Breadcrumb
ఇషాన్, శ్రేయస్‌ల విధ్వంసం.. తొలి టీ20లో టీమిండియా ఘన విజయం
Published Thu, Feb 24 2022 6:14 PM | Last Updated on Thu, Feb 24 2022 10:24 PM
Live Updates
టీమిండియా వర్సెస్ శ్రీలంక.. తొలి టీ20 అప్డేట్స్
ఇషాన్, శ్రేయస్‌ల విధ్వంసం.. తొలి టీ20లో టీమిండియా ఘన విజయం
టీమిండియా నిర్ధేశించిన 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లంకేయులు ఏమాత్రం ప్రతిఘటించకుండానే చేతులెత్తేశారు. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేసి 62 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యారు. ఈ విజయంతో టీమిండియా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో బోణీ కొట్టగా, రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు వరుసగా 10వ టీ20 విజయాన్ని నమోదు చేసింది.
భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, వెంకటేశ్ అయ్యర్ తలో రెండు వికెట్లు, చహల్, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఇషాన్ కిషన్ (56 బంతుల్లో 89; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (28 బంతుల్లో 57; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (32 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 44) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. లంక బౌలర్లలో కుమార, షనక తలో వికెట్ దక్కించుకున్నారు.
ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంక
98 పరుగుల వద్ద శ్రీలంక ఆరో వికెట్ కోల్పోయింది. వెంకటేశ్ అయ్యర్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి కరుణరత్నే (21) ఔటయ్యాడు. 16 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 98/6 గా ఉంది. క్రీజ్‌లో చరిత్ అసలంక (39), చమీర (1) ఉన్నారు.
60 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన శ్రీలంక
60 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన శ్రీలంక ఓటమిని దాదాపుగా ఖరారు చేసుకుంది. 10.5వ ఓవర్లో చహల్ బౌలింగ్ భువీకి సునాయాసమైన క్యాచ్ ఇచ్చి షనక (3) ఔటయ్యాడు. క్రీజ్‌లో చరిత్ అసలంక (23), చమిక కరుణరత్నే ఉన్నారు.
వికెట్ తీసి తగ్గేదేలేదన్న జడేజా
10వ ఓవర్లో చండీమాల్ (9 బంతుల్లో సిక్సతో 10) వికెట్ తీసిన జడేజా వెరైటీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. పుష్ప సినిమాలో హీరోలా తగ్గేదేలే అంటూ సందడి చేశాడు. 10 ఓవర్ల తర్వాత లంక నాలుగు వికెట్ల నష్టానికి 57 పరుగులు మాత్రమే చేసి ఓటమిని దాదాపు ఖరారు చేసుకుంది. క్రీజ్‌లో చరిత్ అసలంక (22), షనక (1) ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక
200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక 7 ఓవర్లలో 36 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. వెంకటేశ్ అయ్యర్ బౌలింగ్‌లో సంజూ సామ్సన్‌కు క్యాచ్ ఇచ్చి జనిత్ లియనాగే (17 బంతుల్లో 11) ఔటయ్యాడు. క్రీజ్‌లో చరిత్ అసలంక (12), చండీమాల్ ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక
వరుసగా రెండో ఓవర్లోనూ భువనేశ్వర్ కుమార్ వికెట్ పడగొట్టాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్ ఆఖరి బంతికి భువీ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి కమిల్ మిశారా (12 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు) ఔటయ్యాడు. 3 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 15/2. క్రీజ్‌లో జనిత్ లియనాగే (2), చరిత్ అసలంక ఉన్నారు.
తొలి బంతికే వికెట్ కోల్పోయిన శ్రీలంక
200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లంకేయులకు ఇన్నింగ్స్ తొలి బంతికే షాక్ తగిలింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో నిస్సంక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో శ్రీలంక సున్నా పరుగులకే వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజ్‌లో కమిల్ మిశారా, జనిత్ లియనాగే ఉన్నారు.
ఇషాన్, శ్రేయస్‌ల విధ్వంసం.. టీమిండియా భారీ స్కోర్
తొలి టీ20లో టీమిండియా బ్యాటర్లు మూకుమ్మడిగా లంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. తొలుత ఇషాన్ కిషన్ (56 బంతుల్లో 89; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆఖర్లో శ్రేయస్ అయ్యర్ (28 బంతుల్లో 57; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) లంక బౌలర్లను ఓ రేంజ్లో ఆడుకున్నారు. ఈ ఇద్దరికి కెప్టెన్ రోహిత్ శర్మ (32 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 44) తోడవ్వడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లంక బౌలర్లలో కుమార, షనక తలో వికెట్ దక్కించుకున్నారు.
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. ఇషాన్ కిషన్ (89) ఔట్
భారీ స్కోర్ సాధించే క్రమంలో టీమిండియా 17వ ఓవర్లో ఇషాన్ కిషన్ (56 బంతుల్లో 89; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) వికెట్ కోల్పోయింది. షనక బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి జనిత్ లియనాగేకు క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్ ఔటయ్యాడు. 17 ఓవర్ల తర్వాత టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. క్రీజ్‌లో శ్రేయస్ అయ్యర్ (17), రవీంద్ర జడేజా ఉన్నారు.
