Rajasthan Royals
-
IPL 2025: సంజూ శాంసన్ కీలక నిర్ణయం!.. ఇకపై..
భారత స్టార్ క్రికెటర్, రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025లో తాను కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగుతాననే సంకేతాలు ఇచ్చాడు. వికెట్ కీపర్ బాధ్యతలను ఓ యువ ఆటగాడికి అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నాడు. కాగా 2021లో రాజస్తాన్ రాయల్స్ సారథిగా పగ్గాలు చేపట్టాడు సంజూ శాంసన్.కెప్టెన్‌గా హిట్ఆ మరుసటి ఏడాదే అంటే.. 2022లో రాజస్తాన్‌ను ఫైనల్ చేర్చి సత్తా చాటాడు. 2008 తర్వాత ఆ జట్టు మళ్లీ తుదిపోరుకు అర్హత సాధించడం అదే తొలిసారి. అయితే, 2023లో మాత్రం ప్లే ఆఫ్స్ చేర్చలేకపోయినప్పటికీ ఐదో స్థానంలో నిలపగలిగాడు. ఇక తాజా ఎడిషన్‌లో మాత్రం రాజస్తాన్‌ను మరోమారు ఆఫ్స్‌లో నిలబెట్టాడు సంజూ.అతడి కోసం త్యాగం చేసేందుకు సిద్దంఇలా గత మూడేళ్లుగా రాజస్తాన్‌ను మెరుగైన స్థితిలో నిలపడంలో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే, వచ్చే ఏడాది మాత్రం ధ్రువ్ జురెల్ కోసం వికెట్ కీపర్‌గా తన స్థానాన్ని త్యాగం చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు సంజూ తాజాగా వెల్లడించాడు.నాకు ఇదొక పెద్ద సవాలే.. అయినా‘‘ధ్రువ్ జురెల్ ప్రస్తుతం టెస్టుల్లో సెకండ్ వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌లోనూ అతడు కీపింగ్ బాధ్యతలు నిర్వహిస్తే అతడి అంతర్జాతీయ కెరీర్‌కు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విషయం గురించి మేము చర్చలు జరుపుతున్నాం.జురెల్‌తో కలిసి కీపింగ్ బాధ్యతలు పంచుకోవాలనే ఆలోచనలో ఉన్నాను. నిజానికి.. నేను కేవలం ఓ ఫీల్డర్‌గా ఎప్పుడూ కెప్టెన్సీ చేయలేదు. కాబట్టి నాకు ఇదొక పెద్ద సవాలే. అయితే.. ధ్రువ్ విధుల పట్ల మాత్రం స్పష్టతతో ఉన్నాను.నాయకుడిగా నా బాధ్యత.. అందుకే ఈ నిర్ణయంనేను అతడితో ఇప్పటికే ఈ విషయం గురించి మాట్లాడాను. ‘‘చూడు ధ్రువ్.. నాయకుడిగా నేను నీ గురించి తప్పక ఆలోచిస్తాను. ఐపీఎల్లో కొన్ని మ్యాచ్‌లలో కీపింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండు’’ అని చెప్పాను. ఏదేమైనా మాకు జట్టు ప్రయోజనాలే ముఖ్యం.అయితే, ఆటగాళ్ల వ్యక్తిగత ఎదుగుల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అందుకే వికెట్ కీపింగ్ బాధ్యతలు పంచుకునే దిశగా ఆలోచనలు చేస్తున్నాం’’ అని సంజూ శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ సంజూ ఈ మేరకు తన ఆలోచినలు, నిర్ణయం గురించి వెల్లడించాడు.రూ. 18 కోట్లకుకాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు రాజస్తాన్.. సంజూ శాంసన్‌ను రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. అతడితో పాటు యశస్వి జైస్వాల్(రూ. 18 కోట్లు ), రియాన్ పరాగ్(రూ. 14 కోట్లు)ధ్రువ్ జురెల్(రూ. 14 కోట్లు), హెట్‌మైర్(రూ. 