చిత్తూరు, సాక్షి: ప్రజాసమస్యలు తెలుసుకోవడం కోసం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యం లో గురువారం రచ్చబండ, పల్లెనిద్ర కా ర్యక్రమాలు జరిగాయి. టీడీపీ చేస్తున్న అ రాచకాలను ప్రజలకు వివరించారు. రచ్చబండ ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళెం మండలం సంక్రాంతిపల్లెలో ఎమ్మె ల్యే సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో రచ్చబం డ పల్లెనిద్ర కార్యక్రమం జరిగింది. రేషన్‌కార్డులు, అర్హులకు పింఛన్ మంజూరు కా లేదని, గ్రామాల్లో మౌలికవసతులు క ల్పించాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక హోదా వస్తే కేంద్రం నుం చి రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో నిధులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు.
జీడీనెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండలంలో ఎమ్మెల్యే నారా యణస్వామి ఆధ్వర్యంలో పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలు జరిగాయి. ఎస్టీ రు ణాలకు దరఖాస్తు చేసుకోగా బ్యాంకర్లు పట్టించుకోవడం లేదని, సరైన రోడ్డు సౌకర్యం లేదు, పాఠశాలకు మూడు కిలోమీటర్ల వరకు విద్యార్థులు నడిచి వెళ్తున్నారని ప్రజలు విన్నవించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రజల సమస్యలు పట్టించుకో వడం లేదని విమర్శించారు. గత ఎన్నికల్లో టీడీపీ మోసపూరిత హామీ లను ప్రకటించి ప్రజలను మభ్య పెట్టిం దని ఆరోపించారు. జగన్‌మోహన్ రెడ్డి సీఎం అయితే ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. వెదురుకుప్పం ఎస్టీకాలనీ, తంగేలిమిట్టలో రచ్చబం డ నిర్వహించి, చిన్నరెడ్డికండ్రిగ దళితవా డలో పల్లెనిద్రలో పాల్గొన్నారు.
పావలావడ్డీ అమలు కావడం లేదు
సదుం: తాము తీసుకున్న రుణాలకు పావలావడ్డీ అమలు కావడం లేదని బూరగమంద మహిళా స్వయం సహాయ సంఘ సభ్యులు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మొరపెట్టుకున్నారు. మండలంలోని బూరగమందలో మహిళలతో గురువారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రచ్చబండ కార్యక్రమం నిర్వహిం చారు. తమ గ్రామంలో సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు నిర్మించాలని మహిళలు కోరారు. పక్కాగృహాలు, మరుగుదొడ్ల బిల్లుల కోసం వేచి చూడాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్‌కార్డులు, పింఛన్లు మంజూరు చేయడం లేదని తెలిపారు. గ్రామంలో మార్చిలోగా సీసీ రోడ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ వెంకటరెడ్డిని ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ఆదేశించారు.
మార్చిలోగా నిర్మించకపోతే తన నిధులతో నిర్మిస్తానని, రేషన్, పింఛన్ సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. పర్యటనలో ఎక్కువగా రెవెన్యూ సమస్యలు వస్తున్నాయని, పరిష్కరించడంలో ఎందుకు అలక్ష్యం చూపుతున్నారని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలను జన్మభూమి కమిటీ సభ్యులు చేయడంతో అర్హులను ఎంపిక చేయడంలో వారు అక్రమాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రస్తుతం రేషన్‌కార్డుతోనే పలు ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయని వాటి మంజూరులో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడం తగదని తెలిపారు. జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్‌రెడ్డి, తహసీల్దార్ హనుమంతనాయక్, సూపరింటెండెంట్ నాగరాజు, ఏఓ మాధవి, ఎంపీటీసీ సభ్యుడు విజయభాస్కర్, ఏపీఎం సురేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment