
సాక్షి, కర్నూలు : నంద్యాలలో ఈ నెలలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి హత్య కేసును నంద్యాల పోలీసులు చేధించారు. కాగా ఈ నెల 9న వైఎస్సార్‌సీపీ నేత, న్యాయవాది సుబ్బారాయుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. నంద్యాలకు చెందిన సుబ్బరాయుడు వాకింగ్‌కు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు మాటువేసి కర్రలతో కొట్టి హత్యచేశారు. అయితే ఆదిపత్య పోరుతోనే అతడిని హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. టీడీపీకి చెందిన మనోహర్ గౌడ్‌తోపాటు మరో ముగ్గురు అనుచరులు సుబ్బరాయుడిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: నంద్యాలలో వైఎస్సార్‌సీపీ నేత దారుణ హత్య
అంతేగాక హత్యకు పాల్పడిన టీడీపీ నాయకుడైన మనోహర్ గౌడ్.. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సన్నిహితుడిగా తేలింది. ఆధిపత్యం కోసమే సుబ్బారాయుడిని హత్య చేసినట్లు నిందితుడు మనోహర్ గౌడ్ అంగీకరించాడు. హత్యకు పాల్పడిన మనోహర్ గౌడ్, రవికుమార్, సురేంద్ర, హరి నాయక్‌లను నంద్యాల తాలూకా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: నెల్లూరులో హెలికాప్టర్ ల్యాండింగ్ కలకలం
Comments
Please login to add a commentAdd a comment