pallenidra
-
ఫ్యాక్షనిస్టులు, రౌడీషీటర్లకు జిల్లా బహిష్కరణ!
ఆత్మకూరు రూరల్: ఫ్యాక్షనిస్టులు, రౌడీషీటర్లను జిల్లా నుంచి బహిష్కరించే యోచన ఉందని జిల్లా ఎస్పీ గోపీనాథ్ జట్టి తెలిపారు. ఆదివారం ఆయన ఆత్మకూరు ఎస్డీపీవో, పోలీస్ సర్కిల్ కార్యాలయాలను తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పల్లెనిద్ర కార్యక్రమంతో గ్రామాల్లో శాంతి భద్రతలపై అవగాహన పెరుగుతోందన్నారు. ఎన్నికలు వస్తున్నందున హింసకు పాల్పడే వారి నేర చరిత్రను సేకరిస్తున్నామన్నారు. నేర చరిత్ర గల వారిని పోలీసులు.. బైండోవర్ చేసుకుంటారన్నారు. అవసరమైతే వారిని జిల్లా నుంచి బహిష్కరించేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. అనంతరం కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్(సీపీవో)లతో మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ సామాజిక స్పృహ అవసరమన్నారు. సీపీవోలు చక్కగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ప్రతిభావంతంగా పనిచేసిన వారికి నగదు రివార్డులు అందించారు. ఆ తరువాత పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఎస్డీపీవో అడిషనల్ ఎస్పీ మాధవ రెడ్డి, సీఐ బత్తల కృష్ణయ్య, ఎస్ఐలు వెంకట సుబ్బయ్య, రమేష్ బాబు పాల్గొన్నారు. -
ఆలకించయ్యా.. బాలయ్య
చిలమత్తూరు : మండలంలో సాగిన ఎమ్మెల్యే బాలకృష్ణ రెండో రోజు పర్యటనలో కూడా ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. మొరంపల్లి, కో డూరు, శెట్టిపల్లి, మరవకొత్తపల్లి, వీరాపురం గ్రామాల్లో ఆయన పర్యటించారు. పింఛన్ రాలేద ని, కొందరు, రేషన్ సక్రమంగా అందలేదని కొందరు, ఇంటి స్థలాలు మంజూరు కాలేదని కొందరు ఇలాసమస్యలను పరిష్కారించాలంటూ వందలాది మంది ప్రజలు వినతులు అందజేశారు. ఆశా కార్యకర్తలకు న్యాయం చేయాలి : ప్రభుత్వాసుపత్రిలో, ఆరోగ్య ఉపకేంద్రాల పరిధిలో పనిచే సే ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం న్యాయం చేయాలని కార్యకర్తలు బాలకృష్ణ వద్ద శెట్టిపల్లిలో మొరపెట్టుకున్నారు. సరైన గౌరవ వేతనం లేక నానా ఇబ్బందులు పడుతున్నామని వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. యువకులకు ఉద్యోగాలు కల్పించాలి యువకులకు ఉద్యోగాలు కల్పించాలంటూ నిరుద్యోగ యువత కోరారు. కియో పరిశ్రమం ఏర్పాటు జ రుగుతోందని అధికారులు, ప్రజాప్రతినిధులు తె లియజేస్తున్నారని స్థానికులకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. శెట్టిపల్లి ఎస్సీ కాలనీ వా సులకు గత కొన్ని నెలలుగా నీటి సమస్యతో పాటు ఇంటి పట్టాలు, నిర్మాణాల సమస్య ఉందని వాటిని పరిష్కరించాలన్నారు. కోడూరు పంచాయతీ లోని కనిశెట్టిపల్లిలో చౌకధాన్యపు డిపో సమస్యలను డీలర్ స్వయంగా బాలకృష్ణకు వివరించారు. అనంతరం వీరాపురంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. స్పెషల్ పార్టీ పోలీసుల అత్యుత్సాహం ఎమ్మెల్యే బాలకృష్ణకు సెక్యురిటీగా వచ్చిన స్పెషల్ పార్టీ పోలీసులు అత్యుత్యాహం ప్రదర్శించారు. అర్జీలు ఇచ్చుకోవడం కోసం వెళ్లిన ప్రజలను అడ్డుకున్నారు. సెక్యూరిటీ సమస్యలు వస్తాయనే సాకుతో చాలామంది ప్రజలు నేరుగా సమస్యలను తెలియజేసే అవకాశం ఇవ్వలేదు. ఈ కార్యక్రమాల్లో జిల్లా అధికారులతో పాటు, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
అనంతలో రచ్చబండ పల్లెనిద్ర కార్యక్రమం
-
పశ్చిమ గోదావరి జిల్లాలో రచ్చబండ, పల్లెనిద్ర
-
నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ రచ్చబండ-పల్లెనిద్ర
-
పశ్చిమ గోదావరి జిల్లాలో రచ్చబండ, పల్లెనిద్ర
-
మేమున్నామని
చిత్తూరు, సాక్షి: ప్రజాసమస్యలు తెలుసుకోవడం కోసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యం లో గురువారం రచ్చబండ, పల్లెనిద్ర కా ర్యక్రమాలు జరిగాయి. టీడీపీ చేస్తున్న అ రాచకాలను ప్రజలకు వివరించారు. రచ్చబండ ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళెం మండలం సంక్రాంతిపల్లెలో ఎమ్మె ల్యే సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో రచ్చబం డ పల్లెనిద్ర కార్యక్రమం జరిగింది. రేషన్‌కార్డులు, అర్హులకు పింఛన్ మంజూరు కా లేదని, గ్రామాల్లో మౌలికవసతులు క ల్పించాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక హోదా వస్తే కేంద్రం నుం చి రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో నిధులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. జీడీనెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండలంలో ఎమ్మెల్యే నారా యణస్వామి ఆధ్వర్యంలో పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలు జరిగాయి. ఎస్టీ రు ణాలకు దరఖాస్తు చేసుకోగా బ్యాంకర్లు పట్టించుకోవడం లేదని, సరైన రోడ్డు సౌకర్యం లేదు, పాఠశాలకు మూడు కిలోమీటర్ల వరకు విద్యార్థులు నడిచి వెళ్తున్నారని ప్రజలు విన్నవించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రజల సమస్యలు పట్టించుకో వడం లేదని విమర్శించారు. గత ఎన్నికల్లో టీడీపీ మోసపూరిత హామీ లను ప్రకటించి ప్రజలను మభ్య పెట్టిం దని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. వెదురుకుప్పం ఎస్టీకాలనీ, తంగేలిమిట్టలో రచ్చబం డ నిర్వహించి, చిన్నరెడ్డికండ్రిగ దళితవా డలో పల్లెనిద్రలో పాల్గొన్నారు. పావలావడ్డీ అమలు కావడం లేదు సదుం: తాము తీసుకున్న రుణాలకు పావలావడ్డీ అమలు కావడం లేదని బూరగమంద మహిళా స్వయం సహాయ సంఘ సభ్యులు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మొరపెట్టుకున్నారు. మండలంలోని బూరగమందలో మహిళలతో గురువారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రచ్చబండ కార్యక్రమం నిర్వహిం చారు. తమ గ్రామంలో సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు నిర్మించాలని మహిళలు కోరారు. పక్కాగృహాలు, మరుగుదొడ్ల బిల్లుల కోసం వేచి చూడాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్‌కార్డులు, పింఛన్లు మంజూరు చేయడం లేదని తెలిపారు. గ్రామంలో మార్చిలోగా సీసీ రోడ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ వెంకటరెడ్డిని ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ఆదేశించారు. మార్చిలోగా నిర్మించకపోతే తన నిధులతో నిర్మిస్తానని, రేషన్, పింఛన్ సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. పర్యటనలో ఎక్కువగా రెవెన్యూ సమస్యలు వస్తున్నాయని, పరిష్కరించడంలో ఎందుకు అలక్ష్యం చూపుతున్నారని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలను జన్మభూమి కమిటీ సభ్యులు చేయడంతో అర్హులను ఎంపిక చేయడంలో వారు అక్రమాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రస్తుతం రేషన్కార్డుతోనే పలు ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయని వాటి మంజూరులో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడం తగదని తెలిపారు. జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్‌రెడ్డి, తహసీల్దార్ హనుమంతనాయక్, సూపరింటెండెంట్ నాగరాజు, ఏఓ మాధవి, ఎంపీటీసీ సభ్యుడు విజయభాస్కర్, ఏపీఎం సురేష్ పాల్గొన్నారు. -
సత్యవరంలో రచ్చబండ పల్లెనిద్ర
-
ప్రజల మధ్య వైఎస్సార్సీపీ
చిత్తూరు, సాక్షి: ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వైఎస్సార్సీపీ జిల్లాలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆయా గ్రామాల్లో ప్రజలు పడుతున్న బాధలు, ఎదుర్కొంటున్న సమస్యలను నాయకులే స్వయంగా పరిశీలిస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకుపోతున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని నాయకులు ప్రజలకు తెలియజేస్తున్నారు. పీలేరు నియోజకవర్గం కేవీపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీలోని శిబ్బాలవారిపల్లెలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సోమవారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటామని, ఏ కష్టమొచ్చినా ప్రజలు నేరుగా వచ్చి మా దృష్టికి తెస్తే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని కంచన పుత్తూరు గ్రామంలోని ఎస్సీ, ఎస్టీకాలనీలో సోమవారం నియోజకవర్గ సమన్వయ కర్త ఆదిమూలం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో రోడ్లు, తాగునీటి సరఫరా అధ్వానంగా ఉన్నాయని నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. పక్కాగృహాలన్నీ టీడీపీ సానుభూతిపరులకే ఇస్తున్నారని ప్రజలు వాపోయారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయ్తు కార్యదర్శి విద్యానాథ్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ∙పుంగనూరు పట్టణంలోని భగత్‌సింగ్‌కాలనీలో ఆదివారం రాత్రి వైఎస్ఆర్ సీపీ రాష్ట్రకార్యదర్శి ఎన్ రెడ్డెప్ప, జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బాలు ఆధ్వర్యంలో పల్లె నిద్ర చేశారు. -
ప్రజలకు బాసటగా పల్లెనిద్ర
చిత్తూరు, సాక్షి: ప్రజా సమస్యలు తెలుసుకోవడమే ధ్యేయంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు సంఘీభావంగా ఆ పార్టీ నాయకులు చేపట్టిన పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలు రెండో రోజైన ఆదివారమూ జిల్లావ్యాప్తంగా సాగాయి. ప్రజలకు బాసటగా పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాళహస్తి, తిరుపతి, పూతలపట్టు, పలమనేరు, సత్యవేడు, మదనపల్లె నియోజకవర్గాల్లో ప్రజలతో నాయకులు మమేకమయ్యారు. ప్రజలు తమ సమస్యలను నాయకుల దృష్టికి తెచ్చారు. ⇒ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి తిరుపతి ఎస్టీవీ నగర్ మాతమ్మగుడిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. బెల్ట్ షాపుల వల్ల కాలనీలో మద్యం ఏరులై పారుతోందని ప్రజలు ఆయన దృష్టికి తెచ్చారు. 2019 వరకు పెన్షన్లు, రేషన్ రాక అవస్థలు పడుతున్న ఆరుగురు నిరుపేదలకు వెయ్యి రూపాయలు, 25 కేజీల బియ్యం ఇవ్వడానికి పార్టీ నేతలు ఎస్కే బాబు, ఆంజనేయులు ముందుకు వచ్చారు. ⇒ మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి సప్పిరెడ్డిగారిపల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. జన్మభూమి కమిటీల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. పెన్షన్లు, రేషన్ సరుకులు అనర్హులకు దక్కుతున్నాయని వాపోయారు. సర్పంచ్ శరత్‌రెడ్డి పాల్గొన్నారు. ⇒ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి రేణిగుంటలోని తారకరామనగర్‌లో పల్లె నిద్ర చేశారు. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యలు విన్నారు. ⇒ పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం మత్యం పంచాయతీ జోగివారిపల్లిలో ఎమ్మెల్యే సునీల్‌కుమార్ రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదని, పక్కా గృహాలు, రేషన్ కార్డులు ఇవ్వకుండా జన్మభూమి కమిటీ సభ్యులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలు ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు. సర్పంచ్ మయూరి జగన్నా«థ్‌రెడ్డి పాల్గొన్నారు. ⇒ పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్తలు సీవీకుమార్, రెడ్డెమ్మ, రాకేశ్‌రెడ్డి వీకోట మండలం గోనుమాకులపల్లె దళితవాడలో పల్లెనిద్ర చేశారు. వైఎస్సార్సీపీకి ఓటేసిన వారికి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా జన్మభూమి కమిటీ సభ్యులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రజలు వివరించారు. ⇒ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం బుచ్చినాయుడుకండ్రిగ మండలం నీర్పాకోటలో పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. తాగునీరు, పింఛన్లు రావడం లేదని ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. పార్టీ జిల్లా కార్యదర్శి విద్యానాథ్‌రెడ్డి పాల్గొన్నారు. -
ప్రజల వద్దకు ప్రతిపక్షం
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రజల సమస్యలు తెలుసుకొనేందుకు ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ వారి ముంగిటకే వెళ్తోంది. రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాల్లో భాగంగా ఆ పార్టీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు గ్రామాలు, కాలనీల్లో బస చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. వరుసగా రెండో రోజైన ఆదివారం కూడా జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు వివిధ సమస్యలు ఏకరువు పెట్టారు. వారికి భరోసా ఇచ్చిన నేతలు.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ఆయా సమస్యలను ఏవిధంగా పరిష్కరిస్తుందో వివరించారు. దళితుల గృహ అవసరాలకు ఉచిత విద్యుత్, నవరత్న పథకాల ద్వారా జరిగే మేలును రచ్చబండలో వివరించారు. రాత్రి ఆయా కాలనీల్లోని దేవాలయాలు, స్కూళ్లలో బస చేశారు. కోటనందూరులో తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, అయినవిల్లి మండలం కొండుకుదురులంకలో పి.గన్నవరం కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, రౌతులపూడి మండలం పి.చామవరంలో ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్, గండేపల్లి మండలం ఉప్పలపాడులో జగ్గంపేట కో ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్, అనాతవరంలో ముమ్మిడివరం కో ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ, రంగంపేట ఎస్టీ కాలనీలో అనపర్తి కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, కొత్తపల్లి మండలం రమణక్కపేటలో పిఠాపురం కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు, కపిలేశ్వరపురం మండలం నేలటూరులో మండపేట కో ఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహించారు. కడియం మండలం మురమండలో శనివారం రచ్చబండ నిర్వహించగా, ఆదివారం ప్రత్యేక హోదాకు మద్దతుగా రాజమహేంద్రవరం రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో సంతకాలు సేకరించారు. అదే నియోజకవర్గం ధవళేశ్వరంలో మరో కో ఆర్డినేటర్ గిరిజాల వీర్రాజు (బాబు) కూడా సంతకాలు సేకరించారు. ప్రజా సమస్యలే ఎన్నికల మేనిఫెస్టో : ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కోటనందూరు: తెలుగుదేశం ప్రభుత్వ నిరంకుశ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకొని, వాటి పరిష్కారాలనే ఎన్నికల మేనిఫెస్టోగా ప్రకటిస్తామని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. కోటనందూరు కొత్త ఎస్సీ కాలనీలో ఆదివారం జరిగిన ‘రచ్చబండ–పల్లెనిద్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అసెంబ్లీలో ఉండాల్సిన తమ పార్టీ ఎమ్మెల్యేలు.. టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరి కారణంగా ప్రజా సమస్యలను తెలుసుకొనేందుకు పల్లెల్లో తిరుగుతున్నారన్నారు. సీఎం చంద్రబాబు తమ ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలతో సంతలో పశువుల మాదిరిగా కొలుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విలువలంటే గౌరవం లేని అసెంబ్లీని అందుకే బాయ్‌కట్ చేశామన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తొలుత ఈ కార్యక్రమాన్ని దళితవాడల్లో నిర్వహిస్తున్నామన్నారు. నేరుగా ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని, పార్టీ అధికారం చేపట్టిన తరువాత వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు దళిత మహిళలు వివిధ సమస్యలను వివరించారు. అర్హులకు కూడా పింఛన్లు ఇవ్వడం లేదని, ఒక్క ఇల్లు కూడా నిర్మించుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, త్వరలో రాజన్న పాలన వస్తుందని, అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. దళితులకు ఉచిత కరెంటు, వృద్ధులకు రూ.2 వేల పింఛను, మండల కేంద్రాల్లో వృద్ధాశ్రమాలు వంటి అనేక హామీలను జగన్ ప్రకటించారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను సీఎంను చేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ గొర్లి రామచంద్రరావు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, జిల్లా కార్యదర్శి పెదపాటి అమ్మాజీ, సర్పంచ్‌లు బొంగు గోపాలకృష్ణ, యలమంచిలి దేవుళ్ళు, ఎంపీటీసీ సభ్యురాలు గర్సింగు శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల మధ్యలో..
శ్రీకాకుళం అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండో రోజు ఆదివారం నిర్వహించిన రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమానికి ప్రజల నుంచి అమోఘ స్పందన లభిం చింది. పార్టీ నేతలు ఆయా గ్రామాలకు వెళ్లి వారు పడుతున్న బాధలు, సమస్యలను స్వయంగా పరిశీలిస్తున్నారు. దీంతో నాయకుల వద్దకు ప్రజలంతా చేరుకుని తమ కష్టాలు చెప్పుకుంటున్నారు. టీడీపీ అరాచకాలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి చరమగీతం పాడుతారని, ఆయన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితే ప్రజల సమస్యలు ప రిష్కారం అవుతాయని నాయకులు ప్రజల కు చెబుతున్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలోని బూర్జ మండలం సోమిదలవలస గ్రామ నుంచి పార్టీ జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో పాదయా త్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి మశానపుట్టి, జంగాలపాడు, బొడ్డపాడు గ్రామం వరకు పాదయాత్ర జరిగింది. మశానపుట్టి, జంగాలపాడు గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. నవరత్నాల పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలను ప్రధాన ప్రతిపక్షం లేకుండానే నిర్వహించడం బాబుకే చెల్లిందన్నారు. ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, మండల పార్టీ అధ్యక్షుడు ఖండాపు గోవిందరావు, యువజన విభాగం అధ్యక్షుడు గుమ్మడి రాంబా బు, జిల్లా పార్టీ కార్యదర్శులు వావిలపల్లి గోవిందరావు, మామిడి శ్రీనివాసరావు, నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు. ♦ సీతంపేట మండలం సోమగండి గ్రామంలో ఎమ్మెల్యే కళావతి ఆధ్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన సమస్యలను పాలక పార్టీ నేతలు గాలికొదిలేశారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎస్.లక్ష్మి, సర్పంచ్ ఎస్. గోపాల్, పార్టీ మండల కన్వీనర్లు జి. సుమిత్రరావు, ఆరిక కళావతి తదితరులు పాల్గొన్నారు. ♦ రాజాం నగరపంచాయతీ పరిధి శిమ్మయ్యపేట గ్రామంలో ఆదివారం ఎమ్మె ల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యలపై ఆరా తీసి వాటి పరిష్కారం కోసం ఎమ్మెల్యే సంబంధిత శాఖాధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జోగులు మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను దుయ్యబట్టారు. హంగులూ, ఆర్భాటాలు, ప్రచారాలకే ప్రభుత్వం పరిమితమవుతోందని, ప్రజా సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ♦ నరసన్నపేట పోలాకి మండలం ఉర్జాం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు గ్రామంలోని సమస్యలను కృçష్ణదాస్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్వహిస్తున్న పథకాల ఎంపికపై ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పోలాకి మండలానికి చెందిన పార్టీ నాయకులు కరిమి రాజేశ్వరరావు, కణితి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ♦ కవిటి మండలం డి.గొనపపుట్టుగ గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు ఆధ్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిం చారు. ఎస్సీలకు వడ్డీలేని రుణాలు గాని, రాయితీ వడ్డీ రుణాలు గానీ లేకపోవడంతో బ్యాంకుల్లో చేసిన అప్పులకు అసలు కన్నా వడ్డీ ఎక్కువై బకాయిలు భారీగా పేరుకుపోయాయని ఎస్సీ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గ్రామంలో ఎస్సీ వీధికి చెందిన ఎవరైనా చనిపోతే శ్మశాన వాటిక కూడా సరైన సదుపాయాలతో లేదని, ఆధునిక హుంగులతో కూడిన శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని పలువురు మహిళలు కోరారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పీఎం తిలక్, నర్తు చామంతి, శ్యామ్‌కురియా, బి. జయప్రకాశ్, కడియాల ప్రకాశ్, తడక జోగారావు, పిట్టా ఆనంద్‌కుమార్, మడ్డు రాజారావు, సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. -
సమస్యలు వింటూ.. భరోసా ఇస్తూ
అయ్యా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క పనీ కాలేదు. సమస్యలు చెబుదామన్నా అధికారపార్టీ నాయకులు పట్టించుకోవడం లేదు’ అంటూ తమ సమస్యలను వైఎస్సార్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల దృష్టికి ఆయా గ్రామాల ప్రజలు తీసుకొస్తున్నారు. క్షేత్ర స్థాయికెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్యంలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్‌రావు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు రచ్చబండ, పల్లెనిద్ర పేరుతో రెండో రోజు ఆదివారం జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజలతో మమేకం అవుతూ సమస్యలు తెలుసుకున్నారు. నెల్లూరు(సెంట్రల్): వైఎస్సార్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఆదివారం నిర్వహించిన రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాల్లో జిల్లాలోని ఆయా గ్రామాల్లోని దళితవాడల్లో పరిస్థితి ఏమిటి? ఏ విధంగా వారి జీవన విధానం ఉందనే విషయంపై దృష్టి పెట్టారు. ప్రధానంగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్లు, పక్కాగృహాల మంజూరు తదితర సమస్యలను ప్రజలు నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. టీడీపీ అ«ధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ప్రజలు నాయకులు దృష్టికి తీసుకొస్తున్నారు. దీనికి వైఎస్సార్ సీపీ నాయకులు స్పందిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి మీ అందరి ఆశీస్సులతో అధికారంలోకి రాగానే మీ సమస్యలు పూర్తిగా పరిష్కరించే బాధ్యత తమదేనని భరోసా ఇచ్చారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని తడ మండలం కారూరు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. తాగునీటి సమస్యలు ఉన్నాయని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.కోవూరు నియోజకవర్గంలోని కోవూరు మండలం పోతిరెడ్డిపాడులో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలు ప్రసన్నకుమార్‌రెడ్డి దృష్టికి స్థానిక ప్రజలు తీసుకొచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 12వ డివిజన్ ముస్లింపాళెంలో స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలను నిర్వహించారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్‌పేట మండలం అక్బరాబాద్‌లో స్థానిక ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. తాగునీటి సమస్యతో పాటు అంతర్గత రోడ్లు సమస్యను తీర్చాలని స్థానికులు కోరారు. ఉదయగరి నియోజకవర్గంలోని సీతారామపురం మండలం మారంరెడ్డిపల్లెలో నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలను నిర్వహించారు. తాగునీటి కష్టాలతో పాటు జన్మభూమి కమిటీలతో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు ఏమీ అందడం లేదనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు మండలం తెగచెర్లలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాన్ని జెడ్పీ చైర్మన్, నియోజకవర్గ సమన్వయకర్త బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి నిర్వహించారు. తాగు, సాగునీటికి ప్రజలు కష్టాలు పడుతున్నట్లు బొమ్మిరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. గూడూరు నియోజకవర్గంలోని కోట మండలం కొక్కుపాడులో స్థానిక సమన్వయకర్త మేరిగ మురళీధర్ ఆధ్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ సమస్యతో పాటు, పింఛన్లు అందడం లేదని స్థానికులు తెలిపారు. -
సమరోత్సాహం
అనంతపురం సెంట్రల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రచ్చబండ, పల్లె నిద్ర కార్యక్రమాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దుష్టపాలనపై ప్రజలు నేతలకు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రజా సమస్యలను వింటున్న నేతలు రానున్నది వైఎస్సార్ ప్రభుత్వమని.. ప్రతి సమస్యనూ పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తున్నారు. రెండోరోజు ఆదివారం జిల్లా వ్యాప్తంగా రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలు పార్టీ నేతలు నిర్వహించారు. ఇళ్లు, పింఛన్లు, నిరుద్యోగ భృతి రావడం లేదని ప్రజలు ఫిర్యాదు చేశారు. ఉపాధి లేక వలస పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధిహామీ పనులకు పోతే రెండు, మూడు నెలలకు కూడా బిల్లులు మంజూరు చేయడం లేదని ఫిర్యాదు చేశారు. ► అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని రుద్రంపేట పంచాయతీ ఎస్సీ కాలనీలో రచ్చబండ, పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డితో జనం తన బాధలు చెప్పుకున్నారు. కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, రోడ్లు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయని, డ్రైనేజి వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని వివరించారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, అనంతపురం అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్త నదీం అహ్మద్, నగర అధ్యక్షుడు సోమశేఖర్‌రెడ్డిలు హాజరయ్యారు. ► పెనుకొండ మండలం అడదాకులపల్లి పంచాయతీలోని జాలిపల్లితండాలో రచ్చబండ, పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు శంకర్‌నారాయణతో తండా ప్రజలు తమ సమస్యలు చొప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజల సమస్యలన్నీ విన్న శంకర్‌నారాయణ..సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని భరోసా ఇచ్చారు. సమస్యలన్నింటినీ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ► ఆత్మకూరు మండలకేంద్రంలోని ఎస్సీ కాలనీలో రాప్తాడు మండలం సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ‘పల్లె నిద్ర’ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యలు విన్న ఆయన పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు ఇళ్లపట్టాలు, భూమిలేని వారికి భూమి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ► నల్లచెరువు మండలం ఉబిచెర్ల ఎస్పీకాలనీలో కదిరి నియోజకవర్గ సమన్వకర్త పీవీ సిద్దారెడ్డి పల్లె నిద్ర చేశారు. అంతకుముందు ఉబిచెర్ల పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఇంటిఇంటికీ తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం దళితవాడలో పల్లెనిద్ర చేశారు. వచ్చేది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమేనని, సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. ► తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త పెద్దారెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు సమస్యలను ఏకరవు పెట్టారు. ► ధర్మవరం మండలం ఓబుళనాయునిపల్లిలోని దళితవాడలో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రజాసమస్యలను ఆలకించిన అనంతరం పల్లెనిద్ర చేశారు. ► బ్రహ్మసమద్రం మండలం బొమ్మగానిపల్లితండాలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వకర్త ఉషాశ్రీచరణ్ ప్రజల సమస్యలను ఆలకించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ► రొళ్ల మండలం వన్నారణపల్లి ఎస్సీకాలనీలో మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి రచ్చబండ, పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ► పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓడీసీ మండలం నల్లగుట్లపల్లిలో జరిగిన రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. -
హోరెత్తిన ప్రజాసమస్యలు
సాక్షి, నెట్వర్క్ : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ప్రజా సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం ఆ పార్టీ నేతలు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ–పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. తమ గ్రామాలకు వచ్చిన విపక్ష నేతలకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాలకు హాజరైన ప్రజలు గ్రామాల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. తొలుత రచ్చబండ నిర్వహించిన నేతలు.. తర్వాత పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తలు, స్థానిక నేతలు పాల్గొని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోడ్లు, తాగునీటి సమస్య, కరెంటు కోతలు, రేషన్ కార్డులు, పింఛన్ కష్టాలు, గృహనిర్మాణాలు తదితర సమస్యలను ప్రజలు విపక్ష నేతలకు వివరించారు. టీడీపీ నేతల దౌర్జన్యాలు, జన్మభూమి కమిటీల అరాచకాలు ప్రతిపక్ష నేతల దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు నమ్మి తామెలా మోసపోయింది కూడా వారు వివరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రజలకు వైఎస్సార్సీపీ నేతలు హామీ ఇచ్చారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ అండగా ఉంటూ, పోరాటం చేస్తామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా దళిత వాడల్లోని ప్రజలతో మమేకం అయ్యారు. అక్కడే భోజనం చేసి ఆ కాలనీల్లోనే నిద్రించారు. (పాఠశాలలో పల్లెనిద్ర చేస్తున్న కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, జెడ్పీటీసీ శెట్టి పద్మావతి) -
