
టీ20 వరల్డ్‌కప్-2024కు టీమిండియా సిద్దమవుతోంది. ఇప్పటికే అమెరికా చేరుకున్న భారత జట్టు తమ ప్రాక్టీస్‌ను కూడా మొదలు పెట్టేసింది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తమ సన్నాహక శిబరాన్ని భారత జట్టు ఏర్పాటు చేసుకుంది.
అయితే ప్రాక్టీస్ లేని సమయంలో భారత ఆటగాళ్లు న్యూయార్క్ సీటీలో చక్కెరల్లు కొడుతున్నారు. ఈ క్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ బుధవారం న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వీధుల్లో ఎంజాయ్ చేస్తూ కన్పించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
షాపింగ్‌కు వెళ్లిన ద్రవిడ్, రోహిత్ భారీ వర్షంలో చిక్కుకున్నారు. భారీ వర్షం కురుస్తుండంతో రోహిత్, ద్రవిడ్ ఇద్దరూ ఓ షాప్‌లో ఉండిపోయారు. ఈ క్రమంలో ఓ అభిమాని రోహిత్ దగ్గరకు వచ్చి ఫోటో కావాలని అడగగా.. హిట్‌మ్యాన్ అందుకు నిరాకరించాడు. "నో ఫోటో, బయట భారీ వర్షం పడుతోంది" అంటూ రోహిత్ సమాధనమిచ్చాడు.
వెంటనే కారు తీసుకురావలంటూ డ్రైవర్‌ను రోహిత్ సూచించాడు. కుండపోత వర్షం పడుతుండగానే రోహిత్, ద్రవిడ్ ఇద్దరూ కారు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారు. పాపం వారిద్దరితో ఫోటో కోసం ఎదురు చూసిన సదరు అభిమానికి నిరాశే ఎదురైంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. భారత తమ తొలి మ్యాచ్‌లో జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడనుంది.
Team India spotted in New York. Wait for Rohit Sharma’s sprint. 😂 pic.twitter.com/QlfPlSSLAW
— Vipin Tiwari (@Vipintiwari952_) May 29, 2024
Comments
Please login to add a commentAdd a comment