highlights
-
Champions Trophy 2025: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్
India Vs Bangladesh Match Live Updates And Highlights:భారత్ ఘన విజయం..ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 4 వికెట్లు కోల్పోయి 46.3 ఓవర్లలో అందుకుంది. భారత బ్యాటర్లలో ఓపెనర్ శుబ్‌మన్ గిల్(129 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 101 నాటౌట్) సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు రోహిత్ శర్మ(41), కేఎల్ రాహుల్(41) పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో రిషాద్ హొస్సేన్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముస్తఫిజుర్ రెహ్మన్, టాస్కిన్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. గిల్ సెంచరీ..శుబ్‌మన్ గిల్ సెంచరీతో మెరిశాడు. 125 బంతుల్లో గిల్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. భారత్ విజయానికి ఇంకా 7 పరుగులు కావాలి.విజయానికి చేరువలో భారత్..44 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(88), కేఎల్ రాహుల్(33) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 19 పరుగులు కావాలి.34 ఓవర్లకు భారత్ స్కోర్: 158/434 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(65), కేఎల్ రాహుల్(5) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 90 పరుగులు కావాలి.భారత్ నాలుగో వికెట్ డౌన్..144 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. రిషాద్ హొస్సేన్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి కేఎల్ రాహుల్ వచ్చాడు. భారత్ విజయానికి ఇంకా 85 పరుగులు కావాలి.మూడో వికెట్ డౌన్..134 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. ముస్తఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో శుబ్‌మన్ గిల్(56), అక్షర్ పటేల్(3) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 90 పరుగులు కావాలి.విరాట్ కోహ్లి ఔట్..టీమిండియా విరాట్ కోహ్లి రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. రిషాద్ హొస్సేన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. 24 ఓవర్లకు భారత్ స్కోర్: 118/2ఆచితూచి ఆడుతున్న గిల్-కోహ్లిరోహిత్ శర్మ ఔటయ్యాక భారత బ్యాటర్లు విరాట్ కోహ్లి(13), శుబ్‌మన్ గిల్(41) ఆచితూచి ఆడుతున్నారు. 19 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.టీమిండియా తొలి వికెట్ డౌన్..69 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ.. టాస్కిన్ ఆహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్: 69/1దూకుడుగా ఆడుతున్న రోహిత్, గిల్..229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 7 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(27), శుబ్‌మన్ గిల్(13) ఉన్నారు.ఐదేసిన షమీ.. బంగ్లాదేశ్ 228 ఆలౌట్ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయాడు. భారత బౌలర్ల ధాటికి టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఈ మాత్రం స్కోరైన సాధించిందంటే అది తౌహిద్ హృదోయ్ (100), జాకిర్ అలీ (68) చలువే. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను వీరిద్దరూ ఆదుకున్నారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో వీరిద్దరూ మినహా ఎవరూ రాణించలేదు. ఈ మ్యాచ్‌లో షమీ 200 వికెట్ల క్లబ్లో చేరాడు. రోహిత్ శర్మ సునాయాసమైన క్యాచ్ వదిలేయడంతో అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్ మిస్ అయ్యింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. ఐదు వికెట్లు తీసిన షమీతౌహిద్ హృదోయ్ సూపర్ సెంచరీజట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన తౌహిద్ హృదోయ్.. అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి సూపర్ సెంచరీ చేశాడు. కండరాల సమస్యతో బాధపడుతూనే హృదోయ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. నాలుగో వికెట్ తీసిన షమీఈ మ్యాచ్‌లో షమీ ఖాతాలో నాలుగో వికెట్ పడింది. షమీ.. తంజిమ్ హసన్ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 47 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 221/8గా ఉంది. తౌహిద్ హృదోయ్ (96) , తస్కిన్ అహ్మద్ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో సూపర్‌గా బ్యాటింగ్ చేస్తున్న హృదోయ్ కండరాలు పట్టేయడంతో బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు.ఏడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్214 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఏడో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి రిషద్ హొసేన్ (18) ఔటయ్యాడు.ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్హృదోయ్, జాకిర్ అలీ మధ్య భాగస్వామ్యానికి ఎట్టకేలకు తెరపడింది. జాకిర్ అలీని (68) షమీ ఔట్ చేశాడు. 189 పరుగుల వద్ద (42.4 ఓవర్లు) బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. తౌహిద్ హృదోయ్ (84), రిషద్ హొసేన్ క్రీజ్‌లో ఉన్నారు. హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న జాకిర్ అలీ, హృదోయ్బంగ్లా మిడిలార్డర్ బ్యాటర్లు తౌహిద్ హృదోయ్, జాకిర్ అలీ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను వీరిద్దరూ ఆదుకున్నారు. ప్రస్తుతం జాకిర్ అలీ 54, హృదోయ్ 61 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 37.3 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 150/5గా ఉంది. 31 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 113/5తౌహిద్ హృదోయ్ (37), జాకిర్ అలీ (41) జాగ్రత్తగా ఆడుతూ బంగ్లాదేశ్‌ను గౌరవప్రదమైన స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయమైన 78 పరుగులు జోడించారు. 31 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 113/5గా ఉంది.25 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 92/535 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ మరో వికెట్ పడకుంగా జాగ్రత్తగా ఆడుతుంది.25 ఓవర్ల అనంతరం ఆ జట్టు స్కోర్ 92/5గా ఉంది. తౌహిద్ హృదోయ్, జాకిర్ అలీ తలో 29 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు. హ్యాట్రిక్ మిస్అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్ మిస్ అయ్యింది. తొమ్మిదో ఓవర్లో వరుసగా 2, 3 బంతులకు వికెట్లు తీసిన అక్షర్.. నాలుగో బంతికి కూడా వికెట్ తీయాల్సింది. జాకిర్ అలీ ఇచ్చిన లడ్డూ లాంటి క్యాచ్‌కు రోహిత్ శర్మ మిస్ కావడంతో అక్షర్ హ్యాట్రిక్ తీసే సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. 9 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 36/5గా ఉంది. తౌహిద్ హృదోయ్ (4), జాకిర్ అలీ (1) క్రీజ్‌లో ఉన్నారు.వరుస బంతుల్లో వికెట్లు తీసిన అక్షర్.. పీకల్లోతు కష్టాల్లో బంగ్లాదేశ్ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో అక్షర్ పటేల్ వరుస బంతుల్లో (2, 3) వికెట్లు తీశాడు. తొలుత తంజిద్‌కు పెవిలియన్‌కు పంపిన అక్షర్.. ఆతర్వాతి బంతికే ముష్ఫికర్‌కు ఔట్ చేశాడు.నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్35 పరుగుల వద్ద బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో తంజిద్ హసన్ (25) పెవిలియన్ బాట పట్టాడు. మళ్లీ వికెట్ తీసిన షమీ.. మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్బంగ్లాదేశ్ జట్టు 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో షమీ తన రెండో వికెట్ తీశాడు. స్లిప్స్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో మెహిది హసన్ మిరాజ్ (5) పెవిలియన్‌కు చేరాడు. 6.2 ఓవర్ల అనంతరం బంగ్లా స్కోర్ 26/3గా ఉంది. తంజిద్ హసన్ (20) ధాటిగా ఆడుతున్నాడు. తౌహిద్ హృదోయ్ కొత్తగా క్రీజ్‌లోకి వచ్చాడు.రెండో ఓవర్లో మరో వికెట్బంగ్లాదేశ్ జట్టు రెండో ఓవర్లో మరో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి నజ్ముల్ హసన్ షాంటో డకౌటయ్యాడు. బంగ్లా ఖాతాలో ప్రస్తుతం 2 పరుగులకే ఉన్నాయి. తొలి ఓవర్లోనే వికెట్ తీసిన షమీటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టడంతో సౌమ్య సర్కార్ డకౌటయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 20) భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతుంది దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో (అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్) బరిలోకి దిగుతుంది. అర్షదీప్ స్థానంలో షమీ రీఎంట్రీ ఇస్తున్నాడు. షమీకి జతగా హర్షిత్ రాణా బరిలోకి దిగుతున్నాడు. వికెట్‌కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ కొనసాగుతున్నాడు. మిస్టరీ స్నిన్నర్ వరుణ్ చక్రవర్తికి తుది జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు బంగ్లాదేశ్ సైతం ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగుతుంది.తుది జట్లు..బంగ్లాదేశ్: తంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్‌కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మన్భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ -
ఆర్థిక సర్వే 2025 ముఖ్యాంశాలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న సమగ్ర బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో 2024-25లో జరిగిన వృద్ధిని, భవిష్యత్తు అంచనాలతో 2025 ఆర్థిక సర్వేను శుక్రవారం విడుదల చేశారు. అందులోకి కొన్ని ముఖ్యాంశాలు కింది విధంగా ఉన్నాయి.స్థిరమైన జీడీపీ వృద్ధి: అంతర్జాతీయంగా అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం వాస్తవ జీడీపీ వృద్ధి 2025 ఆర్థిక సంవత్సరంలో 6.3 నుంచి 6.8 శాతం ఉంటుందని అంచనా వేశారు. ఇది దశాబ్ద సగటుకు దగ్గరగా ఉంది.రంగాలవారీ పనితీరు: వ్యవసాయం, పరిశ్రమలు, సేవలతో సహా అన్ని రంగాలు మంచి పనితీరు కనబరుస్తున్నాయి. వ్యవసాయ రంగం బలంగా ఉంది.ద్రవ్యోల్బణం నియంత్రణ: రిటైల్ ద్రవ్యోల్బణం 2024 ఆర్థిక సంవత్సరంలో 5.4 శాతం నుంచి 2025 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ కాలంలో 4.9 శాతానికి తగ్గింది.బ్యాంకింగ్ రంగం: వాణిజ్య బ్యాంకులు తమ స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్‌పీఏ) నిష్పత్తిలో స్థిరమైన తగ్గుదలను నమోదు చేశాయి. ఇది 2024 సెప్టెంబర్ చివరి నాటికి 2.6% కనిష్టానికి చేరుకుంది.గ్లోబల్ ఐపీఓ లిస్టింగ్స్: గ్లోబల్ ఐపీఓ లిస్టింగ్స్‌లో భారత్ వాటా 2023లో 17 శాతం నుంచి 2024 నాటికి 30 శాతానికి చేరింది.మూలధన వ్యయం: 2024 నవంబర్ వరకు మొత్తం మూలధన వ్యయంలో రక్షణ, రైల్వేలు, రోడ్డు రవాణా వాటా 75 శాతంగా ఉంది.ఆహార ద్రవ్యోల్బణం: కూరగాయల ధరల కాలానుగుణంగా భారీ ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఖరీఫ్ సీజన్ వస్తుండడంతో ఆహార ద్రవ్యోల్బణం 2025 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నాటికి తగ్గుతుందని భావిస్తున్నారు.బీమా రంగ వృద్ధి: బీమా రంగం 2024 ఆర్థిక సంవత్సరంలో 7.7% వృద్ధి చెంది మొత్తం ఎఫ్‌డీఐల్లో 62% ఆకర్షించింది.హెల్త్ అండ్ మోటార్ ఇన్సూరెన్స్: భారత బీమా రంగం వృద్ధికి ఆరోగ్యం, మోటారు బీమా గణనీయంగా దోహదపడ్డాయి.ఇదీ చదవండి: తగ్గిన జీడీపీ వృద్ధి అంచనానిరుద్యోగ రేటు గణనీయంగా తగ్గింది. అయితే వృద్ధిరేటు కొనసాగేందుకు క్షేత్రస్థాయి సంస్కరణలు కొనసాగాలి. ప్రపంచస్థాయిలో పోటీపడే దిశగా మెరుగుపడాలి. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌కు సరైన యంత్రాంగం లేకపోతే దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది.భౌగోళిక, రాజకీయ అస్థిరతల వల్ల డాలర్ బలపడడంతో రూపాయి మారక విలువ పడిపోయింది. 2025లో స్టాక్ మార్కెట్లు కొంత పడిపోయే అవకాశం ఉంది. -
Ind vs Aus: పెర్త్ టెస్టు.. తొలిరోజు హైలైట్స్ (ఫొటోలు)
-
IND VS AUS: నిప్పులు చెరిగిన బౌలర్లు.. తొలి రోజు టీమిండియాదే
IND VS AUS 1st Test Day 1 Live Updates:ముగిసిన తొలి రోజు ఆట..పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆతిథ్య జట్టుపై టీమిండియా పై చేయి సాధించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి కేవలం 67 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం క్రీజులో అలెక్స్ క్యారీ(19), మిచెల్ స్టార్క్(6) పరుగులతో ఉన్నారు.ఇక భారత బ్యాటర్లు నిరాశపరిచినప్పటికి బౌలర్లు మాత్రం నిప్పులు చెరిగారు. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లతో కంగారులను దెబ్బతీయగా.. సిరాజ్ రెండు, హర్షిత్ రానా ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు టీమిండియా కేవలం 150 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్ర ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి(41) అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడితో వికెట్ కీపర్ రిషబ్ పంత్(37) మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లలో హాజిల్ వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, కమ్మిన్స్, మిచెల్ మార్ష్ తలా రెండు వికెట్లు సాధించారు.ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్కెప్టెన్ కమిన్స్ రూపంలో ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో వికెట్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి కమిన్స్(3) పెవిలియన్ చేరాడు. స్టార్క్ క్రీజులోకి వచ్చాడు. ఆసీస్ స్కోరు: 59/7 (24.4). ఆరో వికెట్ డౌన్..భారత బౌలర్లు నిప్పులు చేరుగుతున్నారు. లబుషేన్ రూపంలో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. రెండు పరుగులు చేసిన లబుషేన్.. సిరాజ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. 23 ఓవర్లకు ఆసీస్ స్కోరు: 48-6ఆసీస్ ఐదో వికెట్ డౌన్..38 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన మిచెల్ మార్ష్.. సిరాజ్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి అలెక్స్ క్యారీ వచ్చాడు. 18 ఓవర్లకు ఆసీస్ స్కోరు: 39-5నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్.. హర్షిత్ రానా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.కష్టాల్లో ఆసీస్.. 19 పరుగులకే 3 వికెట్లు డౌన్19 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయింది. బుమ్రా వరుస బంతుల్లో ఉస్మాన్ ఖ్వాజా (8), స్టీవ్ స్మిత్‌ను (0) ఔట్ చేశాడు. 7 ఓవర్ల అనంతరం ఆస్ట్రేలియా స్కోర్ 19/3గా ఉంది. ట్రవిస్ హెడ్, లబూషేన్ క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియానాథన్ మెక్స్వినీ రూపంలో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. పెర్త్ టెస్టుతో అరంగేట్రం చేసిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. 13 బంతులు ఎదుర్కొని 10 పరుగులు చేయగలిగాడు. బుమ్రా బౌలింగ్ బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. ఖవాజా , లబుషేన్ క్రీజులో ఉన్నారు. ఆరు ఓవర్లలో ఆసీస్ స్కోరు: 19-1.150 పరుగులకు ఆలౌటైన టీమిండియా150 పరుగుల వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. నితీశ్ కుమార్ రెడ్డి (41) చివరి వికెట్‌గా వెనురిగాడు. కమిన్స్ బౌలింగ్‌లో ఖ్వాజాకు క్యాచ్ ఇచ్చి నితీశ్ ఔటయ్యాడు. తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియాబుమ్రా రూపంలో టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి బుమ్రా ఎనిమిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. సిరాజ్ క్రీజులోకి రాగా.. నితీశ్ రెడ్డి 35 పరుగులతో ఆడుతున్నాడు. భారత్‌స్కోరు: 144-9(49)ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా128 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో లబూషేన్ క్యాచ్ పట్టడంతో హర్షిత్ రాణా (7) ఔటయ్యాడు. నితీశ్ కుమార్‌కు (27) జతగా బుమ్రా క్రీజ్‌లోకి వచ్చాడు. ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. పంత్ ఔట్121 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి రిషబ్ పంత్ (37) ఔటయ్యాడు. నితీశ్‌కుమార్ రెడ్డికి (27) జతగా హర్షిత్ రాణా క్రీజ్‌లోకి వచ్చాడు.ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా73 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. మిచ్ మార్ష్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి వాషింగ్టన్ సుందర్ (4) పెవిలియన్ బాట పట్టాడు. రిషబ్ పంత్‌కు (17) జతగా నితీశ్ కుమార్ రెడ్డి క్రీజ్‌లోకి వచ్చాడు. 59 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా59 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది టీమిండియా. 59 పరుగుల వద్ద మిచ్ మార్ష్ బౌలింగ్‌లో లబూషేన్‌కు క్యాచ్ ఇచ్చి జురెల్ (11) ఔటయ్యాడు. రిషబ్ పంత్‌కు (10) జతగా వాషింగ్టన్ సుందర్ క్రీజ్‌లోకి వచ్చాడు. కష్టాల్లో టీమిండియాలంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 51/4 (25)పంత్ పది, జురెల్ నాలుగు పరుగులతోక్రీజులో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా47 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి కేఎల్ రాహుల్ (26) ఔటయ్యాడు. రిషబ్ పంత్‌కు (10) జతగా ధృవ్ జురెల్ క్రీజ్‌లోకి వచ్చాడు.32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా32 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖ్వాజాకు క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లి (5) ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా14 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి దేవ్‌దత్ పడిక్కల్ డకౌటయ్యాడు. కేఎల్ రాహుల్‌కు జతగా విరాట్ కోహ్లి క్రీజ్‌లోకి వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియాటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆదిలోనే వికెట్ కోల్పోయింది. 5 పరుగుల టీమ్ స్కోర్ వద్ద యశస్వి జైస్వాల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో నాథన్ మెక్‌స్వీనికి క్యాచ్‌ని జైస్వాల్ పెవిలియన్ బాట పట్టాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్పెర్త్లోని అప్టస్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తరఫున నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా అరంగేట్రం చేయనున్నారు. ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్ నాథన్ మెక్‌స్వీని డెబ్యూ చేయనున్నాడు. తుది జట్లు..ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖ్వాజా, నాథన్ మెక్‌స్వీని, మార్నస్ లబూషేన్, స్టీవెన్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ(వికెట్‌కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హేజిల్వుడ్భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), మహ్మద్ సిరాజ్ -
కొన్ని గంటల్లో అమెరికా ఎన్నికలు.. విశేషాలివే..
అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల పోలింగ్‌కు సమయం ఆసన్నమైంది. నవంబర్ 5 (మంగళవారం)పోలింగ్ జరగనుంది. బరిలో ఇతర అభ్యర్థులు కూడా ఉన్నా ప్రధాన పోరు మాత్రం రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్యే జరగనుంది. పోలింగ్‌కు మరికొద్ది గంటలే ఉండడంతో ట్రంప్,హారిస్‌లు తమ ప్రచారాన్ని స్వింగ్ స్టేట్స్లో హోరెత్తించి ముగించారు. అమెరికాలో మొత్తం 17 కోట్ల మంది ఓటర్లుండగా ఎర్లీ ఓటింగ్‌లో భాగంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇప్పటికే 6.8 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్, ఫలితాలు, ఎలక్టోరల్ కాలేజీ తతంగం, కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకారం తదితర విషయాలను ఒకసారి చూద్దాం. పోలింగ్ నవంబర్లోనే ఎందుకు..?ప్రతిసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ నవంబర్ నెలలోని తొలి మంగళవారమే నిర్వహిస్తారు. ఈ మేరకు 1845లో చట్టం చేశారు. ఈసారి నవంబర్ తొలి మంగళవారం అయిదో తేదీ వచ్చినందున అధ్యక్ష ఎన్నికలు 5వ తేదీన జరుగుతున్నాయి. అప్పట్లో వ్యవసాయం ప్రధానంగా ఉన్న అమెరికాలో పంటల కోత పూర్తవడంతో పాటు ప్రయాణాలకు అనుకూల వాతావరణం ఉండడంతో నవంబర్‌ను ఎన్నికల కోసం ఎంచుకున్నారు. కాగా,1845కు ముందు అధ్యక్ష ఎన్నికలు అమెరికాలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సారి జరిగేవి.పోలింగ్ సమయాలు..అమెరికాలోని ఒక్కో రాష్ట్రంలో అక్కడి కాలమానం ప్రకారం మంగళవారం(నవంబర్ 5)వ తేదీ ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు జరుగుతుంది. ఇదే ఇండియా టైమింగ్స్ ప్రకారం చూస్తే మనకు మంగళవారం సాయంత్రం 4.30 నుంచి రాత్రి 9.30 గంటల మధ్య అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమవుతుంది.ఫలితాలు ఎప్పుడు..?అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ప్రాథమిక ఫలితాలు వెలువడతాయి. ట్రంప్,హారిస్ మధ్య పోరు హోరాహోరీగా ఉంటే మాత్రం తుది ఫలితాలు వెలువడేసరికి ఒకటి రెండు రోజులు పడుతుంది. ఇక ఎలక్టోరల్ కాలేజీ ఎన్నిక తతంగం పూర్తై అధ్యక్షుడి ప్రమాణస్వీకారం జరగాలంటే 2025 జనవరి 20 దాకా ఆగాల్సిందే. ఒకవేళ జనవరి 20 ఆదివారం అయితే జనవరి 21న ప్రమాణస్వీకారం ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న ఒపీనియన్ పోల్స్ అంచనాల ప్రకారమైతే ట్రంప్ కంటే కమలా హారిస్ కొద్దిగా ముందంజలో ఉన్నారు.ప్రజల ఓటు నేరుగా అధ్యక్షుడికి వెళుతుందా..?అమెరికా ప్రెసిడెంట్‌గా ఎన్నిక కావాలంటే ముందుగా 50 రాష్ట్రాల్లో పాపులర్ ఎన్నికలు జరగాలి. ఈ ఎన్నికల్లో ప్రజలు ఓట్లేస్తారు. ఇవి కాకుండా ప్రతీ రాష్ట్రంలో జనాభా ఆధారంగా ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి దీనినే ఎలక్టోరల్ కాలేజీ అంటారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లుంటాయి. అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు ఆయా రాష్ట్రాల్లో తమ ఎలక్టర్లను ముందే నిర్ణయిస్తాయి. అయితే ఓటింగ్ సమయంలో మాత్రం ప్రజలు బ్యాలెట్ పేపర్‌పై అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకున్నట్లుగానే ఓటు వేస్తారు. ఈ ఓట్లన్నీ ఎలక్టర్లకు వెళతాయి. ఎన్నికల్లో పాపులర్ ఓట్లు ఎక్కువగా వస్తే విజయం సాధించలేరు. ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు వస్తేనే అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తారు. మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో 270 వచ్చిన వారు విజయం సాధించినట్లు. కాలిఫోర్నియాలో అత్యధికంగా 54,టెక్సాస్‌లో 40 ఎలక్టోరల్ ఓట్లుండగా తక్కువ జనాభాగల వ్యోమింగ్‌కు మూడు ఎలక్టోరల్ ఓట్లున్నాయి. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకుగాను 270 ఓట్లు లభించినవారు అధ్యక్షులవుతారు.స్వింగ్ రాష్ట్రాలు ఏంటి.. ఎందుకు కీలకం..?అమెరికా ఎన్నికల్లో చాలా రాష్ట్రాలు ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపుతాయి. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం తటస్థంగా ఉంటాయి. వీటిని స్వింగ్ స్టేట్స్ అని అంటారు. వీటికి అధ్యక్ష ఎన్నిక ఫలితాన్ని తారుమారు చేసే సత్తా ఉంటుంది. పార్టీలు ఈ స్వింగ్ రాష్ట్రాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టి ప్రచారం ఎక్కువగా నిర్వహిస్తాయి. 2024 ఎన్నికల్లో స్వింగ్ రాష్ట్రాలుగా భావిస్తున్న పెన్సిల్వేనియా, ఆరిజోనా, జార్జియా, మిషిగన్, నెవడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్- రాష్ట్రాల్లో కలిపి 93 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్నాయి. ఇవే అధ్యక్ష పీఠాన్ని మలుపుతిప్పుతాయన్నది సుస్పష్టం. అందుకే వీటిపై పట్టుకోసం హారిస్, ట్రంప్ హోరాహోరీగా ప్రయత్నించారు. ఎలక్టోరల్ కాలేజీకి ఎంపికైన ప్రతినిధులు (ఎలక్టర్లు ) డిసెంబరు 17న సమావేశమై అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఎలక్టోరల్ కాలేజీ రిజల్ట్ టై అయితే అధ్యక్ష ఎన్నిక ఎలా..ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో ఏ అధ్యక్ష అభ్యర్థికి 270 రాకుండా ఇద్దరూ 269 ఓట్ల దగ్గరే ఆగిపోతే ఫలితం టై అవుతుంది. ఈ పరిస్థితుల్లో కంటింజెంట్ ఎన్నిక నిర్వహిస్తారు. ఇలాంటి సందర్భంలో హౌజ్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ ప్రతినిధులు తమ ఓటు హక్కు ద్వారా ఇద్దరిలో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. ఇదే వైస్ ప్రెసిడెంట్ విషయంలో అయితే సెనేట్ సభ్యులకు ఓటు హక్కు కల్పించి ఉపాధ్యక్షుడిని నిర్ణయిస్తారు.ఇందుకోసం 1800 అధ్యక్ష ఎన్నిక తర్వాత రాజ్యాంగానికి 12వ సవరణ తీసుకువచ్చారు.ఇండియన్ అమెరికన్ ఓటర్ల ప్రభావం ఎంత..?అమెరికా ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల ఓటర్ల ప్రభావం చాలా వరకు ఉంటుందని ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్‌మెన్ రాజాకృష్ణమూర్తి చెప్పారు. స్వింగ్ స్టేట్స్తో పాటు దేశవ్యాప్తంగా భారతీయ అమెరికన్ల ఓట్లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. తమ సమస్యలను పరిష్కరించే అధ్యక్షుడి కోసం భారతీయ అమెరికన్లు చూస్తున్నారని చెప్పారు. -- సాక్షి వెబ్‌డెస్క్ -
వైఎస్ జగన్ గుంటూరు పర్యటన విశేషాలు
-
Today Highlights: టుడే టాప్-10 న్యూస్
1. ఆ వక్రబుద్ధితోనే ఏపీలో ఫిరాయింపులపర్వం!ఎన్నో అనుమానాల మధ్యే అసెంబ్లీ ఎన్నికల్లో 164 సీట్లు గెల్చుకుంది చంద్రబాబు టీడీపీ పార్టీ. ఆ వెంటనే ప్రతీకార రాజకీయాలు మొదలుపెట్టి.. అరాచక పాలన కొనసాగిస్తున్నారు. అయినా సంతృప్తి దక్కనట్లుంది.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి2. హైడ్రా.. హైదరాబాద్ వరకే పరిమితం: సీఎం రేవంత్హైడ్రా హైదరాబాద్ వరకే పరిమితం అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, చెరువులు, నాలాలు మొదటి ప్రయారిటీగా పేర్కొన్నారు.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి3. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు : 12 కొత్త స్మార్ట్ సిటీలు.. 10 లక్షల ఉద్యోగాలు..దేశంలో కొత్తగా 12 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి4.పాక్‌లో ప్రాణాంతక వైరస్.. భారత్‌కూ ముప్పు?పాకిస్తాన్‌ను ఇప్పుడు మరోవైరస్ చుట్టుముట్టింది. ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక వ్యాధులలో ఒకటైన సీసీహెచ్ఎఫ్(క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్) కేసు పాక్‌లో వెలుగు చూసింది. పాకిస్తాన్లో వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధి భారతీయులనూ భయపెడుతోంది.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి5.డీఎంకే ఎంపీకి 900 కోట్ల ఈడీ జరిమానా!డీఎంకే ఎంపీ జగత్రక్షకన్కు భారీ షాకిచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసులో ఆయనకు ఏకంగా రూ.908 కోట్ల జరిమానా విధించింది. ఇప్పటికే ఈ కేసులో కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన దర్యాప్తు సంస్థ.. ఇప్పుడు భారీ ఫైన్‌తో చర్యలు తీసుకుంది.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి6.పేమెంట్ చేయాలంటే.. యూపీఐలో కీలక మార్పులు..!డిజిటల్ చెల్లింపుల యుగంలో యూపీఐ (UPI - యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) వినియోగం వేగంగా పెరుగుతోంది. చాలా మంది ఇప్పుడు నగదు లావాదేవీల కంటే యూపీఐ పేమెంట్స్‌నే ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఇదే క్రమంలో యూపీఐ మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి7. నా కన్నతండ్రి వేధించాడు.. ఈ విషయం ఎప్పుడో చెప్పాల్సింది!రంగుల వెండితెర వెనక దాగి ఉన్న రాక్షస చర్యలు ఎన్నో అంటూ హేమ కమిటీ మలయాళ ఇండస్ట్రీలో ఆర్టిస్టుల అవస్థలను బయటపెట్టింది. పేరున్న పెద్దలు, పెత్తనం వహించిన తారల చేతిలో ఆర్టిస్టుల బతుకులు చితికిపోతున్నాయని వెల్లడించింది.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి8.రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ డేవిడ్ మలన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. 2017లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. తన కెరీర్లో 22 టెస్టులు, 30 వన్డేలు, 62 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 1074, 1450, 1892 పరుగులు సాధించాడు.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి9.మాయమవుతున్న ‘వై’ క్రోమోజోమ్ : మగజాతి మనుగడకు ముప్పు?మనిషిలోని ఎక్స్, వై క్రోమోజోములు అనేవి ఆడ, మగ లింగ నిర్ధారణకు మూలం. ప్రధానంగా పురుషుల్లో ఉండే వై క్రోమోజోమ్ మగబిడ్డ జననానికి కారణమవుతుంది. అందుకే దీన్ని మేల్ క్రోమోజోమ్ అని పిలుస్తారు..మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి10. పోలవరం నిధుల క్రెడిట్ అంతా జగన్‌దే: అంబటిముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి వల్లే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు వచ్చాయని, కానీ సీఎం చంద్రబాబు ఆ క్రెడిట్ తనదే అన్నట్లు ప్రసంగాలు ఇస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి -
మూడో వన్డేలోనూ ఓటమి.. సిరీస్ కోల్పోయిన భారత్
శ్రీలంకతో మూడో వన్డేలో టీమిండియా చిత్తుగా ఓడింది. 249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 138 పరుగులకే (26.1 ఓవర్లలో) ఆలౌటైంది. దునిత్ వెల్లలగే ఐదు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. తీక్షణ, వాండర్సే తలో రెండు, అషిత ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (35), సుందర్ (30), విరాట్ కోహ్లి (20), రియాన్ పరాగ్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. పథుమ్ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96), కుసాల్ మెండిస్ (59), కమిందు మెండిస్ (23 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో అసలంక 10, సమరవిక్రమ 0, లియనాగే 8, వెల్లలగే 2 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3, సిరాజ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఓటమితో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది. తొలి వన్డే టైగా ముగియగా.. రెండు, మూడు వన్డేల్లో శ్రీలంక విజయం సాధించింది.తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా138 పరుగుల వద్ద టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. తీక్షణ బౌలింగ్‌లో వాండర్సేకు క్యాచ్ ఇచ్చి వాషింగ్టన్ సుందర్ (30) ఔటయ్యాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా101 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. వాండర్సే బౌలింగ్‌లో శివమ్ దూబే (9) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన భారత్100 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. వాండర్సే బౌలింగ్‌లో రియాన్ పరాగ్ (15) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.శివమ్ దూబే (9), వాషింగ్టన్ సుందర్ క్రీజ్‌లో ఉన్నారు.86 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా249 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 82 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. దునిత్ వెల్లలగే 4 వికెట్లు తీసి టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టాడు. రోహిత్ 35, గిల్ 6, విరాట్ 20, రిషబ్ పంత్ 6, శ్రేయస్ అయ్యర్ 8, అక్షర్ పటేల్ 2 ఔట్ కాగా.. రియాన్ పరాగ్ 10, శివమ్ దూబే 0 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అషిత ఫెర్నాండో, తీక్షణ తలో వికెట్ పడగొట్టారు.తొలి వికెట్ కోల్పోయిన భారత్249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 37 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అశిత ఫెర్నాండో బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఎండ్‌లో రోహిత్ (13 బంతుల్లో 31; 5 ఫోర్లు, సిక్స్) చెలరేగి ఆడుతున్నాడు. రాణించిన రియాన్ పరాగ్.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన శ్రీలంకకొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫలితంగా శ్రీలంక నామమాత్రపు స్కోర్‌కే (248/7) పరిమితమైంది. కెరీర్లో తొలి వన్డే ఆడుతున్న రియాన్ పరాగ్ బంతితో రాణించాడు. రియాన్ 9 ఓవర్లలో 54 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి తలో వికెట్ పడగొట్టారు. శివమ్ దూబూ నాలుగు ఓవర్లు వేసి కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. మహ్మద్ సిరాజ్ ధారళంగా పరుగులు సమర్పించుకుని ఓ వికెట్ తీశాడు. సిరాజ్ 9 ఓవర్లలో ఏకంగా 78 పరుగులు సమర్పించుకున్నాడు.తృటిలో సెంచరీ చేజార్చుకున్న అవిష్కటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు ఓపెనర్లు పథుమ్ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించారు. అవిష్క నాలుగు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు.రాణించిన కుసాల్ మెండిస్అవిష్క ఫెర్నాండో ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కుసాల్ మెండిస్ (59) అర్ద సెంచరీతో రాణించాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కుసాల్ ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆఖర్లో కమిందు మెండిస్ (23 నాటౌట్) వేగంగా పరుగులు సాధించడంతో శ్రీలంక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. లంక ఇన్నింగ్స్‌లో అసలంక 10, సధీర సమరవిక్రమ 0, లియనాగే 8, వెల్లలగే 2 పరుగులు చేసి ఔటయ్యారు.ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక235 పరుగుల వద్ద శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి కుసాల్ మెండిస్ (59) ఔటయ్యాడు. మూడు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయిన శ్రీలంకశ్రీలంక మూడు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. 196 పరుగుల వద్ద లియనాగేను (8) వాషింగ్టన్ సుందర్ క్లీన్ బౌల్డ్ చేయగా.. 199 పరుగుల వద్ద వెల్లలగేను (2) రియాన్ పరాగ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 45 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 207/6గా ఉంది. కుసాల్ మెండిస్ (41), కమిందు మెండిస్ (3) క్రీజ్‌లో ఉన్నారు.నాలుగో వికెట్ డౌన్సధీర సమరవిక్రమ సిరాజ్ బౌలింగ్‌లో తానెదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. 39 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 184/4గా ఉంది.మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక183 పరుగుల వద్ద శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. రియాన్ పరాగ్.. అసలంకను (10) ఎల్బీడబ్ల్యూ చేశాడు.తృటిలో సెంచరీని చేజార్చుకున్న అవిష్కలంక ఓపెనర్ అవిష్క ఫెర్నాండో తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. 96 పరుగుల వద్ద రియాన్ పరాగ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 36 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 173/2గా ఉంది. కుసాల్ మెండిస్ (28), అసలంక (2) క్రీజ్‌లో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక89 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి నిస్సంక (45) ఔటయ్యాడు. అవిష్క ఫెర్నాండో (43), కుసాల్ మెండిస్ క్రీజ్‌లో ఉన్నారు.14 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 65/0ఇన్నింగ్స్ ఆరంభంలో నత్త నడకలా సాగిన శ్రీలంక బ్యాటింగ్ ప్రస్తుతం మెరుగుపడింది. ఆ జట్టు 14 ఓవర్ల అనంతరం వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో 26, నిస్సంక 38 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. నత్త నడకన సాగుతున్న శ్రీలంక బ్యాటింగ్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక నిదానంగా ఆడుతుంది. వారి ఇన్నింగ్స్ నత్త నడకు తలపిస్తుంది. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 28/0గా ఉంది. నిస్సంక 19, అవిష్క ఫెర్నాండో 8 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకొలొంబో వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్ స్థానాల్లో రిషబ్ పంత్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు లంక సైతం ఓ మార్పు చేసింది. అఖిల ధనంజయ స్థానంలో మహేశ్ తీక్షణ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఈ సిరీస్‌లో శ్రీలంక 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. తొలి వన్డే టైగా ముగియగా.. రెండో వన్డేలో లంక విజయం సాధించింది.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), శ్రేయస్ అయ్యర్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్శ్రీలంక: పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(వికెట్‌కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(కెప్టెన్), జనిత్ లియానాగే, కమిందు మెండిస్, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, అసిత ఫెర్నాండో -
శ్రీలంకతో రెండో వన్డే.. టీమిండియా ఓటమి
IND VS SL 2nd ODI Updates And Highlights: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియాకు ఊహించని పరాభవం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో భారత్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 241 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌ను లంక స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే (10-0-33-6) దారుణంగా దెబ్బతీశాడు. వాండర్సేకు అసలంక (6.2-2-20-3) కూడా తోడవ్వడంతో టీమిండియా 208 పరుగులకు (42.2 ఓవర్లలో) ఆలౌటైంది. ఛేదనలో రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీతో (44 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించినప్పటికీ.. భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్‌తో పాటు శుభ్‌మన్ గిల్ (35), అక్షర్ పటేల్ (44) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విరాట్ (14), శివమ్ దూబే (0), శ్రేయస్ అయ్యర్ (7), కేఎల్ రాహుల్ (0) దారుణంగా విఫలమయ్యారు.ఓటమి దిశగా టీమిండియా190 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అసలంక బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్ (15) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియాఅసలంక అద్భుతమైన క్యాచ్ పట్టి అక్షర్ పటేల్‌ను (44) పెవిలియన్‌కు పంపాడు. వాండర్సే మాయాజాలంజెఫ్రీ వాండర్సే తన అద్భుతమైన స్పిన్ మాయాజాలంతో టీమిండియాను ఇరుకున పడేశాడు. ఇప్పటికే నాలుగు వికెట్లు పడగొట్టిన అతను.. స్వల్ప వ్యవధిలో మరో రెండు వికెట్లు కూల్చాడు. శ్రేయస్ అయ్యర్ (7), కేఎల్ రాహుల్ (0) 14 పరుగుల వ్యవధిలో పెవిలియన్ బాట పట్టారు. 26 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 155/6గా ఉంది. అక్షర్ పటేల్ (27), వాషింగ్టన్ సుందర్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే మరో 86 పరుగులు చేయాలి. చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి.నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా.. కోహ్లి ఔట్123 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. వాండర్సే బౌలింగ్‌లో విరాట్ కోహ్లి (14) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అక్షర్ పటేల్ (7), శ్రేయస్ (7) క్రీజ్‌లో ఉన్నారు. వాండర్సేకు ఇది నాలుగో వికెట్. 116 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయిన భారత్116 పరుగుల వద్ద భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ (35), శివమ్ దూబేను (0) వాండర్సే ఒకే ఓవర్లో ఔట్ చేశాడు. 19 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 123/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 118 పరుగులు చేయాల్సి ఉంది.A six over extra cover to bring up his fifty. 🔥- Rohit Sharma in a crazy touch! pic.twitter.com/hI57R7T7Ik— Mufaddal Vohra (@mufaddal_vohra) August 4, 2024తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా97 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. వాండర్సే బౌలింగ్‌లో నిస్సంక సూపర్ క్యాచ్ పట్టడంతో రోహిత్ శర్మ (44 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) వెనుదిరిగాడు. 14 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 102/1గా ఉంది. శుభ్‌మన్ గిల్ (31), విరాట్ కోహ్లి (5) క్రీజ్‌లో ఉన్నారు. సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్241 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. రోహిత్ శర్మ కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సిరీస్‌లో వరుసగా రెండో ఫిఫ్టీ పూర్తి చేశాడు. రోహిత్ సిక్సర్‌తో హాఫ్ సెంచరీని పూర్తి చేయడం విశేషం. 10 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 76/0గా ఉంది. రోహిత్‌కు (51) జతగా శుభ్‌మన్ గిల్ (23) క్రీజ్‌లో ఉన్నాడు.టీమిండియా టార్గెట్ 241కొలంబో వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి (టాస్ గెలిచి) నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక 0, అవిష్క ఫెర్నాండో 40, కుశాల్ మెండిస్ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనగే 12, వెల్లలగే 37, కమిందు మెండిస్ 40, అఖిల ధనంజయ 15 పరుగులు చేసి ఔట్ కాగా.. జెఫ్రీ వాండర్సే 1 పరుగుతో అజేయంగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక208 పరుగుల వద్ద శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి వెల్లలగే (39) ఔటయ్యాడు.208 పరుగుల వద్ద శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి వెల్లలగే (39) ఔటయ్యాడు.ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంక136 పరుగుల వద్ద శ్రీలంక మరో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి అసలంక (25) ఔటయ్యాడు.136 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన శ్రీలంకశ్రీలంక 136 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి జనిత్ లియనాగే (12) ఔటయ్యాడు.నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక111 పరుగుల వద్ద శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి సమరవిక్రమ (14) ఔటయ్యాడు.వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసిన సుందర్వాషింగ్టన్ తన స్పెల్ రెండో ఓవర్ చివరి బంతికి, మూడో ఓవర్ తొలి బంతికి వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్ చివరి బంతికి ఆవిష్క ఫెర్నాండో (40).. 19వ ఓవర్ తొలి బంతికి కుశాల్ మెండిస్ (30) ఔటయ్యారు. 19 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 80/3గా ఉంది. చరిత్ అసలంక (1), సమరవిక్రమ (0) క్రీజ్‌లో ఉన్నారు.తొలి బంతికే వికెట్ కోల్పోయిన శ్రీలంకతొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పథుమ్ నిస్సంక ఔటయ్యాడు. WICKET ON THE FIRST BALL BY MOHAMMAD SIRAJ. 🔥- Siraj, a beast against Sri Lanka!pic.twitter.com/7i7IeWcsGr— Mufaddal Vohra (@mufaddal_vohra) August 4, 2024టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకొలొంబో వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లుశ్రీలంక: పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(కెప్టెన్), కమిందు మెండిస్, జనిత్ లియానగే, దునిత్ వెల్లలాగే, అకిలా దనంజయ, అసిత ఫెర్నాండో, జెఫ్రీ వాండర్సేభారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ -
లోన్స్ పై నిర్మలా సీతారామన్ క్లారిటీ
-
'స్పెయిన్'దే యూరో కప్.. ఇంగ్లండ్‌కు మళ్లీ నిరాశే (ఫోటోలు)
-
ఐదో టీ20లోనూ టీమిండియాదే విజయం.. చిత్తుగా ఓడిన జింబాబ్వే
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన ఐదో టీ20లో టీమిండియా 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. సంజూ శాంసన్ (45 బంతుల్లో 58; ఫోర్, 4 సిక్సర్ల, రెండు క్యాచ్‌లు), ముకేశ్ కుమార్ (3.3-0-22-4) అద్భుతంగా రాణించి టీమిండియాకు ఘన విజయాన్నందించారు. ఈ గెలుపుతో భారత్.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్‌లో గెలవగా.. భారత్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో జయభేరి మోగించింది. మూడో వికెట్ కోల్పోయిన జింబాబ్వే59 పరుగుల వద్ద జింబాబ్వే మూడో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో మరుమణి (27) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 9 ఓవర్ల తర్వాత జింబాబ్వే స్కోర్ 61/3గా ఉంది. మైర్స్ (18), సికందర్ రజా (1) క్రీజ్‌లో ఉన్నారు.టార్గెట్ 168.. రెండో వికెట్ కోల్పోయిన జింబాబ్వే15 పరుగుల వద్ద జింబాబ్వే రెండో వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి బెన్నిట్ (10) ఔటయ్యాడు. టార్గెట్ 168.. తొలి వికెట్ కోల్పోయిన జింబాబ్వే168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో మధెవెరె (0) క్లీన్ బౌల్డ్ ఆయ్యాడు. రాణించిన జింబాబ్వే బౌలర్లు.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన టీమిండియాఈ మ్యాచ్‌లో జింబాబ్వే బౌలర్లు రాణించడంతో టీమిండియా నామమాత్రపు స్కోర్‌కే (167/6) పరిమితమైంది. ముజరబాని 2, సికందర్ రజా, రిచర్డ్ నగరవ, బ్రాండన్ మవుటా తలో వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ (58) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. శివమ్ దూబే 26, రియాన్ పరాగ్ 22, అభిషేక్ శర్మ 14, శుభ్‌మన్ గిల్ 13, యశస్వి జైస్వాల్ 12 పరుగులకు ఔట్ కాగా.. రింకూ సింగ్ 11, వాషింగ్టన్ సుందర్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. శాంసన్ ఔట్135 పరుగుల వద్ద (17.3వ ఓవర్) టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. ముజరబాని బౌలింగ్‌లో మరుమణి క్యాచ్ పట్టడంతో శాంసన్ పెవిలియన్ బాట పట్టాడు. శివమ్ దూబే (10), రింకూ సింగ్ క్రీజ్‌లో ఉన్నారు. 105 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా105 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. బ్రాండన్ మవుటా బౌలింగ్‌లో నగరవకు క్యాచ్ ఇచ్చి రియాన్ పరాగ్ (22) ఔటయ్యాడు.40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియాతొలి ఓవర్లలో దూకుడుగా ఆడిన టీమిండియా ఆతర్వాత ఢీలా పడిపోయింది. జింబాబ్వే బౌలర్లు పుంజుకోవడంతో భారత్ 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. యశస్వి (12), శుభమన్ గిల్ (13), అభిషేక్ శర్మ (14) ఔట్ కాగా.. సంజూ శాంసన్ (16), రియాన్ పరాగ్ (5) క్రీజ్‌లో ఉన్నారు. 8.2 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 62/3గా ఉంది.తొలి వికెట్ కోల్పోయిన టీమిండియాసికందర్ రజా వేసిన తొలి ఓవర్లో తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచిన యశస్వి జైస్వాల్ నాలుగో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలుత బ్యాటింగ్ చేయనున్న టీమిండియాహరారే వేదికగా జింబాబ్వేతో జరుగనున్న ఐదో టీ20లో టీమిండియా టాస్ ఓడింది. జింబాబ్వే కోరిక మేరకు భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. ముకేశ్ కుమార్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు జింబాబ్వే ఓ మార్పు చేసింది. చటారా స్థానంలో బ్రాండన్ మవుటా తుది జట్టులోకి వచ్చాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్ గెలవగా.. టీమిండియా వరుసగా రెండు, మూడు, నాలుగు మ్యాచ్‌లు గెలిచింది.తుది జట్లు..జింబాబ్వే: వెస్లీ మధేవెరే, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్‌కీపర్), బ్రాండన్ మవుటా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీటీమిండియా: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్‌కీపర్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్ -
IND VS ZIM: మూడో టీ20లో టీమిండియా విజయం.. సిరీస్‌లో ఆధిక్యం
మూడో టీ20లో టీమిండియా విజయం.. సిరీస్‌లో ఆధిక్యంఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో ఇవాళ (జులై 10) జరిగిన మూడో టీ20 టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శుభ్‌మన్ గిల్ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 26; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టీ20 జులై 13న జరుగనుంది. కాగా, తొలి మ్యాచ్‌లో జింబాబ్వే, రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆరో వికెట్ కోల్పోయిన జింబాబ్వే16.3వ ఓవర్: 116 పరుగుల వద్ద జింబాబ్వే ఆరో వికెట్ కోల్పోయింది. సుందర్ బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి మదండే (37) ఔటయ్యాడు. 39 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన జింబాబ్వే7.6వ ఓవర్: 183 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే 39 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. 39 పరుగుల వద్ద సుందర్ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ రియాన్ పరాగ్‌కు క్యాచ్ ఇచ్చి జోనాథన్ క్యాంప్‌బెల్ (1) ఔటయ్యాడు. 37 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన జింబాబ్వే6.2వ ఓవర్: 37 పరుగుల వద్ద జింబాబ్వే నాలుగో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి సికందర్ రజా (15) ఔటయ్యాడు. 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే3.1వ ఓవర్: 19 పరుగుల వద్ద జింబాబ్వే రెండు వికెట్లు కోల్పోయింది. 2.4వ ఓవర్లో ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి మరుమణి (13) ఔట్ కాగా.. 3.1వ ఓవర్లో ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో బిష్ణోయ్‌కు క్యాచ్ ఇచ్చి బ్రియాన్ బెన్నెట్ (4) పెవిలియన్‌కు చేరాడు. తొలి వికెట్ కోల్పోయిన జింబాబ్వే1.1వ ఓవర్: 9 పరుగుల వద్ద జింబాబ్వే తొలి వికెట్ కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి మెదెవెరె (1) ఔటయ్యాడు.జింబాబ్వే టార్గెట్ 183టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 36, శుభ్‌మన్ గిల్ 66, అభిషేక్ శర్మ 10, రుతురాజ్ గైక్వాడ్ 49 పరుగులు చేసి ఔట్ కాగా.. సంజూ శాంసన్ (12), రింకూ సింగ్ (1) నాటౌట్‌గా మిగిలారు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు.నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా19.4వ ఓవర్: 177 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ముజరబాని బౌలింగ్‌లో మధెవెరెకు క్యాచ్ ఇచ్చి రుతురాజ్ (49) ఔటయ్యాడు.మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా17.5వ ఓవర్: 153 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ముజరబాని బౌలింగ్‌లో సికందర్ రజాకు క్యాచ్ ఇచ్చి శుభ్‌మన్ గిల్ (66) ఔటయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా10.3వ ఓవర్: 81 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. సికందర్ రజా బౌలింగ్‌లో మరుమణికి క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (10) ఔటయ్యాడు.తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా8.1వ ఓవర్: 67 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. సికందర్ రజా బౌలింగ్‌లో బ్రియాన్ బెన్నెట్‌కు క్యాచ్ ఇచ్చి యశస్వి జైస్వాల్ (36) ఔటయ్యాడు.హరారే వేదికగా జింబాబ్వేతో ఇవాళ (జులై 10) జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా నాలుగు మార్పులతో బరిలోకి దిగనుంది. టీ20 వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్‌లోని సభ్యులు యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, శివమ్ దూబే ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చారు. ముకేశ్ కుమార్ స్థానంలో ఖలీల్ అహ్మద్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు జింబాబ్వే ఈ మ్యాచ్ కోసం రెండు మార్పులు చేసింది. ఇన్నోసెంట్ కాలా స్థానంలో మారుమణి.. లూక్ జాంగ్వే స్థానంలో నగరవ తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుభమన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్(వికెట్‌కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్జింబాబ్వే: తాడివానాషే మారుమణి, వెస్లీ మాధేవేరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), జోనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదాండే(వికెట్‌కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా -
T20 1st Semis: చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్తాన్.. ఫైనల్లో సౌతాఫ్రికా
చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్తాన్.. ఫైనల్లో సౌతాఫ్రికాటీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (జూన్ 27) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 11.5 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా 8.5 ఓవర్లలో ఆడుతూపాడుతూ విజయతీరాలకు (వికెట్ కోల్పోయి) చేరింది.టార్గెట్ 57.. 5 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా57 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 5 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఫజల్ హక్ బౌలింగ్‌లో డికాక్ (5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 11.5 ఓవర్లలో 56 పరుగులకు అప్ఘనిస్తాన్ ఆలౌట్.. దక్షిణాఫ్రికా విజయలక్ష్యం 57 పరుగులు50 పరుగులకే తొమ్మిది వికెట్లు డౌన్ఆఫ్ఘనిస్తాన్ ఒకే స్కోర్ వద్ద మూడు వికెట్లు కోల్పోయింది. 50 పరుగుల వద్ద ఆఫ్ఘనిస్తాన్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. నోర్జే బౌలింగ్‌లో రషీద్ ఖాన్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.50 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్ఆఫ్ఘనిస్తాన్ జట్టు 50 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి ఘోర పతనం దిశగా సాగుతుంది. షంషి బౌలింగ్‌లో నూర్ అహ్మద్ (0) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 50/8గా ఉంది. రషీద్ ఖాన్ (8), నవీన్ ఉల్ హక్ (0) క్రీజ్‌లో ఉన్నారు.50 పరుగుల వద్ద ఏడో వికెట్ డౌన్50 పరుగుల వద్ద ఆఫ్ఘనిస్తాన్ ఏడో వికెట్ కోల్పోయింది. తబ్రేజ్ షంషి బౌలింగ్‌లో కరీమ్ జనత్ (8) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 28 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్ఆఫ్ఘనిస్తాన్ 28 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. నోర్జే బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి ఒమర్జాయ్ (10) ఔటయ్యాడు. కరీమ్ జనత్ (4), రషీద్ ఖాన్ (8) క్రీజ్‌లో ఉన్నారు. 9 ఓవర్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 45/6గా ఉందిట్రినిడాడ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ 2024 తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌కు టాస్ గెలిచిమాన్న సంతోషం ఎంతో సేపు నిలబడలేదు. సఫారీ పేసర్లు రెచ్చిపోవడంతో ఆఫ్ఘన్లు 23 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. గుర్బాజ్ (0), ఇబ్రహీం జద్రాన్ (2), గుల్బదిన్ నైబ్ (9), మొహమ్మద్ నబీ (0), ఖరోటే (2) దారుణంగా విఫలమయ్యారు. జన్సెన్ (3-0-16-3) ఆఫ్ఘన్లను దెబ్బకొట్టాడు. రబాడ (2-1-5-2) మరో చేయి వేశాడు.తుది జట్లు..దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్(వికెట్‌కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బదిన్ నైబ్, మహ్మద్ నబీ, కరీం జనత్, రషీద్ ఖాన్(కెప్టెన్), నంగేయాలియా ఖరోటే, నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫజల్హక్ ఫారూఖీ -
ఐపీఎల్ 17లో బద్దలైన రికార్డ్‌లు
-
బెంగళూరులో దుమ్మురేగొట్టిన ఆరెంజ్ ఆర్మీ ‘ఓ రేంజ్’ బ్యాటింగ్ (ఫొటోలు)
-
IPL 2024, DC VS KKR: ఢిల్లీని చిత్తు చేసిన కేకేఆర్
ఢిల్లీని చిత్తు చేసిన కేకేఆర్ ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 3) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల చేసింది. ఢిల్లీ బౌలర్లలో నోర్జే 3, ఇషాంత్ శర్మ 2, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. 17.2 ఓవర్లలో 166 పరుగులకే చాపచుట్టేసింది. రిషబ్ పంత్ (55), ట్రిస్టన్ స్టబ్స్ (54) ఓటమి ఖరారైన దశలో బ్యాట్‌ను ఝులిపించారు. వీరిద్దరు మినహా ఢిల్లీ ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. వార్నర్ (18), పృథ్వీ షా (10) రెండంకెంల స్కోర్లు చేయగా.. మార్ష్, పోరెల్, అక్షర్ డకౌట్లయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌల్ చేసి చెరి 3 వికెట్లు పడగొట్టారు. స్టార్క్ 2, రసెల్, నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. పంత్ ఔట్ మెరుపు అర్దశతకం బాదిన అనంతరం పంత్ (55) ఔటయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చితక్కొడుతున్న పంత్.. 23 బంతుల్లో ఫిఫ్టి వెంకటేశ్ అయ్యర్ వేసిన 12వ ఓవర్లో పంత్ చెలరేగిపోయాడు. నాలుగు ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28 పరుగులు పిండుకున్నాడు. పంత్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీని కేవలం 23 బంతుల్లోనే పూర్తి చేశాడు. 12 ఓవర్లలో ఢిల్లీ స్కోర్ 125/4గా ఉంది. పోరాడుతున్న పంత్, స్టబ్స్ 273 పరుగల లక్ష్య ఛేదనలో 33 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఢిల్లీని రిషబ్ పంత్ (11 బంతుల్లో 23; 3 సిక్సర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (16 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 9 ఓవర్ల అనంతరం ఢిల్లీ స్కోర్ 83/4గా ఉంది. పేకమేడలా కూలుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలుతుంది. 33 పరుగులకే ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన అనంతరం వార్నర్ (18) ఔటయ్యాడు. 5 ఓవర్లలో ఢిల్లీ స్కోర్ 40/4గా ఉంది. రిషబ్ పంత్ (6), ట్రిస్టన్ స్టబ్స్ (1) క్రీజ్‌లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ 27 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. వైభవ్ అరోరా బౌలింగ్‌లో సునీల్ నరైన్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ పోరెల్ (0) ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ 26 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్‌లో రమన్‌దీప్‌కు క్యాచ్ ఇచ్చి మిచెల్ స్టార్క్ (0) ఔటయ్యాడు.డేవిడ్ వార్నర్‌కు (11) జతగా అభిషేక్ పోరెల్ (0) క్రీజ్‌లోకి వచ్చాడు. 273 పరుగుల లక్ష్యం.. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ 273 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 21 పరుగుల వద్ద వైభవ్ అరోరా బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి పృథ్వీ షా (10) ఔటయ్యాడు. వార్నర్‌తో (10), మిచెల్ మార్ష్ జత కలిశాడు. వీరంగం సృష్టించిన కేకేఆర్ బ్యాటర్లు.. ఐపీఎల్ చరిత్రలో రెండో భారీ స్కోర్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు శివాలెత్తిపోయారు. టాపార్డర్ బ్యాటర్లు పోటాపోటీపడి విధ్వంసం సృష్టించారు.తద్వారా ఐపీఎల్ చరిత్రలో రెండో భారీ స్కోర్ నమోదైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ చేసిన 277 స్కోర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌గా ఉంది. మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. రఘువంశీ ఔట్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేసి అనంతరం రఘువంశీ ఔటయ్యాడు. నోర్జే బౌలింగ్‌లో ఇషాంత్ శర్మ క్యాచ్ పట్టాడు. 14 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 181/3గా ఉంది. రసెల్ (9), శ్రేయస్ (1) క్రీజ్‌లో ఉన్నారు. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రఘువంశీ కేకేఆర్ యువ ఆటగాడు రఘువంశీ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. 13 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 171/3గా ఉంది. రఘువంశీకి జతగా రసెల్ (5) క్రీజ్‌లో ఉన్నాడు. చితకబాది ఔటైన నరైన్.. కేకేఆర్ స్కోర్ 164/2 39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేసిన సునీల్ నరైన్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ మూడో బంతికి మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం కేకేఆర్ స్కోర్ 164/2గా ఉంది. రఘువంశీకి (49) జతగా రసెల్ క్రీజ్‌లోకి వచ్చాడు. 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 135 పరుగులు చేసిన కేకేఆర్ సునీల్ నరైన్ (32 బంతుల్లో 74; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) , రఘువంశీ (16 బంతుల్లో 33; 4 ఫోర్లు, సిక్స్) ధాటికి కేకేఆర్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన నరైన్ కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్ శివాలెత్తిపోయాడు. కేవలం 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఫలితంగా కేకేఆర్ 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్ 4.3వ ఓవర్: 60 పరుగుల వద్ద కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. నోర్జే బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి సాల్ట్ (18) ఔటయ్యాడు. విధ్వంసం సృష్టిస్తున్న సునీల్ నరైన్ కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. 15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేశాడు. ఇషాంత్ వేసిన మూడో ఓవర్లో నరైన్ మూడు సిక్సర్లు, రెండు బౌండరీలు బాదాడు. ఫలితంగా ఆ ఓవర్లో ఏకంగా 26 పరుగులు వచ్చాయి. 4 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 58/0గా ఉంది. నరైన్‌తో పాటు ఫిలిప్ సాల్ట్ (16) క్రీజ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా విశాఖలోని వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియంలో ఇవాళ (ఏప్రిల్ 3) ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుత సీజన్లో కేకేఆర్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. ఢిల్లీ ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి ఏడో స్థానంలో నిలిచింది. తుది జట్లు.. కోల్‌కతా నైట్‌రైడర్స్: ఫిలిప్ సాల్ట్(వికెట్‌కీపర్), వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కెప్టెన్/వికెట్‌కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, రసిఖ్ దార్ సలామ్, అన్రిచ్ నోర్ట్జే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్ -
నంద్యాల సభ: సీఎం జగన్ ప్రసంగంలో హైలైట్స్
-
IPL 2024: సన్‌రైజర్స్ చేతిలో చిత్తైన ముంబై ఇండియన్స్
IPL 2024 SRH VS MI Match Highlights And Updates: బ్యాటర్ల ఊచకోత.. ముంబైను చిత్తు చేసిన సన్‌రైజర్స్ ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మార్చి 27) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు వీరంగం సృష్టించారు. ఫలితంగా ఆరెంజ్ ఆర్మీ 31 పరుగుల తేడాతో ముంబైను చిత్తు చేయడంతో పాటు లీగ్ చరిత్రలోనే అత్యధిక టీమ్ స్కోర్ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ట్రవిస్ హెడ్ (24 బంతుల్లో 62; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (23 బంతుల్లో 63; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (34 బంతుల్లో 80 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు అర్దశతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఛేదనలో ముంబై 12 ఓవర్ల వరకు సన్‌రైజర్స్ ధీటుగా బదులిచ్చింది. అయితే ఆ తర్వాత స్కోర్ నెమ్మదించడంతో ముంబై ఓటమి ఖరారైంది. ఇషాన్ కిషన్ (13 బంతుల్లో 34; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రోహిత్ శర్మ (12 బంతుల్లో 26; ఫోర్, 2 సిక్సర్లు), నమన్ ధిర్ (14 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (34 బంతుల్లో 64; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (22 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (20 బంతుల్లో 24; ఫోర్, సిక్స్), రొమారియో షెపర్డ్ (6 బంతుల్లో 12 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సన్‌రైజర్స్ శిబిరంలో కలకలం సృష్టించారు. ముంబై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసి లక్ష్యానికి 32 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. ముంబై గెలుపుకు 30 బంతుల్లో 93 పరుగులు అవసరం ఈ మ్యాచ్‌లో ముంబై గెలవాలంటే 30 బంతుల్లో 93 పరుగులు చేయాల్సి ఉంది. హార్దిక్ పాండ్యా (20), టిమ్ డేవిడ్ క్రీజ్‌లో ఉన్నారు. 15 ఓవర్ తొలి బంతికే కమిన్స్ తిలక్ వర్మ (64) ఔట్ చేశాడు. 15 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 185/గా ఉంది. రఫ్ఫాడిస్తున్న తిలక్.. 10 ఓవర్లలో ముంబై స్కోర్ 141/2 తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. షాబాజ్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో తిలక్ 3 సిక్సర్లు బాది 22 పరుగులు పిండుకున్నాడు. తిలక్ 24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 10.2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 146/2గా ఉంది. తిలక్‌తో (52) పాటు నమన్ ధిర్ (26) క్రీజ్‌లో ఉన్నాడు. 7.3 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసిన ముంబై ఇండియన్స్ భారీ లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్‌కు ధీటుగా ముంబై ఇండియన్స్ బదులిస్తుంది. ముంబై 7.3 ఓవర్లలనే 100 పరుగుల మార్కును తాకింది. ఇషాన్ కిషన్ (34), రోహిత్ శర్మ (26) ఉతికి ఆరేసి ఔట్ కాగా.. నమన్ ధిర్ (16), తిలక్ వర్మ (19) క్రీజ్‌లో ఉన్నారు. 8 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 102/గా ఉంది. టార్గెట్ 278.. ధీటుగా బదులిస్తున్న ముంబై 278 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ధీటుగా బదులిస్తుంది. ఆ జట్టు 5 ఓవర్ల అనంతరం 2 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (34), రోహిత్ శర్మ (26) ఉతికి ఆరేసి ఔట్ కాగా.. నమన్ ధిర్ (2), తిలక్ వర్మ (1) క్రీజ్‌లో ఉన్నారు. సన్‌రైజర్స్ బ్యాటర్ల వీరంగం.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ నమోదు ముంబై ఇండియన్స్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు వీరంగం సృష్టించడంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టీమ్ స్కోర్ నమోదైంది. ఈ మ్యాచ్‌లో ముగ్గురు ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు సుడిగాలి అర్దశతకాలు బాదారు. ట్రవిస్ హెడ్ 24 బంతుల్లో 62, అభిషేక్ శర్మ 23 బంతుల్లో 63, హెన్రిచ్ క్లాసెన్ 34 బంతుల్లో 80 పరుగులు (నాటౌట్) చేశారు. మార్క్రమ్ సైతం తానేమీ తక్కువ కాదని 28 బంతుల్లో 42 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన క్లాసెన్ హెన్రిచ్ క్లాసెన్ కేవలం 23 బంతుల్లో బౌండరీ, 5 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 18 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 243/3గా ఉంది. క్లాసెన్‌తో పాటు మార్క్రమ్ (40) క్రీజ్‌లో ఉన్నాడు. 14.4 ఓవర్లలోనే 200 పరుగులు పూర్తి చేసిన సన్‌రైజర్స్ సన్‌రైజర్స్ కేవలం 14.4 ఓవర్లలోనే 200 పరుగుల మార్కును తాకింది. మార్క్రమ్ (31), క్లాసెన్ (26) క్రీజ్‌లో ఉన్నారు. 12 ఓవర్లలోనే 173 పరుగులు చేసిన సన్‌రైజర్స్ 11వ ఓవర్ ఆఖరి బంతికి అభిషేక్ శర్మ (23 బంతుల్లో 63; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) ఔటయ్యాడు. పియూశ్ చావ్లా బౌలింగ్‌లో నమన్ ధిర్కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ ఔటయ్యాడు. 12 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 173/3గా ఉంది. మార్క్రమ్ (21), క్లాసెన్ (8) క్రీజ్‌లో ఉన్నారు. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అభిషేక్ అభిషేక్ శర్మ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. సన్‌రైజర్స్ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అభిషేక్ (54), మార్క్రమ్ (13) క్రీజ్‌లో ఉన్నారు. హాఫ్ సెంచరీ అనంతరం ఔటైన హెడ్.. పెను విధ్వంసం సృష్టించిన అనంతరం హెడ్ (24 బంతుల్లో 62; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) కొయెట్జీ బౌలింగ్‌లో హార్దిక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 117/2గా ఉంది. అభిషేక్ (32), మార్క్రమ్ (4) క్రీజ్‌లో ఉన్నాడు. పవర్ ప్లేలో (81/1) సన్‌రైజర్స్‌కు ఇదే అత్యధిక స్కోర్. 7 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసిన సన్‌రైజర్స్ సన్‌రైజర్స్ ఆటగాళ్లు శివాలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ట్రవిస్ హెడ్ (22 బంతుల్లో 62 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. హెడ్ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో అభిషేక్ శర్మ సైతం చెలరేగిపోయాడు. పియూశ్ చావ్లా వేసిన ఆ ఓవర్లో అభిషేక్ మూడు సిక్సర్లు బాదాడు. తొలి బంతికే వికెట్ తీసిన హార్దిక్ 4.1 ఓవర్: హార్దిక్ పాండ్యా తన స్పెల్ తొలి బంతికే వికెట్ తీశాడు. టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి మయాంక్ అగర్వాల్ (11) ఔటయ్యాడు. వీరంగం సృష్టిస్తున్న ట్రవిస్ హెడ్ సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ వీరంగం సృష్టిస్తున్నాడు. కేవలం 10 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేశాడు. యువ పేసర్ మపాకా వేసిన మూడో ఓవర్లోనే హెడ్ శివాలెత్తిపోయాడు. ఈ ఓవర్లో హెడ్ వరుసగా రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది 22 పరుగులు పిండుకున్నాడు. 4 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. హెడ్ (32),మయాంక్ అగర్వాల్ (11) క్రీజ్‌లో ఉన్నారు. ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (మార్చి 27) సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. హైదరాబాద్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30య గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ హార్దిక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్లో ఇరు జట్లు తమతమ తొలి మ్యాచ్‌ల్లో ఓటమిపాలై బోణీ గెలుపు కోసం ఎదురు చూస్తున్నాయి. సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్‌లో కేకేఆర్ చేతిలో ఓటమిపాలు కాగా.. ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయంపాలైంది. తొలి మ్యాచ్‌లో దెబ్బతిన్న ఇరు జట్లు బలాబలాల విషయంలో సమతూకంగా ఉండటంతో నేటి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ మాజీ సారధి రోహిత్ శర్మకు ఆ జట్టు తరఫున 200వ మ్యాచ్ కావడం విశేషం. సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రవిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్ ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, షమ్స్ ములానీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, క్వేన మపాకా ముంబై ఇండియన్స్ సబ్స్: డెవాల్డ్ బ్రెవిస్, రొమారియో షెపర్డ్, మొహమ్మద్ నబీ, విష్ణు వినోద్, నేహాల్ వధేరా సన్‌రైజర్స్ హైదరాబాద్ సబ్‌లు: నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిప్స్, ఉపేంద్ర యాదవ్ -
RR VS LSG Updates: బోణీ కొట్టిన రాజస్తాన్.. లక్నోపై ఘన విజయం
IPL 2024 RR VS LSG Jaipur Live Updates And Highlights బోణీ కొట్టిన రాజస్తాన్.. లక్నోపై ఘన విజయం ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ బోణీ కొట్టింది. జైపూర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో రాజస్తాన్ ఘన విజయం సాధించింది. 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు మాత్రమే చేసింది. లక్నో బ్యాటర్లలో పూరన్ (64) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్(58) పరుగులతో పర్వాలేదన్పించాడు. రాజస్తాన్ బౌలర్లలో బౌల్ట్ రెండు వికెట్లు పడగొట్టగా.. బర్గర్, అశ్విన్, చాహల్, సందీప్ శర్మ తలా వికెట్ సాధించారు. కేఎల్ రాహుల్ ఫిప్టీ.. 14 ఓవర్లకు లక్నో స్కోర్: 129/4 14 ఓవర్లు ముగిసే సరికి లక్నో 4 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(53), పూరన్(35) పరుగులతో ఉన్నారు. లక్నో విజయానికి 36 బంతుల్లో 65 పరుగులు కావాలి. మూడో వికెట్ డౌన్.. హుడా ఔట్ దీపక్ హుడా రూపంలో లక్నో మూడో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన హుడా.. చాహల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి నికోలస్ పూరన్ వచ్చాడు. 6 ఓవర్లకు లక్నో స్కోర్ 47/2 6 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. క్రీజులో దీపక్ హుడా(18), కేఎల్ రాహల్(15) ఉన్నారు. రెండో వికెట్ డౌన్ 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పడిక్కల్ రూపంలో లక్నో రెండో వికెట్ కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ పడిక్కల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 3 ఓవర్లకు లక్నో స్కోర్ 12/2 తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. డికాక్ ఔట్ 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన క్వింటన్ డికాక్.. బౌల్ట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి పడిక్కల్ వచ్చాడు. సంజూ శాంసన్ విధ్వంసం.. రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ లక్నోతో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. సంజూ శాంసన్ (52 బంతుల్లో 82 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో బట్లర్ (11), హెట్‌మైర్ (5) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. రియాన్ పరాగ్ (43), యశస్వి జైస్వాల్ (24), ద్రువ్ జురెల్ (20 నాటౌట్) వేగంగా పరుగులు సాధించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 2, మొహిసిన్ ఖాన్, రవి భిఫ్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు. నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ 150 పరుగుల వద్ద (16.3 ఓవర్) రాజస్థాన్ రాయల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి హెట్‌మైర్ (5) ఔటయ్యాడు.శాంసన్‌కు (62) జతగా ద్రువ్ జురెల్ క్రీజ్‌లోకి వచ్చాడు. మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్.. దూకుడుగా ఆడుతున్న రియాన్ పరాగ్ ఔట్ 14.5వ ఓవర్లో 142 పరుగుల వద్ద రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న రియాన్ పరాగ్ (29 బంతుల్లో 43; ఫోర్, 3 సిక్సర్లు) నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సంజూ శాంసన్ (59) క్రీజ్‌లో ఉన్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శాంసన్ సంజూ శాంసన్ తన కెరీర్లో 21వ ఐపీఎల్ ఫిఫ్టిని పూర్తి చేసుకున్నాడు. సంజూ 33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ మార్కును చేరుకున్నాడు. 14 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 128/2గా ఉంది. సంజూ (58), రియాన్ పరాగ్ (32) క్రీజ్‌లో ఉన్నారు. వరుస సిక్సర్లతో విరుచుకుపడిన సంజూ శాంసన్ 9.0 ఓవర్: యశ్ ఠాకూర్ వేసిన 9వ ఓవర్లో సంజూ శాంసన్ శివాలెత్తిపోయాడు. ఆఖరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. అంకుమందు ఇదే ఓవర్లో రియన్ పరాగ్ కూడా ఓ సిక్సర్ బాదాడు. మొత్తంగా ఈ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. 9 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 84/2. సంజూ (33), పరాగ్ (15) క్రీజ్‌లో ఉన్నారు. 8 ఓవర్ల తర్వాత 63/2 8.0 ఓవర్: స్ట్రాటజిక్ టైమ్ ఔట్ సమయానికి రాజస్థాన్ స్కోర్ 63/2గా ఉంది. సంజూ శాంసన్ (21), రియాన్ పరాగ్ (6) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్.. డేంజర్ యశస్వి ఔట్ 5.6 ఓవర్: మొహిసిన్ ఖాన్ వేసిన ఐదో ఓవర్లో బౌండరీ, సిక్సర్ బాది జోష్ మీదుండిన యశస్వి జైస్వాల్ (12 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్).. అదే ఓవర్ చివరి బంతికి మరో భారీ షాట్‌కు ప్రయత్నించి కృనాల్ చేతికి క్యాచ్ ఇచ్చి వికెట్ పారేసుకున్నాడు. 5 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 49/2. సంజూ శాంసన్ (13), రియాన్ పరాగ్ క్రీజ్‌లో ఉన్నారు. WHAT A CATCH BY CAPTAIN RAHUL 🔥🤯 pic.twitter.com/FU2Utxvp2z — Johns. (@CricCrazyJohns) March 24, 2024 అద్బుతమైన క్యాచ్ పట్టిన రాహుల్.. బట్లర్ ఔట్ 1.6 ఓవర్: నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో జోస్ బట్లర్ (11) ఔటయ్యాడు. 2 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 13/1. యశస్వి (1), సంజూ శాంసన్ క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా ఇవాళ (మార్చి 24) రాజస్థాన్ రాయల్స్.. లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లు.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్/వికెట్‌కీపర్), రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్మేయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్ లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్‌కీపర్), దేవదత్ పడిక్కల్, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహిసిన్ ఖాన్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్ -
CM Jagan: రాప్తాడు ‘సిద్ధం’ సభ హైలైట్స్
సాక్షి, అనంతపురం జిల్లా: రాయలసీమలోనే కాదు.. ఏపీలోనే కనివిని ఎరుగని రీతిలో జరిగిన రాప్తాడు సిద్ధం సభ జరిగింది. సభ సముద్రాన్ని తలపించింది. సభకు లక్షలాదిగా జగన్ దండు తరలివచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగం సింహనాదంలా కొనసాగింది. సీఎం జగన్ స్పీచ్‌కు జనం యుద్ధ నినాదాన్ని మోగించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ టార్గెట్ 175 ఫిక్స్ చేసిన సీఎం జగన్.. ఎంత మంది జత కట్టినా.. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా.. ప్రజలతోనే తన పొత్తు అని స్పష్టం చేశారు. ప్రజలే స్టార్ క్యాంపెనర్లుగా సీఎం జగన్ ప్రకటించారు. లబ్దిదారులే తనకు ఓటు వేయిస్తారని ప్రకటించిన సీఎం జగన్.. ఫ్యాన్ ఇంట్లో ఉండాలని, సైకిల్ బైట ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్‌లోనే ఉండాలంటూ జగన్ పొలిటికల్ పంచ్‌లు విసిరారు. ఎన్నికలు ముగిసే వరకు కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ►మేనిఫెస్టోలో 99 శాతం హామీలు పూర్తి చేశామని సగర్వంగా ప్రకటించిన సీఎం జగన్ ►పరిపాలనలో ఎక్కడా తగ్గలేదు. మరి ఒక్క సీటు కూడా ఎలా తగ్గుతుందని సీఎం జగన్ భరోసా ►భీమిలి, దెందులూరు సభలకు మించి రాప్తాడులో సిద్ధం సభ సక్సెస్‌తో వైఎస్సార్సీపీ కేడర్‌లో జోష్ ►ప్రతిపక్షాల కుట్రలను ఎండగట్టిన సీఎం జగన్ ►ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా సూటిగా, స్పష్టంగా ఎన్నికల నినాదాన్ని సవివరంగా సోదహారణంగా వివరించిన సీఎం జగన్ ఇదీ చదవండి: రాప్తాడు ‘సిద్ధం’ సభలో సీఎం జగన్ పంచ్‌లు -
IND VS ENG 3rd Test Day 4: రాజ్‌కోట్ టెస్టులో భారత్ ఘన విజయం..
IND VS ENG 3rd Test Day 4 Updates And Highlights: రాజ్‌కోట్ టెస్టులో భారత్ ఘన విజయం.. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 434 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ భారత బౌలర్ల దాటికి.. కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా 5 వికెట్లతో ఇంగ్లీష్ జట్టు పతనాన్ని శాసించగా.. కుల్దీప్ యాదవ్ రెండు, అశ్విన్ ఒక్క వికెట్ సాధించారు. ఒక్క వికెట్ దూరంలో.. రాజ్‌కోట్ టెస్టులో విజయానికి భారత్ కేవలం ఒక్క వికెట్ దూరంలో నిలిచింది. వరుస క్రమంలో ఇంగ్లండ్ రెండు వికెట్లను కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో ఫోక్స్ ఔట్ కాగా.. అశ్విన్ బౌలింగ్‌లో హార్ట్లీ పెవిలియన్‌కు చేరాడు. ఓటమి దిశగా ఇంగ్లండ్.. ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. రెహాన్ అహ్మద్ రూపంలో ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 28 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 53/7 విజయం దిశగా భారత్.. రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా విజయం వైపు అడుగులు వేస్తోంది. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 50 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. భారత్ విజయానికి కేవలం 4 వికెట్ల దూరంలో నిలిచింది. ఐదో వికెట్ డౌన్.. జో రూట్ రూపంలో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన రూట్.. జడేజా బౌలింగ్‌లో రూట్ ఎల్బీగా వెనుదిరిగాడు. 22 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 50/5. క్రీజులో బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్ ఉన్నారు. పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లండ్.. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 28 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. జడేజా బౌలింగ్‌లో జానీ బెయిర్ స్టో.. నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 519 పరుగులు కావాలి. మూడో వికెట్ డౌన్.. 20 పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన ఓలీ పోప్.. జడేజా బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 10 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 24/3 రెండో వికెట్ డౌన్.. జాక్ క్రాలే రూపంలో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన క్రాలే.. బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ బెన్ డకెట్(4) రనౌటయ్యాడు. క్రీజులోకి ఓలీ పోప్ వచ్చాడు.7 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 18/1 ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భారత్ భారత్ సెకెండ్ ఇన్నింగ్స్‌ను 430/4 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. టీమిండియా.. ఇంగ్లండ్‌కు 557 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. యశస్వి జైస్వాల్ 214, సర్ఫరాజ్ ఖాన్ 68 పరుగులతో అజేయంగా నిలిచారు. మరో డబుల్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ రెండో టెస్ట్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వి జైస్వాల్.. మూడో టెస్ట్‌లో మరో డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ డబుల్‌ను యశస్వి 231 బంతుల్లో పూర్తి చేశాడు. ఇందులో 10 సిక్సర్లు, 14 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 411/3గా ఉంది. లీడ్ 537 పరుగులుగా ఉంది. మరో హాఫ్ సెంచరీ చేసిన సర్పరాజ్ ఖాన్ తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగుల వద్ద పొరపాటున రనౌటైన సర్ఫరాజ్ ఖాన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో మరో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 66 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్.. 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో డబుల్ దిశగా దూసుకుపోతున్న యశస్వి భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరో డబుల్ సెంచరీ దిశగా దూసకుపోతున్నాడు. నిన్న రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగి ఇవాళ తిరిగి బరిలోకి దిగిన యశస్వి.. ధాటిగా ఆడుతున్నాడు. ప్రస్తుతం యశస్వి 182 పరుగుల వద్ద ఉన్నాడు. అతనికి జతగా సర్ఫరాజ్ ఖాన్ (33) క్రీజ్‌లో ఉన్నాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోర్ 359/4గా ఉంది. 440 పరుగుల ఆధిక్యంలో టీమిండియా నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి టీమిండియా ఆధిక్యం 440 పరగులుగా ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (149), సర్ఫరాజ్ ఖాన్ (22) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా 258 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో జో రూట్‌కు క్యాచ్ ఇచ్చి కుల్దీప్ యాదవ్ (27) ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ (115), సర్ఫరాజ్ ఖాన్ క్రీజ్‌లో ఉన్నారు. 91 పరుగుల వద్ద ఔటైన శుభ్‌మన్ గిల్ శుభ్‌మన్ గిల్ సెంచరీకి చేరువలో (91) రనౌటాయ్యడు. కుల్దీప్ తప్పిదం కారణంగా గిల్ ఔటయ్యాడు. నిన్న రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగిన యశస్వి (107) క్రీజ్‌లోకి వచ్చాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 192/2గా ఉంది. శుభ్‌మన్ గిల్ (65), కుల్దీప్ యాదవ్ (3) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 322 పరుగుల లీడ్‌లో ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ అద్బుతమైన సెంచరీతో (107) ఆకట్టుకోగా.. రోహిత్ శర్మ (19), రజత్ పాటిదార్ (0) నిరాశపరిచారు. యశస్వి జైస్వాల్ సెంచరీ అనంతరం రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జో రూట్, టామ్ హార్ట్లీ తలో వికెట్ పడగొట్టారు. స్కోర్ వివరాలు.. భారత్ తొలి ఇన్నింగ్స్: 445 ఆలౌట్ (రోహిత్ 131, జడేజా 112) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319 ఆలౌట్ (బెన్ డకెట్ 153) -
చెలరేగిన పేసర్లు.. సౌతాఫ్రికాపై టీమిండియా చారిత్రక విజయం
South Africa Vs India 2nd Test 2024 Day 2 Updates- కేప్‌టౌన్: చెలరేగిన పేసర్లు.. సౌతాఫ్రికాపై టీమిండియా చారిత్రక విజయం కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పేసర్లు విజృంభించడంతో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. సిరాజ్ (9-3-15-6) విజృంభణ ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకు కుప్పకూలగా... భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు పరిమితమైంది. అనంతరం బుమ్రా (6/61) చెలరేగడంతో సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 176 పరుగులకు ఆలౌటై, భారత్ ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఈ టార్గెట్‌ను భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. స్కోర్ వివరాలు.. సౌతాఫ్రికా- 55 (వెర్రిన్ 15, సిరాజ్ 6/15), 176 (మార్క్రమ్ 106, బుమ్రా 6/61) భారత్- 153 (కోహ్లి 46, ఎంగిడి 3/30), 80/3 (జైస్వాల్ 28, జన్సెన్ 1/15) 7 వికెట్ల తేడాతో భారత్ విజయం మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. కోహ్లి ఔట్ 75 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. జన్సెన్ బౌలింగ్‌లో కోహ్లి (12) ఔటయ్యాడు. భారత్ లక్ష్యానికి ఇంకా నాలుగు పరుగుల దూరంలో ఉంది. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. గిల్ ఔట్ 57 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (10) ఔటయ్యాడు. భారత్ గెలుపుకు ఇంకా 22 పరుగుల దూరంలో ఉంది. తొలి వికెట్ కోల్పోయిన భారత్.. జైస్వాల్ ఔట్ 44 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. బర్గర్ బౌలింగ్‌లో జైస్వాల్ (28) ఔటయ్యాడు.భారత్.. దక్షిణాఫ్రికా గడ్డపై చారిత్రక గెలుపుకు ఇంకా 35 పరుగుల దూరంలో ఉంది. దూకుడుగా ఆడుతున్న జైస్వాల్.. లక్ష్యంగా దిశగా దూసుకుపోతున్న టీమిండియా 79 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా దూకుడుగా ఆడుతుంది. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ టీ20 తరహాలో విరుచుకుపడుతున్నాడు. అతను కేవలం 21 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 24 పరుగులు చేశాడు. రోహిత్ 6 పరుగులతో అతని జతగా క్రీజ్‌లో ఉన్నాడు. 5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 35/0గా ఉంది. 176 పరుగులకు ఆలౌటైన సౌతాఫ్రికా.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..? సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్ 176 పరుగుల వద్ద ముగిసింది. మార్క్రమ్ అద్భుతమైన సెంచరీ సాధించిన అనంతరం సౌతాఫ్రికా వెంటవెంటనే వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. ఆఖరి వికెట్ (ఎంగిడి (8)) కూడా బుమ్రాకే దక్కింది. దీంతో బుమ్రా ఖాతాలో ఆరు వికెట్లు చేరాయి. తొలి ఇన్నింగ్స్‌లో రెండు, ఈ ఇన్నింగ్స్‌లో ఆరు కలుపుకుని బుమ్రా ఖాతాలో మొత్తంగా ఎనిమిది వికెట్లు పడ్డాయి. బుమ్రాతో పాటు ముకేశ్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ దక్కించుకున్నారు. టీమిండియా టార్గెట్ 79 పరుగులుగా ఉంది. మ్యాచ్‌కు లంచ్ విరామం ప్రకటించారు. భారత పేసర్ల విజృంభణ.. తొమ్మిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 32.1: ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగిన రబడ(2) ఎనిమిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 31.4: సిరాజ్ బౌలింగ్‌లో సెంచరీ హీరో మార్క్రమ్ అవుట్ సెంచరీ పూర్తి చేసిన మార్క్రమ్.. 60 పరుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికా ఓపెనర్‌గా బరిలోకి దిగిన మార్క్రమ్ అత్యంత కఠినమైన పిచ్‌పై అద్బుత సెంచరీతో (99 బంతుల్లో 102 నాటౌట్; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగాడు. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున ఇది ఆరో వేగవంతమైన సెంచరీ కూడా కావడం విశేషం. ఐదేసిన బుమ్రా.. పట్టుబిగించిన టీమిండియా 3 వికెట్ల నష్టానికి 62 పరుగుల స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా.. బుమ్రా ధాటికి తొలి సెషన్లోనే మరో 4 వికెట్లు కోల్పోయింది. మొత్తంగా బుమ్రా ఈ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో (5/59) చెలరేగడంతో సౌతాఫ్రికా 30 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 60 పరుగుల ఆధిక్యంలో ఉంది. మార్క్రమ్ (102 నాటౌట్) అద్భుత శతకంతో ఒంటరిపోరాటం చేస్తున్నాడు. అతనికి జతగా రబాడ (2) క్రీజ్‌లో ఉన్నాడు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా రెండో టెస్టు తుదిజట్లు సౌతాఫ్రికా డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెర్రెన్నె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి. టీమిండియా రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ముకేష్ కుమార్. -
IND VS SA 2nd Test: తొలి రోజే 23 వికెట్లు.. ఇంకా ఆధిక్యంలోనే టీమిండియా
South Africa Vs India 2nd Test 2024 Day 1 Updates- కేప్‌టౌన్: తొలి రోజే 23 వికెట్లు.. ఇంకా ఆధిక్యంలోనే టీమిండియా రెండో టెస్ట్‌లో తొలి రోజే 23 వికెట్లు నేలకూలాయి. ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్‌ల్లో ఆలౌటయ్యాక, సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు ఆలౌటైంది. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. సౌతాఫ్రికా భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 36 పరుగులు వెనుకపడి ఉంది. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 45 పరుగుల వద్ద సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్ (1) ఔటయ్యాడు. ఇదే రోజు తొలి ఇన్నింగ్స్‌లో కూడా బుమ్రానే స్టబ్స్‌ను ఔట్ చేశాడు. 16 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 49/3గా ఉంది. సౌతాఫ్రికా భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 49 పరుగులు వెనుకపడి ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో సెకెండ్ వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా రెండో టెస్ట్ తొలి రోజు ఇరు జట్ల పేసర్లు అత్యద్భుతాలు చేస్తున్నారు. ఇరు జట్ల పేసర్ల ధాటికి ఇప్పటికే 22 వికెట్లు నేలకూలాయి. తాజాగా సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌లో సెకెండ్ వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో జార్జీ (1) ఔటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 42/2గా ఉంది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు సౌతాఫ్రికా ఇంకా 56 పరుగులు వెనుకపడి ఉంది. మార్క్రమ్ (25), ట్రిస్టన్ స్టబ్స్ (0) క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 37 పరుగుల వద్ద సౌతాఫ్రికా తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో తొలి వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో ఎల్గర్ (12) ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌కు విరుద్దంగా ఆడుతున్న సౌతాఫ్రికా 55 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన సౌతాఫ్రికా.. ఆతర్వాత టీమిండియాను 153 పరుగులకు ఆలౌట్ చేసి తమ సెకెండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. అయితే సఫారీలు తమ సెకెండ్ను తొలి ఇన్నింగ్స్‌లో ఆడినట్లు ఆడట్లేదు. ఆ జట్టు ఓపెనర్లు చాలా జాగ్రత్తగా వికెట్లు పడకుండా ఆడుతున్నారు. 10 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 37/0గా ఉంది. సౌతాఫ్రికా భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను ఇంకా 61 పరుగులు వెనకపడి ఉంది. ఒకే స్కోర్ వద్ద ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా 153 పరుగుల వద్ద టీమిండియా ఏకంగా ఆరు వికెట్లు కోల్పోయి, అదే స్కోర్ వద్ద ఆలౌటైంది. 34వ ఓవర్లో ఎంగిడి పరుగులేమీ ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టగా.. ఆ మరుసటి ఓవర్లోనే రబాడ.. కోహ్లి (46), ప్రసిద్ద్ (0)లను పెవిలియన్‌కు పంపాడు. అదే ఓవర్లో, అదే స్కోర్ వద్ద (153) సిరాజ్ (0) కూడా రనౌటయ్యాడు. ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసిన ఎంగిడి.. టీమిండియా 153/7 లుంగి ఎంగిడి ఒక్క ఓవర్లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. భారత ఇన్నింగ్స్ 34వ ఓవర్లో ఎంగిడి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. రాహుల్ (8), జడేజా (0), బుమ్రా (0) ఐదు బంతుల వ్యవధిలో ఔటయ్యారు. కోహ్లి (46), సిరాజ్ క్రీజ్‌లో ఉన్నారు. టీ విరామం.. టీమిండియా స్కోర్ 111/4 తొలి రోజు టీ విరామం సమయానికి టీమిండియా స్కోర్ 111/4గా ఉంది. విరాట్ కోహ్లి (20), కేఎల్ రాహుల్ (0) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్ 110 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. నండ్రే బర్గర్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (0) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 105 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. నండ్రే బర్గర్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (36) ఔటయ్యాడు. విరాట్ కోహ్లి (16), శ్రేయస్ అయ్యర్ క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత శర్మ ఔటయ్యాడు. నండ్రే బర్గర్ బౌలింగ్‌లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి హిట్‌మ్యాన్ పెవిలియన్‌కు చేరాడు. 16 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 90/2గా ఉంది. శుభ్‌మన్ గిల్ (24), విరాట్ కోహ్లి (1) క్రీజ్‌లో ఉన్నారు. ఆధిక్యంలోకి వచ్చిన టీమిండియా 10: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా ఆధిక్యంలోకి వచ్చింది. కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య జట్టును 55 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తొలి పది ఓవర్లలోనే లీడ్ సంపాదించింది. ఆరంభంలోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయినా.. మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 58 పరుగులు సాధించిన టీమిండియా మూడు పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. రోహిత్ శర్మ 37 బంతుల్లో 38 పరుగులు సాధించి జోరు మీదున్నాడు. మరో ఎండ్‌లో శుబ్‌మన్ గిల్ ఆరు పరుగులతో ఆడుతున్నాడు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా సిరాజ్ (9-3-15-6), ముకేశ్ కుమార్ (2.2-2-0-2), బుమ్రా (8-1-25-2) నిప్పులు చెరగడంతో సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా.. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించి 17 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్ యశస్వి జైస్వాల్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 3 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 20/1గా ఉంది. ఎంగిడి వేసిన రెండో ఓవర్లో మూడు బౌండరీలు బాది రోహిత్ శర్మ జోరుమీదున్నాడు. సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా రెండో టెస్టు తుదిజట్లు సౌతాఫ్రికా డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెర్రెన్నె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి. టీమిండియా రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ముకేష్ కుమార్. -
సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్ కైవసం
సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్ కైవసం నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా సౌతాఫ్రికాను చిత్తు చేసి 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ సెంచరీతో (108) చెలరేగడంతో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేయగా.. ఛేదనలో సౌతాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటై 78 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అర్ష్‌దీప్ సింగ్ 4 వికెట్లతో చెలరేగగా.. సుందర్, ఆవేశ్ ఖాన్ చెరో 2 వికెట్లు, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఆరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 177 పరుగుల వద్ద (33.2వ ఓవర్) సౌతాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. సుందర్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ముల్దర్ (1) ఔటయ్యాడు. ఐదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 174 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్‌కు క్యాచ్ ఇచ్చి క్లాసెన్ (21) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 161 పరుగుల వద్ద (29.4వ ఓవర్) సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్‌లో జార్జీ (81) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 141 పరుగుల వద్ద (25.5వ ఓవర్) సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. సుందర్ బౌలింగ్‌లో మార్క్రమ్ (36) ఔటయ్యాడు. 22 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 112/2 ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త తడబడిన సౌతాఫ్రికా ఆ తర్వాత నెమ్మదిగా లక్ష్యం దిశగా సాగుతుంది. జార్జీ (64) అర్ధసెంచరీ చేసి ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. జార్జీకు జతగా మార్క్రమ్ (19) క్రీజ్‌లో ఉన్నాడు. 22 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 112/2గా ఉంది. రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 76 పరుగుల వద్ద (14.4 ఓవర్లో) సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ బౌలింగ్‌లో డస్సెన్ (2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టార్గెట్ 297.. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 297 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 59 పరుగుల వద్ద (8.2వ ఓవర్) తొలి వికెట్ కోల్పోయింది. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో రీజా హెండ్రిక్స్ (19) ఔటయ్యాడు. టార్గెట్ 297.. ధాటిగా ఆడుతున్న సౌతాఫ్రికా ఓపెనర్లు 297 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. 6 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 46/0గా ఉంది. జార్జీ (29), రీజా హెండ్రిక్స్ (11) క్రీజ్‌లో ఉన్నారు. సంజూ శతకం.. ఆఖర్లో మెరిసిన రింకూ.. సౌతాఫ్రికా టార్గెట్ 297 నిర్ణయాత్మక మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (108) తన కెరీర్లో తొలి శతకంతో టీమిండియా ఈ స్థాయి స్కోర్ చేయడానికి పునాది వేయగా.. ఆఖర్లో రింకూ సింగ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ (52) సైతం బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. అక్షర్ ఔట్ కేవలం ఒక్క పరుగు చేసి అక్షర్ పటేల్ ఔటయ్యాడు. హెండ్రిక్స్ బౌలింగ్‌లో అక్షర్ వెనుదిరిగాడు. 47 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 259/6గా ఉంది. రింకూ (24), సుందర్ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా 108 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సంజూ శాంసన్ ఔటయ్యాడు. విలియమ్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి సంజూ పెవిలియన్‌కు చేరాడు. 46 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 249/5గా ఉంది. రింకూ (18), అక్షర్ పటేల్ (1) క్రీజ్‌లో ఉన్నారు. శతక్కొట్టిన సంజూ టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తన అంతర్జాతీయ కెరీర్లో ఎట్టకేలకు మూడంకెల స్కోర్‌ను సాధించాడు. సౌతాఫ్రికాతో ఇవాళ జరుగుతున్న మూడో వన్డేలో సంజూ 110 బంతుల్లో సెంచరీ మార్కును చేరుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో సంజూకు ఇది తొలి సెంచరీ. సంజూ శతకంలో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. కఠినమైన పిచ్‌పై జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సంజూ అత్యంత కీలకమై ఇన్నింగ్స్ ఆడాడు. 44 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 235/4గా ఉంది. సంజూకు జతగా రింకూ (14) క్రీజ్‌లో ఉన్నాడు. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా తిలక్ వర్మ (52) హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే ఔటయ్యాడు. ఆది కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో ఇబ్బంది పడ్డ తిలక్ ఆఖరికి తిలక్ హాఫ్ సెంచరీ పూర్తయ్యాక అతని బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. 41.2 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 217/4గా ఉంది. సంజూ (96) జతగా రింకూ సింగ్ బరిలోకి దిగాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తిలక్ ఆరంభంలో చాలా నిదానంగా ఆడిన తిలక్ వర్మ ఇన్నింగ్స్ కొనసాగే కొద్ది వేగం పెంచాడు. తిలక్ వన్డేల్లో తన తొలి హాఫ్ సెంచరీని 75 బంతుల్లో పూర్తి చేశాడు. మరో ఎండ్‌లో సంజూ శాంసన్ (95) శతకానికి చేరువయ్యాడు. 41 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 216/3గా ఉంది. 37 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 178/3 37 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 178/3గా ఉంది. సంజూ శాంసన్ (71), తిలక్ వర్మ (39) క్రీజ్‌లో ఉన్నారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ చాలా రోజుల తర్వాత సంజూ శాంసన్ అంతర్జాతీయ వన్డేల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను 66 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో ఈ ఫీట్‌ను సాధించాడు. సంజూకు జతగా తిలక్ వర్మ (8) క్రీజ్‌లో ఉన్నాడు. 28 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 121/3గా ఉంది. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 101 పరుగుల వద్ద (18.5వ ఓవర్) టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ముల్దర్ బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి రాహుల్ (21) ఔటయ్యాడు. శాంసన్ (38), తిలక్ క్రీజ్‌లో ఉన్నారు. ఆచితూచి ఆడుతున్న శాంసన్, రాహుల్ 49 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ఆటగాళ్లు సంజూ శాంసన్ (33), కేఎల్ రాహుల్ (20) ఆచితూచి ఆడుతున్నారు. 18 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 95/2గా ఉంది. 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 68/2 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 68/2గా ఉంది. సంజూ శాంసన్ (19), కేఎల్ రాహుల్ (7) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా 49 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసి సాయి సుదర్శన్ ఔటయ్యాడు. హెండ్రిక్స్ బౌలింగ్‌లో సుదర్శన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 8 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 50/2గా ఉంది. సంజూ శాంసన్ (9), కేఎల్ రాహుల్ (1) క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా ఇన్నింగ్స్ ఐదవ ఓవర్లో సిక్సర్, బౌండరీ బాదిన అనంతరం నండ్రే బర్గర్ బౌలింగ్‌లో రజత్ పాటిదార్ (22) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 4.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 34/1గా ఉంది. సాయి సుదర్శన్ (9), సంజూ శాంసన్ క్రీజ్‌లో ఉన్నారు. 3 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 20/0 తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆచితూచి ఆడుతుంది. ఓపెనర్ల సాయి సుదర్శన్ (5), రజత్ పాటిదార్ (12) నెమ్మదిగా ఆడుతున్నారు. 3 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 20/0గా ఉంది. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా పార్ల్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా టాస్ ఓడి సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా రెండో వన్డేలో బరిలోకి దిగిన జట్టునే కొనసాగిస్తుండగా.. టీమిండియా రెండు మార్పులు చేసింది. గాయం కారణంగా రుతురాజ్ ఈ మ్యాచ్ నుంచి తప్పుకోగా.. కుల్దీప్ యాదవ్‌కు విశ్రాంతినిచ్చారు. వీరి స్థానాల్లో రజత్ పాటిదార్, వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగనున్నారు. తుది జట్లు: భారత్: సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రింకూ సింగ్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ దక్షిణాఫ్రికా: టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, నండ్రే బర్గర్, బ్యూరాన్ హెండ్రిక్స్, లిజాడ్ విలియమ్స్ -
ఆఖరి ఓవర్లో అర్షదీప్ మ్యాజిక్.. ఐదో టీ20లోనూ టీమిండియాదే గెలుపు
ఆఖరి ఓవర్లో అర్షదీప్ మ్యాజిక్.. ఐదో టీ20లోనూ టీమిండియాదే గెలుపు ఆఖరి ఓవర్లో ఆసీస్ గెలుపుకు 10 పరుగుల చేయాల్సిన తరుణంలో బంతిని అందుకున్న అర్షదీప్ మ్యాజిక్ చేశాడు. 6 బంతుల్లో వికెట్ తీసి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి టీమిండియాను గెలిపించాడు. ఈ గెలుపుతో భారత్ 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగుల మాత్రమే చేసి 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వరుస బంతుల్లో వికెట్లు తీసిన ముకేశ్ కుమార్ 129 పరుగుల వద్ద ఆసీస్ వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయింది. 17.3, 4 బంతుల్లో ముకేశ్ కుమార్.. షార్ట్(16), డ్వార్షుయిస్ (0)ను ఔట్ చేశాడు. నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్ 102 పరుగుల వద్ద ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఆవేశ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి టిమ్ డేవిడ్ (17) ఔటయ్యారు. మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్ 55 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో ఆరోన్ హార్డీ (6) ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్ 47 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో ట్రవిస్ హెడ్ (28) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 5 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 48/2గా ఉంది. టార్గెట్ 161.. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ 161 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. 22 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో జోష్ ఫిలిప్ (4) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రాణించిన ఆసీస్ బౌలర్లు.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన టీమిండియా టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఆసీస్ బౌలర్లు రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ (53) ఒక్కడే అర్ధ సెంచరీతో రాణించాడు. యశస్వి (21), జితేశ్ శర్మ (24), అక్షర్ పటేల్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో బెహ్రెన్‌డార్ఫ్, డ్వాషుయిస్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఆరోన్ హార్డీ, నాథన్ ఇల్లిస్, తన్వీర్ సంగా తలో వికెట్ దక్కించుకున్నారు. ఆరో వికెట్ కోల్పోయిన భారత్ 143 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. బెహ్రెన్‌డార్ఫ్ బౌలింగ్‌లో హార్డీకు క్యాచ్ ఇచ్చి అక్షర్ పటేల్ (31) ఔటయ్యాడు. 97 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా 97 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. ఆరోన్ హార్డీ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్‌కు క్యాచ్ ఇచ్చి జితేశ్ శర్మ (24) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్ 55 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. రింకూ సింగ్ తన టీ20 కెరీర్లో తొలిసారి సింగిల్ డిజిట్ స్కోర్‌కు (6) ఔటయ్యాడు. నిప్పులు చెరుగుతున్న ఆసీస్ బౌలర్లు 46 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. డార్షుయిస్ బౌలింగ్‌లో మెక్‌డెర్మాట్ క్యాచ్ పట్టడంతో సూర్యకుమార్ యాదవ్ (5) పెవిలియన్‌కు చేరాడు. 7 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 46/3. రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్ క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ డౌన్ నాలుగు బంతుల వ్వవధిలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. డ్వార్షుయిస్ బౌలింగ్‌లో బెహ్రెన్డార్ప్కు క్యాచ్ ఇచ్చి రుతురాజ్ (10) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన భారత్.. యశస్వి ఔట్ 33 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. బెహ్రెన్‌డార్ఫ్ బౌలింగ్‌లో నాథన్ ఇల్లిస్‌కు క్యాచ్ ఇచ్చి యశిస్వి జైస్వాల్ (21) ఔటయ్యాడు. 4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 33/1గా ఉంది. రుతురాజ్ (10), శ్రేయస్ క్రీజ్‌లో ఉన్నారు. బెంగళూరు వేదికగా టీమిండియాతో ఇవాళ (డిసెంబర్ 3) జరుగుతున్న నామమాత్రపు ఐదో టీ20లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియాలు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. భారత్ తరఫున దీపక్ చాహర్ స్థానంలో అర్షదీప్ సింగ్.. ఆసీస్ తరఫున క్రిస్ గ్రీన్ స్థానంలో నాథన్ ఇల్లిస్ బరిలో నిలిచారు. టీమిండియా: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేశ్ శర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్ ఆస్ట్రేలియా: ట్రవిస్ హెడ్, జోష్ ఫిలిప్, బెన్ మెక్‌డెర్మాట్, ఆరోన్ హార్డీ, టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మాథ్యూ వేడ్ (కెప్టెన్), బెన్ డ్వారిషుయిస్, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, నాథన్ ఇల్లిస్, తన్వీర్ సంఘా -
IND Vs AUS: బ్యాటర్ల ఊచకోత.. రెండో టీ20లోనూ టీమిండియాదే విజయం
బ్యాటర్ల ఊచకోత.. రెండో టీ20లో టీమిండియా ఘన విజయం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తిరువనంతపురం వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. బ్యాటర్లంతా రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. యశస్వి (25 బంతుల్లో 53; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రుతురాజ్ (43 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ (10 బంతుల్లో 19; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (9 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (2 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. అనంతరం 236 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఆదిలో కాస్త పోరాటపటిమ కనబర్చినప్పటికీ.. ఆతర్వాత భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో భిష్ణోయ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 3 వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్, అర్షదీప్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో కూడా టీమిండియానే విజయం సాధించిన విషయం తెలిసిందే. ఓటమి అంచుల్లో ఆసీస్ 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఆదిలో కాస్త పోరాడినప్పటికీ, ఆతర్వాత భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఆ జట్టు 155 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది.అర్షదీప్ బౌలింగ్‌లో ఆడమ్ జంపా (1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నిప్పులు చెరుగుతున్న ప్రసిద్ద్ కృష్ణ టీమిండియా పేసర్ ప్రసిద్ద్ కృష్ణ నిప్పులు చెరుగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను మూడో వికెట్ పడగొట్టాడు. 152 పరుగుల వద్ద నాథన్ ఇల్లిస్ (1)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఓటమి దిశగా ఆసీస్.. సీన్ అబాట్ క్లీన్ బౌల్డ్ ఆసీస్ జట్టు ఓటమి దిశగా పయనిస్తుంది. ఆ జట్టు 149 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో సీన్ అబాట్ (1) క్లీన్ బౌల్డయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్ 148 పరుగుల వద్ద ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. గుర్తింపు పొందిన ఆఖరి బ్యాటర్ స్టోయినిస్ (45) ఔటయ్యాడు. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి స్టోయినిస్ పెవిలియన్‌కు చేరాడు. ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్ 139 పరుగుల వద్ద ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్ (37) ఔటయ్యాడు. 14 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 142/5గా ఉంది. స్టోయినిస్ (43), వేడ్ (2) క్రీజ్‌లో ఉన్నారు. టార్గెట్ 236.. భారత్‌కు ధీటుగా బదులిస్తున్న ఆసీస్ 236 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆసీస్.. టీమిండియాకు ధీటుగా బదులిస్తుంది.12 ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. స్టోయినిస్ (40), టిమ్ డేవిడ్ (31) చెలరేగి ఆడుతున్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్ 53 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ (12) ఔటయ్యాడు. 6 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 53/3గా ఉంది. స్టోయినిస్, స్టీవ్ స్మిత్ (17) క్రీజ్‌లో ఉన్నారు టార్గెట్ 236.. రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్ 236 పరుగుల అతి భారీ లక్ష్యఛేదనకు దిగిన ఆసీస్ 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. రవి భిష్ణోయ్.. జోస్ ఇంగ్లిస్ (2), మాథ్యూ షార్ట్‌ను (19) పెవిలియన్‌కు పంపాడు. టీమిండియా బ్యాటర్ల మహోగ్రరూపం.. సిక్సర్ల సునామీ ఆసీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా బ్యాటర్లు మహోగ్రరూపం దాల్చారు. టాప్-3 బ్యాటర్లు మెరుపు అర్ధశతకాలతో విరుచుకుపడ్డారు. యశస్వి (25 బంతుల్లో 53; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రుతురాజ్ (43 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సూర్యకుమార్ (10 బంతుల్లో 19; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (9 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) , తిలక్ వర్మ (2 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) సైతం మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో ఇల్లిస్ 3 వికెట్లు పడగొట్టగా.. స్టోయినిస్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఇషాన్ ఔట్ 52 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ ఔటయ్యాడు. స్టోయినిస్ బౌలింగ్‌లో ఇల్లిస్‌కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన స్కై తొలి బంతికే సిక్సర్ బాదాడు. దంచికొడుతున్న ఇషాన్ యశస్వి జైస్వాల్ ఔటయ్యాక కూడా భారత బ్యాటర్లు జోరు కొనసాగిస్తున్నారు. ఇషాన్ కిషన్ (52) విధ్వంసం ఓ రేంజ్లో కొనసాగుతుండగా.. రుతురాజ్ (47) ఆచితూచి ఆడుతున్నాడు. 15 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 164/1గా ఉంది. 10 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసిన భారత్ టీమిండియా 10 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసింది. యశస్వి ధాటిగా ఆడి ఔటైనా రుతురాజ్ (29), ఇషాన్ కిషన్ (10) కూడా ఓ మోస్తరు షాట్లు ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 10 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 101/1గా ఉంది. విధ్వంసం సృష్టించి ఔటైన యశస్వి యశస్వి జైస్వాల్ క్రీజ్‌లో ఉన్నంత సేపు విధ్వంసం సృష్టించాడు. అయితే ఐదో ఓవర్ ఆఖరి బంతికి అతనికి అడ్డుకట్ట పడింది. ఇల్లిస్ బౌలింగ్ యశస్వి (25 బంతుల్లో 53; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔటయ్యాడు. 5.5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 77/1గా ఉంది. రుతురాజ్ (15), ఇషాన్ క్రీజ్‌లో ఉన్నారు. యశస్వి ఊచకోత.. 24 బంతుల్లోనే..! యశస్వి జైస్వాల్ ఉగ్రరూపం దాల్చాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు ఎడాపెడా బాదేస్తున్నాడు. కేవలం 24 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ ఉగ్రరూపం సీన్ అబాట్ వేసిన నాలుగో ఓవర్లో యశస్వి జైస్వాల్ ఉగ్రరూపం దాల్చాడు. వరుసగా మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. తొలి బంతికే ఫోర్ బాదిన రుతురాజ్ తొలి టీ20లో బంతిని ఎదుర్కోకుండానే డైమండ్ రనౌట్‌గా వెనుదిరిగిన రుతురాజ్ ఈ మ్యాచ్‌లో తానెదుర్కొన్న తొలి బంతికే బౌండరీ బాదాడు. తొలి ఓవర్ తర్వాత టీమిండియా స్కోర్ 10/0గా ఉంది. రుతురాజ్ (5), యశస్వి జైస్వాల్ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తిరువనంతపురం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 26) రెండో టీ20 జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించగా.. ఆసీస్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. బెహ్రాన్‌డార్ఫ్, ఆరోన్ హార్డీ స్థానాల్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా ఆసీస్ జట్టులోకి వచ్చారు. టీమిండియా: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ ఆస్ట్రేలియా: స్టీవెన్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ వేడ్(కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ -
హామీలను నెరవేర్చిన.. పార్టీలకే ఓటేయాలి
సాక్షి, హైదరాబాద్: ‘మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన పార్టీలకు, మంచి చేస్తారనే అభ్యర్థులకే ఓటేయాలి. అధికారంలోకి రావడం కోసం అనేక వాగ్దానాలు చేస్తుంటారు. కానీ అవి అమలయ్యే హామీలా? కాదా? అనేది చూడాలి. అలాగే ఇంతకుముందు ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేశారో చూడాలి. పార్టీలిచ్చే హామీలు రాష్ట్ర బడ్జెట్‌ను మించిపోతున్నాయి. కొన్ని పార్టీల మేనిఫెస్టోలు ఉత్తుత్తవిగా ఉంటున్నాయి’ అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) ‘ప్రజల మేనిఫెస్టో–2023’ని విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు, ఎఫ్‌జీజీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ‘ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయేలా ఉంది. పార్టీలు చట్టాల పరిధిలో లేక తామే ఒక చట్టంగా వ్యవహరిస్తున్నాయి. గెలిచిన పార్టీలు అంతా తమదే అనుకుంటున్నాయి. మార్పు కోసం రాజ్యాంగ సంస్కరణలు రావాలి’ అని చెప్పారు. ఎఫ్‌జీజీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి మాట్లాడుతూ ‘మా ఓటు అమ్మకానికి లేదు. మద్యం, డబ్బు సంచులతో రావద్దు’ అని ఓటర్లు నినదించాలన్నారు. జస్టిస్ రామలింగేశ్వరరావు మాట్లాడుతూ.. పార్టీలు రకరకాల తాయిలాలతో విడుదల చేసే మేనిఫెస్టులు చిత్తు కాగితాలతో సమానమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సోమా శ్రీనివాస్‌రెడ్డి తదిరులు పాల్గొన్నారు. ఎఫ్‌జీజీ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు.. రాష్ట్ర బడ్జెట్లో విద్య, ఆరోగ్యానికి 25 శాతం నిధులు కేటాయించాలి. సంక్షేమ పథకాలకు బడ్జెట్లో 30 శాతానికి మించకుండా కేటాయించాలి. పెట్రోలు, డీజిల్‌పై ట్యాక్స్ తగ్గించాలి. రైతుబంధు పది ఎకరాల్లోపు రైతులకే ఇవ్వాలి. కౌలు రైతులకూ రైతుబంధు ఇవ్వాలి. పంటల బీమా అమలు చేయాలి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, మూడు బోర్ల వరకు పరిమితి విధించాలి. నీటి పారుదల ప్రాజెక్టులపై ఒక ఉన్నత కమిటీ ఉండాలి. ప్రభుత్వ పనితీరు పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండాలి. అవినీతికి అడ్డుకట్ట వేయాలి. లోకాయుక్త చట్టాన్ని కర్ణాటకలో మాదిరిగా సవరించాలి. కేంద్రంతో రాష్ట్రం మంచి సంబంధాలు కలిగి ఉండాలి. పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి. దశల వారీగా మద్యనిషేధాన్ని అమలు చేయాలి. మాదక ద్రవ్యాలను ఉక్కుపాదంతో అణచివేయాలి. పార్టీలు తమ మేనిఫెస్టోలో చెప్పిన పథకాలకయ్యే వ్యయం వివరిస్తూ, ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో కూడా తెలపాలి. ఆహార కల్తీపై గట్టి నిఘా ఉండాలి. నైపుణ్యం, ఉపాధి పెంచాలి. సీఎం, మంత్రులు, ప్రజా ప్రతినిధులు తమ ఆస్తి వివరాలు వెల్లడించాలి. మహిళలకు 25శాతం టికెట్లు కేటాయించాలి. నేర చరిత్రులకు టికెట్ ఇవ్వొద్దు. ప్రభుత్వ భూముల అమ్మకంపై నిషేధం విధించాలి. ధరలపై నియంత్రణ ఉండాలి. గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వాలి. -
WC 2023: కాన్వే, రచిన్ విధ్వంసకర శతకాలు.. ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్
కాన్వే, రచిన్ విధ్వంసకర శతకాలు.. ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్ గత వరల్డ్‌కప్ (2019) ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన అపజయానికి న్యూజిలాండ్ టీమ్ ప్రతీకారం తీర్చుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇవాళ జరిగిన వరల్డ్‌కప్ ఆరంభ మ్యాచ్‌లో కివీస్ టీమ్.. ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను 9 వికెట్ల భారీ తేడాతో చిత్తు చేసి, మెగా టోర్నీలో ఘనంగా బోణీ కొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేయగా.. కాన్వే (121 బంతుల్లో 152 నాటౌట్; 19 ఫోర్లు, 3 సిక్సర్లు), రచిన్ రవీంద్ర (96 బంతుల్లో 123 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయమైన శతకాలతో విరుచుకుపడటంతో న్యూజిలాండ్ 36.2 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. శతక్కొట్టిన రచిన్ రవీంద్ర.. గెలుపుకు చేరువైన కివీస్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన రచిన్ రవీంద్ర అద్భుతమైన సెంచరీతో కదంతొక్కాడు. రచిన్ 82 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. రచిన్‌కు కెరీర్లో ఇది తొలి శతకం. మరో ఎండ్‌లో కాన్వే (111) సెంచరీ పూర్తయ్యాక కూడా నిలకడగా ఆడుతున్నారు. 30.4 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 214/1గా ఉంది. న్యూజిలాండ్ గెలుపుకు కేవలం 69 పరుగుల దూరంలో ఉంది. డెవాన్ కాన్వే మెరుపు శతకం.. గెలుపుకు చేరువైన కివీస్ న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే 83 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్లో ఐదో శతకాన్ని పూర్తి చేశాడు. మరో ఎండ్‌లో రచిన్ రవీంద్ర (90) కూడా శతకానికి చేరువయ్యాడు. ఈ ఇద్దరి మెరుపు ఇన్నింగ్స్‌ల సహకారంతో కివీస్ ఆడుతూపాడుతూ విజయం దిశగా సాగుతుంది. 26.1 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 193/1గా ఉంది. శతకాల దిశగా పరుగులు పెడుతున్న కాన్వే, రచిన్ న్యూజిలాండ్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర (71), డెవాన్ కాన్వే (82) శతకాల దిశగా దూసుకుపోతున్నారు. వీరిద్దరి ధాటికి స్కోర్ బోర్డు పరుగులు పెడుతుంది. 20 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 154/1గా ఉంది. న్యూజిలాండ్ గెలవాలంటే 30 ఓవర్లలో 129 పరుగులు చేయాలి. హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న కాన్వే, రచిన్ న్యూజిలాండ్ బ్యాటర్లు డెవాన్ కాన్వే (62 నాటౌట్), రచిన్ రవీంద్ర (58 నాటౌట్) హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 15 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 121/1గా ఉంది. న్యూజిలాండ్ గెలవాలంటే 35 ఓవర్లలో 162 పరుగులు చేయాలి. లక్ష్యం దిశగా దూసుకుపోతున్న న్యూజిలాండ్ 283 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ధాటిగా ఆడుతుంది. ఆ జట్టు ఏడో బంతికే తొలి వికెట్ కోల్పోయినప్పటికీ.. వన్‌డౌన్‌లో వచ్చిన రచిన్ రవీంద్ర (47), డెవాన్ కాన్వే (44) ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 11 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 92/1గా ఉంది. టార్గెట్ 283.. రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ 283 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఏడో బంతికే వికెట్ కోల్పోయింది. సామ్ కర్రన్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి విల్ యంగ్ డకౌటయ్యాడు. 4 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 19/1గా ఉంది. డెవాన్ కాన్వే (11), రచిన్ రవీంద్ర (8) క్రీజ్‌లో ఉన్నారు. పడి లేచిన ఇంగ్లండ్.. గౌరవప్రదమైన స్కోర్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినప్పటికీ రూట్ (77), బట్లర్ (43) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును గట్టెక్కించారు. ఆఖర్లో టెయింలెండర్లు మేము సైతం అని ఓ చేయి వేయడంతో ఇంగ్లండ్ ఊహించిన దాని కంటే ఎక్కువ పరుగులు చేయగలిగింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. మార్క్ వుడ్ (13), ఆదిల్ రషీద్ (15) అజేయంగా నిలువగా.. బెయిర్‌స్టో (33), మలాన్ (14), బ్రూక్ (25), మొయిన్ అలీ (11), బట్లర్ (43), రూట్ (77), లివింగ్‌స్టోన్ (20), సామ్ కర్రన్ (14), క్రిస్ వోక్స్ (11) ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 3, సాంట్నర్, ఫిలిప్స్ తలో 2, బౌల్ట్, రవీంద్ర చెరో వికెట్ దక్కించుకున్నారు. తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 252 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి సామ్ కర్రన్ (14) ఔటయ్యాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 250 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్‌లో విల్ యంగ్‌కు క్యాచ్ ఇచ్చి క్రిస్ వోక్స్ (11) ఔటయ్యాడు. జో రూట్ ఔట్.. ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ రివర్స్ స్వీప్ జో రూట్ (77) కొంపముంచింది. ఈ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి క్రమం తప్పకుండా ఈ షాట్లు ఆడి సక్సెస్ సాధించిన రూట్.. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ మరోసారి ఆ ప్రయత్నం చేయబోయి మూల్యం చెల్లించుకున్నాడు. అప్పటివరకు బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడిన రూట్ అనవసర షాట్‌కు ప్రయత్నించి ఫిలిప్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఫలితంగా ఇంగ్లండ్ 229 పరుగుల వద్ద (41.1 ఓవర్లు) ఏడో వికెట్ కోల్పోయింది. సామ్ కర్రన్, క్రిస్ వోక్స్ క్రీజ్‌లో ఉన్నారు. ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 221 పరుగుల వద్ద (38.5 ఓవర్లు) ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన స్లో బాల్‌కు లివింగ్‌స్టోన్ (20) ఔటయ్యాడు. జో రూట్ (72), సామ్ కర్రన్ క్రీజ్‌లో ఉన్నారు. కష్టాల్లో ఇంగ్లండ్.. ఐదో వికెట్ డౌన్ ఇంగ్లండ్ టీమ్ కష్టాల్లో పడింది. 188 పరుగులకే ఆ జట్టు సగం వికెట్లు (33.2 ఓవర్లలో)బౌలింగ్‌లో వికెట్‌కీపర్ టామ్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (43) ఔటయ్యాడు. జో రూట్ (59) క్రీజ్‌లో ఉన్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రూట్ జో రూట్ 57 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 30 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 166/4గా ఉంది. రూట్‌తో పాటు జోస్ బట్లర్ (30) క్రీజ్‌లో ఉన్నారు. మొయిన్ అలీ క్లీన్ బౌల్డ్ 118 పరుగల వద్ద (21.2 ఓవర్లు) ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో మొయిన్ అలీ (11) క్లీన్ బౌల్డయ్యాడు. జో రూట్ (32) క్రీజ్‌లో ఉన్నాడు. 94 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ వరుసగా 2 బౌండరీలు, ఓ సిక్సర్ బాది జోష్ మీదుండిన హ్యారీ బ్రూక్ (25) అనవసరమైన షాట్ ఆడి వికెట్ పరేసుకున్నాడు. 17 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 94/3. జో రూట్ (20), మొయిన్ అలీ క్రీజ్‌లో ఉన్నారు. జానీ బెయిర్‌స్టో ఔట్.. ఇంగ్లండ్ రెండో వికెట్ డౌన్ 64 పరుగుల వద్ద (12.5 ఓవర్లు) ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి జానీ బెయిర్‌స్టో (33) ఔటయ్యాడు. జో రూట్ (15), హ్యారీ బ్రూక్ క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 40 పరుగుల వద్ద (7.4 ఓవర్లు) ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న డేవిడ్ మలాన్ 14 పరుగులు చేసి మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో వికెట్ కీపర్ టామ్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జానీ బెయిర్‌స్టో (24) క్రీజ్‌లో ఉన్నాడు. దూకుడుగా ఆడుతున్న బెయిర్‌స్టో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో దూకుడుగా ఆడుతున్నాడు. 6 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 35/0గా ఉంది. బెయిర్‌స్టో (21), మలాన్ (13) క్రీజ్‌లో ఉన్నారు. తొలి బంతికే సిక్సర్ బాదిన బెయిర్‌స్టో టాస్ ఓడి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఊహించని ఆరంభం లభించింది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో తొలి బంతికే బెయిర్‌స్టో సిక్సర్ బాదాడు. ఆతర్వాత ఐదో బంతికి బౌండరీ కొట్టాడు. ఫలితంగా ఇంగ్లండ్ తొలి ఓవర్లో 12 పరుగులు రాబట్టింది. బెయిర్‌స్టో (11), డేవిడ్ మలాన్ (1) క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇవాళ (అక్టోబర్ 5) డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీమ్ బెన్ స్టోక్స్ లేకుండా బరిలోకి దిగుతుండగా.. న్యూజిలాండ్ టీమ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సేవలను కోల్పోయింది. విలియమ్సన్తో పాటు ఫెర్గూసన్, టిమ్ సౌథీ, ఐష్ సోధి ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్/ కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మాట్ హెన్రీ, మిచెల్ శాంట్నర్, జేమ్స్ నీషమ్, ట్రెంట్ బౌల్ట్ ఇంగ్లండ్: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలాన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(వికెట్‌కీపర్/ కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. -
మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం
భారత్ అలౌట్ 286 పరుగుల వద్ద (49.4 ఓవర్లు) టీమిండియా ఆఖరి వికెట్ కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా 286 పరుగుల వద్ద (48.3 ఓవర్లు) టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సంగా బౌలింగ్‌లో జడేజా(35) ఔటయ్యాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్ 270 పరుగుల వద్ద (45.3 ఓవర్లు) టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్‌లో లబూషేన్‌కు క్యాచ్ ఇచ్చి బుమ్రా (5) ఔటయ్యాడు. ఓటమి దిశగా పయనిస్తున్న టీమిండియా టీమిండియా ఓటమి దిశగా పయనిస్తుంది. 257 పరుగుల వద్ద (41.5 ఓవర్లు) భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ (2) క్లీన్ బౌల్డయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా 249 పరుగుల వద్ద (38.3 ఓవర్లు) టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (48) క్లీన్ బౌలయ్యాడు. రవీంద్ర జడేజా (9), కుల్దీప్ యాదవ్ క్రీజ్‌లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా 233 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ (8) ఔటయ్యాడు. భారత్ గెలవాలంటే 76 బంతుల్లో 120 పరుగులు చేయాలి. చేతిలో మరో 5 వికెట్లు మాత్రమే ఉన్నాయి. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా 223 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్‌లో క్యారీకి క్యాచ్ ఇచ్చి కేఎల్ రాహుల్ (26) ఔటయ్యాడు. 35.5 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 223/4గా ఉంది. భారత గెలుపుకు 85 బంతుల్లో 130 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. కోహ్లి ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన భారత్ విరాట్ కోహ్లి 56 పరుగుల వద్ద మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 26.5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 171/3గా ఉంది. శ్రేయస్ (14), కేఎల్ రాహుల్ క్రీజ్‌లో ఉన్నారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి విరాట్ కోహ్లి 55 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 26 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 168/2గా ఉంది. విరాట్ (54), శ్రేయస్ (13) క్రీజ్‌లో ఉన్నారు.భారత్ లక్ష్యానికి మరో 185 పరుగుల దూరంలో ఉంది. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా 144 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్ 81 పరుగులు చేసి ఔటయ్యాడు. 23 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 153/2గా ఉంది. విరాట్ కోహ్లి (46), శ్రేయస్ అయ్యర్ (6) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ లక్ష్యానికి మరో 200 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 74 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో లబూషేన్‌కు క్యాచ్ ఇచ్చి వాషింగ్టన్ సుందర్ (18) ఔటయ్యాడు. రోహిత్ శర్మ (55), విరాట్ కోహ్లి క్రీజ్‌లో ఉన్నారు. టార్గెట్ 353.. సిక్సర్ల వర్షం కురిపిస్తున్న రోహిత్ శర్మ 353 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నారు. 24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఎండ్‌లో సుందర్ నిదానంగా ఆడుతున్నాడు. సుందర్ 18 బంతుల్లో 10 పరుగులతో అజేయంగా ఉన్నాడు. 7 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 56/0గా ఉంది. రెచ్చిపోయిన ఆసీస్ బ్యాటర్లు.. టీమిండియా ముందు భారీ లక్ష్యం టాపార్డర్ బ్యాటర్లు రెచ్చిపోవడంతో టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. వార్నర్ (56), మార్ష్ (96), స్టీవ్ స్మిత్ (74), లబూషేన్ (72) అర్ధసెంచరీలతో రాణించడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా 3, కుల్దీప్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు. ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్ బుమ్రా బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి లబూషేన్ (72) ఔటయ్యాడు. 49 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 345/7. ఆరో వికెట్ కోల్పోయిన అసీస్ 299 పరుగుల వద్ద ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి గ్రీన్ (9) ఔటయ్యాడు. లబూషేన్ (42), కమిన్స్ క్రీజ్‌లో ఉన్నారు. మ్యాక్స్‌వెల్ క్లీన్ బౌల్డ్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ (5) క్లీన్ బౌల్డయ్యాడు. 39 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 281/5. లబూషేన్ (33), గ్రీన్ క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్ 267 పరుగుల వద్ద ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి అలెక్స్ క్యారీ (11) ఔటయ్యాడు. లబూషేన్ (26), మ్యాక్స్‌వెల్ క్రీజ్‌లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్ 242 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. 74 పరుగులు చేసి స్మిత్ (74) ఔటయ్యాడు. సిరాజ్ బౌలింగ్‌లో స్మిత్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 32 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 242/3గా ఉంది. లబూషేన్ (13), అలెక్స్ క్యారీ (0) క్రీజ్‌లో ఉన్నారు. తృటిలో సెంచరీ చేజార్చుకున్న మార్ష్ మిచెల్ మార్ష్ 4 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మార్ష్ 84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్‌లో ప్రసిద్ద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 28 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 215/2. స్మిత్ (61), లబూషేన్ క్రీజ్‌లో ఉన్నారు. స్మిత్ హాఫ్ సెంచరీ.. సెంచరీ దిశగా మార్ష్ 26.2 ఓవర్లలోనే ఆస్ట్రేలియా 200 పరుగుల మార్కును అందుకుంది. మార్ష్ (89) సెంచరీ దిశగా పరుగులు పెడుతుండగా.. స్మిత్ (55) అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 27 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 202/1. 15 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ ఎంతంటే..? 15 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 120/1గా ఉంది. మిచెల్ మార్ష్ (43), స్టీవ్ స్మిత్ (21) క్రీజ్‌లో ఉన్నారు. విధ్వంసకర హాఫ్ సెంచరీ అనంతరం ఔటైన వార్నర్ డేవిడ్ వార్నర్ (34 బంతుల్లో 56; 6 ఫోర్లు, 4 సిక్సర్లు)మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అనంతరం ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో అనవసర షాట్ ఆడి ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 84/1. మిచెల్ మార్ష్ (22), స్టీవ్ స్మిత్ (6) క్రీజ్‌లో ఉన్నారు. వార్నర్ విధ్వంసకర హాఫ్ సెంచరీ చాలా రోజుల తర్వాత వార్నర్ మునుపటి ఫామ్‌ను కనబరుస్తున్నాడు. టీమిండియాతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో అతను 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. సిరాజ్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టి వార్నర్ హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ధాటిగా ఆడుతున్న వార్నర్.. 7 ఓవర్ల తర్వాత స్కోర్ ఎంతంటే..? రాజ్‌కోట్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఓపెనర్లు వార్నర్ (27 బంతుల్లో 43), మిచెల్ మార్ష్ (15 బంతుల్లో 22) శుభారంభాన్ని అందించారు. 7 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 65/0గా ఉంది. టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ క్యారీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, తన్వీర్ సింగ్, జోష్ హేజిల్‌వుడ్. -
ఆసీస్ ఆలౌట్.. భారత్ ఘన విజయం
ఆసీస్ ఆలౌట్.. భారత్ ఘన విజయం 217 పరుగుల వద్ద ఆసీస్ ఆఖరి రెండు వికెట్లను కోల్పోయింది. దీంతో భారత్ 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆసీస్ 140 పరుగుల వద్ద ఆసీస్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. జాంపా (5) క్లీన్ బౌల్డయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్ 135 పరుగుల వద్ద ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. గ్రీన్ (19)రనౌటయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్ 128 పరుగుల వద్ద ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో అలెక్స్ క్యారీ (14) క్లీన్ బౌల్డయ్యాడు. 101 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆసీస్.. అశ్విన్‌కు 3 వికెట్లు 101 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆసీస్ కష్టాల్లో కూరుకుపోయింది. అశ్విన్‌కు ఒకే ఓవర్లో (15వ ఓవర్) 2 వికెట్లు సహా మొత్తం 3 వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను దెబ్బకొట్టాడు. 15వ ఓవర్ తొలి బంతికి వార్నర్‌ను (53) ఎల్బీడబ్ల్యూ చేసిన యాష్.. ఐదో బంతికి ఇంగ్లిస్‌ను (6) పెవిలియన్‌కు పంపాడు. మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్ 89 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. అశ్విన్.. లబూషేన్ (27)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. వార్నర్ (48), ఇంగ్లిస్ క్రీజ్‌లో ఉన్నారు. తగ్గిన వర్షం.. మొదలైన ఆట.. 33 ఓవర్లకు మ్యాచ్ కుదింపు వర్షం తగ్గడంతో మ్యాచ్ మళ్లీ మొదలైంది. వర్షం కారణంగా సమయం వృధా కావడంతో మ్యాచ్‌ను 33 ఓవర్లకు కుదించి, డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆసీస్ లక్ష్యాన్ని 317 పరుగులుగా నిర్ధేశించారు. 10 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 63/2గా ఉంది. వార్నర్ (31), లబూషేన్ (18) క్రీజ్‌లో ఉన్నారు. వర్షం కారణంగా నిలిచిపోయిన మ్యాచ్ ఆసీస్ ఇన్నింగ్స్ 9 ఓవర్ల తర్వాత వర్షం మొదలైంది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. అంతకుమందు భారత ఇన్నింగ్స్ సందర్భంగా కూడా వరుణుడు అడ్డుతగిలాడు. 9 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 56/2గా ఉంది. మాథ్యూ షార్ట్ (9), స్టీవ్ స్మిత్ (0)లను ప్రసిద్ద్ కృష్ణ వరుస బంతుల్లో ఔట్ చేయగా.. డేవిడ్ వార్నర్ (26), లబూషేన్ (17) క్రీజ్‌లో ఉన్నారు. టార్గెట్ 400.. రెండో ఓవర్లో 2 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ఆస్ట్రేలియా రెండో ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్ (9), స్టీవ్ స్మిత్ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. 2.3 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 10/2గా ఉంది. లబూషేన్, వార్నర్ క్రీజ్‌లో ఉన్నారు. గిల్, అయ్యర్ శతకాలు.. స్కై విధ్వంసం.. టీమిండియా భారీ స్కోర్ టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (104), శ్రేయస్ అయ్యర్ (105) శతకాలతో విరుచుకుపడగా.. ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (52) అర్ధసెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్ (31) పర్వాలేదనిపించాడు. రుతురాజ్ (8) ఒక్కడే విఫలమయ్యాడు. ఆసీస్ బౌలర్లలో కెమరూన్ గ్రీన్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్, సీన్ అబాట్ తలో వికెట్ దక్కించుకున్నారు. వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన సూర్యకుమార్ గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ 44వ ఓవర్లో సూర్యకుమార్ చెలరేగిపోయాడు. వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్లో మొత్తం 26 పరుగులు వచ్చాయి. 46 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 355/5గా ఉంది. 46వ ఓవర్ ఆఖరి బంతికి గ్రీన్ బౌలింగ్‌లో రాహుల్ (52) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్ 302 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ఆడమ్ జంపా బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔటయ్యాడు. 41 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 306/4గా ఉంది. రాహుల్ (45), సూర్యకుమార్ యాదవ్ (2) క్రీజ్‌లో ఉన్నారు. గిల్ ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన భారత్ 104 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు. గ్రీన్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ బాట పట్టాడు. 35 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 249/3గా ఉంది. కేఎల్ రాహుల్ (18), ఇషాన్ కిషన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. శుభ్‌మన్ గిల్ సెంచరీ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (92 బంతుల్లో 100 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ వన్డే కెరీర్లో ఆరో సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. 33 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 230/2గా ఉంది. గిల్ (100), కేఎల్ రాహుల్ (9) క్రీజ్‌లో ఉన్నారు. సెంచరీ తర్వాత ఔటైన అయ్యర్ శ్రేయస్ అయ్యర్ సెంచరీ చేసిన వెంటనే ఔటయ్యాడు. 105 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సీన్ అబాట్ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్ క్యాచ్ పట్టడంతో అయ్యర్ పెవిలియన్ బాట పట్టాడు. 30.5 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 216/2గా ఉంది. శుభ్‌మన్ గిల్ (95), కేఎల్ రాహుల్ క్రీజ్‌లో ఉన్నారు. శతక్కొట్టిన శ్రేయస్ అయ్యర్ ఆసీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రేయస్ అయ్యర్ సెంచరీ సాధించాడు. అయ్యర్ 86 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో కెరీర్లో మూడో సెంచరీని నమోదు చేశాడు. మరోవైపు శుభ్‌మన్ గిల్ (94) సైతం సెంచరీ దిశగా సాగుతున్నాడు. 29.5 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 210/1గా ఉంది. సెంచరీల దిశగా దూసుకుపోతున్న గిల్, శ్రేయస్ శుభ్‌మన్ గిల్ (90), శ్రేయస్ అయ్యర్లు (92) సెంచరీల దిశగా దూసుకుపోతున్నారు. 28 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 198/1గా ఉంది. శ్రేయస్ హాఫ్ సెంచరీ గాయం నుంచి కోలుకున్న తర్వాత శ్రేయస్ అయ్యర్ తన తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. అయ్యర్ కూడా గిల్ లాగే సిక్సర్‌తో ఫిఫ్టిని కంప్లీట్ చేశాడు. అయ్యర్ 41 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్ సాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు. 17 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 131/1గా ఉంది. గిల్ 61, శ్రేయస్ 54 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. సిక్సర్‌తో ఫిఫ్టి పూర్తి చేసుకున్న గిల్ శుభ్‌మన్ గిల్ కెరీర్లో తన 10వ హాఫ్ సెంచరీని సిక్సర్‌తో పూర్తి చేశాడు. కేవలం 37 బంతుల్లోనే గిల్ ఫిఫ్టిని కంప్లీట్ చేశాడు. గిల్ తన హాఫ్ సెంచరీలో 2 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 111/1గా ఉంది. గిల్ 53, శ్రేయస్ 44 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. మొదలైన ఆట.. 10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 80/1 వర్షం అంతరాయం అనంతరం ఆట మళ్లీ మొదలైంది. ఓవర్ల కుదింపు ఏమీ జరగలేదు. మ్యాచ్ యధావిధిగా 50 ఓవర్ల పాటు సాగనుంది. 10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 80/1గా ఉంది. గిల్ (33), శ్రేయస్ అయ్యర్ (34) క్రీజ్‌లో ఉన్నారు. వర్షం కారణంగా నిలిచిపోయిన ఆట వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. భారత ఇన్నింగ్స్ 10వ ఓవర్లో వర్షం మొదలుకావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. 9.5 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 79/1గా ఉంది. రుతరాజ్ (8) ఔట్ కాగా.. శుభ్‌మన్ గిల్ (32), శ్రేయస్ అయ్యర్ (34) క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన భారత్ టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్ 16 పరుగుల వద్ద రుతురాజ్ గైక్వాడ్ (8) వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకు క్యాచ్ ఇచ్చి రుతు ఔటయ్యాడు. 5 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 26/1. శుభ్‌మన్ గిల్ (3), శ్రేయస్ అయ్యర్ (10) క్రీజ్‌లో ఉన్నారు. ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ ఓడి, ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓ మార్పుతో బరిలోకి దిగింది. బుమ్రా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఆస్ట్రేలియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ స్థానాల్లో అలెక్స్ క్యారీ, జోష్ హాజిల్‌వుడ్, స్పెన్సర్ జాన్సన్ తుది జట్టులోకి వచ్చారు. ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, సీన్ ఆంథోనీ అబాట్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్, జోష్ హాజిల్‌వుడ్ ఇండియా : శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, లోకేష్ రాహుల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ -
వచ్చే వారం మార్కెట్లలో ర్యాలీ? నిఫ్టీ 20 వేలు దాటేస్తుందా?
దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ వారాంతంలో నష్టాల్లో ముగిసాయి.గతవారం చీర్పుల్గా మార్కెట్లు ఈ వారం షాక్ ఇచ్చాయి. కానీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో కనిష్టాల వద్ద రికవరీని సాధించాయి. ఈనేపథ్యంలో తదుపరి వారం పాజిటివ్‌గా ట్రేడ్‌లో ఉండవచ్చు. నియోట్రేడర్ కో-ఫౌండర్ రాజా వెంకటరామన్ సాక్షిబిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు సంభాషణ విందాం. వచ్చే వారం మార్కెట్ ధోరణి ఎలా ఉండబోతోంది. బ్యాంకింగ్ షేర్లలో ఏవి బెటర్. ముఖ్యంగా నిఫ్టీ సపోర్ట్ లెవల్స్ ఏంటి అనేది ఒక సారి చూద్దాం. నిఫ్టీ 50 కచ్చితంగా 20000-20200, కానీ 202600 వద్దకు వెళ్లే ఛాన్స్ వుంది. లోయర్స్ లెవల్స్‌లో కొనుగోళ్లు జరిగే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీకి ఇప్పటివరకూ పాజిటివ్ సంకేతాలే ఉన్నాయి. అయితే నిఫ్టీ19600-19500 వద్ద కొనుగోలు చేయడం ఉత్తమం. ఈ లెవల్ బ్రేక్ అవ్వనంత వరకు పెద్దగా ఆందోళన అవసరం లేదు. ఈ లెవల్స్‌లో కొనుగోలు చేస్తే మళ్లీ నిఫ్టీ 20వేలకు చేరే అవకాశం ఉంది. బ్యాంకింగ్ స్టాక్స్ బలహీనంగా ఉన్నాయి. బ్యాంకింగ్ ఇండెక్స్‌లో ప్రభుత్వ బ్యాంకులా, ప్రైవేటు బ్యాంకులా అనేది ఎలా చూడాలి. కచ్చితంగా పీఎస్‌యూ బ్యాంకులే పటిష్టంగా ఉన్నాయి. అలాగే హెచ్డీఎఫ్సీభారీగా నష్టపోయినప్పటికీ కనిష్టాల వద్ద కొనుగోళ్లు చోటు చేసుకునే అవకాశం ఉంది. రికమెండెడ్ స్టాక్స్: టీవీఎస్ మోటార్స్, టీసీఎస్ కొనుగోలు చేయవచ్చుని రాజా వెంకటరామన్ సూచిస్తున్నారు. (Disclaimer:మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప..వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం
Australia tour of India, 2023- India vs Australia, 1st ODI: భారత్ ఘన విజయం మొదటి వన్డేలో ఆస్ట్రేలియాపై టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 277 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. కేఎల్ రాహుల్ 58 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. లక్ష్యం దిశగా భారత్ టీమిండియా లక్ష్యం దిశగా సాగుతుంది. 45 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 253/4గా ఉంది. మరో 24 పరుగులు చేస్తే టీమిండియా విజయం సాధిస్తుంది. కేఎల్ రాహుల్ (44), సూర్యకుమార్ యాదవ్ (40) క్రీజ్‌లో ఉన్నారు. లక్ష్యానికి 54 పరుగుల దూరంలో ఉన్న భారత్ 40 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 223/4గా ఉంది. భారత్ లక్ష్యానికి మరో 54 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ (25), కేఎల్ రాహుల్ (29) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. ఇషాన్ ఔట్ 185 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. పాట్ కమిన్స్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్ (18) ఔటయ్యాడు. భారత్ లక్ష్యానికి ఇంకా 92 పరుగుల దూరంలో ఉంది. మరో 17.3 ఓవర్లు మిగిలి ఉన్నాయి. రాహుల్ (16), సూర్యకుమార్ యాదవ్ క్రీజ్‌లో ఉన్నారు. 25.3: మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా ఆడం జంపా బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్ బౌల్డ్(74). స్కోరు: 155/3 (25.5). రాహుల్, ఇషాన్ కిషన్ క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన భారత్.. శ్రేయస్ రనౌట్ 148 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. అనవసర పరుగుకు ప్రయత్నించి శ్రేయస్ అయ్యర్ (3) రనౌటయ్యాడు. 23.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 148/2గా ఉంది. గిల్ (72), రాహుల్ క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన భారత్ 142 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఆడమ్ జంపా బౌలింగ్‌లో రుతురాజ్ (71) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 23 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 147/1. గిల్ (71), శ్రేయస్ అయ్యర్ (3) క్రీజ్‌లో ఉన్నారు. కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రుతురాజ్ టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వన్డే కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 60 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో రుతు ఈ మైలురాయిని చేరుకున్నాడు. 17.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 112/0. గిల్ (59), రుతురాజ్ (51) క్రీజ్‌లో ఉన్నారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్ మాథ్యూ షార్ట్ బౌలింగ్‌లో వరుసగా బౌండరీ, సిక్సర్ కొట్టి శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో గిల్ ఈ మార్కును చేరుకున్నాడు. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 95/0. గిల్ (53), రుతురాజ్ (40) క్రీజ్‌లో ఉన్నారు. 8 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 43/0 277 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ ఆచితూచి ఆడుతుంది. 8 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 43/0గా ఉంది. రుతురాజ్ గైక్వాడ్ (17), శుభ్‌మన్ గిల్ (25) క్రీజ్‌లో ఉన్నారు. ఐదేసిన షమీ.. ఆసీస్ 276 ఆలౌట్ టీమిండియా ఏస్ పేసర్ మహ్మద్ షమీ (5/51) ఐదు వికెట్లతో రెచ్చిపోవడంతో తొలి వన్డేలో ఆసీస్ 276 పరుగులకు ఆలౌటైంది. షమీకి ఇవి కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ (4), వార్నర్ (52), స్టీవ్ స్మిత్ (41), మార్నస్ లబూషేన్ (39), కెమరూన్ గ్రీన్ (31), ఇంగ్లిస్ (45), స్టోయినిస్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఖర్లో కమిన్స్ (21 నాటౌట్) వేగంగా పరుగులు రాబట్టాడు. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్, జడేజాలకు తలో వికెట్ దక్కాయి. ఐదేసిన షమీ ఈ మ్యాచ్‌లో షమీ ఐదు వికెట్లు పడగొట్టాడు. సీన్ అబాట్ (0) క్లీన్ బౌల్డయ్యాడు. షమీకి నాలుగో వికెట్ ఈ మ్యాచ్‌లో షమీ నాలుగో వికెట్ తీసుకున్నాడు. షమీ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టడంతో షార్ట్ (2) పెవిలియన్‌కు చేరాడు. 48.2 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 254/8. ఆసీస్ ఏడో వికెట్ డౌన్ 250 పరుగుల వద్ద ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ఇంగ్లిస్ (45) ఔటయ్యాడు. షార్ట్ (1), కమిన్స్ క్రీజ్‌లో ఉన్నారు. మరో వికెట్ తీసిన షమీ.. డేంజరెస్ స్టోయినిస్ క్లీన్ బౌల్డ్ షమీ ఈ మ్యాచ్‌లో తన మూడో వికెట్‌ను పడగొట్టాడు. స్టోయినిస్‌ను (29) షమీ క్లీన్‌బౌల్డ్ చేశాడు. 46.4 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 248/6. ఇంగ్లిస్ (44), షార్ట్ క్రీజ్‌లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్.. గ్రీన్ రనౌట్ 186 పరుగుల వద్ద ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. గ్రీన్ (31) రనౌటయ్యాడు. బుమ్రా,సూర్యకుమార్ యాదవ్‌లు కలిసి గ్రీన్‌ను ఔట్ చేశారు. 40 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 187/5. ఇంగ్లిస్ (14), స్టోయినిస్ క్రీజ్‌లో ఉన్నారు. వర్షం ముప్పు.. ఆటకు విరామం వర్షం కురిసే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. పిచ్‌ను కవర్లతో కప్పేశారు. ఆకాశం మేఘావృతం కావడంతో అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్.. అశ్విన్‌కు వికెట్ 157 పరుగుల వద్ద ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ అద్భుతమైన స్టంపింగ్ చేసి లబూషేన్ (39)ను ఔట్ చేశాడు. 32.4 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 157/4. గ్రీన్ (15), ఇంగ్లిస్ క్రీజ్‌లో ఉన్నారు. Mitchell Marsh ✅ Steven Smith ✅ Mohammed Shami is on fire against the Aussies! 🔥#INDvsAUS #CricketTwitter #SteveSmith pic.twitter.com/bsw6hwJuCe — OneCricket (@OneCricketApp) September 22, 2023 స్టీవ్ స్మిత్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన షమీ మహ్మద్ షమీ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ (60 బంతుల్లో 41; 3 ఫోర్లు, సిక్స్) క్లీన్ బౌల్డయ్యాడు. 22 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 114/3. లబూషేన్ (11), కెమరూన్ గ్రీన్ (1) క్రీజ్‌లో ఉన్నారు. 🫣🫣🫣 pic.twitter.com/mW4EH4c7O3 — Sitaraman (@Sitaraman112971) September 22, 2023 రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్.. వార్నర్ (52) ఔట్ 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వార్నర్ ఔటయ్యాడు. జడేజా బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి వార్నర్ పెవిలియన్‌కు చేరాడు. వార్నర్ 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. 20 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 107/2. స్టీవ్ స్మిత్ (39), లబూషేన్ (7) క్రీజ్‌లో ఉన్నారు. 15 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ ఎంతంటే..? 15 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా స్కోర్ 78/1గా ఉంది. వార్నర్ (48), స్టీవ్ స్మిత్ (21) క్రీజ్‌లో ఉన్నారు. వార్నర్ ధాటిగా ఆడుతున్నాడు. 10 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా స్కోరు 42/1 10 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా స్కోర్ 42/1గా ఉంది. డేవిడ్ వార్నర్ (17), స్టీవ్ స్మిత్ (17) క్రీజ్‌లో ఉన్నారు. The sensational Shami for India! pic.twitter.com/2TzPgB7UjW — Mufaddal Vohra (@mufaddal_vohra) September 22, 2023 తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ 0.4: మిచెల్ మార్ష్ రూపంలో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి మార్ష్(4) అవుటయ్యాడు. స్మిత్, వార్నర్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 4-1 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్ 22) జరుగుతున్న తొలి వన్డేలో ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. టీమిండియా టాస్ గెలిచి ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టీమిండియా: శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, లోకేష్ రాహుల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, మార్నస్ లబుషేన్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్‌కీపర్), మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ ఆంథోనీ అబాట్, ఆడమ్ జంపా. -
నోరుజారిన డాక్టర్‌బాబు.. రెచ్చిపోయి ఛాలెంజ్ చేసిన శోభా
'బిగ్‌బాస్ 7'.. గత రెండు వారాలతో పోలిస్తే రోజురోజుకీ వెరైటీగా మారుతోంది. ఈ వారం నామినేషన్స్‌లో భాగంగా కాస్త హడావుడి జరిగినా.. తర్వాతి రోజుకే అది చల్లారిపోయింది. మరోవైపు మూడో పవరస్త్ర కోసం ముగ్గుర్ని సెలెక్ట్ చేసిన బిగ్‌బాస్.. హౌస్ మొత్తాన్ని ఆగమాగం చేసేశాడు. ఇందులో భాగంగా బుధవారం కూడా శోభాశెట్టి, ప్రిన్స్ యవర్ సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఇంతకీ హౌసులో 17వ రోజు ఏం జరిగిందనేది Day-17 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. ఒకే ప్లేటులో తిన్నారు మంగళవారం జరిగిన పవరస్త్ర టాస్కులో యవర్.. అనర్హుడని రతిక నామినేట్ చేసింది. తనతోనే ఉంటూ తననే వెన్నుపోటు పొడవడంపై తొలుత కాస్త ఇబ్బందిపడ్డ ప్రిన్స్.. తనని తాను సంభాళించుకున్నాడు. రతికతోనే మాట్లాడుతూ.. తనకు ఏం ప్రాబ్లమ్ లేదని ఆమెకే చెప్పుకొచ్చాడు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. రాత్రి ఒకే ప్లేటులో కలిసి భోజనం కూడా చేశారు. ఇది చూసి శుభశ్రీ, దామిని, గౌతమ్.. గుసగుసలాడుకున్నారు. (ఇదీ చదవండి: రతిక బండారం బయటపెట్టిన మాజీ బాయ్‌ఫ్రెండ్!) శివాజీ పవరస్త్ర గొడవ తన పవరస్త్ర దొంగిలించారని పిల్లాడిలా శివాజీ గిలగిలా కొట్టేసుకుంటూనే ఉన్నాడు. సందీప్‌తో మాట్లాడుతూ తేజపై అనుమానం వ్యక్తం చేశాడు. వాడిని నామినేషన్స్ నుంచి సేవ్ చేస్తే, ఇలా చేస్తాడా? వాడికి అసలు అర్హతే లేదని అంటూ రెచ్చిపోయాడు. మరోవైపు పవరస్త్ర కొట్టేసిన అమరదీప్.. శివాజీ, రతిక బెడ్స్ దగ్గర టిష్యూ పేపర్‌పై ఏఏ, ఏ ఏడీ అని రాసి హింట్స్ ఇచ్చేలా పెట్టాడు. కానీ వాళ్లు కనిపెట్టలేకపోయారు. యవర్ని ఆటాడేసుకున్నారు అయితే పవరస్త్ర పోటీలో ఉన్న ప్రిన్స్ యవర్.. కంటెండర్‌గా నిలబడాలంటే ఓ పోటీ తట్టుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. ఇందులో భాగంగా ఓ బల్లపై గడ్డం పెట్టాలి. అతడిని నామినేట్ చేసిన తేజ, దామిని, రతిక డిస్ట్రబ్ చేస్తారు. కదలకుండా గంటసేపు నిలబడాలని రూల్ పెట్టాడు. దీన్ని పాటించిన యవర్.. కదలకుండా అలానే నిలబడ్డాడు. అయితే దామిని,రతిక, తేజ మాత్రం.. పేడ, గడ్డి, శాంపూ నీళ్లు, ఐస్ గడ్డలతో ఆటాడేసుకున్నారు. కానీ యవర్ ఇందులో గెలిచి నిలబడ్డాడు. (ఇదీ చదవండి: హీరోయిన్ సాయిపల్లవి పెళ్లి రూమర్స్.. అసలేం జరిగింది?) శోభాశెట్టి vs గౌతమ్ ఇక యవర్ టాస్క్ అయిపోయిన తర్వాత శోభాశెట్టిని నామినేట్ చేసిన వాళ్ల వీడియోలు చూపించారు. ప్రశాంత్, శుభశ్రీ వరకు పెద్దగా పట్టించుకుని ఈమె.. గౌతమ్ తో మాత్రం పెద్ద గొడవ పెట్టుకుంది. ఫిజికల్‌గా స్ట్రాంగ్ అని కారణం చెప్పడంపై శోభా మండిపడింది. తను శారీరకంగా బలంగా లేకపోతే.. పుల్ రాజా పుల్ టాస్కులో ఎలా గెలుస్తాను, కుస్తీ పోటీల్లో ఎలా గెలుస్తాను అంటూ గొడవ పెట్టుకుంది. దీంతో గౌతమ్.. తను అనుకున్న కారణాలు చెబుతూ షర్ట్ విప్పేశాడు. అయితే అతడు షర్ట్ తీసి షో హాఫ్ చేస్తున్నాడని శోభాశెట్టి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో గౌతమ్ మరింత రెచ్చిపోయాడు. అవసరమైతే ప్యాంట్ కూడా తీసేస్తానని అన్నాడు. అలా మాటామాట పెరిగిన ఒకానొక టైంలో.. 'అసలు నీకు హౌసులో ఉండటానికి అర్హతే లేదు' అని గౌతమ్ నోరుజారాడు. దెబ్బకు శోభాశెట్టి కౌంటర్ ఇచ్చింది. 'హౌసులో నీకంటే ఎక్కువ రోజులు ఉండి చూపిస్తా' అని ఛాలెంజ్ చేసింది. అయితే ఈ గొడవంతా చూస్తుంటే.. కార్తీకదీపం మోనిత శోభాశెట్టిని పూనిందేమో అని ప్రేక్షకులకు డౌట్ వచ్చింది. మరోవైపు అమరదీప్‌ని ప్రియాంక నామినేట్ చేసిన వీడియోని కూడా ప్లే చేశారు. అలా బుధవారం ఎపిసోడ్‌కి ఎండ్ కార్డ్ పడింది. (ఇదీ చదవండి: ఓటీటీకి వచ్చేస్తున్న మెగాహీరో సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే) -
రతిక వెన్నుపోటు.. గిలగిలా కొట్టేసుకున్న ప్రిన్స్ యవర్
'బిగ్‌బాస్'లో మూడోవారం నామినేషన్స్ పర్వం ముగిసింది. హౌస్మేట్స్ దాన్నుంచి బయటకొచ్చేశారు. అంతా ఓకే అనుకునేలోపు.. బిగ్‌బాస్ మరో ఫిట్టింగ్ పెట్టేశాడు. దీంతో హౌస్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇక రతిక వల్ల ప్రశాంత్, యవర్ మెంటలెక్కిపోయారు. ఇంతకీ బిగ్‌బాస్ హౌసులో మంగళవారం ఏం జరిగిందనేది Day-16 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: హీరోయిన్ త్రిషకు పెళ్లి? ఆ నిర్మాతతో ఏడడుగులు!) మాజీ బాయ్‌ఫ్రెండ్ టాపిక్ ఇక సోమవారం నామినేషన్స్ పూర్తయిన దగ్గర మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. తేజని సేవ్ చేసి, అమరదీప్‌ని ఎందుకు నామినేట్ చేయాల్సి వచ్చిందనేది సందీప్, శోభాశెట్టితో చెప్పుకొచ్చాడు. గతవారం ప్రశాంత్‌కి ఎక్కువ ఓట్లు పడ్డాయని, అందుకే ఈసారి అమర్‌ని అయితే తట్టుకోగలడని, కచ్చితంగా సేవ్ అవుతాడని అన్నాడు. మరోవైపు తన మాజీ బాయ్‌ఫ్రెండ్ గురించి పరోక్షంగా మాట్లాడుతున్నారని, దీంతో తన మైండ్ ఆఫ్ అయిపోయిందని రతిక, శివాజీతో మాట్లాడుతూ బాధపడింది. బాధపడిన ప్రశాంత్ ఇక హౌసులో ఉన్న అందరూ కలిసి వినాయక చవితి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. పిండితో ముద్దలా చేసి, దానితో గణేశుడి ప్రతిమ చేసుకుని పూజా చేసుకుని, ప్రసాదం తిన్నారు. ఇక అసలు విషయంలోకి వచ్చేసిన బిగ్‌బాస్.. మూడో పవరస్త్ర కోసం తాను ముగ్గుర్ని సెలెక్ట్ చేశానని అమర్దీప్, శోభాశెట్టి, ప్రిన్స్ యవర్ పేర్లు చెప్పాడు. దీంతో మిగతా వాళ్లలో అసంతృప్తి మొదలైంది. అయితే ఏదో భూమి బద్దలైనట్లు ప్రశాంత్ తెగ బాధపడిపోయాడు. 'ఓడిపోయా.. నేను ఓడిపోయా' అని తనలో తానే అనుకున్నాడు. (ఇదీ చదవండి: హిట్ ఇచ్చిన డైరెక్టర్‌నే అవమానించిన రజనీకాంత్!) ఫిట్టింగ్ పెట్టిన బిగ్‌బాస్ బాధపడుతున్న ప్రశాంత్‌ని కన్ఫెషన్ రూంకి పిలిచిన బిగ్‌బాస్.. పవరస్త్ర కోసం తాను ఎంపిక చేసిన ముగ్గురిలో అనర్హులు అనిపించిన వారి పేరు చెప్పమన్నాడు. సందీప్, శివాజీతో పాటు సెలెక్ట్ అయిన ముగ్గుర్ని కాకుండా అందరినీ పిలిచి అనర్హులు అనిపించిన వారి పేరు, అభిప్రాయాలు చెప్పమన్నాడు. అలా అసలు సిసలైన ఫిట్టింగ్ పెట్టేశాడు. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? ప్రశాంత్ - శోభాశెట్టి ప్రియాంక - అమర్దీప్ శుభశ్రీ - శోభాశెట్టి తేజ - యవర్ దామిని - యవర్ గౌతమ్ - శోభాశెట్టి రతిక - యవర్ (ఇదీ చదవండి: అవినీతి బాబును వెనకేసుకొస్తోన్న 'టాలీవుడ్' పెద్దలు) శివాజీ పవరస్త్ర చోరీ ఓవైపు ఈ గేమ్ జరుగుతుండగానే శివాజీ గెలుచుకున్న పవరస్త్రని అమరదీప్ దొంగతనం చేశాడు. అతడు సైలెంట్‌గా ఏం తెలియనట్లు ఉండిపోయాడు. మరోవైపు ప్రశాంత్ తీశాడమేనని అతడితో రతిక గొడవ పెట్టుకుంది. ఏదో సరదా కోసం అనుకున్న గొడవ కాస్త.. అరిచి గోల గోల చేసుకునేలా మారిపోయింది. ప్రశాంత్, రతికని టచ్ చేస్తూ మాట్లాడటం కాస్త వింతగా అనిపించింది. రతిక వెన్నుపోటు ఎవరు అనర్హులో ఏడుగురు కంటెస్టెంట్స్ చెప్పిన వీడియోస్‌ని టీవీలో ప్లే చేసిన బిగ్‌బాస్.. బాంబు పేల్చాడు. తొలుత యవర్ పేరు చెప్పిన వాళ్ల వీడియోలు ప్లే చేశారు. ఈ క్రమంలోనే అతడు తేజతో గార్డెన్ ఏరియాలో గొడవపెట్టుకున్నాడు. అక్కడితో ఈ తతంగం అయిపోలేదు. తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయిన యవర్.. స్మోక్ రూంలోని బెంచ్‌పై ఉన్న గ్లాసుని పదేపదే కొడుతూ.. అందరినీ భయపెట్టాడు. మిగతా వాళ్ల సంగతేమో కానీ రతిక తనకు ఈ రేంజులో వెన్నుపోటు పొడుస్తుందని ఊహించని యవర్.. ఇదే విషయాన్ని ఆమెతో చెబుతూ తెగ బాధపడ్డాడు. అలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది. (ఇదీ చదవండి: ఆ సీన్ చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా: సదా) -
ప్రధాని మోదీ కీలక ప్రసంగంలో పలు అంశాల ప్రస్తావన
-
నామినేషన్స్‌లో యవర్ అతి.. ప్రశాంత్ సిల్లీ రీజన్స్!
'బిగ్‌బాస్' మూడో వారంలోకి అడుగుపెట్టేశాడు. షకీలా ఎలిమినేట్ అయి, బయటకెళ్లిపోవడంతో కాస్త ఎమోషనల్ అయిన ఇంటి సభ్యులు.. నామినేషన్స్ వచ్చేసరికి మళ్లీ ఎనర్జీతో కనిపించారు. ఒకరిపై ఒకరు అరుస్తూ, బాగానే హడావుడి చేశారు. ఈ వారం కూడా ఏడుగురు నామినేషన్స్‌లో నిలవగా, చివరలో 'బిగ్‌బాస్' చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. అయితే 14వ రోజు ఏం జరిగిందనేది ఇప్పుడు హైలైట్స్‌లో చూద్దాం. సుత్తిలేకుండా మొదలయ్యాయి షకీలా ఎలిమినేట్ అయి, హౌస్ నుంచి బయటకెళ్లిపోవడంతో ఆదివారం ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. అక్కడి నుంచే సోమవారం ఎపిసోడ్ షురూ అయింది. బెడ్ రూంలో దామిని, ప్రియాంక.. ప్రిన్స్ యవర్ గురించి మాట్లాడుకున్నారు. అతడి ప్రవర్తన నచ్చలేదని అన్నారు. నిద్రపోయే లేచేసరికి సోమవారం వచ్చేసింది. నేరుగా సుత్తిలేకుండా నామినేషన్స్ ప్రారంభమైపోయాయి. హుసులో అనర్హుడు అనిపిస్తున్న ఇద్దరినీ నామినేట్ చేయమని బిగ్‌బాస్ చెప్పాడు. (ఇదీ చదవండి: తెలుగు యంగ్ హీరో తల్లిపై పోలీస్ కేసు.. ఏం జరిగింది?) ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? ప్రియాంక - యవర్, గౌతమ్ ప్రశాంత్ - తేజ, దామిని శోభాశెట్టి - శుభశ్రీ, రతిక అమర్దీప్ - గౌతమ్, శుభశ్రీ రతిక - శుభశ్రీ, గౌతమ్ తేజ - ప్రశాంత్, గౌతమ్ యవర్ - ప్రియాంక, దామిని దామిని - యవర్, శుభశ్రీ గౌతమ్ - రతిక, అమర్దీప్ శుభశ్రీ - తేజ, ప్రియాంక నామినేషన్స్‌లో ఏం జరిగింది? తొలుత వచ్చిన ప్రియాంక.. యవర్, గౌతమ్‌ని నామినేట్ చేసింది. అయితే గౌతమ్ పెద్దగా వ్యతిరేకించనప్పటికీ, ప్రిన్స్ యవర్ మాత్రం చాలా హడావుడి చేశాడు. ఇక ప్రశాంత్.. తేజని నామినేట్ చేస్తూ సరైన కారణం చెప్పలేకపోయాడు. మధ్యలో కల్పించుకున్న బిగ్‌బాస్.. సిల్లీ రీజన్స్ వద్దని మొట్టికాయలు వేశాడు. అయినా వల్ల కాకపోయేసరికి వదిలేశాడు. దామిని కూడా నామినేట్ చేసిన ప్రశాంత్.. వంట విషయంలో తనకు పదే పదే చెప్పడం నచ్చలేదని అన్నాడు. శోభాశెట్టి.. శుభశ్రీ నామినేషన్స్ లోకి రాకుండా సేఫ్ గేమ్ ఆడుతుందని చెప్పింది. రతికకి మొండితనం, స్వార్థం ఎక్కువని కారణాలు చెప్పింది. (ఇదీ చదవండి: పెళ్లికి ముందే అత్తారింట్లో మెగా కోడలు సందడి) అతి చేసిన యవర్! అమర్దీప్, రతిక, యవర్.. తమ తమ నామినేషన్స్‌ని పెద్దగా హడావుడి లేకుండా ముగించేశారు. అయితే దామిని.. తనని నామినేట్ చేసేసరికి ప్రిన్స్ యవర్ తట్టుకోలేకపోయాడు. అలానే ఆమె చెప్పేది అతడికి సరిగా అర్థం కాకపోవడం వల్ల వేరేది అనుకుని అటుఇటూ తిరుగుతూ కాస్త అతి చేశాడనిపించింది. ఇక శుభశ్రీ అయితే దామిని తనని టార్గెట్ చేస్తుందని ఈ విషయాన్ని ఆమెతోనే చెప్పింది చివర్లో ట్విస్ట్ మిగిలిన వాళ్లలో గౌతమ్, శుభశ్రీ కూడా తమ తమ నామినేషన్స్‌ని సింపుల్‌గానే ముగించేశారు. దీంతో ఈ వారం నామినేషన్స్‌లో తొలుత శుభశ్రీ, గౌతమ్, తేజ, ప్రియాంక, దామిని, రతిక, యవర్ నిలిచారు. అయితే చివర్లో ఎంట్రీ ఇచ్చిన బిగ్‌బాస్.. పవరస్త్ర గెల్చుకున్న శివాజీ, సందీప్‌లకు ఓ టాస్క్ ఇచ్చాడు. లిస్టులో ఒకరిని సేవ్ చేసి, సేఫ్ గా ఉన్నవాళ్లని నామినేట్ చేయాలని అన్నారు. దీంతో ఇద్దరూ అనుకుని తేజని సేవ్ చేసి, అతడి ప్లేసులో అమర్దీప్ నామినేట్ చేశారు. అలా ఏడుగురు నామినేషన్స్‌లో నిలవడంతో సోమవారం ఎపిసోడ్ పూర్తయింది. మిగతారోజుల సంగతెలా ఉన్నా.. సోమవారం మాత్రం టాప్ లేచిపోతూ ఉంటుంది. ఈసారి అలాంటిదేం లేకుండా, చాలా ప్లెయిన్‌గా అనిపించింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్) -
కంట్రోల్ తప్పిన యవర్.. అపరిచితుడులా బిహేవ్ చేశాడు!
'మాయ అస్త్ర' గెలుచుకున్న రణధీర టీమ్‌లో ఎవరు దాన్ని ఉంచేందుకు అనర్హులో చెప్పే టాస్క్ మధ్యలోనే గురువారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచి శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది. అయితే ఇందులో భాగంగా ప్రిన్స్ యవర్.. గౌతమ్, సందీప్‌తో పెద్ద గొడవలు పెట్టుకున్నాడు. అలానే రెండో 'పవర్ అస్త్ర' కోసం ఆ ముగ్గురి మధ్య 'బిగ్‌బాస్' ఓ పోటీ పెట్టారు. ఇంతకీ అదేంటి? 12వ రోజు హైలైట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. యవర్ vs గౌతమ్ టాస్కులో భాగంగా ప్రిన్స్ దగ్గరున్న భాగాన్ని తీసుకుని.. 'మహబలి' టీమ్ దాన్ని శివాజీ చేతిలో పెట్టారు. దీనికి ప్రిన్స్ ఒప్పుకోలేదు. తన పార్ట్‌ని అస్సలు ఇచ్చేదే లేదని నానా రాద్ధాంతం చేశాడు. ఒకానొక దశలో బరస్ట్ అయిపోయిన యవర్.. తనకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదని, ఇది చాలా బ్యాడ్ గేమ్ అన్నాడు. 'ఇచ్చేయ్ ఇచ్చేయ్' అని తన భాగాన్ని విసిరేసి.. గౌతమ్ వైపు చూస్తూ అరిచాడు. గేటు తెరవండి, ఇంటికెళ్లిపోతా అని చిన్నపిల్లాడిలా గుక్కపట్టి ఏడ్చాడు. (ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి ఫైమా.. అమ్మని పట్టుకుని ఏడ్చేసింది!) ప్లేట్ మార్చిన రతిక మహబలి టీమ్ లో అందరూ అనుకుని.. శివాజీ, షకీలాకు మాయ అస్త్ర భాగాల్ని ఇచ్చారని అందరూ అనుకున్నారు. కానీ అదే గ్రూపులో ఉన్న రతిక.. ఒక్కసారిగా గట్టిగట్టిగా అరుస్తూ ప్లేట్ తిప్పేసింది. తాను శివాజీ, ప్రిన్స్ అని చెబితే.. తన మాట అస్సలు వినలేదని సొంత టీమ్‌పైనే చాడీలు చెప్పింది. ఆడితే జెన్యూన్‌గా ఆడండని అరిచి గోల చేసింది. రతిక అలా అనేసరికి ప్రశాంత్, గౌతమ్ ఆమెపై రెచ్చిపోయారు. ఇప్పుడు చెబితే ఎలా అని గొడవపడ్డారు. కాసేపు అయితే ఆమెని కొట్టేవాళ్లేమో అన్నంతలా ఊగిపోయారు. ఇకపోతే రతిక, వాళ్ల టీమ్ వాళ్లతో గొడవపడుతుంటే మధ్య ప్రిన్స్ ఎంట్రీ ఇచ్చాడు. గౌతమ్ ముఖం వరకు వచ్చి గట్టిగా అరుస్తూ నానా రచ్చ చేశాడు. ఇంగ్లీష్, హిందీలో మాటాడుతూ హౌస్ రూల్స్ మళ్లీ బ్రేక్ చేశాడు. బాడీ చుడూ అని ప్రిన్స్ అంటే.. ఏంటి అవి ఇంజెక్షన్స్‌తో తెచ్చుకున్నవే కదా అని గౌతమ్ సైగ చేశాడు. దీంతో యవర్ ఒళ్లు మండింది. పర్సనల్‌కి వెళ్లొద్దు అని ప్రిన్స్ కోపం కట్టలు తెచుకుంది. కానీ గౌతమ్ తగ్గితేగా! గౌతమ్ ఎంత కంట్రోల్ చేసుకున్నా.. పదే పదే మీదకొస్తూ యవర్ అల్లరల్లరి చేశాడు. బిగ్‌బాస్‌కే వార్నింగ్ హౌసులో రాజకీయాలు ఎక్కువైపోయాయని రతిక.. గట్టిగా అరుస్తూ చెప్పింది. అలానే ఇక్కడందరూ ఫేక్ మనుషులు అని, వాళ్లతో ఉండలేనని యవర్ చెప్పాడు. తన పార్ట్ లాగేసుకున్నారని, ఏకంగా సందీప్‌తోనూ గొడవపడ్డాడు. తనకు ఆన్సర్ కావాలని, లేకపోతే అప్పటివరకు మైక్ వేసుకోనని బిగ్‌బాస్‌కే వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడాడు. (ఇదీ చదవండి: 'ఛాంగురే బంగారు రాజా' సినిమా రివ్యూ) యవర్ కూల్ అయ్యాడు అర్థరాత్రి కన్ఫెషన్ రూంలోకి పిలిచి ఏమైందని యవర్ని బిగ్‌బాస్ అడిగాడు.. దీంతో జరిగినదంతా చెప్పేశాడు. ఈ క్రమంలోనే.. మిమ్మల్ని బిగ్ బాస్ చూస్తున్నారు. బయట ప్రేక్షకులూ చూస్తున్నారు అని చెప్పుకొచ్చాడు. గౌతమ్ నుంచి సారీ కావాలని యవర్ అడగ్గా.. అలాంటిదే ఉండదు అని డైరెక్ట్‌గా చెప్పకుండా, మీరు ఇక్కడికి గెలవడానికి వచ్చారు, మీరు ఇక బయటకెళ్లొచ్చు అని బిగ్‌బాస్, యవర్ని కూల్ చేశాడు. ట్విస్ట్ ఇచ్చిన పెద్దన్న అయితే గొడవ జరుగుతున్న టైంలో మాట వదిలావ్ అని రతికకి షకీలా గీతోపదేశం చేసింది. ఏదైతేనేం చివరకు సారీ చెప్పిన రతిక.. షకీలా కాళ్లకు దండం పెట్టింది. మరోవైపు రెండో పవర్ అస్త్ర కోసం మరో పోటీదారుడ్ని ఎంచుకునే ఛాన్స్ ఇస్తున్నారు అని సందీప్‌తో బిగ్‌బాస్ చెప్పారు. దీంతో చాలాసేపు ఆలోచింది అతడు అమరదీప్ పేరు చెప్పాడు. అయితే పోటీకి ఇద్దరే ఫిక్స్ అయిన తర్వాత మరో వ్యక్తిని ఎంటర్ చేయడేం ఏంటని శివాజీ, షకీలాతో వాదన పెట్టుకున్నాడు. నలుగురు కలిసి ఆడుతున్నారని క్లియర్‌గా తెలిసిపోతుందని(నలుగురు అంటే శోభాశెట్టి, ప్రియాంక, అమరదీప్తో సందీప్ కుమ్మక్కయ్యాడు) శివాజీ తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. తలుపు తీయరా సామీ నేను వెళ్లిపోతా.. నాకొద్దు ఈ గోల అని బిగ్ బాస్ తో అన్నాడు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 30 సినిమాలు) రతికతో యవర్ లవ్? అయితే బిగ్‌బాస్ తీరు తనకు నచ్చట్లేదని, ప్లీజ్ నన్ను ఎలిమినేట్ చేసేయండి అని శివాజీ వేడుకున్నాడు. మరోవైపు రతికని లవ్ చేస్తున్నావా అని ప్రశాంత్ యవర్ని అడిగితే.. కొంచెం ఫీలింగ్స్ ఉన్నాయని అన్నాడు. కొన్నిరోజులు ఆగు నీకే తెలుస్తుందని ప్రశాంత్.. తనకు తొలివారం జరిగిన అనుభవం దృష్ట్యా యవర్పై సెటైర్ వేశాడు. లవ్ వద్దురా నాయనా అని అన్నాడు. అరిచే టాస్కులో రచ్చ రెండో పవర్ అస్త్ర కోసం.. గార్డెన్ ఏరియాలో ఉన్న ఓ చెవిలో గట్టిగా బిగ్ బాస్ అని మూడుసార్లు అరవాల్సి ఉంటుంది. ఎవరైతే పెద్దగా అరుస్తారో వాళ్లు గెలిచినట్లు. కాస్త గ్యాప్ ఇచ్చి, శివాజీ-అమరదీప్-షకీలా తలో మూడుసార్లు అరిచారు. ఈ గ్యాప్‌లో యవర్.. సందీప్‌తో గొడవపెట్టుకున్నాడు. చపాతీలు ఎవరూ చేయట్లేదని తనవైపు వేలు చూపిస్తున్నావ్ ఏంటని దగ్గరకెళ్లి గొడవపెట్టుకోవడానికి చూశాడు. సందీప్ చాలా ప్రశాంతంగా ఉండటంతో అక్కడికది ఎండ్ అయిపోయింది. ఇకపోతే రెండో పవర్ అస్త్రతోపాటు నాలుగు వారాల ఇమ్యూనిటీ గెలుచుకున్నది ఎవరో వీకెండ్లో నాగార్జున చెప్తారు, అప్పటివరకు వెయిట్ చేయండని బిగ్‌బాస్ చెప్పడంతో శుక్రవారం ఎపిసోడ్ పూర్తయింది. (ఇదీ చదవండి: 'జవాన్' కోసం దీపిక నో రెమ్యునరేషన్.. కారణం అదే?) -
Bigg Boss 7: అందరితోనూ శోభా గొడవలు.. అడ్డంగా దొరికిపోయిన తేజ!
'బిగ్‌బాస్ 7' మొదలైన రెండో రోజుకే గొడవలు షురూ అయ్యాయి. సోమవారం ఎపిసోడ్లో శివాజీ, ప్రియాంక మాత్రమే నామినేషన్స్ పూర్తి చేశారు. మంగళవారం మిగిలిన వాళ్లందరూ తమ తమ నామినేషన్స్ కంప్లీట్ చేశారు. ఈ క్రమంలోనే హౌస్ అంతా గొడవ గొడవగా మారింది. శోభాశెట్టి.. పలువురు కంటెస్టెంట్స్‌తో మాటామాటా అనుకుంది. టేస్టీ తేజ ఓ విషయమై అడ్డంగా దొరికిపోయాడు. ఇంతకీ రెండో రోజు ఏం జరిగిందనేది ఇప్పుడు Day 2 హైలైట్స్‌లో చూద్దాం. గౌతమ్ vs శోభాశెట్టి మంగళవారం ఎపిసోడ్లో భాగంగా తొలుత శోభాశెట్టిని బిగ్‌బాస్.. యాక్టివిటీ రూంలోకి పిలిచారు. గౌతమ్, కిరణ్ రాథోడ్‌ని ఆమె నామినేట్ చేసింది. తెలుగు సరిగా రాకపోవడం, మాట్లాడని కారణంగా కిరణ్‌ని నామినేట్ చేశానని చెప్పింది. కనెక్ట్ కాకపోవడం, బాండింగ్ ఏర్పడకపోవడం, పాజిటివ్ వైబ్స్ రాకపోవడంతో గౌతమ్‌ని నామినేట్ చేసినట్లు చెప్పింది. బయటకొచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడుతూ.. 'నువ్వు వినడానికే రెడీగా లేవు' అని గౌతమ్‌తో శోభాశెట్టి గొడవ పెట్టుకుంది. శోభా ఏడుపు ఆ తర్వాత దామిని.. రతికని నామినేట్ చేసింది. డల్‌గా ఉందని, కిచెన్‌లో హెల్ప్ చేయలేదని కారణం చెప్పింది. శోభాశెట్టిని నామినేట్ చేస్తూ.. డిన్నర్ తర్వాత ప్లేట్ కడగలేదని రీజన్ చెప్పింది. ఇకపోతే లాన్లో కూర్చుని టేస్టీ తేజ-శోభాశెట్టి మాట్లాడుకున్నారు. తాను సహాయం చేస్తున్న అందరూ తననే నామినేట్ చేస్తున్నారని శోభా వలవలా ఏడ్చేసింది. దొరికిపోయిన తేజ ఇక ప్రిన్స్.. షకీలా, గౌతమ్‌ని నామినేట్ చేశాడు. 'నువ్వు ప్రిన్సా, మీ ఫాదర్ కింగా' అని అన్నందకు షకీలాని నామినేట్ చేశానని అన్నాడు. 'షో హాఫ్' అని తనపై కామెంట్స్ చేసినందుకు గౌతమ్‌ని నామినేట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇది జరిగిన తర్వాత కంటెస్టెంట్స్ అందరిముందే తేజ ఏమన్నాడో గౌతమ్ కృష్ణ.. ప్రిన్స్‌తో చెప్పాడు. దీంతో తేజ అడ్డంగా దొరికిపోయినట్లు అయింది. దీనిపై మాట్లాడిన తేజ.. ఎవరేం చెప్పారో, ఎవరికేం చెప్పాలో అదే చెప్పానని తనని తాను సమర్థించుకున్నాడు. ఫైనల్‌గా తమ మధ్య మిస్ అండర్ స్టాండింగ్ వచ్చిందని ప్రిన్స్-గౌతమ్ హగ్ ఇచ్చుకున్నారు. కరెక్ట్ కాదని రతిక ఆట సందీప్.. రతికని నామినేట్ చేశాడు. కిచెన్‌లో కాస్త ఇర్రెస్పాన్సిబుల్గా ప్రవర్తించిందనే కారణం చెప్పాడు. పనిలో హెల్ప్ చేయట్లేదనే కారణంతో ప్రిన్స్‌ని నామినేట్ చేశాడు. అయితే ఇర్రెస్పాన్సిబుల్ అనే పదం తన గురించి ఉపయోగించడం కరెక్ట్ కాదని రతిక, సందీప్‌తో వాగ్వాదం పెట్టుకుంది. మరోవైపు దామిని తనని నామినేట్ చేయడంపై శోభాశెట్టి.. ప్రిన్స్‌తో చాలాసేపు మాట్లాడింది. ఆమె(దామిని) విధానం నచ్చలేదని అతడితో చెప్పుకొచ్చింది. చెత్త రీజన్ అని ప్రశాంత్ మరోవైపు షకీలా -ప్రిన్స్‌ని నామినేట్ చేసింది. తను సరదాగా 'మీ డాడీ కింగా?' అన్నానని, దానికి అతడు సీరియస్ అయినందుకు నామినేట్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. పల్లవి ప్రశాంత్ తనకు ఎక్కడో కనెక్ట్ కాలేదని నామినేట్ చేసింది. ఏదైనా పని చెబుతుంటే సరిగా పలకట్లేదని కారణం చెప్పుకొచ్చింది. షకీలా తనని ఓ చెత్త రీజన్‌కి నామినేట్ చేశారని తనలో తానే ప్రశాంత్ అనుకున్నాడు. ఇక గౌతమ్.. అందరిలో తక్కువ పని చేశారనే కారణంతో శోభాశెట్టి, ప్రిన్స్‌ని నామినేట్ చేశాడు. బయటకొచ్చిన తర్వాత మరోసారి గౌతమ్-శోభాశెట్టి మాటలతో కొట్లాడుకున్నారు. శోభాశెట్టి పశ్చాత్తాపం శుభశ్రీ.. రతిక, శోభాశెట్టిని నామినేట్ చేసింది. వాళ్లిద్దరికీ కనెక్ట్ కాలేకపోయానని, అలానే హౌసులో వాళ్లు పెద్దగా పనిచేయట్లేదని కారణాలు చెప్పుకొచ్చింది. గౌతమ్ చెప్పడం వల్లే శుభశ్రీ తనని నామినేట్ చేసిందని, ఇలాంటి మనుషులతో ఉండలేను బాబోయ్ అని శోభా తెగ పశ్చాత్తాప పడిపోయింది. ఇకపోతే పల్లవి ప్రశాంత్.. వీక్‌గా ఉన్నారని చెప్పి షకీలా, కిరణ్ రాథోడ్‌ని నామినేట్ చేశాడు. అమర్దీప్.. ప్రిన్స్, తేజని నామినేట్ చేశాడు. కిరణ్ రాథోడ్.. ప్రశాంత్, శోభాశెట్టిని నామినేట్ చేసింది. టేస్టీ తేజ.. ప్రశాంత్, కిరణ్‌ని నామినేట్ చేశాడు. మరోవైపు రతిక.. ప్రియాంక, దామినిని నామినేట్ చేసింది. అయితే ప్రియాంకని నామినేట్ చేస్తానని ముందే ఆమెకు రతిక చెప్పి వెళ్లింది. ఓవరాల్‌గా ఈ వారం ఎనిమిది మంది నామినేషన్స్‌లో నిలిచారు. నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే శోభా రతిక ప్రిన్స్ ప్రశాంత్ కిరణ్ గౌతమ్ షకీలా దామిని -
'బిగ్‌బాస్ 7'లో తొలిరోజే గొడవ? నామినేషన్లలో ఉన్నది వీళ్లే!
'బిగ్‌బాస్ 7' అసలు గేమ్ మొదలైంది. 14 మంది కంటెస్టెంట్స్‌ని ఆదివారం లోపలికి పంపించిన నాగార్జున.. హౌస్‌కి లాక్ వేసేశాడు. అలా ఆదివారం ఎపిసోడ్‌కి ఎండ్ పడింది. ఇకపోతే సోమవారం నామినేషన్స్ షురూ అయ్యాయి. హౌసులో ఫస్ట్ లవ్ ట్రాక్ కూడా మొదలైపోయింది. టేస్టీ తేజ అప్పుడే ఇద్దరి మధ్య పుల్ల పెట్టేశాడు. వీటితో పాటు తొలిరోజు ఇంకా ఏమేం జరిగాయనేది.. ఇప్పుడు Day-1 హైలైట్స్‌లో డీటైల్‌గా చూద్దాం. టాస్క్ ఇచ్చిన పొలిశెట్టి మూవీ ప్రమోషన్లో భాగంగా హౌసులోకి వెళ్లిన హీరో నవీన్ పొలిశెట్టిని సీక్రెట్ రూంలో పెట్టి బిగ్‌బాస్ లాక్ చేశాడు. హౌసులోని అమ్మాయిలందరూ కలిసి అతడిని బయటకు తీసుకొచ్చారు. అందరూ తమని తాము పరిచయం చేసుకున్నారు. అనంతరం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమాలోని 'లేడీ లక్' పాటని గుర్తు చేసిన నవీన్.. హౌసులో అబ్బాయిలు, అమ్మాయిల్లో నచ్చినవాళ్లకు బ్యాండ్ కట్టాలని టాస్క్ ఇచ్చాడు. బ్యాండ్ కట్టేశారు దీంతో ఆట సందీప్-ప్రియాంక జైన్‌కు, గౌతమ్ కృష్ణ- దామినికి, అమరదీప్ - శోభాశెట్టికి, పల్లవి ప్రశాంత్- రతికకి, శివాజీ-శుభశ్రీకి, ప్రిన్స్ యవర్ - కిరణ్ రాథోడ్‌కి, టేస్టీ తేజ- షకీలాకి బ్యాండ్ కట్టారు. ఆ తర్వాత లేడీ లక్ పాటకు అందరితో కలిసి డ్యాన్స్ చేసిన నవీన్.. హౌసు నుంచి బయటకొచ్చేశాడు. నాగ్ ఇచ్చిన సంకెళ్ల టాస్కులో భాగంగా గౌతమ్ కృష్ణ.. తన చేతికి ఉన్న హ్యాండ్ కఫ్ని శుభశ్రీకి వేశాడు. కాసేపటి తర్వాత అందరితో మాట్లాడిన బిగ్‌బాస్.. హౌసులో ఎన్నో కొత్త విషయాలు, ఆశ్చర్యపరిచేవి ఎన్నో రెడీగా ఉన్నాయని చెప్పారు. హౌసులో ఉన్నంత మాత్రాన హౌజ్‌మేట్స్ అయినట్లు కాదని క్లారిటీ ఇచ్చాడు. పులిహోర షురూ బిగ్ బాస్ అంటేనే పులిహోర కంపల్సరీ. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్, రతికకు బ్యాండ్ కట్టాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య మాటలు కలిశాయి. ఈ క్రమంలోనే అసలు బిగ్ బాస్ హౌసులోకి ఎందుకు రావాలనుకున్నావ్ అని ప్రశాంత్‌ని రతిక అడిగింది. 'ఫస్ట్ టైమ్ బిగ్‌బాస్ లోకి రావాలని అనిపించి ఓ వీడియో పెట్టాను. కానీ అందరూ తిట్టడంతో డిలీట్ చేశాను. అప్పుడే షోలోకి ఎలాగైనా రావాలని ఫిక్స్ అయ్యాను' అని ప్రశాంత్, రతికతో చెప్పాడు. శోభాశెట్టి ఏడుపు రాత్రి ఒంటి గంటకు లైట్ ఆపు చేయడంతో అందరూ నిద్రపోవడానికి రెడీ అయ్యారు. కానీ మంచిగా పడుకోవడానికి రెడీ అవుతున్న సందీప్, శివాజీ, పల్లవి ప్రశాంత్‌ని.. రతిక, టాస్క్ పేరు చెప్పి భయపెట్టింది. దీంతో వాళ్లు నిద్రపోలేదు. మిగిలిన వాళ్లందరికీ బెడ్స్ లేకపోవడంతో కిచెన్‌లో మాట్లాడుతూ టైమ్ పాస్ చేశారు. మరోవైపు శోభాశెట్టి ఏడుపు మొదలుపెట్టేసింది. 'వీక్ అవ్వకూడదు.. వీక్ అవ్వకూడదు బీ స్ట్రాంగ్' అని తనకు తానే చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది. రతిక టాస్క్ తిప్పలు సోమవారం ఉదయం 10:15 గంటలకు కంటెస్టెంట్స్ అందరూ నిద్రలేచారు. 'భోళా శంకర్'లోని జాం జాం జజ్జనక పాటకు స్టెప్పులేసి బిగ్ బాస్‌కి గుడ్ మార్నింగ్ చెప్పారు. ఆ తర్వాత శివాజీకి పెళ్లయిందా? లేదా? అనే టాపిక్ పైన డిస్కషన్ పెట్టారు. తనకు పెళ్లి కాలేదని, బ్యాచిలర్ అని శివాజీ చెప్పాడు. నాగార్జున ఇచ్చిన బ్రోకన్ హార్ట్ టాస్క్ పూర్తి చేసేందుకు రతిక తిప్పలు పడింది. అమరదీప్-ప్రియాంక మధ్య గొడవ పెట్టమని.. శోభాశెట్టికి చెప్పగా ఆమె నో చెప్పింది. గెలిస్తే పర్లేదు లేదంటే తను నామినేట్ అయిపోతాను కదా అని భయపడింది. ఈ టాస్క్ వల్ల నీకు అడ్వాంటేజ్ దక్కుతుంది కదా అని రతికతో శోభాశెట్టి డిస్కషన్ పెట్టింది. రతికతో పల్లవి ప్రశాంత్ టాస్క్ పూర్తి చేసేందుకు రతిక.. పల్లవి ప్రశాంత్ దగ్గరకు వెళ్లింది. దీంతో 'నీకోసం ఏ రిస్క్ అయినా సరే చేస్తా' అని మనోడు రతికతో అన్నాడు. ఆమె అలా నవ్వుతూ ఉండిపోయింది. మరోవైపు టేస్టీ తేజ-షకీలా మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. అసలు వ్యాంప్ తరహా సినిమాలు ఎందుకు చేశారు? అని షకీలాని టేస్టీ తేజ అడగ్గా.. అలాంటి క్యారెక్టర్స్ వచ్చాయని, అవే ఒప్పుకున్నానని షకీలా సమాధానమిచ్చింది. ఈ క్రమంలోనే షకీలా, కిరణ్ రాథోడ్.. ఇద్దరికీ(వేర్వేరుగా) పెళ్లి కాలేదనే విషయం బయటపడింది. గొడవకి తేజ రెడీ టాస్క్ చేయమని.. రతిక టేస్టీ తేజని కూడా బతిమాలాడింది. కానీ అతడు కనీసం పేర్లు కూడా చెప్పొద్దని ఆమెతో అన్నాడు. ఫైనల్‌గా ఒప్పుకున్నాడు. మరోవైపు బ్రోకన్ హార్ట్ ఫస్ట్ తీసుకుంది శోభాశెట్టి. దీంతో ఇది తీసుకున్నందుకు తను కచ్చితంగా నామినేషన్స్‌లో ఉంటానని భయపడిపోయింది. పుల్లపెట్టిన టేస్టీ తేజ టేస్టీ తేజ.. ప్రిన్స్ యవర్-గౌతమ్ కృష్ణ మధ్య పుల్ల పెట్టేశాడు. ఉదయం జిమ్ చేసే సమయంలో ఒకరిని ఒకరు ఇమిటేట్ చేసుకోవడం గురించి ప్రిన్స్ చెప్పింది గౌతమ్ దగ్గరికి వెళ్లి చెప్పాడు. కానీ గౌతమ్ మాత్రం ప్రిన్స్‌తో మాట్లాడటానికి నో చెప్పాడు. ఈ క్రమంలోనే ఎవరివైపు నిలబడతావ్ అని గౌతమ్, శుభశ్రీని అడిగాడు. ఆమె.. నీవైపే అని గౌతమ్‌తో చెప్పుకొచ్చింది. నామినేషన్స్ షురూ సోమవారం సాయంత్రం 6 గంటలకు తొలివారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. యాక్టివిటీ ఏరియాని నరకంలా డిజైన్ చేశారు. బిగ్ బాస్ కూడా వాయిస్ మార్చి మాట్లాడాడు. యాక్టివిటీ ఏరియాకి వెళ్లి.. అక్కడ వేలాడదీసిన ఫొటొల్లో ఎవరిదైతే చింపి, నరకపు వోల్కనోలో వేస్తారో వాళ్లు నామినేట్ అయినట్లు. మొదటగా వెళ్లిన శివాజీ.. దామిని, గౌతమ్ కృష్ణని నామినేట్ చేశాడు. అయితే అతడు చెప్పిన కారణాలు బిగ్‌బాస్‌కి నచ్చలేదు. అది అయిపోయిన తర్వాత శివాజీ.. దామిని, గౌతమ్ కృష్ణతో మాట్లాడాడు. తర్వాత యాక్టివిటీ రూంలోకి వెళ్లిన ప్రియాంక జైన్.. పల్లవి ప్రశాంత్, రతికని నామినేట్ చేసింది. తనతో వాళ్లిద్దరూ పెద్దగా కలవకపోవడం వల్లే నామినేట్ చేశానని కారణం చెప్పింది. దీనికి ప్రశాంత్, రతిక ఇద్దరూ ఒప్పుకోలేదు. సరికదా ఈ విషయమై ప్రియాంకతో యాక్టివిటీ ఏరియా నుంచి బయటకొచ్చిన తర్వాత డిస్కషన్ పెట్టారు. అలా సోమవారం ఎపిసోడ్ ఎండ్ పూర్తయింది. -
డొమినికా టెస్టు: భారత్ తొలి ఇన్నింగ్స్ 421/5 డిక్లేర్డ్
-
గుడివాడ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం ముఖ్యాంశాలు..!
-
మరికొన్ని గంటల్లో రిలీజ్.. 'ఆదిపురుష్' హైలైట్స్ ఇవే!
ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించిన 'ఆదిపురుష్' విడుదలకు మరికొన్ని గంటలే ఉంది. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోంది. ఇప్పటికే నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అడ్వాన్స్ బుకింగ్స్ యమ జోరుగా జరుగుతున్నాయి. తొలి రోజు షోలన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. ఇవే కాదు 'ఆదిపురుష్' విషయంలో ఇంకా బోలెడన్ని హైలైట్స్ ఉన్నాయి. అవేంటో ఓసారి చూసేయండి. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' కోసం ప్రభాస్ ఫస్ట్ టైమ్ అలా!) ఢిల్లీ, ముంబై సహా పలు మెట్రో నగరాల్లో టికెట్ రేట్స్ ఆకాశాన్ని అంటుతున్న ఆడియెన్స్ అస్సలు వెనక్కి తగ్గడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి మూడు రోజులు చాలావరకు హౌస్ ఫుల్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 9000 స్క్రీన్స్‌లో 'ఆదిపురుష్'ని రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో 1500, మిగతా భాషలన్నీ కలిపి 4000, ఓవర్సీస్ లో 3500 స్క్రీన్స్ ఈ మూవీకి కేటాయించారు. గతంలో ఏ సినిమాకు లేని విధంగా.. 'ఆదిపురుష్' టికెట్స్ వేల సంఖ్యలో కొన్న సెలబ్రిటీలు వాటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. 'ఆదిపురుష్' ప్రదర్శించే ప్రతి థియేటర్ లోనూ ఆంజనేయస్వామికి ఓ సీట్ కేటాయించారు. (ఇదీ చదవండి: Adipurush: అక్కడ టికెట్లు కొనేవారే లేరు.. షాక్‌లో ఫ్యాన్స్) 'ఆదిపురుష్' టికెట్ రేటుని తెలుగు రాష్ట్రాల్లో రూ.50 వరకు పెంచారు. అయినాసరే ప్రేక్షకులు, అభిమానులు టికెట్స్ కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణలో రిలీజ్ రోజు అదనపు షోలకు పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఉదయం 4 గంటలకే మొట్టమొదటి షోలు పడనున్నాయి. రామాయణం ఆధారంగా ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. వాటితో పోలిస్తే 'ఆదిపురుష్'ని ఏకంగా రూ.500 బడ్జెట్ తో తీయడం విశేషం. తిరుపతిలో 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కొన్నిరోజుల ముందు చాలా గ్రాండ్ గా నిర్వహించారు. దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేశారని టాక్. రూ 500 కోట్ల బడ్జెట్ తో తీసిన 'ఆదిపురుష్' డిజిటల్, శాటిలైట్ రైట్స్ ని దాదాపు రూ.250 కోట్లకు విక్రయించారట. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ రిలీజ్ హక్కుల్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రూ.185 కోట్లకు దక్కించుకుంది. తెలుగు తప్పితే ఓవర్సీస్, హిందీ, ఇతర భాషల్లో 'ఆదిపురుష్'ని నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేస్తుండటం విశేషం. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్'తో ప్రభాస్ కచ్చితంగా హిట్ కొట్టాలి.. లేదంటే?) -
గ్రీన్ సుడిగాలి శతకం.. సన్‌రైజర్స్‌పై ముంబై ఘన విజయం
గ్రీన్ సుడిగాలి శతకం.. ముంబై ఘన విజయం సన్‌రైజర్స్ నిర్ధేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై టీమ్ సునాయాసంగా ఛేదించింది. రోహిత్ (56) హఫ్ సెంచరీతో రాణించగా.. కెమారూన్ గ్రీన్ (47 బంతుల్లో 100 నాటౌట్) విధ్వంసకర సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా ముంబై టీమ్ 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు వివ్రాంత్ శర్మ (69), మయాంక్ అగర్వాల్ (83) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. గ్రీన్ సుడిగాలి హాఫ్ సెంచరీ కెమారూన్ గ్రీన్ సుడిగాలి హాఫ్ సెంచరీ చేశాడు. కేవలం 20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అర్ధశతకం బాదాడు. 9 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 100/1. రోహిత్ శర్మ 31 క్రీజ్‌లో ఉన్నాడు. ముంబై ముందు భారీ లక్ష్యం టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ భారీ స్కోర్ సాధించింది. వివ్రాంత్ శర్మ (69), మయాంక్ అగర్వాల్ (83) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. క్లాసెన్ (18), ఫిలిప్స్ (1), బ్రూక్ (0) విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ 4 వికెట్లు పడగొట్టాడు. సెంచరీ మిస్ చేసుకున్న మయాంక్ మయాంక్ అగర్వాల్ (83) 17 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ఆకాశ్ మధ్వాల్ బౌలింగ్ ఇషాన కిషన్‌కు ఇచ్చి ఔటయ్యాడు. 16.4 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 174/2. దుమ్ములేపుతున్న వివ్రాంత్ శర్మ సన్రైజర్స్ఓపెనర్ వివ్రాంత్ శర్మ (55) ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. అతనికి మరో ఎండ్‌లో మయాంక్ అగర్వాల్ (40) సహకరిస్తున్నాడు. వీరి ధాటికి సన్‌రైజర్స్ 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 103 పరుగులు చేసింది. ధాటిగా ఆడుతున్న సన్‌రైజర్స్ ఓపెనర్లు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (28), వివ్రాంత్ సింగ్ (29) శుభారంభాన్ని అందించారు. వీరి ధాటికి సన్‌రైజర్స్ 7 ఓవర్లలో 63 పరుగులు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (మే 21) ముంబై ఇండియన్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు.. ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కెమారూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నేహల్ వధేరా, టిమ్ డేవిడ్, పియూశ్ చావ్లా, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆకాశ్ మధ్వాల్, క్రిస్ జోర్డాన్, కుమార్ కార్తికేయ సన్‌రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, వివ్రాంత్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, హ్యారీ బ్రూక్, నితీశ్ రెడ్డి, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, మయాంక్ డాగర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ -
IPL 2023: సన్‌రైజర్స్‌పై లక్నో ఘన విజయం
సన్‌రైజర్స్‌పై లక్నో ఘన విజయం ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ కథ ముగిసింది. లక్నోతో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఓడటం ద్వారా సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతయ్యాయి. సన్‌రైజర్స్ నిర్ధేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని లక్నో మరో నాలుగు బంతులుండగానే ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 16 ఓవర్ల వరకు తమ వైపే ఉన్న మ్యాచ్‌ను సన్‌రైజర్స్ బౌలర్ అభిషేక్ శర్మ పువ్వుల్లో పెట్టి ప్రత్యర్ధికి అప్పజెప్పాడు. ఆ ఓవర్లో అభిషేక్ 31 పరుగులు (స్టోయినిస్ 2 సిక్సర్లు, పూరన్ హ్యాట్రిక్ సిక్సర్లు) సమర్పించుకోవడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయి, లక్నో వైపు మలుపు తిరిగింది. పూరన్ (13 బంతుల్లో 4 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు)తో పాటు ప్రేరక్ మన్కడ్ (45 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆతర్వాతి ఓవర్లలో వరుసగా 14, 10, 10, 6 పరుగులు రాబట్టి లక్నోను విజయతీరాలకు చేర్చారు. లక్నో గెలుపులో స్టోయినిస్ (25 బంతుల్లో 40; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సైతం తన వంతు పాత్ర పోషించాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అన్మోల్ప్రీత్ సింగ్ (36), రాహుల్ త్రిపాఠి (20), మార్క్రమ్ (28), క్లాసెన్ (47), అబ్దుల్ సమత్ (37 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు సాధించగా.. గ్లెన్ ఫిలిప్స్ (0), అభిషేక్ శర్మ (7) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో కృనాల్ 2, యుద్ద్‌వీర్ సింగ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. మూడో వికెట్ కోల్పోయిన లక్నో అభిషేక్ శర్మ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదిన అనంతరం స్టోయినిస్ (40) ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన లక్నో.. డికాక్ ఔట్ మయాంక్ మార్కండే బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి డికాక్ (29) ఔటయ్యాడు. 8.2 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 54/2. ప్రేరక్ మన్కడ్ (21) క్రీజ్‌లో ఉన్నాడు. టార్గెట్ 183.. ఆచితూచి ఆడుతున్న లక్నో ప్లేయర్లు 183 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో ఆటగాళ్లు ఆచితూచి ఆడుతున్నారు. నాలుగో ఓవర్లోనే కైల్ మేయర్స్ (14 బంతుల్లో 2) వికెట్ పోగొట్టుకున్న లక్నో.. మరో వికెట్ పడకుంగా జాగ్రత్తగా ఆడుతుంది. 8 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 50/1గా ఉంది. డికాక్ (25), ప్రేరక్ మన్కడ్ (21) క్రీజ్‌లో ఉన్నారు. లక్నోతో మ్యాచ్.. సన్‌రైజర్స్ స్కోర్ ఎంతంటే..? టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అన్మోల్ప్రీత్ సింగ్ (36), రాహుల్ త్రిపాఠి (20), మార్క్రమ్ (28), క్లాసెన్ (47), అబ్దుల్ సమత్ (37 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు సాధించగా.. గ్లెన్ ఫిలిప్స్ (0), అభిషేక్ శర్మ (7) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో కృనాల్ 2, యుద్ద్‌వీర్ సింగ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఆరో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి క్లాసెన్ (29 బంతుల్లో 47) ఔటయ్యాడు. 19 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 173/6. అబ్దుల్ సమద్ (30), భువనేశ్వర్ క్రీజ్‌లో ఉన్నారు. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ సన్‌రైజర్స్ వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయింది. కృనాల్ వేసిన 13వ ఓవర్ తొలి రెండు బంతులకు మార్క్రమ్, ఫిలిప్స్ ఔటయ్యారు. 13 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 117/5. నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ కృనాల్ బౌలింగ్‌లో మార్క్రమ్ (28) స్టంపౌటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ 82 పరుగుల వద్ద సన్‌రైజర్స్ మూడో వికెట్ కోల్పోయింది. అన్మోల్ప్రీత్ సింగ్ (36)ను అమిత్ మిశ్రా కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. 11 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 101/3. మార్క్రమ్ (27), క్లాసెన్ (7) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ ధాటిగా ఆడుతున్న రాహుల్ త్రిపాఠి (13 బంతుల్లో 20; 4 ఫోర్లు) యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 6 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 56/2. మార్క్రమ్, అన్మోల్ప్రీత్ సింగ్ (25) క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ మూడో ఓవర్ తొలి బంతికి వికెట్ కోల్పోయింది. యద్ధ్వీర్ సింగ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (7) ఔటయ్యాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ ఐపీఎల్ 2023లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇవాళ (మే 13) జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. తుది జట్లు: సన్‌రైజర్స్: ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అన్మోల్ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఫజల్ హక్ ఫారూఖీ, టి నటరాజన్ లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్, కృనాల్ పాండ్యా, కైల్ మేయర్స్, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, యశ్ ఠాకూర్, యుద్ధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్ -
ఢిల్లీ క్యాపిటల్స్ కొంపముంచిన ఇంపాక్ట్ ప్లేయర్...
-
పంజాబ్ కింగ్స్ కు చుక్కలు చూపిస్తున్న రోహిత్ ఫ్యాన్స్
-
DC VS CSK: ముంబై ఇండియన్స్‌పై సీఎస్కే విజయం
ముంబై ఇండియన్స్‌పై సీఎస్కే విజయం ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే రెండు పరాజయాల తర్వాత మళ్లీ విజయాల బాట పట్టింది. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 140 పరుగులు సాధారణ టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్కే 17.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. డెవన్ కాన్వే 44 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 30 పరుగులు చేసి ఔటవ్వగా.. ఆఖర్లో శివమ్ దూబే 18 బంతుల్లో 26 నాటౌట్ సీఎస్కేను గెలిపించాడు. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా.. ట్రిస్టన్ స్టబ్స్, ఆకాశ్ మద్వాల్లు చెరొక వికెట్ తీశారు. నాలుగో వికెట్ కోల్పోయిన సీఎస్కే గెలుపు వాకిట సీఎస్కే వరుసగా వికెట్లు కోల్పోతుంది. ఆకాశ్ మధ్వాల్ బౌలింగ్‌లో డెవాన్ కాన్వే (44) ఔటయ్యాడు. సీఎస్కే గెలుపుకు 20 బంతుల్లో 10 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. మూడో వికెట్ కోల్పోయిన సీఎస్కే అంబటి రాయుడు (*2) మరో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ట్రిస్టన్ స్టబ్స్ బౌలింగ్‌లో రాఘవ్ గోయల్‌కు క్యాచ్ ఇచ్చి రాయుడు ఔటయ్యాడు. 14 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 119/3. కాన్వే (38), శివమ్ దూబే (13) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన సీఎస్కే సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. పియూష్ చావ్లా బౌలింగ్‌లో రహానే (21) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. 11 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 88/2. కాన్వే (29), రాయుడు (3) క్రీజ్‌లో ఉన్నారు. టార్గెట్ 140.. తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే ధాటిగా ఆడుతున్న రుతురాజ్.. 16 బంతుల్లో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. ఐదో ఓవర్ తొలి బంతికి పియూష్ చావ్లా బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 5 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 50/1. కాన్వే (15), రహానే (3) క్రీజ్‌లో ఉన్నారు. టార్గెట్ 140.. రుతురాజ్ గైక్వాడ్ ఊచకోత 140 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో సీఎస్కే ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. కాన్వే (10) ఆచితూచి ఆడుతుంటే.. రుతురాజ్ గైక్వాడ్ (30) ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఫలితంగా సీఎస్కే 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన ముంబై.. చెన్నై టార్గెట్ ఎంతంటే..? టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. సీఎస్కే బౌలర్ల ధాటికి స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. మతీష పతిరణ 3 వికెట్లతో ముంబై పతనాన్ని శాసించగా.. దీపక్ చాహర్, తుషార్ తలో 2 వికెట్లు, జడేజా ఓ వికెట్ పడగొట్టారు. నేహల్ వధేరా (64) హాఫ్ సెంచరీతో రాణించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ముంబై ఇన్నింగ్స్‌లో నేహల్‌తో పాటు సూర్యకుమార్ (26), ట్రిస్టన్ స్టబ్స్ (20) రెండంకెల స్కోర్‌తో రాణించారు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ముంబై 137 పరుగుల వద్ద ముంబై ఎనిమిదో వికెట్ కోల్పోయింది. పతిరణ బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్ (20) ఔటయ్యాడు. అంతకుముందు ఇదే ఓవర్లో అర్షద్ ఖాన్ (1) ఔటయ్యాడు. ముంబై నాలుగో వికెట్ డౌన్ 69 పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ (26) క్లీన్ బౌల్డయ్యాడు. ట్రిస్టన్ స్టబ్స్, నేహల్ (27) క్రీజ్‌లో ఉన్నారు. రోహిత్ శర్మ మరోసారి డకౌట్.. ముంబై స్కోర్ 16/3 ఐపీఎల్లో రోహిత్ శర్మ రికార్డు స్థాయిలో 16వ సారి డకౌటయ్యాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్ ఔటయ్యాడు. 3 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 16/3. సూర్యకుమార్, నేహల్ వధేరా క్రీజ్‌లో ఉన్నారు. 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ముంబై టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ (7) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన ముంబై.. గ్రీన్ ఔట్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో గ్రీన్ (6) క్లీన్‌బౌల్డయ్యాడు. 2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 13/1. రోహిత్, ఇషాన్ కిషన్ (7) క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై ఐపీఎల్-2023లో భాగంగా ఇవాళ (మే 6) మధ్యాహ్నం 3: 30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ జరుగనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు.. సీఎస్కే: ఎంఎస్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్య రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, మతీష పతిరణ, తుషార్ దేశ్‌పాండే. ముంబై: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రిస్టన్ స్టబ్స్, సూర్యకుమార్ యాదవ్, కెమారూన్ గ్రీన్, టిమ్ డేవిడ్, నేహల్ వధేరా, జోఫ్రా ఆర్చర్, పియూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, ఆర్షద్ ఖాన్ -
రెచ్చిపోయిన రషీద్ ఖాన్.. రాజస్థాన్‌పై గుజరాత్ ఘన విజయం
రెచ్చిపోయిన రషీద్ ఖాన్.. రాజస్థాన్‌పై గుజరాత్ ఘన విజయం 119 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్.. ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. 13.5 ఓవర్లలో గిల్ వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి, 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు వృద్దిమాన్ సాహా (41 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (36) రాణించగా.. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన హార్ధిక్ పాండ్యా (15 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గిల్ వికెట్ చహల్‌కు దక్కింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. గుజరాత్ బౌలర్ల ధాటికి 17.5 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లతో రెచ్చిపోగా, నూర్ అహ్మద్ 2, షమీ, హార్ధిక్, జాషువ లిటిల్ తలో వికెట్ పడగొట్టారు. రాజస్ణాన్ ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్ 71 పరగుల వద్ద గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్‌లో గిల్ (36) స్టంపౌటయ్యాడు. లక్ష్యం దిశగా దూసుకెళ్తున్న గుజరాత్ 119 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్ ఓపెనర్లు లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నారు. గిల్ (27), సాహా (27) నిలకడగా ఆడుతుండటంతో ఆ జట్టు 7 ఓవర్లలో 57 పరుగులు చేసింది. టార్గెట్ 119.. నిలకడగా ఆడుతున్న గుజరాత్ ఓపెనర్లు 119 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్ ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. సాహా (23) కాస్త వేగంగా ఆడుతుంటే గిల్ (13) ఆచితూచి ఆడుతున్నాడు. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 39/0. తిప్పేసిన స్పిన్నర్లు.. 118 పరుగులకే కుప్పకూలిన రాజస్థాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. గుజరాత్ బౌలర్ల ధాటికి 17.5 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3, నూర్ అహ్మద్ 2, షమీ, హార్ధిక్, జాషువ లిటిల్ తలో వికెట్ పడగొట్టారు. రాజస్ణాన్ ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో హెట్‌మైర్ (7) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో రాజస్థాన్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఏడో వికెట్ డౌన్ నూర్ అహ్మద్ బౌలింగ్‌లో దృవ్ జురెల్ (9) ఔట్ కావడంతో రాజస్థాన్ ఏడో వికెట్ కోల్పోయింది. ఆరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ నూర్ అహ్మద్ బౌలింగ్‌లో పడిక్కల్ (12) క్లీన్ బౌల్డ్ కావడంతో రాజస్థాన్ ఆరో వికెట్ కోల్పోయింది. 12 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 82/6. హెట్‌మైర్ (4), దృవ్ జురెల్ (5) క్రీజ్‌లో ఉన్నారు. 69 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాజస్థాన్ 69 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో రియాన్ పరాగ్ (4) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. పడిక్కల్ (10), హైట్‌మైర్ క్రీజ్‌లో ఉన్నారు. కష్టాల్లో రాజస్థాన్.. 63 పరుగులకే 4 వికెట్లు డౌన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ కకష్టాల్లో చిక్కుకుంది. ఆ జట్టు 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. జాషువ లిటిల్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ (30) ఔట్ కాగా, ఆ మరుసటి ఓవర్లోనే రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అశ్విన్ (2) క్లీన్ బౌల్డయ్యాడు. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 63/4. పడిక్కల్ (7)రియాన్ పరాగ్ క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్.. యశస్వి ఔట్ రాజస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది. యశస్వి జైస్వాల్ (14) రనౌటయ్యాడు. 5.3 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 48/2. సంజూ శాంసన్ (24), పడిక్కల్ క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో మోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి బట్లర్ (8) ఔటయ్యాడు. 2 ఓవర్ల తర్వాత రాజస్తాన్ స్కోర్ 12/1. యశస్వి (1), సంజూ శాంసన్ (1) క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ ఐపీఎల్-2023లో భాగంగా జైపూర్ వేదికగా ఇవాళ (మే 5) రాజస్థాన్ రాయల్స్- గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లు.. రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవ్‌దత్ పడిక్కల్, సంజూ శాంసన్, షిమ్రోన్ హెట్‌మైర్, దృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, ఆడమ్ జంపా, చహల్ గుజరాత్ టైటాన్స్: హార్ధిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, జాషువ లిటిల్, మోహిత్ శర్మ -
లక్నోపై ఆర్సీబీ సంచలన విజయం.. 127 పరుగులను ఛేదించలేక..!
లక్నోపై ఆర్సీబీ సంచలన విజయం.. 127 పరుగులను ఛేదించలేక..! ఐపీఎల్ 2023 సీజన్లో మరో సంచలనం నమోదైంది. ఈ సీజన్లో అసాధ్యమనుకున్న టార్గెట్లను కొన్ని జట్లు ఛేదించి, అద్భుత విజయాలు సాధించగా.. ఇవాళ లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ అతి స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకుని సంచలన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. కోహ్లి (31), డుప్లెసిస్ (44), దినేశ్ కార్తీక్ (16) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హాక్ 3, బిష్ణోయ్, అమిత్ మిశ్రా తలో 2, కృష్ణప్ప గౌతమ్ ఓ వికెట్ పడగొట్టారు. స్వల్ప లక్ష్యఛేదనలో ఆది నుంచే తడబడుతూ వచ్చిన లక్నో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి 108 పరుగులకే ఆలౌటైంది. స్వల్ప లక్ష్యాన్ని సక్సెస్‌ఫుల్‌గా డిఫెండ్ చేసుకున్న ఆర్సీబీ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్నో ఇన్నింగ్స్‌లో కృష్ణప్ప గౌతమ్ (23) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఆర్సీబీ బౌలర్లలో కర్ణ్ శర్మ, హాజిల్‌వుడ్ తలో 2 వికెట్లు, సిరాజ్, మ్యాక్స్‌వెల్, హసరంగ, హర్షల్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. ఇద్దరు రనౌటయ్యారు. ఆఖర్లో బ్యాటింగ్‌కు దిగిన కేఎల్ రాహుల్ కూడా లక్నోను గెలిపించలేకపోయాడు. ఓటమి దిశగా లక్నో స్వల్ప లక్ష్య ఛేదనలో చతికిలపడిన లక్నో ఓటమి దిశగా పయనిస్తుంది. ఆ జట్టు 77 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. బిష్ణోయ్ (5) రనౌటయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన లక్నో 66 పరుగుల వద్ద లక్నో ఏడో వికెట్ కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. భారీ షాట్లు ఆడుతున్న కృష్ణప్ప గౌతమ్ (23)రనౌటయ్యాడు. 65 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన లక్నో 65 పరుగుల వద్ద లక్నో ఆరో వికెట్ కోల్పోయింది. కర్ణ్ శర్మ బౌలింగ్‌లో సుయాశ్‌కు క్యాచ్ ఇచ్చి డేంజరెస్ స్టోయినిస్ (13) ఔటయ్యాడు. 11 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 65/6. కృష్ణప్ప గౌతమ్ (22), బిష్ణోయ్ క్రీజ్‌లో ఉన్నారు. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన లక్నో స్వల్ప లక్ష్య ఛేదనలో లక్నో 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కర్ణ శర్మ బౌలింగ్‌లో లోమ్రార్‌కు క్యాచ్ ఇచ్చి పూరన్ (9) ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 53/5. స్టోయినిస్ (10), కృష్ణప్ప గౌతమ్ (13) క్రీజ్‌లో ఉన్నారు. టార్గెట్ 127.. లక్నో 27/4 127 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో లక్నో 27 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హసరంగ బౌలింగ్‌లో హుడా (1) నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. దినేశ్ కార్తీక్ అద్భుతమైన స్టంపింగ్ చేసి హుడాను పెవిలియన్‌కు పంపాడు. 6 ఓవర్ల తర్వాత లక్నో స్కొర్ 34/4. స్టోయినిస్ (6), పూరన్ (7) క్రీజ్‌లో ఉన్నారు. టార్గెట్ 127.. 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన లక్నో 127 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో లక్నో సైతం వడివడిగా వికెట్లు కోల్పోతుంది. 5 బంతుల వ్యవధిలో ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత కృనాల్ పాండ్యా (14) ఆతర్వాత ఆయుష్ బదోని (4) పెవిలియన్‌కు చేరారు. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో కృనాల్.. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో బదోని ఔటయ్యారు. టార్గెట్ 127.. రెండో బంతికే వికెట్ కోల్పోయిన లక్నో 127 పరుగుల స్వల్ప లక్ష్య ఛేనదలో లక్నో రెండో బంతికే వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో కైల్ మేయర్స్ డకౌటయ్యాడు. ఆర్సీబీ చెత్త ఆటతీరు.. లక్నో టార్గెట్ 127 టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ చెత్త ఆటతీరు ప్రదర్శించింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోహ్లి (31), డుప్లెసిస్ (44), దినేశ్ కార్తీక్ (16) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హాక్ 3, బిష్ణోయ్, అమిత్ మిశ్రా తలో 2, కృష్ణప్ప గౌతమ్ ఓ వికెట్ పడగొట్టారు. 7 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ.. ఆర్సీబీ 7 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. నవీన్ ఉల్ హాక్ బౌలింగ్‌లో లోమ్రార్ (3), దినేశ్ కార్తీక్ (16) రనౌట్, నవీన్ ఉల్ హాక్ బౌలింగ్‌లో వరస బంతుల్లో కర్ణ శర్మ (2), సిరాజ్ (0) ఔటయ్యారు. ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. డుప్లెసిస్ ఔట్ అమిత్ మిశ్రా బౌలింగ్‌లో డుప్లెసిస్ (44) ఔటయ్యాడు. కృనాల్ పాండ్యా అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకుని డెప్లెసిస్‌ను పెవిలియన్‌కు పంపాడు. 17 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 110/5. క్రీజ్‌లో కార్తీక్ (13), లోమ్రార్ (1) ఉన్నారు. వర్షం అంతరాయం 15.2 ఓవర్ల తర్వాత వర్షం అంతరాయం కలిగించింది. డుప్లెసిస్ (40), కార్తీక్ (1) క్రీజ్‌లో ఉన్నారు. జట్టు స్కోర్ 93/4. పెవిలియన్‌కు క్యూ కడుతున్న ఆర్సీబీ ఆటగాళ్లు.. నాలుగో వికెట్ డౌన్ అమిత్ మిశ్రా బౌలింగ్‌లో కృష్ణప్ప గౌతమ్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టడంతో సుయాశ్ ప్రభుదేశాయ్ (6) ఔటయ్యాడు. 15 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 92/4. డుప్లెసిస్ (39), దినేశ్ కార్తీక్ (1) క్రీజ్‌లో ఉన్నారు. కష్టాల్లో ఆర్సీబీ.. మూడో వికెట్ డౌన్ 79 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ కష్టాల్లో చిక్కుకుంది. బిష్ణోయ్ మరోసారి మాయ చేశాడు. బిష్ణోయ్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడబోయన మ్యాక్సీ (4) అది మిస్ కావడంతో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 82/3. డుప్లెసిస్ (35), సుయాశ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. రావత్ ఔట్ కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో అనుజ్ రావత్ (9) ఔటయ్యాడు. భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రావత్.. కైల్మేయర్స్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 12 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 78/2. డుప్లెసిస్ (33), మ్యాక్స్‌వెల్ (3) క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ రవి బిష్ణోయ్ పన్నిన ఉచ్చులో విరాట్ కోహ్లి (31) చిక్కాడు. కింగ్ భారీ షాట్ ఆడేందుకు ముందుకు వస్తున్నాడని ముందే పసిగట్టిన బిష్ణోయ్ తెలివిగా ఔట్ ఆఫ్ ద హాఫ్ స్టంప్ బంతిని సంధించాడు. కోహ్లి బంతిని కనెక్ట్ చేసుకోలేకపోగా, వికెట్ కీపర్ పూరన్ అలర్ట్‌గా ఉండి స్టంపింగ్ చేశాడు. దీంతో కోహ్లి పెవిలియన్ బాట పట్టక తప్పలేదు. 9 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 62/1. డుప్లెసిస్ (29), అనుజ్ రావత్ క్రీజ్‌లో ఉన్నారు. నిదానంగా ఆడుతున్న కోహ్లి, డుప్లెసిస్.. 6 ఓవర్ల తర్వాత స్కోర్ ఎంతంటే..? ఆర్సీబీ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు విరాట్ కోహ్లి (21), డుప్లెసిస్ (21) నిదానంగా ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. 6 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. పవర్ ప్లేలో ఆర్సీబీ 3 ఫోర్లు, ఓ సిక్సర్ మాత్రమే కొట్టింది. కృనాల్ పాండ్యా (3-0-14-0) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ ఐపీఎల్ 2023లో భాగంగా లక్నో వేదికగా ఇవాళ (మే 1) లక్నో సూపర్ జెయింట్స్-ఆర్సీబీ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లు.. ఆర్సీబీ: విరాట్ కోహ్లి, డుప్లెసిస్ (కెప్టెన్), అనుజ్‌రావత్, మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రార్, దినేశ్ కార్తీక్, సుయాశ్ ప్రభుదేశాయ్, వనిందు హసరంగ, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, జోష్ హాజిల్‌వుడ్ లక్నో: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హాక్, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్ -
సాహా..ఇదెక్కడి రూల్..?