పల్లెబాటకు శ్రీకారం
జనం దగ్గరికి వెళ్లి .. సమస్యలు తెలుసుకొని ప్రజా మెనిఫెస్టోను రూపొందిస్తానని వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్ర స్ఫూర్తితో జిల్లాలో రచ్చబండ–పల్లె నిద్రలకు ఆ పార్టీ నేతలు శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో తొలుత రచ్చబండను ఏర్పాటు చేసి స్థానికుల కష్టనష్టాలను తెలుసుకున్న అనంతరం అక్కడే బసచేసి వారితో మమేకమయ్యారు. జగన్ సేనకు సమస్యలు స్వాగతం పలికాయి. సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రజల యోగ క్షేమాలను తెలుసుకునేందుకు వైఎస్సార్ సీపీ మరో ప్రజా కార్యక్రమాన్ని తలపెట్టింది. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు వినూత్న ప్రయత్నం చేస్తోంది. ‘రచ్చబండ – పల్లె నిద్ర’ పేరుతో పార్టీ నేతలు శనివారం శ్రీకారం చుట్టారు. ప్రజా సంకల్ప యాత్రతో ఇప్పటికే పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా పార్టీ శ్రేణులు తమవంతుగా క్షేత్రస్థాయిలో పర్యటనలకు సమాయత్తమయ్యారు. ప్రజా సమస్యలే అజెండాగా మున్ముందుకు... ప్రజల పక్షాన జిల్లాలో వైఎస్సార్ సీపీ నిరంతరం పోరాటం చేస్తోంది. ఇప్పటికే అనేక సమస్యలపై ప్రజల తరఫున ఉద్యమించింది. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేలా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. మొండి వైఖరిని అవలంబిస్తున్న సర్కార్ పెద్దల తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. అలుపెరగకుండా నిరంతరం ప్రజల కోసం పరితపిస్తున్న పార్టీగా చరిత్ర కెక్కింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎడతెరిపిలేకుండా ప్రజా వ్యతిరేక పాలనపై పోరాడుతూనే ఉంది. ఇందులో భాగంగానే ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, వారి కష్టనష్టాలను కళ్లారా చూసేందుకు ‘రచ్చబండ– పల్లెనిద్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో సూక్ష్మ సమస్యలు సైతం గుర్తించి, అధినేత దృష్టికి తీసుకెళ్లి తగు పరిష్కారానికి కృషి చేయనున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో రూపొందించనున్న మేనిఫెస్టోలో కూడా వీటిని ప్రస్తావంచనున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టో రూపొందిస్తామని ఇప్పటికే అధినేత జగన్ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ మార్గంలోనే రచ్చబండ– పల్లెనిద్ర కార్యక్రమానికి జిల్లాలో నేతలు శ్రీకారం చుట్టారు. సందడిగా ప్రారంభం... కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడి హాజరవగా, అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం కోడూరుపాడులో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి, సమన్వయకర్త పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి పాల్గొన్నారు. పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం పొట్టిలంకలో జరిగిన కార్యక్రమంలో సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహనరావు, సమన్వయకర్త కొండేటి చిట్టిబాబు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, అనపర్తి నియోజకవర్గ పరిధిలోని దుప్పలపూడిలో జరిగిన కార్యక్రమంలో సమన్వయకర్త సత్తి సూర్యనారాయణరెడ్డి, రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో జరిగిన కార్యక్రమంలో సమన్వయకర్త బొంతు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగర నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో సమన్వయకర్త రౌతు సూర్యప్రకాశరావు, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలోని కడియం మండలం మురమండ ఎస్సీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో సమన్వయకర్త ఆకుల వీర్రాజు, అదేæ నియోజకవర్గ పరిధిలోని ధవళేశ్వరంలో జరిగిన కార్యక్రమంలో గిరిజాల వీర్రాజు (బాబు), పెద్దాపురం నియోజకవర్గం పరిధిలో ఉలిమేశ్వరం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో సమన్వయకర్త తోట సుబ్బారావునాయుడు, ముమ్మిడివరం నియోజకవర్గం అనాతవరం ఎస్సీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో సమన్వయకర్త పితాని బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఉదయం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని రాత్రి పల్లెనిద్ర చేశారు. -
రచ్చబండ, పల్లెనిద్ర
ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శనివారం పలు నియోజకవర్గాలలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : పోలవరం మండలం కోండ్రు కోట గ్రామంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్టీసెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు పాల్గొన్నారు. చాగల్లు మండలం ఊనగట్ల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో శనివారం పల్లెనిద్ర కార్యక్రమాన్ని నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు ప్రారంభించారు. దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి పాదయాత్రతో చేబ్రోలులోని పిట్టవారి వీధిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. దెందులూరు మండలం కొమరేపల్లిలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమంలో కన్వీనర్ కొఠారు రామచంద్రరావు పాల్గొన్నారు. గోపాలపురం మండలం హుకుంపేటలో పల్లెనిద్ర కార్యక్రమంలో కన్వీనర్ తలారి వెంకట్రావు, మండల కన్వీనర్ పడమటి సుభాష్‌చంద్రబోస్ పాల్గొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని పల్లె నిద్ర చేపట్టారు. ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్ నర్సింహరాజు నేతృత్వంలో ఆకివీడు మండలంలో పెదకాపవరం వరకు మోటారుసైకిల్ ర్యాలీ నిర్వహించారు. పెదకాపవరంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. పల్లెనిద్ర నిర్వహించారు. -
రచ్చబండ, పల్లెనిద్రతోప్రజల మధ్యకు..
