భారత వెటరన్ వికెట్ కీపర్-బ్యాటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ దినేష్ కార్తీక్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఇండియన్ బ్యాటర్‌గా కార్తీక్ నిలిచాడు.
ఐపీఎల్-2024లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగులు చేసిన డీకే.. ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు కార్తీక్ ఐపీఎల్‌లో బెంగళూరు తరపున 57 మ్యాచ్‌ల్లో 912 పరుగులు చేశాడు.
ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరిట ఉండేది. ద్రవిడ్ 43 మ్యాచ్‌ల్లో ఆర్సీబీ తరపున 898 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో ద్రవిడ్ రికార్డును కార్తీక్ బద్దలు కొట్టాడు.
ఇక అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అగ్రస్ధానంలో ఉన్నాడు. కోహ్లి ఇప్పటివరకు ఆర్సీబీ తరపున 249 మ్యాచ్‌ల్లో 7897 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. హై స్కోరింగ్ మ్యాచ్‌లో పంజాబ్‌ను 60 పరుగుల తేడాతో ఆర్సీబీ చిత్తు చేసింది. దీంతో తమ ప్లే ఆఫ్ ఆశలను ఆర్సీబీ సజీవంగా నిలుపున్‌కుంది..
Comments
Please login to add a commentAdd a comment