royal challengers bengaluru
-
బుమ్రా తర్వాత బెస్ట్ బౌలర్.. భీకర ఫామ్‌లో ఆర్సీబీ పేసర్
ఐపీఎల్-2025 నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఈసారి తమ పేస్ దళాన్ని మరింత పటిష్టం చేసుకుంది. మెగా వేలానికి ముందే యశ్ దయాళ్ను రిటైన్ చేసుకున్న ఆర్సీబీ.. వేలంలో భాగంగా టీమిండియా స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్‌ను సొంతం చేసుకుంది. ఈ వెటరన్ పేసర్ కోసం ఏకంగా రూ. 10.75 కోట్లు ఖర్చు చేసింది.రిటెన్షన్స్ సమయంలో టీమిండియా ప్రస్తుత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను వదిలేసిన తర్వాత.. ఆర్సీబీ ఈ మేర అతడి స్థానాన్ని సీనియర్‌తో భర్తీ చేసుకుంది. ఈ నేపథ్యంలో భువీ గురించి ఆర్సీబీ కోచింగ్ సిబ్బందిలో భాగమైన దినేశ్ కార్తిక్ గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ అవుతున్నాయి.అతడు బెస్ట్ టీ20 బౌలర్ఆర్సీబీ ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్, మొ బొబాట్, ఓంకార్ సాల్వీలతో డీకే మాట్లాడుతూ.. ‘‘బుమ్రా తర్వాత.. ఇప్పటికీ తన ప్రభావం చూపగలుగుతున్న అత్యుత్తమ బౌలర్ ఎవరైనా ఉన్నారా అంటే.. భువనేశ్వర్ కుమార్ పేరు చెబుతాను. అతడు బెస్ట్ టీ20 బౌలర్’’ అని ప్రశంసలు కురిపించాడు. అదే విధంగా.. కుర్ర పేసర్ రసీఖ్ సలాం గురించి ప్రస్తావనకు రాగా.. 24 ఏళ్ల ఈ ఆటగాడి నైపుణ్యాలు అద్భుతమని డీకే కొనియాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ పోస్ట్ చేయగా.. అభిమానులను ఆకర్షిస్తోంది.భీకర ఫామ్‌లో భువీభువనేశ్వర్ కుమార్ టీ20 ఫార్మాట్లో ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ స్వింగ్ సుల్తాన్.. ఎనిమిది ఇన్నింగ్స్‌లో కలిపి పదకొండు వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక హ్యాట్రిక్ కూడా ఉంది. ఇక భువీ ఈ టోర్నీలో ఇప్పటి వరకు సగటు 12.90తో ఎకానమీ రేటు 5.64గా నమోదు చేయడం విశేషం. అంతేకాదు సారథిగానూ జట్టును విజయపథంలో నడిపి క్వార్టర్ ఫైనల్లో నిలిపి.. సెమీస్ రేసులోకి తెచ్చాడు.ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టువిరాట్ కోహ్లి (రూ. 21 కోట్లు) రజత్ పాటిదార్ (రూ.11 కోట్లు) యశ్ దయాళ్ (రూ. 5 కోట్లు) జోష్ హాజల్‌వుడ్ (రూ.12.50 కోట్లు) ఫిల్ సాల్ట్ (రూ.11.50 కోట్లు) జితేశ్ శర్మ (రూ.11 కోట్లు) భువనేశ్వర్ కుమార్ (రూ.10.75 కోట్లు) లియామ్ లివింగ్‌స్టోన్ (రూ.8.75 కోట్లు) రసిఖ్ ధార్ (రూ.6 కోట్లు) కృనాల్ పాండ్యా (రూ. 5.75 కోట్లు) టిమ్ డేవిడ్ (రూ. 3 కోట్లు) జాకబ్ బెథెల్ (రూ. 2.60 కోట్లు) సుయాశ్ శర్మ (రూ.2.60 కోట్లు) దేవ్‌దత్ పడిక్కల్ (రూ. 2 కోట్లు) తుషార (రూ. 1.60 కోట్లు) రొమరియో షెఫర్డ్ (రూ. 1.50 కోట్లు లుంగి ఇన్‌గిడి (రూ. 1 కోటి) స్వప్నిల్ సింగ్ (రూ.50 లక్షలు) మనోజ్ (రూ. 30 లక్షలు) మోహిత్ రాఠి (రూ. 30 లక్షలు) అభినందన్ (రూ. 30 లక్షలు) స్వస్తిక్ చికార (రూ. 30 లక్షలు) .చదవండి: కెప్టెన్ ఫామ్‌లో లేకుంటే కష్టమే.. రోహిత్ ఇకనైనా..: ఛతేశ్వర్ పుజారా -
IPL 2025: ఆర్సీబీ కెప్టెన్ అతడే!
ఐపీఎల్-2025 మెగా వేలం ముగిసింది. సౌదీ అరేబియా వేదికగా రెండు రోజులపాటు జరిగిన ఆక్షన్‌లో ఫ్రాంఛైజీలు తాము కోరుకున్న ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి. ఇక వచ్చే సీజన్లో టైటిల్ లక్ష్యంగా ముందుకు సాగే క్రమంలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవడమే తరువాయి. సారథులు వీరేనా?అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తదితర జట్లు రిటెన్షన్‌కు ముందే తమ కెప్టెన్లను వదిలేశాయి. ఈ క్రమంలో... వేలం ముగిసిన తర్వాత ఆయా జట్ల సారథుల నియామకంపై విశ్లేషకులు ఓ అంచనాకు వచ్చారు. పంజాబ్‌కు శ్రేయస్ అయ్యర్, ఢిల్లీకి కేఎల్ రాహుల్, లక్నోకు రిషభ్ పంత్, కోల్‌కతాకు వెంకటేశ్ అయ్యర్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆర్సీబీ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.కోహ్లి తిరిగి పగ్గాలు చేపడతాడా?ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి తిరిగి పగ్గాలు చేపడతాడా? లేదంటే.. కెప్టెన్సీ అనుభవం ఉన్న రజత్ పాటిదార్, భువనేశ్వర్ కుమార్, ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్‌స్టోన్‌లలో ఒకరికి సారథ్య బాధ్యతలు ఇస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. వీరిలో ఇంగ్లండ్ స్టార్లు సాల్ట్, లివింగ్‌స్టోన్‌లకు ది హండ్రెడ్, ఇంగ్లండ్ లిస్ట్-ఎ టోర్నీల్లో నాయకులుగా వ్యవహరించారు.మరోవైపు.. భారత క్రికెటర్లలో రజత్ పాటిదార్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌కు కెప్టెన్‌గా ఉండగా.. భువీ ఉత్తరప్రదేశ్ సారథిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్సీ అంశంపై సౌతాఫ్రికా దిగ్గజం, బెంగళూరు మాజీ స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ కెప్టెన్ అతడే!‘‘ఇప్పటి వరకు ఆర్సీబీ కెప్టెన్ ఎవరో ఖరారు కాలేదు. అయితే, కోహ్లినే తిరిగి కెప్టెన్ అవుతాడని భావిస్తున్నా. ప్రస్తుతం ఉన్న జట్టును బట్టి చూస్తే ఇదే జరుగుతుందని అనిపిస్తోంది’’ అని ఏబీడీ హిందుస్తాన్ టైమ్స్‌తో వ్యాఖ్యానించాడు. కాగా 2021లో కోహ్లి ఆర్సీబీ కెప్టెన్సీ వదిలేయగా.. సౌతాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ మూడేళ్ల పాటు సారథ్యం వహించాడు. అయితే, ఈసారి వేలానికి ముందే ఆర్సీబీ అతడిని విడిచిపెట్టింది.ఫామ్‌లో ఉంటే అతడిని ఎవరూ ఆపలేరుఇదిలా ఉంటే.. ఆర్సీబీ బౌలింగ్ విభాగం గురించి డివిలియర్స్ ప్రస్తావిస్తూ.. ‘‘భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్ జట్టులోకి రావడం సానుకూలాంశం. రబడ లేడు.. గానీ.. లుంగి ఎంగిడిని దక్కించుకోగలిగారు. స్లో బాల్‌తో అతడు అద్భుతాలు చేయగలడు. ఒకవేళ ఎంగిడి ఫిట్‌గా ఉండి ఫామ్ కొనసాగిస్తే అతడిని ఎవరూ ఆపలేరు’’ అని పేర్కొన్నాడు. కాగా వచ్చే మార్చి 14- మే 25 వరకు ఐపీఎల్ 2025 సీజన్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: వేలంలో ఎవరూ కొనలేదు..! రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్ -
అప్పుడు రూ. 20 లక్షలు.. ఇప్పుడు రూ. 11 కోట్లు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన ఆటగాడు ఎవరనగానే ఠక్కున.. టీమిండియా స్టార్ రిషభ్ పంత్ పేరు చెప్పేస్తారు క్రికెట్ ప్రేమికులు. ఇక అతడి తర్వాతి స్థానాల్లో ఉన్నది ఎవరంటే.. మరో ఇద్దరు భారత స్టార్లు శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్. మరి ఈ ముగ్గురికి సాధ్యంకాని రీతిలో ఓ అరుదైన ఫీట్ సాధించిన ఆటగాడు మరొకడు ఉన్నాడు.క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక హైక్ పొందిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఏకంగా 5500 శాతం హైక్‌తో కోట్లు కొలగొట్టాడు. ఇంతకీ అతడు ఎవరా అంటారా?!.... టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ. అవును.. ఐపీఎల్లో ఇంత వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో జితేశ్ ఏకంగా ఈసారి వేలంలో తన పాత ధర కంటే.. 5500 శాతం ఎక్కువ మొత్తం పలికాడు.21 నిమిషాల వ్యవధిలోనే సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో రెండురోజుల పాటు జరిగిన వేలంలో.. మొదటిరోజే రికార్డులు బ్రేకైన విషయం తెలిసిందే. టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను రూ. 18 కోట్లను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేయగా.. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కోసం రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చు చేసింది. దీంతో ఐపీఎల్లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు.అయితే, 21 నిమిషాల వ్యవధిలోనే అతడి రికార్డును రిషభ్ పంత్ బద్దలుకొట్టాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఈ వికెట్ కీపర్‌ను ఏకంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఐపీఎల్-2024 సీజన్లో శ్రేయస్ అయ్యర్ కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. జట్టును చాంపియన్‌గా నిలిపిన అతడు కేకేఆర్ నుంచి 2022 వేలంలో రూ. 12.25 కోట్లు అందుకున్నాడు. అంతే మొత్తానికి ఈసారీ ఆడాడు.అర్ష్‌దీప్ హైక్ 3500 శాతానికి పైనే!అయితే, ఈసారి వేలంలో రూ. 26.75 కోట్లు దక్కించుకోవడంతో అయ్యర్‌కు 200 శాతం మేర హైక్ లభించినట్లయింది. మరోవైపు అర్ష్‌దీప్ గతంలో రూ. 4 కోట్లే అందుకున్నాడు. ఈసారి ఏకంగా రూ. 18 కోట్లు దక్కించుకున్నాడు. అంటే అర్ష్‌దీప్ హైక్ 3500 శాతానికి పైనే!ఇక రిషభ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా గతంలో రూ. 16 కోట్లు అందుకోగా.. ఈసారి 11 కోట్ల మేర హైక్ పొందాడు. మరోవైపు.. లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ కూడా భారీ జంప్ కొట్టాడు. చివరగా రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన చహల్ పాత ధర రూ. 6జ5 కోట్లు.. ఈసారి పంజాబ్ కింగ్స్ అతడి కోసం ఏకంగా రూ. 18 కోట్లు ఖర్చు చేసింది.20 లక్షల నుంచి 11 కోట్లకు భారీ జంప్మరి జితేశ్ శర్మ ధర సంగతి ఏమిటంటారా?!.. ఐపీఎల్ 2022 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఈ విదర్భ ఆటగాడిని రూ. 20 లక్షల కనీస ధరకు కొనుక్కుంది. 2024 వరకు అదే ధరకు అతడిని కొనసాగించింది. అయితే, ఈసారి వేలంలో జితేశ్‌కు డిమాండ్ రాగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతడిని రూ. 11 కోట్లకు సొంతం చేసుకుంది. అలా 20 లక్షల నుంచి 11 కోట్లకు భారీ జంప్ కొట్టాడు.నిజానికి 2024 ఎడిషన్‌లో జితేశ్ పెద్దగా రాణించలేదు. 131 స్ట్రైక్‌రేటుతో కేవలం 187 పరుగులే చేశాడు. అయినప్పటికీ భారీ ధర పలకడానికి కారణం అతడి వికెట్ కీపింగ్ నైపుణ్యాలు. అంతేకాదు పొట్టిఫార్మాట్లో లోయర్ ఆర్డర్లో ఫినిషర్‌గానూ జితేశ్‌కు మంచి రికార్డు ఉంది. ఇక దినేశ్ కార్తిక్ రిటైర్మెంట్ తర్వాత ఆర్సీబీకి వికెట్ కీపర్ బ్యాటర్ అవసరం కూడా ఉండటంతో జితేశ్ పంట ఇలా పండింది. చదవండి: KKR: అతడు 12 కోట్లకే వచ్చేవాడు.. ఇషాన్ కూడా చీప్.. అయినా ఎందుకిలా? -
IPL 2025: గుడ్ బై.. స్వింగ్ కింగ్ భావోద్వేగం!.. ఆరెంజ్ ఆర్మీపై భువీ పోస్ట్
టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వకుమార్ భావోద్వేగానికి లోనయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తన పదకొండేళ్ల సుదీర్ఘ ప్రయాణం ముగిసిపోయిందన్నాడు. ఈ జట్టుతో తనకెన్నో మరపురాని, మధురజ్ఞాపకాలు ఉన్నాయంటూ భారమైన హృదయంతో వీడ్కోలు పలికాడు. ఈ సందర్భంగా ఆరెంజ్ ఆర్మీని ఉద్దేశించి భువీ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.కరగని కావ్య మనసు!కాగా ఐపీఎల్ మెగా వేలం-2025కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ భువీని వదిలేసిన విషయం తెలిసిందే. అయితే, ఆక్షన్లోనైనా అతడిని కొనుగోలు చేయాలని సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్‌కు అభిమానులు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. అయితే, ఆరెంజ్ ఆర్మీ కోరుకున్నది జరుగలేదు.భువీ కోసం పోటీ పడ్డ ముంబై, లక్నోసౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో జరిగిన వేలంలో భువనేశ్వర్ కుమార్ కోసం సన్‌రైజర్స్ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో అందుబాటులో ఉన్న భువీ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఆది నుంచి ఆసక్తి చూపించింది. రూ. 10.75 కోట్లకు ఆర్సీబీ సొంతంముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్‌లతో పోటీపడి మరీ ధరను రూ. 10 కోట్లకు పెంచింది. ఆ తర్వాత కూడా లక్నో పోటీకి రాగా.. ఒక్కసారిగా 75 లక్షలు పెంచి రూ. 10.75 కోట్లకు ఆర్సీబీ భువీని సొంతం చేసుకుంది.సన్‌రైజర్స్ టైటిల్ గెలవడంలో భువీది కీలక పాత్రకాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన కుడిచేతి వాటం పేసర్ భువనేశ్వర్ కుమార్ 2011లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు. 2013లో సన్‌రైజర్స్‌తో చేరిన అతడు 2024 వరకు జట్టుతోనే కొనసాగాడు. 2016లో సన్‌రైజర్స్ టైటిల్ గెలవడంలో భువీది కీలక పాత్ర. ఆ ఏడాది అతడు 23 వికెట్లతో చెలరేగాడు. ఆ తర్వాతి సీజన్లో అత్యుత్తమంగా 26 వికెట్లు పడగొట్టాడు. కానీ.. అప్పటి నుంచి ఒక్కసారి కూడా మళ్లీ 20 వికెట్లు కూడా తీయలేకపోయాడు. దీంతో వేలానికి ముందు సన్‌రైజర్స్ భువీని వదిలేసింది. ఈ నేపథ్యంలో తమ హార్ట్‌బ్రేక్ అయిందని ఆరెంజ్ ఆర్మీ నెట్టింట భువీ పేరును ట్రెండ్ చేసింది.గుడ్ బై.. ఆరెంజ్ ఆర్మీఈ నేపథ్యంలో భువనేశ్వర్‌కుమార్ తాజాగా ఎక్స్ వేదికగా ఆరెంజ్ ఆర్మీని ఉద్దేశించి వీడియో షేర్ చేశాడు. ‘‘ఎస్ఆర్హెచ్తో అద్భుతమైన పదకొండేళ్ల ప్రయాణానికి ఇక వీడ్కోలు. ఇక్కడ నాకెన్నో మరుపురాని చిర్మసరణీయ జ్ఞాపకాలు ఉన్నాయి. అయితే, మీ ప్రేమను మాత్రం మిస్ అవ్వను. మీ మద్దతను ఎన్నటికీ మరువను. మీరు, మీ మద్దతే నా బలం. నా ప్రయాణాన్ని అద్భుతంగా మలిచినందుకు ధన్యవాదాలు. నాపై మీ ప్రేమ ఇలాగే కొనసాగాలి’’ అని 34 ఏళ్ల భువీ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక వచ్చే ఏడాది ఈ స్వింగ్ కింగ్ ఆర్సీబీ జెర్సీలో దర్శనమివ్వబోతున్నాడు.చదవండి: KKR: అతడు 12 కోట్లకే వచ్చేవాడు.. ఇషాన్ కూడా చీప్.. అయినా ఎందుకిలా?After 11 incredible years with SRH, I say goodbye to this team. I have so many unforgettable and cherishable memories.One thing unmissable is the love of the fans which has been splendid! Your support has been constant.I will carry this love and support with me forever 🧡 pic.twitter.com/SywIykloHp— Bhuvneshwar Kumar (@BhuviOfficial) November 28, 2024After 11 incredible years with SRH, I say goodbye to this team. I have so many unforgettable and cherishable memories.One thing unmissable is the love of the fans which has been splendid! Your support has been constant.I will carry this love and support with me forever 🧡 pic.twitter.com/SywIykloHp— Bhuvneshwar Kumar (@BhuviOfficial) November 28, 2024 -
బిగ్‌బాస్ ఫేమ్, నటితో సిరాజ్ డేటింగ్?.. రూమర్లకు కారణం ఇదే!
టీమిండియా స్టార్ క్రికెటర్, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ఐపీఎల్ మెగా వేలం-2025లో భారీ మొత్తమే దక్కింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతడిని వదిలేసినా.. గుజరాత్ టైటాన్స్ పట్టుబట్టి మరీ కొనుగోలు చేసింది. రూ.12.25 కోట్లు వెచ్చించి సిరాజ్‌ను సొంతం చేసుకుంది. దీంతో వచ్చే ఏడాది అతడు టైటాన్స్ జెర్సీలో దర్శనమివ్వబోతున్నాడు.ఇదిలా ఉంటే.. సిరాజ్ వ్యక్తిగత విషయానికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. బాలీవుడ్‌కు చెందిన ఓ నటితో అతడు డేటింగ్ చేస్తున్నాడనేది దాని సారాంశం. సదరు నటి పేరు మహీరా శర్మ అని, ఆమె హిందీ బిగ్‌బాస్ 13 కంటెస్టెంట్ అని సమాచారం.రూమర్లకు కారణం ఇదే!అయితే, సిరాజ్ గురించి ఇలాంటి వదంతులు పుట్టుకురావడానికి కారణం మాత్రం మహీరా ఇన్‌స్టా పోస్టులు. మహీరా తాను బ్లాక్ కలర్ డ్రెస్‌తో గ్లామరస్ లుక్‌లో కనిపిస్తున్న ఫొటోలను షేర్ చేయగా.. సిరాజ్ వాటిని లైక్ చేశాడు. లైక్ కొట్టినంత మాత్రానఅంతే.. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్లతో వీరిద్దరి పేర్లను ముడిపెట్టి గాసిప్‌రాయుళ్లు తమకు నచ్చిన రీతిలో కథనాలు అల్లేస్తున్నారు. దీంతో సిరాజ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. లైక్ కొట్టినంత మాత్రాన ఇలాంటి అసత్యపు ప్రచారం చేయడం తగదని హితవు పలుకుతున్నారు. క్రికెట్‌కు- బాలీవుడ్‌కు విడదీయరాని అనుబంధంకాగా క్రికెట్‌కు- బాలీవుడ్‌కు విడదీయరాని అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. నాటి క్రికెటర్ పటౌడీ అలీఖాన్ నుంచి జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వరకు బాలీవుడ్ నటీమణులను పెళ్లాడిన క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు.గతంలో వీరిపై కూడా ఇలాంటి ప్రచారమేఇక భారత ఆల్‌రౌండర్, వేలంలో రూ. 23.75 కోట్లతో(కేకేఆర్) జాక్‌పాట్ కొట్టిన వెంకటేశ్ అయ్యర్ కూడా సిరాజ్ మాదిరే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. టాలీవుడ్ నటి ప్రియాంక జువాల్కర్ ఫొటోలకు లైక్ కొట్టినందుకు వచ్చిన చిక్కు అది. అయితే, ఇటీవలే అతడు పెళ్లి చేసుకోవడంతో రూమర్లకు చెక్ పడింది. శుబ్‌మన్ గిల్- సారా అలీఖాన్‌ల పేర్లు కూడా ఇలాగే వైరల్ అయ్యాయి.అంతేకాదు.. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి గతంలో ఇలాంటి వార్తలే వచ్చాయి. నటి అనుపమా పరమేశ్వరన్ పేరుతో అతడిని ముడిపెట్టగా.. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్‌ను పెళ్లాడిన బుమ్రా.. వదంతులు వ్యాప్తి చేసేవారి నోళ్లు మూయించాడు.ఆస్ట్రేలియా పర్యటనలోఇదిలా ఉంటే.. సిరాజ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియాతో అక్కడికి వెళ్లాడు. ఇక ఇరుజట్ల మధ్య పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన బుమ్రా.. జట్టుకు భారీ విజయం అందించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 295 పరుగుల తేడాతో గెలిచి ఆసీస్ గడ్డపై అతిపెద్ద విజయంతో చరిత్ర సృష్టించింది. ఈ టెస్టులో సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు.చదవండి: IPL 2025: ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, పృథ్వీ షా..! View this post on Instagram A post shared by Tellychakkar Official ® (@tellychakkar) -
ఆరెంజ్ ఆర్మీ హార్ట్‌బ్రేక్.. కావ్యా మేడమ్ ఇలా ఎందుకు చేసింది!
ఆరెంజ్ ఆర్మీ అభిమానులకు చేదువార్త. టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బంధం తెగిపోయింది. ఐపీఎల్ మెగా వేలం-2025కి ముందు రిటెన్షన్స్‌లో భాగంగా సన్‌రైజర్స్ భువీని వదిలేసింది.అయితే, కనీసం రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారానైనా భువీని తిరిగి సొంతం చేసుకుంటే బాగుండని సన్‌రైజర్స్ అభిమానులు భావించారు. కానీ.. వారికి నిరాశే మిగిలింది. వచ్చే ఏడాది భువనేశ్వర్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు(ఆర్సీబీ) ఆడబోతున్నాడు. కాగా సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఆదివారం మెగా వేలం మొదలైంది.ఈ క్రమంలో సోమవారం నాటి ఆఖరి రోజు ఆక్షన్‌లో భాగంగా భువీ రూ. 2 కోట్ల కనీస ధరతో అందుబాటులోకి వచ్చాడు. ఆక్షనీర్ మల్లికా సాగర్ భువీ పేరు చెప్పగానే ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ రంగంలోకి దిగాయి. తగ్గేదేలే అన్నట్లు పోటీపడుతూ ఏకంగా రూ. 9 కోట్ల వరకు తలపడ్డాయి.అయితే, ఆ తర్వాత లక్నో భువీ ధరను రూ. 10 కోట్లకు పెంచిన తర్వాత ముంబై పోటీ నుంచి తప్పుకొంది. దీంతో లక్నోకు భువీ సొంతమవుతాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆర్సీబీ రేసులోకి దూసుకువచ్చింది. అమాంతం రూ. 75 లక్షలు పెంచి.. మొత్తంగా 10.75 కోట్ల రూపాయలకు భువీని బెంగళూరు దక్కించుకుంది.సన్‌రైజర్స్‌తో సుదీర్ఘ అనుబంధంఉత్తరప్రదేశ్కు చెందిన భువనేశ్వర్ కుమార్ 2011లో ఐపీఎల్లో అడుగుపెట్టాడు. తొలి సీజన్లో పుణె వారియర్స్(ఇప్పుడు లేదు) జట్టుకు ఆడాడు భువీ. ఏడు కంటే తక్కువ ఎకానమీతో 2013లో 13 వికెట్లు తీసి సత్తా చాటిన ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్‌ను.. 2014లో సన్‌రైజర్స్ దక్కించుకుంది.సన్‌రైజర్స్ ను చాంపియన్‌గా నిలపడంలో కీలకంరైజర్స్ తరఫున 2016లో భువీ 23 వికెట్లతో దుమ్ములేపి జట్టును చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ మరుసటి ఏడాది 26 వికెట్లతో దూసుకుపోయాడు. అయితే, ఆ తర్వాతి సీజన్ నుంచి భువీ ఒక్కసారి కూడా 20 వికెట్ల మార్కు అందుకోలేకపోయాడు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ అతడిని వదిలేయడం గమనార్హం. అంతేకాదు వేలంలో కూడా అతడిపై ఏమాత్రం ఆసక్తి చూపలేదు.ఆరెంజ్ ఆర్మీ హార్ట్‌బ్రేక్.. కావ్యా మేడమ్ ఇలా ఎందుకు చేసింది!దీంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘కావ్యా మేడమ్ భువీని తీసుకోవాల్సింది. నిన్ను కచ్చితంగా మిస్ అవుతావు భయ్యా!’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మందేమో.. ‘‘నా బ్రేకప్ కంటే కూడా.. భువీ- సన్‌రైజర్స్ బ్రేకప్‌తోనే నేను ఎక్కువగా హర్ట్ అయ్యాను’’ అంటూ తమ బాధను పంచుకుంటున్నారు.కాగా గతంలో పలు సందర్భాల్లో భువీ సన్‌రైజర్స్ కెప్టెన్‌గానూ వ్యవహరించాడు.మరోవైపు.. ఆర్సీబీ అభిమానులు భువీ రాకతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు భువీ మొత్తంగా 176 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 181 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 5/19. కాగా గత కొంతకాలంగా ఈ యూపీ పేసర్‌కు టీమిండియాలో చోటు దక్కడం లేదు. అయితే, దేశీ టీ20లలో సత్తా చాటుతూ భువనేశ్వర్ వేలంలో ఈ మేర కోట్లు కొల్లగొట్టాడు.చదవండి: అదే మా కొంపముంచింది.. మరింత బలంగా తిరిగి వస్తాము: ఆసీస్ కెప్టెన్ -
వాషింగ్టన్ సుందర్‌పై ఆసక్తి చూపని ఫ్రాంఛైజీలు.. ఆఖరికి!
టీమిండియా యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు ఐపీఎల్ మెగా వేలం-2025లో షాక్ తగిలింది. కనీస ధర రూ. 2 కోట్లతో ఆక్షన్‌లోకి వచ్చిన వాషీ కోసం తొలుత ఏ ఫ్రాంఛైజీ పెద్దగా ఆసక్తి చూపలేదు. కాసేపటికి.. గుజరాత్ టైటాన్స్ తొలుత బిడ్ వేసేందుకు ముందుకు వచ్చింది. కనీస ధరకు అతడిని దక్కించుకోవాలని చూసింది.ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ రంగంలోకి దిగగా.. గుజరాత్ కూడా వెనక్కి తగ్గలేదు. అయితే, ధర రూ. 3 కోట్లు దాటిన తర్వాత లక్నో తప్పుకోగా.. టైటాన్స్ ఆఖరికి రూ. 3.20 కోట్లకు వాషింగ్టన్ సుందర్‌ను దక్కించుకుంది. కాగా తమిళనాడుకు చెందిన వాషీ.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.మూడు జట్లకుక్యాష్ రిచ్ లీగ్‌లో 2017లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ తరఫున అడుగుపెట్టిన వాషీ.. ఆ ఏడాది ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. అనంతరం 2018లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వాషీని రూ. 3.2 కోట్లకు కొనుక్కుంది. ఆర్సీబీ తరఫున అతడు మొత్తంగా 31 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు తీశాడు.ఈ క్రమంలో 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వాషీని రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసి 2024 వరకు కొనసాగించింది. అయితే, ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు హైదరాబాద్ ఫ్రాంఛైజీ అతడిని వదిలేసింది. కాగా ఎస్ఆర్హెచ్ తరఫున వాషీకి పెద్దగా ఆడే అవకాశం రాలేదు. సన్‌రైజర్స్‌కు మొత్తంగా 18 మ్యాచ్‌లు ఆడిన వాషీ 10 వికెట్లు తీయడంతో పాటు 161 పరుగులు చేశాడు. ఇక వచ్చే ఏడాది అతడు గుజరాత్ టైటాన్స్‌కు ఆడబోతున్నాడు. ఇదిలా ఉంటే.. ఓవరాల్‌గా ఐపీఎల్లో వాషింగ్టన్ సుందర్ ఇప్పటి వరకు 60 మ్యాచ్‌లు ఆడి 378 రన్స్ చేయడంతో పాటు.. 37 వికెట్లు తీశాడు. -
సిరాజ్‌కు షాకిచ్చిన ఆర్సీబీ.. ఆఖరికి ఆ జట్టు సొంతం.. ధర మాత్రం..
ఐపీఎల్-2025లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ గుజరాత్ టైటాన్స్‌కు ఆడబోతున్నాడు. మెగా వేలంలో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) సిరాజ్‌కు షాకివ్వగా.. టైటాన్స్ మాత్రం భారీ మొత్తం వెచ్చించింది. కాగా హైదరాబాద్‌కు చెందిన సిరాజ్ సన్‌రైజర్స్ తరఫున 2017లో క్యాచ్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేశాడు.ఏడేళ్లు అక్కడేఅయితే, ఆ మరుసటి ఏడాది(2018) ఆర్సీబీ అతడిని రెండున్నర కోట్లకు పైగా వెచ్చించి కొనుక్కుంది. 2022లో రూ. 7 కోట్ల భారీ ధరకు అట్టిపెట్టుకుని అంతే మొత్తానికి 2024 వరకు కొనసాగించింది. అయితే, 2025 మెగా వేలానికి ముందు ఆర్సీబీ సిరాజ్‌ను వదిలేసింది. దీంతో అతడు ఆక్షన్‌లోకి వచ్చాడు.చెన్నై కూడా రేసులోఈ క్రమంలో సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో జరిగిన ఆదివారం నాటి వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరతో అతడు రేసులోకి వచ్చాడు. గుజరాత్ అతడి కోసం ఆదినుంచే పోటీ పడగా.. రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆసక్తి చూపాయి. అయితే, రూ. 8 కోట్ల వరకు గుజరాత్‌తో నువ్వా- నేనా అన్నట్లు తలపడిన చెన్నై.. ఆ తర్వాత రేసు నుంచి నిష్క్రమించింది.మాకు వద్దు.. సిరాజ్‌ను మొత్తంగా వదిలేసుకున్న ఆర్సీబీఈ దశలో రాజస్తాన్ మళ్లీ పోటీకి రాగా.. గుజరాత్ రూ. 12.25 కోట్ల మెరుగైన ధరకు సిరాజ్‌ను సొంతం చేసుకుంది. అయితే, సిరాజ్ విషయంలో రైటు మ్యాచ్ కార్డును వినియోగించుకుంటారా అని ఆక్షనీర్ మల్లికా సాగర్ ఆర్సీబీని అడుగగా.. సదరు ఫ్రాంఛైజీ మాత్రం అంత ధర పెట్టే ఉద్దేశం తమకు లేదంటూ సిరాజ్‌ను మొత్తంగా వదిలేసుకుంది. ఇక ఐపీఎల్లో ఇప్పటి వరకు ఈ కుడిచేతి వాటం పేసర్ 93 మ్యాచ్‌లు ఆడి 93 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో సిరాజ్‌కు గుజరాత్ మూడో ఫ్రాంఛైజీ. అదే విధంగా ఇదే అత్యధిక ధర.ఇక ఐపీఎల్-2022 ద్వారాక్యాష్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేసిన గుజరాత్ మొదటి ప్రయత్నంలోనే చాంపియన్‌గా నిలిచింది. గతేడాది రన్నరప్‌గా నిలిచింది. అయితే, ఈసారి మాత్రం ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది.చదవండి: IPL 2025 Mega Auction: కేఎల్ రాహుల్‌కు భారీ షాక్.. -
అతడికి రూ. 25- 28 కోట్లు.. ఆ ఫ్రాంఛైజీ సొంతం చేసుకోవడం ఖాయం!
ఐపీఎల్-2025 మెగా వేలంలో రిషభ్ పంత్ భారీ ధర పలకడం ఖాయమని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. ఈ వికెట్ కీపర్ కోసం ఫ్రాంఛైజీలు ఎగబడటం ఖాయమని.. లీగ్ చరిత్రలో అత్యధిక మొత్తానికి అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ నిలుస్తాడని అంచనా వేశాడు.రూ. 25- 28 కోట్ల రూపాయలు కొల్లగొట్టబోతున్నాడుపంజాబ్ కింగ్స్ పంత్‌ను సొంతం చేసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించవచ్చన్న ఊతప్ప.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా పంత్ కోసం పోటీపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ కూడా పంత్ వైపు మొగ్గుచూపుతాయని అంచనా వేసిన ఊతప్ప.. ఏదేమైనా ఈసారి అతడు వేలంలో రూ. 25- 28 కోట్ల రూపాయలు కొల్లగొట్టబోతున్నాడని జోస్యం చెప్పాడు.కాగా ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా గతేడాది ఐపీఎల్‌కు దూరమైన పంత్.. కోలుకున్న తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్-2024లో 446 పరుగులు చేసిన ఈ వికెట్ కీపర్.. సారథిగా మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. పంత్ కెప్టెన్సీ ఢిల్లీ ఈసారి పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఏడు గెలిచి.. 14 పాయింట్లతో పట్టికలో ఆరోస్థానంలో నిలిచింది.ఈ నేపథ్యంలో మెగా వేలానికి ముందు ఢిల్లీ ఫ్రాంఛైజీ రిషభ్ పంత్‌ను రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఓ క్రీడా చానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న భారత దిగ్గజం సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి తీసుకునే అవకాశముందని సూచనప్రాయంగా వెల్లడించాడు. ‘ఆటగాళ్ల వేలం ప్రక్రియ పూర్తిగా భిన్నమైంది. అది ఎలా సాగుతుందో ఎవరూ చెప్పలేరు. ఊహించలేరు.కానీ నా అంచనా ప్రకారం పంత్‌ను ఢిల్లీ మళ్లీ తమ జట్టులోకి తీసుకోవచ్చు. ఆటగాళ్ల రిటెన్షన్ అనేది సదరు ప్లేయర్‌కు, ఫ్రాంచైజీ యాజమాన్యానికి సంబంధించిన వ్యవహారం. తాను ఆశించినంత ధర రాకపోతే ఆ ఆటగాడు... తాము చెల్లించే ధరకు ఆడకపోతే ఫ్రాంచైజీ నిర్ణయాలకు విభేదించే జట్లను వీడతారు. పంత్ విషయంలోనూ ఇదే జరిగి ఉంటుందని నేను భావిస్తున్నా. రిటెన్షన్ కుదరకపోయినా... పంత్‌లాంటి కెప్టెన్ అవసరం ఢిల్లీకే ఉంది. అతను లేకపోతే ఫ్రాంచైజీ కొత్త సారథి వేటలో పడాలి. నా అంచనా ప్రకారం ఢిల్లీ కచ్చితంగా పంత్‌ను తీసుకుంటుంది’ అని అభిప్రాయపడ్డారు.అయితే, పంత్ మాత్రం గావస్కర్ వ్యాఖ్యలను కొట్టిపారేశాడు. ఢిల్లీతో కొనసాగకపోవడానికి డబ్బు మాత్రం కారణం కానే కాదని పంత్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే.. పంత్ మెగా వేలానికి అందుబాటులోకి రావడంతో ఫ్రాంచైజీలన్నీ అతడిపై కన్నేశాయి. రూ.24.75 కో ట్లతో రికార్డుఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు రాబిన్ ఊతప్ప సహా ఆకాశ్ చోప్రా, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు పంత్‌కు ఈసారి కళ్లు చెదిరే మొత్తం దక్కుతుందని.. పంజాబ్ కింగ్స్ పంత్‌ను దక్కించుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.ఇదిలా ఉంటే.. క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2024 మినీ వేలంలో అతడి కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ ఏకంగా రూ.24.75 కోట్లు వెచ్చించింది. ఈ క్రమంలో సీజన్ ఆరంభంలో నిరాశపరిచినా.. ఆ తర్వాత విజృంభించిన స్టార్క్.. జట్టును చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు.అయితే, మెగా వేలానికి ముందు కోల్‌కతా స్టార్క్‌తో పాటు తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను విడుదల చేసింది. ఇక పంత్‌తో పాటు అయ్యర్, కేఎల్ రాహుల్ రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలో తమ పేరు నమోదు చేసుకున్నారు. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో నవంబరు 24, 25 తేదీల్లో వేలంపాట జరుగనుంది. -
‘ఆర్సీబీతో నా ప్రయాణం ముగియలేదు.. నన్ను మళ్లీ కొనుక్కుంటారు’
ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో తన ప్రయాణం ఇంకా ముగిసిపోలేదని పేర్కొన్నాడు. వేలంపాటలో ఫ్రాంఛైజీ తనను తిరిగి కొనుక్కునే అవకాశం ఉందన్నాడు.బాధ లేదు..ఇక రిటెన్షన్ విషయంలో ఆర్సీబీ వ్యూహాలు పక్కాగా ఉన్నాయన్న మాక్సీ.. తనను విడిచిపెట్టడం వల్ల పెద్దగా బాధ కలగలేదని తెలిపాడు. కాగా ఈసారి ఆర్సీబీ కేవలం ముగ్గురు ఆటగాళ్లనే రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి సహా రజత్ పాటిదార్, యశ్ దయాళ్‌లను అట్టిపెట్టుకుని.. మిగతా ప్లేయర్లందరినీ రిలీజ్ చేసింది.ఈసారి పర్సు వాల్యూ రూ. 120 కోట్లకు పెంచడంతో.. రిటెన్షన్స్ పోనూ ఆర్సీబీ పర్సులో రూ. 83 కోట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాక్స్వెల్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘వారు ఏం చేయబోతున్నారో నాకు పూర్తిగా అర్థమైంది. పటిష్టమైన జట్టును నిర్మించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.ఆర్సీబీతో నా ప్రయాణం ఇంకా ముగియలేదుముఖ్యంగా స్థానిక ఆటగాళ్లకు ఎక్కువగా అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పటికీ ఆర్సీబీతో నా ప్రయాణం ఇంకా ముగియలేదు. నేను తిరిగి అక్కడికి వెళ్లాలనే కోరుకుంటున్నాను. ఆర్సీబీ అద్భుతమైన ఫ్రాంఛైజీ. అక్కడి వారితో నాకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి.రిటెన్షన్ సమయంలోనూ నాకు వారి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ఆండీ ఫ్లవర్ , మొ బొబాట్ నాకు జూమ్ కాల్లో అంతా వివరించారు. వారి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పారు. నాకు వారు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం పట్ల సంతోషంగా ఉన్నాను’’ అని హర్షం వ్యక్తం చేశాడు. నిరాశపరిచిన మాక్సీకాగా పదకొండు కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి కొనుగోలు చేస్తే మాక్సీ ఐపీఎల్-2024లో ఆర్సీబీ యాజమాన్యాన్ని పూర్తిగా నిరాశపరిచాడు. తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 52 పరుగులే చేశాడు. అయితే, తనదైన రోజు చెలరేగి ఆడే ఈ విధ్వంసకర ఆల్‌రౌండర్‌ను ఆర్సీబీ రైట్ టూ మ్యాచ్ కార్డు ద్వారా తిరిగి సొంతం చేసుకున్నా ఆశ్చర్యం లేదు. ఇక ఆర్సీబీ స్టార్, టీమిండియా కింగ్ విరాట్ కోహ్లితో మాక్సీకి మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. నవంబరు 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో ఐపీఎల్-2025 మెగా వేలం జరుగనుంది.చదవండి: Aus Vs Pak: ఆస్ట్రేలియాకు ‘కొత్త’ కెప్టెన్.. ప్రకటించిన సీఏ! కారణం ఇదే -
‘నన్ను వెక్కిరించావు కదా.. అందుకే అలా చేశాను’
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లితో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. తాను కోహ్లిని వెక్కిరించిన కారణంగా అతడు తనను సోషల్ మీడియాలో బ్లాక్ చేశాడని.. అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుతో చేరిన తర్వాత తమ మధ్య స్నేహం కుదిరిందని తెలిపాడు. కాగా మైదానంలో టీమిండియా- ఆస్ట్రేలియా క్రికెటర్ల మధ్య సంవాదాలు, దూషణలు, వ్యంగ్య వ్యాఖ్యలు కొత్త కాదు.ఇక 2017లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించినప్పుడు కూడా కోహ్లి, మ్యాక్స్‌వెల్ మధ్య అలాంటి ఘటన ఒకటి జరిగింది. అయితే, ఆర్సీబీలో చేరిన తర్వాత ఒక రోజు కోహ్లి ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను మ్యాక్సీ ఫాలో అయ్యేందుకు ప్రయత్నించగా...అది సాధ్యం కాలేదు. నువ్వు నన్ను బ్లాక్ చేశావా?దాంతో సందేహం వచ్చిన మ్యాక్స్‌వెల్ ‘నువ్వు నన్ను బ్లాక్ చేశావా’ అని కోహ్లిని అడిగాడు. వెంటనే కోహ్లి...‘అవును...నాలుగేళ్ల క్రితం నువ్వు నన్ను వెక్కిరించిన తర్వాత ఆ పని చేశాను’ అని బదులిచ్చాడు.కాగా 2017 సిరీస్‌లో భాగంగా రాంచీలో జరిగిన టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ కోహ్లి గాయపడ్డాడు. నొప్పిని భరించలేక కోహ్లి తన భుజంపై చేతిని ఉంచి ఇబ్బందిగా నడిచాడు. అదే టెస్టులో దీనిని మ్యాక్స్‌వెల్ అనుకరించి చూపించాడు. అదే ఇది కోహ్లికి ఆగ్రహం తెప్పించింది! అయితే, 2021లో మ్యాక్స్‌వెల్ ఐపీఎల్లో బెంగళూరు జట్టుతో చేరిన తర్వాత కోహ్లితో స్నేహం బలపడింది. మైదానంలోనూ, మైదానం బయట కూడా వీరిద్దరు ఎంతో సరదాగా ఉండేవారు.మాక్సీ ఆర్సీబీలో చేరడంలో కోహ్లిదే కీలక పాత్రనిజానికి ఆర్సీబీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో మాక్స్‌వెల్‌ను జట్టులోకి తీసుకోవాలని కోహ్లి ఫ్రాంఛైజీకి సూచించాడు. ఈ క్రమంలో ఆసీస్ ఆల్‌రౌండర్ కోసం రూ. 14.25 కోట్లు ఆర్సీబీ ఖర్చు పెట్టింది. అతడి రాకతో బ్యాటింగ్ యూనిట్ విధ్వంసకరంగా మారింది. 2021, 2022, 2023 సీజన్లలో మాక్సీ వరుసగా 513, 310. 400 పరుగులు చేశాడు. అయితే, ఈ ఏడాది చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న మాక్స్‌వెల్‌ను ఆర్సీబీ విడిచిపెట్టనున్నట్లు తెలుస్తోంది.చదవండి: IPL 2025 RCB Captain: ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లి..? -
IPL 2025: మెరుపు సెంచరీ.. ఆర్సీబీకి స్ట్రాంగ్ మెసేజ్!
మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్ అద్భుత శతకం సాధించాడు. హర్యానాతో మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో ఉన్న వేళ మెరుపు శతకంతో ఆదుకున్నాడు. కేవలం 68 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా ఆఖరి రోజు ఆటలో మధ్యప్రదేశ్‌ను పటిష్ట స్థితిలో నిలపగలిగాడు.కాగా రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో భాగంగా తొలుత కర్ణాటకతో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న మధ్యప్రదేశ్.. తదుపరి పంజాబ్‌తో మ్యాచ్‌లోనూ ఫలితం తేల్చలేకపోయింది. ఈ క్రమంలో శనివారం ఇండోర్ వేదికగా హర్యానా జట్టుతో రెడ్‌బాల్ మ్యాచ్ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 308ఓపెనర్ హిమాన్షు మంత్రి(97) సహా కెప్టెన్ శుభం శర్మ(44), హర్‌ప్రీత్ సింగ్(36) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు చేయగలిగింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హర్యానా 440 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ లక్ష్య దలాల్ సెంచరీ(105)తో చెలరేగగా.. హిమాన్షు రాణా 90, ధీరూ సింగ్ 94, హర్షల్ పటేల్ 81 పరుగులతో దుమ్ములేపారు. ఆధిక్యంలోకి హర్యానాదీంతో తొలి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్ కంటే 132 పరుగుల ఆధిక్యంలో నిలిచింది హర్యానా. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్ ఆరంభంలోనే ఓపెనర్లు సాగర్ సోలంకి(32), వెంకటేశ్ అయ్యర్(28) వికెట్లు కోల్పోయింది.రజత్ మెరుపు శతకంఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన రజత్ పాటిదార్ 68 బంతుల్లోనే ధనాధన్ ఇన్నింగ్స్‌తో శతకం సాధించాడు. మరో ఎండ్‌లో హర్‌ప్రీత్ సింగ్(44), శుభం శర్మ(38 నాటౌట్) సహకారం అందించగా.. పట్టుదలగా క్రీజులో నిలబడి 102 బంతుల్లో 159 పరుగులు చేశాడు. టార్గెట్ 177ఈ క్రమంలో 48.1 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 308 పరుగుల వద్ద ఉండగా మధ్యప్రదేశ్ తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. పాటిదార్ మెరుపు శతకం వల్ల మంగళవారం నాటి ఆఖరి రోజు ఆటలో భాగంగా హర్యానాకు 177 పరుగుల లక్ష్యం విధించగలిగింది.ఆర్సీబీకి స్ట్రాంగ్ మెసేజ్ఇక ఐపీఎల్-2025 మెగా వేలం సమీపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబరు 31 నాటికి ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాలను సమర్పించనున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో రజత్ పాటిదార్ సెంచరీ సాధించి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) యాజమాన్యానికి రేసులో తానూ ఉన్నాననే సందేశం ఇచ్చాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా గత కొన్నేళ్లుగా ఆర్సీబీకి ఆడుతున్న రజత్ పాటిదార్.. ఈ ఏడాది 395 పరుగులు సాధించాడు. చదవండి: IPL 2025: వాషింగ్టన్ సుందర్ కోసం ఎగబడుతున్న ఫ్రాంఛైజీలు -