ఒంగోలు అర్బన్: వైఎస్సార్ సీపీ అన్నీ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాల ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుంటామని ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు శని, ఆదివారాల్లో జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పగలు గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకుంటామన్నారు. అదేవిధంగా గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో పల్లెనిద్ర చేసి ఆయా కాలనీల ప్రజల ఇక్కట్లను గుర్తించి రచ్చబండ, పల్లెనిద్రతో ప్రజల మధ్యకు.. భరోసా కల్పిస్తామని తెలిపారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి, ప్రజలకు వచ్చే లాభాలను ప్రజలకు వివరిస్తామన్నారు. హోదాతో రాయితీలు వస్తాయని, తద్వారా పరిశ్రమలు భారీగా రాష్ట్రంలో నెలకొల్పవచ్చన్నారు. దీంతో నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. నేడు బాలినేని ఒంగోలు రాక: వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి శనివారం ఉదయం సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో ఒంగోలు చేరుకుంటారు. అనంతరం ఉదయం 10 గంటలకు మండలంలోని అల్లూరు గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకుంటారు. సాయంత్రం గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి గ్రామంలోని ఎస్సీ కాలనీలో పల్లెనిద్ర చేస్తారు. -
నేటి నుంచి వైఎస్సార్ సీపీ రచ్చబండ, పల్లెనిద్ర
సాక్షి, అమరావతి బ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేటి నుంచి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నవంబర్ 11 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లాలోని గుంటూరు పార్లమెంట్ అ«ధ్యక్షుడు రావి వెంకటరమణ నేతృత్వంలో పార్లమెంట్ నియోజకవర్గ సమన్వకర్త శ్రీకృష్ణదేవరాయలు, తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, తెనాలి, తాడికొండ సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, హెనీ క్రిస్టినా, ప్రత్తిపాడు నియోజకవర్గ నేత అనీల్‌తో శుక్రవారం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడు రావి వెంకటరమణ మాట్లాడుతూ ఒక్కో నియోజకవర్గంలో 30 గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపట్టాల్సింది ఉంటుందన్నారు. తొలుత గ్రామాల్లోకి వెళ్లి అక్కడ పార్టీ జెండా అవిష్కరించి వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పిస్తారని తెలిపారు. తరువాత రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి స్థానిక సమస్యలపై చర్చిస్తారన్నారు. ప్రత్యేక హోదా అవశ్యకతను వివరించి స్లిప్‌లలో వారితో సంతకాలు సేకరిస్తారు. అనంతరం బూత్ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహిస్తారని పేర్కొన్నారు. గ్రామంలో ప్రభావితం చేసే ఉద్యోగులు, కుల సంఘాల నేతలను కలుస్తారని తెలిపారు. అనంతరం గ్రామంలోనే పల్లె నిద్ర చేస్తారన్నారని వివరించారు. మధ్యలో నియోజకవర్గ స్థాయిలోని విద్యాసంస్థ విద్యార్దులతో సమావేశమవుతారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు మట్లాడుతూ రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాలన్నారు. టీడీపీ నేతలకు ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలో 80 శాతం మంది ప్రజలను గ్రామాల్లోకి వెళ్లి పల్లెనిద్ర, రచ్చబండ ద్వారా కలుసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలు సమస్యలపై బ్లూప్రింట్ తయారు చేసుకోవాలని సూచించారు. తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాన్నారు. నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో డివిజన్ అధ్యక్షులతో సమావేశమై ప్రత్యేక కార్యచరణ రూపొందిచారు. తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త కార్యక్రమాన్ని వినూత్ననంగా నిర్వహించేందుకు ప్రణాళిక తయారు చేశామని చెప్పారు. నరసరావుపేటలో... నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడు అంబటి రాంబాబు నరసరావుపేటలో నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, చిలకలూరిపేట సమన్వయకర్త మర్రి రాజశేఖర్ పాల్గొన్నారు. అంబటి రాంబాబునియోజకవర్గ ఇన్చార్జిలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ అ«ధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణ సైతం తమ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ ఇన్చార్జులతో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలపై ఇప్పటికే చర్చించారు. -
ఈ నెల 11,12న ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పల్లెనిద్ర..
