టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ప్రస్ధానం ముగిసిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్-2024తో భారత హెడ్ కోచ్‌గా ద్రవిడ్ పదవీ కాలం ముగిసింది. టీ20 వరల్డ్‌కప్ విజయంతో తమ కోచ్‌కు భారత ఆటగాళ్లు ఘనంగా విడ్కోలు పలికారు.
భారత్ వరల్డ్‌కప్ గెలవడంలో ద్రవిడ్‌ది కూడా కీలక పాత్ర. తన అనుభవంతో జట్టును అద్బుతంగా నడిపించాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ద్రవిడ్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని గవాస్కర్ కోరాడు.
"రాహుల్ ద్రవిడ్‌ను కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరిస్తే బాగుంటుంది. అందుకు ద్రవిడ్ నిజంగా అర్హుడు. వెస్టిండీస్ వంటి కఠిన పరిస్ధితుల్లో ద్రవిడ్ ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా అన్నో అద్బుత విజయాలను అందుకున్నాడు.
విండీస్‌లో మాత్రమే కాదు. ఇంగ్లండ్ వంటి విదేశీ పరిస్థితుల్లో కూడా కెప్టెన్‌గా ద్రవిడ్ భారత్‌కు చారిత్రత్మక విజయాలను అందించాడు. ఇంగ్లండ్‌లో టెస్ట్ మ్యాచ్ సిరీస్‌ను గెలుచుకున్న ముగ్గురు భారత కెప్టెన్లలో ద్రవిడ్ ఒకడిగా ఉన్నాడు.
అంతేకాకుండా జాతీయ క్రికెట్ అకాడమీ ఛైర్మన్‌గా పనిచేసి ఎంతో మంది యువ క్రికెటర్లను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత అతడిది. భారత పురుషల సీనియర్ జట్టు కోచ్‌గా కూడా అతడు అద్భుతాలు సృష్టించాడు. ద్రవిడ్ నేతృత్వంలోనే 17 ఏళ్ల తర్వాత భారత్ పొట్టి వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది.
ఆటగాడిగా, కెప్టెన్‌గా, కోచ్‌గా ద్రవిడ్ సాధించిన విజయాలు ప్రతీ భారతీయుడుకు ఆనందనిచ్చాయి. ద్రవిడ్ వరల్డ్‌కప్ విజయంతో యావత్తు దేశం గర్వించేలా చేశాడు. కాబట్టి అటువంటి వ్యక్తికి కచ్చితంగా దేశ అత్యున్నత పురస్కారంతో గౌరవించాలి.
ఈ విషయంపై ప్రతీ ఒక్కరూ నాతో గొంతు కలపాలి. ప్రభుత్వం కచ్చితంగా అతడు సేవలను గుర్తించాలి. భారతరత్న రాహుల్ శరద్ ద్రవిడ్ అని వినడానికి ఎంతో అద్భుతంగా ఉంది కాదా? అని గవాస్కర్ తన కాలమ్ మిడ్ డేలో రాసుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment