Sunil Gavaskar
-
రోహిత్, కోహ్లి, బుమ్రా లేకున్నా భారత్ గెలిచింది: టీమిండియా దిగ్గజం
పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా దూసుకుపోతోంది. తొమ్మిది నెలల వ్యవధిలో రెండు ఐసీసీ ట్రోఫీలు గెలవడమే ఇందుకు నిదర్శనం. రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత్.. ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)ని సొంతం చేసుకుంది.ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)జట్టుతో లేకపోయినా అద్భుత ప్రదర్శనతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. అంతకు ముందు పొట్టి వరల్డ్‌కప్ టోర్నీలో పరాజయమన్నదే లేకుండా ట్రోఫీని ముద్దాడింది. ఈ రెండు ఐసీసీ ఈవెంట్లలో వంద శాతం విజయాలతో రోహిత్ సేన తమ సత్తా చాటింది.అత్యంత పటిష్టంగాఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. భారత జట్టు ప్రస్తుతం అత్యంత పటిష్టంగా ఉందన్న సన్నీ.. బెంచ్ స్ట్రెంత్‌లోనూ మిగతా జట్లతో పోలిస్తే ముందు వరుసలో ఉందని పేర్కొన్నాడు. వ్యక్తులకు అతీతంగా జట్టుగా భారత్ ఎదిగిందని.. రోహిత్, కోహ్లి, బుమ్రా లాంటి వాళ్లు లేకపోయినా గెలవగల స్థాయికి చేరుకుందని అన్నాడు.రోహిత్, కోహ్లి లేకుండానేఈ మేరకు ‘మిడ్-డే’కు రాసిన కాలమ్‌లో.. ‘‘బుమ్రా లేకుండానే టీమిండియా చాంపియన్స్ ట్రోఫీలో అద్భుత విజయం సాధించిన తర్వాత.. వ్యక్తులను మించి టీమిండియా స్థాయి పెరిగిందని అర్థమవుతోంది. గతంలో కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేకుండానే టీమిండియా చాలాసార్లు గెలిచింది.అయితే, వాళ్లిద్దరు ఉంటే జట్టు మరింత పటిష్టంగా మారినట్లు కనిపిస్తుంది. ఆస్ట్రేలియా పర్యటనలో జస్ప్రీత్ బుమ్రాపై టీమిండియా ఎక్కువగా ఆధారపడింది. ఇలాంటివి అరుదుగా జరుగుతూ ఉంటాయి.అయితే, అతడు లేకుండానే ఆస్ట్రేలియా వెలుపల స్వల్ప టార్గెట్లను కూడా టీమిండియా డిఫెండ్ చేసుకుంది. ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టీ20, వన్డే సిరీస్‌లలో టీమిండియా పరిపూర్ణ విజయాలు సాధించింది. భారత క్రికెట్ జట్టుతో పాటు బెంచ్ కూడా ఎంత బలంగా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు’’ అంటూ గావస్కర్ టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించాడు. రోహిత్, కోహ్లి లేకుండానే యువ ఆటగాళ్లు టీ20 ఫార్మాట్లో భారత్‌కు అద్భుత విజయాలు అందిస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.ఏకంగా 17 గెలిచిన సూర్య సేనకాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్- కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అంతకుముందు కూడా విశ్రాంతి పేరిట ఈ దిగ్గజాలు పలు మ్యాచ్‌లకు దూరమయ్యారు. ఇక రోహిత్- కోహ్లి రిటైర్మెంట్ తర్వాత టీమిండియా 20 టీ20 మ్యాచ్‌లు ఆడితే.. అందులో ఏకంగా 17 గెలవడం విశేషం. సూర్యకుమార్ సేన విజయాల శాతం 85గా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే గావస్కర్ పైవిధంగా స్పందించినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025కి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వగా.. రోహిత్ సేన మాత్రం ఈ వన్డే టోర్నీలో తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించిన భారత్.. సెమీస్‌లో ఆస్ట్రేలియా, ఫైనల్లో న్యూజిలాండ్‌లపై గెలిచి చాంపియన్‌గా నిలిచింది. ఇక సెమీస్ మ్యాచ్‌లో కోహ్లి.. ఫైనల్లో రోహిత్ శర్మ అద్భుత అర్ధ శతకాలతో జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి -
‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్’: గావస్కర్ ఫైర్.. రిపీట్ చేసిన పంత్!
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ ఐపీఎల్ -2025 (IPL 2025)కి సన్నద్ధమవుతున్నాడు. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఉన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఈసారి లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) సారథిగా బరిలోకి దిగనున్నాడు. ఈ ఉత్తరాఖండ్ ఆటగాడి కోసం లక్నో ఏకంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసింది.సమతూకంగాతద్వారా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన క్రికెటర్‌గా పంత్ నిలిచాడు. ఇక ఈ సీజన్లో తాము రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగబోతున్నామన్న పంత్.. సీనియర్లు, యువ ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు. నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు అందుబాటులో ఉండటం తమకు సానుకూలాంశమని పేర్కొన్నాడు. ‘‘జట్టులోని ప్రతి ఒక్కరు తమ నైపుణ్యాలను ప్రదర్శరించే విధంగా.. తమలోని అత్యుత్తమ ప్రదర్శనను వెలికి తీసేలా.. అందుకు తగ్గట్లుగా డ్రెసింగ్ రూమ్ వాతావరణం ఉండేలా మేము చూసుకుంటున్నాం. మా మేనేజ్మెంట్ అన్ని రకాలుగా ఆటగాళ్లకు అండగా ఉంటుంది. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు నిక్కీ, మార్క్రమ్, మిల్లర్ ఉండటం మాకు కలిసి వస్తుంది’’ అని పంత్ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను లక్నో తమ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది.Oh Captain… My Captain! 💙 pic.twitter.com/Qkite1n4bh— Lucknow Super Giants (@LucknowIPL) March 17, 2025 ఇదిలా ఉంటే.. ఓ బ్రాండ్ షూట్లో భాగంగా రిషభ్ పంత్ వ్యవహరించిన తీరు వైరల్‌గా మారింది. టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ తనను ఉద్దేశించి విమర్శించిన మాటలను పునరావృతం చేస్తూ పంత్ వ్యాఖ్యానించడంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ‘‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్’’అసలేం జరిగిందంటే.. ఆస్ట్రేలియా గడ్డ మీద రిషభ్ పంత్‌కు మంచి రికార్డు ఉన్న విషయం తెలిసిందే. అయితే, గతేడాది కంగారూ దేశ పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో పంత్ తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. 'ముఖ్యంగా మెల్బోర్న్ టెస్టులో అతడు అవుటైన తీరు విమర్శలకు దారి తీసింది. ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో పంత్ వికెట్ పారేసుకున్న తీరుపై కామెంటేటర్ గావస్కర్ తీవ్ర స్థాయిలో అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్’’ అంటూ పంత్ తీరును విమర్శించాడు.రీక్రియేట్ చేసిన పంత్ఇప్పుడు అదే మూమెంట్‌ను పంత్ రీక్రియేట్ చేశాడు. తనదైన శైలిలో.. ‘‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. ‘‘ఎన్నోసార్లు నిన్ను సమర్థించి, నీకు మద్దతుగా నిలిచిన గావస్కర్ సార్నే ఇలా ఇమిటేట్ చేసి అవమానిస్తావా?’’ అంటూ కొంత మంది కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘ఐకానిక్ మూమెంట్‌ను పంత్ క్యాష్ చేసుకుంటున్నాడు. ఇందులో గావస్కర్‌ను అవమానించిట్లు ఏమీ లేదు’’ అని పంత్‌కు సపోర్టు చేస్తున్నారు.Rishabh Pant recreating the 'Stupid, Stupid, Stupid!' of Sunil Gavaskar. 🤣pic.twitter.com/JhrK34luWh— Mufaddal Vohra (@mufaddal_vohra) March 17, 2025 కాగా గతేడాది ఐపీఎల్లో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 446 పరుగులు చేశాడు. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. జట్టును ఆరో స్థానంలో నిలిపి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఇక ఈసారి మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌తో పంత్ తన కొత్త ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. చదవండి: అతడిపై నిషేధం.. బీసీసీఐ నిర్ణయం సరైందే: మొయిన్ అలీ -
All Time India ODI XI: రోహిత్, కోహ్లిలకు చోటు.. కెప్టెన్‌గా ఎవరంటే?
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) విజేతగా నిలవడంతో టీమిండియా ఐసీసీ టైటిళ్ల సంఖ్య ఏడుకు చేరింది. భారత్ తొలిసారి 1983లో ప్రపంచకప్‌ను ముద్దాడింది. నాటి వన్డే వరల్డ్‌కప్ టోర్నమెంట్లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన కపిల్ సేన ఏకంగా చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. పటిష్ట వెస్టిండీస్ జట్టును ఓడించి వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది.ఫలితంగా టీమిండియాకు మొట్టమొదటి ఐసీసీ ట్రోఫీ అందించిన సారథిగా కపిల్ దేవ్(Kapil Dev).. భారత క్రికెట్ చరిత్రలో తన పేరును అజరామరం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత దాదాపు రెండు దశాబ్దాలకు పైగా భారత జట్టుకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా దక్కలేదు. అయితే, మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) ఆ లోటును తీర్చేశాడు.ధోని ఖాతాలో ముచ్చటగా మూడుఅంతర్జాతీయ క్రికెట్ మండలి 2007లో తొలిసారిగా ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌ను టీమిండియాకు అందించాడు. అనంతరం 2011లో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన కెప్టెన్‌గానూ ధోని నిలిచాడు. అంతేనా.. 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను విజేతగా నిలిపి.. అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన భారత కెప్టెన్‌గా ఇప్పటికీ కొనసాగుతున్నాడు.రోహిత్ ‘డబుల్’ హ్యాపీఇక తాజాగా రోహిత్ శర్మ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచి రెండో ఐసీసీ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన హిట్‌మ్యాన్.. తాజా ఈ వన్డే టోర్నమెంట్లోనూ జట్టును అజేయంగా ముందుకు నడిపి ట్రోఫీని ముద్దాడాడు. తద్వారా ధోని తర్వాత అత్యధిక సార్లు టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌గా నిలిచాడు ఈ వన్డే ‘ట్రిపుల్’ డబుల్ సెంచరీల వీరుడు.మరి కపిల్ దేవ్, ధోని, రోహిత్ శర్మ.. కెప్టెన్లుగా ఈ ఘనతలు సాధించారంటే అందుకు అప్పటి జట్లలో ఉన్న ఆటగాళ్లది కూడా కీలక పాత్ర. 1983లో ఆల్‌రౌండర్ మొహిందర్ అమర్నాథ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి జట్టును ఫైనల్‌కు చేర్చాడు.ఇక 2011 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లిలు కూడా అద్భుతంగా ఆడారు. హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ తమ వంతు పాత్ర పోషించగా.. తాజా చాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్ రోహిత్, కోహ్లిలతో పాటు రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ కూడా రాణించారు.బుమ్రాకు దక్కని చోటుఈ నేపథ్యంలో తన ఆల్‌టైమ్ వన్డే తుదిజట్లులో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ వీరందరికి చోటివ్వడం గమనార్హం. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత చిన్నపిల్లాడిలా గంతులేసిన ఈ మాజీ సారథి... తాజాగా తన వన్డే బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను పంచుకున్నాడు. ఈ జట్టులో క్రికెట్ దేవుడ్, వంద శతకాల వీరుడు సచిన్ టెండుల్కర్‌కు ఓపెనర్‌గా గావస్కర్ చోటిచ్చాడు. అయితే, ఈ జట్టుకు టీమిండియా ప్రధాన పేసర్, ప్రపంచస్థాయి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను మాత్రం గావ స్కర్ ఎంపిక చేయలేదు.సునిల్ గావస్కర్ ఆల్‌టైమ్ వన్డే ఎలెవన్:సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మొహిందర్ అమర్నాథ్, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), కపిల్ దేవ్, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, మహ్మద్ షమీ, జహీర్ ఖాన్. భారత్ గెలిచిన ఐసీసీ టైటిళ్లు ఇవే1983- వన్డే వరల్డ్‌కప్2002- చాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా 2007- టీ20 ప్రపంచకప్2011- వన్డే వరల్డ్‌కప్2013- చాంపియన్స్ ట్రోఫీ2024- టీ20 ప్రపంచకప్2025- చాంపియన్స్ ట్రోఫీ.చదవండి: Team of the Tourney 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్‌కు దక్కని చోటు -
ఛాంపియన్స్‌గా భారత్.. చిన్నపిల్లాడిలా గంతులేసిన గవాస్కర్! వీడియో
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 12 ఏళ్ల తర్వాత టీమిండియా వశమైంది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్‌ను ముద్దాడింది. రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ కొట్టగానే స్టేడియంలో ఉన్న భారత అభిమానలతో పాటు దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) ఆనందానికి అవధలు లేకుండా పోయాయి. ఫైనల్ పోరులో కామెంటేటర్‌గా వ్యవహరించిన గవాస్కర్.. టీమిండియా గెలిచిన వెంటనే మైదానంలో వచ్చి సందడి చేశాడు. 75 ఏళ్ల వయసులోనూ ఆయన చిన్నపిల్లాడిలా డ్యాన్స్ చేస్తూ టీమిండియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.సహచర కామెంటేటర్లు వారి సెల్ఫోన్లలో అద్బుత క్షణాలను బంధించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా ప్లేయర్లు కూడా ట్రోఫీని అందుకున్నాక తమదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ అలరించారు.కాగా భారత్‌కు ఇది మూడో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కావడం విశేషం. 2002లో శ్రీలంకతో ట్రోఫీని సంయుక్తంగా పంచుకున్న భారత జట్టు.. ఆ తర్వాత 2013, 2025లో ఛాంపియన్స్‌గా నిలిచింది. అదేవిధంగా తొమ్మిది నెలల వ్యవధిలో భారత్‌కు ఇది రెండో ఐసీసీ టైటిల్ కావడం గమనార్హం.ఇక ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63), మైఖేల్ బ్రేస్‌వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఆరు వికెట్లు కోల్పోయి చేధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రోహిత్ శర్మ 74 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. Sunil Gavaskar after India won champions trophy 😂😂😂I think now we can understand his harsh criticism of players pic.twitter.com/rWNsT8k47b— Chintan Patel (@Patel_Chintan_) March 9, 2025 -
రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడితే...
న్యూఢిల్లీ: భారత కెప్టెన్ , స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫైనల్లో భారీ ఇన్నింగ్స్ ఆడితే అది మ్యాచ్‌నే ప్రభావితం చేస్తుందని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ విశ్లేషించారు. ‘హిట్‌మ్యాన్’ 25, 30 పరుగులకే పరిమితం కాకుండా ఎక్కువసేపు క్రీజులో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ టోర్నీలో రోహిత్ మెరుపు ఆరంభాల కోసం ప్రతిసారి ఎదురుదాడికి దిగుతున్నాడు. కానీ ఇదే క్రమంలో వెంటనే అవుటవుతున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌పై చేసిన 41 పరుగులే రోహిత్ అత్యధిక స్కోరుగా ఉంది. దీనిపై గావస్కర్ మాట్లాడుతూ ‘ఒకవేళ రోహిత్ 25 ఓవర్లపాటు బ్యాటింగ్ చేస్తే భారత్ 180 నుంచి 200 పరుగులు సాధిస్తుంది. అప్పుడు రెండు, మూడు వికెట్లు పడినా ఇన్నింగ్స్‌కు ఏ ఇబ్బంది ఉండదు. అక్కడి నుంచి సులువుగా 350 పరుగుల మార్క్‌ను దాటేస్తుంది. ఈ విషయాన్ని భారత కెపె్టన్ గుర్తుంచుకోవాలి. ఓపెనింగ్ మెరుపులు మెరిపించి వెళ్లడం కంటే కూడా కాస్త దూకుడుగా ఆడుతూ కనీసం 25–30 ఓవర్ల పాటు క్రీజును అట్టిపెట్టుకుంటే మ్యాచ్ రూపురేఖలే మారుతాయ్. రోహిత్ ఆట ఇన్నింగ్స్‌పై పెను ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యర్థి చేతుల్లోంచి లాగేసుకోవచ్చు’ అని అన్నారు. భారత కెప్టెన్ పాక్‌పై 20, న్యూజిలాండ్‌పై 15, ఆ్రస్టేలియాపై 28 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు అర్ధసెంచరీ కూడా బాదలేకపోయాడు. న్యూజిలాండ్‌కు నాసిర్ హుస్సేన్ మద్దతు చాంపియన్స్ ట్రోఫీలో భారత్ అజేయమైన జట్టే అయినప్పటికీ ఫైనల్లో ట్రోఫీ గెలిచే అర్హత న్యూజిలాండ్‌కే ఉందని ఇంగ్లండ్ మాజీ కెపె్టన్ నాసిర్ హుస్సేన్ అన్నాడు. ‘కివీ క్రికెటర్లు చోకర్లు కాదు. ఒత్తిడిలోనూ నిలబడే స్థైర్యం వారికుంది. ప్రపంచశ్రేణి ఆటగాళ్లు ప్రస్తుత జట్టులో ఉన్నారు. అమీతుమీలో వారంతా శక్తికిమించే పోరాడతారు’ అని వివరించాడు. -
25-30 పరుగులు చేస్తే చాలా?: గంభీర్‌కు టీమిండియా దిగ్గజం కౌంటర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar) కీలక సూచనలు చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఫైనల్లో దూకుడు వద్దని.. సంయమనంతో ఆడాలని సూచించాడు. అదే విధంగా.. రోహిత్ బ్యాటింగ్ శైలిని సమర్థిస్తూ హెడ్‌కోచ్ గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని సన్నీ కుండబద్దలు కొట్టాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ ముగింపు దశకు చేరుకున్న విషయం తెలిసిందే.తొలి సెమీస్‌లో ఆస్ట్రేలియాను టీమిండియా.. రెండో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్ ఓడించాయి. ఈ క్రమంలో దుబాయ్‌లో ఆదివారం నాటి టైటిల్ పోరులో టీమిండియా- న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ వన్డే టోర్నమెంట్‌కు ఆతిథ్యం దేశం పాకిస్తాన్ అయినప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడుతోన్న విషయం తెలిసిందే.ఒక్క ఫిఫ్టీ కూడా లేదుగ్రూప్ దశలో భాగంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను చిత్తు చేసిన భారత్.. సెమీస్‌లోనూ సత్తా చాటి అజేయంగా ఫైనల్లో అడుగుపెట్టింది. అంతాబాగానే ఉన్నా కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి మాత్రం ఇంత వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన రాలేదు. నాలుగు మ్యాచ్‌లలో అతడు చేసిన స్కోర్లు వరుసగా... 41(36 బంతుల్లో), 20(15 బంతుల్లో), 15(17 బంతుల్లో), 28(29 బంతుల్లో).దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. దీంతో రోహిత్ శర్మ బ్యాటింగ్, భవిష్యత్‌పై విమర్శలు రాగా.. గంభీర్ అతడికి మద్దతుగా నిలిచాడు. అద్భుతమైన టెంపోతో ఆడుతున్న హిట్‌మ్యాన్ జట్టుకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాడని పేర్కొన్నాడు.గంభీర్ వ్యాఖ్యలతో ఏకీభవించని గావస్కర్ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘కెప్టెన్‌గా అతడు జట్టును ప్రభావితం చేస్తున్నాడన్నది నిజమే. అయితే, బ్యాటర్‌గా 25-30 పరుగులు మాత్రమే చేస్తే తన ప్రదర్శన పట్ల అతడు సంతోషంగా ఉంటాడా? ఓ బ్యాటర్‌గా అదొక లోటే.జట్టుపై నీ ఆట తీరుతో ప్రభావం చూపడం ఎంత ముఖ్యమో.. బ్యాటర్‌గా ఓ 25 ఓవర్ల పాటు క్రీజులో నిలబడితే మరింత గొప్పగా ప్రభావితం చేయవచ్చు. ఏడు, ఎనిమిది, తొమ్మిది ఓవర్లపాటే ఆడితే మజా ఏం ఉంటుంది?వైవిధ్యభరిత షాట్లు ఆడటంలో దిట్ట.. కానీదూకుడుగా ఆడటం మంచిదే కావొచ్చు. కానీ.. కొన్నిసార్లు అది బెడిసికొట్టవచ్చు. నిజానికి రోహిత్ గనుక 25- 30 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తే.. టీమిండియా సగం ఇన్నింగ్స్ తర్వాత 180- 200 పరుగులకు చేరుకుంటుంది. ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకునే సత్తా రోహిత్‌కు ఉంది. అతడొక ప్రతిభావంతుడైన బ్యాటర్.వైవిధ్యభరిత షాట్లు ఆడటంలో దిట్ట. అయితే, గత వన్డే వరల్డ్‌కప్ నుంచి రోహిత్ శైలి పూర్తిగా మారిపోయింది, దూకుడుగా ఆడేందుకు అతడు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. కొన్నిసార్లు ఈ విషయంలో విజయవంతమైనా.. కీలక మ్యాచ్‌లలో మాత్రం ఆచితూచి నిలకడగా ఆడటం మంచిది’’ అని న్యూజిలాండ్‌తో ఫైనల్‌కు ముందు గావస్కర్ రోహిత శర్మకు సూచించాడు.రోహిత్ శర్మ ప్రపంచ రికార్డుఇదిలా ఉంటే.. నాలుగు ఐసీసీ ఈవెంట్లలోనూ జట్టును ఫైనల్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సాధించాడు. వన్డే, టీ20 ప్రపంచకప్ టోర్నీలు.. అదే విధంగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్, తాజాగా చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను ఫైనల్‌కు చేర్చడం ద్వారా ఈ ఘనత సాధించాడు.చదవండి: ‘లాహోర్‌లో ఫైనల్ జరిగితే బాగుండేది’.. బీసీసీఐ స్ట్రాంగ్ రియాక్షన్ -
సెలక్టర్లను ఒప్పించలేకపోయా.. కెప్టెన్‌గా అదే తీరని కోరిక: గావస్కర్ భావోద్వేగం
భారత్‌కి చెందిన నలుగురు అగ్రశ్రేణి స్పిన్ బౌలర్లు ప్రపంచ క్రికెట్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాలంలో వచ్చిన స్పిన్ బౌలర్లలో ఎడమచేతి వాటం స్పిన్నర్ పద్మాకర్ శివల్కర్(Padmakar Shivalkar) ఒకరు. 84 సంవత్సరాల వయసులో ముంబైలో సోమవారం ఆయన తుది శ్వాస విడిచారు. మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ, బి ఎస్ చంద్రశేఖర్, ఇ ఎ ఎస్ ప్రసన్న, శ్రీనివాసన్ వెంకట రాఘవన్ వంటి అసాధారణ స్పిన్నర్లు ఒక దశలో ప్రపంచ క్రికెట్ ని శాసించారు. అప్పట్లో అగ్రశ్రేణి జట్లయిన వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ బ్యాటర్లు భారత స్పిన్నర్లని ఎదుర్కొనడానికి భయపడిన సందర్భాలు కోకొల్లలు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌కి అనుకూలించే పిచ్‌లపై భారత్ బౌలర్లు చెలరేగిపోయి బౌలింగ్ చేసేవారు. అటువంటి కాలంలో వచ్చిన ఇద్దరు అగ్రశ్రేణి స్పిన్ బౌలర్లకు భారత్ జట్టుకి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించలేదు.ఇప్పట్లో లాగా ఆ కాలంలో వన్డేలు, టీ20 టోర్నమెంట్లు లేవు. ఆడితే టెస్ట్ మ్యాచ్ లు ఆడాలి. ఇంక టెస్ట్ మ్యాచ్ లు అంటే జట్టుకి అత్యుత్తమ ఆటగాళ్లకే స్థానం దొరుకుతుంది. ఈ కారణంగా శివల్కర్, హర్యానా ఎడమచేతి వాటం స్పిన్నర్ రాజిందర్ గోయెల్ ఇద్దరూ తమకి అసాధారణ ప్రతిభ ఉన్నప్పటికీ భారత్ కి ఒక్క టెస్ట్ మ్యాచ్ లో కూడా ప్రాతినిధ్యం వహించే అవకాశం రాకపోవడంతో దేశవాళీ క్రికెట్ కే పరిమితమయ్యారు.గావస్కర్ తీరని కోరిక "నాకు తీరని కోరికగా మిగిలిపోయినది ఏమిటంటే, అప్పటి భారత జట్టు కెప్టెన్‌గా, గోయల్ సాబ్ మరియు పాడీ ( పద్మాకర్ శివల్కర్) లను భారతదేశం తరపున ఆడటానికి సెలెక్టర్లను నేను ఒప్పించలేకపోయాను" అని 2017లో గోయల్ మరియు శివల్కర్లకు సికే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేసిన సందర్భంగా 'లిటిల్ మాస్టర్' సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) వ్యాఖ్యానించడం విశేషం."నేను చూసిన గొప్ప ఎడమచేతి వాటం బౌలర్ బిషన్ సింగ్ బేడి ఉన్న కాలంలోనే వారు జన్మించారు. లేకుంటే వారు కూడా భారతదేశం తరపున చాలా టెస్టులు ఆడి ఉండేవారు" అని గవాస్కర్ వ్యాఖ్యానించాడు.రంజీ ట్రోఫీలో ఆధిపత్యంరంజీ ట్రోఫీలో అత్యంత విజయవంతమైన జట్టు అయిన బాంబే (ఇప్పుడు ముంబై) తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న కాలంలో గవాస్కర్ శివల్కర్తో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నారు. 1965-66 నుండి 1976-77 వరకు బొంబాయి గెలిచిన పది రంజీ ట్రోఫీ ఛాంపియన్షిప్ టైటిల్స్ గెలిచిన కాలంలో శివల్కర్ తన స్పిన్ మాయాజాలంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ కాలంలో ఒక సీజన్ తప్ప ప్రతి సీజన్లోనూ బాంబే (ఇప్పుడు ముంబై) టైటిల్‌ను గెలుచుకుంది. మళ్ళీ బాంబే 1980-81లో రంజీ ట్రోఫీ కిరీటాన్ని చేజిక్కించుకున్న జట్టులో కూడా శివల్కర్ ఉన్నాడు. ఆశ్చర్యకరంగా శివల్కర్ ఏడు సంవత్సరాల విరామం తరువాత 47 సంవత్సరాల వయస్సులో తిరిగి వచ్చి 1987-88 సీజన్లో రెండు మ్యాచ్‌లు ఆడాడు.శివల్కర్ ఫస్ట్-క్లాస్ అరంగేట్రం ఏప్రిల్ 1962లో జరిగింది, అతను ప్రపంచ పర్యటనకు వెళ్తున్న అంతర్జాతీయ XIతో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్స్ XIలో ఎంపికయ్యాడు. బాబ్ సింప్సన్, టామ్ గ్రావెనీ, కాలిన్ కౌడ్రీ, ఎవర్టన్ వీక్స్, రిచీ బెనాడ్ మరియు సోనీ రామధిన్ వంటి ప్రముఖులతో కూడిన ఆ జట్టుపై, శివల్కర్ 129 పరుగులకు 5 వికెట్లు మరియు 44 పరుగులకు 2 వికెట్లు తీసి మ్యాచ్ ని డ్రాగా ముగించాడు.రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన ముంబై బౌలర్మొత్తం మీద, శివల్కర్ 124 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 19.69 సగటుతో 589 వికెట్లు పడగొట్టాడు. ఆ వికెట్లలో 361 రంజీ ట్రోఫీలో వచ్చాయి. రంజీల్లో ఏ ముంబై బౌలర్ కూడా ఇంతకంటే ఎక్కువ వికెట్లు తీయకపోవడం గమనార్హం. 1972-73లో తమిళనాడుతో జరిగిన ఫైనల్లో శివల్కర్ చెలరేగిపోయి 16 పరుగులకు 8 వికెట్లు తన అత్యుత్తమ బౌలింగ్ ని నమోదు చేసుకున్నాడు. "భారత క్రికెట్ నేడు నిజమైన లెజెండ్‌ను కోల్పోయింది.ఎడమచేతి వాటం స్పిన్‌పై పద్మాకర్ శివల్కర్కు ఉన్న నైపుణ్యం మరియు ఆటపై ఆయనకున్న లోతైన అవగాహన ఆయనను దేశీయ క్రికెట్లో గౌరవనీయమైన వ్యక్తిగా మార్చాయి. ముంబై మరియు భారత క్రికెట్‌కు ఆయన చేసిన అసాధారణ నిస్వార్థ సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను, " అని భారత మాజీ మీడియం పేసర్ మరియు ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఒక ప్రకటనలో తెలిపారుభారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కూడా ఆయన మృతికి సంతాపం తెలిపారు. “శివల్కర్ ముంబై యొక్క గొప్ప మ్యాచ్ విజేతలలో ఒకరు, ఆటలో ప్రముఖుడు, ఫస్ట్-క్లాస్ క్రికెట్లో తన అపారమైన రికార్డు ఉన్నప్పటికీ, భారత క్యాప్‌ను ధరించకపోవడం దురదృష్టకరం” అని జాఫర్ అన్నారు. “ఎంతో వినయం, నిజాయితీ కలిగిన శివల్కర్ కి మైదానంలో, మైదానం బయట అనేక మంది అభిమానులు ఉన్నారు. వారంతా ఆయనను ఆరాధించారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి” అని జాఫర్ వ్యాఖ్యానించాడు.చదవండి: CT 2025: కివీస్‌తో సెమీస్.. సఫారీలకు గాయాల బెడద! జట్టులోకి స్టార్ ప్లేయర్ -
భారత్‌కు అడ్వాంటేజ్.. ఇంగ్లండ్ మాజీలకు ఇచ్చిపడేసిన గవాస్కర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 పాకిస్తాన్, దుబాయ్ వేదికలగా హైబ్రిడ్ మోడల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ టోర్నీ పాకిస్తాన్ ఒక్క వేదికగానే జరగాల్సి ఉండగా.. ఆ దేశానికి భారత జట్టును పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. భారత క్రికెట్ బోర్డు ఆటగాళ్ల భద్రతను కారణంగా ఐసీసీకి చూపించింది.దీంతో ఐసీసీ ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పీసీబీని ఒప్పించింది. దీంతో భారత్ తమ మ్యాచ్‌లను దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఆడుతోంది. ఈ క్రమంలో ఒకే వేదికలో మ్యాచ్‌లను నిర్వహించడం ద్వారా భారత్‌కు అడ్వాంటేజ్ కలుగుతోందని ఇంగ్లండ్ మాజీలు నాజర్ హుస్సేన్, మైఖేల్ అథర్టన్ ఐసీసీ తీరును తప్పుబట్టారు.వీరిద్దరే కాకుండా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్, ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఈ తరహా కామెంట్సే చేశారు. తాజాగా ఇంగ్లండ్ మాజీల వ్యాఖ్యలకు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ గట్టి కౌంటరిచ్చాడు. ముందు మీ జట్టు సంగతి చూసుకుండి, తర్వాత ఇతర జట్ల గురించి మాట్లాడండి అంటూ సన్నీ ఫైరయ్యాడు."మీరంతా ఎంతో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు. అంతేకాకుండా చాలా తెలివైన వారు కూడా. అసలు మీ జట్టు(ఇంగ్లండ్) ఎందుకు సెమీస్‌కు ఆర్హత సాధించలేకపోయిందో సమీక్షించుకుండి సర్. ఎప్పుడూ భారత జట్టుపై దృష్టి సారించే బదులు, మీ సొంత టీమ్‌పై ఫోకస్ చేయవచ్చుగా. మీ ఆటగాళ్లు చాలా పేలవంగా ఆడుతున్నారు. వారు అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోతున్నారు. ఫస్ట్ మీ దేశం, మీ టీమ్ గురుంచి ఆలోచించడండి. అంతే తప్ప భారత్‌కు అది జరిగింది, భారత్ ఇలా ఆడింది అని పనికిమాలిన కామెంట్స్ ఎందుకు. భారత జట్టు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. మీ వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోరు. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ సేవలు అద్బుతం.ఆటపరంగానే కాకుండా, ఆర్థికపరంగా కూడా వెన్నుదన్నుగా నిలుస్తోంది. టెలివిజన్ హక్కులు. మీడియా ఆదాయం ద్వారా భారీగా ఆదాయం వస్తోంది. కామెంటేర్లగా మీరు తీసుకుంటున్న జీతాలు కూడా భారత్ వల్లేనన్న విషయం మర్చిపోకండి "అంటూ ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ మండిపడ్డాడు.కాగా ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ జట్టు గ్రూపు స్టేజిలోనే ఇంటి ముఖం పట్టింది. అఫ్గానిస్తాన్ చేతిలో మరోసారి ఇంగ్లండ్ ఓటమి పాలైంది. ఈ ఓటుములకు నైతిక బాధ్యత వహిస్తూ ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి జోస్ బట్లర్ తప్పుకున్నాడు. ఇంగ్లండ్ తమ ఆఖరి మ్యాచ్ శనివారం రావల్పిండి వేదికగా దక్షిణాఫ్రికాతో ఆడుతోంది.చదవండి: 'భారత్‌దే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఒకే ఒక్క పరుగు తేడాతో'.. క్లార్క్ జోస్యం -
ఇమ్రాన్ ఖాన్ వల్లే నా పేరు చరిత్రలో నిలిచిపోయింది: టీమిండియా దిగ్గజం
మార్చి 7, 1987లో టెస్టుల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar). తద్వారా ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు పద్నాలుగు మంది ఈ ఫీట్ నమోదు చేసినా.. ఈ జాబితాలోకి ఎక్కిన మొదటి ఆటగాడిగా గావస్కర్ పేరు మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉండిపోతుంది.అయితే, ఇంతటి ఘనమైన రికార్డు సాధించడానికి పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్(Imran Khan) మాటలే కారణం అంటున్నాడు సునిల్ గావస్కర్. టెన్ స్పోర్ట్స్ షోలో భాగంగా పాక్ మాజీ సారథి వసీం అక్రం(Wasim Akram) అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఈ విషయాన్ని తెలిపాడు. ‘‘పదివేల పరుగులు సాధించడం అత్యద్భుతమైన అనుభూతి.వెయ్యి పరుగులు చేసినాక్రికెటర్గా కెరీర్ మొదలుపెట్టినప్పుడు నేను ఇక్కడిదాకా చేరుకుంటానని అస్సలు ఊహించలేదు. వెయ్యి పరుగులు చేసినా ఇంతే సంతోషంగా ఉండేవాడినేమో!.. నిజానికి ఈ మైల్స్టోన్ చేరుకోవాలనే లక్ష్యం నాకైతే లేదు. ఏదేమైనా.. టెంజింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తులుగా ఎలా చరిత్రలో నిలిచిపోతారో.. నేనూ ఈ మైలురాయికి చేరుకున్న మొదటి ఆటగాడిగా అలాగే గుర్తుండిపోతాను.నిజానికి నేను ఈ ఘనత సాధించడానికి ఏకైక కారణం ఇమ్రాన్ ఖాన్. అప్పుడు మేము ఇంగ్లండ్‌లో ఉన్నాం. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి ఓ ఇటాలియన్ రెస్టారెంట్లో భోజనానికి వెళ్లాము. 1986లో ఇది జరిగింది. ఆరోజు.. నేను ఇమ్రాన్‌తో ఇదే నా చివరి సిరీస్ అని చెప్పాను. ఆ తర్వాతరిటైరైపోతానని అన్నాను.అలా అస్సలు చేయొద్దుఅందుకు అతడు.. ‘లేదు.. లేదు.. అలా అస్సలు చేయొద్దు’ అన్నాడు. అందుకు నేను.. ‘ఎందుకు? ఇది నా ఇష్టం కదా’ అన్నాను. దీంతో ఇమ్రాన్ కలుగుచేసుకుంటూ.. ‘త్వరలోనే పాకిస్తాన్ జట్టు భారత్‌కు రాబోతోంది. అక్కడ మేము మీ జట్టును ఓడిస్తాం. నువ్వున్న భారత జట్టును ఓడిస్తేనే అసలు మజా. నువ్వు లేకుండా టీమిండియాను ఓడించడం నాకైతే నచ్చదు’ అన్నాడు.అవునా.. పాక్ టీమ్ ఇండియాకు వస్తుందా? నిజమా అని అడిగాను. అవును.. ఐసీసీ సమావేశం తర్వాత వచ్చే వారం ప్రకటన వస్తుంది చూడు అన్నాడు. ఒకవేళ ఆ అనౌన్స్మెంట్ వస్తే ఓకే. నేను ఆటలో కొనసాగుతా. లేదంటే రిటైర్ అవుతా అన్నాను. ఇక పాకిస్తాన్‌తో సిరీస్‌కు ముందు మరో రెండో మూడో మ్యాచ్‌లు జరిగాయి. అప్పటికి నేను బహుశా 9200- 9300 పరుగుల వద్ద ఉన్నాననుకుంటా.ఇమ్రాన్ ఖాన్ వల్లే నా పేరు చరిత్రలో నిలిచిపోయిందిఏదేమైనా ఇమ్రాన్ ఖాన్ వల్లే నాకు ఈ అరుదైన రికార్డు దక్కింది’’ అని గావస్కర్ చెప్పుకొచ్చాడు. కాగా 1971 నుంచి 1987 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన సన్నీ 125 టెస్టులు, 108 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 34 శతకాలు, నాలుగు డబుల్ సెంచరీల సాయంతో 10122 రన్స్ చేసిన గావస్కర్.. వన్డేల్లో ఒక సెంచరీ సాయంతో 3092 పరుగులు సాధించాడు. 75 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. చదవండి: ఆస్ట్రేలియానూ వదలకండి: అఫ్గనిస్తాన్ జట్టుపై పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు -
ఇండియా బి టీమ్‌పై కూడా పాక్ గెలవలేదు: సునీల్ గవాస్కర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్(Pakistan) గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. న్యూజిలాండ్ చేతిలో బంగ్లాదేశ్‌తో ఓటమి పాలవ్వడంతో పాక్ సెమీస్ ఆశలు అవిరయ్యాయి. ఒకవేళ ఈ మ్యాచ్‌లో బంగ్లా గెలిచి ఉంటే పాక్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండేవి. అయితే టోర్నీలో పాక్ దారుణ ప్రదర్శన కనబరిచింది. తమ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 60 పరుగుల తేడాతో ఓటమి పాలైన పాక్.. ఆ తర్వాత భారత్ చేతిలో 6 వికెట్ల తేడాతో దారుణ పరాజయాన్ని చవిచూసింది.దీంతో పాక్ కథ టోర్నీ ప్రారంభమైన కేవలం ఆరు రోజుల్లోనే ముగిసిపోయింది. ఈ క్రమంలో పాక్ జట్టు ముప్పేట దాడిని ఎదుర్కొంటుంది. తాజాగా పాక్ జట్టుపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) విమర్శలు గుప్పించారు. ప్రస్తుత పాకిస్తాన్ జట్టు ఇండియన్-బి టీమ్‌ను కూడా ఓడించలేదని ఆయన ఎద్దేవా చేశారు."పాకిస్తాన్ జట్టు బెంచ్ అంత బలంగా లేకపోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. పాకిస్తాన్ జట్టులో ఒకప్పుడు సహజమైన నైపుణ్యాలు, ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉండేవారు. టెక్నికల్‌గా వారు అంత గొప్పగా లేకపోయినా, గేమ్‌పై మాత్రం వారికి మంచి అవగహన ఉండేది. బ్యాట్‌తో పాటు బంతితో కూడా అద్భుతాలు చేసేవారు. ఉదాహరణకు ఇంజమామ్-ఉల్-హక్‌ను తీసుకుంటే... అతడిలా ఉండాలని యువ ఆటగాళ్లకు సలహా ఇవ్వలేం. కానీ ఆట పట్ల అతడికి ఒక తరహా పిచ్చి ఉండేదని చెప్పవచ్చు. ఆటే పరమావధిగా ముందుకు సాగేవాడు. తన దూకుడుతో ఒక్కోసారి సాంకేతిక లోపాలను అధిగమించి అనుకున్న ఫలితాన్ని రాబట్టడంలోనూ సఫలమయ్యేవాడు. ప్రస్తుతం ఉన్న ఫామ్‌తో పాక్ జట్టు, భారత్-బి టీమ్‌పై కూడా గెలవలేదు. సి టీమ్ విషయంలో కచ్చితంగా చెప్పలేను" ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు.చదవండి: భారత్ పటిష్ట జట్టు.. ఆ అడ్వాంటేజ్ కూడా ఉండటం వల్ల..: కమిన్స్ -
ఇదేం తీరు కోహ్లి? ఇలాంటివి అవసరమా?.. మండిపడ్డ గావస్కర్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) తీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar) అసహనం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్(India vs Pakistan)తో మ్యాచ్‌లో అనవసర చర్య ద్వారా వికెట్ కోల్పోయే ప్రమాదం తెచ్చుకున్నాడని.. అయితే, అదృష్టవశాత్తూ బయటపడటంతో తాము ఊపిరి పీల్చుకున్నామన్నాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్ ఆదివారం పాకిస్తాన్‌తో తలపడింది.దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన రోహిత్ సేన తొలుత ఫీల్డింగ్ చేసింది. బౌలర్ల విజృంభణ కారణంగా దాయాదిని 241 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనను దూకుడుగా ఆరంభించిన టీమిండియా.. మిడిల్ ఓవర్లలో మాత్రం ఆచితూచి నిలకడగా ఆడింది. సెంచరీ మార్కు.. విన్నింగ్ షాట్ముఖ్యంగా ఓపెనర్ శుబ్‌మన్ గిల్(46), నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(56)లతో కలిసి విరాట్ కోహ్లి అద్భుత భాగస్వామ్యాలు నెలకొల్పాడు.ఏ దశలో నిర్లక్ష్యపు షాట్లకు యత్నించకుండా.. సహచర బ్యాటర్లతో చక్కగా సమన్వయం చేసుకుంటూ ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ క్రమంలో అర్ధ శతకం పూర్తి చేసుకున్న కోహ్లి.. దానిని శతకంగా మలిచాడు. అంతేకాదు బౌండరీ బాది సెంచరీ మార్కు అందుకున్న ఈ రన్‌మెషీన్.. టీమిండియాను గెలుపుతీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లిపై భారత్‌తో పాటు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.అయితే, బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లి చేసిన ఓ పని మాత్రం సునిల్ గావస్కర్‌కు ఆగ్రహం తెప్పించింది. భారత ఇన్నింగ్స్‌లో 21 ఓవర్‌ను పాక్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ వేయగా.. ఐదో బంతికి కోహ్లి సింగిల్ తీశాడు. ఈ క్రమంలో సురక్షితంగానే క్రీజులోకి చేరుకున్న కోహ్లి.. ఆ తర్వాత ఓవర్ త్రో కాబోతున్న బంతిని తన చేతితో ఆపేశాడు.నిజానికి అక్కడ దగ్గర్లో పాకిస్తాన్ ఫీల్డర్లు ఎవరూ లేరు. ఒకవేళ ఓవర్ త్రో అయినా ఓ అదనపు పరుగు వచ్చేది. అయినా, ఎంసీసీ నిబంధనల ప్రకారం ఓ బ్యాటర్ బంతి లైవ్‌లో ఉన్నపుడు దానిని తన మాటలు, చేతల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా అతడు అలా చేసినట్లు భావించి ఫీల్డింగ్ చేస్తున్న జట్టు అప్పీలు చేస్తే.. సదరు బ్యాటర్‌ను అవుట్‌గా ప్రకటించవచ్చు.అబ్స్ట్రక్ట్ ఫీల్డ్ నిబంధన కింద..కోహ్లి విషయంలో ఒకవేళ పాక్ జట్టు ఈ విషయంలో అప్పీలుకు వెళ్లి ఉంటే పరిస్థితి చేజారిపోయేదని గావస్కర్ అన్నాడు. కామెంట్రీ సమయంలో.. ‘‘అతడు తన చేతితో బంతిని ఆపాడు. ఒకవేళ పాకిస్తాన్ గనుక అప్పీలు చేస్తే ఏమయ్యేది?.. అబ్స్ట్రక్ట్ ఫీల్డ్ నిబంధన కింద అతడు అవుటయ్యేవాడేమో?!.. కానీ వాళ్లు అలా చేయలేదు. ఎందుకంటే.. అక్కడ దగ్గర్లో ఫీల్డర్ లేడు.అంతేకాదు ఓవర్ త్రో ద్వారా అదనపు పరుగు రాకుండా ఉండిపోయిందని భావించి ఉండవచ్చు. నిజానికి మిడ్‌వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాడు డైవ్ చేస్తే బాగుండేది. కానీ ముందుకు వెళ్లిపోతున్న బంతిని కోహ్లి జోక్యం చేసుకుని మరీ ఆపడం సరికాదు. అదృష్టవశాత్తూ ఎవరూ అప్పీలు చేయలేదు కాబట్టి సరిపోయింది’’ అని గావస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. కాగా 21వ ఓవర్ ముగిసే సరికి కోహ్లి కేవలం 41 పరుగుల వద్ద ఉండటం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో 111 బంతులు ఎదుర్కొన్న కోహ్లి సరిగ్గా 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వన్డేల్లో అతడికి ఇది 51వ సెంచరీ కాగా.. అంతర్జాతీయ కెరీర్లో 82వది కావడం విశేషం. సచిన్ టెండ్కులర్ వంద సెంచరీల రికార్డుకు కోహ్లి ఇంకా 18 శతకాల దూరంలో ఉన్నాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025: భారత్ వర్సెస్ పాకిస్తాన్ స్కోర్లు👉పాకిస్తాన్- 241(49.4) ఆలౌట్👉భారత్- 244/4 (42.3)👉ఫలితం: పాక్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన భారత్.చదవండి: ‘ఏంటిది?’.. రిజ్వాన్ చర్యకు హర్షిత్ రాణా రియాక్షన్ వైరల్.. గంభీర్ కూడా! -
పాక్‌తో మ్యాచ్‌లో అతడిని ఆడించాల్సింది.. కానీ: గావస్కర్
బంగ్లాదేశ్‌పై గెలుపొంది చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)ని విజయంతో ఆరంభించింది టీమిండియా. రెండో మ్యాచ్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో రోహిత్ సేన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్(India vs Pakistan)ను ఢీకొట్టింది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ భారత జట్టును తొలుత ఫీల్డింగ్‌కు ఆహ్వానించింది.ఆ నలుగురు మళ్లీ బెంచ్ మీదేఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. బంగ్లాదేశ్‌తో ఆడిన తుదిజట్టునే పాక్‌తో మ్యాచ్‌లోనూ కొనసాగించింది. స్టార్ ప్లేయర్లు రిషభ్ పంత్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్‌కు మరోసారి మొండిచేయి చూపింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ టాస్ సమయంలో స్పోర్ట్స్ ప్రజెంటర్ మయాంతి లాంగర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ప్లేయింగ్ ఎలెవన్ విషయంలో మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాడు.ఒక్క మార్పు చేసి ఉంటే బాగుండేది..‘‘అయినా.. వాళ్లెందుకు తుదిజట్టులో మార్పులు చేయాలి? ఇది స్లో వికెట్. అంతేగాక ప్రస్తుత ప్లేయింగ్ ఎలెవన్‌తోనే వారు గత మ్యాచ్ గెలిచారు. అయితే, ఒక్క మార్పు చేసి ఉంటే బాగుండేది. వరుణ్ చక్రవర్తిని పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆడించి ఉండాల్సింది. కానీ గత మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన మహ్మద్ షమీని ఎలా పక్కనపెట్టగలరు?అంతేగాక.. మరో పేసర్ హర్షిత్ రాణా కూడా గత మ్యాచ్‌లో ఎలాంటి తప్పిదాలు చేయలేదు. అందుకే టీమిండియాపాక్తో పోరులోనూ అదే జట్టుతో బరిలోకి దిగింది’’ అని సునిల్ గావస్కర్ నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ మాత్రం ఒక మార్పుతో మైదానంలో దిగింది. ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడిన సమయంలో ఫఖర్ జమాన్ గాయపడగా.. భారత్‌తో మ్యాచ్‌లో సౌద్ షకీల్‌తో అతడి స్థానాన్ని భర్తీ చేసింది.2017లో చివరిసారిగాకాగా చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్- పాకిస్తాన్ 2017లో చివరిసారిగా తలపడ్డాయి. నాడు లీగ్ దశలో టీమిండియా గెలుపొందగా.. ఫైనల్లో మాత్రం పాకిస్తాన్ భారత జట్టును ఓడించిన టైటిల్ ఎగురేసుకపోయింది. ఈ క్రమంలో దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మరోసారి చాంపియన్స్ ట్రోఫీ జరుగుతుండగా. ఆతిథ్య జట్టు హోదాలో డిఫెండింగ్ చాంపియన్‌గా పాక్ బరిలోకి దిగింది.అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడుతోంది. ఇక ఈ మెగా టోర్నీలో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ ట్రోఫీ కోసం తలపడుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో పాకిస్తాన్‌పై న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌పై భారత్, అఫ్గనిస్తాన్‌పై సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా గెలుపొందాయి. పాయింట్ల పట్టికలో గ్రూప్-ఎ నుంచి న్యూజిలాండ్.. గ్రూప్-బి నుంచి సౌతాఫ్రికా టాప్‌లో ఉన్నాయి.పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత తుదిజట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.పాకిస్తాన్ ప్లేయింగ్ ఎలెవన్సౌద్ షకీల్, బాబర్ ఆజం, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్/వికెట్ కీపర్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహిన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.చదవండి: షమీ చెత్త రికార్డు.. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే.. -
Champions Trophy 2025: పాకిస్తాన్ మ్యాచ్‌లో అతన్ని పక్కన పెట్టండి..!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భారత్ రేపు కీలక మ్యాచ్ ఆడనుంది. దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓ కీలక మార్పు చేయాలని దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) సూచించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన హర్షిత్ రాణాను (Harshit Rana) పక్కన పెట్టాలని సలహా ఇచ్చాడు. రాణా స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి (Varun Chakravarthy) అవకాశం ఇవ్వాలని కోరాడు. బంగ్లాతో మ్యాచ్‌లో పేసర్లే అధికంగా వికెట్లు తీసినప్పటికీ.. స్పిన్నర్లు టీమిండియా గెలుపులో ప్రధాన పాత్ర పోషించారని అన్నాడు. బంగ్లాదేశ్ మ్యాచ్‌లో పేసర్ల కంటే స్పిన్నర్లే పొదుపుగా బౌలింగ్ చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. అందుకే భారత్ కీలకమైన పాకిస్తాన్ మ్యాచ్‌లో నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. షమీకి జతగా హార్దిక్ పాండ్యాను రెండో పేసర్‌గా వినియోగించుకోవాలని సలహా ఇచ్చాడు. స్పోర్ట్స్ టుడేతో మాట్లాడుతూ గవాస్కర్ ఈ విషయాలను వెల్లడించాడు.కాగా, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బౌలర్లతో పాటు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ భారత విజయంలో కీలకపాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. భారత బౌలర్లు చెలరేగడంతో ఆదిలో కష్టాల్లో ఎదుర్కొంది. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను తౌహిద్ హృదయ్ (100) వీరోచిత సెంచరీతో ఆదుకున్నాడు. అతనికి జాకిర్ అలీ (68) సహకరించడంతో బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోర్ (228) చేయగలిగింది. ఐసీసీ ఈవెంట్లలో చెలరేగిపోయే మహ్మద్ షమీ ఈ మ్యాచ్‌లోనూ జూలు విదిల్చి ఐదు వికెట్లు తీశాడు. మరో పేసర్ హర్షిత్ రాణా 3 వికెట్లు పడగొట్టాడు. స్పిన్నర్ అక్షర్ పటేల్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 2 వికెట్లు తీశాడు. రోహిత్ తప్పిదం వల్ల ఈ మ్యాచ్‌లో అక్షర్ హ్యాట్రిక్ తీసే సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. మిగతా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ సైతం పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్లు తీయలేకపోయారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ కూడా ఇబ్బంది పడింది. రోహిత్ (41) తన సహజ శైలిలో బ్యాట్‌ను ఝులిపించినప్పటికీ భారీ స్కోర్ చేయలేకపోయాడు. శుభ్‌మన్ గిల్ బాధ్యతాయుతమై సెంచరీతో చివరి వరకు క్రీజ్‌లో ఉండి భారత విజయాన్ని ఖరారు చేశాడు. అతనికి కేఎల్ రాహుల్ సహకరించాడు. ఇన్నింగ్స్ మధ్యలో భారత్ స్వల్ప వ్యవధిలో విరాట్ కోహ్లి(22), శ్రేయస్ అయ్యర్ (15), అక్షర్ పటేల్ (8) వికెట్లు కోల్పోయి తడబడింది. అయితే గిల్, రాహుల్ జాగ్రత్తగా ఆడి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. లక్ష్యం చిన్నదే అయినప్పటికీ ఛేదించేందుకు భారత్ కాస్త ఇబ్బందిపడింది. బంగ్లా బౌలర్లు.. ముఖ్యంగా స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. రిషద్ హొసేన్ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా రెండు వికెట్లు తీశాడు. మెహిది హసన్ మిరాజ్ భారత బ్యాటర్ల సహనాన్ని పరీక్షించాడు. ఈ మ్యాచ్‌లో లక్ష్యం కాస్త పెద్దదై ఉంటే టీమిండియా ఇబ్బంది పడాల్సి వచ్చేది. -
సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్(KL Rahul) తీరుపై భారత దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏ ఆటగాడైనా జట్టు ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించాలని హితవు పలికాడు. అలా కాకుండా ప్రతి ఒక్కరు స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తే ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందంటూ చురకలు అంటించాడు.కాగా టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్(India vs England ODIs)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇరుజట్ల మధ్య గురువారం నాగ్‌పూర్ వేదికగా తొలి వన్డే జరిగింది. 248 పరుగులుఇందులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్(26 బంతుల్లో 43), బెన్ డకెట్(29 బంతుల్లో 32)లు శుభారంభం అందించగా.. కెప్టెన్ జోస్ బట్లర్(67 బంతుల్లో 52), జాకొబ్ బెతెల్(64 బంతుల్లో 51) అర్ధ శతకాలతో మెరిశారు.అయితే, భారత బౌలర్ల విజృంభణ కారణంగా మరెవరూ రాణించలేకపోయారు. ఫలితంగా 47.4 ఓవర్లలో 248 పరుగులు చేసి ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణాతో పాటు రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ తీశారు.అయ్యర్ మెరుపు అర్ధ శతకంఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్(15), కెప్టెన్ రోహిత్ శర్మ(2) వికెట్లు కోల్పోగా.. శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ భారత ఇన్నింగ్స్ చక్కదిద్దారు. గిల్ పట్టుదలగా క్రీజులో నిలబడి కాస్త నెమ్మదిగానే ఆడగా.. అయ్యర్ మెరుపు అర్ధ శతకం(36 బంతుల్లో 59), అక్షర్ పటేల్(52) విలువైన హాఫ్ సెంచరీ చేసి నిష్క్రమించారు.ఈ దశలో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ శుబ్‌మన్ గిల్‌కు తోడయ్యాడు. అప్పటికి గిల్ సెంచరీకి 19 పరుగులు, టీమిండియా విజయానికి 28 పరుగులు కావాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో స్ట్రైక్‌లో ఉన్న రాహుల్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ కేఎల్ రాహుల్ వ్యవహారశైలిని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. గిల్ సెంచరీ పూర్తి చేసుకునేందుకు సహకరించే క్రమంలో రాహుల్ తన ఆటపై శ్రద్ధ పెట్టలేక నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడని మండిపడ్డాడు. హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘అతడు తన సహజశైలిలో ఆడాల్సింది.కానీ తన బ్యాటింగ్ పార్ట్నర్ సెంచరీ పూర్తి చేసుకునేందుకు వీలు కల్పించే క్రమంలో అజాగ్రత్తగా వ్యవహరించాడు. అందుకు ఫలితంగా ఏం జరిగిందో చూడండి. ఇది టీమ్ గేమ్. కాబట్టి ఏ ఆటగాడు కూడా ఇలా చేయకూడదు. స్ట్రైక్ రొటేట్ చేసేందుకు ఏదో కొత్తగా ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. ఇది పూర్తిగా అతడు అనాసక్తితో ఆడిన షాట్’’ అని గావస్కర్ కేఎల్ రాహుల్ తీరును విమర్శించాడు. కాగా ఈ మ్యాచ్‌లో గిల్ 96 బంతుల్లో 87 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.చదవండి: తుదిజట్టులో నాకసలు స్థానమే లేదు.. రోహిత్ కాల్ తర్వాత..: శ్రేయస్ అయ్యర్ -
Rohit Sharma: కొంపదీసి అందుకోసమేనా ఇదంతా?: గావస్కర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)పై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar) విమర్శలు గుప్పించాడు. ఈ ఇద్దరు ఏదో మొక్కుబడిగా రంజీలు ఆడుతున్నారే తప్ప.. జట్టును గెలిపించాలనే తపన కనిపించలేదన్నాడు. టెక్నిక్‌తో బ్యాటింగ్ చేయాల్సిన చోట.. దూకుడు ప్రదర్శించి వికెట్లు పారేసుకోవడం సరికాదని హితవు పలికాడు.కాగా ఇటీవల భారత టెస్టు జట్టు ఘోర పరాభవాలు చవిచూసిన విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్‌తో 3-0తో వైట్‌వాష్ కావడం సహా.. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది.కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలంఈ రెండు సిరీస్‌లలో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా ఆసీస్ గడ్డపై కనీసం ఒక్క అర్ధ శతకం కూడా సాధించలేకపోయాడు. ఈ నేపథ్యంలో టెస్టు క్రికెట్‌కు ఇక రిటైర్మెంట్ ప్రకటించాలంటూ రోహిత్‌కు మాజీ క్రికెటర్ల నుంచి సూచనలు వచ్చాయి.అయితే, ఇప్పట్లో తాను టెస్టు క్రికెట్ నుంచి వైదొలగబోనని రోహిత్ శర్మ కుండబద్దలు కొట్టాడు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిబంధనల ప్రకారం.. రంజీ ట్రోఫీ బరిలో దిగాడు. సొంతజట్టు ముంబై తరఫున రంజీ రెండో దశ పోటీల్లో భాగంగా జమ్మూ కశ్మీర్‌తో మ్యాచ్ ఆడాడు.రంజీల్లోనూ నిరాశేకానీ.. ఇక్కడ కూడా రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో మూడు.. రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులు చేశాడు. మరో టీమిండియా స్టార్, ఇప్పటికే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ కూడా ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు.రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 11, 17 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్ చేతిలో.. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఐదు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. నిజానికి ముంబై కాస్తైనా పరువు నిలబెట్టుకుందంటే అందుకు లోయర్ ఆర్డర్ బ్యాటర్లే కారణం.చెలరేగిన శార్దూల్, తనుశ్తొలి ఇన్నింగ్స్‌లో మెరుపు అర్థ శతకం(57 బంతుల్లో 51) బాదిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్.. రెండో ఇన్నింగ్స్‌లో శతకం(119)తో సత్తా చాటాడు,. ఇక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ తనుశ్ కొటియాన్ సైతం 26, 62 పరుగులు చేశాడు. ఇక శార్దూల్ ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు కూడా తీశాడు.ఈ నేపథ్యంలో ముంబై మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ల ఆట తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘‘ ఈ ఇద్దరూ తమ స్థాయికి తగ్గట్లు ఆడలేదు. అసలు ఆడాలన్న కసి కూడా వారిలో కనిపించలేదు.కొంపదీసి అందుకోసమేనా ఇదంతా?వీళ్లు నిజంగానే రంజీలు ఆడాలనుకున్నారా. లేదంటే.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు కోల్పోకూడదు, వాటిపై ప్రభావం పడకూడదన్న ఏకైక కారణంతోనే బరిలోకి దిగారా? అనిపించింది. మరోవైపు.. శార్దూల్.. తనూశ్.. రెడ్‌బాల్ క్రికెట్లో జాగ్రత్తగా ఆడుతూనే.. దూకుడుగా ఎలా ఉండాలో చూపించారు’’ అని గావస్కర్ పేర్కొన్నాడు.ఏదేమైనా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ వంటి టీమిండియా స్టార్లు ఈ టోర్నీలో ఆడటం వల్ల యువ ఆటగాళ్లలో కొత్త ఉత్సాహం నింపిందని గావస్కర్ అన్నాడు. వీరి నుంచి ఆయుశ్ మాత్రే వంటి వాళ్లు సలహాలు, సూచనలు తీసుకునేందుకు వీలు కలిగిందని పేర్కొన్నాడు.కాగా వరుస సెంచరీలతో జోరు మీదున్న ఆయుశ్ మాత్రే.. రోహిత్ శర్మ కోసం జట్టులో తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. మరోవైపు.. యశస్వి జైస్వాల్(4, 26) కూడా రోహిత్‌కు ఓపెనింగ్ జోడీగా దిగి.. ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు.చదవండి: Ab De Villiers: సౌతాఫ్రికా కెప్టెన్‌గా డివిలియర్స్.. టీ20 టోర్నీతో రీఎంట్రీ -
అందుకే సంజూ శాంసన్‌ను ఎంపిక చేయలేదు!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో పాల్గొనబోయే భారత జట్టులో సంజూ శాంసన్‌కు చోటివ్వాల్సిందని టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్లో వరుస శతకాలతో చెలరేగినా అతడికి మొండిచేయి ఎదురుకావడం పట్ల విచారం వ్యక్తం చేశాడు. అయినప్పటికీ సంజూ తిరస్కారానికి గురైనట్లుగా భావించరాదని.. క్రికెట్ ప్రేమికులంతా అతడికి మద్దతుగా ఉన్నారని పేర్కొన్నాడు.జట్టు కూర్పు దృష్ట్యానే సంజూను కాదని.. సెలక్టర్లు రిషభ్ పంత్(RIishabh Pant) వైపు మొగ్గుచూపారని గాసవ్కర్ అభిప్రాయపం వ్యక్తం చేశాడు. కాగా హైబ్రిడ్ విధానంలో పాకిస్తాన్- యూఏఈ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. ఈ ఐసీసీ ఈవెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి శనివారం(జనవరి 18) జట్టును ప్రకటించింది.వారిద్దరికే చోటురోహిత్ శర్మ సారథ్యంలోని పదిహేను మంది సభ్యుల జట్టులో వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్(KL Rahul)తో పాటు.. రిషభ్ పంత్ చోటు దక్కించుకున్నాడు. నిజానికి వన్డేల్లో పంత్‌తో పోలిస్తే సంజూ గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి. అంతేకాదు.. ఇటీవల అంతర్జాతీయ టీ20లలో అతడు మూడు శతకాలు బాది సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు సునిల్ గావస్కర్, మహ్మద్ కైఫ్ వంటి వారు సంజూను చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపిక చేయాలన్న డిమాండ్‌ను బలంగా వినిపించారు. అయితే, బీసీసీఐ మాత్రం పంత్ వైపే మొగ్గుచూపింది. దీంతో సంజూకు గతంలో మాదిరే మరోసారి భంగపాటు తప్పలేదు.అందుకే సంజూ శాంసన్‌ను ఎంపిక చేయలేదు!ఈ విషయంపై గావస్కర్ తాజాగా స్పందిస్తూ సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలను విశ్లేషించాడు. ‘‘అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీల మీద సెంచరీలు కొడుతున్న ఆటగాడిని పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోవడం కష్టమే. అసలు అతడిని ఎంపిక చేయకపోవడానికి సరైన కారణం లేదనే చెప్పవచ్చు.సంజూను కాదని.. రిషభ్ పంత్‌ను ఎంపిక చేశారు. గేమ్ ఛేంజర్‌గా అతడికి పేరుండం ఒక కారణం కావచ్చు. ఇక అతడు ఎడమచేతి వాటం బ్యాటర్ కావడం మరొక ప్లస్ పాయింట్. అంతేగాక.. సంజూ కంటే బెటర్ వికెట్ కీపర్ కావడం కూడా అతడికి కలిసి వచ్చిందని చెప్పవచ్చు.ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పగల సత్తా పంత్ సొంతం. అయితే, సంజూకు అలాంటి ఫేమ్ లేదు. అందుకే అతడిని ఎంపిక చేయలేదు. అయినప్పటికీ.. సంజూ ఎందులోనూ తక్కువ కాదు. అతడు తిరస్కార భావంతో ముడుచుకుపోవాల్సిన పనిలేదు. ఎంతో మంది క్రికెట్ ప్రేమికులు అతడి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అతడికి మద్దతు ప్రకటిస్తున్నారు’’ అని సునిల్ గావస్కర్ చెప్పుకొచ్చాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి బీసీసీఐ ప్రకటించిన జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి.చదవండి: ‘అతడి కథ ముగిసిపోయింది.. ఇకపై టీమిండియాలో చోటు ఉండదు’ -
వాంఖడే స్టేడియంలో క్రికెట్ దిగ్గజాల కోలాహలం (ఫోటోలు)
-
‘ధోని అంతటివాడు.. పంత్ కంటే సంజూనే బెటర్’
టీమిండియా స్టార్ రిషభ్ పంత్(Rishabh Pant)ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్(Mohammed Kaif) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వికెట్ కీపింగ్ విషయంలో ఈ ఉత్తరాఖండ్ బ్యాటర్.. దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) అంతటి స్థాయికి చేరుకున్నాడని ప్రశంసించాడు. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం పంత్ కంటే.. సంజూ శాంసన్ బెటర్ అని పేర్కొన్నాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 భారత జట్టులో వికెట్ కీపర్ కోటాలో తాను సంజూకే ఓటువేస్తానని కైఫ్ స్పష్టం చేశాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘సంజూ శాంసన్ తనను దాటుకుని ముందుకు వెళ్లాడన్న నిజాన్ని రిషభ్ పంత్ అంగీకరించాలి.వికెట్ కీపర్‌గా పంత్ సూపర్నిజానికి రిషభ్ పంత్ అంటే అభిమానులకు ఓ ఎమోషన్. టెస్టుల్లో అతడొక మ్యాచ్ విన్నర్. ఆస్ట్రేలియాతో గబ్బా మైదానంలో.. అదే విధంగా సౌతాఫ్రికాపై టెస్టులో అతడు ఆడిన ఇన్నింగ్స్‌ను ఎవరు మాత్రం మర్చిపోగలరు? ముఖ్యంగా విదేశీ గడ్డపై అతడు అద్భుత ప్రదర్శన కనబరచగలడు.మంచి వికెట్ కీపర్ కూడా!.. వికెట్ కీపింగ్ విషయంలో సంజూ శాంసన్ కంటే పంత్ మెరుగు. అతడు దాదాపుగా ఎంఎస్ ధోని స్థాయికి చేరుకున్నాడు. ఇక్కడ మాత్రం సంజూనే బెటర్కానీ.. పరిమిత ఓవర్ల క్రికెట్లో తన గణాంకాలు ఎలా ఉన్నాయో పంత్ ఓసారి గమనించుకోవాలి. ఇతరులు చెప్పిన మాటలు పట్టించుకోకుండా.. తనకు తానుగా విశ్లేషణ చేసుకోవాలి.చాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దొరక్కపోతే.. అది పంత్‌కు అన్యాయం జరిగినట్లు కాదు. సంజూ శాంసన్‌కు ఈ టీమ్‌లో చోటు దక్కించుకునే అర్హత ఉంది. ఈ ఇద్దరినీ పోల్చినపుడు పంత్ కంటే సంజూనే బెటర్’’ అని మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు.పంత్ వర్సెస్ సంజూ - గణాంకాలుకాగా చాంపియన్స్ ట్రోఫీలో ఆడబోయే భారత జట్టులో వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, సంజూ శాంసన్ రేసులో ఉన్నారు. అయితే, వన్డేల్లో పంత్ గణాంకాలు అంత గొప్పగా ఏమీ లేవు. ఇప్పటి వరకు 31 వన్డేలు ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 33.5 సగటుతో 871 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం ఉంది.మరోవైపు.. కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ 16 మ్యాచ్‌లలో 56.66 సగటుతో 510 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక టీ20లలోనూ సంజూ శాంసన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల సౌతాఫ్రికా గడ్డపై నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. రెండు శతకాలతో చెలరేగాడు. గావస్కర్ ఓటు కూడా సంజూకేఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ సంజూ శాంసన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు.. టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునిల్ గావస్కర్ సైతం సంజూ వైపే మొగ్గుచూపాడు. అతడిని ఈ మెగా టోర్నీకి ఎంపిక చేయాలని సెలక్టర్లకు సూచించాడు. కాగా పాకిస్తాన్- యూఏఈ వేదికలుగా ఫిబ్రవరి 19న చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టు(అంచనా)రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్. -
‘నితీశ్ రెడ్డికి చాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు ఇవ్వాల్సిందే’
భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం చర్చంతా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025) గురించే!.. ఈ మెగా టోర్నీలో పాల్గొనబోయే టీమిండియాలో ఎవరెవరికి చోటు దక్కుతుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజానికి ఈ ఐసీసీ ఈవెంట్లో పాల్గొనే ప్రాథమిక జట్లను ప్రకటించడానికి సోమవారమే(జనవరి 13) ఆఖరి తేదీ అయినా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)ని మరింత గడువు కోరింది.ఇందుకు ఐసీసీ నుంచి సానుకూల స్పందన రాగా.. జనవరి 18 లేదా 19న చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనబోయే భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్, భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ కలిసి ఈ మెగా టోర్నీకి తమ జట్టును ఎంచుకున్నారు.కెప్టెన్‌కు నో ఛాన్స్!టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav)కు ఈ వన్డే ఫార్మాట్ జట్టులో గావస్కర్, పఠాన్ చోటివ్వలేదు. అయితే, అనూహ్యంగా ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డిని మాత్రం తమ టీమ్‌లో చేర్చారు. ఈ విషయం గురించి స్టార్ స్పోర్ట్స్ షోలో గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవలి కాలంలో వన్డేల్లో ఎవరు అదరగొట్టారో వారిని మాత్రమే నేను ఎంచుకుంటాను. వన్డే ప్రపంచకప్-2023లో కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించాడు.సంజూను ఎలా కాదనగలం?ఇక శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. అతడు కూడా ప్రపంచకప్ టోర్నీలో మునుపెన్నడూ లేనివిధంగా దుమ్ములేపాడు. కాబట్టి తనకు సెలక్టర్లు మద్దతుగా నిలవాలి. గత కొన్ని నెలలుగా అతడు జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఫామ్‌లో ఉన్నా సరే అతడికి సెలక్టర్ల నుంచి పిలుపురావడం లేదు.నా అభిప్రాయం ప్రకారం వీరిద్దరికి కచ్చితంగా చాంపియన్స్ ట్రోఫీలో ఆడే జట్టులో చోటివ్వాలి. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో కేఎల్ రాహుల్‌ను ఆడించాలి. ఆరో స్థానంలో రిషభ్ పంత్ ఆడాలి. ఇక సంజూ శాంసన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్(టీ20)లో వరుస శతకాలు సాధించాడు. అలాంటి ఆటగాడిని మనం ఎలా విస్మరించగలం?’’ అని పేర్కొన్నాడు.నితీశ్ రెడ్డికి చోటు ఇవ్వాల్సిందేఇక ఇర్ఫాన్ పఠాన్ ఇందుకు బదులిస్తూ.. ‘‘మీరు చెప్పింది బాగుంది. ఇక ఎనిమిదో స్థానంలో రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. ఇక జట్టులో సమతూకం ఉండాలంటే.. బౌలింగ్ ఆప్షన్లు కూడా చూసుకోవాలి. జట్టులో కచ్చితంగా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌కు ఒక బ్యాకప్ ఆప్షన్ ఉండాలి. నితీశ్ కుమార్ రెడ్డి రూపంలో మనకు అద్భుతమైన ఆటగాడు అందుబాటులో ఉన్నాడు.ఆస్ట్రేలియా గడ్డపై సత్తా చాటడం అంటే మామూలు విషయం కాదు. ఎక్కువ మందికి సాధ్యం కాని ఘనతను సెంచరీ ద్వారా అతడు సాధించాడు’’ అని పేర్కొన్నాడు.కాగా నితీశ్ కుమార్ రెడ్డి ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా ఇటీవల ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ టెస్టులో శతకంతో ఆకట్టుకున్నాడు.ఇక ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ తప్పకుండా తుదిజట్టులో ఉంటారని అంచనా వేసిన ఇర్ఫాన్ పఠాన్.. బుమ్రా గాయం త్వరగా నయమైపోవాలని ఆకాంక్షించాడు. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆరంభం కానుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపేందుకు బీసీసీఐ తిరస్కరించగా.. హైబ్రిడ్ విధానంలో భారత్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. తటస్థ వేదికైన దుబాయ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రోహిత్ సేన తమ ప్రయాణం ఆరంభించనుంది.సునిల్ గావస్కర్- ఇర్ఫాన్ పఠాన్ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంచుకున్న భారత జట్టురోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, శుబ్‌మన్ గిల్, సంజూ శాంసన్, మహ్మద్ సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి.చదవండి: CT 2025: వరల్డ్‌కప్‌లో మా ఇద్దరిది కీలక పాత్ర.. ఈసారీ: శ్రేయస్ అయ్యర్ -
టీమిండియా తదుపరి కెప్టెన్ అతడే!
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)పై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)లో ఈ రైటార్మ్ బౌలర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడని కొనియాడాడు. కెప్టెన్‌గానూ బుమ్రా జట్టును ముందుకు నడిపించిన తీరు తనను ఆకట్టుకుందన్నాడు. ఆటగాళ్లపై ఒత్తిడి పడకుండా పరిణతి గల నాయకుడిగా మెప్పించాడని పేర్కొన్నాడు.ఇటు బౌలర్‌గా.. అటు కెప్టెన్‌గా రాణించికాగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, తొలి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) పితృత్వ సెలవుల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో వైస్ కెప్టెన్ బుమ్రా సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఇటు బౌలర్‌గా.. అటు కెప్టెన్‌గా రాణించి పెర్త్‌లో టీమిండియాకు 295 పరుగుల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం అందించాడు.వెన్నునొప్పి వేధిస్తున్నాఆ తర్వాత మరో మూడు టెస్టులకు సారథిగా వ్యవహరించిన రోహిత్ శర్మ.. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా వైఫల్యం చెందినందున ఆఖరి టెస్టు నుంచి తప్పుకొన్నాడు. జట్టు ప్రయోజనాల కోసం విశ్రాంతి పేరిట తానే స్వయంగా దూరంగా ఉన్నాడు. ఫలితంగా మరోసారి పగ్గాలు బుమ్రా చేతికి వచ్చాయి. సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్‌లో జట్టును గెలిపించేందుకు అతడు గట్టిగానే శ్రమించాడు.పేస్ దళ భారాన్ని మొత్తం తానే మోశాడు. ఈ క్రమంలో వెన్నునొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లి వచ్చి మరీ బరిలోకి దిగాడు. అయినప్పటికీ సిడ్నీలో ఓటమిపాలైన టీమిండియా 1-3తో ఓటమిపాలై.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని ఆసీస్‌కు చేజార్చుకుంది. అయితే, జట్టు ప్రదర్శన ఎలా ఉన్నా బుమ్రాకు మాత్రం ఈ టూర్లో మంచి మార్కులే పడ్డాయి. ఐదు టెస్టుల్లో కలిపి మొత్తం 32 వికెట్లు పడగొట్టిన ఈ రైటార్మ్ పేసర్.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.నాయకుడిగా మంచి పేరుఈ పరిణామాల నేపథ్యంలో సునిల్ గావస్కర్ బుమ్రాను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా తదుపరి కెప్టెన్ అతడే!.. నా అభిప్రాయం ప్రకారం కచ్చితంగా అతడే పగ్గాలు చేపడతాడు. జట్టును ముందుండి నడిపించడంలో బుమ్రా తనకంటూ ప్రత్యేకశైలిని ఏర్పరచుకున్నాడు.నాయకుడిగా అతడికి మంచి పేరు వచ్చింది. సారథిగా ఉన్నా సహచర ఆటగాళ్లపై ఒత్తిడి పెంచేరకం కాదు. కొన్నిసార్లు కెప్టెన్లు తామే ఒత్తిడిలో కూరుకుపోయి.. పక్కవాళ్లనూ అందులోకి నెట్టేస్తారు. కానీ బుమ్రా ఏ దశలోనూ అలా చేయలేదు. తనపని తాను చేసుకుంటూనే.. జట్టులో ఎవరి విధి ఏమిటో అర్థమయ్యేలా చక్కగా తెలియజెప్పాడు.నిజంగా అతడొక అద్భుతంఈ క్రమంలో ఎవరిపైనా అతడు ఒత్తిడి పెట్టలేదు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లను డీల్ చేసిన విధానం బాగుంది. వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన కనబరుస్తూనే.. సహచరులకు అన్ని వేళలా మార్గదర్శనం చేశాడు. నిజంగా అతడొక అద్భుతం. అందుకే టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్ అతడే అని నేను బలంగా నమ్ముతున్నాను’’ అని గావస్కర్ 7క్రికెట్‌తో పేర్కొన్నాడు.కాగా ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర ఓటమిని చవిచూసిన టీమిండియా.. తదుపరి స్వదేశంలో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, గాయం కారణంగా బుమ్రా ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 19న మొదలయ్యే చాంపియన్స్ ట్రోఫీ నాటికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.చదవండి: ‘గంభీర్ ఒక మోసగాడు.. గెలిస్తే క్రెడిట్ నాదే అంటాడు.. కానీ’ -
గంభీర్ ఇప్పటికైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి: టీమిండియా దిగ్గజం
టెస్టు క్రికెట్లో వరుస పరాభవాలు ఎదుర్కొన్న టీమిండియాపై విమర్శల వర్షం కురుస్తోంది. తొలుత స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురైన రోహిత్ సేన.. ఆస్ట్రేలియా గడ్డపై కూడా రాణించలేకపోయింది. కంగారూ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్‌ను 1-3తో కోల్పోయింది. తద్వారా దాదాపు పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని తొలిసారి ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది.పేలవ ప్రదర్శన.. ఇక ఈ సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తో పాటు కీలక బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) పూర్తిగా విఫలం కావడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. యువ ఆటగాళ్లకు మార్గదర్శకులుగా ఉండాల్సిన ఈ ఇద్దరు దిగ్గజాలు పేలవ ప్రదర్శనతో తేలిపోయారు. రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్ వంటి స్టార్లు కూడా కీలక సమయంలో చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో.. ఇంటా బయట పరాజయాలతో సతమతమవుతున్న టీమిండియా ప్లేయర్లకు... క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ చురకలు అంటించాడు. భారత ఆటగాళ్లందరూ దేశవాళీల్లో ఆడాలని, ఏ ఒక్కరికీ మినహాయింపు ఇవ్వకుండా అందరూ రంజీ ట్రోఫీలో ఆడేలా చూడాలని సన్నీ సూచించాడు. ఎవరికీ మినహాయింపు వద్దు‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత జట్టు ఓటమి అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ నెల 23 నుంచి రంజీ ట్రోఫీ తదుపరి రౌండ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత భారత జట్టులో నుంచి ఎంతమంది ఆటగాళ్లు అందులో పాల్గొంటారో చూడాలి. ఏ ఒక్కరికీ మినహాయింపు లేకుండా అందరూ దేశవాళీ టోర్నీలో పాల్గొనాలి.గంభీర్ ఇప్పటికైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాలిరంజీ ట్రోఫీకి అందుబాటులో లేని ఆటగాళ్ల విషయంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. తాజా ఆస్ట్రేలియా సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌పై కూడా భారత ఆటగాళ్ల ప్రదర్శన గొప్పగా లేదు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరే అవకాశాలు ఎలాగూ లేవు. ఈ సమయంలో తదుపరి టోర్నీ కోసం అయినా ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించాలి. తమను తాము నిరూపించుకోవాలనే తపన ఉన్న ఆటగాళ్లు ముఖ్యం. రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌ల సమయంలోనే ఇంగ్లండ్‌తో భారత జట్టు టీ20 సిరీస్ ఆడనుంది. మరి దానికి ఎంపిక కాని వారిలో ఎంతమంది దేశవాళీ ట్రోఫీలో పాల్గొంటారో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అని గావస్కర్ వ్యాఖ్యానించాడు.గంభీర్దీ అదే మాటవరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కూడా భారత స్టార్లు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పాడు. ‘‘ప్రతి ఒక్క ఆటగాడు దేశవాళీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నా. అందుబాటులో ఉన్నప్పుడు తప్పకుండా రంజీ మ్యాచ్‌లు ఆడాల్సిందే. దేశవాళీ మ్యాచ్‌లకు ప్రాధాన్యత ఇవ్వకపోతే జాతీయ జట్టు తరఫున టెస్టు క్రికెట్ ఆడే ఆసక్తి లేనట్లే.ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఇంకా చాలా సమయం ఉంది. జట్టులోని ఏ ఒక్కరి భవిష్యత్ గురించి ఇప్పుడే నేను మాట్లాడలేను. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భవితవ్యం గురించి కూడా ఏమీ చెప్పలేను. అయితే వారిలో పరుగులు సాధించాలనే కసి ఇంకా ఉంది. జట్టులో అందరూ సమానమే. అందరితో ఒకే రీతిన వ్యవహరిస్తా. చివరిదైన సిడ్నీ టెస్టు నుంచి తప్పుకోవాలని రోహితే నిర్ణయించుకున్నాడు. దీంతో జట్టులో ప్రతి ఒక్కరికీ జవాబుదారీతనం ఉండాలని రోహిత్ చాటాడు’’ అని సిరీస్ ఓటమి తర్వాత గంభీర్ వ్యాఖ్యానించాడు.చదవండి: CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే? స్టార్ ప్లేయర్‌కు ఛాన్స్! -
ఈ ఆరు నెలల్లో మీరేం చేశారు.. కోచ్‌లను మారిస్తే బెటర్: సునీల్ గవాస్కర్
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో పదేళ్ల తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (BGT)ను ఆసీస్‌కు టీమిండియా సమర్పించుకుంది. బీజీటీ ట్రోఫీతో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ అవకాశాలను సైతం రోహిత్ సేన చేజార్చుకుంది.ఈ విజయంతో ఆస్ట్రేలియా వరుసగా రెండో సారి తమ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. కాగా పదేళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయిన భారత జట్టుపై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. ప్లేయర్స్‌తో పాటు జట్టు మేనేజ్మెంట్ కూడా ముప్పేట దాడిని ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్ గంభీర్ అండ్ కో పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు."అస్సలు కోచ్‌లు ఏం చేస్తున్నారు? న్యూజిలాండ్‌పై కేవలం 46 పరుగులకు ఆలౌట్ అయ్యాం. జట్టు బ్యాటర్ల పరిస్థితి ఎలా ఉందో అప్పుడే ఆర్దం చేసుకోవచ్చు. కాబట్టి ఆస్ట్రేలియా సిరీస్‌కు సరైన ప్రణాళికలతో వెళ్లాల్సింది. కానీ కోచ్‌లు ఎటువంటి బాధ్యత తీసుకోలేదు. ఎందుకు ఆస్ట్రేలియా పర్యటనలో కూడా బ్యాటర్ల ఆట తీరు మెరుగు పడలేదు? కచ్చితంగా ఈ ప్రశ్నకు కోచ్‌లే సమాధనమివ్వాలి. ఆటగాళ్లతో పాటు కోచ్‌ల పనితీరును కూడా అంచనా వేయాలి. మంచి బౌలర్లను ఎలా ఉపయోగించుకోవాలో కోచ్‌లు ప్లాన్ చేయలేదు. ఇష్టం వచ్చినట్లు బ్యాటింగ్‌ను ఆర్డర్‌ను మార్చారు. ఇప్పుడు బ్యాటింగ్ ఆర్డర్‌కు బదులుగా కోచ్‌లను మారిస్తే బెటర్ అన్పిస్తోంది.ప్రతీ ఒక్కరూ బ్యాటర్లను మాత్రమే తప్పుబడుతున్నారు. కానీ కోచ్‌లను కూడా ప్రశ్నించాలన్నది నా అభిప్రాయం. ఈ ఆరు నెలల్లో వారేమి చేశారో నాకు ఆర్ధం కావడం లేదు. దీనికి వారే సమాధానం చెప్పాలి" అని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ ఫైరయ్యాడు. గంభీర్ నేతృత్వంలో పది టెస్టులు ఆడిన భారత్ ఆరింట ఓటమి చవిచూసింది. వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో సిరీస్‌లను కోల్పోయింది.చదవండి: ధోని కెప్టెన్సీలో ఎంట్రీ.. కట్ చేస్తే! రిటైర్మెంట్తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్ -
ట్రోఫీ ప్రదానోత్సవానికి ఆహ్వానించలేదు: గావస్కర్
సిడ్నీ: ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్ విజేతకు ట్రోఫీ అందజేసే సమయంలో తనను ఆహ్వానించకపోవడంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 1996–97 నుంచి భారత్, ఆ్రస్టేలియా మధ్య ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ నిర్వహిస్తుండగా... తాజాగా జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆ్రస్టేలియా జట్టు 3–1తో విజయం సాధించింది. ఆదివారం ఆఖరి టెస్టు ముగిసిన అనంతరం విజేతగా నిలిచిన ఆ్రస్టేలియా జట్టుకు ఆ్రస్టేలియా దిగ్గజం అలెన్ బోర్డర్ ట్రోఫీ బహుకరించాడు. దీనిపై గావస్కర్ స్పందిస్తూ... ‘ట్రోఫీ ఇచ్చే సమయంలో అక్కడ ఉండటాన్ని ఇష్టపడేవాడిని. భారత్, ఆస్ట్రేలియా మధ్య అదీ బోర్డర్–గావస్కర్ సిరీస్ కదా. ఆ సమయంలో నేను మైదానంలోనే ఉన్నా. మెరుగైన ప్రదర్శన చేయడం వల్లే ఆ్రస్టేలియా గెలిచింది. నా స్నేహితుడు బోర్డర్‌తో కలిసి ట్రోఫీ అందించి ఉంటే ఇంకా ఆనందించేవాడిని’ అని అన్నాడు. మరోవైపు క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) స్పందన దీనికి భిన్నంగా ఉంది. సిరీస్‌లో ఆ్రస్టేలియా విజేతగా నిలిస్తే అలెన్ బోర్డర్... భారత్ గెలిస్తే సునీల్ గావస్కర్ ట్రోఫీ అందించాలని నిర్ణయించినట్లు సీఏ తెలిపింది. ఈ విషయాన్ని వారిదద్దరికీ గతంలోనే చెప్పినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. -
అసలేం చేస్తున్నారు.. అది క్షమించరాని నేరం: గవాస్కర్
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. 162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 27 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆసీస్ చేధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో కంగారులు సొంతం చేసుకున్నారు. కాగా టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) గాయం కారణంగా మూడో రోజు ఫీల్డింగ్‌కు దిగలేదు. బుమ్రా లేని లోటు భారత బౌలింగ్ ఎటాక్‌లో స్పష్టంగా కన్పించింది.తొలి రెండో ఓవర్లలోనే భారత పేసర్లు ఏకంగా 26 పరుగులు సమర్పించుకున్నారు. అందులో 12 పరుగులు ఎక్స్‌ట్రాస్ రూపంలో వచ్చినవే కావడం గమనార్హం. ముఖ్యంగా భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన రిథమ్‌ను కోల్పోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సిరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు.తొలి ఓవర్ వేసిన సిరాజ్ 13 పరుగులిచ్చాడు. ఈ నేపథ్యంలో సిరాజ్‌పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విమర్శల వర్షం కురిపించాడు. స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకోవడంలో భారత బౌలర్ల తీరు నిరాశకు గురిచేసిందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు."తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ అద్బుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తన రిథమ్‌ను కోల్పోయాడు. చాలా అదనపు పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తం 15 ఎక్స్‌ట్రాలు ఇవ్వడం ఆమోదయోగ్యం కాదు. ఈ స్థాయిలో ఆడుతున్నప్పుడు బౌలర్లు నో బాల్స్‌ను నియంత్రించగలగాలి.నో బాల్స్ వేయడం క్షమించరాని నేరం. ప్రొఫెషనల్ క్రికెటర్లు ఎప్పుడూ నో బాల్స్ వేయకూడదు. కొన్ని సార్లు నో బాల్‌లు, వైడ్లే గెలుపోటములు నిర్ణయిస్తాయి. మన వేగంగా బౌలింగ్ చేయడానికి ప్రయత్నించి వైడ్లు వేస్తున్నారు. కొంచెం లైన్ లెంగ్త్‌పై దృష్టి పెట్టాలి" అని గవాస్కర్ పేర్కొన్నాడు.చదవండి: Jasprit Bumrah: 3 ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు వేశాడు.. ఆ ఒక్కడిపైనే భారం! -
'రోహిత్ నిజంగా చాలా గొప్ప కెప్టెన్.. అది అతడి సొంత నిర్ణయమే'
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు రోహిత్ తనంతటతానే దూరంగా ఉండాలని నిర్ణయించకున్నాడని టాస్ సమయంలో స్టాండింగ్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా పేర్కొన్నాడు.రోహిత్ స్దానంలో తుది జట్టులోకి శుబ్‌మన్ గిల్(Shubman gill) వచ్చాడు. రోహిత్ గత కొంత కాలంగా టెస్టుల్లో పేలవ ఫామ్‌తో సతమతవుతున్నాడు. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో నిరాశపరిచిన హిట్‌మ్యాన్.. ఆస్ట్రేలియా గడ్డపై అదే తీరును కనబరుస్తున్నాడు.ఈ సిరీస్‌లో రోహిత్ మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ వైదగొలగాలని నిర్ణయించుకున్నాడు. వైదొలగాలని రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయాన్ని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రశంసించారు"పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ స్వచ్చందంగా తానుకు తానే సిడ్నీ టెస్టు నుంచి తప్పుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌తో చర్చించాకే రోహిత్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు.ఇది పూర్తిగా అతని సొంత నిర్ణయమే అనిపిస్తుంది. ఒక కెప్టెన్‌గా రోహిత్ తీసుకున్న నిజంగా ప్రశంసనీయం. రోహిత్ భవిష్యత్తు కెప్టెన్లకు రోల్‌మోడల్‌గా నిలుస్తాడు" అని గవాస్కర్ పేర్కొన్నారు.చదవండి: CT 2025: వన్డే కెప్టెన్‌గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే! -
నితీశ్ రెడ్డి ఒక్కడే కాదు.. అతడూ జట్టులో ఉండాలి!
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్ ముంగిపునకు వచ్చింది. ఈ మెగా ఈవెంట్లో టీమిండియా తమ చివరి టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతోంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy) ఆడేందుకు కంగారూ గడ్డపై అడుగుపెట్టి.. ఇప్పటికి నాలుగు టెస్టులు పూర్తి చేసుకుంది.పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో గెలిచి శుభారంభం చేసిన టీమిండియా.. తదుపరి అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో మాత్రం ఓడిపోయింది. అనంతరం బ్రిస్బేన్‌లో మూడో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న భారత జట్టు.. మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్టులో దారుణంగా విఫలమైంది. ఆతిథ్య జట్టు చేతిలో 184 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంఫలితంగా ఆసీస్ టీమిండియాపై 2-1తో ఆధిక్యంలో నిలవగా.. రోహిత్ సేన డబ్ల్యూటీసీ(WTC) ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పటికే సౌతాఫ్రికా టైటిల్ పోరుకు అర్హత సాధించగా.. ఆస్ట్రేలియాకు మార్గం సుగమమైంది. ఏదేమైనా ఆసీస్‌లో టీమిండియా వైఫల్యం కొనసాగుతున్నప్పటికీ ఓ ఆణిముత్యం లాంటి ఆటగాడు దొరకడం సానుకూలాంశం.నితీశ్ రెడ్డి.. ఆణిముత్యం లాంటి ఆటగాడు అతడు మరెవరో కాదు.. నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy). ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ తొలి టెస్టు నుంచే బ్యాట్ ఝులిపిస్తున్నాడు. మెల్బోర్న్ టెస్టులో ఏకంగా శతకం(114)తో సత్తా చాటాడు. తద్వారా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ)లో అత్యంత పిన్న వయసులోనే సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా 21 ఏళ్ల నితీశ్ రెడ్డి చరిత్ర సృష్టించాడు.ఈ నేపథ్యంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా నితీశ్ రెడ్డి టీమిండియా టెస్టు జట్టుతో పాతుకుపోవడం ఖాయమంటూ భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ప్రశంసించాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో టెస్టుల తర్వాత.. టీమిండియా 2025లో తొలుత ఇంగ్లండ్‌తో స్వదేశంలో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది.నితీశ్ రెడ్డితో పాటు అతడినీ ఎంపిక చేయండి!అనంతరం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 పూర్తి చేసుకుని.. జూన్‌లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నితీశ్ రెడ్డితో పాటు ఇంగ్లండ్ టూర్‌కు మరో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను ఎంపిక చేయాలని మేనేజ్మెంట్కు సూచించాడు.‘‘మెల్బోర్న్ టెస్టు భారత క్రికెట్‌కు అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్‌ను ఇచ్చింది.. అతడి పేరు నితీశ్ కుమార్ రెడ్డి. ఐపీఎల్లో హైదరాబాద్ ఫ్రాంఛైజీ తరఫున అదరగొట్టడం ద్వారా భారత క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించిన ఈ కుర్రాడు.. నిజానికి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అంత గొప్ప ఏమీ ఆడలేదు. క్రెడిట్ మొత్తం వారికేఅయినప్పటికీ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. అతడి బృందం నితీశ్ రెడ్డిపై నమ్మకం ఉంచినందుకు వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. సెలక్టర్ల నమ్మకాన్ని ఈ అబ్బాయి నిలబెట్టుకున్నాడు. ఇక మరో ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్(Venkatesh Iyer)పై కూడా సెలక్టర్లు దృష్టి సారించాలి.అతడు ఎడమచేతి వాటం బ్యాటర్ కావడం మరో సానుకూలాంశం. అయితే, బౌలింగ్ నైపుణ్యాలను కాస్త మెరుగుపరచుకోవాలి. అతడికి ఇప్పటికే ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం ఉంది. కాబట్టి అక్కడ అతడు టెస్టుల్లో రాణించగలడు’’ అని సునిల్ గావస్కర్ స్పోర్ట్స్ స్టార్‌కు రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు.కౌంటీల్లో ఆడిన వెంకటేశ్కాగా 2024లో ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా లంకాషైర్‌కు ప్రాతినిథ్యం వహించాడు వెంకటేశ్ అయ్యర్. మూడు మ్యాచ్‌లు ఆడి 116 పరుగులు చేశాడు. ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు తొమ్మిది టీ20లు, రెండు వన్డేలు ఆడిన వెంకటేశ్ అయ్యర్.. ఆయా ఫార్మాట్లలో 133, 24 పరుగులు చేశాడు. అదే విధంగా అంతర్జాతీయ టీ20లలో ఐదు వికెట్లు తీయగలిగాడు.చదవండి: అతడి కోసం పట్టుబట్టిన గంభీర్.. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు? -
‘థర్డ్ అంపైర్ నిర్ణయం ముమ్మాటికీ తప్పే.. జైస్వాల్ నాటౌట్’
బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అవుటైన తీరు((Yashasvi Jaiswal’s controversial dismissal) )పై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. జైసూ నాటౌట్ అని స్పష్టంగా తెలుస్తున్నా.. అవుట్‌గా ప్రకటించడం సరికాదని అభిప్రాయపడ్డారు. సాంకేతిక ఆధారంగా థర్డ్ అంపైర్ నిర్ణయం తీసుకోవాల్సిందని పేర్కొన్నారు.సరైన కారణాలు లేకుండా ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తారుమారు చేయడం ఏమిటని రాజీవ్ శుక్లా(Rajiv Shukla) మండిపడ్డారు. అదే విధంగా.. భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ సైతం ఈ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులుఆడుతోంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గురువారం మెల్బోర్న్ వేదికగా మొదలైన బాక్సింగ్ డే టెస్టు ఆఖరిరోజైన సోమవారం ముగిసింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన ఆసీస్ చేతిలో 184 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడింది.ఘోర ఓటమిభారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ఒంటరి పోరాటం చేసిన యశస్వి జైస్వాల్ అవుటైన విధానం వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఐదో రోజు ఆటలో భాగంగా కమిన్స్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలయ్యాడు జైస్వాల్. అయితే, బంతి అతడి గ్లౌవ్‌ను తాకినట్లుగా కనిపించి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడింది. దీంతో ఆసీస్ వికెట్ కోసం అప్పీలు చేయగా ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.ఈ క్రమంలో ఆసీస్ రివ్యూకు వెళ్లగా స్నీకో మీటర్లో స్పైక్ రాకపోయినా.. థర్డ్ అంపైర్ జైస్వాల్‌ను అవుట్‌గా ప్రకటించాలని ఫీల్డ్ అంపైర్‌కు సూచించాడు. దీంతో భారత్ కీలక వికెట్ కోల్పోగా.. మ్యాచ్ పూర్తిగా ఆసీస్ చేతుల్లోకి వెళ్లింది. ఆఖరికి 184 పరుగుల తేడాతో కంగారూ జట్టు రోహిత్ సేనపై విజయదుందుభి మోగించి.. 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.థర్డ్ అంపైర్ నిర్ణయం ముమ్మాటికీ తప్పేఅయితే, జైస్వాల్ అవుటా? నాటౌటా? అన్న అంశంపై క్రీడా వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజీవ్ శుక్లా స్పందిస్తూ.. థర్డ్ అంపైర్ నిర్ణయం వల్ల జైస్వాల్‌కు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సునిల్ గావస్కర్ స్పందిస్తూ.. ‘‘మీరు సాంకేతికతను ఉపయోగించాలనుకుంటే.. మొత్తంగా దానినే పరిగణనలోకి తీసుకోండి.అంతేకానీ మిథ్యనే నిజమని భావించవద్దు. అక్కడ స్నీకో మీటర్ ఉంది. అందులో లైన్ స్ట్రెయిట్గానే ఉంది. కాబట్టి ఇది కచ్చితంగా నాటౌట్’’ అని తన అభిప్రాయాన్ని స్టార్ స్పోర్ట్స్ షోలో పంచుకున్నాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం ముమ్మాటికీ తప్పేనని పేర్కొన్నాడు.సిరీస్‌లో వెనుకబడిన టీమిండియాకాగా ఆసీస్‌తో పెర్త్ వేదికగా తొలి టెస్టులో గెలుపొందిన టీమిండియా.. అడిలైడ్ పింక్ బాల్ మ్యాచ్‌లో ఓడిపోయింది. అనంతరం బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో మూడో టెస్టు డ్రా చేసుకున్న రోహిత్ సేన.. మెల్బోర్న్ టెస్టులో మాత్రం ఘోర పరాభవం చవిచూసింది. కమిన్స్ బృందం విధించిన 340 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. 155 పరుగులకే కుప్పకూలింది. ఇరుజట్ల మధ్య జనవరి 3న సిడ్నీ వేదికగా ఆఖరి టెస్టు మొదలుకానుంది. ఇక జైస్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగులు చేసి దురదృష్టకరరీతిలో రనౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 84 పరుగుల వద్ద థర్డ్ అంపైర్ నిర్ణయానికి బలయ్యాడు.చదవండి: WTC 2025: భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. అదొక్కటే దారి! -
IND VS AUS 4th Test: గవాస్కర్‌కు పాదాభివందనం చేసిన నితీశ్ తండ్రి
మెల్బోర్న్ టెస్ట్‌లో నితీశ్ కుమార్ రెడ్డి చేసిన సూపర్ సెంచరీకి యావత్ క్రికెట్ ప్రపంచం ఫిదా అవుతుంది. సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి లాంటి భారత క్రికెట్ దిగ్గజాలు నితీశ్ సూపర్ ఇన్నింగ్స్‌ను కొనియాడుతున్నారు. నితీశ్ సెంచరీ చూసి రవిశాస్త్రి కన్నీటిపర్యంతం కాగా.. గవాస్కర్ జేజేలు పలికాడు.సాధారణంగా గవాస్కర్ ఏ ఆటగాడిని పెద్దగా పొగడడు. అలాంటిది సన్నీ నితీశ్‌ను పొగడటం చూస్తుంటే ఆశ్చర్యమేసింది. పొగడటమే కాదు.. నితీశ్ సెంచరీ అనంతరం గవాస్కర్ స్టాండింగ్ ఓవేషన్ కూడా ఇచ్చాడు. భారత క్రికెట్ చరిత్రలో నితీశ్ సెంచరీ చిరకాలం గుర్తుండిపోతుందని కితాబిచ్చాడు.గవాస్కర్.. నితీశ్‌ను ప్రశంశిస్తూనే ఓ కీలక సూచన కూడా చేశాడు. నితీశ్ ఈ స్థాయికి చేరుకోవడానికి అతని తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసుంటారు. వాటిని నితీశ్ ఎప్పటికీ గుర్తించుకోవాలని సూచించారు. మూడో రోజు ఆట ముగిశాక నితీశ్ కుటుంబ సభ్యులు గవాస్కర్‌ను కలిశారు. Nitish Kumar Reddy's father touching Sunil Gavaskar's feet. (ABC Sport). pic.twitter.com/sVSep2kl9G— Mufaddal Vohra (@mufaddal_vohra) December 29, 2024ఈ సందర్భంగా నితీశ్ తల్లి, తండ్రి, సోదరి గవాస్కర్‌కు పాదాభివందనం చేశారు. నితీశ్ తండ్రి ముత్యాల రెడ్డి కాళ్లకు నమస్కారం చేస్తుండగా గవాస్కర్ వారించారు. అయినా ముత్యాల రెడ్డి వినలేదు. సార్.. మీరు గొప్ప క్రికెటర్ అంటూ సాష్టాంగపడ్డాడు. అనంతరం గవాస్కర్ ముత్యాల రెడ్డిని హత్తుకొని అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.కాగా, భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి 266 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. కమిన్స్ (34), లయోన్ (1) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ 3 వికెట్లు పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో లబూషేన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 82, రోహిత్ శర్మ 3, కేఎల్ రాహుల్ 24, విరాట్ కోహ్లి 36, ఆకాశ్‌దీప్ 0, రిషబ్ పంత్ 28, రవీంద్ర జడేజా 17, నితీశ్ రెడ్డి 114, వాషింగ్టన్ సుందర్ 50, బుమ్రా 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయోన్ తలో 3 వికెట్లు పడగొట్టారు.దీనికి ముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్‌స్టాస్ (60), ఉస్మాన్ ఖ్వాజా (57), లబూషేన్ (72), కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్‌దీప్ 2, సుందర్ ఓ వికెట్ పడగొట్టారు. -
IND Vs AUS: 'స్టుపిడ్.. స్టుపిడ్! నీవు భారత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లొద్దు'
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. తొలి మూడు టెస్టుల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన పంత్.. ఇప్పుడు మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులోనూ అదే తీరును కనబరిచాడు. కీలకమైన బాక్సింగ్ డే టెస్టులో పంత్ నిరాశపరిచాడు.తొలుత మంచి టచ్‌లో కన్పించిన పంత్.. ఓ చెత్త షాట్ ఆడి తన వికెట్‌ను పంత్ సమర్పించుకున్నాడు. ఆసీస్ స్పీడ్ స్టార్ స్కాట్ బోలాండ్ ఓవర్లో లాంగ్-లెగ్ మీదుగా ల్యాప్ షాట్ ఆడటానికి ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ షాట్ ఆడే క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయిన పంత్ కింద పడిపోయాడు.అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. డీప్ థర్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్న నాథన్ లియోన్ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో 28 పరుగులు చేసిన పంత్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు.సన్నీ ఈజ్ ఫైర్.. ఈ క్రమంలో కామెంట్రీ బాక్స్‌లో ఉన్న భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్.. రిషబ్ పంత్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. భారత్ కు పాలో ఆన్ గండం ఉన్నప్పటికీ పంత్ నిర్లక్ష్యంగా ఆడటంపై గావస్కర్ మండిపడ్డాడు."స్టుపిడ్! స్టుపిడ్! స్టుపిడ్! ఇద్దరు ఫీల్డర్లు ఉన్నప్పటికి ఆ చెత్త షాట్ ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది. అంతకుముందే ఆ షాట్‌కు ప్రయత్నించి విఫలమయ్యావు. వెంటనే మళ్లీ అదే షాట్ ఆడి వికెట్‌ను సమర్పించుకున్నావు. ఇంతకు మించిన మూర్ఖత్వం మరొకటి లేదు. ఓ కీలక ఆటగాడిగా క్రీజులో ఉన్నప్పుడు జట్టు పరిస్థితిని ఆర్దం చేసుకుని ఆడాలి. అస్సలు ఆ సమయంలో ఆ షాట్ ఆడాల్సిన అవసరం లేదు. ఇది మీ నేచరల్ గేమ్ కాదు. అతడు ఆడిన స్టుపిడ్ షాట్.. టీమ్ మొత్తాన్ని తీవ్ర నిరాశపరిచింది. అతడు భారత డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లొద్దు.ఇతర డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాలి" అంటూ సన్నీ ఫైరయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది.టీమిండియా ఇంకా 116 పరుగుల వెనుకంజలో ఉంది. భారత బ్యాటర్లలో నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కష్టాల్లో ఉన్న జట్టును తన విరోచిత పోరాటంతో నితీశ్ అదుకున్నాడు. నితీశ్ ప్రస్తుతం 105 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. మూడో రోజు ఆటలో నితీశ్ పాటు వాషింగ్టన్ సుందర్(50) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. "Stupid, stupid, stupid!" 😡🏏 Safe to say Sunny wasn't happy with Rishabh Pant after that shot.Read more: https://t.co/bEUlbXRNpm💻📝 Live blog: https://t.co/YOMQ9DL7gm🟢 Listen live: https://t.co/VP2GGbfgge #AUSvIND pic.twitter.com/Fe2hdpAtVl— ABC SPORT (@abcsport) December 28, 2024 -
చెప్పి మరీ.. అతడిపై వేటు వేయండి: టీమిండియా దిగ్గజం
టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)ను ఉద్దేశించి భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ఘాటు విమర్శలు చేశాడు. అతడిపై నిర్దాక్షిణ్యంగా వేటు వేయాలని యాజమాన్యానికి సూచించాడు. విశ్రాంతి పేరిట పక్కన పెడుతున్నామని చెబితే సరిపోదని.. జట్టు నుంచి తప్పిస్తున్నామని స్పష్టంగా చెప్పాలంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు.ఆసీస్‌తో 1-1తో సమంగా టీమిండియాబోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy) ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత జట్టు.. పెర్త్‌లో గెలుపొంది శుభారంభం చేసింది. అయితే, అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులో ఓటమి చెందిన రోహిత్ సేన.. బ్రిస్బేన్‌లో మూడో టెస్టును డ్రా చేసుకుంది. దీంతో ప్రస్తుతం ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-1తో సమంగా ఉంది.బుమ్రాపై అదనపు భారం మోపుతున్న సిరాజ్? అయితే, ఈ సిరీస్‌లో భారత పేసర్ సిరాజ్ ఇప్పటి వరకు ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి పదమూడు వికెట్లు తీశాడు. కానీ కొత్త బంతితో మ్యాజిక్ చేయలేకపోతున్న ఈ హైదరాబాదీ బౌలర్.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై అదనపు భారం మోపుతున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కీలక సమయంలో సిరాజ్ వికెట్లు తీయకపోవడంతో బుమ్రాపై పనిభారం ఎక్కువవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.వేటు వేస్తున్నామని స్పష్టంగా చెప్పండిఈ నేపథ్యంలో కామెంటేటర్ సునిల్ గావస్కర్(Sunil Gavaskar Comments) మాట్లాడుతూ.. ‘‘సిరాజ్‌కు బ్రేక్ ఇవ్వాలి. నా ఉద్దేశం.. విశ్రాంతి పేరిట పక్కన పెట్టాలని కాదు. ‘నీ ఆట తీరు బాగాలేదు. కాబట్టి నిన్ను జట్టు నుంచి తప్పిస్తున్నాం’ అని స్పష్టంగా అతడికి చెప్పాలి.కొన్నిసార్లు ఆటగాళ్ల పట్ల కాస్త పరుషంగా వ్యవహరించడంలో తప్పులేదు. ఎందుకంటే.. విశ్రాంతినిస్తున్నామని చెబితే.. వాళ్లు మరోలా ఊహించుకుంటారు. కాబట్టి వేటు వేస్తున్నామని వారికి తెలిసేలా చేయాలి.సిరాజ్ స్థానంలో వారిని తీసుకోండి అప్పుడే వారిలో కసి పెరుగుతుంది. కచ్చితంగా ఆట తీరును మెరుగుపరచుకుంటారు’’ అని పేర్కొన్నాడు. జట్టులో మార్పులు చేయాలనుకుంటే.. సిరాజ్‌ను తప్పించి ప్రసిద్ కృష్ణ లేదంటే హర్షిత్ రాణాను పిలిపించాలని గావస్కర్ ఈ సందర్భగా సూచించాడు. బుమ్రాకు వారు సపోర్టుగా ఉంటారని పేర్కొన్నాడు. బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజూ ఆసీస్దేకాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య గురువారం బాక్సింగ్ డే టెస్టు మొదలైంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సరికి ఆసీస్ పటిష్ట స్థితిలోనే ఉంది.తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగుల మేర భారీ స్కోరు సాధించిన కంగారూ జట్టు.. శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి సగం వికెట్లు తీసి భారత్‌ను దెబ్బకొట్టింది. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మరో పేసర్ స్కాట్ బోలాండ్ చెరో రెండు వికెట్లు తీయగా.. 46 ఓవర్లలో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(82) రనౌట్ కావడంతో భారత్‌కు గట్టి షాక్ తగిలింది.చదవండి: కోహ్లికి అవమానం.. ఇంత నీచంగా ప్రవర్తిసారా?.. తగ్గేదేలే అంటూ దూసుకొచ్చిన కింగ్ -
లబుషేన్‌కు రోహిత్ వార్నింగ్ ఇచ్చినా.. అంపైర్లు పట్టించుకోరా?
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ల తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్, మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్ మధ్య పరిగెత్తడం సరికాదని చెబుతున్నా.. పదే పదే అదే తప్పు పునరావృతం చేశారని మండిపడ్డారు. అంపైర్లు కూడా ఆసీస్ బ్యాటర్లను చూసీ చూడనట్లు వదిలేయడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశారు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా భారత్- ఆసీస్ మధ్య గురువారం నాలుగో టెస్టు మొదలైంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలిరోజు కంగారూ జట్టు పైచేయి సాధించింది. 86 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టానికి 311 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీతోఓపెనర్లలో అరంగేట్ర ఆటగాడు సామ్ కొన్‌స్టాస్(60), ఉస్మాన్ ఖవాజా(57) అర్ధ శతకాలతో మెరవగా.. వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్(72) కూడా రాణించాడు. మిగతా వాళ్లలో అలెక్స్ క్యారీ(31) ఫర్వాలేదనిపించగా.. స్టీవ్ స్మిత్ గురువారం ఆట పూర్తయ్యేసరికి 68 పరుగులతో క్రీజులో ఉన్నాడు.లబుషేన్‌కు రోహిత్ వార్నింగ్ఇక భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. కాగా పరుగులు తీసే సమయంలో లబుషేన్(Marnus Labuschagne) పిచ్ మధ్యగా పరిగెత్తగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ అతడిని హెచ్చరించాడు. కామెంటేటర్లు సునిల్ గావస్కర్, ఇర్ఫాన్ పఠాన్ ఈ విషయం గురించి చర్చిస్తూ ఆసీస్ బ్యాటర్ల తీరును తప్పుబట్టారు.అంపైర్లు ఏం చేస్తున్నారు?‘‘పిచ్ మధ్య పరిగెత్త వద్దని మార్నస్ లబుషేన్‌కు రోహిత్ శర్మ చెప్పాడు. అయినా.. మధ్య స్ట్రిప్ గుండా ఎందుకు పరిగెత్తాలి?’’ అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. ఇందుకు గావస్కర్ స్పందిస్తూ.. ‘‘సామ్ కొన్‌స్టాస్(Sam Konstas) కూడా ఇలాగే చేశాడు. అయినా.. అతడిని ఎవరూ హెచ్చరించలేదు’’ అని అన్నాడు.ఈ క్రమంలో ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. ‘‘నిజానికి ఇది అంపైర్ల పని’’ అని పేర్కొనగా.. ‘‘అవును అంపైర్లు అలా చూస్తూ ఊరుకున్నారు. రోహిత్- లబుషేన్‌తో మాట్లాడుతుంటే.. జస్ట్ అలా చూస్తూ ఉండిపోయారంతే.. ఎందుకలా ఉన్నారో నాకైతే అర్థం కాలేదు’’ అని గావస్కర్ అన్నాడు. వీరి సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.చదవండి: ఆసీస్‌తో బాక్సింగ్ డే టెస్టు: వ్యూహం మార్చిన టీమిండియా!.. అందుకే గిల్‌పై వేటు🗣 #RohitSharma gets disappointed, warns #Labuschagne for running on the pitch during the #BoxingDayTest 🧐#AUSvINDOnStar 👉 4th Test, Day 1 LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/iNGMjtGXXQ— Star Sports (@StarSportsIndia) December 26, 2024 -
అశ్విన్.. రిటైర్మెంట్ ప్రకటించడానికి సమయమా ఇది..?
ఆసీస్‌తో మూడో టెస్ట్ (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ) అనంతరం టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అశ్విన్ సడెన్‌గా ఆటకు వీడ్కోలు పలికినందుకు భారత అభిమానులంతా బాధపడుతుంటే.. క్రికెట్ దిగ్గజం, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ మాత్రం అశ్విన్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాడు. సిరీస్ మధ్యలో ఈ ఆకస్మిక నిర్ణయమేంటని ప్రశ్నిస్తున్నాడు. అశ్విన్ రిటైర్ కావాలనుకుంటే సిరీస్ అయిపోయే దాకా వేచి ఉండాల్సిందని అన్నాడు. అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటన టీమిండియా ప్రణాళికలపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఇలాంటి దశలో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన సిరీస్ ఫలితాన్ని తారుమారు చేయగలదని అంచనా వేశాడు. అశ్విన్ సిరీస్ మధ్యలో రిటైర్ కావడం వల్ల భారత్ మిగిలిన రెండు మ్యాచ్‌లకు ఒక ఆటగాడి సేవలు కోల్పోతుందని అన్నాడు. గతంలో ఎంఎస్ ధోని కూడా ఇలాగే సిరీస్ మధ్యలో రిటైరైన విషయాన్ని ప్రస్తావించాడు. సిరీస్‌లో చివరిదైన సిడ్నీ టెస్ట్‌లో అశ్విన్ తన ప్రభావాన్ని చూపేందుకు ఆస్కారముండేదని అభిప్రాయపడ్డాడు. సిడ్నీ పిచ్‌కు స్పిన్నర్లకు సహకరించిన చరిత్ర ఉందని గుర్తు చేశాడు. అశ్విన్ నిర్ణయాన్ని తప్పుబడుతూనే గవాస్కర్ మరో కీలక వ్యాఖ్య చేశాడు. మిగిలిన సిరీస్ కోసం అశ్విన్‌తో పోలిస్తే వాషింగ్టన్ సుందర్ ముందున్నాడని అన్నాడు.కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ వేదికగా ప్రారంభం కానుంది. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే ఆసీస్‌తో తదుపరి జరుగబోయే రెండు టెస్ట్‌ల్లో గెలవాల్సి ఉంది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.మ్యాచ్ ఐదు రోజులు వర్షం అంతరాయాలు కలిగించడంతో మూడో టెస్ట్‌లో ఫలితం తేలలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో తడబడగా.. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఆకాశ్‌దీప్, బుమ్రా ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించారు. రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగులు చేసే క్రమంలో ఆసీస్ త్వరితగతిన వికెట్లు కోల్పోయింది. అయినా భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. చివరి రోజు మరోసారి వరుణుడు విజృంభించడంతో కొద్ది సేపటికే మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. -
‘కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్‌బై చెబుతాడు’
గత కొన్నాళ్లుగా టెస్టు క్రికెట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. కెప్టెన్‌గానూ, బ్యాటర్‌గానూ ఈ ముంబైకర్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో రోహిత్ సేన వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే.వరుస వైఫల్యాలుకివీస్తో సిరీస్‌లో బ్యాటర్‌గానూ రోహిత్ విఫలమయ్యాడు. మూడు టెస్టుల్లో అతడు చేసిన స్కోర్లు 2, 52, 0, 8, 18, 11. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టెస్టుల్లోనూ హిట్‌మ్యాన్ బ్యాట్ ఝులిపించలేకపోతున్నాడు. పెర్త్ టెస్టుకు దూరంగా ఉన్న రోహిత్.. అడిలైడ్‌లో తేలిపోయాడు. ఈ పింక్ బాల్ మ్యాచ్‌లో అతడు మొత్తంగా కేవలం తొమ్మిది (3, 6) పరుగులే చేశాడు.ఇక కీలకమైన మూడో టెస్టులోనూ రోహిత్ శర్మ విఫలయ్యాడు. బ్రిస్బేన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ కేవలం పది పరుగులే చేశాడు. కాగా ఆసీస్‌తో ఆడిన రెండు టెస్టుల్లోనూ ఓపెనర్‌గా కాకుండా ఆరోస్థానంలో రోహిత్ బ్యాటింగ్‌కు దిగడం గమనార్హం. దీంతో మిడిలార్డర్లో ఆడటం కూడా రోహిత్ ప్రదర్శనపై ప్రభావం పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు.. సారథిగా, బ్యాటర్‌గా వైఫల్యం చెందుతున్న రోహిత్ శర్మపై వేటు వేయాలనే డిమాండ్లూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ రోహిత్ శర్మను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆసీస్‌తో మిగిలిన రెండు టెస్టుల్లో రోహిత్ పరుగులు రాబట్టేందుకు కచ్చితంగా ప్రయత్నం చేస్తాడు.అదే జరిగితే కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్‌బై!ఒకవేళ అలా జరగనట్లయితే.. తనను తానుగా తప్పుకొంటాడు. అతడు నిస్వార్థ గుణం ఉన్న కెప్టెన్. జట్టుకు భారంగా ఉండాలని కోరుకోడు. భారత క్రికెట్ ప్రయోజనాల పట్ల అతడి అంకితభావం అమోఘం. కాబట్టి వచ్చే రెండు మ్యాచ్‌లలోనూ ఇదే పునరావృతం అయితే, కచ్చితంగా కెప్టెన్‌గా తప్పుకొంటాడు’’ అని సునిల్ గావస్కర్ పేర్కొన్నాడు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్ గడ్డ మీద ఐదు టెస్టులు ఆడుతోంది టీమిండియా. తొలి టెస్టుకు జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించగా భారత్ 295 పరుగుల తేడాతో గెలిచింది. ఇక రెండో టెస్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా తిరిగి రాగా.. ఆసీస్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడింది. దీంతో సిరీస్ 1-1తో సమం కాగా.. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు ‘డ్రా’ గా ముగిసింది. తదుపరి ఇరుజట్ల మధ్య మెల్బోర్న్, సిడ్నీ వేదికగా నాలుగు, ఐదు టెస్టులు జరుగుతాయి.చదవండి: వర్షం వల్లే డ్రా.. లేదంటే గెలుపు మాదే.. ఆ ఇద్దరు అద్భుతం: కమిన్స్ -
‘షాట్ సెలక్షన్ చెత్తగా ఉంది.. నీ ఇమేజ్ను వదిలెయ్’
టీమిండియా స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ఆట తీరును భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ విమర్శించాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో గిల్ షాట్ సెలక్షన్‌ను సన్నీ తప్పుబట్టాడు. బ్యాటింగ్‌కు వచ్చే ముందు డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఇమేజ్ను వదిలేస్తే ఇలాంటి పొరపాట్లు జరగవంటూ చురకలు అంటించాడు.అడిలైడ్‌లో అలాబోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఐదు టెస్టులు ఆడుతోంది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుకు గాయం కారణంగా గిల్ దూరమయ్యాడు. అయితే, రెండో టెస్టు నాటికి అతడు అందుబాటులోకి వచ్చాడు. అడిలైడ్‌లో జరిగిన ఈ పింక్‌బాల్ మ్యాచ్‌లో గిల్ ఫర్వాలేదనిపించాడు. రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 31, 28 పరుగులు చేశాడు.అయితే, బ్రిస్బేన్ టెస్టులో మాత్రం గిల్ పూర్తిగా నిరాశపరిచాడు. మూడు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్ వెలుపలా వెళ్తున్న బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. నీ ఇమేజ్ను డ్రెస్సింగ్ రూమ్‌లోనే వదిలెయ్అయితే, షాట్ సరిగ్గా కనెక్ట్ కాలేదు. ఈ క్రమంలో బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బంతి గల్లీ పాయింట్లో ఉన్న మిచెల్ మార్ష్ చేతిలో పడింది. దీంతో గిల్ పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘నీ ఇమేజ్ను డ్రెస్సింగ్ రూమ్‌లోనే వదిలెయ్. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇలాంటి షాట్లు ఆడటం ప్రమాదకరమని తెలిసినా.. నువ్వు జాగ్రత్త పడలేదు.చెత్త షాట్ సెలక్షన్కాస్త కుదురుకున్న తర్వాత ఇలాంటివి ప్రయత్నించవచ్చు. 30- 40- 50 పరుగులు సాధించిన తర్వాత రిస్క్ తీసుకోవచ్చు. కానీ ఆరంభంలోనే ఇలాంటి చెత్త షాట్ సెలక్షన్ ఏమిటి? నిజానికి మార్ష్ క్యాచ్ పట్టిన తీరు అద్భుతం. ఈ విషయంలో గిల్‌కు కాస్త దురదృష్టం ఎదురైందని చెప్పవచ్చు.ఏదేమైనా.. ఆ బంతిని ఆడకుండా.. అలా వదిలేసి ఉంటే బాగుండేది. అనవసరపు షాట్‌కు యత్నించినందుకు గిల్ డగౌట్లో కూర్చోవాల్సి వచ్చింది’’ అని పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో భాగంగా గావస్కర్ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కష్టాల్లో టీమిండియాకాగా బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేయగా.. భారత్ కనీసం మూడు వందల పరుగుల మార్కును కూడా చేరుకునేలా కనిపించడం లేదు. గాబ్బాలో మంగళవారం నాటి నాలుగో రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి రోహిత్ సేన ఏడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇక ఈ సిరీస్‌లో పెర్త్‌లో టీమిండియా, అడిలైడ్‌లో ఆసీస్ గెలిచి ప్రస్తుతానికి 1-1తో సమంగా ఉన్నాయి.చదవండి: కెప్టెన్‌గా రింకూ సింగ్ -
నా పరిస్థితి బాలేదు.. తాగడం మానేశాను.. సాయం కావాలి: వినోద్ కాంబ్లీ
టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. మద్యం సేవించడం, పొగ తాగే అలవాట్ల కారణంగా తన ఆరోగ్యం పూర్తిగా పాడైపోయిందన్నాడు. అయితే, ఆరు నెలల క్రితమే ఈ చెడు వ్యసనాలను వదిలేశానని.. తన పిల్లల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అదే విధంగా.. భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బృందం తనకు ఇచ్చిన ఆఫర్‌ను అంగీకరిస్తున్నట్లు కాంబ్లీ పేర్కొన్నాడు.పాతాళానికి పడిపోయాడుముంబై తరఫున టీమిండియాలో అడుగుపెట్టిన వినోద్ కాంబ్లీ.. దిగ్గజ ఆటగాడు సచిన్ టెండుల్కర్‌కు బాల్య మిత్రుడు. సచిన్ అంతటి స్థాయికి ఎదిగే నైపుణ్యాలున్నా.. వ్యక్తిగత క్రమశిక్షణ లోపించిన కారణంగా కాంబ్లీ పాతాళానికి పడిపోయాడని క్రికెట్ ప్రేమికులు భావిస్తుంటారు. ఇటీవల తమ ‘గురు’, ప్రముఖ క్రికెట్ కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ 92 జయంతి సందర్భంగా సచిన్ టెండుల్కర్తో కలిసి వినోద్ కాంబ్లీ వేదికను పంచుకున్నాడు.సాయం చేస్తాం.. కానీ ఓ షరతుఆ సమయంలో కాంబ్లీ ఆరోగ్య, మానసిక పరిస్థితిని చూసిన అభిమానులు చలించిపోయారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్యం కారణంగా కుంగిపోయిన అతడి దుస్థితికి చింతించారు. ఈ నేపథ్యంలో 1983 ప్రపంచకప్ విజేత, కపిల్ దేవ్ సారథ్యంలోని భారత ఆటగాళ్లు కాంబ్లీకి సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు.అయితే, కాంబ్లీ పునరావాస కేంద్రానికి వెళ్లి చికిత్స తీసుకునేందుకు సిద్ధంగా ఉంటేనే.. సాయం చేస్తామనే షరతు విధించారు. ఈ నేపథ్యంలో విక్కీ లల్వానీ యూట్యూబ్ చానెల్‌తో ముచ్చటించిన వినోద్ కాంబ్లీ.. కపిల్ దేవ్ కండిషన్‌కు తాను ఒప్పుకొంటున్నట్లు తెలిపాడు.నా కుటుంబం నాతో ఉంది‘‘రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నా కుటుంబం నాతో ఉంది. కాబట్టి నాకు ఇప్పుడు ఎలాంటి భయం లేదు. తొలుత సునిల్ గావస్కర్ నాతో మాట్లాడారు. ఇక అజయ్ జడేజా కూడా నాకు మంచి స్నేహితుడు.అతడు నా దగ్గరికి వచ్చాడు. నీకోసం మేమంతా ఎదురుచూస్తున్నామని చెప్పాడు. బీసీసీఐ నాకు సహాయం చేస్తుందని తెలుసు. మాజీ పేసర్ అభయ్ కురువిల్లా నాతో పాటు నా భార్యతోనూ టచ్‌లో ఉన్నాడు.నిజానికి నా పరిస్థితి అస్సలు బాగా లేదు. అయినప్పటికీ నా భార్య అన్నింటినీ చక్కగా హ్యాండిల్ చేస్తోంది. ఆమెకు కచ్చితంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. నాకిప్పుడు ఎలాంటి భేషజాలు లేవు. ధైర్యంగా రిహాబ్ సెంటర్‌కు వెళ్లి.. ఆరోగ్యంగా తిరిగి వస్తాను.ఇప్పుడు అన్నీ వదిలేశానుఆరు నెలల క్రితమే మద్యం, పొగ తాగటం మానేశాను. నా పిల్లల బాగుకోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. గతంలో నాకు చెడు అలవాట్లు ఉన్న మాట వాస్తవమే. కానీ ఇప్పుడు అన్నీ వదిలేశాను’’ అని వినోద్ కాంబ్లీ చెప్పుకొచ్చాడు. కాగా గతంలో భార్య ఆండ్రియా కాంబ్లీపై గృహహింస కేసు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం వాళ్లు సఖ్యతగా ఉంటున్నట్లు కాంబ్లీ మాటలను బట్టి తెలుస్తోంది.తొమ్మిదేళ్ల కెరీర్లోఇదిలా ఉంటే.. టీమిండియా తరఫున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడిన వినోద్ కాంబ్లీ.. తొమ్మిదేళ్ల పాటు(1991-2000) అంతర్జాతీయ కెరీర్ కొనసాగించాడు. టెస్టుల్లో 1084, వన్డేల్లో 2477 పరుగులు సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా(14 ఇన్నింగ్స్‌లో) వెయ్యి పరుగుల మార్కు అందుకున్న భారత క్రికెటర్‌గా ఇప్పటికీ కాంబ్లీ తన రికార్డును కొనసాగిస్తున్నాడు.చదవండి: D Gukesh Prize Money: గుకేశ్ ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే? -
ఒకే ఒక సెంచరీ.. చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి
గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టెస్టుకు టీమిండియా సిద్దమవుతోంది. డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న ఈ టెస్టులో ఎలాగైనా తిరిగిపుంజుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్టు ఇప్పటికే బ్రిస్బేన్‌కు చేరుకున్న రోహిత్ సేన నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.అరుదైన రికార్డుపై కన్నేసిన కోహ్లి..అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. మూడో టెస్టులో కోహ్లి సెంచరీ సాధిస్తే.. ఆస్ట్రేలియా గడ్డపై ఐదు ప్రధాన స్టేడియాల్లో టెస్టు సెంచరీ సాధించిన మూడో పర్యాటక బ్యాటర్‌గా నిలుస్తాడు.కోహ్లి ఇప్పటివరకు ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటివరకు 7 టెస్టు సెంచరీలు సాధించాడు. అడిలైడ్‌లో మూడు సెంచరీలు (2012, 2014, 2014), పెర్త్‌లో రెండు (2018, 2024), మెల్బోర్న్ (2014), సిడ్నీ (2015)లో ఒక్కో సెంచరీ సాధించాడు. కానీ గబ్బాలో మాత్రం కోహ్లి ఇప్పటివరకు ఒక్క సెంచరీ నమోదు చేయలేకపోయాడు. కాగా ఇప్పటివరకు భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్, ఇంగ్లండ్ దిగ్గజం అలైస్టర్ కుక్ మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. వీరిద్దరూ ఆస్ట్రేలియాలో ఐదు వేర్వేరు స్టేడియాల్లో సెంచరీలు చేశారు. ఇప్పుడు మరోసారి కోహ్లికి గబ్బాలో సెంచరీ చేసే అవకాశం లభించింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తే కింగ్ కోహ్లి.. గవాస్కర్, కుక్ సరసన చేరుతాడు.చదవండి: ప్రపంచంలో అత్యుత్తమ టెస్టు బ్యాటర్ అతడే: రిక్కీ పాంటింగ్ -
'ఆసీస్‌తో మూడో టెస్టు.. రోహిత్ శర్మ ఓపెనర్‌గానే రావాలి'
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమైన విషయం విధితమే. రెండు ఇన్నింగ్స్‌ల్లో 3, 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే ఈ పింక్ బాల్ టెస్టులో తన ఓపెనింగ్ స్ధానాన్ని కేఎల్ రాహుల్‌కు త్యాగం చేసిన రోహిత్ శర్మ.. ఏకంగా ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. రోహిత్ శర్మ తన భార్య రెండో కాన్పు కోసం తొలి టెస్టుకు గైర్హారయ్యాడు. దీంతో అతడి స్ధానంలో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. పెర్త్ టెస్టులో రాహుల్ బాగా రాణించడంతో రెండో టెస్టులో కూడా అతడినే ఓపెనర్‌గా కొనసాగించింది. ఈ క్రమంలోనే హిట్‌మ్యాన్ లోయార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ మెనెజ్‌మెంట్ నిర్ణయం బెడిసి కొట్టింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గావస్కర్, రవిశాస్త్రి జట్టు మెనెజ్‌మెంట్‌కు కీలక సూచనలు చేశారు. బ్రిస్బేన్ వేదికగా జరగనున్న మూడో టెస్టులో రోహిత్ శర్మ ఎప్పట్లాగే ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేయాలని వీరిద్దరూ అభిప్రాయపడ్డారు.‘రోహిత్ దూకుడుగా ఆడాలంటే అతనికి ఓపెనింగ్ స్థానమే సరైంది. తన శైలి ఆటతీరు ఆవిష్కృతం కావాలంటే, యథేచ్ఛగా బ్యాటింగ్ చేయాలంటే తనకు నూటికినూరు శాతం నప్పే ఓపెనింగ్‌లో బ్యాటింగ్‌కు దిగాలి. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ అంత సౌకర్యంగా కన్పించలేదు. అతడు కొంచెం డీలా పడినట్లు అన్పించిందని శాస్త్రి ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.అదే విధంగా ఆస్ట్రేలియాకు చెందిన స్పోర్ట్స్ టాక్‌తో గవాస్కర్ మాట్లాడుతూ.. "రోహిత్ తిరిగి మళ్లీ తన ఓపెనింగ్ స్ధానానికి రావాలి. రాహుల్ ఎందుకు ఓపెన్ చేశాడో మనకు అందరికి తెలుసు. తొలి టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులో లేనందున రాహుల్ ఆ స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.ఆ మ్యాచ్‌లో జైశ్వాల్‌తో కలిసి 200 పరుగుల పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అందుకే రెండో టెస్టులో కూడా రాహుల్‌కు ఛాన్స్ ఇచ్చారు. కానీ అతడు రాణించలేకపోయాడు. కాబట్టి రోహిత్ మళ్లీ ఓపెనర్‌గా రావాలని నేను భావిస్తున్నాను" అని అతడు చెప్పుకొచ్చాడు.చదవండి: IND vs AUS: 'రోహిత్ ఇంకేం నిరూపించుకోవాలి.. అతడి సత్తా ఏంటో మనకు తెలుసు' -
'మీరేమి టూర్‌కు వెళ్లలేదు.. దయచేసి హోటల్ గదులలో కూర్చోవద్దు'
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ బాల్ టెస్టులో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్ వైఫల్యం కారణంగా భారత్ ఈ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ కనీసం 200 పరుగుల మార్క్‌ను టీమిండియా దాటలేకపోయింది. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగియడంతో మిగిలిన రెండు రోజులను ప్రాక్టీస్ కోసం ఉపయోగించుకోవాలని రోహిత్ సేనను గవాస్కర్ సూచించాడు. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా ప్రారంభం కానుంది."ఈ మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన భారత జట్టుకు ఓ సలహా ఇవ్వాలనకుకుంటున్నాను. ఇది ఐదు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్ అని మర్చిపోండి. మూడు టెస్టుల సిరీస్‌గానే భావించండి. అడిలైడ్ టెస్టులో మిగిలిన రెండు రోజులను ప్రాక్టీస్ కోసం ఉపయోగించుకోవాలి. టెస్టు క్రికెట్‌కు ప్రాక్టీస్ చాలా ముఖ్యం. మీరేమి టూర్‌కు వెళ్ల లేదు,క్రికెట్ ఆడేందుకు ఇక్కడికి వచ్చారన్న విషయం గుర్తు పెట్టుకోండి. కాబట్టి హోటల్ గదులకే పరిమితం కావద్దు.రోజంతా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఉదయం లేదా మధ్యాహ్నం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటే చాలు. కానీ విలువైన ఈ రెండు రోజుల సమయాన్ని మాత్రం వృథా చేయవద్దు. ఈ టెస్టు మ్యాచ్ ఐదు రోజుల పాటు జరిగింటే ఈ సమయంలో మీరు మైదానంలో ఉండేవారు. కాబట్టి అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సాధన చేయండి. తిరిగి మీ రిథమ్‌ను పొందేందుకు ప్రయత్నించండి. ఆప్షనల్ ప్రాక్టీస్‌ను నేను ఎప్పుడూ సపోర్ట్ చేయను. ప్రాక్టీస్ నుంచి ఏ ఆటగాడు విశ్రాంతి తీసుకోవాలనేది కెప్టెన్ లేదా కోచ్ మాత్రమే నిర్ణయించాలి. అంతే తప్ప ఆటగాళ్లకు ఛాయిస్ ఇవ్వకూడదు. అలా చేస్తే ప్రాక్టీస్ వద్దని, రూమ్లకే పరిమితమవుతారు.భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడం తమకు దక్కిన గౌరవంగా భావించాలి. మొత్తం మీరు 57 రోజులు ఆస్ట్రేలియాలో ఉంటారు. అందులో అయిదు టెస్టులు, ప్రాక్టీస్ మ్యాచ్ కలిపి 27 రోజులు ఆడితే, దాదాపు నెల రోజుల విశ్రాంతి మీకు లభిస్తోంది. అది సరిపోతుంది అనుకుంటున్నాను.దయచేసి వచ్చి ప్రాక్టీస్ చేయండి. జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు సాధన చేయకోపోయిన పర్వాలేదు. ఎందుకంటే వారికి చాలా అనుభవం ఉంది. కానీ మిగితా ప్లేయర్లంతా కచ్చితంగా ఈ రెండు రోజులు పాటు శ్రమించాల్సిందేనని" ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు.చదవండి: బాధ్యత బుమ్రా ఒక్కడిదేనా? అందరిదీ: రోహిత్ -
సిరాజ్ కాస్త తగ్గించుకో.. అతడొక లోకల్ హీరో: సునీల్ గవాస్కర్
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్‌బాల్ టెస్టులో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట సందర్భంగా ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిన అనంతరం సిరాజ్ మితిమీరి ప్రవర్తించాడు.అద్భుతమైన యార్కర్‌తో హెడ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్.. అతడి వద్దకు వెళ్లి గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అందుకు హెడ్ రియాక్ట్ కావడంతో సిరాజ్ మరింత రెచ్చిపోయాడు. ఆడింది చాలు ముందు ఇక్కడ నుంచి వెళ్లు అన్నట్లు సైగలు చేశాడు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఆ తర్వాత ఈ హైదరాబాదీ అసీస్ అభిమానుల అగ్రహానికి గురయ్యాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్‌ను చేస్తున్న సిరాజ్‌ను ఫ్యాన్స్ స్లెడ్జింగ్ చేశారు. దీంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సిరాజ్ ఫీల్డింగ్ పొజిషన్‌ను మార్చేశాడు.ఈ నేపథ్యంలో సిరాజ్‌పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అగ్రహం వ్యక్తం చేశాడు. అద్బుతమైన సెంచరీ చేసిన ఆటగాడి పట్ల సిరాజ్ ప్రవర్తించిన తీరు సరికాదని గవాస్కర్ మండిపడ్డాడు."సిరాజ్ అలా ప్రవర్తించడం సరి కాదు. హెడ్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడేమి నాలుగైదు పరుగులు చేసి ఔట్ కాలేదు. 140 పరుగులు చేసిన ఆటగాడిని గౌరవించాల్సింది పోయి అంత ఆగ్రహాంగా సెంఢాఫ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? సిరాజ్ ఇలా చేసినందుకు ఆసీస్ అభిమానుల నుంచి వచ్చిన ప్రతిస్పందన నన్ను ఏ మాత్రం ఆశ్చర్యపరచలేదు.ట్రావిస్ హెడ్ లోకల్ హీరో. సెంచరీ చేసి ఔటైన తర్వాత సిరాజ్ చప్పట్లు కొట్టి అతడిని అభినందించి ఉంటే కచ్చితంగా హీరో అయ్యి ఉండేవాడు. కానీ మితి మీరి ప్రవర్తించడంతో సిరాజ్ ఇప్పుడు విలన్ అయ్యాడు" అని స్టార్ స్పోర్ట్స్ టీ టైమ్ షోలో సన్నీ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 4 వికెట్లు పడగొట్టాడు.చదవండి: IND vs AUS: జస్ప్రీత్ బుమ్రాకు గాయం.. కీలక అప్డేట్ ఇచ్చిన బౌలింగ్ కోచ్ -
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్‌దే పైచేయి.. ఆసీస్‌కు మరోసారి సవాల్?
ప్రపంచ క్రికెట్లో యాషెష్ తర్వాత అంత్యంత టెస్టు రైవలరీ ఏదైనా ఉందంటే అది బోర్డర్-గవాస్కర్ ట్రోఫీనే. ఆస్ట్రేలియా-భారత్ మధ్య ప్రతీ రెండేళ్లకు ఓ సారి జరిగే ఈ రెడ్ బాల్ సమరానికి సమయం అసన్నమైంది. నువ్వా నేనా అన్నట్టుగా సాగే ఈ పోటీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ఈ బీజీటీ ట్రోఫీ ప్రారంభం కానుంది. 32 ఏళ్ల తర్వాత ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీ కోసం ఇరు జట్లు అన్ని విధాల సిద్దమయ్యాయి. భారత జట్టు అయితే 12 రోజుల ముందుగానే ఆసీస్ గడ్డపై అగుడుపెట్టి తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది. ఈ సిరీస్ భారత్ చాలా కీలకం. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కి అర్హత సాధించాలంటే టీమిండియా ఈ టెస్టు సిరీస్‌ను 4-1 తప్పకగెలవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ హిస్టరీపై ఓ లుక్కేద్దాం.1996లో మొదలై..భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు క్రికెట్ జర్నీ 1947లో మొదలైంది. లాలా అమర్నాథ్ సారథ్యంలో భారత జట్టు తొలిసారిగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. మొట్టమొదటి సిరీస్‌ను కంగారులు 4-0 తేడాతో సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 1947 నుండి 1992 వరకు భారత్-ఆస్ట్రేలియా మధ్య 50 టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి.అయితే 1996లో భారత క్రికెట్ బోర్డు, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్, ఆస్ట్రేలియా మాజీ సారథి అలన్ బోర్డర్ల గౌరవర్ధం ఓ సిరీస్ నిర్వహించాలని భావించాయి.దీంతో ఆసీస్-భారత్ మధ్య జరిగే టెస్టు సిరీస్‌కు ‘బోర్డర్-గావస్కర్ ట్రోఫీ’గా ఇరు దేశాల క్రికెట్ బోర్డులు నామకరణం చేశాయి. అప్పటి నుంచి ఈ ట్రోఫీ విజయవంతంగా సాగుతోంది. కాగా గావస్కర్, అలెన్ బోర్డర్ వరల్డ్ టెస్టు క్రికెట్లో తమదైన ముద్ర వేసుకున్నారు. వీరిద్దరూ టెస్టుల్లో 10,000 కంటే ఎక్కువ పరుగులు చేసి తమ జట్లకు ఎన్నో అద్బుత విజయాలు అందించారు.మనదే పైచేయి..బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్‌పై భారత్‌దే పైచేయిగా కొనసాగుతోంది. ఈ ట్రోఫీ కింద ఇప్పటివరకు మొత్తం 16 సిరీస్‌లు జరిగాయి. అందులో టీమిండియా 10 సార్లు విజేతగా నిలవగా.. ఆసీస్ ఐదు సిరీస్‌లను సొంతం చేసుకుంది. 2003–04 సిరీస్ మాత్రమే డ్రా అయింది. ఓవరాల్‌గా 1996 నుంచి ఇరు జట్ల మధ్య 57 టెస్టుల్లో జరిగాయి. అందులో టీమిండియా 24, ఆస్ట్రేలియా 21 విజయాలు సాధించింది. 12 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.ఆసీస్ గడ్డపై సరికొత్త చరిత్ర..2018-19లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. 2-1 తేడాతో ఆసీస్ గడ్డపై తొలి టెస్టు సిరీస్‌ను టీమిండియా తమ ఖాతాలో వేసుకుంది. 71 ఏళ్లగా ఆసీస్ గడ్డపై ఊరిస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుని తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది.ఆ తర్వాత 2021-22లో పర్యటనలో కూడా సత్తాచాటిన భారత జట్టు ఆస్ట్రేలియా గడ్డపై మళ్లీ సిరీస్‌ను కైవసం చేసుకుంది. గత రెండు పర్యాయాలు ఆసీస్‌ను వారి సొంతగడ్డపై ఓడించిన టీమిండియా ఈసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది.చదవండి: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్‌పై వేటు -
Indv s Aus: రెండోసారి తండ్రి కాబోతున్న రోహిత్!.. కెప్టెన్‌గా అతడే ఉండాలి!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరం కానున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, అందుకు గల కారణమేమిటన్నది ఇంత వరకు స్పష్టం కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆసక్తికర అంశం తెరమీదకు వచ్చింది. పితృత్వ సెలవుల కారణంగానే హిట్‌మ్యాన్ ఆసీస్‌తో ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం.రెండోసారి తండ్రి కాబోతున్న రోహిత్!అవును.. రోహిత్ శర్మ రెండోసారి తండ్రి కాబోతున్నాడట. అతడి భార్య రితికా సజ్దే త్వరలోనే తమ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తోంది. మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ జియో సినిమాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. పెటర్నిటీ లీవ్‌లో ఉన్నందు వల్లే రోహిత్ కాస్త ఆలస్యంగా ఆస్ట్రేలియాకు చేరుకోనున్నట్లు వెల్లడించాడు.స్వదేశంలో చెత్త రికార్డుఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ సైతం రోహిత్ త్వరలోనే శుభవార్త చెప్పబోతున్నాడనే సంకేతాలు ఇచ్చాడు. కాగా టీమిండియాకు టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇటీవల సారథిగా చెత్త రికార్డును రికార్డును మూటగట్టుకున్నాడు. స్వదేశంలో తొలిసారి మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు కెప్టెన్‌గా నిలిచాడు.న్యూజిలాండ్‌తో ఇటీవల బెంగళూరు, పుణె, ముంబై టెస్టుల్లో రోహిత్ సారథ్యంలోని టీమిండియా ఓడిపోయింది. ఇక తదుపరి ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఇందులో కనీసం నాలుగు గెలిస్తేనే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌కు భారత్ చేరుకుంటుంది.ఇంతటి కీలకమైన సిరీస్‌లో రోహిత్ శర్మ ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నాడన్న వార్తల నడుమ.. భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ఘాటుగా స్పందించాడు. ఒకవేళ రోహిత్‌కు విశ్రాంతినివ్వాలనుకుంటే ఆసీస్‌తో టెస్టుల్లో జస్ప్రీత్ బుమ్రానే కెప్టెన్‌గా నియమించాలని సూచించాడు.ఒకవేళ భార్య ప్రసవం కోసమే అయితే..ఈ నేపథ్యంలో ఆరోన్ ఫించ్ స్పందిస్తూ.. గావస్కర్ వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నట్లు తెలిపాడు. ‘‘భారత క్రికెట్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్. ఒకవేళ భార్య ప్రసవం కోసం.. అతడు ఇంటిదగ్గరే ఉండాలనుకుంటే.. అంతకంటే అందమైన క్షణాలు ఉండవు.కాబట్టి అతడు సెలవు తీసుకున్నా మరేం పర్లేదు. అతడికి ఆ హక్కు ఉంది’’ అని పేర్కొన్నాడు. ఒకటీ రెండు మ్యాచ్‌లకు దూరమైనంత మాత్రాన సిరీస్ మొత్తానికి కేవలం ఆటగాడిగానే పరిగణించాలనడం సరికాదని గావస్కర్ వ్యాఖ్యలను ఫించ్ ఖండించాడు.సమైరాకు చెల్లి లేదంటే తమ్ముడు!ఇక కివీస్‌తో ముంబై టెస్టు తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘నేను ఆస్ట్రేలియాకు ఇప్పుడే వెళ్తానో లేనో చెప్పలేను’’ అని పేర్కొన్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో సమైరాకు చెల్లి లేదంటే తమ్ముడు రావడం కన్ఫామ్ అంటూ ఫ్యాన్స్ నెట్టింట సందడి చేస్తున్నారు. కాగా 2015లో స్పోర్ట్స్ మేనేజర్ రితికా సజ్దేను రోహిత్ వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు తొలి సంతానంగా 2018లో కుమార్తె సమైరా జన్మించింది.చదవండి: #Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. కెరీర్లో తొలి డబుల్ సెంచరీ -
BGT: రోహిత్‌ను తప్పించి.. అతడిని కెప్టెన్ చేయండి: టీమిండియా దిగ్గజం
చారిత్రాత్మక ఓటమి నుంచి కోలుకుని తదుపరి టెస్టు సిరీస్‌పై టీమిండియా దృష్టి పెట్టింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో రాణించాలని పట్టుదలగా ఉంది. అయితే, ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.రోహిత్‌ను తప్పించండిఆస్ట్రేలియాతో సిరీస్‌కు కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించాలని గావస్కర్ బీసీసీఐకి సూచించాడు. అతడి స్థానంలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను సారథిగా నియమిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ‘‘రోహిత్ శర్మ తొలి టెస్టుకు అందుబాటులో ఉండడనే వార్తలు వినిపిస్తున్నాయి. బహుశా అతడు రెండో టెస్టు కూడా ఆడకపోవచ్చు.అదే నిజమైతే మాత్రం.. టీమిండియా సెలక్షన్ కమిటీ కాస్త కఠినంగానే వ్యవహరించాలి. ఒకవేళ రోహిత్‌కు విశ్రాంతినివ్వాలని భావిస్తే అలాగే చేయండి. కానీ వ్యక్తిగత కారణాల దృష్ట్యా జట్టుకు దూరమై.. రెండు- మూడు టెస్టులకు అందుబాటులో లేకుండా పోతే మాత్రం.. ఈ టూర్లో అతడిని కేవలం ఆటగాడినే పరిగణించండి.భారత క్రికెట్ కంటే ఎవరూ ఎక్కువ కాదువైస్ కెప్టెన్‌ను ఈ సిరీస్‌కు పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమించండి. వ్యక్తుల కంటే కూడా భారత క్రికెట్ బాగోగులే మనకు ముఖ్యం. ఒకవేళ మనం న్యూజిలాండ్ సిరీస్‌ను 3-0తో గెలిచి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ.. మనం కివీస్ చేతిలో 3-0తో ఓడిపోయాం. కాబట్టి ఇకపై ప్రతి మ్యాచ్‌కు కెప్టెన్ అవసరం తప్పకుండా ఉంటుంది.కెప్టెన్ ఉంటేనే జట్టు ఐకమత్యంగా ఉంటుంది. ఆరంభంలో ఒక సారథి.. ఆ తర్వాత మరో కెప్టెన్ వచ్చాడంటే మాత్రం పరిస్థితి మన ఆధీనంలో ఉండకపోవచ్చు’’ అని సునిల్ గావస్కర్ స్పోర్ట్స్ తక్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇక భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సైతం గావస్కర్ వ్యాఖ్యలను సమర్థించాడు. టెస్టు సారథిగా ఒకే ఒకసారిఇదిలా ఉంటే.. బుమ్రా టెస్టుల్లో ఇప్పటి వరకు టీమిండియాకు ఒకేసారి సారథ్యం వహించాడు. ఇంగ్లండ్‌తో 2022లో జరిగిన బర్మింగ్‌హామ్ టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో బుమ్రా ఐదు వికెట్లతో రాణించినా భారత్‌కు ఓటమి తప్పలేదు. నాడు ఇంగ్లండ్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో బుమ్రా సేన పరాజయం పాలైంది. ఇక.. స్వదేశంలో ఇటీవల న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 3-0తో భారత జట్టు వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే. భారత క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై ఇలా జరగటం ఇదే తొలిసారి. కాగా ఆసీస్‌తో నవంబరు 22 నుంచి టీమిండియా టెస్టులు ఆరంభం కానున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనకు బీసీసీఐ ఎంపిక చేసిన జట్టురోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైశ్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్‌కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.చదవండి: IPL Auction: టీమిండియా స్టార్ల కనీస ధర? అప్పటి నుంచి ఒక్క టీ20 ఆడకుండానే... -
'డబ్ల్యూటీసీ ఫైనల్‌పై ఆశలు వద్దు.. ఆసీస్‌ను భారత్ ఓడించలేదు'
సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్‌కు గురైనటీమిండియా ఇప్పుడు మరో కఠిన పరీక్షకు సిద్దమవుతోంది. మరో వారం రోజుల్లో ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియాకు పయనం కానుంది. నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆసీస్‌తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది.గత రెండు పర్యాయాలు కంగారులను వారి సొంతగడ్డపై చిత్తు చేసిన టీమిండియా ఈసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. కానీ ప్రస్తుత భారత జట్టు ప్రదర్శను చూస్తుంటే హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.అంతేకాకుండా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే భారత్‌కు బీజీటీ ట్రోఫీ ఎంతో కీలకం. ఈ సిరీస్‌లో 4-0 తేడాతో గెలిస్తేనే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆర్హత సాధిస్తుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ గవాస్కర్ ఆప వ్యాఖ్యలు చేశాడు."భారత్ డబ్యూటీసీ ఫైనల్‌కు చేరుతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై టీమిండియా 4-0తో ఓడించలేదు. ఒకవేళ ఆసీస్‌ను భారత్ ఓడిస్తే మాత్రం నేను గాల్లో తేలుతాను. అసలు డబ్ల్యూటీసీ ఫైనల్ గురించే నేను మాట్లాడుకోవడం లేదు.ఇప్పుడు కేవలం ఆస్ట్రేలియాలో సిరీస్ గెలుపైనే దృష్టిపెట్టిండి. 1-0, 2-0, 3-1, 2-1 తేడాతో సిరీస్ గెలిచినా పర్వాలేదు. సిరీస్ గెలవడం ముఖ్యం. ఎందుకంటే భారత క్రికెట్ అభిమానులందరూ ప్రస్తుతం తీవ్ర నిరాశలో ఉన్నారు. మీరు గెలిచి మళ్లీ ఫ్యాన్స్‌లో జోష్ నింపండి" అంటూ ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ పేర్కొన్నాడు.చదవండి: PAK Vs AUS 1st ODI: అదృష్టం వల్లే ఆస్ట్రేలియా గెలిచింది: పాక్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు -
ఐపీఎల్ వల్లే నాశనం.. ఆ సిరీస్ ఎందుకు దండగ?
భారత దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2024-25 సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ టోర్నీలో గ్రూపు స్టేజి మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆక్టోబరు 11న మొదలైన ఈ ప్రతిష్టాత్మక టోర్నీ వచ్చే ఏడాది మార్చి 2 వరకు జరగనుంది.అయితే ప్రస్తుత సీజన్లో చాలా మంది ఆటగాళ్లు తమ రాష్ట్ర జట్ల తరపున ఆడేందుకు అందుబాటులో లేరు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టులతో సీనియర్ జట్టు బిజీగా ఉండగా.. తిలక్ వర్మ నేతృత్వంలోని భారత ‘ఎ’ జట్టు ఒమన్‌లో ఎమర్జింగ్ ఆసియాకప్‌లో ఆడుతోంది. దీంతో దాదాపుగా 30 నుంచి 40 మధ్య ఆటగాళ్లు రంజీ ట్రోఫీకి దూరంగా ఉన్నట్లే. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లు తమ రాష్ట్ర జట్ల నుంచి వైదొలగడం వల్ల ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీవిలువ తగ్గుతోందని గవాస్కర్ అవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను ఎందుకు షెడ్యూల్ చేశారో ఆర్ధం కావడం లేదని ఆయన అన్నారు."ఒకవైపు న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌తో భారత సీనియర్ ఆటగాళ్లు బీజీగా ఉన్నారు. మరోవైపు యువ భారత క్రికెటర్లు ఆసియా కప్‌లో ఆడుతున్నారు. ఈ క్రమంలో రంజీ ట్రోఫీ సీజన్ కూడా ప్రారంభమైంది. ఆటగాళ్లంతా ఇతర ఈవెంట్లలో ఆడేందుకు వెళ్లిపోతున్నారు. దీంతో జాతీయ టోర్నమెంట్(రంజీ ట్రోఫీ) విలువ రోజు రోజుకు తగ్గిపోతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత జట్టు నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు దక్షిణాఫ్రికాకు వెళ్లనుంది. అసలు ఈ సిరీస్ అవసరమా? అంతేకాకుండా భారత-ఎ జట్టు కూడా కూడా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో దాదాపు 50 నుండి 60 మంది ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో తమ రాష్ట్ర జట్లకు అందుబాటులో ఉండరు. ఇతర దేశ క్రికెట్ బోర్డులు ఏవీ కూడా భారత్‌లా వారి దేశీవాళీ టోర్నీలను చిన్నచూపు చూడలేదు.ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియా జట్లు తమ దేశవాళీ టోర్నీల కోసం 'ఎ' జట్ల పర్యటనలను కూడా వాయిదా వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ వచ్చినప్పటి నుంచి రంజీ ట్రోఫీని చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. వచ్చే దేశవాళీ సీజన్ నుంచి అయినా ఈ పరిస్థితి మారుతుందా? అని స్పోర్ట్స్ స్టార్‌కు రాసిన తన కాలమ్‌లో గవాస్కర్ పేర్కొన్నారు.చదవండి: ఓవర్ వెయిట్..! టీమిండియా ఓపెనర్‌కు ఊహించని షాక్? -
'అతడొక అద్బుతం.. నడుము సన్నగా లేదని ఛాన్స్ ఇవ్వలేదు'
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమి పాలైనప్పటికి మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మాత్రం తన అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌటైన సర్ఫరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో మెరుపు సెంచరీతో చెలరేగాడు. కివీస్ బౌలర్లను చీల్చిచెండాడుతూ తన తొలి అంతర్జాతీయ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.ఓవరాల్‌గా 195 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ 18 ఫోర్లు, 3 సిక్స్‌లతో 150 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్‌పై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. సర్ఫరాజ్ ఒక అద్బుతమైన ప్లేయర్, బ్యాటింగ్ టెక్నిక్ చాలా బాగుంటుందని సన్నీ కొనియాడాడు. అదే విధంగా స్లిమ్‌గా లేడని ఇప్పటివరకు సర్ఫరాజ్‌కు అవకాశమివ్వని భారత సెలక్టర్ల తీరును కూడా గవాస్కర్ తప్పుబట్టాడు.దేశవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్‌కు టన్నుల కొద్దీ పరుగులు, సెంచరీలు చేసిప్పటకి భారత జట్టులో చోటు సంపాదించుకోవడానికి కొన్నేళ్ల సమయం పట్టింది. అంతర్జాతీయ క్రికెట్‌కు తగ్గట్టు అతడు స్లిమ్‌గా లేడని, నడుము సన్నగా లేదని అవకాశాలు ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అదే సర్ఫరాజ్ అతడి నడుము కంటే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దురదృష్టవశాత్తూ.. భారత క్రికెట్లో చాలా మంది నిర్ణయాధికారులు ఉన్నారు. వారి ఆ ఆలోచనలను అర్థం చేసుకోవడం చాలా కష్టమని స్పోర్ట్స్ స్టార్ కాలమ్‌లో సన్నీ రాసుకొచ్చాడు. రిషబ్ పంత్ ఫిట్‌నెస్‌పై కూడా గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.ఫిట్నెస్ అతి ప్రేమికులు కోరుకున్నట్లుగా లేని మరో క్రికెటర్ రిషబ్ పంత్. ఈ ఫిట్నెస్ ప్యూరిస్ట్లు కోరుకునే సన్నని నడుము పంత్‌కు కూడా లేదు. కానీ అతడు చాలా టాలెంటడ్ క్రికెటర్. అతను రోజంతా వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. ఒక టెస్టులో దాదాపు ఆరు గంటల పాటు వికెట్ కీపర్‌గా పలు రకాల సేవలను అందిస్తున్నాడు. కాబట్టి దయచేసి ఈ యోయో-యోయో పరీక్షలను పక్కన పెట్టండి. ఆటగాడు మానసికంగా ఎంత బలంగా ఉన్నాడో పరీక్షంచిండి. అది ఆటగాడి ఫిట్నెస్కి నిజమైన పరీక్ష. ఒక ఆటగాడు రోజంతా బ్యాటింగ్ చేయగలడా లేదా ఒక రోజులో 20 ఓవర్లు బౌలింగ్ చేయగలడా అనే దాని గురించి ఆలోచించండి. అతని నడుము ఎంత సన్నగా ఉన్నా లేదా లేకపోయినా మ్యాచ్‌లో మాత్రం పూర్తి ఫిట్నెస్గా ఉంటాడు అని సన్నీ రాసుకొచ్చాడు.చదవండి: సెలక్టర్లకు వార్నింగ్.. డబుల్ సెంచరీతో చెలరేగిన పుజారా -
కాన్వే జాగ్రత్తగా ఉండు.. అతడు ఇప్పుడు డీఎస్పీ: గవాస్కర్
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో ప్రారంభమైన మొదటి టెస్టులో భారత్‌కు ఏదీ కలిసి రావడం లేదు. వర్షం కారణంగా తొలి రోజు ఆట తుడిచిపెట్టుకుపోవడంతో రెండో రోజు(గురువారం) మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఘోర పరాభావం ఎదురైంది. న్యూజిలాండ్ బౌలర్ల దాటికి భారత్ కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. 92 ఏళ్ల తమ టెస్టు క్రికెట్ హిస్టరీల భారత జట్టుకు స్వదేశంలో ఇదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 5 వికెట్లు పడగొట్టగా.. రౌర్కీ 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్(20) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌లో కూడా కివీస్ అదరగొడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.అతడొక డీఎస్పీ..కాగా రెండో రోజు ఆట సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌కు ఓపెనర్లు లాథమ్, కాన్వే మంచి ఆరంభాన్ని ఇచ్చారు. లాథమ్గా స్లోగా ఆడినప్పటకి మరో ఓపెనర్ డెవాన్ కాన్వే మాత్రం వన్డే తరహాలో తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.ఈ క్రమంలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్.. కాన్వేను స్లెడ్జ్ చేశాడు. ఆ ఓవర్లో మూడో బంతిని కాన్వే బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత నాలుగో బంతిని డెవాన్ డిఫెండ్ చేశాడు. వెంటనే సిరాజ్ కాన్వే వైపు సీరియస్‌గా చూస్తూ ఏదో అన్నాడు. కాన్వే మాత్రం సిరాజ్ మాటలను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఫన్నీ వ్యాఖ్యలు చేశాడు. "అతడు ఇప్పుడు డీఎస్పీ అన్న విషయం మర్చిపోవద్దు. అతనికి సహచరులు సెల్యూట్ చేశారా? లేదా? ఒక వేళ చేస్తే కచ్చితంగా నేను షాక్ అవుతాను" అని గవాస్కర్ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న మహమ్మద్ సిరాజ్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 పోస్ట్ కింద డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది. Siraj telling his real Instagram I'd to Conway pic.twitter.com/OMTZbP4VSY— John_Snow (@MrSnow1981) October 17, 2024 -
కౌన్ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్‌కు సంబంధించి రూ. 6. 4 లక్షల ప్రశ్న
ప్రముఖ టీవీ గేమ్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి'లో ఇటీవలికాలంలో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువయ్యాయి. తాజా ఎపిసోడ్లో ఏకంగా రూ. 6.4 లక్షల ప్రశ్న జెంటిల్మెన్ గేమ్‌కు సంబంధించింది ఎదురైంది. ఇంతకి ప్రశ్న ఏంటంటే.. 2024లో సునీల్ గవాస్కర్ తర్వాత ఓ ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లో 700కు పైగా పరుగులు స్కోర్ చేసింది ఎవరు..? ఈ ప్రశ్నకు నాలుగు ఆప్షన్స్‌లో మొదటిది విరాట్ కోహ్లి కాగా.. రెండోది యశస్వి జైస్వాల్, మూడోది శుభ్‌మన్ గిల్, నాలుగోది రోహిత్ శర్మ. ఈ ప్రశ్న ఎదురైనప్పుడు కంటెస్టెంట్ ఆడియన్స్ పోల్ లైఫ్ లైన్‌కు వెళ్లాడు. ఆడియన్స్ పోల్‌లో మెజార్టీ శాతం 'బి' యశస్వి జైస్వాల్‌కు ఓటు వేశారు. ఈ నాలుగు ఆప్షన్స్‌లో మీకు తెలిసిన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.కాగా, 1978-79లో వెస్టిండీస్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ 774 పరుగులు చేశాడు. ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ సునీల్ గవాస్కరే. ఈ సిరీస్‌లో గవాస్కర్ రెండు డబుల్ సెంచరీలు, ఓ సెంచరీ చేశాడు.ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో గవాస్కర్ తర్వాత 700 పరుగుల మార్కును తాకింది యశస్వి జైస్వాల్ ఒక్కడే. 2024లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో యశస్వి 712 పరుగులు చేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఈ సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో గెలుచుకుంది.చదవండి: IPL 2025: ‘ఆర్సీబీ రోహిత్ శర్మను కొని.. కెప్టెన్ చేయాలి’ -
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మళ్లీ బ్యాట్ పట్టనున్న సచిన్
వెటరన్ క్రికెటర్లు సందడి చేసేందుకు మరో టీ20 క్రికెట్ లీగ్ పుట్టుకొచ్చింది. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 టోర్నీ తొట్టతొలి సీజన్ ఈ ఏడాది జరగనుంది. సోమవారం ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ మొదటి ఎడిషన్‌ను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లాంచ్ చేశారు. ఈ లీగ్ కమీషనర్‌గా టీమిండియా మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్ నియమితుడయ్యాడు. ఈ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, శ్రీలంక మొత్తం ఆరు జట్లు పాల్గోనున్నాయి. ఈ ఆరు దేశాల నుంచి క్రికెట్ స్టార్లు పాల్గొనున్నారు. సచిన్ టెండూల్కర్ కూడా ఈ లీగ్‌లో భారత తరపున ఆడనున్నట్లు తెలుస్తోంది."క్రికెట్‌కు భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతూనే ఉంది. గత దశాబ్దం నుంచి టీ20 క్రికెట్‌కు మరింత ఆదరణ పెరిగింది. ఈ పొట్టి క్రికెట్లో తమకు ఇష్టమైన మాజీ క్రికెటర్లు ఆడితే చూడాలన్న కోరిక అభిమానుల్లో ఉంది. వెటరన్ క్రికెటర్లు ఆడే ప్రతీ లీగ్‌కు ఫ్యాన్స్ మద్దతుగా నిలుస్తున్నారని సచిన్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా లీగ్‌లోని మ్యాచ్‌లు ముంబై, లక్నో, రాయ్‌పూర్‌లలో జరగనున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు. -
గావస్కర్ ఉపయోగించని ప్లాటు రహానేకు
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌కు గతంలో కేటాయించిన స్థలాన్ని వెటరన్ బ్యాటర్ అజింక్య రహానేకు బదలాయిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముంబైలోని ఖరీదైన బాంద్రా ప్రాంతంలో 2000 చదరపు మీటర్ల (2391 గజాలు) స్థలాన్ని రహానేకు 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలని మహారాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. స్పోర్ట్స్ కాంప్లెక్స్, క్రీడాభివృద్ధి కోసం ఈ స్థలాన్ని వినియోగించాల్సి ఉంటుంది. ఈ స్థలాన్ని 1988లో గావస్కర్‌కు కేటాయించారు. ఇండోర్ క్రికెట్ ట్రెయినింగ్ అకాడమీ కోసం లీజుకు ఇచ్చారు. కానీ 30 ఏళ్లకుపైగా గావస్కర్ ఈ స్థలాన్ని సది్వనియోగం చేయలేదు.క్రికెట్ అవసరాలకోసం అభివృద్ధి చేయలేదు. ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం కేటాయించిన భూమి నిరుపయోగంగా మారడంపై 2021లోనే ఆ రాష్ట్ర మాజీ గృహనిర్మాణ మంత్రి జితేంద్ర అవ్హద్ విమర్శించారు. దీంతో గావాస్కర్ మరుసటి ఏడాదే (2022) ప్రభుత్వానికి అప్పగించారు. తాజాగా ఈ స్థలానే ఇప్పుడు రహానేకు కేటాయించారు. -
చరిత్ర సృష్టించిన జైస్వాల్.. భారత తొలి బ్యాటర్‌గా
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టు ఫార్మాట్లో తనదైన ముద్ర వేస్తున్నాడు. అరంగేట్రంలోనే శతకంతో అలరించిన ఈ ముంబై బ్యాటర్.. పట్టుమని పది టెస్టుల్లోనే వెయ్యికి పైగా పరుగులు సాధించాడు. తద్వారా టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు.అరంగేట్రంలోనే 171 పరుగులుగతేడాది వెస్టిండీస్ పర్యటన సందర్భంగా యశస్వి జైస్వాల్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగి.. తొలి టెస్టులోనే 171 పరుగులతో చెలరేగాడు. ఆ తర్వాత యశస్వి అద్బుత ఇన్నింగ్స్‌తో అలరిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు.విలువైన అర్ధ శతకంఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఖాతాలో ఇప్పటి వరకు టెస్టుల్లో మూడు శతకాలు, రెండు డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. ఇక తాజాగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లోనూ జైస్వాల్ తన హవా కొనసాగిస్తున్నాడు. చెన్నై వేదికగా గురువారం మొదలైన మొదటి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ(6), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(6) విఫలమైన వేళ జైస్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో విలువైన అర్ధ శతకం(56) బాదాడు.గావస్కర్ రికార్డు బ్రేక్ఇక రెండో ఇన్నింగ్స్‌లో పది పరుగులకే పరిమితమైనా.. జైస్వాల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. కెరీర్‌లోని తొలి పది టెస్టు మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు సాధించిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. తద్వారా సునిల్ గావస్కర్(978) పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా తొలి 10 టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు.తమ కెరీర్లో మొదటి 10 టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లు1.డాన్ బ్రాడ్‌మన్(ఆస్ట్రేలియా)- 1446 పరుగులు2.ఎవర్టన్ వీక్స్(వెస్టిండీస్)- 1125 పరుగులు3.జార్జ్ హెడ్లీ(వెస్టిండీస్)- 1102 పరుగులు4. యశస్వి జైస్వాల్(ఇండియా)- 1094 పరుగులు5. మార్క్ టేలర్(ఆస్ట్రేలియా)- 1088 పరుగులు.చదవండి: బంగ్లాతో తొలి టెస్ట్.. భారీ ఆధిక్యం దిశగా టీమిండియాపంత్పై సిరాజ్ ఆగ్రహం.. రోహిత్ కూడా ఇలా చేస్తాడనుకోలేదు! View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
'బంగ్లాను తేలికగా తీసుకోవద్దు'.. రోహిత్‌ను హెచ్చరించిన సన్నీ
భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సమయం అసన్నమైంది. సెప్టెంబర్ 19ను చెన్నై వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25లో భాగంగా జరగనున్న ఈ సిరీస్‌లో బంగ్లాను చిత్తు చేసి ముందుకు వెళ్లాలని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే చెన్నైకు చేరుకున్న భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే తొలి టెస్టుకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ హెచ్చరించాడు. బంగ్లాదేశ్‌ను ఏమాత్రం తేలికగా తీసుకోవద్దని హిట్‌మ్యాన్‌ను అతడు సూచించాడు. కాగా బంగ్లా జట్టు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. పాకిస్తాన్‌పై చారిత్రత్మక టెస్టు సిరీస్ విజయం సాధించి భారత గడ్డపై బంగ్లా జట్టు అడుగుపెట్టింది. ఇప్పటివరకు ఒక్కసారి టెస్టుల్లో టీమిండియాను బంగ్లా ఓడించనప్పటకి.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం ఓటమి రుచిని చూపించింది. 2007 వన్డే ప్రపంచ కప్, 2012 ఆసియా కప్, 2015, 2022 ద్వైపాక్షిక సిరీస్‌లలో బంగ్లా జట్టు భారత్‌కు షాకిచ్చింది."పాకిస్తాన్‌ను వారి సొంత గడ్డపై ఓడించి బంగ్లాదేశ్ తమ సత్తా చాటింది. వారి టెస్టు క్రికెట్ హిస్టరీలోనే పాక్‌పై తొలి సిరీస్ విజయం సాధించి ప్రపంచ క్రికెట్‌కు సవాలు విసిరింది. ఇప్పుడు రెట్టింపు ఆత్మవిశ్వాసంతో భారత గడ్డపై అడుగుపెట్టారు.టీమిండియాను ఓడించాలన్న లక్ష్యంతో వారు ఉన్నారు. రెండేళ్ల క్రితం భారత క్రికెట్ జట్టు టెస్టు సిరీస్ కోసం బంగ్లా పర్యటనకు వెళ్లింది. అప్పుడు కూడా వారు గట్టీ పోటీ ఇచ్చారు. ప్రస్తుతం బంగ్లా జట్టులో కొంతమంది అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన వెంటనే ప్రత్యర్థిపై ఎలా ఆధిపత్యం ప్రదర్శించాలనేది త్వరగా నేర్చుకొంటున్నారు. పాక్‌పై విజయంతో బంగ్లా టీమ్‌ను ఏ ప్రత్యర్ధి కూడా తక్కువగా అంచనా వేయడం లేదు. కాబట్టి బంగ్లా-భారత్ సిరీస్ కచ్చితంగా మంచి సిరీస్ అవుతోంది" అని గవాస్కర్ తెలిపాడు.మరో 10 మ్యాచ్‌లు..టీమిండియా వచ్చే నాలుగైదు నెలల్లో 10 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే కనీసం ఐదు మ్యాచ్‌లోనైనా గెలవాలి. రాబోయే టెస్టు సీజన్ మొత్తం భారత్‌కు సవాల్‌తో కూడుకున్నది అని గవాస్కర్ మిడ్-డే కాలమ్‌లో రాసుకొచ్చాడు.చదవండి: 'రోహిత్ నా బౌలింగ్ ఆడలేకపోయాడు.. బుమ్రా సైతం మెచ్చుకున్నాడు' -
రోహిత్, కోహ్లికి విశ్రాంతి అవసరమా?: టీమిండియా దిగ్గజం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో పాల్గొనాల్సిందని భారత జట్టు మాజీ సారథి సునిల్ గావస్కర్ అన్నాడు. తద్వారా బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ముందు ఈ ఇద్దరు సీనియర్లకు మ్యాచ్ ప్రాక్టీస్ లభించేదని పేర్కొన్నాడు. అయితే, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మాత్రం ఈ రెడ్‌బాల్ టోర్నీ నుంచి విశ్రాంతినిచ్చి మంచి పని చేశారని సెలక్టర్ల నిర్ణయాన్ని గావస్కర్ సమర్థించాడు.ఆ నలుగురు మినహాకాగా.. జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు.. ఫిట్‌గా ఉన్న సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్లంతా దేశవాళీ టోర్నమెంట్లలో ఆడాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న దులిప్ ట్రోఫీలో దాదాపు టీమిండియా ఆటగాళ్లంతా భాగం కానున్నారు.కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాకు మాత్రం సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు దులిప్ ట్రోఫీ జరుగబోతోంది. కానీ సెలక్టర్లు మాత్రం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు మినహాయింపు ఇచ్చారు.తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ లభించేదినిజానికి ఈ టోర్నీలో ఆడితే బంగ్లాతో సిరీస్‌కు ముందు వారికి తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ లభించేది. జస్ప్రీత్ బుమ్రా వంటి ఫాస్ట్ బౌలర్‌కు విశ్రాంతినిచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అతడికి గాయాల ప్రమాదం పొంచి ఉంటుంది. కానీ బ్యాటర్లకు అలా కాదు. ముఖ్యంగా ముప్పై ఏళ్ల వయసు దాటిన ఏ ఆటగాడైనా సరే ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి సారించడం అవసరం.ఆ సమస్యలు వస్తాయిసుదీర్ఘ విరామం తీసుకుని.. ఒకేసారి బరిలోకి దిగితే కండరాల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీలైనంత ఎక్కువగా మ్యాచ్‌లు ఆడితేనే మంచిది’’ అని అభిప్రాయపడ్డాడు. రోహిత్, కోహ్లికి విశ్రాంతినివ్వడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నాడు. కాగా కోహ్లి 2012, రోహిత్ 2016లో చివరగా దేశవాళీ క్రికెట్ ఆడారు.లంకలో రో‘హిట్’..ఇక టీ20 ప్రపంచకప్-2024 తర్వాత కోహ్లి- రోహిత్ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుదీర్ఘ విరామం అనంతరం.. శ్రీలంకతో వన్డే సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చారు. అయితే, లంకతో మూడు వన్డేల్లో 37 ఏళ్ల రోహిత్ 58, 64, 35 పరుగులు చేయగా.. 35 ఏళ్ల కోహ్లి మాత్రం 24, 14, 20 రన్స్‌తో పూర్తిగా నిరాశపరిచాడు. కాగా సెప్టెంబరు 19 నుంచి స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌లో రోహిత్- కోహ్లి ద్వయం మైదానంలో దిగనున్నారు.చదవండి: తారలు దిగివచ్చే వేళ.. అనంతపురంలో దులీప్ ట్రోఫీ -
సాకులు చెప్పడంలో మన దేశం బంగారు పతకాలు సాధిస్తుంది..!
భారత బ్యాడ్మింటన్ బృందం 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కూడా గెలవలేకపోయింది. లక్ష్య సేన్ పతకం దగ్గరికి వచ్చినప్పటికీ లీ జి జియాతో జరిగిన కాంస్య పతక పోరులో ఓటమిపాలయ్యాడు. భారత షట్లర్ల పేలవ ప్రదర్శన పట్ల బ్యాడ్మింటన్ కోచ్ ప్రకాష్ పదుకొణే తీవ్ర నిరాశకు గురయ్యాడు. భారత షటర్ల ఆటతీరును బహిరంగంగా దుయ్యబట్టాడు. ప్రకాశ్ వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. అశ్విని పొన్నప్ప ఆవేశపూరిత సమాధానంతో ముందుకు వచ్చారు. అయితే ప్రకాశ్ పదుకొణెకు భారత క్రికెట్ జట్టు మాజీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ అండగా నిలిచాడు. స్పోర్ట్‌స్టార్ కోసం రాసిన కాలమ్‌లో గవాస్కర్ ఇలా రాసుకొచ్చాడు. సాకులు చెప్పడం మన ఆటగాళ్లకు అలవాటుగా మారిందని అర్దం వచ్చేలా కామెంట్స్ చేశాడు. సాకులు చెప్పడంలో మన దేశం (షట్లర్లను ఉద్దేశిస్తూ) బంగారు పతకాలు సాధిస్తుంది ఎద్దేవా చేశాడు. ప్రకాశ్ బాధలో నిజాయితీ ఉందని, ఇందులో అతన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదని అన్నాడు. ఆటగాళ్లకు ప్రభుత్వం నుంచి చాలా మద్దతు ఉందని, ఓటములకు ఆటగాళ్లు బాధ్యత వహించాలని ప్రకాశ్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని గవాస్కర్ పేర్కొన్నాడు. కాగా, ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత షట్లర్ల శిక్షణ నిమిత్తం కోట్ల రూపాయల ఖర్చు చేశారన్న అంశంపై ప్రస్తుతం క్రీడా వర్గాల్లో దూమారం రేగుతున్న విషయం తెలిసిందే. -
75వ వసంతంలోకి టీమిండియా దిగ్గజం.. హ్యాపీ బర్త్‌డే సన్నీ! (ఫొటోలు)
-
రాహుల్ ద్రవిడ్‌కు భారతరత్న ఇవ్వాలి: సునీల్ గవాస్కర్
టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ప్రస్ధానం ముగిసిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్-2024తో భారత హెడ్ కోచ్‌గా ద్రవిడ్ పదవీ కాలం ముగిసింది. టీ20 వరల్డ్‌కప్ విజయంతో తమ కోచ్‌కు భారత ఆటగాళ్లు ఘనంగా విడ్కోలు పలికారు. భారత్ వరల్డ్‌కప్ గెలవడంలో ద్రవిడ్‌ది కూడా కీలక పాత్ర. తన అనుభవంతో జట్టును అద్బుతంగా నడిపించాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ద్రవిడ్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని గవాస్కర్ కోరాడు."రాహుల్ ద్రవిడ్‌ను కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరిస్తే బాగుంటుంది. అందుకు ద్రవిడ్ నిజంగా అర్హుడు. వెస్టిండీస్ వంటి కఠిన పరిస్ధితుల్లో ద్రవిడ్ ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా అన్నో అద్బుత విజయాలను అందుకున్నాడు. విండీస్‌లో మాత్రమే కాదు. ఇంగ్లండ్ వంటి విదేశీ పరిస్థితుల్లో కూడా కెప్టెన్‌గా ద్రవిడ్ భారత్‌కు చారిత్రత్మక విజయాలను అందించాడు. ఇంగ్లండ్‌లో టెస్ట్ మ్యాచ్ సిరీస్‌ను గెలుచుకున్న ముగ్గురు భారత కెప్టెన్లలో ద్రవిడ్ ఒకడిగా ఉన్నాడు. అంతేకాకుండా జాతీయ క్రికెట్ అకాడమీ ఛైర్మన్‌గా పనిచేసి ఎంతో మంది యువ క్రికెటర్లను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత అతడిది. భారత పురుషల సీనియర్ జట్టు కోచ్‌గా కూడా అతడు అద్భుతాలు సృష్టించాడు. ద్రవిడ్ నేతృత్వంలోనే 17 ఏళ్ల తర్వాత భారత్ పొట్టి వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది.ఆటగాడిగా, కెప్టెన్‌గా, కోచ్‌గా ద్రవిడ్ సాధించిన విజయాలు ప్రతీ భారతీయుడుకు ఆనందనిచ్చాయి. ద్రవిడ్ వరల్డ్‌కప్ విజయంతో యావత్తు దేశం గర్వించేలా చేశాడు. కాబట్టి అటువంటి వ్యక్తికి కచ్చితంగా దేశ అత్యున్నత పురస్కారంతో గౌరవించాలి. ఈ విషయంపై ప్రతీ ఒక్కరూ నాతో గొంతు కలపాలి. ప్రభుత్వం కచ్చితంగా అతడు సేవలను గుర్తించాలి. భారతరత్న రాహుల్ శరద్ ద్రవిడ్ అని వినడానికి ఎంతో అద్భుతంగా ఉంది కాదా? అని గవాస్కర్ తన కాలమ్ మిడ్ డేలో రాసుకొచ్చాడు. -
ఒకరితో చెప్పించుకునే స్థితిలో రోహిత్ లేడు: టీమిండియా దిగ్గజం
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంత వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయనేలేదు. ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి కేవలం 76 పరుగులే చేశాడు.ఇక కీలకమైన సూపర్-8 తొలి మ్యాచ్‌లోనూ రోహిత్ విఫలమైన విషయం తెలిసిందే. అఫ్గనిస్తాన్‌తో గురువారం నాటి మ్యాచ్ సందర్భంగా 13 బంతులు ఎదుర్కొని కేవలం ఎనిమిది పరుగులే చేశాడు రోహిత్.అఫ్గన్ లెఫ్టార్మ్ పేసర్ ఫజల్హక్ ఫారూకీ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా అఫ్గనిస్తాన్‌పై గెలిచినప్పటికీ రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరుపై మాత్రం విమర్శలు వచ్చాయి.లెఫ్టార్మ్ పేసర్లను ఎదుర్కోలేడంటూ రోహిత్‌ను ఉద్దేశించి నెట్టింట ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.‘‘అతడు అనుభవం ఉన్న ఆటగాడు. ఎప్పుడు ఏం చేయాలో అతడికి బాగా తెలుసు. నిజానికి తన ఆట ఎలా ఉండాలో ఒకరితో చెప్పించుకోవాల్సిన స్థితిలో రోహిత్ శర్మ లేనే లేడు.ప్రత్యర్థి బౌలర్ ఎవరన్న అంశంతో అతడికి సంబంధం లేదు. అయితే, ఒక్కోసారి మన బలహీనతలు తెలిసిన బౌలర్ ఎదురుగా ఉన్నపుడు ఆన్‌సైడ్ హిట్టింగ్ చేయడం కరెక్ట్ కాదని మీరు అనొచ్చు.ఇలాంటి సమయంలో ఎక్స్ట్రా కవర్ మీదుగా ఇన్సైడ్ అవుట్ షాట్ ఆడవచ్చు కదా అని భావించవచ్చు. ఇవి కేవలం బయట నుంచి చూసి చెప్పేవి మాత్రమే.తీరికగా కూర్చుని.. ఎవరు ఎలాంటి షాట్ ఆడాలో చెప్పడం తేలికే. కానీ మైదానంలో దిగి ఆడితేనే కదా తెలిసేది’’ అంటూ గావస్కర్ రోహిత్ శర్మ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా సూపర్-8 దశను అఫ్గన్‌పై విజయంతో మొదలుపెట్టిన టీమిండియా.. శనివారం తమ రెండో మ్యాచ్ ఆడనుంది. ఆంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడేందుకు సిద్ధమైంది. అయితే, వర్షం కారణంగా ఈ మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడే పరిస్థితి ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. -
కోహ్లి చెత్త ప్రదర్శన.. టీమిండియా దిగ్గజం కీలక వ్యాఖ్యలు
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వైఫల్యాలు కొనసాగుతున్నాయి. ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో కలిపి ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కేవలం ఐదు పరుగులే చేశాడు.న్యూయార్క్ వేదికగా తొలుత ఐర్లాండ్‌పై ఒకటి, పాకిస్తాన్‌పై నాలుగు పరుగులు చేసిన కోహ్లి.. తాజాగా ఆతిథ్య యూఎస్ఏ జట్టుతో మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మూడు మ్యాచ్‌లలో టీమిండియా విజయాలు సాధించినా.. కోహ్లి ఫామ్‌లేమి మాత్రం మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది.కోహ్లి ఆట తీరుపై విమర్శలుఅదే విధంగా.. విరాట్ కోహ్లి ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి. యశస్వి జైస్వాల్ వంటి యువ బ్యాటర్‌కు అవకాశం ఇవ్వకుండా.. కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా కోహ్లిని పంపడం సత్ఫలితాలు ఇవ్వడం లేదని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ విరాట్ కోహ్లి ఫామ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అనుభవజ్ఞుడైన కోహ్లి సరైన సమయంలో రాణించి జట్టుకు ప్రయోజనం చేకూరుస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. నాకౌట్ మ్యాచ్‌లలో అతడి పాత్ర ఎంతో కీలకం అని పేర్కొన్నాడు.బ్యాటింగ్ బాగా లేదని అనుకోవద్దు‘‘మ్యాచ్‌లు గెలవడం అనేది ఏ ఆటగాడిగైనా అతిపెద్ద ఊరట. గత కొన్నేళ్లుగా కోహ్లి జట్టు కోసం ఇదే పని చేస్తున్నాడు. ప్రస్తుతం మనం వరల్డ్‌కప్ ఆరంభ దశలోనే ఉన్నాం.దీని తర్వాత సూపర్-8, సెమీ ఫైనల్స్, ఫైనల్ ఉన్నాయి. అంత వరకు కాస్త ఓపికగా ఉండటం అవసరం. అతడిపై నమ్మకం ఉంచడం మేలు. ఎందుకంటే.. అందరినీ తప్పని నిరూపించగల నైపుణ్యాలు అతడి సొంతం.వరుసగా మూడు లో స్కోర్లు నమోదు చేసినంత మాత్రాన అతడి బ్యాటింగ్ బాగా లేదని కాదు. ఒక్కోసారి బౌలర్లు అద్భుతమైన డెలివరీలతో బ్యాటర్లను బోల్తా కొట్టిస్తారు. ఇలా జరగటం సహజమే.కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతడి పట్ల నమ్మకం ఉంచుదాం. త్వరలోనే కచ్చితంగా అతడు తన బ్యాట్ పవర్ చూపిస్తాడు’’ అని సునిల్ గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.సూపర్-8 దశకు అర్హతకాగా బుధవారం నాటి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా జట్టుపై గెలిచిన టీమిండియా.. సూపర్-8 దశకు అర్హత సాధించింది. గ్రూప్(ఏ) దశలో తదుపరి కెనడాతో శనివారం నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది రోహిత్ సేన. అనంతరం సూపర్-8 మ్యాచ్‌ల కోసం వెస్టిండీస్‌కు పయనం కానుంది. అమెరికాతో విండీస్ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.చదవండి: Rohit Sharma: ఇక్కడ గెలవడం అంత తేలికేమీ కాదు.. క్రెడిట్ వాళ్లకే View this post on Instagram A post shared by ICC Hindi (@icchindiofficial) -
చెత్త షాట్లు.. బుమ్రా విషయంలో ఇలా చేస్తారా?: రోహిత్‌పై విమర్శలు
T20 WC 2024- India vs Pakistan: పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా మేనేజ్మెంట్ అనుసరించిన బౌలింగ్ వ్యూహాలను భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ తప్పుబట్టాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మూడో ఓవర్లో బంతిని ఇవ్వడమేమిటని ప్రశ్నించాడు.కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు టాపార్డర్‌లో బ్యాటింగ్ చేసినట్లే.. బుమ్రాను కూడా తొలి ఓవర్లోనే ఉపయోగించుకోవాలని సూచించాడు. నిజానికి పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియాను బౌలర్లే గట్టెక్కించారని.. ఈ విజయంలో క్రెడిట్ వాళ్లకే ఇవ్వాలని గావస్కర్ పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా న్యూయార్క్ వేదికగా భారత్- పాకిస్తాన్ ఆదివారం తలపడ్డాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక భారీ అంచనాలతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 119 పరుగులకే కుప్పకూలింది.ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ (13), విరాట్ కోహ్లి(4) పూర్తిగా నిరాశపరచగా.. వన్‌డౌన్ బ్యాటర్ రిషభ్ పంత్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. 31 బంతుల్లో 42 పరుగులతో పంత్ దుమ్ములేపగా.. అక్షర్ పటేల్ 20 పరుగులతో రాణించాడు.మిగతా వాళ్లంత సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ బ్యాటర్లను.. టీమిండియా బౌలర్లు ఆది నుంచే కట్టడి చేశారు. వీరి దెబ్బకు పాక్ బ్యాటింగ్ ఆర్డర్ 113 పరుగులకే కుప్పకూలింది.‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ జస్ప్రీత్ బుమ్రా (3/14), హార్దిక్ పాండ్యా (2/24) అద్భుతంగా రాణించగా.. అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.అయితే, ఈ మ్యాచ్‌లో బౌలింగ్ అటాక్‌ను అర్ష్‌దీప్ సింగ్ ప్రారంభించడం విశేషం. తొలి ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ శర్మ అతడికి బంతిని అందించాడు. మహ్మద్ సిరాజ్ రెండో ఓవర్ వేయగా.. బుమ్రా మూడో ఓవర్లో యాక్షన్‌లోకి దిగాడు. View this post on Instagram A post shared by ICC (@icc) బుమ్రాకు తొలి ఓవర్ ఇవ్వకపోవడమేమిటి?ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ భారత్- పాక్ మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘భారత క్రికెట్లో బౌలర్లూ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.వాళ్లు తిరిగి పుంజుకోవడం అద్భుతంగా అనిపించింది. అయినా.. బుమ్రాకు తొలి ఓవర్ ఇవ్వకపోవడమేమిటి? మూడో ఓవర్లో అతడికి చేతికి బంతినిస్తారా?మొదటి 12 బంతులు ఎందుకు వృథా చేశారు? మీ జట్టులో ఉన్న అత్యుత్తమ బౌలర్‌కే కదా మొదటగా బంతిని ఇవ్వాల్సింది. రోహిత్ శర్మ లేదంటే విరాట్ కోహ్లిని ఐదు లేదంటే ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రమ్మని చెప్తారా?చెప్పరు కదా?!.. వాళ్లిద్దరు అత్యుత్తమ బ్యాటర్లు కాబట్టి టాపార్డర్‌లోనే వస్తారు. మరి ఈ ప్రధాన బౌలర్ విషయంలో మాత్రం ఎందుకిలా?’’ అని గావస్కర్ టీమిండియా సారథి రోహిత్ వ్యూహాలను విమర్శించాడు.చెత్త షాట్లతో వికెట్లు కోల్పోయిఅదే విధంగా టీమిండియా బ్యాటర్ల తీరుపైనా గావస్కర్ విమర్శలు గుప్పించాడు. అనవసరపు షాట్లకు యత్నించి వికెట్లు పారేసుకోవడం ఏమిటని మండిపడ్డాడు. ఏదేమైనా పాక్‌పై టీమిండియా మ్యాచ్ గెలవడం మాత్రం సంతోషంగా ఉందంటూ స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.చదవండి: Ind vs Pak: కావాలనే బంతులు వృథా చేశాడు: పాక్ మాజీ కెప్టెన్ ఫైర్ -
సునీల్ గవాస్కర్‌ను కలిసిన బాబర్ ఆజం.. వీడియో వైరల్
టీ20 వరల్డ్‌కప్-2024కు పాకిస్తాన్ సన్నద్దమవుతోంది. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి చవిచూసిన పాక్.. తమ లోపాలను సరిదిద్దుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే న్యూయార్క్ చేరుకున్న పాకిస్తాన్ ప్రాక్టీస్‌లో బీజీబీజీగా ఉంది.ఈ మెగా ఈవెంట్లో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌లో డల్లాస్ వేదికగా అమెరికాతో తలపడనుంది. ఇక ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం.. న్యూయర్క్‌లోని ఓ హోటల్లో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కలిశాడు.హోటల్లోని డైనింగ్ ఏరియాలో అనుకోకుండా ఒకరికొకరు ఎదురయ్యారు. ఈ క్రమంలో ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను పీసీసీ ఎక్స్‌లో షేర్ చేసింది. కాగా ఈ మెగా టోర్నీకి సంబంధించి కామెంటరీ ప్యానల్లో గవాస్కర్ సభ్యునిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక టీ20 వరల్డ్‌కప్-2024 సందడి షురూ అయింది. ఆదివారం(జూన్ 2) అమెరికా-కెనడా మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేచింది. తొలి మ్యాచ్‌లో కెనడాపై 7 వికెట్ల తేడాతో యూఎస్ఎ ఘన విజయం సాధించింది. Babar Azam interacts with cricketing icon Sunil Gavaskar 🤝🏏#T20WorldCup pic.twitter.com/YZMRkDBXWV— Pakistan Cricket (@TheRealPCB) June 1, 2024 -
సచిన్, గవాస్కర్ కాదు.. అతడే నా ఫేవరెట్: కేంద్ర మంత్రి జైశంకర్
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్డర్ ఎస్ జైశంకర్ టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు. క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే జైశంకర్‌ను అత్యుత్తమ భారత బ్యాటర్ ఎవరని ప్రశ్నించగా.. విరాట్ కోహ్లికి తన ఓటు వేశాడు. ఈ విషయంలో జైశంకర్‌కు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లి రూపంలో మూడు ఆప్షన్లు ఇవ్వగా.. విరాట్పైపు మొగ్గు చూపాడు. ఫిట్నెస్ మరియు వైఖరి కారణంగా కోహ్లిను ఇష్టపడతానని జైశంకర్ చెప్పుకొచ్చాడు. ఈ కారణాలు మినహాయించి సచిన్, గవాస్కర్లను పక్కకు పెట్టడానికి వేరే కారణాలు లేవని తెలిపాడు. సుశాంత్ సిన్హా యూట్యూబ్ ఛానెల్లో మాట్లడుతూ జైశంకర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లి 35 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫామ్‌లో ఉండి ఇరగదీస్తున్నాడు. కోహ్లి ఈ వయసులోనూ భీకర ఫామ్‌లో ఉండటానికి అతని ఫిట్‌నెస్సే కారణమని అంతా అంటుంటారు. ఆట పట్ల అతనికున్న అంకితభావం, దృక్పదం అతన్ని లేటు వయసులోనూ టాప్ క్రికెటర్‌గా నిలబెడుతుంది. చాలా మంది యువ క్రికెటర్లు సైతం ఫిట్నెస్ విషయంలో, యాటిట్యూడ్ విషయంలో విరాట్‌ను ఆదర్శంగా తీసుకుంటారు. Question:- Virat Kohli or Sachin Tendulkar or Sunil Gavaskar? (Sushant Sinha YT).External affairs Minister Dr Jaishankar:- "I have biased towards Virat Kohli because of his fitness, attitude. That's why I will pick Virat".pic.twitter.com/Y7ossf99CQ— Tanuj Singh (@ImTanujSingh) May 29, 2024పెద్దపెద్ద సెలబ్రిటీలు సైతం విరాట్ ఫిట్‌నెస్‌కు ముగ్దులవుతుంటారు. ప్రపంచ క్రికెట్లో దృవతారగా వెలగడానికి విరాట్ ఫిట్‌నెస్సే కారణమనడం అతిశయోక్తి కాదు. మైదానంలో అతను ప్రదర్శించే దూకుడు, చిన్న చిన్న విషయాలకు సైతం స్పందించే విభిన్నమైన తత్వం విరాట్‌ను ప్రత్యేకంగా నిలబెడుతుంది. మంత్రులే కాక దేశాధినేతలు సైతం విరాట్‌ను అభిమానించడానికి అతని ఫిట్నెస్, ఆట పట్ల అతనికున్న అంకితభావమే కారణం.ఇదిలా ఉంటే, విరాట్ ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2024 సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో విరాట్ 15 మ్యాచ్‌ల్లో 61.75 సగటున సెంచరీ, 5 అర్ధసెంచరీ సాయంతో 714 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. విరాట్.. జూన్ 1 నుంచి ప్రారంభంకాబోయే టీ20 వరల్డ్‌కప్‌లో ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే టీమిండియా రెండోసారి టైటిల్ గెలవడం ఖాయం. -
ఇప్పుడు అతడు మారిపోయాడు.. టీమిండియా రీ ఎంట్రీ పక్కా!
ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్ అద్బుత ప్రదర్శన కనబరిచాడు. కేకేఆర్ మూడో సారి ఛాంపియన్స్‌గా నిలవడంలో వెంకటేష్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. కీలకమైన క్వాలిఫయర్-1, ఫైనల్లోనూ అయ్యర్ అదరగొట్టాడు. క్వాలిఫయర్-1లో 52 పరుగులు చేసిన అయ్యర్.. ఫైనల్లో 52 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్లో ఓవరాల్‌గా 13 ఇన్నింగ్స్‌లో వెంకటేష్ అయ్యర్.. 46.25 సగటుతో 370 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో వెంకటేష్ అయ్యర్‌పై భారత మాజీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. గత సీజన్‌తో పోలిస్తే అయ్యర్ తన బ్యాటింగ్ టెక్నిక్‌ను మెరుగుపరుచుకున్నాడని సునీల్ గవాస్కర్ కొనియాడాడు. ఈ ఏడాది సీజన్లో వెంకటేష్ అయ్యర్ తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు."గత సీజన్‌తో పోలిస్తే అతడి బ్యాటింగ్ స్టైల్లో మార్పు కన్పించింది. అతడు ఆలోచించి సరైన టెక్నిక్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు. అయ్యర్ బౌలింగ్ కూడా చేయడం మొదలు పెడితే, మరోసారి భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అతడొక మంచి ఫీల్డర్ కూడా. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టుకు ఇటువంటి లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ అవసరం. అతడికి బౌలింగ్ చేసే కూడా సత్తా ఉంది. కాబట్టి అతడు కొంచెం కష్టపడితే మళ్లీ భారత జెర్సీ ధరించవచ్చు. భారత తరపున అరంగేట్రం చేసిన తర్వాత అయ్యర్‌లో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కన్పించింది. అందుకే జట్టులో అతడి స్ధానాన్ని పదిలం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత ఐపీఎల్ సీజన్(2023)లో కూడా పెద్దగా రాణించలేకపోయాడు. ముంబై ఇండియన్స్‌పై సెంచరీ చేసినప్పటికి.. మిగితా మ్యాచ్‌ల్లో నిరాశపరిచాడు. అతడు క్రీజులోకి వచ్చిన వెంటనే భారీ షాట్లకు ప్రయత్నించి తన వికెట్‌ను సమర్పించుకునేవాడు.కానీ ఇప్పుడు అతడి మైండ్ సెట్ మారింది అంటూ" స్టార్ స్పోర్ట్స్ షోలో సన్నీ పేర్కొన్నాడు. కాగా 2022లో భారత జట్టు తరపున అరంగేట్రం చేసిన అయ్యర్.. తనకు ఇచ్చి అవకాశాలను సద్వినియోగపరుచుకోలేకపోయాడు. వరుసగా విఫలమకావడంతో జట్టులో చోటు కోల్పోయాడు. -
SRH vs RR: ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం?: టీమిండియా దిగ్గజం ఫైర్
రాజస్తాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ ఆట తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ మండిపడ్డాడు. ప్రతిభ ఉంటే సరిపోదని.. దానిని ఎలా వినియోగించుకోవాలో కూడా తెలిసి ఉండాలంటూ చురకలు అంటించాడు.ఐపీఎల్-2024లో ఆది నుంచి వరుస విజయాలు సాధించిన రాజస్తాన్ రాయల్స్.. ఆ తర్వాత వరుస ఓటములతో విమర్శలు మూటగట్టుకుంది. ప్లే ఆఫ్స్ చేరినప్పటికీ సంజూ శాంసన్ సేన స్థాయికి తగ్గట్లు రాణించడం లేదని విశ్లేషకులు పెదవి విరిచారు.ఎలిమినేటర్ మ్యాచ్‌లో విశ్వరూపంఅలాంటి సమయంలో కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో అద్భుత ఆట తీరుతో రాజస్తాన్ తిరిగి సత్తా చాటింది. అహ్మదాబాద్‌లో బుధవారం నాటి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.విలువైన ఇన్నింగ్స్ ఆడిన రియాన్ఈ విజయంలో రియాన్ పరాగ్ కీలక పాత్ర పోషించాడు. 26 బంతుల్లో 36 విలువైన పరుగులు జోడించి జట్టును గెలుపు తీరాలకు చేర్చడంలో సహకారం అందించాడు. అయితే, మరో కీలకమైన మ్యాచ్‌లో మాత్రం ఒత్తిడిలో అతడు చిత్తయ్యాడు.మరో కీలక మ్యాచ్‌లో మాత్రం విఫలంసన్రైజర్స్ హైదరాబాద్‌లో శుక్రవారం నాటి క్వాలిఫయర్-2లో రియాన్ పరాగ్ పూర్తిగా విఫలమయ్యాడు. లక్ష్య ఛేదనలో రాజస్తాన్ తడబడుతున్న వేళ నాలుగో నంబర్లో బ్యాటింగ్‌కు వచ్చిన 22 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. 10 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులే చేశాడు.రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్ వేసిన రైజర్స్ లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో మొదటి బంతిని ఎదుర్కొనే క్రమంలో.. నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. అనవసరపు షాట్‌కు యత్నించి బంతిని గాల్లోకి లేపగా.. అభిషేక్ శర్మ క్యాచ్ పట్టాడు.Shahbaz Ahmed has put Sunrisers Hyderabad on 🔝🧡#RR in deep trouble and in search of something special in Chennai! Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #SRHvRR | #Qualifier2 | #TheFinalCall pic.twitter.com/8sGV8fzxcZ— IndianPremierLeague (@IPL) May 24, 2024 దీంతో రియాన్ పరాగ్ తడ‘బ్యాటు’ అంతటితో ముగిసిపోయింది. అతడు అవుటైన తీరుకు రాజస్తాన్ కోచ్ సంగక్కర షాక్‌లో ఉండిపోగా.. కామెంటేటర్ సునిల్ గావస్కర్ తీవ్ర స్థాయిలో విమర్శించాడు.ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం?‘‘ఎలా ఉపయోగించుకోవాలో తెలియనపుడు నీకు ఎంత ప్రతిభ ఉంటే ఏం లాభం? అసలు ఇలాంటి షాట్ ఎలా ఆడతావు? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. అపారమైన ప్రతిభ.. కానీ దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియదు. ఇంకొన్ని బంతుల వరకు పరుగులు రానంత మాత్రాన ఏం మునిగిపోతుంది? ఆ తర్వాత మళ్లీ పుంజుకోవచ్చు కదా!’’ అంటూ గావస్కర్ లైవ్ కామెంట్రీలోనే రియాన్ పరాగ్‌పై ఫైర్ అయ్యాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్లో రియాన్ పరాగ్ 16 మ్యాచ్‌లలో కలిపి 573 పరుగులు సాధించాడు.చదవండి: Kavya Maran Viral Reaction Video: దటీజ్ కావ్య.. సరైన నిర్ణయాలు!.. తండ్రిని హత్తుకుని చిన్నపిల్లలా! -
RR vs RCB: వార్ వన్‌సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం
ఐపీఎల్-2024 ఆఖరి అంకానికి చేరుకుంటోంది. ఇప్పటికే ఒక ఫైనలిస్టు ఖరారు కాగా.. తుది పోరుకు అర్హత సాధించేందుకు మిగిలిన మూడు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్ క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రైజర్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకువెళ్లింది కేకేఆర్.ఇక ఫైనల్ రేసులో మిగిలినవి రెండే మ్యాచ్‌లు. ఎలిమినేటర్, క్వాలిఫయర్-2. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది.సన్‌రైజర్స్‌తో ఎలిమినేటర్ విజేత పోటీఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. క్వాలిఫయర్-1లో కేకేఆర్ చేతిలో ఓడిన సన్‌రైజర్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. ఆ మ్యాచ్‌లో గనుక గెలిస్తే ఫైనల్‌కు చేరుకుంటుంది.ఈ క్రమంలో బెంగళూరు- రాజస్తాన్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్ సునిల్ గావస్కర్ ఎలిమినేటర్ విజేత ఎవరన్న అంశంపై తన అంచనా తెలియజేశాడు.‘‘ఆర్సీబీ ఈసారి ఎంతటి అద్భుతం చేసిందో చూశాం. ముఖ్యంగా వరుస పరాజయాల తర్వాత వాళ్లు తిరిగి పుంజుకున్న తీరు అమోఘం. మామూలు జట్లకు ఇలాంటివి సాధ్యం కావు.అయ్యో.. మనం ఓడిపోతూనే ఉన్నాంఆర్సీబీ ప్రధాన ఆటగాళ్లలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లితో పాటు మిగతా సీనియర్ ప్లేయర్లు తమ ఆట తీరుతో.. జట్టులో ఉత్సాహం నింపారు. ఆర్సీబీ స్థానంలో మరే ఇతర జట్టు ఏదైనా ఉంటే.. ‘అయ్యో.. మనం ఓడిపోతూనే ఉన్నాం. అంతా ముగిసిపోయింది’ అని బెంబేలెత్తిపోయేవాళ్లు.కానీ డుప్లెసిస్, కోహ్లి ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వలేదు. ఇక రాజస్తాన్.. గత నాలుగు- ఐదు మ్యాచ్‌లలో ఓడిపోతూనే ఉంది. ఆఖరిగా ఆడిన మ్యాచ్‌లోనూ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.వాళ్లను చూస్తే పూర్తిగా ఫామ్ కోల్పోయినట్లు కనిపిస్తున్నారు. పదకొండు రోజుల పాటు ఆటకు దూరంగా ఉన్న కేకేఆర్ మాదిరి ఏదైనా ప్రత్యేకంగా చేస్తే తప్ప రాజస్తాన్‌కు గెలిచే అవకాశాలు ఉండవు.లేదంటే మ్యాచ్ ఏకపక్షంగా సాగిపోయే ఛాన్స్ ఉంది. ఆర్సీబీ రాజస్తాన్‌ను చిత్తు చేసినా చేస్తుంది. ఒకవేళ అలా జరగకపోతేనే ఆశ్చర్యం’’ అని సునిల్ గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశాడు.గావస్కర్ వర్సెస్ కోహ్లికాగా ఇటీవల గావస్కర్- కోహ్లి మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. కోహ్లి స్ట్రైక్‌రేటు గురించి గావస్కర్ విమర్శించగా.. రన్‌మెషీన్ అందుకు కాస్త ఘాటుగానే బదులిచ్చాడు. ఎలా ఆడాలో తనకు తెలుసునని.. జట్టు ప్రయోజనాల కోసం ఏం చేయాలో కూడా తెలుసంటూ కౌంటర్ వేశాడు. -
అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
పదకొండు ఇన్నింగ్స్.. 542 రన్స్.. సగటు 67.75.. స్ట్రైక్ రేటు 148.08.. అత్యధిక స్కోరు 113 నాటౌట్. ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇప్పటి దాకా నమోదు చేసిన గణాంకాలు. ఇక పదకొండింట జట్టు గెలిచిన మ్యాచ్‌లు నాలుగు.వరల్డ్‌కప్ జట్టులోనూ అతడి స్థానాన్ని ప్రశ్నిస్తూఈ సీజన్ ఆరంభం నుంచి కోహ్లి మెరుగ్గానే ఆడుతున్నా.. జట్టు వరుస పరాజయాల పాలవడంతో అతడి స్ట్రైక్‌రేటు చర్చనీయాంశంగా మారింది. మిగతా ఆటగాళ్లు ఎంతగా విఫలమవుతున్నా పట్టించుకోని కొందరు కామెంటేటర్లు అదే పనిగా కోహ్లి ఆట తీరును విమర్శించడం.. వరల్డ్‌కప్ జట్టులోనూ అతడి స్థానాన్ని ప్రశ్నించడం వంటివి చేశారు.మరికొందరు మాజీ క్రికెటర్లు మాత్రం జట్టు ప్రయోజనాలు, పరిస్థితులకు అనుగుణంగా ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఆడుతున్నాడంటూ కోహ్లిని సమర్థించారు. ఈ నేపథ్యంలో కోహ్లి స్పందిస్తూ.. ‘‘బయట ఎక్కడో కూర్చుని మాట్లాడేవాళ్ల కామెంట్లను పట్టించుకోను. జట్టు కోసం ఏం చేయాలో నాకు తెలుసు’’ అంటూ విమర్శకులకు కౌంటర్ వేశాడు.మీ అంత కాకపోయినా.. మేమూ కాస్త క్రికెట్ ఆడాముఈ క్రమంలో టీమిండియా దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్ సునిల్ గావస్కర్ కాస్త ఘాటుగానే బదులిచ్చాడు. ‘‘అవునా.. చాలా మంది మేము బయట వాగుడు పట్టించుకోం అని గంభీరాలు పలుకుతూ ఉంటారు.మరెందుకని ఇలాంటి రిప్లైలు ఇస్తూ ఉంటారు. మీ అంత కాకపోయినా.. మేమూ కాస్త క్రికెట్ ఆడాము. మాకేమీ అజెండాలు ఉండవు. మేము ఏం చూస్తున్నామో దాని గురించే మాట్లాడతాం.మాకు ఒకరంటే ఇష్టం.. మరొకరంటే కోపం ఉండదు. ఏం జరుగుతుందో దాని గురించే మాట్లాడతాం’’ అని గావస్కర్ అన్నాడు. ఈ నేపథ్యంలో గావస్కర్‌పై కోహ్లి ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. గతంలో.. కోహ్లిని విమర్శించే క్రమంలో అతడి భార్య అనుష్క శర్మను ఉద్దేశించి గావస్కర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఏకిపారేస్తున్నారు.ప్రతిసారీ కోహ్లి గురించే మాట్లాడటం ద్వారా ఎల్లపుడూ వార్తల్లో ఉండేందుకు చేసే ప్రయత్నమే ఇదంటూ మండిపడుతున్నారు. గతంలో గావస్కర్ 176 బంతుల్లో 36 పరుగులు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. జట్టు ప్రయోజనాల కోసం మీరు ఏం చేసినా చెల్లుబాటే గానీ.. కోహ్లి చేస్తే మాత్రం తప్పా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.విమర్శలు సరికాదుఈ నేపథ్యంలో పాకిస్తాన్ లెజెండరీ పేసర్ వసీం అక్రం స్పందిస్తూ.. కోహ్లి ఒక్కడే జట్టును గెలిపించలేడని.. అనవసరంగా అతడిని తక్కువ చేసి మాట్లాడవద్దని కామెంటేటర్లకు హితవు పలికాడు. ఆర్సీబీలో మిగతా బ్యాటర్లు కూడా రాణిస్తేనే కోహ్లిపై ఒత్తిడి తగ్గి స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించగలడని అభిప్రాయపడ్డాడు. కాగా ఈ సీజన్లో వరుస పరాజయాలతో చతికిల పడ్డ ఆర్సీబీ.. హ్యాట్రిక్ విజయాలతో గాడిలో పడింది.చదవండి: ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్ -
T20 WC: దుమ్ములేపుతున్నాడు.. సెలక్టర్లు అతడిని గుర్తుంచుకోవాలి!
ఐపీఎల్-2024 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 24 మ్యాచ్‌లు పూర్తి కాగా.. రాజస్తాన్ రాయల్స్ ఐదింట నాలుగు విజయాలతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ పాత కథనే పునరావృతం చేస్తూ ఐదింటి నాలుగు పరాజయాలతో ప్రస్తుతం అట్టడుగున పదో స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే.. క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్ పూర్తైన దాదాపు ఐదు రోజుల వ్యవధిలోనే టీ20 ప్రపంచకప్-2024 ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ పదిహేడో సీజన్ ప్రదర్శన ఆధారంగా టీమిండియా ఎంపిక జరుగనుందన్న నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్ సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఫార్మాటల్లో వరుస హాఫ్ సెంచరీలు బాదుతున్న యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్‌ను గుర్తుపెట్టుకోవాలని సెలక్టర్లకు సూచించాడు. కాగా అసోం ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపిన విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్లో గత 15 ఇన్నింగ్స్‌లో పరాగ్ ఏకంగా 170.7 స్ట్రైక్‌రేటుతో 771 పరుగులు సాధించాడు. 15 ఇన్నింగ్స్‌లో పది హాఫ్ సెంచరీలు వరుసగా 45 (19), 61(34), 76*(37), 53*(29), 77(39), 72(36), 57*(33), 50*(31), 12(10), 8(10), 43(29), 84*(45), 54*(39), 4(4), 76(48) పరుగులు స్కోరు చేశాడు. ఇందులో ఏకంగా పది హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘అతడిపై సెలక్షన్ కమిటీ ఓ కన్నేసి ఉంచాలి. ఇక అతడేమో తన పనిని ఇలాగే చేసుకుపోతూ ఉంటే మంచిది’’ అని రియాన్ పరాగ్ మున్ముందు కూడా ఇలాగే దూసుకుపోవాలని ఆకాంక్షించాడు. అసోం తరఫున దేశవాళీ క్రికెట్లో కాగా అసోంలోని గువాహటిలో 2001లో జన్మించిన రియాన్ పరాగ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ హిట్టింగ్‌లో దిట్ట. అలాగే రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ కూడా! ఇక దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో రాణిస్తున్న రియాన్ పరాగ్ ఇంత వరకు టీమిండియాకు సెలక్ట్ కాలేదు. రాజస్తాన్ తరఫున దుమ్ములేపుతూ అయితే, ఐపీఎల్-2024లో మాత్రం అతడి ప్రదర్శన సెలక్టర్లను ఆకర్షించేలా ఉంది. రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రియాన్ పరాగ్ ఇప్పటి వరకు ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 261 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 84 నాటౌట్. ఆరెంజ్ క్యాప్ రేసులో ప్రస్తుతం రియాన్ పరాగ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక తాజాగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లోనూ పరాగ్ అదరగొట్టిన విషయం తెలిసిందే. 48 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 76 పరుగులు సాధించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ గుజరాత్ చేతిలో మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. Caution ⚠ It's Riyan Parag demolition on display 🔥💥#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/dzKuPfTS0Q — JioCinema (@JioCinema) April 10, 2024 చదవండి: సంజూ శాంసన్‌కు భారీ జరిమానా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
గేమ్ చేంజర్.. అతడు ఉంటే ముంబై గెలిచేది: టీమిండియా దిగ్గజం
IPL 2024- MI Vs RR: ఐపీఎల్-2024లో పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది ముంబై ఇండియన్స్. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో ఒక్కటీ గెలవలేక హ్యాట్రిక్ పరాజయాలతో చతికిలపడింది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇంతవరకు తనదైన ముద్ర వేయలేకపోయాడు.అతడి చెత్త నిర్ణయాల కారణంగా జట్టు మూల్యం చెల్లించాల్సి వస్తుందనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కాగా పదిహేడో ఎడిషన్‌లో తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్.. తాజాగా రాజస్తాన్ రాయల్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది.ఈ మూడింటిలో టైటాన్స్‌తో మ్యాచ్‌లో మాత్రమే ముంబై కాస్త మెరుగైన ప్రదర్శన కనబరిచింది. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో బౌలర్లు తేలిపోగా.. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగా రాజస్తాన్ చేతిలో ముంబై ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.𝙄𝙣 𝙎𝙩𝙮𝙡𝙚 😎Riyan Parag's innings help @rajasthanroyals reach 🔝 of the table 💪#RR are the 2️⃣nd team to win an away fixture this season 👏👏Scorecard ▶️ https://t.co/XL2RWMFLbE#TATAIPL | #MIvRR pic.twitter.com/ZsVk9rvam1— IndianPremierLeague (@IPL) April 1, 2024ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ జట్టుతో లేకపోవడం ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ అన్నాడు. అతడు గనుక అందుబాటులో ఉండి ఉంటే మ్యాచ్ ఫలితాలను కచ్చితంగా ప్రభావితం చేసేవాడని గావస్కర్ అభిప్రాయపడ్డాడు.‘‘ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ యాదవ్ సేవలను కచ్చితంగా మిస్ అవుతోంది. సూర్యకుమార్ ఉంటే మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి దూకుడుగా ఆడుతూ.. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఒత్తిడి పెంచుతాడు. కానీ ప్రస్తుతం అతడు జట్టుతో లేడు.అతడు త్వరగా తిరిగి రావాలని ముంబై ఇండియన్స్ బహుశా గట్టిగా ప్రార్థిస్తూ ఉంటుంది. ఎందుకంటే సూర్య ఉంటే కచ్చితంగా ఫలితాలను తారుమారుచేయగలడు. అతడొక గేమ్ గేమ్ చేంజర్’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో సునిల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు..@rajasthanroyals’ Lethal Start 🔥They run through #MI’s top order courtesy Trent Boult & Nandre Burger 👏After 7 overs, it is 58/4Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvRR pic.twitter.com/mEUocuD0EV— IndianPremierLeague (@IPL) April 1, 2024కాగా ముంబై ఇండియన్స్ టాపార్డర్‌కు సూర్యకుమార్ యాదవ్ వెన్నెముక లాంటివాడు. ఐసీసీ వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్ అయిన ఈ టీమిండియా స్టార్.. ఈ ఏడాది జనవరిలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు. అయితే, అతడు ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు.ఇక గత సీజన్లో రోహిత్ శర్మకు బదులు కొన్ని మ్యాచ్‌లలో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఐపీఎల్-2023లో మొత్తంగా ఆడిన 16 మ్యాచ్‌లో 605 పరుగులు సాధించాడు. ఇక రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా అందుబాటులోని సమయంలో టీమిండియాకు కూడా సారథిగా వ్యవహరించి జట్టును గెలిపించిన ఘనత అతడి సొంతం.చదవండి: IPL 2024: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగా -
గేమ్ చేంజర్.. అతడు ఉంటే ముంబై గెలిచేది: టీమిండియా దిగ్గజం
IPL 2024- MI Vs RR: ఐపీఎల్-2024లో పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది ముంబై ఇండియన్స్. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో ఒక్కటీ గెలవలేక హ్యాట్రిక్ పరాజయాలతో చతికిలపడింది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇంతవరకు తనదైన ముద్ర వేయలేకపోయాడు. అతడి చెత్త నిర్ణయాల కారణంగా జట్టు మూల్యం చెల్లించాల్సి వస్తుందనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కాగా పదిహేడో ఎడిషన్‌లో తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్.. తాజాగా రాజస్తాన్ రాయల్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ఈ మూడింటిలో టైటాన్స్‌తో మ్యాచ్‌లో మాత్రమే ముంబై కాస్త మెరుగైన ప్రదర్శన కనబరిచింది. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో బౌలర్లు తేలిపోగా.. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగా రాజస్తాన్ చేతిలో ముంబై ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 𝙄𝙣 𝙎𝙩𝙮𝙡𝙚 😎 Riyan Parag's innings help @rajasthanroyals reach 🔝 of the table 💪#RR are the 2️⃣nd team to win an away fixture this season 👏👏 Scorecard ▶️ https://t.co/XL2RWMFLbE#TATAIPL | #MIvRR pic.twitter.com/ZsVk9rvam1 — IndianPremierLeague (@IPL) April 1, 2024 ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ జట్టుతో లేకపోవడం ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ అన్నాడు. అతడు గనుక అందుబాటులో ఉండి ఉంటే మ్యాచ్ ఫలితాలను కచ్చితంగా ప్రభావితం చేసేవాడని గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ‘‘ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ యాదవ్ సేవలను కచ్చితంగా మిస్ అవుతోంది. సూర్యకుమార్ ఉంటే మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి దూకుడుగా ఆడుతూ.. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఒత్తిడి పెంచుతాడు. కానీ ప్రస్తుతం అతడు జట్టుతో లేడు. అతడు త్వరగా తిరిగి రావాలని ముంబై ఇండియన్స్ బహుశా గట్టిగా ప్రార్థిస్తూ ఉంటుంది. ఎందుకంటే సూర్య ఉంటే కచ్చితంగా ఫలితాలను తారుమారుచేయగలడు. అతడొక గేమ్ గేమ్ చేంజర్’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో సునిల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు. .@rajasthanroyals’ Lethal Start 🔥 They run through #MI’s top order courtesy Trent Boult & Nandre Burger 👏 After 7 overs, it is 58/4 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvRR pic.twitter.com/mEUocuD0EV — IndianPremierLeague (@IPL) April 1, 2024 కాగా ముంబై ఇండియన్స్ టాపార్డర్‌కు సూర్యకుమార్ యాదవ్ వెన్నెముక లాంటివాడు. ఐసీసీ వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్ అయిన ఈ టీమిండియా స్టార్.. ఈ ఏడాది జనవరిలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు. అయితే, అతడు ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. ఇక గత సీజన్లో రోహిత్ శర్మకు బదులు కొన్ని మ్యాచ్‌లలో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఐపీఎల్-2023లో మొత్తంగా ఆడిన 16 మ్యాచ్‌లో 605 పరుగులు సాధించాడు. ఇక రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా అందుబాటులోని సమయంలో టీమిండియాకు కూడా సారథిగా వ్యవహరించి జట్టును గెలిపించిన ఘనత అతడి సొంతం. చదవండి: IPL 2024: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
RCB Vs KKR: పాపం.. కోహ్లి ఒక్కడు ఏం చేయగలడు?
IPL 2024 RCB vs KKR: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ల తీరును టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ విమర్శించాడు. ప్రతిసారి విరాట్ కోహ్లి ఒక్కడి మీదే ఆధారపడితే ఫలితం ఇలాగే ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోహ్లి ఒక్కడు ఎంతని పోరాడగలడంటూ చురకలు అంటించాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీ రెండో పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. పదిహేడో ఎడిషన్ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన ఆర్సీబీ.. అనంతరం సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో జయభేరి మోగించింది. అయితే, అదే జోరును కొనసాగించలేక చతికిలపడింది. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో ఓటమిని చవిచూసింది. చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ఆర్సీబీ పరాజయం పాలైంది. సొంత మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. ఆరంభంలోనే ఓపెనర్, కెప్టెన్ డుప్లెసిస్(8) వికెట్ కోల్పోయింది. King Kohli in his Kingdom! 🥵🤌#RCBvsKKR pic.twitter.com/c8kgfXdWHS — OneCricket (@OneCricketApp) March 29, 2024 మరో ఓపెనర్ విరాట్ కోహ్లి(59 బంతుల్లో 83- నాటౌట్) ఆఖరి వరకు అజేయంగా నిలిచినా.. ఇతరుల నుంచి పెద్దగా సహకారం అందలేదు. వన్‌డౌన్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ 33 పరుగులతో పర్వాలేదనిపించగా.. గ్లెన్ మాక్స్వెల్ మెరుపులు(19 బంతుల్లో 23) కాసేపు అలరించాయి. ఇక రజత్ పాటిదార్(3) మరోసారి నిరాశపరచగా.. అనూజ్ రావత్(3) సైతం చేతులెత్తేశాడు. ఆఖర్లో దినేశ్ కార్తిక్(8 బంతుల్లో 20) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోరు చేయగలిగింది ఆర్సీబీ. అయితే, కేకేఆర్ బ్యాటర్లు దంచికొట్టడంతో 16.5 ఓవర్లలోనే లక్ష్యం ఛేదించడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘కోహ్లి ఒక్కడు ఎంతని చేయగలడు. అతడికి కనీసం ఒక్కరైనా సహకారం అందించి ఉండే బాగుండేది. ఒకవేళ ఈరోజు తనకు మరో బ్యాటర్ నుంచి సపోర్టు దొరికి ఉంటే 83కు బదులు 120 పరుగులు చేసేవాడు. ఇది ఒక్కడి ఆట కాదు కదా. జట్టుగా ఆడాల్సిన ఆట. కానీ దురదృష్టవశాత్తూ ఈరోజు తనొక్కడే పోరాడాల్సి వచ్చింది’’ అని పేర్కొన్నాడు. మిగతా బ్యాటర్లు ఇంకాస్త మెరుగ్గా రాణించి ఉంటే ఆర్సీబీ మంచి స్కోరు చేసి ఉండేదని అన్నాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో గావస్కర్ తన అభిప్రాయం పంచుకున్నాడు. కాగా ఆర్సీబీ తాజా ఓటమితో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోగా.. ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడి గెలిచిన కేకేఆర్ నాలుగు పాయింట్లతో రెండోస్థానంలో కొనసాగుతోంది. చదవండి: IPL 2024: రూ.11 కోట్లు తీసుకున్నాడు.. కట్ చేస్తే! ఆర్సీబీని నిండా ముంచేశాడు -
#Hardhik pandya: 'బాధపడకు హార్దిక్.. నేను నీకు ఉన్నా'
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో ముంబై పరాజయం పాలైంది. దీంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తొలి ఓటమి చవిచూశాడు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. ఈ మ్యాచ్‌లో హార్దిక్ కెప్టెన్సీ పరంగానే కాకుండా ఆటగాడిగా కూడా నిరాశపరిచాడు. బ్యాటింగ్ బౌలింగ్‌లో తన మార్క్‌ను హార్దిక్ చూపించలేకపోయాడు. కెప్టెన్సీలో సరైన వ్యూహాలను రచించడంలో పాండ్యా విఫలయ్యాడు. దీంతో హార్దిక్ వల్లే ముంబై ఓడిపోయిందని నెటజన్లు తెగ ట్రోలు చేస్తున్నారు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాకు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సపోర్ట్‌గా నిలిచాడు. ఇది కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమేనని, ఆటలో గెలుపోటములు సహజం అంటూ గవాస్కర్ ఓదర్చాడు. "హార్దిక్ పాండ్యా నీవు బాధపడకు. ఒక ముంబై ఫ్యాన్‌గా నేను నీకు సపోర్ట్‌గా ఉంటాను. ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌లో ఓడిపోవడం ఇదేమి కొత్త కాదు. ప్రతీ సీజన్లో అదే జరుగుతోంది. అప్పుడు మళ్లీ అదే జరిగింది. ఇది కేవలం మీకు మొదటి మ్యాచ్ మాత్రమే. తర్వాత మ్యాచ్‌లో మీకు అద్బుతమైన కమ్ బ్యాక్ ఇస్తారని ఆశిస్తున్నా" అని మ్యాచ్ అనంతరం గవాస్కర్ పేర్కొన్నాడు. ఐపీఎల్-2024 సీజన్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ తమ జట్టు పగ్గాలను రోహిత్ శర్మ నుంచి హార్దిక్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. -
అతడికి ప్రమోషన్ ఇవ్వండి.. దంచికొడతాడు: గవాస్కర్
ఐపీఎల్ 2024 సీజన్‌కు మరో 24 గంటల్లో తెరలేవనుంది. శుక్రవారం(మార్చి 22)న చెపాక్ స్టేడియం వేదికగా చెన్నైసూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ షురూ కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ఆస్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ రాజస్తాన్ రాయల్స్ జట్టుకు కీలక సూచనలు చేశాడు. ఆ జట్టు యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇవ్వాలని సన్నీ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2024లో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ కచ్చితంగా ఆకట్టుకుంటాడు. అతడు ప్రస్తుతం మంచి రిథమ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో అతడు ఏమి చేశాడో మనమందరం చూశాం. గత ఐపీఎల్లో కూడా ధ్రువ్ మెరుపులు మెరిపించాడు. కానీ అతడు బ్యాటింగ్‌కు మాత్రం చాలా ఆలస్యంగా వస్తున్నాడు. కాబట్టి ఈ ఏడాది సీజన్లో అతడి బ్యాటింగ్ ఆర్డర్‌ను కచ్చితంగా మార్చాల్సిందే. అతడికి ప్రమోషన్ ఇచ్చి కాస్త ముందు పంపాలని" స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో జురెల్ అదరగొట్టాడు. కీలక ఇన్నింగ్స్‌లతో అందరి ఆకట్టుకున్నాడు. దీంతో అతడికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో సైతం చోటు దక్కింది. అతడితో పాటు సర్ఫరాజ్ ఖాన్‌కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చింది. -
IPL 2024: సన్‌రైజర్స్ కోచ్‌గా దూరం.. ఆ ‘టీమ్’లో స్పీడ్‌గన్!
ఐపీఎల్ తాజా సీజన్ ఆరంభానికి తరుణం ఆసన్నమైంది. చెపాక్ వేదికగా మార్చి 22న క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్‌కు తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆరంభ మ్యాచ్ జరుగనుంది. దేశంలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలి దశలో 21 మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే విడుదలైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో ఓవైపు క్రికెటర్లు ఆటతో అలరిస్తుంటే.. వారి ఆటను విశ్లేషిస్తూ మాటల గారడితో అభిమానులను ఆకట్టుకునేందుకు సిద్ధమైన కామెంటేటర్లు సిద్ధమవుతున్నారు. ఇందులో టీమిండియా మాజీ హెడ్‌కోచ్, ప్రముఖ వ్యాఖ్యాత రవిశాస్త్రి, దిగ్గజం సునిల్ గావస్కర్ సహా భారత్ నుంచి తరలివెళ్లి అమెరికాకు ఆడుతున్న ఉన్ముక్త్ చాంద్ వరకు లిస్టు పెద్దదిగానే ఉంది. ఇక వ్యక్తిగత కారణాల దృష్ట్యా సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా తప్పుకొన్న సౌతాఫ్రికా స్పీడ్‌గన్ డేల్ స్టెయిన్ కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం. ఇంటర్నేషనల్: స్టీవ్ స్మిత్, స్టువర్ట్ బ్రాడ్, డేల్ స్టెయిన్, జాక్వెస్ కలిస్, టామ్ మూడీ, పాల్ కాలింగ్‌వుడ్. ఇంగ్లిష్ కామెంట్రీ: సునిల్ గావస్కర్, రవి శాస్త్రి, బ్రియన్ లారా, మాథ్యూ హెడెన్, కెవిన్ పీటర్సన్, మైఖేల్ క్లార్క్, సంజయ్ మంజ్రేకర్, ఆరోన్ ఫించ్, ఇయాన్ బిషప్, నిక్ నైట్, సైమన్ కటిచ్, డ్యారీ మోరిసన్, క్రిస్ మోరిస్, క్యాటీ మార్టిన్, సామ్యూల్ బద్రి, గ్రేమ్ స్వాన్, దీప్‌దాస్ గుప్తా, హర్షా భోగ్లే, పుమెలెలో ముబాంగ్వా, అంజుమ్ చోప్రా, మురళి కార్తిక్, డబ్ల్యూవీ రామన్, నటాలీ జెర్మనోస్, డారెన్ గంగ, మార్క్ హొవార్డ్, రోహన్ గావస్కర్. తెలుగు: మిథాలీ రాజ్, ఎమ్మెస్కే ప్రసాద్, వేణుగోపాల్ రావు, టి. సుమన్, కళ్యాణ్ కృష్ణ, జ్ఞానేశ్వర్రావు, రాకేశ్ దేవా రెడ్డి, డానియల్ మనోహర్, రవి రాక్లే, శశికాంత్ ఆవులపల్లి, ఎం ఆనంత్ శ్రీక్రిష్ణ, వింధ్య మేడపాటి, గీతా భగత్, అంబటి రాయుడు. హిందీ: హర్భజన్ సింగ్ ఇర్ఫాన్ పఠాన్ అంబటి రాయుడు రవిశాస్త్రి సునీల్ గవాస్కర్ వరుణ్ ఆరోన్ మిథాలీ రాజ్ మహ్మద్ కైఫ్ సంజయ్ మంజ్రేకర్ ఇమ్రాన్ తాహిర్ వసీం జాఫర్ గురుకీరత్ మన్ ఉన్ముక్త్ చంద్ వివేక్ రజ్దాన్ రజత్ భాటియా దీప్ దాస్‌గుప్తా రామన్ భానోట్ పదమ్జెట్ సెహ్రావత్ జతిన్ సప్రు. -
నన్ను క్షమించండి సన్నీ సార్.. మరోసారి అలా చేయను: సర్ఫరాజ్
టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తన అరంగేట్ర టెస్టు సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. రాజ్‌కోట్ వేదికగా జరిగిన ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టు ద్వారా డెబ్యూ చేసిన సర్ఫరాజ్.. తన బ్యాటింగ్ స్కిల్స్‌తో అందరని అకట్టుకున్నాడు. సర్ఫరాజ్ తన అరంగేట్ర టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. అదేవిధంగా ధర్మశాల వేదికగా ఐదో టెస్టులోనూ ఈ ముంబైకర్ సత్తాచాటాడు. అయితే ఆఖరి టెస్టులో మంచి టచ్‌లో కన్పించిన సర్ఫరాజ్ ఓ చెత్త షాట్ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. టీ బ్రేక్ అనంతరం ఎదుర్కొన్న తొలి బంతికే సర్ఫరాజ్ పెవిలియన్‌కు చేరాడు. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో బంతిని తప్పుగా అంచనా వేసిన సర్ఫరాజ్.. లేట్ కట్ షాట్ ఆడి స్లిప్‌లో జో రూట్ చేతికి చిక్కాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ ఖాన్ 8 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 56 పరుగులు చేశాడు. కాగా సర్ఫరాజ్ ఔటైన వెంటనే భారత బ్యాటర్లు వరుస క్రమంలో పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ సమయంలో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్.. సర్ఫరాజ్ ఔటైన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. "బంతి ఒక్కసారిగా పైకి పిచ్ అయ్యింది. అది షాట్ ఆడాల్సిన బాల్ కాదు. అయినా ఆడేందుకు వెళ్లి మూల్యం చెల్లించుకున్నాడు. టీ బ్రేక్ తర్వాత తొలి బంతినే ఆవిధంగా ఆడాల్సిన అవసరం లేదు. కాస్త దృష్టి పెట్టి ఆడాల్సింది. ఇటువంటి సమయంలో దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్‌మాన్ మాటలను గుర్తు చేసుకోవాలి. తాను 200 పరుగులు సాధించినా సరే ఎదుర్కొనే తర్వాత బంతిని సున్నా స్కోరు పై ఉన్నాను అని అనుకుని ఆడేవాడినని చెప్పేవారు. కానీ సర్ఫరాజ్ టీ విరామం తర్వాత తొలి బంతికే చెత్త షాట్ ఆడి ఔటయ్యాడని" సన్నీ కాస్త సీరియస్ అయ్యాడు. అయితే గవాస్కర్ అంతలా సీరియస్ అవ్వడానికి ఓ కారణముంది. ఎందుకంటే మ్యాచ్‌కు ముందు షాట్ల ఎంపికపై దాదాపు గంట సేపు సర్ఫరాజ్‌కు గవాస్కర్ కీలక సూచనలు చేశాడు. కానీ సర్ఫరాజ్ మాత్రం చెత్త షాట్ ఆడి ఔట్ కావడంతో లిటిల్ మాస్టర్‌కు కోపం వచ్చింది. అయితే గవాస్కర్ సీరియస్ కావడంతో సర్ఫరాజ్ ఖాన్ బాధపడ్డాడని, ఆయనకు క్షమాపణలు కూడా చెప్పాడని ప్రముఖ వ్యాపారవేత్త శ్యామ్ భాటియా తెలిపారు. ఈయన గవాస్కర్‌కు అత్యంత సన్నిహితుడు. ‘సన్నీ సార్‌కు నేను క్షమాపణలు చెబుతున్నా. నేను తప్పు చేశా. మరోసారి అలాంటి తప్పిదం పునరావృతం కాదు’ అని యువ ఆటగాడు అన్నాడు’’ అని శ్యామ్ భాటియా చెప్పుకొచ్చారు. చదవండి: Ind vs Eng: పుజారాను వద్దని.. వాళ్ల కోసం రోహిత్, ద్రవిడ్‌లను ఒప్పించి మరీ.. -
చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. 21వ శతాబ్దంలో తొలి ఆటగాడిగా
టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ధర్మశాల వేదికగా ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్న ఆఖరి టెస్టులోనూ జైశ్వాల్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 58 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్.. 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన జైశ్వాల్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 21వ శతాబ్దంలో ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా జైశ్వాల్ చరిత్ర సృష్టించాడు. యశస్వీ ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లో 712 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. 2014-15లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో కోహ్లి 692 పరుగులు చేశాడు. అయితే తాజా మ్యాచ్‌తో కోహ్లి ఆల్‌టైమ్ రికార్డును ఈ ముంబైకర్(జైశ్వాల్) బ్రేక్ చేశాడు. ఇక ఓవరాల్‌గా ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ పేరిట ఉంది. 1971లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో గవాస్కర్ 774 పరుగులు చేశాడు. అయితే ధర్మశాల టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో జైశ్వాల్ మరో 63 పరుగులు చేస్తే.. సన్నీని కూడా జైశ్వాల్ అధిగమించే ఛాన్స్ ఉంది. ఇక ఈ రికార్డుతో పలు అరుదైన ఘనతలను కూడా జైశ్వాల్ తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లి(655) రికార్డును కూడా ఈ యువ ఓపెనర్ బ్రేక్ చేశాడు. అదే విధంగా టెస్టుల్లో ఓ జట్టుపై అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా జైశ్వాల్ నిలిచాడు. ఈ రికార్డు ఇప్పటివరకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కూలర్ పేరిట ఉండింది. ఆసీస్‌పై 74 ఇన్నింగ్స్‌ల్లో 25 సిక్సర్లు బాదితే.. యశస్వి ఇంగ్లండ్‌పై కేవలం 9 ఇన్నింగ్స్‌ల్లోనే 26 సిక్సర్లు బాది సచిన్‌ను అధిగమించాడు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 57.4 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది. క్రాలీ (108 బంతుల్లో 79; 11 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... మిగతా వారంతా విఫలమయ్యారు. కుల్దీప్ యాదవ్ (5/72) ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగగా, అశ్విన్‌కు 4 వికెట్లు దక్కాయి.అనంతరం ఆట ముగిసే సమయానికి భారత్ 30 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 135 పరుగులు చేసి మరో 83 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. క్రీజులో రోహిత్ శర్మ(52 నాటౌట్), గిల్(26) పరుగులతో ఉన్నారు. -
వారికి జట్టులో చోటు లేదు.. ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎట్లా?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నానని భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అన్నాడు. రోహిత్ చెప్పినట్టు సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లు భారత క్రికెట్ పట్ల కాస్తైనా విశ్వసనీయత ప్రదర్శించాలన్నాడు. కాగా టెస్టు జట్టులోకి తిరిగి రావాలంటే భారత ఆటగాళ్లు కచ్చితంగా రంజీల్లో ఆడాలని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు రంజీ క్రికెట్ ఆడటం పట్ల విముఖంగా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో ఈ మేరకు బోర్డు ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు విజయానంతరం కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రశ్న ఎదురైంది. బదలుగా.. ‘‘టెస్టు క్రికెట్ ఆడాలన్న తపన, కసి ఉన్నవారికి మాత్రమే జట్టులో చోటు ఇస్తాం’’ అని రోహిత్ శర్మ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాల్సిన ఆవశ్యకతను నొక్కి వక్కాణించాడు. ఈ విషయంపై స్పందించిన సునిల్ గావస్కర్.. ‘‘రోహిత్ చెప్పిన మాటలు సరైనవే. టెస్టు క్రికెట్‌పై ఇష్టం ఉన్న వాళ్లకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలి. ఎన్నో ఏళ్లుగా నేను ఇదే విషయం చెబుతున్నా. దేశవాళీ క్రికెట్లో రాణించడం వల్లే చాలా మంది ఉన్నత స్థాయికి చేరుకున్నారు. కనీసం వాళ్లైనా డొమెస్టిక్ క్రికెట్ పట్ల విశ్వాసం ప్రదర్శించాలి కదా’’ అంటూ రంజీల్లో ఆడేందుకు ఇష్టపడని టీమిండియా క్రికెటర్లకు చురకలు అంటించాడు. ఒకవేళ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లు ఎవరైనా టెస్టులు ఆడొద్దని నిర్ణయించుకుంటే.. వారిని నిర్మొహమాటంగా పక్కనపెట్టేయాలంటూ పరక్షంగా బోర్డుకు విజ్ఞప్తి చేశాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా కైవసం చేసుకుంది. సీనియర్ల గైర్హాజరీలో దేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్ ఈ సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. రజత్ మినహా మిగతా ముగ్గురు సత్తా చాటి తమ ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నారు. చదవండి: #Dhruv Jurel: ఈ కుర్రాడిని నమ్మినందుకు ధన్యవాదాలు.. -
ఆయనొక టీమిండియా మాజీ కెప్టెన్.. ఇదేనా మీరేచ్చే గౌరవం?
టీమిండియా మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్(95) ఫిబ్రవరి 13న కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే మరణించిన నాలుగు రోజుల తర్వాత భారత జట్టు ఆటగాళ్లు సంతాపం తెలిపారు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో మూడో టెస్టు మూడో రోజు ఆట సందర్భంగా అతనికి నివాళిగా.. భారత జట్టు ఆటగాళ్లు చేతికి బ్లాక్ బ్యాండ్స్ ధరించి మైదానంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో ఆలస్యంగా స్పందించినందుకు భారత జట్టు మేనెజ్మెంట్పై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అగ్రహం వ్యక్తం చేశాడు. అయనొక భారత జట్టుమాజీ కెప్టెన్ అని, జట్టు మేనెజ్మెంట్ మొదటి రోజు ఆటలోనే వాళులర్పించింటే బాగుండేదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. " గైక్వాడ్ ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆయన ఉన్న లేకపోయినా గౌరవించాల్సిన అవసరం మనకు ఉంది. ఆయన మృతి పట్ల మొదటి రోజు ఆటలోనే సంతాపం వ్యక్తం చేయాల్సింది. ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ముందుగా ఎందుకు తీసుకోలేదో నాకు అర్ధం కావడం లేదు. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇంత ఆలస్యం జరగలేదని రాజ్‌కోట్ టెస్టుకు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న లిటిల్ మాస్టర్" పేర్కొన్నాడు. -
అతడే కాదు.. అసలు ఎవరికీ ఆ అర్హత లేదు: టీమిండియా దిగ్గజం
IPL 2024- KKR: ఐపీఎల్ వేలం-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ అవలంబించిన వ్యూహాన్ని టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ విమర్శించాడు. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ కోసం కేకేఆర్ ఏకంగా 24 కోట్లు వెచ్చించడం అతిశయోక్తిగా అనిపించిందన్నాడు. ఏ క్రికెటర్ కూడా అంత మొత్తం అందుకునేందుకు అర్హుడు కాదని తాను భావిస్తున్నట్లు గావస్కర్ పేర్కొన్నాడు. కాగా దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత స్టార్క్ క్యాష్ రిచ్ లీగ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఏకంగా రూ. 24.75 కోట్లు భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్-2023లో సత్తా చాటిన ఈ పేస్ బౌలర్ కోసం మినీ వేలంలో ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. ఈ క్రమంలో స్టార్క్ కోసం గుజరాత్ టైటాన్స్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైన కేకేఆర్.. ఏకంగా రూ. 24.75 కోట్లు చెల్లించి అతడిని సొంతం చేసుకుంది. తద్వారా ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ పాత రికార్డులన్నీ బద్దలుకొట్టాడు. ఈ విషయం గురించి సునిల్ గావస్కర్ తాజాగా స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడాడు. ‘‘నాకైతే నిజంగా ఇది అతిశయోక్తి అనిపించింది. అతడే కాదు.. అసలు ఎవరికీ ఆ అర్హత లేదు నాకు తెలిసి ఏ క్రికెటర్‌కు కూడా అంత భారీ మొత్తం అందుకోగల అర్హత లేదు. ఒకవేళ తాను ఆడే 14 మ్యాచ్‌లలో స్టార్క్ కనీసం నాలుగింటిలోనైనా ప్రభావం చూపితే.. ఆ డబ్బుకు కాస్తైనా న్యాయం చేసినట్లు అవుతుంది. మిగతా మ్యాచ్‌లలోనూ రాణించగలిగితే అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వంటి జట్లలో మేటి బ్యాటర్లు ఉన్నారు. ఈ జట్లపై స్టార్క్ బంతితో ప్రభావం చూపితే మాత్రం ఫ్రాంఛైజీ తన కోసం వెచ్చించిన మొత్తానికి న్యాయం చేసినవాడవుతాడు’’ అని సునిల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు. తొలుత ఆర్సీబీకి ఆడాడు కాగా 2014, 2015 సీజన్లలో ఆర్సీబీకి ఆడిన స్టార్క్.. 2018లో కేకేఆర్‌కు మారాడు. అప్పుడు కేకేఆర్ అతడి కోసం రూ. 9.40 కోట్లు ఖర్చు చేయగా.. గాయం కారణంగా ఆడలేకపోయాడు. ఇక వన్డే వరల్డ్‌కప్-2023లో మిచెల్ స్టార్క్ మొత్తంగా ఆడిన 10 మ్యాచ్‌లలో 16 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆసీస్ ఆరోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. చదవండి: Ravindra Jadeja: మా కోడలి వల్లే ఇదంతా... మండిపడ్డ రివాబా! -
హార్దిక్ తిరిగొచ్చినా వరల్డ్‌కప్‌లో ఆడేది అతడే: టీమిండియా దిగ్గజం
T20 WC 2024: టీమిండియా ఆల్‌రౌండర్ శివం దూబేపై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న ఈ ముంబై బ్యాటర్... టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమని అంచనా వేశాడు. ఇలాగే ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగితే సెలక్టర్లు అతడిని పక్కనపెట్టే సాహసం చేయలేరని పేర్కొన్నాడు. కాగా 2019లో బంగ్లాదేశ్ టూర్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టాడు పేస్ ఆల్‌రౌండర్ శివం దూబే. ఢిల్లీ వేదికగా జరిగిన నాటి మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అదే విధంగా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఆ తర్వాత అడపాదడపా వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పాండ్యా గాయం.. దూబే పాలిట వరం! దీంతో బీసీసీఐ సెలక్టర్లు శివం దూబేను పక్కనపెట్టారు. అయితే, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున గతేడాది సత్తా చాటిన దూబేను.. హార్దిక్ పాండ్యా గాయం రూపంలో అదృష్టం వరించింది. ప్రపంచకప్-2024కు ముందు స్వదేశంలో టీమిండియా అఫ్గనిస్తాన్‌తో ఆడుతున్న టీ20 సిరీస్‌కు పాండ్యా దూరమయ్యాడు. చీలమండ నొప్పి కారణంగా అందుబాటులో లేకుండా పోయాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా స్థానంలో పేస్ ఆల్‌రౌండర్‌గా శివం దూబేకు అవకాశం వచ్చింది. అయితే, పునరాగమనంలో దూబే తప్పులను పునరావృతం చేయలేదు. వరుస హాఫ్ సెంచరీలు మొహాలీ వేదికగా తొలి టీ20లో ఒక వికెట్ తీయడంతో పాటు.. లక్ష్య ఛేదనలో దంచికొట్టాడు. కేవలం 40 బంతుల్లోనే 60 పరుగులు రాబట్టి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక రెండో టీ20లోనూ ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన శివం దూబే.. ఒక వికెట్ పడగొట్టడంతో పాటు.. 32 బంతుల్లోనే 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరోసారి జట్టును గెలిపించాడు. తద్వారా టీమిండియా 2-0తో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. సెలక్టర్లకు తలనొప్పి ఇక బుధవారం నాటి మూడో టీ20లోనూ సత్తా చాటి.. ఆపై ఐపీఎల్-2024లోనూ అద్భుతాలు చేస్తే దూబేకు తిరుగు ఉండదు. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ హార్దిక్ పాండ్యా ఫిట్‌గా లేకపోతే టీమిండియా పరిస్థితి ఏంటి? అని మనమంతా ఆందోళనకు గురయ్యాం. కానీ.. ఇప్పుడు హార్దిక్ పూర్తి ఫిట్‌గా ఉన్నా శివం దూబే అమెరికా ఫ్లైట్ ఎక్కడం ఖాయం. ఇలాగే తన ప్రదర్శనను కొనసాగిస్తే... అతడిని జట్టు నుంచి తప్పించాలన్న ఆలోచనే రాదు. హార్దిక్ తిరిగి వస్తే సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. గత రెండు మ్యాచ్‌లతో దూబే తన స్థాయిని పెంచుకున్నాడు. తనదైన శైలిలో ఆడుతూ విజయవంతమవుతున్నాడు. ఎవరినీ అనుకరించే ప్రయత్నం చేయడం లేదు. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడానికి తానేం చేయాలో అంతా చేస్తున్నాడు’’ అని పేర్కొన్నాడు. కాగా జూన్ 4 నుంచి అమెరికా-వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్-2024 ఆరంభం కానుంది. చదవండి: లక్ష్యం 110.. నరాలు తెగే ఉత్కంఠ! ఏకంగా 7 వికెట్లు కూల్చి.. -
పంత్ ఒక్క కాలితో ఫిట్‌గా ఉన్నా టీ20 వరల్డ్‌కప్ ఆడాలి..!
టీమిండియా చిచ్చరపిడుగు రిషబ్ పంత్‌పై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ ఒక్క కాలితో ఫిట్‌గా ఉన్నా త్వరలో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో ఆడాలని అన్నాడు. ఫార్మాట్ ఏదైనా పంత్ గేమ్ ఛేంజర్ అని, అందుకే అతను ఒక్క కాలితో ఫిట్‌గా ఉన్నా జట్టులోకి రావాలని కోరుకుంటున్నానని తెలిపాడు. నేను సెలెక్టర్‌ను అయితే ఈ పనిని తప్పక చేస్తానని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. దీని ముందు గవాస్కర్ కేఎల్ రాహుల్‌ను ఉద్దేశిస్తూ కూడా పలు కామెంట్స్ చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో కేఎల్ రాహుల్ కూడా వికెట్‌కీపింగ్ కమ్ బ్యాటింగ్‌కు బెస్ట్ ఛాయిసే. అయినా నా ఓటు మాత్రం పంత్‌కే అని అన్నాడు. పంత్ అందుబాటులో ఉన్నంత కాలం అతనే తన ఫస్ట్ ఛాయిస్ అని తెలిపాడు. ఒకవేళ పంత్ అందుబాటులో లేకపోతే మాత్రం తన ఓటు కేఎల్ రాహుల్‌కు ఉంటుందని చెప్పిన గవాస్కర్.. రాహుల్ వల్ల టీమిండియా సమతూకంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. రాహుల్ వికెట్‌కీపింగ్ చేస్తూ మిడిలార్డర్లో అయినా ఓపెనర్‌గా అయినా సింక్ అవుతాడని తెలిపాడు. స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో జరిగిన గేమ్ ప్లాన్ అనే షోలో గవాస్కర్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, 2022 చివర్లో జరిగిన కార్ యాక్సిడెంట్లో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడిని విషయం తెలిసిందే. అప్పటి నుంచి టీమిండియా సిరీస్‌కు ఒకరు చొప్పున పార్ట్‌టైమ్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్లతో నెట్టుకొస్తుంది. ఇటీవలి కాలంలో కేఎల్ రాహుల్ ఈ పాత్రలో పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యాడు. వన్డే వరల్డ్‌కప్‌లో అతను పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడటంతో పాటు అద్భుతంగా వికెట్‌కీపింగ్ చేశాడు. పంత్ తిరిగి జట్టులోకి వస్తే రాహుల్ కేవలం బ్యాటింగ్ వరకు మాత్రమే పరిమితం కావచ్చు. ఏడాదికి పైగా జట్టుకు దూరంగా ఉంటున్న పంత్.. ఈ ఏడాది ఐపీఎల్ సమయానికంతా పూర్తి ఫిట్నెస్ సాధించి బరిలోకి దిగుతాడని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాల్టి నుంచి ప్రారంభంకాబోయే టీ20 సిరీస్ కోసం భారత సెలెక్టర్లు రాహుల్‌ను కానీ ఇషాన్ కిషన్‌ను కాని వికెట్కీపర్లుగా ఎంపిక చేయలేదు. ఈ జట్టులో వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్లుగా సంజూ శాంసన్, జితేశ్ శర్మ ఎంపిక చేయబడ్డారు. రాహుల్, ఇషాన్‌లకు రెస్ట్ ఇచ్చినట్లు సెలెక్టర్లు చెబుతున్నారు. మొహాలీ వేదికగా భారత్-ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఇవాళ రాత్రి 7 గంటలకు తొలి టీ20 ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల చేత కోహ్లి తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రకటించాడు. -
Ind Vs SA: ‘రెండో టెస్టులో టీమిండియాదే విజయం.. ఎందుకంటే?’
Ind Vs SA 2nd Test: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ధీమా వ్యక్తం చేశాడు. తొలి రోజే ప్రొటిస్ జట్టు కీలక వికెట్లు కోల్పోయింది కాబట్టి భారత్ గెలుపు సాధ్యమవుతుందని పేర్కొన్నాడు. టీమిండియా పేసర్లు మరోసారి విజృంభించి సౌతాఫ్రికాను తక్కువ స్కోరుకే కట్టడి చేసి శుభారంభం అందిస్తే.. బ్యాటర్లు విజయ లాంఛనం పూర్తి చేయగలరని గావస్కర్ అంచనా వేశాడు. కాగా సెంచూరియన్ వేదికగా బాక్సింగ్ డే టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసిన రోహిత్ సేన.. రెండో మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. సఫారీ గడ్డపై తొలిసారి సిరీస్ గెలిచే అవకాశాన్ని ఆదిలోనే చేజార్చుకున్న టీమిండియా.. కేప్‌టౌన్‌లో గెలిచి కనీసం డ్రా చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా బుధవారం మొదలైన టెస్టులో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. అనూహ్య రీతిలో సౌతాఫ్రికాను 55 పరుగులకే ఆలౌట్ చేసింది. 36 పరుగుల ఆధిక్యంలో టీమిండియా ఆ తర్వాత 153 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. అనంతరం మళ్లీ బౌలింగ్ చేసిన టీమిండియాకు మూడు వికెట్లు దక్కాయి. డీన్ ఎల్గర్ రూపంలో కీలక బ్యాటర్‌ను అవుట్ చేయగలిగింది. ఈ క్రమంలో తొలి రోజు ఆట ముగిసే సరికి సౌతాఫ్రికా 17 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేయగా.. టీమిండియాకు 36 పరుగుల ఆధిక్యం దక్కింది. రోహిత్ సేనదే విజయం.. ఎందుకంటే ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయింది. భారత్ ఇంకా ఆధిక్యంలోనే కొనసాగుతోంది. కాబట్టి మ్యాచ్ టీమిండియా చేజారిపోతుందని నేను అనుకోవడం లేదు. సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్లో మిగిలిన ఆటగాళ్లంతా కలిసి 150- 200 పరుగులు చేయడం మాత్రం కష్టమే. కాబట్టి భారత్‌కు విజయావకాశాలు ఎక్కువే. ఇన్నింగ్స్ తేడాతో విజయం దక్కకపోయినా.. మెరుగైన స్థితిలోనే ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. చదవండి: Ind vs SA: అస్సలు ఊహించలేదు.. వాళ్లిద్దరి సహకారం వల్లే సాధ్యమైంది: ‘సిక్సర్’ సిరాజ్ -
గిల్ కొంచెం దూకుడు తగ్గించుకుంటే మంచిది: గవాస్కర్
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఈ ఒక్క మ్యాచ్ మాత్రమే కాకుండా గతేడాది మొత్తం టెస్టుల్లో గిల్ ప్రదర్శన అంతంతమాత్రమే. గిల్ ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 48 మ్యాచ్‌లు ఆడి 46.82 సగటున 7 సెంచరీలు, 10 అర్థసెంచరీల సాయంతో 2154 పరుగులు చేశాడు. అయితే ఏడాది టెస్టుల్లో మాత్రం గిల్ 10 ఇన్నింగ్స్‌లలో కేవలం 258 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో కేవలం ఒకే సెంచరీ మాత్రమే ఉంది. మిగితా మ్యాచ్‌ల్లో కనీసం హాఫ్ సెంచరీ మార్క్‌ను కూడా అందుకోలేకపోయాడు. ఈ క్రమంలో కొత్త ఏడాదిలోనైనా తన టెస్టు గణాంకాలను మెరుగు పరుచుకోవాలని గిల్ భావిస్తున్నాడు. జనవరి 3 నుంచి కేప్‌టౌన్ వేదికగా ప్రోటీస్‌తో జరగనున్న రెండో టెస్టు కోసం ప్రిన్స్ సిద్దమవుతున్నాడు. ఈ నేపథ్యంలో గిల్‌ను ఉద్దేశించి భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "టెస్టు క్రికెట్లో శుబ్‌మన్ గిల్ కొంచెం దూకుడుగా ఆడుతున్నాడు. వైట్‌బాల్ క్రికెట్ టెస్టులకు చాలా తేడా ఉంటుంది. వన్డేలు, టీ20లు ఆడే విధంగా టెస్టు క్రికెట్ ఆడుతామంటే ఇబ్బంది పడక తప్పదు. టెస్టుల్లో వాడే రెడ్ బాల్లో కూడా కొంచెం తేడా ఉంటుంది. వైట్ బాల్ కంటే రెడ్ బాల్ బాగా స్వింగ్ అవుతోంది. అంతేకాకుండా బౌన్స్ కూడా ఎక్కువగా అవుతోంది. గిల్ అది మైండ్‌లో పెట్టుకుని ఆడాలి. శుబ్‌మన్ గిల్ తన టెస్టు కెరీర్‌ను అద్భుతంగా ఆరంభించాడు. అతడు తన బ్యాటింగ్ స్టైల్‌తో అందరిని అకట్టుకుకున్నాడు. అతడు మళ్లీ తిరిగి తన ఫామ్‌ను పొందుతాడని ఆశిస్తున్నానని" స్టార్స్పోర్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు. చదవండి: Ind vs SA 2nd Test: మార్పులు సూచించిన ఇర్ఫాన్ పఠాన్.. ప్రసిద్ కృష్ణ ఉంటే.. -
'దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. అతడు ఉంటే కథ వేరేలా ఉండేది'
సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు భారత బ్యాటర్లకు దక్షిణాఫ్రికా పేస్ దళం చుక్కలు చూపించారు. సఫారీ పేస్ దళం దెబ్బకు భారత టాపర్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయితే టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మాత్రం బౌలర్లు నిప్పులు చేరుగుతున్న చోట.. తన బ్యాటింగ్ సత్తాతో ఎదురు నిలిచాడు. కేఎల్ రాహుల్(70) క్రీజులో ఉన్నాడు. అతడి అద్భుత పోరాటం ఫలితంగా టీమిండియా తొలి రోజు ఆటముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్ 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ ఐదు వికెట్లతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ(5), యశస్వీ జైశ్వాల్(17), శుబ్‌మన్ గిల్ తీవ్ర నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇటువంటి కష్టతరమైన పరిస్థితులలో వెటరన్ ఆటగాడు అజింక్యా రహానే జట్టులో ఉంటే బాగుండేది అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. "ఈ జట్టులో అజింక్యా రహానే ఉండాల్సింది. విదేశీ పరిస్థితుల్లో రహానేకు చాలా అనుభవం ఉంది. అతడు ఈ టెస్టులో కూడా ఉండి కథ పూర్తి భిన్నంగా ఉండేది. ఎందుకంటే ఐదేళ్ల క్రితం(2018-19) జోహన్నెస్‌బర్గ్ టెస్టులో పిచ్ గురించి పెద్దు ఎత్తున చర్చనడిచింది. అప్పుడు నేను కూడా అక్కడ ఉన్నాను. దక్షిణాఫ్రికా బౌలర్లు నిప్పులు చేరిగారు. అటువంటి బౌన్సీ పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. కానీ రహానే మాత్రం అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన రహానే.. మూడో టెస్టుకు జట్టులోకి వచ్చి కీలకమైన 48 పరుగులతో టీమిండియాను గెలిపించాడని" స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ పేర్కొన్నాడు. కాగా రహానే చివరగా భారత తరుపున ఈ ఏడాది జూలైలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో ఆడాడు. ఈ సిరీస్‌లో రహానే తీవ్ర నిరాశపరిచాడు. రెండు టెస్టులు కలిపి కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో సౌతాఫ్రికా సిరీస్‌కు రహానేను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. -
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. వారిద్దరూ దుమ్మురేపుతారు: సునీల్ గవాస్కర్
సెంచూరియాన్ వేదికగా డిసెంబర్-26 నుంచి దక్షిణాఫ్రికా-భారత్ తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్ కోసం దక్షిణాఫ్రికా,భారత జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాయి. తమ సొంత గడ్డపై టెస్టుల్లో భారత్‌పై అధిపత్యాన్ని చెలాయించాలని సౌతాఫ్రికా భావిస్తుంటే.. టీమిండియా మాత్రం తొలిసారి సఫారీ గడ్డపై టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకోవాలని కసితో ఉంది. ఈ సిరీస్‌కు టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అందుబాటులో ఉన్నారు. వన్డే వరల్డ్‌కప్ తర్వాత ఈ సీనియర్ ద్వయంకు ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో 'విరోహిత్'ను ఉద్దేశించి భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రోటీస్ సిరీస్‌లో విరాట్, రోహిత్ పరుగులు పరుగుల వరద పారిస్తారని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం జట్టులో విరాట్, రోహిత్ శర్మ చాలా అనుభవజ్ఞులైన బ్యాటర్లు. వారిద్దరికి దక్షిణాఫ్రికా పిచ్‌లపై ఆడిన అనుభవం ఉంది. కాబట్టి ఈ టెస్టు సిరీస్‌లో వారిద్దరూ భారీగా పరుగులు సాధిస్తారని నేను భావిస్తున్నాను. ఈసారి దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎటాక్ కొంచెం వీక్‌గా ఉంది. ఈ సిరీస్‌కు సీనియర్ పేసర్లు నోర్జే, లుంగి ఎంగిడీ దూరమయ్యారు. రబాడ అందుబాటుపై ఇంకా క్లారిటీ లేదు. దీంతో భారత్ భారీ స్కోర్ చేసే అవకాశముందని స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు. చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్! -
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. భారత తుది జట్టు ఇదే! ఓపెనర్లు ఎవరంటే?
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు అదే జట్టుతో టెస్టు సిరీస్‌కు సిద్దమైంది. వన్డే వరల్డ్‌కప్ ఓటమి తర్వాత తొలిసారి పూర్తి స్ధాయి జట్టుతో బరిలోకి దిగనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ప్రోటీస్‌లో టెస్టు సిరీస్‌కు భారత జట్టులో భాగమయ్యారు. డిసెంబర్ 26న సెంచరీ జరగనున్న తొలి టెస్టుతో ఈ రెడ్‌బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో టెస్టుకు భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఎంచుకున్నాడు. ఆరుగురు స్పెషలిస్టు బ్యాటర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్లు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను గవాస్కర్ ఎంపిక చేశాడు. 'నేను ఎంచుకున్న ప్లేయింగ్ చాలా సింపుల్‌గా ఉంటుంది. భారత ఇన్నింగ్స్‌ను యశస్వీ జైశ్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మ ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను. అదే విధంగా మూడు, నాలుగు స్ధానాల్లో వరుసగా శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి ఆడే అవకాశముంది. ఐదో స్ధానంలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌కు రానున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఆరో స్ధానంలో ఆడనున్నాడని అనుకుంటున్నాను. అయితే మ్యాచ్ పరిస్థితుల బట్టి అయ్యర్ బ్యాటింగ్ పొజిషేన్ మారే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్‌కు రానున్నారు. ఆపై ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ నేను ఎంచుకున్న తుది జట్టులో ఉంటారని ' అని స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ గవాస్కర్ అన్నాడు. కాగా గవాస్కర్ ఓపెనర్‌గా గిల్‌కు ఛాన్స్ ఇవ్వకపోవడం గమానార్హం. సునీల్ గవాస్కర్ ఎంచుకున్న భారత జట్టు ఇదే: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా,మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్. -
ఎనిమిదేళ్ల కెరీర్లో తొలి సెంచరీ.. దీని వల్ల సంజూ: గావస్కర్
టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్‌పై క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. సౌతాఫ్రికాతో వన్డేలో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడని.. ఇకపై అతడి కెరీర్ ఊపందుకుంటుందని పేర్కొన్నాడు. కాగా 2015లో జింబాబ్వేతో మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కేరళ బ్యాటర్ సంజూ శాంసన్‌కు టీమిండియాలో తగినన్ని అవకాశాలు రాలేదనే చెప్పాలి. అడపాదడపా ఛాన్స్‌లు వచ్చినా వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయాడన్న అపవాదూ అతడిపై ఉంది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఈ వికెట్ కీపర్‌కు సౌతాఫ్రికా పర్యటన రూపంలో సువర్ణావకాశం దక్కింది. ప్రొటిస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన సంజూ శాంసన్‌కు తొలి వన్డేలో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోగా.. రెండో మ్యాచ్‌లో 12 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే, ట్రోఫీ కైవసం చేసుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఏకంగా సెంచరీతో కదం తొక్కాడు. పర్ల్ వేదికగా గురువారం నాటి మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు అనుకూలంగా లేని పిచ్‌పై.. సహచర ఆటగాళ్లు విఫలమైన వేళ సంజూ శతక్కొట్టాడు. మొత్తంగా 114 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 108 పరుగులు సాధించాడు. ఇక సంజూ ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 296 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా బ్యాటర్లను భారత బౌలర్లు ఓ ఆట ఆడుకున్నారు. దీంతో 218 పరుగులకే ఆలౌట్ అయిన ప్రొటిస్ జట్టు వన్డే సిరీస్‌ను 1-2తో టీమిండియాకు సమర్పించుకుంది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. కాగా సంజూ ఎనిమిదేళ్ల కెరీర్లో తొలి అంతర్జాతీయ సెంచరీ.. అది కూడా సఫారీ గడ్డపై నమోదు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో కామెంటేటర్ సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘ఈ సెంచరీ అతడి కెరీర్‌ను మలుపు తిప్పుతుంది. నిజానికి సంజూ ఎంతటి ప్రతిభావంతుడో అందరికీ తెలిసిందే. అయితే.. తనను తాను నిరూపించుకోవడంలో ఇన్నాళ్లు విఫలమయ్యాడు. సరైన సమయంలో తనలోని నైపుణ్యాలను బయటకు తీసి అద్భుతం చేశాడు. ఇతరులతో పాటు తనకు తానేంటో కూడా చూపించుకోగలిగాడు’’ అని సంజూను కొనియాడాడు. A dream realised, a landmark breached!#SanjuSamson batted out of his skin to bring up his maiden ODI 💯 in a crucial series decider! How important in this knock in the greater scheme of things? Tune-in to the 3rd #SAvIND ODI, LIVE NOW on Star Sports Network#Cricket pic.twitter.com/OjR5qN8aXZ — Star Sports (@StarSportsIndia) December 21, 2023 -
IPL 2024: అందుకే కెప్టెన్‌గా రోహిత్‌పై వేటు.. పాండ్యా వైపు మొగ్గు!?
IPL 2024- Mumbai indians- Rohit Sharma: ముంబై ఇండియన్స్ కెప్టెన్ మార్పు విషయంలో తప్పొప్పులు ఎంచుతూ రచ్చ చేయాల్సిన పనిలేదని టీమిండియా క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అన్నాడు. జట్టు ప్రయోజనాల కోసమే ఫ్రాంఛైజీ నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడ్డాడు. గత రెండేళ్లుగా రోహిత్ శర్మ ప్రదర్శన స్థాయికి తగ్గట్లు లేదన్న గావస్కర్.. బహుశా అందుకే ముంబై హార్దిక్ పాండ్యా వైపు చూసి ఉంటుందని పేర్కొన్నాడు. ఇటు ఐపీఎల్, అటు టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మపై పనిభారం ఎక్కువైన క్రమంలో ముంబై అతడిని తప్పించి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2024 వేలానికి ముందు భారీ మొత్తానికి ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కెప్టెన్‌గా తమకు ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను తప్పించి.. పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. అయితే, కెప్టెన్ మార్పు విషయంపై పలువురు మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులూ ఫైర్ అవుతున్నారు. పాండ్యా నియామకానికి సంబంధించి ముంబై ప్రకటన చేయగానే.. ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో ఆగ్రహం వెళ్లగక్కారు. ఈ నేపథ్యంలో క్రీడా వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారిన ఈ అంశం గురించి సునిల్ గావస్కర్ స్పందించాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ తప్పు ఒప్పులు ఎంచాల్సిన పనిలేదు. జట్టు ప్రయోజనాల కోసమే యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. గత రెండేళ్లుగా రోహిత్ శర్మ బ్యాటర్‌గా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. 2021, 2022లో ముంబై ఇండియన్స్ వరుసగా తొమ్మిది, పది స్థానాల్లో నిలవడమే ఇందుకు నిదర్శనం. ఈసారి మాత్రం ప్లే ఆఫ్స్ చేరగలిగింది. అయితే, రోహిత్ మాత్రం పూర్తిస్థాయిలో తన సేవలు అందించలేదు. టీమిండియా కెప్టెన్‌గా, ఫ్రాంఛైజీ జట్టు సారథిగా వరుస మ్యాచ్‌లు ఆడినందు వల్ల బహుశా అతడు అలసిపోయి ఉంటాడు. అందుకే ముంబై అతడికి విశ్రాంతినివ్వాలని భావించి ఉంటుంది. మరోవైపు.. హార్దిక్ పాండ్యా రూపంలో వాళ్లకు యువ కెప్టెన్ అందుబాటులోకి వచ్చాడు. ఇప్పటికే అతడు గుజరాత్ టైటాన్స్‌ను రెండుసార్లు ఫైనల్‌కు తీసుకువెళ్లి.. ఓసారి టైటిల్ కూడా అందించాడు. అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ముంబై ఇండియన్స్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుంది’’ అని గావస్కర్ అభిప్రాయపడ్డాడు. చదవండి: Ind vs SA: ముఖం మీదే డోర్ వేసేశాడు! పాపం రుతురాజ్.. వీడియో వైరల్ -
గ్రౌండ్ కవర్ చేసేందుకూ డబ్బుల్లేవా?: భారత దిగ్గజం ఫైర్
South Africa vs India, 1st T20I: ఆస్ట్రేలియాపై స్వదేశంలో టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటననూ ఘనంగా ఆరంభించాలని భావించింది. అయితే, ఆదిలోనే వరుణుడు సూర్యకుమార్ సేనకు అడ్డుపడ్డాడు. ప్రొటిస్ గడ్డపై కఠిన సవాలు ఎదురవుతుందనుకుంటే ఎడతెరిపిలేని వర్షంతో తొలి టి20 మ్యాచ్ రద్దయ్యింది. అదేపనిగా వాన కురవడంతో పిచ్‌పై కప్పి ఉంచిన కవర్స్‌ను తీయాల్సిన అవసరమే రాలేదు. కాస్త ఆలస్యంగానైనా మ్యాచ్‌ను అస్వాదించవచ్చని ఎదురుచూస్తూ మైదానంలో గొడుగుల కిందే గడిపిన క్రికెట్ ప్రియుల ఆశలపై నీళ్లు పడ్డాయి. ఆగని వాన వల్ల కనీసం టాస్ కూడా వేసే అవకాశం లేకపోయింది. దీంతో మైదానంలో ఆడాల్సిన ఇరుజట్ల ఆటగాళ్లు... డ్రెస్సింగ్ రూమ్‌లలో సగటు ప్రేక్షకుల్లానే మిగిలిపోయారు. అభిమానులకు తప్పని నిరాశ వాతావరణ పరిస్థితిని సమీక్షించిన ఫీల్డ్ అంపైర్లు బాన్గని జెలె, స్టీఫెన్ హారిస్ రెండు గంటల అనంతరం ఓ నిర్ణయానికి వచ్చారు. వర్షం ఇంకా కొనసాగడం, అవుట్ ఫీల్డ్ అంతా చిత్తడిగా ఉండటంతో ఇక మ్యాచ్ నిర్వహించేందుకు అవకాశం లేదని, ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మెరుపులు చూడాలనుకున్న అభిమానులంతా చినుకులతో విసిగి నిరాశగా వెనుదిరిగారు. వర్షం కారణంగా.. కింగ్స్‌మేడ్ మైదానంలో జరగాల్సిన తొలి టీ20 రద్దు (PC: BCCI) సీఎస్ఏపై గావస్కర్ ఫైర్ ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు(సీఎస్ఏ) తీరుపై టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆర్థికంగా తమకు ఎంతో ముఖ్యమైన సిరీస్ అని చెప్పిన సీఎస్ఏ.. ఏర్పాట్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించాడు. తొలి టీ20 సమయంలో.. ఒకవేళ వర్షం ఆగిపోయినా ఆట కొనసాగకపోయేదని.. అప్పటికే గ్రౌండ్ మొత్తం తడిచిపోయిందని గావస్కర్ పేర్కొన్నాడు. ఈ విషయం గురించి గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘మైదానం మొత్తం కవర్ చేయనేలేదు. వర్షం తెరిపినిచ్చినా మరో గంట.. రెండు గంటల వరకు మ్యాచ్ కొనసాగే పరిస్థితి కనిపించలేదు. అంతలోనే మళ్లీ వర్షం పడింది. బీసీసీఐ దగ్గర ఉన్నంత డబ్బు మీకు లేకపోవచ్చు.. కానీ కాబట్టి మ్యాచ్ రద్దు చేశారు. నిజానికి ప్రతి క్రికెట్ బోర్డు దగ్గర చాలానే డబ్బు ఉంది. ఒకవేళ ఈ మాట తప్పని ఎవరైనా చెబితే వారు అబద్ధం ఆడుతున్నట్లే లెక్క! అయితే, అందరి దగ్గరా బీసీసీఐ వద్ద ఉన్నంత డబ్బు లేకపోవచ్చు. అయితే, ప్రతి బోర్డు దగ్గర కనీసం గ్రౌండ్ తడవకుండా కాపాడే కవర్లు కొనుగోలు చేసేంత సొమ్ము అయినా ఉంటుంది కదా!’’ అంటూ దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు చురకలు అంటించాడు. టీమిండియాతో సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా భావించినపుడు కనీస ఏర్పాట్లైనా చేసి ఉండాల్సిందని సునిల్ గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా మంగళవారం పోర్ట్ ఎలిజబెత్‌లో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య రెండో టి20 మ్యాచ్ జరుగనుంది. చదవండి: #Virushka: అందుకే విరాట్ కోహ్లి పేరును రాహుల్‌గా మార్చి మరీ! -
Rohit Sharma: రోహిత్ శర్మకు ఇదొక గోల్డెన్ ఛాన్స్!
India tour of South Africa, 2023-24 :సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు ముంగిట నిలిచాడని క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అన్నాడు. సఫారీ గడ్డపై గనుక ఈ సిరీస్ గెలిస్తే వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ఎదురైన పరాభవ ప్రభావాన్ని కొంతమేర అయినా తగ్గించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా సొంతగడ్డపై జరిగిన ఐసీసీ మెగా ఈవెంట్లో రోహిత్ సేన ఫైనల్ చేరేంత వరకు అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, అసలైన పోరులో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓడి తీవ్ర నిరాశకు గురైంది. నరేంద్ర మోదీ స్టేడియంలో దాదాపు లక్ష మందికి పైగా అభిమానుల మధ్య ఎదురైన ఘోర పరాభవం కారణంగా ఆటగాళ్లంతా భావోద్వేగానికి లోనయ్యారు. బాక్సింగ్ డే టెస్టుతో పునరాగమనం కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సహా ఇతర క్రికెటర్లంతా కంటతడి పెట్టుకుని భారంగా మైదానాన్ని వీడారు. ఈ క్రమంలో మూడు వారాలకు పైగా ఆటకు దూరమైన ‘విరాహిత్’ ద్వయం దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా తిరిగి మైదానంలో దిగనుంది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా డిసెంబరు 26 నుంచి ఈ ఇద్దరు తిరిగి జట్టుతో కలవనున్నారు. కాగా ప్రొటిస్ గడ్డపై ఇంతవరకు భారత జట్టు ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సారథి సునిల్ గావస్కర్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్‌కప్ ఓటమిని మరిపించేలా ‘‘గత 6-8 నెలలుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నారు. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో రోహిత్ కీలకం కానున్నాడు. ఈ టీమిండియా ఈ సిరీస్ గనుక గెలిస్తే వరల్డ్‌కప్ ఫైనల్లో ఎదురైన ఓటమి తాలుకు గాయాన్ని కొంతమేర అయినా నయం చేసే అవకాశం ఉంటుంది’’ అని గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే.. దిక్షిణాఫ్రికా పర్యటనలో భారత్‌కు వర్షం స్వాగతం పలికింది. సఫారీలో కఠిన సవాలు ఎదురవుతుందనుకుంటే ఎడతెరిపిలేని వర్షంతో ఆదివారం నాటి తొలి టి20 మ్యాచ్ రద్దయ్యింది. కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడనుంది. చదవండి: Ind vs Pak: భారత క్రికెట్ జట్టుకు నిరాశ.. సెమీస్ చేరాలంటే.. -
ఈ రైల్వే స్టేషన్ పేరు సచిన్!
స్టేడియంల సంగతి ఏమిటోగానీ రైల్వేస్టేషన్లకు క్రికెటర్ల పేర్లు ఊహించలేము. అయితే గుజరాత్‌లోని సూరత్ సమీపంలోని ఒక రైల్వేస్టేషన్ పేరు సచిన్. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఈ రైల్వేస్టేషన్ ముందు దిగిన ఫోటో వైరల్‌గా మారింది. ‘ఈ రైల్వేస్టేషన్‌కు మన ఆల్‌టైమ్ గ్రేట్ క్రికెటర్లలో ఒకరైన నా ఫేవరెట్ క్రికెటర్, నా అభిమాన వ్యక్తి పేరు పెట్టారు. గత శతాబ్దానికి చెందిన పెద్దల ముందు చూపు అబ్బురపరుస్తుంది’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాశాడు సునీల్ గవాస్కర్. ఇది చూసి ‘సచిన్‌లో సన్నీని చూడడం ఆనందంగా ఉంది’ అంటూ స్పందించాడు సచిన్ తెందూల్కర్. నిజానికి ఈ రైల్వేస్టేషన్‌కి ‘సచిన్’ అనే పేరు సచిన్ తెందూల్కర్ తాతముత్తాల కాలంలోనే ఉంది. సచిన్ తెందూల్కర్ పేరుకు, ఈ రైల్వేస్టేషన్ పేరుకు ఎలాంటి సంబంధం లేకపోయినా సరదా కోసం ‘పూర్వీకుల ముందుచూపు అబ్బురపరిచింది’ అని రాశాడు గవాస్కర్. -
ఇక చాలు.. టీమిండియా తప్పులు తెలుసుకోవాలి.. 2007 తర్వాత..
గత దశాబ్దకాలంగా టీమిండియా ఐసీసీ టోర్నీల్లో నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తున్నా ఒక్క ట్రోఫీ కూడా గెలవలేకపోయింది. ప్రపంచకప్-2015లో లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత జట్టు.. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి ఇంటిబాట పట్టింది. ఇక 2019లో లీగ్ దశలో ఒకే మ్యాచ్ ఓడిపోయి సెమీస్ చేరిన టీమిండియాకు అక్కడ.. న్యూజిలాండ్ చేతిలో పరాభవం తప్పలేదు. అయితే, ఈసారి సొంతగడ్డపై పొరపాట్లకు తావివ్వకుండా కచ్చితంగా మరోసారి వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడుతుందని అంతా భావించారు. అందుకు తగ్గట్లే రోహిత్ సేన ఫైనల్ వరకు అజేయంగా దూసుకువచ్చింది. టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచిన భారత జట్టు గెలుపు లాంఛనమే అని అభిమానులు సంబరపడుతున్న వేళ.. ఫైనల్లో ఆస్ట్రేలియా గట్టి షాకిచ్చింది. దీంతో మరోసారి టీమిండియాకు భంగపాటు తప్పలేదు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కన్నీటి పర్యంతం కాగా ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశమంతా భారత జట్టుకు అండగా నిలిచారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లోనైనా సత్తా చాటాలని కోరుకుంటున్నారు. ఈ పరిణామాలపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ తనదైన శైలిలో స్పందించాడు. తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే మరోసారి చేదు అనుభవం ఎదుర్కోక తప్పదని హెచ్చరించాడు. జట్టుకు అండగా నిలవడం మంచిదే అని.. అయితే, ప్రతిసారి ఏదో ఒక కారణం చూపి క్షమించేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. టీమిండియా 2007 తర్వాత ఇప్పటి వరకు ఒక్క టీ20 ప్రపంచకప్ కూడా గెలవకలేకపోవడాన్ని ప్రస్తావించిన గావస్కర్... "టీమిండియా వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందనడంలో సందేహం లేదు. అయితే, ఇప్పుడది గతం. ఆ ఓటమి బాధ నుంచి త్వరగా తేరుకోవాలి. గత నాలుగు వరల్డ్ కప్ ఈవెంట్లలో రెండుసార్లు ఫైనల్ వరకు రాగలిగినా ఆఖరి మెట్టుపై బోల్తా పడింది టీమిండియా. మిగతా జట్లతో పోలిస్తే ఈసారి మరింత గొప్పగా రాణించినా ఫలితం లేకుండా పోయింది. అయితే.. ఇప్పటికైనా టీమిండియా తమ తప్పులను తెలుసుకుని విశ్లేషించుకోవాలి. ట్రోఫీ ఎందుకు గెలవలేకపోయారో ఆలోచించుకోవాలి. పొరపాట్లను అంగీకరించే గుణం అలవరచుకోవాలి. అప్పుడే పురోగతి కనిపిస్తుంది. రానున్న వారం రోజుల్లో సెలక్షన్ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. 2007 తర్వాత మనం టీ20 ప్రపంచకప్ గెలవనేలేదు. ఐపీఎల్ రూపంలో ఇంత మంది యువ, ప్రతిభావంతులైన ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నా ఇలా జరగడం విచారకరం" అని మిడ్ డేకు రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు. అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉండాలని భావిస్తున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి స్టార్ల నిర్ణయాలు గౌరవించి.. వరల్డ్ కప్-2024 నాటికి యువ జట్టును సన్నద్ధం చేయాలని పరోక్షంగా సూచించాడు గావస్కర్. కాగా వచ్చే ఏడాది జూన్ 4 నుంచి టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. చదవండి: అదే అతడి బలం.. టీమిండియా కెప్టెన్ కాగలడు: అంబటి రాయుడు -
CWC 2023: టీమిండియా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అంతే!
వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో రెండు అత్యుత్తమ జట్లు తలపడటం సంతోషంగా ఉందని భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అన్నాడు. లీగ్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా సెమీస్‌లో సత్తా చాటిందన్న ఈ మాజీ ఓపెనర్.. పడిలేచిన కెరటంలా ఆస్ట్రేలియా తుదిమెట్టుకు చేరుకున్న తీరు అద్భుతమని ప్రశంసించాడు. ప్రపంచకప్ ఫైనల్ ఆడేందుకు ఈ రెండు జట్లు వందకు వందశాతం అర్హత కలిగినవే అని గావస్కర్ అభిప్రాయపడ్డాడు. అయితే, ఫైనల్లో భారత జట్టు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించకతప్పదని రోహిత్ సేనను హెచ్చరించాడు. పట్టువదలని విక్రమార్కుల్లా ఆఖరి వరకు పోరాడే ఆటగాళ్లున్న ఆస్ట్రేలియాతో పోటీ అంటే మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. కాగా సొంతగడ్డపై ప్రపంచకప్-2023 టోర్నీలో ఇప్పటి దాకా అపజయమన్నదే ఎరుగని టీమిండియా ఫైనల్లో కంగారూ జట్టుతో పోటీకి సిద్ధమైంది. కాగా ఆరంభ మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత వరుస విజయాలతో తుదిపోరుకు అర్హత సాధించింది. ముఖ్యంగా అఫ్గనిస్తాన్‌తో లీగ్ మ్యాచ్‌లో ఓడిపోవడం ఖాయమనుకున్న తరుణంలో.. ఆ జట్టు ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ అజేయ డబుల్ సెంచరీతో.. అనూహ్య విజయం అందించాడు. ఇక సౌతాఫ్రికాతో సెమీ ఫైనల్లో ఓపెనర్ ట్రవిస్ హెడ్ బ్యాట్‌తోనే కాకుండా బంతితోనూ మెరిసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. కీలక సమయాల్లో ఇలా ఎవరో ఒకరు అద్భుత ఆట తీరుతో గట్టెక్కించి ఆస్ట్రేలియాను ఇక్కడి దాకా తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఆసీస్.. ఆరో టైటిల్‌ను ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ ఇండియా టుడే మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా అద్భుతంగా ఆడుతోంది కాబట్టే టైటిల్ ఫేవరెట్‌గా ఉంది. కానీ ఆస్ట్రేలియన్లు అంత తేలికగ్గా తలవంచేవాళ్లు రకం కాదు. గ్లెన్ మాక్స్వెల్ ఆరోజు ఎలా ఆడాడో చూశాం కదా! ఆఖరి వరకు పట్టుదలగా నిలబడి జట్టును గెలిపించుకున్నాడు. దేశం కోసం గెలవాలన్న కసి వారిలో ఎంతగా ఉంటుందో మరోసారి నిరూపించాడు. కాబట్టి ఆసీస్‌ను తక్కువగా అంచనా వేస్తే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది’’ అని సునిల్ గావస్కర్ ఇండియా టుడేతో వ్యాఖ్యానించాడు. కాగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. -
బంగ్లాతో మ్యాచ్‌లో అతడిని ఎందుకు ఆడించారు? భారత జట్టు మేనెజ్మెంట్పై గవాస్కర్ ఫైర్
వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అదరగొడుతున్నాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ రెండు కీలక వికెట్లు పడగొట్టి తన మార్క్‌ను చూపించాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో 4 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. 10 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇది ఇలా ఉండగా.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రాను ఆడించాడన్ని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తప్పుబట్టాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు బుమ్రాకి విశ్రాంతి ఇచ్చి ఉంటే బాగుండేది అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. కాగా ఆదివారం ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో టీమిండియా తాడోపేడో తెల్చుకోనుంది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్‌లో గవాస్కర్ మాట్లాడుతూ.. గత రెండు మ్యాచ్‌ల నుంచి భారత జట్టు ఎటువంటి మార్పులు లేకుండా ఆడుతోంది. ఒకట్రెండు రోజుల్లో న్యూజిలాండ్ వంటి పెద్ద జట్టుతో టీమిండియా ఆడనుంది. కాబట్టి బంగ్లాతో మ్యాచ్‌కు బుమ్రాకి విశ్రాంతి ఇచ్చి ఉండాల్సింది. అయితే భారత జట్టుకు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు మూడు రోజుల విశ్రాంతి లభించింది. బహుశా అది సరిపోతుందని జట్టు మేనెజ్మెంట్ భావించి వుండవచ్చు. కానీ బుమ్రా గాయం నుంచి కోలుకుని వచ్చాడు కాబట్టి మరింత విశ్రాంతి అవసరమని" పేర్కొన్నాడు. కాగా కివీస్‌తో మ్యాచ్‌కు భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. చదవండి: ODI WC 2023 IND Vs BAN: కొంచెం కూడా ఓపిక లేదు.. అలా వికెట్లు పారేసుకుంటే ఎలా?: యువ బ్యాటర్లపై భారత దిగ్గజం ఫైర్ -
కొంచెం కూడా ఓపిక లేదు.. అలా వికెట్లు పారేసుకుంటే ఎలా?: టీమిండియా దిగ్గజం
ICC ODI WC 2023- Virat Kohli: టీమిండియా యువ బ్యాటర్లు శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ల ఆట తీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ మండిపడ్డాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకుని భారీ స్కోర్లు చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నారని విమర్శించాడు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్‌కు క్రీజులో నిలబడే ఓపిక ఉండటం లేదని.. విరాట్ కోహ్లిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ యువ ప్లేయర్‌కు చురకలు అంటించాడు. అయ్యర్‌తో పోలిస్తే గిల్ కాస్త నయమేనని.. అయితే, ఇలాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లలో ఫిఫ్టీలను సెంచరీలుగా మార్చడంపై మరింత దృష్టి సారించాలని గావస్కర్ సూచించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) వన్డే ప్రపంచకప్-2023లో పుణె వేదికగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయభేరి మోగించిన విషయం తెలిసిందే. తద్వారా వరల్డ్‌కప్ తాజా ఎడిషన్‌లో వరుసగా నాలుగో గెలుపు నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ కెరీర్లో 78వ సెంచరీ నమోదు చేశాడు. క్రీజులో నిలదొక్కుకుని ఓపికగా ఆడుతూ.. వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ తన వ్యక్తిగత స్కోరు పెంచుకోవడంతో పాటు.. జట్టును లక్ష్యానికి చేరువ చేశాడు. సిక్స్‌తో విజయలాంఛనం పూర్తి చేసి వన్డేల్లో 48వ శతకం పూర్తి చేసుకుని పలు అరుదైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఆరంభంలో నెమ్మదిగా ఆడినా తర్వాత వేగం పెంచి 53 పరుగులతో రాణించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) అయితే, బంగ్లా స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో మహ్మదుల్లాకు క్యాచ్ ఇవ్వడంతో గిల్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక గిల్ ఫర్వాలేదనిపించినా.. అయ్యర్ మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. మరో ఎండ్‌లో కోహ్లి తన అనుభవాన్ని రంగరించి అద్భుతంగా ముందుకు సాగుతున్న వేళ.. శ్రేయస్ అయ్యర్ మాత్రం 19 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ నాలుగో నెంబర్ బ్యాటర్ కూడా మిరాజ్ చేతికే చిక్కి చెత్త షాట్ సెలక్షన్‌తో వికెట్ సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘శ్రేయస్ అయ్యర్‌కు ఓపిక లేదు. 19 పరుగుల వద్ద ఉన్నపుడు తన వికెట్ పారేసుకున్నాడు. ఇక శుబ్‌మన్ గిల్ ఫిఫ్టీ(53) పూర్తి చేసుకున్న తర్వాత వికెట్ సమర్పించుకున్నాడు. ఇలాంటి టోర్నీల్లో సెంచరీ ఎలా చేయాలో అయ్యర్, గిల్ తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. అయితే, గిల్ ఇటీవల సెంచరీలు సాధించి ఫామ్‌లోనే కనిపిస్తున్నాడు. కానీ.. శ్రేయస్ అయ్యర్ నుంచి మంచి ఇన్నింగ్స్ కరువైంది. బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానంలో వచ్చిన ఆటగాడికి అప్పటికే పిచ్ గురించి ఒక అవగాహన వచ్చి ఉంటుంది. నిజానికి నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేయడం ఒకరకంగా సువర్ణావకాశం లాంటిదే. పరిస్థితులను అర్థం చేసుకుని ముందు సాగాలే తప్ప సహనం కోల్పోతే ఇలాగే వికెట్ పారేసుకోవాల్సి వస్తుంది’’ అని అయ్యర్ ఆట తీరును విమర్శించాడు. ఇక శతకాల వీరుడు కోహ్లి గురించి మాట్లాడుతూ.. ‘‘కోహ్లి ఎప్పుడూ ఇలా నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నది లేదు. జాగ్రత్తగా ఆడటం అతడికి అలవాటు. ప్రతిఒక్క క్రికెటర్‌కు ఉండాల్సిన లక్షణం ఇదే. 70-80 పరుగుల వద్ద ఉన్నపుడు సెంచరీ ఎందుకు చేయకూడదనే ఉద్దేశంతో ముందుకు సాగుతాడు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం సహా అనుకున్నది సాధించడం కోసం ఓపికగా ఎదురుచూస్తాడు. ప్రతిరోజూ.. ప్రతి మ్యాచ్‌లోనూ సెంచరీ చేసే అవకాశం రాదు కదా!’’ అని గావస్కర్.. కోహ్లిపై ప్రశంసల జల్లు కురిపించాడు. చదవండి: Virat Kohli: 78వ సెంచరీ! వాళ్ల వల్లే సాధ్యమైంది.. జడ్డూకు సారీ చెప్పాలి: కోహ్లి -
WC 2023: మీ నాన్న నేర్పించలేదా?: ఆసీస్ క్రికెటర్‌ను ప్రశ్నించిన గావస్కర్
ICC WC 2023- Aus Vs SL: వన్డే వరల్డ్‌కప్-2023లో శ్రీలంకపై విజయంతో హ్యాట్రిక్ ఓటమి ముప్పు నుంచి తప్పించుకుంది ఆస్ట్రేలియా. లక్నోలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో లంకను ఓడించి.. తాజా ఎడిషన్‌లో తొలి గెలుపు నమోదు చేసింది. కాగా ఆసీస్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక ఆరంభంలో అదరగొట్టినా.. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ కుప్పకూలడంతో 209 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా(4 వికెట్లు) దాటికి లంక బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. స్వల్ప లక్ష్య ఛేదనలో ఇలా క్రీజులోకి వచ్చి.. అలా పెవిలియన్‌కు వెళ్లిపోయారు. ఇక స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్ 51 బంతుల్లో 52 పరుగులతో రాణించగా.. నాలుగో నంబర్ బ్యాటర్ లబుషేన్ 40 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ అర్ధ శతకం(58) సాధించగా.. గ్లెన్ మాక్స్వెల్(31- నాటౌట్), మార్కస్ స్టొయినిస్(20-నాటౌట్) విజయలాంఛనం పూర్తి చేశారు. 5 వికెట్ల తేడాతో గెలుపొందిన కంగారూ తొలి విజయం అందుకోగా.. ఆడం జంపాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మీ నాన్న నీకు నేర్పించలేదా? అయితే, ఈ గెలుపుతో జంపాతో పాటు మార్ష్‌ది కూడా కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మార్ష్‌ను టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ ఫన్నీగా ట్రోల్ చేశాడు. ‘‘మీ నాన్న నీకెప్పుడూ ఇలా ఆడాలని నేర్పించలేదా’’ అంటూ డిఫెన్సివ్ షాట్ ఆడుతున్నట్లుగా ఫోజు పెట్టాడు. ఇందుకు స్పందించిన మార్ష్.. ‘‘మా నాన్న పూర్ స్ట్రైక్‌రేటును కప్పిపుచ్చేలా ఇలా నా వంతు ప్రయత్నం చేస్తున్నా’’ అని అంతే సరదాగా బదులిచ్చాడు. జెఫ్ మార్ష్ తనయుడే మిచెల్ కాగా మిచెల్ మార్ష్ మరెవరో కాదు.. ఆసీస్ మాజీ బ్యాటర్ జెఫ్ మార్ష్ కుమారుడు. గావస్కర్‌కు సమకాలీనుడైన జెఫ్ తన అంతర్జాతీయ వన్డే కెరీర్లో 117 మ్యాచ్‌లాడి.. 55.93 స్ట్రైక్‌రేటుతో 4357 పరుగులు సాధించాడు. ఇందులో 9 సెంచరీలు, 50 అర్ధ శతకాలు ఉన్నాయి. మరోవైపు.. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఇప్పటి వరకు 82 వన్డేల్లో 93.85 స్ట్రైక్‌రేటుతో 2290 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తండ్రి అలా.. కొడుకు ఇలా ఈ నేపథ్యంలో తండ్రీతనయులు స్ట్రైక్‌రేటును ఉద్దేశించి గావస్కర్ సరదాగా కామెంట్ చేయగా.. మార్ష్ బదులిచ్చిన తీరు అభిమానులను ఆకర్షిస్తోంది. ఇక లంకపై విజయం గురించి మార్ష్ మాట్లాడుతూ.. ఇంగ్లిస్ ఓ యోధుడని.. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగల సత్తా ఉన్నవాడని ప్రశంసించాడు. భవిష్యత్తులో అతడు మరింత గొప్ప ఇన్నింగ్స్ ఆడాలని ఆకాంక్షించాడు. చదవండి: టీమిండియాతో మ్యాచ్.. బంగ్లాదేశ్‌కు భారీ షాక్! Sunil Gavaskar- "Did your father not teach you to bat like this (gestures playing a defensive shot)?" Mitch Marsh- "I am making up for his poor strike rate." pic.twitter.com/P4GuLGFCa6 — Rohit Yadav (@cricrohit) October 16, 2023 -
'భారత్, ఆసీస్, పాక్ కాదు.. ఆ జట్టే వరల్డ్‌కప్ టైటిల్ ఫేవరేట్'
వన్డే ప్రపంచకప్-2023 మహా సంగ్రామానికి సమయం అసన్నమైంది. ఆక్టోబర్ 5 అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్- ఇంగ్లండ్ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఇప్పటికే భారత గడ్డపై అడుగు పెట్టిన ఆయా జట్లు వామాప్ మ్యాచ్‌ల్లో బీజీబీజీగా ఉన్నాయి. ఇక బారత జట్టు తమ వామాప్ మ్యాచ్‌లో సెప్టెంబర్ 30న గౌహుతి వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌తో తలపడనుంది. అదే విధంగా ఆక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్‌తో టీమిండియా తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఇక ఇది ఇలా ఉండగా.. వన్డే ప్రపంచకప్ టైటిల్ ఫేవరేట్‌ను భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఎంచుకున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న ఇంగ్లండ్ మరోసారి టైటిల్‌ను సొంతం చేసుకుందని గవాస్కర్ జోస్యం చెప్పాడు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన గవాస్కర్ ప్రపంచ కప్ గెలవడానికి ఇంగ్లండ్‌కు అన్నిరకాల అర్హతలున్నాయని సన్నీ చెప్పాడు. కాగా 2019 ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. "నావరకు అయితే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ తమ వద్దే ట్రోఫీని ఉంచుకుంటుంది. ఇంగ్లండ్ బ్యాటింగ్ విభాగంలో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. అదే విధంగా బ్యాట్, బంతితో మ్యాచ్ స్వరూపాన్నే మార్చగల ముగ్గురు వరల్డ్ క్లాస్ ఆల్‌రౌండర్లు ఉన్నారు. అంతేకాకుండా మార్క్ వుడ్, అదిల్ రషీద్ వంటి సీనియర్ బౌలర్లు కూడా ఉన్నారు. కాబట్టి మళ్లీ ఇంగ్లండ్ జట్టే టైటిల్ ఫేవరేట్" అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. చదవండి: World Cup 2023: బ్యాడ్ లక్కు బ్రాండ్ అంబాసిడర్ దక్షిణాఫ్రికా.. ప్రొటీస్‌కు కలిసిరాని వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఇవే! -
అయ్యర్ అదరగొడుతున్నాడు.. సూర్యకు జట్టులో చోటు కష్టమే: గవాస్కర్
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. మూడు వన్డేల్లో రెండు హాఫ్ సెంచరీలతో సూర్య చెలరేగాడు. వన్డేల్లో పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న సూర్యకుమార్.. ఆసీస్ సిరీస్‌తో తిరిగి గాడిలో పడ్డాడని చెప్పుకోవాలి. ముఖ్యంగా వరల్డ్‌కప్‌కు ముందు సూర్య ఈ తరహా ప్రదర్శన చేయడం భారత జట్టుకు సానుకూలాంశం. ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌ను ఉద్దేశించి భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో సూర్య అద్భుతంగా రాణించినప్పటికీ.. తుది జట్టులో చోటు దక్కడం చాలా కష్టమని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. "వన్డే క్రికెట్లో సూర్యకుమార్ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. అతడు చివరి 15 నుంచి 20 ఓవర్లలో మాత్రమే బ్యాటింగ్ చేయగలడు. ఆ సమయంలో టీ20 ఫార్మాట్ మాదిరిగా ఆడుతాడు. టీ20ల్లో అద్భుతమైన ఆటగాడనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ హార్దిక్, రాహుల్, ఇషాన్ కూడా ఆఖరి ఓవర్లలో అద్భుతంగా రాణించగలరు. కాబట్టి సూర్యకుమార్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం చాలా కష్టం. ఇప్పటికే నాలుగో స్ధానంలో శ్రేయస్ అయ్యర్ అదరగొడుతున్నాడు. ఒకవేళ నెంబర్ 4లో సూర్యకు అవకాశం లభిస్తే భారీ శతకం సాధించి తనకు తను నిరూపించుకోవాలి. అప్పుడే అతడిపై జట్టు మేనెజ్మెంట్ నమ్మకం ఉంచుతుందని" ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు. చదవండి: ODI WC 2023: కోహ్లిని ఔట్ చేయడానికి ఐదు బంతులు చాలు.. పసికూన బౌలర్ వార్నింగ్ -
అతడి ఆట ముందు గిల్ శతకం కూడా చిన్నబోయింది: టీమిండియా దిగ్గజం
ICC World Cup 2023- Shreyas Iyer: ‘‘వరల్డ్ కప్‌నకు ముందు ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యను పరిష్కరించుకునేందుకు ఇండోర్ మ్యాచ్ భారత్‌కు ఉపకరించింది. ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన స్థితిలో నిలిచిన శ్రేయస్ అయ్యర్ ఒక చక్కటి ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. అతని ఆట ముందు గిల్ శతకం(104) కూడా చిన్నబోయినట్లు అనిపించింది. అర్ధరాత్రి నిద్రలో నుంచి లేపి బ్యాటింగ్ చేయమన్నా సరే తడబడకుండా ఆడే ఫామ్‌లో ఉన్న గిల్‌ను అయ్యర్ వెనక్కి తోసిన తీరు ఈ ఇన్నింగ్స్ ప్రత్యేకతను చూపించింది. ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఇలాంటి సమన్వయం ఉండటం భవిష్యత్తులో భారత క్రికెట్‌కు ఎంతో మేలు చేస్తుంది. జట్టులో తన స్థానం గురించి రేకెత్తిన అన్ని సందేహాలను పటాపంచలు చేసే ఉద్దేశ్యంతో అయ్యర్ బ్యాటింగ్‌కు దిగాడు. అతను కొన్ని ఆకట్టుకునే షాట్లు ఆడిన తీరు సాధారణంగా ముభావంగా కనిపించే కోచ్ ద్రవిడ్ ముఖంపై కూడా చిరునవ్వులు పూయించింది. గిల్ ఎప్పటిలాగే ఒక్క పొరపాటు లేని ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ ద్వారా భారత్‌కు మేలు చేసిన మరో అంశం అశ్విన్ బౌలింగ్. అతని గురించి సెలక్టర్లు ఏం ఆలోచిస్తున్నారో మరో ఒకటి రెండు రోజుల్లో తేలిపోతుంది. కానీ మొహాలీతో పోలిస్తే ఈ మ్యాచ్‌లో అతని బౌలింగ్ మరింత మెరుగ్గా కనిపించింది. వరల్డ్ కప్‌కు ముందు తమ ఆటను సానుబెట్టుకునేందుకు భారత సీనియర్లకు రాజ్‌కోట్ వన్డే అవకాశం కల్పిస్తోంది. మరోవైపు దక్షిణాఫ్రికా నుంచి మొదలైన పరాజయాలకు ఎలా విరామం ఇవ్వాలో తెలియక ఆస్ట్రేలియా జట్టు పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తోంది’’ అని టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ అన్నాడు. వన్డే ప్రపంచకప్-2023 టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ భారత క్రికెటర్లకు ఉపకరిస్తుందని పేర్కొన్నాడు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ పుంజుకున్న తీరు అమోఘమని.. అద్భుత ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడని కొనియాడాడు. కాగా ఇప్పటికే మొహాలీ, ఇండోర్లలో గెలిచిన టీమిండియా.. బుధవారం రాజ్‌కోట్ వేదికగా నామమాత్రపు మూడో వన్డేకు సిద్ధమైంది. ఇక రెండో వన్డేలో శ్రేయస్ అయ్యర్ తన వరుస వైఫల్యాలకు తెరదించుతూ 90 బంతుల్లో 105 పరుగులతో మెరిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన అయ్యర్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. చదవండి: పరుగుల సునామీ.. ఏకంగా 8 సిక్సర్లు.. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. యువీ రికార్డు బ్రేక్ Mohali ✅ Indore ✅#TeamIndia arrive ✈️ for the third and the final ODI in Rajkot 👌#INDvAUS pic.twitter.com/pIrDvPFNyB — BCCI (@BCCI) September 25, 2023 -
ఆ ఇద్దరి ఆట ఆకట్టుకుంది
భారత స్టార్ ఆటగాళ్లకు తొలి రెండు మ్యాచ్‌లకు విశ్రాంతి ఇవ్వడంతో ఆ్రస్టేలియాతో తొలి వన్డేలో ఫలితం ఎలా ఉంటుందోనని నాతోపాటు పలువురు ఆందోళన చెందారు. కానీ టీమిండియా సులభంగా విజయం సాధించడంతో సంతోషపడ్డ వారిలో నేనూ ఉన్నాను. ఇక రెండో వన్డేలో ఆ్రస్టేలియా గెలిచి సిరీస్‌ను సమం చేస్తే...రాజ్‌కోట్‌లో జరిగే చివరిదైన మూడో వన్డే మ్యాచ్‌కు స్టార్ ఆటగాళ్లతో భారత్ పూర్తిస్థాయి బలగంతో బరిలోకి దిగుతుంది. రోహిత్, కోహ్లిలాంటి ఇద్దరు అనుభవజు్ఞలైన బ్యాటర్లు లేకపోయినా భారీ లక్ష్యాన్ని ఛేదించే సత్తా తమలో ఉందని తాజా గెలుపుతో కేఎల్ రాహుల్ బృందం నిరూపించింది. భారత భవిష్యత్‌కు ఢోకా లేదని చాటింది. టి20 తరహాలో కాకుండా నేర్పుగా ఆడి రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీలు సాధించడం ఆనందం కలిగించింది. గతంలో వారికి కొన్ని అవకాశాలు లభించినా టి20 తరహాలో దూకుడుగా ఆడి తమ వికెట్లను సమర్పించుకున్నారు. కానీ ఈసారి ఈ ఇద్దరూ సంయమనంతో ఆడి అలరించారు. శుబ్‌మన్ గిల్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు. సొంత మైదానంలో తొలి అంతర్జాతీయ సెంచరీ సాధిస్తాడనుకున్న దశలో అవుటవ్వడం నిరాశ కలిగించింది. మొహమ్మద్ షమీ బంతితో నిప్పులు చెరగడం ఆకట్టుకుంది. దాంతో కోచ్, కెపె్టన్ తుది జాబితాలో ముగ్గురు పేసర్లను ఆడించే విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తారు. వికెట్లు తీసే బౌలర్లను ఆడిస్తే వారు ప్రత్యర్థి బ్యాటర్లు తొందరగా పరుగులు చేయకుండా నియంత్రిస్తారు. సమష్టి ఆటతీరుతో ఆకట్టుకోవడంతో సమీపంలో భారత క్రికెట్ మరిన్ని గొప్ప విజయాలు సాధిస్తుందనే నమ్మకం పెరిగింది. -
కాశీ విశ్వనాథుని దర్శించుకున్న టీమిండియా దిగ్గజాలు.. వీడియో వైరల్
Varanasi International Cricket Stadium: ‘క్రికెట్ దేవుడు’ సచిన్ టెండుల్కర్ కాశీ విశ్వనాథుని దర్శించుకున్నాడు. స్వామివారికి అభిషేకం చేసి భక్తిభావం చాటుకున్నాడు. కాగా ఉత్తరప్రదేశ్‌లోని చారిత్రాత్మక నగరం వారణాసిలో అంతర్జాతీయస్థాయి స్టేడియం నిర్మించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సమాయత్తమైన విషయం తెలిసిందే. కాశీ విశ్వేశ్వరుడు కొలువైన ఈ ఆధ్యాత్మిక నగరంలో శివతత్వం ఉట్టిపడేట్లుగా సీటింగ్ స్థలం అర్ధ చంద్రాకారంలో.. ఫ్లడ్లైట్స్ త్రిశూలాన్ని స్ఫురించేలా.. ఎంట్రీ ఢమరుకాన్ని పోలి ఉండేలా నిర్మించనున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ స్టేడియానికి శనివారం శంకుస్థాపన చేశారు. కాశీ విశ్వనాథునిరి టీమిండియా దిగ్గజాల అభిషేకం ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజాలు.. వరల్డ్‌కప్ విజేతలు కపిల్ దేవ్, సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్ ఇప్పటికే వారణాసికి చేరుకున్నారు. వీరితో పాటు బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా అక్కడికి వెళ్లారు. వీరంతా కలిసి విశ్వనాథుని దర్శించుకుని పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా వారణాసి స్టేడియం నిర్మాణం డిసెంబరు 2025 నాటికి పూర్తికానున్నట్లు సమాచారం. దీంతో యూపీలోని లక్నోలో గల భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియం, కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ క్రికెట్ స్టేడియం తర్వాత మూడో స్టేడియంగా ఇది చరిత్రలో నిలిచిపోనుంది. వారణాసి స్టేడియం నిర్మాణానికి సుమారు 451 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. #WATCH | Uttar Pradesh: Former Indian cricketers Sachin Tendulkar Sunil Gavaskar and Kapil Dev, BCCI Secretary Jay Shah, Rajeev Shukla, BCCI Vice-President, offered prayers at Kashi Vishwanath temple in Varanasi (Video source - PRO Vishwanath Temple) pic.twitter.com/pWc1qWmOqR — ANI (@ANI) September 23, 2023 -
IND vs AUS: పూర్తి స్థాయి జట్టుతో ఆడాల్సింది.. సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు
స్వదేశంలో ఆస్ట్రేలియాతో కీలక పోరుకు టీమిండియా సిద్దమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం మొహాలీ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్ సిరీస్‌లో భారత్ పూర్తి స్థాయి జట్టుతో ఆడాల్సిందని గావస్కర్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ, హార్దిక్ , కోహ్లిలకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. "మరో పక్షం రోజుల్లో ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ్రస్టేలియాతో జరిగే పోరును ఒక ద్వైపాక్షిక సిరీస్‌లా కాకుండా వామప్ మ్యాచ్‌ల తరహాలోనే భారత్ చూస్తున్నట్లుగా అనిపిస్తోంది. భారత జట్టు ఎంపికను చూస్తే వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. రోహిత్, కోహ్లి, పాండ్యాలాంటి వారిని పక్కన పెట్టడంతో బ్యాటింగ్ బాగా బలహీనంగా మారిపోయింది. వరల్డ్‌కప్‌కు ముందు జాగ్రత్త కోసం బౌలర్లకు విశ్రాంతినిచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. స్వదేశంలో గత రెండు వన్డే సిరీస్‌లను కూడా ఆ్రస్టేలియానే గెలుచుకుంది. అలాంటప్పుడు ప్రపంచకప్‌కు ముందు జరిగే ఈ సిరీస్‌లో గెలిస్తే టీమిండియా మరింత ఉత్సాహంతో ప్రపంచకప్ బరిలోకి దిగేది. సీనియర్లు లేకపోవడం వల్ల ఆ అవకాశం తగ్గిందనేది వాస్తవం. ఇలాంటి సిరీస్‌ను తక్కువ చేసి చూడటం భారత అభిమానులను నిర్ఘాంతపరిచేదే. ఆ్రస్టేలియా జట్టు ప్రపంచకప్ ఫేవరెట్లలో ఒకటని అంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. ఆసియా కప్ గెలిచిన జోరులో అలాంటి జట్టును భారత్ ఓడిస్తే ఎంతో బాగుండేది. అలా కాకుండా ఇప్పుడు ఆసీస్ గెలిస్తే వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై సీనియర్లకు విశ్రాంతినిస్తే ఏం జరిగిందో చూశాం. వరల్డ్‌కప్ జట్టులోకి ఎంపికైన అక్షర్ పటేల్ సమయానికి కోలుకోకపోతే అశి్వన్, వాషింగ్టన్ సుందర్‌లలో ఎవరికి అవకాశం లభిస్తుందో చూడాలి. ఈ సిరీస్‌లో బాగా ఆడితే తుది జట్టులో తమ స్థానం కోసం షమీ, శార్దుల్ కూడా పోటీ పడవచ్చు. శ్రేయస్ అయ్యర్ కూడా తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని నిరూపించుకోవాలి. వరల్డ్‌కప్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ సిరీస్ కోసం జట్టును సెలక్టర్లు ఎంపిక చేసి ఉండవచ్చు. వచ్చే సోమవారం జరిగే బీసీసీఐ ఏజీఎం సమయానికి ఆసీస్ సిరీస్ గెలవరాదని వారు కోరుకోవాలని గావస్కర్ పేర్కొన్నాడు. -
సచిన్ కంటే ఇంజమామ్ గొప్ప.. కోహ్లి కంటే బాబర్ బెటర్.. ఏంటిది? చెత్తగా..
Asia Cup 2023- ICC ODI WC 2023: పాకిస్తాన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ల తీరుపై టీమిండియా మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ మండిపడ్డాడు. ప్రతి ఒక్కరూ భారత జట్టు కూర్పుపై తమ అభిప్రాయాలు రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని.. వాళ్ల ఉచిత సలహాలు టీమిండియాకు అవసరం లేదని ఘాటుగా విమర్శించాడు. అదే విధంగా.. తమ అభిమానులకు మెరుగైన ఆటతో సంతృప్తిపరచలేక భారత క్రికెటర్లతో పోల్చుకుంటూ తామే గొప్ప అని చెప్పుకోవడం పాక్ ఆటగాళ్లకు అలవాటైపోయిందని గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అలాంటి వాళ్లకు స్థానిక మీడియాలో ఎక్కువ ప్రచారం కల్పించడం సరికాదంటూ హితవు పలికాడు. టీమిండియా సెలక్షన్‌పై పెదవి విరుపులు కాగా ఆసియా కప్, వరల్డ్‌కప్ ఈవెంట్లకు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు గురించి ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయాలు వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వన్డేల్లో మెరుగైన రికార్డు లేని సూర్యకుమార్ యాదవ్ వంటి బ్యాటర్లను ఎందుకు ఎంపిక చేశారంటూ ఆస్ట్రేలియా దిగ్గజం టామ్ మూడీ తదితరులు విమర్శించారు. భారత జట్టు భయపడుతోందంటూ ఇదిలా ఉంటే.. ఆసియా కప్ వేదిక మార్పుల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ నజామ్ సేథీ.. పాకిస్తాన్‌తో తలపడేందుకు టీమిండియా భయపడుతోందంటూ అడ్డగోలు వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ టుడేతో మాట్లాడిన సునిల్ గావస్కర్.. ఇలాంటి వాళ్ల చెత్త సలహాలు మనకు అవసరమా అంటూ విమర్శించాడు. సునిల్ గావస్కర్ సచిన్ కంటే ఇంజమామ్ గొప్పా? ఏంటిదంతా? ‘‘కొంతమంది బయటి వ్యక్తులు.. ముఖ్యంగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా ప్రముఖులు టీమిండియా సెలక్షన్లో దూరిపోవాలని తహతహలాడుతూ ఉంటారు. ఏవేవో సలహాలు ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు మీడియా కూడా ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు. మన జట్టు గురించి వాళ్లకు ఆందోళన ఎందుకు? వాళ్లకు అవసరం లేని విషయాల్లో తలదూర్చడం ఏమిటో? కానీ మనం వాళ్లను సహిస్తున్నాం. ఇక.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కంటే బాబర్ ఆజం బెటర్.. షాహిన్ ఆఫ్రిది లాంటి పేసర్ లేడు.. సచిన్ టెండుల్కర్ కంటే ఇంజమామ్ ఉల్ హక్ బెటర్.. ఇలాంటివి తరచుగా మనకు వినిపిస్తూ ఉంటాయి. అలా చెప్పుకొంటూ పబ్బం గడుపుతూ వాళ్ల దృష్టిలో తామెల్లప్పుడూ... టీమిండియా క్రికెటర్ల కంటే మెరుగే అనుకుంటారు. అలా చెప్పుకొంటూ తమ అభిమానులను అలరిస్తూ ఉంటారు’’ అని గావస్కర్ చురకలు అంటించాడు. కాగా ఆసియా కప్-2023లో భాగంగా టీమిండియా- పాకిస్తాన్ మధ్య కొలంబోలో ఆదివారం మ్యాచ్ జరుగనుంది. చదవండి: పాకిస్తాన్‌తో మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్! బుమ్రా వచ్చేశాడు -
అనవసర చర్చలు ఆపండి.. ఆ స్ధానంలో కోహ్లినే సరైనోడు: సునీల్ గవాస్కర్
ప్రపంచ క్రికెట్లో బిగ్గెస్ట్ ఫైట్ మరికొన్ని గంంటల మాత్రమే మిగిలి ఉంది. ఆసియాకప్-2023లో భాగంగా శనివారం చిరకాల ప్రత్యర్ధిలు భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. దాయాదుల పోరుకు శ్రీలంకలోని పల్లెకెలె మైదానం వేదికైంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో అతృతగా ఎదరుచూస్తున్నారు. కాగా పాకిస్తాన్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిని నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు పంపాలని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. పాక్‌తో మ్యాచ్‌కు కేఎల్ రాహుల్ దూరం కావడంతో వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్‌ను తుది జట్టులోకి తీసుకోవడం దాదాపు ఖాయమైంది. అయితే కిషన్‌కు మిడిలార్డర్ బ్యాటింగ్ చేసిన అనుభవం లేకపోవడంతో అతడు రోహిత్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే రెగ్యూలర్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను మూడో స్ధానంలో, కోహ్లిని నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు పంపాలని పలువరు సూచిస్తున్నారు. సాధారణంగా కోహ్లి ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తుంటాడు. ఇక ఇదే భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఎట్టిపరిస్ధితుల్లోనూ కోహ్లీ బ్యాటింగ్ స్థానం మార్చకూడదని గవాస్కర్ తెలిపాడు."విరాట్ కోహ్లి ఒక అద్భుతమైన ఆటగాడు. అటువంటి అత్యుత్తమ ప్లేయర్‌కు ఎక్కువ ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాలి. కోహ్లి మూడో స్ధానంలో వస్తేనే గరిష్ట సంఖ్యలో ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశం లభిస్తుంది. అతడికి ఆ స్ధానంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. అతడు ఆపోజిషేన్లో బ్యాటింగ్‌కు వచ్చి దాదాపు 43 సెంచరీలు సాధించాడు. అంతేకాకుండా ఛేజింగ్‌లో ఒంటి చేత్తో విజయాలు అందించిన సందర్భాలు ఉన్నయి. ఇంతగా విజయవంతమైన ఆటగాడి బ్యాటింగ్ ఆర్డర్ మార్చాల్సిన అవసరం లేదు అని ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు. చదవండి: Asia Cup 2023: పాక్ స్టార్ బౌలర్‌ను కలిసిన విరాట్ కోహ్లి.. టీ20 ప్రపంచకప్ రిపీట్ అవుతుందా? -
Asia Cup 2023: భారత్, పాకిస్తానే కాదు.. ఆ జట్టు కూడా చాలా డేంజరస్!
ఆసియాకప్-2023 బుధవారం(ఆగస్టు 30)తో ప్రారంభమైంది. ముల్తాన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో నేపాల్‌ను పాకిస్తాన్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో 238 పరుగుల తేడాతో పాక్ ఘన విజయం సాధించింది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఇక ఈ టోర్నీలో క్రికెట్ అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్న దాయాదుల పోరుకు సమయం అసన్నమైంది. సెప్టెంబర్ 2న కాండీ వేదికగా చిరకాల ప్రత్యర్థిలు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇక ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. "ఆసియాకప్‌లో అందరూ భారత్-పాకిస్తాన్ మధ్య పోటీ గురించే మాట్లాడతున్నారు. కానీ ఈ టోర్నీలో శ్రీలంక కూడా ఆడుతుందన్న విషయం మర్చిపోకుడదు. గత ఏడాది ఆసియాకప్‌ను లంకనే సొంతం చేసుకుంది. కాబట్టి ఈ మూడు దేశాల మధ్య పోటీ ఎప్పుడూ ప్రత్యేకమే" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. ఇక శ్రీలంక తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 31న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అయితే ఈ టోర్నీకి వనిందు హసరంగా, చమీరా, అవిష్క ఫెర్నాండో వంటి స్టార్ ఆటగాళ్లు దూరమయ్యారు. చదవండి: బాబర్ చాలా సింపుల్‌గా ఉంటాడు.. కానీ బ్యాటింగ్ మాత్రం అద్భుతం: భారత మాజీ క్రికెటర్ -
అప్పుడు ఇండియా- ఇంగ్లండ్ సిరీస్... ఆనాటి అనుభూతి మళ్లీ ఇప్పుడు: గావస్కర్
మరో పది, పదిహేనేళ్లలో దేశం క్రీడా భారత్‌గా ఎదుగుతుందని క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అన్నాడు. చెస్‌లో ప్రజ్ఞానంద, బ్యాడ్మింటన్‌లో ప్రణయ్, అథ్లెటిక్స్‌లో నీరజ్ చోప్రా ప్రపంచ వేదికల్లో పతకాలతో మెరిశారు. ఈ విషయంపై స్పందించిన సునిల్ గావస్కర్.. ‘‘గతంలో కొన్ని క్రీడలే భారత్‌లో వెలుగొందేవి. అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. చెస్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ తదితర క్రీడలకు కవరేజీ, ప్రేక్షకాదరణ బాగా పెరిగాయి’’ అని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా చారిత్రాత్మక విజయాన్ని గుర్తుచేసుకుంటూ.. ‘‘అప్పుడు ఇండియా- ఇంగ్లండ్ సిరీస్ నడుస్తోంది. నేను ఇంగ్లండ్ నుంచే నీరజ్ ఆటను చూశాను.. మేరే దేశ్ కీ ధర్తీ సోనా ఉగ్లే అని పాడుకునేంతలా అతడు నన్ను ఆకట్టుకున్నాడు. ఆదివారం నాటి జావెలిన్ త్రో ఫైనల్స్ సందర్భంగానూ అచ్చంగా అదే అనుభూతిని పొందాను. రెండేళ్ల క్రితం నీరజ్ ఒలింపిక్స్‌లో పసిడి పతకం గెలిచాడు. గతేడాది వరల్డ్ అథ్లెటిక్స్‌లో రజతంతో సరిపెట్టుకున్నాడు. అయితే, ఈసారి తన అద్భుతమైన త్రోతో స్వర్ణం సాధించాడు’’ అని గావస్కర్ హర్షం వ్యక్తం చేశాడు. ఇక బ్యాడ్మింటన్ ప్రపంచంలో ప్రణయ్ అద్భుతంగా రాణిస్తున్నాడని గావస్కర్ ప్రశంసించాడు. చాలా మంది అమెరికా, ఆస్ట్రేలియాలను క్రీడా దేశాలుగా భావిస్తారని.. రానున్న 10- 15 ఏళ్లలో భారత్ కూడా స్పోర్టింగ్ కంట్రీగా ఎదుగుతుందని జోస్యం చెప్పాడు. -
అందుకే చాహల్‌కు జట్టులో చోటివ్వలేదు.. ఆ విషయంలో కుల్దీప్ బెటర్!
ఆసియాకప్ 2023కు భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. ఈ మెగా టోర్నీ కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపికచేశారు. సుదీర్ఘ కాలంగా గాయాలతో బాధపడుతున్న శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు. మరోవైపు ఇప్పటి వరకు ఇంకా వన్డేల్లో అరంగేట్రం చేయని హైదరాబాదీ తిలక్ వర్మకు కీలకమైన ఆసియా కప్ జట్టులో చోటు దక్కడం గమానార్హం. ఇక టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజువేంద్ర చహల్‌కు ఆసియాకప్ జట్టులో చోటు దక్కకపోవడం అందరినీ ఆశ్యర్యపరిచింది. అతడి స్ధానంలో కుల్దీప్ యాదవ్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపారు. ఈ క్రమంలో చాహల్‌ను కాదని కుల్దీప్ యాదవ్‌ను ఎందుకు ఎంచుకున్నారనే దానిపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. కుల్దీప్ బ్యాట్‌తో కూడా రాణించగలడని, అందుకే చహల్‌ను కాదని అతడిని ఎంపిక చేశారని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. "విండీస్ సిరీస్‌లో సంజు శాంసన్ ఎక్కువ పరుగులు చేసి ఉంటే అతడు ఖచ్చితంగా ఈ జట్టులో ఉండేవాడు. అలాగే చాహల్ కూడా వికెట్లు పడగొట్టి ఉంటే జట్టులో అవకాశం దక్కి ఉండేది. అయితే కొన్ని సార్లు జట్టును బ్యాలెన్స్ చేయాలంటే కొంతమందిపై వేటుపడక తప్పదు. కుల్దీప్కు లోయార్డర్‌లో బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. ఈ కోణంలోనే సెలక్టర్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా కుల్దీప్ చైనామన్ బౌలర్ కూడా కావడం అతడికి కలిసొచ్చింది. అందుకే చహల్‌ను కాదని కుల్దీప్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపారాని" గవాస్కర్ ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. చదవండి: Yuzvendra Chahal: అందుకే అతడికి జట్టులో చోటివ్వలేదు.. స్పందించిన చహల్! అప్పుడు రోహిత్.. -
'డబ్బు, అహంకారంతో'.. భారత ఆటగాళ్లపై కపిల్ దేవ్ ఆగ్రహం
ప్రస్తుతమున్న క్రికెటర్లపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ విమర్శలు గుప్పించారు. తమకు అంతా తెలుసని వారు అనుకుంటుంటారని చెప్పాడు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం ఉండటం మంచి విషయమేనని... అయితే ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకుందామనే తపన వారిలో కొరవడటం నెగెటివ్ పాయింట్ అని అన్నాడు. ఇలా తయారు కావడానికి ప్రధానంగా డబ్బు, పొగరు, అహం అనే మూడు అంశాలే కారణమని తెలిపాడు. మైదానంలో సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజం ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడి సలహాలను తీసుకోవడానికి వీరికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. 50 సీజన్ల (సంవత్సరాలు) క్రికెట్ ను చూసిన గవాస్కర్ తో మాట్లాడేందుకు వీరికి నామోషీ ఎందుకని అడిగారు. తమకు అంతా తెలుసుని వారు అనుకుంటుంటారని... వాస్తవానికి వారికి అంతా తెలియదని చెప్పారు. ''అప్పటి, ఇప్పటి ఆటగాళ్లలో వ్యత్యాసం ఉండడం సహజమే. ప్రస్తుత తరం ప్లేయర్లలో గొప్ప విషయం ఏంటంటే వారంతా ఆత్మవిశ్వాసంతో ఆడటం. నెగటివిటీని పట్టించుకోరు.ఇదే సమయంలో మేం ఎవరిని ఏమి అడగాల్సిన అవసరం లేదనుకుంటారు'' అంటూ తెలిపాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌తో పాటు కాసులు కురిపించే ఐపీఎల్లో ఒక్క సీజన్ ఆడినా చాలు భారీ మొత్తంలో డబ్బులు దక్కించుకోవచ్చనే భ్రమలో ఆటగాళ్లు బతికేస్తున్నారు. ఏదో ఒకరోజు తిరిగి వారికే దెబ్బకొట్టే అవకాశముందని.. ఈ తరం ఆటగాళ్లు డబ్బు, అహంకారంతో బతికేస్తున్నారని కపిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చదవండి: #SackRahulDravid: 'లాభం కంటే నష్టమే ఎక్కువ.. తక్షణమే ద్రవిడ్‌ను తొలగించండి' ప్రీ మెచ్యూర్ బేబీ.. ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టం! అయినా క్రికెట్ ప్రపంచంలో రారాజు -
వారి మ్యాచ్ ఫీజులు పెంచండి.. లేదంటే చాలా కష్టం: భారత మాజీ కెప్టెన్
ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్.. ఇప్పుడు ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. మొన్నటికి మొన్న వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో విఫలమైన విండీస్ జట్టు.. ప్రస్తుతం భారత్‌తో జరగుతోన్న టెస్టు సిరీస్‌లో కూడా అదే తీరును పునరావృతం చేస్తోంది. డొమినికా వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో కరేబియన్ జట్టు ఘోర ఓటమి చవిచూసింది. రెండు సార్లు వన్డే, టీ20 ప్రపంచకప్‌లను ముద్దాడిన విండీస్ జట్టు.. ప్రస్తుతం ఒక్క మ్యాచ్‌లోనైనా గెలుస్తే చాలు అన్న స్ధితికి దిగజారింది. విండీస్ క్రికెట్‌కు ఈ పరిస్థితి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యం కారణం వారి వార్షిక వేతనాలతో పాటు మ్యాచ్ ఫీజ్‌లు తక్కువ ఉండటమే. దీంతో చాలా మంది ఆటగాళ్లు తమ దేశం తరపున కాకుండా ఫ్రాంచైజీ లీగ్‌లకే ఎక్కువ ప్రాధన్యత ఇస్తున్నారు. అందులో సునీల్ నరైన్, అండ్రీ రస్సెల్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ముందు వరుసలో ఉంటారు. ఇక ఇదే విషయంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వాఖ్యలు చేశారు. తమ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులు పెంచి, సెంట్రల్ కాంట్రాక్ట్‌లను తగ్గించాలని విండీస్ క్రికెట్ బోర్డుకు సునీల్ గవాస్కర్ సలహా ఇచ్చాడు. "వెస్టిండీస్ క్రికెటర్లకు మినహా ప్రపంచంలోని మిగితా ఆటగాళ్లందరకి ఆయా క్రికెట్ బోర్డులు సెంట్రల్ కాంట్రాక్ట్‌లతో పాటు ఫీజుల రూపంలో లక్షల డాలర్లు చెల్లుస్తున్నాయి. అదే విధంగా వారి క్రికెటర్లకు అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నాయి. కానీ విండీస్ పరిస్ధితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇది కూడా వారి ప్రదర్శన సరిగా లేకపోవడానికి ప్రధాన కారణమవ్వచ్చు. కాబట్టి విండీస్ క్రికెట్‌కు నేను ఇచ్చే సలహా ఒక్కటే. ఆటగాళ్లకు ఇచ్చే సెంట్రల్ కాంట్రక్ట్లను తగ్గించి మ్యాచ్ ఫీజ్‌లు పెంచండి. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో మ్యాచ్ ఫీజ్‌లు పెంచితే.. విండీస్ తమ పూర్వ వైభవాన్ని పొందే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్ ఫీజులు పెంచితే ఆటగాళ్ల వ్యక్తగత ప్రదర్శనలో కూడా మార్పు రావచ్చు. లేదంటే భవిష్యత్తులో విండీస్ క్రికెట్‌కు మరిన్ని కష్టాలు ఎదురవతాయి" అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. చదవండి: IND vs WI: టీమిండియాతో రెండో టెస్టు.. వెస్టిండీస్ జట్టు ప్రకటన! యువ సంచలనం ఎంట్రీ -
0-4తో వైట్‌వాష్‌కు గురైనా కెప్టెన్‌ను మార్చలేదు: గావస్కర్ ఘాటు వ్యాఖ్యలు
Sunil Gavaskar Comments: టీమిండియా నవతరం కెప్టెన్లను ఉద్దేశించి దిగ్గజ సారథి సునిల్ గావస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. జట్టు బాగా ఆడకపోయినా, చెత్తగా ఓడినా తమకు వచ్చే నష్టమేమీ లేదన్నట్లు వ్యవహరిస్తారని పేర్కొన్నాడు. కెప్టెన్‌గా తమ స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదన్నట్లు హాయిగా ఉంటారని పరోక్షంగా ఐసీసీ టైటిళ్ల కెప్టెన్‌ను ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించాడు. మూడు టైటిళ్లతో కాగా 2013 తర్వాత టీమిండియా ఇంతవరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. 1983లో కపిల్ డెవిల్స్ వన్డే వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత 2011లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని భారత జట్టు మరోసారి 50 ఓవర్ల ఫార్మాట్లో చాంపియన్‌గా నిలిచింది. అంతకంటే ముందు ధోని సేన అంటే 2007లో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్ టోర్నీలో గెలిచి ట్రోఫీని ముద్దాడింది. మెగా టోర్నీల్లో చేతులెత్తేసి ఆ తర్వాత మళ్లీ మ్యాజిక్ రిపీట్ చేస్తూ.. 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఇలా భారత్‌కు మూడుసార్లు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్‌గా ధోని చరిత్రకెక్కాడు. ఇదిలా ఉంటే.. గత పదేళ్లుగా టీమిండియా ద్వైపాక్షిక సిరీస్‌లలో రాణిస్తున్నా.. మెగా ఈవెంట్లలో మాత్రం తేలిపోతోంది. 2015, 2019 వన్డే వరల్డ్‌కప్.. 2021, 2022 టీ20 ప్రపంచకప్, ఆసియా టీ20 టోర్నీ-2022 ఈవెంట్లలో వైఫల్యాలే ఇందుకు నిదర్శనం. ఇటీవల ముగిసిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్- 2023 ఫైనల్లోనూ ఆస్ట్రేలియా చేతిలో ఏకంగా 209 పరుగుల తేడాతో ఓడి ఘోర పరాభవం మూటగట్టుకుంది. కెప్టెన్‌కు ఆ భయం లేకుంటే ఇలాగే ఉంటది ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో సునిల్ గావస్కర్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ‘‘మ్యాచ్ ఓడినా గెలిచినా.. తనకైతే జట్టులో చోటు ఉంటుందని కెప్టెన్‌కు తెలుసు. ఇది కేవలం ఇటీవలి కాలంలో జరుగుతున్నదని మీరు అనుకోవచ్చు. కానీ 2011 నుంచే ఇలా జరుగుతోంది. విదేశాల్లో టెస్టు సిరీస్‌లలో 0-4, 0-4తో వైట్‌వాష్‌కు గురైనా అప్పుడు కెప్టెన్‌ను మార్చలేదు కదా!’’ అని వ్యాఖ్యానించాడు. జట్టు గెలుపోటములకు కెప్టెన్లు, కోచ్‌లు జవాబుదారీగా ఉన్నపుడే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని అభిప్రాయపడ్డాడు. నాడు ధోని సారథ్యంలో వైట్‌వాష్ కెప్టెన్‌కు తన స్థానం గురించి పూర్తి భరోసా ఉన్నపుడు ఒక్కోసారి అన్నీ తేలికగా తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చాడు. కాగా గావస్కర్ ధోనిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడనడానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే.. ధోని సారథ్యంలోనే టీమిండియా 2011-12లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో టెస్టు సిరీస్‌లో 0-4తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. అయితే, ధోని తర్వాత టెస్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లి విదేశాల్లో టీమిండియాకు పలు చిరస్మరణీయ విజయాలు అందించడం విశేషం. ఇక టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. డబ్ల్యూటీసీ సీజన్ 2023-25లో తొలి మ్యాచ్‌లో విండీస్‌పై రోహిత్ సేన ఘన విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం 1-0తో ముందంజలో ఉంది. చదవండి: టీమిండియా కొత్త కెప్టెన్ అరంగేట్రం.. రహానేపై వేటు! అతడు కూడా.. SL Vs Pak: జస్ట్ 87 పరుగులతో సెంచరీ మిస్! ఆ బాధ వర్ణణాతీతం! సౌతాఫ్రికాలో ఇలాంటి బ్యాటర్లే కావాలి: టీమిండియా బ్యాటింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు -
'ఆటగాళ్ల మధ్య దూరానికి అది కూడా కారణమే.. రోహిత్ కెప్టెన్సీ అంతగా బాగోలేదు'
"ఒకప్పుడు జట్టులోని ఆటగాళ్లంతా స్నేహితుల్లా ఉండేవాళ్లమని, ఇప్పుడు కేవలం కొలిగ్స్లాగా ఉంటున్నాము". ఇవి టీమిండియా డ్రెసింగ్ రూం వాతావరణం గురించి వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన కామెంట్స్. తాజాగా అశ్విన్ వాఖ్యలపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించాడు. సహచరుల మధ్య ప్రేమ, అభిమానం లోపించడం చాలా బాధకరమని, జట్టు రాణించకపోవడానికి ఇది కూడా ఒక కారణమని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. "ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. మ్యాచ్ ముగియగానే అందరూ ఒక చోట కూర్చోని మాట్లాడుకోవాలి. ఆ సమయంలో కేవలం క్రికెట్ కోసమే కాకుండా.. సినిమా, మ్యూజిక్ వంటి ఇతర విషయాల కోసం కూడా చర్చించుకోవాలి. అలా జరగలేదంటే కచ్చితంగా ఆలోచించాల్సిందే. గత కొంత కాలంగా జట్టులో ప్రతీ ఆటగాడికి ప్రత్యేక గదిని కేటాయిస్తున్నారు. ప్లేయర్స్ మధ్య దూరం పెరగడానికి ఇది కూడా ఒక కారణమని " ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. ఇక ఐసీసీ ఈవెంట్లలో భారత జట్టు వైఫల్యం, రోహిత్ శర్మ కెప్టెన్సీపై కూడా గవాస్కర్ మాట్లాడాడు. "నేను రోహిత్ శర్మ నుంచి చాలా ఎక్కువగా ఆశించాను. స్వదేశంలో గెలవడం అంత కష్టం కాదు. విదేశాలలో బాగా రాణిస్తే మన సత్తా ఎంటో ప్రపంచానికి తెలుస్తోంది. విదేశీ గడ్డలపై రోహిత్ కెప్టెన్సీ నన్ను నిరాశపరిచింది. టీ20 టోర్నీల్లో కూడా భారత జట్టు పరిస్ధితి అలానే ఉంది. ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు ఉన్ననప్పటికి ఫైనల్స్‌కు చేరడంలో భారత జట్టు విఫలమవుతోందని" గవాస్కర్ చెప్పుకొచ్చాడు. చదవండి: Ashes 2023: చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్.. ధోని ప్రపంచ రికార్డు బద్దలు -
ఆ రెండు మ్యాచులు గెలిస్తే.. వరల్డ్ కప్ టీమిండియాదే: సునీల్ గవాస్కర్
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఐసీసీ విడుదల చేసింది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇక దాదాపు పుష్కరకాలం తర్వాత సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్ జరగనుండడంతో.. 2011 ప్రపంచకప్ మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని భారత జట్టు భావిస్తోంది. కాగా 2011 వన్డే ప్రపంచకప్‌లో ధోని సారధ్యంలోని టీమిండియా ఛాంపియన్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అదే విధంగా 2013 తర్వాత ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా భారత్ సొంతం చేసుకోలేకపోయింది. చివరగా 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత జట్టు కైవసం చేసుకుంది. అప్పటి నుంచి ఐసీసీ ట్రోఫీ అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ఈ క్రమంలో ఎలాగైనా ఐసీసీ టైటిల్‌ను సాధించి తమ 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. ఇక ఆక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్‌తో టీమిండియా తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. తర్వాతి మ్యాచ్‌లో అక్టోబర్ 11న ఆఫ్ఘానిస్తాన్‌తో భారత్ ఆడనుంది. ఇక క్రికెట్ అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ హైవోల్టేజ్ మ్యాచ్ ఆక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఆరంభంలోనే ఆస్ట్రేలియా, పాకిస్తాన్ వంటి బలమైన జట్లతో ఆడనుండడం భారత జట్టుకు కలిసిస్తోందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. "తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియా వంటి బలమైన ప్రత్యర్ధిని ఎదుర్కొవడం భారత జట్టుకు కలిసిస్తోంది. అదే ఆఖరిలో డూ ఆర్‌డై మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వంటి జట్టుతో ఆడాల్సి వస్తే.. టీమిండియాపై ఒత్తడి మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా బలమైన జట్లను ముందుగా ఎదుర్కొంటే ఆయా టీమ్స్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది. అదే ఆస్ట్రేలియాపై మనం ఓటమి చెందితే.. మిగిలిన టీమ్స్‌తో ఎలా ఆడాలో ఒక క్లారిటీ వస్తుంది. అ తర్వాత టోర్నీలో ముందుకు సాగేందుకు మనం ప్రణాళికలు, వ్యూహాలు సిద్దం చేసుకోవచ్చు. మేము 1983 ప్రపంచకప్‌లో కూడా పటిష్ట వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్ ఆడాము. విండీస్ డిఫెండింగ్ ఛాంపియన్స్ అయినప్పటికీ మేము ఆ మ్యాచ్‌లో ఓడించాము. ఆ సమయంలో మా ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు అయింది. మేము ఏకంగా ఛాంపియన్స్‌గా నిలిచాం. అదే విధంగా ప్రస్తుత భారత జట్టు కూడా ఆసీస్, పాకిస్తాన్ వంటి మేటి జట్లపై విజయం సాధిస్తే హిస్టరీ రిపీట్ చేసే అవకాశం ఉంది అని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు. చదవండి: 'చహల్ విషయంలో తప్పు చేస్తున్నారు'.. బీసీసీఐకి గంగూలీ హెచ్చరిక -
ధోనీ కాదు.. ‘ఒరిజినల్’ కెప్టెన్ కూల్ అతడే: సునీల్ గవాస్కర్
భారత క్రికెట్లో 'కెప్టెన్ కూల్' అంటే మనకు టక్కున గుర్తు వచ్చేది టీమిండియా మాజీ సారధి ఎంఎస్ ధోనినే. అతడు తన కూల్ కెప్టెన్సీ భారత జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు. అయితే భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ దృష్టిలో కెప్టెన్ కూల్' అంటే ధోని కాదంట. భారత్‌కు తొలి ప్రపంచకప్‌ను అందిచిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అసలైన 'కెప్టెన్ కూల్' గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. 1983 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుని నిన్నటికి(జూన్25) 40 ఏళ్లు పూరైన సందర్భంగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోగవాస్కర్ ఈ వాఖ్యలు చేశాడు. 1983 ప్రపంచకప్‌లో కపిల్ దేవ్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా ఫైనల్లో వివ్ రిచర్డ్స్ క్యాచ్‌ను కపిల్ అద్భుతంగా అందుకున్నాడు. అదే మేము వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలిచేలా చేసింది. ఆ క్యాచ్ ఇప్పటికి ఎవరూ మరిచిపోరు. కపిల్ ఒక డైనమిక్ లీడర్. ఒక కెప్టెన్‌కు ఉండాల్సిన అన్ని క్వాలిటీలు అతడిలో ఉండేవి. ఒక ఆటగాడు క్యాచ్ వదిలినా, మిస్ ఫీల్డ్ చేసినా.. కపిల్ ముఖంపై చిరునవ్వు తప్ప కోపం కనిపించకపోయేది. కపిల్ అసలైన కెప్టెన్ కూల్ అని గవాస్కర్ పేర్కొన్నాడు. కాగా 1983 ప్రపంచకప్‌లో అండర్ డగ్స్గా బరిలోకి దిగిన టీమిండియా.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫైనల్లో పటిష్ట విండీస్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. చదవండి: ధోనితో అట్లుంటది మరి.. గంటల వ్యవధిలో అపర కుబేరులను చేశాడు..! -
వాళ్లేం సాధించారు.. పూజారాని మాత్రం ఎందుకు బలి చేశారు?: సునీల్ గవాస్కర్
వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. అయితే విండీస్‌తో టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో సీనియర్ బ్యాటర్, నయావాల్ ఛతేశ్వర్ పూజారాకి చోటు దక్కలేదు. అదే విధంగా ఐపీఎల్లో అదరగొట్టిన యశస్వీ జైశ్వాల్, రుత్‌రాజ్ గైక్వాడ్‌కు సెలక్టర్లు టెస్టు జట్టులో అవకాశం ఇచ్చారు. అయితే టెస్టు క్రికెట్లో నయావాల్‌గా పేరుగాంచిన పూజారాను పక్కన పెట్టడాన్ని చాలా మంది మాజీలు తప్పుబడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చేరాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో చాలా మంది భారత ఆటగాళ్లు విఫలమైనా పూజారాని మాత్రం ఎందుకు బలిపశువు చేశారంటూ గవాస్కర్ మండిపడ్డాడు. "పుజారాను జట్టు నుంచి ఎందుకు తప్పించారు? టీమిండియా బ్యాటింగ్ యూనిట్ మొత్తం ఫెయిల్ అయినప్పుడు అతన్ని మాత్రం ఎందుకు బలిపశువుని చేశారు? పుజారా భారత క్రికెట్‌కు ఎన్నో ఏళ్లగా తన సేవలు అందిస్తున్నాడు. అతడు సైలెంట్‌గా ఉండి భారత జట్టును ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు. కేవలం అతనికి సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్లు లేరనే ఉద్దేశంతోనే పూజారాని తప్పించారని అనిపిస్తోంది. సరే.. డబ్ల్యూటీసీ ఫైనల్లో పుజారా సరిగ్గా ఆడలేదని జట్టు నుంచి తప్పించారు.. మరి మిగితా ఆటగాళ్లు కూడా ఫెయిలయ్యారు కదా వారి పరిస్ధితి ఏంటి? అయినా జట్టును ప్రకటించేటప్పుడు సెలక్షన్ కమిటీ, మీడియా సమావేశం ఎందుకు పెట్టడం లేదో నాకు ఆర్ధం కావడం లేదు. పుజారా గత కొంత కాలంగా కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. కాబట్టి అతడి రెడ్‌బాల్ క్రికెట్లో మరింత అనుభవం పెరిగింది. రెడ్‌బాల్ క్రికెట్‌పై అతడికి పూర్తి అవగహన ఉంది. ప్రస్తుతం ఫిట్నెస్ ఉంటే 39-40 సంవత్సరాల వయస్సు వరకు ఆడవచ్చు. పూజారాకి కూడా నాలుగైదేళ్ల కెరీర్ ఉంది. అజింకా రహానే మినహా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఏ బ్యాటర్ కూడా సరిగా ఆడలేదు. అయినా కేవలం పుజారాను మాత్రమే ఎందుకు బలిచేశారో సెలక్టర్లు సమాధానం చెప్పాలంటూ" స్పోర్ట్స్ టూడేతో మాట్లాడుతూ సన్నీ ఫైరయ్యాడు. చదవండి: Ind Vs WI 2023: 'రంజీలెందుకు ఆడించడం.. ఐపీఎల్‌తోనే కానిచ్చేయండి!' -
'రంజీలెందుకు ఆడించడం.. ఐపీఎల్‌తోనే కానిచ్చేయండి!'
