అయ్యా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క పనీ కాలేదు. సమస్యలు చెబుదామన్నా అధికారపార్టీ నాయకులు పట్టించుకోవడం లేదు’ అంటూ తమ సమస్యలను వైఎస్సార్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల దృష్టికి ఆయా గ్రామాల ప్రజలు తీసుకొస్తున్నారు. క్షేత్ర స్థాయికెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్యంలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్‌రావు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు రచ్చబండ, పల్లెనిద్ర పేరుతో రెండో రోజు ఆదివారం జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజలతో మమేకం అవుతూ సమస్యలు తెలుసుకున్నారు.
నెల్లూరు(సెంట్రల్): వైఎస్సార్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఆదివారం నిర్వహించిన రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాల్లో జిల్లాలోని ఆయా గ్రామాల్లోని దళితవాడల్లో పరిస్థితి ఏమిటి? ఏ విధంగా వారి జీవన విధానం ఉందనే విషయంపై దృష్టి పెట్టారు. ప్రధానంగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్లు, పక్కాగృహాల మంజూరు తదితర సమస్యలను ప్రజలు నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. టీడీపీ అ«ధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ప్రజలు నాయకులు దృష్టికి తీసుకొస్తున్నారు. దీనికి వైఎస్సార్ సీపీ నాయకులు స్పందిస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీ అందరి ఆశీస్సులతో అధికారంలోకి రాగానే మీ సమస్యలు పూర్తిగా పరిష్కరించే బాధ్యత తమదేనని భరోసా ఇచ్చారు.
సూళ్లూరుపేట నియోజకవర్గంలోని తడ మండలం కారూరు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. తాగునీటి సమస్యలు ఉన్నాయని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.కోవూరు నియోజకవర్గంలోని కోవూరు మండలం పోతిరెడ్డిపాడులో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలు ప్రసన్నకుమార్‌రెడ్డి దృష్టికి స్థానిక ప్రజలు తీసుకొచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 12వ డివిజన్ ముస్లింపాళెంలో స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలను నిర్వహించారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్‌పేట మండలం అక్బరాబాద్‌లో స్థానిక ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. తాగునీటి సమస్యతో పాటు అంతర్గత రోడ్లు సమస్యను తీర్చాలని స్థానికులు కోరారు.
ఉదయగరి నియోజకవర్గంలోని సీతారామపురం మండలం మారంరెడ్డిపల్లెలో నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలను నిర్వహించారు. తాగునీటి కష్టాలతో పాటు జన్మభూమి కమిటీలతో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు ఏమీ అందడం లేదనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు మండలం తెగచెర్లలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాన్ని జెడ్పీ చైర్మన్, నియోజకవర్గ సమన్వయకర్త బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి నిర్వహించారు. తాగు, సాగునీటికి ప్రజలు కష్టాలు పడుతున్నట్లు బొమ్మిరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. గూడూరు నియోజకవర్గంలోని కోట మండలం కొక్కుపాడులో స్థానిక సమన్వయకర్త మేరిగ మురళీధర్ ఆధ్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ సమస్యతో పాటు, పింఛన్లు అందడం లేదని స్థానికులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment