
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు చెలరేగారు. సీఎస్‌కే బౌలర్లకు చుక్కలు చూపించారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో ఫాప్ డుప్లెసిస్(54) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లి(47), రజిత్ పాటిదార్(41), కామెరాన్ గ్రీన్(38 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు.
సీఎస్‌కే బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ రెండు వికెట్లు, తుషార్ దేశ్‌పాండే, శాంట్నర్ తలా వికెట్ సాధించారు. ఇక ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించాలంటే 18 పరుగుల తేడాతో సీఎస్‌కేను ఓడించాలి.
చదవండి: టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్..!
Comments
Please login to add a commentAdd a comment