IPL 2025: ‘ఆర్సీబీ రోహిత్ శర్మను కొని.. కెప్టెన్ చేయాలి’
ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గనుక వేలంలోకి వస్తే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అతడిని కొనుగోలు చేయాలని సూచించాడు. అంతేకాదు.. హిట్‌మ్యాన్‌ను ఆర్సీబీ తమ సారథిగా నియమిస్తే.. ట్రోఫీ గెలవాలన్న చిరకాల కల నెరవేరుతుందన్నాడు.కాగా 2008లో ఆరంభమైన ఐపీఎల్లో రోహిత్ శర్మ తొలుత దక్కన్ చార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. రెండో ఎడిషన్‌లో టైటిల్ గెలిచిన చార్జర్స్‌లో అతడు సభ్యుడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ రోహిత్‌ను కొనుగోలు చేసి.. జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ క్రమంలో తన కెప్టెన్సీ నైపుణాల్యతో ముంబైని ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు.తొలి కెప్టెన్‌గా రోహిత్ రికార్డుతద్వారా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. అయితే, ఈ ఏడాది ముంబై ఇండియన్స్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రోహిత్ శర్మపై వేటు వేసి.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాను తమ కెప్టెన్‌గా నియమించుకుంది.ఈ క్రమంలో అసంతృప్తికి లోనైన రోహిత్ శర్మ జట్టును వీడాలని నిర్ణయించుకున్నాడని.. ముంబై ఫ్రాంఛైజీతో అతడి బంధం ముగిసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. ‘‘రోహిత్ వేలంలోకి వస్తే ఆర్సీబీ.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.టైటిల్ కరువు తీరుతుందిఅంతేకాదు.. రోహిత్‌ను ఒప్పించి తమ కెప్టెన్‌గా నియమించుకోవాలి. బ్యాటర్‌గా రోహిత్ మరీ మునుపటిలా పరుగులు రాబట్టలేకపోవచ్చు. ఫార్టీ, ఫిఫ్టీస్ మాత్రం చేయగలడు. అయితే, కెప్టెన్‌గా తుదిజట్టు కూర్పును మాత్రం చక్కగా సెట్ చేస్తాడు. అతడి వల్ల ఆర్సీబీకి లాభం చేకూరుతుంది.టైటిల్ కరువు తీరుతుంది. ఏ ఆటగాడి సేవలను ఎప్పుడు ఎలా వాడుకోవాలో రోహిత్‌కు బాగా తెలుసు. కెప్టెన్‌గా తన ప్రణాళికలు, వ్యూహాలు అమోఘం. ఒకవేళ ఆర్సీబీకి గనుక అవకాశం దొరికితే.. రోహిత్ శర్మను కొని, కెప్టెన్ చేసుకుని తీరాల్సిందే’’ అని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా.. రోహిత్ ఐపీఎల్లో కొనసాగితే ఏదైనా ఒక జట్టుకు కెప్టెన్‌గా మాత్రమే ఉండాలని పేర్కొన్నాడు.మూడుసార్లు ఫైనల్ చేరిన ఆర్సీబీకాగా ఇప్పటి వరకు మూడుసార్లు ఫైనల్ చేరిన ఆర్సీబీ.. ఆఖరి గండాన్ని మాత్రం దాటలేకపోయింది. 2009లో దక్కన్ చార్జర్స్, 2011లో చెన్నై సూపర్ కింగ్స్, 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడి టైటిల్ మిస్ చేసుకుంది. ఇక టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి చాలాకాలం పాటు ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఆటగాడిగా అతడు బెంగళూరు ఫ్రాంఛైజీతోనే కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం విదితమే.చదవండి: అరంగేట్రం చేసిన నాలుగేళ్లకే పాక్ క్రికెటర్ రిటైర్మెంట్.. కానీ ఓ ట్విస్ట్! -
‘ఐపీఎల్లో చెత్తగా ఆడినా.. వరల్డ్‌కప్‌లో మాత్రం దుమ్ములేపుతాడు’
ఐపీఎల్-2024లో దారుణంగా విఫలమైన ఆటగాళ్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ‘స్టార్’ గ్లెన్ మాక్స్వెల్ ఒకడు. ఈ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కోసం ఆర్సీబీ యాజమాన్యం ఏకంగా రూ. 11 కోట్లు ఖర్చు చేసింది.మాక్సీ ఆట తీరుపై నమ్మకంతో ఈ మేరకు భారీ మొత్తానికి అతడిని రీటైన్ చేసుకుంది. కానీ ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మేనేజ్మెంట్, అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాడు.పదిహేడో ఎడిషన్ ఆరంభం నుంచే పేలవ ప్రదర్శనతో చతికిల పడ్డ మాక్స్వెల్.. మానసిక ఒత్తిడిని కారణంగా చూపి మధ్యలో కొన్ని మ్యాచ్‌లలో దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ కొన్ని మ్యాచ్‌లు ఆడగా.. మాక్సీ తిరిగి వచ్చి మళ్లీ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు.అయితే, ఓవరాల్‌గా ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 52 పరుగులు మాత్రమే చేశాడు. జట్టుకు అవసరమైన సమయంలో ముఖ్యంగా కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.ఇదిలా ఉంటే.. మాక్సీ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2024తో బిజీ కానున్నాడు. అయితే, ఐపీఎల్-2024లో అతడి ఫామ్‌లేమి ప్రభావం ఆస్ట్రేలియా జట్టుపై పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కీలక వ్యాఖ్యలు చేశాడు.‘‘ఐపీఎల్ ఫామ్‌తో అసలు సంబంధమే లేదు. మాక్సీ ఇప్పటికే తనను తాను ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. సుదీర్ఘకాలంగా మెగా టోర్నీల్లో అద్భుతంగా రాణించే ఆటగాడు.. పరిస్థితులను అర్థం చేసుకుని అందుకు తగ్గట్లుగా ఆడటంలో ఏమాత్రం వెనక్కి తగ్గడు.టీ20 క్రికెట్లో మిడిలార్డర్లో ఆడుతున్నపుడు కొన్నిసార్లు రిస్క్ తీసుకోకతప్పదు. ఒక్కసారి క్రీజులో కుదురుకుని మంచి ఇన్నింగ్స్ ఆడాడంటే తనకు తిరుగే ఉండదు.గతం గురించి చర్చ అనవసరం. గతాన్ని అతడు మార్చలేడు. అయితే, భవిష్యత్తును మాత్రం అందంగా మలచుకోగల సత్తా అతడికి ఉంది’’ అని ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా చెప్పుకొచ్చాడు.టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.ట్రావెలింగ్ రిజర్వ్స్: జేక్ ఫ్రేజర్ మెగర్క్, మాథ్యూ షార్ట్. -
నేనైతే వదిలేసేదాన్నేమో: దినేశ్ కార్తిక్ భార్య భావోద్వేగం
‘‘జీవితంలో ఎప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది. మేము 2013లో తొలిసారి ఒకరినొకరం నేరుగా కలిశాం. ఇద్దరి మనసులోనూ కలిసి జీవించాలనే ఆలోచనే వచ్చింది. ఆ తర్వాత అన్నీ సజావుగా సాగిపోయాయి.తనలో నాకు నచ్చే గొప్ప గుణం ఏమిటంటే.. ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగటం. బాగా ఆడలేక విమర్శలు ఎదుర్కొన్నపుడు.. జట్టులో స్థానం కరువైనపుడు రెండు- మూడు రోజుల పాటు కాస్త నిరాశగా కనిపిస్తాడు.తిరిగి వెంటనే కోలుకుని తర్వాత ఏం చేయాలన్న అంశంపై దృష్టి పెడతాడు. నాకు తెలిసి అలాంటి స్థితిలో వేరే ఎవరైనా ఉంటే కచ్చితంగా చాలా రోజుల పాటు కుంగిపోతారు.వదిలేసేదాన్నేమో!నేను కూడా అథ్లెట్‌నే కాబట్టి అప్పుడు అతడి మానసిక స్థితి ఎలా ఉంటుందో అంచనా వేయగలను. తన స్థానంలో గనుక నేనే ఉంటే.. ఇక చాల్లే అని వదిలేసేదాన్నేమో!కానీ తను అలా కాదు. తన కెరీర్లో వివిధ దశల్లో విభిన్న పాత్రలు పోషించాల్సి వచ్చింది. చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లోనూ తను పట్టుదలగా నిలబడ్డాడు.గతం కంటే మెరుగ్గా ఆడుతూ ముందుకు సాగాడు. డీకే తన జీవితంలో ఏవైతే సాధించాలనుకున్నాడో అన్నీ సాధించేశాడు. ఒక అథ్లెట్ లైఫ్‌లో అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు.అలాంటి వ్యక్తి ఇకపై ఆటకు దూరంగా ఉండాలంటే అంత సులువేమీ కాదు. అయితే, వ్యక్తిగతంగా తన జీవితంలో ముందుకు సాగాలని అతడు నిర్ణయించుకున్నాడు.తన కోసం, తన కుటుంబం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడు. తను సాధించిన విజయాలు మమ్మల్ని గర్వపడేలా చేశాయి’’ అని టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ భార్య దీపికా పళ్లికల్ ఉద్వేగానికి లోనయ్యారు.తన భర్త కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాడని.. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి తాను అనుకున్న స్థాయికి చేరుకున్నాడని తెలిపారు. కాగా ఐపీఎల్లో ఆరంభం నుంచి పదిహేడేళ్ల పాటు కొనసాగిన క్రికెటర్లలో ఒకడైన దినేశ్ కార్తిక్ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు.క్యాష్ రిచ్ లీగ్‌కు గుడ్బైఐపీఎల్-2024లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన అతడు ఎలిమినేటర్ మ్యాచ్‌లో చివరిసారిగా ఆడాడు. రాజస్తాన్ చేతిలో ఆర్సీబీ ఓటమి తర్వాత క్యాష్ రిచ్ లీగ్‌కు గుడ్‌బై చెప్పాడు. ఓటమితో తన ఐపీఎల్ కెరీర్ ముగించాడు.ఈ నేపథ్యంలో దినేశ్ కార్తిక్ భార్య, భారత స్క్వాష్ ప్లేయర్ దీపికా పళ్లికల్ పైవిధంగా స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా దీపికా పళ్లికల్ కామన్వెల్త్ గేమ్స్‌లో నాలుగుసార్లు భారత్ తరఫున పతకాలు సాధించారు. ఆసియా క్రీడలు, వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లోనూ మెడల్స్ గెలిచారు. డీకే- దీపిక 2015లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు(కవలలు) సంతానం.చదవండి: Dinesh Karthik: మొదటి భార్య మోసం: ఆ నవ్వే నన్ను ముంచేసింది!.. ఎల్లప్పుడూ నా వాడే!(ఫొటోలు)Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్! అరుదైన రికార్డులు.. దటీజ్ డీకే!DK, We love you! ❤ Not often do you find a cricketer who’s loved by everyone around him. DK is one, because he was smart, humble, honest, and gentle! Celebrating @DineshKarthik's career with stories from his best friends and family! 🤗#PlayBold #ನಮ್ಮRCB #WeLoveYouDK pic.twitter.com/fW3bLGMQER— Royal Challengers Bengaluru (@RCBTweets) May 24, 2024 -
టైమ్‌కి చెక్ వస్తుంది.. రూ. 11 కోట్లు.. ఇంకెందుకు ఆడటం?
