టీమిండియా వెటరన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ క్రికెటర్ దినేష్ కార్తీక్ తన కెరీర్‌లో చివరి ఐపీఎల్ ఆడేశాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఎలిమినేటర్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై ఓటమి అనంతరం కార్తీక్ తన 17 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌కు విడ్కోలు పలికాడు. ఈ క్రమంలో తన సహచర ఆటగాడు, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి.. కార్తీక్‌తో అనుబంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
దినేష్ కార్తీక్‌ను నేను తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ 2009 సందర్భంగా కలిశాను. బహుశా దక్షిణాఫ్రికాలో అనుకుంటా. నేను అతడితో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం అదే మొదటి సారి. అతడు చాలా సరదాగా ఉంటాడు. డికే చాలా యాక్టివ్ ఉంటాడు. అదేవిధంగా కన్‌ఫ్యూజ్డ్ పర్సన్.
చాలా సార్లు అతడు ఏదో ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. దినేశ్‌పై నాకు కలిగిన తొలి అభిప్రాయం ఇదే. డీకేకు అద్భుతమైన టాలెంట్ ఉంది. నేను మొదటిసారిగా చూసిన దినేష్‌కు, ఇప్పటి దినేష్‌లో ఎలాంటి మార్పులేదు. అతడు తెలివైనవాడు. అంతేకాకుండా చాలా ప్రశాంతంగా ఉంటాడు.
ఫీల్డ్‌లోనే కాదు, ఆఫ్‌ది ఫీల్డ్ కూడా డీకేతో నాకు మంచి అనుబంధం ఉంది. కార్తీక్‌కు క్రికెట్‌పైనే కాకుండా ఇతర విషయాలపై మంచి అవహగహన ఉంది. అతడితో నాకు సంబంధించిన ఏ విషయమైన నేను చర్చిస్తాను. ఐపీఎల్-2022లో నేను పెద్దగా రాణించలేదు.
ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయి చాలా ఇబ్బంది పడ్డా. ఆ సమయంలో దినేష్ నా పక్కను కూర్చోని నాలో ఆత్మ విశ్వాసాన్ని నింపాడు. నాలో ఉన్న లోపాలను నాకు అర్ధమయ్యేలా చెప్పాడు. నేను ఈ రోజు మెరుగ్గా ఆడుతున్నానంటే అందుకు కారణం డీకేనే. కార్తీక్‌లో తన నిజాయితీ, ధైర్యం నాకు బాగా నచ్చాయి. నాకు పరిచయం అయినందుకు థంక్యూ డీకే అంటూ విరాట్ ఆర్సీబీ షేర్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment