nandyal
-
నంద్యాల జిల్లాలో వైద్యులు లేక రోగులకు వాచ్ మెన్ వైద్యం
-
శ్రీశైలం ఆలయ పరిసరాలలో డ్రోన్ కలకలం
సాక్షి, నంద్యాల జిల్లా: శ్రీశైలం ఆలయ పరిసరాలలో డ్రోన్ కలకలం రేపింది. దేవస్థానం అనుమతి లేకుండా ఆలయ పరిధిలో డ్రోన్ చక్కర్లు కొట్టింది. దీంతో ఆలయ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. డ్రోన్ ఎగురవేసింది తణుకు చెందిన రమేష్‌గా భద్రతా సిబ్బంది గుర్తించారు. డ్రోన్ పట్టుకుని సీసీ కంట్రోల్ రూమ్‌కి తరలించారు. ఆలయ అధికారులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ముచ్చుమర్రి ఘటన: ‘వాళ్లు మా కళ్ల ముందే తిరుగుతున్నారు’
నంద్యాల, సాక్షి: ప్రతీకార రాజకీయంతో దాడులు, ఆడపడుచులపై అఘాయిత్యాలు.. చిన్నారులను చిదిమేస్తున్న మానవ మృగాలు.. ఏపీలో నాలుగు నెలలుగా అసలేం జరుగుతోంది?. పైగా బాధితులకు న్యాయం జరగకపోగా.. నిందితులు యధేచ్ఛగా బయట తిరుగుతున్నారు. సంచలనం సృష్టించిన ముచ్చుమర్రి బాలిక హత్యచార ఘటన కేసులో న్యాయం అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. నిందితులకు బెయిల్ లభించడంతో వాళ్లు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ పరిణామంతో.. ఆ బాలిక తల్లిదండ్రులు ప్రభుత్వంపై ఆక్రోశం వ్యక్తం చేశారు.‘‘121 రోజులైంది. మాపాప ఆచూకీ ఇంత వరకు దొరకకపోవడం ఏమిటి?. అసలేం జరుగుతోంది. నిందితులు బెయిల్ వచ్చి స్వేచ్చగా బయట తిరుగుతున్నారు. ఏ తప్పు చేయని మేం బిడ్డను దూరం చేసుకుని శిక్ష అనుభవించాలా?. వాళ్లకు బహిరంగంగా ఉరిశిక్ష వేస్తేనే మా కూతురి విషయం న్యాయం జరిగినట్లు’’ అని ఆమె తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కేసు నేపథ్యం ఇలా..నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో తొమ్మిదేళ్ల బాలికను జూలై 7న అదేగ్రామానికి చెందిన 15, 14, 9 వయసున్న ముగ్గురు మైనర్ బాలురు హత్యాచారానికి పాల్పడ్డారు. అయితే వాళ్లకు సహకరించిన మరో ముగ్గురు పెద్దలను సైతం పోలీసులు ఈ కేసులో చేర్చారు. దీంతో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసినట్లయ్యింది.అయితే.. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు, నిందితులు వెల్లడించిన వివరాలు అన్నీ అనుమానాస్పదంగా ఉన్నవే. నేరం జరిగి 90 రోజులు గడవడంతో పోలీసులు ప్రిలిమనరీ చార్జిషీట్ ఫైల్ చేశారు. క్రైం నంబర్ 69/2024లో నిందితులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాదనలు విన్న కర్నూలు పోక్సో కోర్టు ఏ4 కాటం యోహాన్, ఏ5 బొల్లెద్దుల సద్గురు అలియాస్ సద్గురుడు, ఏ6 అంబటి ప్రబేష్కు అక్టోబర్ 24వ తేదీన బెయిల్ మంజూరు చేసింది. అలాగే.. కేసులో కొద్ది రోజుల క్రితం ముగ్గురు మైనర్ నిందితుల్లో ఇద్దరికి జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరు చేసింది. చైల్డ్ ఇన్ కాంఫ్లిట్ విత్ లా(సీసీఎల్2)14 ఏళ్ల బాలుడు, సీసీఎల్3 అయిన తొమ్మిదేళ్ల బాలుడికి బెయిల్ మంజూరైంది. అయితే.. సీసీఎల్1 అయిన పదిహేనేళ్ల బాలుడు మాత్రం ప్రస్తుతం జువైనల్ జస్టిస్ హోంలో ఉన్నాడు.ఇదెక్కడి న్యాయం?ఈ కేసులో పోలీసుల అలసత్వంపై మొదటి నుంచి విమర్శలున్నాయి. తల్లిదండ్రులు బాలిక కనిపించకుండా పోయిన రోజున ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ప్రజా సంఘాల ఒత్తిడితో రెండు రోజుల తర్వాత నుంచి విచారణ ప్రారంభించారు. జులై 10న నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తే చిన్నారిని రేప్ చేసి చంపేసినట్లు నేరాన్ని ఒప్పుకున్నారు. నిందితులు బాలిక శవాన్ని మాయం చేయడంతో గుర్తించడంలో పోలీసులు పూర్తి వైఫల్యం చెందారని బాధితులు చెబుతున్నారు. అలాగే.. ప్రభుత్వం స్పందించిన తీరుపైనా ఆ టైంలో తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. తమకు న్యాయం చేయాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆ తల్లిదండ్రులు పలు ఇంటర్వ్యూల ద్వారా విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అటుపై ఈ కేసును ప్రభుత్వం, పోలీసులు పూర్తిగా గాలికొదిలేశారు. సుమారు 121 రోజులు గడుస్తున్న ఇంకా పాప ఆచూకీ దొరకలేదన్న బాధలో ఉన్న ఆ తల్లిదండ్రులు.. ఇప్పుడు న్యాయం అందకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. -
బాణాసంచా షాపుల కేటాయింపులో టీడీపీ నేతల చేతివాటం
-
ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్‌కు రిలీఫ్!
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కి హైకోర్టులో ఊరట లభించింది. గతంలో ఆయన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ కేసు నమోదైంది. ఈ కేసును కొట్టి వేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నవంబర్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజున తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.కాగా.. గత ఎన్నికల్లో తన స్నేహితుడు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఉన్న రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతుగా నంద్యాల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అభిమాన హీరో నంద్యాలకు రావడంతో ఊహించని రీతిలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరలివచ్చారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ నియామావళి ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. -
పార్క్ కు తాళం వేసిన మున్సిపల్ కమిషనర్.. ఎందుకంటే !
-
త్వరలో కార్తీక మాసం..శ్రీశైలం మల్లన్న భక్తులకు అలర్ట్
సాక్షి,నంద్యాల: శ్రీశైలం మల్లన్న భక్తులకు ముఖ్యగమనిక. త్వరలో శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రంలో కార్తీక మహోత్సవాలు జరగనున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా కార్తీక మహోత్సవాల్ని పురస్కరించుకొని ఆలయంలో జరిగే గర్భాలయ అభిషేకాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ ఆలయ ఈవో చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. నవంబర్ 2 నుండి డిసెంబర్ 1 వరకు మల్లికార్జునస్వామి పుణ్యక్షేత్రంలో కార్తీక మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కార్తీక మాసం సందర్భంగా దేవాలయానికి భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది. రద్దీ దృష్ట్యా కార్తీక మాసంలో జరిగే మాసోత్సవాల్లో భాగంగా ఆలయంలో జరిగే పలు కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు.రద్దీ రోజులలో స్వామివార్ల స్పర్శ దర్శనం నిలిపివేసి.. అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆలయ అధికారులు ప్రకటించారు. రద్దీ రోజులలో మినహా మిగిలిన రోజులలో విడతల వారిగా సామూహిక అభిషేకాలు చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారి అంతరాలయంలో కుంకుమార్చన, పూజలు తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు తెలిపారు. -
నంద్యాలలో చిరుత సంచారంతో కలకలం?
నంద్యాల జిల్లా: జిల్లా మిడుతూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సమీపంలో చిరుత పులి కలకలం సృష్టించింది. అయితే స్థానికులు తమకు చిరుత కనిపించిందని చెప్పడంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పాద ముద్రలు సేకరించారు. పాదముద్రలు సరిగ్గా లేకపోవడంతో.. అది పులినా లేక మరేదైనా జంతువు అన్నది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసతమైతే కెమెరాలు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. కాగా, కొద్ది నెలల క్రితం నంద్యాల–గిద్దలూరు నల్లమల ఘాట్‌రోడ్డులోని పచ్చర్ల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ మెహరున్నీసాపై తాజాగా చిరుతపులి దాడి చేసి తలను తినేసిన సంఘటన స్థానికులను కలచివేసింది. కట్టెపుల్లల కోసం అటవీ ప్రాంతానికి వెళ్లిన ఆమైపె చిరుతపులి దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.ఇదిలా ఉండగా మహానందిలోనూ చిరుతపులి సంచారంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. నంద్యాల, ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లోని నల్లమల అడవి పరిసరాల్లో ఉన్న గ్రామాల సమీపంలో చిరుతపులులు సంచరిస్తున్నాయి. నెలల వ్యవధిలోనే నలుగురు చిరుతపులి దాడిలో గాయపడ్డారు. ఇటీవల అటవీశాఖలోని మూడాకుల గడ్డ ప్రాంతంలో ఉన్న లెపర్డ్ బేస్ క్యాంపులో విధులు నిర్వహించే అజీమ్‌బాషాపై చిరుతపులి దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. తాజాగా, మరోసారి చిరుత సంచరిస్తుందనే ప్రచారంతో స్థానికులు ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. -
తగువులు వద్దన్నందుకు తమ్ముడినే చంపేశాడు..
రుద్రవరం: చిన్న చిన్న విషయాలకు ఇతరులతో గొడవపడొద్దని సూచించిన తమ్ముడిని.. అన్న కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన గురువారం రాత్రి నంద్యాల జిల్లా రుద్రవరం మండలం బి.నాగిరెడ్డిపల్లెలో జరిగింది. శిరివెళ్ల సీఐ వంశీధర్, ఎస్ఐ వరప్రసాద్ తెలిపిన వివరాలు.. బి.నాగిరెడ్డిపల్లెలో గురువారం రాత్రి సురేంద్ర అనే వ్యక్తి మోటార్ సైకిల్‌పై వేగంగా వెళ్తుండగా పెద్ద ఓబులేసు అనే వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు. దాడి విషయం తెలుసుకున్న ఓబులేసు కుటుంబ సభ్యులు.. నువ్వు మద్యం మత్తులో రోజూ ఏదో ఒక సమస్య తెస్తున్నావు.. పద్ధతి మార్చుకోవాలి.. అని చెప్పారు. ఇందుకు కోపోద్రిక్తుడైన ఓబులేసు.. కత్తితో తమ్ముడు కర్రెన్న అలియాస్ ఇసాక్(40)ను పొడిచాడు. అడ్డు వచ్చిన తండ్రిపైనా దాడి చేశాడు. క్షతగాత్రులిద్దరినీ నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. శుక్రవారం తెల్లవారు జామున ఇసాక్ మృతి చెందాడు. మృతుడి భార్య కుమారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్‌చేశారు. -
అతీగతీలేని దర్యాప్తు
సాక్షి, అమరావతి : నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో చిన్నారి వాసంతిని అపహరించి, హత్యాచారం చేసి మూడునెలలు అవుతున్నా మృతదేహాన్ని ఇప్పటివరకూ గుర్తించలేదు. అలాగే, చిత్తూరు జిల్లా పుంగనూరులో చిన్నారి అంజుమ్‌ను అపహరించి, హత్యచేసి ఆరు రోజులవుతున్నా ఇప్పటివరకు నిందితులెవరో కనుగొనలేదు. .. ఇదీ బాలికలు, మహిళల భద్రతపట్ల సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. ప్రభుత్వ తీరును ఆసరాగా చేసుకునే రాష్ట్రంలో రౌడీలు, ఆకతాయిలు అత్యాచారాలు, లైంగిక దాడులకు బరితెగిస్తున్నారు. మరోవైపు.. దర్యాప్తు విషయంలో పోలీసుల తీరూ నత్తనడకను మరిపిస్తోంది. ఇందుకు పుంగనూరులో చిన్నారి అశి్వయ అంజుమ్ కిడ్నాప్, హత్య కేసే ఉదాహరణ. ఆమె తల్లిదండ్రులు వెంటనే ఫిర్యాదు చేసినా పోలీసులుగానీ ప్రభుత్వంగానీ బాధ్యతాయుతంగా స్పందించకపోవడంవల్లే ఏడేళ్లకే ఆ చిన్నారికి నూరేళ్లు నిండిపోయాయి. అపహరణకు గురైన అంజూమ్‌ను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. కనీసం ఆమె హంతకులను అయినా గుర్తించడంలో పోలీసులు క్రియాశీలంగా దర్యాప్తు చేస్తున్నారా అంటే అదీ లేదు. ముఖ్యమంత్రి, హోంమంత్రి అయినాసరే ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారా అంటే అదసలే లేదు. సత్వర స్పందన లేదు.. సమగ్ర దర్యాప్తు అంతకన్నా లేదు.. నిజానికి.. అంజుమ్ గత ఆదివారం సాయంత్రం నుంచి కనిపించలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు షమియ, అజ్మతుల్లా ఆ రోజు సా.6 గంటల సమయంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు సరైన రీతిలో స్పందించలేదు. పుంగనూరులోని అంజుమ్ కుటుంబం నివసించే యూబీ కాంపౌండ్ నుంచి చెంగాలాపురం రోడ్డు వరకే దర్యాప్తును పరిమితం చేయడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే పోలీసు జాగిలాలు చెంగలాపురం రోడ్డు వరకు వచ్చి ఆగిపోయాయి. దీంతో పోలీసుల దర్యాప్తు కూడా అక్కడితోనే నిలిచిపోయింది. అంతేగానీ అక్కడికి పది కి.మీ. పరిధిలో గాలింపు చర్యలు చేపట్టాలనిగానీ అనుమానితుల కదలికలపై ఆరా తీయాలనిగానీ వారికి అనిపించకపోవడం విస్మయపరుస్తోంది.చెంగలాపురం రోడ్డు వరకు జాగిలాలు వచ్చి ఆగిపోయాయి అంటే.. అక్కడ నుంచి ఆగంతకులు మరో వాహనంలో అంజుమ్‌ను తీసుకునిపోవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనేలేదు. ఇక గత ఆదివారం అంజుమ్ నివాసం పరిసర ప్రాంతాల్లో అనుమానితుల కదలికలపైనా ఆరా తీయలేదు, స్థానిక ఆకతాయిలపై దృష్టిసారించనే లేదు. సెల్‌ఫోన్ టవర్ల డేటా, గూగుల్ టేకవుట్ డేటా విశ్లేíÙంచాలని అనిపించకపోవడం విడ్డూరం. ఆదివారం సాయంత్రం నుంచి బుధవారం వరకు పోలీసులు తూతూమంత్రంగా విచారణ పేరుతో విలువైన కాలాన్ని వృథా చేశారు. చివరికి.. బుధవారం మధ్యాహ్నం ఎన్‌ఎస్‌పేట సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో అంజుమ్ మృతదేహాన్ని గుర్తించారు. అంజూమ్ నివాసానికి ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 4 కి.మీ. దూరంలోనే ఉంది. అంటే.. పోలీసులు మూడ్రోజుల్లో కూడా కనీసం 4 కి.మీ. పరిధిలో కూడా గాలింపు చర్యలు చేపట్టలేదన్నది స్పష్టమవుతోంది.ఆరు రోజులైనా నిందితులను గుర్తించనేలేదు..పోనీ అంజుమ్ హంతకులను గుర్తించే దిశగా అయినా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారా అంటే అదీ లేదు. చిన్నారి అంజుమ్ అపహరణకు గురై ఆరు రోజులు గడిచాయి. ఆమె మృతదేహాన్ని గుర్తించి మూడు రోజులైంది. ఇప్పటివరకు అసలు నిందితులను గుర్తించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. హత్యకు గల కారణాలనూ పోలీసులు నిర్ధారించలేకపోయారు. స్థానికంగా ఉండే ఓ మహిళతోపాటు గంజాయికి బానిసలైన నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు గంజాయి వ్యసనపరులపైకి నేరాన్ని నెట్టివేసేందుకు యత్నిస్తోందని స్థానికులు సందేహం వ్యక్తంచేస్తున్నారు. అంతేతప్ప.. అంజుమ్‌ను అపహరించి హత్యచేసిన అసలు దోషులను గుర్తించేందుకు సమగ్రంగా దర్యాప్తు చేయడంలేదని చెబుతున్నారు. కేసును ఏదో విధంగా క్లోజ్ చేయాలనే దిశగానే పోలీసులు ప్రయత్నిస్తున్నారు తప్ప.. అసలు దోషులను గుర్తించేందుకు చిత్తశుద్ధితో దర్యాప్తు చేయడంలేదని కూడా వారు విమర్శిస్తున్నారు. -
నల్లమలలో పక్షుల కిలకిల
నల్లమల అంటేనే ఎన్నో వింతలు, విశేషాలకు పుట్టినిల్లు. జాతీయ జంతువైన పెద్దపులి నుంచి అరుదైన వన్యప్రాణులు, ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, ఆధ్యాతి్మక కేంద్రాలైన ప్రముఖ పుణ్యక్షేత్రాలు, అద్భుత జలపాతాలు, పచ్చటి పర్వత సానువులు, దట్టమైన అడవుల అందాలు...ఇలా నల్లమల ఎన్నో అద్భుతాలకు ఆలవాలం. జీవ వైవిధ్యానికి పెట్టింది పేరైన నల్లమల తాజాగా దేశ, విదేశీ పక్షులకు స్థావరంగా మారింది. వేల కిలోమీటర్లు దాటుకుంటూ వలస పక్షులు నల్లమలకు చేరుకుని ఆవాసాలు ఏర్పరచుకుంటున్నాయి. నల్లమలలో పచ్చని చెట్లు, గలగల పారే సెలయేటి సవ్వడులు వలస పక్షులను మరింత ఆకర్షిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. – మహానందిబార్ హెడెడ్ గూస్ప్రపంచంలోనే అత్యంత ఎత్తుకు ఎగిరే పక్షి బార్ హెడెడ్ గూస్ అని చెబుతారు. ఇవి సంతానోత్పత్తి కోసం మ«ధ్య ఆసియాలోని పర్వత ప్రాంతాల నుంచి దక్షిణాసియాలోని ద్వీపకల్ప ప్రాంతానికి వస్తాయి. ఈ పక్షులు ఒకేసారి మూడు నుంచి పది గుడ్లు పెడతాయి. ఇవి అత్యంత ఎత్తయిన హిమాలయాల మీదుగా ఎగురుకుంటూ వలస వస్తాయి. ఎల్లో థ్రోటెడ్ బుల్బుల్ ఎంతో అందంగా కనిపించే అరుదైన పక్షిజాతుల్లో ఎల్లో థ్రోటెడ్ బుల్బుల్ ఒకటి. అంతరించిపోతున్న పక్షి జాతుల్లో ఇది ఒకటని ఆరి్నథాలజిస్టులు చెబుతున్నారు. ఇవి తాము సంచరించే ప్రాంతాలను చిన్న చిన్న సర్కిల్స్‌గా ఏర్పాటు చేసుకుంటాయి. కీటకాలను తింటాయి. భారత ద్వీపకల్పానికి చెందిన పక్షిజాతుల్లో ఇది ఒకటి. నిటారుగా ఉండే కొండ ప్రాంతాల్లో ఇవి నివసిస్తాయి. పక్షులనే ఆహారం తీసుకునే ‘‘హారియర్స్’’: విదేశీ పక్షిజాతుల్లో రకరకాల పక్షులు ఉంటాయి. వాటిలో పక్షులనే ఆహారంగా తీసుకునే హ్యారియర్స్ జాతి ఒకటి. ఇది ఆక్సిపిట్రిడి అనే వేటాడే పక్షి కుటుంబానికి చెందిన సర్కస్ జాతి. ఇవి మైదాన ప్రాంతాల్లో తిరుగుతూ పక్షులు, చిన్నచిన్న క్షీరదాలను ఆహారంగా తీసుకుంటాయి. యూరప్, పశ్చిమాసియా నుంచి నల్లమలకు వలస వస్తాయి. గ్రేటర్ ఫ్లెమింగోలుఫ్లెమింగో కుటుంబానికి చెందిన అతి పెద్ద జాతి గ్రేటర్ ఫ్లెమింగో. ఇవి ఉత్తర తీర ప్రాంతాలు, దక్షిణ ఐరోపా, హిమాలయ ప్రాంతాల్లో ఉంటాయి. తల, మెడ, రంగుల ఆధారంగా గ్రేటర్ ఫ్లెమింగో, అమెరికన్ ఫ్లెమింగోలుగా వర్గీకరిస్తారు. వీటి ఈకలు గులాబీ రంగులో ఉంటాయి.ఇండియన్ పిట్టచిన్న మొండితోకను కలిగి ఎంతో అందంగా కనిపించే పక్షి ఇండియన్ పిట్ట. ఇది దట్టమైన అడవుల్లోని నేలలపై, పొదల్లో ఉంటుంది. ఆకులు, చెత్తలో ఉండే క్రిమికీటకాలను ఆహారంగా తీసుకుంటుంది. గతంలో ఓ ఆంగ్లేయుడు ఈ పిట్ట(పక్షి)ని చూసి దీని పేరేంటి అని అడిగితే మన భారతీయులు ఇండియన్ పిట్ట అన్నారని, అందుకే ఇండియన్ పిట్టగా పేరు పడిపోయిందని పలువురు శాస్త్రవేత్తల అభిప్రాయం. ఊలి నెక్డ్ స్టార్క్(ఉన్ని మెడ కొంగ)కొంగల్లో ఊలి నెక్డ్ స్టార్క్ ఒకటి. దీని మెడ వద్ద ఉన్నిలాగా ఉండటంతో దీన్ని ఉన్ని మెడ కొంగ అని పిలుస్తారు. వీటిలో ఆసియా, ఆఫ్రికన్ జాతులు అని రెండు రకాలు ఉంటాయి. నల్లమల ప్రాంతంలో ఆసియా జాతికి చెందినవి ఎక్కువగా సంచరిస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. నంద్యాల జిల్లాలో అరుదైన పక్షులు పెద్దపులి, చిరుతపులులతో పాటు ఎన్నో అరుదైన వన్యప్రాణులు, వింతలు, విశేషాలకు నల్లమల నిలయం. నంద్యాల జిల్లాలోని నల్లమల, అహోబిలం ప్రాంతాల్లోని అడవుల్లో అరుదైన దేశీయ, విదేశీ వలస పక్షులు ఉన్నాయి. మేము చేసిన పరిశోధనల్లో 230 రకాల పక్షులను గుర్తించాము. ఒకే జిల్లాలో ఇన్ని రకాల పక్షులు ఉండటం ఎంతో విశేషమనే చెప్పాలి. – తరుణ్‌కుమార్ సింగ్, జూనియర్ సైంటిస్ట్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ వలసపక్షులకు కేంద్రంనల్లమలలో పెద్దపులులే కాదు. అరుదైన వన్యప్రాణులు, క్రిమికీటకాలు ఎన్నో ఉన్నాయి. పక్షుల్లో అనేక రకాల జాతులకు నంద్యాల జిల్లా పరిధిలోని నేలలు ఎంతో అనువైనవి. కొన్ని రకాల పక్షులు చిత్తడి నేలలంటే ఇష్టపడతాయి. ఎక్కడ తడినేలలు కనిపిస్తే అక్కడికి అన్నీ చేరి ఆహారాన్వేషణ చేస్తూ రైతులకు తెలియకుండా రైతు నేస్తాలుగా మారిపోతున్నాయి. – దూపాడు శ్రీధర్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ నంద్యాల జిల్లాలో 230 రకాల పక్షులు నంద్యాల జిల్లాలో 230 రకాల పక్షిజాతులు ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. మనం నిత్యం చూసే చిలుకలు, కింగ్ ఫిషర్, కొంగలు, బాతులు, వడ్రంగిపిట్టలు, పిచ్చుకలు, పావురాలతో పాటు దేశ, విదేశాల నుంచి వచ్చే వలస పక్షులు సైతం ఈ ప్రాంత వాతావరణాన్ని ఇష్టపడుతున్నాయి. గడ్డిభూములు, కొండలు, చిత్తడి నేలలు ఇలా అన్ని రకాల నేలలు ఉండటంతో వివిధ రకాల పక్షులకు ఆహారం కూడా తేలికగా లభిస్తోంది. మనం నిత్యం చూసే పక్షి జాతులతో పాటు బార్ హెడెడ్ గూస్, హ్యారియర్స్, టరŠన్స్, ఎల్లో త్రోటెడ్ బుల్బుల్, ఇండియన్ పిట్ట, స్వాంపెన్, గ్రేటర్ ఫ్లెమింగోస్, డార్టర్ కార్మోరెంట్, స్పాట్ బిల్డ్ పెలికాన్, పాండ్ హెరాన్, రెడ్ నాప్డ్ హైబిస్, పర్పుల్ సన్ బర్డ్స్, వెయిట్ త్రోటెడ్ కింగ్ ఫిషర్, మార్స్ హారియర్, శాండ్ పైపర్, స్పాటెడ్ ఓలెట్, కాంబ్ డక్, బ్లూ టెయిల్డ్ బీ ఈటర్ లాంటి వాటితో పాటు రాత్రుళ్లు మాత్రమే కనిపించే నైట్‌జార్స్ వంటి అనేక రకాల పక్షులు నల్లమల పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. -
మైనర్‌పై అత్యాచారం
అవుకు: ఇంట్లో ఎవరూ లేని సమయం తెలుసుకున్న ఓ ప్రబుద్ధుడు తాగడానికి మంచినీళ్లు అడిగి... అదే అదునుగా మైనర్‌పై అత్యాచారం చేసిన ఘటన నంద్యాల జిల్లా, అవుకు మండల పరిధిలోని కాశీపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాశీపురం గ్రామానికి చెందిన మైనర్ కోవెలకుంట్ల పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ప్రభుదాసు అనే వ్యక్తి ఇదే పాఠశాల వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.రోజూ బాలిక ఇదే వ్యాన్‌లో ఊరికి వచ్చేది. ఆదివారం బాలిక తల్లిదండ్రులు పనులకు వెళ్లారు. ఇంట్లో ఎవ్వరూ లేరనే విషయం తెలుసుకున్న నిందితుడు ఇంటి వద్దకు వెళ్లి బాలికను..మీ నాన్న ఇంట్లోలేడా అని అడిగి.. తాగేందుకు మంచినీళ్లు తీసుకురమ్మన్నాడు. బాలిక ఇంట్లోకి వెళ్లగానే నిందితుడు తలుపులు వేసి బాలికనోరు మూసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంతలో బాలిక తల్లి ఇంటికి తిరిగి వచ్చి గేటు తీసింది. గేటు శబ్దం విన్న నిందితుడు బాలికను బెదిరించి మంచం కింద దాక్కున్నాడు. అప్పటికే భయాందోళనగా ఉన్న బాలిక తలుపులు తెరవగానే చెంపపై కాట్లు ఉండటంతో తల్లి ప్రశి్నస్తూనే నిందితుడిని గమనించింది. దీంతో కేకలు వేయగా, చుట్టుపక్కల వారు, బంధువులు బాలిక ఇంటికి వచ్చి నిందితుడిని కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
పోలీసులు బదిలీల్లో మితిమీరిన రాజకీయ జోక్యం
నంద్యాల, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో అన్నింటా మితిమీరిన రాజకీయ జోక్యం నడుస్తోంది. కూటమి నేతల్లో ప్రభుత్వం ఏర్పాటు నుంచి అధికార దర్పం ప్రదర్శించడం మరీ ఎక్కవైపోయింది. ఈ క్రమంలో వాళ్ల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో అధికారులు నలిగిపోతున్నారు. నందికొట్కూరులో నంద్యాల ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య పోస్టింగ్ ల రగడ నెలకొంది. పోలీసులు బదిలీల్లో రాజకీయ జోక్యం శ్రుతి మించిపోయింది. మొన్న నందికొట్కూరు సర్కిల్ సీఐ పోస్టింగ్ లో నువ్వా నేనా అంటూ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరగ్గా.. ఇవాళ జూపాడుబంగ్లా పోలీస్ స్టేషన్ ఎస్ఐగా కేశవకి పోస్టింగ్ ఇప్పించుకున్నారు ఎంపీ శబరి. అయితే.. ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్న ఐదు నిమిషాల్లోనే ఎస్ఐ కేశవను బదిలీ చేపించారు ఎమ్మెల్యే జయసూర్య. ఇదే తరహాలో ముచ్చుమర్రి పీఎస్ ఎస్ఐగా ఎవరివారే సిఫార్సు చేసిన వాళ్లకు పోస్టింగ్ ఇవ్వాలంటున్న పట్టుపట్టారు ఇద్దరు. పోలీస్ ఉన్నతాధికారులు డీఓలు వేయడం, వెంటనే రద్దు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయ నేతల సిఫార్సులకు నాలుగు సింహలు తలోగుతుండగా.. అధికారుల తీరుతో సర్కిల్ పోలీస్ సిబ్బంది నలిగిపోతున్నారు. -
స్నేహితులే అలా చేసేసరికి.. నంద్యాల ఇంటర్ విద్యార్థి కేసులో విస్తుపోయే విషయాలు!
నంద్యాల, సాక్షి: ఆత్మకూరు ఇంటర్ విద్యార్థి అదృశ్యం కేసు.. విషాదాంతంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు విస్తుపోయే వివరాల్ని మీడియాకు వెల్లడించారు. స్నేహితులే అతన్ని ఎత్తుకెళ్లడం, ఆపై అమానవీయంగా ప్రవర్తించడంతో అతను బలవర్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. ఆత్మకూరు మండలం కొత్తపేటకు చెందిన ఇంటర్ విద్యార్థి వహీద్ బాషా ఈ నెల 13న కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లి అడిగారు. వహీద్ కళాశాల ప్రాంగణంలో తిరిగి వెళ్లినట్లు తెలుసుకున్నారు. అయితే వహీద్ స్నేహితులే అతన్ని కిడ్నాప్ చేసినట్లు అనుమానించారు. ఆ నలుగురు యువకులపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు తెలిపారు. ఈలోపు మూడు రోజులు గడిచాయి. అయినా వహీద్ జాడ తెలియకపోవడంతో అతని కుటుంబంలో ఆందోళన పెరిగిపోయింది. ఈలోపు.. ఆత్మకూరు శివారులోని ఓ బావిలో వహీద్ శవమై కనిపించాడు. దీంతో.. ఇది హత్యా? ఆత్మహత్యా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగింది. చివరకు.. స్నేహితుల వల్లే వహీద్ చనిపోయాడని పోలీసులు నిర్ధారించారు. అర్బన్ సీఐ లక్ష్మినారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం.. వహిద్‌కు స్నేహితులతో ఏవో గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో అతన్ని కిడ్నాప్ చేసిన తీవ్రంగా కొట్టిన యువకులు.. అతన్ని దుస్తులు విప్పించి బలవంతంగా ఫొటోలు తీశారు. దాడి గురించి బయట ఎవరికైనా చెబితే ఆ ఫొటోల్ని నెట్లో పెడతామని బెదిరించారు. దీనిని అవమానభారంగా భావించిన వాహిద్ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు కారకులైన నలుగురు యువకుల్ని అరెస్ట్ చేశాం అని తెలిపారయన. -
జగన్ ను కలిసిన తర్వాత ధైర్యం వచ్చింది..
