ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా మార్చి 22న జరుగనుంది. సీజన్ ఓపెనర్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.
హెడ్ టు హెడ్ రికార్డులను ఓసారి పరిశీలిస్తే.. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సూపర్ కింగ్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్‌లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్‌కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
సొంత అడ్డా చెపాక్‌లో ఏ జట్టుపై అయినా పట్టపగ్గాల్లేని సీఎస్‌కే.. ఆర్సీబీపై సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. చెపాక్ ఈ ఇరు జట్లు ఇప్పటివరకు 8 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్‌కే ఏకంగా ఏడు మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగురవేసింది. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది. అది కూడా లీగ్ ప్రారంభ ఎడిషన్ అయిన 2008లో. నాటి నుంచి ఇప్పటివరకు ఆర్సీబీ సీఎస్‌కేపై చెపాక్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా గెలిచింది లేదు.
చెపాక్ పిచ్ విషయానికొస్తే.. ఈ మైదానం బ్యాటింగ్, బౌలింగ్ రెండిటికీ అనుకూలిస్తుందని చెప్పాలి. తొలుత బ్యాటర్లకు స్వర్గధామంగా కనిపించే ఈ పిచ్ క్రమంగా స్నిన్‌కు అనుకూలిస్తూ బౌలర్ ఫ్రెండ్లీగా మారుతుంది. ఈ పిచ్‌పై ఛేదన కాస్త కష్టంగానే ఉంటుంది. ఇందుకు అక్కడి వాతావరణం కూడా ఓ కారణం. వేసవికాలం రాత్రి వేళల్లో తేమ శాతం అధికంగా ఉండటంతో స్పిన్నర్లు చెలరేగే అవకాశం ఉంటుంది.
తుది జట్లు (అంచనా):
సీఎస్‌కే: రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్/వికెట్‌కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, మతీశ పతిరణ
ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్‌దీప్
Comments
Please login to add a commentAdd a comment