11 కోట్లు), సందీప్ శర్మ(రూ. 4 కోట్లు)లను అట్టిపెట్టుకుంది.ఐపీఎల్ వేలం-2025 తర్వాత రాజస్తాన్ జట్టుయశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, షిమ్రన్ హెట్‌మైర్, సందీప్‌శర్మ, జోఫ్రా ఆర్చర్ (రూ.12.50 కోట్లు), తుషార్ దేశ్‌పాండే (రూ.6.50 కోట్లు), వనిందు హసరంగ (రూ.5.25 కోట్లు),మహీశ్ తీక్షణ (రూ.4.40 కోట్లు), నితీశ్ రాణా (రూ. 4.20 కోట్లు), ఫజల్హక్ ఫారూకీ(రూ. 2 కోట్లు), క్వెనా మఫాక (రూ. 1.50 కోట్లు), ఆకాశ్ మధ్వాల్ (రూ.1.20 కోట్లు), వైభవ్ సూర్యవంశి (రూ. 1.10 కోట్లు), శుభమ్ దూబే (రూ. 80 లక్షలు), యుద్వీర్ చరక్ (రూ. 35 లక్షలు), కుమార్ కార్తికేయ (రూ.30 లక్షలు), అశోక్ శర్మ (రూ. 30 లక్షలు), కునాల్‌సింగ్ (రూ. 30 లక్షలు).చదవండి: పాకిస్తాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి జట్టుగా ఘనత -
సరికొత్త రికార్డు నెలకొల్పిన వైభవ్ సూర్యవంశీ
టీనేజీ సంచలనం, రాజస్థాన్ రాయల్స్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ లిస్ట్-ఏ క్రికెట్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 13 ఏళ్ల వైభవ్.. లిస్ట్-ఏ క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడైన భారతీయ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ (బీహార్) ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు అలీ అక్బర్ పేరిట ఉండేది. అలీ 14 ఏళ్ల 51 రోజుల వయసులో లిస్ట్-ఏ క్రికెట్లోని అరంగేట్రం చేశాడు. తాజాగా వైభవ్ అలీ రికార్డును బద్దలు కొట్టాడు. వైభవ్ లిస్ట్-ఏ క్రికెట్‌తో పాటు రంజీల్లో మరియు అండర్-19 స్థాయిలో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగానూ రికార్డు కలిగి ఉన్నాడు.కాగా, వైభవ్ లిస్ట్-ఏ అరంగేట్రం ఊహించినంత సజావుగా సాగలేదు. మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి బంతికే బౌండరీ బాదిన వైభవ్ ఆతర్వాతి బంతికే ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ ప్రాతినిథ్యం వహించిన బీహార్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన బీహార్ 46.4 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. బిపిన్ సౌరభ్ (50), గనీ (48), ప్రబల్ ప్రతాప్ సింగ్ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 3, ఆర్యన్ పాండే, కుల్వంత్ కేజ్రోలియా తలో 2, వెంకటేశ్ అయ్యర్, కుమార్ కార్తికేయ తలో వికెట్ పడగొట్టారు.197 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ 25.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ హర్ష్ గావ్లి (83), కెప్టెన్ రజత్ పాటిదార్ (55) అర్ద సెంచరీలతో రాణించి మధ్యప్రదేశ్‌ను గెలిపించారు. ఇదిలా ఉంటే, ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. -
సచిన్, కోహ్లి కాదు! 13 ఏళ్ల చిచ్చరపిడుగుకు ఆదర్శం ఇతడే!
వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ వర్గాల్లో ఇప్పుడీ పేరు హాట్‌టాపిక్. పన్నెండేళ్ల వయసులోనే రంజీ మ్యాచ్ ఆడిన ఈ బిహారీ చిచ్చరపిడుగు... ఇటీవలే మరో అరుదైన ఘనత సాధించాడు. అత్యంత పిన్నవయసులోనే ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయి సరికొత్త చరిత్ర సృష్టించాడు.పదమూడేళ్ల ఈ కుర్రాడి కోసం రాజస్తాన్ రాయల్స్ రూ. 1.10 కోట్లు ఖర్చు చేసింది. కాగా ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ అండర్-19 ఆసియా కప్ టోర్నీతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో టోర్నీ అధికారిక బ్రాడ్‌కాస్టర్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో మాట్లాడిన వైభవ్ తన ఐడల్ ఎవరో చెప్పేశాడు. సచిన్, కోహ్లి కాదు! అతడే ఆదర్శంమెజారిటీ మంది టీమిండియా అభిమానులు ఊహించినట్లుగా వైభవ్ సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్, రోహిత్ శర్మల పేరు చెప్పలేదు. అతడికి వెస్టిండీస్ దిగ్గజం లారా ఆదర్శమట. ‘‘బ్రియన్ లారా నాకు ఆదర్శం. నేను ఆయనలా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాను. అయితే, నాదైన సహజ శైలిని మాత్రం విడిచిపెట్టను. నాకున్న నైపుణ్యాలను మరింత పెంపొందించుకునేందుకు కృషి చేస్తా. ప్రస్తుతం నా దృష్టి మొత్తం ఈ టోర్నీ మీదే ఉంది. నా చుట్టూ ఏం జరుగుతుందన్న విషయంతో సంబంధం లేదు’’ అని వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.పట్టించుకోనుఐపీఎల్లో తన డిమాండ్, తన వయసు పదమూడు కాదు.. పదిహేను అంటూ వస్తున్న ఆరోపణలను పట్టించుకోనని వైభవ్ కుండబద్దలుకొట్టాడు. కాగా దుబాయ్ వేదికగా అండర్-19 ఆసియా కప్ తొలి మ్యాచ్‌లోనే భారత్‌కు చేదు అనుభవం ఎదురైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో 44 పరుగుల తేడాతో అమాన్ సేన ఓటమిని మూటగట్టుకుంది. ఇక శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్ ఒకే ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు. యువ టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో జపాన్‌తో ఆడనుంది. చదవండి: IPL 2025: అతడే గనుక బతికి ఉంటే.. పంత్ రికార్డు బ్రేక్ చేసేవాడు! Vaibhav Sooryavanshi gears up for the big stage 🌟 🗣️ Hear from India’s rising star as the action unfolds against Pakistan 🎤 #SonySportsNetwork #NextGenBlue #AsiaCup #NewHomeOfAsiaCup #INDvPAK pic.twitter.com/PLG8UlvB6i— Sony Sports Network (@SonySportsNetwk) November 30, 2024 -
పదమూడు కాదు.. పదిహేను!.. రూ. 1.10 కోట్లు.. మాకేం భయం లేదు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలం చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో అమ్ముడుపోయిన క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు వైభవ్ సూర్యవంశీ. క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు అతడి పేరే హాట్ టాపిక్. అయితే, కొంతమంది వైభవ్ నైపుణ్యాలను ప్రశంసిస్తుండగా.. మరికొంత మంది మాత్రం వయసు విషయంలో అతడు అందరినీ మోసం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు.బిహార్ మొత్తానికి ముద్దుబిడ్డవైభవ్ సూర్యవంశీ పదమూడేళ్ల పిల్లాడు కాదని.. అతడి వయసు పదిహేనేళ్లు అంటూ వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ స్పందించారు. వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘నా కుమారుడు చిన్ననాటి నుంచే ఎంతో కఠిన శ్రమకోరుస్తున్నాడు. ఇప్పుడు అతడు సాధించిన విజయం వల్ల బిహార్ మొత్తానికి ముద్దుబిడ్డ అయిపోయాడు.ఎనిమిదేళ్ల వయసులోనే అతడు అండర్-16 డిస్ట్రిక్ట్ ట్రయల్స్‌లో పాల్గొన్నాడు. క్రికెట్ కోచింగ్ కోసం నేను తనని రోజూ సమస్తిపూర్ వరకు తీసుకువెళ్లి.. తిరిగి తీసుకువచ్చేవాడిని. వైభవ్‌ను క్రికెటర్‌గా తీర్చిదిద్దేందుకు మేమెంతగా కష్టపడ్డామో ఎవరికీ తెలియదు.మాకు ఏ భయమూ లేదుఆర్థిక ఇబ్బందుల వల్ల పొలం కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. నా కుమారుడు ఎనిమిదిన్నరేళ్ల వయసులోనే మొట్టమొదటిసారి బీసీసీఐ బోన్ టెస్టు ఎదుర్కొన్నాడు. ఇప్పటికే అతడు ఇండియా అండర్-19 జట్టుకు ఆడుతున్నాడు. మాకు ఏ భయమూ లేదు. కావాలంటే మరోసారి వైభవ్ ఏజ్ టెస్టుకు వెళ్తాడు’’ అని ఆరోపణలు చేస్తున్న వారికి సంజీవ్ సూర్యవంశీ గట్టి కౌంటర్ ఇచ్చారు.కాగా అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. వైభవ్ సూర్యవంశీ వయసు 13 ఏళ్ల 243 రోజులు. ఇక రూ. 30 లక్షల కనీస ధరతో అతడు తన పేరును ఐపీఎల్-2025 మెగా వేలంలో నమోదు చేసుకున్నాడు. ఆక్షన్‌లో వైభవ్ కోసం రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడగా.. రాజస్తాన్ ఏకంగా రూ. కోటీ పది లక్షల భారీ ధరకు అతడిని సొంతం చేసుకుంది.ఒకే ఓవర్లో 17 పరుగులు ఈ విషయం గురించి సంజీవ్ సూర్యవంశీ స్పందిస్తూ.. ‘‘నాగపూర్‌లో ట్రయల్స్ సమయంలో వైభవ్‌ను రమ్మని రాజస్తాన్ రాయల్స్ నుంచి పిలుపు వచ్చింది. బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్ సర్ నా కుమారుడిని టెస్టు చేశారు. ఒకే ఓవర్లో అతడు 17 పరుగులు చేశాడు. ట్రయల్స్‌లో మొత్తంగా ఎనిమిది సిక్సర్లు, నాలుగు ఫోర్లు బాదాడు’’ అంటూ పుత్రోత్సాహంతో పొంగిపోయారు. చదవండి: Gautam Gambhir: ఆసీస్‌తో రెండో టెస్ట్‌కు ముందు స్వదేశానికి పయనమైన టీమిండియా హెడ్ కోచ్ Vaibhav Suryavanshi, all of 13 years old, entering the IPL! 💗😂 pic.twitter.com/ffkH73LUeG— Rajasthan Royals (@rajasthanroyals) November 25, 2024 View this post on Instagram A post shared by Vaibhav Suryavanshi (@vaibhav.suryavanshi_25) -
