first T20
-
ఆరంభం అదిరింది.. తొలి టీ20లో ఇంగ్లండ్ చిత్తు
టి20 వరల్డ్ చాంపియన్ భారత్ మరోసారి తమ స్థాయికి తగ్గ ఆటతో అదరగొట్టింది. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య ఏకపక్షంగా సాగిన పోరులో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. కట్టుదిట్టమైన పేస్, స్పిన్‌తో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన టీమిండియా... ఆపై దూకుడైన బ్యాటింగ్‌తో మరో 43 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. భారీ బ్యాటింగ్ బలగం ఉన్న ఇంగ్లండ్ కనీస స్థాయి ప్రదర్శన కూడా ఇవ్వలేక చేతులెత్తేసింది. అర్ష్ దీప్ , వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌తో పాటు అభిషేక్ శర్మ మెరుపు ప్రదర్శన భారత జట్టును ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో నిలిపాయి. రెండో టి20 మ్యాచ్ శనివారం చెన్నైలో జరుగుతుంది. కోల్‌కతా: ఇంగ్లండ్‌తో మొదలైన టి20 సిరీస్‌లో భారత్ 1–0తో ముందంజ వేసింది. బుధవారం జరిగిన తొలి పోరులో భారత్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. జోస్ బట్లర్ (44 బంతుల్లో 68; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. వరుణ్ చక్రవర్తికి 3 వికెట్లు దక్కగా...అర్ష్ దీప్ , అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 12.5 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు సాధించి గెలిచింది. అభిషేక్ శర్మ (34 బంతుల్లో 79; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) సిక్సర్లతో చెలరేగి జట్టును గెలిపించాడు. భారత బౌలర్ల జోరు... లెఫ్టార్మ్ పేసర్ అర్ష్ దీప్ పదునైన బంతులతో ఆరంభంలోనే ఇంగ్లండ్‌ను దెబ్బ తీశాడు. తొలి ఓవర్లో ఫిల్ సాల్ట్ (0)ను అవుట్ చేసిన అతను, తన రెండో ఓవర్లో డకెట్ (4)ను వెనక్కి పంపించాడు. బట్లర్, బ్రూక్ (17) కలిసి కొద్దిసేపు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. పాండ్యా ఓవర్లో నాలుగు ఫోర్లతో బట్లర్ దూకుడు ప్రదర్శించాడు. అయితే ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి స్పిన్‌కు ఇంగ్లండ్ కుదేలైంది. ఒకే ఓవర్లో అతను బ్రూక్, లివింగ్‌స్టోన్ (0)లను డగౌట్‌కు పంపించాడు. అనంతరం ఒక ఎండ్‌లో ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోగా... బట్లర్ ఒక్కడే పోరాడగలిగాడు. 34 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. ఆపై పాండ్యా, అక్షర్ మెరుగైన బౌలింగ్‌కు తోడు చక్కటి ఫీల్డింగ్ కారణంగా ఇంగ్లండ్ 26 పరుగుల వ్యవధిలో తర్వాతి 4 వికెట్లు చేజార్చుకుంది. మెరుపు బ్యాటింగ్... అట్కిన్సన్ వేసిన రెండో ఓవర్లో సంజు సామ్సన్ (20 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో వరుసగా 4, 4, 0, 6, 4, 4 బాదిన అతను 22 పరుగులు రాబట్టాడు. అయితే ఒకే ఓవర్లో సామ్సన్, సూర్యకుమార్ (0)లను అవుట్ చేసి ఆర్చర్ దెబ్బ తీశాడు. వుడ్ ఓవర్లో అభి షేక్ 2 సిక్స్‌లు, ఫోర్ కొట్టడంతో పవర్‌ప్లేలో భారత్ 63 పరుగులు చేసింది. ఆ తర్వాత 29 పరుగుల వద్ద ఆదిల్ రషీద్ రిటర్న్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన అభిషేక్ తర్వాతి మూడు బంతుల్లో వరుసగా 4, 6, 6 బాదాడు. ఆపై మరో సిక్స్‌తో 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాతా దూకుడుగా ఆడిన అభిషేక్ భారత విజయానికి 8 పరుగుల దూరంలో అవుటయ్యాడు. షమీకు నో చాన్స్!ఫిట్నెస్ నిరూపించుకొని దాదాపు 14 నెలల విరామం తర్వాత భారత జట్టులోకి వచి్చన సీనియర్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీకి ఇంకా మ్యాచ్ ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఇంగ్లండ్‌తో తొలి టి20 కోసం ప్రకటించిన టీమ్‌లో అనూహ్యంగా అతనికి చోటు దక్కలేదు. దీనికి మేనేజ్మెంట్ ఎలాంటి కారణం చెప్పలేదు. జట్టు కూర్పులో భాగంగా అతడిని పక్కన పెట్టారా లేక పూర్తిగా కోలుకోలేదా అనే విషయంపై స్పష్టత లేదు.97 అంతర్జాతీయ టి20ల్లో అర్ష్ దీప్ సింగ్ వికెట్ల సంఖ్య. భారత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా అతను నిలిచాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న యుజువేంద్ర చహల్ (96)ను అర్ష్ దీప్ అధిగమించాడు. స్కోరు వివరాలుఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) సామ్సన్ (బి) అర్ష్ దీప్ 0; డకెట్ (సి) రింకూ (బి) అర్ష్ దీప్ 4; బట్లర్ (సి) నితీశ్ రెడ్డి (బి) వరుణ్ 68; బ్రూక్ (బి) వరుణ్ 17; లివింగ్‌స్టోన్ (బి) వరుణ్ 0; బెతెల్ (సి) అభిషేక్ (బి) పాండ్యా 7; ఒవర్టన్ (సి) నితీశ్ రెడ్డి (బి) అక్షర్ 2; అట్కిన్సన్ (స్టంప్డ్) సామన్ (బి) అక్షర్ 2; ఆర్చర్ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 12; రషీద్ (నాటౌట్) 8; వుడ్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 132. వికెట్ల పతనం: 1–0, 2–17, 3–65, 4–65, 5–83, 6–95, 7–103, 8–109, 9–130, 10–132. బౌలింగ్: అర్ష్ దీప్ సింగ్ 4–0–17–2, హార్దిక్ పాండ్యా 4–0–42–2, వరుణ్ చక్రవర్తి 4–0–23–3, అక్షర్ పటేల్ 4–1–22–2, రవి బిష్ణోయ్ 4–0–22–0. భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) అట్కిన్సన్ (బి) ఆర్చర్ 26; అభిషేక్ శర్మ (సి) బ్రూక్ (బి) రషీద్ 79; సూర్యకుమార్ (సి) సాల్ట్ (బి) ఆర్చర్ 0; తిలక్‌వర్మ (నాటౌట్) 19; పాండ్యా (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (12.5 ఓవర్లలో 3 వికెట్లకు) 133. వికెట్ల పతనం: 1–41, 2–41, 3–125. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 4–0–21–2, అట్కిన్సన్ 2–0–38–0, మార్క్ వుడ్ 2.5–0–25–0, రషీద్ 2–0–27–1, ఒవర్టన్ 1–0–10–0, లివింగ్‌స్టోన్ 1–0–7–0. -
మెరిసిన జెమీమా, స్మృతి
నవీ ముంబై: భారత మహిళల జట్టు చాన్నాళ్ల తర్వాత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెప్పుకోదగ్గ విజయం సాధించింది. వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా 49 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై నెగ్గింది. టాపార్డర్ బ్యాటర్లు స్మృతి మంధాన (33 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), జెమీమా రోడ్రిగ్స్ (35 బంతుల్లో 73; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేయగా, బౌలింగ్‌లో టిటాస్ సాధు (3/37), దీప్తి శర్మ (2/21), రాధా యాదవ్ (2/28) కరీబియన్ జట్టును దెబ్బతీశారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఉమా ఛెత్రి (26 బంతుల్లో 24; 4 ఫోర్లు), రిచా ఘోష్ (14 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. కరిష్మా రమ్హార్యాక్ 2, డియాండ్ర డాటిన్ 1 వికెట్ తీశారు. అనంతరం వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులే చేసి ఓడింది. ఓపెనర్ కియానా జోసెఫ్ (33 బంతుల్లో 49; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), డియాండ్ర డాటిన్ (28 బంతుల్లో 52; 4 ఫోరు, 3 సిక్స్‌లు) రాణించారు. జెమీమాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మంగళవారం ఇదే వేదికపై రెండో టి20 మ్యాచ్ జరుగుతుంది. స్కోరు వివరాలు భారత మహిళల ఇన్నింగ్స్: స్మృతి (సి) కియానా (బి) కరిష్మా 54; ఉమా ఛెత్రి (బి) కరిష్మా 24; జెమీమా రోడ్రిగ్స్ (రనౌట్) 73; రిచా ఘోష్ (సి) మంగ్రూ (బి) డియాండ్ర 20; హర్మన్‌ప్రీత్ (నాటౌట్) 13; సజన (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–50, 2–131, 3–155, 4–190. బౌలింగ్: చినెలీ హెన్రీ 2–0–17–0, జైదా జేమ్స్ 1–0–13–0, హేలీ 3–0–38–0, కరిష్మా 4–0–18–2, అఫీ ఫ్లెచర్ 3–0–39–0, డియాండ్ర 4–0–37–1, షమిలియా 1–0–11–0, కియానా జోసెఫ్ 2–0–22–0. వెస్టిండీస్ మహిళల ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) సబ్–మిన్నుమణి (బి) టిటాస్ 1; కియానా (సి) సైమా (బి) టిటాస్ 49; షెమైన్ (బి) దీప్తి శర్మ 13; డియాండ్ర (సి) రాధ (బి) టిటాస్ 52; చినెలీ హెన్రీ (సి) సబ్–మిన్నుమణి (బి) రాధ 7; షబిక (నాటౌట్) 15; అఫీ ఫ్లెచర్ (బి) దీప్తి శర్మ 0; జైదా (సి) ఉమా ఛెత్రి (బి) రాధ 5; మంగ్రూ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–2, 2–36, 3–80, 4–108, 5–126, 6–127, 7–140. బౌలింగ్: రేణుక 4–0– 25–0, టిటాస్ సాధు 4–0–37–3, దీప్తిశర్మ 4–0– 21–2, సైమా 4–0–35–0, రాధ 4–0–28–2.3622 అంతర్జాతీయ మహిళల టి20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా స్మృతి మంధాన గుర్తింపు పొందింది. ఇన్నాళ్లు హర్మన్‌ప్రీత్ (3589 పరుగులు) పేరిట ఉన్న రికార్డును స్మృతి సవరించింది. 117 అంతర్జాతీయ మహిళల టి20ల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్ డియాండ్రా డాటిన్ (117) ఘనత సాధించింది. న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డివైన్ (114) పేరిట ఉన్న రికార్డును డియాండ్రా బద్దలు కొట్టింది. -
మహిళ జట్టు సత్తా చాటేనా!
ముంబై: ఆ్రస్టేలియా చేతిలో మూడు వన్డేల సిరీస్‌లో వైట్‌వాష్ అయిన భారత మహిళల క్రికెట్ జట్టు ఐదు రోజుల వ్యవధిలోనే మరో ద్వైపాక్షిక సిరీస్‌కు సిద్ధమైంది. భారత్ పర్యటనకు వ చ్చిన వెస్టిండీస్ అమ్మాయిల జట్టుతో సొంతగడ్డపై నెగ్గే ప్రయత్నంలో సాధన చేస్తోంది. రెండు పరిమిత ఓవర్ల సిరీస్‌లలో ముందుగా భారత్, విండీస్ జట్ల మధ్య నేడు తొలి టి20 జరగనుంది. జట్టులో కొరవడిన నిలకడ, అనుభవజ్ఞుల బాధ్యతా రాహిత్యం, బ్యాటర్ల ఫామ్ లేమి హర్మన్‌ప్రీత్ సేనను కలవరపెడుతోంది. స్టార్ ఓపెనర్, వైస్ కెపె్టన్ స్మృతి మంధాన చాన్నాళ్ల తర్వాత సెంచరీతో టచ్‌లోకి వచ్చిoది. అయితే ఈ ఫామ్ ఇకపై కొనసాగిస్తుందో లేదో కరీబియన్‌తో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లలో తెలుస్తుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మాత్రం వరుసగా విఫలం కావడం జట్టుపై ప్రభావం చూపిస్తోంది. వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు ఆడనున్న తొలి టి20 సిరీస్ ఇదే కానుంది. ఆ్రస్టేలియా లాంటి పటిష్టమైన జట్టుతో జరిగిన చివరి వన్డేలో 4 వికెట్లతో చెలరేగినా... హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డి జట్టులో స్థానం కోల్పోయింది. ఆతిథ్య జట్టు పరిస్థితి ఇలా ఉంటే వెస్టిండీస్ అమ్మాయిల జట్టు మనకంటే మెరుగనే చెప్పవచ్చు. బ్యాటింగ్‌లో కెపె్టన్ హేలీ మాథ్యూస్, క్వియానా జోసెఫ్, డియాండ్రా డాటిన్, షెమైన్ క్యాంప్‌బెల్ ఫామ్‌లో ఉన్నారు. ఈ ఏడాది టి20 ఫార్మాట్లో కరీబియన్ టీమ్ 13 మ్యాచ్‌లాడితే తొమ్మిది మ్యాచ్‌ల్లో గెలిచింది. అయితే నవంబర్ 2019నుంచి భారత్, విండీస్ మహిళల జట్ల మధ్య ఎనిమిది టి20లు జరిగితే అన్నింటిలో భారతే విజయం సాధించడం విశేషం. జట్లు (అంచనా) భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, నందిని కశ్యప్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తిశర్మ, రేణుక, ప్రియా మిశ్రా, సైమా ఠాకూర్, మిన్ను మణి, రాధా యాదవ్. వెస్టిండీస్ మహిళల జట్టు: హేలీ మాథ్యూస్ (కెప్టెన్ ), షెమైన్ క్యాంప్‌బెల్, ఆలియా అలెన్, షమిలియా కానెల్, డియాండ్ర డాటిన్, అఫి ఫ్లెచర్, నెరిసా, క్వియానా జోసెఫ్, హెన్రీ, జైదా జేమ్స్, కరిష్మా రమ్హారక్. -
అమితోత్సాహంతో సూర్య సేన : యువ ఆటగాళ్లకు పరీక్ష
సొంతగడ్డపై ఐపీఎల్లో చెలరేగిపోయే భారత యువ క్రికెటర్లకు టీమిండియా తరఫున సత్తా చాటే మరో అరుదైన అవకాశం వచ్చింది. సీనియర్ల రిటైర్మెంట్తో పాటు మరికొందరు సీనియర్లు విశ్రాంతి తీసుకోవడంతో జట్టులోకి వచ్చిన పలువురు యువ ఆటగాళ్లు తమదైన చాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. బంగ్లాదేశ్‌తో టి20 సిరీస్ వారి సత్తాకు పరీక్ష పెట్టనుంది. ఈ నేపథ్యంలో మూడు మ్యాచ్‌ల పోరుకు రంగం సిద్ధమైంది. అనుభవంలో మెరుగ్గా కనిపిస్తున్న బంగ్లా ఆతిథ్య జట్టుకు ఎలాంటి పోటీనిస్తుందనేది ఆసక్తికరం. గ్వాలియర్: బంగ్లాదేశ్‌పై టెస్టు సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టు ఇప్పుడు కాస్త విరామం తర్వాత టి20ల్లో గెలుపుపై గురి పెట్టింది. నేడు జరిగే తొలి టి20 మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ తలపడేందుకు సన్నద్ధమయ్యాయి. జింబాబ్వే పర్యటనలో భారత్‌ను గెలిపించిన కెప్టెన్ సూర్యకుమార్ మరో సిరీస్‌ను గెలుచుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. టీమిండియా నుంచి కనీసం ఇద్దరు ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. మయాంక్, నితీశ్‌లకు చాన్స్! ఐపీఎల్లో తన మెరుపు బౌలింగ్‌తో మయాంక్ యాదవ్ అందరి దృష్టిలో పడ్డాడు. ఇప్పుడు అదే ఎక్స్‌ప్రెస్ వేగం అతనికి భారత జట్టులో స్థానం అందించింది. ఆదివారం తొలి మ్యాచ్ ఆడే అవకాశం లభిస్తే మయాంక్ సత్తా చాటగలడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్ హర్షిత్ రాణా కూడా చాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే ఇద్దరు పేసర్లను ఒకేసారి అరంగేట్రం చేయిస్తారా అనేది చూడాలి. మరో వైపు ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా బరిలోకి దిగడం ఖాయమైంది. నితీశ్ తన ఐపీఎల్ ప్రదర్శనతో జింబాబ్వేతో టూర్‌కు ఎంపికైనా...చివరి నిమిషంలో అనారోగ్యం కారణంగా తప్పుకున్నాడు. వీరితో పాటు జింబాబ్వేలో రాణించిన రియాన్ పరాగ్, అభిõÙక్ శర్మ చెలరేగిపోగలరు. టి20ల్లో ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న సామ్సన్, రింకూ, సుందర్, బిష్ణోయ్, వరల్డ్ కప్ విజేత జట్టులో సభ్యుడు అర్‡్షదీప్‌లతో భారత జట్టు పటిష్టంగా ఉంది. ఇక సారథిగానే కాకుండా అద్భుత బ్యాటర్‌గా సూర్యకుమార్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలు ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించగలరు. వీరిని నిలువరించడం బంగ్లాదేశ్‌కు అంత సులువు కాదు. అనుభవజు్ఞలతో... భారత్‌తో పోలిస్తే బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ఎక్కువ అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. మహ్ముదుల్లా, ముస్తఫిజుర్, లిటన్ దాస్, తస్కీన్, మెహదీ హసన్ మిరాజ్... వీరంతా కనీసం 50 టి20లకు పైగా ఆడినవారే. ఇప్పుడు భారత్‌ను ఓడించాలంటే వీరంతా సమష్టిగా రాణించాల్సి ఉంటుంది. గతంలోనూ అప్పుడప్పుడు కాస్త మెరుపులు చూపించినా భారత్‌పై బంగ్లా పెద్దగా ఆధిపత్యం కనబర్చింది లేదు. సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లలో తన్జీమ్, తన్జీద్, రిషాద్ ఇటీవల టి20ల్లో తమ జట్టు తరఫున కీలక ఆటగాళ్లుగా ఎదిగారు. టెస్టు సిరీస్ ఓడిన బంగ్లా కనీసం టి20ల్లోనైనా మెరుగ్గా ఆడి గౌరవంగా వెనుదిరగాలని భావిస్తోంది. తొలి పోరులో గెలిచి ఆధిక్యం లభిస్తే సిరీస్ విజయంపై బంగ్లా ఆశలు పెట్టుకోవచ్చు. దూబే స్థానంలో తిలక్ వర్మ వెన్ను గాయం కారణంగా ఆల్‌రౌండర్ శివమ్ దూబే బంగ్లాదేశ్‌తో సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మను బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేశారు. అతను ఆదివారం ఉదయం జట్టు సభ్యులతో కలుస్తాడని బోర్డు పేర్కొంది. అయితే తొలి మ్యాచ్‌లో తిలక్ తుది జట్టులో ఆడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిõÙక్, సంజు సామ్సన్, పరాగ్, నితీశ్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, అర్‡్షదీప్ సింగ్ బంగ్లాదేశ్: నజు్మల్ హసన్ (కెప్టెన్ ), లిటన్ దాస్, పర్వేజ్, తన్జీద్, మిరాజ్, తౌహీద్, మహ్ముదుల్లా, రిషాద్, తన్జీమ్, తస్కీన్, ముస్తఫిజుర్ -
ఆసీస్‌తో తొలి టీ20.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ముగ్గురి అరంగేట్రం
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో రేపు (సెప్టెంబర్ 11) జరుగబోయే తొలి మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ మ్యాచ్‌తో ముగ్గురు ఇంగ్లండ్ ఆటగాళ్లు (జేకబ్ బేథెల్, జేమీ ఓవర్టన్, జోర్డన్ కాక్స్) టీ20 అరంగేట్రం చేయనున్నారు. రెగ్యులర్ కెప్టెన్ జోస్ బట్లర్ గాయం కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరం కావడంతో ఫిల్ సాల్ట్ ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సౌతాంప్టన్ వేదికగా రేపటి మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది.ఆసీస్‌తో తొలి టీ20 కోసం ఇంగ్లండ్ తుది జట్లు: ఫిల్ సాల్ట్ (కెప్టెన్), విల్ జాక్స్, జోర్డన్ కాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బెథెల్, సామ్ కర్రన్, జేమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, రీస్ టాప్లేకాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది.ఆసీస్, ఇంగ్లండ్ మధ్య టీ20, వన్డే సిరీస్ షెడ్యూల్..సెప్టెంబర్ 11- తొలి టీ20 (సౌతాంప్టన్)సెప్టెంబర్ 13- రెండో టీ20 (కార్డిఫ్)సెప్టెంబర్ 15- మూడో టీ20 (మాంచెస్టర్)సెప్టెంబర్ 19- తొలి వన్డే (నాటింగ్హమ్)సెప్టెంబర్ 21- రెండో వన్డే (లీడ్స్)సెప్టెంబర్ 24- చెస్టర్ లీ స్ట్రీట్సెప్టెంబర్ 27- లండన్సెప్టెంబర్ 29- బ్రిస్టల్ -
ఆరంభం అదిరింది.. శ్రీలంకను చిత్తు చేసిన భారత్
పల్లెకెలె: టి20 ప్రపంచ చాంపియన్ భారత్... శ్రీలంక పర్యటనలో శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో సూర్యకుమార్ బృందం 43 పరుగుల తేడాతో లంకపై విజయం సాధించింది. మూడు టి20ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో నిలిచింది. విరామం లేకుండా నేడే రెండో టి20 మ్యాచ్ జరగనుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ సూర్యకుమార్ (26 బంతుల్లో 58; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), రిషభ్ పంత్ (33 బంతుల్లో 49; 6 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. పతిరణకు 4 వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 19.2 ఓవర్లలో 170 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు నిసాంక (48 బంతుల్లో 79; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), కుశాల్ మెండిస్ (27 బంతుల్లో 45; 7 ఫోర్లు, 1 సిక్స్) ఒకదశలో భారత శిబిరాన్ని వణికించేలా మెరిపించారు. రియాన్ పరాగ్ (1.2–0–5–3) బంతితో మ్యాజిక్ చేశాడు. అర్‡్షదీప్ (2/24), అక్షర్ పటేల్ (2/38) కీలక వికెట్లు తీశారు. జైస్వాల్, గిల్ మెరుపులతో... ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (21 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (16 బంతుల్లో 34; 6 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్‌తో భారత్ ఇన్నింగ్స్ మొదలైంది. ఉన్నది కాసేపే అయినా ఇద్దరు పోటీపడి బౌండరీలు బాదడంతో 4వ ఓవర్లో జట్టు స్కోరు 50 దాటింది. పవర్ ప్లేలో పవర్ చూపిన ఓపెనర్లిద్దరిని లంక బౌలర్లు వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చారు. మదుషంక వేసిన ఆరో ఓవర్లో శుబ్‌మన్ రెండు ఫోర్లు, డీప్ మిడ్‌వికెట్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. తొలి ఐదు బంతుల్లోనే 15 పరుగులు రాగా... అదే ఊపులో ఆఖరి బంతిని షాట్ ఆడేందుకు ప్రయతి్నంచగా, మిడాన్‌లో ఉన్న ఫెర్నాండో క్యాచ్ పట్టడంతో గిల్ వెనుదిరిగాడు. 6 ఓవర్లలో 74/1 స్కోరుతో ఉన్న భారత్‌కు తర్వాతి బంతి మరో దెబ్బతీసింది. హసరంగ వేసిన ఏడో ఓవర్ తొలిబంతికి జోరుమీదున్న జైస్వాల్ స్టంపౌట్ అయ్యాడు. సూర్య ఫిఫ్టీ... ఈ ఊరట కాస్తా ఆ రెండు బంతులకే పరిమితమైంది. తర్వాత దశను హార్డ్ హిట్టర్లు సూర్యకుమార్, రిషభ్ పంత్ మొదలుపెట్టారు. దీంతో పరుగుల్లో వేగం, బ్యాటింగ్‌లో దూకుడు మరింత పెరిగిందే తప్ప తగ్గనేలేదు. 8.4 ఓవర్లోనే భారత్ 100 పరుగుల మైలురాయిని చేరుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ స్ట్రోక్ ప్లేతో పదేపదే బౌండరీలకు తరలించాడు. చెత్త బంతులు ఎదురైతే సిక్స్‌లుగా బాదేశాడు. ఈ మెరుపులతో అతని అర్ధశతకం 22 బంతుల్లోనే పూర్తవగా, 13.1 ఓవర్లో జట్టు స్కోరు 150 పరుగులకు చేరింది. కానీ తర్వాతి బంతికి పతిరణ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో కెపె్టన్ ఇన్నింగ్స్ ముగిసింది. హార్దిక్ పాండ్యా (9), పరాగ్ (7) విఫలమైనప్పటికీ పంత్ తనశైలి ఆటతీరుతో జట్టు స్కోరును 200 పైచిలుకు తీసుకెళ్లాడు. పరుగు తేడాతో అర్ధసెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. చకచకా లక్ష్యం వైపు... అంతలోనే! శ్రీలంక కూడా లక్ష్యానికి తగ్గ దూకుడుతోనే బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు నిసాంక, కుశాల్ మెండీస్ మెరుపులతో సగటున ఓవర్‌కు 10 పరుగుల రన్‌రేట్‌తో లంక ఇన్నింగ్స్ దూసుకెళ్లింది. 5.1 ఓవర్లలో జట్టు స్కోరు 50కి చేరింది. నిసాంక భారీషాట్లతో విరుచుకుపడగా, మెండీస్ బౌండరీలతో భారత బౌలర్ల భరతం పట్టాడు. జట్టు స్కోరు 84 వద్ద అర్ష్‌దీప్... మెండిస్‌ను అవుట్ చేసి తొలివికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. తర్వాత కుశాల్ పెరీరా (14 బంతుల్లో 20; 3 ఫోర్లు) అండతో నిసాంక మరింతగా రెచి్చపోయాడు. 14 ఓవర్లదాకా ఎంతవేగంగా లక్ష్యం వైపు దూసుకొచి్చంతో... నిసాంక అవుటయ్యాక అంతే వేగంగా లంక ఇన్నింగ్స్ పతనమైంది. 140 స్కోరు వద్ద నిసాంక రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. 36 బంతుల్లో 74 పరుగుల సమీకరణం ఏమంత కష్టం కాకపోయినా... భారత బౌలర్లు పట్టుబిగించడంతో అనూహ్యంగా మరో 30 పరుగుల వ్యవధిలోనే 8 వికెట్లను కోల్పోయి లంక 170 పరుగులకే ఆలౌటైంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: యశస్వి (స్టంప్డ్) కుశాల్ మెండిస్ (బి) హసరంగ 40; గిల్ (సి) ఫెర్నాండో (బి) మదుషంక 34; సూర్యకుమార్ (ఎల్బీడబ్ల్యూ) (బి) పతిరణ 58; పంత్ (బి) పతిరణ 49; పాండ్యా (బి) పతిరణ 9; పరాగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) పతిరణ 7; రింకూ సింగ్ (బి) ఫెర్నాండో 1; అక్షర్ (నాటౌట్) 10; అర్‡్షదీప్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–74, 2–74, 3–150, 4–176, 5–192, 6–201, 7–206. బౌలింగ్: మదుషంక 3–0–45–1, అసిత ఫెర్నాండో 4–0–47–1, తీక్షణ 4–0–44–0, హసరంగ 4–0–28–1, కమిండు మెండీస్ 1–0–9–0, పతిరణ 4–0–40–4. శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (బి) అక్షర్ 79; కుశాల్ మెండిస్ (సి) జైస్వాల్ (బి) అర్‡్షదీప్ 45; పెరీరా (సి) బిష్ణోయ్ (బి) అక్షర్ 20; కమిండు మెండిస్ (బి) పరాగ్ 12; అసలంక (సి) జైస్వాల్ (బి) బిష్ణోయ్ 0; షనక (రనౌట్) 0; హసరంగ (సి) పరాగ్ (బి) అర్‡్షదీప్ 2; తీక్షణ (బి) పరాగ్ 2; పతిరణ (సి) అక్షర్ (బి) సిరాజ్ 6; ఫెర్నాండో (నాటౌట్) 0; మదుషంక (బి) పరాగ్ 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.2 ఓవర్లలో ఆలౌట్) 170. వికెట్ల పతనం: 1–84, 2–140, 3–149, 5–160, 6–161, 7–163, 8–170, 9–170, 10–170. బౌలింగ్: అర్‡్షదీప్ 3–0–24–2, సిరాజ్ 3–0–23–1, అక్షర్ 4–0–38–2, రవి బిష్ణోయ్ 4–0–37–1, పాండ్యా 4–0–41–0, పరాగ్ 1.2–0–5–3. -
శుభారంభంపై భారత్ దృష్టి
పల్లెకెలె: భారత్ కొత్తకొత్తగా లంక పర్యటనను ప్రారంభించేందుకు సిద్ధమైంది. గతంలో టి20 సారథిగా వ్యవహరించినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ ఈసారి గంభీర్ కోచింగ్‌లో నడవడం కొత్తే! టాపార్డర్‌లో రోహిత్ శర్మ, కోహ్లితో పాటు ఆల్‌రౌండర్ జడేజా పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడంతో ఆ చాలెంజింగ్ స్థానాలు భర్తీ చేసే ఆటగాళ్లకు ఈ సిరీస్ సరికొత్తగా స్వాగతం పలకబోతోంది. మొత్తం పల్లెకెలె వేదికపైనే జరిగే మూడు టి20ల సిరీస్‌లో నేడు తొలి మ్యాచ్ జరుగుతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ అనుభవం, సూర్యకుమార్ సారథ్యం, సత్తాగల యువ ఆటగాళ్లతో భారత్ సమతూకంగా ఉంది. కొత్త జట్టు మేళవింపుతో శుభారంభంపై దృష్టి సారించింది. కొత్త కోచ్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. గంభీర్ ఓపెనర్‌గా నిరూపించుకున్నాడు. అంతకుమించి రెండు ప్రపంచకప్ (2007 టి20; 2011 వన్డే) విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. అలాగే దీనితో పోల్చలేకపోయినా కూడా... ఐపీఎల్లో విజయవంతమైన సారథిగా, అనంతరం మెంటార్‌గానూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు టైటిళ్లు అందించాడు. కాబట్టి గంభీర్ మార్గదర్శనంపై ఎవరికీ ఏ అనుమానాలు లేవు. అయితే పూర్తిగా యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఏ విధంగా సన్నద్ధం చేస్తారన్నదానిపైనే సర్వత్రా ఆసక్తినెలకొంది. దుర్భేధ్యంగా టీమిండియా ఈ ఏడాది భారత జట్టు అద్భుతంగా రాణిస్తోంది. ప్రపంచకప్‌లో ట్రోఫీ గెలిచేదాకా జైత్రయాత్ర కొనసాగించింది. ఓవరాల్‌గా ఈ ఏడాది 16 టి20లు ఆడిన భారత్ 15 మ్యాచ్‌ల్లో గెలిచింది. జింబాబ్వేకెళ్లిన ద్వితీయశ్రేణి భారత జట్టు తొలి మ్యాచ్‌లో ఒటమి తప్ప సిరీస్ 4–1తో గెలిచి సత్తా చాటుకుంది. ఓపెనింగ్‌లో యశస్వి, గిల్‌లతో పాటు వన్‌డౌన్‌లో రిషభ్ పంత్ మెరిపిస్తే మిడిలార్డర్‌ను సూర్యకుమార్‌తో పాటు అనుభవజ్ఞుడైన హార్దిక్ పాండ్యా నడిపించగలడు.బౌలింగ్‌లో బుమ్రా కూడా విశ్రాంతిలో ఉండటంతో.... మొత్తం మీద అనుభవజు్ఞల్లేని టీమిండియాకు ప్రస్తుతం పాండ్యానే పెద్ద దిక్కు. బౌలింగ్‌లో సిరాజ్, అర్‡్షదీప్ సింగ్‌లు సత్తా చాటితే ఆరంభంలోనే వికెట్లు కూలుతాయి. గంభీర్ ప్లాన్ ముగ్గురు స్పిన్నర్లయితే వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌లతో పాటు రవి బిష్ణోయ్‌కి చాన్స్ లభిస్తుంది. లంక ఎదురునిలిచేనా... స్టార్లు లేకపోయినా భారత్ సత్తాపై ఎవరికీ ఏ అనుమానాల్లేవు. కానీ కొన్నేళ్లుగా శ్రీలంక ప్రదర్శన మాత్రం నిరాశజనకంగా సాగుతోంది. ఇలాంటి జట్టును అనుభవం లేని కెపె్టన్ చరిత్ అసలంక ఏ మేరకు నడిపిస్తాడో చూడాలి. టాపార్డర్‌లో నిసాంక, కుశాల్ మెండిస్ బౌలింగ్‌లో హసరంగ, పతిరణ తప్ప జట్టులో నిలకడగా ఆడే ఆటగాళ్లే కరువయ్యారు. సొంతగడ్డపై అనుకూలత కూడా టి20లకు ఏమాత్రం అక్కరకు రాదు. కాబట్టి భారత్ యువ ఆటగాళ్లతో ఉన్నా... వారిలో ఐపీఎల్ అపారమైన అనుభవాన్నిచి్చంది. ఈ నేపథ్యంలో శ్రీలంక సిరీస్ గెలిచేందుకు కాదు... మ్యాచ్ నెగ్గేందుకే ప్రతిసారీ యుద్ధం చేయక తప్పదు! జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), యశస్వి, శుబ్‌మన్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, సుందర్, అక్షర్, అర్శ్‌దీప్, రవి బిష్ణోయ్/ఖలీల్ అహ్మద్, సిరాజ్. శ్రీలంక: అసలంక (కెప్టెన్), నిసాంక, కుశాల్ మెండిస్, పెరీరా, ఫెర్నాండో, షనక, హసరంగ, తీక్షణ, బినుర ఫెర్నాండో, మదుషంక, పతిరణ. పిచ్, వాతావరణం ఇది స్పిన్ వికెట్. నిలదొక్కుకుంటే 180 పైచిలుకు స్కోరు సాధించవచ్చు. అయితే స్పిన్నర్లతో ఇబ్బందులు తప్పవు. శనివారం పగటివేళ వర్షం కురిసే అవకాశముంది. కానీ రాత్రికల్లా తెరిపినిస్తుందని స్థానిక వాతావరణశాఖ తెలిపింది. -
లంకతో తొలి టీ20.. భారత తుది జట్టులో ఎవరెవరు..?
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20 పల్లెకెలె వేదికగా రేపు (జులై 27) జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా సర్వ శక్తులు ఒడ్డనుంది. ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు ఫుల్ మెంబర్ జట్టును ఎంపిక చేశారు. టీ20 వరల్డ్‌కప్ విజయానంతరం భారత్ ఫుల్ మెంబర్ జట్టుతో ఆడుతున్న తొలి సిరీస్ ఇదే. ఈ సిరీస్‌కు ముందు భారత్ జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడినా అందులో సీనియర్లు ఆడలేదు. సీనియర్లు రాకతో భారత తుది జట్టు ఎంపిక మేనేజ్మెంట్కు పెద్ద సవాల్‌గా మారింది. తుది జట్టులో ఎవరెవరు ఉంటారనే దానిపై పెద్ద కసరత్తే చేయాల్సి ఉంది.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌కు ఓపెనర్లుగా లైన్ క్లియర్ అయ్యింది. ఈ సిరీస్‌కు వారిద్దరే స్పెషలిస్ట్ ఓపెనర్లుగా ఎంపికయ్యారు. వన్‌డౌన్‌లో ఎవరిని పంపుతారనే దానిపై క్లారిటీ లేదు. ఒకవేళ భారత్ సంజూ శాంసన్, రిషబ్ పంత్ ఇద్దరూ బరిలోకి దించితే సంజూ వన్‌డౌన్‌లో రావచ్చు. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన మార్కు చూపించుకునే క్రమంలో అక్షర్ పటేల్‌ను వన్‌డౌన్‌లో పంపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.నాలుగో స్థానంలో నూతన టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఐదో స్థానంలో రిషబ్ పంత్, ఆరో స్థానంలో రింకూ సింగ్, ఏడో స్థానంలో హార్దిక్ పాండ్యా, ఎనిమిదో స్థానంలో శివమ్ దూబే, స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవి భిష్ణోయ్, పేసర్లుగా అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్ తుది జట్టులో ఉండవచ్చు. ఒకవేళ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని భావిస్తే.. శివమ్ దూబే స్థానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టుకు ఎంపిక కావచ్చు.శ్రీలంకతో తొలి టీ20కి భారత తుది జట్టు (అంచనా)..శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్/రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే/ వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి భిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్ -
కుర్రాళ్లు నిలవలేకపోయారు...
ఐపీఎల్ అనుభవంతో జింబాబ్వే గడ్డపై అడుగు పెట్టిన భారత యువ బృందం అంతర్జాతీయ వేదికపై ఆ మెరుపులు చూపించలేకపోయింది. తమతో పోలిస్తే టి20 క్రికెట్లో తక్కువ అనుభవం ఉన్న బలహీన ప్రత్యర్థిని నిలువరించడంలో విఫలమైంది. తమ ప్రధాన ఆటగాళ్లతో బరిలోకి దిగిన జింబాబ్వే ఎనిమిదేళ్ల తర్వాత టీమిండియాపై విజయాన్ని నమోదు చేసింది. తక్కువ స్కోర్ల మ్యాచ్‌లో స్ఫూర్తిదాయక ఆటతో సొంత అభిమానుల్లో ఆనందం పంచింది. వరల్డ్ కప్ ఫైనల్ గెలిచిన టీమ్‌లోని ఒక్క ఆటగాడు కూడా ఈ మ్యాచ్‌లో ఆడకపోయినా... అధికారిక రికార్డుల ప్రకారం వరల్డ్ చాంపియన్ అయిన తర్వాత భారత్‌కు ఇది ఓటమి! హరారే: సొంత గడ్డపై ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో జింబాబ్వే శుభారంభం చేసింది. శనివారం జరిగిన పోరులో జింబాబ్వే 13 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. క్లైవ్ మదాందె (25 బంతుల్లో 29 నాటౌట్; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా...మైర్స్ (23), బెన్నెట్ (22), మదివెరె (21) స్కోరులో తలా ఓ చేయి వేశారు. రవి బిష్ణోయ్ (4/13) అంతర్జాతీయ టి20ల్లో తన అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేయగా, సుందర్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. శుబ్‌మన్ గిల్ (29 బంతుల్లో 31; 5 ఫోర్లు), వాషింగ్టన్ సుందర్ (24 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సికందర్ రజా (3/25), చటారా చెరో 3 వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశారు. రెండో టి20 నేడు ఇక్కడే జరుగుతుంది. ఈ మ్యాచ్‌తో అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్ భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేశారు. రవి బిష్ణోయ్‌కు 4 వికెట్లు... రెండో ఓవర్లోనే కయా (0) అవుటైనా...ఖలీల్ ఓవర్లో 4 ఫోర్లతో జింబాబ్వే బ్యాటర్లు 17 పరుగులు రాబట్టారు. అయితే ఆ తర్వాత ఈ జోరుకు బ్రేక్ పడింది. బిష్ణోయ్ తన తొలి రెండు ఓవర్లలో 2 వికెట్లతో జింబాబ్వేను దెబ్బ తీశాడు. 10 ఓవర్లలో స్కోరు 69/3కి చేరింది. ఆ తర్వాత ఒకే స్కోరు వద్ద రెండు వికెట్లు కోల్పోయిన జట్టు 74/5 వద్ద నిలిచింది. కొద్ది సేపటికే సుందర్ కూడా ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని పూర్తిగా నిలువరించాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన బిష్ణోయ్ కూడా మరో 2 వికెట్లు పడగొట్టడంతో జింబాబ్వే 100 లోపే ఆలౌట్ అయ్యేలా అనిపించింది. అయితే చటారా, మదాందె కలిసి తర్వాతి 27 బంతులను జాగ్రత్తగా ఆడి అభేద్యంగా 25 పరుగులు జోడించారు. 90/9 నుంచి స్కోరు 115 వరకు చేరింది. మ్యాచ్ తుది ఫలితంతో ఈ చివరి పరుగులే కీలకంగా మారాయి. టపటపా... తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ (0) నాలుగు బంతులు ఆడితే, రియాన్ పరాగ్ (2) ఆట మూడు బంతుల్లో ముగిసింది. రుతురాజ్ (7) విఫలం కాగా, రింకూ సింగ్ (0) పేలవంగా నిష్క్రమించాడు. దాంతో స్కోరు 22/4. మరో అరంగేట్ర ఆటగాడు ధ్రువ్ జురేల్ (6) విఫలం కావడంతో 9.5 ఓవర్లలో సగం టీమ్ పెవిలియన్‌కు! ఇదీ భారత జట్టు పరిస్థితి. మరో వైపు జాగ్రత్తగా ఆడిన కెప్టెన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. అయితే రజా బౌలింగ్‌లో అతను వెనుదిరగడంతో 47/6 వద్ద భారత్ ఆశలు ఆవిరయ్యాయి. చివర్లో సుందర్ పోరాడినా లాభం లేకపోయింది. ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా 5 బంతుల్లో 2 పరుగులే చేసిన జట్టు చివరి వికెట్ కోల్పోయింది. స్కోరు వివరాలు: జింబాబ్వే ఇన్నింగ్స్: మదెవెరె (బి) బిష్ణోయ్ 21; కయా (బి) ముకేశ్ 0; బెన్నెట్ (బి) బిష్ణోయ్ 22; రజా (సి) బిష్ణోయ్ (బి) అవేశ్ 17; మయర్స్ (సి) అండ్ (బి) సుందర్ 23; క్యాంప్‌బెల్ (రనౌట్) 0; మదాందె (నాటౌట్) 29; మసకద్జ (స్టంప్డ్) జురేల్ (బి) సుందర్ 0; జాంగ్వే (ఎల్బీ) (బి) బిష్ణోయ్ 1; ముజరబాని (బి) బిష్ణోయ్ 0; చటారా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 115. వికెట్ల పతనం: 1–6, 2–40, 3–51, 4–74, 5–74, 6–89, 7–89, 8–90, 9–90. బౌలింగ్: ఖలీల్ 3–0–28–0, ముకేశ్ 3–0–16–1, రవి బిష్ణోయ్ 4–2–13–4, అభిõÙక్ 2–0–17–0, అవేశ్ 4–0–29–1, సుందర్ 4–0–11–2. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) మసకద్జ (బి) బెన్నెట్ 0; గిల్ (బి) రజా 31; రుతురాజ్ (సి) కయా (బి) ముజరబాని 7; పరాగ్ (సి) (సబ్) మవుతా (బి) చటారా 2; రింకూ సింగ్ (సి) బెన్నెట్ (బి) చటారా 0; జురేల్ (సి) మదెవెరె (బి) జాంగ్వే 6; సుందర్ (సి) ముజరబాని (బి) చటారా 27; బిష్ణోయ్ (ఎల్బీ) (బి) రజా 9; అవేశ్ (సి) రజా (బి) మసకద్జా 16; ముకేశ్ (బి) రజా 0; ఖలీల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 102. వికెట్ల పతనం: 1–0, 2–15, 3–22, 4–22, 5–43, 6–47, 7–61, 8–84, 9–86, 10–102. బౌలింగ్: బెన్నెట్ 1–1–0–1, మసకద్జ 3–0–15–1, చటారా 3.5–1–16–3, ముజరబాని 4–0–17–1, జాంగ్వే 4–0–28–1, రజా 4–0–25–3. -
Ind vs Zim: గిల్ కెప్టెన్సీలో కుర్రాళ్లతో కొత్తగా...
టి20 ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచింది...ఇంకా దేశంలో సంబరాలు, వేడుకలు కొనసాగుతూనే ఉన్నాయి. మరో వైపు టీమిండియా మరో టి20 పోరుకు రంగం సిద్ధమైంది. అయితే ఇప్పటి వరకు జరిగిన ఆటతో పోలిస్తే ఇది కాస్త భిన్నమైంది. రోహిత్, కోహ్లి, జడేజాల రిటైర్మెంట్ తర్వాత జట్టు కాస్త కొత్తగా కనపడబోతోంది.తమ అవకాశాల కోసం ఎదురు చూస్తూ వచ్చిన యువ ఆటగాళ్ల సత్తాను ప్రదర్శించేందుకు ఇది సరైన వేదిక కానుంది. వరల్డ్ కప్ టీమ్‌లో అవకాశం దక్కించుకోలేకపోయిన గిల్ నాయకత్వ సామర్థ్యానికి కూడా ఈ సిరీస్ పరీక్ష కానుండగా... సొంతగడ్డపై జింబాబ్వేవిజయాన్ని అందుకోవాలని ఆశిస్తోంది. హరారే: పేరుకే ఇది భారత్‌కు చెందిన ద్వితీయ శ్రేణి జట్టు కావచ్చు. కానీ అగ్రశ్రేణి ఆటగాళ్లందరితో కలిసి ఆడిన, ఎదుర్కొన్న అపార ఐపీఎల్ అనుభవంతో యువ ఆటగాళ్లంతా కూడా అన్ని రకాలుగా సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు జరిగే తొలి టి20 మ్యాచ్‌లో జింబాబ్వేతో భారత్ తలపడుతుంది. వరల్డ్ కప్ విజయోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు స్వదేశానికి వచ్చిన సామ్సన్, యశస్వి, దూబే తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. మూడో టి20 సమయానికి వీరు జట్టుతో చేరతారు. 2026 టి20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని భారత సెలక్టర్లు సిద్ధం చేయదలిచే బృందంలో కొందరి ప్రదర్శనపై ఇక్కడినుంచే ఒక అంచనాకు రావచ్చు. గిల్ కెప్టెన్సీలో... ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు నాయకత్వం వహించి సరైన ఫలితాలు రాబట్టలేకపోయిన శుబ్‌మన్ గిల్ తొలి సారి జాతీయ జట్టుకు కెప్టెన్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఓపెనర్‌గా అతనితో పాటు అతని బాల్య మిత్రుడు, అండర్–19 వరల్డ్ కప్ సహచరుడు అభిషేక్ శర్మ ఆడటం ఖాయమైంది. అభిషేక్ కు ఇది తొలి అంతర్జాతీయ మ్యాచ్ కానుంది.ఇటీవల ఐపీఎల్లో భీకర ఫామ్‌తో అదరగొట్టిన అభిõÙక్ ఇక్కడ ఎలా ఆడతాడన్నది ఆసక్తికరం. మూడో స్థానంలో రుతురాజ్ ఖాయం కాగా, రియాన్ పరాగ్ కూడా అరంగేట్రం చేసే అవకాశం ఉంది. వరల్డ్ కప్‌లో రిజర్వ్‌గా ఉండి ఆడే అవకాశం రాని రింకూ సింగ్‌పై కూడా అందరి దృష్టీ నిలిచింది. తన దూకుడును ప్రదర్శించేందుకు రింకూకు ఇంతకంటే మంచి అవకాశం రాదు. బౌలింగ్‌లో కూడా ఐపీఎల్లో ఆకట్టుకున్న ఖలీల్, అవేశ్, బిష్ణోయ్‌లపై జట్టు ఆధారపడుతోంది. ప్రతిభ ఉన్నా...వరుస గాయాలతో పదే పదే సీనియర్ జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తన పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. కీపర్‌గా తొలి ప్రాధాన్యత జురేల్‌కు దక్కవచ్చు. ఈ మ్యాచ్‌లో భారత్‌నుంచి ఎంత మంది అరంగేట్రం చేస్తారనేది ఆసక్తికరం. రజాపైనే భారం... జింబాబ్వే కూడా కొత్త కుర్రాళ్లపైనే దృష్టి పెట్టింది. అందుకే సీనియర్లలో ర్యాన్ బర్ల్పై వేటు వేసిన జట్టు సీన్ విలియమ్స్, క్రెయిగ్ ఇర్విన్లను ఈ సిరీస్ కోసం ఎంపిక చేయకుండా విశ్రాంతినిచ్చి0ది. డ్రగ్స్ వాడిన ఆరోపణలతో నాలుగు నెలలు సస్పెన్షన్‌కు గురైన మదవెర్, మవుతా తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే కెప్టెన్ సికందర్ రజాపైనే జింబాబ్వే ప్రధానంగా ఆధారపడుతోంది. ఇటీవల వైటాలిటీ బ్లాస్ట్‌లో చెలరేగిన అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. మసకద్జ, ముజరబానిలనుంచి అతనికి సహకారం అందాల్సి ఉంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్ ), అభిషేక్, రుతురాజ్, పరాగ్, రింకూ, జురేల్, సుందర్, బిష్ణోయ్, అవేశ్, తుషార్, ఖలీల్ జింబాబ్వే: రజా (కెప్టెన్ ), బెనెట్, మరుమని, క్యాంప్‌బెల్, నక్వి, మదాందే, మదవెర్, జాంగ్వే, ఫరాజ్, మసకద్జ, ముజరబాని పిచ్, వాతావరణం నెమ్మదైన పిచ్. భారీ స్కోర్లకు అవకాశం లేదు. గత 12 మ్యాచ్‌లలో 5 సార్లు మాత్రమే స్కోరు 150 పరుగులు దాటింది. పొడి వాతావరణం. వర్ష సూచన లేదు. 8 భారత్, జింబాబ్వే మధ్య 8 టి20లు జరిగాయి. 6 భారత్ గెలవగా, 2 జింబాబ్వే గెలిచింది. -
క్లీన్‌స్వీప్ లక్ష్యంగా...
చెన్నై: ఇప్పటికే వన్డే సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసి... ఏకైక టెస్టులో ఘనవిజయం సాధించి... జోరు మీదున్న భారత మహిళల క్రికెట్ జట్టు టి20 సిరీస్‌నూ దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉంది. దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య నేడు తొలి మ్యాచ్ జరుగుతుంది. బలాబలాలను పరిశీలిస్తే దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లోనూ భారత్‌దే పైచేయి ఉండటం ఖాయమనిపిస్తోంది. వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీతో అదరగొట్టిన స్మృతి మంధాన... ఏకైక టెస్టులో డబుల్ సెంచరీతో మెరిసిన షఫాలీ వర్మ అదే జోరును టి20 సిరీస్‌లోనూ కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదు. బౌలింగ్ విభాగంలో పేసర్లు రేణుక సింగ్, అరుంధతి రెడ్డి... స్పిన్నర్లు ఆశా శోభన, శ్రేయాంక పాటిల్ కీలకం కానున్నారు. దక్షిణాఫ్రికా అవకాశాలన్నీ కెపె్టన్ లౌరా వొల్వార్ట్, మరిజన్ కాప్, సునె లుస్ ఆటతీరుపై ఆధారపడి ఉన్నాయి. -
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
బంగ్లాదేశ్‌తో ఆదివారం సిల్హెట్లో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 44 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 145 పరుగులు చేసింది. యస్తిక భాటియా (36; 6 ఫోర్లు), కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30; 4 ఫోర్లు), షఫాలీ వర్మ (31; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 101 పరుగులకే పరిమితమైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుక సింగ్ (3/18), పూజ వస్త్రకర్ (2/25) బంగ్లాదేశ్‌ను కట్టడి చేశారు. రెండో టి20 మంగళవారం జరుగుతుంది. -
నేడు పాక్, కివీస్ తొలి టి20
రావల్పిండి: టి20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా న్యూజిలాండ్ జట్టు తో పాకిస్తాన్ ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్ లో పోటీపడేందుకు సిద్ధమైంది. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో బ్రేస్‌వెల్ నాయకత్వంలోని న్యూజిలాండ్ జట్టుతో బాబర్ ఆజమ్ సారంథ్యంలోని పాకిస్తాన్ జట్టు తలపడు తుంది. తొలి మూడు మ్యాచ్‌లు రావల్పిండిలో, చివరి రెండు మ్యాచ్‌లు లాహోర్‌లో జరుగుతాయి. రాత్రి గం. 7:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌లను ఫ్యాన్‌కోడ్ యాప్‌లో తిలకించవచ్చు. -
చెత్త ప్రదర్శనతో విసుగు తెప్పించిన శ్రీలంక బౌలర్.. ఏకంగా 36 బంతులు
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న (మార్చి 5) జరిగిన మొదటి మ్యాచ్‌లో శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరణ చెత్త బౌలింగ్ ప్రదర్శనతో విసుగు తెప్పించాడు. టీ20 మ్యాచ్‌లో ఓ బౌలర్ 24 బంతులు వేయాల్సి ఉండగా.. పతిరణ ఏకంగా 36 బంతులు వేసి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. పతిరణ తన నాలుగు ఓవర్ల కోటాలో తొమ్మిది వైడ్లు, మూడు నో బాల్స్ వేసి 56 పరుగులు సమర్పించుకున్నాడు. తన తొలి ఓవర్లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీసిన పతిరణ.. తన స్పెల్ రెండో ఓవర్లో 2 నో బాల్‌లు, 3 వైడ్లు.. మూడో ఓవర్లో 6 వైడ్లు.. నాలుగో ఓవర్లో నో బాల్ సహా మూడు బౌండరీలు సమర్పించుకుని చెత్త గణాంకాలు నమోదు చేశాడు. పతిరణ.. ఈ చెత్త ప్రదర్శనను తన జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఎలాగోలా విజయం సాధించి కాబట్టి సరిపోయింది. లేకపోతే లంక అభిమానులు పతిరణను ఆట ఆడుకునే వారు. ఓ అంతర్జాతీయ స్థాయి బౌలర్ ఒక్క మ్యాచ్‌లో ఇన్ని బంతులు వేస్తాడా అని ఏకి పారేసేవారు. కాగా, 207 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ శ్రీలంకకు ముచ్చెమటలు పట్టించింది. ఆతిథ్య జట్టు లక్ష్యానికి కేవలం నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులకే పరిమితమైంది. లంక ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్ (59), సమరవిక్రమ (61 నాటౌట్) మెరుపు అర్దశతకాలతో విరుచుకుపడగా.. ఆఖర్లో అసలంక (44 నాటౌట్) బంగ్లా బౌలర్లను ఉతికి ఆరేశాడు. భారీ లక్ష్య ఛేదనలో తొలుత తడబడ్డ బంగ్లాదేశ్.. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మహమదుల్లా (54), జాకిర్ అలీ (68) సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడటంతో లక్ష్యం దిశగా పయనించింది. వీరికి పతిరణ చెత్త బౌలింగ్ కూడా తోడవ్వడంతో బంగ్లాదేశ్ సునాయాసంగా గెలుస్తుందని అనిపించింది. అయితే షనక ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసి బంగ్లా గెలుపును అడ్డుకున్నాడు. -
ఆసీస్‌ను గెలిపించిన టిమ్ డేవిడ్
వెల్లింగ్టన్: ఆఖరి బంతిదాకా ఉత్కంఠ రేపిన తొలి టి20 మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు ఆ్రస్టేలియాను గెలిపించాయి. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ పోరులో ఆ్రస్టేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా కివీస్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీస్కోరు చేసింది. రచిన్ రవీంద్ర (35 బంతుల్లో 68; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు), కాన్వే (46 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ఆసీస్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (15 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ వార్నర్ (20 బంతుల్లో 32; 1 ఫోర్, 3 సిక్స్‌లు) తక్కువే చేసినా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ మార్ష్ (44 బంతుల్లో 72 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) కెపె్టన్ ఇన్నింగ్స్ ఆడాడు. 17వ ఓవర్ ఆఖరి బంతికి హిట్టర్ టిమ్ డేవిడ్ క్రీజులోకి వచ్చాడు. అప్పుడు ఆసీస్ గెలిచేందుకు 19 బంతుల్లో 44 పరుగులు కావాలి. కాసేపటికే అది కాస్తా 9 బంతుల్లో 32 పరుగుల సమీకరణం కష్టంగా మారింది. ఈ దశలో మిల్నే వేసిన 19వ ఓవర్ ఆఖరి మూడు బంతుల్ని డేవిడ్ 4, 6, 6లుగా బాదేశాడు. దాంతో చివరి ఓవర్లో ఆసీస్ విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేసిన సౌతీ వైడ్ సహా 3 బంతుల్లో 4 పరుగులే ఇచ్చాడు. ఇక మిగిలిన 3 బంతుల్లో 12 పరుగులు కావాల్సి ఉండగా... డేవిడ్ 6, 2, 4లతో ఆసీస్ జట్టును గెలిపించాడు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆ్రస్టేలియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టి20 మ్యాచ్ శుక్రవారం ఆక్లాండ్‌లో జరుగుతుంది. -
శివాలెత్తిన మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్.. భారీ స్కోర్‌ను ఊదేసిన ఆస్ట్రేలియా
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన తొలి టీ20లో పర్యాటక ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరింతగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ చివరి బంతికి గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేయగా.. మిచెల్ మార్ష్ (44 బంతుల్లో 72 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. టిమ్ డేవిడ్ చివరి బంతికి బౌండరీ బాది ఆసీస్‌ను గెలిపించాడు. కాన్వే, రచిన్ మెరుపు అర్దశతకాలు.. ఓపెనర్ డెవాన్ కాన్వే (46 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), వన్ డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (35 బంతుల్లో 68; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఫిన్ అలెన్ (17 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (19 నాటౌట్), మార్క్ చాప్మన్ (18 నాటౌట్) వేగంగా పరుగులు సాధించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. శివాలెత్తిన మార్ష్, డేవిడ్.. 216 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. మార్ష్, టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్‌లతో విధ్వంసం సృష్టించడంతో చివరి బంతికి (4 వికెట్ల నష్టానికి) విజయం సాధించింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మిగతా ఆటగాళ్లు కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ట్రవిస్ హెడ్ 24, డేవిడ్ వార్నర్ 32, మ్యాక్స్‌వెల్ 25, ఇంగ్లిస్ 20 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్ 2, ఆడమ్ మిల్నే, ఫెర్గూసన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లోని రెండో మ్యాచ్ ఆక్లాండ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది. బౌండరీ కొట్టి గెలిపించిన డేవిడ్.. చివరి మూడు బంతుల్లో (సౌథీ బౌలింగ్‌లో) 12 పరుగులు అవసరం కాగా.. టిమ్ డేవిడ్ వరసగా 6, 2, 4 పరుగులు స్కోర్ చేసి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ ఓవర్లో మార్ష్, డేవిడ్ కలిపి 16 పరుగులు సాధించారు. అంతకుముందు ఓవర్లో (19) కూడా టిమ్ డేవిడ్ వీర బాదుడు బాదాడు. మిల్నే వేసిన ఈ ఓవర్లో డేవిడ్ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఈ ఓవర్లో మొత్తం 19 పరుగులు వచ్చాయి. -
వందో మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన వార్నర్.. తొలి టీ20 ఆసీస్‌దే
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా హోబర్ట్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో విండీస్ చివరివరకు అద్భుతంగా పోరాడింది. వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ చూస్తే ఎంతటి భారీ స్కోర్లనైనా ఛేదిస్తుందని అనిపించింది. జట్టులో దాదాపుగా అందరూ బ్యాట్‌తో మెరుపులు మెరిపించగల సమర్ధులే. ఇంతటి విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ ఉన్నా విండీస్ ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. కెరీర్లో వందో మ్యాచ్ ఆడుతున్న డేవిడ్ వార్నర్ (70) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. జోష్ ఇంగ్లిస్ (39), టిమ్ డేవిడ్ (37 నాటౌట్), వేడ్ (21) వేగంగా పరుగులు సాధించగా.. మిచెల్ మార్ష్ (16), మ్యాక్స్‌వెల్ (10), స్టోయినిస్ (9), అబాట్ (0) నిరాశపరిచారు. విండీస్ బౌలరల్లో రసెల్ 3 వికెట్లు, అల్జరీ జోసఫ్ 2, హోల్డర్, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్.. నిర్ణీత ఓవర్లలో 202 పరుగులకు పరిమితమై (8 వికెట్లు కోల్పోయి) 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. విండీస్ ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (53), జాన్సన్ చార్లెస్ (42) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి తొలి వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసినప్పటికీ.. ఆతర్వాత వచ్చివారు తుస్సుమనిపించడంతో విండీస్ చేతులెత్తేసింది. ఆఖర్లో జేసన్ హోల్డర్ (34 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడి విండీస్ శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. పూరన్ (18), పావెల్ (14), హోప్ (16), రసెల్ (1), రూథర్‌ఫోర్డ్ (7), షెపర్డ్ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో జంపా 3, స్టోయినిస్ 2, బెహ్రెన్‌డార్ఫ్, మ్యాక్స్‌వెల్, అబాట్ తలో వికెట్ పడగొట్టారు. రెండో టీ20 ఫిబ్రవరి 11న అడిలైడ్‌లో జరుగనుంది. -
విధ్వంసం సృష్టించిన డేవిడ్ వార్నర్
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా హోబర్ట్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వెటరన్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కెరీర్లో 100వ టీ20 ఆడుతున్న వార్నర్.. కేవలం 22 బంతుల్లోనే 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో మెరుపు హాఫ్ సెంచరీ బాది ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. వార్నర్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో ఆసీస్ 9.1 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన జోష్ ఇంగ్లిస్ 39 పరుగులు (5 ఫోర్లు, సిక్స్) చేసి ఔట్ కాగా.. వార్నర్ (57), మిచెల్ మార్ష్ (11) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లిస్ వికెట్ జేసన్ హోల్డర్‌కు దక్కింది. 10 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా స్కోర్ 110/1గా ఉంది. కాగా, ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ కోవిడ్‌తో బాధపడుతున్నప్పటికీ ఈ మ్యాచ్ ఆడుతున్నాడు. కోవిడ్ నిర్ధారణ కావడంతో మార్ష్‌కు బదులు వార్నర్ టాస్కు వచ్చాడు. Mitchell Marsh is leading Australia but as he is COVID positive, David Warner came for the toss. pic.twitter.com/MBBgZ1z6RE — Johns. (@CricCrazyJohns) February 9, 2024 ఇదిలా ఉంటే, 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌ల కోసం వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. టెస్ట్ సిరీస్ 1-1తో సమం కాగా.. వన్డే సిరీస్‌ను ఆసీస్ క్లీన్‌స్వీప్ (3-0) చేసింది. రెండు, మూడు టీ20లు ఫిబ్రవరి 11, 13 తేదీల్లో అడిలైడ్, పెర్త్ వేదికలుగా జరుగనున్నాయి -
NZ Vs PAK 1st T20: షాహీన్ అఫ్రిదికి చుక్కలు చూపించిన కివీస్ ఓపెనర్
పాకిస్తాన్ స్టార్ పేసర్, ఆ జట్టు కొత్త కెప్టెన్ షాహీన్ అఫ్రిదికి న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ చుక్కలు చూపించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్ వేదికగా ఇవాళ (జనవరి 12) జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అలెన్ ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్ తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన అలెన్.. ఆతర్వాత హ్యాట్రిక్ బౌండరీలు, ఆ వెంటనే సిక్సర్ బాదాడు. ఆఖరి బంతి డాట్ బాల్ అయ్యింది. ఆమిర్ జమాల్ వేసిన ఆ మరుసటి ఓవర్లో రెండో బంతిని సైతం సిక్సర్‌గా మలిచిన అలెన్.. ఈ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టిస్తాడని అంతా అనుకున్నారు. అయితే ఆ తర్వాతి ఓవర్లో మరో అఫ్రిది (అబ్బాస్ అఫ్రిది) అలెన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) జోరుకు అడ్డుకట్ట వేసి అతన్ని పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న కివీస్.. 11.2 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. అలెన్, డెవాన్ కాన్వే (0) ఔట్ కాగా.. కేన్ విలియమ్సన్ (57), డారిల్ మిచెల్ (31) క్రీజ్‌లో ఉన్నారు. అబ్బాస్ అఫ్రిది బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాది విలియమ్సన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అబ్బాస్ అఫ్రిది, షాహీన్ అఫ్రిదిలకు తలో వికెట్ దక్కింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 417 రోజుల తర్వాత అంతర్జాతీయ టీ20ల బరిలోకి దిగి హాఫ్ సెంచరీ సాధించడం విశేషం. -
పాకిస్తాన్‌తో తొలి టీ20కి ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (జనవరి 12) జరిగే తొలి టీ20కి ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు మిచెల్ సాంట్నర్ కోవిడ్ కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇటీవలి కాలంలో మంచి ఫామ్‌లో ఉన్న సాంట్నర్ జట్టులో లేకపోవడం కివీస్‌కు పెద్ద లోటు. సాంట్నర్‌ను సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించినట్లు క్రికెట్ న్యూజిలాండ్ పేర్కొంది. కాగా, ప్రస్తుతం న్యూజిలాండ్‌లో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి దేశంలో ఎలాంటి అంక్షలు లేనప్పటికీ.. ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది. 🚨NEWS ALERT🚨: Mitchell Santner has been ruled out of the first T20I against Pakistan after testing positive for Covid. pic.twitter.com/lCFttMZzpQ — CricTracker (@Cricketracker) January 12, 2024 ఇదిలా ఉంటే, ఆక్లాండ్ వేదికగా ఇవాళ న్యూజిలాండ్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఉదయం 11: 30 గంటలకు ప్రారంభమవుతుంది. పాకిస్తాన్ ఫుల్‌టైమ్ టీ20 జట్టు కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిదికి ఇది తొలి మ్యాచ్ కాగా.. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ చాలాకాలం తర్వాత టీ20 జట్టు పగ్గాలు చేపట్టాడు. న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టిమ్ సీఫెర్ట్ (వికెట్‌కీపర్), డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్, ఐష్ సోధి, టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, బెన్ సియర్స్ పాకిస్తాన్: మొహ్మమద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), షాహీన్ అఫ్రిది (కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, ఇఫ్తికార్ అహ్మద్, ఆజం ఖాన్, అమీర్ జమాల్, మహ్మద్ నవాజ్, హరీస్ రౌఫ్, జమాన్ ఖాన్, ఉసామా మీర్, మహ్మద్ వసీం జూనియర్, అబ్రర్ అహ్మద్, సాహిబ్జాదా ఫర్హాన్, అబ్బాస్ అఫ్రిది, హసీబుల్లా ఖాన్ -
పొట్టి ఫార్మాట్లో రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 విజయాల్లో భాగమైన తొలి పురుష క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గురువారం ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించడం ద్వారా హిట్‌మ్యాన్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. రోహిత్ ఈ ఘనతను కేవలం 149 మ్యాచ్‌ల్లోనే అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ ఖాతా తెరవకుండానే ఔటైనా అతని ఖాతాలో ప్రపంచ రికార్డు చేరడం విశేషం. Players to be part of most wins in T20I history: 1) Rohit Sharma - 100* 2) Shoaib Malik - 86 Hitman created history in Mohali. pic.twitter.com/x7UkiRwMUv — Johns. (@CricCrazyJohns) January 11, 2024 ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాల్లో భాగమైన రికార్డు ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డ్యానీ వ్యాట్ (111) పేరిట ఉండగా.. పురుషుల క్రికెట్లో రోహిత్ తర్వాత ఈ రికార్డు పాక్ ఆటగాడు షోయబ్ మాలిక్ (124 మ్యాచ్‌ల్లో 86 విజయాలు) పేరిట ఉంది. రోహిత్ తర్వాత భారత్ తరఫున అత్యధిక టీ20 విజయాల్లో భాగమైన ఘనత విరాట్ కోహ్లి (115 మ్యాచ్‌ల్లో 73 విజయాలు) సొంతం చేసుకున్నాడు. ఆఫ్ఘన్‌తో తొలి టీ20లో విజయం సాధించడం ద్వారా హిట్‌మ్యాన్ కెప్టెన్‌గానూ అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు. హిట్‌మ్యాన్ సారథ్యంలో టీమిండియా కేవలం 52 మ్యాచ్‌ల్లోనే 40 విజయాలు సాధించింది. Rohit Sharma has 40 wins from just 52 games in T20I as a captain 🇮🇳 - One of the most successful captains in T20I history. pic.twitter.com/Tpas68JN4M — Johns. (@CricCrazyJohns) January 12, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. శివమ్ దూబే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (1/9, 60 నాటౌట్) చెలరేగడంతో భారత్ 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. మొహమ్మద్ నబీ (42) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించగా.. గుర్బాజ్ (23), కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (25), అజ్మతుల్లా (29), నజీబుల్లా (19 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. శివమ్ దూబే ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం ఛేదనలో భారత్ ఖాతా తెరవకుండానే రోహిత్ (0) వికెట్ కోల్పోయినా కుర్రాళ్లు జట్టును గెలిపించారు. శుభ్‌మన్ గిల్ (23), తిలక్ వర్మ (26), శివమ్ దూబే (60 నాటౌట్), జితేశ్ శర్మ (31 ), రింకూ సింగ్ (16 నాటౌట్) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్ 2, ఒమర్జాయ్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టీ20 ఇండోర్ వేదికగా జనవరి 14న జరుగనుంది. -
IND Vs AFG, 1st T20I: కుర్రాళ్లు గెలిపించారు
విరాట్ కోహ్లి ఆడలేదు... రోహిత్ శర్మ విఫలమయ్యాడు... అయినా సరే యువ ఆటగాళ్ల ప్రదర్శనతో భారత్ విజయాన్ని అందుకుంది. అఫ్గానిస్తాన్‌తో పోరులో అక్కడక్కడా కాస్త శ్రమించినా... చివరకు గెలుపు టీమిండియాదే అయింది. ముందుగా అక్షర్ పటేల్ కట్టుదిట్టమైన బౌలింగ్, ఆపై బ్యాటింగ్‌లో శివమ్ దూబే మెరుపులు జట్టును సిరీస్‌లో ఆధిక్యంలో నిలిపాయి. అఫ్గాన్ ఆటగాళ్లు కొంత పోరాడినా... మంచు ప్రభావంతో పాటు ఒత్తిడిలో ఆ జట్టు చిత్తయింది. మొహాలి: అఫ్గానిస్తాన్‌తో టి20 సిరీస్‌లో భారత్ 1–0తో ముందంజ వేసింది. గురువారం జరిగిన తొలి పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో అఫ్గాన్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. నబీ (27 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శివమ్ దూబే (40 బంతుల్లో 60 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీ సాధించగా, జితేశ్ శర్మ (20 బంతుల్లో 31; 5 ఫోర్లు) రాణించాడు. నబీ మెరుపులు... అఫ్గాన్‌కు ఓపెనర్లు ఇబ్రహీమ్ జద్రాన్ (22 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్), గుర్బాజ్ (28 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుగైన ఆరంభం అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 48 బంతుల్లో 50 పరుగులు జోడించారు. 1 పరుగు వద్ద ఇబ్రహీమ్ ఇచ్చిన క్యాచ్‌ను దూబే వదిలేయడం కూడా జట్టుకు కలిసొచ్చింది. అయితే ఒకే స్కోరు వద్ద వీరిద్దరిని అవుట్ చేసి భారత్ పైచేయి సాధించింది. తొలి అంతర్జాతీయ టి20 ఆడుతున్న రహ్మత్ షా (3) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో నబీ, అజ్మతుల్లా (22 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) భాగస్వామ్యంతో అఫ్గాన్ కోలుకుంది. ముఖ్యంగా నబీ దూకుడు ప్రదర్శించడంతో స్కోరు వేగంగా దూసుకుపోయింది. రవి బిష్ణోయ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 16 పరుగులు రాగా... ముకేశ్ వేసిన తర్వాతి ఓవర్లో నబీ 2 సిక్స్‌లు బాదాడు. నబీ, అజ్మతుల్లా నాలుగో వికెట్‌కు 43 బంతుల్లో 68 పరుగులు జత చేయగా... ముకేశ్ ఒకే ఓవర్లో వీరిని పెవిలియన్ పంపించాడు. చివరి 2 ఓవర్లలో అఫ్గాన్ 6 ఫోర్లతో 28 పరుగులు రాబట్టింది. రోహిత్ డకౌట్... ఛేదనలో రెండో బంతికే భారత్‌కు అనూహ్య షాక్ తగిలింది. శుబ్‌మన్ గిల్ (12 బంతుల్లో 23; 5 ఫోర్లు)తో సమన్వయ లోపంతో కెపె్టన్ రోహిత్ శర్మ (0) రనౌట్‌గా వెనుదిరిగాడు. మిడాఫ్ దిశగా ఆడిన రోహిత్ సింగిల్ కోసం దూసుకుపోగా, గిల్ ఏమాత్రం స్పందించకుండా తన క్రీజ్‌లోనే ఉండిపోయాడు. దాంతో డకౌట్ అయిన రోహిత్ తన సహచరుడిపై తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ వెనుదిరిగాడు. ఆ తర్వాత కొన్ని చక్కటి బౌండరీలు కొట్టిన గిల్ అదే జోరులో ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. భారీ షాట్లు ఆడటంలో తడబడిన తిలక్ వర్మ (22 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఈ దశలో దూబే, జితేశ్ భాగస్వామ్యం జట్టును గెలుపు దిశగా నడిపించింది. అఫ్గాన్ పేలవ ఫీల్డింగ్ కూడా భారత్‌కు సానుకూలంగా మారింది. జితేశ్ వెనుదిరిగినా... రింకూ సింగ్ (9 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) సహకారంతో దూబే మరో 15 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (స్టంప్డ్) జితేశ్ (బి) అక్షర్ 23; ఇబ్రహీమ్ (సి) రోహిత్ (బి) దూబే 25; అజ్మతుల్లా (బి) ముకేశ్ 29; రహ్మత్ (బి) అక్షర్ 3; నబీ (సి) రింకూ (బి) ముకేశ్ 42; నజీబుల్లా (నాటౌట్) 19; కరీమ్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–50, 2–50, 3–57, 4–125, 5–130. బౌలింగ్: అర్ష్‌దీప్ 4–1–28–0, ముకేశ్ 4–0–33–2, అక్షర్ 4–0–23–2, సుందర్ 3–0–27–0, దూబే 2–0–9–1, బిష్ణోయ్ 3–0–35–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (రనౌట్) 0; శుబ్‌మన్ గిల్ (స్టంప్డ్) గుర్బాజ్ (బి) ముజీబ్ 23; తిలక్ (సి) గుల్బదిన్ (బి) అజ్మతుల్లా 26; శివమ్ దూబే (నాటౌట్) 60; జితేశ్ శర్మ (సి) ఇబ్రహీమ్ (బి) ముజీబ్ 31; రింకూ సింగ్ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (17.3 ఓవర్లలో 4 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–0, 2–28, 3–72, 4–117. బౌలింగ్: ఫారుఖీ 3–0–26–0, ముజీబ్ 4–1–21–2, మొహమ్మద్ నబీ 2–0–24–0, నవీన్ 3.3–0–43–0, అజ్మతుల్లా 4–0–33–1, గుల్బదిన్ 1–0–12–0. -
పంత్ ఒక్క కాలితో ఫిట్‌గా ఉన్నా టీ20 వరల్డ్‌కప్ ఆడాలి..!
టీమిండియా చిచ్చరపిడుగు రిషబ్ పంత్‌పై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ ఒక్క కాలితో ఫిట్‌గా ఉన్నా త్వరలో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో ఆడాలని అన్నాడు. ఫార్మాట్ ఏదైనా పంత్ గేమ్ ఛేంజర్ అని, అందుకే అతను ఒక్క కాలితో ఫిట్‌గా ఉన్నా జట్టులోకి రావాలని కోరుకుంటున్నానని తెలిపాడు. నేను సెలెక్టర్‌ను అయితే ఈ పనిని తప్పక చేస్తానని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. దీని ముందు గవాస్కర్ కేఎల్ రాహుల్‌ను ఉద్దేశిస్తూ కూడా పలు కామెంట్స్ చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో కేఎల్ రాహుల్ కూడా వికెట్‌కీపింగ్ కమ్ బ్యాటింగ్‌కు బెస్ట్ ఛాయిసే. అయినా నా ఓటు మాత్రం పంత్‌కే అని అన్నాడు. పంత్ అందుబాటులో ఉన్నంత కాలం అతనే తన ఫస్ట్ ఛాయిస్ అని తెలిపాడు. ఒకవేళ పంత్ అందుబాటులో లేకపోతే మాత్రం తన ఓటు కేఎల్ రాహుల్‌కు ఉంటుందని చెప్పిన గవాస్కర్.. రాహుల్ వల్ల టీమిండియా సమతూకంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. రాహుల్ వికెట్‌కీపింగ్ చేస్తూ మిడిలార్డర్లో అయినా ఓపెనర్‌గా అయినా సింక్ అవుతాడని తెలిపాడు. స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో జరిగిన గేమ్ ప్లాన్ అనే షోలో గవాస్కర్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, 2022 చివర్లో జరిగిన కార్ యాక్సిడెంట్లో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడిని విషయం తెలిసిందే. అప్పటి నుంచి టీమిండియా సిరీస్‌కు ఒకరు చొప్పున పార్ట్‌టైమ్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్లతో నెట్టుకొస్తుంది. ఇటీవలి కాలంలో కేఎల్ రాహుల్ ఈ పాత్రలో పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యాడు. వన్డే వరల్డ్‌కప్‌లో అతను పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడటంతో పాటు అద్భుతంగా వికెట్‌కీపింగ్ చేశాడు. పంత్ తిరిగి జట్టులోకి వస్తే రాహుల్ కేవలం బ్యాటింగ్ వరకు మాత్రమే పరిమితం కావచ్చు. ఏడాదికి పైగా జట్టుకు దూరంగా ఉంటున్న పంత్.. ఈ ఏడాది ఐపీఎల్ సమయానికంతా పూర్తి ఫిట్నెస్ సాధించి బరిలోకి దిగుతాడని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాల్టి నుంచి ప్రారంభంకాబోయే టీ20 సిరీస్ కోసం భారత సెలెక్టర్లు రాహుల్‌ను కానీ ఇషాన్ కిషన్‌ను కాని వికెట్కీపర్లుగా ఎంపిక చేయలేదు. ఈ జట్టులో వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్లుగా సంజూ శాంసన్, జితేశ్ శర్మ ఎంపిక చేయబడ్డారు. రాహుల్, ఇషాన్‌లకు రెస్ట్ ఇచ్చినట్లు సెలెక్టర్లు చెబుతున్నారు. మొహాలీ వేదికగా భారత్-ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఇవాళ రాత్రి 7 గంటలకు తొలి టీ20 ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల చేత కోహ్లి తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రకటించాడు. -
India Vs Afghanistan T20I: టీమిండియాతో తొలి టీ20.. ఆఫ్ఘనిస్తాన్‌కు భారీ షాక్
టీమిండియాతో టీ20 సిరీస్‌కు ముందు ఆఫ్ఘనిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆ జట్టు స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్ భారత్‌తో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ సిరీస్ కోసం రషీద్ జట్టుతో పాటు భారత్‌కు విచ్చేసినప్పటికీ.. గాయం పూర్తిగా తగ్గకపోవడంతో సెలెక్టర్లు అతన్ని తిరిగి ఇంటికి పంపించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇదే గాయం కారణంగా రషీద్ బిగ్‌బాష్ లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లకు కూడా దూరంగా ఉన్నాడు. రషీద్ భారత్‌తో టీ20 సిరీస్ మొత్తానికి దూరమైనట్లు ఆ జట్టు తాత్కాలిక కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ ప్రకటించాడు. కాగా, రషీద్ వన్డే వరల్డ్‌కప్ అనంతరం వెన్నెముక సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, భారత్-ఆఫ్ఘనిస్తాన్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇవాల్టి నుంచి ప్రారంభంకానుంది. మొహాలీ వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ అనంతరం జనవరి 14న రెండో టీ20 (ఇండోర్), జనవరి 17న (బెంగళూరు) మూడో టీ20 జరుగనున్నాయి. తొలి టీ20కి కోహ్లి దూరం.. చాలాకాలంగా టీ20ల్లో తన బ్యాటింగ్ చూడాలని వెయ్యి కళ్లతో ఎదురుచూసిన అభిమానులకు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఊహించని షాక్ ఇచ్చాడు. వ్యక్తిగత కారణాల చేత అతను ఆఫ్ఘనిస్తాన్‌తో తొలి టీ20కి దూరమయ్యాడు. కోహ్లి రెండో టీ20 నుంచి తిరిగి అందుబాటులోకి వస్తాడని భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రకటించాడు. -
భారత మహిళల విజయగర్జన
ముంబై: ఆ్రస్టేలియా మహిళలతో వన్డే సిరీస్‌ను 0–3తో చేజార్చుకున్న భారత జట్టు టి20 సిరీస్‌లో మెరుపు విజయంతో శుభారంభం చేసింది. ముందుగా చక్కటి బౌలింగ్‌తో ఆసీస్‌ను కట్టడి చేసిన మన జట్టు... ఆపై అలవోకగా లక్ష్యాన్ని ఛేదించి సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబర్చింది. శుక్రవారం డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన తొలి టి20లో భారత్ 9 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియాను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 19.2 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. 2020 టి20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత ఆసీస్ జట్టు మళ్లీ ఆలౌట్ కావడం ఇదే తొలిసారి. ఫోబీ లిచ్‌ఫీల్డ్ (32 బంతుల్లో 49 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఎలైస్ పెరీ (30 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. పవర్‌ప్లే ముగిసేసరికి 33/4 స్కోరుతో ఆసీస్ ఇబ్బందుల్లో పడిన స్థితిలో లిచ్‌ఫీల్డ్, పెరీ ఐదో వికెట్‌కు 52 బంతుల్లోనే 79 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. యువ పేస్ బౌలర్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టిటాస్ సాధు (4/17) పదునైన బంతులతో ప్రత్యర్థిని కుప్పకూల్చగా... శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 145 పరుగులు చేసి గెలిచింది. షఫాలీ వర్మ (44 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), స్మృతి మంధాన (52 బంతుల్లో 54; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 93 బంతుల్లోనే 137 పరుగులు జోడించడం విశేషం. తొలి ఓవర్లో ఎక్స్‌ట్రాల రూపంలోనే 14 పరుగులు రావడంతో మొదలైన ఛేదనలో చివరి వరకు భారత్‌కు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. ముఖ్యంగా గత రెండు వన్డేల్లో తుది జట్టులో స్థానం దక్కించుకోలేకపోయిన షఫాలీ ఇప్పుడు మళ్లీ అవకాశం రాగానే చెలరేగిపోయింది. విజయానికి ఐదు పరుగుల దూరంలో స్మృతి వెనుదిరిగినా... షఫాలీతో కలిసి జెమీమా (6 నాటౌట్) మ్యాచ్ ముగించింది. సిరీస్‌లో భారత్ 1–0తో ముందంజలో నిలవగా, రెండో మ్యాచ్ ఆదివారం ఇదే మైదానంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌తో స్మృతి అంతర్జాతీయ టి20ల్లో 3 వేల పరుగులు పూర్తి చేసుకొని హర్మన్‌ప్రీత్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచింది. -
పరాజయంతో ప్రారంభం
ముంబై: సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు పరాజయంతో ప్రారంభించింది. బుధవారం వాంఖెడె మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం 38 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. హీతెర్ నైట్ సారథ్యంలోని ఇంగ్లండ్ ఈ గెలుపుతో సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో మ్యాచ్ ఇదే వేదికపై శనివారం జరుగుతుంది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 197 పరుగుల భారీ స్కోరు సాధించింది. రేణుక సింగ్ తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో సోఫీ డంక్లీ, అలీస్ క్యాప్సీలను అవుట్ చేసింది. 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డ ఇంగ్లండ్‌ను డానియల్ వైట్ (47 బంతుల్లో 75; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నాట్ సివర్ బ్రంట్ (53 బంతుల్లో 77; 13 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. మూడో వికెట్‌కు 138 పరుగులు జోడించి ఇంగ్లండ్ భారీ స్కోరుకు బాటలు వేశారు. భారత బౌలర్లలో రేణుక సింగ్ 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లు ఆడి 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసి ఓడిపోయింది. షఫాలీ వర్మ (42 బంతుల్లో 52; 9 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (21 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎకిల్‌స్టోన్ (3/15) భారత్‌ను కట్టడి చేసింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సోఫియా డంక్లీ (బి) రేణుక సింగ్ 1; డానియల్ వైట్ (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) సైకా ఇషాక్ 75; అలీస్ క్యాప్సీ (బి) రేణుక సింగ్ 0; నాట్ సివర్ బ్రంట్ (సి) రిచా ఘోష్ (బి) రేణుక సింగ్ 77; హీతెర్ నైట్ (బి) శ్రేయాంక పాటిల్ 6; అమీ జోన్స్ (సి) జెమీమా (బి) శ్రేయాంక పాటిల్ 23; ఫ్రెయా కెంప్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 197. వికెట్ల పతనం: 1–2, 2–2, 3–140, 4–165, 5–177, 6–197. బౌలింగ్: రేణుక 4–0–27–3, పూజ 4–0–44–0, సైకా ఇషాక్ 4–0–38–1, దీప్తి శర్మ 3–0–28–0, శ్రేయాంక 4–0–44–2, కనిక అహుజా 1–0–12–0. భారత్ ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (సి) సారా గ్లెన్ (బి) సోఫీ ఎకిల్‌స్టోన్ 52; స్మృతి మంధాన (బి) నాట్ సివర్ బ్రంట్ 6; జెమీమా రోడ్రిగ్స్ (సి) అమీ జోన్స్ (బి) ఫ్రెయా కెంప్ 4; హర్మన్‌ప్రీత్ కౌర్ (బి) సోఫీ ఎకిల్‌స్టోన్ 26; రిచా ఘోష్ (సి) అలీస్ క్యాప్సీ (బి) సారా గ్లెన్ 21; కనిక అహుజా (సి) నాట్ సివర్ బ్రంట్ (బి) సోఫీ ఎకిల్‌స్టోన్ 15; పూజ వస్త్రకర్ (నాటౌట్) 11; దీప్తి శర్మ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–20, 2–41, 3–82, 4–122, 5–134, 6–151. బౌలింగ్: మహికా గౌర్ 2–0–18–0, లారెన్ బెల్ 4–0–35–0, నాట్ సివర్ బ్రంట్ 4–0–35–1, ఫ్రెయా కెంప్ 2–0–30–1, సోఫీ ఎకిల్‌స్టోన్ 4–0–15–3, సారా గ్లెన్ 4–0–25–1. -
టీ20ల్లో అత్యుత్తమ ఛేజింగ్.. రోహిత్‌ను దాటేసిన సూర్యకుమార్
ఆస్ట్రేలియాతో నిన్న (నవంబర్ 23) జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓ అత్యుత్తమ రికార్డు సాధించింది. నిన్నటి మ్యాచ్‌లో ఆసీస్‌పై విజయం సాధించిన భారత్.. పొట్టి ఫార్మాట్లో తమ అత్యుత్తమ రన్ ఛేజింగ్ రికార్డును మెరుగుపర్చుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్.. ఆసీస్ నిర్ధేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని ఆఖరి బంతికి ఛేదించింది. ఈ మ్యాచ్‌కు ముందు టీ20ల్లో భారత్ అత్యుత్తమ ఛేజింగ్ రికార్డు 208 పరుగులుగా ఉండింది. హైదరాబాద్ వేదికగా 2019లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 208 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. టీ20ల్లో భారత్ అన్ని దేశాల కంటే అధికంగా ఐదు సార్లు 200 ప్లస్ స్కోర్లను ఛేదించింది. భారత్ పొట్టి ఫార్మాట్లో 209, 208, 207, 204, 202 పరుగులకు విజయవంతంగా ఛేదించింది. భారత్ తర్వాత సౌతాఫ్రికా (4), పాకిస్తాన్ (3), ఆస్ట్రేలియా (3) అత్యధికంగా 200 ప్లస్ స్కోర్లను ఛేదించాయి. రోహిత్‌ను దాటేసిన సూర్యకుమార్.. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానానికి ఎగబాకాడు. ఆసీస్‌తో తొలి టీ20లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న స్కై.. తన 54 మ్యాచ్‌ల టీ20 కెరీర్లో 13 సార్లు ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (115 మ్యాచ్‌ల్లో 15) టాప్‌లో ఉండగా.. రోహిత్ శర్మ (148 మ్యాచ్‌ల్లో 12) మూడో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే, ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. జోష్ ఇంగ్లిస్ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టీవ్ స్మిత్ (52) అర్ధసెంచరీతో రాణించాడు. 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. సూర్యకుమార్ యాదవ్ (42 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), రింకూ సింగ్ (14 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విజృంభించడంతో ఆఖరి బంతికి విజయం సాధించింది. -
IND VS AUS 1st T20: సెంచరీ కొట్టిన సూర్యకుమార్ యాదవ్
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా విశాఖ వేదికగా ఆసీస్‌తో నిన్న (నవంబర్ 23) జరిగిన తొలి టీ20లో సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో 42 బంతులు ఎదుర్కొన్న సూర్య భాయ్ 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో కొట్టిన సిక్సర్లతో స్కై అంతర్జాతీయ టీ20ల్లో ఓ అరుదైన రికార్డు సాధించాడు. T20 format is so easy for Suryakumar Yadav. 🔥pic.twitter.com/8XcKGl6MO6 — Johns. (@CricCrazyJohns) November 23, 2023 బ్యాటింగ్ ఆర్డర్లో 3 అంతకంటే కింది స్థానాల్లో వచ్చి 100 సిక్సర్లు (47 ఇన్నింగ్స్‌ల్లో) బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ విభాగంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టాప్‌లో ఉన్నాడు. మోర్గాన్ 107 ఇన్నింగ్స్‌ల్లో 120 సిక్సర్లు బాదాడు. ఇతని తర్వాత ఈ విభాగంలో విరాట్ కోహ్లి (98 ఇన్నింగ్స్‌ల్లో 106 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (98 ఇన్నింగ్స్‌ల్లో 105) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా స్కై తన 51 ఇన్నింగ్స్‌ల టీ20 కెరీర్లో 108 సిక్సర్లు బాదాడు. ఇదిలా ఉంటే, ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. జోష్ ఇంగ్లిస్ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టీవ్ స్మిత్ (52) అర్ధసెంచరీతో రాణించాడు. 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), రింకూ సింగ్ (14 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విజృంభించడంతో ఆఖరి బంతికి విజయం సాధించింది. -
ఆఖరి బంతికి సిక్సర్ కొట్టిన రింకూ.. మ్యాచ్ గెలిచాం, కానీ..!