‘‘అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో ఎంతో అనుభవం గడించాడు. ఆస్ట్రేలియా తరఫున ఎల్లప్పుడూ అద్భుతంగా ఆడతాడు. కానీ ఐపీఎల్‌కు వచ్చే సరికి.. అతడికి ఏమవుతుందో తెలియడం లేదు.బహుశా ఐపీఎల్ పట్ల అతడికి ఆసక్తి లేదేమో?!.. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు తాను అవుటైనా పర్లేదనకుంటాడేమో!.. అతడి బ్యాంకు బ్యాలెన్స్ నిండుగా ఉంది.సమయానికి చెక్ అందుతుంది. సహచర ఆటగాళ్లతో కలిసి రాత్రుళ్లు పార్టీలు.. నవ్వులు.. సరదాలు.. ఫొటోలకు ఫోజులు.. ఇంతే’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ గ్లెన్ మాక్స్వెల్ ఆట తీరును విమర్శిస్తూ అతడిపై మండిపడ్డాడు. ఫ్రాంఛైజీ నుంచి టైమ్‌కు చెక్కులు తీసుకోవడం మాత్రమే అతడికి తెలుసని.. ఆటపై అసలు ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2024 నేపథ్యంలో ఆసీస్ ఆల్‌రౌండర్ మాక్సీని ఆర్సీబీ రూ. 11 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే, ఈ సీజన్లో అతడు దారుణంగా విఫలమయ్యాడు. 10 ఇన్నింగ్స్ ఆడి కేవలం 52 పరుగులు చేశాడు. అదే విధంగా.. ఆరు వికెట్లు మాత్రమే తీయగలిగాడు ఈ ఆర్థోడాక్స్ బౌలర్.కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లోనూమానసికంగా అలసిపోయానంటూ కొన్నాళ్లు సెలవు కూడా తీసుకున్నాడు. ఇక కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ మాక్స్వెల్ తేలిపోయాడు. రాజస్తాన్ రాయల్స్‌తో అహ్మదాబాద్‌లో బుధవారం నాటి మ్యాచ్‌లో మాక్సీ డకౌట్ అయ్యాడు.టాపార్డర్‌లో విరాట్ కోహ్లి(33) ఒక్కడు ఫర్వాలేదనిపించగా.. ఫాఫ్ డుప్లెసిస్, కామెరాన్ గ్రీన్(27) త్వరగానే నిష్క్రమించారు. ఈ క్రమంలో నాలుగో నంబర్ బ్యాటర్ రజత్ పాటిదార్ 34 పరుగులతో ఆకట్టుకోగా.. ఐదో స్థానంలో వచ్చిన మాక్సీ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.క్వాలిఫయర్-2లో రాజస్తాన్మిగతా వాళ్లలో మహిపాల్ లామ్రోర్(17 బంతుల్లో 32) చెప్పుకోదగ్గ స్కోరు చేయగా.. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఇక ఆర్సీబీ విధించిన లక్ష్యాన్ని రాజస్తాన్ 19 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా క్వాలిఫయర్-2కి అర్హత సాధించింది. ఆర్సీబీ యథావిథిగా ఇంటిబాట పట్టింది.ఈ నేపథ్యంలో మనోజ్ తివారీ మాక్సీ ఆట తీరును విమర్శిస్తూ పైవిధంగా స్పందించాడు. అదే విధంగా ఆర్సీబీ స్థాయికి తగ్గట్లు రాణించలేదని.. వరుసగా ఆరు విజయాలు సాధించినా.. అసలు పోరులో ఓడిపోతే లాభం ఉండదంటూ పెదవి విరిచాడు.చదవండి: Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్! అరుదైన రికార్డులు.. దటీజ్ డీకే!🎥 𝐓𝐡𝐞 𝟏% 𝐜𝐡𝐚𝐧𝐜𝐞 ❤️They were down and out. But what followed next was a dramatic turnaround and comeback fuelled with belief and emotions 🙌 Well done, Royal Challengers Bengaluru 👏 👏 #TATAIPL | #RRvRCB | #Eliminator | #TheFinalCall | @RCBTweets pic.twitter.com/PLssOFbBvf— IndianPremierLeague (@IPL) May 23, 2024 -
విరాట్ కోహ్లి ఆర్సీబీని వీడాలి.. ఆ జట్టులో చేరాలి: ఇంగ్లండ్ స్టార్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. మళ్లీ పాత కథే.. ఐపీఎల్-2024లో వరుసగా ఆరు పరాజయాలు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి అవుటైనట్లే ఇక అనుకున్న సమయంలో అనూహ్య రీతిలో కమ్‌బ్యాక్.వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి టాప్-4లో అడుగు.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి ఎలిమినేటర్ మ్యాచ్‌కు అర్హత. ఈ గండం దాటితే క్వాలిఫయర్-2 ఆడొచ్చు. అక్కడా గెలిస్తే ఏకంగా ఫైనల్లో.. ఇక టైటిల్‌కు ఒకే ఒక్క అడుగు దూరం..ఆర్సీబీ జోరు చూస్తే ఈసారి కప్పు మనదే అనిపిస్తోందంటూ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సైతం.. రాజస్తాన్ రాయల్స్‌ను ఆర్సీబీ ఎలిమినేట్ చేయడం ఖాయమంటూ జోస్యాలు చెప్పారు.అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రాజస్తాన్ అద్భుత ఆట తీరుతో ఆర్సీబీ ఆశలను గల్లంతు చేసింది. వరుసగా ఓటముల తర్వాత.. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.ఫలితంగా ఆర్సీబీ పదిహేడేళ్ల కల ఈసారికీ కలగానే మిగిలిపోయింది. అయితే, సీజన్ ఆసాంతం ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకోవడం ఒక్కటే అభిమానులకు కాస్త ఊరట కలిగిస్తోంది.దుమ్ములేపిన కోహ్లి.. కానీ ఏం లాభం?ఈ ఎడిషన్‌లో కోహ్లి 15 ఇన్నింగ్స్‌లో కలిపి 741 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి ఇప్పటికైనా ఆర్సీబీని వదిలేయాలని విజ్ఞప్తి చేశాడు.‘‘ఇంతకు ముందు చెప్పాను.. ఇప్పుడూ అదే చెప్తున్నా. ఇతర క్రీడల్లోని దిగ్గజాలు సైతం ఒకానొక సమయంలో తమ సొంత జట్లను వదిలి వేరే చోటకు వెళ్లి టైటిల్స్ సాధించారు.ఆర్సీబీని వీడటమే ఉత్తమంఇప్పటికే కోహ్లి ఎంతగానో ప్రయత్నించాడు. మరోసారి ఆరెంజ్‌క్యాప్ కూడా సొంతం చేసుకున్నాడు. ఫ్రాంఛైజీ కోసం ఎంతో చేస్తున్నాడు. కానీ ఈసారి కూడా ఆర్సీబీ టైటిల్ గెలవడంలో విఫలమైంది. బ్రాండ్‌వాల్యూ పరంగా ఫ్రాంఛైజీతో కోహ్లి బంధం ఎలాంటిదో తెలుసు. అయినప్పటికీ.. ట్రోఫీ ముద్దాడేందుకు కోహ్లి నూటికి నూరుపాళ్లు అర్హుడు. కాబట్టి టైటిల్ గెలిచే సత్తా ఉన్న టీమ్‌లోకి అతడు వెళ్లాలని కోరుకుంటున్నా’’ అని ఆర్సీబీ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ పేర్కొన్నాడు.ఢిల్లీకి ఆడాలివచ్చే ఏడాది కోహ్లి ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారిపోవాలని సూచించాడు. సొంతగడ్డకు చెందిన ఫ్రాంఛైజీకి అతడు ప్రాతినిథ్యం వహిస్తే చూడాలని ఉందని.. ఈ సందర్భంగా ఫుట్‌బాల్ దిగ్గజాలు బెక్హాం, క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ తదితరులు ఫ్రాంఛైజీలు మారి విషయాన్ని పీటర్సన్ ప్రస్తావించాడు. కాగా ఐపీఎల్ ఆరంభం నుంచి అంటే 2008 నుంచి కోహ్లి ఆర్సీబీతోనే ఉన్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో 8 వేలకు పైగా పరుగులు పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించాడు.చదవండి: Hardik Pandya: భార్యతో హార్దిక్ పాండ్యాకు విభేదాలు?.. అతడి వల్లే అంటూ నటాషా పోస్ట్ వైరల్ -
ఐపీఎల్‌కు బైబై.. దినేశ్ కార్తిక్ రిటైర్ అయ్యాడా!.. వీడియో వైరల్
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫినిషర్ దినేశ్ కార్తిక్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు వీడ్కోలు పలికాడు. క్యాష్ రిచ్ లీగ్ నుంచి రిటైర్ అయ్యాడు.అయితే, రిటైర్మెంట్ గురించి డీకే నేరుగా ప్రకటించకపోయినా.. ఎలిమినేటర్ మ్యాచ్ తర్వాత మైదానంలో చోటు చేసుకున్న దృశ్యాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఐపీఎల్ నిర్వాహకులు సైతం సోషల్ మీడియా వేదికగా డీకే రిటైర్మెంట్ను నిర్ధారించారు.‘‘ఒక ఐపీఎల్ ట్రోఫీ.. అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన వికెట్ కీపర్.. 16 ఏళ్లు.. ఆరు జట్లు.. ఎన్నెన్నో జ్ఞాపకాలు.. థాంక్యూ డీకే’’ అంటూ జస్ట్ రిటైర్డ్ అనే బోర్డున్న కారు వెనకాల నిల్చున్న దినేశ్ కార్తిక్.. విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోని, హార్దిక్ పాండ్యాలకు టాటా చెప్తున్నట్లుగా ఉన్న ఫొటోను ఐపీఎల్ అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.కాగా ఐపీఎల్-2024లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ రాజస్తాన్ రాయల్స్‌తో తలపడింది. అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా టైటిల్ రేసు నుంచి నిష్క్రమించి ఇంటిబాట పట్టింది.అయితే, ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం డీకేను ఆర్సీబీ ప్లేయర్లు ఆత్మీయంగా హత్తుకున్నారు. ఇక అభిమానులకు అభివాదం చేస్తూ మైదానమంతా కలియదిరుగుతూ భావోద్వేగానికి గురైన దినేశ్ కార్తిక్.. వారి పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. ఆ సమయంలో ఆర్సీబీ ఆటగాళ్లు అతడి వెనకాలే నడుస్తూ కరతాళ ధ్వనులతో ఉత్సాహపరిచారు.ఓటమితో ఐపీఎల్ కెరీర్ ముగించిన డీకే ఉద్వేగానికి లోనుకాగా ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అతడిని హత్తుకుని.. ‘‘మరేం పర్లేదు’’ అంటూ ఓదార్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో #Happy Retirement DK అంటూ ఫ్యాన్స్ అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. From #RCB to Dinesh Karthik ❤️ #TATAIPL | #RRvRCB | #TheFinalCall | #Eliminator | @RCBTweets | @DineshKarthik pic.twitter.com/p2XI7A1Ta6— IndianPremierLeague (@IPL) May 22, 20241⃣ #TATAIPL 🏆2⃣nd - most dismissals by a WK in #IPL 💪3⃣rd - most appearances in the league's history! 🤯#IPLonJioCinema #RRvRCB #DineshKarthik #TATAIPLPlayoffs pic.twitter.com/dXYJz6skOi— JioCinema (@JioCinema) May 22, 2024 -
Virat Kohli: కీలక మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి షాక్?!
ఐపీఎల్-2024 ఆరంభంలో పేలవ ప్రదర్శనతో విమర్శలపాలైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఊహించని విజయాలతో ప్లే ఆఫ్స్‌నకు దూసుకువచ్చింది. లీగ్ దశలో వరుసగా ఆరు మ్యాచ్‌లలో ఓడిన తర్వాత కూడా ఏమాత్రం డీలాపడకుండా.. పట్టుదలగా పోరాడి టాప్-4లో స్థానం సంపాదించింది.ఆరు మ్యాచ్‌లలో వరుసగా గెలుపొంది రాజస్తాన్ రాయల్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌కు సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. ఈ నేపథ్యంలో కీలక మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.ఉగ్ర ముప్పు పొంచి ఉందనే సందేహాల నడుమ విరాట్ కోహ్లి భద్రతా కారణాల దృష్ట్యా ఆర్సీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆనంద్ బజార్ పత్రిక, హిందుస్థాన్ టైమ్స్ కథనం వెల్లడించింది. అహ్మదాబాద్‌లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి.అతడు జాతీయ నిధిఈ మేరకు.. ‘‘అహ్మదాబాద్ చేరుకోగానే ఈ విషయం గురించి విరాట్ కోహ్లికి తెలిసింది. అతడు జాతీయ నిధి. అతడి భద్రతే మా ప్రథమ ప్రాధాన్యం. ఆర్సీబీ ఈ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు.వాళ్లకు ఈ విషయం చెప్పిన తర్వాత ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేసుకున్నట్లు తెలిపింది. రాజస్తాన్ రాయల్స్‌కు కూడా ఈ విషయం గురించి తెలిసింది. అయితే, వాళ్లు యథాతథంగా ప్రాక్టీస్ చేశారు’’ అని పోలీస్ అధికారి విజయ్ సంఘా పేర్కొన్నట్లు హిందుస్థాన్ టైమ్స్ తెలిపింది.ఈ క్రమంలోనే గుజరాత్ కాలేజీ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయాల్సిన ఆర్సీబీ తమ ప్రాక్టీస్ సెషన్‌తో పాటు ప్రీ- ప్రెస్‌మీట్‌ను కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం... ఇందుకు ఉగ్ర ముప్పు కారణం కాదని తెలుస్తోంది.భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదు.. కారణం అదే‘‘భద్రతకు సంబంధించి ఎలాంటి అనుమానాలు లేవు. అంతగా సమస్య ఉందనుకుంటే ఇండోర్‌లో ప్రాక్టీస్ సెషన్ నిర్వహించుకోవచ్చని వాళ్లకు చెప్పాము. అయితే, వేడిమి తట్టుకోలేకమంటూ వాళ్లు సెషన్ రద్దు చేసుకున్నారు’’ అని అహ్మదాబాద్ స్టేడియం వద్ద పనిచేసే సిబ్బంది తెలిపినట్లు ఇండియా టుడే వెల్లడించింది. కారణాలు ఏమైనా మొత్తానికి కీలక మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ ప్రాక్టీస్ చేయలేదన్నది స్పష్టమైంది. ఒక రకంగా ఇది ఎదురుదెబ్బ లాంటిదే!చదవండి: RR vs RCB: వార్ వన్‌సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం -
Virat Kohli: రాజస్తాన్‌తో కీలక మ్యాచ్.. కోహ్లి ప్లాన్ ఇదే
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అద్భుతాలు చేసింది. వరుసగా ఆరు ఓటముల తర్వాత... అనూహ్య రీతిలో పుంజుకుని ఏకంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి టాప్-4కు అర్హత సాధించి.. టైటిల్ రేసులో నిలవగలిగింది.రాజస్తాన్ రాయల్స్‌తో అమీ తుమీఈ క్రమంలో ఎలిమినేటర్ రూపంలో తొలి గండం దాటేందుకు ఆర్సీబీ సిద్ధమైంది. రాజస్తాన్ రాయల్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో అమీ తుమీ తేల్చుకోనుంది.ఇక ఆర్సీబీ వరుస విజయాల్లో ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌తో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిది కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. కోహ్లి ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 14 ఇన్నింగ్స్‌లో కలిపి 708 పరుగులు సాధించాడు.తద్వారా టాప్ స్కోరర్‌గా కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్‌ను తన దగ్గరే పెట్టుకున్నాడు. ఇక రాజస్తాన్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ నేపథ్యంలో విరాట్ కోహ్లి తన ఆట తీరు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.బౌలర్ల విషయంలో నా ప్లాన్ ఇదే‘‘అతిగా ఆలోచించడం నాకు ఇష్టం ఉండదు. గణాంకాలను నేను పెద్దగా పట్టించుకోను. ప్రత్యర్థి జట్టు బౌలర్ .. రిస్ట్ పొజిషన్ ఏంటి? బాల్ ఎక్కడ వేస్తాడు? అన్న విశ్లేషణలకు సంబంధించిన వీడియోలు చూడను.ఎందుకంటే.. మ్యాచ్ నాటికి ఆ బౌలర్ సరికొత్త, విభిన్న ప్రణాళికతో మన ముందుకు రావచ్చు కదా! అందుకే నేను పరిస్థితులకు తగ్గట్లుగా ఆడేందుకే మొగ్గు చూపుతా.బౌలర్ బంతిని సంధించే సమయంలో కేవలం నా కళ్లను మాత్రమే నమ్ముకుంటా. బాల్‌కు రియాక్ట్ అయ్యే విషయంలో నా మెదడు ఏది చెబితే అదే చేస్తా. మనకు మనంగా నిర్ణయాలు తీసుకోగలిగితే సమస్యలకు సరైన పరిష్కారాలు కనుగొనే వీలుంటుందని నేను బలంగా నమ్ముతాను. బేసిక్స్ మర్చిపోనుకంప్యూటర్ అనాలసిస్‌తో పరిస్థితులను అంచనా వేయలేం. మైదానంలో అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలే ఫలితాలనిస్తాయి. బేసిక్స్‌ను నేనెప్పుడూ మర్చిపోను. వాటి ఆధారంగానే మూడు ఫార్మాట్లలోనూ నేను ఒకే విధంగా ఆడటానికి ఒక రకంగా ఇదే కారణం అని చెప్పవచ్చు’’ అని విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.చదవండి: RR vs RCB: వార్ వన్‌సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం Incredible Icon @imVkohli talks about his mentality when he walks out to bat! 👀Will he unsettle #RajasthanRoyals' bowlers today and take #RoyalChallengersBengaluru a step closer to the #IPLfinal?📺 | #RRvRCB #Eliminator | TODAY, 6:30 PM | #IPLOnStar | #PlayOffsOnStar pic.twitter.com/Kkc1L0QqEo— Star Sports (@StarSportsIndia) May 22, 2024 -
RR vs RCB: వార్ వన్‌సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం
ఐపీఎల్-2024 ఆఖరి అంకానికి చేరుకుంటోంది. ఇప్పటికే ఒక ఫైనలిస్టు ఖరారు కాగా.. తుది పోరుకు అర్హత సాధించేందుకు మిగిలిన మూడు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్ క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రైజర్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకువెళ్లింది కేకేఆర్.ఇక ఫైనల్ రేసులో మిగిలినవి రెండే మ్యాచ్‌లు. ఎలిమినేటర్, క్వాలిఫయర్-2. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది.సన్‌రైజర్స్‌తో ఎలిమినేటర్ విజేత పోటీఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. క్వాలిఫయర్-1లో కేకేఆర్ చేతిలో ఓడిన సన్‌రైజర్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. ఆ మ్యాచ్‌లో గనుక గెలిస్తే ఫైనల్‌కు చేరుకుంటుంది.ఈ క్రమంలో బెంగళూరు- రాజస్తాన్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్ సునిల్ గావస్కర్ ఎలిమినేటర్ విజేత ఎవరన్న అంశంపై తన అంచనా తెలియజేశాడు.‘‘ఆర్సీబీ ఈసారి ఎంతటి అద్భుతం చేసిందో చూశాం. ముఖ్యంగా వరుస పరాజయాల తర్వాత వాళ్లు తిరిగి పుంజుకున్న తీరు అమోఘం. మామూలు జట్లకు ఇలాంటివి సాధ్యం కావు.అయ్యో.. మనం ఓడిపోతూనే ఉన్నాంఆర్సీబీ ప్రధాన ఆటగాళ్లలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లితో పాటు మిగతా సీనియర్ ప్లేయర్లు తమ ఆట తీరుతో.. జట్టులో ఉత్సాహం నింపారు. ఆర్సీబీ స్థానంలో మరే ఇతర జట్టు ఏదైనా ఉంటే.. ‘అయ్యో.. మనం ఓడిపోతూనే ఉన్నాం. అంతా ముగిసిపోయింది’ అని బెంబేలెత్తిపోయేవాళ్లు.కానీ డుప్లెసిస్, కోహ్లి ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వలేదు. ఇక రాజస్తాన్.. గత నాలుగు- ఐదు మ్యాచ్‌లలో ఓడిపోతూనే ఉంది. ఆఖరిగా ఆడిన మ్యాచ్‌లోనూ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.వాళ్లను చూస్తే పూర్తిగా ఫామ్ కోల్పోయినట్లు కనిపిస్తున్నారు. పదకొండు రోజుల పాటు ఆటకు దూరంగా ఉన్న కేకేఆర్ మాదిరి ఏదైనా ప్రత్యేకంగా చేస్తే తప్ప రాజస్తాన్‌కు గెలిచే అవకాశాలు ఉండవు.లేదంటే మ్యాచ్ ఏకపక్షంగా సాగిపోయే ఛాన్స్ ఉంది. ఆర్సీబీ రాజస్తాన్‌ను చిత్తు చేసినా చేస్తుంది. ఒకవేళ అలా జరగకపోతేనే ఆశ్చర్యం’’ అని సునిల్ గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశాడు.గావస్కర్ వర్సెస్ కోహ్లికాగా ఇటీవల గావస్కర్- కోహ్లి మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. కోహ్లి స్ట్రైక్‌రేటు గురించి గావస్కర్ విమర్శించగా.. రన్‌మెషీన్ అందుకు కాస్త ఘాటుగానే బదులిచ్చాడు. ఎలా ఆడాలో తనకు తెలుసునని.. జట్టు ప్రయోజనాల కోసం ఏం చేయాలో కూడా తెలుసంటూ కౌంటర్ వేశాడు. -
IPL 2024: ధోనిని అవమానించిన ఆర్సీబీ ప్లేయర్లు!.. తప్పు ‘తలా’దేనా?
‘‘ప్రపంచకప్ ఫైనల్ గెలిచినా.. భావోద్వేగాలు ప్రతిబింబించేలా సంబరాలు చేసుకుంటున్న సమయంలోనూ ప్రత్యర్థి జట్టుతో కరచాలనం చేయడం మర్యాద. ‘మన మధ్య పోరు ముగిసిపోయింది.మన మధ్య ఇక ఎలాంటి శత్రుత్వం లేదు. ఇప్పటికి ఇది ముగిసిపోయింది’ అని ఇరు జట్లు పరస్పరం చెప్పుకోవడానికి ఇది(షేక్‌హ్యాండ్) ప్రతీక’’- హర్షా భోగ్లే, కామెంటేటర్.‘‘అతడొక ఐకానిక్ ప్లేయర్. వచ్చే ఏడాది ఆడతాడో లేదో కూడా తెలియదు. బహుశా ఇదే చివరి మ్యాచ్ కూడా అయి ఉండవచ్చు. అలాంటి లెజెండ్‌ను కలవడానికి ఆటగాళ్లు ఆసక్తిగా ఎదురుచూడటం సహజం.ఆ తర్వాత ఎంతసేపు సంబరాలు చేసుకున్నా ఎవరూ ఏమీ అనరు. కానీ అంతా ముగిసి తెల్లారిన తర్వాత.. ‘అయ్యో.. ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ప్రకటించాడు.కానీ మనం ఆయనకు డీసెంట్‌గా ఓ షేక్‌హ్యాండ్‌తో వీడ్కోలు పలకలేకపోయామే’ అని బాధ పడితే ప్రయోజనం ఉంటుందా?’’- ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్.ధోనికి అవమానంచెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని పట్ల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు వ్యవహరించిన తీరుపట్ల ఇలా కామెంటేటర్లు, మాజీ క్రికెటర్లు విరుచుకుపడ్డారు. ఐపీఎల్లో రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్)తో పాటు ఐదుసార్లు ట్రోఫీ సాధించిన దిగ్గజం పట్ల ఆర్సీబీ ప్లేయర్లు ప్రవర్తించిన విధానం అవమానకరమని మండిపడుతున్నారు.ఇక ధోని అభిమానులైతే ఆర్సీబీ జట్టును సోషల్ మీడియా వేదికగా పదునైన కామెంట్లతో తూర్పారబడుతున్నారు. అయితే, తాజాగా ఓ నెటిజన్ కొత్త వీడియోను తెరమీదకు తెచ్చారు. ధోనికి మద్దతుగా మాట్లాడే వారందరూ ఒక్కసారి ఈ దృశ్యాలను చూడాలంటూ కొత్త చర్చకు దారితీశారు.ఇంతకీ ఏం జరిగింది?... ఐపీఎల్-2024 ఆరంభం నుంచి వరుస పరాజయాలతో చతికిలపడ్డ ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్ రేసులో వరుసగా ఆరు మ్యాచ్‌లలో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది.లీగ్ దశలో సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా చెన్నైని ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పించి.. టాప్-4 బెర్తును ఖరారు చేసుకుంది.ధోనిని పట్టించుకోని ఆర్సీబీ ఆటగాళ్లు?ఈ క్రమంలో ఆర్సీబీ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఫైనల్ గెలిచినంతంగా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ధోని సహా మిగిలిన చెన్నై ఆటగాళ్లు కరచాలనం చేసేందుకు వచ్చారు. అయితే, ఆర్సీబీ సెలబ్రేషన్స్ పూర్తికాకపోవడంతో వీళ్లను పట్టించుకోలేదు. దీంతో చిన్నబుచ్చుకున్న ధోని డ్రెసింగ్‌రూంకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మిగతా ఆటగాళ్లు కాసేపు వేచి చూడగా.. ఎట్టకేలకే ఆర్సీబీ ప్లేయర్లు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు.ఈ నేపథ్యంలో ధోని మూడు నిమిషాల పాటు ఎదురుచూసినా ఆర్సీబీ ఆటగాళ్లు షేక్‌హ్యాండ్ కోసం రాలేదని.. తలాను ఘోరంగా అవమానించారంటూ విరాట్ కోహ్లి సహా ఆర్సీబీ ఆటగాళ్లందరిపై సీఎస్కే ఫ్యాన్స్ మండిపడ్డారు.అసలు నిజం ఇదేనంటూఈ క్రమంలో ఓ వ్యక్తి నిజం ఇదేనంటూ.. ‘‘ధోని మూడు నిమిషాలు వేచి చూశాడని అభిమానులు అంటున్నారు. అయితే, అతడు కాసేపు కూడా ఎదురుచూడకుండా వెళ్లిపోయాడు. గెలిచిన జట్టుకు ఆమాత్రం సెలబ్రేట్ చేసుకునే హక్కులేదా? సీఎస్కే గతేడాది ట్రోఫీ గెలిచినపుడు సంబరాలు చేసుకుందా? లేదంటే షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి వెళ్లిందా? ’’ అని ఓ వీడియోను పంచుకున్నారు. ఇది ఇప్పుడు ఆర్సీబీ- సీఎస్కే ఫ్యాన్స్ మధ్య మరోసారి మాటల యుద్ధానికి తెరతీసింది.చదవండి: KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్ చేరే తొలి జట్టు ఇదే: పాక్ లెజెండ్I can understand he’s pissed but every other player came to shake hands. Those players deserved to have that moment. When CSK won last year should they have gone around celebrating or gone to shake hands? https://t.co/MPXQ9zVOYo pic.twitter.com/TxKA2My6xD— Pradhyoth (@Pradhyoth1) May 19, 2024#THALAFOREVER 🦁💛@msdhoni pic.twitter.com/zOu5KABAcP— Chennai Super Kings (@ChennaiIPL) May 19, 2024 -
యశ్ దయాల్‌పై కోహ్లి ఫైర్.. దెబ్బకు ధోని ఖేల్ ఖతం!