వేలం ముగిసింది.. ఇంకా ఎవరి పర్సులో ఎంత? ఎన్ని ఖాళీలు.. పూర్తి వివరాలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2025 సీజన్‌కు సంబంధించి మెగా వేలం కార్యక్రమం పూర్తయింది. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన వేలంపాటలో.. తాము కోరుకున్న ఆటగాళ్ల కోసం పది ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. ఎట్టకేలకు తమకు కావాల్సిన వారిని దక్కించుకున్నాయి. ఇక వేలం ప్రక్రియ ముగిసింది కాబట్టి... ఇక వచ్చే ఏడాది మార్చిలో జరిగే టోర్నీకి ఎలా సమాయత్తం కావాలో ఫ్రాంచైజీలు ప్రణాళికలు రచించుకుంటాయి.కాగా ఐపీఎల్లో ఇంతవరకూ టైటిల్ నెగ్గలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఈసారి ఎలాగైనా ఆ లోటును తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. మరి వచ్చే సీజన్లోనైనా ఈ జట్లలో ఒకటి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి.ఇక ఆదివారం నాటి తొలిరోజు వేలంలో టీమిండియా స్టార్లు రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ భారీ ధర పలికారు. వికెట్ కీపర్ బ్యాటర్, కెప్టెన్ ఆప్షన్ అయిన పంత్ కోసం లక్నో ఏకంగా రూ. 27 కోట్లు వెచ్చించింది. మరోవైపు.. పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్‌ను రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ తాము రిలీజ్ చేసిన వెంకటేశ్ అయ్యర్‌ను ఏకంగా రూ. 23.75 కోట్లకు కొనుగోలు చేసి మరోసారి జట్టులో చేర్చుకుంది.ఇదిలా ఉంటే.. సోమవారం నాటి రెండో రోజు వేలంలోని విశేషాలను గమనిస్తే.. భువనేశ్వర్ కుమార్ కోసం ముంబై ఇండియన్స్, లక్నో మధ్య తీవ్ర పోటీ సాగింది. ఈ రెండు కలిసి అతడి విలువను రూ.10 కోట్ల 50 లక్షల వరకు తీసుకెళ్లాయి. ఈ స్థితిలో అనూహ్యంగా ముందుకు వచ్చిన బెంగళూరు రూ.10 కోట్ల 75 లక్షలకు అతడిని సొంతం చేసుకుంది. మరోవైపు.. తమ పాత ఆటగాడు దీపక్ చహర్‌ను తీసుకునేందుకు చెన్నై సూపర్‌కింగ్స్ చివరి వరకు ప్రయత్నించింది. ముంబై, పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీలతో పోటీ పడి రూ. 8 కోట్ల వరకు బరిలో నిలిచింది. అయితే వెనక్కి తగ్గని ముంబై రూ.9 కోట్ల 75 లక్షలకు అతడిని దక్కించుకుంది.వీరికి మంచి ధర👉సోమవారం వేలంలో అందరికంటే ముందుగా న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ పేరు రాగా అతడిని తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. 👉గత ఏడాది వరకు బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్‌ను ఈసారి అతని కనీస విలువ రూ.2 కోట్లకే ఢిల్లీ క్యాపిటల్స్ ఎంచుకుంది. 👉భారత పేస్ బౌలర్లలో ఆకాశ్‌దీప్ (రూ.8 కోట్లు; లక్నో), ముకేశ్ కుమార్ (రూ. 8 కోట్లు; ఢిల్లీ), తుషార్ దేశ్‌పాండే (రూ. 6 కోట్ల 50 లక్షలు; రాజస్తాన్ రాయల్స్) మంచి ధర పలికారు. 👉అఫ్గానిస్తాన్ మిస్టరీ ఆఫ్‌స్పిన్నర్ అల్లా గజన్ఫర్(రూ. 4.80 కోట్లు) కోసం కోల్‌కతా, బెంగళూరులతో పోటీ పడి ముంబై సొంతం చేసుకుంది. భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని పోలిన బౌలింగ్ శైలిగల గజన్ఫర్ గత ఏడాది కోల్‌కతా టీమ్‌లో ఉన్నా మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. 👉ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఒకే ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది అందరి దృష్టిలో పడిన ప్రియాన్ష్ ఆర్య కోసం నాలుగు జట్లు బరిలో నిలవగా, చివరగా పంజాబ్ దక్కించుకుంది. 