విరాట్ కోహ్లి (PC: BCCI/IPL)
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ ఐదో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో శనివారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది.
ఇక ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఆర్సీబీ కేవలం ఒకటి మాత్రమే గెలిచింది. ఫలితంగా రెండు పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది.
మరోవైపు.. రాజస్తాన్ రాయల్స్ హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదుంది. ఆడిన మూడు మ్యాచ్‌లలో మూడూ గెలిచి ఆరు పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే, ఇరుజట్ల మధ్య ముఖాముఖి పోరులో ఆర్సీబీదే పైచేయి.
ఆర్సీబీదే పైచేయి.. కానీ
ఇప్పటి వరకు రాజస్తాన్‌తో ఆడిన 30 మ్యాచ్‌లలో బెంగళూరు 15సార్లు గెలిచి.. 12 సార్లు ఓటమిపాలైంది. మూడు మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. ఓవరాల్‌గా రాయల్స్‌పై ఆర్సీబీదే పైచేయి అయినప్పటికీ రాజస్తాన్‌తో మ్యాచ్ అంటే ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అభిమానులు వణికిపోతున్నారు.
ఇప్పటి వరకు జైపూర్ స్టేడియంలో కోహ్లికి ఉన్న పేలవ రికార్డే(ఐపీఎల్‌లో) ఇందుకు కారణం. అంతర్జాతీయ మ్యాచ్‌లలో కోహ్లి ఇక్కడ హీరోనే. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడి 195 పరుగులతో అదరగొట్టాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి.
కోహ్లి ఫాస్టెస్ట్ సెంచరీ ఇక్కడే.. ఐపీఎల్‌లో మాత్రం వరస్ట్
ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా 2013లో ఇక్కడ వన్డే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు కోహ్లి. కేవలం 52 బంతుల్లోనే వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. కానీ.. ఐపీఎల్‌లో మాత్రం ఒక్కసారి కూడా కనీసం యాభై పరుగుల మార్కు అందుకోలేకపోయాడు.
సవాయి మాన్‌సింగ్ స్టేడియంలో మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడి కోహ్లి సాధించిన పరుగులు కేవలం 149. అత్యధిక స్కోరు 39 నాటౌట్. ఐపీఎల్‌లో కోహ్లి వరస్ట్ యావరేజ్ కూడా ఇక్కడే.
సందీప్ శర్మ బౌలింగ్‌లో ఏడుసార్లు
ఇక ఆఖరిగా రాజస్తాన్ రాయల్స్‌తో ఇక్కడ ఆడిన మ్యాచ్‌లో కోహ్లి 19 బంతులు ఎదుర్కొని 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కాగా రాజస్తాన్ పేసర్ సందీప్ శర్మ ఐపీఎల్‌లో కోహ్లిపై ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు అతడి బౌలింగ్‌లో కోహ్లి 67 బంతులు ఎదుర్కొని కేవలం 87 రన్స్ చేశాడు. ఏడుసార్లు అతడి బౌలింగ్‌లో అవుటయ్యాడు కూడా!
ఇక ఈ సీజన్ ఆరంభం నుంచి కోహ్లి ఒక్కడే ఆర్సీబీ టాపార్డర్‌లో రాణిస్తున్నాడు. ఇక్కడ గనుక గత సెంటిమెంట్ రిపీట్ చేస్తూ త్వరగానే పెవిలియన్ చేరితే అంతే సంగతులు!!
రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ ఆర్సీబీ తుదిజట్ల అంచనా
రాజస్తాన్
జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్/ వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మైర్, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, సందీప్ శర్మ(గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చే ఛాన్స్)/నండ్రీ బర్గర్, ఆవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్. [ఇంపాక్ట్ ప్లేయర్ - శుభమ్ దూబే].
ఆర్సీబీ
విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, మయాంక్ దాగర్, రీస్ టాప్లీ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్. [ఇంపాక్ట్ ప్లేయర్ - మహిపాల్ లోమ్రోర్].
చదవండి: జడ్డూ అవుట్ కావాలి కదా? కమిన్స్ ఎందుకు వదిలేశాడు? వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment