rahul dravid
-
చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. డబుల్ సెంచరీ.. తొలి ఆస్ట్రేలియన్‌గా రికార్డు
ఆసీస్ తాత్కాలిక సారధి స్టీవ్ స్మిత్ (Steve Smith) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్ట్‌ల్లో 200 క్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి ఆస్ట్రేలియన్‌గా రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్‌లో స్మిత్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో స్మిత్ మొత్తం ఐదు క్యాచ్‌లు పట్టుకున్నాడు. స్మిత్ క్యాచ్‌ల్లో డబుల్ సెంచరీ సాధించే క్రమంలో రికీ పాంటింగ్ (Ricky Ponting) రికార్డును అధిగమించాడు. 🚨 HISTORY BY STEVEN SMITH. 🚨- Smith becomes the first ever Australian fielder to complete 200 catches in Tests. 🙇♂️pic.twitter.com/3T2v9jgcid— Mufaddal Vohra (@mufaddal_vohra) February 9, 2025పాంటింగ్ 287 ఇన్నింగ్స్‌ల్లో 196 క్యాచ్‌లు అందుకోగా.. స్మిత్ 205 ఇన్నింగ్స్‌ల్లోనే 200 క్యాచ్‌లు పూర్తి చేశాడు. ఆసీస్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్న నాన్ వికెట్కీపర్ల జాబితాలో స్మిత్, పాంటింగ్ తర్వాతి స్థానంలో మార్క్ వా ఉన్నాడు. మార్క్ వా 209 ఇన్నింగ్స్‌ల్లో 181 క్యాచ్‌లు పట్టుకున్నాడు.ఓవరాల్‌గా ఐదో క్రికెటర్టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ఐదుగురు మాత్రమే 200 క్యాచ్‌లు పూర్తి చేశారు. వీరిలో టీమిండియా గ్రేట్ రాహుల్ ద్రవిడ్ (Rahu Dravid) 210 క్యాచ్‌లతో (164 టెస్ట్‌ల్లో) అగ్రస్థానంలో ఉండగా.. జో రూట్ (152 టెస్ట్‌ల్లో 207), మహేళ జయవర్దనే (149 టెస్ట్‌ల్లో 205), జాక్ కల్లిస్ (166 టెస్ట్‌ల్లో 200) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. శ్రీలంకతో మ్యాచ్‌లో స్మిత్ కల్లిస్ సరసన చేరడంతో పాటు 200 క్యాచ్‌ల క్లబ్లో చేరిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. అలాగే టెస్ట్‌ల్లో అత్యంత వేగవంతంగా 200 క్యాచ్‌లు పూర్తి చేసిన ఆటగాడిగానూ స్మిత్ రికార్డు నెలకొల్పాడు. స్మిత్ కేవలం 116 టెస్ట్‌ల్లోనే 200 క్యాచ్‌లు పూర్తి చేశాడు. స్మిత్ మరో 11 క్యాచ్‌లు పడితే టెస్ట్‌ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొడతాడు.లంకతో మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఐదు క్యాచ్‌లు పట్టిన స్మిత్.. బ్యాటింగ్‌లోనూ చెలరేగి టెస్ట్‌ల్లో 36వ సెంచరీ నమోదు చేశాడు. ఈ సెంచరీతో స్మిత్ టెప్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం స్మిత్, జో రూట్ తలో 36 సెంచరీలతో సంయుక్తంగా ఐదో స్థానంలో ఉన్నారు. టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ (51) పేరిట ఉంది.అంతకుముందు స్మిత్ లంకతో జరిగిన తొలి టెస్ట్‌లోనూ సెంచరీ సాధించాడు. ఇదే మ్యాచ్‌లో స్మిత్ టెస్ట్‌ల్లో 10000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్‌కు దూరం కాగా.. అతని గైర్హాజరీలో స్మిత్ ఆసీస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు. తొలి టెస్ట్‌లోనూ ఘన విజయం సాధించిన ఆసీస్.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో ఊడ్చేసింది. ఫిబ్రవరి 12, 14 తేదీల్లో ఆసీస్.. శ్రీలంకతో రెండు వన్డేలు ఆడనుంది. -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. తిరుగులేని హిట్‌మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar)ను అధిగమించాడు. ఇంగ్లండ్‌తో రెండో వన్డే(India vs England) సందర్భంగా ఈ ఘనత సాధించాడు. అదే విధంగా.. ఈ మ్యాచ్‌లో శతక్కొట్టడం ద్వారా మరిన్ని రికార్డులను హిట్‌మ్యాన్ తన ఖాతాలో వేసుకున్నాడు.అద్భుత ఇన్నింగ్స్కాగా రోహిత్ శర్మ గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో విమర్శలు మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టెస్టుల్లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా దారుణంగా విఫలమైన అతడు రిటైర్ అయిపోవాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే, ఇంగ్లండ్‌తో కటక్ వన్డేలో తనదైన శైలిలో విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడి.. విమర్శించినవాళ్లే ప్రశంసించేలా రోహిత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.వన్డే కెరీర్లోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీబరాబతి స్టేడియంలో లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు రోహిత్ శర్మ. ఫ్లడ్‌లైట్ల సమస్య కారణంగా కాసేపు అవాంతరాలు ఎదురైనా.. అతడి ఏకాగ్రత చెదరలేదు. ఒంటిమీదకు బాణాల్లా దూసుకువస్తున్న ఇంగ్లండ్ ఫాస్ట్‌బౌలర్ల బంతులను సమర్థవంతంగా ఎదుర్కొన్న రోహిత్ శర్మ తన వన్డే కెరీర్లోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు.డెబ్బై ఆరు బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌లో ఏకంగా పన్నెండు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. అయితే, లియామ్ లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో ఆదిల్ రషీద్‌కు క్యాచ్ ఇవ్వడంతో హిట్‌మ్యాన్ ధనాధన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.ఇక ఈ మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్‌గా నిలిచాడు. మూడు ఫార్మాట్లలో కలిపి ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఇప్పటి వరకు 15404 పరుగులు చేశాడు. తద్వారా సచిన్ టెండుల్కర్‌ను అధిగమించాడు.కాగా ఓపెనర్‌గా సచిన్ టెండుల్కర్ 15335 పరుగులు చేశాడు. మరోవైపు.. ఈ జాబితాలో విధ్వంసకర మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 15758 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడి తర్వాతి స్థానంలోకి ఇప్పుడు రోహిత్ దూసుకువచ్చాడు. కాగా 2007లో అరంగేట్రం చేసిన రోహిత్.. 2013లో ఓపెనర్‌గా ప్రమోట్ అయ్యాడు.ద్రవిడ్‌ను అధిగమించివన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ (267 వన్డేల్లో 10,987 పరుగులు) నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇప్పటి వరకు నాలుగో స్థానంలో ఉన్న రాహుల్ ద్రవిడ్ (344 వన్డేల్లో 10,889 పరుగులు) ఐదో స్థానానికి చేరాడు. టాప్–3లో సచిన్ టెండూల్కర్ (463 వన్డేల్లో 18,246 పరుగులు), విరాట్ కోహ్లి (296 వన్డేల్లో 13,911 పరుగులు), సౌరవ్ గంగూలీ (311 వన్డేల్లో 11,363 పరుగులు) ఉన్నారు.32వ శతకంవన్డేల్లో రోహిత్ శర్మ సెంచరీలు 32. తద్వారా అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు. టాప్–2లో విరాట్ కోహ్లి (50), సచిన్ టెండూల్కర్ (49) ఉన్నారు.ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. కటక్‌లో ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. 49.5 ఓవర్లలో 304 పరుగులకు బట్లర్ బృందం ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రోహిత్ సేన 44.3 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. ఆరు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసిన భారత్.. నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. భారత్- ఇంగ్లండ్ మధ్య నామమాత్రపు మూడో వన్డే అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరుగుతుంది.చదవండి: జట్టు కోసం కొన్ని పరుగులు చేశా.. అతడొక క్లాసీ ప్లేయర్: రోహిత్ శర్మ -
IPL 2025: రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ ప్లేయర్
ఐపీఎల్ 2025 (IPL) సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) కీలక ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్సీఏలో (National Cricket Academy) ఉన్న టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులేను (Sairaj Bahutule) స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమించుకున్నట్లు సమాచారం. బహుతులే ఎన్సీఏలో జాయిన్ కాకముందు 2018-21 మధ్యలో రాజస్థాన్ రాయల్స్‌కు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు. బహుతులేతో ఆర్ఆర్ యాజమాన్యం తుది సంప్రదింపులు జరుపుతుందని తెలుస్తుంది. అన్నీ కుదిరితే బహుతులే ఆర్ఆర్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్, ఆ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి పని చేయాల్సి ఉంటుంది. 52 ఏళ్ల బహుతులే.. గతంలో రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్‌గా ఉండగా అతని అండర్లో పని చేశాడు. రాయల్స్‌తో చర్చలు జరుగుతున్న విషయాన్ని బహుతులే స్వయంగా క్రిక్‌బజ్‌కు తెలిపాడు. రాయల్స్‌తో మళ్లీ కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రకటించాడు. 2023 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో స్పిన్-బౌలింగ్ కోచ్‌గా పనిచేసినప్పుడు ద్రవిడే తనను భారత జట్టుకు పరిచయం చేడని గుర్తు చేసుకున్నాడు. గతంలో శ్రీలంకలో జరిగిన సిరీస్‌లో ద్రవిడ్ కోచింగ్ స్టాఫ్‌లో తాను పని చేసిన విషయాన్ని ప్రస్తావించాడు. పాత పరిచయాల నేపథ్యంలో ద్రవిడ్‌తో పునఃకలయిక కోసం ఎదురు చూస్తున్నానని అన్నాడు. బహుతులే 1997-2003 మధ్యలో టీమిండియా తరఫున 2 టెస్ట్‌లు, 8 వన్డేలు ఆడాడు.ట్రెంట్ రాకెట్స్‌పై ఆసక్తి చూపుతున్న రాయల్స్ యాజమానిరాజస్థాన్ రాయల్స్ యజమాని మనోజ్ బదాలే హండ్రెడ్ లీగ్‌లో (ఇంగ్లండ్‌లో జరిగే హండ్రెడ్ బాల్ టోర్నీ) ట్రెంట్ రాకెట్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. నాటింగ్హమ్ కౌంటీకి చెందిన రాకెట్స్ ఈ సోమవారం వేలానికి రానుంది. రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యానికి ఐపీఎల్‌తో పాటు కరీబియన్ ప్రీమియర్ లీగ్ (బార్బడోస్ రాయల్స్), సౌతాఫ్రికా టీ20 లీగ్‌ల్లో (పార్ల్ రాయల్స్) ఫ్రాంచైజీలు ఉన్నాయి. హండ్రెడ్ లీగ్ విషయానికొస్తే.. ఈ లీగ్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీలైన ఎస్ఆర్హెచ్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఇదివరకే పెట్టుబడులు పెట్టాయి. సదరు ఫ్రాంచైజీల యాజమాన్యాలు హండ్రెడ్ లీగ్‌లోని నార్త్రన్ సూపర్ ఛార్జర్స్, ఓవల్ ఇన్విన్సిబుల్స్, మాంచెస్టర్ ఒరిజినల్స్ ఫ్రాంచైజీలను కొనుగోలు చేశాయి.ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ జట్టు..సంజూ శాంసన్ (కెప్టెన్), ద్రువ్ జురెల్, కునాల్ సింగ్ రాథోడ్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్‌మైర్, శుభమ్ దూబే, యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, వనిందు హసరంగ, ఆకాశ్ మధ్వాల్, ఆశోక్ శర్మ, ఫజల్ హక్ ఫారూకీ, జోఫ్రా ఆర్చర్, కుమార్ కార్తికేయ, క్వేనా మపాకా, మహీశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, యుద్ద్వీర్సింగ్ -
రాహుల్ ద్రవిడ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు (Rahul Dravid) తృటిలో ప్రమాదం తప్పింది. నిన్న (ఫిబ్రవరి 4) బెంగళూరులో రాహుల్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రాహుల్‌కు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు. నిన్న సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో బెంగళూరులోని ఓ బిజీ రోడ్డులో (కన్నింగ్హమ్ రోడ్) రాహుల్ ప్రయాణిస్తున్న కారును ఓ ఆటో ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం ద్రవిడ్ ఆటో డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.In #Bengaluru: A video of former India cricket captain and coach Rahul Dravid getting into an argument with an autodriver on Cunningham Road after a minor collision surfaced on Tuesday evening. No one was injured. pic.twitter.com/0tAtoqQk96— TOI Bengaluru (@TOIBengaluru) February 4, 2025ఈ ప్రమాదంలో రాహుల్ కారుకు స్వల్ప డ్యామేజీ అయ్యింది. ఇందుకే ద్రవిడ్ ఆటో డ్రైవర్‌తో వాదనకు దిగాడు. ద్రవిడ్.. తన మాతృభాష కన్నడలో ఆటో డ్రైవర్‌పై అసహనాన్ని ప్రదర్శించాడు. ఘటన స్ధలం నుంచి బయల్దేరేముందు ద్రవిడ్ సదరు ఆటో డ్రైవర్ వివరాలు తీసుకున్నాడు. అయితే అతనిపై ఎలాంటి పోలీసు కేసు నమోదు కాలేదు. ఎప్పుడూ కూల్‌గా కనిపించే ద్రవిడ్ నడి రోడ్డుపై ఓ ఆటో డ్రైవర్‌తో వాదనకు దిగడం క్రికెట్ అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించింది.52 ఏళ్ల రాహుల్ ద్రవిడ్.. తన 16 ఏళ్ల కెరీర్లో మైదానంలో గొడవలు పడిన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ప్రత్యర్థులు రెచ్చిగొడితే రాహుల్ తన బ్యాట్‌తో సమాధానం చెప్పేవాడు కానీ ఎప్పుడూ గొడవకు దిగేవాడు కాదు. అలాంటి ద్రవిడ్ ఓ ఆటో డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగడంపై ప్రస్తుతం నెట్టింట చర్చ నడుస్తుంది.ఇదిలా ఉంటే, ద్రవిడ్ హెడ్ కోచ్‌గా ఉండగా భారత్ 2024 టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. టీమిండియా హెడ్ కోచ్‌గా ద్రవిడ్‌కు అదే చివరి టోర్నమెంట్. టీమిండియా కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగాక ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా రీ జాయిన్ అయ్యాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాహుల్ తనదైన మార్కును చూపించాడు. ఆ వేలంలో ద్రవిడ్ సూచనలతో రాయల్స్ 13 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని దక్కించుకుంది. వైభవ్ లీగ్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. -
ఆసీస్‌తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు..
టీమిండియా వరుస వైఫల్యాలపై భారత మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) హెడ్‌కోచ్‌గా ఉన్నంతకాలం అంతా బాగానే ఉందని.. కానీ గత ఆరునెలల కాలంలో జట్టు ఇంతగా దిగజారిపోవడం ఏమిటని ప్రశ్నించాడు. మ్యాచ్ విన్నర్లుగా అభివర్ణిస్తూ జట్టుకు భారమైనా కొంతమందిని ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదన్నాడు.ట్రోఫీ గెలిచిన తర్వాత ద్రవిడ్ గుడ్బైఇప్పటికైనా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెలక్టర్లు కఠినంగా వ్యవహరించాలని భజ్జీ సూచించాడు. సూపర్‌స్టార్ ఆటిట్యూడ్ ఉన్నవారిని నిర్మొహమాటంగా పక్కనపెట్టాలని సలహా ఇచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. ద్రవిడ్ కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో మాజీ బ్యాటర్ గౌతం గంభీర్ హెడ్‌కోచ్ పదవిని చేపట్టాడు.ఘోర పరాభవాలుఅయితే, గౌతీ మార్గదర్శనంలో టీమిండియా ఇప్పటి వరకు చెప్పుకోగదగ్గ విజయాలేమీ సాధించకపోగా.. ఘోర పరాభవాలు చవిచూసింది. శ్రీలంక పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు కోల్పోవడంతో పాటు.. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టుల్లో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. తాజాగా ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లోనూ పరాజయాన్ని మూటగట్టుకుంది.కంగారూల చేతిలో 3-1తో ఓడిపోయి.. పదేళ్ల తర్వాత తొలిసారి ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని ఆసీస్‌కు సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో ఇంటా.. బయటా వైఫల్యాల పరంపర కొనసాగిస్తున్న టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. సెలక్టర్లు కఠినంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశాడు. ‘స్టార్ల’ కోసం అభిమన్యు ఈశ్వరన్(Abhimanyu Easwaran) వంటి వాళ్లను బలిచేయవద్దని హితవు పలికాడు.ద్రవిడ్ ఉన్నంత వరకు అంతా బాగానే ఉండేదిఈ మేరకు.. ‘‘గత ఆరు నెలల్లో.. టీమిండియా శ్రీలంక చేతిలో ఓడిపోయింది. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయింది. ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డపై 3-1తో సిరీస్ ఓటమిని చవిచూసింది. రాహుల్ ద్రవిడ్ ఉన్నంత వరకు అంతా బాగానే ఉండేది.అతడి మార్గదర్శనంలో టీమిండియా ప్రపంచకప్ గెలిచింది. కానీ... ఆ తర్వాత అకస్మాత్తుగా ఏమైంది? ప్రతి ఒక్క ఆటగాడికి తనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. ఒకవేళ కొంతమందిని మ్యాచ్ విన్నర్లుగా భావిస్తూ తప్పక ఆడించాలనుకుంటే.. కపిల్ దేవ్, అనిల్ కుంబ్లేలను కూడా జట్టులోకి తీసుకోండి. ఎందుకంటే.. భారత క్రికెట్లో వాళ్ల కంటే పెద్ద మ్యాచ్ విన్నర్లు ఎవరూ లేరు.అభిమన్యు ఈశ్వరన్‌ను ఆడించాల్సిందిఇప్పటికైనా బీసీసీఐ సెలక్టర్లు కఠిన వైఖరి అవలంభించాలి. సూపర్‌స్టార్ ఆటిట్యూడ్‌ను పక్కనపెట్టండి. అభిమన్యు ఈశ్వరన్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకువెళ్లారు. కానీ.. ఒక్క మ్యాచ్‌లోనూ ఆడించలేదు. ఒకవేళ అతడికి అవకాశం ఇచ్చి ఉంటే.. కచ్చితంగా సత్తా చాటేవాడు.సర్ఫరాజ్ ఖాన్ విషయంలోనూ ఇలాగే జరిగింది. తదుపరి ఇంగ్లండ్ పర్యటనలో టెస్టులు ఆడాల్సి ఉంది. అప్పుడు మాత్రం ప్రదర్శన బాగున్న ఆటగాళ్లనే ఎంపిక చేయండి. కీర్తిప్రతిష్టల ఆధారంగా సెలక్షన్ వద్దు’’ అంటూ హర్భజన్ సింగ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశాడు. హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా ఆసీస్‌తో సిడ్నీలో ఆఖరిదైన ఐదో టెస్టులో ఓడిన టీమిండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025 ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. తదుపరి 2025-27 సీజన్లో తొలుత ఇంగ్లండ్ టూర్లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది.చదవండి: CT 2025: శుబ్‌మన్ గిల్‌పై ‘వేటు’?.. అతడికి ప్రమోషన్? -
శతక్కొట్టిన ద్రవిడ్ చిన్న కుమారుడు.. బౌండరీల వర్షం
మూలపాడు (ఆంధ్రప్రదేశ్): భారత బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ (153 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ శతకంతో మెరిశాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ కర్ణాటక బ్యాటర్ ఆకట్టుకున్నాడు.మూడు రోజుల మ్యాచ్‌లో ఆఖరి రోజు కర్ణాటక తొలిఇన్నింగ్స్‌లో 123.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 441 పరుగుల భారీస్కోరు చేయగా, మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. జట్టు తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అన్వయ్ మొదట శమంతక్ అనిరుధ్ (76)తో కలిసి మూడో వికెట్‌కు 167 పరుగులు జతచేశాడు.387 పరుగులకు ఆలౌట్అనిరుధ్ అవుటయ్యాక వచ్చిన సుకుర్థ్ (33)తో నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 128.4 ఓవర్లలో 387 పరుగులు చేసి ఆలౌటైంది. 54 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన కర్ణాటకకు 3 పాయింట్లు లభించగా, జార్ఖండ్ ఒక్క పాయింట్‌తో సరిపెట్టుకుంది.జోనల్ టోర్నమెంట్లో డబుల్ సెంచరీఅన్వయ్ ద్రవిడ్ గతేడాది కర్ణాటక అండర్–14 జట్టుకు సారథ్యం వహించాడు. విజయ్ మర్చంట్ టోర్నీకి ముందు జరిగిన కేఎస్‌సీఏ (కర్ణాటక క్రికెట్ సంఘం) అండర్–16 ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో బెంగళూరు జోన్‌కు ప్రాతినిధ్యం వహించిన అన్వయ్... తుంకూర్ జోన్‌పై చెలరేగి ఆడాడు. డబుల్ సెంచరీ (200 నాటౌట్)తో అజేయంగా నిలిచాడు.ఇక అన్వయ్ అన్నయ్య 19 ఏళ్ల సమిత్ కూడా ఇదివరకే జూనియర్ క్రికెట్లో ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్నాడు. సొంతగడ్డపై ఆ్రస్టేలియా అండర్–19 జట్టుతో జరిగిన పరిమిత ఓవర్ల, ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో సమిత్ ద్రవిడ్ రాణించాడు. చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
జో రూట్ సూపర్ సెంచరీ.. ద్రవిడ్ ఆల్‌టైమ్ రికార్డు సమం
టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో అనూహ్యంగా విఫలమైన జో రూట్.. రెండో టెస్టులో మాత్రం తన మార్క్‌ను చూపించాడు. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన సెకెండ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.130 బంతులు ఎదుర్కొన్న రూట్.. 11 ఫోర్లతో 106 పరుగులు చేశాడు. రూట్‌కు ఇది 36వ టెస్టు సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ఓ అరుదైన ఘనతను రూట్ తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదో బ్యాటర్‌గా భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రికార్డును ఈ ఇంగ్లండ్ లెజెండ్ సమం చేశాడు. ద్రవిడ్ తన అంతర్జాతీయ టెస్టు కెరీర్లో 36 సెంచరీలు చేశాడు. రూట్ మరో సెంచరీ సాధిస్తే ద్రవిడ్‌ను అధిగమిస్తాడు. కాగా రూట్ 2021 నుంచి ఇప్పటి వరకు రూట్ అత్యధికంగా 19 టెస్టు సెంచరీలు చేయడం విశేషం.ఇక టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(51) అగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. జాక్వెస్ కలిస్(45), రికీ పాంటింగ్(41), కుమార సంగక్కర(38), ద్రవిడ్(36), రూట్(36) తర్వాతి స్ధానాల్లో ఉన్నారు.కాగా రెండో టెస్టులో న్యూజిలాండ్‌పై 323 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది.చదవండి: ఆసీస్ చేతిలో ఘోర ఓటమి.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే? -
కోహ్లి అద్భుతం.. జైస్వాల్ దూసుకుపోతున్నాడు.. ఇంకా: ద్రవిడ్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై మాజీ కెప్టెన్, మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లి తిరిగి ఫామ్‌లోకి రావడం శుభసూచకమని.. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులోనే సెంచరీ చేయడం అద్భుతమని కొనియాడాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో కోహ్లి మరింత చెలరేగడం ఖాయమని ద్రవిడ్ పేర్కొన్నాడు.కోహ్లి శతకాలు@81 కాగా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కోహ్లి టెస్టుల్లో శతకం బాదిన విషయం తెలిసిందే. దాదాపు 491 రోజుల తర్వాత అతడు ఓ ఇన్నింగ్స్‌లో వంద పరుగులు సాధించాడు. తద్వారా తన అంతర్జాతీయ సెంచరీల సంఖ్యను 81కి పెంచుకున్నాడు. ఆసీస్‌తో పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా కోహ్లి ఈ ఘనత సాధించాడు.కోహ్లి అద్భుతంకఠిన పరిస్థితుల్లో తన అనుభవాన్ని రంగరించి జట్టు భారీ విజయం సాధించడంలో కోహ్లి కీలక పాత్ర పోషించాడు. తద్వారా విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘కోహ్లి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆరు నెలల క్రితం సౌతాఫ్రికా పర్యటనలోనూ రాణించాడు.సఫారీ గడ్డపై కఠినమైన పిచ్‌లపై కూడా బ్యాట్‌తో అదరగొట్టాడు. తను మళ్లీ టచ్‌లోకి రావడం సంతోషంగా ఉంది. సిరీస్ ఆరంభంలోనే శతకం బాదడం శుభసూచకం. ఈ సిరీస్‌లో మరోసారి కోహ్లి తనదైన మార్కు వేయబోతున్నాడని అనిపిస్తోంది’’ అని కోహ్లిని ప్రశంసించాడు.అందరికీ సాధ్యం కాదుఇక ఇదే మ్యాచ్‌లో 161 పరుగులతో దుమ్ములేపిన టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్‌పై కూడా ద్రవిడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. రోజురోజుకూ అతడు ఊహించనిరీతిలో ఆటను మెరుగుపరచుకుంటున్నాడని కొనియాడాడు. ఆస్ట్రేలియా గడ్డపై తొలి ప్రయత్నంలోనే సెంచరీ చేయడం అందరికీ సాధ్యం కాదని.. జైస్వాల్ మాత్రం పక్కా ప్రణాళికతో తన వ్యూహాలను అమలు చేసిన తీరు ఆకట్టుకుందని ద్రవిడ్ కితాబులిచ్చాడు.బుమ్రా ఆటగాడిగా, సారథిగా సూపర్ హిట్అదే విధంగా.. పెర్త్ టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరించిన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కూడా ద్రవిడ్ ఈ సందర్భంగా అభినందించాడు. తన అసాధారణ బౌలింగ్ నైపుణ్యాలతో జట్టును ఎన్నోసార్లు ఒంటిచేత్తో గెలిపించాడని కొనియాడాడు. కెప్టెన్‌గానూ విజయవంతంగా జట్టును ముందుకు నడిపించాడంటూ హ్యాట్సాఫ్ చెప్పాడు.భారీ విజయంతో మొదలుకాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఎడిషన్‌లో ఆఖరి సిరీస్ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా అక్కడ ఐదు టెస్టులు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో పెర్త్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టుకు రోహిత్ శర్మ గైర్హాజరు కాగా.. బుమ్రా టీమిండియాకు సారథ్యం వహించాడు.ఈ మ్యాచ్‌లో జైస్వాల్, కోహ్లి సెంచరీలతో రాణించగా.. బుమ్రా ఎనిమిది వికెట్లతో చెలరేగాడు. ఈ క్రమంలో టీమిండియా ఆసీస్‌ను 295 పరుగుల తేడాతో మట్టికరిపించింది. సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య కాన్బెర్రా వేదికగా డిసెంబరు 6 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.చదవండి: అప్పుడు రూ. 20 లక్షలు.. ఇప్పుడు రూ. 11 కోట్లు.. టీమిండియా రైజింగ్ స్టార్ ‘భారీ’ రికార్డు -
Ind vs Aus 1st Test: రాహుల్ ద్రవిడ్ మనసంతా ఇక్కడే..!
టీమిండియా హెడ్‌కోచ్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్. రవిశాస్త్రి స్థానాన్ని భర్తీ చేస్తూ ప్రధాన కోచ్‌గా వచ్చిన ఈ కర్ణాటక దిగ్గజం.. తన హయాంలో భారత జట్టును అన్ని ఫార్మాట్లలోనూ అగ్రపథంలో నిలిపాడు. ద్రవిడ్ మార్గదర్శనంలో టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో ఫైనల్ చేరడంతో పాటు.. వన్డే వరల్డ్‌కప్-2023లోనూ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అయితే, ఈ రెండు సందర్భాల్లో తుదిమెట్టుపై బోల్తా పడి విజయానికి ఒక అడుగుదూరంలోనే నిలిచిపోయింది.అద్భుత విజయంతో ముగింపుఅలాంటి సమయంలో ద్రవిడ్‌పై విమర్శలు రాగా.. టీ20 ప్రపంచకప్-2024 రూపంలో గట్టి సమాధానమిచ్చే అవకాశం అతడికి దొరికింది. ఆటగాళ్ల ప్రాక్టీస్, క్రమశిక్షణ విషయంలో నిక్కచ్చిగా ఉండే ద్రవిడ్.. ఈసారి ఆఖరి గండాన్ని దాటేసి.. కోచ్‌గా అద్భుత విజయంతో తన ప్రయాణం ముగించాడు. ఈ మెగా టోర్నీలో రోహిత్ సేన టైటిల్ సాధించడంతో కోచ్‌గా తన జర్నీని సంపూర్ణం చేసుకున్నాడు.ఇక గంభీర్ వంతుఇక ఈ ఐసీసీ ఈవెంట్ తర్వాత ద్రవిడ్ స్థానంలో గౌతం గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్‌గా నియమితుడయ్యాడు. అతడి నేతృత్వంలో టీమిండియా మిశ్రమ ఫలితాలు పొందుతోంది. అయితే, ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో 3-0తో టీమిండియా వైట్‌వాష్ కావడంతో గంభీర్‌పై విమర్శలు వచ్చాయి.ఈ క్రమంలో ఆస్ట్రేలియా వేదికగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భారత జట్టు ప్రదర్శనపైనే గౌతీ భవిష్యత్తు ఆధారపడి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మెగా సిరీస్‌లో భాగంగా భారత్ ఆసీస్ టూర్లో ఐదు టెస్టులు ఆడనుంది. ఇందులో కనీసం నాలుగు గెలిస్తేనే ఈసారి భారత్ పరపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుతుంది.పెర్త్ టెస్టుపై ద్రవిడ్ ఆసక్తిఈ నేపథ్యంలో భారీ అంచనాల నడుమ పెర్త్ వేదికగా శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో టీమిండియాకు సారథ్యం వహిస్తున్నాడు. పెర్త్‌లో టాస్ గెలిచిన అతడు... తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయింది.అయితే, బ్యాటింగ్‌లో కుప్పకూలినా.. బౌలింగ్‌లో మాత్రం భళా అనిపించింది. తొలి రోజు ఆటలో ఆసీస్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టింది. భారత పేసర్ల దెబ్బకు శుక్రవారం ఆసీస్ కేవలం 67 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది.ఇక ఈ మ్యాచ్ సాధారణ అభిమానులతో పాటు ద్రవిడ్‌లోనూ ఆసక్తి రేపింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఎన్ని వికెట్లు పడ్డాయి? ఎవరు అవుటయ్యారంటూ ద్రవిడ్ ఆరా తీసిన వీడియో వైరల్‌గా మారింది. కాగా ద్రవిడ్ ప్రస్తుతం ఐపీఎల్-2025 మెగా వేలంతో బిజీగా ఉన్నాడు.అవుటైంది ఎవరు? ఎవరి బౌలింగ్‌లో?అయినప్పటికీ అతడి మనసు టీమిండియా- ఆసీస్ మ్యాచ్‌పై ఉండటం విశేషం. ఆసీస్ 47 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన రాజస్తాన్ రాయల్స్ సభ్యుడు ఒకరు స్కోరు చెప్తుండగా.. ద్రవిడ్ ఎవరు అవుటయ్యారంటూ ఉత్సాహంగా అడిగాడు. రాజస్తాన్ ఫ్రాంఛైజీ ఇందుకు సంబంధించిన వీడియోను తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఇదిలా ఉంటే.. శనివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా భారత్ ఆసీస్‌ను కేవలం 104 పరుగులకే ఆలౌట్ చేసింది. బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. హర్షిత్ రాణా మూడు, మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.కాగా ద్రవిడ్ ఇటీవలే రాజస్తాన్ రాయల్స్ హెడ్‌కోచ్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. ఇక మెగా వేలం కోసం అతడు ఇప్పటికే సౌదీ అరేబియాలోని జెద్దా నగరానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. నవంబరు 24, 25 తేదీల్లో వేలంపాట జరుగనుంది.చదవండి: ఇది నా డ్రీమ్ ఇన్నింగ్స్ కాదు.. అతడే నా ఆరాధ్య దైవం: నితీశ్ రెడ్డి Difficult to not keep up with scores when it’s Day 1 of the Border-Gavaskar Trophy 🇮🇳😂🔥 pic.twitter.com/d9qUdkZDoh— Rajasthan Royals (@rajasthanroyals) November 22, 2024 -
సంజూ శాంసన్ తండ్రి క్షమాపణ చెప్పాలి.. లేదంటే!
టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ గురించి ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రాడ్ హాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సంజూ తండ్రి భారత క్రికెట్ దిగ్గజాలపై ఇష్టారీతిన కామెంట్లు చేయడం తగదని.. ఆయన క్షమాపణ చెబితే బాగుంటుందని హితవు పలికాడు. లేదంటే.. ఆ ప్రభావం సంజూ ఆటపై కచ్చితంగా పడుతుందని పేర్కొన్నాడు.కాగా కేరళకు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ 2015లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన అతడు.. ఆరేళ్ల తర్వాత వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక టెస్టుల్లో ఇంత వరకు సంజూ స్థానం దక్కించుకోలేకపోయాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ అతడికి అరకొర అవకాశాలే వచ్చేవి. అయితే, ఆ సమయంలోనూ నిలకడలేమి ఆటతో చోటు కోల్పోయేవాడు.సఫారీ గడ్డపై శతకాలు బాదిఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. సంజూకు టీ20 జట్టులో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో, సౌతాఫ్రికా గడ్డపై సంజూ బ్యాట్‌తో సత్తా చాటాడు. సఫారీలతో టీ20 సిరీస్‌లో రెండు శతకాలు బాది.. జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేశాడు.ఆ నలుగురి కారణంగానేఇలాంటి తరుణంలో సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ ఓ మలయాళ చానెల్‌తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. టీమిండియా దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ వల్లే తన కుమారుడి పదేళ్ల కెరీర్ నాశనమైనందని ఆయన ఆరోపించాడు. విశ్వనాథ్ చేసిన వ్యాఖ్యలపై ఆసీస్ లెజెండ్ బ్రాడ్ హాగ్ తాజాగా స్పందించాడు.ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదుఈ మేరకు.. ‘‘సంజూ శాంసన్ తండ్రి బహిరంగంగా ధోని, కోహ్లి, రోహిత్, ద్రవిడ్ పేర్లు చెబుతూ.. తన కొడుకు కెరీర్లో పదేళ్లు వెనకబడటానికి కారణం వాళ్లే అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. భారత క్రికెట్లో ముఖ్యమైన, కీలకమైన నాలుగు పేర్లను ఆయన ప్రస్తావించారు.వాళ్లంతా తమ హయాంలో టీమిండియాను అగ్రస్థానంలో నిలిపిన వ్యక్తులు. నిజానికి సంజూ శాంసన్ అద్భుతమైన ఆటగాడు. ఇప్పుడిప్పుడే కెరీర్లో నిలదొక్కుకుంటున్నాడు. రెండు సెంచరీలతో సత్తా చాటి.. తన స్థానాన్ని పదిలం చేసుకునే పనిలో ఉన్నాడు.సంజూ తండ్రి క్షమాపణ చెప్పాలి.. లేదంటే అతడిపై ఒత్తిడి పెరుగుతుందిఇలాంటి సమయంలో సంజూ కుటుంబం నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం.. అతడిపై ఒత్తిడిని పెంచుతుంది. నా అభిప్రాయం ప్రకారం.. సంజూ కెరీర్ సాఫీగా, ప్రశాంతంగా సాగాలంటే.. అతడి తండ్రి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే.. తండ్రి వ్యాఖ్యల వల్ల ఒత్తిడికి లోనైతే.. సంజూ ఆట తీరు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.నోళ్లను అదుపులో పెట్టుకునిఐపీఎల్లో ఇప్పటికే రాజస్తాన్ రాయల్స్ జట్టుకు అతడు కెప్టెన్‌గా ఉన్నాడు. సంజూతో పాటు భారత్‌లో ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు కొదవలేదు. కాబట్టి ఎవరైనా సరే.. నోళ్లను అదుపులో పెట్టుకుని.. బ్యాట్‌తోనే విమర్శకులకు సమాధానం ఇస్తే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు’’ అంటూ బ్రాడ్ హాగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.చదవండి: ప్రపంచంలోని ప్రతి జట్టుకు ఇలాంటి ఆల్‌రౌండర్ అవసరం: టీమిండియా కోచ్ -
ద్రవిడ్ చిన్న కొడుకు వచ్చేస్తున్నాడు.. ఆ టోర్నమెంట్‌కు ఎంపిక
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనయులు క్రికెట్ ప్రపంచంలోకి దూసుకొస్తున్నారు. పెద్ద కొడుకు సుమిత్ ద్రవిడ్ అండర్-19 స్ధాయిలో అదరగొడుతుండగా.. ఇప్పుడు చిన్న కొడుకు అన్వయ్ ద్రవిడ్ విజయ్ మర్చంట్ ట్రోఫీలో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీకి కర్ణాటక క్రికెట్ ఆసోషియేషన్‌కు ప్రకటించిన 35 మంది ప్రాబబుల్స్ జాబితాలో అన్వయ్‌కు చోటుదక్కింది. కాగా అన్వయ్ ద్రవిడ్ గతేడాది ఇంటర్-జోన్ స్థాయిలో కర్ణాటక అండర్-14 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అదేవిధంగా ఇటీవల కేఎస్‌సీఏ అండర్-16 ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో అన్వయ్ అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ టోర్నీలో భాగంగా తుమకూరు జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జోన్ తరపున 200 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు అతడికి జయ్ మర్చంట్ ట్రోఫీ కోసం ప్రాబబుల్స్‌లో చోటు కల్పించారు. ఇక ఈ టోర్నీ డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. మరోవైపు ద్రవిడ్ పెద్ద కొడుకు సుమిత్ ద్రవిడ్ కూచ్ బెహర్ ట్రోఫీలో కర్ణాటక తరపున ఆడుతున్నాడు.చదవండి: BGT 2024: టీమిండియా టెస్టు సిరీస్.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్లకు చోటు -
‘ఇకపై నీ పేరును పరిశీలించం’ అని ద్రవిడ్ డైరెక్ట్‌గానే చెప్పేశాడు!
‘సంతోషకరమైన నా క్రికెట్ ప్రయాణంలో ఇది నా చివరి సీజన్. రిటైర్మెంట్‌లోగా రంజీ ట్రోఫీలో మాత్రమే ఆడతాను. బెంగాల్‌కు చివరిసారి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా భావిస్తున్నా. ఈ సీజన్‌ను మర్చిపోలేనిదిగా మార్చుకుంటాం’ అంటూ టీమిండియా వెటరన్ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తూ చేసిన వ్యాఖ్యలు. భారత అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడిగా చెప్పుకోదగ్గ సాహాకు రావాల్సినన్ని అవకాశాలు రాలేదనే చెప్పవచ్చు.ధోని నీడలో..నిజానికి వికెట్ కీపర్‌గా సాహా అద్భుత ప్రతిభావంతుడు. గత కాలపు భారత కీపర్లు సయ్యద్ కిర్మాణీ, కిరణ్ మోరె, నయన్ మోంగియా తరహాలో అత్యుత్తమ కీపింగ్ నైపుణ్యంతో పాటు అవసరమైతే కొంత బ్యాటింగ్ చేయగల సమర్థుడిగానే ఎక్కువగా గుర్తింపు పొందాడు. దేశవాళీ క్రికెట్లో బెస్ట్ కీపర్‌గా పేరు వచ్చినా... టీమిండియాను శాసిస్తున్న ధోని ఉండటంతో అతను తన చాన్స్ కోసం చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చింది.2010లో నాగపూర్ టెస్టుకు ముందు రోహిత్ శర్మ అనూహ్యంగా గాయపడటంతో సాహాకు బ్యాటర్‌గా తొలి టెస్టు ఆడే అవకాశం దక్కింది. మరో రెండేళ్ల తర్వాత స్లో ఓవర్‌రేట్ కారణంగా ధోనిపై నిషేధం పడటంతో రెండో టెస్టు దక్కింది. ఎట్టకేలకు 2014–15 ఆసీస్ పర్యటనలో తొలి టెస్టు తర్వాత ధోని అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో సాహా అసలు కెరీర్ మొదలైంది. అక్కడి నుంచి దాదాపు ఐదేళ్ల పాటు ప్రధాన కీపర్‌గా సాహా తన సత్తాను ప్రదర్శిస్తూ ప్రపంచ అత్యుత్తమ కీపర్లలో ఒకడిగా నిలిచాడు.పంత్ రాకతో పాత కథ మళ్లీ మొదలుస్వదేశంలో గిర్రున తిరిగే అతి కష్టమైన స్పిన్ బంతులనైనా, విదేశీ గడ్డపై సీమ్ బంతులనైనా స్టంప్‌ల వెనక చురుగ్గా, సమర్థంగా అందుకోవడంలో అతనికి అతనే సాటిగా నిలిచాడు. బ్యాటింగ్‌లో కూడా కొన్ని చక్కటి ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. అయితే రిషభ్ పంత్ దూసుకొచ్చిన తర్వాత సాహా వెనుకబడిపోయాడు. పంత్ ఉన్నప్పుడు కూడా కొంత కాలం రెండో కీపర్‌గా జట్టులో అవకాశం దక్కినా అది ఎంతో కాలం సాగలేదు. కోచ్ ద్రవిడ్ ‘ఇకపై నీ పేరును పరిశీలించం’ అంటూ సాహాకు నేరుగా చెప్పేయడంతో అతని టెస్టు కెరీర్ ముగిసింది. ఐపీఎల్లో అదే హైలైట్2008 నుంచి 2024 వరకు ఐపీఎల్ ఆడిన కొద్ది మంది ఆటగాళ్ల జాబితాలో సాహా కూడా ఉన్నాడు. కోల్‌కతా, చెన్నై, పంజాబ్, హైదరాబాద్, గుజరాత్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన అతను 170 మ్యాచ్‌లలో 127.57 స్ట్రయిక్‌రేట్‌తో 2934 పరుగులు సాధించాడు.ఇక 2014లో ఫైనల్లో పంజాబ్ తరఫున 55 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో అజేయంగా 115 పరుగులు సాధించిన ప్రదర్శన అతని ఐపీఎల్ కెరీర్లో హైలైట్. 2022లో టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు.అతడిని తన వారసుడిగా తీర్చిదిద్దిబెంగాల్ యువ కీపర్ అభిషేక్ పొరేల్కు మెంటార్‌గా వ్యవహరించి తన వారసుడిగా అతడిని సాహా తీర్చిదిద్దాడు. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్)తో విభేదాల కారణంగా రెండేళ్లు త్రిపుర తరఫున ఆడిన సాహా ఈ సీజన్లో మళ్లీ తిరిగొచ్చాడు.అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సాహా... ఈ టోర్నీనే తనకు చివరిదని వెల్లడించాడు. మూడేళ్ల క్రితమే చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన 40 ఏళ్ల సాహా రంజీ తర్వాత దేశవాళీ క్రికెట్లోనూ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ కానున్నట్లు స్పష్టం చేశాడు. ఇక ఈ సీజన్ రంజీలో బెంగాల్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా...లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆడిన ఒకే ఒక ఇన్నింగ్స్‌లో అతను డకౌటయ్యాడు.కాగా టీమిండియా తరఫున 40 టెస్టులు ఆడిన సాహా 29.41 సగటుతో సాహా 1353 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 6 అర్ధసెంచరీలు ఉన్నాయి. కీపర్‌గా 92 క్యాచ్‌లు అందుకున్న అతను 12 స్టంపింగ్‌లు చేశాడు. టీమిండియా తరఫున 9 వన్డేలు కూడా ఆడిన సాహాకు అంతర్జాతీయ టీ20లు ఆడే అవకాశం మాత్రం రాలేదు. 17 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో అతను 138 మ్యాచ్‌లు ఆడటం విశేషం.చదవండి: Rachin Ravindra: నేను వంద శాతం న్యూజిలాండ్‌వాడినే.. కానీ -
Irani Cup 2024: సచిన్, ద్రవిడ్ సరసన సర్ఫరాజ్
ఇరానీ కప్ 2024లో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ డబుల్ సెంచరీతో మెరిశాడు. రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఈ మార్కును తాకాడు. రెండో రోజు మూడో సెషన్ సమయానికి సర్ఫరాజ్ 218 పరుగులతో అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా శార్దూల్ ఠాకూర్ (25) క్రీజ్‌లో ఉన్నాడు. 133.4 ఓవర్ల అనంతరం ముంబై స్కోర్ 522/8గా ఉంది. ముంబై ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అజింక్య రహానే (97), శ్రేయస్ అయ్యర్ (57), తనుశ్ కోటియన్ (64) అర్ద సెంచరీలతో రాణించారు. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, ప్రసిద్ద్ కృష్ణ తలో రెండు వికెట్లు తీశారు.సచిన్, ద్రవిడ్ సరసన సర్ఫరాజ్రెస్ట్ ఆఫ్ ఇండియాపై సెంచరీతో సర్ఫరాజ్ ఖాన్ క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ సరసన చేరాడు. సర్ఫరాజ్‌కు ఇరానీ కప్‌లో ఇది రెండో సెంచరీ కాగా.. సచిన్, ద్రవిడ్ కూడా ఇరానీ కప్‌లో తలో రెండు సెంచరీలు చేశారు. ఇరానీ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత దిలీప్ వెంగ్‌సర్కార్, గుండప్ప విశ్వనాథ్‌కు దక్కుతుంది. ఈ ఇద్దరు ఇరానీ కప్‌లో తలో నాలుగు సెంచరీలు చేశారు. వెంగ్‌సర్కార్, విశ్వనాథ్ తర్వాత ఇరానీ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత హనుమ విహారి, అభినవ్ ముకుంద్, సునీల్ గవాస్కర్, వసీం జాఫర్‌లకు దక్కుతుంది. వీరంతా ఈ టోర్నీలో తలో మూడు సెంచరీలు చేశారు.చదవండి: డబుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్ ఖాన్ -
సమిత్ ద్రవిడ్ బ్యాడ్‌లక్.. ఇక ఆ జట్టుకు ఆడలేడు!
భారత యువ క్రికెట్ జట్టు తరఫున అరంగేట్రం చేయాలన్న సమిత్ ద్రవిడ్‌కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. గాయం కారణంగా ఇప్పటికే ఆస్ట్రేలియాతో యూత్ వన్డేలు మిస్సయిన ఈ కర్ణాటక ప్లేయర్.. రెడ్‌బాల్ మ్యాచ్‌లకు కూడా దూరం కానున్నట్లు తాజా సమాచారం. టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పెద్ద కుమారుడే సమిత్ ద్రవిడ్.వన్డేల్లో బెంచ్‌కు పరిమితంకాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్‌ల ఫోర్ డే సిరీస్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా అండర్-19 జట్టు భారత్‌కు వచ్చింది. ఈ క్రమంలో తొలుత పుదుచ్చేరి వేదికగా సెప్టెంబరు 21, 23, 26 తేదీల్లో వన్డేలు ఆడింది. ఇందులో యువ భారత్ ఆసీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే, మోకాలి గాయం కారణంగా సమిత్ ద్రవిడ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. బెంచ్‌కే పరిమితమయ్యాడు.రెడ్‌బాల్ మ్యాచ్‌లకూ దూరంప్రస్తుతం.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో అతడు చికిత్స పొందుతున్నాడు. ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇంకా కోలుకోనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సెప్టెంబరు 30- అక్టోబరు 7 వరకు చెన్నైలో ఆస్ట్రేలియాతో జరుగనున్న ఫోర్-డే మ్యాచ్‌లకు కూడా దూరం కానున్నాడు. ఈ విషయం గురించి భారత యువ జట్టు హెడ్‌కోచ్ హృషికేశ్ కనిత్కర్ ఈఎస్‌పీఎన్‌క్రిక్ ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం అతడు ఇంకా ఎన్సీఏలోనే ఉన్నాడు.ఇకపై ఆ జట్టుకు ఆడలేడుమోకాలి గాయం పూర్తిగా నయం కాలేదు. కాబట్టి అతడు ఆసీస్‌తో మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశం లేదు’’ అని తెలిపాడు. కాగా సమిత్ ద్రవిడ్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు. ఎందుకంటే.. ఈ ఏడాది అక్టోబరు 11న 19వ పుట్టినరోజు జరుపుకోబోతున్నాడు. దీనర్థం ఇక అతడికి అండర్-19 జట్టుకు, ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్-2026 ఆడే భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించే ఛాన్స్ ఉండదు. ఇదిలా ఉంటే.. ద్రవిడ్ చిన్న కుమారుడు, సమిత్ తమ్ముడు అన్వయ్ కూడా కర్ణాటక తరఫున జూనియర్ లెవల్లో క్రికెట్ ఆడుతున్న విషయం తెలిసిందే.చదవండి: WTC Updated Points Table: మూడో స్థానానికి ఎగబాకిన శ్రీలంక.. టాప్‌లోనే భారత్ -
‘చెత్తగా ఆడండి.. అప్పుడు అసలైన గంభీర్‌ను చూస్తారు’
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ గురించి బంగ్లాదేశ్ వెటరన్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టును విజయపథంలో నడపగల సత్తా గౌతీకి ఉందని.. అయితే, అతడి కోచింగ్ స్టైల్ గురించి ఇప్పుడే అంచనాకు రాలేమన్నాడు. టీమిండియా చెత్తగా ఆడినపుడు గంభీర్ ‘నిజ స్వరూపం’ బయటపడుతుందని వ్యాఖ్యానించాడు.ద్రవిడ్ తర్వాతటీ20 ప్రపంచకప్-2024లో రోహిత్ సేన చాంపియన్‌గా నిలిచిన అనంతరం రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్ పదవి నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో మాజీ ఓపెనర్ గౌతం గంభీర్‌ను టీమిండియా హెడ్‌కోచ్‌గా నియమించింది బీసీసీఐ. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(రెండుసార్లు ప్లే ఆఫ్స్) జట్టుకు మార్గదర్శనం చేయడంతో పాటు.. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన మెంటార్‌గా ఘనత వహించిన అతడికి భారత జట్టు బాధ్యతలు అప్పగించింది.తన దూకుడు వైఖరికి విరుద్ధంగాశ్రీలంక పర్యటన సందర్భంగా జూలైలో కోచ్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన గంభీర్‌కు శుభారంభం దక్కింది. సూర్యకుమార్ సేన ఆతిథ్య జట్టు టీ20 సిరీస్‌లో 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే, వన్డే సిరీస్‌లో మాత్రం రోహిత్ సేనకు ఘోర పరాభవం ఎదురైంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత శ్రీలంక చేతిలో సిరీస్ ఓడిపోయింది. రెండో ప్రయత్నంలోనే గంభీర్‌కు ఇలాంటి చేదు అనుభవం ఎదురైనా.. తన దూకుడు వైఖరికి విరుద్ధంగా ప్రశాంతంగానే కనిపించాడు. ఈ క్రమంలో స్వదేశంలో తాజాగా బంగ్లాదేశ్‌తో సిరీస్‌తో టెస్టుల ప్రయణాన్ని మొదలుపెట్టిన గంభీర్‌కు.. రోహిత్ సేన ఘన విజయంతో స్వాగతం పలికింది. చెన్నై టెస్టులో బంగ్లాను 280 పరుగుల తేడాతో చిత్తు చేసి క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. గంభీర్ విశ్వరూపం చూస్తారుఈ నేపథ్యంలో భారత్- బంగ్లా సిరీస్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న తమీమ్ ఇక్బాల్ జియో సినిమా షోలో మాట్లాడుతూ గంభీర్ గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘మీరు(టీమిండియా) వరుసగా గెలుస్తూ ఉంటే.. అతడి మనసులో నిజంగా ఏం దాగుందో బయటకు రాదు. మీరు ఎప్పుడైతే ఓ సిరీస్ కోల్పోతారో.. ఆ వెంటనే మరొకటి ఓడిపోతారో.. అప్పుడు తన నిజ స్వరూపం బయటపడుతుంది. జట్టును విజయవంతంగా ముందుకు నడిపించగల సామర్థం అతడికి ఉంది. అయితే, ఇప్పుడే తన కోచింగ్ స్టైల్‌పై నిశ్చితాభిప్రాయానికి రాకూడదు. టీమిండియా ఒక్క చెత్త మ్యాచ్ ఆడనివ్వండి.. అప్పుడు తెలుస్తుంది’’ అని తమీమ్ ఇక్బాల్ పేర్కొన్నాడు. గంభీర్ మరీ అంత కూల్ కాదని.. జట్టు ఓటములపాలైతే ఆటగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించడానికి వెనుకాడడని అభిప్రాయపడ్డాడు.గంభీర్ ముందున్న సవాళ్లువరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరడం సహా చాంపియన్స్ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్-2026, వన్డే వరల్డ్‌కప్-2027 రూపంలో గంభీర్‌కు కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి.చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి -
ద్రవిడ్ రీ ఎంట్రీ.. ప్రకటించిన ఐపీఎల్ ఫ్రాంఛైజీ
టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పునరాగమనం చేయనున్నాడు. వచ్చే సీజన్లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించనునున్నాడు. రాయల్స్ యాజమాన్యం ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ‘‘టీమిండియా లెజండరీ, ప్రపంచకప్ గెలిపించిన కోచ్ రాజస్తాన్ రాయల్స్‌లోకి సంచలన రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు’’ అంటూ రాయల్స్ సీఈవో జేక్ లష్ మెక్రమ్‌తో ద్రవిడ్ దిగిన ఫొటోను షేర్ చేసింది.సరికొత్త సవాళ్లకు సిద్ధంఈ సందర్భంగా ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్ టోర్నీ ముగిసిన తర్వాత.. సరికొత్త సవాళ్లకు సిద్ధం కావాలని భావించాను. అందుకు రాయల్స్‌తో జతకట్టడం కంటే ఉత్తమమైన మార్గం మరొకటి లేదు’’ అని పేర్కొన్నాడు. కాగా.. ‘‘ద్రవిడ్‌తో సంప్రదింపులు ఫలప్రదంగా ముగిశాయి. త్వరలోనే అతను కోచ్ బాధ్యతలు చేపట్టడం ఖాయం’’ అని ఇటీవల రాయల్స్ ఫ్రాంఛైజీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇప్పుడు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ద్రవిడ్‌తో పాటు టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ విక్రం రాథోడ్‌ను కూడా కోచింగ్ సిబ్బందిలోకి తీసుకోవాలని రాయల్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.గతంలో సారథిగాకాగా ద్రవిడ్ ఐపీఎల్లో రాజస్తాన్‌కు సేవలందించడం ఇదే తొలిసారి కాదు. 2012, 2013 ఎడిషన్లలో రాయల్స్ కెప్టెన్‌గా వ్యహరించిన ద్రవిడ్ రిటైర్మెంట్ అనంతరం.. ఆ జట్టు మెంటార్‌గా రెండేళ్లు పని చేశాడు. అనంతరం 2016లో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టాడు.ఆ తర్వాత.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ‘హెడ్’గా నియమితుడైన ద్రవిడ్.. ఐపీఎల్‌కు దూరమయ్యాడు. అనంతరం టీమిండియా ప్రధాన కోచ్‌గా ఎంపికైన ఈ కర్ణాటక ప్లేయర్ రెండున్నరేళ్లపాటు ఆ విధులు నిర్వర్తించాడు. అతడి హయాంలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2022 సెమీస్, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-2023 ఫైనల్, వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్ చేరింది.వరల్డ్ కప్ విన్నర్అయితే, టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న అతడి కల నెరవేరింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ ద్రవిడ్‌ల కాంబినేషన్లో టీమిండియా కరీబియన్ గడ్డపై ఈ ఏడాది పొట్టి ఫార్మాట్ కప్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత ద్రవిడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగాడు. నిజానికి ద్రవిడ్ పదవీ కాలం కూడా గత ఏడాది వన్డే ప్రపంచకప్‌తోనే ముగిసింది. అయినా.. ఈ మెగా టోర్నీ ముగిసే వరకు కోచ్‌గా సేవలు అందించి.. ఐసీసీ టైటిల్‌తో తన ప్రయాణం ముగించాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ఇప్పటి వరకు రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ డైరెక్టర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. రాజస్తాన్‌కు సంబంధించిన బార్బడోస్ రాయల్స్... కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో, పార్ల్ రాయల్స్... సౌతాఫ్రికా20 టోర్నీల్లో పాల్గొంటున్నాయి. ఆయా లీగ్‌లలో విజయాలే లక్ష్యంగా సహాయ సిబ్బందిలో దిగ్గజాలను నియమించుకుంటోంది రాయల్స్.చదవండి: బ్యాట్ ఝులిపించిన శ్రేయస్ అయ్యర్.. ఎట్టకేలకు.. -
రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్..?
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ నూతన హెడ్ కోచ్‌ను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ శనివారం ఆర్ఆర్ మేనేజ్మెంట్ తమ నూతన హెడ్ కోచ్‌గా టీమిండియా తాజా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. రాయల్స్ 2024 ఎడిషన్‌లో డెడికేటెడ్ హెడ్ కోచ్ లేకుండానే బరిలో నిలిచింది. కుమార సంగక్కర డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా.. ట్రెవర్ పెన్నీ, షేన్ బాండ్లు అసిస్టెంట్ కోచ్‌లుగా వ్యవహరించారు. రాయల్స్ గత సీజన్ ప్లే ఆఫ్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతుల్లో ఓడింది.కాగా, ద్రవిడ్ 2011-2013 మధ్యలో రాయల్స్ హెడ్ కోచ్‌గా పని చేశాడు. 2014 ఎడిషన్‌లో మెంటార్‌గా వ్యవహరించాడు. అనంతరం అతను భారత అండర్-19, ఇండియా-ఏ, ఎన్సీఏలో హెడ్ ఆఫ్ క్రికెట్, టీమిండియా హెడ్ కోచ్ వంటి హోదాల్లో పని చేశాడు. ద్రవిడ్ ఆథ్వర్యంలోనే టీమిండియా ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌ను చేజిక్కించుకుంది. అలాగే ద్రవిడ్ హయాంలో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు.. వన్డే వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు కూడా చేరింది. తాజా సమాచారం మేరకు ద్రవిడ్ రాయల్స్ హెడ్ కోచ్‌గా నియమితుడైతే అసిస్టెంట్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్ ఎంపికవుతాడని తెలుస్తుంది. కుమార సంగక్కర డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా కొనసాగే అవకాశం ఉంది. -
మెంటలోడు అనుకుంటారని భయపడ్డా: ద్రవిడ్
ఎన్నో కఠిన సవాళ్లు దాటిన తర్వాతే తాము ప్రపంచకప్‌ను కైవసం చేసుకోగలిగామని టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. భారత్ టీ20 వరల్డ్‌కప్-2024 చాంపియన్‌గా అవతరించగానే తమ సంబరాలు అంబరాన్నంటాయని.. తాను సైతం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యానని పేర్కొన్నాడు. ఆ సమయంలో భావోద్వేగాలు నియంత్రించుకోలేక ఆటగాళ్లతో కలిసి తాను చిన్నపిల్లాడిలా గంతులు వేశానని తెలిపాడు.అయితే, ఇందుకు సంబంధించిన దృశ్యాలు తన కుమారుల కంటపడకుండా ఉండేందుకు విఫలయత్నం చేశానంటూ ద్రవిడ్ నవ్వులు చిందించాడు. కాగా సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2024లో మరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది టీమిండియా. అమెరికా- వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలిచి.. పదకొండేళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. విమర్శించిన నోళ్లే ప్రశంసల వర్షం కురిపించాయి..ఫలితంగా కెప్టెన్‌గా రోహిత్ ఖాతాలో తొలి టైటిల్ చేరగా... హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ప్రయాణానికి విజయవంతమైన ముగింపు లభించింది. దీంతో... 2022లో జట్టు వైఫల్యానికి కారణమని వీళ్లిద్దరిని విమర్శించిన నోళ్లే ప్రశంసల వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలో.. జట్టు కప్ అందుకోగానే ద్రవిడ్ కూడా ఎన్నడూ లేని విధంగా ఉద్వేగానికి లోనవుతూ.. ఆటగాళ్లతో కలిసి సందడి చేశాడు. ఎప్పుడూ గంభీరంగా కనిపించే ఈ మాజీ కెప్టెన్‌ను అలా చూసి అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. నాకు పిచ్చిపట్టిందని సందేహ పడతారనుకున్నాఈ విషయం గురించి తాజాగా ప్రస్తావనకు రాగా రాహుల్ ద్రవిడ్ స్పందిస్తూ.. ‘‘మేమంతా ఎంతో కష్టపడిన తర్వాత దక్కిన ఫలితం అది. అలాంటపుడు మా సంతోషం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకు నిదర్శనమే నాటి సెలబ్రేషన్స్. ఎంతో గొప్పగా సంబరాలు చేసుకున్నాం. అయితే, ఈ వీడియోను నా కుమారులు చూడకూడదని జాగ్రత్త పడ్డాను. ఎందుకంటే.. నన్ను వాళ్లిలా చూశారంటే నాకు పిచ్చి పట్టిందేమోనని వాళ్లు సందేహపడతారేమోనన్న భయం వెంటాడింది(నవ్వుతూ). నిజానికి నేనెప్పుడూ మా వాళ్లకు కూల్‌గా ఉండాలని చెబుతాను.గెలుపైనా.. ఓటమైనా తొణకకుండా ఉంటూ భావోద్వేగాలను నియంత్రించుకోవాలని వాళ్లకు హితబోధ చేస్తూ ఉంటాను. అలాంటిది నేనే అంతగా సెలబ్రేట్ చేసుకున్నానంటే ఆ విజయానికి ఉన్న విలువ అటువంటిది. కోచ్‌గా నా చివరి మ్యాచ్ అలా ముగిసిందుకు సంతోషంగా ఉన్నాను. అదే ఆఖరి మ్యాచ్ కావడం కూడా నయమైంది. లేదంటే.. మీరు చెప్పేదొకటి.. చేసేదొకటి(సెలబ్రేషన్స్ విషయంలో) అని మా జట్టు సభ్యులు నన్ను ఆటపట్టించేవారు’’ అంటూ చిరు నవ్వులు చిందించాడు. సియట్ అవార్డు వేడుక సందర్భంగా హిందుస్తాన్ టైమ్స్‌తో రాహుల్ ద్రవిడ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా ద్రవిడ్ కుమారులు కూడా క్రికెటర్లేనన్న విషయం తెలిసిందే. పెద్ద కొడుకు సమిత్ ఇటీవలే అండర్-19 భారత జట్టుకు ఎంపికయ్యాడు. చిన్న కొడుకు అన్వయ్ సైతం ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇక ద్రవిడ్ స్థానంలో ప్రస్తుతం గౌతం గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.చదవండి: పతనం దిశగా పాక్.. అసలు ఈ జట్టుకు ఏమైంది?.. బంగ్లా రికార్డులివీ -
భారత జట్టులో జూనియర్ ద్రవిడ్ ఎంట్రీ!
టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ అంతర్జాతీయ క్రికెట్‌వైపు తొలి అడుగువేశాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడనున్న అండర్-19 భారత జట్టుకు ఎంపికయ్యాడు. కంగారూ జట్టుతో స్వదేశంలో జరుగనున్న వన్డే, ఫోర్-డే సిరీస్‌కు సమిత్‌ను ఎంపిక చేశారు సెలక్టర్లు.కాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్‌ల రెడ్‌బాల్ సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా అండర్-19 జట్టు భారత్‌కు రానుంది. పుదుచ్చేరి వేదికగా సెప్టెంబరు 21, 23, 26 తేదీల్లో వన్డేలు.. సెప్టెంబరు 30- అక్టోబరు 7 వరకు చెన్నై వేదికగా ఫోర్-డే మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌లలో భారత అండర్ 19 వన్డే జట్టుకు మహ్మద్ అమాన్, ఫోర్-డే జట్టుకు సోహం పట్వర్ధన్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.పేస్ బౌలింగ్ ఆల్రౌండర్కర్ణాటకకు చెందిన సమిత్ ద్రవిడ్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ప్రస్తుతం అతడు కేఎస్‌సీఏ మహరాజా టీ20 ట్రోఫీ టోర్నీలో మైసూర్ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే, ఈ టోర్నమెంట్లో సమిత్ ఇప్పటి వరకు తన మార్కు చూపించలేకపోయాడు. ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 82 పరుగులే చేయడంతో పాటు.. ఇంతవరకు ఒక్కసారి కూడా బౌలింగ్ చేసే అవకాశం దక్కించుకోలేకపోయాడు.ఆ టోర్నీలో అదరగొట్టిన సమిత్ అయితే, అంతకుముందు కూచ్ బెహర్ ట్రోఫీలో మాత్రం కర్ణాటక టైటిల్ గెలవడంలో సమిత్ ద్రవిడ్ కీలక పాత్ర పోషించాడు. ఈ రెడ్‌బాల్ టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన 18 ఏళ్ల సమిత్.. 362 పరుగులు సాధించాడు. జమ్మూ కశ్మీర్‌పై చేసిన 98 పరుగులు అతడి అత్యధిక స్కోరు. ఇక ఈ టోర్నీలో సమిత్ 16 వికెట్లు కూడా పడగొట్టడం విశేషం. ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో పాటు.. ముంబైతో జరిగిన ఫైనల్లో రెండు కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకుని సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు సమిత్ ద్రవిడ్. కాగా అండర్-19 స్థాయిలో సత్తా చాటితే టీమిండియాలో ఎంట్రీకి మార్గం సుగమమవుతుందన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో అండర్ 19 జట్టుతో వన్డే సిరీస్‌కు భారత అండర్-19 జట్టు:రుద్ర పటేల్ (వైస్ కెప్టెన్- గుజరాత్), సాహిల్ పరాఖ్ (మహారాష్ట్ర), కార్తికేయ కేపీ (కర్ణాటక), మహ్మద్ అమాన్ (కెప్టెన్) (ఉత్తరప్రదేశ్), కిరణ్ చోర్మాలే (మహారాష్ట్ర), అభిజ్ఞాన్ కుందు (ముంబై), హర్వంశ్ సింగ్ పంగలియా (వికెట్ కీపర్, సౌరాష్ట్ర), సమిత్ ద్రవిడ్ ( కర్ణాటక), యుధాజిత్ గుహ (బెంగాల్ ), సమర్థ్ ఎన్ (కర్ణాటక), నిఖిల్ కుమార్ (చండీగఢ్), చేతన్ శర్మ (రాజస్తాన్), హార్దిక్ రాజ్ (కర్ణాటక), రోహిత్ రజావత్(మధ్యప్రదేశ్), మహ్మద్ ఖాన్(కేరళ).ఆస్ట్రేలియాతో అండర్ 19 జట్టుతో వన్డే సిరీస్‌కు భారత అండర్-19 జట్టు:వైభవ్ సూర్యవంశీ (బీహార్), నిత్యా పాండ్యా (బీహార్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్- సంజాబ్), సోహమ్ పట్వర్ధన్ (కెప్టెన్) (మధ్యప్రదేశ్), కార్తికేయ కేపీ (కర్ణాటక), సమిత్ ద్రవిడ్ (కర్ణాటక), అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్- ముంబై), హర్వంశ్ సింగ్ పంగలియా (వికెట్ కీపర్- సౌరాష్ట్ర), చేతన్ శర్మ(రాజస్తాన్), సమర్థ్ ఎన్(కర్ణాటక), ఆదిత్య రావత్(ఉత్తరాఖండ్), అన్మోల్జీత్ సింగ్(పంజాబ్), ఆదిత్య సింగ్(ఉత్తరప్రదేశ్), మహ్మద్ ఎనాన్(కేరళ).చదవండి: సూర్యకుమార్ ఆశలపై నీళ్లు.. ఊహించని షాక్! -
రిటైర్మెంట్ కాదు!.. కేఎల్ రాహుల్ ముఖ్యమైన ప్రకటన ఇదే
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తన ‘ముఖ్యమైన ప్రకటన’కు సంబంధించిన వివరాలను వెల్లడించాడు. దివ్యాంగులైన పిల్లల జీవితాల్లో వెలుగులు నింపేలా.. తాము తలపెట్టిన సత్కార్యం విజయవంతమైందని తెలిపాడు. తమకు సహకరించిన తోటి క్రికెటర్లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. అసలు విషయమేమిటంటే..‘నేనొక ప్రకటన చేయబోతున్నా.. ’ అంటూ కేఎల్ రాహుల్ ఇన్‌స్టా పోస్ట్ పెట్టగానే.. అతడు క్రికెట్‌కు వీడ్కోలు పలకబోతున్నాడంటూ వదంతులు వ్యాపించాయి. జాతీయ జట్టులో తగినన్ని అవకాశాలు రాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా తన ఇన్‌స్టా స్టోరీ ద్వారా ఇవన్నీ వట్టి పుకార్లేనని స్పష్టం చేశాడు కేఎల్ రాహుల్.తన భార్య అతియా శెట్టితో కలిసి ఒక మంచి పని చేసినట్లు వెల్లడించాడు. దివ్యాంగులైన పిల్లల బాగు కోసం.. క్రికెటర్ల వస్తువులు వేలం వేయడం ద్వారా నిధులు సమకూర్చినట్లు తెలిపాడు. ఈ సత్కార్యంలో తమకు సహకరించిన తన సహచర, మాజీ క్రికెటర్ల జట్ల కృతజ్ఞతాభావం చాటుకున్నాడు. వేలాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, విరాళాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపాడు.కోహ్లి జెర్సీకి అత్యధిక ధరకేఎల్ రాహుల్- అతియా శెట్టి దంపతులు నిర్వహించిన ఈ వేలంలో టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లి జెర్సీ అత్యధిక ధర పలికినట్లు సమాచారం. రూ. 40 లక్షలకు కింగ్ జెర్సీ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అదే విధంగా... ఈ జాబితాలో రెండో స్థానంలో కూడా కోహ్లినే ఉండటం విశేషం. అతడి గ్లోవ్స్ రూ. 28 లక్షల ధర పలికింది.ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ రూ. 24 లక్షలు, దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాట్ రూ. 13 లక్షలు, మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ బ్యాట్ రూ. 11 లక్షలకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ వేలం ద్వారా రాహుల్- అతియా మొత్తంగా రూ. 1.93 కోట్లు సేకరించినట్లు సమాచారం.కాగా ఐపీఎల్-2024లో స్థాయికి తగ్గట్లుగా రాణించలేకపోయిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు.. టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు దక్కలేదు. టీమిండియా తరఫున 2022లో చివరి టీ20 ఆడిన రాహుల్.. ఇటీవల శ్రీలంకతో ముగిసిన వన్డే సిరీస్‌లో పాల్గొన్నాడు. ఇదే ఏడాది జనవరిలో ఆఖరిగా టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇక ఈ కర్ణాటక బ్యాటర్ తదుపరి దులిప్ ట్రోఫీలో పాల్గొననున్నాడు.చదవండి: BAN vs PAK: తండ్రైన స్టార్ క్రికెటర్.. టెస్టు సిరీస్ నుంచి ఔట్? -
అదృష్టం కలిసొస్తేనే...
ముంబై: మెగా ఈవెంట్లలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లకు కొన్నిసార్లు ప్రదర్శనతో పాటు కాస్తంత అదృష్టం కూడా తోడవ్వాలని భారత మాజీ కెపె్టన్, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నారు. ‘సియెట్’ సంస్థ అందించే వార్షిక క్రికెట్ అవార్డుల్లో ద్రవిడ్‌కు ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ పురస్కారం లభించింది. ఈ అవార్డుల కార్యక్రమం సందర్భంగా ద్రవిడ్ తన అనుభవాలను వివరించాడు. ద్రవిడ్ ఏమన్నాడంటే‘గతేడాది భారత్ వన్డే ప్రపంచకప్‌లో అజేయంగా ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో వరుసగా పది మ్యాచ్‌ల్లో గెలిచిన టీమిండియాకు అనూహ్యంగా టైటిల్ పోరులో ఆ్రస్టేలియా చేతిలో పరాజయం ఎదురైంది. ఓ ఆరు నెలల తిరిగేసరికి... ఈ ఏడాది జరిగిన టి20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ డెత్ ఓవర్లలో కనబరిచిన అద్భుత పోరాటంతో దక్షిణాఫ్రికాను ఓడించి రెండోసారి టి20 వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. ఈ రెండు సందర్బాల్లోనూ కెపె్టన్‌గా రోహిత్, కోచ్‌గా నేను ఉన్నాను. మాకు టి20 ప్రపంచకప్ టైటిల్‌కు మధ్య దక్షిణాఫ్రికా అడ్డుగా ఉంది. అయితే ఆటతోపాటు కొంచెం అదృష్టం కలసిరావడంతో కప్‌తో ఆనందం మా వశమైంది. ఎంత చేసినా ఆ రోజు మనది కావాలంటే రవ్వంత అదృష్టం కూడా మనతో ఉండాలి.దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 30 బంతుల్లో 30 పరుగుల సమీకరణం ప్రత్యరి్థకే అనుకూలంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంత చిత్తంతో అనుకున్న ప్రణాళికను కెపె్టన్ రోహిత్ అమలు చేయాలి. ఎవరో ఒకరు మా ప్రయత్నాలకు కలిసి రావాలి. చివరకు సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ రూపంలో అదృష్టం మా పక్షాన నిలిచింది. ఈ క్యాచ్ తుది ఫలితాన్ని మావైపునకు తిప్పింది. కానీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరిగిన నవంబర్ 19న మాత్రం ఆసీస్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ శతకం శతకోటికిపైగా భారతీయుల కలల్ని కల్లలు చేసింది.టి20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు రిటైర్మెంట్ ఇచి్చనప్పటికీ యువ బ్యాటర్లు వారి స్థానాలను భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇకముందు కూడా భారత క్రికెట్ వెలిగిపోతుంది. ప్రస్తుతం దేశంలో నాణ్యమైన అకాడమీలు, మెరుగైన మౌలిక వసతులు, లీగ్‌లతో అపార అవకాశాలు యువ క్రికెటర్ల భవిష్యత్తుకు బంగారుబాట వేస్తున్నాయి’ అని ద్రవిడ్ వివరించారు. -
సియెట్ అవార్డుల ప్రధానోత్సవం.. సందడి చేసిన క్రికెట్ స్టార్స్ (ఫొటోలు)
-
ఆ ముగ్గురి సహకారంతోనే టీ20 వరల్డ్‌కప్ గెలిచాం: రోహిత్
నిన్న (ఆగస్ట్ 21) జరిగిన సియెట్ రేటింగ్ అవార్డ్స్ ఫంక్షన్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్‌కప్ గెలవడానికి జై షా, అజిత్ అగార్కర్, రాహుల్ ద్రవిడ్ చాలా తోడ్పడ్డారని అన్నాడు. ఈ ముగ్గురిని మూల స్తంభాలతో పోల్చాడు. జట్టు మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చి సత్ఫలితాలు సాధించేందుకు ఈ మూడు స్తంభాలు తోడ్పడ్డాయని తెలిపాడు. నేను నా టీమ్ వరల్డ్‌కప్ సాధించడానికి ఈ ముగ్గురే కీలకమని ఆకాశానికెత్తాడు. జట్టుగా మేం రాణించడానికి ఆ ముగ్గురు ఇచ్చిన స్వేచ్ఛనే కారణమని తెలిపాడు.తన కెప్టెన్సీ గురించి హిట్‌మ్యాన్ మాట్లాడుతూ.. తాను ఆషామాషీగా ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలవలేదని, కెప్టెన్‌గా ఇంతటితో ఆగేది లేదని ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ టైటిళ్లు సాధించడమే తన లక్ష్యమని చెప్పకనే చెప్పాడు. కాగా, నిన్న జరిగిన ఫంక్షన్లో రోహిత్ మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నాడు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డు లభించింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. మెన్స్ వన్డే బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, యశస్వి జైస్వాల్ మెన్స్ టెస్ట్ బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ మెన్స్ టీ20 బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నారు.బౌలర్ల విషయానికొస్తే.. మహ్మద్ షమీ మెన్స్ వన్డే బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, రవిచంద్రన్ అశ్విన్ మెన్స్ టెస్ట్ బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, టీమ్ సౌథీ మెన్స్ టీ20 బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు అందుకున్నారు. -
రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్‌లకు అత్యున్నత అవార్డులు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌లకు క్రికెట్‌కు సంబంధించిన అత్యున్నత అవార్డులు లభించాయి. సియెట్ రేటింగ్ అవార్డ్స్ 2023-24లో రోహిత్‌కు మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు.. రాహుల్ ద్రవిడ్‌కు లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డులు లభించాయి. నిన్న జరిగిన అవార్డుల ప్రధానోత్సవ వేడుకలో వీరిద్దరు ఈ అవార్డులు అందుకున్నారు. Rohit Sharma receiving the CEAT Cricketer of the year award from Jay Shah. 💥 pic.twitter.com/5FdU2CIWi6— Mufaddal Vohra (@mufaddal_vohra) August 21, 2024రాహుల్, రోహిత్‌తో పాటు మరికొందరు సియెట్ రేటింగ్ అవార్డులు అందుకున్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. మెన్స్ వన్డే బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, యశస్వి జైస్వాల్ మెన్స్ టెస్ట్ బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ మెన్స్ టీ20 బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నారు.CEAT Best ODI batter of the year - Virat Kohli. 🐐 pic.twitter.com/efYQ9GP5gc— Mufaddal Vohra (@mufaddal_vohra) August 21, 2024బౌలర్ల విషయానికొస్తే.. మహ్మద్ షమీ మెన్స్ వన్డే బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, రవిచంద్రన్ అశ్విన్ మెన్స్ టెస్ట్ బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ మెన్స్ టీ20 బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు అందుకున్నారు.Jay Shah, Rohit, Dravid, Gavaskar, Shami, Shreyas, Hayden, Salt Deepti, Harmanpreet at the CEAT awards. 👌❤️ pic.twitter.com/tJ2mmlYeKb— Mufaddal Vohra (@mufaddal_vohra) August 21, 2024ఐపీఎల్ 2024లో కేకేఆర్‌ను విజేతగా నిలిపిన శ్రేయస్ అయ్యర్ ప్రత్యేక మెమెంటోను అందుకుగా.. దేశవాలీ క్రికెట్‌కు సంబంధించి తమిళనాడు కెప్టెన్ ఆర్ సాయి కిషోర్‌కు డొమెస్టిక్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నాడు.Unyielding at the crease, a champion beyond compare. Congratulations @ybj_19 on being CEAT Test Batter of the Year!#CCR26 #CEATCricketRatingAwards #CEAT #Cricket #CEATCricketAwards #ThisIsRPG pic.twitter.com/x0jcLPPROS— CEAT TYRES (@CEATtyres) August 21, 2024మహిళల క్రికెట్లో టీమిండియాను అత్యధిక టీ20ల్లో ముందుండి నడిపించినందుకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కు ప్రత్యేక మెమెంటోను బహుకరించారు. టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధన వుమెన్స్ ఇండియన్ బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకోగా.. దీప్తి శర్మ వుమెన్స్ ఇండియన్ బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకుంది. ఇటీవల టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు నమోదు చేసిన షెఫాలీ వర్మను ప్రత్యేక మెమెంటోతో సత్కరించారు.A hearty Congratulations to @JayShah , for bringing unparelleled leadership and direction to the most loved sport of our country!#CCR26 #CEATCricketRatingAwards #CEAT #Cricket #CEATCricketAwards #ThisIsRPG pic.twitter.com/BWGGyUqoQ1— CEAT TYRES (@CEATtyres) August 21, 2024క్రికెట్ ఉన్నతికి అనునిత్యం పరితపించే బీసీసీఐ కార్యదర్శి జై షా ఎక్సెలెన్స్ ఇన్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ అవార్డు అందుకున్నాడు. Celebrating the pinnacle of T20 leadership! Join us in honouring the standout leader of the league.#CCR26 #CEATCricketRatingAwards #CEAT #Cricket #CEATCricketAwards #ThisIsRPG @ShreyasIyer15 pic.twitter.com/j0vqvx1ZAI— CEAT TYRES (@CEATtyres) August 21, 2024 -
కరుణ్ నాయర్ మెరుపు అర్ద సెంచరీ.. రాణించిన ద్రవిడ్ కొడుకు
మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీలో ఇవాళ (ఆగస్ట్ 18) జరుగుతున్న మ్యాచ్‌లో మైసూర్ వారియర్స్, గుల్బర్గా మిస్టిక్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన మైసూర్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. వారియర్స్ కెప్టెన్ కరుణ్ నాయర్ మెరుపు అర్ద సెంచరీతో (35 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగగా.. టీమిండియా తాజా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొడుకు సమిత్ ద్రవిడ్ ఓ మోస్తరు స్కోర్‌తో (24 బంతుల్లో 33; 4 ఫోర్లు, సిక్స్) రాణించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జగదీశ్ సుచిత్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో (12 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకట్టుకోగా.. వారియర్స్ ఇన్నింగ్స్‌లో కార్తీక్ 5, అజిత్ కార్తీక్ 9, సుమిత్ కుమార్ 19, మనోజ్ భంగడే 0, కృష్ణప్ప గౌతమ్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. మిస్టిక్ బౌలర్లలో మోనిశ్ రెడ్డి, పృథ్వీ రాజ్ షెకావత్, యశోవర్దన్ తలో రెండు వికెట్లు.. విజయ్‌కుమార్, శరణ్ గౌడ్ చెరో వికెట్ పడగొట్టారు. -
భారీ సిక్సర్ బాదిన ద్రవిడ్ కొడుకు.. వీడియో వైరల్
మహారాజా ట్రోఫీ-2024లో భారత మాజీ హెడ్‌కోచ్ తనయుడు సమిత్ మరోసారి నిరాశపరిచాడు. ఈ లీగ్‌లో మైసూరు వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సమిత్.. శుక్రవారం బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో మాత్రం సుమిత్ అద్బుతమైన సిక్స్‌తో మెరిశాడు. అతడు కొట్టిన షాట్‌కు అందరూ ఫిదా అయిపోయారు. మైసూర్ ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన జ్ఞానేశ్వర్ నవీన్.. నాలుగో బంతిని సమిత్‌కు ఔట్‌సైడ్ హాఫ్ స్టంప్ దిశగా షార్ట్ పిచ్ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో సమిత్ మిడాన్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి బంతికే సమిత్ ఔటయ్యాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా టోర్నీలో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన సమిత్ కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మైసూరు వారియర్స్‌పై బెంగళూరు బ్లాస్టర్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మహారాజా ట్రోఫీ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతోంది. ದ್ರಾವಿಡ್ ಸರ್ ಮಗ ಗುರು ಇವ್ರು..🤯🔥ಈ ಸಿಕ್ಸ್ ಗೆ ಒಂದು ಚಪ್ಪಾಳೆ ಬರ್ಲೇಬೇಕು..👏👌📺 ನೋಡಿರಿ Maharaja Trophy KSCA T20 | ಬೆಂಗಳೂರು vs ಮೈಸೂರು | LIVE NOW #StarSportsKannada ದಲ್ಲಿ#MaharajaTrophyOnStar@maharaja_t20 pic.twitter.com/ROsXMQhtwO— Star Sports Kannada (@StarSportsKan) August 16, 2024 -
గంభీర్‌కు చెప్పడానికి నేనెవరిని?: జై షా
ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కోచ్ ఉండాల్సిన అవసరం లేదని తాము భావిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కార్యదర్శి జై షా అన్నాడు. టీమిండియాలోని ఆటగాళ్లలో ఎక్కువ మంది మూడు ఫార్మాట్లలో ఆడుతున్నారని.. అలాంటపుడు ఒకే కోచ్ ఉంటే ఇంకాస్త మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని పేర్కొన్నాడు. ఒక్కసారి ప్రధాన శిక్షకుడిగా ఓ వ్యక్తిని నియమించిన తర్వాత అతడి నిర్ణయానుసారమే అంతా జరుగుతుందని తెలిపాడు.టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా హెడ్‌కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ వైదొలిన విషయం తెలిసిందే. అతడి స్థానంలో మాజీ ఓపెనర్ గౌతం గంభీర్‌ను నియమించింది బీసీసీఐ. అయితే, ఇందుకు సంబంధించిన ప్రకటనకు ముందు.. టీమిండియాకు ముగ్గురు కోచ్‌లు ఉండబోతున్నారనే వార్తలు వచ్చాయి. టెస్టు, వన్డే, టీ20లకు వేర్వేరు వ్యక్తులు శిక్షణ ఇవ్వనున్నట్లు వదంతులు వ్యాపించాయి.గంభీర్‌కు చెప్పడానికి నేనెవరిని?ఈ విషయంపై జై షా తాజాగా స్పందించాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ... ‘‘కోచ్‌ను నియమించుకున్న తర్వాత.. అతడి అభిప్రాయాన్ని మేము గౌరవించాల్సి ఉంటుంది. అతడు చెప్పిందే వినాలి కూడా!.. గౌతం గంభీర్‌ను హెడ్‌కోచ్‌గా సెలక్ట్ చేసుకున్న తర్వాత.. అతడి దగ్గరికి వెళ్లి.. ‘నువ్వు ఈ ఫార్మాట్‌కు సరిగ్గా కోచింగ్ ఇవ్వలేవు’ అని చెప్పడానికి నేనెవరిని?ఒకవేళ తను మూడు ఫార్మాట్లకు కోచ్‌గా ఉండాలని భావిస్తే.. మేమెందుకు అడ్డుచెప్తాం? అయినా భారత జట్టులో 70 శాతం మంది ఆటగాళ్లు మూడు ఫార్మాట్లలో ఆడుతూనే ఉన్నారు. కాబట్టి వేర్వేరు కోచ్‌లు అవసరం లేదనే భావిస్తున్నాం.ఎన్సీఏ కోచ్‌లు ఉన్నారు కదా!అంతేకాదు.. ఒకవేళ హెడ్‌కోచ్ విరామం తీసుకున్నా మాకు బ్యాకప్ కోచ్‌లు ఉండనే ఉన్నారు. జాతీయ క్రికెట్ అకాడమీ కోచ్(ఎన్సీఏ)లు మాకు సేవలు అందిస్తారు. ఉదాహరణకు.. రాహుల్ ద్రవిడ్ బ్రేక్ తీసుకున్నపుడు వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించాడు కదా! ఇప్పుడు కూడా అంతే!’’ అని జై షా చెప్పుకొచ్చాడు.కాగా శ్రీలంక పర్యటనతో టీమిండియా హెడ్‌కోచ్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన గౌతం గంభీర్.. టీ20 సిరీస్ 3-0తో క్లీన్‌స్వీప్ విజయం అందుకున్నాడు. అయితే, వన్డే సిరీస్‌లో మాత్రం ఘోర పరాభవం ఎదురైంది. ఇరవై ఏడేళ్ల తర్వాత టీమిండియా లంకు వన్డే సిరీస్(0-2)ను కోల్పోయింది. తదుపరి రోహిత్ సేన బంగ్లాదేశ్ స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడనుంది. చదవండి: ’టీ20 ఫార్మాట్ క్రికెట్‌ను నాశనం చేస్తోంది.. ఇండియా మాత్రం లక్కీ’ -
రోహిత్ శర్మతో కలిసి పనిచేయడం నా అదృష్టం: ద్రవిడ్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్‌తో కలిసి పనిచేయడం గొప్ప గౌరవమని ద్రవిడ్ కొనియాడాడు. కాగా ద్రవిడ్- రోహిత్ శర్మ ఆధ్వర్యంలోనే టీ20 వరల్డ్‌కప్-2024ను భారత జట్టు సొంతం చేసుకుంది.గత 13 ఏళ్లగా ఊరిస్తున్న వరల్డ్‌కప్ ట్రోఫీని వీరిద్దరి కలిసి టీమిండియాకు అందించారు. అంతేకాకుండా వీరిద్దరి కాంబనేషన్లో భారత జట్టు ఎన్నో అద్భుతాలు విజయాలు సాధించింది. టీ20 వరల్డ్‌కప్ విజయంతో భారత హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ ప్రస్ధానం ముగిసింది. భారత హెడ్‌కోచ్‌గా తప్పుకున్న అనంతరం ద్రవిడ్ వరుస ఇంటర్వ్యూలతో బీజీబీజీగా ఉన్నాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ద్రవిడ్ మాట్లాడుతూ.. "రోహిత్ శర్మతో కలిసి పనిచేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. రోహిత్ ఒక అద్భుతమైన కెప్టెన్. అతడు తన కెప్టెన్సీతో టీమిండియాను అభిమానులకు మరింత చేరువ చేశాడు. అంతేకాకుండా కెప్టెన్సీ స్కిల్స్‌తో అందరని ఆకట్టుకున్నాడు. జట్టులో అందరని ఒకేలా చూస్తాడు. డ్రెస్సింగ్ రూమ్ వాతవారణం ప్రశాంతంగా ఉందంటే అందుకు కారణం రోహిత్ శర్మనే. భారత జట్టులో విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, అశ్విన్ లాంటి చాలా మంది సీనియర్ క్రికెటర్లు ఉన్నారు. వారందరూ సూపర్ స్టార్లు. కానీ వీరిందరూ ఎటువంటి ఈగోలు లేకుండా కెప్టెన్ అడుగుజాడల్లానే నడుస్తున్నారు. రోహిత్‌తో పాటు ఈ సీనియర్ ఆటగాళ్ల గ్రూప్ జట్టును ముందుకు నడిపిస్తుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా స్టార్ ప్లేయర్స్‌కు ఇగో ఎక్కువగా ఉంటుందనుకుంటారు. వారితో కలసి పని చేయడం కష్టమని చాలా భావిస్తారు. కానీ భారత జట్టులో పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. వాళ్లు ఎంత గొప్ప క్రికెటర్లైనా చాలా వినయంగా ఉంటారని" పేర్కొన్నాడు. -
రాహుల్ ద్రవిడ్ గల్లీ క్రికెట్..
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. రాజస్తాన్ రాయల్స్ జట్టు ప్రధాన కోచ్‌గా ద్రవిడ్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. అయితే భారత హెడ్‌కోచ్‌గా తప్పుకున్న తర్వా ద్రవిడ్ తన ఫ్రీ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మిస్టర్ డిఫెండ్బుల్ తాజాగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీని సందర్శించాడు. ఈ క్రమంలో అక్కడ గ్రౌండ్ స్టాఫ్‌తో కలిసి ద్రవిడ్ సరదాగా క్రికెట్ ఆడాడు. టెన్నిస్ బాల్‌తో బౌలింగ్ కూడా ద్రవిడ్ చేశాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా గతంలో ద్రవిడ్ ఎన్సీఏ హెడ్‌గా కూడా పని చేశాడు. ఇక టీ20 వరల్డ్‌కప్-2024 విజయం తర్వాత టీమిండియా హెడ్‌కోచ్ పదవి నుంచి ద్రవిడ్ తప్పుకున్నాడు. 2021 నుంచి 2024 వరకు ద్రవిడ్ భారత ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. Rahul Dravid playing cricket with the Ground Staffs of NCA. 🌟 pic.twitter.com/y2tXJKGNbW— Johns. (@CricCrazyJohns) August 11, 2024 -
నా కోచింగ్ కెరీర్లో చేదు అనుభవం అదే: ద్రవిడ్
టీమిండియా విజయవంతమైన కోచ్‌లలో ఒకడిగా గుర్తింపు పొందాడు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్. టీ20 ప్రపంచకప్-2021 తర్వాత రవిశాస్త్రి స్థానంలో హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఈ కర్ణాటక లెజెండ్ మార్గదర్శనంలో.. టీమిండియా అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్‌గా ఎదిగింది. ద్వైపాక్షిక సిరీస్‌లలో వరుస విజయాలతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.ఘనంగా వీడ్కోలుఅయితే, టీ20 ప్రపంచకప్-2022(సెమీస్), ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్- 2021-23, వన్డే వరల్డ్‌కప్-2023(ఫైనల్) టోర్నీలో మాత్రం టైటిల్ గెలవలేకపోయింది. ఈ క్రమంలో ఒక సందర్భంలో ద్రవిడ్‌ను వెంటనే కోచ్‌గా తొలగించాలనే డిమాండ్లూ వచ్చాయి. అయితే, బీసీసీఐ మాత్రం అతడిపై నమ్మకం ఉంచింది. వరల్డ్‌కప్-2023 తర్వాత అతడి పదవీకాలం ముగిసినా.. టీ20 ప్రపంచకప్-2024 వరకు కోచ్‌గా కొనసాగాలని కోరింది.ఇందుకు అంగీకరించిన ద్రవిడ్‌కు ఘనమైన వీడ్కోలు లభించింది. ప్రపంచకప్-2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు చాంపియన్‌గా అవతరించింది. తద్వారా దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత మరోసారి భారత్‌కు ఐసీసీ టైటిల్ దక్కింది. అయితే, సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్ ఓడిపోవడం మాత్రం ద్రవిడ్ కెరీర్‌లోని చేదు అనుభవం అని చెప్పవచ్చు.ఆ ఓటమే బాధించిందిఅయితే, రాహుల్ ద్రవిడ్ మాత్రం అన్నింటికంటే సౌతాఫ్రికా గడ్డ మీద ఓటమే.. తన కోచింగ్ కెరీర్లో ఎదురైన ఘోర పరాభవం అంటున్నాడు. ప్రొటిస్ జట్టును తమ సొంతదేశంలో ఓడించే అవకాశం చేజారడం ఎన్నటికీ మర్చిపోలేనన్నాడు. చిరస్మరణీయ విజయం సాధించే క్రమంలో జరిగిన పొరపాట్ల వల్ల భారీ మూల్యమే చెల్లించామని పేర్కొన్నాడు.ఈ మేరకు.. ‘‘నా క్రికెట్ కోచింగ్ కోరీర్లో అన్నింటికంటే ఘోర పరాభవం.. సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలవలేకపోవడం. సెంచూరియన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో మేము విజయం సాధించాం. అదే జోరులో రెండో టెస్టును ఘనంగా ఆరంభించాం. కానీ సౌతాఫ్రికా అనూహ్య రీతిలో తిరిగి పుంజుకుని గెలుపును లాగేసుకుంది.మూడో టెస్టులోనూ అదే ఫలితం పునరావృతం చేసింది. మా జట్టులోని కొందరు సీనియర్లు అప్పుడు అందుబాటులో లేరు. రోహిత్ శర్మ కూడా గాయపడ్డాడు. అయినా.. రెండు, మూడో టెస్టుల్లో విజయానికి చేరువగా వచ్చాం. కానీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. అయితే, ఈ సిరీస్ ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. కోచ్‌గా ఎలా నన్ను నేను సంభాళించుకోవాలో తెలుసుకున్నా.ఓటమీ మంచికేఅన్ని మ్యాచ్‌లు మనమే గెలవలేం. ఒక్కోసారి ఓటమే మనకు ఎంతో నేర్పిస్తుంది’’ అని రాహుల్ ద్రవిడ్ 2021-22 సిరీస్ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా ద్రవిడ్ స్థానంలో టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇక గౌతీ హయాంలో తొలిసారిగా శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమిండియా టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే, వన్డే సిరీస్‌లో మాత్రం 0-2తో ఆతిథ్య లంక జట్టు చేతిలో ఓటమిని చవిచూసింది. 27 ఏళ్ల తర్వాత తొలిసారి శ్రీలంకకు వన్డే సిరీస్‌ను సమర్పించుకుంది.చదవండి: IPL 2025: ఈ ముగ్గురు కెప్టెన్లను రిలీజ్ చేయనున్న ఫ్రాంఛైజీలు! -
రాజస్థాన్ రాయల్స్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్.. ఇంగ్లండ్‌కు సంగక్కర..?
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. రాయల్స్ యాజమాన్యం ద్రవిడ్‌తో బేరసారాలన్ని పూర్తి చేసినట్లు సమాచారం. ప్రస్తుత హెడ్ కోచ్ కుమార సంగక్కర ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు హెడ్ కోచ్‌గా వెళ్లనున్న నేపథ్యంలో ద్రవిడ్ ఎంపికకు వేగంగా పావులు కదులుతున్నట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల హెడ్ కోచ్ మాట్ పాట్స్ గత నెలలో తన పదవికి రాజీనామా చేయగా.. ఆ స్థానాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంగక్కరతో భర్తీ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ఈసీబీ నుంచి కానీ సంగక్కర నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ తెర వెనుక పావులు వేగంగా కదులుతున్నట్లు సమాచారం. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ కీ సంగక్కరతో సంప్రదింపులు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ పరిమిత ఓవర్ల జట్లకు తాత్కాలిక హెడ్ కోచ్‌గా మార్కస్ ట్రెస్కోధిక్ను నియమించింది. సెప్టెంబర్ 11 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు ట్రెస్కోథిక్ ఇంగ్లండ్ జట్టు కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ మూడు టీ20లు, ఐదు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్‌లు ముగిసిన అనంతరం పర్మెనెంట్ కోచ్‌గా సంగక్కర నియమితుడయ్యే అవకాశం ఉంది. ఈసీబీతో లైన్ క్లియెర్ కాగానే సంగక్కర రాయల్స్‌తో తెగదెంపులు చేసుకోవచ్చు. సంగక్కర రాయల్స్‌తో నాలుగేళ్ల పాటు కొనసాగాడు. మరోవైపు ద్రవిడ్‌కు సైతం రాయల్స్ పాత బంధం ఉంది. ఐపీఎల్ ఆరంభ సీజన్లలో అతను రాయల్స్ కెప్టెన్‌గా, కోచ్‌గా వ్యవహరించాడు. ఈ అనుబంధం కారణంగా రాయల్స్ యాజమాన్యం ద్రవిడ్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. -
టీమిండియా సూపర్స్టార్లలో అతడే బెస్ట్: ద్రవిడ్
టీమిండియా సీనియర్ క్రికెటర్ల గురించి మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టును ఐకమత్యంగా ఉంచడంలో వారు పెద్దన్న పాత్ర పోషిస్తారని కొనియాడాడు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మకు కలుపుగోలుతనం ఎక్కువని.. డ్రెస్సింగ్ రూం వాతావరణం ప్రశాంతంగా ఉండటానికి తనే ప్రధాన కారణం అని పేర్కొన్నాడు.ఇక రోహిత్ శర్మ మాదిరే మిగతా టీమిండియా సూపర్ స్టార్లు సైతం ఎంతో నిరాడంబరంగా ఉంటారని ద్రవిడ్ తెలిపాడు. టీ20 ప్రపంచకప్-2021 తర్వాత టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్, కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. వీరిద్దరి హయాంలో భారత జట్టు టీ20 ప్రపంచకప్-2022(సెమీస్), ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్, వన్డే వరల్డ్‌కప్-2023(ఫైనల్) ఆడింది.అయితే, ఈ ఐసీసీ టోర్నీల్లో విజేతగా నిలవలేకపోయింది. టీ20 ప్రపంచకప్-2024 ద్వారా ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలన్న ద్రవిడ్-రోహిత్ కల నెరవేరింది. అమెరికా- వెస్టిండీస్ వేదికగా సాగిన ఈ టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది. ఫలితంగా కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిశాయి.ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోచ్‌గా తన పని సులువు కావడానికి జట్టులోని సీనియర్లే కారణమని పేర్కొన్నాడు. ‘‘ఈ విజయానికి క్రెడిట్ నేనొక్కడినే తీసుకోలేను. ఈ జట్టును తీర్చిదిద్దిన కోచ్‌లు, సీనియర్లు, కెప్టెన్లు అందరికీ చెందుతుంది. రోహిత్‌తో కలిసి పని చేయడం నాకు దక్కిన గౌరవం.ఈ రెండున్నరేళ్లకాలంలో అతడిని దగ్గరిగా గమనించారు. అద్భుతమైన నాయకుడు. జట్టులోని ఆటగాళ్లంతా ఎల్లప్పుడూ అతడి వైపే ఉంటారు. అంతలా వారి అభిమానం చూరగొన్నాడు. చాలా మంది.. భారత క్రికెట్ సూపర్స్టార్లు ఇగో కలిగి ఉంటారని అనుకుంటారు. వారిని మేనేజ్ చేయడం కోచ్‌లకు కష్టం అనుకుంటారు.అయితే, ఇక్కడ అంతా రివర్స్ ఉంటుంది. సూపర్స్టార్లు అయినప్పటికీ వాళ్లెంతో నిరాడంబరంగా ఉంటారు. పూర్తిస్థాయిలో మ్యాచ్‌లకు సన్నద్ధమవుతారు. అందుకే వాళ్లు ఈరోజు సూపర్స్టార్లుగా క్రేజ్ సంపాదించారు. జట్టును ఒక్కటిగా ఉంచడంలో వారిదే కీలక పాత్ర. విరాట్ కోహ్లి, బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్.. వీళ్లంతా డ్రెసింగ్ రూంలో సానుకూల వాతావరణం ఉండేలా చూస్తారు’’ అని రాహుల్ ద్రవిడ్ స్టార్ స్పోర్ట్స్‌తో వ్యాఖ్యానించాడు. -
అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ.. 2 పరుగుల దూరంలో
కొలంబో వేదికగా ఆదివారం శ్రీలంకతో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ మరో 2 పరుగులు సాధిస్తే వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో రోహిత్ 10,767 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా ఈ రికార్డు ప్రస్తుతం టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్(10,768) పేరిట ఉంది. ఇప్పుడు కొలంబో వన్డేలో హిట్‌మ్యాన్ కేవలం రెండు పరుగులు చేస్తే ద్రవిడ్‌ను అధిగమిస్తాడు.ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(18,426) అగ్రస్ధానంలో ఉండగా.. ఆ తర్వాతి స్ధానాల్లో విరాట్ కోహ్లి(13,872), సౌరవ్ గంగూలీ(11, 221) ఉన్నారు. ఇక తొలి వన్డేను టైగా ముగించిన భారత్.. రెండో వన్డేలో ఎలాగైనా గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది.చదవండి: IPL 2025: హార్దిక్ పాండ్యాకు షాక్!.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్యకుమార్? -
‘రోహిత్ ఎవరినో తిడుతున్నాడు.. ఆరోజు ద్రవిడ్‌కు నిద్ర పట్టలేదు’
2015, 2016, 2017, 2019, 2022.. 2023.. ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీల్లో భారత్‌కు ఎదురైన చేదు అనుభవాలను మరిపిస్తూ.. నెల రోజుల క్రితం ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది. ఫలితంగా దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి.ఈ టైటిల్ సాధించిన తర్వాత హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ తన ప్రస్థానం ముగించగా.. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. విండీస్‌లోని బార్బడోస్‌లో సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత్ విజేతగా నిలిచిన తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో కోహ్లి- రోహిత్ అభిమానులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. అయితే, యావత్ భారతావని మాత్రం వరల్డ్‌కప్ హీరోలు ఎప్పుడెప్పుడు తిరిగి వస్తారా? అని ఆసక్తిగా ఎదురుచూసింది. అయితే, బార్బడోస్‌లో హారికేన్ బీభత్సం వల్ల టీమిండియా రాక రెండు రోజులు ఆలస్యమైంది. ఉధృతమైన వర్షాల కారణంగా విమాన సర్వీసులు రద్దు కాగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి తక్షణ చర్యలు చేపట్టింది. వాతావరణం కాస్త తేలికపడగానే AIC24WC చార్టెడ్ ఫ్లైట్‌ను బార్బడోస్‌కు పంపింది. ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో పాటు కవరేజ్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులను కూడా ఇదే విమానంలో భారత్‌కు తీసుకువచ్చారు.ఈ క్రమంలో స్టార్ స్పోర్ట్స్ ప్రొడ్యూసర్ ఒకరు నాటి విమాన ప్రయాణానికి సంబంధించిన జ్ఞాపకాలను తాజాగా గుర్తుచేసుకున్నారు. ‘‘ఆరోజు బార్బడోస్ నుంచి ఢిల్లీకి విమాన ప్రయాణం. పదహారు గంటల జర్నీ. అయితే, ఆరోజు ఎవరూ కూడా ఆరు గంటలకు మించి నిద్రపోలేదు. అంతా సందడి సందడిగా సాగింది.ఆటగాళ్లలో చాలా మంది ప్రెస్ వాళ్లను కలవడానికి వచ్చారు. వారితో ముచ్చట్లు పెట్టారు. అందరి కంటే రోహిత్ శర్మ ఎక్కువసార్లు బయటకు వచ్చాడు. బిజినెస్ క్లాస్ అంతా విజయ సంబరంతో అల్లరి అల్లరిగా ఉండటంతో రాహుల్ ద్రవిడ్ ఒకానొక సమయంలో ఎకానమీ క్లాస్‌కు వచ్చేశాడు. బిజినెస్ క్లాస్‌లో నిద్రపట్టడం లేదని..ఎకానమీ క్లాస్‌లో నిద్రపోయాడు.నేను నిద్రపోతున్న సమయంలో రోహిత్ శర్మ ఎవరినో తిడుతున్నట్లుగా శబ్దాలు వినిపించాయి. లేచి చూస్తే నిజంగానే రోహిత్ అక్కడ ఎవరినో ఏదో అంటున్నాడు. అయితే, తనదైన స్టైల్లో సరదాగానే వారికి చివాట్లు పెడుతూ ఆటపట్టిస్తున్నాడు. ఆ తర్వాత రిషభ్ పంత్, హార్దిక్‌పాండ్యా అందరూ బయటకు వచ్చారు. మీడియా వాళ్లతో ముచ్చటించారు. ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు’’ అని పేర్కొన్నారు. -
‘ద్రవిడ్ వల్లే కాలేదు.. ఇక్కడ నేనే బాస్ అంటే కుదరదు’
టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ శుభారంభం చేశాడు. శ్రీలంకపై సిరీస్ విజయంతో తన ప్రస్థానాన్ని ఘనంగా మొదలుపెట్టాడు. గతంలో కోచ్‌గా పనిచేసిన అనుభవం లేకున్నా తొలి ప్రయత్నంలోనే విజయవంతమయ్యాడు. టీమిండియా టీ20 కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని యువ జట్టుతో అనుకున్న ఫలితం రాబట్టాడు.‘సూపర్స్టార్ల’తో అంత వీజీ కాదుఅయితే.. ఇప్పటిదాకా అంతా బాగానే ఉన్నా వన్డే సిరీస్ రూపంలో గంభీర్‌కు గట్టి సవాల్ ఎదురుకానుంది. ప్రత్యర్థి శ్రీలంక బలాబలాలను పక్కనపెడితే.. ‘సూపర్స్టార్ల’ను అతడు ఏ మేరకు డీల్ చేయగలడన్నది ఆసక్తికరంగా మారింది. వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా అందుబాటులోకి వచ్చాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీ నేపథ్యంలో లంకతో సిరీస్‌కు ప్రాధాన్యం ఏర్పడగా.. సెలవులు ముగించుకుని జట్టుతో చేరారు. అసలే దూకుడు స్వభావం ఉన్న గంభీర్.. వీరిద్దరిని ఎలా కలుపుకొనిపోతాడన్నది క్రికెట్ ప్రేమికుల్లో చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ సన్నిహిత వర్గాలు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.‘‘ఇది అంత సులువేమీ కాదు. ఫ్రాంఛైజీ క్రికెట్లో లాగా నేను బాస్‌ను... నువ్విది చేయాల్సిందే అంటే కుదరదు. ఇక్కడి వాతావరణం వేరుగా ఉంటుంది. ఇండియన్ డ్రెస్సింగ్‌రూం విషయానికొస్తే.. ప్రతి ఒక్క ప్లేయర్‌తో ఓపికగా మాట్లాడాల్సి ఉంటుంది. అవసరమైతే స్వయంగా ఫోన్ చేయాల్సి ఉంటుంది. అందరూ లక్షాధికారులేద్రవిడ్ కూడా అలాగే చేసేవాడు. హెడ్‌కోచ్‌గా వచ్చిన కొత్తలో అతడు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. అప్పటికి.. ఇప్పటికి భారత క్రికెట్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక్కడ ఉన్న ఆటగాళ్లలో అందరూ లక్షాధికారులే. అంతేకాదు ఐపీఎల్లో కెప్టెన్లుగా పనిచేస్తున్న వారూ ఉన్నారు. వాళ్లందరినీ సాఫీగా డీల్ చేయడం గంభీర్ ముందున్న అతిపెద్ద సవాలు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.ఐపీఎల్లో సత్తా చాటికాగా టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011 గెలిచిన భారత క్రికెట్ జట్టులో సభ్యుడైన గంభీర్.. రిటైర్మెంట్ తర్వాత కామెంటేటర్‌గా కొనసాగాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను రెండుసార్లు ఐపీఎల్ చాంపియన్‌గా నిలిపిన ఈ ఢిల్లీ బ్యాటర్.. లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది కోల్‌కతా ఫ్రాంఛైజీ మెంటార్‌గా బాధ్యతలు స్వీకరించి.. జట్టు మూడోసారి ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఆగష్టు 2 నుంచి మొదలుఈ నేపథ్యంలోనే టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేశాడు. కోచ్‌గా శ్రీలంక పర్యటనతో కెరీర్ మొదలుపెట్టిన గౌతం గంభీర్.. 2-0తో టీ20 సిరీస్ గెలిచాడు. ఇరు జట్ల మధ్య మంగళవారం నామమాత్రపు మూడో టీ20 జరుగనుండగా.. ఆగష్టు 2 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. కాగా రోహిత్, కోహ్లిలు వరల్డ్‌క్లాస్ క్రికెటర్లు అంటూ ప్రశంసించిన గంభీర్.. వారితో కలిసి ప్రయాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ తన తొలి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.చదవండి: గిల్ కంటే ఆ విషయంలో అతడే బెటర్.. ఇద్దరినీ ఆడిస్తే తప్పేంటి? -
నువ్వు తేలిగ్గా తలొగ్గే రకం కాదు: గంభీర్‌కు ద్రవిడ్ సందేశం
‘‘హలో గౌతం.. భారత క్రికెట్ ప్రపంచంలోని అత్యంత ఆసక్తికరమైన విధుల నిర్వహణకు సమాయత్తమైన నీకు స్వాగతం పలుకుతున్నా. మూడు వారాల క్రితం.. టీమిండియా హెడ్‌కోచ్‌గా నేను కన్న కలలు బార్బడోస్‌లో నెరవేరాయి. ఇక ముంబైలో అందుకు సంబంధించిన సంబరాల సాయంత్రాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను.అయితే, జట్టుతో నా స్నేహం, నేను పోగు చేసుకున్న మధుర జ్ఞాపకాలు మరెన్నో ఉన్నాయి. భారత జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న నీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు లభించాలని కోరుకుంటున్నాను. నీ హయాంలోప్రతి జట్టులోనూ నువ్వు కోరుకున్న ఆటగాళ్లు పూర్తి ఫిట్‌గా ఉండి.. నీ ప్రణాళికలకు అనుగుణంగా అందుబాటులో ఉండాలని ఆకాంక్షిస్తున్నా.నువ్వు తేలికగా తలొగ్గేరకం కాదునిజానికి కోచ్ అంటే.. మనం సాధారణంగా ఆలోచించే దానికంటే కూడా మరింత తెలివిగా.. ఇంకాస్త స్మార్ట్‌గా ఉండాలి. నీకు ఇవన్నీ తెలుసుననుకో. నీ సహచర ఆటగాడిగా మైదానంలో నువ్వు ఎలా ఉంటావో నాకు తెలుసు. నీ బ్యాటింగ్ పార్ట్నర్గా.. తోటి ఫీల్డర్‌గా నీ నైపుణ్యాలు దగ్గరగా చూశాను. ప్రత్యర్థి ముందు నువ్వు తేలికగా తలొగ్గేరకం కాదు.ఐపీఎల్‌లోనూ నీలో ఇలాంటి ఆటతీరునే చూశాను. గెలుపు కోసం నువ్వు ఎంత పరితపిస్తావో నాకు తెలుసు. యువ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపి వారిలో విజయకాంక్ష రగిల్చే తీరు అద్భుతం. టీమిండియా కోచ్‌గానూ నువ్విలాగే ఉండాలి. భారీ అంచనాల నడుమ కీలక బాధ్యత తీసుకోబోతున్నావు.జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు, సహాయక సిబ్బంది.. గెలిచినా.. ఓడినా నీ వెన్నంటే ఉంటారు. విజయాల్లోనే కాదు.. చేదు అనుభవాలను సమంగా పంచుకుంటారు. కొన్నిసార్లు మనం వెనకడుగు వేయాల్సి వస్తుంది. నీ స్వభావానికి ఇది విరుద్ధమని నాకు తెలుసు. అయితే, చిరునవ్వుతో అన్నింటినీ జయించగలవు.ఇక్కడ ఏ చిన్న సంఘటన అయినా అభిమానులకు ఆసక్తికరమే. కాబట్టి నీ కదలికలన్నీ గమనిస్తూనే ఉంటారు. ఏదేమైనా భారత క్రికెట్‌ను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చగల సత్తా నీకు ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ గౌతం’’ అంటూ టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ గౌతం గంభీర్‌కు ప్రత్యేక సందేశం పంపించాడు.గంభీర్ భావోద్వేగంశ్రీలంక పర్యటనలో భాగంగా భారత క్రికెట్ జట్టు నూతన ప్రధాన కోచ్‌గా గంభీర్ ప్రస్థానం మొదలుకానున్న వేళ.. తన వారసుడిని ప్రత్యేకంగా విష్ చేశాడు. ఇందుకు స్పందించిన గౌతీ.. ద్రవిడ్‌కు ధన్యవాదాలు తెలిపాడు. తాను ఇంత వరకు చూసిన నిస్వార్థమైన క్రికెటర్లలో ఒకడైన రాహుల్ భాయ్ నుంచి మెసేజ్ అందుకోవడం సంతోషంగా ఉందన్నాడు. సాధారణంగా తాను ఎమోషనల్కానని.. అయితే, రాహుల్ భాయ్ మాటలు విని తీవ్ర ఉద్వేగానికి లోనయ్యానని తెలిపాడు.నిజాయితీ, పారదర్శకతతో వ్యవహరిస్తూ ద్రవిడ్ విడిచి వెళ్లిన వారసత్వాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. దేశంతో పాటు రాహుల్ భాయ్‌ను కూడా సగర్వంగా తలెత్తుకునేలా చేస్తానని గంభీర్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. కాగా శ్రీలంక- టీమిండియా మధ్య శనివారం నాటి తొలి టీ20తో ద్వైపాక్షిక సిరీస్ మొదలుకానుంది. 𝗣𝗮𝘀𝘀𝗶𝗻𝗴 𝗼𝗻 𝘁𝗵𝗲 𝗯𝗮𝘁𝗼𝗻 𝘄𝗶𝘁𝗵 𝗰𝗹𝗮𝘀𝘀 & 𝗴𝗿𝗮𝗰𝗲! 📝To,Gautam Gambhir ✉From,Rahul Dravid 🔊#TeamIndia | #SLvIND | @GautamGambhir pic.twitter.com/k33X5GKHm0— BCCI (@BCCI) July 27, 2024 -
ద్రవిడ్ కొడుకుకు సూపర్ ఆఫర్
టీమిండియా తాజా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ పెద్ద కొడుకు సమిత్ ద్రవిడ్‌కు బంపరాఫర్ లభించింది. కర్ణాటక టీ20 లీగ్ (కేఎస్‌సీఏ టీ20 టోర్నీ) వేలంలో సుమిత్‌ను గత సీజన్ రన్నరప్ మైసూరు వారియర్స్ సొంతం చేసుకుంది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన సమిత్‌ను రూ. 50000 సొంతం చేసుకున్నట్లు ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రకటించింది.18 ఏళ్ల సమిత్ ఇప్పటివరకు సీనియర్ స్థాయి క్రికెట్ ఆడలేదు. సీనియర్లతో కలిసి ఆడేందుకు సమిత్‌కు ఇది మంచి అవకాశం. సమిత్‌ను కొనుగోలు చేసిన మైసూరు జట్టుకు టీమిండియా ట్రిపుల్ సెంచూరియన్ కరుణ్ నాయర్ సారథ్యం వహించనున్నాడు. ఇదే జట్టులో టీమిండియా పేసర్ ప్రసిద్ద్ కృష్ణ ఉన్నాడు. వీరి సహవాసంలో సమిత్ మరింత రాటుదేలే అవకాశం ఉంది. ప్రస్తుత సీజన్ కూచ్ బెహర్ ట్రోఫీ గెలిచిన కర్ణాటక అండర్-19 జట్టులో సమిత్ సభ్యుడిగా ఉన్నాడు. మిడిలార్డర్లో ఉపయోకరమైన బ్యాటర్‌గా పేరున్న సమిత్ ఇటీవలి కాలంలో అద్బుతంగా ఆడుతూ తండ్రికి తగ్గ తనయుడనిపించుకుంటున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్ కౌంటీ జట్టు లాంకాషైర్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సమిత్ పర్వాలేదనిపించాడు.ఇదిలా ఉంటే, సమిత్ తండ్రి రాహుల్ ద్రవిడ్ ఇటీవలే టీమిండియాను టీ20 వరల్డ్‌కప్ గెలిపించి హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. ద్రవిడ్ సుమారు రెండున్నర సంవత్సరాల పాటు భారత హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. ద్రవిడ్ స్థానంలో టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎంపికయ్యాడు. గంభీర్ ఆథ్వర్యంలో టీమిండియా రేపటి నుంచి శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడనుంది.మైసూర్ వారియర్స్ జట్టు:కరుణ్ నాయర్, కార్తీక్ సీఏ, మనోజ్ భండగే, కార్తీక్ ఎస్‌యూ, సుచిత్ జే, గౌతమ్ కే, విద్యాధర్ పాటిల్, వెంకటేష్ ఎం, హర్షిల్ ధర్మాని, గౌతమ్ మిశ్రా, ధనుష్ గౌడ, సమిత్ ద్రవిడ్, దీపక్ దేవాడిగ, సుమిత్ కుమార్, స్మయన్ శ్రీవాస్తవ, జాస్పర్ ఈజే, ప్రసిద్ధ్ కృష్ణ , మహమ్మద్ సర్ఫరాజ్ అష్రఫ్. -
'అతడెప్పుడూ క్రెడిట్ కోసం పనిచేయలేదు'.. ద్రవిడ్‌పై ప్రశంసల వర్షం
టీ20 వరల్డ్‌కప్-2024 కప్ విజయనంతరం టీమిండియా హెడ్‌కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. గత 13 ఏళ్లగా ఊరిస్తున్న వరల్డ్‌కప్‌ను భారత్‌కు అందించి హెడ్‌కోచ్‌గా తన ప్రస్ధానాన్ని ద్రవిడ్ ముగించాడు.ద్రవిడ్ కెప్టెన్‌గా ఎక్కడైతే అవమానాలు ఎదుర్కొన్నాడో అదే కరేబియన్ దీవుల్లో కోచ్‌గా అందరితో శెభాష్ అనిపించుకున్నాడు. ద్రవిడ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే పదవీకాలం కూడా టీ20 వరల్డ్‌కప్‌తో ముగిసింది. అయితే ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్‌ను మాత్రం బీసీసీఐ కొనసాగించింది. ఈ నేపథ్యంలో ద్రవిడ్‌పై భారత మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ప్రశంసల వర్షం కురిపించాడు. ద్రవిడ్ ఎలాంటి స్వార్థం లేని వ్యక్తి అని మాంబ్రే కొనియాడాడు. కాగా ద్రవిడ్ స్ధానంలో భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు."రాహుల్ ద్రవిడ్‌తో నాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఇండియా-ఏ, అండర్-19 జట్లు, ఎన్సీఎ, ఆపై భారత సీనియర్ జట్లకు అతడితో కలిసి పనిచేశాను. దాదాపు 8-9 నుంచి ద్రవిడ్‌తో కలిసి ప్రయాణం చేస్తున్నాను. కోచ్‌గా ద్రవిడ్ ఎప్పుడూ ఆధికారం చెలాయించలేదు.ఆటగాళ్ల వెనకే ఉండి ప్రోత్సహించేవాడు. ఇదొక్కటి చాలు రాహుల్ అంటే ఏంటో తెలియడానికి. అతడు ఆటగాళ్లపై ఎక్కువగా ఫోకస్ పెట్టేవాడు. ఎప్పుడూ ప్లేయర్లు కోసమే ఆలోచించేవాడు. ద్రవిడ్ ఎప్పుడూ క్రెడిట్ కోసం పనిచేయలేదు.ఏ క్రెడటైనా జట్టుకు, కెప్టెన్‌కే దక్కాలని ద్రవిడ్ ఆశించేవాడు. ద్రవిడ్, రోహిత్ ఇద్దరూ కలిసి సమన్వయంతో పనిచేసి భారత్‌కు వరల్డ్‌కప్‌ను అందించారు" అని హిందూస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరాస్ పేర్కొన్నాడు. -
'T20 వరల్డ్‌కప్‌లో అదే నా ఫేవరేట్ మూమెంట్.. నా కళ్లలో నీళ్లు తిరిగాయి'
టీ20 వరల్డ్‌కప్-2024 విజేతగా నిలిచి భారత్ తమ 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో సగర్వంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు విడ్కోలు పలికారు. వీరిముగ్గురు మాత్రమే కాకుండా రాహుల్ ద్రవిడ్ సైతం భారత హెడ్‌కోచ్‌గా తన ప్రస్ధానాన్ని ముగించాడు. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌లో ఆఖరి మెట్టుపై బోల్తా పడిన టీమిండియాకు.. 7 నెలల తిరిగకముందే పొట్టి ప్రపంచకప్ రూపంలో ఐసీసీ టైటిల్‌ను ది గ్రేట్ వాల్ అందించాడు. విజయనంతరం భారత ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కొంతమంది ఆటగాళ్లు అయితే కన్నీటి పర్యంతమయ్యారు. ఈ భావోద్వేగ క్షణాలను యావత్తు ప్రపంచం వీక్షించింది. ఇక తాజాగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టీ20 వరల్డ్‌కప్ విన్నింగ్ సెలబ్రేషన్స్‌లో తన ఫేవరేట్ మూమెంట్‌ను ఎంచుకున్నాడు. సెలబ్రేషన్స్ సమయంలో విరాట్ కోహ్లి ట్రోఫీని రాహుల్ ద్రవిడ్‌కు అందజేసినప్పుడు తన కళ్లలో నీళ్లు తిరిగినట్లు అశ్విన్ చెప్పుకొచ్చాడు."నిజంగా ఇది యావత్తు భారత్ గర్వించదగ్గ విజయం. మా 13 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అయితే ఈ టోర్నీలో విజయం సాధించిన తర్వాత ఓ మూమెంట్ నా మనసును హత్తుకుంది. విరాట్ కోహ్లి.. రాహుల్ ద్రవిడ్‌కు పిలిచి ట్రోఫీని అందిండచడం నన్ను ఎంతగానే ఆకట్టుకుంది.ఇదే నా ఫేవరేట్ మూమెంట్. ద్రవిడ్ వెంటనే కప్‌ను అందుకుని గట్టిగా కేకలు వేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ క్షణం నా కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. ద్రవిడ్ నుంచి ఇటువంటి సెలబ్రేషన్స్ ఇప్పటివరకు నేను చూడలేదు. అయితే అందుకు ఓ కారణముంది.2007లో కరేబియన్ దీవుల వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ద్రవిడ్ సారథ్యంలోని భారత జట్టు గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. ఆ తర్వాత ద్రవిడ్ తన కెప్టెన్సీ నుంచి వైదొలగాడు. అప్పటి నుంచి జట్టులో కేవలం ఆటగాడిగా కొనసాగాడు. కెప్టెన్సీ నుంచి తప్పకున్నప్పటకి ద్రవిడ్ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఒకవేళ భారత జట్టు మ్యాచ్ ఓడిపోయినా అందరూ ద్రవిడ్‌నే టార్గెట్ చేసేవారు. అప్పుడు తను కెప్టెన్‌గా సాధించలేకపోయింది.. ఇప్పుడు కోచ్‌గా సాధించి చూపించాడని" తన యూట్యూబ్ ఛానల్లో అశ్విన్ పేర్కొన్నాడు. -
రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్..!?
భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. హెడ్‌కోచ్‌గా భారత్‌కు టీ20 వరల్డ్‌కప్ అందించిన రాహుల్ ద్రవిడ్‌పై రాజస్తాన్ రాయల్స్ కన్నేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు అతడిని తమ జట్టు హెడ్‌కోచ్‌గా నియమించాలని రాయల్స్ ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే రాజస్తాన్ యాజమాన్యం ద్రవిడ్‌తో చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ద్రవిడ్ కూడా రాజస్తాన్ ఆఫర్‌పై సముఖంగా ఉన్నట్లు వినికిడి. కాగా ఈ మిస్టర్ డిఫెండ్బుల్కు రాజస్తాన్‌తో మంచి అనుబంధం ఉంది. గతంలో రాజస్తాన్‌కు కెప్టెన్‌గా, మెంటార్‌గా ద్రవిడ్ పనిచేశాడు. 2012, 2013 సీజన్లలో రాజస్తాన్ సారథిగా ద్రవిడ్ వ్యవహరించాడు.అనంతరం 2014. 2015 సీజన్లలో రాజస్తాన్ మెంటార్‌గా తన సేవలు అందించాడు. ఇప్పుడు మరోసారి మరోసారి రాయల్స్‌తో జత కట్టేందుకు మిస్టర్ వాల్ సిద్దమైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. .కాగా ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్‌కు కుమార సంగక్కర డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌తో పాటు కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. సంగ్కర నుంచి కోచింగ్ బాధ్యతలు ద్రవిడ్ తీసుకునే అవకాశముంది. కాగా కోచ్‌గా కూడా ద్రవిడ్‌కు అపారమైన అనుభవం ఉంది. 2016, 2017 సీజన్లలో ఢిల్లీ డేర్‌డెవిల్స్( ఢిల్లీ క్యాపిటల్స్)కు హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ పనిచేశాడు. ఆ తర్వాత 2019 వరకు భారత అండర్-19 జట్టు హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ కొనసాగాడు. ఆ తర్వాత 2021-2024 వరకు టీమిండియా హెడ్ కోచ్‌గా ద్రవిడ్ బాధ్యతలు నిర్వర్తించాడు. -
రోహిత్, విరాట్ వల్లే ద్రవిడ్ అలా..: వీవీఎస్ లక్ష్మణ్
వన్డే వరల్డ్‌కప్-2003 టోర్నీలో టీమిండియా సభ్యుడు.. నాడు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో చేజారిన ట్రోఫీ.. ఆ మరుసటి ఎడిషన్ అంటే 2007 నాటికి అతడు కెప్టెన్ అయ్యాడు.అయితే, ఈసారి మరీ ఘోరంగా భారత జట్టు తొలి రౌండ్లోనే ప్రపంచకప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ రెండు సందర్భాల్లోనూ ఓ దిగ్గజ ఆటగాడికి తీవ్ర నిరాశే మిగిలింది.అయితే, టీ20 ప్రపంచకప్-2024 రూపంలో తొలిసారి ఐసీసీ ట్రోఫీని ముద్దాడే అవకాశం వచ్చింది. అయితే, ఈసారి ఆటగాడిగా కాకుండా కోచ్‌గా ఉన్నాడు ఆ వ్యక్తి.ఇంకేముంది ఎప్పుడూ గంభీరంగా ఉండే అతడు కూడా చిన్నపిల్లాడిలా మారిపోయాడు. ఎన్నడూ లేని విధంగా ఈ ఆనంద సమయంలో తన భావోద్వేగాలను వ్యక్తపరిచాడు. ట్రోఫీని ముద్దాడుతూ మురిసిపోయాడు. అవును మీరు ఊహించిన పేరే.. రాహుల్ ద్రవిడ్.రోహిత్ సేన వరల్డ్‌కప్ టైటిల్ గెలిచిన సమయంలో కనిపించిన ఈ దృశ్యాలు అభిమానులనే కాదు తమనూ ఆకట్టుకున్నాయంటున్నాడు టీమిండియా సొగసరి బ్యాటర్, ద్రవిడ్ సహచర ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్. ఈ మాజీ క్రికెటర్ ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.రోహిత్, విరాట్ వల్లే ద్రవిడ్ అలా..ఈ నేపథ్యంలో వీడియో సందేశం ద్వారా తన మనసులోని భావాలు పంచుకున్నాడు. ద్రవిడ్‌ను అలా ట్రోఫీతో చూడటం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ‘‘రాహుల్‌తో చాలా ఏళ్లపాటు కలిసి క్రికెట్ ఆడాను.మామూలుగా అతడు తన భావోద్వేగాలను వ్యక్తపరచడు. అయితే, ఈసారి ట్రోఫీ గెలిచినపుడు మాత్రం భిన్నంగా కనిపించాడు. రోహిత్, విరాట్ కోహ్లి ద్రవిడ్ చేతికి ట్రోఫీని ఇవ్వడం చూడముచ్చటగా అనిపించింది.ఇక ద్రవిడ్ సెలబ్రేట్ చేసుకున్న విధానం చూస్తే.. ఈ విజయం మనకెంత ప్రత్యేకమో అందరికీ అర్థమయ్యే ఉంటుంది’’ అని వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాను ఓడించి టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. తద్వారా భారత్ ఖాతాలో ఐదో ఐసీసీ ట్రోఫీ చేరింది. ఇక ఈ టోర్నీ తర్వాత రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా తప్పుకోగా.. గౌతం గంభీర్‌తో అతడి స్థానాన్ని భర్తీ చేసింది బీసీసీఐ.చదవండి: మిస్టరీ గర్ల్‌తో హార్దిక్ పాండ్యా.. ప్రేమ గురించి నటాషా పోస్ట్ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
KKR: ద్రవిడ్ కాదు.. కోల్‌కతా కొత్త మెంటార్‌గా దిగ్గజ బ్యాటర్?
కోల్‌కతా నైట్ రైడర్స్.. ఐపీఎల్‌లోని విజయవంతమైన జట్లలో ఒకటిగా పేరొందింది. ముంబై ఇండియన్స్(5), చెన్నై సూపర్ కింగ్స్(5) తర్వాత అత్యధిక టైటిల్స్ సాధించిన రెండో జట్టుగా నిలిచింది.టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కెప్టెన్సీలో 2012, 2014 సీజన్లలో ట్రోఫీ గెలిచిన కోల్‌కతా(కేకేఆర్).. ఈ ఏడాది చాంపియన్‌గా నిలిచింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఐపీఎల్-2024 విజేతగా అవతరించింది.ఈ విజయంలో కోచ్ చంద్రకాంత్ పండిట్‌తో పాటు మెంటార్‌గా వ్యవహరించిన గంభీర్ పాత్ర కూడా కీలకం. ఈ నేపథ్యంలోనే అతడు టీమిండియా ప్రధాన కోచ్‌గా ఎంపిక కావడం విశేషం.అందుకే రాహుల్ ద్రవిడ్ స్థానంలోఇంతవరకు శిక్షకుడిగా పనిచేసిన అనుభవం లేకపోయినా కేకేఆర్ విజయం సాధించిన తీరుతో బీసీసీఐ గౌతీపై నమ్మకం ఉంచింది. అందుకే రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని అతడితో భర్తీ చేసింది. శ్రీలంకతో సిరీస్ సందర్భంగా గౌతీ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.ఈ నేపథ్యంలో కేకేఆర్ జట్టు కొత్త మెంటార్ ఎవరా అని క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. గంభీర్ స్థానంలో ద్రవిడ్ ఈ బాధ్యతలు స్వీకరిస్తాడని ఇన్నాళ్లుగా ప్రచారం జరగగా.. తాజాగా కొత్త పేరు తెరమీదకు వచ్చింది.కేకేఆర్ మెంటార్‌గా సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ జాక్వెస్ కలిస్ కేకేఆర్ మెంటార్‌గా రానున్నాడని సమాచారం. అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల వరద పారించిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఐపీఎల్‌లోనూ సత్తా చాటిన విషయం తెలిసిందే.కేకేఆర్ 2012, 2014లో టైటిల్ గెలిచిన జట్టులో కలిస్ సభ్యుడు. గంభీర్ కెప్టెన్సీలో కోల్‌కతాకు ఆడిన ఈ కేప్‌టౌన్ స్టార్.. 2015లో బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా కొత్త అవతారం ఎత్తాడు.అనంతరం నాలుగు సీజన్ల పాటు కేకేఆర్ హెడ్ కోచ్‌గానూ వ్యహరించాడు. ఈ పదవి నుంచి వైదొలిగన తర్వాత సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా కలిస్ నియమితుడయ్యాడు.ఈ నేపథ్యంలో తమతో సుదీర్ఘ అనుబంధం ఉన్న జాక్వెస్ కలిస్‌తో తిరిగి జట్టు కట్టేందుకు కేకేఆర్ యాజమాన్యం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. గంభీర్ స్థానంలో కలిస్‌ను తమ మెంటార్‌గా నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. చదవండి: హెడ్ కోచ్ గంభీర్‌కు షాకిచ్చిన బీసీసీఐ!.. ఏమిజరిగిందంటే? -
దటీజ్ ద్రవిడ్.. రూ. 5 కోట్లు వద్దు..! వాళ్లతో పాటే నేనూ..!
-
హెడ్ కోచ్‌గా గంభీర్ జీతం అన్ని కోట్లా?.. ద్రవిడ్ కంటే రెట్టింపు?!
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాడు. భారత జట్టు హెడ్ కోచ్‌గా సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. కాగా రెండుసార్లు ప్రపంచకప్(2007, 2011) గెలిచిన భారత జట్టులో భాగమైన గౌతీ రాజకీయాల్లోనూ అదృష్టం పరీక్షించుకున్నాడు.రెండు పడవల మీద ప్రయాణం చేయలేననిబీజేపీ తరఫున ఎంపీగా గెలిచిన ఈ ఢిల్లీ బ్యాటర్.. కామెంటేటర్‌గానూ కొనసాగాడు. అయితే, రెండు పడవల మీద ప్రయాణం చేయలేనని చెబుతూ రాజకీయాలకు స్వస్తి పలికిన గంభీర్.. పూర్తి స్థాయిలో క్రికెట్‌కే అంకితమయ్యాడు.ఐపీఎల్ జట్లు లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా వ్యవహరించి జట్లను విజయాల బాట పట్టించాడు. లక్నో అరంగేట్రంలోనే ప్లే ఆఫ్స్ చేరడంలో గౌతీ కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ ఏడాది కేకేఆర్ చాంపియన్‌గా నిలవడంలోనూ ఈ మాజీ కెప్టెన్ సేవలు మరువలేనివి.ఈ క్రమంలోనే గౌతం గంభీర్ భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈ నేపథ్యంలో గౌతీ జీతం ఎంత ఉంటుందన్న అంశం క్రికెట్ ప్రేమికుల్లో చర్చకు దారితీసింది.టీ20 ప్రపంచకప్-2024 అందించికాగా 2021 నుంచి ఇప్పటి దాకా రాహుల్ ద్రవిడ్ టీమిండియా ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. వెళ్తూ వెళ్తూ భారత్‌కు టీ20 ప్రపంచకప్-2024 అందించిన కోచ్‌గా ద్రవిడ్ పేరు సంపాదించాడు.ఇక హెడ్ కోచ్‌గా అతడికి బీసీసీఐ ఏడాదికి రూ. 12 కోట్ల మేర వేతనం ఇచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే గంభీర్ మాత్రం ఇంతకు రెట్టింపు జీతం పొందనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.కేకేఆర్ మెంటార్‌గా గంభీర్‌కు రూ. 25 కోట్లు?కాగా కేకేఆర్ మెంటార్‌గా గంభీర్‌కు రూ. 25 కోట్లు ఆ జట్టు యాజమాన్యం పారితోషికంగా అందించిందని అప్పట్లో వదంతులు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో.. హెడ్ కోచ్‌గా వచ్చినందున ఆ పదవికి రాజీనామా చేయాలి కాబట్టి.. బోర్డు ఈ మొత్తం తనకు జీతంగా చెల్లించాలని గౌతీ కండిషన్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.జీతంతో పాటు అన్ని సదుపాయాలువార్తా సంస్థ IANS వివరాల ప్రకారం.. 2019 వరకు ప్రధాన కోచ్‌కు రోజూవారీ వేతనం కింద రూ. 21 వేలు(విదేశీ పర్యటనలో రూ. 42 వేలు), బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం, హోటళ్లలో బస, అందుకు సంబంధించిన ప్రతీ ఖర్చు బీసీసీఐ చెల్లించేదని తెలుస్తోంది.అయితే, హెడ్ కోచ్ వేతనం విషయంలో బేరసారాలకు ఆస్కారం ఉందనే వార్తలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గంభీర్ నియామకానికి సంబంధించిన ప్రకటన కూడా ఆలస్యం జరిగిందని నెట్టింట ప్రచారం సాగింది.ఎట్టకేలకు గంభీర్ ఆశించిన మొత్తానికి బీసీసీఐ సరేనన్న తర్వాతే అతడు పదవి చేపట్టేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. అయితే, ఇంత వరకు టీమిండియా హెడ్ కోచ్ జీతం గురించి ఎక్కడా ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడం గమనార్హం.అదే నా లక్ష్యం: గంభీర్‘‘నా చిరునామా భారతదేశం. దేశానికి సేవ చేయగలడం నా జీవితంలో కలిగిన అతి పెద్ద అదృష్టం. ఇప్పుడు మరో రూపంలో పునరాగమనం చేయడం గౌరవంగా భావిస్తున్నా. ఎప్పటిలాగే ప్రతీ భారతీయుడు గర్వపడేలా చేయడమే నా లక్ష్యం.140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను టీమిండియా మోస్తుంది. వారి కలలు నిజంచేసేందుకు నా స్థాయిలో ఏదైనా చేసేందుకు నేను సిద్ధం’’ అని భారత జట్టు కొత్త హెడ్ కోచ్‌గా నియమితుడైన తర్వాత గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. కాగా గంభీర్ మూడున్నరేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు.చదవండి: దటీజ్ ద్రవిడ్.. రూ. 5 కోట్లు వద్దు!.. వాళ్లతో పాటే నేనూ! -
రూ. 5 కోట్లు వద్దు!.. వాళ్లూ, నేనూ సమానమే!
ఆటలోనే కాదు.. వ్యక్తిత్వంలోనూ ‘జెంటిల్‌మేన్’నే అని మరోసారి నిరూపించుకున్నాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించిన క్యాష్ రివార్డులో తనకు దక్కాల్సిన మొత్తాన్ని సగానికి తగ్గించుకుని గొప్పతనాన్ని చాటుకున్నాడు.సహాయక సిబ్బందితో పాటే తానూ అంటూ హుందాగా వ్యవహరించాడు. కాగా టీ20 ప్రపంచకప్-2021 తర్వాత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ భారత పురుషుల జట్టు ప్రధాన కోచ్‌గా నియమితుడైన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ‘వాల్’ మార్గదర్శనంలో టీమిండియా టీ20 వరల్డ్‌కప్-2022లో సెమీస్, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో ఫైనల్, వన్డే వరల్డ్‌కప్-2023లో ఫైనల్ చేరింది. కానీ టైటిల్ మాత్రం గెలవలేకపోయింది.అయితే, తాజా పొట్టి ప్రపంచకప్ ఎడిషన్ ద్వారా ద్రవిడ్ కల నెరవేరింది. అతడి గైడెన్స్‌లో రోహిత్ సేన వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది. తద్వారా భారత్ ఖాతాలో ఐదో ఐసీసీ టైటిల్ చేరింది.దాదాపు పదకొండేళ్ల తర్వాత టీమిండియా ఇలా మేజర్ టోర్నీలో చాంపియన్‌గా నిలవడంతో బీసీసీఐ ఏకంగా రూ. 125 కోట్ల నజరానా ప్రకటించింది. ఇందులో.. కప్ గెలిచిన ప్రధాన జట్టులోని పదిహేను మంది ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్ ద్రవిడ్‌కు రూ. 5 కోట్ల మేర కానుకగా ఇవ్వాలని భావించింది.అదే విధంగా... బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్‌లకు ఒక్కొక్కరికి రూ. 2.5 కోట్ల మేర ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, ద్రవిడ్ మాత్రం తనకు దక్కిన మొత్తాన్ని సగానికి తగ్గించమని బోర్డును కోరినట్లు తెలుస్తోంది.సహాయక కోచ్‌ల మాదిరే తనకు కూడా రెండున్నర కోట్ల రూపాయలు చాలంటూ.. మిగిలిన సగాన్ని తిరిగి తీసుకోమని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాకు వెల్లడించాయి.‘‘మిగతా సహాయక సిబ్బంది మాదిరే రాహుల్ కూడా తనకు బోనస్‌గా కేవలం రెండున్నర కోట్లు చాలని చెప్పాడు. మేము అతడి సెంటిమెంట్‌ను గౌరవిస్తాం’’ అని పేర్కొన్నాయి.దటీజ్ ద్రవిడ్.. అప్పుడు కూడా ఇలాగే..రాహుల్ ద్రవిడ్ గతంలో అండర్-19 జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. 2018లో అతడి మార్గదర్శనంలో యువ భారత్ ప్రపంచకప్ గెలిచింది.ఈ నేపథ్యంలో నాడు బీసీసీఐ ద్రవిడ్‌కు రూ. 50 లక్షలు, సహాయక సిబ్బందికి రూ. 20 లక్షల చొప్పున రివార్డు ప్రకటించింది. ఆటగాళ్లకు రూ. 30 లక్షలు ఇచ్చింది.ఈ క్రమంలో ద్రవిడ్ తనకు ఎక్కువ మొత్తం వద్దని.. కోచింగ్ స్టాఫ్ అందరికీ సమానంగా రివార్డును పంచాలని కోరాడు. ఫలితంగా బోర్డు ద్రవిడ్‌తో పాటు మిగతా సిబ్బందికి రూ. 25 లక్షల చొప్పున అందజేశారు.చదవండి: శుభవార్త చెప్పిన పేసర్.. టీమిండియా ఎంట్రీ మాత్రం ఆ తర్వాతే! -
నా వర్క్ వైఫ్: ద్రవిడ్‌ను ఉద్దేశించి రోహిత్ భావోద్వేగ పోస్ట్.. వైరల్
‘‘ప్రియమైన రాహుల్ భాయ్.. నా మనసులోని భావాలను వెల్లడించేందుకు సరైన పదాల కోసం వెతుక్కొంటున్నాను. అయితే, ఈ నా ప్రయత్నం వృథా అవుతుందేమో!ఏదేమైనా చెప్పాలనుకున్నది చెప్పి తీరుతా..! కోట్లాది మంది అభిమానుల్లాగే నేను కూడా చిన్ననాటి నుంచి నిన్ను చూస్తూ పెరిగా.అయితే, వారెవరికీ రాని అవకాశం నాకు వచ్చింది. నిన్న దగ్గరగా చూడటమే కాదు.. నీతో కలిసి పనిచేసే భాగ్యం దక్కింది.క్రికెట్లో నువ్వొక శిఖరానివి. కఠిన శ్రమకు ఓర్చే ఆటగాడివి. అందుకు ప్రతిఫలంగా ఎన్నెన్నో ఘనతలు సాధించావు.అయితే, మా దగ్గరికి వచ్చే సమయంలో ఆటగాడిగా నీ ఘనతలన్నీ పక్కన పెట్టి.. కేవలం కోచ్‌గా మాత్రమే వ్యవహరిస్తావు.నీలాంటి గొప్ప ఆటగాడితో మమేకమయ్యే క్రమంలో మాకు ఎలాంటి సందేహాలు, సంశయాలు లేకుండా చేస్తూ మేము సౌకర్యంగా ఫీలయ్యేలా చేస్తావు.ఆటకు, మాకు నువ్విచ్చిన గొప్ప బహుమతి అది. ఆట పట్ల నీకున్న ప్రేమ నీ హుందాతనానికి కారణం. నీ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను.ఎన్నో మధుర జ్ఞాపకాలు పోగు చేసుకున్నాను. పనిలో ఉన్నపుడు తనను కూడా పట్టించుకోకుండా నేను నీతోనే ఉంటానని నా భార్య ఎల్లప్పుడూ అంటూ ఉంటుంది.రాహుల్ భాయ్ ‘నీ వర్క్ వైఫ్’(పనిలో సహచరులు, పరస్పర గౌరవం, మద్దతు, విశ్వసనీయత కలిగి ఉండేవారు) అంటూ నన్ను ఆటపట్టిస్తుంది. ఇలా అనిపించుకోవడం కూడా నా అదృష్టమే అని భావిస్తా. నిన్ను చాలా మిస్సవుతాను. అయితే, కలిసి కట్టుగా మనం సాధించిన విజయం పట్ల సంతోషంగా ఉన్నాను.రాహుల్ భాయ్ నా నమ్మకం, నా కోచ్, నా స్నేహితుడు అని అనుకుంటూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా?! సెల్యూట్’’ అంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉద్వేగానికి లోనయ్యాడు.భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకొంటున్న రాహుల్ ద్రవిడ్‌ను ఉద్దేశించి భావోద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. రాహుల్ భాయ్‌తో తన అనుబంధం చిరస్మరణీయంగా నిలిచిపోతుందంటూ కోచ్ పట్ల ప్రేమను చాటుకున్నాడు.ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీతో ద్రవిడ్, తాను, తన కుటుంబం దిగిన ఫొటోలను రోహిత్ శర్మ షేర్ చేశాడు. కాగా విరాట్ కోహ్లి తర్వాత భారత జట్టు సారథిగా రోహిత్ పగ్గాలు చేపట్టగా.. హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించాడు.కల నెరవేరిందివీరిద్దరి హయాంలో టీమిండియా ఆసియా వన్డే కప్ గెలవడంతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్, వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్ చేరింది. అయితే, తాజాగా ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌తో ఈ దిగ్గజాల కల నెరవేరింది.అమెరికా- వెస్టిండీస్ వేదికగా సాగిన ఈ మెగా టోర్నీలో ద్రవిడ్ మార్గదర్శనంలోని రోహిత్ సేన ట్రోఫీ గెలిచింది. సౌతాఫ్రికాను ఓడించి ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకుంది.ఇక ఈవెంట్ తర్వాత తాను బాధ్యతల నుంచి వైదొలుగుతానని ఇప్పటికే ద్రవిడ్ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రోహిత్ శర్మ ఉద్వేగానికి గురయ్యాడు.మీరిద్దరూ అరుదైన వజ్రాలుఇందుకు స్పందిస్తూ.. ‘‘మీరిద్దరూ అరుదైన వజ్రాలు’’ అంటూ టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ కామెంట్ చేశాడు. కాగా వరల్డ్‌కప్-2024 తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.తదుపరి చాంపియన్స్ ట్రోఫీ-2025, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్ ముగిసే వరకూ కెప్టెన్‌గా తనే కొనసాగనున్నాడు. ఇదిలా ఉంటే.. రోహిత్‌తో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సైతం ఇంటర్నేషనల్ టీ20 కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. చదవండి: శుభవార్త చెప్పిన పేసర్.. టీమిండియా ఎంట్రీ మాత్రం ఆ తర్వాతే! -
IPL: కేకేఆర్ మెంటార్‌గా రాహుల్ ద్రవిడ్..?
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైన నేపథ్యంలో ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్ కొత్త మెంటార్ అన్వేషణలో పడింది. తమ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించాలని కేకేఆర్ టీమిండియా తాజా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను కోరినట్లు తెలుస్తుంది. ఇందుకు ద్రవిడ్ సైతం సుముఖత వ్యక్తం చేశాడని సమాచారం. ఒకవేళ ఈ డీల్ కుదిరితే ద్రవిడ్ వచ్చే సీజన్ (2025) నుంచి కేకేఆర్ మెంటార్‌గా వ్యవహరిస్తాడు.మరోవైపు టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు అధికారికంగా ప్రకటించడమే తరువాయి. హెడ్ కోచ్ పదవి విషయంలో గంభీర్-బీసీసీఐ మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని సమాచారం. గంభీర్ తన సహాయ సిబ్బందిని ఎంచుకునే విషయంలోనూ బీసీసీఐ పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలుస్తుంది. గంభీర్ సక్సెస్ఫుల్ బ్యాటర్ కావడంతో తనే బ్యాటింగ్ కోచ్‌గా కూడా వ్యవహరించే అవకాశం ఉంది. గంభీర్ తనకు ఇష్టం వచ్చిన వారికి బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లుగా ఎంచుకోవచ్చు.టీమిండియా ఫీల్డింగ్ కోచ్ రేసులో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, దిగ్గజ ఫీల్డర్ జాంటీ రోడ్స్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. బౌలింగ్ కోచ్‌గా ఎవరుంటారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపడితే కేకేఆర్ మెంటార్షిప్ను వదులుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ద్రవిడ్ కేకేఆర్ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కాగా, టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 వరల్డ్‌కప్ 2024తో ముగిసిన విషయం తెలిసిందే. -
BCCI: గంభీర్ మనసులో ఏముంది?.. ఆలస్యానికి కారణం ఇదే
టీమిండియా కొత్త ప్రధాన కోచ్ ప్రకటనపై సస్పెన్స్ వీడటం లేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ అంశంపై ఇంత వరకు స్పష్టతనివ్వలేదు.కాగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగిసినా.. టీ20 ప్రపంచకప్-2024 వరకు అతడినే కొనసాగించింది బీసీసీఐ. ఈ క్రమంలో టైటిల్ గెలిచి సగర్వంగా తన బాధ్యతల నుంచి వైదొలిగాడు ద్రవిడ్.ఇక ఇప్పటికే ద్రవిడ్ స్థానంలో మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కోచ్‌గా వస్తాడనే ప్రచారం జరుగుతున్నా బీసీసీఐ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.అయితే, శ్రీలంకతో సిరీస్ నాటికి మాత్రం పూర్తిస్థాయి కోచ్ అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇప్పటికే వెల్లడించారు. అయినప్పటికీ హెడ్‌కోచ్ ప్రకటన విషయంలో ఆలస్యం జరుగుతోంది.బ్యాటింగ్ కోచ్‌గానూ గంభీర్?అయితే, జీతం విషయంలో గంభీర్- బోర్డు మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నాయని.. ఆలస్యానికి కారణం ఇదేనంటూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. హెడ్ కోచ్‌గా ఉండటంతో పాటు బ్యాటింగ్ కోచ్‌గానూ గంభీర్ వ్యవహరించే అవకాశం ఉందని.. అయితే, ఈ విషయమై చర్చలు కొలిక్కి రాలేదని తెలిపింది.కాగా రాహుల్ ద్రవిడ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ పదవీ కాలం కూడా ముగియనున్నది. ఈ నేపథ్యంలో సహాయక సిబ్బంది నియామకంలో తనకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని గంభీర్ బీసీసీఐకి షరతు విధించినట్లు సమాచారం.అదే విధంగా వరల్డ్‌క్లాస్ బ్యాటర్ అయిన తాను ఉండగా.. ప్రత్యేకంగా బ్యాటింగ్ కోచ్ అవసరం లేదనే యోచనలో అతడు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. గంభీర్‌తో పాటు డబ్ల్యూవీ రామన్ కూడా హెడ్ కోచ్ పదవి కోసం ఇంటర్వ్యూకు హాజరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ ఎవరన్న అంశంలో అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే క్లారిటీ రానుంది.చదవండి: BCCI: రోహిత్‌కు రూ. 5 కోట్లు.. మూడు టైటిళ్ల ధోనికి ఎంత? కపిల్ డెవిల్స్ పాపం! -
నాన్సెన్స్.. నేనెందుకు రంజీల్లో ఆడాలి: ఇషాన్ కిషన్
చేతులారా తన కెరీర్‌ను తానే నాశనం చేసుకుంటున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్. భారత జట్టు ఓపెనర్‌గా తనదైన శైలిలో రాణిస్తూ ప్రతిభ నిరూపించుకున్న ఈ జార్ఖండ్ వికెట్ కీపర్.. కొంత కాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు.గతేడాది నవంబరులో సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే వ్యక్తిగత కారణాలు చెప్పి స్వదేశానికి తిరిగి వచ్చిన ఇషాన్ కిషన్ పట్ల బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. మానసిక ఒత్తిడితో బాధపడుతున్నానని జట్టు నుంచి నిష్క్రమించిన ఈ యంగ్ ఓపెనర్.. కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.ఈ నేపథ్యంలో.. తుదిజట్టులో ఆడే అవకాశం రానందు వల్లే ఇషాన్ ఇంటిబాట పట్టాడని.. ఈ క్రమంలో బోర్డుతో విభేదాలు తారస్థాయికి చేరాయనే వార్తలు వినిపించాయి. అందుకు తగ్గట్లుగానే.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం.. ఇషాన్ దేశవాళీ క్రికెట్(రంజీ)లో ఆడితేనే మళ్లీ జాతీయ జట్టులో అడుగుపెట్టగలడని స్పష్టం చేశాడు.అయితే, ఇషాన్ కిషన్ మాత్రం ఈ ఆదేశాలను బేఖాతరు చేశాడు. జార్ఖండ్ తరఫున అతడు రంజీ బరిలో దిగుతాడని స్థానిక బోర్డు ఆశించినా.. అతడి నుంచి స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలు తీసుకున్న బీసీసీఐ.. ఇషాన్ కిషన్‌ను సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించింది.ఈ విషయంపై తాజాగా ఇషాన్ కిషన్ స్పందించాడు. తాను రంజీలు ఆడకపోవడానికి గల కారణం వెల్లడించాడు. ‘‘ఒక ఆటగాడు చాలా కాలం తర్వాత పునరాగమనం చేయాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలనే నిబంధన ఉంది.అయితే, నన్ను కూడా ఇలా ఆడమనడంలో అర్థం లేదనిపించించింది. ఎందుకంటే నేను కాస్త విరామం తీసుకున్నా. అది సాధారణ సెలవు మాత్రమే.అలాంటపుడు నేనెందుకు రంజీలు ఆడాలి. ఆడే ఓపిక లేదనే కదా అంతర్జాతీయ క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్నా. అయినా.. జాతీయ జట్టుకు ఆడకుండా విరామం తీసుకుంటే.. రంజీలు ఆడమంటూ ఆదేశించడం ఏమిటో అర్థం కాలేదు.నేను బాగుంటే గనుక ఇంటర్నేషనల్ క్రికెట్ కంటిన్యూ చేసేవాడిని కదా. అప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నాను. ఈ రోజు కూడా అంతా బాగుందని చెప్పే పరిస్థితిలో లేను.క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నా. అయినా నా విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతోందనే ప్రశ్న పదే పదే నా మదిని తొలుస్తోంది.నేను బాగా ఆడుతున్నా.. కేవలం బ్రేక్ తీసుకున్నాననే కారణంగా ఇలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదు’’ అని ఇషాన్ కిషన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ ఈ మేరకు తన మనసులోని భావాలు పంచుకున్నాడు.కాగా రంజీలు ఆడకుండా ఎగ్గొట్టిన ఇషాన్ కిషన్.. ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగడం గమనార్హం. ఈ సీజన్లో అతడు 14 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 320 పరుగులు చేయగలిగాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 జట్టు ఎంపిక సమయంలో బీసీసీఐ అతడిని పరిగణనలోకి కూడా తీసుకోలేదు.ఇక వికెట్ కీపర్ల కోటాలో రిషభ్ పంత్, సంజూ శాంసన్ చోటు దక్కించుకున్నారు. ఇక ఈ మెగా టోర్నీ ఆద్యంతం అదరగొట్టిన టీమిండియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. -
BCCI: ద్రవిడ్‌కు రూ. 5 కోట్లు.. రోహిత్, కోహ్లిలకు ఎంతంటే?
టీ20 ప్రపంచకప్-2024 విజేతగా నిలిచిన టీమిండియాపై ప్రశంసలతో పాటు కనక వర్షం కూడా కురిసింది. ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందికి కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే.దాదాపు పదకొండేళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ గెలిచిన నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రూ. 125 కోట్ల రివార్డును బీసీసీఐ ప్రకటించింది. అయితే, ఈ మొత్తం పంచుకునే క్రమంలో ఎవరెవరికి ఎంత దక్కనుందనే విషయం గురించి ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.ఒక్కొక్కరికి రూ. 5 కోట్లు!ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. వరల్డ్‌కప్ ప్రధాన జట్టులో భాగమైన ఆటగాళ్లతో పాటు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌లకు ఒక్కొక్కరికి రూ. 5 కోట్ల మేర ఇవ్వనున్నారు. ఈ ఈవెంట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని క్రికెటర్లకు కూడా ఈ మేర భారీ మొత్తం దక్కనుంది.వారికి 2.5 కోట్లు? అదే విధంగా ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున ఇవ్వనున్నారు. ఇక కోచింగ్ సిబ్బందిలో ప్రధానమైన బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్‌లకు రూ. 2.5 కోట్ల మేర రివార్డు దక్కనుంది.మిగిలిన వాళ్లలో ముగ్గురు ఫిజియోథెరపిస్టులు కమలేశ్ జైన్, యోగేష్ పర్మార్, తులసీ రామ్ యువరాజ్.. ఇద్దరు మసాజర్లు రాజీవ్ కుమార్, అరుణ్ కనాడే.. అదే విధంగా కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయిలకు ఒక్కొక్కరికి రూ. 2 కోట్ల మేర బీసీసీఐ నజరానా ఇవ్వనుంది.చీఫ్ సెలక్టర్‌కు ఎంతంటే?వీరి సంగతి ఇలా ఉంటే.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సహా సెలక్షన్ కమిటీలోని మిగిలిన నలుగురు సభ్యులకు రూ. కోటి చొప్పున ఇచ్చేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.అదే విధంగా.. వీడియో అనలిస్టులు, మీడియా ఆఫీసర్లు, టీమిండియా లాజిస్టిక్ మేనేజర్ సహా ఈ మెగా టోర్నీలో భాగమైన 42 మంది సభ్యులకు వారి బాధ్యతలకు అనుగుణంగా రివార్డులోని కొంత మొత్తాన్ని అందించనున్నట్లు సమాచారం.సౌతాఫ్రికాను ఓడించికాగా రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు టీ20 ప్రపంచకప్-2024 చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన ఈ మెగా టోర్నీ ఫైనల్లో సౌతాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించి టైటిల్ గెలిచింది.ఈ ఐసీసీ ఈవెంట్లో భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలవగా.. ఫైనల్లో అద్భుతంగా ఆడిన విరాట్ కోహ్లి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2024 భారత జట్టు:రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్, సంజూ శాంసన్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్.ట్రావెలింగ్ రిజర్వ్స్: రింకూ సింగ్, శుబ్‌మన్ గిల్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్.చదవండి: IND vs SL: భారత్‌తో టీ20 సిరీస్.. శ్రీలంక హెడ్ కోచ్‌గా సనత్ జయసూర్య -
రాహుల్ ద్రవిడ్‌కు భారతరత్న ఇవ్వాలి: సునీల్ గవాస్కర్
టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ప్రస్ధానం ముగిసిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్-2024తో భారత హెడ్ కోచ్‌గా ద్రవిడ్ పదవీ కాలం ముగిసింది. టీ20 వరల్డ్‌కప్ విజయంతో తమ కోచ్‌కు భారత ఆటగాళ్లు ఘనంగా విడ్కోలు పలికారు. భారత్ వరల్డ్‌కప్ గెలవడంలో ద్రవిడ్‌ది కూడా కీలక పాత్ర. తన అనుభవంతో జట్టును అద్బుతంగా నడిపించాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ద్రవిడ్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని గవాస్కర్ కోరాడు."రాహుల్ ద్రవిడ్‌ను కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరిస్తే బాగుంటుంది. అందుకు ద్రవిడ్ నిజంగా అర్హుడు. వెస్టిండీస్ వంటి కఠిన పరిస్ధితుల్లో ద్రవిడ్ ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా అన్నో అద్బుత విజయాలను అందుకున్నాడు. విండీస్‌లో మాత్రమే కాదు. ఇంగ్లండ్ వంటి విదేశీ పరిస్థితుల్లో కూడా కెప్టెన్‌గా ద్రవిడ్ భారత్‌కు చారిత్రత్మక విజయాలను అందించాడు. ఇంగ్లండ్‌లో టెస్ట్ మ్యాచ్ సిరీస్‌ను గెలుచుకున్న ముగ్గురు భారత కెప్టెన్లలో ద్రవిడ్ ఒకడిగా ఉన్నాడు. అంతేకాకుండా జాతీయ క్రికెట్ అకాడమీ ఛైర్మన్‌గా పనిచేసి ఎంతో మంది యువ క్రికెటర్లను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత అతడిది. భారత పురుషల సీనియర్ జట్టు కోచ్‌గా కూడా అతడు అద్భుతాలు సృష్టించాడు. ద్రవిడ్ నేతృత్వంలోనే 17 ఏళ్ల తర్వాత భారత్ పొట్టి వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది.ఆటగాడిగా, కెప్టెన్‌గా, కోచ్‌గా ద్రవిడ్ సాధించిన విజయాలు ప్రతీ భారతీయుడుకు ఆనందనిచ్చాయి. ద్రవిడ్ వరల్డ్‌కప్ విజయంతో యావత్తు దేశం గర్వించేలా చేశాడు. కాబట్టి అటువంటి వ్యక్తికి కచ్చితంగా దేశ అత్యున్నత పురస్కారంతో గౌరవించాలి. ఈ విషయంపై ప్రతీ ఒక్కరూ నాతో గొంతు కలపాలి. ప్రభుత్వం కచ్చితంగా అతడు సేవలను గుర్తించాలి. భారతరత్న రాహుల్ శరద్ ద్రవిడ్ అని వినడానికి ఎంతో అద్భుతంగా ఉంది కాదా? అని గవాస్కర్ తన కాలమ్ మిడ్ డేలో రాసుకొచ్చాడు. -
న్యాయం చేయలేకపోతున్నా.. కోహ్లి ఆవేదన! ద్రవిడ్ రిప్లై ఇదే..
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి. లీగ్ దశలో పూర్తిగా విఫలమైన ఈ ‘రన్‌మెషీన్’.. సెమీస్ వరకు అదే పేలవ ప్రదర్శన కనబరిచాడు.అయితే, అసలైన మ్యాచ్‌లో మాత్రం దుమ్ములేపాడీ కుడిచేతి వాటం బ్యాటర్. సౌతాఫ్రికాతో ఫైనల్లో అద్భుత అర్ధ శతకంతో రాణించి భారత్ ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.తద్వారా ‘ఫామ్ తాత్కాలికం.. క్లాస్ మాత్రమే శాశ్వతం’ అని నిరూపించి.. తన విలువ చాటుకున్నాడు. అయితే, ఫైనల్ మ్యాచ్‌కు ముందు తనను ఆత్మవిశ్వాసంతో లేనని.. డీలా పడిపోయానని కోహ్లి పేర్కొన్నాడు.భారంగా తయారయ్యానని కుమిలిపోయాజట్టుకు ఏమాత్రం ఉపయోగపడకుండా భారంగా తయారయ్యానని కుమిలిపోయానని తెలిపాడు. అలాంటి సమయంలో హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతుగా నిలిచి.. తాను కోలుకునేలా ఉత్సాహాన్ని నింపారని కోహ్లి వెల్లడించాడు.వెస్టిండీస్ నుంచి ట్రోఫీతో తిరిగి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సమయంలో కోహ్లి సంభాషిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ‘‘నాకు నేను, నా జట్టుకు ఏమాత్రం న్యాయం చేయలేకపోతున్నానని రాహుల్ భాయ్‌కు చెప్పాను.అందుకు బదులుగా.. ‘కీలక సమయంలో నువ్వు తప్పకుండా ఫామ్‌లోకి వస్తావు’ అని భాయ్ చెప్పాడు. ఆ తర్వాత మ్యాచ్ ఆడే సమయంలో రోహిత్‌తో కూడా ఇదే మాట చెప్పాను. నేను కాన్ఫిడెంట్‌గా లేనని చెప్పాను.పట్టుదలగా నిలబడ్డానుఒక్క పరుగు కూడా చేయకపోతే పరిస్థితి ఏమిటని సతమతమయ్యాను. అయితే, ఫైనల్లో మేము వికెట్లు కోల్పోతున్న క్రమంలో పరిస్థితి తగ్గట్లుగా నన్ను నేను మలచుకోవాలని నిర్ణయించుకున్నాను.జట్టు కోసం నా వంతు ప్రయత్నం చేయాలని పట్టుదలగా నిలబడ్డాను. అందుకు తగ్గట్లుగానే ఫలితం కూడా వచ్చింది’’ అని విరాట్ కోహ్లి సంతోషం వ్యక్తం చేశాడు. కాగా వరల్డ్‌కప్-2024లో ఫైనల్‌కు ముందు కోహ్లి చేసిన పరుగులు 75 మాత్రమే.. సౌతాఫ్రికాతో ఫైనల్లో 59 బంతుల్లోనే 76 రన్స్ సాధించాడు. కాగా సమష్టిగా రాణించి టీమిండియా టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే.చదవండి: Ind vs Zim: వికెట్ కీపర్‌గా అతడే.. భారత తుది జట్టు ఇదే! -
17 ఏళ్ల పొట్టి ప్రపంచకప్ చరిత్రలో తొలి జట్టుగా టీమిండియా
నిన్న (జూన్ 29) జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో సారి పొట్టి ప్రపంచకప్‌ను సాధించింది. 17 ఏళ్ల పొట్టి ప్రపంచకప్ చరిత్రలో భారత్‌తో (2007, 2024) పాటు వెస్టిండీస్ (2012, 2016), ఇంగ్లండ్ (2010, 2022) మాత్రమే రెండేసి సార్లు టైటిల్స్ సాధించాయి. ఈ వరల్డ్‌కప్ విజయంతో భారత్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. ఈ ప్రపంచకప్‌లో అజేయ జట్టుగా నిలిచిన టీమిండియా.. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా (సింగిల్ ఎడిషన్) టైటిల్ సాధించిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గతంలో ఏ జట్టు అజేయంగా టీ20 ప్రపంచకప్ గెలవలేదు.కాగా, టీ20 వరల్డ్‌కప్ 2024 విజయానంతరం భారత ఆటగాళ్ల సంబురాలు అంబరాన్నంటాయి. తొలుత భావోద్వేగాలను అదుపు చేసుకోలేక ఆనంద బాష్పాలు కార్చిన టీమిండియా క్రికెటర్లు.. ఆతర్వాత తేరుకుని సంబురాలు చేసుకున్నారు.11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ, 13 ఏళ్ల తర్వాత ప్రపంచకప్, 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ గెలవడంతో యావత్ భారతావణి పులకించిపొయింది. ఊరు వాడా విజయోత్సవ సంబురాలు జరిగాయి. టీమిండియా కృష్ణార్జునులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పొట్టి ప్రపంచకప్ టైటిల్ గెలిచి టీ20 ఫార్మాట్‌కు ఘనంగా వీడ్కోలు పలకగా.. భారత హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం వరల్డ్‌కప్ విక్టరీతో ముగిసింది. భారత క్రికెట్ అభిమానులు ఓ పక్క టీమిండియా విజయాన్ని ఆస్వాధిస్తూనే.. మరోపక్క దిగ్గజాల రిటైర్మెంట్ ప్రకటనను తలచుకుంటూ కుమిలిపోయారు. మొత్తంగా నిన్నటి ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ భారత క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయంగా గుర్తుండిపోతుంది. -
'ది గ్రేట్ వాల్'.. కప్పు కొట్టించాడు! తన ప్రస్ధానాన్ని ముగించాడు
టీ20 వరల్డ్‌కప్-2024 ఘనంగా ముగిసింది. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్‌ను టీమిండియా ఎగురేసుకోపోయింది. టోర్నీ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు కీలకమైన ఫైనల్లోనూ సత్తాచాటింది. శనివారం బార్బోడస్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన భారత జట్టు.. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్‌కప్‌ను తమ ఖాతాలో వేసుకుంది.భారత జట్టుకు సారథిగా వరల్డ్‌కప్ ట్రోఫీని అందించాలన్న రోహిత్ శర్మ కల ఎట్టకేలకు నేరవేరింది. అదే విధంగా భారత్‌కు వరల్డ్‌కప్‌ను అందించి తన ప్రస్ధానాన్ని ముగించాలన్న రాహుల్ ద్రవిడ్ కోరిక కూడా ఈ విజయంతో తీరింది. వీరిద్దరితో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం తన కెప్టెన్ సాధించలేకపోయిన ట్రోఫీని.. కనీసం ఆటగాడిగానైనా దక్కించుకున్నందుకు ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఈ మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు విరాట్ కోహ్లి, రోహిత్ గుడ్ బై చెప్పగా.. రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా భారత జట్టుతో తన ప్రయాణాన్ని ముగించాడు.ముగిసిన రాహుల్ ద్రవిడ్ ప్రస్ధానం..భారత పురుషల జట్టు హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ప్రస్ధానం ముగిసింది. భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నద్రవిడ్.. తన మార్క్‌ను కోచింగ్‌లోనూ చూపించాలనుకున్నాడు.ఈ క్రమంలోనే 2021 నవంబరులో రవి శాస్త్రి నుంచి భారత హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించాడు. అయితే హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. 2013 నుంచి భారత్‌ను ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని సాధించడమే లక్ష్యంగా ద్రవిడ్ పెట్టుకున్నాడు.ఇది అతడి లక్ష్యం మాత్రమే కాదు అతడి ముందు ఉన్న సవాలు కూడా. ఎందుకంటే ద్వైఫాక్షిక సిరీస్‌లలో మాత్రమే అదరగొడుతుందని, ఐసీసీ టోర్నీల్లో మాత్రం తేలిపోతుందన్న ఆపఖ్యాతి అప్పటికే భారత్ మూటకట్టుకుంది. ద్రవిడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆరంభంలో అన్ని ఎదురుదెబ్బలే తగిలాయి.2022 ఆసియాకప్, టీ20 ప్రపంచకప్-2022లోద్రవిడ్ నేతృత్వంలోని టీమిండియా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత డబ్ల్యూటీసీ-2023 ఫైనల్ చేరినప్పటకి.. అక్కడ కూడా మళ్లీ నిరాశే. ఆసీస్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. దీంతో ఎంతమంది కోచ్‌లు మారిన ఐసీసీ టోర్నీల్లో భారత్ తల రాత మారలేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ద్రవిడ్ ఎక్కడా కుంగిపోలేదు. ఆటగాళ్లకు మద్దతుగా ఉంటూ జట్టును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే వన్డే వరల్డ్‌కప్-2023లో సత్తాచాటిన టీమిండియా ఫైనల్‌కు చేరింది. ఆ మెగా టోర్నీలో భారత్ ప్రదర్శన చూసి అంతా కప్ మనదే అని ఫిక్స్ అయిపోయారు. కానీ ఆసీస్ చేతిలో తుది మెట్టుపై భారత్ బోల్తా పడింది. మళ్లీ ద్రవిడ్‌కు నిరాశే మొదలైంది. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌తో తన పదవీ కాలం ముగిసినప్పటికి మరో ఏడాది తన కాంట్రాక్ట్‌ను పొడిగించాడు. ఈ సారి ఎలాగైనా కప్ కొట్టే తన ప్రస్ధానాన్ని ముగించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. మిషన్ టీ20 వరల్డ్‌కప్ 2024ను ద్రవిడ్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఒకప్పుడు మైదానంలో బౌలర్ల ఓపికను పరీక్షించిన ద్రవిడ్‌కు.. ఈ నిరీక్షణ పెద్ద లెక్కేమి కాదు. గతం గతహా అన్నట్లు ఆటగాళ్లను పొట్టి ప్రపంచకప్ కోసం అన్ని విధాలగా సన్నద్దం చేశాడు. సెలక్టర్లు, కెప్టెన్ రోహిత్‌తో కలిసి గొప్ప సమన్వయంతో వ్యవహరించిన ద్రవిడ్ 24 మంది ఆటగాళ్లతో కూడిన ఒక పూల్న్ని సిద్దం చేశాడు. ప్రపంచకప్‌కు కొన్ని నెలల ముందు భారత జట్టు తరఫున ఆడిన ఆటగాళ్లంతా ఈ పూల్‌లోని వాళ్లే. ఇందులో నుంచి 15 మంది అత్యుత్తమ ఆటగాళ్లను టీ20 వరల్డ్‌కప్-2024కు ఎంపిక చేశారు. ఈ 15 మంది సభ్యుల బృందం వరల్డ్‌కప్‌లో తలపడేందుకు అమెరికా గడ్డపై అడుగుపెట్టింది. ఈ టోర్నీ తొలి మ్యాచ్ నుంచే ద్రవిడ్ తెర వెనుకుండి జట్టును నడిపించాడు. రోహిత్‌కు విలువైన సూచనలు ఇస్తూ ఫైనల్‌కు చేర్చాడు.ఫైనల్లో తీవ్ర ఒత్తిడిలోనూ ఆటగాళ్లకు సపోర్ట్‌గా ఉంటూ కప్పు కొట్టేలా చేశాడు. ఆఖరికి పట్టువదలని విక్రమార్కుడిలా వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడి హెడ్ కోచ్‌గా తన ప్రయాణాన్ని ముగించాడు. ఆఖరిగా తన కెరీర్లో ఆటగాడిగా, కెప్టెన్‌గా సాధించని వరల్డ్‌కప్ టైటిల్‌ను కోచ్‌గా సాధించి ద్రవిడ్ చరిత్ర సృష్టించాడు. అందుకే విజయం సాధించిన అనంతరం ద్రవిడ్ కప్‌ను పట్టుకుని చిన్న పిల్లాడిలా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. కోచ్‌గా ద్రవిడ్ రికార్డులు ఇవే..భారత్ 24 టెస్టుల్లో 14 గెలిచి మూడింట్లో ఓడింది.13 వన్డే ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్ పదింటిని గెలుచుకుంది. అలాగే రోహిత్-ద్రవిడ్ కాంబినేషన్లో ఆడిన 56 మ్యాచ్‌ల్లో 41 విజయాలున్నాయి.77 టీ20 మ్యాచ్‌ల్లో 56 గెలిచింది. Never expected idhi #RahulDravid 😂❤️pic.twitter.com/n7o3Ffa83O— Harsha... (@harshatweets03) June 29, 2024 -
టీమిండియా విన్నింగ్ సెలబ్రేషన్స్.. చిన్న పిల్లాడిలా మారిన ద్రవిడ్! వీడియో
టీమిండియా కల నేరవేరింది. గత 11 ఏళ్లగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీ ఎట్టకేలకు భారత్ సొంతమైంది. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా బార్బోడస్ వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించిన భారత జట్టు.. రెండో పొట్టి ప్రపంచకప్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. భారత్‌కు ఇది రెండో టీ20 వరల్డ్‌కప్ కాగా.. ఓవరాల్‌గా నాలుగో ఐసీసీ ట్రోఫీ కావడం విశేషం. అయితే సుధీర్ఘ నిరీక్షణకు తెరపడడంతో భారత ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేవు. భావోద్వేనికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, సిరాజ్ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే కప్ అందుకునే సమయంలో మాత్రం భారత ఆటగాళ్లు నవ్వుతూ సంబరాల్లో మునిగి తేలిపోయారు. భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అయితే చిన్నపిల్లాడిలా ప్లేయర్స్‌తో కలిపి సెలబ్రేషన్స్ జరపుకున్నాడు. ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే ద్రవిడ్ ఈ తరహా సెలబ్రేషన్స్ చేసుకోవడం అందరిని కట్టిపడేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ద్రవిడ్‌కు భారత జట్టు హెడ్ కోచ్‌గా ఇదే చివరి మ్యాచ్ కావడం గమనార్హం. టీ20 వరల్డ్‌కప్-2024తో భారత హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ పదవీ కాలం ముగియనుంది. అదే విధంగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి తప్పుకున్నారు.Never expected idhi #RahulDravid 😂❤️pic.twitter.com/n7o3Ffa83O— Harsha... (@harshatweets03) June 29, 2024It's that sigh of relief in the end from Rahul Dravid after his aggressive celebration. pic.twitter.com/ZDeXiiLr7k— Aditya Saha (@Adityakrsaha) June 29, 2024 -
T20ప్రపంచ కప్ సొంతం.. ఆనంద క్షణాల్లో ఆటగాళ్ల భావోద్వేగం (ఫొటోలు)
-
భారత్‌దే టి20 ప్రపంచకప్ .. విశ్వవిజేతగా రోహిత్ సేన (ఫోటోలు)
-
T20 World Cup 2024 Final: ద్రవిడ్‌కు చివరి మ్యాచ్.. టైటిల్‌తో వీడ్కోలు పలకండి..!
టీ20 వరల్డ్‌కప్ 2024 చివరి అంకానికి చేరింది. బార్బడోస్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య ఇవాళ (జూన్ 29) జరుగబోయే ఫైనల్‌తో మెగా టోర్నీ ముగస్తుంది. ఈ మ్యాచ్ టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కు చివరిది. భారత హెడ్ కోచ్‌గా ద్రవిడ్ పదవీకాలం ఈ మ్యాచ్‌తో ముగస్తుంది. టైటిల్ గెలిచి ద్రవిడ్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని టీమిండియా ఆటగాళ్లు భావిస్తున్నారు. భారత క్రికెట్ అభిమానులు సైతం ఇదే కోరుకుంటున్నారు. కోచ్‌గా ద్రవిడ్ టీమిండియాకు ఎనలేని సేవలనందించాడు. ద్రవిడ్ ఆథ్వర్యంలో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, వన్డే ప్రపంచకప్ ఫైనల్ లాంటి ప్రతిష్టాత్మకమైన మ్యాచ్‌లు ఆడింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడనుంది. తన హయాంలో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ద్రవిడ్‌కు ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేదన్న లోటు మిగిలిపోయింది. ఈ ప్రపంచకప్‌తో ఆ లోటు తీర్చుకోవాలని ద్రవిడ్ పట్టుదలగా ఉన్నాడు. RAHUL DRAVID - ONE FINAL DAY AS HEAD COACH. 🌟- Indian cricket will miss you. pic.twitter.com/Xd7hMZiPBP— Johns. (@CricCrazyJohns) June 28, 2024ఇందుకోసం అతను బాయ్స్‌ను (టీమిండియా క్రికెటర్లను) సమాయత్తం చేస్తున్నాడు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైనా (రిజర్వ్ డేలో కూడా) భారత్ సంయుక్త విజేతగా నిలుస్తుంది కానీ.. అది ద్రవిడ్‌కు అంత సంతృప్తిని ఇవ్వకపోవచ్చు. భారత ఆటగాళ్లకు, అభిమానులకు కూడా సంయుక్త విజేతలుగా నిలవడం ఇష్టం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ జరిగి. అందులో టీమిండియా విజేతగా నిలవాలని యావత్ భారత దేశం కోరుకుంటుంది. భారత్ చివరిసారి ప్రపంచకప్ టైటిల్‌ను (వన్డే) 2011లో సాధించింది. టీ20 వరల్డ్‌కప్‌ను 2007 అరంగేట్రం ఎడిషన్‌లో గెలిచింది. ఈ సారి టీమిండియా టైటిల్ సాధిస్తే.. ప్రపంచకప్ కోసం 13 ఏళ్ల నిరీక్షణకు తెరపడినట్లవుతుంది.మరోవైపు ఈ వరల్డ్‌కప్‌లో మరో ఫైనలిస్ట్ అయిన సౌతాఫ్రికా కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు కోరుకుంటున్నారు. సౌతాఫ్రికా ఇప్పటివరకు ఒక్క వరల్డ్‌కప్ టైటిల్ కూడా గెలవలేదు. ఫైనల్స్‌కు చేరడం కూడా ఆ జట్టుకు ఇదే మొదటిసారి. కాబట్టి సౌతాఫ్రికా కూడా టైటిల్ సాధించే విషయంలో కృత నిశ్చయంతో ఉంది. మరి ఎవరు టైటిల్ గెలుస్తారో వేచి చూడాలి. -
T20 WC: బాధలో విరాట్ కోహ్లి.. ఓదార్చిన ద్రవిడ్! వీడియో వైరల్
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్స్‌లో విరాట్‌కు మంచి రికార్డు ఉండడంతో ఈ ఏడాది కూడా సత్తాచాటుతాడని అభిమానులు భావించారు. కానీ గయనా వేదికగా ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో కోహ్లి కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇంగ్లండ్ పేసర్ రీస్ టాప్లీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి కోహ్లి క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో నిరాశతో కోహ్లి తన బ్యాట్‌ను పంచ్ చేస్తూ పెవిలియన్‌కు చేరాడు. అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా కోహ్లి తన సహచరులతో దిగులుగా కూర్చోన్నాడు. ఊబికి వస్తున్న కన్నీరును ఆపునకుంటూ విరాట్ మ్యాచ్‌ను వీక్షించాడు. ఈ క్రమంలో భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. విరాట్ వద్దకు వెళ్లి భుజం తట్టి ఓదార్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 75 పరుగులు మాత్రమే చేశాడు. అందులో రెండు డక్‌లు కూడా ఉన్నాయి. Rahul dravid went to Virat as he was looking broken after that dismissal, can't see him like this man 💔 #INDvsENG pic.twitter.com/X0nPoSdF5s— a v i (@973Kohli) June 27, 2024 -
NCA: వీవీఎస్ లక్ష్మణ్ సైతం గుడ్‌బై!.. కారణం?
భారత క్రికెట్ మేనేజ్మెంట్లో మరో కీలక మార్పు చోటు చేసుకోనున్నట్లు సమాచారం. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ తన పదవి నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోనున్న సంగతి తెలిసిందే. నిజానికి వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత అతడి పదవీ కాలం ముగిసినప్పటికీ బీసీసీఐ అభ్యర్థన మేరకు ఈ టీ20 మెగా టోర్నీ పూర్తయ్యే వరకు అందుబాటులో ఉండేందుకు ద్రవిడ్ అంగీకరించాడు.ఈ క్రమంలో అతడి స్థానంలో బాధ్యతలు చేపట్టాల్సిందిగా వీవీఎస్ లక్ష్మణ్‌ను బోర్డు కోరగా అందుకు అతడు నిరాకరించాడనే వార్తలు వినిపించాయి. అనంతరం రేసులోకి దూసుకొచ్చిన మరో మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ప్రధాన కోచ్‌గా నియమితుడు కావడం దాదాపుగా ఖరారైపోయింది.కాగా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ బాస్‌గా ఉన్న సమయంలో 2021లో రాహుల్ ద్రవిడ్ టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టగా.. ఎన్సీఏ హెడ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ నియమితుడయ్యాడు.లక్ష్మణ్ పదవీకాలం ఈ ఏడాదితో ముగిసిపోనున్నట్లు సమాచారం. అయితే, కుటుంబానికి సమయం కేటాయించే క్రమంలో అతడు తన కాంట్రాక్టును పునరుద్ధరించుకునేందుకు సిద్ధంగా లేడని తెలుస్తోంది.ఎన్సీఏ హెడ్‌గా తప్పుకొన్న తర్వాత కామెంట్రీ చేయడంతో పాటు ఐపీఎల్ మెంటార్‌గా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా 2013- 2021 వరకు వీవీఎస్ లక్ష్మణ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్‌గా ఉన్న విషయం తెలిసిందే.కాగా ఎన్సీఏ చైర్మన్‌గా తన పదవీకాలంలో వీవీఎస్ లక్ష్మణ్ అబ్బాయిలు, అమ్మాయిల క్రికెట్లోని అన్ని కేటగిరీలపై దృష్టి సారించి జూనియర్ నుంచి సీనియర్ లెవల్ వరకు రాటుదేలేలా శిక్షణ ఇవ్వడంలో సఫలీకృతమయ్యాడని చెప్పవచ్చు. అదే విధంగా.. గాయపడిన ఆటగాళ్ల పునరావాసం, త్వరగా వాళ్లు కోలుకునేలా సహాయక సిబ్బందిని సరైన మార్గంలో నడిపించాడు. ఈ మేరకు ది టెలిగ్రాఫ్ తన కథనంలో పేర్కొంది.ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్-2024లో సెమీస్ బెర్తు లక్ష్యంగా ముందుకు సాగుతున్న రోహిత్ సేన.. సోమవారం నాటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. సెయింట్ లూసియాలోని డారెన్ సామీ జాతీయ క్రికెట్ స్టేడియం ఇందుకు వేదిక. చదవండి: కోహ్లి, రోహిత్‌లకు అదే ఆఖరి ఛాన్స్.. పట్టుబట్టిన గంభీర్! -
Ind vs Ban: అతడిపై వేటు.. సంజూకు ఛాన్స్!
టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో శుభారంభం చేసిన టీమిండియా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. తమ రెండో మ్యాచ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీస్ అవకాశాలను మెరుగుపరచుకోవాలని పట్టుదలగా ఉంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే రోహిత్ సేన నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చింది. అఫ్గనిస్తాన్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో విజయానంతరం.. మరుసటి రోజే ప్రాక్టీస్ సెషన్‌తో బిజీగా గడిపింది.ప్రత్యేకంగా ప్రాక్టీస్ఫామ్లేమితో సతమతమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా కూడా నెట్ సెషన్లో పాల్గొన్నట్లు సమాచారం. సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో శుక్రవారం జరిగిన సెషన్లో సంజూ శాంసన్‌తో రిజర్వ్ బౌలర్ ఖలీల్ అహ్మద్ ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా సంజూ శాంసన్ కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో దాదాపు రెండు గంటల పాటు నెట్ సెషన్లో పాల్గొన్నట్లు సమాచారం. సంజూ బ్యాటింగ్‌ను వీరిద్దరు పరిశీలించినట్లు రెవ్‌స్పోర్ట్స్ వెల్లడించింది.అతడిపై వేటు?ఈ నేపథ్యంలో... టోర్నీ ఆరంభం నుంచి బెంచ్‌కే పరిమితమైన సంజూ శాంసన్‌కు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివం దూబే స్థానంలో ఈ కేరళ బ్యాటర్‌ను తుదిజట్టులోకి తీసుకోనున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.హిట్టర్‌గా ఐపీఎల్-2024లో ఇరగదీసిన శివం దూబే వరల్డ్‌కప్-2024లో మాత్రం బ్యాట్ ఝులిపించలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి 44 పరుగులే చేశాడు. స్ట్రైక్‌రేటు 83.అందుకే సంజూకు లైన్ క్లియర్ఈ నేపథ్యంలో దూబేను తప్పించి సంజూకు మార్గం సుగమం చేయాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ తర్వాత టీమిండియా తదుపరి ఆస్ట్రేలియాతో తలపడనుంది.పటిష్ట ఆసీస్‌ను ఢీకొట్టేకంటే ముందే తుదిజట్టులో ఈ మేరకు మార్పులతో ప్రయోగం చేయాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. మిడిలార్డర్లో ఉన్న ఒకే ఒక్క లెఫ్టాండర్ బ్యాటర్ శివం దూబే విషయంలో టీమిండియా రిస్క్ చేయకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా అంటిగ్వాలోని వివియన్ రిచర్ట్స్ స్టేడియంలో శనివారం టీమిండియా- బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్ష సూచన ఉండటం ఆందోళనకరంగా పరిణమించింది.చదవండి: టీమిండియా స్టార్ పేసర్ రీ ఎంట్రీకి సిద్ధం.. ఆ సిరీస్ నాటికి!Barbados ✈️ Antigua #TeamIndia have arrived for today's Super 8 clash against Bangladesh 👌👌#T20WorldCup pic.twitter.com/RM54kEWP3W— BCCI (@BCCI) June 22, 2024 -
కొత్తగా చేయాల్సిందేమీ లేదు.. థాంక్యూ: ద్రవిడ్ కౌంటర్
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. బ్యాటర్‌గా తన ఆట తీరును గుర్తుచేస్తూ.. టీమిండియాను కించపరచాలని చూసిన జర్నలిస్టుకు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 లీగ్ మ్యాచ్‌లను అమెరికాలో ఆడిన టీమిండియా.. సూపర్-8 కోసం వెస్టిండీస్‌కు చేరుకుంది. ఇందులో భాగంగా గురువారం తొలి మ్యాచ్ ఆడనుంది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది.ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను తన ప్రశ్నలతో ఇరుకున పెట్టాలని ఓ జర్నలిస్టు ప్రయత్నించాడు. ఆటగాడిగా ఇదే వేదికపై ద్రవిడ్‌కు, టీమిండియాకు గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేశాడు.‘‘రాహుల్.. మీరు ఇక్కడ మ్యాచ్‌లు ఆడారు కదా. కానీ 97 టెస్టులో మీకంటూ గొప్ప జ్ఞాపకాలు ఏమీ లేవు’’ అని సదరు జర్నలిస్టు ద్రవిడ్‌తో అన్నాడు.ఇందుకు బదులిస్తూ.. ‘‘గీజ్.. ఈ ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు! ఇక్కడ నాకు కొన్ని మధుర జ్ఞాపకాలు కూడా ఉన్నాయి’’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు.అయితే, అంతటితో సంతృప్తి చెందని రిపోర్టర్.. ‘‘నేనూ అదే అంటున్నా. ఇక్కడ మీకున్న కాస్తో కూస్తో మంచి జ్ఞాపకాలను గొప్ప జ్ఞాపకాలుగా మార్చుకుంటారా?’’ అని ప్రశ్నించాడు.దీంతో సహనం కోల్పోయిన ద్రవిడ్.. ‘‘అన్నీ తెలిసిన వ్యక్తి కదా మీరు.. నేను ఇక్కడ కొత్తగా చేయాల్సిందేమీ లేదయ్యా. గతాన్ని మరిచి ముందుకు సాగడంలో నేను ముందుంటాను. వెనక్కి తిరిగి చూసుకుని.. పదే పదే గతాన్ని తవ్వుకోవడం నాకు అలవాటు లేదు.ప్రస్తుతం నేను ఏం చేస్తున్నాను, నా విధి ఏమిటన్న అంశాలపైనే దృష్టి పెడతాను. 97లో ఏం జరిగింది? ఆ తర్వాతి సంవత్సరంలో ఏం జరిగింది? అంటూ కూర్చోను.ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా ఇలాంటి ప్రశ్నలు రావచ్చు. మంచైనా.. చెడైనా.. రెండింటినీ సమంగా స్వీకరిస్తాను. ఆటగాడిగా ఉన్ననాటి విషయాల గురించి ఆలోచించే సమయమే లేదు. భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తా. ఈ మ్యాచ్ ఎలా గెలవాలన్న విషయం మీద మాత్రమే ఫోకస్ చేస్తా’’ అంటూ ద్రవిడ్ కౌంటర్ ఇచ్చాడు.కాగా 1997లో బార్బడోస్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో రాహుల్ ద్రవిడ్ రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 78, 2 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 38 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. నాటి విషయాన్ని గుర్తు చేస్తూ.. సదరు రిపోర్టర్ ద్రవిడ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయగా.. ఇలా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం... కోచ్‌గా జట్టును సరైన దిశలో నడపడం మాత్రమే తన తక్షణ కర్తవ్యమని సమాధానమిచ్చాడు. కాగా ఈ మెగా టోర్నీ తర్వాత ద్రవిడ్ హెడ్ కోచ్‌గా వైదొలగనున్న విషయం తెలిసిందే. అతడిస్థానంలో గౌతం గంభీర్ ఈ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.చదవండి: T20 WC 2024: అఫ్గాన్‌తో అంత ఈజీ కాదు.. కోహ్లి ఫామ్‌లోకి వస్తాడా? -
BCCI: ద్రవిడ్‌తో పాటు వాళ్లందరూ అవుట్! గంభీర్ కొత్త టీమ్?
టీమిండియా హెడ్‌కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ నియామకం ఖరారు కానుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇందుకు సంబంధించిన ప్రక్రియను మంగళవారం పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.రవిశాస్త్రి తర్వాత భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రవిడ్ పదవీకాలం వన్డే వరల్డ్‌కప్-2023 నాటికే ముగిసిపోయింది. అయితే, టీ20 ప్రపంచకప్-2024 పూర్తయ్యే వరకు కొనసాగమని బీసీసీఐ కోరగా.. ద్రవిడ్ అందుకు అంగీకరించినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి.గంభీర్ వైపే మొగ్గుఈ క్రమంలో బీసీసీఐ ద్రవిడ్ వారసుడి ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో గౌతం గంభీర్ వైపు మొగ్గుచూపిన బోర్డు పెద్దలు.. అతడితో సంప్రదింపులు జరిపినట్లు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.అందుకు అనుగుణంగానే గంభీర్ సైతం తాను టీమిండియా హెడ్‌కోచ్‌గా పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలపడం ఇందుకు బలాన్ని చేకూర్చింది. ఈ క్రమంలో గంభీర్ ఒక్కడే ఈ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోగా.. మంగళవారం ఇంటర్వ్యూకి అతడు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యులైన అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపె, సులక్షణ నాయక్‌లు గంభీర్‌ను జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం సహాయక సిబ్బందికి సంబంధించి.. గంభీర్ తన సొంత టీమ్‌ను ఎంచుకోనున్నట్లు సమాచారం.ద్రవిడ్‌తో పాటు వాళ్లంతా అవుట్!ద్రవిడ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్‌ల పదవీ కాలం ముగియనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరందరికి ఉద్వాసన పలికి.. గౌతం గంభీర్ కొత్త వాళ్లను తన టీమ్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ పేరు వినిపిస్తుండగా.. మిగతా కోచ్‌లు ఎవరన్న అంశం చర్చనీయంగా మారింది.ఇదిలా ఉంటే.. సలీల్ అంకోలా స్థానంలో కొత్త సెలక్టర్‌ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గంభీర్‌కు ఇంత వరకు కోచ్‌గా పనిచేసిన అనుభవం లేదు. అయితే, ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు మెంటార్‌గా వ్యవహరించాడు గంభీర్. తాజా సీజన్లో కోల్‌కతా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. -
టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్.. అధికారిక ప్రకటనకు ముహూర్తం ఖరారు
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ నెల (జూన్) చివరి వారంలో గంభీర్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ 2024తో పూర్తి కానున్న నేపథ్యంలో బీసీసీఐ అతి త్వరలోనే రాహుల్ వారసుడి పేరును ప్రకటించవచ్చని సమాచారం.ఒకవేళ ఇదే నిజమైతే 42 ఏళ్ల గంభీర్‌కు ఫుల్‌టైమ్ హెడ్ కోచ్‌గా ఇదే మొదటి బాధ్యత అవుతుంది. గంభీర్ గతంలో ఏ జట్టుకు ఫుల్‌టైమ్ హెడ్ కోచ్‌గా పని చేయలేదు. అయితే అతను మూడు సీజన్ల పాటు ఐపీఎల్లో మెంటార్‌గా వ్యవహరించాడు. 2022, 2023లో లక్నోతో.. 2024లో కేకేఆర్‌కు మెంటార్‌గా పని చేశాడు. గత ఐపీఎల్ సీజన్లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంతోనే గంభీర్‌కు టీమిండియా హెడ్ కోచ్‌గా అవకాశం వచ్చింది.టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్, మహేళ జయవర్దనే, జస్టిన్ లాంగర్ లాంటి పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ.. బీసీసీఐ గంభీర్వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది.బీసీసీఐకి చెందిన ఓ కీలక వ్యక్తి అందించిన సమాచారం మేరకు గంభీర్ తన సపోర్టింగ్ స్టాఫ్‌ను తనే ఎంచుకోనున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ గంభీర్ పెట్టిన ఈ షరతుకు బీసీసీఐ అంగీకరిస్తే ప్రస్తుతమున్న సపోర్టింగ్ స్టాఫ్ ద్రవిడ్‌తో పాటు తప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్‌గా పరస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్‌గా టి దిలీప్ ఉన్నారు.టీ20 వరల్డ్‌కప్ 2024 తర్వాత భారత్ జింబాబ్వే, శ్రీలంక పర్యటనలకు వెళ్లాల్సి ఉంది. గంభీర్ కోచ్‌గా నియమితుడైతే జింబాబ్వే పర్యటన నుంచే అతని విధులు మొదలవుతాయి. జులై 6 నుంచి 14 మధ్యలో జరిగే జింబాబ్వే పర్యటనలో భారత్ ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. -
అమెరికా-పాక్ థ్రిల్లింగ్ సూపర్ ఓవర్.. ఫాలో అయిన ద్రవిడ్
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా డల్లాస్ వేదికగా అమెరికా-పాకిస్తాన్ మధ్య జరిగన మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. సూపర్ ఓవరకు దారితీసిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఆతిథ్య అమెరికా చిత్తు చేసింది.యావత్తు క్రికెట్ ప్రపంచం తమ వైపు చూసేలా యూఎస్ఎ అద్బుతమైన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 159/7 స్కోరు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో యూఎస్ఏ కూడా 159/3 స్కోరుతో నిలిచింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. సూపర్ ఓవర్లో మొదటి బ్యాటింగ్ చేసిన అమెరికా 18 పరుగులు చేయగా.. పాక్ 13 పరుగులు మాత్రమే చేసింది. ఇక అమెరికా-పాక్ మధ్య జరిగిన ఈ థ్రిల్లింగ్ పోరుకు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఆకర్షితుడయ్యాడు. న్యూయర్క్‌లో సబ్వేలో ద్రవిడ్ ప్రయాణిస్తూ ఇరు జట్ల మధ్య జరిగిన సూపర్ ఓవర్ బాల్ టూ బాల్‌ను తన ఫోన్లో ఫాలోయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.Rahul Dravid following the Super Over of Pakistan vs USA on Espn Cricinfo. [📸: Vishal Misra] pic.twitter.com/eanrXe6my6— Johns. (@CricCrazyJohns) June 6, 2024 -
BCCI: అందుకే తప్పుకొంటున్నా.. ద్రవిడ్ ఫస్ట్ రియాక్షన్
టీమిండియా ప్రధాన కోచ్‌గా తాను కొనసాగబోవడం లేదని రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ కోచ్‌గా తన కెరీర్లో చివరిదని పేర్కొన్నాడు. ఏదేమైనా భారత జట్టు మార్గదర్శకుడిగా వ్యవహరించడం తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని ఈ మాజీ కెప్టెన్ హర్షం వ్యక్తం చేశాడు.కాగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత ద్రవిడ్ పదవీ కాలం ముగిసినప్పటికీ ఈ మెగా ఈవెంట్ కోసం కొనసాగమని బీసీసీఐ అతడిని కోరిన విషయం తెలిసిందే. ఇందుకు అంగీకరించిన ద్రవిడ్ ప్రస్తుతం టీమిండియాతో కలిసి అమెరికాకు వెళ్లాడు.అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్య ఇస్తున్న వరల్డ్‌కప్-2024 జూన్ 1న మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూన్ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనున్న తరుణంలో రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు.ఈ సందర్భంగా.. ‘‘ప్రతి టోర్నమెంట్ నాకు ముఖ్యమైనదే. టీమిండియా కోచ్‌గా ప్రతి మ్యాచ్‌లోనూ పూర్తి ఎఫర్ట్ పెట్టాను. టీ20 వరల్డ్‌కప్ కూడా అంతే. అయితే, నేను ఇన్చార్జ్గా ఉన్న సమయంలో ఇదే ఆఖరిది కాబట్టి మరింత ప్రాముఖ్యం ఏర్పడింది.నా పనిని పూర్తి నిష్ఠగా.. ప్రేమతో చేశాను. టీమిండియాకు కోచింగ్ ఇవ్వడం అనేది నా కెరీర్లో ఎంతో ప్రత్యేకమైనది. గొప్ప ఆటగాళ్లున్ను జట్టుతో పని చేయడాన్ని పూర్తిగా ఆస్వాదించాను.అయితే, బిజీ షెడ్యూల్స్, పని ఒత్తిడి కారణంగా తిరిగి ఈ జాబ్‌కు తిరిగి అప్లై చేయాలనుకోవడం లేదు’’ అంటూ తాను హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పుకొనేందుకు సిద్ధమైనట్లు రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు.కాగా ద్రవిడ్ స్థానంలో గౌతం గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్‌గా వస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. గౌతీ సైతం తాను ఈ గౌరవప్రదమైన బాధ్యతను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పడం గమనార్హం. -
ట్రోఫీ గెలిచే వ్యూహాలే లేవు.. ఇకనైనా: ద్రవిడ్‌పై లారా వ్యాఖ్యలు
టీమిండియాను ఉద్దేశించి వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ ఈవెంట్లలో లీగ్ దశలో రాణిస్తున్నా.. సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే భారత జట్టు నాకౌట్ మ్యాచ్‌లలో తేలిపోతోందన్నాడు.జట్టులో ఎంత మంది సూపర్స్టార్లు ఉన్నా టైటిల్ గెలవకపోతే ఏం లాభమని పెదవి విరిచాడు. కనీసం ఈసారైనా బలహీనతలు అధిగమించి వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచేలా వ్యూహాలు రచించాలని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు లారా సూచించాడు.పదకొండేళ్లుగా నిరీక్షణకాగా మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007లో టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్, చాంపియన్స్ ట్రోఫీ-2013 గెలిచిన టీమిండియా.. మళ్లీ ఇప్పటి వరకు ఐసీసీ టైటిల్ నెగ్గలేదు. పదకొండేళ్లుగా నిరీక్షణ కొనసాగుతూనే ఉంది.ఇక హెడ్‌కోచ్‌గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత జట్టు టీ20 ప్రపంచకప్-2022లో సెమీస్‌లో నిష్క్రమించగా.. వన్డే వరల్డ్‌కప్-2023లో ఫైనల్లో ఓడిపోయింది. ఈ రెండు సందర్భాల్లోనూ రోహిత్ సేన స్థాయికి తగ్గట్లు రాణించలేక టైటిల్ వేటలో వెనుకబడింది.మరో అవకాశంఈ నేపథ్యంలో కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, టీ20 ప్రపంచకప్-2024 రూపంలో వీరిద్దరు తమను తాము నిరూపించుకునే మరో అవకాశం వచ్చింది. జూన్ 1 నుంచి మొదలయ్యే ఈ మెగా టోర్నీ నేపథ్యంలో బ్రియన్ లారా కీలక వ్యాఖ్యలు చేశాడు.వ్యూహాలే లేవుటీమిండియాను కలవరపెడుతున్న అంశాలేమిటి అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘గత టీ20, వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్లలో భారత జట్టును గమనిస్తే.. వారి వద్ద టోర్నీలో ముందుకు సాగేందుకు సరైన ప్రణాళికలు లేవని అనిపించింది.మీ దగ్గర వరల్డ్‌కప్ గెలిచే వ్యూహాలు లేనపుడు.. జట్టులో ఎంత మంది సూపర్స్టార్లు ఉంటే ఏం లాభం? ఎలా బ్యాటింగ్ చేయాలి? ప్రత్యర్థిని ఎలా అటాక్ చేయాలి అన్న విషయాలపై స్పష్టత ఉండాలి కదా!ఈసారైనా ద్రవిడ్ఈసారి రాహుల్ ద్రవిడ్ తమ ప్లేయర్లందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి.. ప్రపంచకప్ గెలిచే ప్లాన్ చేస్తాడనే ఆశిస్తున్నా’’ అని లారా ఐసీసీ ఈవెంట్లో చెప్పుకొచ్చాడు. కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ వరల్డ్‌కప్ టోర్నీలో.. టీమిండియా జూన్ 5న ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: WC: పక్కా టీ20 టైప్.. న్యూయార్క్ పిచ్ వెనుక ఇంత కథ ఉందా? ద్రవిడ్‌తో కలిసి View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
ఫోటో అడిగిన అభిమాని.. వర్షంలో పరిగెత్తిన రోహిత్! వీడియో వైరల్
టీ20 వరల్డ్‌కప్-2024కు టీమిండియా సిద్దమవుతోంది. ఇప్పటికే అమెరికా చేరుకున్న భారత జట్టు తమ ప్రాక్టీస్‌ను కూడా మొదలు పెట్టేసింది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తమ సన్నాహక శిబరాన్ని భారత జట్టు ఏర్పాటు చేసుకుంది.అయితే ప్రాక్టీస్ లేని సమయంలో భారత ఆటగాళ్లు న్యూయార్క్ సీటీలో చక్కెరల్లు కొడుతున్నారు. ఈ క్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ బుధవారం న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వీధుల్లో ఎంజాయ్ చేస్తూ కన్పించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. షాపింగ్‌కు వెళ్లిన ద్రవిడ్, రోహిత్ భారీ వర్షంలో చిక్కుకున్నారు. భారీ వర్షం కురుస్తుండంతో రోహిత్, ద్రవిడ్ ఇద్దరూ ఓ షాప్‌లో ఉండిపోయారు. ఈ క్రమంలో ఓ అభిమాని రోహిత్ దగ్గరకు వచ్చి ఫోటో కావాలని అడగగా.. హిట్‌మ్యాన్ అందుకు నిరాకరించాడు. "నో ఫోటో, బయట భారీ వర్షం పడుతోంది" అంటూ రోహిత్ సమాధనమిచ్చాడు.వెంటనే కారు తీసుకురావలంటూ డ్రైవర్‌ను రోహిత్ సూచించాడు. కుండపోత వర్షం పడుతుండగానే రోహిత్, ద్రవిడ్ ఇద్దరూ కారు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారు. పాపం వారిద్దరితో ఫోటో కోసం ఎదురు చూసిన సదరు అభిమానికి నిరాశే ఎదురైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. భారత తమ తొలి మ్యాచ్‌లో జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడనుంది. Team India spotted in New York. Wait for Rohit Sharma’s sprint. 😂 pic.twitter.com/QlfPlSSLAW— Vipin Tiwari (@Vipintiwari952_) May 29, 2024 -
టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ పేరు ఖరారు.. త్వరలోనే ప్రకటన..?
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు ఖరారైనట్లు తెలుస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. భారత్ హెడ్ కోచ్ పదవిపై ఆసక్తి ఉన్నట్లు గంభీర్ స్వయంగా సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు ఓ ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ పేర్కొంది. గంభీర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ అయిన షారుఖ్ ఖాన్‌కు కూడా ఈ విషయం తెలుసని సదరు వెబ్సైట్ వెల్లడించింది. హెడ్ కోచ్ పదవికి గంభీర్ దరఖాస్తు చేశాడా లేదా అనే విషయంపై స్పష్టత లేనప్పటికీ ఈ విషయం ముమ్మాటికి నిజమేనని సోషల్‌మీడియా సైతం కోడై కూస్తుంది. ఇదే విషయాన్ని ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ కూడా స్పష్టం చేశాడని తెలుస్తుంది. బీసీసీఐ కార్యదర్శి జై షా, గంభీర్ల మధ్య డీల్ కుదిరిందని.. ఈ విషయమై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని సదరు ఫ్రాంచైజీ ఓనర్ చెప్పినట్లు సమాచారం. రెండ్రోజుల కిందట ముగిసిన ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ఈ డీల్ క్లోజ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ ఫైనల్ ముగిశాక గంభీర్-జై షా చాలాసేపు బహిరంగంగా డిస్కస్ చేసుకోవడం జనమంతా చూశారు. ఆ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ పదవిపైనే చర్చ జరిగినట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వస్తే కాని ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది. టీ20 వరల్డ్‌కప్ 2024తో భారత హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తవుతుంది. ద్రవిడ్ పదవి వీడేందుకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో అతి త్వరలోనే ప్రకటన వెలువడేందుకు ఆస్కారం ఉంది. టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. కాగా, గంభీర్ మెంటార్షిప్లో కేకేఆర్ ఈ ఏడాది ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. పదేళ్లకు ముందు ఇదే గంభీర్ కెప్టెన్‌గా కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అంతకు రెండేళ్ల ముందు కూడా గంభీర్ ఓసారి కేకేఆర్‌కు టైటిల్ అందించాడు. ఘనమైన ట్రాక్ రికార్డుతో పాటు దేశం పట్ల గంభీర్‌కు ఉన్న కమిట్మెంట్ భారత్ హెడ్ కోచ్ పదవి రేసులో అతన్ని ముందుంచుతుంది. -
ముగిసిన డెడ్ లైన్.. భారత కొత్త హెడ్ కోచ్ ఎవరో?
టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం టీ20 ప్రపంచకప్-2024తో ముగియున్న సంగతి తెలిసిందే. దీంతో కొత్త కోచ్‌ను భర్తీ చేసే పనిలో బీసీసీఐ పడింది. అయితే భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి ధరఖాస్తు చేసుకునేందుకు గడువు సోమవారం(మే 27) సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది.కాగా ధరఖాస్తులను బీసీసీఐ స్వీకరించినప్పటకి..కొత్త హెడ్ కోచ్‌ను ఎంపిక చేసేందుకు మరింత సమయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే టీమిండియా హెడ్‌కోచ్ పదవికి విదేశీయులెవరూ దరఖాస్తు చేసుకోలేదని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తొలుత ఆస్ట్రేలియా దిగ్గజాలు జస్టిన్ లాంగర్, రికీ పాంటింగ్ పేర్లు వినిపించినప్పటికి.. వారవ్వరూ హెడ్‌కోచ్ పదవికి ఆప్లై చేసేందుకు ఆసక్తి చూపలేదని బీసీసీఐ మాలాలు వెల్లడించాయి. నో చెప్పిన వీవీఎస్ లక్ష్మణ్..!కాగా భారత హెడ్ కోచ్ రేసులోప్రధానంగా దిగ్గజ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం హెడ్‌కోచ్ పోస్ట్ కోసం దరఖాస్తు చేయలేదంట. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) డైరెక్టర్‌గా ఉన్న లక్ష్మణ్‌కు పూర్తి స్ధాయి హెడ్‌కోచ్ పదవిపై ఆసక్తి లేనిట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. టీమిండియా హెడ్ కోచ్ ఎంపికైతే జట్టుతో పాటు 10 నెలల పాటు కలిసి ప్రయాణం చేయాలి. ఈ క్రమంలోనే లక్ష్మణ్ ప్రధాన కోచ్ పదవి వైపు మొగ్గు చూపకపోయినట్లు తెలుస్తోంది. గంభీర్ కోచ్ అవుతాడా? ఇక వీవీఎస్ లక్ష్మణ్ హెడ్‌కోచ్ బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించడంతో ద్రవిడ్ వారుసుడుగా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే బీసీసీఐ పెద్దలు గంభీర్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా ఒక క్లారిటీ రాలేదు. గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్నాడు. ఐపీఎల్-2024లో అతడి నేతృత్వంలోనే కేకేఆర్ ఛాంపియన్స్‌గా నిలిచింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును వీడి గౌతీ వస్తాడా అనే విషయం సందిగ్ధంగా ఉంది. -
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్.. కానీ ఒకే ఒక కండీషన్!?
టీమిండియా కొత్త హెడ్ కోచ్ కోసం బీసీసీఐ వేటను మొదులెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ధరఖాస్తులను సైతం బీసీసీఐ అహ్హనించింది. హెడ్ కోచ్ పదవికి ధరఖాస్తు చేసుకునేందుకు మే 27 సాయంత్రం ఆరు గంటలతో గడువు ముగియునుంది. ఈ క్రమంలో హెడ్‌కోచ్ రేసులో గౌతం గంభీర్, రికీ పాంటింగ్, వీవీఎస్ లక్ష్మణ్,జస్టిన్ లాంగర్, స్టీఫెన్ ఫ్లెమింగ్ వంటి దిగ్గజ క్రికెటర్ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే బీసీసీఐ పెద్దలు మాత్రం భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కాగా దైనిక్ జాగరణ్ రిపోర్ట్ ప్రకారం.. గంభీర్ కూడా భారత ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హెడ్‌కోచ్ పదవికి ధరఖాస్తు చేసేముందు గంభీర్ బీసీసీఐకు ఒక కండీషన్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'సెలక్షన్ గ్యారెంటీ' ఇస్తేనే హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేస్తానని బీసీసీఐతో గంభీర్ చెప్పినట్లు దైనిక్ జాగరణ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. అందుకు బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నిల్ ఇచ్చినట్లు వినికిడి. ప్రస్తుత సమాచారం ప్రకారం ద్రవిడ్ వారసుడిగా గంభీర్ బాధ్యతలు చెపట్టడం దాదాపు ఖాయమన్పిస్తోంది. కాగా గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్నాడు. ఆదివారం జరగనున్న ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కేకేఆర్ తలపడనుంది. -
టీమిండియా హెడ్ కోచ్‌గా డివిలియర్స్?.. హింట్ ఇచ్చిన ఏబీడీ
రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ ఎవరన్న అంశంపై క్రికెట్ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది. ఈ పదవి కోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. విదేశీ కోచ్‌లకు కూడా తలుపు తెరిచే ఉన్నాయంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేయడంతో పలువురు మాజీ క్రికెటర్ల పేర్లు తెరమీదకు వచ్చాయి.ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం రిక్కీ పాంటింగ్, మాజీ కోచ్ జస్టిన్ లాంగర్, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్టీఫెన్ ఫ్లెమింగ్, ఆర్సీబీ కోచ్ ఆండీ ఫ్లవర్ తదితరులు టీమిండియా హెడ్‌కోచ్ రేసులో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, రిక్కీ, లాంగర్ తాము ఈ పదవి పట్ల ఆసక్తిగా లేమని చెప్పగా.. జై షా సైతం తాము ఎవరికీ ఇంకా ఆఫర్ ఇవ్వలేదంటూ కౌంటర్ ఇచ్చాడు.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టీమిండియా హెడ్ కోచ్‌గా ఆఫర్ వస్తే ఏం చేస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘నాకైతే ఈ విషయం గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచనా లేదు.అయితే, ఏదేని జట్టుకు కోచింగ్ ఇవ్వడాన్ని నేను పూర్తిగా ఆస్వాదిస్తాను. అదే సమయంలో.. నన్ను ఇబ్బంది పెట్టే అంశాలు కూడా కొన్ని ఉంటాయన్న విషయం మర్చిపోవద్దు.నాకు తెలియని విషయాలను కూడా త్వరత్వరగా నేర్చుకోవాల్సి ఉంటుంది. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది. భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు. కోచ్‌గా ఉండటానికి నాకెలాంటి అభ్యంతరం లేదు.40 ఏళ్ల వయసులో.. ఇప్పుడు నేను పూర్తి పరిణతి చెందిన వ్యక్తిని. నా కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమేం జరిగాయో అన్న దానిపై మరింత స్పష్టత వచ్చింది. చాలా పాఠాలు నేర్చుకున్నాను.కొంత మంది యువ ఆటగాళ్లకు.. మరికొంత మంది సీనియర్లకు కూడా నా అనుభవం ఉపయోగపడవచ్చు. కొంత మంది ఆటగాళ్లతో.. కొన్ని జట్లతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.కానీ పూర్తిస్థాయిలో హెడ్ కోచ్‌గా ఉండేందుకు ఇది సరైన సమయం కాదనుకుంటున్నా. ఈ విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నా. అయితే, ముందుగా చెప్పినట్లు కోచ్ మారడానికి నేనెప్పుడూ నో చెప్పను. పరిస్థితులు మారుతూనే ఉంటాయి కదా!’’ అని ఏబీ డివిలియర్స్ న్యూస్18తో పేర్కొన్నాడు.భవిష్యత్తులో తనను కోచ్ అవతారంలో తప్పక చూస్తారనే సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఏబీ డీ అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడో ఎందుకు ఇప్పుడే టీమిండియా హెడ్‌కోచ్‌గా వచ్చేయమంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు.. ఆర్సీబీ ఫ్యాన్స్ సైతం వచ్చే ఏడాది డివిలియర్స్ తమ బెంగళూరు జట్టుకు మెంటార్‌గా రావడం ఖాయమని ఫిక్సయిపోతున్నారు.చదవండి: SRH Captain Pat Cummins: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్.. ఇంకొక్క అడుగు -
BCCI: అవన్నీ అబద్ధాలే: ఆసీస్ మాజీలకు జై షా కౌంటర్
టీమిండియా కొత్త హెడ్ కోచ్ విషయంలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా కొట్టిపారేశారు. ఈ బాధ్యతలు స్వీకరించాల్సిందిగా తాము ఇంత వరకు ఎవరినీ సంప్రదించలేదని స్పష్టం చేశారు.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రాహుల్ ద్రవిడ్ భారత జట్టు ప్రధాన కోచ్‌గా పదవీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ అతడి వారసుడిని ఎంపిక చేసే క్రమంలో దరఖాస్తులు ఆహ్వానించింది. విదేశీ కోచ్‌ల పేర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.హెడ్ కోచ్ రేసులోఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు రిక్కీ పాంటింగ్, జస్టిన్ లాంగర్ సహా న్యూజిలాండ్ మాజీ ఆటగాడు స్టీఫెన్ ఫ్లెమింగ్, శ్రీలంక లెజెండ్ మహేళ జయవర్ధనే తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో రిక్కీ పాంటింగ్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. బీసీసీఐ తనకు ఆఫర్ ఇచ్చినా తిరస్కరించానని పేర్కొన్నాడు. మరోవైపు.. జస్టిన్ లాంగర్ సైతం కేఎల్ రాహుల్ తన కళ్లు తెరిపించాడంటూ టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం తాను అప్లై చేసుకోనని పరోక్షంగా వెల్లడించాడు.వాళ్లకు మేమే ఆఫర్ ఇవ్వలేదురిక్కీ పాంటింగ్, జస్టిన్ లాంగర్ వ్యాఖ్యలపై బీసీసీఐ కార్యదర్శి జై షా తాజాగా స్పందించారు. ‘‘టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం నేను గానీ, బీసీసీఐ గానీ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లెవరికీ ఆఫర్ చేయలేదు.మీడియా వస్తున్న వార్తలన్నీ నిజం కాదు. జాతీయ జట్టు కోసం సరైన కోచ్‌ను ఎంపిక చేసుకోవడం క్లిష్టతరమైన ప్రక్రియ. భారత క్రికెట్ స్వరూపాన్ని చక్కగా అర్థం చేసుకోగల వ్యక్తుల కోసం అన్వేషిస్తున్నాం.పూర్తి అవగాహన ఉన్నవాళ్లకే ప్రాధాన్యంటీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్నవారికి భారత దేశవాళీ క్రికెట్ గురించి, ఆటగాళ్ల గురించి పూర్తి అవగాహన ఉండాలి. అలాంటి వాళ్ల కోసమే మేము ఎదురుచూస్తున్నాం.భారత జట్టు ప్రధాన కోచ్‌గా ఉండటం కంటే అంతర్జాతీయ క్రికెట్లో ప్రతిష్టాత్మకమైన పదవి ఇంకోటి ఉంటుందని అనుకోను. ప్రపంచవ్యాప్తంగా టీమిండియాకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. భారత క్రికెట్ చరిత్ర, ఔన్నత్యం.. ఆట పట్ల మా అంకితభావం.. అన్నీ వెరసి ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయిలో ఉన్నాం.ఇలాంటి చోట జాబ్ చేయడం కంటే గొప్ప విషయం ఏముంటుంది?. ఇలాంటి జట్టుకు గురువుగా బాధ్యతలు నిర్వర్తించే సరైన వ్యక్తి కోసం మేము జల్లెడపట్టాల్సి ఉంటుంది’’ అని జై షా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో వ్యాఖ్యానించారు. చదవండి: SRH vs RR: అతడి మీదే భారం.. అలా అయితేనే సన్‌రైజర్స్ ముందుకు -
టీమిండియా హెడ్‌కోచ్‌గా అతడే సరైనోడు!
భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ వేటలో ఉంది. టీ20 ప్రపంచకప్-2024 ముగిసే నాటికి రాహుల్ ద్రవిడ్ వారసుడిని ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ పేసర్ వసీం అక్రం టీమిండియా హెడ్‌కోచ్‌గా పనిచేయడానికి సరైన వ్యక్తి ఇతడేనంటూ ఓ మాజీ క్రికెటర్ పేరును ప్రతిపాదించాడు. ఇంతకీ అతడు ఎవరు?..టీ20 వరల్డ్‌కప్-2021 తర్వాత రవిశాస్త్రి హెడ్‌కోచ్ పదవి నుంచి వైదొలగగా.. టీమిండియా మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. ద్రవిడ్ మార్గదర్శనంలో టీమిండియా మూడు ఫార్మాట్లలో నంబర్ వన్‌గా నిలిచింది.అయితే, టీ20 ప్రపంచకప్-2022, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్, వన్డే వరల్డ్‌కప్-2023లో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. పొట్టి ప్రపంచకప్‌లో సెమీస్‌లోనే నిష్క్రమించిన రోహిత్ సేన.. టెస్టు చాంపియన్‌షిప్, వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో రెండుసార్లు ఆస్ట్రేలియా చేతిలో చిత్తైంది.ఇక వన్డే వరల్డ్‌కప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగిసినప్పటికీ పొట్టి ప్రపంచకప్ నేపథ్యంలో అతడిని కొనసాగాల్సిందిగా బీసీసీఐ కోరింది. అయితే, ఈ మెగా టోర్నీ అనంతరం అతడు తన పదవి నుంచి తప్పుకోనుండగా.. అభ్యర్థుల కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది.మరోవైపు.. విదేశీ కోచ్‌ల నియామకానికి బీసీసీఐ సుముఖంగా ఉందన్న వార్తల నేపథ్యంలో స్టీఫెన్ ఫ్లెమింగ్, జస్టిన్ లాంగర్, రిక్కీ పాంటింగ్ తదితరుల పేర్లు తెరమీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో వసీం అక్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘‘టీమిండియా హెడ్‌కోచ్‌గా అత్యుత్తమ వ్యక్తి ఎవరంటే గౌతం గంభీర్ అనే చెప్తా. గౌతం ఈ బాధ్యతను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా అనేది అతడి ఇష్టం.నిజానికి గౌతం ఇప్పుడు రాజకీయాలు కూడా వదిలేశాడు. తన కుటుంబానికి సమయం కేటాయించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక హెడ్‌కోచ్ విషయానికొస్తే.. ఎప్పుడూ బిజీ షెడ్యూల్ ఉంటుంది. కాబట్టి తను ఇది ఎంచుకుంటాడా లేదా అన్నది చూడాలి.గౌతం గంభీర్ చాలా సింపుల్‌గా ఉంటాడు. తాను చెప్పాలనుకున్నది ఏదైనా సరే.. రెండో మాటకు తావులేకుండా సూటిగా చెప్తాడు. నిజానికి టీమిండియా క్రికెట్ కల్చర్‌కు ఇది విరుద్ధం.కానీ గంభీర్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటాడు. ఏదేనా ముఖం మీదే చెప్పేస్తాడు. అతడికి దూకుడు ఎక్కువ. జట్టును కూడా తనలాగే అగ్రెసివ్‌గా తయారుచేయగలడు. నిజంగా తను కోచ్‌గా వస్తే బాగుంటుంది. కానీ అందుకు అతడు ఒప్పుకొంటాడో లేదో?!’’ అని వసీం అక్రం స్పోర్ట్స్‌కీడాతో పేర్కొన్నాడు.కాగా గంభీర్ ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా ఉన్నాడు. ఈ ఏడాది కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇక కేకేఆర్ ఇప్పటికే ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. -
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై హర్భజన్ ఆసక్తి..?
టీ20 ప్రపంచకప్-2024 ముగిసిన తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెడ్‌కోచ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను సైతం ఆహ్వానించింది.మే 27 సాయంత్రం ఆరు గంటలలోపు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. టీమిండియా హెడ్‌కోచ్ రేసులో మాజీ క్రికెటర్లు జస్టిన్ లాంగర్, గౌతం గంభీర్, స్టీఫెన్ ఫ్లెమింగ్, పాంటింగ్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు అవకాశం లభిస్తే టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు భజ్జీ తెలిపాడు.భారత హెడ్‌కోచ్ పదవికి నేను దరఖాస్తు చేస్తానో లేదో నాకు తెలియదు. కానీ, టీమిండియాకు కోచింగ్ అనేది మ్యాన్ మేనేజ్మెంట్. భారత ఆటగాళ్లకు క్రికెట్ గురించి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు. క్రికెట్ ఎలా ఆడాలో వారికి బాగా తెలుసు. వారికి మార్గదర్శకత్వంగా ఉంటే చాలు. నాకు క్రికెట్ ఎంతో ఇచ్చింది. కోచ్ రూపంలో ఎంతోకొంత తిరిగి ఇచ్చే అవకాశం వస్తే సంతోషిస్తా" అని ఓ స్పోర్ట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ పేర్కొన్నాడు. -
టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్..!
టీ20 వరల్డ్‌కప్-2024 తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనున్న విషయం విధితమే. భారత హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులను సైతం ఆహ్వానించింది. మే 27 లోపు హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే భారత హెడ్‌కోచ్ రేసులో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన కోచ్‌గా ఉండాలని గంభీర్‌ను బీసీసీఐ కోరినట్లు సమాచారం. గంభీర్ ప్రస్తుతం కేకేఆర్ జట్టుకు గంభీర్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్-2024 సీజన్ ముగిసిన తర్వాత గంభీర్‌తో బీసీసీఐ పూర్తి స్ధాయి చర్చలు జరపనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. గంభీర్ గతంలో ఎప్పుడూ కోచ్‌గా పనిచేయనప్పటికి మెంటార్‌గా మాత్రం అపారమైన అనుభవం ఉంది. ప్రస్తుతం కేకేఆర్‌తో పాటు గతంలో రెండు సీజన్ల పాటు లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా కూడా గంభీర్ పనిచేశాడు. ప్రస్తుతం అతడు మెంటార్‌గా ఉన్న కోల్‌కతా అద్భుత ఆటతో ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. కెప్టెన్‌గా కూడా కేకేఆర్‌కు రెండు సార్లు టైటిల్‌ను గౌతీ అందించాడు. అంతేకాకుండా ఆటగాడిగా గంభీర్ తనదైన ముద్ర వేసుకున్నాడు. ఈ క్రమంలోనే గౌతీకి భారత హెడ్‌కోచ్ బాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు వినికిడి. -
BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా వాళ్లిద్దరిలో ఒకరు?
భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టుకు కొత్త హెడ్ కోచ్‌ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ అత్యున్నత పదవి కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆసక్తిగలవారు ఈనెల 27వ తేదీలోపు తమ దరఖాస్తులు పంపించాలి.ఎంపికైన కొత్త హెడ్ కోచ్ పదవీకాలం మూడేన్నరేళ్లపాటు (1 జూలై 2024 నుంచి 31 డిసెంబర్ 2027 వరకు) ఉంటుంది. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం గత ఏడాది నవంబర్‌లో వన్డే వరల్డ్‌కప్ అనంతరం ముగిసింది.అయితే టి20 ప్రపంచకప్ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ ముగిసేవరకు టీమిండియాకు తాత్కాలిక కోచ్‌గా కొనసాగాలని బీసీసీఐ కోరడంతో ద్రవిడ్ అంగీకరించాడు. ఈ నేపథ్యంలో కొత్త హెడ్ కోచ్ పదవి కోసం ద్రవిడ్ కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. నో చెప్పిన ద్రవిడ్అయితే, ఇందుకు ద్రవిడ్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. మరికొంత కాలం పాటు అతడిని కోచ్‌గా కొనసాగాలని టీమిండియా ప్రధాన ఆటగాళ్లలో కొందరు అభ్యర్థించినట్లు సమాచారం. కనీసం టెస్టు జట్టుకైనా ద్రవిడ్ మార్గదర్శకుడిగా ఉంటే బాగుంటుందని వారు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.కానీ వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌ల నియామకంపై క్రికెట్ అడ్వైజరీ కమిటీదే తుది నిర్ణయం అని.. ఏదేమైనా ఇలాంటి ప్రతిపాదనలు ఆమోదం పొందకపోవచ్చని జై షా ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. మరోవైపు.. రాహుల్ ద్రవిడ్ సైతం హెడ్ కోచ్ పదవికి గుడ్‌బై చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.లక్ష్మణ్‌కు ఆ ఛాన్స్ లేదుమరోవైపు.. ద్రవిడ్ గైర్హాజరీలో టీమిండియా కోచ్‌గా వ్యవహరించిన వీవీఎస్ లక్ష్మణ్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ పనులతో బిజీగా ఉన్నాడు. అయితే, బీసీసీఐ అతడిని అక్కడి నుంచి కదిలించేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.ఫ్లెమింగ్ లేదంటే రిక్కీ పాంటింగ్?ఈ నేపథ్యంలో.. ఈసారి విదేశీ కోచ్‌ను రంగంలోకి తీసుకువచ్చేందుకు బీసీసీఐ సుముఖంగానే ఉన్నట్లు జై షా హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరును బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు వార్తలు రాగా.. మరో పేరు కూడా తెర మీదకు వచ్చింది.ఆస్ట్రేలియా దిగ్గజ సారథి రిక్కీ పాంటింగ్ కూడా టీమిండియా హెడ్‌కోచ్ పదవి రేసులో ఉన్నాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా వీరిద్దరు ప్రస్తుతం ఐపీఎల్ జట్లకు హెడ్కోచ్లుగా ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆ జట్టును ఐదుసార్లు విజేతగా నిలపడంలో కృషి చేయగా.. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్(ప్రస్తుతం) జట్లకు కోచ్‌గా పనిచేసిన అనుభవం పాంటింగ్‌కు ఉంది.అది సాధ్యం కాదన్న పాంటింగ్అయితే, వీళ్లిద్దరు కూడా టీమిండియా హెడ్‌కోచ్ పదవి చేపట్టేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఎందుకంటే వరుస సిరీస్‌లతో బిజీగా ఉండే టీమిండియా కోసం కోచ్ ఏడాదిలో దాదాపు 10 నెలల పాటు అంకితం కావాల్సి ఉంటుంది.కాబట్టి కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే వీలుండదు. అందుకే భారత జట్టు హెడ్‌కోచ్ పదవి ఆఫర్ వచ్చినా తాను చేపట్టలేదని రిక్కీ పాంటింగ్ గతం(2021)లో వెల్లడించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా కొత్త కోచ్‌గా ఎవరు వస్తారో? అంటూ క్రికెట్ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది.చదవండి: సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్ -
మళ్లీ హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి?
టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను మరోసారి ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. అయితే, ఇందులో ఓ ట్విస్టు ఉంది.భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి 2017- 2021 మధ్య టీమిండియా హెడ్ కోచ్‌గా పనిచేశాడు. అతడి మార్గదర్శనంలో.. విరాట్ కోహ్లి కెప్టెన్సీలో భారత జట్టు పలు చిరస్మరణీయ విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలవడంసహా నంబర్ వన్ జట్టుగా ఎదిగింది.అయితే, వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క ఐసీసీ టైటిల్ కూడా నెగ్గలేకపోయింది టీమిండియా. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2021 తర్వాత రవిశాస్త్రి పదవీకాలం ముగియగా.. కెప్టెన్‌గా విరాట్ కోహ్లి యుగానికి తెరపడింది. ఈ క్రమంలో కోహ్లి రోహిత్ శర్మ సారథ్యంలో ఆటగాడిగా కొనసాగుతుండగా.. రవిశాస్త్రి తిరిగి కామెంటేటర్‌గా మారాడు.ఈ నేపథ్యంలో తాజాగా రవిచంద్రన్ అశ్విన్‌తో మాట్లాడుతూ రవిశాస్త్రి.. హెడ్‌కోచ్‌గా పనిచేయడంపై తనకున్న ఆసక్తిని వివరించాడు. భవిష్యత్తులో తాను ఐపీఎల్ జట్టు కోచ్‌గా పనిచేసే అవకాశాలను కొట్టిపారేయలేనని తెలిపాడు.భారత్‌లో ఎంతో మంది ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు ఉన్నారని.. వారిని మెరికల్లా తీర్చిదిద్దే అవకాశం తనకు వస్తే కచ్చితంగా మళ్లీ కోచ్‌గా మారతానని రవిశాస్త్రి సంకేతాలు ఇచ్చాడు. ఇప్పటికే సూపర్ స్టార్లుగా ఎదిగిన వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. అయితే, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు తనకు ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోనని స్పష్టం చేశాడు.ఏడేళ్లు టీమిండియాతో పనిచేసిన తర్వాత .. తిరిగి కామెంటేటర్‌గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్న రవిశాస్త్రి.. తదుపరి ఐపీఎల్ కోచ్‌గా మారేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలియజేశాడు. కాగా రవిశాస్త్రి తర్వాత టీమిండియా హెడ్‌కోచ్‌గా పనిచేసిన రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియడంతో బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
టీమిండియాకు హెడ్ కోచ్ కావలెను.. ఆ మాజీకి ఛాన్స్ దక్కేనా?
టీ20 వరల్డ్ కప్ 2024తో రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెచ్ కోచ్ పదవీ కాలం ముగియనుంది. దీంతో ఆయన మరోసారి దరఖాస్తు చేసుకుంటారా? లేదంటే ఆ అవకాశం మరొకరిని వరిస్తుందా?.. టీమిండియాకు కాబోయే హెడ్ కోచ్ ఎవరు? అనే చర్చ నడుస్తోంది. ఈ లోపే హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులకు ఆహ్వానించింది.కొత్త కోచ్ పదవీకాలం ఈ ఏడాది జులై 1 నుంచి 2027 డిసెంబర్ 31వ తేదీ వరకు ఉంటుందని బీసీసీఐ తాజాగా స్పష్టం చేసింది. అంటే కొత్తగా కోచ్ పదవికి ఎంపికయిన వ్యక్తి 2027 వన్డే ప్రపంచకప్ వరకు భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా కొనసాగుతారన్నమాట. అలాగే.. కొత్త కోచ్‌కు దరఖాస్తు చేసుకునేవాళ్ల వయసు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి. పారితోషికం అనుభవాన్ని బట్టి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. వీటితో పాటు.. మూడు ఫార్మాట్లలో జట్టుకు హెడ్ కోచ్ గా కొనసాగుతాడు. కోచ్‌కు 14-16 మంది సహాయక సిబ్బంది ఉంటారు. టీమ్ ప్రదర్శన, నిర్వహణకు ప్రధాన కోచ్ పూర్తి బాధ్యత వహిస్తాడు. అలాగే స్పెషలిస్ట్ కోచ్‌లు, సహాయక సిబ్బంది బృందానికి నాయకత్వం వహిస్తాడు. భారత జట్టులోని క్రమశిక్షణా కోడ్లను సమీక్షించడం, నిర్వహించడం, అమలు చేయడం ప్రధాన కోచ్ బాధ్యతఅర్హతలుకనీసం 30 టెస్ట్ మ్యాచ్‌లు లేదా 50 వన్డేలు ఆడి ఉండాలి. లేదంటే.. టెస్టు క్రికెట్ ఆడే దేశానికి ప్రధాన కోచ్‌గా కనీసం 2 సంవత్సరాల పాటు పనిచేసిన అనుభవం ఉండాలి.ఐపీఎల్ జట్టు లేదా సమానమైన ఇంటర్నేషనల్ లీగ్/ఫస్ట్ క్లాస్ జట్లకు/ జాతీయ అ జట్లకు ప్రధాన కోచ్‌గా కనీసం మూడేళ్లు పనిచేసి ఉండాలి.బీసీసీఐ లెవల్ 3 సర్టిఫికేషన్ కలిగి ఉండాలి.పై కండిషన్లలో ఏది ఉన్నా సరే.. దరఖాస్తు చేసుకోవచ్చు.ఉవ్విళ్లూరుతున్న మాజీ ప్లేయర్టీమిండియా హెడ్ కోచ్ దరఖాస్తుల నేపథ్యంలో.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ ఈ పదవిపై ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఈ ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ గా ఉన్నాడు‘‘టీమిండియా హెచ్ కోచ్ పదవిపై నేను ఆసక్తిగా ఉన్నాను. దీని గురించి ఎప్పుడూ నేను ఆలోచించలేదు. ప్రతి అంతర్జాతీయ కోచ్ పై నాకు అమితమైన గౌరవం ఉంది. ఎందుకంటే అందులో ఉండే ఒత్తిడి నాకు తెలుసు. కానీ ఇండియన్ టీమ్ కోచింగ్ అద్భుతమైన జాబ్. ఈ దేశంలో ఉన్న టాలెంట్ చూసిన తర్వాత కోచ్ పదవి అనేది ఆకర్షణీయంగా కనిపిస్తోంది’’ అని లాంగర్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.లాంగర్ కెరీర్జస్టిన్ లాంగర్ ఆస్ట్రేలియా తరఫున 105 టెస్టులు ఆడాడు. 45 సగటుతో 7696 రన్స్ చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా టీమ్ కోచ్ గా ఉన్నాడు. అతని కోచింగ్ లోనే 2021లో ఆస్ట్రేలియా తొలిసారి టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఇక ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ కు కూడా కోచ్ గా ఉన్నాడు. గత రెండు సీజన్లలోనూ ఆ టీమ్ ప్లేఆఫ్స్ చేరుకుంది.ఫారినర్‌కు ఛాన్స్ దక్కేనా?డంకన్ ఫ్లెచర్ తర్వాత గత పదేళ్లలో మరో విదేశీ కోచ్ ను నియమించలేదు. కుంబ్లే, రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్ ఈ బాధ్యతను చేపట్టారు. దీంతో.. బీసీసీఐ మరోసారి విదేశీ కోచ్ ను నియమిస్తుందా లేదా అన్నది చూడాలి. అయితే ఈసారి ఓ విదేశీ కోచ్ ను నియమించే అవకావాలను కూడా కొట్టిపారేయలేం అన్నట్లుగా బీసీసీఐ సెక్రటరీ జై షా మాటలను బట్టి అర్థమవుతోంది. -
ద్రవిడ్ మళ్లీ దరఖాస్తు చేయాల్సిందే!
ముంబై: టి20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్టుకు కొత్త హెడ్ కోచ్ బాధ్యతలు స్వీకరిస్తారని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. దాని కోసం మరికొద్ది రోజుల్లోనే దరఖాస్తులు కోరతామని కూడా ఆయన స్పష్టం చేశారు. భారత జట్టు వరల్డ్ కప్‌కు బయల్దేరే ముందే ఈ ప్రక్రియ మొదలవుతుందని కూడా జై షా చెప్పారు. గత ఏడాది రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తయిన తర్వాతే కొత్త కోచ్‌పై చర్చ జరగడంతో కొంత గందరగోళం నెలకొంది. దాంతో ద్రవిడ్‌నే మరో ఏడాది కొనసాగించారు. ఈసారి అలాంటి స్థితి రాకుండా బోర్డు ముందే జాగ్రత్త పడుతోంది. ఒప్పందం ప్రకారం వచ్చే జూన్‌లో ద్రవిడ్ పదవీకాలం పూర్తవుతుంది. ద్రవిడ్ మళ్లీ కోచ్‌గా కొనసాగాలనుకుంటే మళ్లీ దరఖాస్తు చేయాల్సి ఉంటుందని... కొన్ని ఇతర జట్ల తరహాలో వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌లను ఎంపిక చేసే ఆలోచన లేదని కూడా షా పేర్కొన్నారు. కొత్త హెడ్ కోచ్‌కు మూడేళ్ల పదవీ కాలం ఇస్తామని, 2027 వన్డే వరల్డ్ కప్ వరకు అతను కొనసాగుతాడని బోర్డు కార్యదర్శి ప్రకటించారు. కోచ్ ఎంపిక విషయంలో క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)దే తుది నిర్ణయమన్న షా... విదేశీ కోచ్ అయినా అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు చేరని జట్లలో ఉన్న ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది కలిసి మే 24న తొలి బృందంగా టి20 వరల్డ్ కప్ కోసం అమెరికా బయలుదేరతారని జై షా వెల్లడించారు. ఐపీఎల్లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనను ప్రయోగాత్మకంగానే పెట్టామని, అవసరమైతే దీనిపై మళ్లీ చర్చించి కొనసాగించాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లను బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో చేర్చకపోవడంలో తన పాత్ర ఏమీ లేదని... ఇది పూర్తిగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నిర్ణయమని ఆయన సందేహ నివృత్తి చేశారు.