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా విశాఖ వేదికగా ఆసీస్‌తో నిన్న (నవంబర్ 23) జరిగిన తొలి టీ20లో టీమిండియా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో ఆసీస్ నిర్ధేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఆఖరి బంతికి ఛేదించింది. సీన్ అబాట్ బౌలింగ్‌లో రింకూ సింగ్ ఆఖరి బంతికి సిక్సర్ బాదాడు. అయితే రింకూ ఈ సిక్సర్ కొట్టినందుకు టీమిండియా గెలవలేదు. భారత్ గెలుపుకు ఆఖరి బంతికి సింగిల్ అవసరం కాగా.. అబాట్ నో బాల్ వేశాడు. అంపైర్లు రింకూ సిక్సర్‌ను పరిగణలోకి తీసుకోకుండా నో బాల్ ద్వారా లభించిన పరుగుతోనే టీమిండియా గెలిచినట్లు ప్రకటించారు. దీంతో రింకూ సింగ్ సిక్సర్ వృధా అయ్యింది. The Finisher Rinku Singh is here to rule for India. 💪🫡pic.twitter.com/p3TtZOm7iC — Johns. (@CricCrazyJohns) November 23, 2023 కాగా, ఛేదనలో అప్పటిదాకా సాఫీగా సాగిన టీమిండియా ప్రయాణం ఆఖరి ఓవర్లో కీలక మలుపులు తిరిగింది. చివరి ఓవర్లో భారత్ గెలుపుకు 7 పరుగులు మాత్రమే అవసరం కాగా.. రింకూ సింగ్ తొలి బంతికే బౌండరీ బాది భారత్‌ను గెలుపు వాకిటికి చేర్చాడు. అనంతరం రెండో బంతికి బైస్ రూపంలో మరో పరుగు వచ్చింది. దీంతో భారత్ గెలుపుకు మరింత చేరువగా వెళ్లింది. ఇక భారత్ గెలవాలంటే 4 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేయాలి. ఇక్కడే మ్యాచ్ మలుపులు తిరిగింది. మూడు (అక్షర్ క్యాచ్ ఔట్), నాలుగు (బిష్ణోయ్ రనౌట్), ఐదు బంతులకు (అర్షదీప్) భారత్ వికెట్లు కోల్పోయింది. ఐదో బంతికి అర్షదీప్ రెండో పరుగుకు వెళ్తూ రనౌటయ్యాడు. దీంతో భారత్ గెలవాలంటే ఆఖరి బంతికి ఒక్క పరుగు చేయాల్సి వచ్చింది. స్ట్రయిక్‌లో ఉన్న రింకూ సింగ్ అబాట్ వేసిన బంతిని సిక్సర్‌గా మలిచాడు. మ్యాచ్ చూస్తున్నవారంతా రింకూ సిక్సర్ కారణంగానే భారత్ గెలిచినందని అనున్నారు. కానీ, అబాట్ ఆఖరి బంతి క్రీజ్ దాటి బౌలింగ్ చేయడంతో భారత్ ఖాతాలోని పరుగు చేరి శ్రమ లేకుండానే టీమిండియాకు విజయం దక్కింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. జోష్ ఇంగ్లిస్ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టీవ్ స్మిత్ (52) అర్ధసెంచరీతో రాణించాడు. 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. సూర్యకుమార్ యాదవ్ (42 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), రింకూ సింగ్ (14 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విజృంభించడంతో ఆఖరి బంతికి విజయం సాధించింది. -
బాగానే ఆడాం.. గెలుస్తామని అనుకున్నాం.. కానీ అతను అలా..!: ఆసీస్ కెప్టెన్
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా విశాఖ వేదికగా టీమిండియాతో నిన్న (నవంబర్ 23) జరిగిన తొలి టీ20లో ఆసీస్ 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ భారీ స్కోర్ సాధించినప్పటికీ.. సూర్యకుమార్ యాదవ్ (42 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), రింకూ సింగ్ (14 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి భారత్‌ను గెలిపించారు. చివరి ఓవర్లో భారత్ 3 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయి ఓటమిపాలయ్యేలా కనిపించినప్పటికీ.. రింకూ సింగ్ చివరి బంతికి సిక్సర్ బాది టీమిండియాను గెలిపించాడు. అంతకుముందు జోష్ ఇంగ్లిస్ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టీవ్ స్మిత్ (52) అర్ధసెంచరీతో రాణించాడు. ఇంగ్లిస్ విధ్వంసం ధాటికి భారత బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. మ్యాచ్ అనంతరం ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఓవరాల్‌గా మంచి మ్యాచ్. ఇంగ్లిస్ మాకు మంచి స్కోర్ అందించాడు. డిఫెండ్ చేసుకోగలమని భావించాం. కానీ సూర్యకుమార్ మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు. మ్యాచ్ గెలిచేందుకు ఆఖరి ఓవర్లోనూ అవకాశం వచ్చింది. అయితే రింకూ సింగ్ సిక్సర్ బాది ఖేల్ ఖతం చేశాడు. యువ భారత ఆటగాళ్లకు ఐపీఎల్‌తో పాటు స్థానిక దేశవాలీ టీ20లు ఆడటం బాగా కలిసొచ్చింది. మా వరకు మేము బౌలింగ్ బాగానే చేశాం. అయితే యార్కర్లు సంధించడంలో విఫలమయ్యాం. ఈ గేమ్ నుండి చాలా పాజిటివ్‌లు తీసుకోవాలి. ఇంగ్లిస్ క్లాసీ బ్యాటింగ్. 19వ ఓవర్లో ఇల్లిస్ కట్టుదిట్టమైన బౌలింగ్. మొత్తంగా మా వైపు నుంచి అద్బుత ప్రదర్శన చేశాం. కానీ, టీమిండియా ఆటగాళ్లు మా కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చి మాపై పైచేయి సాధించారు. సూర్య విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినప్పటికీ చివరి బంతి వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లామంటే మా ప్రదర్శన బాగానే ఉన్నట్లు అనుకుంటున్నామని వేడ్ అన్నాడు. -
కెప్టెన్సీని డ్రెస్సింగ్ రూమ్‌లోనే వదిలేశాను.. రింకూ కోసమే అనిపించింది: సూర్యకుమార్
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో నిన్న (నవంబర్ 23) జరిగిన తొలి టీ20లో టీమిండియా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. జోష్ ఇంగ్లిస్ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్‌గా వచ్చిన స్టీవ్ స్మిత్ (52) అర్ధసెంచరీతో రాణించాడు. ఇంగ్లిస్ విధ్వంసం ధాటికి ముకేశ్ కుమార్ (4-0-29-0), అక్షర్ పటేల్ (4-0-32-0) మినహా భారత బౌలర్లంతా కుదేలయ్యారు. ప్రసిద్ద్, రవి బిష్ణోయ్‌కు తలో వికెట్ దక్కింది. అనంతరం 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. మరో బంతి మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. సూర్యకుమార్ యాదవ్ (42 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి టీమిండియా గెలుపుకు బాటలు వేశాడు. ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. స్కై ఔటయ్యాక ఆఖర్లో టీమిండియా 3 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయి ఓటమిపాలయ్యేలా కనినపించింది. అయితే రింకూ సింగ్ చివరి బంతికి సిక్సర్ బాది టీమిండియాను గెలిపించాడు. భారత్ గెలుపుకు చివరి బంతికి సింగిల్ అవసరం కాగా సీన్ అబాట్ నో బాల్ వేసి భారత గెలుపును లాంఛనం చేశాడు. దీంతో రింకూ సిక్సర్‌తో సంబంధం లేకుండానే టీమిండియా విజయం సాధించింది. రింకూ సిక్సర్ గణాంకాల్లో కూడా కలవలేదు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ అనంతరం స్కై మాట్లాడుతూ.. ఈ రోజు మా ఆటతీరు అద్భుతంగా ఉంది. ఓ దశలో ఒత్తిడికి గురయ్యాము. కానీ మా ఆటగాళ్లు దాన్ని అధిగమించి సత్తా చాటారు. టీమిండియా కెప్టెన్‌గా ఇది నాకు గర్వించదగ్గ క్షణం. మ్యాచ్ సమయంలో మంచు కురుస్తుందని భావించాము. కానీ అలా జరగలేదు. మైదానం చిన్నది కావడంతో ఛేదనలో బ్యాటింగ్ సులభం అవుతుందని తెలుసు. వారు 230-235 సాధించవచ్చని భావించాం. కానీ ఆఖర్లో మా బౌలర్లు వారిని అద్భుతంగా కట్టడి చేశారు. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయమని ఇషాన్‌కు చెప్పాను. అందుకే అతను ఫ్రీగా షాట్లు ఆడగలిగాడు. కెప్టెన్సీ లగేజీని డ్రెస్సింగ్ రూమ్‌లో వదిలేసి బరిలోకి దిగాను. అందుకే బ్యాటింగ్‌ను ఆస్వాదించగలిగాను. ఆఖరి బంతికి రింకూ సిక్సర్ కొట్టడంపై స్పందిస్తూ.. అతడి కొరకే ఇలాంటి పరిస్థితులు వస్తాయన్నట్లుగా అనిపించింది. అతను ప్రశాంతంగా ఉండటమే కాకుండా నన్ను కూడా శాంతింపజేశాడు. ఇక్కడి (విశాఖ) వాతావరణం అద్భుతంగా ఉంది. ప్రేక్షకులకు ధన్యవాదాలు అని అన్నాడు. -
టీమిండియా శుభారంభం.. తొలి టీ20లో ఆసీస్‌పై విజయం
సాక్షి, విశాఖపట్నం: పరుగుల వరద పారిన మ్యాచ్‌లో చివరికి భారత జట్టుదే పైచేయిగా నిలిచింది. ఆ్రస్టేలియాతో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. గురువారం ఇక్కడి డాక్టర్ వైఎస్ఆర్–ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు రెండు వికెట్ల తేడాతో ఆ్రస్టేలియా జట్టును ఓడించింది. తొలిసారి జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన మ్యాచ్‌లో సూర్యకుమార్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 208 పరుగులు సాధించింది. జోష్ ఇంగ్లిస్ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీ సాధించగా... ఓపెనర్‌గా వచ్చిన స్టీవ్ స్మిత్ (41 బంతుల్లో 52; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 130 పరుగులు జోడించారు. ఇన్‌గ్లిస్ 47 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ క్రమంలో ఆ్రస్టేలియా తరఫున టి20ల్లో వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్‌గా ఆరోన్ ఫించ్ (47 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. అనంతరం భారత జట్టు 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ (42 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు)– అర్ధ సెంచరీలతో అదరగొట్టగా... రింకూ సింగ్ (14 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. భారత్ విజయానికి ఆఖరి బంతికి ఒక పరుగు అవసరంకాగా... సీన్ అబాట్ వేసిన బంతిని రింకూ సింగ్ సిక్సర్‌గా మలిచి భారత విజయాన్ని ఖరారు చేశాడు. అయితే టీవీ రీప్లేలో అబాట్ వేసిన బంతి నోబాల్ అని తేలడంతో అక్కడే భారత విజయం ఖాయమైంది. దాంతో రింకూ సింగ్ సిక్స్‌ను లెక్కలోకి తీసుకోలేదు. టి20ల్లో భారత జట్టుకిదే అత్యధిక ఛేజింగ్ కావడం విశేషం. సిరీస్‌లోని రెండో టి20 మ్యాచ్ ఈనెల 26న తిరువనంతపురంలో జరుగుతుంది. సూర్య, ఇషాన్ ధనాధన్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (8 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో సమన్వయలోపం కారణంగా మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (0) ఒక్క బంతి ఆడకుండానే తొలి ఓవర్లోనే రనౌటయ్యాడు. అనంతరం మూడో ఓవర్లో యశస్వి భారీ షాట్‌కు యత్నించి నిష్క్రమించాడు. ఈ దశలో ఇషాన్, సూర్యకుమార్ జత కలిశారు. వీరిద్దరు ఎక్కడా తగ్గకుండా ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో భారత్ స్కోరు 4.5 ఓవర్లలో 50 దాటింది. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ 2 వికెట్లకు 63 పరుగులు సాధించింది. ఆ తర్వాత కూడా ఇషాన్, సూర్య జోరు కొనసాగించడంతో భారత్ 9.1 ఓవర్లలో 100 పరుగులు చేసింది. ఇషాన్ 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించి డీప్ ఎక్స్ట్రా కవర్లో షార్ట్ చేతికి చిక్కడంతో ఇషాన్ ఇన్నింగ్స్ ముగిసింది. తిలక్ వర్మ (10 బంతుల్లో 12; 2 ఫోర్లు) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. ఈ దశలో సూర్య, రింకూ జతకలిసి ఐదో వికెట్‌కు 40 పరుగులు జోడించడంతో భారత్ 194/4తో విజయానికి చేరువైంది. అయితే ఇదే స్కోరు వద్ద సూర్య అవుటయ్యాడు. అప్పటికి భారత్ విజయానికి చేరువైంది. చివరి ఓవర్ డ్రామా... 12 బంతుల్లో 14 పరుగులు చేయాల్సిన దశలో 19వ ఓవర్లో భారత్ 7 పరుగులు చేసింది. దాంతో చివరి ఓవర్లో భారత్ గెలుపునకు 6 బంతుల్లో 7 పరుగులు అవసరమయ్యాయి. తొలి బంతికే రింకూ ఫోర్ కొట్టాడు. రెండో బంతికి ‘బై’ రూపంలో పరుగు వచ్చింది. 4 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన దశలో భారత్ వరుసగా మూడు బంతుల్లో అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ వికెట్లను కోల్పోయింది. రెండో పరుగు పూర్తి చేసే క్రమంలో అర్ష్‌దీప్ అవుటయ్యాడు. దాంతో చివరి బంతికి భారత్ విజయానికి ఒక పరుగు అవసరమైంది. ‘సూపర్ ఓవర్’ అవసరం పడుతుందా అనే అనుమానం కలిగిన దశలో అబాట్ వేసిన ఆఖరి బంతిని రింకూ సిక్స్‌గా మలచడంతో భారత్ విజయం ఖరారైంది. అయితే అబాట్ బంతి నోబాల్ అని తేలడంతో రింకూ సిక్స్ షాట్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: స్టీవ్ స్మిత్ (రనౌట్) 52; మాథ్యూ షార్ట్ (బి) రవి బిష్ణోయ్ 13; జోష్ ఇన్‌గ్లిస్ (సి) యశస్వి జైస్వాల్ (బి) ప్రసిధ్ కృష్ణ 110; స్టొయినిస్ (నాటౌట్) 7; టిమ్ డేవిడ్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–31, 2–161, 3–180. బౌలింగ్: అర్ష్‌దీప్ సింగ్ 4–0–41–0, ప్రసిధ్ కృష్ణ 4–0–50–1, అక్షర్ పటేల్ 4–0–32–0, రవి బిష్ణోయ్ 4–0–54–1, ముకేశ్ కుమార్ 4–0–29–0. భారత్ ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) స్మిత్ (బి) షార్ట్ 21; రుతురాజ్ గైక్వాడ్ (రనౌట్) 0; ఇషాన్ కిషన్ (సి) షార్ట్ (బి) తన్వీర్ 58; సూర్యకుమార్ యాదవ్ (సి) ఆరన్ హార్డి (బి) బెహ్రన్‌డార్ఫ్ 80; తిలక్ వర్మ (సి) స్టొయినిస్ (బి) తన్వీర్ సంఘా 12; రింకూ సింగ్ (నాటౌట్) 22; అక్షర్ పటేల్ (సి అండ్ బి) సీన్ అబాట్ 2; రవి బిష్ణోయ్ (రనౌట్) 0; అర్ష్‌దీప్ సింగ్ (రనౌట్) 0; ముకేశ్ కుమార్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (19.5 ఓవర్లలో 8 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–11, 2–22, 3–134, 4–154, 5–194, 6–207, 7–207, 8–208. బౌలింగ్: స్టొయినిస్ 3–0–36–0, బెహ్రన్‌డార్ఫ్ 4–1–25–1, షార్ట్ 1–0–13–1, సీన్ అబాట్ 3.5–0–43–1, నాథన్ ఎలిస్ 4–0–44–0, తన్వీర్ సంఘా 4–0–47–2. -
ఆసీస్‌తో తొలి టీ20.. టీమిండియాలో ఎవరెవరు..?
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (నవంబర్ 23) తొలి మ్యాచ్ జరుగనుంది. వైజాగ్ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌పై గెలిచి వరల్డ్‌కప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ టీమిండియా సారధిగా వ్యవహరించనున్నాడు. మాథ్యూ వేడ్ ఆసీస్ కెప్టెన్‌గా బరిలో ఉంటాడు. ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆసీస్ సైతం పలువురు రెగ్యులర్ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించింది. కెప్టెన్ పాట్ కమిన్స్, వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, పేసర్లు స్టార్క్, హాజిల్‌వుడ్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ వరల్డ్‌కప్ ముగిసిన అనంతరం స్వదేశానికి వెళ్లిపోయారు. వరల్డ్‌కప్ హీరోలు ట్రవిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా జట్టులో ఉన్నప్పటికీ వారు తొలి మ్యాచ్ ఆడకపోవచ్చు. ఆసీస్ మేనేజ్మెంట్ వారికి విశ్రాంతి కల్పించవచ్చు. ఆసీస్ ఇన్నింగ్స్‌ను మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్ ఆరంభించే అవకాశం ఉంది. ఇతర సభ్యులుగా మ్యాథ్యూ వేడ్, జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హర్డీ, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, సీన్ అబాట్, నాథన్ ఇల్లిస్, జేసన్ బెహ్రన్‌డార్ఫ్, తన్వీర్ సంగా బరిలోకి దిగే అవకాశం ఉంది. టీమిండియా విషయానికొస్తే.. ఓపెనింగ్ విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లలో ఎవరికి అవకాశం ఇస్తారో వేచి చూడాలి. ఇషాన్ కిషన్‌తో పాటు వీరిద్దరిలో ఎవరో ఒకరు బరిలోకి దిగుతారు. వన్‌డౌన్‌లో తిలక్ వర్మ, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, ఆర్షదీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, ముకేశ్ కుమార్ బరిలోకి దిగుతారు. అదనపు బ్యాటర్‌తో బరిలోకి దిగాలనుకుంటే ఓ పేసర్ బదులు రుతురాజ్, యశస్విలలో ఎవరో ఒకరు బరిలోకి దిగుతారు. -
భారత్-ఆసీస్ తొలి టీ20.. వైజాగ్‌లో వాతావరణ పరిస్థితి ఏంటి..?
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా వైజాగ్‌లోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా ఇవాళ భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వైజాగ్‌లో ప్రస్తుత వాతావరణ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉండటంతో మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా వైజాగ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్ జరిగే సమయానికి వర్షం పడే అవకాశాలు ఉండటంతో టాస్ ఆలస్యమవ్వవచ్చని స్థానికులు అంటున్నారు. వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదమేమీ లేనప్పటికీ, ప్రస్తుత వాతావరణ పరిస్థితి మాత్రం కాస్త ఆందోళనకరంగానే ఉన్నట్లు సమాచారం. కాగా, భారత సెలెక్టర్లు ప్రధాన ఆటగాళ్లకంతా విశ్రాంతినివ్వడంతో ఈ సిరీస్‌లో యువ జట్టు బరిలోకి దిగనుంది. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు. వరల్డ్‌కప్ ఫైనల్లో ఎదురైన పరాభవం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న భారత క్రికెటర్లు.. వైజాగ్ టీ20లో ఆసీస్‌ను మట్టికరిపించాలని పట్టుదలగా ఉన్నారు. ఈ సిరీస్ కోసం ఆసీస్ సైతం కొందరు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించింది. వరల్డ్‌కప్ అనంతరం కెప్టెన్ పాట్ కమిన్స్, వెటరన్ డేవిడ్ వార్నర్, పేసర్లు స్టార్క్, హాజిల్‌వుడ్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ స్వదేశానికి వెళ్లిపోయారు. ఈ సిరీస్‌లో మాథ్యూ వేడ్ ఆస్ట్రేలియా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. తొలి మ్యాచ్‌కు మ్యాక్స్‌వెల్, ట్రవిస్ హెడ్, ఆడమ్ జంపా దూరంగా ఉండనున్నారని సమాచారం. తుది జట్లు (అంచనా).. భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్ ), ఇషాన్ కిషన్, యశస్వి/రుతురాజ్, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ముకేశ్ కుమార్. ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్ (కెప్టెన్ ), స్మిత్, షార్ట్, హార్డీ, ఇన్‌గ్లిస్, స్టొయినిస్, టిమ్ డేవిడ్, సీన్ అబాట్, ఎలిస్, బెహ్రన్‌డార్ఫ్, తన్విర్ సంఘా. -
IND VS AUS 1st T20: మనదే పైచేయి.. విశాఖలోనూ మనోళ్లే..!
భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (నవంబర్ 23) తొలి మ్యాచ్ జరుగనుంది. వైజాగ్ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌పై గెలిచి వరల్డ్‌కప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ టీమిండియా సారధిగా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ జట్టును ఎంపిక చేశారు. ఆసీస్ సైతం వారి కెప్టెన్ పాట్ కమిన్స్, వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌లకు విశ్రాంతి కల్పించింది. వరల్డ్‌కప్ ఫైనల్ హీరో ట్రవిస్ హెడ్ జట్టులో ఉన్నప్పటికీ తొలి టీ20కి ఆడే అవకాశం లేదు. అతనితో పాటు మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఆసీస్ తమ రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లను తొలి మ్యాచ్‌లో అడించే అవకాశం ఉంది. సీనియర్లకు విశ్రాంతి కల్పించినప్పటికీ టీమిండియా ఆసీస్‌తో పోలిస్తే పటిష్టంగా కనిపిస్తుంది. కెప్టెన్ స్కై, ఇషాన్ కిషన్, యశస్వి, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్ లాంటి విధ్వంసకర ఆటగాళ్లతో భారత బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. అక్షర్, బిష్ణోయ్‌లతో భారత స్పిన్ విభాగం పటిష్టంగా కనిపిస్తుంది. ఆర్షదీప్, ప్రసిద్ద్, ముకేశ్ కుమార్‌లతో కూడిన పేస్ విభాగమే కాస్త వీక్‌గా ఉంది. మనదే పైచేయి.. ఇరు జట్ల మధ్య జరిగిన టీ20ల తీరును పరిశీలిస్తే.. ఆసీస్‌పై భారత్ స్పష్టమైన ఆధిక్యత కలిగి ఉందని తెలిస్తుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 26 టీ20ల్లో ఎదురెదురుపడగా.. భారత్ 15, ఆసీస్ 10 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఓ మ్యాచ్ రద్దైంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో 10 మ్యాచ్‌లు ఆడగా భారత్ 6 మ్యాచ్‌ల్లో గెలిచి, 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. విశాఖలోనూ మనోళ్లే..! విశాఖపట్నంలో టీమిండియా ఇప్పటి వరకు మూడు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడగా రెండింటిలో (2016లో శ్రీలంకపై, 2022లో దక్షిణాఫ్రికాపై) గెలిచి, ఓ మ్యాచ్‌లో (2019లో ఆ్రస్టేలియా) ఓటమిపాలైంది. -
నిస్వార్ధంగా, నిర్భయంగా ఆడండి.. వ్యక్తిగత మైలురాళ్లను ఇష్టపడే వ్యక్తిని కాదు..!
