
మళ్లీ నారా పాలన తెస్తామంటున్నారు.. వారిని అడ్డుకేనేందుకు ప్రజలంతా సిద్ధం

ఇటు జగన్ ఒక్కడు.. అటు చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ.. వీరికి కాంగ్రెస్ పార్టీ కూడా తోడైంది

పొత్తు కుట్రలను ఎదుర్కొనేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలి.. 175 ఎమ్మెల్యే,25 ఎంపీ స్ధానాలు గెలిచి డబుల్ సెంచరీ కొడదాం

గతంలో చంద్రబాబు అబద్ధాలు చూశాం..మోసాలు చూశాం. వైసీపీకి ఓటేస్తే మరో ఐదేళ్లు ముందుకు.. బాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి

పేదల గుండెల్లో నాకు చోటు దక్కింది..అదే నాకు బహుమతి.. పేదల బతుకుల్లో మార్పు కోసమే నా ఆరాటం

చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటీ లేదు..బాబు పేరు చెబితే బషీర్ బాగ్ కాల్పులు,కరువు కాటకాలు గురొస్తాయి.

2014లో చంద్రబాబు రంగురంగుల హామీల ఇచ్చారు. సూపర్ సిక్స్ అంటూ మళ్లీ కొత్త హామీలు ప్రకటిస్తున్నారు.. ప్రజలు యుద్దానికి సిద్ధం కావాల్సిన సమయం వచ్చేసింది