ఐపీఎల్-2024లో ప్లే ఆఫ్స్ చివరి బెర్తును ఖరారు చేసే పోటీలో చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నువ్వా- నేనా అన్నట్లుగా తలపడ్డాయి. వర్షం రాకతో ఆరంభం నుంచే ఆసక్తి రేపుతూ.. హోరీహోరీగా సాగిన ఈ పోరులో ఎట్టకేలకు ఆర్సీబీదే పైచేయి అయింది.ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్ సత్తా చాటి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. సమిష్టి ప్రదర్శనతో చెన్నైకి చెక్ పెట్టి టాప్-4కు అర్హత సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ ఎంచుకుంది.మూడు ఓవర్ల పాటు ఆర్సీబీ బ్యాటింగ్ పూర్తైన తరుణంలో వరణుడి రాక అభిమానులను కలవరపెట్టింది. అయితే, కాసేపటికే మ్యాచ్ తిరిగి ఆరంభమైంది. ఈ క్రమంలో ఓపెనర్లు విరాట్ కోహ్లి(47), ఫాఫ్ డుప్లెసిస్(54).. వన్‌డౌన్ బ్యాటర్ రజత్ పాటిదార్(41) రాణించారు.వీరికి తోడు నాలుగో నంబర్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ ధనాధన్ ఇన్నింగ్స్(17 బంతుల్లో 38 నాటౌట్)తో చెలరేగాడు. మిగతా వాళ్లలో దినేశ్ కార్తిక్ 14, మాక్స్వెల్(16) ఫర్వాలేదనిపించారు. ఈ క్రమంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 218 పరుగులు చేసింది.చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే ఆరంభంలోనే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(0) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర(61) రాణించగా.. అజింక్య రహానే(33) అతడికి సహకరించాడు.రవీంద్ర జడేజా సైతం 22 బంతుల్లో 42 పరుగులతో దుమ్ములేపాడు. మహేంద్ర సింగ్ ధోని కూడా మెరుపులు(13 బంతుల్లో 25) మెరిపించాడు. కానీ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా సీఎస్కే బ్యాటర్లు చేతులెత్తేశారు.కాగా అనూహ్య రీతిలో చివరి ఓవర్లో ఆర్సీబీ సారథి డుప్లెసిస్ బంతిని యశ్ దయాల్ చేతికి ఇచ్చాడు.అతడి బౌలింగ్‌లో తొలి బంతికే ధోని సిక్సర్ బాది ఆశలు రేకెత్తించాడు. సమీకరణం 5 బంతుల్లో 11 పరుగులుగా మారింది.దయాల్ అప్పటికే తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లి అతడికి దగ్గరికి దిశా నిర్దేశం చేశాడు. ధోని లాంటి లెజెండ్ క్రీజులో ఉన్నపుడు యార్కర్ కాదు స్లో బాల్ వేయాలంటూ కాస్త గట్టిగానే హెచ్చరించాడు.దీంతో యశ్ దయాల్ ధోనికి స్లో బాల్ సంధించగా.. ట్రాప్‌లో చిక్కుకున్న తలా స్వప్నిల్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఆర్సీబీ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. ఇక మిగిలిన నాలుగు బంతుల్లో సీఎస్కే కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించడంతో.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరింది.అలా కోహ్లి దెబ్బకు సెట్ అయిన యశ్ దయాల్ కీలక వికెట్ తీసి ఆర్సీబీ గెలుపునకు ప్రధాన కారణమయ్యాడు. కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆద్యంతం కీలక సమయంలో ఆటగాళ్లకు సూచనలు ఇస్తూ సానుకూల ఫలితాలు రాబట్టడం విశేషం. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఫాఫ్ డుప్లెసిస్ తన అవార్డును యశ్ దయాల్‌కు అంకితమివ్వడం మరో విశేషం. Nail-biting overs like these 📈Describe your final over emotions with an emoji 🔽Recap the match on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #RCBvCSK pic.twitter.com/XYVYvXfton— IndianPremierLeague (@IPL) May 18, 2024pic.twitter.com/xgmfhb0Fri— The Game Changer (@TheGame_26) May 19, 2024 -
RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
ఆర్సీబీ.. ఆర్సీబీ.. ఆర్సీబీ.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే పేరు.. ఆర్సీబీ నామస్మరణతో హోరెత్తుతూ ఆగని జోరు... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఏకంగా ఐపీఎల్-2024 టైటిల్ సాధించిందా? అన్నంతగా సంబరాలు..ఖండాంతరాలు దాటిన సంబురం.. అమెరికాలోనూ పేలుతున్న విన్నింగ్ క్రాకర్స్.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరిన క్రమంలో ‘నమ్మ బెంగళూరు’ అంటూ కనీవినీ ఎరుగని రీతిలో సెలబ్రేషన్స్.. అంత ప్రత్యేకమాఈ విజయం అంత ప్రత్యేకమా అంటే అవుననే చెప్పాలి. ఇంత వరకు ఒక్కసారి కూడా ఆర్సీబీ టైటిల్ గెలవనే లేదు. అయితే, అనూహ్య రీతిలో ఈసారి మహిళా ప్రీమియర్ లీగ్ రూపంలో తొలిసారి బెంగళూరు ఫ్రాంఛైజీకి ట్రోఫీ దక్కింది.స్మృతి మంధాన కెప్టెన్సీలో ఆర్సీబీ వుమెన్ టీమ్ కప్ కొట్టింది. ఇదే జోరులో పురుషుల జట్టు కూడా ఈసారి ట్రోఫీ సాధిస్తుందని.. టైటిల్ లేదన్న వెలితిని పూరిస్తుందని అభిమానులు ఆశపడ్డారు. అయితే, ఆరంభ మ్యాచ్‌లోనే ఆర్సీబీ ఓటమిపాలైంది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాజయంతో సీజన్‌ను మొదలుపెట్టింది.ఆ తర్వాత సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించిన బెంగళూరు జట్టు.. అదే జోరును కొనసాగించలేకపోయింది. వరుస వైఫల్యాలతో చతికిల పడి ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించే తొలి జట్టు అవుతుందేమోనన్న భావన కలిగించింది. KGF త్రయంలో విరాట్ కోహ్లి రాణించినా గ్లెన్ మాక్స్వెల్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అంచనాలు అందుకోలేకపోయారు.మాక్సీ కొన్నాళ్లు జట్టుకు దూరంగాఫలితంగా విమర్శల పాలయ్యారు. దీంతో మాక్సీ కొన్నాళ్లు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ చేరాలంటే ప్రతి మ్యాచ్‌లోనూ చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. నిజానికి ఇలాంటి ఒత్తిడిలో ఏ జట్టైనా చిత్తవుతుంది. కానీ ఆర్సీబీ అందుకు విరుద్ధం.ఎంత ఒత్తిడి పెరిగితే అంతగా చెలరేగిపోతాం అన్నట్లుగా వరుసగా ఆరు విజయాలు సాధించి.. ఇప్పుడిలా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఊహించని విజయం సాధించింది. రిపీట్ అవుతుందా?సీఎస్కేపై గెలిచినా నెట్ రన్‌రేటు పరంగా కూడా ఆ జట్టు కంటే మెరుగైన స్థితిలో ఉంటేనే టాప్-4కు అర్హత సాధిస్తుందన్న తరుణంలో అద్భుతం చేసి.. టాప్-4కు అర్హత సాధించింది. కాగా 2016లోనూ ఆరంభంలో ఆకట్టుకోలేకపోయిన ఆర్సీబీ.. ఆ తర్వాత వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ చేరి.. అటుపై ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతమవుతుందని అభిమానులు భావిస్తున్నారు. కాగా 2016 ఫైనల్లో ఆర్సీబీ సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే.ఆర్సీబీ వర్సెస్ చెన్నై స్కోర్లు👉వేదిక: చిన్నస్వామి స్టేడియం.. బెంగళూరు👉టాస్: చెన్నై.. బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 218/5 (20)👉చెన్నై స్కోరు: 191/7 (20)👉ఫలితం: చెన్నైపై 27 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్స్‌లో ఎంట్రీ👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఫాప్ డుప్లెసిస్(39 బంతుల్లో 54, కీలక సమయంలో రెండు క్యాచ్‌లు).చదవండి: Virat Kohli: కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క.. వీడియో వైరల్ Winning celebration of RCB in North America right now🔥🔥.Bigger than any franchise.RCB , RCB , RCB . pic.twitter.com/2M2FipXGYX— Kohlified. (@123perthclassic) May 19, 2024Winning celebration of RCB near Trump building Chicago. right now🔥🔥.Bigger than any franchise.RCB , RCB , RCB . pic.twitter.com/dy1Oko6QS7— #RCBNation (@9Sxventy3) May 19, 2024Bengaluru won't sleep tonight 😎RCB RCB all over the city @RCBTweets ❤️🔥pic.twitter.com/6jvvAAVERT— M. (@RCB_Hiv3) May 18, 2024Hear the Roar, Hear "Kohli, Kohli & RCB, RCB" Chants when they qualify for playoffs.- King Kohli & RCB are emotions..!!!! pic.twitter.com/Afqck4jNSH— Tanuj Singh (@ImTanujSingh) May 18, 2024📽️ RAW Reactions post a surreal win ❤️When emotions spoke louder than words at Chinnaswamy 🏟️A special lap of honour for the @RCBTweets fans that continue to believe in their side 👏👏#TATAIPL | #RCBvCSK pic.twitter.com/CrBQUBRKEI— IndianPremierLeague (@IPL) May 19, 2024 -
Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు తుది అంకానికి చేరుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ బెర్తులు ఖరారు చేసుకోగా.. నాలుగో స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య గట్టి పోటీ నెలకొంది.బెంగళూరు వేదికగా ఈ రెండు జట్లు శనివారం తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే సూచనలు ఉన్నాయి. ఒకవేళ వాన వల్ల మ్యాచ్ రద్దైతే మాత్రం ఎలాంటి సమీకరణలతో పనిలేకుండా చెన్నై టాప్-4కు దూసుకువెళ్తుంది.బహుశా ఇదే ఆఖరిసారిఇదిలా ఉంటే.. చెన్నై సూపర్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనికి ఇదే ఆఖరి సీజన్ అన్న వార్తల నేపథ్యంలో ఆర్సీబీ మేటి క్రికెటర్ విరాట్ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మహీ భాయ్.. నేను మరోసారి కలిసి(ప్రత్యర్థులుగా) ఆడబోతున్నాం.బహుశా ఇదే ఆఖరిసారి కావొచ్చేమో ఎవరికి తెలుసు! ఏదేమైనా మా అభిమానులకు ఇదొక గొప్ప కానుకలాంటిదే. టీమిండియాలో ఇద్దరం కలిసి ఎన్నో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాం.మహీ భాయ్ తన ఫినిషింగ్ టచ్‌తో ఎన్నో మ్యాచ్‌లలో జట్టును గెలిపించాడని అందరికీ తెలిసిందే’’ అని కోహ్లి పేర్కొన్నాడు. ఐపీఎల్లో ధోనితో కలిసి ఆడే ఆఖరి మ్యాచ్ ఇదే కావొచ్చంటూ.. ధోని రిటైర్మెంట్పై కోహ్లి సంకేతాలు ఇచ్చాడు.రుతురాజ్ గైక్వాడ్‌కు పగ్గాలుకాగా 42 ఏళ్ల ధోని చెన్నై సూపర్ కింగ్స్‌ను ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. అయితే, ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే కెప్టెన్సీ పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించిన తలా.. వికెట్‌కీపర్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.ఈ సీజన్లో పలు మ్యాచ్‌లలో వింటేజ్ ధోనిని తలపిస్తూ పరుగుల విధ్వంసం సృష్టించిన మహీ.. 10 ఇన్నింగ్స్‌లో కలిపి 136 పరుగులు సాధించాడు. మోకాలి నొప్పి వేధిస్తున్నా సీఎస్కే తరఫున బరిలోకి దిగిన అతడు.. వచ్చే సీజన్లో ఆటకు గుడ్‌బై చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లి వ్యాఖ్యలు ధోని రిటైర్మెంట్ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చాయి.చదవండి: MI: అంతా ఫేక్!.. అర్జున్ టెండుల్కర్ ఓవరాక్షన్.. ఆ తర్వాత ఇలా!