దేశవాలీ టోర్నీ అయిన రంజీ ట్రోపీలో దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ ఖాన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. విండీస్‌తో టెస్టు సిరీస్‌కు సర్ఫరాజ్ పేరు కచ్చితంగా ఉంటుందని అంతా భావించారు. కానీ అతనికి మరోసారి మొండిచేయి ఎదురైంది. సర్ఫరాజ్‌ను ఎంపిక చేయకపోవడంపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. టెస్టు క్రికెట్లోకి తీసుకునేది రంజీల్లో చేసే ప్రదర్శనతోనే కానీ ఐపీఎల్‌తో కాదు కదా అంటూ చురకలు అంటించాడు. అలాంటప్పుడు పనిగట్టుకొని ప్రతీ ఏడాది రంజీ ట్రోపీ ఆడించడం ఎందుకు.. ఐపీఎల్ ప్రదర్శనతోనే జట్టులోకి ఎంపిక చేస్తామంటే అలానే కానియ్యండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ''సర్ఫరాజ్ ఖాన్ రంజీల్లో అదరగొడుతున్నాడు. మూడు సీజన్లలో అతని పర్ఫామెన్స్ రికార్డు లెవెల్లో ఉంది. దాదాపు 100 సగటుతో పరుగులు చేస్తున్నాడు. అయినా అతనికి చోటు దక్కడం లేదు. టీమ్‌లోకి రావాలంటే అతను ఇంకేం చేయాలి. తుది జట్టులో చోటు ఇవ్వకపోయినా కనీసం అతన్ని ఎంపిక చేస్తే, రంజీల్లో ఆడుతున్నదానికి గుర్తింపు దక్కిందనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ సెలక్టర్లు మాత్రం ఐపీఎల్ ఆడిన వాళ్లకే టీమ్‌లో చోటు ఇస్తున్నారు. రెడ్ బాల్ క్రికెట్‌కి కూడా ఐపీఎల్ ఆటే కొలమానం అయితే రంజీ ట్రోఫీ పెట్టడం ఎందుకు? దాన్ని ఆపేయండి. రంజీల్లో ఏ ప్లేయర్ కూడా ఆడకండి. ఫలితం లేనప్పుడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీకి అంత ఖర్చు పెట్టి దండగే'' అంటూ కామెంట్ చేశాడు. ఓవరాల్‌గా సర్ఫరాజ్ ఖాన్ రంజీ క్రికెట్లో ఇప్పటివరకు 37 మ్యాచులు ఆడి 79.65 సగటుతో 13 సెంచరీలతో 3505 పరుగులు చేశాడు. ఇక 2022-23 రంజీ ట్రోఫీలో 6 మ్యాచుల్లో 92.66 సగటుతో 556 పరుగులు చేశాడు. అంతకుముందు 2021-22 సీజన్లో 4 సెంచరీలతో 122.75 సగటుతో 982 పరుగులు చేశాడు. చదవండి: యార్కర్ల కింగ్ అన్నారు.. ఇప్పుడు జట్టు నుంచి ఏకంగా పక్కన పెట్టేశారు! -
స్వాతంత్య్రం వచ్చాక టీమిండియా తొలి కెప్టెన్‌గా.. ఆయన కొడుకులు సైతం!
భారత క్రికెట్ తొలితరం క్రీడాకారుల్లో లాలా అమర్నాథ్ భరద్వాజ్ అగ్రగణ్యుడు. టెస్ట్ క్రికెట్లో సెంచరీ సాధించిన తొలి భారతీయుడిగా 1933లోనే ఆయన చరిత్ర సృష్టించారు. రెండో ప్రపంచయుద్ధ కాలంలో భారత్ అధికారికంగా ఎలాంటి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌లలోనూ పాల్గొనలేదు. అదేకాలంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు సహా వివిధ జట్లతో జరిగిన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో ఆడిన లాలా అమర్నాథ్ ఆ మూడేళ్ల వ్యవధిలోనే ముప్పయి సెంచరీలు సహా పదివేల పరుగుల మైలురాయిని అధిగమించారు. స్వాతంత్య్రం వచ్చాక భారత క్రికెట్ జట్టుకు తొలి కెప్టెన్‌గా సారథ్యం వహించారు. బ్యాట్స్‌మన్‌గానే కాకుండా బౌలర్‌గానూ అద్భుతంగా రాణించారు. అప్పటి ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాట్స్‌మన్ డాన్ బ్రాడ్‌మాన్‌ను తన బౌలింగ్‌లో హిట్ వికెట్‌గా ఔట్‌చేసిన ఏకైక బౌలర్‌గా చరిత్ర సృష్టించారు. క్రీడారంగంలో వారసులు నిలదొక్కుకోవడం చాలా కష్టం. అలాంటిది లాలా అమర్నాథ్ కొడుకులు– సురీందర్ అమర్నాథ్, మోహీందర్ అమర్నాథ్ తండ్రి అడుగుజాడల్లోనే క్రికెట్ క్రీడాకారులుగా అంతర్జాతీయంగా రాణించారు. మొహీందర్ అమర్నాథ్ 1983 ప్రపంచకప్ సాధించిన జట్టు వైస్‌కెప్టెన్‌గా కీలక పాత్ర పోషించాడు. లాలా అమర్నాథ్ చిన్న కొడుకు రాజీందర్ అమర్నాథ్ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకపోయినా, ఫస్ట్‌క్లాస్ క్రికెటర్‌గా రాణించాడు. రాజీందర్ తన తండ్రి జీవిత చరిత్రను ‘లాలా అమర్నాథ్: లైఫ్ అండ్ టైమ్స్– ది మేకింగ్ ఆఫ్ ఎ లెజెండ్’ పేరుతో రాశాడు. తండ్రి స్ఫూర్తితోనే తమ సోదరులు ముగ్గురమూ క్రికెట్లోకి అడుగు పెట్టామని రాజీందర్ చెబుతాడు. భారత క్రికెట్లో తండ్రీకొడుకులు ►వినోద్ మన్కడ్- అశోక్ మన్కడ్ ►నయన్ మోంగియా- మోహిత్ మోంగియా ►యోగ్రాజ్ సింగ్- యువరాజ్ సింగ్ ►రోజర్ బిన్నీ- స్టువర్ట్ బిన్నీ ►సునిల్ గావస్కర్- రోహన్ గావస్కర్ ►హేమంత్ కనిత్కర్- హ్రిషికేశ్ కనిత్కర్ ►విజయ్ మంజ్రేకర్- సంజయ్ మంజ్రేకర్ ►పంకజ్ రాయ్- ప్రణబ్ రాయ్ చదవండి: ఖ్వాజా వీరోచిత సెంచరీ.. బ్యాట్ కిందకు విసిరి! వీడియో వైరల్ ఇండియాలో మ్యాచ్‌లంటే అంతే! వాళ్లు మాపై ఒత్తిడి పెంచి: నితిన్ మీనన్ సంచలన వ్యాఖ్యలు -
రోహిత్ శర్మ పరువు తీసిన సునీల్ గవాస్కర్
-
ఐపీఎల్లో అలా అడగడం లేదు కదా.. రోహిత్ శర్మపై లెజెండ్ ఫైర్
ఐసీసీ ఈవెంట్లో టీమిండియా మరోసారి నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఘోర ఓటమి చూసింది. 444 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 234 పరుగులకే కుప్పకూలింది. కాగా డబ్ల్యూటీసీ విజేతను నిర్ణయించడానికి కేవలం ఒక్క మ్యాచ్ సరిపోదని, కనీసం మూడు మ్యాచ్‌ల సిరీస్‌నైనా ఆడించాలని రోహిత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఈ వాదనతో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విభేదించాడు. "డబ్ల్యూటీసీ ఫైనల్ ఎంతో కాలం క్రితమే నిర్ణయించబడి ఉంటుంది. ఫైనల్ ఒక్క మ్యాచ్ మాత్రమే ఉంటుందని డబ్ల్యూటీసీ సైకిల్ మొదటి మ్యాచ్ మొదలకావడానికి ముందే మీకు తెలుసు. కాబట్టి అందకు తగ్గట్టు మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి. మీరు ఐపీఎల్‌కు ఎలా అయితే సిద్దమవుతున్నారో ఈ మ్యాచ్‌కు కూడా అలానే ప్రిపేర్ కావాలి. అక్కడ ఎవరూ మూడు మ్యాచులు పెట్టండి అని అడగడం లేదు కాదా. ఎవరికైనా కొన్ని బ్యాడ్ డేస్ ఉంటాయి. భవిష్యత్తులో ముందుకు ఎలా వెళ్లాలన్న దాని గురించి ఆలోచించాలి. ఇప్పుడు విజేతను నిర్ణయించడానికి మూడు మ్యాచ్‌లు పెట్టమని అడుగుతున్నారు. అదే అప్పుడు కూడా ఓడిపోతే ఐదు మ్యాచ్‌లు పెట్టమని అడగరని గ్యారంటీ ఎంటీ" అని సన్నీ ప్రశ్నించాడు. చదవండి: WTC Final: కోహ్లికి ఏమైంది.. రోహిత్, ద్రవిడ్‌తో విభేదాలా? కారణం అదేనా -
డబ్ల్యూటీసీ ఫైనల్.. వికెట్ కీపర్‌గా భరత్! కిషన్‌కు నోఛాన్స్
జూన్ 7 నుంచి లండన్ వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన భారత్, ఆస్ట్రేలియా ఈ పోరులో తలపడుతున్నాయి. ఇక ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచులో గెలిచి వరల్డ్ ఛాంపియన్‌గా నిలవాలని రెండు జట్లూ పట్టుదలగా ఉన్నాయి. ఇప్పటికే లండన్‌కు చేరుకున్న ఇరు జట్లు తమ ప్రాక్టీస్ సెషన్స్‌లో బీజీబీజీగా ఉన్నాయి. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఎంపిక చేశాడు. తన ఎంపిక చేసిన జట్టుతో ఆడితే భారత్ కచ్చితంగా విజయం సాధిస్తుందని గవాస్కర్ థీమా వ్యక్తం చేశాడు. అందరూ ఊహించిన విధంగానే గవాస్కర్ తన జట్టులో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లకు చోటిచ్చాడు. లిటిల్‌మాస్టర్ ఎంపిక చేసిన ప్లేయింగ్ ఎలెవన్‌లో ఓపెనర్లుగా శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మకు అవకాశం ఇచ్చాడు. అదే విధంగా పుజారా మూడో స్థానంలో, విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో, అజింక్య రహానె ఐదో స్థానంలో బ్యాటింగ్ వస్తే బాగుంటుందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. వికెట్ కీపర్‌గా కిషన్‌ను కాదని భరత్ వైపే సన్నీ మొగ్గుచూపాడు. భరత్‌కు ఆరో స్ధానంలో చోటు ఇచ్చాడు. ఇక స్పిన్నర్లగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌కు అతడు అవకాశమిచ్చాడు. చివరగా ఫాస్ట్ బౌలర్ల విభాగంలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్లకు గవాస్కర్ ఛాన్స్ ఇచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సునీల్ గవాస్కర్ జట్టు : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్. చదవండి: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా కీలక నిర్ణయం -
పుజారా మీదే ఆశలు..!
-
మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకో? హార్దిక్‌ను ఏకిపారేసిన గావస్కర్..పైగా..
IPL 2023 Final CSK Vs GT- Winner CSK: ‘‘ఆఖరి ఓవర్లో మొదటి 3-4 బంతులు అతడు అద్బుతంగా బౌల్ చేశాడు. కానీ ఏంటో అనూహ్యంగా మధ్యలో హార్దిక్ పాండ్యా వచ్చాడు. అతడితో ఏదో మాట్లాడాడు. నిజానికి ఓ బౌలర్ మంచి రిథమ్, లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తున్నపుడు అతడిని ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు. అతడు సరైన దిశలో పయనిస్తున్నపుడు అనవసరంగా సలహాలు ఇవ్వడం ఎందుకు? దూరం నుంచి చూసి మనం.. అతడు అలా బౌల్ చేస్తున్నాడు. ఇలా బౌల్ చేస్తున్నాడు అని విశ్లేషణలు చేస్తూ ఉంటాం. సదరు బౌలర్ ఫామ్‌లో ఉన్నపుడు ఎవరైనా అంత వరకే ఆగిపోవాలి. అంతేగానీ.. అతడి దగ్గరికి వెళ్లి సలహాలు, సూచనలు ఇవ్వడం సరికాదు. పాండ్యా అక్కడికి వెళ్లగానే ఒక్కసారిగా మోహిత్ ముఖమే మారిపోయింది. అతడు బిత్తరచూపులు చూడటం మొదలుపెట్టాడు. ఆ వాటర్ బాటిల్ ఎందుకో’’ అని టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ అన్నాడు. హార్దిక్ పాండ్యా చేసిన పనేమీ బాగా లేదని విమర్శలు గుప్పించాడు. కాగా ఐపీఎల్-2023 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ తలపడిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా రిజర్వ్ డే అయిన సోమవారం(మే 29) జరిగిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో సీఎస్కే 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ఐదోసారి ట్రోఫీ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలవాలనుకున్న డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లింది. ఇక వర్షం కారణంగా లక్ష్య ఛేదనలో 15 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో గుజరాత్ పేసర్ మోహిత్ శర్మ చేతికి బంతినిచ్చాడు కెప్టెన్ పాండ్యా. అప్పటికి శివం దూబే, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలో మొదటి బంతిని పర్ఫెక్ట్ యార్కర్‌గా మలిచిన మోహిత్.. దూబేకు పరుగు తీసే అవకాశం ఇవ్వలేదు. రెండో బాల్ కూడా యార్కరే. ఈసారి దూబే ఒక పరుగు తీయగలిగాడు. ఇక మూడో బంతికి కూడా అద్భుతమైన యార్కర్ సంధించి సీఎస్కే అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. నాలుగో బంతి కూడా సేమ్. ఈ క్రమంలో చెన్నై విజయసమీకరణం 2 బంతుల్లో 10 పరుగులుగా మారింది. జడ్డూ క్రీజులో ఉన్నాడు. ప్రేక్షకుల్లో నరాలు తెగే ఉత్కంఠ. అంతలో హార్దిక్ పాండ్యా వచ్చి మోహిత్‌తో ముచ్చటించాడు. ఆ తర్వాతి బంతిని జడ్డూ సిక్సర్‌గా మలిచాడు. విజయానికి ఒక్క బంతికి నాలుగు పరుగులు కావాల్సిన తరుణంలో జడ్డూ బౌండరీ బాది సీఎస్కేను చాంపియన్‌గా నిలిపాడు.ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ ఆఖరి ఓవర్ హైడ్రామా గురించి ఇండియా టుడేతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. చదవండి: సీఎస్కేకు ఫైనల్లో అడ్వాంటేజ్ అంటూ ట్వీట్! నీకెందుకంత అక్కసు? మరి ముంబై అయితే.. Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 -
టెస్టుల్లో ఆడడం టీమిండియాకు అతి పెద్ద సవాలు..కారణమిదే: గవాస్కర్
లండన్ వేదికగా జరగున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2023లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనున్న విషయం విధితమే. ఈ ఫైనల్ పోరు లండన్‌లోని ఓవల్ స్టేడియం వేదికగా వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు జరగనుంది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ టీమిండియాను ఉద్దేశించి ఆసక్తికర వాఖ్యలు చేశాడు. నేరుగా టీ20లు నుంచి టెస్టు క్రికెట్ ఆడటం భారత జట్టుకు పెద్ద సవాల్ అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన భారత జట్టులో పుజరా మినహా మిగితా ఆటగాళ్లందరూ ఐపీఎల్-2023లో భాగమయ్యారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఆడనుండంతో గవాస్కర్ ఇటువంటి వాఖ్యలు చేశాడు. "డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు పుజరా మినహా మిగితా ఆటగాళ్లందరూ టీ20 ఫార్మాట్లో ఆడి బయటకు వచ్చారు. కాబట్టి భారత ఆటగాళ్లకు ఇంగ్లండ్ గడ్డపై గట్టి సవాలు ఎదురుకానుంది. టెస్ట్ క్రికెట్ సుదీర్ఘ ఫార్మాట్. టీ20 మైండ్‌సెట్‌తో ఆడితే సరిపోదు. ఛెతేశ్వర్ పుజారా కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పుజరా ఆడుతున్నాడు కాబట్టి అక్కడి పరిస్థితులకు బాగా అలవాటు పడి ఉంటాడు. అతడు రాణించాల్సిన అవసరం చాలా ఉంది. అతడితో పాటు రహానేకు కూడా ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం ఎక్కువగా ఉంది. రహానే ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని నేను అనుకుంటున్నారు. అతడు తన అనుభవవాన్ని మరోసారి నిరూపించుకోవాల్సి ఉంటుంది. రహానేకు ఇది అద్భుతమైన అవకాశం. అతడు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడని భావిస్తున్నాను" అని స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు. చదవండి: WTCFinal2023: ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన ఆ ఐదుగురు! ఫోటోలు వైరల్ -
ఒక్క సీజన్కేనా? సచిన్, కోహ్లితో ఇప్పుడే పోలికలు వద్దు: టీమిండియా దిగ్గజం
IPL 2023- Shubman Gill: ‘‘సునిల్ గావస్కర్ వచ్చాడు... అదరగొట్టాడు.. తర్వాత సచిన్ టెండుల్కర్.. అనంతరం రాహుల్ ద్రవిడ్.. అటు పిమ్మట వీవీఎస్ లక్ష్మణ్.. వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లి... ఇలాగే అద్బుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. శుబ్‌మన్ గిల్ కూడా వారి అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు’’ అంటూ టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్.. టీమిండియా యువ బ్యాటర్ శుబ్మన్పై ప్రశంసలు కురిపించాడు. అయితే, ఇప్పుడే గిల్ ఆట తీరుపై పూర్తి అంచనాకు రాలేమని వచ్చే సీజన్లోనూ ఇలాగే ఆడితే అతడికి తిరుగు ఉండదని పేర్కొన్నాడు. ఏకంగా మూడు సెంచరీలు కాగా ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పంజాబీ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ సెంచరీలతో దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. ఈ ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఆడిన 16 మ్యాచ్‌లలో 851 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా మూడు శతకాలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటి వరకు గిల్ బాదిన బౌండరీల సంఖ్య 78. సిక్సర్లేమో 33. అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్న గిల్.. ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా అవతరించాడు. పరుగుల వరద పారించి అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ఇక ఆదివారం నాటి ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌పై మరోసారి చెలరేగితే గిల్‌కు తిరుగుండదు. అద్భుత ఆటగాడే కానీ.. ఈ నేపథ్యంలో శుబ్‌మన్ ఆట తీరుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలో కపిల్ దేవ్.. గిల్‌ను కొనియాడుతూనే.. ఆటలో నిలకడ అవసరమని పేర్కొన్నాడు. ‘‘గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అతడిలో అపారమైన ప్రతిభ దాగుంది. బ్యాటింగ్‌లో శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాలకు కొదువలేదు. అయితే, తను ఆటలో ఇంకాస్త పరిణతి చెందాల్సి ఉంది. రానున్న సీజన్లో కూడా ఇదే నిలకడైన ఆట తీరు కొనసాగిస్తే అతడిని అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో చేర్చడం ఖాయం. ఇప్పుడే వద్దు కాబట్టి నేను ఇప్పుడే గిల్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేను. వచ్చే ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత తన గురించి మాట్లాడతా. ఇప్పుడే గొప్ప ప్లేయర్ అంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం తొందరపాటు చర్యే అవుతుంది’’ అని కపిల్ దేవ్ ఏబీపీ న్యూస్‌తో వ్యాఖ్యానించాడు. కాగా అహ్మదాబాద్ వేదికగా సీఎస్కే- గుజరాత్ ఐపీఎల్-2023 ట్రోఫీ కోసం ఆదివారం తలపడనున్నాయి. చదవండి: చరిత్రకు అడుగు దూరంలో శుబ్‌మన్ గిల్.. అలా అయితే కోహ్లి రికార్డు బద్దలు! ఒకవేళ వర్షం వల్ల ఫైనల్ రద్దు అయితే.. ఐపీఎల్ విజేత ఎవరంటే? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
టీ20 ప్రపంచకప్ జట్టులో కోహ్లి ఉండాలా వద్దా? గవాస్కర్ సమాధానమిదే
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి గత కొంత కాలంగా అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. కోహ్లి చివరగా గతేడాది నవంబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కనిపించాడు. అప్పటి నుంచి కోహ్లితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మను కూడా టీ20 జట్టు నుంచి సెలక్టర్లు తప్పించారు. వారి స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది వెస్టిండీస్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో కోహ్లి ఆడుతాడా లేదా అన్న చర్చ ఇప్పటినుంచే మొదలైంది. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ కెప్టెన్ గవాస్కర్ తన అభిప్రయాలను వెల్లడించాడు. కోహ్లి ప్రస్తుత ఉన్న ఫామ్ ప్రకారం అయితే కచ్చితంగా భారత్ టీ20 సెటాప్‌లో ఉండాలి అని గవాస్కర్ తెలిపాడు. "టీ20 ప్రపంచకప్-2024కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉంది. దానికి ముందు వచ్చే ఏడాది మార్చి,ఏప్రిల్ లో మరో ఐపీఎల్ జరుగుతుంది. అందులో కోహ్లి ఎలా రాణిస్తాడన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అంతే తప్ప ప్రపంచకప్‌లో కోహ్లి స్థానం గురించి ఇప్పటినుంచి చర్చలు అవసరంలేదు. ఒక వేళ ఈ ఏడాది జూన్‌లో ఏదైన టీ20 మ్యాచ్ జరిగినట్లైతే అతడు కచ్చితంగా భారత జట్టులో ఉండాలి. ఎందుకంటే విరాట్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో కూడా రెండు సెంచరీలు సాధించాడు. కానీ వెస్టిండీస్, అమెరికాలో జరగనున్న ప్రపంచ కప్-2024 గురించి అనవసరమైన వాదన అవసరం లేదు. ప్రపంచ కప్ గురించి మాట్లాడితే మాత్రం.. వచ్చే ఐపీఎల్లో ప్లేయర్స్ ఫామ్ చూడాలి. అప్పుడే జట్టుపై ఒక క్లారిటీ వస్తుంది" అని స్పోర్ట్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్-2023లో విరాట్ కోహ్లి దుమ్మురేపాడు. 14 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 639 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: AFG vs IND: ఆఫ్గాన్‌తో వన్డే సిరీస్.. భారత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా! విధ్వంసకర ఓపెనర్ ఎంట్రీ -
‘అంతా ధోని మాయ’
ఇంగ్లండ్ గడ్డపై నా (సునీల్ గావస్కర్) తొలి టెస్టు సిరీస్ రోజుల్లోకి ఒక్కసారి వెళ్లి చూస్తే... చివరి టెస్టులో మా విజయలక్ష్యం 172 పరుగులు. దానిని అందుకుంటే ఇంగ్లండ్‌లో భారత్ మొదటిసారి టెస్టు సిరీస్ గెలుస్తుంది. నాలుగో రోజు ఆటను మెరుగైన స్థితిలో ముగించడంతో లక్ష్యం చేరేందుకు ఒక రోజంతా మా వద్ద మిగిలింది. అప్పుడు ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రే ఇల్లింగ్‌వర్త్ నా దృష్టిలో అత్యంత చురుకైన సారథి. ఒక్క సులువైన పరుగు కూడా ఇవ్వకుండా కట్టిపడేయడంతో మా దృష్టిలో లక్ష్యం 572 పరుగులుగా కనిపించింది! చివరకు 75 ఓవర్లు ఆడి మేం మ్యాచ్ గెలవగలిగాం. చిదంబరం స్టేడియంలో ధోని కూడా తక్కువ లక్ష్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో చిరునవ్వులు చిందిస్తూనే గుజరాత్‌కు అదే తరహా భావన కల్పించాడు. అతని బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ వ్యూహాలతో గుజరాత్ ఆటగాళ్లు కదల్లేకపోయారు. అలవోకగా లక్ష్యాలు ఛేదించే తమకు ఏం జరిగిందో అని వారు కూడా ఆశ్చర్యపోయి ఉండవచ్చు. అది అర్థమయ్యేసరికి వారికి ఓటమి ఖాయమైపోయింది. పిచ్ కాస్త నెమ్మదించి టర్న్‌కు అనుకూలించిందనేది వాస్తవమే అయినా దానిని ధోని సమర్థంగా వాడుకోవడమే చెప్పుకోదగ్గ అంశం. అంతకుముందు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే చెన్నైకి కావాల్సిన సరైన ఆరంభాన్ని అందిస్తే రాయుడు, జడేజా కలిసి స్కోరును 172 వరకు తీసుకెళ్ళారు. ఆ తర్వాత ధోని గతంలో ఎన్నోసార్లు చేసినట్లుగానే మళ్లీ తన మాయ చూపించాడు. చెన్నై జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. చదవండి: ఐదు వికెట్లతో చెలరేగిన ఆకాశ్ మద్వాల్.. క్వాలిఫయర్-2కు ముంబై -
రూ. 8 కోట్లు పెడితే మధ్యలోనే వదిలివెళ్లాడు.. ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దు!
IPL 2023: ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌పై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ మండిపడ్డాడు. కోట్లు కుమ్మరించి కొనుక్కుంటే ముంబై ఇండియన్స్‌కు అతడి వల్ల ఏమి ఒరిగిందని ప్రశ్నించాడు. ముంబై తనపై వెచ్చించిన ఒక్క రూపాయికి కూడా ఆర్చర్ న్యాయం చేయలేదని.. అతడికి రూ. 8 కోట్ల మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ముందే తెలిసినా ఐపీఎల్-2022 వేలంలో భాగంగా 8 కోట్లు పెట్టి ముంబై ఇండియన్స్ జోఫ్రా ఆర్చర్‌ను కొనుగోలు చేసింది. ఫిట్నెస్ సమస్యలతో బాధ పడుతున్న ఆర్చర్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండడని తెలిసినా అతడి కోసం భారీ మొత్తం వెచ్చించింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా టీ20 లీగ్ ద్వారా ఈ ఏడాది ఆరంభంలో టీ20 క్రికెట్లో తిరిగి అడుగుపెట్టిన ఆర్చర్.. ఎంఐ కేప్‌టౌన్ జట్టుకు ఆడాడు. జోఫ్రా ఆర్చర్ ఈ క్రమంలో ఐపీఎల్-2023 సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లోకి తిరిగి వచ్చాడు. ఎన్నో అంచనాలతో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగిన అతడు 5 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు వికెట్లు తీశాడు. తర్వాత గాయం తిరగబెట్టడంతో మే 9న స్వదేశం ఇంగ్లండ్‌కు వెళ్లిపోయాడు. 8 కోట్లు పెడితే ఏం దక్కింది? ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ జోఫ్రా ఆర్చర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మిడ్ డేకు రాసిన కాలమ్‌లో.. ‘‘జోఫ్రా ఆర్చర్ వల్ల ముంబై ఇండియన్స్ ఎలాంటి అనుభవం చవిచూసిందో తెలుసు కదా! ఈ సీజన్ నుంచి మాత్రమే అతడు అందుబాటులో ఉంటాడని తెలిసినా గాయపడిన అతడిని కొనుగోలు చేసింది. అతడి కోసం భారీ మొత్తం వెచ్చించింది. కానీ ప్రతిఫలంగా వారికి ఏం లభించింది? అతడు 100 శాతం ఫిట్నెస్ సాధించకలేకపోయాడు. కనీసం ఈ విషయం గురించి ముందే ఫ్రాంఛైజీకి సమాచారం ఇవ్వాల్సింది. అపుడైనా వాళ్లకు.. అతడి సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేమని తెలిసేది. టోర్నీ మధ్యలో చికిత్స కోసమని స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఈసీబీ స్వయంగా చెప్పింది. నిజానికి ఈసీబీ కంటే ముంబై ఫ్రాంఛైజీనే ఆర్చర్‌కు ఎక్కువ మొత్తం చెల్లిస్తోంది. కానీ అతడు కనీస బాధ్యత లేకుండా వ్యవహరించాడు. యూకేకు తిరిగి వెళ్లినపుడే ఫ్రాంఛైజీ పట్ల అతడి నిబద్ధత ఎలాంటిదో అర్థమైంది’’ అని గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అసలు ఆర్చర్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోయినా నష్టమేమీ లేదని పేర్కొన్నాడు. చదవండి: అది కూడా కీలకమే.. పాపం రాజస్తాన్ ఆ విషయం మర్చిపోయినట్టుంది! -
గావస్కర్..సెహ్వాగ్ దగ్గరకు రాడు! వీరూనే వెళ్లాలి.. అర్థమైందా? వాళ్లిద్దరు అంతే!
IPL 2023: సీనియర్ల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడానికి జూనియర్లే ఒక అడుగు ముందుకు వేస్తే బాగుంటుందని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఆటలో మెలకువలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలని.. తన కెరీర్ తొలినాళ్లలో దిగ్గజం సునిల్ గావస్కర్‌తో మాట్లాడేందుకు విశ్వప్రయత్నం చేశానని పేర్కొన్నాడు. దూసుకుపోతున్న గిల్ కానీ.. టీమిండియా యువ ఓపెనర్లు పృథ్వీ షా, శుబ్‌మన్ గిల్‌కు మాత్రం ఇలాంటి లక్షణాలు లేవని చురకలు అంటించాడు. కాగా ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ గిల్ అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై సెంచరీ చేసిన ఈ యువ ఆటగాడు ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో కలిపి 576 పరుగులు చేశాడు. షా ఇప్పుడిలా ఇదిలా ఉంటే.. భారత్‌కు అండర్-19 వరల్డ్‌కప్ అందించిన గిల్ సమకాలీకుడు పృథ్వీ షా పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ముంబై బ్యాటర్ ఆరంభంలో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో జట్టులో చోటు కోల్పోయాడు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో తిరిగి తుది జట్టులో స్థానం సంపాదించిన అతడు.. తొలిసారి బ్యాట్ ఝులిపించాడు. వార్నర్‌కు జోడీగా ఓపెనింగ్ చేసిన అతడు 38 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 54 పరుగులు రాబట్టాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 101 పరుగులు(7 ఇన్నింగ్స్) చేసిన అతడికి ఇదే అత్యధిక స్కోరు. నాతో యాడ్ షూట్ చేసినపుడు ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్ షోలో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘పృథ్వీ షా నాతో కలిసి ఓ యాడ్‌లో నటించాడు. శుబ్‌మన్ గిల్ కూడా అక్కడే ఉన్నాడు. మేమంతా దాదాపు ఆరు గంటల పాటు అక్కడే ఉన్నాం. వారిద్దరిలో ఒక్కరు కూడా నా దగ్గరకు వచ్చి క్రికెట్ గురించి మాట్లాడలేదు. నేనైతే టీమిండియాకు ఆడుతున్న కొత్తలో సన్నీ భాయ్(గావస్కర్)తో మాట్లాడటానికి చేయని ప్రయత్నం లేదు. ఓ రోజు జాన్‌రైట్ దగ్గరకు వెళ్లి.. ‘‘నేను కొత్త ప్లేయర్‌ని.. సన్నీ భాయ్ నాతో మాట్లాడతారో లేదో తెలియదు. కానీ నేను మాత్రం ఎలాగైనా ఆయనను కలవాలని అనుకుంటున్నానని చెప్పాను. గావస్కర్ నన్ను కలవాలనుకోడు.. నేనే వెళ్లాలి! కాబట్టి ఎలాగైనా మీటింగ్ ఏర్పాటు చేయమని కోరాను. ఓ రోజు రైట్ డిన్నర్ ఏర్పాటు చేశాడు. 2003-04లో నా ఓపెనింగ్ పార్ట్నర్ ఆకాశ్ చోప్రా. తను కూడా నాతో కలిసి సన్నీ భాయ్ దగ్గరకు వచ్చాడు. మేమిద్దరం కలిసి డిన్నర్ చేస్తూ బ్యాటింగ్ ఎలా చేయాలన్న అంశం గురించి ఆయనతో చర్చించాం. మనకు ఏదేని విషయం పట్ల ఆసక్తి ఉండాలి. అందుకోసం మనమే రంగంలోకి దిగాలి. సునిల్ గావస్కర్ వచ్చి సెహ్వాగ్ లేదంటే చోప్రాతో మాట్లాడాలని అనుకోరు. మనమే ఆయన దగ్గరకు వెళ్లాలి’’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. సీనియర్లు అందుబాటులో ఉన్నపుడు వారితో చర్చిస్తే ఆటలో మెలకువలు తెలుసుకునే వీలుంటుందని.. అలాకాక సీనియర్లే తమకు దగ్గరకు వస్తారని ఆశించడం సరికాదని పరోక్షంగా షా, గిల్‌లకు చురకలు అంటించాడు. వీరూ భాయ్ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ‘‘షా, గిల్ల ప్రవర్తనతో ముల్తాన్ సుల్తాన్‌కు బాగా కోపం వచ్చినట్లుంది. అయినా భాయ్ చెప్పిందే కరెక్టే కదా! సీనియర్లు జూనియర్ల దగ్గరికి రారు. జూనియర్లే వెళ్లాలి. ఇప్పటికైనా అర్థమైందా షా, గిల్?’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఈజీ క్యాచ్ డ్రాప్.. కోపంతో ఊగిపోయిన కుల్దీప్ యాదవ్! వీడియో వైరల్ -
అద్బుత దృశ్యం.. ధోని ఆటోగ్రాఫ్ తీసుకున్న భారత దిగ్గజం
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే, కేకేఆర్ మ్యాచ్‌లో ఒక అద్బుత దృశ్యం చోటుచేసుకుంది. టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ ధోనిని ఆటోగ్రాఫ్ అడగడం ఆసక్తి కలిగించింది. ఈ అద్బుతం సీఎస్కే, కేకేఆర్ మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగింది. Photo: IPL Twitter ధోని అభిమానానికి ముచ్చటపడిన సునీల్ గావస్కర్ స్వయంగా అతని వద్దకు ఆటోగ్రాఫ్ అడిగాడు. ఒక దిగ్గజ క్రికెటర్ ఆటోగ్రాఫ్ అడిగితే ధోని కాదంటాడా చెప్పండి. సునీల్ గావస్కర్ షర్ట్ ముందుబాగంలోనే ధోని తన ఆటోగ్రాఫ్ ఇవ్వడం.. ఆ తర్వాత ధోనిని సునీల్ గావస్కర్ మనస్పూర్తిగా హత్తుకోవడం అందరిని ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Sunil Gavaskar taking autograph from MS Dhoni on his shirt. What a picture. pic.twitter.com/d74Rsq6YcR — CricketMAN2 (@ImTanujSingh) May 14, 2023 Photo: IPL Twitter అంతకముందు కేకేఆర్ ఆటగాడు రింకూ సింగ్ కూడా ధోని ఆటోగ్రాఫ్‌ను తీసుకున్నాడు. పుట్టినప్పటి నుంచే ధోని ఆట చూస్తూ పెరిగిన రింకూ సింగ్.. ఇవాళ తన అభిమాన ఆటగాడికి ప్రత్యర్థిగా ఆడడమే గాక ఫిఫ్టీతో మెరిసి కేకేఆర్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం తన అభిమాన ఆటగాడిని కలుసుకున్న రింకూ సింగ్ ధోనితో ముచ్చటించాడు. ధోని ఇచ్చిన విలువైన సలహాలను శ్రద్దగా విన్నాడు. అనంతరం తన జెర్సీపై ధోని ఆటోగ్రాఫ్‌ను పెట్టించుకున్నాడు. MS Dhoni signing in the jersey of Rinku Singh. What a beautiful moment. pic.twitter.com/ugB1kPfPNE — Johns. (@CricCrazyJohns) May 14, 2023 చదవండి: 'అరె లొల్లి సల్లగుండ'.. ప్రశ్న అర్థంగాక ధోని ఇబ్బంది -
IPL 2023: ధోని కెప్టెన్సీపై సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
క్రికెట్ అనిశ్చితికి మారుపేరు కాగా, టి20ల్లో ఇది మరీ ఎక్కువ. గత సీజన్లో చివరి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఈ సారి టాప్–3లో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఆరంభంలో సరిగా స్టార్ట్ కాని కారు ఇంజన్ తరహాలో ఉండే ముంబై ఇండియన్స్ ఇప్పుడు అందరికంటే ముందుగా క్వాలిఫై అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెరుగ్గా మొదలు పెట్టినా మధ్యలో స్పీడ్ బ్రేకర్లతో కాస్త ఇబ్బంది పడ్డ చెన్నై కూడా అగ్రస్థానంలో నిలవవచ్చు. గుజరాత్‌పై ముంబై గెలవడం కూడా ఆ జట్టుకు మేలు చేసింది. కోల్‌కతాపై గెలిచి ఇదే జోరు కొనసాగిస్తే చెన్నై టాప్కు చేరవచ్చు. యువ యశస్వి చేతిలో కోల్‌కతా పూర్తిగా చిత్తయింది. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ మాత్రమే అతను శతకం పూర్తి చేసుకుంటే అదో అద్భుతమయ్యేది. యశస్వి సెంచరీ పూర్తి కాకుండా ఉండేందుకు కోల్‌కతా బౌలర్ ఒకరు ఉద్దేశపూర్వకంగా వైడ్ బాల్ వేసేందుకు ప్రయత్నించడం ఆ జట్టు పరిస్థితిని చూపిస్తోంది. ఆ విషయాన్ని సదరు బౌలర్‌కు ఎవరైనా చెప్పి ఉంటారని ఆశిస్తున్నా. సరైన ఆరంభాలు లభించకపోవడం కోల్‌కతా సమస్య కాగా, వారి వైఫల్యంతో మిడిలార్డర్‌పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. మిడిల్లో చెన్నై స్పిన్నర్లూ వారిని కట్టడి చేయగలరు. చెన్నై వెలుగులోకి తెచ్చిన పతిరణ స్లాగ్ ఓవర్లలో తన విభిన్న శైలి బౌలింగ్‌తో చెలరేగుతున్నాడు. ప్రతీసారి చెన్నైకి రుతురాజ్, కాన్వే శుభారంభాలు అందిస్తున్నారు. శివమ్ దూబేను సీఎస్కే సమర్థంగా వాడుకోగలిగింది. సాధారణ ఆటగాళ్ల నుంచి కూడా స్థాయికి మించిన ప్రదర్శన రాబట్టడం ధోని కెప్టెన్సీ గొప్పతనం. స్వయంగా తానే ఆకట్టుకునే సిక్సర్లు బాది అందరినీ అలరిస్తున్నాడు. ధోని జోరు ఈ సీజన్‌కే పరిమితం కారాదని ఆశిద్దాం. చదవండి: హెచ్‌సీఏను ఏకిపారేసిన సునీల్ గావస్కర్ -
హెచ్‌సీఏను ఏకిపారేసిన సునీల్ గావస్కర్
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ మరో పరాజయాన్ని మూటగట్టుకొని ప్లేఆఫ్ చేరే అవకాశాలను కోల్పోయింది. శనివారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ సమయంలో నోబాల్ విషయమై ఎస్ఆర్హెచ్ అభిమానులు కాస్త అతి చేశారు. థర్డ్ అంపైర్ నోబాల్ ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు అభిమానులు లక్నో డగౌట్‌వైపు బోల్టులు, మేకులతో దాడి చేశారు. ఈ సమయంలో లక్నో ఆటగాళ్లు సహా సిబ్బంది అక్కడ ఉండడంతో కాస్త గందరగోళం నెలకొంది, అయితే డగౌట్‌కు కనీస భద్రతా ప్రమాణాలు లేకుండా కేవలం టెంట్లతో ఏర్పాటు చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. దేవుని దయ వల్ల మేకులు ఎవరికి గుచ్చుకోకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇదే విషయమై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ హెచ్‌సీఏ వైఖరిని ఎండగట్టాడు. ''ఐపీఎల్లో ఇతర వేదికల్లో డగౌట్లను ఫ్లెక్సీ గ్లాస్‌తో ఏర్పాటు చేశారు. కానీ హైదరాబాద్ స్టేడియంలో మాత్రం డగౌట్లను కేవలం గొడుగుల కింద ఏర్పాటు చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఇవాళ లక్నోతో మ్యాచ్ సందర్భంగా నోబాల్ ఇవ్వలేదని అభిమానులు మేకులు, బోల్టులు విసరడం మంచి పద్దతి కాదు. దేవుని దయవల్ల ఎవరికి ఏం కాలేదు. అయినా డగౌట్ ఏర్పాటులో ఇంత నిర్లక్ష్య ధోరణి పనికిరాదు. హెచ్‌సీఏ నిర్వహణ లోపం ఏంటనేది మరోసారి బయటపడింది. కనీసం సరైన డగౌట్లు నిర్మించలేని పరిస్థితిలో హెచ్‌సీఏ ఉండడం దురదృష్టకరం'' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఆవేశ్ ఖాన్ వేశాడు. ఓవర్ మూడో బంతి హైఫుల్ టాస్‌గా వెళ్లింది. క్రీజులో ఉన్న అబ్దుల్ సమద్ నడుము పై భాగంలో వెళ్లడంతో ఫీల్డ్ అంపైర్ నోబాల్‌కు కాల్ ఇచ్చాడు. అయితే లక్నో సూపర్‌జెయింట్స్ అంపైర్ కాల్‌ను చాలెంజ్ చేశారు. దీంతో అల్ట్రాఎడ్జ్‌లో పరిశీలించిన థర్డ్ అంపైర్ బంతి క్లియర్‌గా ఉందని.. నో బాల్ కాదని చెప్పాడు. దీంతో క్లాసెన్ సహా అబ్దుల్ సమద్‌లు షాక్‌కు గురయ్యారు. వాస్తవానికి నడుము పై నుంచి బంతి వెళితే నోబాల్ ఇవ్వడం జరుగుతుంది. అంత క్లియర్‌గా నోబాల్ అని కనిపిస్తున్నా థర్డ్ అంపైర్ కరెక్ట్ బాల్‌గా కౌంట్ చేయడం ఆసక్తి కలిగించింది. చదవండి: సూపర్ ప్రబ్‌సిమ్రన్.. ఓపెనర్‌గా వచ్చి సెంచరీ కొట్టి -
కోహ్లి, గంభీర్‌లను సస్పెండ్ చేసి పాడేయండి.. ఓవరాక్షన్ ఎక్కువైంది..!
ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మే 1న జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి-ఎల్ఎస్జీ మెంటార్ గౌతమ్ గంభీర్ల మధ్య జరిగిన ఘర్షనపై క్రికెట్ దిగ్గజం, భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఘాటుగా స్పందించాడు. కోహ్లి-గంభీర్‌లు జరిమానాలు విధిస్తే మారే రకం కాదని, వారిని తక్షణమే ఐపీఎల్ నుంచి సస్పెండ్ చేయాలని నిర్వహకులకు సూచించాడు. కోహ్లి-గంభీర్ల ఓవరాక్షన్ మరీ ఎక్కువైందని, ఇష్టం లేకపోతే స్వచ్ఛందంగా తప్పుకోవాలి కానీ, భారత క్రికెట్ పరువును ఇలా బజారుకీడ్చకూడదని హెచ్చరించాడు. జరిమానాలు విధించి సరిపెట్టుకుంటే వారి ఓవరాక్షన్ ఆగదని, కఠినమైన శిక్షలు వేస్తే ఏమైనా మారే అవకాశం ఉంటుందని అన్నాడు. కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకునే కోహ్లి, గంభీర్‌లు ఫైన్లు అస్సలు లెక్క చేయరని, భవిష్యత్తులో ఇలాంటివి జరగవని వారి నుంచి కచ్చితమైన హామీ లభిస్తేనే లీగ్‌లో కొనసాగించాలని, అలా చేయకపోతే వారిని లీగ్ నుంచి బహిష్కరించాలని కోరాడు. రూల్స్ వ్యతిరేకించి, దేశ పరువును బజారుకీడ్చిన వారు ఎంతటి స్టార్ క్రికెటర్లైనా సహించకూడదని, కఠిన చర్చలు తీసుకుంటేనే మున్ముందు ఇలాంటివి జరగకుండా ఉంటాయని అభిప్రాయపడ్డాడు. తాము క్రికెట్ ఆడే రోజుల్లో కూడా స్వల్ప స్థాయిలో కవ్వింపులు ఉండేవని, మరీ ఇలా బాహాబాహీకి దిగిన దాఖలాలు చాలా అరుదు అని తెలిపాడు. కాగా, లక్నో-ఆర్సీబీ మ్యాచ్‌లో నవీన్ ఉల్ హాక్-కోహ్లిల మధ్య మొదలైన చిన్నపాటి వివాదం చినిచినికి గాలివానలా మారి క్రికెట్ సర్కిల్స్‌లో ప్రకంపనలకు కారణమైంది. నవీన్‌తో కోహ్లి గొడవపడటాన్ని పర్సనల్‌గా తీసుకున్న గంభీర్ మ్యాచ్ అనంతరం నానా హంగామా చేశాడు. కోహ్లి కూడా ఏ మాత్రం తగ్గలేదు. వీరిద్దరి గొడవకు దిగిన సమయంలో లక్నో మైదానం రణరంగాన్ని తలపించింది. బాహాటంగా గొడవకు దిగి, రూల్స్‌ను తుంగలో తొక్కినందుకు గాను బీసీసీఐ కోహ్లి, గంభీర్‌లకు 100 శాతం (ఒక మ్యాచ్‌కు) మ్యాచ్ ఫీజ్‌లో కోత విధించింది. -
IPL 2023: రోహిత్ శర్మ.. కొద్ది రోజులు రెస్ట్ తీసుకో..!