👉పదేళ్ల క్రితం చివరి టీ20 మ్యాచ్ ఆడి టెస్టుల రిటైర్మెంట్ తర్వాత ఇప్పుడు ఐపీఎల్లో రిజిస్టర్ చేసుకున్న ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్‌ను ఎవరూ పట్టించుకోలేదు.👉రిటెయిన్ చేసుకున్న వారితో కలిపి మొత్తం 25 ఆటగాళ్ల గరిష్ట కోటాను చెన్నై సూపర్‌కింగ్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ పూర్తి చేసుకోగా... లక్నో సూపర్ జెయింట్స్ (24), ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ (23), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (22), డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (21), రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (20) అంతకంటే తక్కువ మందితో సరిపెట్టాయి. చెన్నై సూపర్ కింగ్స్రుతురాజ్ (రూ. 18 కోట్లు) జడేజా (రూ. 18 కోట్లు) పతిరణ (రూ. 13 కోట్లు) శివమ్ దూబే (రూ. 12 కోట్లు) ధోని (రూ. 4 కోట్లు) నూర్ అహ్మద్ (రూ.10 కోట్లు) ఆర్. అశి్వన్ (రూ. 9.75 కోట్లు) కాన్వే (రూ. 6.25 కోట్లు) ఖలీల్ అహ్మద్ (రూ. 4.80 కోట్లు) రచిన్ రవీంద్ర (రూ. 4 కోట్లు) రాహుల్ త్రిపాఠి (రూ. 3.40 కోట్లు) అన్షుల్ కంబోజ్ (రూ.3.40 కోట్లు) స్యామ్ కరన్ (రూ. 2.40 కోట్లు) గుర్జప్నీత్ సింగ్ (రూ. 2.20 కోట్లు) నాథన్ ఎలిస్ (రూ. 2 కోట్లు) దీపక్ హుడా (రూ.1.70 కోట్లు) జేమీ ఓవర్టన్ (రూ.1.50 కోట్లు) విజయ్ శంకర్ (రూ. 1.20 కోట్లు) వంశ్ బేడీ (రూ. 55 లక్షలు) ముకేశ్ చౌదరీ (రూ. 30 లక్షలు) షేక్ రషీద్ (రూ. 30 లక్షలు) అండ్రి సిద్ధార్థ్ (రూ. 30 లక్షలు) కమలేశ్ నాగర్కోటి (రూ. 30 లక్షలు) రామకృష్ణ ఘోష్ (రూ. 30 లక్షలు) శ్రేయస్ గోపాల్ (రూ.30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 65 కోట్లు; వేలానికి రూ. 54.95 కోట్లు; మిగిలింది: 5 లక్షలుఢిల్లీ క్యాపిటల్స్అక్షర్ పటేల్ (రూ. 16.50 కోట్లు) కుల్దీప్ యాదవ్ (రూ. 13.25 కోట్లు) స్టబ్స్ (రూ. 10 కోట్లు) అభిషేక్ పోరెల్ (రూ. 4 కోట్లు) కేఎల్ రాహుల్ (రూ. 14 కోట్లు) స్టార్క్ (రూ. 11.75 కోట్లు) నటరాజన్ (రూ. 10.75 కోట్లు) జేక్ ఫ్రేజర్ (రూ 9 కోట్లు) ముకేశ్ కుమార్ (రూ. 8 కోట్లు) హ్యారీ బ్రూక్ (రూ. 6.25 కోట్లు) అశుతోష్ శర్మ (రూ. 3.80 కోట్లు) మోహిత్ శర్మ (రూ.2.20 కోట్లు) డుప్లెసిస్ (రూ. 2 కోట్లు) సమీర్ రిజ్వీ (రూ. 95 లక్షలు) దుష్మంత చమిర (రూ. 75 లక్షలు) డోనొవన్ ఫెరీరా (రూ. 75 లక్షలు) విప్రాజ్ నిగమ్ (రూ.50 లక్షలు) కరుణ్ నాయర్ (రూ. 50 లక్షలు) మాధవ్ తివారి (రూ. 40 లక్షలు) అజయ్ జాదవ్ (రూ.30 లక్షలు) దర్శన్ నల్కండే (రూ. 30 లక్షలు) త్రిపురాణ విజయ్ (రూ. 30 లక్షలు) మన్వంత్ కుమార్ (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 47 కోట్లు; వేలానికి రూ 72.80 కోట్లు; మిగిలింది: రూ. 20 లక్షలు గుజరాత్ టైటాన్స్రషీద్ ఖాన్ (రూ. 18 కోట్లు) శుబ్‌మన్ గిల్ (రూ. 16.50 కోట్లు) సాయి సుదర్శన్ (రూ. 8.5 కోట్లు) రాహుల్ తెవాటియా (రూ. 4 కోట్లు) షారుక్ ఖాన్ (రూ. 4 కోట్లు) బట్లర్ (రూ.15.75 కోట్లు) సిరాజ్ (రూ.12.25 కోట్లు) రబాడ (రూ.10.75 కోట్లు) ప్రసిధ్ కృష్ణ (రూ.9.50 కోట్లు) సుందర్ (రూ. 3.20 కోట్లు) రూథర్‌ఫర్డ్ (రూ. 2.60 కోట్లు) కొయెట్జీ (రూ. 2.40 కోట్లు) ఫిలిప్స్ (రూ. 2 కోట్లు) సాయి కిషోర్ (రూ. 2 కోట్లు) మహిపాల్ లోమ్రోర్ (రూ.1.70 కోట్లు) గుర్నూర్ సింగ్ (రూ. 1.30 కోట్లు) అర్షద్ ఖాన్ (రూ.1.30 కోట్లు), జయంత్ (రూ. 75 లక్షలు) ఇషాంత్ (రూ. 75 లక్షలు) కరీమ్ జనత్ (రూ. 75 లక్షలు) కుమార్ కుశాగ్ర (రూ.65 లక్షలు) మానవ్ సుతార్ (రూ. 30 లక్షలు) అనూజ్ రావత్ (రూ.30 లక్షలు) నిశాంత్ సింధు (రూ. 30 లక్షలు) కుల్వంత్ (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 51 కోట్లు; వేలానికి రూ. 68.85 కోట్లు; మిగిలింది: 15 లక్షలు పంజాబ్ కింగ్స్శశాంక్ సింగ్ (రూ.5.5 కోట్లు) ప్రభ్‌సిమ్రన్ సంగ్ (రూ.4 కోట్లు) శ్రేయస్ అయ్యర్ (రూ.26.75 కోట్లు) అర్ష్‌దీప్ సింగ్ (రూ.18 కోట్లు) యుజువేంద్ర చహల్ (రూ.18 కోట్లు) స్టొయినిస్ (రూ.11 కోట్లు) మార్కొ జాన్సెన్ (రూ. 7 కోట్లు) నేహల్ వధేరా (రూ.4.20 కోట్లు) మ్యాక్స్‌వెల్ (రూ.4.20 కోట్లు) ప్రియాన్‡్ష ఆర్య (రూ. 3.80 కోట్లు) జోష్ ఇంగ్లిస్ (రూ. 2.60 కోట్లు) అజ్మతుల్లా (రూ. 2.40 కోట్లు) ఫెర్గూసన్ (రూ. 2 కోట్లు) వైశాక్ విజయ్‌కుమార్ (రూ.1.80 కోట్లు) యశ్ ఠాకూర్ (రూ.1.60 కోట్లు) హర్‌ప్రీత్ బ్రార్ (రూ.1.50 కోట్లు) ఆరోన్ హార్డి (రూ. 1.25 కోట్లు) విష్ణు వినోద్ (రూ.95 లక్షలు) జేవియర్ బార్ట్లెట్ (రూ. 80 లక్షలు) కుల్దీప్ సేన్ (రూ. 80 లక్షలు) అవినాశ్ (రూ. 30 లక్షలు) సూర్యాంశ్ షెడ్గే (రూ. 30 లక్షలు) ముషీర్‌ఖాన్ (రూ.30 లక్షలు) హర్నూర్ (రూ.30 లక్షలు) ప్రవీణ్ దూబే (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ.9.50 కోట్లు; వేలానికి రూ. 110.15 కోట్లు; మిగిలింది: రూ. 35 లక్షలు రాజస్తాన్ రాయల్స్యశస్వి జైస్వాల్ (రూ. 18 కోట్లు) సంజూ సామ్సన్ (రూ. 18 కోట్లు) ధ్రువ్ జురేల్ (రూ. 14 కోట్లు) రియాన్ పరాగ్ (రూ. 14 కోట్లు) హెట్‌మైర్ (రూ. 11 కోట్లు) సందీప్‌శర్మ (రూ. 4 కోట్లు) జోఫ్రా ఆర్చర్ (రూ.12.50 కోట్లు) తుషార్ దేశ్‌పాండే (రూ.6.50 కోట్లు) హసరంగ (రూ.5.25 కోట్లు) మహీశ్ తీక్షణ (రూ.4.40 కోట్లు) నితీశ్ రాణా (రూ. 4.20 కోట్లు) ఫజల్హక్ (రూ. 2 కోట్లు) క్వెన మఫాక (రూ. 1.50 కోట్లు) ఆకాశ్ మధ్వాల్ (రూ.1.20 కోట్లు) వైభవ్ సూర్యవంశి (రూ. 1.10 కోట్లు) శుభమ్ దూబే (రూ. 80 లక్షలు) యు«ద్వీర్ చరక్ (రూ. 35 లక్షలు) కుమార్ కార్తికేయ (రూ.30 లక్షలు) అశోక్ శర్మ (రూ. 30 లక్షలు) కునాల్‌సింగ్ (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 79 కోట్లు; వేలానికి రూ. 40.70 కోట్లు; మిగిలింది: రూ. 30 లక్షలు సన్‌రైజర్స్ హైదరాబాద్క్లాసెన్ (రూ. 23 కోట్లు) కమిన్స్ (రూ. 18 కోట్లు) హెడ్ (రూ. 14 కోట్లు) అభిõÙక్ శర్మ (రూ. 14 కోట్లు) నితీశ్ రెడ్డి (రూ. 