15 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 132/1
ఓపెనర్ ఇషాన్ కిషన్ (50 బంతుల్లో 73; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) జోరును కొనసాగిస్తుండగా, మరో ఎండ్‌లో శ్రేయస్ అయ్యర్ (8 బంతుల్లో 9) నిదానంగా ఆడుతున్నాడు. 15 ఓవర్ల తర్వాత టీమిండియా వికెట్ నష్టానికి 130 పరుగులు చేసింది.
టీమిండియాకు తొలి షాక్.. రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్
111 పరుగుల వద్ద టీమిండియాకు తొలి షాక్ తగిలింది. లహీరు కుమార్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ (32 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 44) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 112/0 గా ఉంది. క్రీజ్‌లో ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 65; 7 ఫోర్లు, 2 సిక్సర్లు),శ్రేయస్ అయ్యర్ ఉన్నారు.
చితక్కొడుతున్న ఇషాన్ కిషన్.. తగ్గేదేలేదంటున్న రోహిత్
గత కొంతకాలంగా తన స్థాయికి తగ్గ ప్రదర్శనను ఇవ్వలేకపోతున్న ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. బౌండరీలు, సిక్సర్లతో లంక బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. కేవలం 30 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్లో రెండో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మరో ఎండ్‌లో రోహిత్ సైతం తగ్గేలేదంటున్నాడు. టీమిండియా కెప్టెన్ 28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 41 పరుగులు చేశాడు. ఫలితంగా టీమిండయా స్కోర్ 10 ఓవర్ల తర్వాత 98/0గా ఉంది.
హ్యాట్రిక్ బౌండరీలతో జోరుమీదున్న ఇషాన్ కిషన్
కరణరత్నే వేసిన మూడో ఓవర్లో టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ చెలరేగిపోయాడు. హ్యాట్రిక్ బౌండరీలతో లంక పేసర్‌పై విరుచుకుపడ్డాడు. ఈ ఓవర్లో టీమిండియా మొత్తం 15 పరుగులు పిండుకుంది. 3 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 26/0 ఉంది. రోహిత్ 10, ఇషాన్ కిషన్ 15 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక
లక్నో వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో పర్యాటక శ్రీలంక జట్టు టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా ప్లేయర్లు రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, సంజూ సామ్సన్ రీఎంట్రీ ఇస్తుండగా, గాయపడిన సూర్యకుమార్ యాదవ్ స్థానాన్ని దీపక్ హుడా భర్తీ చేస్తున్నాడు.
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), శ్రేయస్ అయ్యర్, సంజూ సామ్సన్, దీపక్ హుడా, వెంకటేష్ అయ్యర్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, చహల్
శ్రీలంక: పతుమ్ నిస్సంక, కమిల్ మిశారా, చరిత్ అసలంక, దినేష్ చండిమాల్ (వికెట్‌కీపర్), జనిత్ లియానాగే, దసున్ షనక (కెప్టెన్), చమిక కరుణరత్నే, జెఫ్రీ వాండర్సే, దుష్మంత చమీర, ప్రవీణ్ జయవిక్రమ, లహిరు కుమార
Related News By Category
Related News By Tags
-
Ind Vs SL 1st T20: బోణీ కొట్టిన టీమిండియా
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో 38 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టును 126 పరుగులకే ఆలౌట్ చేసి సిరీస్‌లో తొలి ...
-
మూడో వన్డేలోనూ ఓటమి.. సిరీస్ కోల్పోయిన భారత్
శ్రీలంకతో మూడో వన్డేలో టీమిండియా చిత్తుగా ఓడింది. 249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 138 పరుగులకే (26.1 ఓవర్లలో) ఆలౌటైంది. దునిత్ వెల్లలగే ఐదు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొ...
-
శ్రీలంకతో రెండో వన్డే.. టీమిండియా ఓటమి
IND VS SL 2nd ODI Updates And Highlights: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియాకు ఊహించని పరాభవం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో భారత్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 241 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుక...
-
ఐర్లాండ్‌పై టీమిండియా ఘన విజయం
ఐర్లాండ్‌పై టీమిండియా ఘన విజయం ఐర్లాండ్‌తో జరగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధిచింది. వర్షం కారణంగా 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత ఐర్లాండ్ 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు...
-
చెలరేగిన హర్షల్, చహల్.. మూడో టీ20లో టీమిండియా ఘన విజయం
సత్తా చాటిన భారత బౌలర్లు.. మూడో టీ20లో టీమిండియా ఘన విజయం భారత బౌలర్లు హర్షల్ పటేల్ (4/25), చహల్ (3/20) సత్తా చాటడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన కీలకమైన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్...
Comments
Please login to add a commentAdd a comment