ఐపీఎల్-2023 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ సారధి రోహిత్ శర్మ పాక్షికంగా విరామం తీసుకోవాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. గుజరాత్ చేతిలో ఓటమి అనంతరం హిట్‌మ్యాన్‌ను ఉద్దేశిస్తూ సన్నీ ఈ కామెంట్స్ చేశాడు. ప్రస్తుత సీజన్లో ముంబై పేలవ ప్రదర్శనకు (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) రోహిత్ ఫామ్ కూడా ఓ కారణమని, చిన్న విరామం అనంతరం తిరిగి వస్తే అతని ఆటతీరులో కూడా మార్పు వస్తుందని, ఇలా చేయడం ముంబై ఇండియన్స్‌తో పాటు టీమిండియాకు మేలు చేస్తుందని అభిప్రాయపడ్డాడు. స్వల్ప విరామం అనంతరం హిట్‌మ్యాన్ ఫ్రెష్‌గా ఆడుకోవచ్చని (ఐపీఎల్ చివరి మ్యాచ్‌ల్లో), ఇలా చేయడం వల్ల అతను డబ్ల్యూటీసీ ఫైనల్‌పై కూడా కాన్సంట్రేట్ చేయవచ్చని తెలిపాడు. ఫామ్‌లో లేని రోహిత్ బ్రేక్ తీసుకోవడం వల్ల గాయాల బారిన పడే ప్రమాదం కూడా తప్పుతుందని, 35 ఏళ్ల రోహిత్‌కు ఇది మేలు చేస్తుందని అన్నాడు. ముంబై ఇండియన్స్‌కు సైతం రోహిత్ గైర్హాజరీలో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుందని, ఇలా జరిగితే వారి ఆటతీరులోనూ మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, ఆతర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించి, మళ్లీ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయాల బాట పట్టింది. ముంబై వైఫల్యాలకు నాణ్యమైన ఫాస్ట్ బౌలర్ లేకపోవడం ఓ కారణమైతే, బ్యాటర్ల వరుస వైఫల్యాలు మరో కారణం. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ, గ్రీన్ మినహయించి అందరూ దారుణంగా విఫలమవుతున్నారు. హిట్‌మ్యాన్ ఫామ్ ఆందోళనకరంగా ఉంది. అతనాడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. వాస్తవానికి రోహిత్ శర్మ స్థాయి ఇది కాదు. -
'వార్నర్‌ను పక్కన పెట్టి అతడికి ఢిల్లీ కెప్టెన్సీ ఇవ్వండి'
ఐపీఎల్-2023లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. తొలుత బ్యాటింగ్‌లో 34 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన అక్షర్.. తర్వాత బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ విజయం సాధించడంలో అక్షర్ పటేల్ ముఖ్య పాత్ర పోషించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన అక్షర్ పటేల్‌పై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించే సత్తా అక్షర్‌పటేల్‌కు ఉందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ ఏడాది సీజన్‌కు రిషబ్ పంత్ దూరం కావడంతో ఢిల్లీ కెప్టెన్సీ బాధ్యతలు డేవిడ్ వార్నర్ చేపట్టాడు. వార్నర్‌కు డిప్యూటీగా అక్షర్ పటేల్ వ్యవహరిస్తున్నాడు. "అక్షర్ పటేల్ అద్భుతమైన ఆల్‌రౌండర్. అతడికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి అక్షర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా నియమించాలి. అతడో నిజాయతీ గల ఆటగాడు. అదే విధంగా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతన్ని కెప్టెన్ గా చేసి, బాగా రాణించగలిగితే భారత జట్టుకు కూడా మేలు జరుగుతుంది" అని స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ లైవ్ లో గవాస్కర్ పేర్కొన్నాడు. ఇక ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్లో ఏడు మ్యాచ్‌లు ఆడిన అక్షర్.. 182 పరుగులతో పాటు 6వికెట్లు సాధించాడు. చదవండి: IPL 2023: డేవిడ్ వార్నర్‌కు బిగ్ షాక్.. భారీ జరిమానా! ఎంతంటే? -
ధోని లాంటి కెప్టెన్ లేడు.. ఇక ముందు రాబోడు: టీమిండియా దిగ్గజం
IPL 2023- RCB Vs CSK- MS Dhoni: టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్ ధోనినే అంటూ కితాబులు ఇచ్చాడు. భవిష్యత్తులో కూడా తనలాంటి నాయకుడు మరెవరూ రాబోరంటూ మిస్టర్ కూల్‌ను ఆకాశానికెత్తాడు. ఒకే ఒక్కడు భారత్‌కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఎంఎస్ ధోని.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పటికే సీఎస్కేను నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత ధోనిది. ఇక ఇటీవల(ఏప్రిల్ 12న) రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌తో చెన్నై కెప్టెన్‌గా 200 మ్యాచ్ పూర్తి చేసుకున్నాడు. తద్వారా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఈ అరుదైన రికార్డు సాధించిన ఏకైక సారథిగా 41 ఏళ్ల ధోని నిలిచాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే రెండింట విజయాలు సాధించింది. మామూలు విషయం కాదు ఈ క్రమంలో బెంగళూరు వేదికగా ఆర్సీబీతో సోమవారం తదుపరి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ షోలో మాట్లాడుతూ ధోని గురించి గావస్కర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘‘సీఎస్కేకు గడ్డు పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో తెలుసు. ఎంఎస్ ధోని కెప్టెన్సీలో మాత్రమే సీఎస్కేకు ఇది సాధ్యపడుతుంది. మహీ డిఫరెంట్ 200 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించడం అంటే మామూలు విషయం కాదు. అన్నేసి మ్యాచ్‌లకు సారథ్యం వహించడం అంటే మోయలేని భారాన్ని నెత్తినవేసుకున్నట్లే. అది వ్యక్తిగత ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సాధారణంగా అందరు ఆటగాళ్ల విషయంలో జరిగేది ఇది. అయితే, మహీ అందరికీ భిన్నం. అతడు ప్రత్యేక సామర్థ్యాలు కలిగిన కెప్టెన్. తనలాంటి కెప్టెన్లు ఐపీఎల్లో ఇంత వరకు ఎవరూ లేరు. ఇక ముందు రాబోరు కూడా! అతడు అత్యుత్తమ కెప్టెన్’’ అని ఈ టీమిండియా మాజీ సారథి.. ధోని నైపుణ్యాలను ప్రశంసించాడు. కాగా సీఎస్కే కెప్టెన్‌గా 200 మ్యాచ్‌లు ఆడిన ధోని ఖాతాలో 120 విజయాలు ఉన్నాయి. 79 సార్లు ఓటమి ఎదురుకాగా.. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. చదవండి: సంజూపై ప్రశంసల వర్షం.. వైరల్ ట్వీట్! నాకే గనుక ఆ అవకాశం ఉంటే.. అర్జున్ చాలా కష్టపడ్డాడు.. సచిన్ టెండుల్కర్ భావోద్వేగం! వీడియో వైరల్ -
ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్! ప్రతీసారి ఇంతే
ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు మన్దీప్ సింగ్ వరుసగా రెండో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. పంజాబ్ కింగ్స్‌తో తొలి మ్యాచ్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే చేసిన మన్దీప్.. ఇప్పుడు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాడిగా మన్దీప్(15) రికార్డులకెక్కాడు.దీంతో అతడి ఆటతీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో మన్దీప్ ఆటతీరుపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ప్రతీ ఐపీఎల్ సీజన్లో ఎదోక జట్టులో మన్దీప్ ఉంటాడని, అయితే తన స్థానానికి మాత్రం ఎటువంటి న్యాయం చేయడని గవాస్కర్ విమర్శించాడు. అతడు ఔటైన సమయంలో కామెంటరీ బాక్స్‌లో ఉన్న గవాస్కర్ మాట్లాడుతూ.. ప్రతీ సారి అతడిని ఏదో ఒక ప్రాంఛైజీ కొనుగొలు చేస్తుంది. కానీ అతడి మాత్రం తనకు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. బహుశా అతడు వచ్చే సీజన్‌కు కేకేఆర్ విడిచిపెట్టే అవకాశం ఉంది అని పేర్కొన్నాడు. మరోవైపు నెటిజన్లు సైతం మన్‌దీప్‌ను ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఐపీఎల్‌కు ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్ అంటూ ట్రోలు చేస్తున్నారు. చదవండి: రోహిత్, కోహ్లి, రాహుల్‌కే ఛాన్స్‌లు ఇస్తారా.. అతడు ఏం పాపం చేశాడు మరి? -
క్రికెట్లో మరో కొత్తరూల్... సూనీల్ గవాస్కర్ ఐడియా
-
ధోని కంటే ముందే గ్రౌండ్లోకి .. గావస్కర్ చివాట్లు
ఐపీఎల్ 16వ సీజన్లో సోమవారం సీఎస్కే, లక్నో మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీఎస్కే ఇన్నింగ్స్ ఆఖర్లో.. జడేజా ఔటయ్యి పెవిలియన్‌కు వెళ్తున్నాడు.. ఇక ధోని గ్రౌండ్లోకి రావాల్సి ఉంది. కానీ సరిగ్గా ఇదే సమయంలో ధోని కంటే ముందు ఒక కుక్క అనుకోకుండా గ్రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎక్కడినుంచి వచ్చిందో తెలియక గ్రౌండ్ సిబ్బంది కాస్త తడబాటుకు గరయ్యారు. కుక్కను బయటికి పంపడానికి వచ్చిన ఆరుగురు సిబ్బందిని పరుగులు పెట్టించింది. చివరకు ఎలాగోలా దానిని బయటకు పంపించారు. ఇదంతా గమనించిన ధోని, జడేజాలు కాసేపు నవ్వుకున్నారు. అయితే ఇక్కడ మరో విషయమేంటంటే.. ధోని ఎంట్రీ కూడా అప్పుడే జరిగింది. నాలుగేళ్ల తర్వాత చెపాక్ స్టేడియంలో మ్యాచ్ ఆడుతున్న ధోనికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. అతను గ్రౌండ్లోకి వస్తున్న సమయంలో స్టేడియం మొత్తం ధోని.. ధోని అరుపులతో దద్దరిల్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ మాత్రం ఒక కుక్కను అదుపు చేయలేని గ్రౌండ్ సిబ్బందికి చివాట్లు పెట్టారు. మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్వవహరించిన గావస్కర్ ఎయిర్‌లో మాట్లాడుతూ.. 'అసలే వైడ్స్, నోబాల్స్‌తో టైం వేస్ట్ అవుతుంటే.. మధ్యలో కుక్క వల్ల కాసేపు అంతరాయం. సిబ్బంది కళ్లు గప్పి కుక్క మైదానంలోకి వచ్చిదంటేనే వారి పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇది ఏ మాత్రం సహించలేనిది. పైగా ఒక కుక్కను కంట్రోల్ చేయడానికి ఆరుగురు వచ్చారు.. ఒక్కరు పట్టుకోలేకపోయారు.. వీటి వల్ల సమయం చాలా వృథా అవుతుంది'' అంటూ కామెంట్ చేశాడు. Look who wants to come on as an Impact Player... 😂 A dog delays start at Chepauk. Even as the groundsmen try in vain to get it out, Avesh Khan joins the fun. The audience is loving every bit of this. #CSKvLSG #IPL2023 @sportstarweb pic.twitter.com/Egv2s36QWn — Santadeep Dey (@SantadeepDey) April 3, 2023 #CSKvLSG #DogLover #CSK Even dog can not stop him to come #Chepauk pic.twitter.com/tOQDT9xble — mohit (@Rajwar2Rajwar) April 3, 2023 చదవండి: ఏంది ఈ అరాచకం.. రెండు సిక్సర్లకే! -
'వాట్ యాన్ ఐడియా సర్ జీ'.. ఈ దెబ్బతో బౌలర్లు దారిలోకి
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సోమవారం సీఎస్కే, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. మ్యాచ్‌లో సీఎస్కే 12 పరుగులతో గెలిచి సీజన్లో బోణీ కొట్టింది. ఫలితం సంగతి పక్కనబెడితే మ్యాచ్‌లో 34 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో రావడం ఆసక్తి కలిగించింది. ఇందులో వైడ్లు 20 ఉంటే.. సీఎస్కేవి 13 కాగా.. లక్నోవి ఏడు వైడ్స్ ఉన్నాయి. ఒకవేళ ఆ 13 వైడ్స్ ఇవ్వకపోయుంటే 25 పరుగులతో గెలిచి ఉండేది. అలా అయితే రన్‌రేట్ కాస్త మెరుగ్గా ఉండేది. ఇక తమ బౌలర్లు ఎక్స్‌ట్రాలు ఇవ్వడంపై సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని సీరియస్ అయ్యాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ..'' తర్వాతి మ్యాచ్ నుంచి మా బౌలర్లు నోబాల్స్, వైడ్స్ ఎక్కువగా వేస్తే ఊరుకోను. నేను కెప్టెన్ పదవి నుంచి దిగిపోతా. అప్పుడు వేరే కెప్టెన్ నేతృతంలో ఆడాల్సి ఉంటుంది. ఇది నా సెకండ్ వార్నింగ్.. ఇంకోసారి ఇలా జరిగితే తప్పుకుంటా'' అంటూ జట్టును హెచ్చరించాడు. ఇదే విషయమై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఒక యూనిక్ ఐడియా ఇవ్వడం అందరిని ఆకట్టుకుంది.'' మ్యాచ్‌లో బౌలర్లు రెండు లేదా మూడు వైడ్స్ వేస్తే బ్యాటర్‌కు ఫ్రీహిట్ ఇవ్వండి.. అప్పుడు బౌలర్లు ఆటోమెటిక్‌గా దారిలోకి వస్తారు. నియంత్రణతో బౌలింగ్ వేయడం చూస్తాం.'' అంటూ పేర్కొన్నాడు. కాగా లక్నో ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 17వ ఓవర్లో దీపక్ చహర్ వరుసగా మూడు వైడ్స్ వేసిన సమయంలో సునీల్ కామెంట్రీలో ఇలా స్పందించాడు. పక్కనే ఉన్న మరో కామెంటేటర్ ఇయాన్ బిషప్ మాత్రం..'' వినడానికి హాస్యాస్పదంగా'' ఉంది అంటూ కామెంట్ చేశాడు. అయితే బిషప్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన సునీల్.. ''ఇలాంటి వైడ్స్, నోబాల్స్ వల్ల మ్యాచ్ సమయం చాలా వృథా అవుతుంది. అందుకే నేను చెప్పింది మంచి ఆలోచనే.. వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తే మంచిది'' అంటూ తనను తాను సమర్థించుకున్నాడు. అయితే సునీల్ గావస్కర్ ఐడియాపై కొందరు అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. ''వాట్ యాన్ ఐడియా సర్ జీ.. దెబ్బకు బౌలర్లు దారిలోకి రావడం ఖాయం.'' అంటూ పేర్కొన్నారు. ఇక ఐపీఎల్ 2023 సీజన్‌కు పలు కొత్త రూల్స్ వచ్చాయి. ఇంపాక్ల్ ప్లేయర్ అనే రూల్‌ను ఈసారి కొత్తగా ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఇంపాక్ట్ రూల్‌ను అన్ని జట్లు విరివిగా వాడేస్తున్నాయి. ఇక వైడ్, నోబాల్స్ విషయంలోనూ ఆటగాళ్లు డీఆర్ఎస్కు వెళ్లే అవకాశాన్ని కల్పించారు. -
ఈ మూడు మ్యాచ్‌లను మర్చిపో సూర్య.. ఐపీఎల్లో బాగా ఆడు!
టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మూడింట్లోనూ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్‌పై తీవ్ర విమర్శలు వర్షం కురుస్తోంది. అతడు వన్డేలకు పనికిరాడని, జట్టు నుంచి వెంటనే తొలిగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సూర్యకు కొంతమంది మాజీ క్రికెటర్లు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా సూర్యకు సపోర్ట్‌గా నిలిచాడు. ఆసీస్ సిరీస్‌ను మర్చిపోవాలి అని,రాబోయే ఐపీఎల్ సీజన్‌పై దృష్టి సారించాలని గవాస్కర్ సూచించాడు. "క్రికెట్ కెరీర్లో ఏ ఆటగాడైనా ఇటువంటి పరిస్ధితులను ఎదుర్కొవడం సహజం. ఆ విషయాన్ని సూర్య అర్ధం చేసుకోవాలి. ఇప్పుడు సూర్య చేయాల్సిన పని ఒక్కటే. ఈ మూడు మ్యాచ్‌లను ఒక పీడ కలలా మర్చిపోయి, త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్‌పై దృష్టి పెట్టాలి. ఐపీఎల్లో పరుగులు సాధిస్తే..సూర్య తన ఫామ్‌ను తిరిగి పొందుతాడు. అయితే ఈ సిరీస్‌లో అతడు మొదటి బంతికే 3 సార్లు ఔట్ అయ్యాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో అద్భుతమైన బంతులతో మిచెల్ స్టార్క్.. సూర్యను పెవిలియన్‌కు పంపాడు. కానీ మూడో వన్డేలో మాత్రం సూర్య కొంచెం జాగ్రత్తగా ఆడి ఉంటే బాగుండేంది. ఎందుకుంటే సూర్య ఔటైన డెలివరి అంత గొప్పది ఏమి కాదు" అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ పేర్కొన్నాడు. చదవండి: IND vs AUS: అతడి వికెటే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్.. లేదంటేనా? -
భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే.. విశాఖకు చేరుకున్న సునీల్ గావస్కర్
విశాఖపట్నం వేదికగా భారత్- ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డేకు రంగం సిద్దమైంది. ఆదివారం(మార్చి 19)న జరగనున్న ఈ మ్యాచ్‌కు నిర్వహాకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మ్యాచ్ వీక్షించేందుకు దాదాపు 25 వేల మంది స్టేడియంకు రానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రెండో వన్డేకు వాఖ్యతగా వ్యవహరించనున్న టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ విశాఖకు శనివారం చేరుకున్నారు. అతడికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపీనాథ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. మ్యాచ్‌కు వర్షం ముప్పు.. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.మార్చి 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు విశాఖలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం మ్యాచ్ జరిగే సమయంలో ఉరుములు, ఈదురు గాలులతో భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది ఉందని భారత వాతావరణ విభాగం (IMD) ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు వర్షం పడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు.. స్టేడియం నిర్వాహకులు తెలిపారు. వర్షం నుంచి మైదానాన్ని రక్షించేందుకు అవసరమైన అత్యంత తేలికైన పిచ్ కవర్లు తమ వద్ద ఉన్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. తుది జట్లు(అంచనా) భారత్: శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా. -
WTC Final: భరత్ వద్దు.. అతడే సరైనోడు అంటున్న టీమిండియా దిగ్గజం! ఎందుకిలా?
WTC Final 2023- India Vs Australia: స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ కంగారూ జట్టును ఢీకొట్టబోతోంది. డబ్ల్యూటీసీ 2021-23 సైకిల్ తుదిపోరులో ఇంగ్లండ్ గడ్డ మీద ఆసీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జూన్ 7- 11 వరకు ఇరు జట్ల మ్యాచ్‌కు ఇప్పటికే ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్లో కమిన్స్ బృందంతో తలపడే భారత జట్టుపై అంచనాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. అదరగొట్టిన గిల్ తొలి టెస్టులో పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న ఈ కర్ణాటక బ్యాటర్‌ను ఢిల్లీ మ్యాచ్‌లోనూ కొనసాగించడంతో సెలక్టర్ల తీరుపై విమర్శల వర్షం కురిసింది. ఈ క్రమంలో మూడో టెస్టులో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ స్థానంలో యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ జట్టులోకి వచ్చాడు. ఇండోర్ టెస్టులో పెద్దగా రాణించనప్పటికీ ఆఖరిదైన నిర్ణయాత్మక అహ్మదాబాద్ టెస్టులో శతకంతో చెలరేగాడు. విలువైన 44 పరుగులు గిల్, విరాట్ కోహ్లి అద్భుత సెంచరీల కారణంగా చివరి టెస్టును డ్రా చేసుకున్న రోహిత్ సేన ట్రోఫీని ముద్దాడింది. ఇక ఈ నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌తో అరంగేట్రం చేసిన ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాటర్ కేఎస్ భరత్.. ఆరంభంలో ఆకట్టుకోలేకపోయినా.. చివరి టెస్టులో 44 విలువైన పరుగులు చేసి డ్రా కావడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఓపెనర్‌గా గిల్, వికెట్ కీపర్‌గా కేఎస్ భరత్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని.. డబ్ల్యూటీసీ ఫైనల్లో వీరిని కొనసాగించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. సునిల్ గావస్కర్ మాత్రం కేఎల్ రాహుల్ పేరును తెరమీదకు తెచ్చాడు. భరత్ వద్దు.. అతడే సరైనోడు ‘‘ఫైనల్లో రాహుల్‌ను వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఆడించవచ్చు. ఓవల్‌లో ఐదు లేదంటే ఆరో స్థానంలో అతడిని ఆడిస్తే బ్యాటింగ్ ఆర్డర్ మరింత పటిష్టమవుతుంది. గతేడాది ఇంగ్లండ్‌లో రాహుల్ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకునే ఈ మాట అంటున్నాను. లార్డ్స్‌లో అతడు సెంచరీ సాధించాడు. కాబట్టి డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టును ఎంపిక చేసేటపుడు తప్పకుండా రాహుల్ పేరును పరిగణనలోకి తీసుకోవాలి’’ అని గావస్కర్ స్పోర్ట్స్‌తక్‌తో వ్యాఖ్యానించాడు. ఎందుకు సర్ ఇలా అంటున్నారు? ఇక కేఎస్ భరత్ వికెట్ కీపింగ్ నైపుణ్యాలు మరింత మెరుగుపరచుకోవాలన్న గావస్కర్.. ‘‘ఒకవేళ డబ్ల్యూటీసీ ఫైనల్ తుది జట్టులో కేఎస్ భరత్ ఉంటాడా లేదా అన్నది పూర్తిగా సెలక్షన్ కమిటీ నిర్ణయం. అయితే, నా అభిప్రాయం ప్రకారం ఇంగ్లండ్ పిచ్‌లపై వికెట్ కీపింగ్ చేయాలంటే కేఎల్ రాహుల్ వంటి అనుభవజ్ఞులు అవసరం. లేదంటే ఇషాన్ కిషన్ పేరును కూడా పరిశీలించవచ్చు. ఎందుకంటే భరత్ కంటే అతడు మెరుగ్గా బ్యాటింగ్ చేయగలడు’’ అని పేర్కొన్నాడు. దీంతో గావస్కర్ మాటలపై కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ‘‘డబ్ల్యూటీసీ ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో.. టెస్టుల్లో అరంగేట్రం చేయని ఇషాన్‌ను ఆడించాలి.. చాన్నాళ్లుగా విఫలమవుతున్న రాహుల్‌ను ఎంపిక చేయాలి.. కానీ తనను తాను నిరూపించుకుంటున్న భరత్‌ను మాత్రం పక్కనపెట్టాలా?’’ అని ట్రోల్ చేస్తున్నారు. ఈ వివక్ష ఎందుకో అర్థం కావడం లేదంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ పంత్ గతేడాది యాక్సిడెంట్‌కు గురైన కారణంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. దీంతో అతడి స్థానంలో భరత్ బీజీటీ-2023 ద్వారా అరంగేట్రం చేశాడు. చదవండి: ఖరీదైన 6 బెడ్ రూమ్‌ల భవనాన్ని కొనుగోలు చేసిన పాంటింగ్.. ధర ఎంతో తెలుసా..? విలియమ్సన్, సౌతీలకు ఊరట.. ఐపీఎల్ కోసం..! -
BGT 2023: సెలక్టర్లు రాజీనామా చేయాల్సిందే: టీమిండియా దిగ్గజం వ్యాఖ్యలు వైరల్
Border- Gavaskar Trophy 2023: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్ నేపథ్యంలో ఉపఖండ పిచ్‌ల గురించి క్రికెట్ ఆస్ట్రేలియా, మాజీ క్రికెటర్లు, మీడియా చేస్తున్న రచ్చ అంతా ఇంతాకాదు. ముఖ్యంగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే ‘డాక్టర్డ్ పిచ్’ అంటూ నిందలు వేయడం, నాగ్‌పూర్, ఢిల్లీ టెస్టులు రెండున్నర రోజుల్లోనే ముగియడం.. రెండింటిలో గెలిచి టీమిండియా ఆధిక్యంలోకి వెళ్లడం.. తదితర పరిణామాలతో వారి వ్యాఖ్యలు శ్రుతిమించాయి. ఇక మూడో టెస్టులో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడం.. ఇండోర్ పిచ్ నాసిరకంగా ఉందంటూ ఐసీసీ మూడు డీమెరిట్ పాయింట్లు ఇవ్వడంతో వాళ్ల నోటిదురుసుకు తాళం పడింది. ఈ నేపథ్యంలో గతేడాది గబ్బాలో ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికాల మధ్య టెస్టు రెండు రోజుల్లోనే ముగియడం గురించి ప్రస్తావిస్తూ ఆసీస్, ఐసీసీ తీరును ఎండగట్టాడు టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్. సెలక్టర్లపై గావస్కర్ ఫైర్ ఆసీస్‌లో జరిగిన ఆ టెస్టు కూడా రెండురోజుల్లోనే ముగిసిందని గుర్తుచేస్తూ.. అప్పుడు ఎన్ని డీమెరిట్ పాయింట్లు ఇచ్చారంటూ ప్రశ్నించాడు. ఈ క్రమంలో మొదటి రెండు టెస్టుల్లో ఆసీస్ ఓటములకు సెలక్టర్లను బాధ్యులను చేయాలంటూ గావస్కర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవతున్నాయి. పిచ్ గురించి రచ్చ చేయడం మానుకుని అసలు ఆస్ట్రేలియా సెలక్టర్లు ఏం చేస్తున్నారో గమనించాలంటూ హితవు పలికాడీ లెజెండ్. ఆటగాళ్లను విమర్శిస్తున్న వాళ్లు సెలక్టర్ల గురించి ఒక్క మాట మాట్లాడకపోవడం చిత్రంగా ఉందన్నాడు. ‘‘చాలా మంది ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు వివిధ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఆటగాళ్ల గురించి విమర్శలు చేస్తున్నారు. నిజానికి వాళ్లు సెలక్టర్లను టార్గెట్ చేయాల్సింది. తొలి రెండు టెస్టులకు అందుబాటులో ఉంటారో లేరోనని సందేహం ఉన్నప్పటికీ హాజిల్‌వుడ్, స్టార్క్, కామెరాన్ గ్రీన్‌లను ఎలా ఎంపిక చేస్తారు? అంటే సగం సిరీస్‌కు వాళ్లు అందుబాటులో ఉండరని తెలిసి సెలక్ట్ చేశారంటే 13 మందితోనే జట్టును ప్రకటించి ఉండవచ్చు కదా! వాళ్లు వెంటనే రాజీనామా చేయాలి ఇక అప్పటికప్పుడు కొత్త ప్లేయర్(మాథ్యూ కుహ్నెమన్)ను హడావుడిగా రప్పించారు. అలాంటి బౌలర్ జట్టుతో ఉన్నప్పటికీ మళ్లీ స్పిన్నర్‌ను తీసుకున్నారు. ఒకవేళ జట్టుకు ఆ ఆటగాడు అవసరం లేడనుకుంటే ముందే అతడిని ఎంపిక చేయడం ఎందుకు? తర్వాత అతడి స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం ఎందుకు? అంటే మేనేజ్మెంట్ 12 మంది ప్లేయర్ల నుంచి 11 మందిని ఎంపిక చేసుకుంటుందా? మరీ చిత్రంగా ఉంది. సెలక్టర్లకు నిజంగా చిత్తుశుద్ధి, పని పట్ల అంకితభావం ఉంటే.. వెంటనే వాళ్లు రాజీనామా చేయాలి. ఒకవేళ మిగిలిన టెస్టుల్లో ఆస్ట్రేలియా విజయం సాధించినా సరే వాళ్లు తమ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిందే’’ అని స్పోర్ట్స్ స్టార్‌తో గావస్కర్ వ్యాఖ్యానించాడు. మూడో టెస్టుకు ముందు ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా సిరీస్ ఆరంభంలోనే మిచెల్ స్వెప్సన్ తన తొలి సంతానాన్ని చూసుకునేందుకు స్వదేశానికి వెళ్లిపోగా.. జోష్ హాజిల్‌వుడ్ మడిమ నొప్పి, వార్నర్ మోచేతి గాయం, మ్యాట్ రెన్షా మోకాలి గాయంతో ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక తొలి రెండు మ్యాచ్‌లలో ఆడే అవకాశం రాని అష్టన్ అగర్ దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించడానికి.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన తల్లి అనారోగ్యం పాలవడంతో సొంత దేశానికి వెళ్లిపోయిన విషయం విదితమే. చదవండి: WPL 2023: తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు.. కేవలం రూ.10 లక్షలు మాత్రమే! ఎవరీ తారా నోరిస్? WPL 2023: ముంబై ఇండియన్స్ రికార్డు బద్దలు కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఒక్క మ్యాచ్‌తోనే రికార్డు గల్లంతు -
'ఇండోర్‌కే మూడిస్తే.. మరి గబ్బాకు ఎన్నివ్వాలి?'
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్టుకు వేదికైన ఇండోర్ పిచ్ నాసిరకంగా ఉందని పేర్కొన్న ఐసీసీ మూడు డీమెరిట్ పాయింట్లు విధించిన విషయం తెలిసిందే. రెండురోజుల్లోనే 30 వికెట్లు కూలడం.. మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగిసిపోవడం విమర్శలకు దారి తీసింది. అయితే ఐసీసీ డీమెరిట్ పాయింట్లు విధించడంపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''ఇండోర్ పిచ్‌కు ఐసీసీ మూడు డీమెరిట్ పాయింట్లు ఇవ్వడం నాకు నచ్చలేదు. అయితే ఒక విషయం తెలుసుకోవాలని ఉంది. గతేడాది నవంబర్‌లో బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరిగిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ రెండురోజుల్లోనే ముగిసింది. మరి ఈ పిచ్‌కు ఐసీసీ ఎన్ని డీమెరిట్ పాయింట్లు కేటాయించింది.? అప్పుడు మ్యాచ్ రిఫరీ ఎవరు?'' అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. గతేడాది నవంబర్‌లో గబ్బాలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మొదటి టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. ఆ మ్యాచ్‌లో ఆతిథ్య ఆసీస్ విజయం సాధించింది.ఆ తర్వాతి టెస్టుల్లోనూ గెలుపొందిన ఆసీస్ సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది. బౌలర్లకు ఎక్కువగా సహకరించిన గబ్బా పిచ్‌కు ఐసీసీ అప్పట్లో ఒక్క డీమెరిట్ పాయింట్‌తో తక్కువ యావరేజ్‌తో రేటింగ్ ఇచ్చింది. ఇదే విషయాన్ని లేవనెత్తిన గావస్కర్ ఐసీసీ వైఖరిని తప్పుబట్టాడు. ఇక మూడో టెస్టులో టీమిండియా అనూహ్యంగా ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా చేతిలో 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 2012 నవంబర్ తర్వాత సొంత గడ్డపై భారత్‌కు ఇది టెస్టుల్లో తొలి ఓటమి కావడం విశేషం. 76 పరుగుల లక్ష్యంతో మూడో రోజు బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రీలియా తొలి సెషన్లోనే విజయం సాధించింది. మార్నస్ లబుషేన్ (28), ఓపెనర్ ట్రెవిస్ హెడ్ (49) ధనాధన్ ఆడి మ్యాచ్ ముగించారు. 11 వికెట్లు తీసిన నాథన్ లియాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ విజయంతో, నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ బోణీ కొట్టింది. భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. అహ్మదాబాద్ స్టేడియంలో మార్చి 9న నాలుగో టెస్టు జరగనుంది. చదవండి: 'ఇండోర్ పిచ్ అత్యంత నాసిరకం' -
BGT 2023: పిచ్ పరమ చెత్తగా ఉంది.. అతడు లేడు కాబట్టే ఇలా: టీమిండియా దిగ్గజం
India vs Australia, 3rd Test: ‘‘భారత పిచ్‌లపై ఇరవై వికెట్లు తీయడమంటే అంత సులువేమీ కాదు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి స్టార్ పేసర్లు లేకుండా అస్సలు సాధ్యపడదు. అనుభవం తక్కువైనప్పటికీ మహ్మద్ సిరాజ్ ప్రభావం చూపగలడు. కానీ అనుకున్న ఫలితాలు రాబట్టాలంటే ఇప్పుడున్న బౌలింగ్ విభాగంతో సాధ్యం కాదు. ఈ సిరీస్‌కు సంబంధించి మన బౌలింగ్ విభాగం మరీ అంత పటిష్టంగా ఉన్నట్లు కనిపించడం లేదు. అయితే, పిచ్ సహకారం ఉంటే టీమిండియా 20 వికెట్లు తొందరగానే పడగొట్టగలదు. ఇలాంటి పిచ్‌లు తయారు చేయడం వెనుక అసలు కారణం ఇదేనేమో!’’ అని టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ అన్నాడు. ఒకవేళ బుమ్రా జట్టుతో ఉంటే గనుక కాస్త మెరుగైన పిచ్ తయారు చేసేవాళ్లని అభిప్రాయపడ్డాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే క్రమంలో బుమ్రా వంటి స్టార్ల గైర్హాజరీలో ఇలాంటి పిచ్‌లు తయారు చేయడం కంటే టీమిండియాకు మరో అప్షన్ లేదని పేర్కొన్నాడు. ‘‘ఒకవేళ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంటే.. పిచ్ వేరేలా ఉండేదేమో! నిజానికి సొంతగడ్డపై స్పిన్నర్లే టీమిండియాకు బలం. అందుకే వాళ్లు ఇలా చేసి ఉంటారు. ఫ్లాట్ పిచ్‌లపై బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించడం ఖాయం. కానీ ఈ పిచ్‌లు బ్యాటర్ల సహనానికి పరీక్షగా నిలిచాయి’’ అని సునిల్ గావస్కర్ పేర్కొన్నాడు. ఏదేమైనా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో నాగ్‌పూర్, ఢిల్లీ పిచ్‌ల కంటే ఇండోర్ పిచ్ పరమచెత్తగా ఉందని గావస్కర్ కుండబద్దలుకొట్టాడు. ఇప్పటి వరకు మూడు టెస్టులు రెండున్నర రోజుల్లోనే ముగిసిన నేపథ్యంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. అత్యంత నాసికరంగా పిచ్ ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీమిండియా తొలి రెండు టెస్టుల్లో గెలవగా... మూడో మ్యాచ్‌లో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఇండోర్‌లో తొలి రోజు నుంచే బంతి స్పిన్‌కు టర్న్ కావడంతో బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేనకు కష్టాలు తప్పలేదు. ఆసీస్ స్పిన్నర్లు విజృంభించగా.. భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ వ్యూహాలు పక్కాగా అమలు చేసి.. గెలుపునందుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇండోర్ పిచ్ అత్యంత నాసికరంగా ఉందని ఐసీసీ రేటింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: పరువు తీసుకున్న బంగ్లా; క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రివ్యూ నోరు మూసుకుని ఆటపై దృష్టి పెట్టండి.... టీమిండియాపై ఆసీస్ మాజీ కెప్టెన్ ఘాటు వ్యాఖ్యలు -
పుజారా చెత్త రికార్డు.. భారత్ తరపున రెండో క్రికెటర్‌గా
ఇండోర్ వేదికగా మొదలైన మూడో టెస్టులో టీమిండియా తడబడుతుంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఏంచుకున్నప్పటికి ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ 12 పరుగులు చేసి స్టంపౌట్ రూపంలో పెవిలియన్ చేరగా.. గిల్ 21 పరుగులు చేసి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇక పుజారా నాలుగు బంతులు ఎదుర్కొన్న అనంతరం లియోన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలోనే పుజారా ఒక చెత్త రికార్డును తన పేరిట లఖించుకున్నాడు. ఒక బౌలర్ చేతిలో అత్యధిక సార్లు ఔటైన జాబితాలో చేరిపోయాడు. నాథన్ లియోన్ పుజారాను ఔట్ చేయడం ఇది 12వ సారి. ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కూడా పుజారాను 12 సార్లు ఔట్ చేయడం విశేషం. ఇంతకముందు సునీల్ గావస్కర్ అండర్వుడ్ చేతిలో 12 సార్లు ఔటయ్యాడు. టీమిండియా తరపున సునీల్ గావస్కర్ తర్వాత ఒక బౌలర్ చేతిలో అత్యధిక సార్లు ఔటైన రెండో క్రికెటర్‌గా పుజారా నిలిచాడు. -
పిచ్‌పై నీలాపనిందలు.. ఆడడం చేతగాకనే
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియతో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించింది. జడేజా, అశ్విన్‌లు తమ స్పిన్ మాయాజాలంతో ఆసీస్ వెన్నులో వణుకు పుట్టించారు. అయితే పిచ్‌లు భారత స్పిన్నర్లకు అనుకూలంగా తయారు చేయడం వల్లే ఓడిపోతున్నామని మళ్లీ పాత పాటే పాడారు. ఆడడం చేతగాక పిచ్‌పై నీలాపనిందలు వేస్తున్నారు కంగారూలు. -సాక్షి, వెబ్‌డెస్క్ నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ ఆసీస్ కథ రెండున్నర రోజుల్లోనే ముగిసింది. తాజాగా ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. అయితే తొలి టెస్టుతో పోలిస్తే.. ఢిల్లీ టెస్టులో ఆసీస్ బ్యాటింగ్ కొంత నయం అనిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 263 పరుగులు.. ఆ తర్వాత భారత్‌ను 262 పరుగులకు ఆలౌట్ చేసి.. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 61/1తో పటిష్టంగా కనిపించినప్పుడు ఆస్ట్రేలియాకు పిచ్ గురించి కానీ.. భారత్ స్పిన్ నొప్పి తెలియలేదు. అయితే కేవలం 52 పరుగుల తేడాతో మిగతా 9 వికెట్లు చేజార్చుకొని 113 పరుగులకు ఆలౌట్ కాగానే మా ఓటమికి కారణం పిచ్లేనంటూ అసహనం వ్యక్తం చేశారు. టీమిండియాకు అనుకూలంగా పిచ్‌లు తయారు చేయడంతోనే తాము ఓడిపోతున్నామంటూ పెడబొబ్బలు పెడుతున్నారు. వాస్తవానికి ఏ దేశంలో అయినా ఆతిథ్య జట్టుకు అనుకూలంగానే పిచ్‌లు ఉంటాయన్నది బహిర్గతం. అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి పిచ్‌లు కాస్త ప్రతికూలంగా ఉంటాయి. తేమ ఎక్కువగా ఉండడంతో అక్కడి పిచ్‌లపై పేసర్లు వికెట్ల పండగ చేసుకుంటారు. ఇటీవలే ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు కూడా పిచ్‌లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయని తెలిసింది. దీనికి బ్రిస్బేన్‌లో ఆసీస్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ నిదర్శనం. పట్టుమని రెండు రోజులు కూడా సరిగ్గా మ్యాచ్ జరగలేదు. ఇరుజట్లు కలిపి 143 ఓవర్లలో నాలుగు ఇన్నింగ్స్‌లు ఆడేశాయంటే అక్కడి పిచ్‌లు ఆసీస్‌కు ఎంత అనుకూలంగా ఉన్నాయనేది చూపించింది. మరి అప్పుడు లేవని 'అనుకూల పిచ్' నోర్లు.. ఇప్పుడు టీమిండియాతో ఓటమి పాలవ్వగానే లేస్తున్నాయి. భారత గడ్డపై అడుగుపెట్టగానే స్పిన్ పిచ్‌లపై కఠిన పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని ఆసీస్ భావించింది. అందుకోసం బెంగుళూరులోని ఒక క్రికెట్ స్టేడియంలో అశ్విన్‌ను పోలిన బౌలర్ మహేష్ పితియాతో గంటల తరబడి బౌలింగ్ చేయించుకొని ప్రాక్టీస్ చేశారు. కేవలం ప్రాక్టీస్‌తోనే తమకు స్పిన్ ఆడడం వచ్చేసిందనే భ్రమలో ఉండిపోయారు ఆసీస్ ఆటగాళ్లు. కానీ క్రీజులోకి వచ్చాకా అశ్విన్, జడేజాల బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియకు తలలు పట్టుకుంటున్నారు. ఇక ఢిల్లీ టెస్టులో ఆసీస్ బ్యాటర్లు ఎక్కువగా వికెట్లు పారేసుకుంది స్వీప్, రివర్స్‌స్వీప్ షాట్లతోనే. జడేజా తెలివిగా లోబాల్స్ వేస్తున్నప్పటికి దానిని అర్థం చేసుకోలేని ఆసీస్ ఆటగాళ్లు అర్థం పర్థం లేని షాట్లు ఆడుతూ వికెట్లు పారేసుకున్నారు. పిచ్ తమ ఓటములకు కారణమని చెప్పుకుంటున్న ఆసీస్ క్రికెటర్లకు టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. ''ఉపఖండం పిచ్‌లపై స్పిన్ ఆడడం అంత తేలిక కాదు. టెస్టు క్రికెట్లో స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం బ్యాటర్లకు అతిపెద్ద సవాల్. స్పిన్ అనే అస్త్రం బ్యాట్స్‌మన్ ఫుట్‌వర్క్‌కు పరీక్ష పెడుతుంది. క్రీజును ఎలా ఉపయోగించుకోవాలో నేర్పుతుంది. అందుకే భారత్ లాంటి ఉపఖండపు పిచ్‌లపై సెంచరీ లేదా డబుల్ సెంచరీలు చేసిన వాళ్లను అత్యుత్తమ బ్యాటర్లుగా పరిగణిస్తారు. ఇలా కొన్ని ప్రాథమిక సూత్రాలు మరిచిపోయి పిచ్‌పై నానా యాగీ చేయడం ఎంతవరకు కరెక్ట్. పిచ్‌లపై ఏడ్వడం మానేసి ముందు పరిస్థితులకు అలవాటు పడండి. స్పిన్ ఆడడం అంత తేలిక కాదన్న విషయం ఇప్పటికైనా అర్థమై ఉంటుంది. దమ్ముంటే స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నం చేయండి. ఆడడం చేతగాకపోతే ఎలా ఆడాలో నేర్చుకొండి.. ఇలాంటి అర్థరహిత వ్యాఖ్యలు మాత్రం చేయకండి'' అంటూ కౌంటర్ ఇచ్చాడు. గతంలోనూ ఆస్ట్రేలియా టీమిండియా పర్యటనకు చాలాసార్లు వచ్చింది. నిజానికి అశ్విన్, జడేజాల కంటే ఉపఖండంలో మెరుగైన స్పిన్నర్లు చాలా మందే ఉన్నారు. కుంబ్లే, హర్బజన్, మురళీధరన్, బిషన్‌సింగ్ బేడీ, ప్రసన్న, ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్.. వీరంతా తమ స్పిన్ బౌలింగ్‌తో ముప్పతిప్పలు పెట్టినవారే. అంతెందుకు దిగ్గజం వార్న్ కూడా భారత్ పిచ్‌లపై చాలాసార్లు ప్రభావం చూపించాడు. ఇవాల్టికి అత్యుత్తమ స్పిన్నర్లుగా పేరున్న వార్న్, మురళీధరన్ బౌలింగ్‌ను సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్‌లు ఎలా చీల్చి చెండాడారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి ఫుట్‌వర్క్‌తో సరైన షాట్ సెలెక్షన్‌తో బంతిని బౌండరీలకు తరలిస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది. క్రీజు వదిలి వికెట్ల ముందుకొచ్చి డిఫెన్స్ ఆడొచ్చన్న టెక్నిక్‌ను ఇప్పటి బ్యాటర్లు పూర్తిగా మరిచిపోయారు. టి20 క్రికెట్ మోజులో పడి సంప్రదాయ క్రికెట్లోనూ అదే దూకుడు కనబరచాలని భావించి బొక్క బోర్లా పడుతున్నారు. రాబోయే మూడో టెస్టుకైనా ఆసీస్ పరిస్థితులకు అలవాటు పడల్సిందే. అలా కాకుండా పిచ్‌లపై అవగాహన లేకుండా ఇష్టారీతిలో స్వీప్, రివర్స్ స్వీప్ అంటూ అర్థరహిత షాట్లు ఆడితే ఢిల్లీ టెస్టు ఫలితమే మరోసారి పునరావృతమవుతుంది. అశ్విన్, జడేజాల బౌలింగ్ ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా కసరత్తేమీ అవసరం లేదు. సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, గావస్కర్, ఇయాన్ చాపెల్, డేవిడ్ గోవర్ లాంటి దిగ్గజాల బ్యాటింగ్ వీడియోలు చూస్తే స్పిన్ ఎలా ఆడాలనే దానిపై ఒక క్లారీటీ వస్తుంది. చదవండి: పురుషులే అనుకున్నాం.. మహిళా క్రికెటర్లది అదే తీరు! -
గిల్‌కు కొత్త పేరు పెట్టిన టీమిండియా దిగ్గజం
టీమిండియా యువ సంచలనం శుబ్‌మన్ గిల్ ప్రస్తుతం అద్బుత ఫామ్‌లో ఉన్నాడు. హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో డబుల్ సెంచరీతో మెరిసిన గిల్.. రెండో వన్డేలోనూ 40 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ను ఆడి జట్టును గెలిపించాడు. దీంతో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక తన ఇన్నింగ్స్‌లతో జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో పడిన గిల్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. రెండో వన్డే సందర్భంగా సునీల్ గావస్కర్ మ్యాచ్ కామెంటరీలో పాల్గొన్నాడు. లైవ్ జరుగుతున్న సమయంలోనే శుబ్‌మన్ గిల్‌కు గావస్కర్ కొత్త పేరును ప్రతిపాదిస్తున్నట్లు అడిగాడు. 'గిల్ నీకు ఒక నిక్‌నేమ్ పెడుతున్నా.. అదేంటో తెలుసా.. 'స్మూత్మాన్ గిల్'.. నీకు ఎలాంటి అభ్యంతరం లేదుగా అంటూ కామెంట్ చేశాడు. కాగా గావస్కర్ కామెంట్‌పై గిల్ వెంటనే స్పందించాడు. ''అలా ఏం లేదు సార్.. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు'' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. ఇక తొలి వన్డేలో డబుల్ సెంచరీతో మెరిసిన శుబ్‌మన్ గిల్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. టీమిండియా నుంచి వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. టీమిండియా తరపున డబుల్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఇక 19 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన గిల్ టీమిండియా తరపున వన్డేల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. చదవండి: 'టీమిండియా రైట్ ట్రాక్‌లోనే వెళ్తుందా?'.. మీకేమైనా అనుమానమా! 'నాకు నచ్చలేదు.. బయోపిక్ నుంచి తప్పుకుంటున్నా' -
సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లి బ్రేక్ చేస్తాడు: సునీల్ గవాస్కర్
పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి దుమ్మురేపుతున్నాడు. వరుసగా సెంచరీల మోత మోగిస్తున్నాడు. తాజాగా తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో మరో అద్భుతమైన శతకంతో విరాట్ చెలరేగాడు. అతడి గత నాలుగు వన్డే ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు ఉండడం గమానార్హం. కాగా కింగ్ కోహ్లికి ఇది 46వ వన్డే సెంచరీ. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(49) అత్యధిక వన్డే సెంచరీల రికార్డుకు విరాట్ మరింత చేరువయ్యాడు. మరో నాలుగు సెంచరీలు ఈ రన్‌మిషన్ సాధిస్తే ప్రపంచ వన్డే క్రికెట్లో అత్యధిక శతకాలు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లి ఎప్పుడు బ్రేక్ చేస్తాడనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌కు ముందు సచిన్ వన్డే సెంచరీల రికార్డును కింగ్ కోహ్లి బ్రేక్ చేస్తాడని గవాస్కర్ జోస్యం చెప్పాడు. అదే విధంగా విరాట్ మరో 5-6 ఏళ్లు ఆడితే సచిన్ 100 సెంచరీల రికార్డును బద్దల కొట్టగలడని లిటిల్ మాస్టర్ అభిప్రాయపడ్డాడు. "విరాట్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌కు ముందు భారత జట్టు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో మూడేసి వన్డేలు ఆడనుంది. ప్రస్తుతం సచిన్ రికార్డును బ్రేక్ చేయడానికి కావల్సిన సెంచరీలు కేవలం మూడు మాత్రమే. కాబట్టి ఐపీఎల్‌కు ముందు సచిన్ వన్డే సెంచరీల రికార్డును కోహ్లి బద్దలు కొడతాడని నేను భావిస్తున్నాను. కోహ్లి విశ్రాంతి తీసుకుని వచ్చినప్పటి నుంచి అదరగొడుతున్నాడు. ఈ క్రమంలో సచిన్ పలు రికార్డులను కోహ్లి బ్రేక్ చేస్తడనడంలో ఎటువంటి సందేహం లేదని" గవాస్కర్ పేర్కొన్నాడు. అదేవిధంగా సచిన్ 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డు గురించి సన్నీ మాట్లాడుతూ.. ఒక వేళ కోహ్లి మరో 5-6 ఏళ్ల పాటు క్రికెట్ ఆడితే కచ్చితంగా సచిన 100 సెంచరీల రికార్డును బ్రేక్ చేస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అతడు సగటున సంవత్సరానికి సెంచరీలు చేసినా సచిన్‌ను ఈజీగా అధిగమిస్తాడు. అతడు తన వయస్సు 40 ఏళ్ల వచ్చే వరకు ఆడితే వచ్చే 5-6 సంవత్సరాలలో మరో 26 సెంచరీలు సాధించగలడు. సచిన్ కూడా 40 ఏళ్ల వరకు క్రికెట్ ఆడాడు. కోహ్లికి కూడా అద్భుతమైన ఫిట్నెస్ ఉంది. కాబట్టి విరాట్ సచిన్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది అని అతడు అన్నాడు. చదవండి: Virat Kohli: అరుదైన ఘనతకు చేరువలో! రికార్డుల కోసం వెంపర్లాడేవాడిని కాదు.. అయితే! -
టీమిండియా యువ ఓపెనర్ విధ్వంసం.. 400 మిస్! రికార్డులు బద్దలు
Assam vs Mumbai- Prithvi Shaw Triple Century: రంజీ ట్రోఫీ టోర్నీలో టీమిండియా యువ ఓపెనర పృథ్వీ షా దుమ్ములేపుతున్నాడు. ఈ ముంబై ఆటగాడు అసోంతో మ్యాచ్‌లో ద్విశతకాన్ని ట్రిపుల్ సెంచరీగా మలిచాడు. గువహటి వేదికగా మంగళవారం మొదలైన టెస్టు తొలి రోజు ఆట ముగిసే సరికి ఈ యువ బ్యాటర్ 240 పరుగులు సాధించాడు. క్వాడ్రపుల్ సెంచరీ మిస్ ఈ క్రమంలో బుధవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా త్రిశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, 379 పరుగుల వద్ద రియాన్ పరాగ్ బౌలింగ్‌లో పృథ్వీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో క్వాడ్రపుల్ సెంచరీ మిస్సయ్యాడు. కాగా ఈ తొలి ఇన్నింగ్స్‌లో మొత్తంగా 383 బంతులు ఎదుర్కొన్న 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో ఈ మేరకు భారీగా పరుగులు రాబట్టాడు. దిగ్గజాల రికార్డులు బద్దలు తద్వారా ట్రిపుల్ సెంచరీ వీరుడు 23 ఏళ్ల పృథ్వీ షా.. టీమిండియా దిగ్గజాల పేరిట ఉన్న పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ముంబై తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా ఘనత సాధించాడు. గతంలో సంజయ్ మంజ్రేకర్ 377 పరుగులతో ముంబై టాప్ బ్యాటర్‌గా ఉండగా.. 32 ఏళ్ల తర్వాత యువ ఓపెనర్ పృథ్వీ షా అతడిని అధిగమించాడు. అదే విధంగా.. టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ (ముంబై తరఫున రంజీల్లో 340 పరుగులు)ను కూడా దాటేశాడు. కాగా గత కొన్నాళ్లుగా భారత జట్టులో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న పృథ్వీ షా ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో మరోసారి సెలక్టర్లకు సవాల్ విసిరాడు. చదవండి: Kohli-Pandya: పాండ్యాపై గుడ్లురిమిన కోహ్లి! సెంచరీ మిస్ అయ్యేవాడే! వీడియో వైరల్ IPL 2023: పంత్ లేని లోటు ఎవరూ తీర్చలేరు.. అయితే: గంగూలీ కీలక వ్యాఖ్యలు -
అర్షదీప్ నో బాల్స్ వ్యవహారంపై మండిపడ్డ గవాస్కర్.. గల్లీ బౌలర్లా అంటూ..!
క్రికెట్‌కు సంబంధించి ఎంతటి వారు తప్పు చేసినా పరుష పదజాలంతో మందలించే లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్.. తాజాగా టీమిండియా యువ పేసర్ అర్షదీప్ సింగ్‌పై ఫైరయ్యాడు. శ్రీలంకతో నిన్న (జనవరి 5) జరిగిన రెండో టీ20లో అర్షదీప్ హ్యాట్రిక్ నో బాల్స్‌తో పాటు మొత్తంగా 5 నో బాల్స్ వేయడంపై సన్నీ ఓ రేంజ్లో మండిపడ్డాడు. ప్రొఫెషనల్ బౌలర్ అయి ఉండి ఇలా చేయడం సరికాదని, పరోక్షంగా గల్లీ బౌలర్ అని అర్ధం వచ్చేలా సంబోధించాడు. నో బాల్స్ వేయకపోవడం అన్నది అంతర్జాతీయ స్థాయి బౌలర్‌కు ప్రాధమిక సూత్రమని, అది మరిచిన బౌలర్ ఈ స్థాయి క్రికెట్‌కు పనికిరాడని ఘాటుగా వ్యాఖ్యానించాడు. బౌలర్ తన బేసిక్స్‌కు స్టిక్ అయి బంతి విసిరిన తర్వాత ఏం జరుగుతుంది, బ్యాటర్ ఏం చేస్తాడన్నది పక్కకు పెడితే.. నోబాల్ వేయకపోవడం అన్నది బౌలర్ బేసిక్స్‌లో భాగమని అర్షదీప్‌ను ఉద్దేశించి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్ జరుగుతుండగా లైవ్ కామెంట్రీలోనే గవాస్కర్ అర్షదీప్‌పై విరుచుకుపడ్డాడు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో ఇన్నింగ్స్ రెండో ఓవర్ బౌల్ చేసిన అర్షదీప్ వరుసగా మూడు నోబాల్స్ సంధించాడు. ఆతర్వాత ఇన్నింగ్స్ 19వ ఓవర్లో బంతినందుకున్న అర్షదీప్.. ఆ ఓవర్లోనూ మరో రెండు నో బాల్స్ వేసి అభిమానులు, సహచరులతో సహా విశ్లేషకులను సైతం విస్మయానికి గురి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 2 ఓవర్లు వేసిన అర్షదీప్ ఏకంగా 37 పరుగులు సమర్పించుకుని టీమిండియా ఓటమికి పరోక్ష కారకుడయ్యాడు. ఇదిలా ఉంటే, లంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో పోరాడి ఓటమిపాలైంది. 207 పరుగుల లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్ పటేల్ (31 బంతుల్లో 65; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), శివమ్ మావీ (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతంగా పోరాడినా టీమిండియాకు విజయం దక్కలేదు. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను శ్రీలంక 1-1తో సమం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 జనవరి 7న రాజ్‌కోట్ వేదికగా జరుగనుంది. -
సంజూ శాంసన్‌ను ఏకి పారేసిన లిటిల్ మాస్టర్
టీమిండియా వికెట్‌కీపర్ సంజూ శాంసన్‌ను భారత మాజీ కెప్టెన్, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఏకి పారేశాడు. ముంబై వేదికగా శ్రీలంకతో నిన్న (జనవరి 3) జరిగిన తొలి టీ20లో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనందుకు గాను శాంసన్‌పై నిప్పులు చెరిగాడు. ఎంత టాలెంట్ ఉన్నా ఏం ప్రయోజనం.. చెత్త షాట్ సెలెక్షన్‌తో మరోసారి వికెట్ పారేసుకున్నాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. అమవాస్యకో పున్నానికో వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోకుంటే ఎలా అంటూ ఘాటు స్వరంతో వ్యాఖ్యానించాడు. తొలి టీ20లో శాంసన్ చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్న వెంటనే సన్నీ ఈ రకంగా స్పందించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన సంజూ.. కేవలం ఆరు బంతులు మాత్రమే ఆడి (5 పరుగులు) దారుణంగా నిరాశపరిచాడు. ధనంజయ డిసిల్వ వేసిన ఏడో ఓవర్ నాలుగో బంతికి క్యాచ్ మిస్ కావడంతో బతికిపోయిన సంజూ.. ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేక అదే ఓవర్ ఆఖరి బంతికి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తేలిపోయిన సంజూ.. ఫీల్డింగ్ చేస్తూ కీలక క్యాచ్ జారవిడిచాడు. లంక ఇన్నింగ్స్‌లో హార్ధిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్లో నిస్సంక ఇచ్చిన క్యాచ్‌ను వదిలిపెట్టి కెప్టెన్ ఆగ్రహానికి గురయ్యాడు. ఇదిలా ఉంటే, భీభత్సమైన టాలెంట్ ఉన్నా సంజూ శాంసన్‌కు టీమిండియాలో సరైన అవకాశాలు కల్పించకుండా వివక్ష చూపుతున్నారంటూ గత కొంతకాలంగా అతని అభిమానులు సోషల్‌మీడియా వేదికగా గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజూపై సునీల్ గవాస్కర్ చేసిన ఘాటు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. -
టీమిండియా దిగ్గజానికి మాతృ వియోగం.. బాధను దిగమింగుకుని మరీ
Sunil Gavaskar: టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్‌కు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి మినాల్ గావస్కర్ కన్నుమూశారు. వయో సంబంధిత అనారోగ్య కారణాల వల్ల 95 ఏళ్ల వయసులో ముంబైలోని నివాసంలో ఆదివారం తుది శ్వాస విడిచారు. కాగా సునిల్ గావస్కర్ టీమిండియా- బంగ్లాదేశ్ రెండో టెస్టుకు ఢాకాలో కామెంటరీ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ విషాదకర వార్త తెలిసినప్పటికీ బాధను దిగమింగుకుని ఆయన తన బాధ్యతలు నిర్వర్తించారు. వృత్తి పట్ల నిబద్ధతను చాటుకున్నారు. ఈ నేపథ్యంలో తల్లి పోగొట్టుకుని విషాదంలో మునిగిపోయిన గావస్కర్‌కు సంతాపం ప్రకటిస్తూనే.. విధుల పట్ల ఆయన అంకితభావానికి అభిమానులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. సోదరుడూ క్రికెటరే! భారత మాజీ వికెట్ కీపర్, బాంబే క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించిన మాధవ్ మంత్రి సోదరి మినాల్. ఆమెకు మనోహర్ గావస్కర్‌తో వివాహం కాగా.. వీరికి ఒక కుమారుడు సునిల్ గావస్కర్ , ఇద్దరు కుమార్తెలు నూతన్, కవిత జన్మించారు. ఇక స్వతహాగా క్రికెటర్ చెల్లెలు అయిన మినాల్ తన కుమారుడు సునిల్ క్రికెటర్‌గా ఎదగడంలో కీలక పాత్ర పోషించారు. ఆమె కోరుకున్నట్లుగానే టీమిండియా దిగ్గజ ఆటగాడిగా పేరు సంపాదించి సునిల్ గావస్కర్ ఆమెకు గొప్ప బహుమతి అందించారు. కాగా 2012లో ఆమె భర్త మనోహర్ గావస్కర్ మరణించారు. చదవండి: Suryakumar Yadav: సీక్రెట్ రివీల్ చేసిన సూర్యకుమార్.. వాళ్ల వల్లే ఇలా! కేకేఆర్ నుంచి మారిన తర్వాతే ఎదురుగా అంతా చీకటి, కళ్లు బైర్లుకమ్మాయి.. బతకడం కష్టమన్నారు.. అయినా -
టెస్టు క్రికెట్లో పుజారా అరుదైన ఫీట్! దిగ్గజాల సరసన.. కోహ్లి తర్వాత
Bangladesh vs India, 2nd Test - Cheteshwar Pujara: టీమిండియా నయా వాల్ ఛతేశ్వర్ పుజారా టెస్టు క్రికెట్లో 7 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఎనిమిదో బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. తద్వారా సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్ వంటి దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా ఈ ఫీట్ నమోదు చేశాడు. ఢాకాలోని షేర్-ఈ- బంగ్లా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ వేసిన బంతి(18.5 ఓవర్)కి మూడు పరుగులు తీసి పుజారా 7 వేల పరుగుల మార్కును అందుకున్నాడు. అయితే, మొదటి టెస్టులో అజేయ సెంచరీతో మెరిసిన పుజారా(90, 102 నాటౌట్) రెండో మ్యాచ్‌లో 24 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించాడు. కాగా సౌతాఫ్రికా టూర్ తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. కౌంటీల్లో ససెక్స్ తరఫున మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రంమలో ఇంగ్లండ్ పర్యటనలో ఆఖరి టెస్టులో జట్టులో పునరాగమనం చేశాడు. ప్రస్తుతం బంగ్లా టూర్లో స్థాయికి తగ్గట్లు ఆడుతున్నాడు. టెస్టుల్లో 7 వేల పైచిలుకు పరుగులు.. జాబితాలో పుజారా ►సచిన్ టెండుల్కర్- 15,921 ►రాహుల్ ద్రవిడ్- 13265 ►సునిల్ గావస్కర్- 10122 ►వీవీఎస్ లక్ష్మణ్- 8781 ►వీరేంద్ర సెహ్వాగ్- 8503 ►విరాట్ కోహ్లి- 8099* ►సౌరవ్ గంగూలీ- 7212 ►ఛతేశ్వర్ పుజారా- 7000* చదవండి: Ind Vs Ban: నీ ఆట తీరు మారదా.. అసలు నీకేమైంది రాహుల్!? ద్రవిడ్, నువ్వూ కలిసి.. వేలంలో.. ఆ అఫ్గన్ యువ బౌలర్ సూపర్‌స్టార్! స్టోక్స్, ఉనాద్కట్ కోసం పోటీ: మిస్టర్ ఐపీఎల్