వైజాగ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే తొలి టీ20 ముందు టీమిండియా కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా అతను వరల్డ్‌కప్ అనుభవాలను పంచుకున్నాడు. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం బాధాకరమని అన్నాడు. వరల్డ్‌కప్‌లో తమ ప్రయాణం అద్భుతంగా సాగిందని తెలిపాడు. ఫైనల్లో ఓడినప్పటికీ తమ ప్రదర్శన యావత్ భారత దేశానికి గర్వకారణంగా నిలిచిందని పేర్కొన్నాడు. పైనల్లో ఎదురైన చేదు అనుభవాన్ని మరచిపోయి ముందుకు సాగాలని అనుకుంటున్నామన్నాడు. వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ టీమిండియాను అద్భుతంగా ముందుండి నడిపించాడని కితాబునిచ్చాడు. హిట్‌మ్యాన్ కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురిపించాడు. వన్డే వరల్డ్ ఛాంపియన్లను ఢీకొట్టేందుకు కుర్రాళ్లు ఉత్సాహంగా ఉన్నారని తెలిపాడు. రోహిత్ లాగే తాను కూడా జట్టుకు ఉపయోగపడే సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటానని వివరించాడు. వ్యక్తిగతంగా మైలురాళ్లను ఇష్టపడే వ్యక్తిని కాదని పేర్కొన్నాడు. సిరీస్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ.. వచ్చే ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్‌కప్ దృష్ట్యా ఈ సిరీస్ చాలా కీలకమని తెలిపాడు. నిర్భయంగా, నిస్వార్ధంగా, జట్టు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఆడమని సభ్యులతో చెప్పానని అన్నాడు. ఇటీవలికాలంలో జరిగిన దేశవాళీ టోర్నీల్లో, ఐపీఎల్లో వారు అదే చేశారని తెలిపాడు. కాగా, వైజాగ్ వేదికగా ఇవాళ రాత్రి 7 గంటలకు భారత్-ఆసీస్ మధ్య తొలి ట20 జరుగనున్న విషయం తెలిసిందే. తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్ ), ఇషాన్ కిషన్, యశస్వి/రుతురాజ్, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ముకేశ్ కుమార్. ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్ (కెప్టెన్ ), స్మిత్, షార్ట్, హార్డీ, ఇన్‌గ్లిస్, స్టొయినిస్, టిమ్ డేవిడ్, సీన్ అబాట్, ఎలిస్, బెహ్రన్‌డార్ఫ్, తన్విర్ సంఘా. -
బుమ్రా బృందం శుభారంభం
డబ్లిన్: భారత పేస్ తురుపుముక్క జస్ప్రీత్ బుమ్రా (2/24) తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. 11 నెలల సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన ఈ సీనియర్ సీమర్ వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత బౌలింగ్ దళానికి తాను వెన్నుదన్నుగా ఉంటానని భరోసా ఇచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే అనుకున్నట్లే భారత్, ఐర్లాండ్ తొలి టి20ని వరుణుడు అడ్డుకున్నాడు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ 2 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై గెలిచింది. ఈ మ్యాచ్‌తో రింకూ సింగ్, ప్రసిధ్ కృష్ణ భారత్ తరఫున టి20ల్లో అరంగేట్రం చేశారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. బారీ మెకార్తీ (33 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరిపించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలా 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ వర్షంతో ఆట నిలిచే సమయానికి 6.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (23 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్), రుతురాజ్ గైక్వాడ్ (16 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడారు. పవర్‌ప్లేలో ఓపెనింగ్ జోడీ 45 పరుగులు చేసింది. ఏడో ఓవర్ వేసిన క్రెయిగ్ యంగ్ 5 బంతులేసి 2 వికెట్లు పడగొట్టాడు. తిలక్ వర్మ (0) డకౌటయ్యాడు. వర్షంతో ఆట నిలిచే సమయానికి డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత విజయ సమీకరణం 45 పరుగులుగా ఉంది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం ఇదే వేదికపై రెండో మ్యాచ్ జరుగుతుంది. బుమ్రా ధాటికి... చాన్నాళ్ల తర్వాత మైదానంలోకి దిగిన భారత పేసర్, కెపె్టన్ బుమ్రా తన పేస్‌లో పదును ఏమాత్రం తగ్గలేదని తొలి ఓవర్లోనే చూపించాడు. అతని ధాటికి ఓపెనర్ బల్బిర్నీ (4) క్లీన్‌బౌల్డ్ కాగా, టక్కర్ (0) ఖాతానే తెరవలేదు. తర్వాత ప్రసిధ్ కృష్ణ కూడా ఐర్లాండ్ ఇన్నింగ్స్‌ను చావుదెబ్బ తీయడంతో 31 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. అయితే క్యాంఫర్ (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆదుకోగా, మెకార్తీ డెత్ ఓవర్లలో చెలరేగడంతో ఐర్లాండ్ చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. స్కోరు వివరాలు ఐర్లాండ్ ఇన్నింగ్స్: బల్బిర్నీ (బి) బుమ్రా 4; స్టిర్లింగ్ (బి) బిష్ణోయ్ 11; టక్కర్ (సి) సామ్సన్ (బి) బుమ్రా 0; టెక్టర్ (సి) తిలక్ (బి) ప్రసిధ్ కృష్ణ 9; క్యాంఫర్ (బి) అర్శ్‌దీప్ 39; డాక్రెల్ (సి) రుతురాజ్ (బి) ప్రసిధ్ కృష్ణ 1; మార్క్ అడైర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బిష్ణోయ్ 16; మెకార్తీ (నాటౌట్) 51; యంగ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–4, 2–4, 3–27, 4–27, 5–31, 6–59, 7–116. బౌలింగ్: బుమ్రా 4–0–24–2, అర్ష్‌దీప్ 4–0–35–1, ప్రసిధ్ కృష్ణ 4–0–32–2, రవి బిష్ణోయ్ 4–0–23–2, శివమ్ దూబే 1–0–6–0, వాషింగ్టన్ సుందర్ 3–0–19–0. భారత్ ఇన్నింగ్స్: యశస్వి (సి) స్టిర్లింగ్ (బి) యంగ్ 24; రుతురాజ్ (నాటౌట్) 19; తిలక్ వర్మ (సి) టక్కర్ (బి) యంగ్ 0; సామ్సన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (6.5 ఓవర్లలో 2 వికెట్లకు) 47. వికెట్ల పతనం: 1–46, 2–46. బౌలింగ్: మార్క్ అడైర్ 1–0–10–0, జోష్ లిటిల్ 3–0–20–0, మెకార్తీ 2–0–14–0, యంగ్ 0.5–0–2–2. -
IND VS IRE 1st T20: వర్షం అంతరాయం.. ఐర్లాండ్‌పై టీమిండియా విజయం
ఐర్లాండ్‌తో 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో టీమ్ ఇండియా డక్‌వర్త్ లూయిస్ ప్రకారం రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో ఇవాళ (ఆగస్ట్ 18) జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు మూకుమ్మడిగా రాణించారు. ఫలితంగా ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులకు పరిమతమైంది. భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్ సింగ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఐర్లాండ్ బ్యాటర్లలో (51 నాటౌట్), కర్టిస్ క్యాంఫర్ (39)రాణించగా.. మిగతావారంతా విఫలమయ్యారు. ఆండ్రూ బల్బిర్నీ (4), పాల్ స్టిర్లింగ్ (11), లోక్కాన్ టక్కర్ (0), హ్యారీ టెక్టార్ (9), జార్జ్ డాక్రెల్ (1), మార్క్ అదైర్ (16) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. ఆఖర్లో, ముఖ్యంగా అర్షదీప్ వేసిన చివరి ఓవర్లో మెక్‌కార్తీ చెలరేగి ఆడాడు. అ ఓవర్లో అతను ఏకంగా 22 పరుగులు పిండుకున్నాడు. ఇందులో 2 సిక్సర్లు, ఓ బౌండరీ ఉంది. ఆఖరి బంతికి సిక్సర్ బాదిన మెక్‌కార్తీ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అతను ఓ రికార్డు కూడా సాధించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో 8 లేదా అంతకంటే కింది స్థానాల్లో వచ్చి అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ స్థానంలో వచ్చి కేశవ్ మహారాజ్ చేసిన 41 పరుగులే అత్యధికంగా ఉండేది. కాగా, దాదాపుగా ఏడాది తర్వాత బంతి పట్టిన బుమ్రా.. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ, ఆతర్వాత ప్రభావం చూపించలేకపోయాడు. -
ఐర్లాండ్‌తో తొలి పోరు.. శుభారంభం లక్ష్యంగా
డబ్లిన్: రాబోయే కాలానికి కాబోయే స్టార్లతో ఉన్న టీమిండియా మరో టి20 క్రికెట్ సమరానికి సిద్ధమైంది. ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నిరూపించుకునేందుకు కుర్రాళ్లు సై అంటున్నారు. ఇందులో భాగంగా నేడు తొలి పోరు జరుగనుంది. 11 నెలలుగా బరిలోకే దిగని బుమ్రా టీమిండియాకు నాయకత్వం వహించనుండటం మరో విశేషం. అయితే స్టార్ల కొరతే సిరీస్‌కు వెలతి! ఇటీవల వెస్టిండీస్‌తో ఆడిన జట్టులో తాత్కాలిక కెపె్టన్ హార్దిక్ పాండ్యా అయినా ఉన్నాడు. ఈ సిరీస్‌కు తను కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలాగే విశ్రాంతి తీసుకుంటున్నాడు. అంతమాత్రాన ఈ క్రికెట్ ‘షో’కు సోకులేం తక్కువగా లేవు. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, జితేశ్ శర్మ తదితరులంతా ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన వారే! కలగలిపిన ప్రపంచ శ్రేణి బౌలర్లను ఎదుర్కొన్నవారే! ఇప్పుడు మాత్రం ఒక్క ఐర్లాండ్ బౌలర్లతో ‘ఢీ’ కొట్టేందుకు రెడీ అయ్యారు. అందరి కళ్లు బుమ్రా, తిలక్లపైనే... వెన్ను గాయం, శస్త్ర చికిత్స, పునరావస శిబిరం ఇలా చాన్నాళ్ల తర్వాత 29 ఏళ్ల బుమ్రా అంతర్జాతీయ క్రికెట్ బరిలోకి దిగుతున్నాడు. ఇదేమో టి20 సిరీస్... భారత్‌లో జరగబోయేది వన్డే వరల్డ్‌కప్... ఎలా చూసుకున్నా పరిమిత ఓవర్లలో బుమ్రా పవర్ఫుల్ బౌలర్. ఒకేసారి 10 ఓవర్ల కోటా ఉండే వన్డేల్లో కాకుండా 4 ఓవర్లతో సరిపెట్టుకునే టి20 మ్యాచ్‌లతో ఆడించడం ద్వారా అతనిపై పని ఒత్తిడి లేకుండా బోర్డు జాగ్రత్త పడింది. మరోవైపు అవకాశం వచ్చిన ఐపీఎల్లో, బరిలోకి దించిన కరీబియన్ సిరీస్‌లో చెలరేగిన హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మపై కూడా సెలక్టర్లు దృష్టి పడింది. ఈ సిరీస్‌లో వీరిద్దరిపైనే అందరి కళ్లుంటాయనేది వాస్తవం. ఇక ప్రత్యర్థి ఐర్లాండ్ విషయానికొస్తే బల్బిర్నీ సారథ్యంలో జట్టు నిలకడగా రాణిస్తోంది. కుర్రాళ్లున్నా... ఇంకెవరున్నా... టీమిండియాపై గెలుపు వారికి గొప్పదే అవుతుంది. అందుకే సిరీసే లక్ష్యంగా ఐర్లాండ్ దిగుతోంది. టికెట్లు హాట్‌కేకుల్లా... మైదానంలో భారత జట్టు దిగితే ఏ జట్టుకైనా కాసుల రాశులు కురుస్తాయనే దానికి భారత్, ఐర్లాండ్ టి20 సిరీస్ మరో ఉదాహరణ. టీమిండియా వైపు నుంచి చూస్తే ప్రత్యర్తి పెద్దగా పోటీ జట్టు కాదు. ‘హిట్‌మ్యాన్’ రోహిత్, బ్యాటింగ్ ‘కింగ్’ కోహ్లి... అంతెందుకు తాజా తాత్కాలిక కెపె్టన్ హార్దిక్ పాండ్యా కూడా లేడు. అంటే భారత స్టార్లెవరూ బరిలో లేకపోయినా... మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు టి20లకు టికెట్లన్నీ అమ్ముడయ్యాయని స్వయంగా ఐర్లాండ్ బోర్డే వెల్లడించింది. 11,500 సీట్ల సామర్థ్యమున్న స్టేడియం ‘హౌస్‌ఫుల్’ అయ్యింది. అయితే శుక్రవారం డబ్లిన్‌లో భారీ వర్ష సూచన ఉండటంతో మ్యాచ్ సజావుగా సాగుతుందో లేదో వేచి చూడాలి. -
ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు షాక్.. విండీస్‌కు కూడా..!
5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా విండీస్‌తో నిన్న (ఆగస్ట్ 3) జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 4 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమి నుంచి తేరుకోక ముందే ఐసీసీ భారత జట్టుకు మరో షాకిచ్చింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా ఐసీసీ టీమిండియా మ్యాచ్ ఫీజ్‌లో 5 శాతం, విండీస్ మ్యాచ్ ఫీజ్‌లో 10 శాతం కోత విధించింది. నిర్దిష్ట సమయానికి భారత్ ఒక ఓవర్, విండీస్ రెండు ఓవర్లు వెనుకపడి ఉండటంతో ఐసీసీ ఇరు జట్లకు జరిమానా విధించింది. కాగా, ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన భారత్ 145 పరుగులకే పరిమితమైంది. విండీస్ ఇన్నింగ్స్‌లో పూరన్ (41), కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ (48) రాణించగా.. భారత్ ఇన్నింగ్స్‌లో తిలక్ వర్మ (39) ఒక్కడే పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, చహల్ తలో 2 వికెట్లు, హార్దిక్, కుల్దీప్ చెరో వికెట్ పడగొట్టగా.. విండీస్ బౌలర్లు జేసన్ హోల్డర్, ఓబెద్ మెక్కాయ్, రొమారియో షెపర్డ్ తలో 2 వికెట్లు, అకీల్ హొసేన్ ఓ వికెట్ దక్కించుకున్నారు. రెండో టీ20 ఆగస్ట్ 6న గయానాలో జరుగనుంది. -
పసికూనలపై బంగ్లా పులుల ప్రతాపం
స్వదేశంలో బంగ్లాదేశ్ విజయాల పరంపర కొనసాగుతుంది. ఇటీవలే జగజ్జేత ఇంగ్లండ్‌ను క్లీన్‌స్వీప్ (3-0 తేడాతో టీ20 సిరీస్) చేసి జోష్ మీదున్న బంగ్లాదేశ్.. ఐర్లాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న హోం సిరీస్‌లోనూ అదే జోరును కంటిన్యూ చేస్తోంది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న బంగ్లా పులులు.. ఇవాళ (మార్చి 27) మొదలైన టీ20 సిరీస్‌కు కూడా శుభారంభం చేశారు. చట్టోగ్రామ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం బంగ్లాదేశ్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిధ్య జట్టు.. 19.2 ఓవర్ల తర్వాత 207/5 స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుండగా, వర్షం మొదలైంది. చాలా సేపు కొనసాగిన వర్షం నిర్ణీత సమయానికి కాస్త ముందు ఎడతెరిపినివ్వడంతో రిఫరీ మ్యాచ్‌ను ప్రారంభించాడు. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం బంగ్లా టార్గెట్‌ను 8 ఓవర్లలో 104 పరుగులుగా నిర్ధేశించారు. ధాటిగా ఛేదనను ప్రారంభించిన ఐర్లాండ్‌ను తస్కిన్ అహ్మద్ దారుణంగా దెబ్బకొట్టాడు. తొలి ఓవర్లో 18 పరుగులు, రెండో ఓవర్లో 14 పరుగులు రాబట్టి లక్ష్యం దిశగా పరుగులు తీస్తున్న ఐర్లాండ్‌ను తస్కిన్ అహ్మద్ ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి దెబ్బకొట్టాడు. 2 ఓవర్ల తర్వాత 32/0గా ఉన్న స్కోర్ 4 ఓవర్ల తర్వాత 44/4గా మారింది. ఈ పరిస్థితి తర్వాత కూడా ఏమాత్రం తగ్గని ఐర్లాండ్ తమవంతు ప్రయత్నం చేసి చివరికి ఓటమిపాలైంది. 2 ఓవర్లు వేసిన తస్కిన్ 16 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు.. లిట్టన్ దాస్ (23 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రోని తలుక్దార్ (38 బంతుల్లో 67; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), షమీమ్ హొస్సేన్ (20 బంతుల్లో 30; 2 ఫోర్లు, సిక్స్), షకీబ్ (13 బంతుల్లో 20 నాటౌట్; 3 ఫోర్లు) రాణించడంతో బంగ్లాదేశ్ 19.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. మరో 4 బంతులు మిగిలుండగానే వర్షం ప్రారంభంకావడంతో బంగ్లా ఇన్నింగ్స్ ఆక్కడే ముగిసింది. బంగ్లా-ఐర్లాండ్ మధ్య రెండో టీ20 మార్చి 29న జరుగుతుంది. -
చెత్త రికార్డు సమం చేసిన డికాక్
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా సాతాఫ్రికాతో నిన్న (మార్చి 25) జరిగిన తొలి మ్యాచ్‌లో పర్యాటక వెస్డిండీస్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. వర్షం అంతరాయం కలిగించడంతో 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేయగా.. విండీస్ మరో 3 బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్నోయి లక్ష్యాన్ని ఛేదించింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో డేవిడ్ మిల్లర్ (22 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడగా.. విండీస్‌ను కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ (18 బంతుల్లో 43; ఫోర్, 5 సిక్సర్లు) అజేయమై విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విజయతీరాలకు చేర్చాడు. కాగా, ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా వికెట్‌కీపర్,బ్యాటర్ క్వింటన్ డికాక్ ఓ చెత్త రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలి బంతికే ఔటైన (గోల్డన్ డక్) డికాక్.. సౌతాఫ్రికా తరఫున టీ20ల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా జేపీ డుమినీ, ఆండైల్ ఫెలుక్వాయో సరసన చేరాడు. వీరు ముగ్గురు టీ20ల్లో 6 సార్లు డకౌటయ్యారు. ఇదిలా ఉంటే, 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌లు ఆడేందుకు సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న వెస్టిండీస్ జట్టు టెస్ట్ సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోగా.. వన్డే సిరీస్‌ను 1-1తో (వర్షం కారణంగా ఓ మ్యాచ్ రద్దైంది) సమం చేసుకుంది. తొలి టీ20లో విండీస్ గెలవడంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. -
ఒక చెవితో మాత్రమే వినగలడు.. అయితేనేం.. వాషింగ్టన్ సుందర్ గురించిన ఆసక్తికర విషయాలు
టీమిండియా యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలిస్తే నోరెళ్లబెట్టక తప్పదు. 17 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఈ టాలెంటెడ్ యంగ్ క్రికెటర్.. 2021 ఆస్ట్రేలియా పర్యటన తర్వాత రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. ఆ సిరీస్‌లోని బ్రిస్బేన్ టెస్ట్‌లో నాటకీయ పరిణామాల మధ్య జట్టులో చోటు దక్కించుకున్న సుందర్.. సంచలన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. ఆ మ్యాచ్‌లో సుందర్ చేసిన హాఫ్ సెంచరీ.. ఆ మ్యాచ్‌లో సుందర్ తీసిన స్టీవ్ స్మిత్ వికెట్ అతని జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసాయి. తాజాగా న్యూజిలాండ్ సిరీస్-2023లో భాగంగా జరిగిన తొలి టీ20లో బౌలింగ్‌లో 2 వికెట్లు, బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న సుందర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో సుందర్.. అబ్బురపడే ప్రదర్శనతో రాణించినా జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. అయినప్పటికీ ఈ యువ ఆల్‌రౌండర్ అభిమానుల మనసులను కొల్లగొట్టాడు. ఈ మ్యాచ్ తర్వాత సుందర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటంటే.. సుందర్ కేవలం ఒక్క చెవితో మాత్రమే వినగలడట. ఈ విషయాన్ని సుందరే ఓ ఇంటర్వ్యూ సందర్భంగా బహిర్గతం చేశాడు. వినికిడి లోపం ఉన్నప్పటికీ.. ఏమాత్రం కుంగిపోని ఈ యువ కెరటం, సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకుంటూ టీమిండియాలో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సుందర్‌కు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. వాషింగ్టన్ సుందర్ పేరు వినగానే, అతను క్రిస్టియన్ ఏమోనని అందరూ అనుకుంటారు. అయితే అతను సంప్రదాయ తమిళ హిందు కుటుంబానికి చెందిన వాడని సుందర్ తండ్రి వివరణ ఇచ్చాడు. మరి సుందర్‌కు వాషింగ్టన్ పేరును ఎందుకు జోడించాల్సి వచ్చిందన్న విషయంపై అతని తండ్రి ఓ సందర్భంగా క్లారిటీ ఇచ్చాడు. సుందర్ చిన్నతనంలో కుటుంబం ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు పీడీ వాషింగ్టన్ అనే ఓ సైనికుడు తమను అన్ని విధాల ఆదుకున్నాడని, ఆ కృతజ్ఞతతోనే తమ అబ్బాయికి వాషింగ్టన్ పేరును జోడించానని సుందర్ తండ్రి వివరణ ఇచ్చాడు. -
హార్ధిక్‌కు అంత సీన్ లేదు.. కెప్టెన్‌గా అతను ఫెయిల్..!
3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా రాంచీ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా.. న్యూజిలాండ్ చేతిలో 21 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమి నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యాను ఉద్దేశిస్తూ పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలి మ్యాచ్‌లో హార్ధిక్ వ్యూహాలను ఎండగట్టిన కనేరియా.. భారత్‌ను గెలిపించేందుకు హార్ధిక్ దగ్గర ఎలాంటి ప్రణాళికలు లేవని, కెప్టెన్‌గా హార్ధిక్ ఘోరంగా వైఫల్యం చెందాడని తన యూట్యూబ్ ఛానల్ వేదికగా నోటికి వచ్చినట్లు వాగాడు. బౌలర్లను రొటేట్ చేయడంలో దారుణంగా విఫలమైన హార్ధిక్.. చిన్నపిల్లాడిలా తానే మొదట బౌలింగ్ చేయాలన్నట్లుగా బంతి కోసం ఎగబడ్డాడని కనేరియా మండిపడ్డాడు. శివమ్ మావీని లేటుగా బరిలోకి దించడం, దీపక్ హుడాకు అనవసరమైన ప్రాధాన్యత ఇవ్వడం.. ఇలా, ప్రణాళికలేమీ లేకుండా బౌలర్లను మార్చడంపై ధ్వజమెత్తాడు. జట్టును ముందుండి నడిపించడంలో చేతులెత్తేసిన హార్ధిక్.. వ్యక్తిగతంగానూ దారుణంగా విఫలమయ్యాడని విమర్శించాడు. మొత్తంగా తొలి టీ20లో హార్ధిక్.. జట్టును ముందుండి నడిపించడంలో పూర్తిగా విఫలమయ్యాడని, కెప్టెన్‌గా అతనికి అంత సీన్ లేదని అర్ధం వచ్చేలా టీమిండియా కెప్టెన్‌ను తక్కువ చేసి మాట్లాడాడు. ఆఖర్లో ఇది వ్యక్తిగత విమర్శ కాదని.. హార్ధిక్ కెప్టెన్సీపై తన అభిప్రాయం మాత్రమేనని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇదిలా ఉంటే, రోహిత్ సారధ్యంలో వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన భారత్.. టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే (హార్ధిక్ నేతృత్వంలో) ఓడింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1 తేడాతో వెనుకంజలో ఉంది. ఇవాళ (జనవరి 29) జరుగబోయే రెండో మ్యాచ్‌లో గెలిస్తేనే టీమిండియా సిరీస్ విజయావకాశాలు సజీవంగా ఉంటాయి. -
IND VS NZ 1st T20: టీమిండియాతో కలిసి సందడి చేసిన ధోని
3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రాంచీ వేదికగా రేపు (జనవరి 27) తొలి మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఓ అనుకోని అతిధి ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తడంతో పాటు జట్టు సభ్యుల్లో జోష్ నింపాడు. ఆ స్పెషల్ పర్సన్ ఎవరంటే..? టీమిండియా మాజీ కెప్టెన్, లోకల్ హీరో మహేంద్రసింగ్ ధోని. Look who came visiting at training today in Ranchi - the great @msdhoni! 😊#TeamIndia | #INDvNZ pic.twitter.com/antqqYisOh — BCCI (@BCCI) January 26, 2023 టీమ్ మేనేజ్మెంట్కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రత్యక్షమైన ధోనిని చూసి యువ భారత సభ్యులు ఉబ్బితబ్బిబైపోయారు. ధోనితో సరదాగా గడుపుతూ సందడి చేశారు. ధోని సైతం హుషారుగా యువ సభ్యులతో మాటలు కలుపుతూ, సలహాలిచ్చాడు. హార్ధిక్, ఇషాన్, గిల్, సూర్యకుమార్, చహల్, సుందర్.. ఇలా దాదాపుగా ప్రతి సభ్యుడు మిస్టర్ కూల్ కెప్టెన్‌తో కలియతిరిగారు. Hello Ranchi 👋 We are here for the #INDvNZ T20I series opener 👏 👏#TeamIndia | @mastercardindia pic.twitter.com/iJ4uSi8Syv — BCCI (@BCCI) January 25, 2023 ధోని సైతం వారితో సరదాగా గడిపారు. చాలాకాలం తర్వాత కలిసిన భారత నాన్ ప్లేయింగ్ బృంద సభ్యులకు ధోని షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ఇవాళ (జనవరి 26) తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా, ప్రస్తుతం వైరలవుతోంది. ధోనిని చాలాకాలం తర్వాత చూసిన ఫ్యాన్స్ తెగ సంబురపడిపోతున్నారు. కాగా, మహేంద్రుడి స్వస్థలం జార్ఖండ్‌లోని రాంచీ అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు రాత్రి 7 గంటల నుంచి తొలి టీ20 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన జోష్‌లో టీమిండియా ఉండగా.. ఈ సిరీస్‌నైనా గెలిచి పరువు నిలుపుకోవాలని కివీస్ పట్టుదలగా ఉంది. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో రెండో టీ20 జనవరి 29న లక్నోలో, మూడో మ్యాచ్ ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌లో జరుగనుంది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను భారత జట్టు.. హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావీ, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చహల్, ముకేశ్ కుమార్ న్యూజిలాండ్ జట్టు.. మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, డారల్ మిచెల్, మైఖేల్ రిప్పన్, మార్క్ చాప్మన్, ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, డేన్ క్లీవర్, గ్లెన్ ఫిలిప్స్, జాకబ్ డఫ్ఫీ, బెన్ లిస్టర్, ఐష్ సోధీ, లోకీ ఫెర్గూసన్, హెన్రీ షిప్లే, బ్లెయిర్ టిక్నర్ -
IND VS NZ 1st T20: పృథ్వీ షాకు లైన్ క్లియర్, తుది జట్టు ఇలా ఉంటుంది..!