-
RCB VS RR: ఉత్కంఠపోరు.. రాజస్తాన్‌పై ఆర్సీబీ విజయం
ఉత్కంఠపోరు.. రాజస్తాన్‌పై ఆర్సీబీ విజయం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా. యశస్వి జైశ్వాల్ 47, ద్రువ్ జురేల్ 34 నాటౌట్ చివరి వరకు నిలిచినప్పటికి రాజస్తాన్‌ను గెలిపించలేకపోయాడు. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. డేవిడ్ విల్లీ, మహ్మద్ సిరాజ్‌లు చెరొక వికెట్ తీశారు. నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాజస్థాన్ రాయల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో షాబాజ్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చి సంజూ శాంసన్ (22) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ 108 పరుగుల వద్ద రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో కోహ్లి క్యాచ్ అందుకోవడంతో యశస్వి జైస్వాల్ (47) ఔటయ్యాడు. 14 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 108/3. సంజూ శాంసన్ (7), హెట్‌మైర్ (0) క్రీజ్‌లో ఉన్నారు. పడిక్కల్ (52) ఔట్ విల్లే బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి పడిక్కల్ ఔటయ్యాడు. బాధ్యతగా ఆడుతున్న జైస్వాల్, పడిక్కల్ ఒక్క పరుగు వద్దే తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్.. ఆ తర్వాత వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. యశస్వి జైస్వాల్ (42), దేవ్‌దత్ పడిక్కల్ (39) బాధ్యతగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నారు. 9 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 81/1గా ఉంది. సిరాజ్ సింహ గర్జన.. బట్లర్ క్లీన్ బౌల్డ్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అదరగొడుతున్న సిరాజ్ ఇవాల్టి మ్యాచ్‌లోనూ చెలరేగాడు. తొలి ఓవర్ నాలుగో బంతికే సిరాజ్ బట్లర్ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మ్యాక్సీ, డుప్లెసిస్ మెరుపులు.. అయినా భారీ స్కోర్ చేయలేకపోయిన ఆర్సీబీ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ మరోసారి భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకుంది. డుప్లెసిస్ (39 బంతుల్లో 62; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (44 బంతుల్లో 77; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుతమైన పార్ట్నర్షిప్ తర్వాత కూడా ఆ జట్టు భారీ స్కోర్ చేయలేక చతికిలపడింది. ఆ జట్టు 45 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి దారుణంగా నిరాశపర్చింది. కోహ్లి (0), షాబాజ్ అహ్మద్ (2), లోమ్రార్ (8), దినేశ్ కార్తీక్ (16), ప్రభుదేశాయ్ (0), హసరంగ (6) విజయ్‌కుమార్ వైశాఖ్ (0) గల్లీ క్రికెటర్ల కంటే హీనంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా దినేశ్ కార్తీక్ అత్యంత దారుణంగా ఆడటమే కాకుండా ఇద్దరు రనౌట్ కావడంతో కీలకపాత్ర పోషించాడు. పెవిలియన్‌కు క్యూ కడుతున్న ఆర్సీబీ బ్యాటర్లు 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసి పటిష్టంగా ఉండిన ఆర్సీబీ.. ఆతర్వాత పేకమేడలా కూలిపోతుంది. డుప్లెసిస్ (62) రనౌట్‌తో ఆర్సీబీ పతనం మొదలైంది. ఆ తర్వాత అశ్విన్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ (77), చహల్ బౌలింగ్‌లో లోమ్రార్ (8) పెవిలియన్ బాట పట్టారు. అదే ఓవర్లో (17) ప్రభుదేశాయ్ (0) కూడా రనౌటయ్యాడు. 24 పరుగుల వ్యవధిలో ఆర్సీబీ 4 వికెట్లు కోల్పోయింది. 17 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 164/6గా ఉంది. దినేశ్ కార్తీక్ (3), హసరంగ (1) క్రీజ్‌లో ఉన్నారు. చితక్కొడుతున్న మ్యాక్సీ, డుప్లెసిస్ మ్యాక్స్‌వెల్ (35 బంతుల్లో 64), డుప్లెసిస్ (34 బంతుల్లో 56) బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. 12 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 128/2గా ఉంది. ధాటిగా ఆడుతున్న మ్యాక్సీ, డుప్లెసిస్ ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆర్సీబీని మ్యాక్స్‌వెల్ (19 బంతుల్లో 40), డుప్లెసిస్ (18 బంతుల్లో 30) ఆదుకుంది. వీరిద్దరు బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. 7 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 72/2గా ఉంది. రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 12 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో జైస్వాల్‌కు సునాయాసమైన క్యాచ్ ఇచ్చి షాబాజ్ అహ్మద్ (2) ఔటయ్యాడు. తొలి బంతికే కోహ్లి ఔట్.. గోల్డెన్ డక్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి తొలి బంతికే భారీ షాక్ తగిలింది. కెప్టెన్ కోహ్లి తొలి బంతికే బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 23) మధ్యాహ్నం 3: 30 గంటలకు రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు.. ఆర్సీబీ: విరాట్ కోహ్లి (కెప్టెన్), డుప్లెసిస్, మహిపాల్ లోమ్రార్, మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, సుయాశ్ ప్రభుదేశాయ్, డేవిడ్ విల్లే, వనిందు హసరంగ, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైశాఖ్ రాజస్థాన్: సంజూ శాంసన్ (కెప్టెన్), బట్లర్, యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, షిమ్రోన్ హెట్‌మైర్, దృవ్ జురెల్, అశ్విన్, జేసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, చహల్ -
LSG VS GT: గుజరాత్ సంచలన విజయం
లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఏడు పరుగుల తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్‌జెయింట్స్ ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు కోల్పోయి చేజేతులా ఓటమిని కొనితెచ్చుకుంది. ఆఖరి ఓవర్లో 12 పరుగులు అవసరమైన దశలో మోహిత్ శర్మ సూపర్ బౌలింగ్ వేశాడు. తొలి బంతికి రెండు పరుగులు రాగా.. ఆ తర్వాత వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగా.. ఇందులో మోహిత్ రెండు వికెట్లు తీయగా.. మిగతా రెండు రనౌట్ల రూపంలో వచ్చాయి. కేఎల్ రాహుల్ 68 పరుగులు చేసినప్పటికి జట్టును గెలిపించడంలో విఫలమయ్యాడు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్, మోహిత్ శర్మలు చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశాడు. మూడో వికెట్ కోల్పోయిన లక్నో గుజరాత్, లక్నో మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. ఒక్క పరుగు మాత్రమే చేసిన పూరన్ నూర్ అహ్మద్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం లక్నో విజయానికి 12 బంతుల్లో 17 పరుగులు కావాలి. కృనాల్ పాండ్యా ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన లక్నో 23 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా నూర్ అహ్మద్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో రెండు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. రాహుల్ 60, పూరన్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. లక్నో విజయానికి 24 బంతుల్లో 27 పరుగులు కావాలి. విజయానికి దగ్గరలో లక్నో సూపర్‌జెయింట్స్ గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ విజయానికి దగ్గరైంది. 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ప్రస్తుతం వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 56, కృనాల్ పాండ్యా 23 పరుగులతో ఆడుతున్నారు. తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. మేయర్స్ (24) ఔట్ 136 పరుగుల లక్ష్య ఛేదనలో 55 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో కైల్ మేయర్స్ (24 ) ఔటయ్యాడు. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 55/1గా ఉంది. టార్గెట్ 136.. 5 ఓవర్లలో 46/0 136 పరుగుల అతి సాధారణ లక్ష్య ఛేదనలో లక్నో ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. 5 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు వికెట్ నష్టాపోకుండా 46 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (25), కైల్ మేయర్స్ (21) బ్యాట్‌ను ఝులిపిస్తున్నారు. రాణించిన లక్నో బౌలర్లు.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన గుజరాత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 135 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. వృద్ధిమాన్ సాహా (47), కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (66) రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హాక్ (4-0-19-1), కృనాల్ పాండ్యా (4-0-16-2) స్టోయినిస్ (3-0-20-2), అమిత్ మిశ్రా (2-0-9-1) సత్తా చాటారు. హార్ధిక్ ఔట్ స్టోయినిస్ బౌలింగ్‌లో రాహుల్ క్యాచ్ పట్టడంతో హర్ధిక్ పాండ్యా (66) ఔటయ్యాడు. విజయ్ శంకర్ క్లీన్ బౌల్డ్.. నాలుగో వికెట్ డౌన్ నవీన్ ఉల్ హాక్ బౌలింగ్‌లో విజయ్ శంకర్ (10) క్లీన్ బౌల్డయ్యాడు. నవీన్ ఉల్ హాక్కు ఇది ఐపీఎల్లో తొలి వికెట్. 15 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 92/4గా ఉంది. హార్ధిక్ (32), మిల్లర్ క్రీజ్‌లో ఉన్నారు. సూపర్ క్యాచ్.. మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్ అమిత్ మిశ్రా బౌలింగ్‌లో నవీన్ ఉల్ హాక్ సూపర్ క్యాచ్ పట్టడంతో అభినవ్ మనోహర్ (3) ఔటయ్యాడు. 12 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 78/2. హార్ధిక్ (27), విజయ్ శంకర్ (1) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్ 47 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో సాహా ఔటయ్యాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన సాహా.. దీపక్ హుడాకు సునాయాసమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 11 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 75/2గా ఉంది. హార్ధిక్ (26), అభినవ్ మనోహర్ (2) క్రీజ్‌లో ఉన్నారు. నత్తనడకన సాగుతున్న గుజరాత్ బ్యాటింగ్ రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయిన గుజరాత్.. ఆ తర్వాత మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతుంది. హార్దిక్ (10 బంతుల్లో 6) నిదానంగా ఆడుతూ బోర్ కొట్టిస్తుండగా.. సాహా (24 బంతుల్లో 34) కాస్త ధాటిగా ఆడుతున్నాడు. 6 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 40/1. గుజరాత్ టైటాన్స్‌కు ఆదిలోనే షాక్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న గుజరాత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. కృనాల్ పాండ్యా వేసిన రెండో ఓవర్లోనే శుభ్‌మన్ గిల్ (0) ఔటయ్యాడు.3 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 13/1. సాహా (9), హార్ధిక్ (4) క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ ఐపీఎల్ 2023లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 22 మధ్యాహ్నం 3:30 గంటలకు) లక్నో సూపర్ జెయింట్స్-గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్(కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్, నవీన్ ఉల్ హాక్, రవి బిష్ణోయ్ -
150 పరుగులకే పంజాబ్ ఆలౌట్.. ఆర్సీబీ ఘన విజయం
150 పరుగులకే పంజాబ్ ఆలౌట్.. ఆర్సీబీ ఘన విజయం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 24 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 18.2 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. ప్రబ్‌సిమ్రన్ సింగ్ 46, జితేశ్ శర్మ 41 మినహా మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. హసరంగా రెండు వికెట్లు, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్‌లు చెరొక వికెట్ తీశారు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన పంజాబ్ 147 పరుగుల వద్ద పంజాబ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో హర్‌ప్రీత్ బ్రార్ క్లీన్ బౌల్డయ్యాడు. ఓటమి దిశగా పయనిస్తున్న పంజాబ్.. ఏడో వికెట్ డౌన్ 106 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పంజాబ్ ఓటమి దిశగా పయనిస్తుంది. హసరంగ బౌలింగ్‌లో షారుఖ్ ఖాన్ (7) స్టంపౌటయ్యాడు. 76 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన పంజాబ్ పంజాబ్ రనౌట్ రూపంలో మరో వికెట్ కోల్పోయింది. హసరంగ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో సామ్ కర్రన్ (10) ఔటయ్యాడు. దీంతో పంజాబ్ 76 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. సిరాజ్ సూపర్ త్రో.. నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్ వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసి జోరుమీదున్న సిరాజ్, మరో అద్భుతమైన డైరెక్ట్ త్రోతో హర్‌ప్రీత్ సింగ్ (13) పెవిలియన్‌కు పంపాడు. 6 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 49/4. సామ్ కర్రన్, ప్రభ్‌సిమ్రన్ (21) క్రీజ్‌లో ఉన్నారు. నిప్పులు చెరుగుతున్న సిరాజ్.. మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడుతున్నాడు. తన స్పెల్‌లో వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు. తొలుత రివ్యూవి వెళ్లే అథర్వ వికెట్ (ఎల్బీ)ను దక్కించుకున్న సిరాజ్.. ఆతర్వాత 4వ ఓవర్లో కూడా రివ్యూకి వెళ్లి లివింగ్‌స్టోన్‌ను ఔట్ (ఎల్బీ) చేశాడు. రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్ 175 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ మూడో ఓవర్ తొలి బంతికి రెండో వికెట్ కోల్పోయింది. హసరంగ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్ (8) క్లీన్ బౌల్డయ్యాడు. టార్గెట్ 175.. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ 175 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ రెండో బంతికే వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో అథర్వ టైడే (4) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రాణించిన డుప్లెసిస్, కోహ్లి.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..? టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకుంది. వరుస బంతుల్లో కోహ్లి (59), మ్యాక్స్‌వెల్ (0) ఔట్ కావడం.. స్కోర్ వేగం పెంచే క్రమంలో డుప్లెసిస్ (84) కూడా పెవిలియన్‌కు చేరడం.. ఆ తర్వాత వచ్చిన దినేశ్ కార్తీక్ (7), మహిపాల్ (7 నాటౌట్), షాబాజ్ అహ్మద్ (5 నాటౌట్) చెత్తగా బ్యాటింగ్ చేయడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 174 పరుగుల స్కోర్‌కే పరిమితమైంది. హర్‌ప్రీత్ బ్రార్ 2, అర్షదీప్, ఇల్లిస్ తలో వికెట్ పడగొట్టారు. డుప్లెసిస్ (84) ఔట్ ఇల్లిస్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన మరుసటి బంతికే డుప్లెసిస్ (84) ఔటయ్యాడు. 18 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 154/3. లోమ్రార్, కార్తీక్ (3) క్రీజ్‌లో ఉన్నారు. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ.. కోహ్లి, మ్యాక్స్‌వెల్ ఔట్ ఆర్సీబీకి వరుస షాక్‌లు తగిలాయి. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో వరుస బంతుల్లో విరాట్ కోహ్లి (59), మ్యాక్స్‌వెల్ (0) ఔటయ్యారు. 17 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 145/2. డుప్లెసిస్ (78), దినేశ్ కార్తీక్ (1) క్రీజ్‌లో ఉన్నారు. కోహ్లి హాఫ్ సెంచరీ.. 14 ఓవర్ల తర్వాత స్కోర్ ఎంతంటే..? 40 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో కోహ్లి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 14 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 118/0. కోహ్లికు జతగా డుప్లెసిస్ (65) క్రీజ్‌లో ఉన్నాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన డుప్లెసిస్ ఆర్సీబీ ఓపెనర్ డుప్లెసిస్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ సీజన్లో డుప్లెసిస్‌కు ఇది నాలుగో హాఫ్ సెంచరీ. ఓవరాల్‌గా 29వ ఐపీఎల్ ఫిఫ్టి. 11 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 98/0. డుప్లెసిస్‌కు జతగా కోహ్లి (39) క్రీజ్‌లో ఉన్నాడు. ధాటిగా ఆడుతున్న డుప్లెసిస్, కోహ్లి ఆర్సీబీ ఓపెనర్లు డుప్లెసిస్ (27), విరాట్ కోహ్లి (29) ధాటిగా ఆడుతున్నారు. వీరి ధాటికి ఆర్సీబీ 5.1 ఓవర్లలోనే 50 పరుగుల మార్కు దాటింది. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 59/0గా ఉంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ ఐపీఎల్-2023లో భాగంగా మొహాలీ వేదికగా ఇవాళ (ఏప్రిల్ 20) మధ్యాహ్నం 3:30 గంటలకు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు.. పంజాబ్ కింగ్స్: అథర్వ టైడే, మాథ్యూ షార్ట్, లివింగ్‌స్టోన్, హర్‌ప్రీత్ సింగ్, సికందర్ రజా, సామ్ కర్రన్ (కెప్టెన్), జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఇల్లీస్, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్ ఆర్సీబీ: డుప్లెసిస్, విరాట్ కోహ్లి (కెప్టెన్), మహిపాల్ లోమ్రార్, మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్, హసరంగ, పార్నెల్, సుయాష్ ప్రభుదేశాయ్, సిరాజ్ -
MI VS KKR: కేకేఆర్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం
కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 17.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. ముంబై బ్యాటర్లలో ఇషాన్ కిషన్ 25 బంతుల్లో 58, సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 43, తిలక్ వర్మ 25 బంతుల్లో 30 పరుగులు, టిమ్ డేవిడ్ 12 బంతుల్లో 23 పరుగులు నాటౌట్ సమిష్టిగా రాణించి ముంబై విజయంలో కీలకపాత్ర పోషించారు. కేకేఆర్ బౌలర్లలో సుయాష్ శర్మ రెండు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, లోకీ ఫెర్గూసన్‌లు తలా ఒక వికెట్ తీశారు. సీజన్లో ముంబైకిది వరుసగా రెండో విజయం కాగా.. కేకేఆర్‌కు వరుసగా రెండో పరాజయం కావడం గమనార్హం. విజయం దిశగా ముంబై ఇండియన్స్ కేకేఆర్‌తో మ్యాచ్‌లో ముంబై విజయానికి దగ్గరైంది. 17 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ముంబై విజయానికి కేవలం ఆరు పరుగుల దూరంలో ఉంది. తిలక్ వర్మ క్లీన్ బౌల్డ్.. మూడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్ సుయాశ్ శర్మ బౌలింగ్‌లో తిలక్ వర్మ (30) క్లీన్ బౌల్డయ్యాడు. 14 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 148/3. సూర్యకుమార్ యాదవ్ (30), టిమ్ డేవిడ్ క్రీజ్‌లో ఉన్నారు. ఇషాన్ కిషన్ (58) క్లీన్ బౌల్డ్ 25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు సాయంతో 58 పరుగులు చేసిన అనంతరం ఇషాన్ కిషన్ ఔటయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఇషాన్ క్లీన్ బౌల్డయ్యాడు. ఉమేశ్ సూపర్ క్యాచ్.. హిట్‌మ్యాన్ ఔట్ 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ శర్మ ఔటయ్యాడు. సుయాశ్ శర్మ బౌలింగ్‌లో మిడ్ ఆఫ్‌లో ఉమేశ్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకోవడంతో హిట్‌మ్యాన్ పెవిలియన్‌కు చేరాడు. క్రీజ్‌లో ఇషాన్ కిషన్ (43) జతగా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. 5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 65/1. టార్గెట్ 186.. ధాటిగా ఆడుతున్న రోహిత్, ఇషాన్ 186 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. 4 ఓవర్లలో ఆ జట్టు ఏకంగా 57 పరుగులు రాబట్టింది. ఇషాన్ కిషన్ (15 బంతుల్లో 42; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. అతనికి జతగా రోహిత్ శర్మ (9 బంతుల్లో 13; ఫోర్, సిక్స్) క్రీజ్‌లో ఉన్నాడు. వెంకటేశ్ అయ్యర్ సెంచరీ.. ముంబై టార్గెట్ ఎంతంటే..? ఐపీఎల్-2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 16 మధ్యాహ్నం 3:30 గంటలకు) జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్.. వెంకటేశ్ అయ్యర్ (51 బంతుల్లో 104; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కేఆర్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్ (8), జగదీశన్ (0), నితీశ్ రాణా (5), శార్దూల్ ఠాకూర్ (13), రింకూ సింగ్ (18) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. ఆఖర్లో రసెల్ (21 నాటౌట్) ధాటిగా ఆడాడు. ముంబై బౌలర్లలో హృతిక్ షోకీన్ 2 వికెట్లు పడగొట్టగా.. కెమరూన్ గ్రీన్, పియూష్ చావ్లా, జన్సెన్. మెరిడిత్ తలో వికెట్ దక్కించుకున్నారు. రింకూ సింగ్ ఔట్.. ఆరో వికెట్ కోల్పోయిన కేకేఆర్ జన్సెన్ బౌలింగ్‌లో నేహల్‌కు క్యాచ్ ఇచ్చి రింకూ సింగ్ (18) ఔటయ్యాడు. అయ్యర్ ఔటయ్యాక స్కోర్ ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. శతక్కొట్టి ఔటైన వెంకటేశ్ అయ్యర్ సెంచరీ తర్వాత కేవలం ఒకే ఒక ఫోర్ కొట్టిన అయ్యర్.. 104 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. మెరిడిత్ బౌలింగ్‌లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి అయ్యర్ పెవిలియన్‌కు చేరాడు. వెంకటేశ్ అయ్యర్ ఊచకోత.. 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో విధ్వంకర శతకం ముంబైలోని వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 16) జరుగుతున్న మ్యాచ్‌లో (మధ్యాహ్నం 3:30 గంటలకు) కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలి బంతి నుంచి ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అయ్యర్.. కేవలం 49 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో విధ్వంకర శతకం బాదాడు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో బ్యాటర్లంతా కలిపి కేవలం 2 ఫోర్లు కొడితే, ఒక్క వెంకటేశ్ అయ్యరే 5 బౌండరీలు, 9 సిక్సర్లు బాదడం విశేషం. తిలక్ వర్మ సూపర్ క్యాచ్.. శార్దూల్ ఠాకూర్ ఔట్ తిలక్ వర్మ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో శార్దూల్ ఠాకూర్ (13) పెవిలియన్ బాట పట్టాడు. తద్వారా 123 పరుగుల వద్ద కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో ఉన్న వెంకటేశ్ అయ్యర్ (86) దుమ్మురేపుతున్నాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంకటేశ్ అయ్యర్ హార్ఢ్ హిట్టర్ వెంకటేశ్ అయ్యర్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం స్పీడ్ పెంచిన అయ్యర్.. ఇంకా ధాటిగా ఆడుతున్నాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 76 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉన్నాడు. 11 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 104/3. అయ్యర్, శార్దూల్ (4) క్రీజ్‌లో ఉన్నారు. నితీశ్ రాణా ఔట్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన నితీశ్ రాణా (5) హృతిక్ షోకీన్ బౌలింగ్‌లో రమన్‌దీప్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 8.1 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 73/3. వెంకటేశ్ అయ్యర్ (49) క్రీజ్‌లో ఉన్నాడు. రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్ 57 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. పియూష్ చావ్లా బౌలింగ్‌లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి గుర్భాజ్ (8) ఔటయ్యాడు. క్రీజ్‌లో ఉన్న వెంకటేశ్ అయ్యర్ (39) ధాటిగా ఆడుతున్నాడు. నితీశ్ రాణా క్రీజ్‌లోకి వచ్చాడు. 6 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 57/2. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్.. జగదీశన్ ఔట్ రెండో ఓవర్లోనే కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. గ్రీన్ బౌలింగ్‌లో హృతిక్ షోకీన్ క్యాచ్ పట్టడంతో ఎన్ జగదీశన్ (0) ఔటయ్యాడు. 2 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 12/1. రహ్మానుల్లా గుర్బాజ్ (5), వెంకటేశ్ అయ్యర్ క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై.. రోహిత్ ఔట్, అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం ఐపీఎల్-2023లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 16) జరుగనున్న డబుల్ హెడర్ మ్యాచ్‌ల్లో తొలుత (మధ్యాహ్నం 3:30 గంటలకు) ముంబై ఇండియన్స్- కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కడుపు నొప్పి కారణంగా ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరం కాగా, అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ముంబై కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అలాగే ఈ మ్యాచ్ ద్వారా సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జన్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నాడు. తుది జట్లు.. ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్, కెమారూన్ గ్రీన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, నేహల్ వధేరా, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, పియుశ్ చావ్లా, డ్యుయాన్ జన్సెన్, రిలే మెరిడిత్ కేకేఆర్: రహ్మానుల్లా గుర్భాజ్, వెంకటేశ్ అయ్యర్, ఎన్ జగదీశన్, నితీశ్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, లోకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి -
పూరన్ ఊచకోత.. ఆఖర్లో హైడ్రామా.. చివరి బంతికి లక్నో థ్రిల్లింగ్ విక్టరీ
పూరన్ ఊచకోత.. ఆఖర్లో హైడ్రామా.. చివరి బంతికి లక్నో థ్రిల్లింగ్ విక్టరీ గుజరాత్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ ఆటగాడు రింకూ సింగ్ సృష్టించిన విధ్వంసాన్ని మరువకముందే మరో రెండు బ్లాస్టింగ్ ఇన్నింగ్స్‌లు నమోదయ్యాయి. ఆర్సీబీతో మ్యాచ్‌లో 213 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లక్నోను తొలుత స్టోయినిస్ (30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆతర్వాత పూరన్ (18 బంతుల్లో 62; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) చారిత్రక ఇన్నింగ్స్‌లు ఆ జట్టు గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. వీరిద్దరి సిక్సర్ల సునామీ ధాటికి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం తడిసి ముద్ద అయ్యింది. ఆఖర్లో పూరన్ ఔటయ్యాక లక్నో శిబిరంలో కాస్త అలజడి మొదలైనప్పటికీ బదోని (30) అద్భుతమైన షాట్లు ఆడి తన జట్టును గెలుపు దిశగా నడిపించాడు. అయితే ఇక్కడే హైడ్రామా చోటు చేసుకుంది. 19వ ఓవర్ నాలుగో బంతికి పార్నెల్ బౌలింగ్‌లో బదోని సిక్సర్ బాది, హిట్ వికెట్‌గా ఔటయ్యాడు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. లక్నో గెలుస్తుందా లేదా అన్న సందేహం మొదలైంది. అయితే చివరి బంతికి బై రావడంతో లక్నో గెలిచింది. ఫలితంగా ఆ జట్టు వికెట్ తేడాతో విజయం సాధించింది. దడ పుట్టిస్తున్న పూరన్.. 15 బంతుల్లోనే ఫిఫ్టి 213 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 105 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి గెలుపుపై ఆశలు వదులుకున్న లక్నోకు పూరన్ జీవం పోస్తున్నాడు. ఈ విండీస్ బ్యాటర్ కేవలం 15 బంతుల్లోనే 51 పరుగులు చేసి విధ్వంసం కొనసాగిస్తున్నాడు. 105 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన లక్నో భారీ లక్ష్య ఛేదనకు దిగిన లక్నో 105 పరుగులకే సగం వికెట్లు (11.1 ఓవర్లలో) కోల్పోయింది. నాలుగు బంతుల వ్యవధిలో ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. కర్ణ్ శర్మ బౌలింగ్‌లో స్టోయినిస్ (30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆతర్వాత సిరాజ్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (18) ఔటయ్యారు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన లక్నో.. దీపక్ హుడా, పాండ్యా ఔట్ వేన్ పార్నెల్ వేసిన 4వ ఓవర్లో లక్నో సూపర్ జెయింట్స్ రెండు వికెట్లు కోల్పోయింది. దీపక్ హుడా (9), కృనాల్ పాండ్యా (0) ఔటయ్యారు. 4 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 23/3. కేఎల్ రాహుల్ (8), స్టోయినిస్ క్రీజ్‌లో ఉన్నారు. మూడో బంతికే వికెట్ తీసిన సిరాజ్ 213 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన లక్నో మూడో బంతికే వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో కైల్ మేయర్స్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి ఓవర్ తర్వాత లక్నో స్కోర్ 5/1గా ఉంది. కేఎల్ రాహుల్ (0), దీపక్ హుడా (0) క్రీజ్‌లో ఉన్నారు. కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ విధ్వంసం.. ఆర్సీబీ భారీ స్కోర్ తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. విరాట్ కోహ్లి (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), డుప్లెసిస్ (46 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (29 బంతుల్లో 59; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో వికెట్ నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. అమిత్ మిశ్రా, మార్క్ వుడ్‌కు తలో వికెట్ దక్కింది. 19 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 203/1 డుప్లెసిస్ (45 బంతుల్లో 78 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (25 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ విధ్వంసం.. భారీ స్కోర్ దిశగా ఆర్సీబీ విరాట్ కోహ్లి ఔటయ్యాక కూడా ఆర్సీబీ ఏమాత్రం తగ్గట్లేదు. డుప్లెసిస్ (34 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు ), మ్యాక్స్‌వెల్ (12 బంతుల్లో 21; ఫోర్, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టిస్తున్నారు. బిష్ణోయ్ వేసిన 15వ ఓవర్లో ఈ ఇద్దరు 3 సిక్సర్లు బాదారు. ఫలితంగా ఆర్సీబీ స్కోర్ 15 ఓవర్ల తర్వాత 137/1గా ఉంది. విరాట్ కోహ్లి (61) ఔట్ 96 పరుగుల స్కోర్ వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 61 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ కోహ్లి అమిత్ మిశ్రా బౌలింగ్‌లో స్టోయినిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. డుప్లెసిస్ (31), మ్యాక్స్‌వెల్ క్రీజ్‌లో ఉన్నారు. హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లి ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన విరాట్ కోహ్లి 35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ఆచితూచి ఆడుతున్న డుప్లెసిస్ 18 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. 8.4 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 71/0. వీర బాదుడు బాదుతున్న విరాట్ కోహ్లి ఆర్సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లి ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించాడు. కింగ్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 56/0. కోహ్లికి జతగా డుప్లెసిస్ (12) క్రీజ్‌లో ఉన్నాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో ఐపీఎల్ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ (ఏప్రిల్ 10) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు పలు మార్పులు చేశాయి. ఎల్ఎస్జీ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలుపొంది, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలువగా.. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓ గెలుపు, ఓ పరాజయంతో ఏడో ప్లేస్‌లో ఉంది. తుది జట్లు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రార్, షాబాజ్ అహ్మద్, డేవిడ్ విల్లే, అనూజ్ రావత్, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్ లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ (వికెట్‌కీపర్), కృనాల్ పాండ్యా, అమిత్ మిశ్రా, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయ్, మార్క్ వుడ్, ఆవేశ్ ఖాన్ -
ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు.. కేకేఆర్ సంచలన విజయం
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ సంచలన విజయం సాధించింది. కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లు బాది జట్టును గెలిపించాడు. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు ఆఖరి ఓవర్లో 29 పరుగులు అవసరమయ్యాయి. యష్ దయాల్ వేసిన ఆఖరి ఓవర్ తొలి బంతిని ఉమేశ్ యాదవ్ సింగిల్ తీసి రింకూ సింగ్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. ఇక్కడి నుంచే రింకూ సింగ్ విధ్వంసం మొదలైంది. చివరి ఐదు బంతులను ఐదు సిక్సర్లుగా మలిచి కేకేఆర్‌కు గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో రింకూ సింగ్ 21 బంతుల్లోనే 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అంతకముందు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన వెంకటేశ్ అయ్యర్ 40 బంతుల్లో 80 పరుగులు చేసి కేకేఆర్ విజయానికి బాటలు వేశాడు. అయితే ఇన్నింగ్స్ 17వ ఓవర్లో రషీద్ ఖాన్ హ్యాట్రిక్ నమోదు చేసి మ్యాచ్‌ను గుజరాత్ వైపు టర్న్ చేశాడు. అయితే యశ్ దయాల్ ఆఖరి ఓవర్లో చెత్తగా బౌలింగ్ చేసి మ్యాచ్ ఓటమికి కారణమయ్యాడు. 5 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయిన కేకేఆర్, రషీద్ ఖాన్ హ్యాట్రిక్ నిమిషాల వ్యవధిలో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. గెలుపు దిశగా సాగుతున్న కేకేఆర్ 5 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి ఓటమిని కొని తెచ్చుకునేలా ఉంది. రషీద్ ఖాన్ వరుస బంతుల్లో రసెల్, నరైన్, శార్దూల్ వికెట్లు పడగొట్టి, ఈ సీజన్ తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. వెంకటేశ్ అయ్యర్ ఔట్ 40 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో విధ్వంసం (83) సృష్టించిన వెంకటేశ్ అయ్యర్.. అల్జరీ జోసఫ్ బౌలింగ్‌లో గిల్‌కు సునాయాసమైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 16 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 155/4. మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. కెప్టెన్ ఔట్ ధాటిగా ఆడుతున్న కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా 45 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. అల్జరీ జోసఫ్ బౌలింగ్‌లో షమీకి క్యాచ్ ఇచ్చి రాణా పెవిలియన్‌కు చేరాడు. 14 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 132/3. ధాటిగా ఆడుతున్న అయ్యర్, రాణా 205 పరుగుల లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే 2 వికెట్లు కోల్నోయిన కేకేఆర్... వికెట్లు పడ్డా ఏమాత్రం తగ్గకుండా ధాటిగా బ్యాటింగ్ చేస్తుంది. వెంకటేశ్ అయ్యర్ (28 బంతుల్లో 58; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ నితీశ్‌రాణా (24 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 12 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 116/2గా ఉంది. రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్ 28 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. జాషువ లిటిల్ బౌలింగ్‌లో అభినవ్ మనోహర్‌కు క్యాచ్ ఇచ్చి జగదీశన్ (6) ఔటయ్యాడు. 4 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 28/2. యశ్ దయాల్ సెన్సేషనల్ క్యాచ్.. కేకేఆర్ తొలి వికెట్ డౌన్ యశ్ దయాల్ సెన్సేషనల్ క్యాచ్ పట్టడంతో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో దయాల్ షార్ట్ ఫైన్ లెగ్ నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకోవడంతో గుర్భాజ్ 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్‌కు చేరాడు. 3 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 26/1గా ఉంది. జగదీశన్(5), వెంకటేశ్ అయ్యర్ (6) క్రీజ్‌లో ఉన్నారు. విధ్వంసం సృష్టించిన త్రీడీ ప్లేయర్.. గుజరాత్ భారీ స్కోర్ కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. విజయ్ శంకర్ (24 బంతుల్లో 63 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (38 బంతుల్లో 53; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించగా, శుభ్‌మన్ గిల్ (31 బంతుల్లో 39; 5 ఫోర్లు) పర్వాలేదనిపించాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్‌కు 3, సుయాశ్ శర్మకు ఓ వికెట్ దక్కింది. నరైన్‌కు మరో వికెట్.. సాయి సుదర్శన్ ఔట్ 158 పరుగుల వద్ద గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. సునీల్ నరైన్ బౌలింగ్ సాయి సుదర్శన్ (53) ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో నరైన్‌కు ఇది మూడో వికెట్. సుయాశ్ సూపర్ డెలివరీ.. అభినవ్ మనోహర్ క్లీన్ బౌల్డ్ కేకేఆర్ యువ స్పిన్నర్ సుయాశ్ శర్మ సూపర్ డెలివరీతో అభినవ్ మనోహర్‌ను (14) బోల్తా కొట్టించి క్లీన్ బౌల్డ్ చేశాడు. 15 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 132/3. సాయి సుదర్శన్ (46), విజయ్ శంకర్ (2) క్రీజ్‌లో ఉన్నారు. శుభ్‌మన్ ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్ 100 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శుభ్‌మన్ గిల్ సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. 12 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 101/2. సాయి సుదర్శన్ (31), అభినవ్ మనోహర్ (1) క్రీజ్‌లో ఉన్నారు. నిలకడగా ఆడుతున్న గిల్, సుదర్శన్ సాహా వికెట్ పడ్డాక కూడా గిల్ (27), సుదర్శన్ నిలకడగా ఆడుతున్నారు. 8 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 68/1గా ఉంది. ఈ మ్యాచ్‌లో గిల్ ఐపీఎల్లో 2000 పరుగుల మైలురాయిని దాటాడు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్.. జగదీశన్ సూపర్ క్యాచ్ 5వ ఓవర్ రెండో బంతికి గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. సునీల్ నరైన్ బౌలింగ్‌లో జగదీశన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో సాహా 17 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. 5 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 38/1. గిల్ (10), సాయి సుదర్శన్ (4) క్రీజ్‌లో ఉన్నారు. అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 9) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. స్వల్ప అస్వస్థత కారణంగా ఇవాల్టి మ్యాచ్‌కు గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా దూరం కాగా అతని స్థానంలో రషీద్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. హార్ధిక్ స్థానంలో విజయ్ శంకర్ జట్టులోకి వచ్చాడు. కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. టిమ్ సౌథీ స్థానంలో ఫెర్గూసన్, మన్దీప్ సింగ్ ప్లేస్‌లో జగదీశన్ తుది జట్టులోకి వచ్చారు. తుది జట్లు.. గుజరాత్ టైటాన్స్: వృద్దిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్ (కెప్టెన్), మహ్మద్ షమీ, అల్జరీ జోసఫ్, యశ్ దయాల్ కోల్‌కతా నైట్‌రైడర్స్: రహ్మానుల్లా గుర్భాజ్ (వికెట్‌కీపర్), ఎన్ జగదీశన్, నితీశ్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, సుయాశ్ శర్మ, లోకీ ఫెర్గూసన్, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి -
ఆసీస్ ఓపెనర్ల విధ్వంసం.. రెండో వన్డేలో భారత్ ఓటమి
ఆసీస్ ఓపెనర్ల విధ్వంసం.. రెండో వన్డేలో భారత్ ఓటమి టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 118 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. వికెట్ నష్టపోకుండా 11 ఓవర్లలోనే చేదించింది. ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్(36 బంతుల్లో 66 నాటౌట్), ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 51 నాటౌట్) విధ్వంసం సృష్టించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఆసీస్ బౌలర్లు నిప్పులు చేరగడంతో కేవలం 117 పరుగులకే కుప్పకూలింది.ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ 5వికెట్లతో టీమిండియా వెన్ను విరచగా.. అబాట్ మూడు, నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు సాధించారు. విజయానికి చేరువలో ఆసీస్.. 118 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 8 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్(54) హాఫ్ సెంచరీ సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఇప్పటి వరకు 5 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. అతడితో పాటు హెడ్(32) పరుగులతో క్రీజులో ఉన్నాడు. 118 పరుగుల టార్గెట్.. దూకుడుగా ఆడుతున్న ఆసీస్ 118 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతుంది. 3 ఓవర్లలో ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (10), ట్రవిస్ హెడ్ (10) క్రీజ్‌లో ఉన్నారు. నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్లు.. 117 పరుగులకే కుప్పకూలిన భారత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. మిచెల్ స్టార్క్ (5/53), సీన్ అబాట్ (3/23), నాథన్ ఇల్లీస్ (2/13) నిప్పులు చెరగడంతో భారత్‌ను 117 పరుగులకే ఆలౌట్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 103 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా 103 పరుగుల వద్ద టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ (4), షమీ (0)లను అబాట్ పెవిలియన్‌కు పంపాడు. క్రీజులో అక్షర్ పటేల్, సిరాజ్ ఉన్నారు. ఏడో వికెట్ కోల్పోయిన భారత్.. జడ్డూ (16) ఔట్ 91 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. నాథన్ ఇల్లీస్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ అలెక్స్ క్యారీ క్యాచ్ పట్టడంతో రవీంద్ర జడేజా (16) ఔటయ్యాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ క్రీజ్‌లో ఉన్నారు. ఆరో వికెట్ కోల్పోయిన భారత్... కోహ్లి ఔట్ 71 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. నాథన్ ఇల్లీస్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి (31) ఎల్బీడబ్ల్యూ ఔటయ్యాడు. స్మిత్ సెన్సేషనల్ క్యాచ్.. 49 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన భారత్ ఫస్ట్ స్లిప్‌లో స్టీవ్ స్మిత్ సెన్సేషనల్ క్యాచ్ పట్టడంతో హార్ధిక్ పాండ్యా (1) పెవిలియన్ బాటపట్టక తప్పలేదు. దీంతో టీమిండియా 49 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. విరాట్ కోహ్లి (22), జడేజా క్రీజ్‌లో ఉన్నాడు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. రాహుల్ ఔట్, 4 వికెట్లు స్టార్క్ ఖాతాలోకే మిచెల్ స్టార్క్ టీమిండియాను దారుణంగా దెబ్బకొడుతున్నాడు. ఇప్పటికే 3 వికెట్లు పడగొట్టిన స్టార్క్.. కేఎల్ రాహుల్ (9)ను కూడా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 9 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 49/4. కోహ్లి (22), హార్ధిక్ (1) క్రీజ్‌లో ఉన్నారు. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన భారత్.. స్కై మరో డకౌట్ టీమిండియా కష్టాల్లో పడింది. స్టార్క్ వరుస బంతుల్లో రోహిత్ శర్మ (13), సూర్యకుమార్ యాదవ్‌లకు ఔట్‌చేసి టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టాడు. 4.5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 32/3గా ఉంది. విరాట్ కోహ్లి (15), కేఎల్ రాహుల్ క్రీజ్‌లో ఉన్నారు. రోహిత్ శర్మ ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా 13 పరుగులు చేసిన రోహిత్ శర్మ స్టార్క్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. మూడు ఓవర్లలో టీమిండియా స్కోరు 29/1 మూడు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. కోహ్లి 14, రోహిత్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. గిల్ డకౌట్.. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే టీమిండియాకు షాక్ తగిలింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో గిల్ డకౌట్ అయ్యాడు. లబుషేన్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి నాలుగు పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేయనున్న భారత్ విశాఖ వేదికగా ఇవాళ (మార్చి 19) జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోతుందేమోనని ఆందోళన చెందిన అభిమానులకు శుభవార్త. వరుణుడు శాంతించి, ఎండ కాయడంతో జరుగదనుకున్న మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆసీస్ రెండు మార్పులతో బరిలోకి దిగనుండగా.. టీమిండియా ఒక్క మార్పు చేసింది. మ్యాక్స్‌వెల్ స్థానంలో నాథన్ ఇల్లీస్, జోస్ ఇంగ్లిస్ ప్లేస్‌లో అలెక్స్ క్యారీ బరిలోకి దిగనుండగా.. భారత్ నుంచి శార్దూల్ ఠాకూర్ స్థానాన్ని అక్షర్ పటేల్ భర్తీ చేయనున్నాడు. తుది జట్లు.. భారత్: శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లాబుషేన్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, నాథన్ ఇల్లీస్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా -
కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ హవా.. వరుసగా నాలుగో విజయం
కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ హవా.. వరుసగా నాలుగో విజయం వారియర్జ్ నిర్ధేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. యస్తిక భాటియా (42), నాట్ సీవర్ బ్రంట్ (45 నాటౌట్), హర్మన్‌ప్రీత్ కౌర్ (53 నాటౌట్) మెరుపుల సహకారంతో 17.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. యస్తికా భాటియా మెరుపులు 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. మెరుపు వేగంతో ఇన్నింగ్స్ ప్రారంభించింది. యస్తికా భాటియా 19 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేయగా.. హేలీ మాథ్యూస్ 11 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 10 పరుగులు చేసింది. 5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 40/0గా ఉంది. మెత్తంగా యూపీ వారియర్స్‌పై 8 వికెట్లు తేడా, 162 పరుగులతో యూపీ వారియర్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. రాణించిన హీలీ, మెక్‌గ్రాత్.. తిప్పేసిన ఇషాఖీ, కెర్ అలైసా హీలీ (58), తహీల మెక్‌గ్రాత్ (50) హాఫ్‌సెంచరీలతో రాణించడంతో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో యూపీ వారియర్జ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. హీలీ, మెక్‌గ్రాత్ మినహా వారియర్జ్ ఇన్నింగ్స్‌లో అందరూ విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో సైకా ఇషాఖీ 3, అమేలియా కెర్ 2, హేలీ మాథ్యూస్ ఓ వికెట్ పడగొట్టారు. నిలకడగా ఆడుతున్న అలైసా హీలీ మెక్‌గ్రాత్ 58 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన యూపీ వారియర్జ్‌ను కెప్టెన్ అలైసా హీలీ (39), తహీల మెక్‌గ్రాత్ (38) ఆదుకున్నారు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూనే స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 13 ఓవర్ల తర్వాత వారియర్జ్ స్కోర్ 113/2గా ఉంది, దేవిక (6)ను సైకా ఇషాఖీ.. కిరణ్ నవగరే (17)ను అమేలియా కెర్ ఔట్ చేశారు. హ్యాట్రిక్ ఫోర్లు బాదిన హీలీ ముంబై బౌలర్ సైకా ఇషాఖీ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్లో యూపీ వారియర్జ్ సారధి అలైసా హీలీ హ్యాట్రిక్ ఫోర్లు సహా మొత్తం 4 బౌండరీలు బాదింది. ఫలితంగా వారియర్జ్ స్కోర్ 5 ఓవర్ల తర్వాత 39/1గా ఉంది. హీలీ (23), కిరణ్ నవగిరే (6) క్రీజ్‌ల ఉన్నారు. అంతకుముందు రెండో ఓవర్ ఆఖరి బంతికి సైకా ఇషాఖీ.. దేవిక వైద్య (6) ఎల్బీడబ్ల్యూ చేసింది. మహిళల ఐపీఎల్ (WPL) అరంగేట్రం సీజన్ (2023)లో భాగంగా బ్రబోర్న్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, యూపీ వారియర్జ్ జట్లు ఇవాళ (మార్చి 12) తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ వారియర్జ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. యూపీ వారియర్జ్ టీమ్‌లో హ్యారిస్ స్థానంలో ఇస్మాయిల్ బరిలోకి దిగనుండగా.. ముంబై జట్టు పూజా స్థానంలో ధారాను బరిలోకి దించుతుంది. పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో గెలుపొందిన ముంబై టాప్ ప్లేస్‌లో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ (4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు), యూపీ వారియర్జ్ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), గుజరాత్ జెయింట్స్ (4 మ్యాచ్‌ల్లో ఓ విజయం), ఆర్సీబీ (4 మ్యాచ్‌ల్లో 4 పరాజయాలు) వరుస స్థానాల్లో ఉన్నాయి. ముంబై ఇండియన్స్: యస్తికా భాటియా (వికెట్‌కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ సీవర్ బ్రంట్, హర్మన్ప్రీతి కౌర్ (కెప్టెన్), ధారా గుజ్జర్, అమేలియా కెర్, ఇస్సీ వాంగ్, అమన్‌జ్యోత్ కౌర్, హుమైరా ఖాజీ, జింటిమని కలిత, సైకా ఇషాఖీ యూపీ వారియర్జ్: దేవిక వైద్య, అలైసా హీలీ (కెప్టెన్/వికెట్‌కీపర్), శ్వేతా సెహ్రావత్, కిరణ్ నవగిరే, తహీలా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, సిమ్రాన్ షేక్, సోఫీ ఎక్లెస్టోన్, షబ్నిమ్ ఇస్మాయిల్, అంజలీ శర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్ -
IND VS AUS 4th Test: సెంచరీతో చెలరేగిన ఖవాజా.. తొలి రోజు ఆసీస్‌దే
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు మొదటి రోజు ఆటముగిసింది. తొలి రోజు ఆటలో టీమిండియాపై ఆసీస్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖవాజా(104 నాటౌట్) అద్భుతమైన సెంచరీ సాధించాడు. అతడితో పాటు కామెరాన్ గ్రీన్ 49 పరుగులతో క్రీజులో ఉన్నాయి. ఇక భారత బౌలర్లలో షమీ రెండు వికెట్లు పడగొట్టగా.. జడేజా, అశ్విన్ తలా వికెట్ సాధించారు. 170 పరుగుల వద్ద ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన హ్యాండ్స్కాంబ్.. మహ్మద్ షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు, మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్ టీమిండియా ఎట్టకేలకు మూడో వికెట్ సాధించింది. 38 పరుగులు చేసిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి హ్యాండ్స్ కాంబ్ వచ్చాడు. 64 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు: 152/3 టీ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా స్కోరు: 149/2 (62) 60 ఓవర్లలో ఆసీస్ స్కోరు: 145-2 హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఖ్వాజా ఇన్నింగ్స్ ఆరంభం నుంచి చాలా కాన్ఫిడెంట్‌గా ఆడిన ఉస్మాన్ ఖ్వాజా 146 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. షమీ బౌలింగ్‌లో బౌండరీ బాది ఈ మార్కును అందుకున్నాడు. 49 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 128/2గా ఉంది. ఖ్వాజా (56)తో పాటు స్టీవ్ స్మిత్ (26) క్రీజ్‌లో ఉన్నాడు. 100 దాటిన ఆసీస్ స్కోర్.. లంచ్ తర్వాత టీమిండియాకు లభించని ఫలితం లంచ్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసిన ఆస్ట్రేలియా, ఆతర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. ఈ క్రమంలో ఆ జట్టు 42వ ఓవర్లో 100 పరుగుల మార్కు దాటింది. ఉస్మాన్ ఖ్వాజా (47) హాఫ్ సెంచరీ దిశగా సాగుతుండగా, స్టీవ్ స్మిత్ 12 పరుగుల బ్యాటింగ్ కొనసాగిస్తుతున్నాడు. 42 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 105/2గా ఉంది. లంచ్ సమయానికి ఆసీస్ స్కోర్ 75/2, అశ్విన్, షమీకి తలో వికెట్ తొలి రోజు లంచ్ సమయానికి ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. ట్రివిస్ హెడ్ (32), లబూషేన్ (3) ఔట్ కాగా, ఉస్మాన్ ఖ్వాజా (27), స్టీవ్ స్మిత్ (2) క్రీజ్‌లో ఉన్నారు. హెడ్‌ను అశ్విన్, లబూషేన్‌ను షమీ ఔట్ చేశారు. రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్.. లబూషేన్ (3) ఔట్ జట్టు స్కోర్ 72 పరుగుల వద్ద ఉండగా ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో లబూషేన్ (3) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఉస్మాన్ ఖ్వాజా (26), స్టీవ్ స్మిత్ క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. హెడ్ (32) ఔట్ 16వ ఓవర్ మూడో బంతికి ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి ట్రవిస్ హెడ్ (32) ఔటయ్యాడు. 16 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 62/1. ఉస్మాన్ ఖ్వాజా (18), లబూషేన్ (1) క్రీజ్‌లో ఉన్నారు. 7 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 24/0, శ్రీకర్ భరత్ చెత్త వికెట్‌కీపింగ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఆచితూచి ఆడుతుంది. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 24/0గా ఉంది. శ్రీకర్ భరత్ చెత్త వికెట్‌కీపింగ్ కారణంగా ట్రవిస్ హెడ్‌కు లైఫ్ లభించింది. ఉమేశ్ బౌలింగ్‌లో హెడ్ అందించిన సునాయాసమైన క్యాచ్‌ను భరత్ నేలపాలు చేశాడు. అంతకుముందు ఆ తర్వాత కూడా భరత్ వికెట్ వెనకాల చాలా తప్పిదాలు చేసి అనసవర పరుగులిచ్చాడు. ఇషాన్ కిషన్‌ను కాదని భరత్‌ను వరుసగా నాలుగో టెస్ట్‌లో కూడా కొనసాగించిన విషయం తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా ఇవాల్టి నుంచి (మార్చి 9) నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఒక్క మార్పు చేయగా.. ఆసీస్ మూడో టెస్ట్‌లో బరిలోకి దిగిన జట్టునే కొనసాగించింది. సిరాజ్ స్థానంలో షమీ జట్టులో చేరాడు. 4 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. 75 ఏళ్ల భారత్-ఆస్ట్రేలియా మైత్రి సంబరాల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ మ్యాచ్ వీక్షించేందుకు స్టేడియంకు విచ్చేశారు. ఇరువురు దేశ ప్రధానులు ప్రత్యేక వాహనంలో స్టేడియం మొత్తం తిరిగి అభిమానులకు అభివాదం చేశారు. మ్యాచ్‌కు ముందు మోదీ, అల్బనీస్ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీని సందర్శించారు. అనంతరం మోదీ, అల్బనీస్ కలిసి కాసేపు కామెంట్రీ చెప్పే అవకాశం ఉంది. -
IND VS AUS: ముగిసిన రెండో రోజు ఆట.. 163 పరుగులకు టీమిండియా ఆలౌట్
Ind Vs Aus 3rd Test Indore 2nd Day Updates: ముగిసిన రెండో రోజు ఆట 163 పరుగుల వద్ద టీమిండియా రెండో ఇన్నింగ్స్ ముగించింది. ఆస్ట్రేలియా కంటే కేవలం 75 పరుగుల ఆధిక్యం మాత్రమే సంపాదించగలిగింది. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ అత్యధికంగా 8 వికెట్లు తీయగా.. మరో స్పిన్నర్ మథ్యూ కుహ్నెమన్‌కు ఒకటి, పేసర్ స్టార్క్‌కు ఒక వికెట్ దక్కాయి. టీమిండియా బ్యాటర్లలో ఛతేశ్వర్ పుజారా 59 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 57: టీమిండియా స్కోరు: 155-9. కేవలం 67 పరుగుల ఆధిక్యం 56.4: తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా లియోన్ బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్ గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. డకౌట్‌గా వెనుదిరిగాడు. 56.3: ఎనిమిదో వికెట్ డౌన్ లియోన్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి పుజారా (59) అవుట్. 54: టీమిండియా స్కోరు: 145/7 48.1: అశ్విన్ రూపంలో ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా నాథన్ లియోన్ బౌలింగ్‌లో అశ్విన్(16) బౌల్డ్ అయ్యాడు. 40.1: ఆరో వికెట్ కోల్పోయిన భారత్ నాథన్ లియోన్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్ బౌల్డ్ అయ్యాడు. మూడు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. ఈ క్రమంలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది.స్కోరు- 118/6 (40.1). పుజారా (46), అశ్విన్ (0) క్రీజులో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా 37.2: శ్రేయస్ అయ్యర్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఖవాజాకు క్యాచ్ ఇచ్చి అయ్యర్ అవుటయ్యాడు. 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మైదానాన్ని వీడాడు. పుజారా, శ్రీకర్ భరత్ క్రీజులో ఉన్నారు. భారత్ స్కోరు: 115-5(38) జడేజా ఔట్.. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. ఆస్ట్రేలియా స్పిన్నర్ల దాటికి భారత బ్యాటర్లు తడబడుతున్నారు. క్రీజులో కుదురుకున్నట్లే కన్పించిన ఆల్‌రౌండర్ జడేజా.. లయోన్ బౌలింగ్‌లో ఎల్బీబ్ల్యూగా వెనుదిరిగాడు. 36 బంతులో ఏడు పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో భారత్ 78 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్, పుజారా 36(76) ఉన్నారు. విరాట్ కోహ్లి ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన భారత్ టీమిండియాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. క్రీజ్‌లో కుదురుకుని టీమిండియాను గట్టెక్కిస్తాడని ఆశించిన విరాట్ కోహ్లి మరోసారి విఫలమై పెవిలియన్‌కు చేరాడు. కుహ్నేమన్ మరోసారి కోహ్లిని (13) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కోహ్లి ఔటయ్యే సమయానికి టీమిండియా స్కోర్ 54/3గా ఉంది. పుజారా (20), జడేజా (0) క్రీజ్‌లో ఉన్నారు. భారత్.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 34 పరుగులు వెనుకపడి ఉంది. రెండో వికెట్ కోల్పోయిన భారత్.. రోహిత్ ఔట్ 32 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. లయోన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ (12) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు టీమిండియా ఇంకా 56 పరుగులు వెనుకపడే ఉంది. పుజారా (11), కోహ్లి క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన భారత్.. గిల్ క్లీన్ బౌల్డ్ లంచ్ విరామం తర్వాత లయోన్ వేసిన తొలి ఓవర్లోనే భారత్ వికెట్ కోల్పోయింది, లయోన్ బౌలింగ్‌లో ముందుకు వచ్చి భారీ షాట్ ఆడే క్రమంలో గిల్ (5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. లంచ్ సమయానికి భారత్ స్కోర్ 13/0 156/4 స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. లంచ్ విరామం సమయానికి వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 75 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. 197 పరుగులకే ఆలౌటైన ఆసీస్ 156/4 స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌటైంది. ఈ రోజు ఆసీస్ కోల్పోయిన 6 వికెట్లలో అశ్విన్, ఉమేశ్ చెరి సగం పంచుకున్నారు. వీరిద్దరు ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌పై ఎదురుదాడికి దిగి వికెట్లు పడగొట్టారు. ఆస్ట్రేలియాకు 88 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై ఉమేశ్ యాదవ్ రెచ్చిపోతున్నాడు. ఇవాళ ఆసీస్ కోల్పోయిన 5 వికెట్లలో ఉమేశ్ ఒక్కడే 3 వికెట్లు పడగొట్టాడు. మర్ఫీని ఉమేశ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా 196 పరుగుల వద్ద ఆస్ట్రేలియా 8వ వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్ అలెక్స్ క్యారీ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. వారెవ్వా ఉమేశ్.. స్పిన్ పిచ్‌పై ప్రతాపం చూపిస్తున్నావు..! డ్రింక్స్ బ్రేక్ తర్వాత ఆస్ట్రేలియా వరుసగా 3 వికెట్లు కోల్పోయింది. హ్యాండ్స్‌కోంబ్‌ను అశ్విన్ పెవిలియన్‌కు పంపగా.. గ్రీన్, స్టార్క్‌లను ఉమేశ్ ఔట్ చేశాడు. స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై ఉమేశ్ నిప్పులు చెరుగుతూ వికెట్లు పడగొడుతున్నాడు. గ్రీన్‌ను ఎల్బీడబ్ల్యూ చేసిన ఉమేశ్.. స్టార్క్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. 74 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 196/7. వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయిన ఆసీస్ రెండో రోజు చాలా సమయం వరకు నిలకడగా ఆడిన ఆసీస్.. డ్రింక్స్ బ్రేక్ తర్వాత వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయింది. తొలు హ్యాండ్స్‌కోంబ్‌ను యాష్ బోల్తా కొట్టించగా.. మరుసటి ఓవర్లో ఉమేశ్ యాదవ్.. గ్రీన్ (21)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 72 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 188/6గా ఉంది. అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్ క్రీజ్‌లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట మొదలయ్యాక చాలా సేపు నిలకడగా ఆడిన హ్యాండ్స్‌కోంబ్‌ను (19) ఎట్టకేలకు అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. 71వ ఓవర్లో షార్ట్ లెగ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి హ్యాండ్స్కోంబ్ వెనుదిరిగాడు. 71 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 186/5గా ఉంది. గ్రీన్ (19), అలెక్స్ క్యారీ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఆచితూచి ఆడుతున్న గ్రీన్, హ్యాండ్స్కోంబ్ ఓవర్‌నైట్ స్కోర్ 156/4 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆచితూచి ఆడుతుంది. హ్యాండ్స్కోంబ్ (16), గ్రీన్ (17) చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ.. క్రీజ్‌లో కుదురుకునే ప్రయత్నం చేస్తున్నారు. 66 ఓవర్లు ముగిసే ఆసీస్ స్కోర్ 177/4గా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు 68 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండో రోజు ఆట ప్రారంభం.. రవీంద్రుడి మాయాజాలం కొనసాగేనా..? ఓవర్‌నైట్ స్కోర్ 156/4 వద్ద ఆస్ట్రేలియా రెండో రోజు ఆటను ప్రారంభించింది. ట్రవిస్ హెడ్ (9), ఉస్మాన్ ఖ్వాజా (60), లబూషేన్ (31), స్టీవ్ స్మిత్ (26) ఔట్ కాగా.. హ్యాండ్స్కోంబ్ (7), గ్రీన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ కోల్పోయిన వికెట్లన్నీ జడేజా ఖాతాలోకే వెళ్లాయి. ప్రస్తుతానికి ఆసీస్ 47 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌటైంది. కుహ్నేమన్ (5/16) టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేయగా.. లయోన్ (3/35), మర్ఫీ (1/23) భారత జట్టు పతనంలో తమవంతు పాత్ర పోషించారు. విరాట్ కోహ్లి (22) భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తుది జట్లు.. భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబూషేన్, పీటర్ హ్యాండ్స్కోంబ్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, టాడ్ మర్ఫీ , నాథన్ లియోన్, మార్క్ కుహ్నేమన్ -
పాక్‌ను మట్టికరిపించిన భారత్.. టీ20 వరల్డ్‌కప్‌లో బోణీ విక్టరీ
పాక్‌ను మట్టికరిపించిన భారత్.. టీ20 వరల్డ్‌కప్‌లో బోణీ విక్టరీ మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా బోణీ విక్టరీ నమోదు చేసింది. సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో భారత్.. తమ తొలి మ్యాచ్‌లోనే దాయాది పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. కెప్టెన్ మారూఫ్ (68 నాటౌట్), అయేషా నసీం (43 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్.. షెఫాలీ వర్మ (33), జెమీమా రోడ్రిగెస్ (53 నాటౌట్), రిచా ఘోష్ (31 నాటౌట్) చెలరేగడంతో 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. మూడో వికెట్ కోల్పోయిన భారత్ 93 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. సంధూ బౌలింగ్‌లో మారూఫ్‌కు క్యాచ్ ఇచ్చి హర్మన్ కౌర్ (16) ఔటైంది. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 95/3. రెండో వికెట్ కోల్పోయిన భారత్ 65 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. సంధూ బౌలింగ్‌లో అమీన్‌కు క్యాచ్ ఇచ్చి షెఫాలీ వర్మ (33) ఔటైంది. 10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 67/2. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 150 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్.. 38 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. సాదియా ఇక్బాల్ బౌలింగ్‌లో ఫాతిమా సనాకు క్యాచ్ ఇచ్చి యస్తికా భాటియా (17) ఔటైంది. 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 43/1. విజృంభించిన అయేషా నసీం.. సత్తా చాటిన బిస్మా మారూఫ్ కెప్టెన్ బిస్మా మారూఫ్ (55 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు), మిడిలార్డర్ బ్యాటర్ అయేషా నసీం (23 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ 2, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ తలో వికెట్ పడగొట్టారు. తిప్పేసిన రాధా యాదవ్.. నాలుగో వికెట్ కోల్పోయిన పాక్ లెఫ్ట్ ఆర్మ స్పిన్నర్ రాధా యాదవ్ మాయాజాలం ధాటికి పాకిస్తాన్ 68 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 12.1వ ఓవర్లో రాధా బౌలింగ్‌లో రిచా ఘోష్‌కు క్యాచ్ ఇచ్చి అమీన్ (11) ఔటైంది. 15 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 91/4గా ఉంది. ఫైర్ మీదున్న టీమిండియా బౌలర్లు, 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పాక్ టీమిండియా బౌలర్లు ఫైర్ మీదున్నారు. దీప్తి శర్మ, రాధా యాదవ్, పూజా వస్త్రాకర్ తలో వికెట్ తీయడంతో పాక్ 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. వస్త్రాకర్ బౌలింగ్‌లో రిచాకు క్యాచ్ ఇచ్చి నిదా దార్ (0) డకౌటైంది. 8 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 46/3. రెండో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్.. రిచా ఘోష్ సూపర్ స్టంపింగ్ 42 పరుగుల వద్ద పాక్ రెండో వికెట్ కోల్పోయింది. రాధా యాదవ్ బౌలింగ్‌లో రిచా ఘోష్ సూపర్ స్టంపింగ్ చేయడంతో మునీబా అలీ (12) పెవిలియన్ బాట పట్టింది. 7 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 42/2గా ఉంది. తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 10 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. దీప్తి శర్మ బౌలింగ్‌లో హర్మన్‌కు క్యాచ్ ఇచ్చి జవేరియా ఖాన్ (8) ఔటైంది. 4.4 ఓవర్ల తర్వాత పాకిస్తాన్ స్కోర్ 31/1గా ఉంది. బిస్మా మారూఫ్ (18), మునీబా అలీ (5) క్రీజ్‌లో ఉన్నారు. ICC Womens T20 WC 2023 IND VS PAK: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇవాళ (ఫిబ్రవరి 12) భారత్-పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. మెగా టోర్నీలో తొలి మ్యాచ్ ఆడుతున్న ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఈ మ్యాచ్ ఆడటం లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా స్మృతి చేతి వేలికి గాయమైంది. స్మృతి స్థానంలో హర్లీన్ డియోల్ తుది జట్టులోకి వచ్చిందని, ఈ మ్యాచ్‌కు శిఖా పాండే దూరంగా ఉందని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ అనంతరం వెల్లడించారు. పాక్ జట్టులో సైతం ఓ కీలక ప్లేయర్ మ్యాచ్‌కు దూరమైంది. డయానా బేగ్ ఇవాల్టి మ్యాచ్ ఆడటం లేదని పాక్ కెప్టెన్ బిస్మా మారూఫ్ తెలిపింది. తుది జట్లు: భారత్: షెఫాలీ వర్మ, యస్తిక భాటియా, జెమీమా రోడ్రిగెస్, హర్లీన్ డియోల్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్‌కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్ పాకిస్తాన్: జవేరియా ఖాన్, మునీబా అలీ (వికెట్‌కీపర్), బిస్మా మారూఫ్ (కెప్టెన్), నిదా దార్, సిద్రా అమీన్, అలీయా రియాజ్, అయేషా నసీమ్, ఫాతిమా సనా, ఎయిమన్ అన్వర్, సష్రా సంధూ, సాదియా ఇక్బాల్ -
వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ హైలైట్స్
-
IND VS NZ 3rd ODI: వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దు
New Zealand vs India, 3rd ODI: న్యూజిలాండ్- టీమిండియా మధ్య మూడో వన్డేకు కూడా వర్షం అడ్డంకిగా నిలిచింది. దీంతో ఫలితం తేలకుండానే ఈ మ్యాచ్ కూడా ముగిసిపోయింది. ఈ క్రమంలో మొదటి వన్డేలో గెలిచిన ఆతిథ్య కివీస్ సిరీస్‌ను 1-0తో సొంతం చేసుకుంది. ఇక రెండో వన్డేలో కూడా వరణుడి ఆటంకం కారణంగా మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే. వరుణుడి ఆటంకం.. కివీస్ గెలవాలంటే..! ఇన్నింగ్స్ 18 ఓవర్ల తర్వాత వరుణుడు ఆటంకం కలిగించాడు. ఈ సమయానికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. న్యూజిలాండ్ గెలవాలంటే మరో 32 ఓవర్లలో 116 పరుగులు చేయాల్సి ఉంటుంది. కాన్వే (38), విలియమ్సన్ క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ తొలి వికెట్‌కు 97 పరుగులు జోడించాక న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి ఫిన్ అలెన్ (57) ఔటయ్యాడు. గేర్ మార్చిన ఓపెనర్లు.. లక్ష్యం దిశగా సాగుతున్న కివీస్ ఆరంభంలో ఆచితూచి ఆడిన కివీస్ ఓపెనర్లు ఆతర్వాత క్రమంగా వేగం పెంచారు. ఫిన్ అలెన్ (53) హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడుతుండగా.. డెవాన్ కాన్వే (31) నిదానంగా ఆడుతున్నాడు. 16 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 93/0. ఆ జట్టు గెలవాలంటే 34 ఓవర్లలో మరో 127 పరుగులు చేయాల్సి ఉంది. టార్గెట్ 220.. ఆచితూచి ఆడుతున్న కివీస్ ఓపెనర్లు 220 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందకు బరిలోకి దిగిన కివీస్ ఆచితూచి ఆడుతుంది. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 28/0. డెవాన్ కాన్వే (7), ఫిన్ అలెన్ (16) క్రీజ్‌లో ఉన్నారు. రాణించిన సుందర్, శ్రేయస్.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా పేలవ బ్యాటింగ్ ప్రదర్శనతో నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. శ్రేయస్ అయ్యర్ (49), వాషింగ్టన్ సుందర్ (51) ఓ మోస్తరుగా రాణించడంతో టీమిండియా 47.3 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌటైంది. కివీస్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, సౌథీ 2, ఫెర్గూసన్, సాంట్నర్ తలో వికెట్ దక్కించుకున్నారు. తొమ్మిదో వికెట్ డౌన్.. పోరాడుతున్న సుందర్ 47వ ఓవర్ రెండో బంతికి అర్షదీప్ సింగ్ ఔటయ్యాడు. ఫలితంగా టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 46.1 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 213/9. సుందర్ (45) ఒక్కడు పోరాడుతున్నాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా 44.3వ ఓవర్లో టీమిండియా 8వ వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్‌లో సౌథీకి క్యాచ్ ఇచ్చి చహల్ (8) ఔటయ్యాడు. 45 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 206/8. సుందర్ (44), అర్షదీప్ సింగ్ (3) క్రీజ్‌లో ఉన్నారు. ఏడో వికెట్ కోల్పోయిన భారత్ 170 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన దీపక్ చహర్.. మిచెల్ బౌలింగ్‌లో సౌథీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆరో వికెట్ డౌన్ 149 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. సౌథీ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ టామ్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి దీపక్ హుడా (12) ఔటయ్యాడు. సుందర్, చాహర్ క్రీజ్‌లో ఉన్నారు. కష్టాల్లో టీమిండియా.. 121 పరుగులకే సగం వికెట్లు డౌన్ 121 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో చిక్కుకుంది. మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన శ్రేయస్ అయ్యర్ 49 పరుగుల వద్ద ఔటయ్యాడు. వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా క్రీజ్‌లో ఉన్నారు. డేంజరెస్ సూర్యకుమార్ యాదవ్ ఔట్ 25వ ఓవర్ తొలి బంతికి డేంజరెస్ సూర్యకుమార్ యాదవ్ (6) ఔటయ్యాడు. ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో సౌథీకి క్యాచ్ ఇచ్చి స్కై పెవిలియన్ బాటపట్టాడు. 25 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 116/4. శ్రేయస్ అయ్యర్ (49), దీపక్ హుడా (1) క్రీజ్‌లో ఉన్నారు. మళ్లీ నిరాశపర్చిన పంత్.. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా ఇటీవలి కాలంలో వరుసగా విఫలమవుతున్న పంత్, మరోసారి నిరాశపరిచాడు. 16 బంతుల్లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి మిచెల్ బౌలింగ్‌లో ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 21 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 87/3. శ్రేయస్ అయ్యర్ (28), సూర్యకుమార్ యాదవ్ క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా 13వ ఓవర్ ఆఖరి బంతికి టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో కెప్టెన్ శిఖర్ ధవన్ (28) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 13 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 55/2. శ్రేయస్ అయ్యర్ (12), రిషబ్ పంత్ క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. గిల్ ఔట్ 8వ ఓవర్ నాలుగో బంతికి టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. పరుగులు చేసేందుకు బాగా ఇబ్బంది పడిన శుభ్‌మన్ గిల్ (22 బంతుల్లో 13) ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో సాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 43/1. నత్త నడకన సాగుతున్న టీమిండియా బ్యాటింగ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా.. ఆచితూచి బ్యాటింగ్ చేస్తుంది. ఓపెనర్లలో శిఖర్ ధవన్ (25) ఓ మోస్తరుగా ఆడుతుండగా.. గిల్ (5) నిదానంగా ఆడుతున్నాడు. 8 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 31/0. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లే పార్క్ వేదికగా ఇవాళ (నవంబర్ 30) జరుగనున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా టాస్ ఆలస్యంగా వేశారు. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఉదయం 7 గంటకు ప్రారంభమవుతుంది. భారత తుది జట్టు.. శిఖర్ ధవన్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, దీపక్ హూడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, చహల్ న్యూజిలాండ్ తుది జట్టు.. ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీ, లోకీ ఫెర్గూసన్ -
టీ ట్వంటీ ప్రపంచకప్ విజేత ఇంగ్లాండ్
-
అదృష్టం ఈ కెప్టెన్ దే.... ఆడేదేలే అయినా ఓడేదేలే
-
India vs South Africa 3rd T20: చివరిది వదిలేశారు.. పోరాడకుండానే..
ఇండోర్: టీమిండియా టి20 ప్రపంచకప్ సన్నాహకం పరాజయంతో ముగిసింది. మెగా టోర్నీకి ముందు ఆడిన చివరి పోరులో భారత్ ఓటమి పాలైంది. ఇప్పటికే సిరీస్ చేజార్చుకున్న దక్షిణాఫ్రికా మూడో టి20లో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చి 49 పరుగులతో భారత్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. రిలీ రోసో (48 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) అంతర్జాతీయ టి20ల్లో తొలి సెంచరీ సాధించగా... డికాక్ (43 బంతుల్లో 68; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేశాడు. అనంతరం భారత్ 18.3 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. దినేశ్ కార్తీక్ (21 బంతుల్లో 46; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), దీపక్ చహర్ (17 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. భారత్ ఈ సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. భారీ భాగస్వామ్యాలు... కెప్టెన్ బవుమా (3) పేలవ ఫామ్ కొనసాగగా, మరో ఓపెనర్ డికాక్ మొదటి నుంచే ధాటిగా ఆడాడు. మూడో స్థానంలో వచ్చి రోసో కూడా దూకుడు కనబర్చడంతో దక్షిణాఫ్రికా వేగంగా పరుగులు రాబట్టింది. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 48 పరుగులకు చేరింది. అశ్విన్ బౌలింగ్‌లో రోసో (వ్యక్తిగత స్కోరు 24) ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీపై సిరాజ్ అందుకోలేకపోగా, అది సిక్స్‌గా మారింది. మరోవైపు ఉమేశ్ బౌలింగ్‌లో సిక్స్‌తో 33 బంతుల్లో డికాక్ అర్ధసెంచరీ పూర్తయింది. రెండో వికెట్‌కు 47 బంతుల్లో 89 పరుగులు జోడించిన తర్వాత డికాక్ రనౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం రోసో 27 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. చహర్, హర్షల్ ఓవర్లలో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టిన 90ల్లోకి చేరిన రోసో... చివరి ఓవర్ రెండో బంతికి సింగిల్ తీసి శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. చహర్ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా మూడు సిక్స్‌లు బాది డేవిడ్ మిల్లర్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 సిక్స్‌లు) ఇన్నింగ్స్‌కు ఘనమైన ముగింపునిచ్చాడు. పోరాడకుండానే... 8 ఓవర్లు ముగిసేసరికి ఐదుగురు బ్యాటర్లు పెవిలియన్‌కు... క్రీజ్‌లో ఇద్దరు బౌలర్లు అక్షర్, హర్షల్! ఛేదనలో భారత జట్టు పరిస్థితి ఇది. ఓపెనర్‌గా వచ్చిన ‘బర్త్‌డే బాయ్’ పంత్ (14 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), కార్తీక్ క్రీజ్‌లో ఉన్న కొద్దిసేపు (20 బంతుల్లో 41 పరుగుల భాగస్వామ్యం) టీమిండియాకూ విజయవకాశాలు ఉన్నాయని అనిపించింది. గత మ్యాచ్‌లో భారీ లక్ష్యమే అయినా దక్షిణాఫ్రికా పోరాడిన తరహాలో భారత్ కూడా చెలరేగవచ్చని భావించినా అది సాధ్యం కాలేదు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (రనౌట్) 68; బవుమా (సి) రోహిత్ (బి) ఉమేశ్ 3; రోసో (నాటౌట్) 100; స్టబ్స్ (సి) అశ్విన్ (బి) చహర్ 23; మిల్లర్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 227. వికెట్ల పతనం: 1–30, 2–120, 3–207. బౌలింగ్: చహర్ 4–0–48–1, సిరాజ్ 4–0–44–0, అశ్విన్ 4–0– 35–0, ఉమేశ్ 3–0–34–1, హర్షల్ 4–0–49–0, అక్షర్ 1–0–13–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) రబడ 0; పంత్ (సి) స్టబ్స్ (బి) ఇన్‌గిడి 27; శ్రేయస్ (ఎల్బీ) (బి) పార్నెల్ 1; కార్తీక్ (బి) మహరాజ్ 46; సూర్యకుమార్ (సి) స్టబ్స్ (బి) ప్రిటోరియస్ 8; అక్షర్ (సి) డి కాక్ (బి) పార్నెల్ 9; హర్షల్ (సి) మిల్లర్ (బి) ఇన్‌గిడి 17, అశ్విన్ (సి) రబడ (బి) మహరాజ్ 2, చహర్ (సి) మిల్లర్ (బి) ప్రిటోరియస్ 31; ఉమేశ్ (నాటౌట్) 20; సిరాజ్ (సి) మిల్లర్ (బి) ప్రిటోరియస్ 5; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (18.3 ఓవర్లలో ఆలౌట్) 178. వికెట్ల పతనం: 1–0, 2–4, 3–45, 4–78, 5–86, 6–108, 7–114, 8–120, 9–168, 10–178. బౌలింగ్: రబడ 4–0–24–1, పార్నెల్ 4–0–41–2, ఇన్‌గిడి 3–0–51–2, మహ రాజ్ 4–0–34–2, ప్రిటోరియస్ 3.3–0–26–3. -
వరద నష్టం అంచనాల నమోదు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని ఆదేశం
-
ఐర్లాండ్‌పై టీమిండియా ఘన విజయం
ఐర్లాండ్‌పై టీమిండియా ఘన విజయం ఐర్లాండ్‌తో జరగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధిచింది. వర్షం కారణంగా 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత ఐర్లాండ్ 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లలో హ్యారీ టెక్టర్(64) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో భువీ, పాండ్యా, అవేశ్, చహల్ తలా ఒక వికెట్ తీశారు. ఇక 109 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 9.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో దీపక్ హుడా(47), ఇషాన్ కిషన్(26), హార్ధిక్ పాండ్యా(24) పరుగులతో రాణించారు. మ్యాచ్ ప్రారంభానికి వరుణుడి ఆటంకం టాస్ తర్వాత వర్షం మొదలు కావడంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గాక మ్యాచ్ ప్రారంభంకానుంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని యువ భారత జట్టు ఇవాళ (జూన్ 26) ఐర్లాండ్‌తో తొలి టీ20 ఆడనుంది. డబ్లిన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా: హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), చహల్, ఆవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్ ఐర్లాండ్: ఆండ్రూ బాల్బిర్నీ (కెప్టెన్), హ్యారీ టెక్టార్, గ్యారీ డెలానీ, పాల్ స్టిర్లింగ్, లోర్కాన్ టక్కర్, మార్క్ అడైర్, జాషువా లిటిల్, జార్జ్ డాక్రెల్, ఆండీ మెక్‌బ్రైన్, కానర్ ఆల్ఫర్ట్, క్రెయిగ్ యంగ్ -
చెలరేగిన హర్షల్, చహల్.. మూడో టీ20లో టీమిండియా ఘన విజయం
సత్తా చాటిన భారత బౌలర్లు.. మూడో టీ20లో టీమిండియా ఘన విజయం భారత బౌలర్లు హర్షల్ పటేల్ (4/25), చహల్ (3/20) సత్తా చాటడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన కీలకమైన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్లు ఇషాన్ కిషన్ (54), రుతురాజ్ గైక్వాడ్ (57) అర్ధ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా.. ఛేదనలో సఫారీలు భారత బౌలర్ల ధాటికి 19.1 ఓవర్లలో 131 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో క్లాసెస్ (29) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా దక్షిణాఫ్రికా ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. ఓటమి దిశగా పయనిస్తున్న దక్షిణాఫ్రికా వరుస క్రమంలో వికెట్లు కోల్పోతున్న దక్షిణాఫ్రికా ఓటమి దిశగా పయనిస్తుంది. 9 వికెట్ కోల్పోయే సమయానికి జట్టు 7 బంతుల్లో 49 పరుగులు చేయాల్సి ఉంది. 71 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా భారత బౌలర్లు వరుస ఓవర్లలో వికెట్లు పడగొట్టడంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. 9వ ఓవర్లో చహల్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి ప్రిటోరియస్ (20) ఔట్ కాగా.. 11వ ఓవర్లో హర్షల్ పటేల్ బౌలింగ్‌లో గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి మిల్లర్ (3) వెనుదిరిగాడు. 11 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 71/5. క్రీజ్‌లో క్లాసెన్, పార్నెల్ ఉన్నారు. డస్సెన్ ఔట్ వరుస ఓవర్లలో దక్షిణాఫ్రికా వికెట్లు కోల్పోయింది. చహల్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి డస్సెన్ (1) ఔటయ్యాడు. 7 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 40/3. క్రీజ్‌లో ప్రిటోరియస్, క్లాసెన్ ఉన్నారు. రెండో వికెట్ డౌన్ ఇన్నింగ్స్ 6వ ఓవర్లో దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో చహల్‌కు క్యాచ్ ఇచ్చి హెండ్రిక్స్ (23) ఔటయ్యాడు. 6 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 38/2. క్రీజ్‌లో ప్రిటోరియస్, డస్సెన్ ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సఫారీ జట్టు ఇన్నింగ్స్ 4వ ఓవర్లో తొలి వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఆవేశ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి బవుమా(8) ఔటయ్యాడు. 4 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 23/1. క్రీజ్‌లో హెండ్రిక్స్, ప్రిటోరియస్ ఉన్నారు. సౌతాఫ్రికా టార్గెట్ 180 టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. ఓపెనర్లు రుతురాజ్, ఇషాన్ కిషన్‌లు అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఆఖర్లో హార్ధిక్ పాండ్యా (21 బంతుల్లో 31 నాటౌట్) రాణించడంతో టీమిండియా ఈ మాత్రం స్కోర్ సాధించగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ప్రిటోరియస్ 2, రబాడ, షంషి, కేశవ్ మహారాజ్ తలో వికెట్ పడగొట్టారు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్ రబాడ వేసిన 19వ ఓవర్లో దినేశ్ కార్తీక్ ఔటయ్యాడు. 8 బంతుల్లో 6 పరుగులు చేసిన డీకే పార్నెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 19 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 167/4. క్రీజ్‌లో హార్ధిక్ (20), అక్షర్ ఉన్నారు. పంత్ ఔట్ ప్రస్తుత సిరీస్‌లో రిషబ్ పంత్ పేలవ ఫామ్ కొనసాగుతుంది. తొలి రెండు టీ20ల్లో నిరాశపరిచిన పంత్ ఈ మ్యాచ్‌లోనూ విఫలయ్యాడు. 8 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేసిన పంత్ ప్రిటోరియస్ బౌలింగ్‌లో బవుమాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 17 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 148/4. క్రీజ్‌లో హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 3 పరుగుల వ్యవధిలో టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. 128 పరుగుల వద్ద శ్రేయస్ వికెట్ కోల్పోయిన భారత్ 131 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 54) వికెట్‌ను చేజార్చుకుంది. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 133/3. క్రీజ్‌లో పంత్, హార్ధిక్ పాండ్యా ఉన్నారు. మరోసారి నిరాశపరిచిన శ్రేయస్ వన్‌డౌన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మరోసారి నిరాశపరిచాడు. 11 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 14 పరుగులు చేసిన అతను.. షంషి బౌలింగ్‌లో నోర్జేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 128/2. క్రీజ్‌లో ఇషాన్ కిషన్ (53), పంత్ ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా ధాటిగా ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ 57 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు బాదిన రుతురాజ్ కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 97/1. క్రీజ్‌లో ఇషాన్ కిషన్ (36), శేయస్ అయ్యర్ ఉన్నారు. 30 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన రుతురాజ్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ధాటిగా ఆడుతున్న రుతురాజ్.. కేవలం 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ధనాధన్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాదిన రుతురాజ్.. కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 9 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 89/0గా ఉంది. రుతురాజ్ (54), ఇషాన్ కిషన్ (35) క్రీజ్‌లో ఉన్నారు. ధాటిగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్లు రుతురాజ్ (16), ఇషాన్ కిషన్ (6) మెరుపు వేగంతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఫలితంగా టీమిండియా 3 ఓవర్లలో వికెట్ నష్టాపోకుండా 22 పరుగులు చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా విశాఖ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. కీలకమైన ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. మరోవైపు 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందిన దక్షిణాఫ్రికా సైతం ఈ మ్యాచ్‌లో గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఆతృతగా ఉంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎలాంటి మార్పులేకుండా బరిలోకి దిగుతున్నాయి. భారత్ తుదిజట్టు: ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్ దక్షిణాఫ్రికా తుదిజట్టు: టెంబా బావుమా(కెప్టెన్), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డ్వైన్ ప్రిటోరియస్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబాడ, అన్రిచ్ నోర్ట్జే -
మెరిసిన శ్రేయస్.. మరో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
-
IND VS SL 2nd T20: బ్యాటర్ల విశ్వరూపం.. భారీ టార్గెట్‌ను ఊదేసిన రోహిత్ సేన
-
ఇషాన్, శ్రేయస్‌ల విధ్వంసం.. తొలి టీ20లో టీమిండియా ఘన విజయం
-
IND Vs NAM: రాణించిన రోహిత్, రాహుల్.. నమీబియాపై టీమిండియా ఘన విజయం
రాణించిన రోహిత్, రాహుల్.. నమీబియాపై టీమిండియా ఘన విజయం సమయం 22:28.. నామమాత్రపు మ్యాచ్‌లో నమీబియా నిర్ధేశించిన 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా.. రోహిత్ శర్మ(37 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్(36 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో రాణించడంతో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాహుల్, సూర్యకుమార్ యాదవ్(19 బంతుల్లో 25; 4 ఫోర్లు)లు 15.2 ఓవర్లలో టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. నమీబియా బౌలర్లలో ఫ్రైలింక్‌కు ఏకైక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ విజయంతో టీమిండియా ఆటగాళ్లు.. టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లికి ఘనంగా వీడ్కోలు పలికారు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. రోహిత్ శర్మ(56) ఔట్ సమయం 22:00.. నమీబియా బౌలర్లను ఊచకోత కోసిన రోహిత్ శర్మ(37 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఎట్టకేలకు ఔటయ్యాడు. జాన్ ఫ్రైలింక్ వేసిన 10వ ఓవర్ ఐదో బంతికి రోహిత్ పెవిలియన్ బాట పట్టాడు. 10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 87/1. క్రీజ్‌లో కేఎల్ రాహుల్(31), సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. రాణించిన భారత స్పిన్నర్లు.. నమీబియా గౌరవప్రదమైన స్కోర్ సమయం 20:59.. టీమిండియా స్పిన్నర్లు అశ్విన్(3/20), జడేజా(3/16), పేసర్ బుమ్రా(2/19) రాణించడంతో నమీబియా గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. షమీ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ట్రంపెల్మెన్(13).. ఫోర్, సిక్సర్ సహా 13 పరుగులు రాబట్టడంతో నమీబియా ఈ స్కోర్ సాధించగలిగింది. నమీబియా ఇన్నింగ్స్‌లో డేవిడ్ వీస్(26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 94 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన నబీమియా అశ్విన్(3/20), జడేజా(3/16) తమ స్పిన్ మాయాజాలంతో పసికూన నమీబియాను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఫలితంగా నమీబియా 94 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. 18 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్ 114/7. క్రీజ్‌లో డేవిడ్ వీస్(25), జాన్ ఫ్రైలింక్(12) ఉన్నారు. జడ్డూ మాయాజాలం.. మూడో వికెట్ కోల్పోయిన నమీబియా సమయం 20:03.. రవీంద్ర జడేజా మరోసారి మాయ చేశాడు. నమీబియా ఆటగాడు స్టీఫెన్ బార్డ్(21 బంతుల్లో 21; ఫోర్, సిక్స్)ను బోల్తా కొట్టించాడు. 7.4వ ఓవర్లో బార్డ్.. జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఫలితంగా నమీబియా 39 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో గెర్హార్డ్ ఎరాస్మస్(2), లాఫ్టీ ఈటన్ ఉన్నారు. జడ్డూ కమాల్.. రెండో వికెట్ కోల్పోయిన నమీబియా సమయం 19:57.. టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా మాయ చేశాడు. అద్భతమైన బంతితో క్రెయిగ్ విలియమ్స్(0)ను బోల్తా కొట్టించాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ సూపర్ స్టంపింగ్‌తో నమీబియా రెండో వికెట్ కోల్పోయింది. 6 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్ 34/2. క్రీజ్‌లో స్టీఫెన్ బార్డ్(15),గెర్హార్డ్ ఎరాస్మస్ ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన నమీబియా..వాన్ లింగెన్(14) ఔట్ సమయం 19:51.. టాస్ ఓడి టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన నమీబియా ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. తొలి 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 31 పరగులు చేసింది. అయితే, 5వ ఓవర్లో బుమ్రా నమీబియాను దెబ్బకొట్టాడు. వాన్ లింగెన్(15 బంతుల్లో 14; 2 ఫోర్లు)ను ఔట్ చేశాడు. 5 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్ 33/1. క్రీజ్‌లో స్టీఫెన్ బార్డ్(15), క్రెయిగ్ విలియమ్స్ ఉన్నారు. దుబాయ్: టీ20 ప్రపంచకప్-2021లో టీమిండియా తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. సెమీస్ ఆశలు ఆవిరైన నేపథ్యంలో నామమాత్రపు పోరులో నేడు(నవంబర్ 8) పసికూన నమీబియాతో తలపడనుంది. భారత కాలమాన ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. టీ20 సారథిగా విరాట్ కోహ్లికి ఇదే చివరి మ్యాచ్ కావడంతో ఈ నామమాత్రపు పోరుకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించి టీ20 సారధిగా విరాట్ కోహ్లికి ఘనంగా వీడ్కోలు పలకాలని టీమిండియా చూస్తుండగా.. కోహ్లి సేనకు కనీస పోటీనైనా ఇవ్వాలని నమీబియా భావిస్తుంది. కోహ్లి సహా రవిశాస్త్రి నేతృత్వంలోని శిక్షణా బృందానికి సైతం ఇదే చివరి మ్యాచ్ కావడంతో భారత డ్రెసింగ్ రూమ్‌లో తీవ్ర భావోద్వేగం నెలకొంది. తుది జట్లు: భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లి(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అశ్విన్, రాహుల్ చాహర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా నమీబియా: స్టీఫెన్ బార్డ్, క్రెయిగ్ విలియమ్స్, జేన్ గ్రీన్(వికెట్ కీపర్), గెర్హార్డ్ ఎరాస్మస్(కెప్టెన్), డేవిడ్ వీస్, మైఖేల్ వాన్ లింగెన్, జెజె స్మిట్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, రూబెన్ ట్రంపెల్మాన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, జాన్ ఫ్రైలింక్ -
T20 World Cup 2021: టీమిండియా ఆశలు ఆవిరి.. అఫ్గాన్‌పై కివీస్ ఘన విజయం
టీమిండియా ఆశలు ఆవిరి.. అఫ్గాన్‌పై కివీస్ ఘన విజయం సమయం 18:36.. అఫ్గాన్లు నిర్ధేశించిన 125 పరగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్(42 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు), డెవాన్ కాన్వే(32 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు) కివీస్‌ను విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో అఫ్గాన్లను మట్టికరిపించి దర్జాగా సెమీస్‌కు దూసుకెళ్లింది. అఫ్గాన్ బౌలర్లు ముజీబ్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 124 పరుగులకే పరిమితమైంది. న్యూజిలాండ్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్(3/17), టిమ్ సౌథీ(2/24), సోధి(1/13), మిల్నే(1/17), నీషమ్(1/24) అప్గాన్‌ను దారుణంగా దెబ్బకొట్టారు. నజీబుల్లా జద్రాన్(48 బంతుల్లో 73; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించకపోయుంటే అఫ్గాన్ ఈ మాత్రం స్కోర్ కూడా చేయలేకపోయేది. 3 వికెట్లతో సత్తా చాటిన ట్రెంట్ బౌల్ట్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. టార్గెట్ 125.. 57 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ సమయం 17:49.. 57 పరుగుల వద్ద న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మార్టిన్ గప్తిల్(23 బంతుల్లో 28; 4 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 8.5 ఓవర్ల తర్వాత అఫ్గాన్ స్కోర్ 57/2. క్రీజ్‌లో విలియమ్సన్(11), కాన్వే ఉన్నారు. టార్గెట్ 125.. తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ సమయం 17:28.. 125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ముజీబ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ అహ్మద్ షెజాద్‌కు క్యాచ్ ఇచ్చి డారిల్ మిచెల్(12 బంతుల్లో 17; 3 ఫోర్లు) ఔటయ్యాడు. 4 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 30/1. క్రీజ్‌లో గప్తిల్(11), విలియమ్సన్(2) ఉన్నారు. దారుణంగా నిరాశపర్చిన అఫ్గానిస్థాన్.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితం సమయం 17:05.. కీలకమైన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్ దారుణంగా నిరాశపర్చింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 124 పరుగులకే పరిమితమైంది. న్యూజిలాండ్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్(3/17), టిమ్ సౌథీ(2/24), సోధి(1/13), మిల్నే(1/17), నీషమ్(1/24) అప్గాన్‌ను దారుణంగా దెబ్బకొట్టారు. నజీబుల్లా జద్రాన్(48 బంతుల్లో 73; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించకపోయుంటే అఫ్గాన్ ఈ మాత్రం స్కోర్ కూడా చేయలేకపోయేది. నాలుగో వికెట్ కోల్పోయిన అఫ్గాన్.. గుల్బదిన్(15) ఔట్ ఇష్ సోధి వేసిన 10వ ఓవర్ ఆఖరి బంతికి గుల్బదిన్(18 బంతుల్లో 15; ఫోర్) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా అఫ్గానిస్థాన్ 56 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. క్రీజ్‌లో జద్రాన్(27), మహ్మద్ నబీ ఉన్నారు. 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన అఫ్గాన్ సమయం 15:55.. జట్టు స్కోర్ 19 పరుగుల వద్ద ఉండగా అఫ్గాన్ మూడో వికెట్ కోల్పోయింది. సౌథీ బౌలింగ్‌లో రహ్మానుల్లా గుర్భాజ్(9 బంతుల్లో 6; ఫోర్) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 6 ఓవర్ల తర్వాత అఫ్గాన్ స్కోర్ 23/3. క్రీజ్‌లో గుల్బదిన్ నయీబ్(5), జద్రాన్(4) ఉన్నారు. కష్టాల్లో అఫ్గాన్.. 12 పరుగులకే ఓపెనర్లు ఔట్ సమయం 15:46.. తొలి వికెట్ కోల్పోయిన మరుసటి ఓవర్లోనే అఫ్గాన్‌కు మరో షాక్ తగిలింది. నాలుగో ఓవర్ తొలి బంతికి బౌల్ట్ బౌలింగ్‌లో సాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి హజ్రతుల్లా జజాయ్(4 బంతుల్లో 2) ఔటయ్యాడు. 4 ఓవర్ల తర్వాత అఫ్గాన్ స్కోర్ 16/2. క్రీజ్‌లో రహ్మానుల్లా గుర్భాజ్(4), గుల్బదిన్ నయీబ్(4) ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన అఫ్గాన్.. షెజాద్(4) ఔట్ సమయం 15:41.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అహ్మద్ షెజాద్(11 బంతుల్లో 4, ఫోర్) అనవసర ప్రయోగం చేసి ఔటయ్యాడు. మిల్నే బౌలింగ్‌లో వికెట్‌కీపర్ డెవాన్ కాన్వే అద్భుతమైన క్యాచ్ పట్టడంతో షెజాద్ పెవిలియన్ బాట పట్టాడు. 2.2 ఓవర్ల తర్వాత అఫ్గాన్ స్కోర్ 8/1. క్రీజ్‌లో హజ్రతుల్లా జజాయ్(2), రహ్మానుల్లా గుర్భాజ్ ఉన్నారు. అబుదాబి: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 గ్రూప్-2లో భాగంగా ఆదివారం(నవంబర్ 7) మధ్యాహ్నం 3:30 గంటలకు షెడ్యూలైన కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుత మెగా టోర్నీలో గ్రూప్-2 నుంచి సెమీస్‌కు చేరబోయే రెండో బెర్తు ఈ మ్యాచ్‌తో తేలనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పాక్ ఇదివరకే ఈ గ్రూప్ నుంచి సెమీస్‌కు చేరుకోగా.. మరో బెర్తు కోసం న్యూజిలాండ్, అఫ్గాన్, భారత జట్ల మధ్య పోటీ నెలకొంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిస్తే నేరుగా సెమీస్ చేరుకోనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ విజయం సాధిస్తే.. నెట్ రన్‌రేట్ ఆధారంగా ఈ గ్రూప్ నుంచి రెండో సెమీస్ బెర్తు ఖరారు కానుంది. తుది జట్లు: న్యూజిలాండ్: మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డేవాన్ కాన్వే(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టీమ్ సౌథీ, ఇష్ సోధీ, ట్రెంట్ బౌల్ట్ అఫ్గానిస్థాన్: హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షెజాద్(వికెట్ కీపర్), రహ్మానుల్లా గుర్బాజ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(కెప్టెన్), ముజీబ్ ఉర్ రెహ్మాన్, గుల్బదిన్ నయీబ్, రషీద్ ఖాన్, కరీం జనత్, నవీన్ ఉల్ హక్, హమీద్ హసన్ -
AUS Vs WI: చెలరేగిన వార్నర్, మార్ష్.. విండీస్‌పై ఆసీస్ ఘన విజయం
చెలరేగిన వార్నర్, మార్ష్.. విండీస్‌పై ఆసీస్ ఘన విజయం సమయం 18:55.. విండీస్ నిర్ధేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ బ్యాటర్లు డేవిడ్ వార్నర్(56 బంతుల్లో 89 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), మిచెల్ మార్ష్(32 బంతుల్లో 53; 5 ఫోర్లు, సిక్సర్లు) చెలరేగి ఆడారు. ఫలితంగా ఆసీస్ 16.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆసీస్ రన్‌రేట్‌ను మరింత మెరుగుపర్చుకుని సెమీస్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. విండీస్ బౌలర్లలో అకీల్ హొసేన్, క్రిస్ గేల్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్(4/39) రాణించడంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. పోలార్డ్(31 బంతుల్లో 44; 4 ఫోర్లు, సిక్స్), ఎవిన్ లూయిస్(26 బంతుల్లో 29; 5 ఫోర్లు), హెట్‌మైర్(28 బంతుల్లో 27; 2 ఫోర్లు) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్‌కు జంపా(1/20), స్టార్క్(1/33), కమిన్స్(1/37) సహకరించారు. వార్నర్ దూకుడు.. ఆస్ట్రేలియా 122/1 సమయం: 18:38.. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ దూకుడు కనబరుస్తున్నాడు. అతనికి తోడుగా ఉన్న మిచెల్ మార్ష్ కూడా బ్యాట్ ఝలిపిస్తుండడంతో ఆసీస్ లక్ష్యంత వైపు వేగంగా అడుగులు వేస్తుంది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. వార్నర్ 68, మిచెల్ మార్ష్ 47 పరుగులతో ఆడుతున్నారు. టార్గెట్ 158.. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ సమయం 17:44.. 158 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. 3.3వ ఓవర్లో ఆకీల్ హొసేన్ బౌలింగ్ ఆరోన్ ఫించ్(11 బంతుల్లో 9; ఫోర్) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా ఆసీస్ 33 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో వార్నర్(11 బంతుల్లో 23; 3 ఫోర్లు, సిక్స్), మిచెల్ మార్ష్ ఉన్నారు. చెలరేగిన హేజిల్‌వుడ్.. ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైన విండీస్ సమయం 17:15.. ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్(4/39) రాణించడంతో విండీస్ ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆఖరి రెండు బంతులను రసెల్(7 బంతుల్లో 18; ఫోర్, సిక్సర్లు) భారీ సిక్సర్లుగా మలచడంతో విండీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. విండీస్ ఇన్నింగ్స్‌లో పోలార్డ్(31 బంతుల్లో 44; 4 ఫోర్లు, సిక్స్), ఎవిన్ లూయిస్(26 బంతుల్లో 29; 5 ఫోర్లు), హెట్‌మైర్(28 బంతుల్లో 27; 2 ఫోర్లు) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్‌కు జంపా(1/20), స్టార్క్(1/33), కమిన్స్(1/37) సహకరించారు. ఐదో వికెట్ కోల్పోయిన విండీస్.. హెట్‌మైర్(27) ఔట్ సమయం 16:37.. ఆసీస్ బౌలర్ల ధాటికి విండీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతుంది. హేజిల్‌వుడ్ వేసిన 13వ ఓవర్లో మాథ్యూ వేడ్‌కు క్యాచ్ ఇచ్చి హెట్‌మైర్(28 బంతుల్లో 27; 2 ఫోర్లు) ఔటయ్యాడు. దీంతో విండీస్ 91 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో పోలార్డ్(9), బ్రేవో(1) ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన విండీస్.. ఎవిన్ లూయిస్(29) ఔట్ సమయం 16:18.. విండీస్ హార్డ్ హిట్టర్ ఎవిన్ లూయిస్(26 బంతుల్లో 29; 5 ఫోర్లు)ను ఆడమ్ జంపా బోల్తా కొట్టించాడు. స్టీవ్ స్మిత్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకోవడంతో లూయిస్ పెవిలియన్ బాట పట్టాడు. 10 ఓవర్ల తర్వాత విండీస్ స్కోర్ 74/4. క్రీజ్‌లో హెట్‌మైర్(19), పోలార్డ్(1) ఉన్నారు. ఆసీస్ బౌలర్ల ధాటికి బెంబేలెత్తిపోతున్న విండీస్ బ్యాటర్లు సమయం 15:52.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు ఆసీస్ బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. వరుస పెట్టి వికెట్లు తీస్తూ విండీస్ బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. 3వ ఓవర్ రెండో బంతికి కమిన్స్ బౌలింగ్‌లో క్రిస్ గేల్(9 బంతుల్లో 15; 2 సిక్సర్లు) క్లీన్ బౌల్డ్ కాగా.. ఆ మరుసటి ఓవర్ తొలి బంతికి పూరన్(4), మూడో బంతికి రోస్టన్ ఛేజ్(0)లను హేజిల్‌వుడ్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో విండీస్ 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. 4 ఓవర్ల తర్వాత విండీస్ స్కోర్ 37/3. క్రీజ్‌లో ఎవిన్ లూయిస్(14), హెట్‌మైర్(1) ఉన్నారు. అబుదాబి: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 గ్రూప్-1లో భాగంగా శనివారం(నవంబర్ 6) మధ్యాహ్నం 3:30 గంటలకు షెడ్యూలైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, ఓ పరాజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. వెస్టిండీస్ నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం, 3 పరాజయాలతో సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించింది. ఇక పొట్టి ఫార్మాట్లో ఇరు జట్ల మధ్య ముఖాముఖి పోరు విషయానికొస్తే.. రెండు జట్ల మధ్య మొత్తం 16 మ్యాచ్‌లు జరగ్గా.. ఆసీస్ 6, వెస్టిండీస్ 10 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ప్రపంచకప్ టోర్నీల్లో రెండు జట్ల మధ్య 5 మ్యాచ్‌లు జరగ్గా ఆసీస్ 2, వెస్టిండీస్ 3 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. తుది జట్లు: ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్ వెస్టిండీస్: క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్‌మైర్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), డ్వేన్ బ్రావో, జాసన్ హోల్డర్, అకీల్ హొసేన్, హేడెన్ వాల్ష్ -
NZ Vs NAM: పసికూనపై న్యూజిలాండ్ ప్రతాపం.. 52 పరుగుల తేడాతో ఘన విజయం
పసికూనపై న్యూజిలాండ్ ప్రతాపం.. 52 పరుగుల తేడాతో ఘన విజయం సమయం 18: 52.. 164 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా.. న్యూజిలాండ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి కేవలం 111 పరుగుల మాత్రమే చేయగలిగింది. ఫలితంగా న్యూజిలాండ్ పసికూన నమీబియాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. నమీబియా ఇన్నింగ్స్‌లో వాన్ లింగెన్(22), స్టీఫెన్ బార్డ్(21), జేన్ గ్రీన్(23), డేవిడ్ వీస్(17) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. కివీస్ బౌలర్లలో సౌథీ, బౌల్ట్ చెరో రెండు వికెట్లు సాధించగా.. సాంట్నర్, నీషమ్, సోధీ తలో వికెట్ పడగొట్టారు. ఓటమి దిశగా నమీబియా సమయం 18:38.. 18వ ఓవర్ ఐదో బంతికి నమీబియా ఐదో వికెట్ కోల్పోయింది. సౌథీ బౌలింగ్‌లో బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చి జేన్ గ్రీన్ 27 బంతుల్లో 23; ఫోర్, సిక్స్) ఔటయ్యాడు. 18 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్ 102/5. నాలుగో వికెట్ కోల్పోయిన నమీబియా.. డేవిడ్ వీస్(16) ఔట్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో నమీబియా నాలుగో వికెట్ కోల్పోయింది. సౌథీ బౌలింగ్‌లో డేవిడ్ వీస్(17 బంతుల్లో 16; ఫోర్, సిక్స్) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 15 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్ 86/4. క్రీజ్‌లో జేన్ గ్రీన్(16), జెజె స్మిట్ ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన నమీబియా సమయం 17:59.. కివీస్ స్పిన్నర్లు నమీబియా బ్యాటింగ్ లయను దెబ్బ కొట్టారు. వరుస ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టారు. సాంట్నర్ వేసిన 8.1వ ఓవర్లో బార్డ్(22 బంతుల్లో 21; 2 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ కాగా.. 10వ ఓవర్ రెండో బంతికి సోధి బౌలింగ్‌లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి ఎరాస్మస్(4 బంతుల్లో 3) ఔటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్ 56/3. క్రీజ్‌లో గ్రీన్(3), వీస్(1) ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన నమీబియా.. 7.2 ఓవర్ల తర్వాత 47/1 సమయం 17:48.. 164 పరుగుల లక్ష్య ఛేదనలో నమీబియాకు శుభారంభం లభించింది. ఓపెనర్లు వాన్ లింగెన్(25 బంతుల్లో 25; 2 ఫోర్లు, సిక్స్), స్టీఫెన్ బార్డ్(19 బంతుల్లో 19; 2 ఫోర్లు) తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించారు. అయితే, 7.2వ ఓవర్లో నీషమ్ బౌలింగ్‌లో వాన్ లింగెన్ ఔట్ కావడంతో నమీబియా తొలి వికెట్ కోల్పోయింది. 8 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్ 51/1. రాణించిన నీషమ్, ఫిలిప్స్.. నమీబియా టార్గెట్ 164 సమయం 17:07.. జిమ్మీ నీషమ్(23 బంతుల్లో 35 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), గ్లెన్ ఫిలిప్స్(21 బంతుల్లో 39 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) ఆఖర్లో చెలరేగడంతో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. గప్తిల్(18), డారిల్ మిచెల్(19), డెవాన్ కాన్వే(17) నిరాశపరచినా.. నీషమ్, ఫిలిప్స్, విలిమయ్సన్(25 బంతుల్లో 28; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తారుగా రాణించడంతో న్యూజిలాండ్ ఈ స్కోర్‌ను చేయగలిగింది. నమీబియా బౌలర్లలో స్కోల్జ్, వీస్, ఎరాస్మస్ తలో వికెట్ పడగొట్టారు. నాలుగో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. కాన్వే(17) రనౌట్ సమయం 16:30.. న్యూజిలాండ్‌కు 14వ ఓవర్ ఆఖరి బంతికి మరో షాక్ తగిలింది. అనవసర పరుగుకు ప్రయత్నించి డెవాన్ కాన్వే(18 బంతుల్లో 17; ఫోర్) రనౌటయ్యాడు. 14 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 87/4. క్రీజ్‌లో గ్లెన్ ఫిలిప్(4), నీషమ్ ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. విలియమ్సన్(28) ఔట్ నమీబియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతుంది. జట్టు స్కోర్ 81 పరుగుల వద్ద ఉండగా.. ఎరాస్మస్ బౌలింగ్‌లో విలియమ్సన్(25 బంతుల్లో 28; 2 ఫోర్లు, సిక్స్) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా న్యూజిలాండ్ మూడో వికెట్‌ను కోల్పోయింది. 13 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 82/3. క్రీజ్‌లో డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్ ఉన్నారు. న్యూజిలాండ్‌కు మరో షాక్.. డారిల్ మిచెల్(19) ఔట్ సమయం 15:57.. ఇన్నింగ్స్ 7వ ఓవర్ రెండో బంతికి న్యూజిలాండ్‌కు మరో షాక్ తగిలింది. బెర్నార్డ్ స్కోల్జ్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్(15 బంతుల్లో 19; 2 ఫోర్లు) ఔటయ్యాడు. దీంతో న్యూజిలాండ్ 43 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. క్రీజ్‌లో కేన్ విలియమ్సన్(6), కాన్వే ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. గప్తిల్(18) ఔట్ సమయం 15:48.. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. అయితే డేవిడ్ వీస్ వేసిన 5వ ఓవర్లో న్యూజిలాండ్‌కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. వీస్ 4.1వ ఓవర్లో మార్టిన్ గప్తిల్(18 బంతుల్లో 18; ఫోర్, సిక్స్)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో న్యూజిలాండ్ 30 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. క్రీజ్‌లో డారిల్ మిచెల్(12), కేన్ విలియమ్సన్ ఉన్నారు. షార్జా: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 గ్రూప్-2లో భాగంగా శుక్రవారం(నవంబర్ 5) మధ్యాహ్నం 3:30 గంటలకు షెడ్యూలైన మ్యాచ్‌లో న్యూజిలాండ్, నమీబియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నమీబియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రస్తుత మెగా టోర్నీలో న్యూజిలాండ్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ పరాజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. నమీబియా సూపర్-12లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓ విజయం, 2 పరాజయాలతో సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఇక పొట్టి ఫార్మాట్లో ఇరు జట్ల మధ్య ముఖాముఖి పోరు విషయానికొస్తే.. ఈ ఫార్మాట్లో ఇరు జట్లు తలపడడం ఇదే తొలిసారి. తుది జట్లు: న్యూజిలాండ్: మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), జేమ్స్ నీషమ్, డెవన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్(వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌతీ, ఆడమ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్ నమీబియా: స్టీఫెన్ బార్డ్, క్రెయిగ్ విలియమ్స్, జేన్ గ్రీన్(వికెట్ కీపర్), గెర్హార్డ్ ఎరాస్మస్(కెప్టెన్), డేవిడ్ వీస్, మైఖేల్ వాన్ లింగెన్, జెజె స్మిట్, కార్ల్ బిర్కెన్‌స్టాక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, రూబెన్ ట్రంపెల్మాన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్ -
AUS Vs BAN: ఐదేసిన జంపా.. బంగ్లాపై ఆసీస్ ఘన విజయం
ఐదేసిన జంపా.. బంగ్లాపై ఆసీస్ ఘన విజయం సమయం 17:44.. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ కేవలం 6.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ ఓపెనర్లు ఆరోన్ ఫించ్(20 బంతుల్లో 40; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ వార్నర్(10 బంతుల్లో 16; 3ఫోర్లు) మెరుపులు మెరిపించగా.. చివర్లో మిచెల్ మార్ష్(5 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) మ్యాచ్‌ను లాంఛనంగా పూర్తి చేశాడు. బంగ్లా బౌలర్లలో షొరీఫుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా(5/19) ఐదేయడంతో బంగ్లా జట్టు కేవలం 73 పరుగులకే కుప్పకూలింది. జంపాకు హేజిల్‌వుడ్(2/8), మిచెల్ స్టార్క్(2/21), మ్యాక్స్‌వెల్(1/6) తోడవ్వడంతో కేవలం 15 ఓవర్లలోనే బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో షమీమ్ హొసేన్(19) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. ఫించ్(40) ఔట్ సమయం 17:33.. 74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(10 బంతుల్లో 16; 3ఫోర్లు), ఆరోన్ ఫించ్(20 బంతుల్లో 40; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. అయితే 5వ ఓవర్ ఆఖరి బంతికి తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో ఫించ్ క్లీన్ బౌల్డ్ కావడంతో ఆసీస్ 58 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఐదేసిన జంపా.. 73 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్ సమయం 16:48.. ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా(5/19) ఐదేయడంతో బంగ్లా జట్టు కేవలం 73 పరుగులకే కుప్పకూలింది. జంపాకు హేజిల్‌వుడ్(2/8), మిచెల్ స్టార్క్(2/21), మ్యాక్స్‌వెల్(1/6) తోడవ్వడంతో కేవలం 15 ఓవర్లలోనే బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో షమీమ్ హొసేన్(19)దే అత్యధిక స్కోర్ కాగా, మరో ఇద్దరు(నయీమ్(17), మహ్మదుల్లా(16)) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. మహ్మదుల్లా(16) ఔట్ సమయం 16:35.. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ చివరి దశకు చేరింది. కెప్టెన్ మహ్మదుల్లా(18 బంతుల్లో 16; 2 ఫోరు) స్టార్క్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ వేడ్‌కు క్యాచ్ ఇచ్చి ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. 13 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 65/8. క్రీజ్‌లో తస్కిన్ అహ్మద్(2), ముస్తాఫిజుర్ ఉన్నారు. 62 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ సమయం 16:31.. ఆసీస్ బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. జంపా వేసిన 11వ ఓవర్లో ఇద్దరు బంగ్లా ఆటగాళ్లు పెవిలియన్‌కు చేరారు. ఐదో బంతికి షమీమ్ హొసేన్(18 బంతుల్లో 19; ఫోర్, సిక్స్), ఆరో బంతికి మెహిది హసన్(0) ఔటయ్యారు. దీంతో బంగ్లాదేశ్ 62 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. క్రీజ్‌లో మహ్మదుల్లా, తస్కిన్ అహ్మద్ ఉన్నారు. 33 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ సమయం 16:05.. బంగ్లాదేశ్.. ఇన్నింగ్స్ నాలుగు, ఐదు ఓవర్లు మినహా అన్నీ ఓవర్లలో వికెట్లు కోల్పోయింది. జంపా తన స్పెల్ తొలి బంతికే అఫీఫ్ హెసేన్(0)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఆ జట్టు కేవలం 33 పరుగులు మాత్రమే స్కోర్ చేసి సగం వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో మహ్మదుల్లా, షమీమ్ హొసేన్ ఉన్నారు. నయీమ్(17) ఔట్..బంగ్లాదేశ్ 32/4 సమయం 15:59.. మొదటి మూడు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్.. నాలుగో ఓవర్, ఐదో ఓవర్ గ్యాప్ ఇచ్చి ఆరో ఓవర్లో మరో వికెట్ కోల్పోయింది. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి మహ్మద్ నయీమ్(16 బంతుల్లో 17; 3 ఫోర్లు) ఔటయ్యాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో మహ్మదుల్లా(8), అఫీఫ్ హొసేన్ ఉన్నారు. 3 ఓవర్లు 3 వికెట్లు..బంగ్లాదేశ్ స్కోర్ 10/3 సమయం 15:46.. ఆసీస్ బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ బెంబేలెత్తిపోతుంది. వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోతూ కష్టాల్లో చిక్కుకుంది. తొలి ఓవర్లో లిటన్ దాస్ వికెట్ కోల్పోయిన బంగ్లా.. రెండో ఓవర్లో సౌమ్య సర్కార్.. మూడో ఓవర్ ఐదో బంతికి ముష్ఫికర్ రహీమ్(2 బంతుల్లో 1) వికెట్ నష్టపోయింది. ముష్ఫికర్‌ను మ్యాక్స్‌వెల్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 3 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి 3 కీలక వికెట్లు కోల్పోయింది. 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ సమయం 15:42.. తొలి ఓవర్లో లిటన్ దాస్ వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. రెండో ఓవర్లో సౌమ్య సర్కార్(8 బంతుల్లో 5: ఫోర్) వికెట్‌ను చేజార్చుకుంది. రెండో ఓవర్ ఆఖరి బంతికి జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో సౌమ్య సర్కార్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా బంగ్లాదేశ్.. 6 పరుగులకే రెండు వికెట్లు నష్టపోయింది. క్రీజ్‌లో మహ్మద్ నయీమ్, ముష్ఫికర్ రహీమ్ ఉన్నారు. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ సమయం 15:33.. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మూడో బంతికి స్టార్క్ బౌలింగ్‌లో లిటన్ దాస్(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా బంగ్లాదేశ్ఒక్క పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో మహ్మద్ నయీమ్(1), సౌమ్య సర్కార్ ఉన్నారు. దుబాయ్: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 గ్రూప్-1లో భాగంగా గురువారం(నవంబర్ 4) మధ్యాహ్నం 3:30 గంటలకు షెడ్యూలైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ పరాజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. బంగ్లాదేశ్ సూపర్-12లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలై సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించింది. ఇక పొట్టి ఫార్మాట్లో ఇరు జట్ల మధ్య ముఖాముఖి పోరు విషయానికొస్తే.. మొత్తం 9 మ్యాచ్‌ల్లో.. ఆసీస్ 5, బంగ్లాదేశ్ 4 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. అయితే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్.. ఆసీస్‌తో తలపడిన ప్రతిసారి పరాజయం పాలైంది. 4 మ్యాచ్‌ల్లో నాలుగింటిలోనూ ఓటమిని ఎదుర్కొంది. తుది జట్లు: ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్ బంగ్లాదేశ్: మహ్మదుల్లా (కెప్టెన్), మహ్మద్ నయీమ్, లిటన్ దాస్, సౌమ్య సర్కార్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొసేన్, షమీమ్ హెసేన్, మెహిది హసన్, షొరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్ -
NZ Vs SCO: గప్తిల్ విధ్వంసం.. న్యూజిలాండ్ ఖాతాలో మరో విజయం
గప్తిల్ విధ్వంసం.. న్యూజిలాండ్ ఖాతాలో మరో విజయం సమయం 18:59.. పసికూన స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. మార్టిన్ గప్తిల్(56 బంతుల్లో 93; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం 173 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్.. అద్భుత పోరాటపటిమను కనబర్చి 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసి ఓటమిపాలైంది. మైఖేల్ లీస్క్(20 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), జార్జ్ మున్సే(18 బంతుల్లో 22; ఫోర్, 2 సిక్సర్లు), మ్యాథ్యూ క్రాస్(29 బంతుల్లో 27; 5 ఫోర్లు) స్కాట్లాండ్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్, ఐష్ సోధి తలో రెండు వికెట్లు దక్కించుకోగా టిమ్ సౌథీ ఓ వికెట్ పడగొట్టాడు. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన మార్టిన్ గప్తిల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. బెర్రింగ్టన్(20) ఔట్.. స్కాట్లాండ్ 106/5 సమయం 18:40.. 16వ ఓవర్ నాలుగో బంతికి ఐష్ సోధి బౌలింగ్‌లో డెవాన్ కాన్వేకు క్యాచ్ ఇచ్చి బెర్రింగ్టన్(17 బంతుల్లో 20; ఫోర్, సిక్స్) ఔటయ్యాడు. ఫలితంగా స్కాట్లాండ్ 106 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో మైఖేల్ లీస్క్(4), క్రిస్ గ్రీవ్స్ ఉన్నారు. మెక్లియాడ్(12) ఔట్.. స్కాట్లాండ్ 102/4 సమయం 18:34.. భారీ లక్ష్య ఛేదనలో పసికూన స్కాట్లాండ్ తడబడుతుంది. ఆరంభంలో ధాటిగా ఆడినట్లు కనిపించినా.. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా పయనిస్తుంది. 15వ ఓవర్ ఐదో బంతికి బౌల్ట్ బౌలింగ్‌లో మెక్లియాడ్(15 బంతుల్లో 12) క్లీన్ బౌల్డ్ కావడంతో స్కాట్లాండ్ 102 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో రిచీ బెర్రింగ్టన్(20), మైఖేల్ లీస్క్(1) ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన స్కాట్లాండ్.. క్రాస్(27) ఔట్ సమయం 18:14.. మిల్నే వేసిన ఒకే ఓవర్లో 5 బౌండరీలు బాది జోరుమీదున్నట్లు కనిపించిన మాథ్యూ క్రాస్(29 బంతుల్లో 27; 5 ఫోర్లు)ను సౌథీ క్లీన్ బౌల్డ్ చేశాడు. 11 ఓవర్ల తర్వాత స్కాట్లాండ్ స్కోర్ 77/3. క్రీజ్‌లో రిచీ బెర్రింగ్టన్(6), కలమ్ మెక్లియాడ్ ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన స్కాట్లాండ్.. మున్సే(22) ఔట్ సమయం 18:01.. ఐష్ సోధి వేసిన 8వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో విరుచుకుపడిన జార్జ్ మున్సే(18 బంతుల్లో 22; ఫోర్, 2 సిక్సర్లు) అదే ఓవర్లో సౌథీ చేతికి చిక్కి ఔటయ్యాడు. అంతకుముందు ఆడమ్ మిల్నే వేసిన 6వ ఓవర్లో మ్యాథ్యూ క్రాస్ ఐదు వరుస బౌండరీలతో చెలరేగాడు. 8 ఓవర్ల తర్వాత స్కాట్లాండ్ స్కోర్ 67/2. క్రీజ్‌లో మ్యాథ్యూ క్రాస్(23), రిచీ బెర్రింగ్టన్ ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన స్కాట్లాండ్.. కొయెట్జర్(17) ఔట్ 173 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్.. ఇన్నింగ్స్ 3వ ఓవర్ నాలుగో బంతికి తొలి వికెట్ కోల్పోయింది. ట్రెంట్ బౌలింగ్‌లో సౌథీకి క్యాచ్ ఇచ్చి కొయెట్జర్(11 బంతుల్లో 17; 4 ఫోర్లు) ఔటయ్యాడు. 3 ఓవర్ల తర్వాత స్కాట్లాండ్ స్కోర్ 25/1. క్రీజ్‌లో జార్జ్ మున్సే(6), మ్యాథ్యూ క్రాస్ ఉన్నారు. గప్తిల్ వీరవిహారం.. స్కాట్లాండ్ ముందు భారీ టార్గెట్ సమయం 17:13.. ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (56 బంతుల్లో 93; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు నష్టపోయి 172 పరుగులు చేసింది. గప్తిల్‌కు గ్లెన్ ఫిలిప్(37 బంతుల్లో 33; సిక్స్) సహకరించడంతో కివీస్ ప్రత్యర్ధికి భారీ టార్గెట్ నిర్ధేశించగలిగింది. డారిల్ మిచెల్(13), విలిమయ్సన్(0), డెవాన్ కాన్వే(1) నిరాశపరిచారు. స్కాట్లాండ్ బౌలర్లు రెండుసార్లు ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయారు. సాఫ్యాన్ షరీఫ్(2/28), బ్రాడ్లీ వీల్(2/40), మార్క్ వాట్(1/13) రాణించారు. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్.. సమయం 17:03.. స్కాట్లాండ్ బౌలర్ బ్రాడ్లీ వీల్ 19వ ఓవర్లో న్యూజిలాండ్‌కు షాకిచ్చాడు. వరుస బంతుల్లో గ్లెన్ ఫిలిప్(37 బంతుల్లో 33; సిక్స్), మార్టిన్ గప్తిల్(56 బంతుల్లో 93; 6 ఫోర్లు, 7 సిక్సర్లు)లను పెవిలియన్‌కు పంపాడు. దీంతో న్యూజిలాండ్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. క్రీజ్‌లో జేమ్స్ నీషమ్(5), మిచెల్ సాంట్నర్(1) ఉన్నారు. న్యూజిలాండ్‌ను వణికిస్తున్న స్కాట్లాండ్ బౌలర్లు.. 6 ఓవర్లలో 52/3 సమయం 16:05.. పసికూన స్కాట్లాండ్ న్యూజిలాండ్‌ను వణికిస్తోంది. 6 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చి 3 కీలకమైన వికెట్లు పడగొట్టింది. తొలుత సాఫ్యాన్ షరీఫ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టగా.. 7వ ఓవర్ తొలి బంతికి మార్క్ వాట్.. డెవాన్ కాన్వే(1)ను పెవిలియన్‌కు పంపాడు. 7 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 54/3. క్రీజ్‌లో గప్తిల్(20 బంతుల్లో 29), గ్లెన్ ఫిలిప్ ఉన్నారు. న్యూజిలాండ్‌కు షాక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు డౌన్ సమయం 15:55.. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఇన్నింగ్స్ 5వ ఓవర్లో భారీ షాక్ తగిలింది. స్కాట్లాండ్ బౌలర్ సాఫ్యాన్ షరీప్ వేసిన ఆ ఓవర్లో న్యూజిలాండ్ రెండు వికెట్లు కోల్పోయింది. 4.1వ ఓవర్లో డారిల్ మిచెల్(13)ను షరీఫ్ ఎల్బీడబ్ల్యూ చేసి పెవిలియన్‌కు పంపగా.. ఆదే ఓవర్ ఐదో బంతికి న్యూజిలాండ్ మరో షాక్ తగిలింది. విలియమ్సన్ ఖాతా తెరవకుండానే మాథ్యూ క్రాస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో న్యూజిలాండ్ 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో మార్టిన్ గప్తిల్(14 బంతుల్లో 15), డెవాన్ కాన్వే ఉన్నారు. దుబాయ్: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 గ్రూప్-2లో భాగంగా బుధవారం(నవంబర్ 3) మధ్యాహ్నం 3:30 గంటలకు షెడ్యూలైన మ్యాచ్‌లో న్యూజిలాండ్, స్కాట్లాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన స్కాట్లాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్ ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓ విజయం(టీమిండియాపై 8 వికెట్ల తేడాతో విజయం) మరో పరాజయం(పాక్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి)తో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. స్కాట్లాండ్ సూపర్-12లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో (అఫ్గాన్ చేతిలో 130 పరుగుల తేడాతో ఓటమి, నమీబియా చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి) ఓటమిపాలై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఇక పొట్టి ఫార్మాట్లో ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక పోరు(2009 టీ20 ప్రపంచకప్)లో కివీస్‌నే విజయం వరించింది. తుది జట్లు: న్యూజిలాండ్: మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), జేమ్స్ నీషమ్, డెవన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్(వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌతీ, ఆడమ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్ స్కాట్లాండ్: జార్జ్ మున్సే, కైల్ కొయెట్జర్(కెప్టెన్), మాథ్యూ క్రాస్, రిచీ బెర్రింగ్టన్, కలమ్ మెక్లియోడ్, మైఖేల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్, సాఫ్యాన్ షరీఫ్, బ్రాడ్లీ వీల్, ఈవాన్స్ -
SA Vs BAN: బౌలర్ల విజృంభణ.. బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం
బౌలర్ల విజృంభణ.. బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం సమయం 18:31.. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 85 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా కూడా ఆరంభంలో తడబడినప్పటికీ.. కెప్టెన్ బవుమా(28 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), డస్సెన్(27 బంతుల్లో 22; 2 ఫోర్లు) నిలకడగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. సఫారిలు 13.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2 వికెట్లు దక్కించుకోగా.. మెహిది హసన్, నసుమ్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు సఫారి పేసర్లు రబాడ(3/20), నోర్జే(3/8), ప్రిటోరియస్(1/11) నిప్పులు చెరగడంతో బంగ్లా జట్టు 18.2 ఓవర్లలో 84 పరుగులకే కుప్పకూలింది. మూడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా.. మార్క్రమ్ డకౌట్ సమయం 17:51.. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా కూడా తడబడుతుంది. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో నయీమ్‌కు క్యాచ్ ఇచ్చి మార్క్రమ్ డకౌటయ్యాడు. 6 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 33/3. క్రీజ్‌లో డస్సెన్, బవుమా ఉన్నారు. టార్గెట్ 85.. రెండో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా సమయం 17:46.. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ ఐదో బంతికి దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. మెహిది హసన్ బౌలింగ్‌లో డికాక్(15 బంతుల్లో 16; 3 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా 28 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో డస్సెన్(5), మార్క్రమ్ ఉన్నారు. టార్గెట్ 85.. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 85 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా కూడా ఆరంభంలోనే తడబడింది. తొలి ఓవర్ ఆఖరి బంతికి తొలి వికెట్ కోల్పోయింది. తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో హెండ్రిక్స్(5 బంతుల్లో 4) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తొలి ఓవర్ తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 6/1. క్రీజ్‌లో డికాక్, డస్సెన్ ఉన్నారు. 84 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్ టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 18.2 ఓవర్లలో కేవలం 84 పరుగులకే కుప్పకూలింది. 17.2వ ఓవర్లో తస్కిన్ అహ్మద్(5 బంతుల్లో 3) రనౌట్ కాగా, నోర్జే వేసిన ఆ మరుసటి ఓవర్లో(18.1) మెహిది హసన్(25 బంతుల్లో 27; 2 ఫోర్లు, సిక్స్), నసుమ్ అహ్మద్(0) ఔట్ కావడంతో బంగ్లా ఇన్నింగ్స్ 84 పరుగుల వద్ద ముగిసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో మెహిది హసన్(27) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సఫారి బౌలర్లలో రబాడ, నోర్జే చెరో మూడు వికెట్లు దక్కించుకోగా.. షంషి 2, ప్రిటోరియస్ ఓ వికెట్ పడగొట్టారు. 64 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ సమయం 16:52.. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో షంషి మరో వికెట్ పడగొట్టాడు. 15.2వ ఓవర్లో షమీమ్ హెసేన్(20 బంతుల్లో 11) ఔట్ చేశాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 64 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో మెహిది హసన్, తస్కిన్ అహ్మద్ ఉన్నారు. 45 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ సమయం 16:35.. సఫారి బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ విలవిలలాడుతుంది. 45 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. షంషి వేసిన 11.3వ ఓవర్లో లిటన్ దాస్(36 బంతుల్లో 24; ఫోర్) ఎల్బీడబ్ల్యూగా ఔట్ కావడంతో బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. 12 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 46/6. క్రీజ్‌లో షమీమ్ హెసేన్(4), మెహిది హసన్(1) ఉన్నారు. చెలరేగుతున్న సఫారి పేసర్లు.. 34 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ సమయం 16: 16.. సఫారి పేసర్లు చెలరేగిపోతున్నారు. బంగ్లా బ్యాటింగ్ లైనప్‌పై విరుచుకుపడుతున్నారు. తొలుత రబాడ వరుస బంతుల్లో వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ నడ్డి విరచగా.. తాజాగా నోర్జే, ప్రిటోరియస్ వరుస బంతుల్లో వికెట్లు తీసి బంగ్లాను కోలుకోలేని దెబ్బకొట్టారు. నోర్జే వేసిన 8వ ఓవర్ ఆఖరి బంతికి మహ్మదుల్లా(9 బంతుల్లో 3) క్యాచ్ ఔట్ కాగా.. ఆ మరుసటి బంతికే ప్రిటోరియస్ బౌలింగ్‌లో అఫీఫ్ హెసేన్(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 9 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 36/5. క్రీజ్‌లో లిటన్ దాస్(19), షమీమ్ హెసేన్(1) ఉన్నారు. దడదడలాడిస్తున్న రబాడ.. 5 బంతుల్లో 3 వికెట్లు సమయం 15: 57.. ఇన్నింగ్స్ నాలుగో నాలుగో ఓవర్లో ఆఖరి రెండు బంతులకు రెండు వికెట్లు పడగొట్టిన రబాడ 6వ ఓవర్లో మరోసారి చెలరేగాడు. 5.3వ ఓవర్లో ముష్ఫికర్ రహీమ్(0) పెవిలియన్‌కు పంపి బంగ్లాదేశ్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఫలితంగా బంగ్లా జట్టు 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. క్రీజ్‌లో లిటన్ దాస్(14), మహ్మదుల్లా ఉన్నారు. దడదడలాడించిన రబాడ.. వరుస బంతుల్లో వికెట్లు సమయం 15: 49.. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగాదేశ్ను రబాడ దడదడలాడించాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఆఖరి రెండు బంతులకు రెండు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్‌ను భారీ దెబ్బ కొట్టాడు. తొలుత నయీమ్(11 బంతుల్లో 9; ఫోర్)ను ఔట్ చేసిన రబాడ.. మరుసటి బంతికే సౌమ్య సర్కార్(0)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కు పంపాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 4 ఓవర్లలో 22 పరగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజ్‌లో లిటన్ దాస్, ముష్ఫికర్ రహీమ్ ఉన్నారు. అబుదాబి: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 గ్రూప్-1లో భాగంగా మంగళవారం(నవంబర్ 2) మధ్యాహ్నం 3:30 గంటలకు షెడ్యూలైన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మెగా టోర్నీలో ఇరు జట్టు ఇప్పటివరకు చెరో మూడు మ్యాచ్‌లు ఆడాయి. దక్షిణాఫ్రికా 2 మ్యాచ్‌ల్లో గెలిచి(వెస్టిండీస్, శ్రీలంక) ఆసీస్ చేతిలో పరాజయంపాలవ్వగా.. సూపర్-12 దశలో బంగ్లాదేశ్ ఆడిన 3 మ్యాచ్‌ల్లో(శ్రీలంక, ఇంగ్లండ్, వెస్టిండీస్) ఓటమిపాలై సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. ఇక పొట్టి ఫార్మాట్లో ఇరు జట్ల మధ్య ముఖాముఖి పోరు విషయానికొస్తే.. ఓవరాల్‌గా ఇరు జట్లు 6 సందర్భాల్లో తలపడగా.. 6 సార్లు దక్షిణాఫ్రికానే గెలుపొందింది. టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు ఒకే ఒక్కసారి తలపడగా.. ఆ మ్యాచ్‌లో సైతం దక్షిణాఫ్రికానే విజయం సాధించింది. ఇప్పటివరకు జరిగిన 6 టీ20 ప్రపంచకప్‌లలో(2007, 2009, 2010, 2012, 2014, 2016) ఇరు జట్లు ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరుకోలేకపోయాయి. 2009, 2014లో సెమీస్‌కు చేరడమే దక్షిణాఫ్రికాకు అత్యుత్తమం కాగా, బంగ్లా 2007లో సూపర్ దశకు చేరుకోగలిగింది. తుది జట్లు: దక్షిణాఫ్రికా: టెంబా బవుమా (కెప్టెన్), డికాక్(వికెట్‌కీపర్), వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, డ్వేన్ ప్రిటోరియస్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడా, అన్రిచ్ నోర్జే, తబ్రేజ్ షమ్సీ బంగ్లాదేశ్: మహ్మదుల్లా (కెప్టెన్), సౌమ్య సర్కార్, మహ్మద్ నయీమ్, లిటన్ దాస్(వికెట్‌కీపర్), షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొసేన్, మెహిది హసన్, షొరిఫుల్ ఇస్లాం, షమీమ్ హొసేన్, నసుమ్ అహ్మద్