
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 పాకిస్తాన్, దుబాయ్ వేదికలగా హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ టోర్నీ పాకిస్తాన్ ఒక్క వేదికగానే జరగాల్సి ఉండగా.. ఆ దేశానికి భారత జట్టును పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. భారత క్రికెట్ బోర్డు ఆటగాళ్ల భద్రతను కారణంగా ఐసీసీకి చూపించింది.
దీంతో ఐసీసీ ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేందుకు పీసీబీని ఒప్పించింది. దీంతో భారత్ తమ మ్యాచ్‌లను దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఆడుతోంది. ఈ క్రమంలో ఒకే వేదికలో మ్యాచ్‌లను నిర్వహించడం ద్వారా భారత్‌కు అడ్వాంటేజ్ కలుగుతోందని ఇంగ్లండ్ మాజీలు నాజర్ హుస్సేన్, మైఖేల్ అథర్టన్ ఐసీసీ తీరును తప్పుబట్టారు.
వీరిద్దరే కాకుండా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్, ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఈ తరహా కామెంట్సే చేశారు. తాజాగా ఇంగ్లండ్ మాజీల వ్యాఖ్యలకు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ గట్టి కౌంటరిచ్చాడు. ముందు మీ జట్టు సంగతి చూసుకుండి, తర్వాత ఇతర జట్ల గురించి మాట్లాడండి అంటూ సన్నీ ఫైరయ్యాడు.
"మీరంతా ఎంతో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు. అంతేకాకుండా చాలా తెలివైన వారు కూడా. అసలు మీ జట్టు(ఇంగ్లండ్) ఎందుకు సెమీస్‌కు ఆర్హత సాధించలేకపోయిందో సమీక్షించుకుండి సర్. ఎప్పుడూ భారత జట్టుపై దృష్టి సారించే బదులు, మీ సొంత టీమ్‌పై ఫోకస్ చేయవచ్చుగా. మీ ఆటగాళ్లు చాలా పేలవంగా ఆడుతున్నారు. వారు అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోతున్నారు.
ఫస్ట్ మీ దేశం, మీ టీమ్ గురుంచి ఆలోచించడండి. అంతే తప్ప భారత్‌కు అది జరిగింది, భారత్ ఇలా ఆడింది అని పనికిమాలిన కామెంట్స్ ఎందుకు. భారత జట్టు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. మీ వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోరు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ సేవలు అద్బుతం.
ఆటపరంగానే కాకుండా, ఆర్థికపరంగా కూడా వెన్నుదన్నుగా నిలుస్తోంది. టెలివిజన్ హక్కులు. మీడియా ఆదాయం ద్వారా భారీగా ఆదాయం వస్తోంది. కామెంటేర్లగా మీరు తీసుకుంటున్న జీతాలు కూడా భారత్ వల్లేనన్న విషయం మర్చిపోకండి "అంటూ ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ మండిపడ్డాడు.
కాగా ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ జట్టు గ్రూపు స్టేజిలోనే ఇంటి ముఖం పట్టింది. అఫ్గానిస్తాన్ చేతిలో మరోసారి ఇంగ్లండ్ ఓటమి పాలైంది. ఈ ఓటుములకు నైతిక బాధ్యత వహిస్తూ ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి జోస్ బట్లర్ తప్పుకున్నాడు. ఇంగ్లండ్ తమ ఆఖరి మ్యాచ్ శనివారం రావల్పిండి వేదికగా దక్షిణాఫ్రికాతో ఆడుతోంది.
చదవండి: 'భారత్‌దే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఒకే ఒక్క పరుగు తేడాతో'.. క్లార్క్ జోస్యం
Comments
Please login to add a commentAdd a comment