యువ ఓపెనర్ పృథ్వీ షాకు దాదాపు ఏడాదిన్నర తర్వాత టీమిండియాకు ఆడే అవకాశం లభించనుంది. కివీస్‌తో టీ20 సిరీస్‌కు ముందు మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయం బారిన పడటంతో షాకు తుది జట్టులో స్థానం లభించడం దాదాపుగా ఖరారైంది. షా చివరిసారిగా 2021 జులైలో శ్రీలంకతో టీ20 మ్యాచ్ ఆడాడు. షా అంతర్జాతీయ స్థాయిలో ఆడిన ఏకైక టీ20 మ్యాచ్ ఇదే. ఆ మ్యాచ్‌లో షా తొలి బంతికే గోల్డన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇటీవల ఓ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో భారీ ట్రిపుల్ సెంచరీ బాదడం ద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకర్శించిన షా.. రేపు (జనవరి 27) రాంచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగబోయే తొలి టీ20లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టు కూర్పు విషయానికొస్తే.. షాతో పాటు మరో ఓపెనర్‌గా భీకర ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఆతర్వాత దీపక్ హుడా, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావీ, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైనట్టే. ఒకవేళ లెఫ్ట్ అండ్ రైట్ ఓపెనింగ్ కాంబినేషన్ ఉంటే బాగుంటుందని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తే.. షా స్థానంలో ఇషాన్, వన్ డౌన్లో షా వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే, ఈ ప్రయోగకర సమీకరణను ట్రై చేసే సాహసం టీమిండియా యాజమాన్యం చేయకపోవచ్చు. కాగా, భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే తొలి టీ20లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. తాజాగా ముగిసిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన జోష్‌లో టీమిండియా ఉండగా.. టీ20 సిరీస్‌నైనా కైవసం చేసుకుని ప్రతీకారం తీర్చుకోవాలని పర్యాటక జట్టు పట్టుదలగా ఉంది. ఈ సిరీస్‌లో మిగతా మ్యాచ్‌లు జనవరి 29, ఫిబ్రవరి 1న జరుగనున్నాయి. రెండో టీ20 లక్నో వేదికగా, మూడో మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరుగనున్నాయి. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను భారత జట్టు.. హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావీ, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చహల్, ముకేశ్ కుమార్ న్యూజిలాండ్ జట్టు.. మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, డారల్ మిచెల్, మైఖేల్ రిప్పన్, మార్క్ చాప్మన్, ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, డేన్ క్లీవర్, గ్లెన్ ఫిలిప్స్, జాకబ్ డఫ్ఫీ, బెన్ లిస్టర్, ఐష్ సోధీ, లోకీ ఫెర్గూసన్, హెన్రీ షిప్లే, బ్లెయిర్ టిక్నర్ -
IND VS NZ T20 Series: టీమిండియాకు భారీ షాక్.. గాయం కారణంగా స్టార్ ఓపెనర్ ఔట్
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మణికట్లు గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఇవాళ (జనవరి 26) అధికారికంగా ప్రకటించింది. రుతురాజ్‌ను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిపోర్ట్ చేయాలని సూచించినట్లు బీసీసీఐ ప్రతినిధి వెల్లడించారు. రుతురాజ్ స్థానాన్ని మరే ఇతర ఆటగాడితో భర్తీ చేసేది లేదని సదరు అధికారి పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా పృథ్వీ షా జట్టులో ఉండటంతో బీసీసీఐ ఈ మేరకు తీర్మానించి ఉండవచ్చని తెలుస్తోంది. కాగా, రుతురాజ్ (మహారాష్ట్ర) ఇటీవల హైదరాబాద్‌తో జరిగిన రంజీ మ్యాచ్ సందర్భంగా గాయపడినట్లు సమాచారం. అతడు మణికట్టు గాయం బారిన పడటం ఇటీవలికాలంలో ఇది రెండోసారి. గతేడాది శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ నుంచి కూడా రుతురాజ్ మణికట్టు గాయం కారణంగానే తప్పుకున్నాడు. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ జనవరి 27 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. రాంచీ వేదికగా రేపు భారత్-కివీస్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. తాజాగా ముగిసిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన జోష్‌లో టీమిండియా ఉండగా.. టీ20 సిరీస్‌నైనా కైవసం చేసుకోవాలని పర్యాటక జట్టు పట్టుదలగా ఉంది. గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి రుతురాజ్ తప్పుకోవడంతో టీమిండియా ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, పృథ్వీ షా బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైంది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను భారత జట్టు.. హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావీ, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చహల్, ముకేశ్ కుమార్ న్యూజిలాండ్ జట్టు.. మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, డారల్ మిచెల్, మైఖేల్ రిప్పన్, మార్క్ చాప్మన్, ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, డేన్ క్లీవర్, గ్లెన్ ఫిలిప్స్, జాకబ్ డఫ్ఫీ, బెన్ లిస్టర్, ఐష్ సోధీ, లోకీ ఫెర్గూసన్, హెన్రీ షిప్లే, బ్లెయిర్ టిక్నర్ -
సంజూ శాంసన్‌ను ఏకి పారేసిన లిటిల్ మాస్టర్
టీమిండియా వికెట్‌కీపర్ సంజూ శాంసన్‌ను భారత మాజీ కెప్టెన్, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఏకి పారేశాడు. ముంబై వేదికగా శ్రీలంకతో నిన్న (జనవరి 3) జరిగిన తొలి టీ20లో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనందుకు గాను శాంసన్‌పై నిప్పులు చెరిగాడు. ఎంత టాలెంట్ ఉన్నా ఏం ప్రయోజనం.. చెత్త షాట్ సెలెక్షన్‌తో మరోసారి వికెట్ పారేసుకున్నాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. అమవాస్యకో పున్నానికో వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోకుంటే ఎలా అంటూ ఘాటు స్వరంతో వ్యాఖ్యానించాడు. తొలి టీ20లో శాంసన్ చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్న వెంటనే సన్నీ ఈ రకంగా స్పందించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన సంజూ.. కేవలం ఆరు బంతులు మాత్రమే ఆడి (5 పరుగులు) దారుణంగా నిరాశపరిచాడు. ధనంజయ డిసిల్వ వేసిన ఏడో ఓవర్ నాలుగో బంతికి క్యాచ్ మిస్ కావడంతో బతికిపోయిన సంజూ.. ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేక అదే ఓవర్ ఆఖరి బంతికి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తేలిపోయిన సంజూ.. ఫీల్డింగ్ చేస్తూ కీలక క్యాచ్ జారవిడిచాడు. లంక ఇన్నింగ్స్‌లో హార్ధిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్లో నిస్సంక ఇచ్చిన క్యాచ్‌ను వదిలిపెట్టి కెప్టెన్ ఆగ్రహానికి గురయ్యాడు. ఇదిలా ఉంటే, భీభత్సమైన టాలెంట్ ఉన్నా సంజూ శాంసన్‌కు టీమిండియాలో సరైన అవకాశాలు కల్పించకుండా వివక్ష చూపుతున్నారంటూ గత కొంతకాలంగా అతని అభిమానులు సోషల్‌మీడియా వేదికగా గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజూపై సునీల్ గవాస్కర్ చేసిన ఘాటు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. -
న్యూజిలాండ్‌తో తొలి టీ20.. శాంసన్ సహా 'ఆ ఇద్దరికి' మొండిచెయ్యి..?
IND VS NZ 1st T20: టీ20 వరల్డ్‌కప్-2022 అనంతరం సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ రెస్ట్ తీసుకోవడంతో యువ జట్లతో (టీ20, వన్డే సిరీస్‌లకు వేర్వేరు జట్లు) న్యూజిలాండ్ పర్యటనకు బయల్దేరిన టీమిండియా.. రేపు (నవంబర్ 18) వెల్లింగ్టన్లోని స్కై స్టేడియంలో 3 మ్యాచ్‌ల సిరీస్‌లతో భాగంగా తొలి టీ20 ఆడనుంది. ఈ పర్యటనలో టీ20 సిరీస్‌కు హార్ధిక్ పాండ్యా, వన్డే సిరీస్‌కు శిఖర్ ధవన్ టీమిండియాకు నాయకత్వం వహించనుండగా.. వీరి సారధ్యంలో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఆతిధ్య జట్టుతో అమీతుమీకి సై అంటుంది. భారతకాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే తొలి టీ20లో భారత తుది జట్టు ఎలా ఉండే అవకాశం ఉందంటే.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సీనియర్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, ఉమ్రాన్ మాలిక్‌లకు తుది జట్టులో చోటు లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ ఇద్దరినీ జట్టులోకి తీసుకుంటే, సంజూ శాంసన్ బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. వరల్డ్‌కప్‌లో అవకాశాలు దక్కని దీపక్ హుడా తుది జట్టులో తప్పక ఉండే ఛాన్స్ ఉంది. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, హర్షల్ పటేల్ ఛాన్స్ కోసం ఎదురు చూడాల్సి రావచ్చు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటాలో యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ.. స్కై స్టేడియంలో పిచ్ పరిస్థితుల దృష్ట్యా కుల్దీప్కే అవకాశం దొరకవచ్చు. పేసర్ల కోటాలో స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ స్థానాలు పక్కా కాగా.. ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్‌ల మధ్య పోటీ ఉంటుంది. అయితే పేస్‌కు అనుకూలించే వెల్లింగ్టన్ పిచ్‌పై మేనేజ్మెంట్.. ఉమ్రాన్ మాలిక్‌ను ఫస్ట్ చాయిస్‌గా తీసుకునే అవకాశం ఉంది. తుది జట్టు (అంచనా).. శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ టీ20 సిరీస్‌కు భారత జట్టు.. హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. చదవండి: Viral Video: సిక్స్ ప్యాక్ బాడీలతో టీమిండియా క్రికెటర్లు..! video -
Viral Video: సిక్స్ ప్యాక్ బాడీలతో టీమిండియా క్రికెటర్లు..!
టీ20 వరల్డ్‌కప్-2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో పరాభవం అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చిన టీమిండియా, రోజుల వ్యవధిలోనే న్యూజిలాండ్ పర్యటనకు బయల్దేరింది. ఈ పర్యటనలో 3 టీ20లు, 3 వన్డేలు ఆడనున్న భారత్.. వరల్డ్‌కప్ తాలూకా చేదు అనుభవాలను అధిగమించి, కివీస్‌పై అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చాలని ఉవ్విళ్ళూరుతోంది. ఈ క్రమంలో రేపు (నవంబర్ 18) జరుగబోయే తొలి టీ20కి వేదిక అయిన వెల్లింగ్టన్కు చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది. View this post on Instagram A post shared by Washington Sundar (@washisundar555) ప్రాక్టీస్‌లో పాల్గొన్న యువ భారత ఆటగాళ్లు ఎంతో హుషారుగా, ఆత్మ విశ్వాసంతో కనిపించారు. మధ్యలో దొరికిన కొద్దిపాటి ఖాళీ సమయంలో బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ సేద తీరారు. హార్ధిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్‌లు సిక్స్ ప్యాక్ బాడీలతో బీచ్ నుంచి బయటికి వస్తున్న వీడియోను వాషింగ్టన్ సుందర్ ఇన్‌స్టాలో షేర్ చేయగా, ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అభిమానులు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొందరు పాజిటివ్‌గా స్పందిస్తుంటే, మరికొందరు నెగిటివ్ కామెంట్స్‌తో రాక్షసానందం పొందుతున్నారు. ఇంకొందరేమో.. ఫిట్నెస్ విషయంలో శ్రద్ధ తీసుకునే భారత క్రికెటర్లు.. న్యూజిలాండ్‌పై గెలిచేందుకు కూడా అంతే శ్రద్ధతో కృషి చేయాలని సూచిస్తున్నారు. కాగా, రేపు జరుగబోయే తొలి టీ20 భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో సీనియర్ల గైర్హాజరీ నేపథ్యంలో టీ20 జట్టుకు హార్ధిక్ పాండ్యా.. వన్డే టీమ్‌కు శిఖర్ ధవన్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. టీ20 సిరీస్‌కు భారత జట్టు.. హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. వన్డే సిరీస్‌కు టీమిండియా.. శిఖర్ ధావన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్‌కీపర్), శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్. న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే (వికెట్ కీపన్), లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ (వన్డే). టామ్ లాథమ్ (వన్డే), డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి (టీ20). టిమ్ సౌతీ, బ్లెయిర్ టిక్నర్ (టీ20) టీ20 సిరీస్ షెడ్యూల్.. ►మొదటి టీ20: నవంబరు 18, శుక్రవారం- స్కే స్టేడియం, వెల్లింగ్టన్ ►రెండో టీ20: నవంబరు 20, ఆదివారం- బే ఓవల్, మౌంట్ మాంగనీ ►మూడో టీ20: నవంబరు 22, మంగళవారం- మెక్లీన్ పార్క్, నేపియర్ ►మ్యాచ్‌ల ఆరంభ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు(భారత కాలమానం ప్రకారం) వన్డే సిరీస్ షెడ్యూల్.. ►మొదటి వన్డే: నవంబరు 25, శుక్రవారం- ఈడెన్ పార్క్, ఆక్లాండ్ ►రెండో వన్డే: నవంబరు 27, ఆదివారం- సెడాన్ పార్క్, హామిల్టన్ ►మూడో వన్డే: నవంబరు 30, బుధవారం- హాగ్లే ఓవల్, క్రైస్ట్‌చర్చ్ ►మ్యాచ్‌ల ఆరంభ సమయం: ఉదయం 7 గంటలకు(భారత కాలమానం ప్రకారం) చదవండి: కెప్టెన్ మార్పు వద్దు.. ఇలా చేస్తే టీమిండియాకు తిరుగే ఉండదు..! చదవండి: కివీస్‌తో తొలి టి20.. ప్రాక్టీస్‌లో మునిగిన టీమిండియా ఆటగాళ్లు (ఫొటోలు) -
మాథ్యూ వేడ్ తొండాట.. క్యాచ్ పట్టబోయిన మార్క్ వుడ్‌ను తోసేసి..!
AUS VS ENG 1st T20: 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ఇంగ్లండ్ ఇవాళ (అక్టోబర్ 9) తొలి మ్యాచ్ ఆడింది. ఆథ్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. ఓపెనర్లు జోస్ బట్లర్ (32 బంతుల్లో 68; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), అలెక్స్ హేల్స్ (51 బంతుల్లో 84; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో ఆసీస్ వీరోచితంగా పోరాడి ఓడింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ లక్ష్యాన్ని ఛేదిస్తున్న సందర్భంగా చోటు చేసుకున్న ఓ సన్నివేశం ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. వుడ్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్ మూడవ బంతికి వేడ్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. క్యాచ్ అందుకునేందుకు వుడ్ స్ట్రయికర్ ఎండ్‌కు పరుగెడుతుండగా.. అప్పటికీ క్రీజ్ దిశగా బయల్దేరిన వేడ్.. వుడ్‌ను ఉద్దేశపూర్వకంగా గట్టిగా తోసేసి క్యాచ్ నేలపాలయ్యేలా చేశాడు. The CEO of Sportsman Spirit, M Wade, stopping M Wood from catching the ball!!The OZs@azkhawaja1 pic.twitter.com/zAsJl6gpqz— WaQas Ahmad (@waqasaAhmad8) October 9, 2022 ఐసీసీ నిబంధనల ప్రకారం క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నిస్తున్న ఫీల్డర్ని ఉద్దేశపూర్వకంగా ఆపితే సదరు బ్యాటర్‌ని అవుట్‌గా ప్రకటిస్తారు. అయితే ఇక్కడ ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అప్పీల్ చేయకపోవడంతో చేసేదేమీ లేక అంపైర్లు మ్యాచ్‌ను కొనసాగించారు. మ్యాచ్ అనంతరం బట్లర్‌ను ఈ విషయమై ప్రశ్నించగా.. ఆసీస్ పర్యటనలో ఈ సిరీస్‌తో పాటు వరల్డ్‌కప్ కూడా ఆడాల్సి ఉన్నందున విషయాన్ని పెద్దది చేయదల్చుకోలేదని సమాధానం చెప్పాడు. కాగా, ఇంగ్లండ్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరంభం నుంచే ప్రత్యర్ధిపై ఎదురుదాడికి దిగింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (44 బంతుల్లో 73; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆతర్వాత మిచెల్ మార్ష్ (26 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టోయినిస్ (15 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఓ దశలో ఆసీస్ సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే ఆఖర్లో మార్క్ వుడ్ (3/34) వరుస క్రమంలో వికెట్లు తీయడంతో ఆసీస్ లక్ష్యానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసి 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. -
ఉతికి ఆరేసిన బట్లర్, హేల్స్.. వణికించి ఓడిన ఆస్ట్రేలియా
టీ20 వరల్డ్‌కప్‌కు ముందు 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ఇంగ్లండ్ జట్టుకు మాంచి బూస్ట్ అప్ విజయం దక్కింది. సిరీస్‌లో భాగంగా ఆతిధ్య జట్టుతో ఇవాళ (అక్టోబర్ 9) జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసిన ఇంగ్లండ్ ఎట్టకేలకు గెలుపొందింది. బట్లర్, హేల్స్ విధ్వంసం.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. ఓపెనర్లు జోస్ బట్లర్ (32 బంతుల్లో 68; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), అలెక్స్ హేల్స్ (51 బంతుల్లో 84; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరలెవెల్లో రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. వీరిద్దరు తొలి వికెట్‌కు 11.2 ఓవర్లలో 132 పరుగులు జోడించగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు వరుసగా విఫలమయ్యారు. ఆఖర్లో క్రిస్ వోక్స్ (5 బంతుల్లో 13 నాటౌట్) బౌండరీ, సిక్సర్ బాదడంతో ఇంగ్లండ్ 200 స్కోర్‌ను క్రాస్ చేసింది. ఆసీస్ బౌలర్లలో స్వెప్సన్ 3, కేన్ రిచర్డ్సన్, డేనియల్ సామ్స్, స్టోయినిస్ తలో వికెట్ పడగొట్టారు. చెలరేగిన వార్నర్, స్టోయినిస్.. వణికించి ఓడిన ఆస్ట్రేలియా 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరంభం నుంచే ప్రత్యర్ధిపై ఎదురుదాడికి దిగింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (44 బంతుల్లో 73; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆతర్వాత మిచెల్ మార్ష్ (26 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టోయినిస్ (15 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఓ దశలో ఆసీస్ సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే ఆఖర్లో మార్క్ వుడ్ (3/34) వరుస క్రమంలో వికెట్లు తీయడంతో ఆసీస్ లక్ష్యానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసి 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ ఆసీస్ పతనాన్ని శాశించగా.. రీస్ టాప్లే, సామ్ కర్రన్ తలో 2 వికెట్లు, ఆదిల్ రషీద్ ఓ వికెట్ పడగొట్టారు. భారీ అర్ధశతకం సాధించి ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించడానికి పునాది వేసిన హేల్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్‌లో తదుపరి మ్యాచ్ బుధవారం (అక్టోబర్ 12) జరుగనుంది. -
India Vs South Africa 1st T20: సఫారీతో ‘సై’
తిరువనంతపురం: ఆస్ట్రేలియా గడ్డపై వచ్చే నెలలో జరిగే టి20 ప్రపంచకప్ కోసం గట్టి ప్రత్యర్థులతో ఏర్పాటు చేసిన సిరీస్‌లలో ఒకటి ఆస్ట్రేలియాపై భారత్ గెలిచింది. ఇప్పుడు రెండు రోజుల వ్యవధిలోనే సఫారీతో రెండో వేటకు సిద్ధమైంది. మేటి జట్టయిన దక్షిణాఫ్రికాతో మూడు టి20ల సిరీస్‌లో రోహిత్ బృందం తలపడనుంది. బుధవారం జరిగే తొలి మ్యాచ్‌లో శుభారంభమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీ హోరాహోరీ పోటీ కోసమే కాదు... తుది కసరత్తుకు ఆఖరి సమరంగా టీమ్ మేనేజ్మెంట్కు ఉపయోగపడనుంది. ఇప్పటికే 11 మంది ఎవరనే ప్రాథమిక అంచనాకు వచ్చిన జట్టు మేనేజ్మెంట్కు డెత్ ఓవర్ల బెంగ పట్టి పీడిస్తోంది. బుమ్రా వచ్చాక కూడా ఆఖరి ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం బౌలింగ్ దళంపై కంగారు పెట్టిస్తోంది. ఈ సమస్యను అధిగమిస్తేనే కసరత్తు పూర్తి అవుతుంది. బ్యాటింగ్ భళా భారత బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. మరీ ముఖ్యంగా అనుభవజ్ఞులైన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఫామ్‌లో ఉండటం కాదు... సూపర్ ఫామ్‌లోకి వచ్చేశారు. ఇన్నేళ్లయినా ఇద్దరి షాట్లు కుర్రాళ్లను మించి చుక్కలు చూపిస్తున్నాయి. సూర్యకుమార్ ఇప్పుడు మెరుపుల్లో తురుపుముక్కలా మారాడు. ఆసీస్‌తో ఆఖరి మ్యాచ్ గెలుపునకు అతని ఇన్నింగ్సే అసలైన కారణం. రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్ ఇలా బ్యాటింగ్‌లో అంతా మెరుగ్గానే ఉంది. నిలకడగా మెరిపిస్తోంది. ఈ సిరీస్ నుంచి హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్‌లకు విశ్రాంతి ఇచ్చారు. బౌలర్లే కీలకమైన దశలో డీలాపడటం, యథేచ్ఛగా పరుగులు కాదు వరుసబెట్టి బౌండరీలు, సిక్సర్లు ఇచ్చుకోవడం జట్టు భారీ స్కోర్లను కూడా సులువుగా కరిగిస్తున్నాయి. సవాల్‌కు సిద్ధం జోరు మీదున్న భారత్‌కు దీటైన సవాల్ విసిరేందుకు పర్యాటక దక్షిణాఫ్రికా జట్టు సిద్ధమైంది. ఓపెనింగ్‌లో డికాక్, కెప్టెన్ బవుమాలతో పాటు మిడిలార్డర్లో హార్డ్ హిట్టర్లు మార్క్రమ్, మిల్లర్లతో బ్యాటింగ్ లైనప్ ఆతిథ్య జట్టులాగే పటిష్టంగా ఉంది. ఇందులో ఏ ఇద్దరు భారత్ బౌలింగ్‌పై మెరిపించినా కష్టాలు తప్పవు. ఇక సఫారీ బౌలింగ్ ఒకింత మనకంటే మెరుగనే చెప్పాలి. ప్రిటోరియస్, రబడ, నోర్జేలు అద్భుతంగా రాణిస్తున్నారు. టి20 సమరానికి సరైన సరంజామాతోనే దక్షిణాఫ్రికా భారత్‌కు వచ్చింది. ఆసీస్‌పై గెలిచిన ధీమాతో ఏమాత్రం ఆదమరిచినా టీమిండియాకు కోలుకోలేని దెబ్బ తప్పదు. భారత క్రికెటర్లపై పూల వాన కేరళ అభిమానులు భారత క్రికెటర్లకు అడుగడుగునా జేజేలు పలికారు. విమానం దిగగానే మొదలైన హంగామా బస చేసే హోటల్ వద్దకు చేరేదాకా సాగింది. అక్కడ ఆటగాళ్లపై పూల వాన కురిసింది. కేరళ కళాకారుల నుంచి సంప్రదాయ స్వాగతం లభించింది. -
హార్ధిక్, రాహుల్ మెరుపులు వృధా.. తొలి టి20లో టీమిండియా ఓటమి
ఆస్ట్రేలియాపై టి20ల్లో అత్యధిక స్కోరు సాధించిన ఆనందం భారత్‌కు దక్కలేదు. హార్దిక్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ దూకుడైన బ్యాటింగ్‌తో 208 పరుగులు సాధించినా అవి విజయానికి సరిపోలేదు. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్, వేగవంతమైన అవుట్ ఫీల్డ్‌పై అదే రీతిలో జవాబిచ్చిన ఆస్ట్రేలియా భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో సఫలమైంది. ఆరంభంలో గ్రీన్, చివర్లో వేడ్ చెలరేగి ఆ జట్టుకు సిరీస్‌లో ఆధిక్యాన్ని అందించారు. ఇద్దరు ప్రధాన పేసర్లు భువనేశ్వర్, హర్షల్ కలిపి ఒక్క వికెట్ తీయకుండా 8 ఓవర్లలో 101 పరుగులు ఇవ్వడం టీమిండియా ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. తాజా మ్యాచ్ ఫలితం ప్రపంచకప్‌కు ముందు భారత్ సరిదిద్దుకోవాల్సిన లోపాలను గుర్తు చేసింది. మొహాలి: భారత్‌పై టి20 సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్ నాలుగు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 71 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), కేఎల్ రాహుల్ (35 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా, సూర్యకుమార్ యాదవ్ (25 బంతుల్లో 46; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కామెరాన్ గ్రీన్ (30 బంతుల్లో 61; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), మాథ్యూ వేడ్ (21 బంతుల్లో 45 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టీవ్ స్మిత్ (24 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇరు జట్ల మధ్య రెండో టి20 శుక్రవారం నాగపూర్‌లో జరుగుతుంది. రాహుల్ అర్ధ సెంచరీ... భారత్ ఇన్నింగ్స్ ధాటిగా ప్రారంభమైనా... తక్కువ వ్యవధిలోనే రోహిత్ (11), కోహ్లి (2) వెనుదిరిగారు. అయితే మరో ఎండ్‌లో రాహుల్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించాడు. తన స్ట్రయిక్‌రేట్‌పై వస్తున్న విమర్శలకు సమాధానాలివ్వాలనే కసి అతనిలో కనిపించింది. సూర్యకుమార్ కూడా తనదైన శైలిలో మెరుపు షాట్లు ఆడటంతో స్కోరు వేగంగా దూసుకుపోయింది. పవర్‌ప్లేలో భారత్ 46 పరుగులు చేయగా, 10 ఓవర్లలో స్కోరు 86 పరుగులకు చేరింది. 32 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన రాహుల్ ఈ క్రమంలో అంతర్జాతీయ టి20ల్లో 2 వేల పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. అయితే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అతను వెనుదిరగ్గా, జంపా ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన సూర్యకుమార్ త్రుటిలో అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. ఆ తర్వాత హార్దిక్ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్ భారీ స్కోరు సాధించగలిగింది. చివరి 7 ఓవర్లలో భారత్ 89 పరుగులు సాధించగా, ఇందులో హార్దిక్ ఒక్కడే 69 పరుగులు చేయడం విశేషం. హాజల్‌వుడ్ ఓవర్లో 2 ఫోర్లు, కమిన్స్ ఓవర్లో 6, 4 కొట్టిన అతను 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో చివరి 3 బంతులను అతను వరుసగా 6, 6, 6 బాది ఘనంగా ఇన్నింగ్స్‌ను ముగించాడు. టి20ల్లో ఆస్ట్రేలియాపై భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. గాయం నుంచి కోలుకున్న బుమ్రాను ముందు జాగ్రత్తగా భారత్ ఈ మ్యాచ్‌లో ఆడించలేదు. వేడ్ మెరుపులు... భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతినే సిక్సర్‌గా మలచిన ఆరోన్ ఫించ్ (13 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్) అతని మలి ఓవర్లో 3 ఫోర్లు కొట్టాడు. మరోవైపు మూడున్నరేళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడిన ఉమేశ్ యాదవ్ తన తొలి ఓవర్లోనే గ్రీన్‌కు నాలుగు ఫోర్లు సమర్పించుకున్నాడు. ఫించ్‌ను అవుట్ చేసి అక్షర్ ప్రత్యర్థి జోరుకు బ్రేక్ వేసినా... గ్రీన్, స్మిత్ భాగస్వామ్యం (40 బంతుల్లో 70 పరుగులు) ఆసీస్‌ను విజయం వైపు నడిపించింది. అక్షర్, రాహుల్ చెరో క్యాచ్ వదిలేయడం కూడా ప్రత్యర్థికి కలిసొచ్చింది. చహల్ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్ కొట్టిన గ్రీన్, అక్షర్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో 26 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లలో స్కోరు 109 పరుగులకు చేరింది. విజయానికి 60 బంతుల్లో 109 పరుగులు చేయాల్సి ఉండగా, 14 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు తీసి భారత్ కాస్త ఒత్తిడి పెంచింది. గ్రీన్‌ను అక్షర్ అవుట్ చేయగా... ఉమేశ్ ఒకే ఓవర్లో స్మిత్, మ్యాక్స్‌వెల్ (1)లను వెనక్కి పంపాడు. ఈ రెండు నిర్ణయాలు డీఆర్ఎస్ ద్వారానే భారత్‌కు అనుకూలంగా రాగా, ఇన్‌గ్లిస్ (17) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అయితే వేడ్ మెరుపు బ్యాటింగ్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. భువీ ఓవర్లో రెండు ఫోర్ల తర్వాత హర్షల్ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన అతను... భువీ వేసిన 19వ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో ఆసీస్ గెలుపు ఖాయమైంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) స్కోరు వివరాలు... భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) ఎలిస్ (బి) హాజల్‌వుడ్ 55; రోహిత్ (సి) ఎలిస్ (బి) హాజల్‌వుడ్ 11; కోహ్లి (సి) గ్రీన్ (బి) ఎలిస్ 2; సూర్యకుమార్ (సి) వేడ్ (బి) గ్రీన్ 46; హార్దిక్ (నాటౌట్) 71; అక్షర్ (సి) గ్రీన్ (బి) ఎలిస్ 6; కార్తీక్ (ఎల్బీ) (బి) ఎలిస్ 6; హర్షల్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–21, 2–35, 3–103, 4–126, 5–146, 6–176. బౌలింగ్: హాజల్‌వుడ్ 4–0–39–2, కమిన్స్ 4–0–47–0, జంపా 4–0–36–0, ఎలిస్ 4–0–30–3, గ్రీన్ 3–0–46–1, మ్యాక్స్‌వెల్ 1–0–10–0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఫించ్ (బి) అక్షర్ 22; గ్రీన్ (సి) కోహ్లి (బి) అక్షర్ 61; స్మిత్ (సి) కార్తీక్ (బి) ఉమేశ్ 35; మ్యాక్స్‌వెల్ (సి) కార్తీక్ (బి) ఉమేశ్ 1; ఇన్‌గ్లిస్ (బి) అక్షర్ 17; టిమ్ డేవిడ్ (సి) హార్దిక్ (బి) చహల్ 18; వేడ్ (నాటౌట్) 45; కమిన్స్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.2 ఓవర్లలో 6 వికెట్లకు) 211. వికెట్ల పతనం: 1–39, 2–109, 3–122, 4–123, 5–145, 6–207. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–52–0, ఉమేశ్ యాదవ్ 2–0–27–2, అక్షర్ పటేల్ 4–0–17–3, చహల్ 3.2–0–42–1, హర్షల్ పటేల్ 4–0–49–0, హార్దిక్ పాండ్యా 2–0–22–0. -
సికందర్ రాజా ఊచకోత.. బంగ్లాకు షాకిచ్చిన జింబాబ్వే
Sikander Raja: స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో జింబాబ్వేకు శుభారంభం దక్కింది. శనివారం (జులై 30) జరిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే సంచలన ప్రదర్శన నమోదు చేసి 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. వెస్లీ మదెవెరె (46 బంతుల్లో 67 రిటైర్డ్ హర్ట్; 9 ఫోర్లు), సికందర్ రాజా (26 బంతుల్లో 65 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలు సాధించి జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. సీన్ విలియమ్స్ (19 బంతుల్లో 33; 4 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. ముఖ్యంగా సికందర్ రాజా బంగ్లా బౌలర్లపై శివాలెత్తి సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. దొరికిన బంతిని దొరికినట్లు బాది ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ 2 వికెట్లు పడగొట్టగా.. మొసద్దెక్ హొసేన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం ఛేదనలో బంగ్లా ఆటగాళ్లు కూడా గట్టిగానే ప్రయత్నించినప్పటికీ విజయానికి 17 పరుగుల దూరంలోనే (188/6) నిలిచిపోయారు. కెప్టెన్ నరుల్ హసన్ (26 బంతుల్లో 42 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు), లిటన్ దాస్ (19 బంతుల్లో 32; 6 ఫోర్లు) జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. జింబాబ్వే బౌలర్లలో లూక్ జాంగ్వి 2 వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్ ఎంగరవా, వెల్లింగ్టన్ మసకద్జా, సికందర్ రాజా తలో వికెట్ సాధించారు. సిరీస్‌లో రెండో టీ20 రేపు (జులై 31) జరుగనుంది. అనంతరం ఆగస్ట్ 2న మూడో టీ20.. 5, 7, 10 తేదీల్లో 3 వన్డేలు జరుగనున్నాయి. చదవండి: రోహిత్‌కు జతగా ధవన్ ఉండగ, ఈ ప్రయోగాలు ఎందుకు దండగ..! -
రోహిత్‌కు జతగా ధవన్ ఉండగ, ఈ ప్రయోగాలు ఎందుకు దండగ..!
ఇటీవలి కాలంలో టీమిండియా పొట్టి ఫార్మట్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నా ఓ విషయం మాత్రం అభిమానులను పెద్ద ఎత్తున కలవరపెడుతుంది. సిరీస్‌కు ఓ కెప్టెన్ మారుతుండటంతో ఇప్పటికే దిక్కుతోచని స్థితిలో ఉన్న సగటు టీమిండియా అభిమానిని.. కొత్తగా ఓపెనింగ్ సమస్య జట్టు పీక్కునేలా చేస్తుంది. ఏడాది కాలంలో టీమిండియా ఏకంగా తొమ్మిది ఓపెనింగ్ జోడీలను మార్చడమే అభిమాని ఈ స్థితికి కారణంగా మారింది. తాజాగా విండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు రోహిత్ శర్మకు జతగా సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగడంతో అభిమానులు ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా హైలైట్ చేస్తున్నారు. అన్నీ సజావుగా సాగుతూ, జట్టు వరుస విజయాలు సాధిస్తున్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు అవసరమా అని టీమ్ మేనేజ్మెంట్ను ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ వైఖరిని తప్పుబడుతున్నారు. ఓ జోడీకి కనీసం నాలుగైదు అవకాశాలైనా ఇవ్వకుండానే మార్చేయడం పద్దతి కాదని చురకలంటిస్తున్నారు. పేరుకు మాత్రమే రోహిత్-కేఎల్ రాహుల్ రెగ్యులర్ ఓపెనర్లని, వీరిద్దరిలో ఒకరు అందుబాటులో ఉంటే మరొకరు ఉండరన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇలాంటప్పుడు ఏదైన కొత్త జోడీని తయారు చేయాల్సిందిపోయి, వరుస పెట్టి ఓపెనర్లను మార్చడం ఎంతమాత్రం సమంజసంకాదని అభిప్రాయపడుతున్నారు. కొందరైతే రోహిత్‌కు జతగా శిఖర్ ధవన్ ఉండగా.. ఈ ప్రయోగాలెందుకు దండగ అంటూ అని అంటున్నారు. ఎలాగూ ధవన్ ఇటీవలి కాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి రోహిత్‌కు జతగా అతన్ని పర్మనెంట్‌గా ఆడించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట ఈ డిస్కషన్ హాట్ హాట్‌గా సాగుతుంది. 12 నెలల కాలంలో టీమిండియా మార్చిన ఓపెనింగ్ జోడీలు.. 1. రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్, 2. కేఎల్ రాహుల్-ఇషాన్ కిషన్ 3. రోహిత్ శర్మ-ఇషాన్ కిషన్ 4. రుతురాజ్ గైక్వాడ్-ఇషాన్ కిషన్ 5. సంజు శాంసన్-రోహిత్ శర్మ 6. దీపక్ హుడా-ఇషాన్ కిషన్ 7. ఇషాన్ కిషన్-సంజు శాంసన్ 8. రోహిత్ శర్మ-రిషభ్ పంత్ 9. రోహిత్ శర్మ-సూర్యకుమార్ యాదవ్ చదవండి: Ind Vs WI: నిజంగా వాళ్లిద్దరు గ్రేట్! ప్రపంచకప్ జట్టులో మనిద్దరం ఉండాలి! -
విండీస్‌తో తొలి టీ20.. టీమిండియా ఎలా ఉండబోతుందంటే..?
విండీస్‌తో 3 వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసి జోరుమీదున్న టీమిండియా.. రేపటి (జులై 29) నుంచి ప్రారంభంకాబోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం సమాయత్తమవుతోంది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా రేపు ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరుగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియాను ముందుండి నడిపించనుండగా.. వికెట్కీపర్లు దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ తిరిగి జట్టులో చేరనున్నారు. వన్డేల్లో విండీస్‌ను వైట్‌వాష్ చేసిన జట్టులోని చాలామంది సభ్యులు ఈ సిరీస్‌ను అందుబాటులో ఉండకపోవడంతో జట్టు కూర్పు ఎలా ఉండబోతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుత సమీకరణల ప్రకారం చూస్తే.. రోహిత్ శర్మకు జతగా రిషభ్ పంత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. కరోనా కారణంగా రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ సిరీస్‌కు దూరంగా ఉండటంతో పంత్‌కు ప్రమోషన్ లభించే ఛాన్స్ ఉంది. ఈ ఆప్షన్ వల్ల దినేశ్ కార్తీక్‌కు కూడా తుది జట్టులో చోటు లభిస్తుంది. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌ల బెర్తులు దాదాపుగా ఖరారేనని చెప్పాలి. ఆల్‌రౌండర్ల కోటాలో దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌లు తుది జట్టులో ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బౌలర్ల విషయానికొస్తే.. హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్‌లకు తుది జట్టులో అవకాశం దక్కవచ్చు. భారత తుది జట్టు(అంచనా).. రోహిత్ శర్మ(కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్‌కీపర్), శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్ చదవండి: విండీస్‌తో టీ20 సిరీస్.. టీమిండియాకు భారీ షాక్! -
దినేశ్ కార్తీక్‌కు వింత అనుభవం.. తన డెబ్యూ మ్యాచ్‌లో ప్లేయర్ ఇప్పుడు..!
Dinesh Karthik: ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టీ20 సందర్భంగా టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌కు వింత అనుభవం ఎదురైంది. తన వన్డే డెబ్యూ మ్యాచ్‌లో ప్రత్యర్ధి ఆటగాడిగా ఉన్న అలెక్స్ వార్ఫ్ (ఇంగ్లండ్) ఈ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్‌గా బరిలో నిలిచాడు. 2004లో డీకే ( నాడు 19 ఏళ్లు) వన్డే అరంగేట్రం చేసిన మ్యాచ్‌లో (లార్డ్స్) అలెక్స్ (29) ఇంగ్లండ్ తుది జట్టులో బౌలర్‌గా ఉన్నాడు. ఆ మ్యాచ్ డీకేకు తొలి మ్యాచ్ అయితే అలెక్స్‌కు వన్డేల్లో మూడవది. ఆ మ్యాచ్‌లో డీకే.. అలెక్స్ క్యాచ్ కూడా పట్టాడు. ఈ ఆసక్తికర పరిణామం నేపథ్యంలో నెటిజన్లు డీకేపై సెటైర్లు వేస్తున్నారు. క్లాస్ మేట్ టీచర్ అయితే ఎలా ఉంటదో.. ప్రస్తుతం డీకే పరిస్థితి అలాగే ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో డీకే నిత్య యువకుడు, పోరాట యోధుడు, పడి లేచని కెరటం అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇంగ్లండ్ తరఫున 13 వన్డేల్లో 18 వికెట్లు పడగొట్టిన అలెక్స్.. 2011లో ఫీల్డ్ అంపైర్‌గా మారాడు. అలెక్స్ ఇప్పటి వరకు 2 టెస్టులు, 8 వన్డేలు, 27 టీ20 మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించాడు. కాగా, దినేశ్ కార్తీక్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన వారంతా ప్రస్తుతం ఆటకు గుడ్‌బై చెప్పి వివిధ హోదాల్లో ఉన్నారు. డీకే సమకాలీకుల్లో చాలా మంది కామెంటేటర్లుగా, కోచ్‌లుగా, అంపైర్లుగా వ్యవహరిస్తుంటే డీకే మాత్రం ఇంకా ఆటగాడిగానే కొనసాగుతున్నాడు. సరైన అవకాశాలే లేక మధ్యలో కొద్దికాలం పాటు కామెంటేటర్‌గా వ్యవహరించిన డీకే.. ఐపీఎల్ 2022 పర్ఫామెన్స్ కారణంగా మూడేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చదవండి: సిరీస్ విజయమే లక్ష్యంగా... కోహ్లికి పరీక్ష! -
IND VS ENG: తొలి టీ20కి కోచ్‌గా లక్ష్మణ్.. ద్రవిడ్‌కు ఏమైంది..?
సౌతాంప్టన్ వేదికగా జులై 7న ఇంగ్లండ్‌తో జరుగబోయే తొలి టీ20కు టీమిండియా హెడ్ కోచ్‌గా ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడని తెలుస్తోంది. రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ ముగిసిన (జులై 5) రోజు గ్యాప్‌లోనే తొలి టీ20 జరుగనుండటంతో రెగ్యులర్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ డిసైడ్ చేసినట్లు సమాచారం. దీంతో భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టీ20కు లక్ష్మణ్ కోచింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. లక్ష్మణ్.. ఇటీవల ముగిసిన ఐర్లాండ్ పర్యటనలో తొలిసారి టీమిండియా (హార్ధిక్ సేన) హెడ్ కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగబోయే తొలి టీ20కు కోచ్‌తో పాటు సీనియర్ సభ్యులు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా కూడా జట్టుకు దూరంగా ఉంటున్నారు. ద్రవిడ్‌తో పాటు రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్‌లో భాగమైన వీరందరికి కూడా విశ్రాంతినిచ్చేందకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీసీసీఐ ఇదివరకే జట్లను కూడా ప్రకటించింది. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా జట్టులో చేరితే రుతురాజ్, సంజూ శాంసన్, అర్షదీప్ సింగ్, రాహుల్ త్రిపాఠి, వెంకటేశ్ అయ్యర్ జట్టు నుంచి తప్పుకోనున్నారు. తొలి మ్యాచ్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, చహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ 2, 3 టీ20లకు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవి జడేజా, చహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్ మూడు టీ20లకు ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, రిచర్డ్ గ్లీసన్, క్రిస్ జోర్డాన్, లియమ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, టైమాల్ మిల్స్, మాథ్యూ పార్కిన్సన్, జేసన్ రాయ్, రీస్ టాప్లే, డేవిడ్ విల్లే, ఫిల్ సాల్ట్ చదవండి: IND vs ENG: ఒక్కరోజులో అంతా ఉల్టా పల్టా! భారత్ అద్భుతం చేయగలదా? -
IND VS IRE 1st T20: భువీ ఖాతాలో అరుదైన రికార్డు
Bhuvaneshwar Kumar: టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఆండ్రూ బల్బిర్నీ వికెట్ పడగొట్టడం ద్వారా భువీ పొట్టి ఫార్మాట్ పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు (34 వికెట్లు) సాధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. భువీకి ముందు ఈ రికార్డు విండీస్ స్పిన్నర్ శామ్యూల్ బద్రీ, న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీల పేరిట ఉండేది. వీరిద్దరు పవర్ ప్లేలో 33 వికెట్లు సాధించారు. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భువీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఫలితంగా హార్ధిక్ సేన 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భువీ తొలి ఓవర్ ఐదో బంతికే ఐరిష్ కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన భువీ కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. భువీ తన స్పెల్‌లో మెయిడిన్ కూడా వేయడం విశేషం. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ తొలి ఓవర్లో భువీ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఓ అద్భుతం చోటు చేసుకుంది. ఈ ఓవర్లో భువీ బౌలింగ్ చేస్తుండగా స్పీడోమీటర్ మూడు సార్లు గంటకు 200కు పైగా కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరినట్లు చూపించింది. ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్‌కు వేసిన బంతి 201 Km/h, అదే విధంగా బల్బిర్నీ ఎదుర్కొన్న రెండు బంతులు 208, 201 కిమీ వేగంతో విసిరినట్లుగా రికార్డైంది. అయితే, భువీ నిజంగా ఈ ఫీట్ నమోదు చేశాడా లేదంటే సాంకేతిక తప్పిదం కారణంగా స్పీడోమీటర్ ఇలా చూపిందా అన్న విషయం తెలియాల్సి ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్(161.3 km/h) పేరిట నమోదై ఉంది. చదవండి: 'అతడు అద్భుతమైన ఆటగాడు.. త్వరలోనే ఐపీఎల్లో ఆడుతాడు' -
ఐర్లాండ్‌కు చుక్కలు చూపించిన భారత్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
డబ్లిన్: ఐర్లాండ్ గడ్డపై భారత్ శుభారంభం చేసింది. వర్షంతో 12 ఓవర్లకు కుదించిన తొలి టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని భారత్ 9.2 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసి ఛేదించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (11 బంతుల్లో 26; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా ఆడాడు. మరో ఓపెనర్ దీపక్ హుడా (29 బంతుల్లో 47 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 24; 1 ఫోర్, 3 సిక్సర్లు) భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. హుడా, పాండ్యా మూడో వికెట్‌కు చకచకా 64 పరుగులు జోడించారు. హార్దిక్ అవుటయ్యాక దినేశ్ కార్తీక్ (5 నాటౌట్)తో కలిసి హుడా మిగతా లాంఛనాన్ని పూర్తిచేశాడు. అంతకుముందు టాస్ నెగ్గిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా... తొలుత ఐర్లాండ్ నిర్ణీత 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. భారత సీమర్లు హార్దిక్, భువనేశ్వర్, అవేశ్ టాపార్డర్‌పై తలా ఒక దెబ్బ వేశారు. దీంతో ఓపెనర్లు స్టిర్లింగ్ (4), బల్బిర్నీ (0) సహా గ్యారెత్ (8) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అలా ఐర్లాండ్ 22 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది. ఈ దశలో హ్యారీ టెక్టర్ (33 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరిగా పోరాటం చేశాడు. టక్కర్ (18; 2 సిక్సర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 50 పరుగులు జోడించాడు. అనంతరం డాక్ రెల్ (4)తో కలిసి జట్టు స్కోరును వంద దాటించాడు. భారత బౌలర్లలో భువీ, పాండ్యా, అవేశ్, చహల్ తలా ఒక వికెట్ తీశారు. రేపు రెండో టి20 మ్యాచ్ ఇక్కడే జరుగుతుంది. -
ఐర్లాండ్‌పై టీమిండియా ఘన విజయం
ఐర్లాండ్‌పై టీమిండియా ఘన విజయం ఐర్లాండ్‌తో జరగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధిచింది. వర్షం కారణంగా 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత ఐర్లాండ్ 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లలో హ్యారీ టెక్టర్(64) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో భువీ, పాండ్యా, అవేశ్, చహల్ తలా ఒక వికెట్ తీశారు. ఇక 109 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 9.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో దీపక్ హుడా(47), ఇషాన్ కిషన్(26), హార్ధిక్ పాండ్యా(24) పరుగులతో రాణించారు. మ్యాచ్ ప్రారంభానికి వరుణుడి ఆటంకం టాస్ తర్వాత వర్షం మొదలు కావడంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గాక మ్యాచ్ ప్రారంభంకానుంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని యువ భారత జట్టు ఇవాళ (జూన్ 26) ఐర్లాండ్‌తో తొలి టీ20 ఆడనుంది. డబ్లిన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా: హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), చహల్, ఆవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్ ఐర్లాండ్: ఆండ్రూ బాల్బిర్నీ (కెప్టెన్), హ్యారీ టెక్టార్, గ్యారీ డెలానీ, పాల్ స్టిర్లింగ్, లోర్కాన్ టక్కర్, మార్క్ అడైర్, జాషువా లిటిల్, జార్జ్ డాక్రెల్, ఆండీ మెక్‌బ్రైన్, కానర్ ఆల్ఫర్ట్, క్రెయిగ్ యంగ్ -
IND VS SL 1st T20: చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్
Rohit Sharma: లంకతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు (3300) చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన గప్తిల్ (3299) పేరిట ఉండగా.. హిట్‌మ్యాన్ ఆ రికార్డును బద్ధలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 32 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 44 పరుగులు చేసి లహిరు కుమార బౌలింగ్‌లో ఔటయ్యాడు. కెరీర్లో ఇప్పటివరకు 123 టీ20లు ఆడిన రోహిత్.. 32.74 సగటుతో 3307 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పొట్టి క్రికెట్లో అత్యధిక పరుగుల జాబితాలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (3296) మూడో స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే, శ్రీలంకతో తొలి టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఇషాన్ కిషన్ (56 బంతుల్లో 89; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (28 బంతుల్లో 57; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (32 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 44) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో శ్రీలంక 15 ఓవర్లలో 90 పరుగులు చేసి సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. చదవండి: ICC World Cup 2022: ఐసీసీ కీలక నిర్ణయం.. 9 మంది ప్లేయర్స్‌తో బరిలోకి దిగవచ్చు..! -
ఇషాన్, శ్రేయస్‌ల విధ్వంసం.. తొలి టీ20లో టీమిండియా ఘన విజయం
-
Virat Kohli: చరిత్ర తిరగరాసేందుకు మరో 73 పరుగుల దూరంలో..
రికార్డుల రారాజు విరాట్ కోహ్లి మరో ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ(ఫిబ్రవరి 16) వెస్టిండీస్‌తో జరిగే తొలి టీ20లో ఆ రికార్డును బద్దలు కొట్టేందుకు ఈ టీమిండియా మాజీ కెప్టెన్ సిద్ధంగా ఉన్నాడు. ఇవాల్టి మ్యాచ్ లో కోహ్లి మరో 73 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గుప్టిల్ 3299 పరుగులతో తొలి స్ధానంలో ఉండగా, ప్రస్తుతం కోహ్లి 3227 పరుగులతో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. ఇక ఇదే జాబితాలో 3197 పరుగులతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్ధానంలో నిలిచాడు. రోహిత్ శర్మ సైతం ఈ మ్యాచ్ లో సెంచరీ(103 పరుగులు) సాధిస్తే పొట్టి క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. కాగా, కోల్‌కతా వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నేటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ లు రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. నేటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను విజయంతో ప్రారంభించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. అయితే టీమిండియా ఆడిన చివరి 6 మ్యాచ్‌ల్లో ఒక్కటి కూడా ఓడిపోకపోవడం విశేషం. మరోవైపు రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఇంత వరకు ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. దీంతో ఈ సిరీస్‌లోనూ హిట్‌మ్యాన్ ఆ రికార్డును కొనసాగిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. చదవండి: IPL 2022: వేలంలో పాక్ బౌలర్ కు 200 కోట్లు.. ఆశకు హద్దు ఉండాలంటున్న నెటిజన్లు -
IND Vs WI: టీ20 సిరీస్‌కు ముందు అభిమానులకు బ్యాడ్‌న్యూస్..
IND VS WI T20 Series: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కోల్‌కతా వేదికగా రేపటి(ఫిబ్రవరి 16) నుంచి ప్రారంభంకానున్నటీ20 సిరీస్‌కు ముందు భారత అభిమానులకు ఓ చేదు వార్త వినిపించింది. కరోనా కారణంగా రేపు జరగబోయే తొలి టీ20 మ్యాచ్‌కు ప్రేక్షకులను అనమతించేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. దేశంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కనీసం 50 శాతం ప్రేక్షకులనైనా అనుమతిస్తారని అభిమానులు భావించినప్పటికీ.. బీసీసీఐ అందుకు విముఖత వ్యక్తం చేసింది. దీంతో ఖాళీ స్టేడియంలోనే తొలి టీ20 మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. కనీసం ఇదే వేదికగా జరగబోయే రెండు, మూడు మ్యాచ్‌లకైనా ప్రేక్షకులను అనుమతించాలని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) కోరగా.. త్వరలోనే తుది నిర్ణయం వెల్లడిస్తామని బీసీసీఐ పేర్కొంది. ఐపీఎల్ ప్రారంభ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎలాంటి రిస్క్‌లు అవసరం లేదని భావిస్తున్న బీసీసీఐ.. అవకాశం ఉన్నా ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు నిర్వహించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కాగా, అహ్మదాబాద్ వేదికగా విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అవేష్ ఖాన్, యజ్వేంద్ర చహల్, దీపక్ చాహర్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లి, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, జయంత్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్. వెస్టిండీస్ జట్టు: కీరన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్), ఫాబియన్ అలెన్, డారెన్ బ్రావో, రోస్టన్ చేజ్, షెల్డన్ కాట్రెల్, డొమినిక్ డ్రేక్స్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, బ్రాండన్ కింగ్, రోవ్‌మన్ పావెల్ షెపర్డ్, ఓడియన్ స్మిత్, కైల్ మేయర్స్, హేడెన్ వాల్ష్ జూనియర్. చదవండి: Ind Vs Wi T20 Series: పంత్‌కు బంపర్ ఆఫర్.. వైస్ కెప్టెన్‌గా ఛాన్స్ -
కొత్త కెప్టెన్.. కొత్త కోచ్.. కొత్తకొత్తగా..!
టి20 వరల్డ్‌కప్ ఫేవరెట్లలో ఒకరిగా బరిలోకి దిగి కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించిన భారత జట్టు సొంతగడ్డపై మళ్లీ కొత్తగా సీజన్‌ను మొదలు పెట్టేందుకు సన్నద్ధమైంది. ‘ప్రపంచకప్’ ఓటమి వేదన ‘పేటీఎమ్ కప్’తో తీరదు కానీ ఆట ఆగిపోదు కాబట్టి మరో టి20 సమరానికి సమయం వచ్చేసింది. సరిగ్గా చెప్పాలంటే మరో ఏడాదిలోపే జరిగే తర్వాతి టి20 ప్రపంచకప్ ప్రణాళికలు కొత్త కెప్టెన్, కొత్త కోచ్‌ల నేతృత్వంలో ఈ సిరీస్ నుంచే మొదలు కానున్నాయి. మరోవైపు వరల్డ్‌కప్ ఫైనల్ ఆడిన మూడు రోజుల్లోపే, ఆ ఓటమి బాధ నుంచి పూర్తిగా కోలుకోక ముందే ఒక ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్‌లో బరిలోకి దిగాల్సిన పరిస్థితిలో దురదృష్టవశాత్తూ న్యూజిలాండ్ నిలిచింది. సీనియర్లకు విశ్రాంతినిచ్చి టీమిండియా యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని భావిస్తుండగా... విలియమ్సన్ లేని కివీస్ ఎలాంటి పోటీనిస్తుందో చూడాలి. IND vs NZ T20: Important Things About Rohit Sharma and Rahul Dravid: వరల్డ్‌కప్‌లో నమీబియాతో తమ చివరి మ్యాచ్ ఆడిన భారత తుది జట్టులో కొన్ని తప్పనిసరి మార్పులు జరగనున్నాయి. రోహిత్, రాహుల్, సూర్యకుమార్, అశ్విన్‌లు మాత్రమే ఇక్కడా ఆడే అవకాశం ఉండగా. కోహ్లి, జడేజా స్థానాల్లో ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ ఆడనున్నారు. వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కని లెగ్‌స్పిన్నర్ చహల్ ఇక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడు. ఇద్దరు పేసర్లు షమీ, బుమ్రా దూరం కావడంతో భువనేశ్వర్‌కు మరో అవకాశం లభించింది. ఒకప్పటి తన బౌలింగ్‌తో పోలిస్తే పదును కోల్పోయిన భువీ ఈసారి ఎలాంటి ప్రభావం చూపిస్తాడనేది కీలకం. ఇక చివరిసారిగా 2018 మార్చిలో భారత టి20 టీమ్ తరఫున ఆడిన హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌కు మరో అవకాశం లభించింది. తన టెస్టు ప్రదర్శనతో కీలక సభ్యుడిగా మారిన అతను ఐపీఎల్‌లోనూ రాణించి టి20ల్లో చాన్స్ దక్కించుకున్నాడు. ఇక మిడిలార్డర్లో మరో బ్యాట్స్‌మన్ స్థానం కోసం మాత్రమే తీవ్రంగా పోటీ ఉంది. ఇప్పటికే భారత్‌కు ఆడిన అనుభవం ఉన్న శ్రేయస్ అయ్యర్ ముందు వరుసలో ఉన్నా... అతనికి రుతురాజ్, వెంకటేశ్ అయ్యర్‌లనుంచి పోటీ ఉంటుంది. తాజా ఫామ్ చూసుకుంటే రుతురాజ్ అద్భుతంగా ఆడుతుండగా... బౌలింగ్ కూడా చేయగలగడం వెంకటేశ్ బలం. జేమీసన్‌కు చోటు... మరోవైపు న్యూజిలాండ్ జట్టు ఫైనల్లో ఓడిన 24 గంటలలోపు సిరీస్ ఆడేందుకు సోమవారం సాయంత్రం జైపూర్‌లో దిగింది. టెస్టు సిరీస్‌కు ముందు తగినంత విశ్రాంతి కోరుకుంటున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ టి20 సిరీస్ నుంచి దూరమవుతున్నట్లు ప్రకటించాడు. దాంతో సారథిగా టిమ్ సౌతీ వ్యవహరిస్తాడు. బౌల్ట్ కూడా టీమ్‌లో లేకపోగా... కాన్వే, ఫెర్గూసన్ ఇంకా గాయాల నుంచి కోలుకుంటున్నారు. వరల్డ్‌కప్ ఆడని వారిలో కొత్తగా మార్క్ చాప్మన్, కైల్ జేమీసన్ ఈ సిరీస్‌లో బరిలోకి దిగనున్నారు. ఐపీఎల్లో ముంబైకి ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మ భారత జట్టు టి20 నాయకత్వం కూడా కొత్త కాదు. కోహ్లి గైర్హాజరులో 2017–2020 మధ్య అతను 19 మ్యాచ్‌లలో భారత్‌కు సారథిగా వ్యవహరించాడు. ఇందులో 15 విజయాలు దక్కగా, 4 సార్లు జట్టు ఓడింది. అతని కెప్టెన్సీలో జట్టు ఆసియా కప్ కూడా గెలిచింది. అయితే కోహ్లి అధికారికంగా తప్పుకోవడంతో ఇప్పుడు పూర్తి స్థాయిలో అతను టి20 కెప్టెన్‌గా జట్టును నడిపించనున్నాడు. 🎥 Head Coach Rahul Dravid rekindles his first meeting with a young @ImRo45 & lauds the #TeamIndia T20I captain for his contribution towards the Indian cricket. 👏 ☺️#INDvNZ pic.twitter.com/croLaIElLu — BCCI (@BCCI) November 16, 2021 -
Viral Video: మ్యాచ్‌కు ముందు హార్ధిక్ చేసిన ఆ పనిపై నెటిజన్ల సెటైర్లు
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20కు ముందు భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చేసిన ఓ పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు సంప్రదాయం ప్రకారం ఇరు జట్ల ఆటగాళ్లు తమ తమ జాతీయ గీతాలను ఆలపించారు. ముందుగా టీమిండియా ఆటగాళ్లు భారత జాతీయ గీతాన్ని ఆలపించగా.. ఆ తర్వాత శ్రీలంక జాతీయ గీతం వంతు వచ్చింది. ఈ సందర్భంగా హార్దిక్.. శ్రీలంక ఆటగాళ్లతో కలిసి వారి దేశ జాతీయ గీతాన్ని ఆలపిస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. Is it just me that saw @hardikpandya7 singing the SL national anthem, then? #SLvInd pic.twitter.com/TuALbiRFu4— Pranith (@Pranith16) July 25, 2021 హార్దక్ శ్రీలంక జాతీయ గీతాన్ని ఆలపించడంపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. హార్దిక్ ఓ ట్రూ మ్యూజిక్ లవర్ అని ఒకరంటే.. శ్రీలంక నమో నమో మాతా జాతీయ గీతానికి పాండ్యా ఫిదా అయ్యుంటాడని మరొకరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు శ్రీలంక పట్ల తన ఉదారతను చాటుకుంటున్నాడని, ఈ మ్యాచ్‌లో రాణించేదేముండదని ట్వీట్ చేస్తున్నారు. ప్రత్యర్థిని గౌరవించడం అంటే ఇదేనని కూడా మరికొందరు కామెంట్ చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో హార్దిక్(10) మరో మారు నిరాశపరిచాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా ఊహించనట్లుగానే ఈ మ్యాచ్ ద్వారా భారత యువ ఆటగాళ్లు పృథ్వీ షా, వరుణ్ చక్రవర్తి అంతర్జాతీయ టీ20 క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. మనీశ్ పాండేపై వేటు పడగా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఇద్దరికీ అవకాశం దక్కింది. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 164 పరుగులు స్కోర్ చేసింది. ఓపెనర్ పృథ్వీ షా గోల్డెన్ డక్‌గా వెనుదిరిగగా, సూర్య కుమార్ యాదవ్(50), ధవన్(46) రాణించారు. -
Ind Vs SL 1st T20: బోణీ కొట్టిన టీమిండియా
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో 38 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టును 126 పరుగులకే ఆలౌట్ చేసి సిరీస్‌లో తొలి విజయం నమోదు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్‌కుమార్ 4, దీపక్ చహర్ రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. ఫెర్నాండో(26) ఔట్ రెండు పరుగుల వ్యవధిలో లంక జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. 7వ ఓవర్ తొలి బంతికి చహల్... ధనంజయ డిసిల్వా(10 బంతుల్లో 9; ఫోర్)ను పెవిలియన్‌కు పంపగా, 8వ ఓవర్ తొలి బంతికి భువీ.. అవిష్క ఫెర్నాండో(23 బంతుల్లో 26; 3 ఫోర్లు)ను ఔట్ చేశాడు. 7.1 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 50/2గా ఉంది. క్రీజ్‌లో అసలంక(1), బండార(0) ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక.. భానుక(10) ఔట్ 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లంక జట్టు ధాటిగానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అయితే 3వ ఓవర్లో ఆ జట్టు తొలి వికెట్‌ను కోల్పోయింది. టీమిండియా స్పిన్నర్ కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో భానుక(7 బంతుల్లో 10; 2 ఫోర్లు) ఔటయ్యాడు. 3 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 25/1. క్రీజ్‌లో అవిష్క ఫెర్నాండో(12), ధనంజయ డిసిల్వా(1) ఉన్నారు. శ్రీలంక టార్గెట్ 165 టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. సూర్యకుమార్(50), ధవన్(46) రాణించడంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. పృథ్వీ షా(0), హార్ధిక్ పాండ్యా(0) మరోసారి నిరశపరచగా సామ్సన్ పర్వాలేదనిపించాడు. ఇషాన్ కిషన్(20), కృనాల్(3) నాటౌట్ బ్యాట్స్మెన్లుగా నిలిచారు. లంక బౌలర్లలో చమీరా, హసరంగ చెరో రెండు వికెట్లు, కరుణరత్నే ఓ వికెట్ పడగొట్టారు. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా.. హార్ధిక్ పాండా(10) ఔట్ చమీరా బౌలింగ్‌లో వికెట్ కీపర్ భానుకకు క్యాచ్ ఇచ్చి హార్ధిక్(12 బంతుల్లో 10; ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. 19 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 155/5గా ఉంది. క్రీజ్‌లో ఇషాన్ కిషన్(14), కృనాల్ పాండ్యా(1) ఉన్నారు. ఫిఫ్టి కొట్టి వెంటనే ఔటైన సూర్యకుమార్ సిక్స్ కొట్టి టీ20ల్లో రెండో ఫిఫ్టి నమోదు చేసిన సూర్యకుమార్(34 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆ మరుసటి బంతికే ఔటయ్యాడు. హసరంగ బౌలింగ్‌లో మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో లాంగ్ ఆఫ్‌లో ఉన్న ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 15.2 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 127/4గా ఉంది. క్రీజ్‌లో హార్దిక్ పాండ్యా(0), ఇషాన్ కిషన్(0) ఉన్నారు. టీమిండియా మూడో వికెట్ డౌన్.. గబ్బర్(46) ఔట్ జట్టు స్కోర్ 113 పరుగుల వద్ద కెప్టెన్ శిఖర్ ధవన్(36 బంతుల్లో 46; 4 ఫోర్లు, సిక్స్) పెవిలియన్‌కు చేరాడు. టీ20ల్లో 12వ హాఫ్ సెంచరీ నమోదు చేసే అవకాశాన్ని గబ్బర్ చేజార్చుకున్నాడు. 14.1 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 113/3గా ఉంది. క్రీజ్‌లో సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 37; 5 ఫోర్లు), హార్దిక్ పాండ్యా(0) ఉన్నారు. 10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 78/2 సామ్సన్ పెవిలియన్ బాట పట్టాక టీమిండియా ప్లేయర్లు ధవన్(23 బంతుల్లో 27; 3 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్(16 బంతుల్లో 22; 3 ఫోర్లు) నిలకడగా ఆడుతున్నారు. దీంతో 10 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 78/2గా ఉంది. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. సామ్సన్(27) ఔట్ అంతకుముందు ధనంజయ వేసిన ఆరో ఓవర్లో సిక్స్, ఫోర్ సహా మొత్తం 16 పరుగులు పిండుకున్న సామ్సన్(20 బంతుల్లో 27; 2 ఫోర్లు, సిక్స్).. 7 ఓవర్ తొలి బంతికే ఔటయ్యాడు. హసరంగ బౌలింగ్‌లో సామ్సన్.. వికెట్ల ముందు చిక్కాడు. 7.1 ఓవర్ల తర్వాత టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. క్రీజ్‌లో ధవన్(16 బంతుల్లో 22; 3 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్(0) ఉన్నారు. ఆచితూచి ఆడుతున్న టీమిండియా.. 5 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 35/1 తొలి బంతికే పృథ్వీ షా డకౌటయ్యాక ధవన్(16 బంతుల్లో 22; 3 ఫోర్లు), సామ్సన్(20 బంతుల్లో 27; 2 ఫోర్లు, సిక్స్)లు ఆచితూచి ఆడుతున్నారు. దీంతో 5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 35/1గా ఉంది. తొలి బంతికే వికెట్ కోల్పోయిన టీమిండియా.. పృథ్వీ షా డకౌట్ టీ20 క్రికెట్లో ఎదుర్కొన్న తొలి బంతికే అరంగేట్రం ఆటగాడు పృథ్వీ షా వెనుదిరిగాడు. చమీరా బౌలింగ్‌లో వికెట్‌కీపర్ భానుకకు క్యాచ్ ఇచ్చి షా పెవిలియన్‌కు చేరాడు. క్రీజ్‌లోకి సంజూ సామ్సన్ వచ్చాడు. కొలొంబో: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో అతిధ్య లంక జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగగా.. యువ ఓపెనర్ పృథ్వీ షా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీ20 అరంగేట్రం చేయనున్నారు. మరోవైపు లంక జట్టు ఆఖరి వన్డే ఆడిన జట్టులో మూడు మార్పులు చేసి బరిలోకి దిగనుంది. కాగా, లంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. టీ20 స్పెషలిస్ట్ ఇసురు ఉడానా తుది జట్టులో చేరాడు. తుది జట్లు: భారత్: పృథ్వీ షా, శిఖర్ ధవన్(కెప్టెన్), ఇషాన్ కిషన్, సంజూ సామ్సన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, చహల్ శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక(కీపర్), ధనుంజయ డిసిల్వా, చరిత్ అసలంక, డసన్ షనక(కెప్టెన్), చమిక కరుణరత్నే, అశేన్ బండార, వానిందు హసరంగ, ఇసురు ఉడానా, దుష్మంత చమీరా, అకిలా ధనంజయ -
తొలి టీ20కి వర్ష గండం?