-
11,12 తేదీల్లో రచ్చబండ, పల్లెనిద్ర..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఈ నెల 11,12 తేదీల్లో రచ్చబండ, పల్లె నిద్ర కార్యక్రమాలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. పార్టీ నియోజకవర్గ శాసనసభ్యులకు, నియోజకవర్గ సమన్వయకర్తలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండు రోజుల్లో, నియోజకవర్గాల్లోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సమస్యలను తెలుసుకుంటూ శాసనసభ్యులు, నియోజవకర్గ సమన్వయకర్తలు ఆయా కాలనీల్లోనే నిద్ర చేస్తారు. ఆయాన నియోజవర్గాల్లో సమస్యలను, మొత్తంగా సామాజికవర్గాల వారి సమస్యలను తెలుసుకుని ఆ అంశాలను పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకు వస్తారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. -
వాతావరణ సమతుల్యత కోసమే హరితహారం
నందిపేట : వాతావరణ సమతుల్యత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి పోచారం అన్నారు. నందిపేట మండలం ఆంధ్రనగర్‌లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వచ్చే రెండేళ్లలో రైతాంగానికి ఉచితంగా కరెంట్ సరఫరా చేస్తామన్నారు. ప్రతి ఇంటికి నల్లానీరు ఇచ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2.5 కోట్ల మొక్కలు నాటామన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 30 టీఎంసీల నీరు చేరుకోగానే గుత్పను ప్రారంభిస్తామని తెలిపారు. ఆంధ్రనగర్ గ్రామంలో వెటర్నరీ భవనానికి రూ. 40 లక్షలు, కళ్యాణ మండపానికి రూ. 25 మంజూరు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అంకంపల్లి యమున, ఎంపీటీసీ నాయుడు రామారావు, సర్పంచ్ రామకృష్ణ, ఆర్డీవో యాదిరెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ మధుసూదన్, టీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్‌రెడ్డి, నక్కల భూమేశ్, ఉల్లి శ్రీనివాస్‌గౌడ్, మీసాల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ గారూ... మా ఊరొస్తారా!
నల్లగొండ: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాకకోసం నల్లగొండ జిల్లాలోని ఓ గ్రామం ఆశగా ఎదురుచూస్తోంది. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా తమ గ్రామంలో రాత్రి బస చేసిన కేసీఆర్ ఇప్పుడు సీఎం కావడంతో తాము గుర్తున్నామా? తమకు ఇచ్చిన హామీలు గుర్తున్నాయా? వాటి పరిష్కారానికి చొరవ తీసుకుంటా రా..? సీఎం తమ గ్రామానికి ఎప్పుడు వస్తారన్న సందేహాలతో వర్టూరు గ్రామ ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ నల్లగొండలో వివిధ సమస్యలపై ఆందోళనల్లో నేరుగా పాల్గొన్నారు. నా గార్జునసాగర్ ఆయకట్టు రైతాంగం కోసం కోదాడ నుంచి నాగార్జునసాగర్ దాకా పాదయాత్ర చేశారు. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో రెండురోజులపాటు పర్యటించారు. ఇదే తరహాలో ఆయన పల్లెప్రజల కష్టనష్టాలు తెలుసుకునేందుకు ‘పల్లెనిద్ర’ అనే కార్యక్రమానికి పిలుపు ఇచ్చి, యాదగిరిగుట్ట మండలం వర్టూరు గ్రామం నుంచి స్వయంగా ఆయనే ఈ కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు. పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా 2008 ఏప్రిల్ 14వ తేదీన కేసీఆర్ వర్టూరు దళితకాలనీలోని ఆడెపు లక్ష్మయ్య ఇంట్లో రాత్రి నిద్రపోయారు. ఉదయాన్నే ఆ వాడలోని ఇంటింటికీ వెళ్లి వారి కష్టనష్టాలు అడిగి తె లుసుకున్నారు. అనేక వాగ్దానాలు చేశారు. అయితే, ఇవి వాస్తవరూపం దాల్చలేదు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తమ గ్రామానికి వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని గ్రామస్తులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ నాడు ఇచ్చిన హామీలివే.. * పార్టీ నిధులతో దళితవాడలోని సమస్యలు పరిష్కరిస్తాం. * దళితవాడలోని 89 కుటుంబాలకు ఇంటికో పాడిగేదె, రూ.5,116 నగదు అందజేస్తాం. * దళితవాడలో 400 గజాల స్థలంలో కమ్యూనిటీ హాలు నిర్మాణం. * కమ్యూనిటీ హాల్ కోసం పార్టీ తరపున రూ.2.50 లక్షలు మంజూరు. * ఎస్పీ కార్పొరేషన్ ద్వారా అవసరమైన మరిన్ని నిధులు ఇప్పిస్తాం. * గ్రామానికి సాగునీరు అందించే పడమటికుంటలోకి మోటకొండూరు చెరువు నుంచి మిగులు జలాలను రప్పించేందుకు సొంత డబ్బులతో ఫీడర్ చానల్ తవ్విస్తా. ప్రత్యేక నిధులు ఇవ్వాలి వర్టూర్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు ఇవ్వాలి. గతంలో ఆయన ఇక్కడకు పల్లెనిద్ర చేసేందుకు వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చారు. దళితుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఆయన అధికారంలోకి వచ్చివంద రోజులు పూర్తయ్యాయి. కానీ మా గ్రామ అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు. - మైసయ్య,గ్రామస్తుడు ఉపాధి కల్పించాలి కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా మా గ్రామానికి రావడం ఆనందం కలిగించింది. ఆయన మా సమస్యలను తెలుసుకున్నారు. పార్టీ తరపున కొన్ని, ప్రభుత్వం తరపున కొన్ని సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు. ఆయన సీఎం అయ్యారు. మా గ్రామంలో ఏదైనా పరిశ్రమ పెట్టి, ఉపాధి కల్పించాలి. - భిక్షపతి, గ్రామస్తుడు