-
జన నాయకుడికి అడుగడుగునా జన నీరాజనం..
-
నంద్యాలలో సుబ్బారాయుడి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్ (ఫొటోలు)
-
పోలీసులు పక్కనే ఉన్న రక్షణ లేదు మాకు...
-
నంద్యాలకు బయల్దేరిన జగన్
-
నంద్యాలకు బయల్దేరిన జగన్
-
సుబ్బరాయుడు కుటుంబానికి జగన్ పరామర్శ
-
పోలీసులకు లొంగిపోయిన టీడీపీ హంతకుడు..
-
నేడు నంద్యాల జిల్లా పర్యటనకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. టీడీపీ గూండాల దాడిలో హత్యకు గురైన పసుపులేటి సుబ్బరాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. దీనిలో భాగంగా ఉదయం 9 గంటల ప్రాంతంలో తాడేపల్లి నుండి నంద్యాల జిల్లా పర్యటనకు బయల్దేరి వెళతారుగన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 10.15 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామాపురం చేరుకొని.. సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. బెంగళూరుకు వెళతారు. -
నంద్యాల జిల్లాలో నరమేధం సృష్టించిన శ్రీనివాస్‌రెడ్డి ఎక్కడ?
-
వైఎస్సార్సీపీ సుబ్బారాయుడు హత్య కేసు.. 11 మంది అరెస్ట్
సాక్షి, నంద్యాల: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నంద్యాల జిల్లాలో వైఎస్సార్సీపీ నేత పెద్ద సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇక, ఈ కేసులో తాజాగా పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. కానీ, ఏ-1గా ఉన్న బుడ్డా శ్రీనివాస్‌ను మాత్రం పోలీసులు అరెస్ట్ చేయకపోవడం గమనార్హం.ఇక, మహానంది మండలం సీతారామపురం గ్రామంలో వైఎస్సార్సీపీ నేత పెద్ద సుబ్బారాయుడిని టీడీపీ నేత బుడ్డా శ్రీనివాస్ హత్య చేశాడు. అతడి అనుచరులతో కలిసి పోలీసుల ముందే దాడి చేసి చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా 11 మంది ముద్దాయిలను అరెస్ట్ చేశారు. ఈ కేసులో మిగతా 15 మంది ముద్దాయిల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరిని నంద్యాల సమీపంలోని చాపిరేవుల అండర్ పాస్ దగ్గర అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుల నుండి హత్యకు ఉపయోగించిన మూడు కత్తులు, మూడు కర్రలు, రెండు సెల్ఫోన్లను, స్కోడా కారు, ఫార్చునర్ కారులను పోలీసులు సీజ్ చేశారు.అరెస్టు అయిన వారి వివరాలు..A2 బుడ్డా రెడ్డి ప్రభాకర్ రెడ్డి, A3 వంగాల లక్ష్మి రెడ్డి, A4 వంగాల పుల్లారెడ్డి, A5 బుడ్డా రెడ్డి లక్ష్మి నాగశేఖర్ రెడ్డి @ కుంటి శేఖర్ రెడ్డి, A7 తాలూరి శ్రీనివాసులు @ దుబ్బ శ్రీను,A9 పెరుమాళ్ల వెంకటరమణ @ డీలర్ రమణ,A10 మైలాపురం రామచంద్ర రెడ్డి,A11 దూదేకుల బాల హుసేని,A12 జిల్లెల్ల బాస్కర్,A13 గని రంగస్వామి,A14 వంగాల ఈశ్వర్ రెడ్డి,