కొలంబో: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభంకానున్న తొలి టీ20కి వరుణ గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మ్యాచ్ ప్రారంభ సమాయానికి వర్షం నుంచి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా, మధ్యలో మాత్రం ఆటంకం కలిగించే ఆస్కారముందని సమాచారమందుతోంది. కొలొంబోలో గత కొద్ది రోజులుగా సాయంత్రం వేళల్లో వర్షం కురుస్తుండడం ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ వార్త ఇరు జట్ల అభిమానులను కలవరపెడుతుంది. వరుణుడి ఆటంకం లేకుండా 20 ఓవర్ల పాటు మ్యాచ్ సజావుగా సాగాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్ ముందు జరుగుతున్న ఆఖరి సిరీస్ కావడంతో ఇరు జట్లు ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. ఆఖరి వన్డేలో 6 మార్పులు చేసి మూల్యం చెల్లించుకున్న భారత్.. ఈ మ్యాచ్‌లో పకడ్బందీగా బరిలోకి దిగనుంది. ఓపెనర్లుగా శిఖర్ ధవన్, పృథ్వీ షా బరిలోకి దిగనుండగా, వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. వన్డే సిరీస్‌లో దారుణంగా విఫలమైన మనీశ్ పాండే స్థానంలో సంజూ శాంసన్‌కు అవకాశం దక్కనుంది. మరోవైపు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలకు తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది. స్పిన్నర్ కోటాలో చహల్‌ను ఆడిస్తారా? లేక రాహుల్ చాహర్‌కు అవకాశమిస్తారా? అనేది చివరి నిమిషంలో తేలనుంది. ఇక ప్రధాన పేసర్లుగా దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్ జట్టులోకి తిరిగిరానుండగా వరుణ్ చక్రవర్తి అంతర్జాతీయ అరంగేట్రం ఖాయమేనని తెలుస్తోంది. మరోవైపు తొలి రెండు వన్డేల్లో ఓడిన శ్రీలంక.. ఆఖరి మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టింది. సొంతగడ్డపై భారత్ చేతిలో 10 ఓటముల తర్వాత గెలుపొందింది. ఈ విజయంతో రెట్టించిన ఉత్సాహంలో తొలి టీ20 బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌కు దూరమైన హసరంగా ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశాలున్నాయి. హసరంగా జట్టులోకి వస్తే జయవిక్రమ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. టీ20 స్పెషలిస్ట్ అయిన ఇసురు ఉడానాకు కూడా చోటు దక్కే అవకాశాలున్నాయి. మూడో వన్డేలో ఆల్‌రౌండ్ షో కనబర్చిన లంక జట్టు తొలి టీ20లోనూ అదే తరహాలో రాణించాలని ఆశిస్తోంది. తుది జట్లు: (అంచనా) భారత్: పృథ్వీ షా, శిఖర్ ధవన్(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, చహల్/రాహుల్ చాహర్ శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక(కీపర్), భానుక రాజపక్స, ధనుంజయ డి సిల్వా, చరిత అసలంక, డసన్ షనక(కెప్టెన్), చమిక కరుణరత్నే, వానిందు హసరంగ/ ప్రవీణ్ జయవిక్రమ, ఇసురు ఉడానా, దుష్మంత చమీరా, అకిలా ధనుంజయ -
చెలరేగిన బంగ్లా బ్యాట్స్‌మెన్.. తొలి టీ20లో జింబాబ్వేపై గెలుపు
హరారే: జింబాబ్వే గడ్డపై బంగ్లాదేశ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన బంగ్లా జట్టు.. మూడు టీ20ల సిరీస్‌లోను బోణీ కొట్టింది. గురువారం జరిగిన తొలి టీ20లో ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటిన బంగ్లా.. 8 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 19 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రెగిస్ చకబ్వా(22 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), డియోన్ మైర్స్(22 బంతుల్లో 35; 2 ఫోర్లు) రాణించారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్(3/31) మూడు వికెట్లతో చెలరేగగా.. సైఫుద్దీన్(2/23), షోరిఫుల్ ఇస్లామ్(2/17) చెరో రెండేసి వికెట్లు పడగొట్టారు. సౌమ్య సర్కార్, షకీబ్ అల్ హసన్‌లకు తలో వికెట్ దక్కింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లా జట్టు ఆడుతూ పాడుతూ 18.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లు మహమ్మద్ నైమ్(51 బంతుల్లో 63 నాటౌట్; 6 ఫోర్లు), సౌమ్య సర్కార్(45 బంతుల్లో 50; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే బౌలర్లు ఒక్క వికెట్ తీయలేకపోవడం గమనార్హం. బంగ్లా రెండు వికెట్లు కూడా రనౌట్ల రూపంలోనే కోల్పోయింది. ఇక వికెట్‌తో పాటు హాఫ్ సెంచరీ సాధించిన సౌమ్య సర్కార్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఇదే వేదికగా శుక్రవారం జరగనుంది. -
ఒకే ఓవర్లో 6,6,6,6,6,6
కూలిడ్జ్: వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ కీరన్ పొలార్డ్ అరుదైన ఘనతలో భాగమయ్యాడు. శ్రీలంకతో జరిగిన తొలి టి20లో ఒకే ఓవర్లోని 6 బంతుల్లో వరుసగా 6 సిక్సర్లు బాది... గిబ్స్ (దక్షిణాఫ్రికా–2007 వన్డే వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్‌పై వాన్ డాన్ బంజ్ బౌలింగ్‌లో), యువరాజ్ (భారత్– 2007 టి20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో) తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. పొలార్డ్ దెబ్బకు 36 పరుగులు సమర్పించుకున్న బాధిత బౌలర్ గా స్పిన్నర్ అకిల ధనంజయ నిలిచాడు. పొలార్డ్ సిక్సర్లు కొట్టాడిలా... తొలి బంతి (లెంగ్త్ బాల్): మోకాలిపై కూర్చొ ని స్లాగ్ షాట్. లాంగాన్ మీదుగా సిక్సర్. రెండో బంతి (ఫుల్ బాల్): నేరుగా సైట్ స్క్రీన్ వైపు సిక్సర్. మూడో బంతి (వికెట్‌కు కొంత దూరంగా ఫుల్లర్ బాల్): వైడ్ లాంగాఫ్ దిశగా సిక్సర్. నాలుగో బంతి (లెంగ్త్ బాల్): స్లాగ్ షాట్. డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్. ఐదో బంతి (ఆఫ్ స్టంప్‌పై లెంగ్త్ బాల్): బౌలర్ తల మీదుగా భారీ సిక్సర్. ఆరో బంతి (రౌండ్ ద వికెట్ ప్యాడ్లపైకి): అలవోకగా డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్. ‘హ్యాట్రిక్’ తర్వాత... పొలార్డ్ బాదుడుకు ముందు వేసిన ఓవర్లో ధనంజయ ఒక్కసారిగా హీరోలా కనిపించగా, తర్వాతి ఓవర్‌కే పరిస్థితి తలకిందులైంది. మ్యాచ్‌లో ముందుగా లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసింది. చూస్తే చిన్న లక్ష్యంగానే కనిపించింది కానీ ధనంజయ వరుస బంతుల్లో లూయిస్ (28), గేల్ (0), పూరన్ (0)లను అవుట్ చేసి ‘హ్యాట్రిక్’ నమోదు చేయడంతో మ్యాచ్ లంక వైపు తిరిగింది. అంతర్జాతీయ టి20ల్లో హ్యాట్రిక్ సాధించిన 13వ బౌలర్‌గా అకిల నిలిచాడు. అయితే చివరకు 13.1 ఓవర్లలో 6 వికెట్లకు 134 పరుగులు చేసిన విండీస్ 4 వికెట్లతో మ్యాచ్ గెలిచింది. -
తొలి టి20లో పాక్‌దే విజయం
అబుదాబి: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టి20లో పాకిస్తాన్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. బుధవారం రాత్రి ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో పాక్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగులు చేసింది. మొహమ్మద్ హఫీజ్ (36 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), సర్ఫరాజ్ అహ్మద్ (26 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం కివీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 146 పరుగులే చేసింది. మున్రో (42 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకం సాధించాడు. చివరి ఓవర్లో విజయానికి 17 పరుగులు కావాల్సి ఉండగా షాహిన్ ఆఫ్రిది 14 పరుగులు ఇచ్చాడు. ఆఖరి బంతికి సిక్స్ కొడితే ‘టై’ అయ్యే అవకాశం ఉండగా, రాస్ టేలర్ (26 బంతు ల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు) ఫోర్ కొట్టగలిగాడు. -
ఇంగ్లండ్‌కు ఇదో హెచ్చరిక
ఇంగ్లండ్‌పై తొలి టి20లో భారత్ ఏకపక్ష విజయం సాధించడం అమితానందం కలిగింది. లోపాలు లేని ‘సూపర్ కార్’ తరహాలో అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న జట్టు ఎలాంటి ప్రదర్శన ఇవ్వగలదనేదానికి ఇదో మంచి ఉదాహరణ. మ్యాచ్‌లో కొన్ని సార్లు జోరు తగ్గినట్లు కనిపించినా, మళ్లీ డ్రైవర్ మార్గనిర్దేశనంలో ఈ సూపర్ కార్ దూసుకుపోయింది. చక్కగా, తన అనుభవంతో సరైన దిశలో జట్టును నడిపించిన ఆ డ్రైవర్ విరాట్ కోహ్లి ఈ పర్యటనలో మరిన్ని విజయాలు అందిస్తాడని ఆశించవచ్చు. కొందరు ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, జట్టు ఇంత సాధికారికంగా గెలిచిందంటే ఇక వారికి ఆకాశమే హద్దు. భారత్‌లోలాగే వాతావరణం కొంత వేడిగా ఉండటంతో ఇంగ్లండ్‌లో సాధారణంగా కనిపించే విధంగా స్వెటర్లు వేసుకొని మన ఆటగాళ్ళు బరిలోకి దిగాల్సిన అవసరం రాలేదు. నిజానికి వాతావరణం చూసి ఇంగ్లండ్ జట్టే కొంత ఆశ్చర్యపడి ఉండవచ్చు. వాస్తవానికి భారత అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి వస్తారని వారు కూడా ఊహించే ఉంటారు. అయితే కుల్దీప్ యాదవ్ మాయను మాత్రం వారు కచ్చితంగా అంచనా వేయలేకపోయారు. అతని బౌలింగ్ ముందు ఇంగ్లిష్ బ్యాట్స్‌మన్ తోలుబొమ్మల్లా మారిపోయారు. మణికట్టు స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఇంగ్లండ్ బలహీనత గురించి తెలిసినవారు బెయిర్‌స్టో, రూట్ ఔటైన బంతులు చూసి గట్టిగా నవ్వుకొని ఉంటారు. బంతిపై సరిగా పట్టు చిక్కకపోవడంతో చహల్ అంత గొప్పగా రాణించకపోయినా... కుల్దీప్ మాత్రం బట్లర్ చెలరేగిపోతున్న కీలక సమయంలో బంతిని అందుకొని ఒక్కసారిగా మ్యాచ్‌ను మార్చేశాడు. అతని బౌలింగ్ నిజంగా అద్భుతం. ఆ తర్వాత ఒక కళాత్మక ఆట మరో బ్యాట్స్మన్నుంచి జాలువారింది. భవిష్యత్తులో మరింత గొప్పవాడిగా ఎదిగే అవకాశం ఉన్న రాహుల్ ఆ ఇన్నింగ్స్ ఆడాడు. తన తొలి పర్యటనలో ఆస్ట్రేలియా గడ్డపై మిచెల్ జాన్సన్‌ను సమర్థంగా ఎదుర్కొన్నప్పుడే అతని ప్రత్యేకత ఏమిటో తెలిసింది. ఇంగ్లండ్ బౌలర్లను అతను చితక్కొట్టిన తీరు చూసి డగౌట్లో ఉన్న కెప్టెన్ కోహ్లి కూడా చప్పట్లతో ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. అతి సాధా రణ ఇంగ్లండ్ బౌలింగ్‌లో నేనేంటి ఆడేది అన్నట్లుగా రోహిత్ శర్మ ఔటయ్యాక రాహుల్ ఆటను కోహ్లి మరింత దగ్గరనుంచి ఆస్వాదించాడు. రాబోయే రోజుల్లో ఇంగ్లండ్ వెంటనే లోపాలు సవరించుకుంటేనో, లేక వాతావరణం ఒక్కసారిగా మారిపోతేనో తప్ప రాహుల్ ఇన్నింగ్స్ మున్ముందు ప్రత్యర్థికి ఎలాంటి రోజులు రాబోతున్నాయనేదానికి సూచిక. -
తొలి టి20లో లంకపై దక్షిణాఫ్రికా గెలుపు
సెంచూరియన్ : శ్రీలంకతో శుక్రవారం రాత్రి జరిగిన తొలి టి20లో దక్షిణాఫ్రికా 19 పరుగుల తేడాతో నెగ్గింది. వర్షం వల్ల ఈ మ్యాచ్‌ను 10 ఓవర్లకు కుదించారు. తొలుత దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేయగా... శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసి ఓడింది. -
అమ్మాయిలు అదే జోరు..
రాంచీ: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత మహిళల జట్టు.. టి-20 సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగించింది. లంక మహిళల జట్టుతో మూడు టి-20ల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో మిథాలీ రాజ్ సేన 34 పరుగులతో విజయం సాధించింది. అనూజా పాటిల్ (22 నాటౌట్, మూడు వికెట్లు) ఆల్‌రౌండ్ షోతో రాణించి జట్టు విజయంతో కీలక పాత్ర పోషించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులు చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ 36, మందన 35, అనూజా పాటిల్ 22 (నాటౌట్) పరుగులు చేశారు. లంక బౌలర్లు సుగంధిక కుమారి మూడు, కౌశల్య రెండు వికెట్లు తీశారు. అనంతరం 131 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లంక పూర్తి ఓవర్లు ఆడి 7 వికెట్ల నష్టానికి 96 పరుగులే చేయగలిగింది. దిలాని మనోదర 41 (నాటౌట్) చివరిదాకా పోరాడినా ఫలితం లేకపోయింది. సిరివర్దెనె 18, కరుణరత్నె 14 పరుగులు చేశారు. భారత బౌలర్లు అనూజా పాటిల్ మూడు, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు. -
తొలి టి20కి మ్యాక్స్‌వెల్ దూరం
మోకాలి కండర గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్... భారత్‌తో అడిలైడ్‌లో మంగళవారం జరగనున్న తొలి టి20 మ్యాచ్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం మెల్బోర్న్లో విశ్రాంతి తీసుకుంటున్న మ్యాక్స్‌వెల్ ఈనెల 29న జరిగే రెండో టి20కి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ‘మ్యాక్స్ ఇంకా నొప్పితో బాధపడుతున్నాడు. కాబట్టి ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకుంటాడు. మెల్బోర్న్లో జరిగే రెండో టి20కి జట్టుతో కలుస్తాడు’ అని జట్టు కోచ్ డి వెంటో చెప్పారు. -
ఊదేశారు!
తొలి టి20లో భారత్ గెలుపు రాణించిన ఉతప్ప, విజయ్ స్పిన్ ఉచ్చుకు జింబాబ్వే విలవిల మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అక్షర్ 5 ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఐదుగురు పాండే, జాదవ్, అక్షర్ పటేల్, బిన్నీ, సందీప్‌లు టి20ల్లో అరంగేట్రం చేశారు. టి20 ప్రపంచకప్ ఆడిన అనుభవం ఉన్న ఉతప్ప, హర్భజన్ మినహా ప్రస్తుత భారత జట్టులోని మిగతా ఆటగాళ్లందరూ ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చినవారే. లీగ్‌లో ఆడిన అనుభవాన్ని తమలోని నైపుణ్యానికి జోడించి విదేశీ గడ్డపై జింబాబ్వేను ఉఫ్‌మని ఊదేశారు. సీనియర్లు లేరన్న లోటును మరిపిస్తూ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టారు. దీంతో తొలి టి20లో టీమిండియా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. హరారే: వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి జోరుమీదున్న భారత్.. టి20లోనూ సత్తా చాటింది. బ్యాటింగ్‌లో రాబిన్ ఉతప్ప (35 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు), మురళీ విజయ్ (19 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) మెరిస్తే.. బౌలింగ్‌లో అక్షర్ పటేల్ (3/17), హర్భజన్ (2/29)లు తమ మాయాజాలాన్ని చూపించారు. ఫలితంగా శుక్రవారం జరిగిన టి20 మ్యాచ్‌లో భారత్ 54 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు చేసింది. తర్వాత జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 124 పరుగులే చేసి ఓడింది. మసకద్జా (24 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. చిబాబా (27 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. అక్షర్ పటేల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆదివారం రెండో టి20 మ్యాచ్ జరుగుతుంది. ఓపెనర్ల శుభారంభం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం, ఆతిథ్య పేసర్ల నుంచి పెద్దగా ఇబ్బంది లేకపోవడంతో భారత ఓపెనర్లు రహానే (32 బంతుల్లో 33; 2 ఫోర్లు), విజయ్‌లు ఆరంభంలో చెలరేగి ఆడారు. బౌండరీల జోరుతో స్కోరును వేగంగా ముందుకు తీసుకెళ్లారు. ఏడు ఓవర్లలోనే ఈ జోడి తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించింది. అయితే ఇదే ఓవర్లో రజా మిడ్‌వికెట్ నుంచి వేసిన డెరైక్ట్ త్రోకు విజయ్ అనూహ్యంగా రనౌటయ్యాడు. తర్వాత రిస్క్ తీసుకోకుండా ఉతప్పతో కలిసి సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రయిక్‌ను రొటేట్ చేసిన కెప్టెన్ రహానే 10వ ఓవర్లో క్రెమెర్ బంతికి పెవిలియన్‌కు చేరాడు. దీంతో భారత్ 82 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. ఇక ఇక్కడి నుంచి జింబాబ్వే స్లో బౌలర్లు టీమిండియా పరుగుల వేగానికి కళ్లెం వేశారు. మనీష్ పాండే (19 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్) భారీ సిక్సర్‌తో రెచ్చిపోయినా... 5 ఓవర్లలో (10 నుంచి 14) కేవలం 31 పరుగులు మాత్రమే ఇచ్చారు. 16వ ఓవర్లో మనీష్ అవుట్‌కావడం భారత్ భారీ స్కోరుపై ప్రభావం చూపింది. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 45 పరుగులు జోడించారు. చివర్లో కేదార్ జాదవ్ (9), స్టువర్ట్ బిన్నీ (6 బంతుల్లో 11; 1 సిక్స్) వరుస విరామాల్లో వెనుదిరిగారు. ఆఖరి బంతికి హర్భజన్ (8 నాటౌట్) ఫోర్ కొట్టి భారత ఇన్నింగ్స్‌కు మంచి ముగింపు ఇచ్చాడు. మెంపోయు 3 వికెట్లు తీశాడు. స్పిన్నర్ల జోరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వేను స్పిన్నర్లు హర్భజన్, అక్షర్ పటేల్ ఘోరంగా దెబ్బతీశారు. ఆరంభంలో ఓపెనర్లు మసకద్జా, చిబాబా మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. సందీప్, భజ్జీ బౌలింగ్‌లో ఈ జోడి సిక్సర్లు బాదడంతో తొలి వికెట్‌కు 55 పరుగులు సమకూరాయి. కానీ పదో ఓవర్ నుంచి స్పిన్నర్లు తమ మాయాజాలాన్ని చూపెట్టారు. 10 బంతుల వ్యవధిలో మసకద్జా, చిగుంబురా (1), కోవెంట్రీ (10)లను అవుట్ చేశారు. మరో 17 బంతుల తేడాలో ఇర్విన్ (2) కూడా వెనుదిరగడంతో జింబాబ్వే 14 ఓవర్లలో 82 పరుగులకు సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. తర్వాత సికిందర్ రజా (10), క్రెమెర్ (9)లు నిలకడగా ఆడే ప్రయత్నం చేసినా భారత బౌలర్లు అవకాశం ఇవ్వలేదు. కనీసం సింగిల్స్ కూడా రాకపోవడంతో భారీ షాట్లకు ప్రయత్నించి ఈ ఇద్దరు స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. చివర్లో ఉత్సేయా (13 నాటౌట్), మజ్దీవా (14 నాటౌట్)... భువీ, సందీప్ ఓవర్లలో చెరో సిక్సర్, ఫోర్ కొట్టి భారత్ విజయాన్ని కాస్త ఆలస్యం చేశారు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రహనే (సి) మసకద్జా (బి) క్రెమెర్ 33; విజయ్ రనౌట్ 34; ఉతప్ప నాటౌట్ 39; పాండే (సి) రజా (బి) మెంపోయు 19; జాదవ్ (సి) మసకద్జా (బి) మెంపోయు 9; బిన్నీ (సి) క్రెమెర్ (బి) మెంపోయు 11; హర్భజన్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు: 25; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1-64; 2-82; 3-127; 4-150; 5-166. బౌలింగ్: ఉత్సేయా 4-0-30-0; మెంపోయు 4-0-33-3; ముజరబాని 3-0-36-0; మద్జీవా 4-0-46-0; క్రెమెర్ 4-1-20-1; రజా 1-0-2-0. జింబాబ్వే ఇన్నింగ్స్: మసకద్జా (సి) జాదవ్ (బి) అక్షర్ 28; చిబాబా (సి) మనీష్ (బి) హర్భజన్ 23; కోవెంట్రీ (సి) రహానే (బి) హర్భజన్ 10; చిగుంబురా (బి) అక్షర్ 1; సికిందర్ రజా (బి) అక్షర్ 10; ఇర్విన్ రనౌట్ 2; క్రెమెర్ (బి) మోహిత్ 9; ఉత్సేయా నాటౌట్ 13; మజ్దీవా నాటౌట్ 14; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 124. వికెట్ల పతనం: 1-55; 2-64; 3-66; 4-68; 5-82; 6-90; 7-98. బౌలింగ్: భువనేశ్వర్ 4-0-22-0; సందీప్ 3-0-34-0; మోహిత్ 3-0-8-1; అక్షర్ పటేల్ 4-0-17-3; హర్భజన్ 4-0-29-2; స్టువర్ట్ బిన్నీ 2-0-8-0.