టీమిండియా వికెట్‌కీపర్ సంజూ శాంసన్‌ను భారత మాజీ కెప్టెన్, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఏకి పారేశాడు. ముంబై వేదికగా శ్రీలంకతో నిన్న (జనవరి 3) జరిగిన తొలి టీ20లో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనందుకు గాను శాంసన్‌పై నిప్పులు చెరిగాడు. ఎంత టాలెంట్ ఉన్నా ఏం ప్రయోజనం.. చెత్త షాట్ సెలెక్షన్‌తో మరోసారి వికెట్ పారేసుకున్నాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు.
అమవాస్యకో పున్నానికో వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోకుంటే ఎలా అంటూ ఘాటు స్వరంతో వ్యాఖ్యానించాడు. తొలి టీ20లో శాంసన్ చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్న వెంటనే సన్నీ ఈ రకంగా స్పందించాడు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన సంజూ.. కేవలం ఆరు బంతులు మాత్రమే ఆడి (5 పరుగులు) దారుణంగా నిరాశపరిచాడు. ధనంజయ డిసిల్వ వేసిన ఏడో ఓవర్ నాలుగో బంతికి క్యాచ్ మిస్ కావడంతో బతికిపోయిన సంజూ.. ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేక అదే ఓవర్ ఆఖరి బంతికి ఔటయ్యాడు.
ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తేలిపోయిన సంజూ.. ఫీల్డింగ్ చేస్తూ కీలక క్యాచ్ జారవిడిచాడు. లంక ఇన్నింగ్స్‌లో హార్ధిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్‌లో నిస్సంక ఇచ్చిన క్యాచ్‌ను వదిలిపెట్టి కెప్టెన్ ఆగ్రహానికి గురయ్యాడు.
ఇదిలా ఉంటే, భీభత్సమైన టాలెంట్ ఉన్నా సంజూ శాంసన్‌కు టీమిండియాలో సరైన అవకాశాలు కల్పించకుండా వివక్ష చూపుతున్నారంటూ గత కొంతకాలంగా అతని అభిమానులు సోషల్‌మీడియా వేదికగా గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజూపై సునీల్ గవాస్కర్ చేసిన ఘాటు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment