సాక్షి, నెట్‌వర్క్ : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ప్రజా సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం ఆ పార్టీ నేతలు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ–పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. తమ గ్రామాలకు వచ్చిన విపక్ష నేతలకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాలకు హాజరైన ప్రజలు గ్రామాల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. తొలుత రచ్చబండ నిర్వహించిన నేతలు.. తర్వాత పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తలు, స్థానిక నేతలు పాల్గొని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రోడ్లు, తాగునీటి సమస్య, కరెంటు కోతలు, రేషన్ కార్డులు, పింఛన్ కష్టాలు, గృహనిర్మాణాలు తదితర సమస్యలను ప్రజలు విపక్ష నేతలకు వివరించారు. టీడీపీ నేతల దౌర్జన్యాలు, జన్మభూమి కమిటీల అరాచకాలు ప్రతిపక్ష నేతల దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు నమ్మి తామెలా మోసపోయింది కూడా వారు వివరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రజలకు వైఎస్సార్‌సీపీ నేతలు హామీ ఇచ్చారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ అండగా ఉంటూ, పోరాటం చేస్తామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా దళిత వాడల్లోని ప్రజలతో మమేకం అయ్యారు. అక్కడే భోజనం చేసి ఆ కాలనీల్లోనే నిద్రించారు.
(పాఠశాలలో పల్లెనిద్ర చేస్తున్న కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, జెడ్పీటీసీ శెట్టి పద్మావతి)
Comments
Please login to add a commentAdd a comment