
సాక్షి, కర్నూలు : వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త చెరుకులపాడు శ్రీదేవి ఆధ్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా వెల్దుర్థి మండలం, శ్రీరంగాపురంలో నిర్వహించనున్నారు. వచ్చే ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా దివంగత చెరుకులపాడు నారాయణ రెడ్డి భార్య చెరుకులపాడు శ్రీదేవి పోటీచేయనున్న విషయం విధితమే.