6 కోట్లు) ఇషాన్ కిషన్ (రూ.11.25 కోట్లు) షమీ (రూ.10 కోట్లు) హర్షల్ పటేల్ (రూ.8 కోట్లు) రాహుల్ చహర్ (రూ.3.20 కోట్లు) అభినవ్ మనోహర్ (రూ.3.20 కోట్లు) రాహుల్ చహర్ (రూ. 3.20 కోట్లు) ఆడమ్ జంపా (రూ.2.40 కోట్లు) సిమర్జీత్ సింగ్ (రూ. 1.50 కోట్లు) ఇషాన్ మలింగ (రూ. 1.20 కోట్లు) బ్రైడన్ కార్స్ (రూ. 1 కోటి) ఉనాద్కట్ (రూ. 1 కోటి) కమిండు మెండిస్ (రూ. 75 లక్షలు) జీషాన్ అన్సారి (రూ. 40 లక్షలు) అనికేత్ వర్మ (రూ. 30 లక్షలు) అథర్వ తైడే (రూ.30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 75 కోట్లు; వేలానికి రూ.44.80 కోట్లు; మిగిలింది: రూ.20 లక్షలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకోహ్లి (రూ. 21 కోట్లు) రాజత్ పటిదార్ (రూ.11 కోట్లు) యశ్ దయాళ్ (రూ. 5 కోట్లు) హాజల్‌వుడ్ (రూ.12.50 కోట్లు) ఫిల్ సాల్ట్ (రూ.11.50 కోట్లు) జితేశ్ శర్మ (రూ.11 కోట్లు) భువనేశ్వర్ (రూ.10.75 కోట్లు) లివింగ్‌స్టోన్ (రూ.8.75 కోట్లు) రసిక్ ధార్ (రూ.6 కోట్లు) కృనాల్ పాండ్యా (రూ. 5.75 కోట్లు) టిమ్ డేవిజ్ (రూ. 3 కోట్లు) జాకబ్ బెథెల్ (రూ. 2.60 కోట్లు) సుయాశ్ శర్మ (రూ.2.60 కోట్లు) పడిక్కల్ (రూ. 2 కోట్లు) తుషార (రూ. 1.60 కోట్లు) రొమరియో (రూ. 1.50 కోట్లు ఇన్‌గిడి (రూ. 1 కోటి) స్వప్నిల్ సింగ్ (రూ.50 లక్షలు) మనోజ్ (రూ. 30 లక్షలు) మోహిత్ రాఠి (రూ. 30 లక్షలు) అభినందన్ (రూ. 30 లక్షలు) స్వస్తిక్ చికార (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 37 కోట్లు; వేలానికి రూ. 82.25 కోట్లు; మిగిలింది: రూ. 75 లక్షలు ముంబై ఇండియన్స్బుమ్రా (రూ. 18 కోట్లు) హార్దిక్ పాండ్యా (రూ.16.35 కోట్లు) సూర్యకుమార్ (రూ. 16.35 కోట్లు) రోహిత్ శర్మ (రూ. 16.30 కోట్లు) తిలక్ వర్మ (రూ. 8 కోట్లు) ట్రెంట్ బౌల్ట్ (రూ.12.50 కోట్లు) దీపక్ చహర్ (రూ. 9.25 కోట్లు) నమన్ ధీర్ (రూ.5.25 కోట్లు) విల్ జాక్స్ (రూ.5.25 కోట్లు) ఘజన్ఫర్ (రూ. 4.80 కోట్లు) సాంట్నర్ (రూ. 2 కోట్లు) రికెల్టన్ (రూ. 1 కోటి) రీస్ టోప్లే (రూ. 75 లక్షలు) లిజాద్ విలియమ్స్ (రూ. 75 లక్షలు) రాబిన్ మిన్జ్ (రూ.65 లక్షలు) కరణ్ శర్మ (రూ.50 లక్షలు) అర్జున్ టెండూల్కర్ (రూ.30 లక్షలు) విఘ్నేశ్ (రూ.30 లక్షలు) సత్యనారాయణ (రూ. 30 లక్షలు) రాజ్ అంగద్ (రూ. 30 లక్షలు) శ్రీజిత్ కృష్ణన్ (రూ. 30 లక్షలు) అశ్వని కుమార్ (రూ. 30 లక్షలు) బెవాన్ జాకబ్స్ (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 75 కోట్లు; వేలానికి రూ. 44.80 లక్షలు; మిగిలింది: రూ. 20 లక్షలులక్నో సూపర్ జెయింట్స్నికోలస్ పూరన్ (రూ.21 కోట్లు) రవి బిష్ణోయ్ (రూ.21 కోట్లు) మయాంక్ యాదవ్ (రూ. 11 కోట్లు) మోసిన్ ఖాన్ (రూ.4 కోట్లు) ఆయుశ్ బదోని (రూ.4 కోట్లు) రిషభ్ పంత్ (రూ.27 కోట్లు) అవేశ్ ఖాన్ (రూ.9.75 కోట్లు) ఆకాశ్‌దీప్ (రూ.8 కోట్లు) మిల్లర్ (రూ.7.50 కోట్లు) అబ్దుల్ సమద్ (రూ.4.20 కోట్లు) మిచెల్ మార్‡్ష (రూ.3.40 కోట్లు) షహబాజ్ అహ్మద్ (రూ. 2.40 కోట్లు) మార్క్రమ్ (రూ.2 కోట్లు) బ్రీట్జ్కే (రూ. 75 లక్షలు) షమర్ జోసెఫ్ (రూ. 75 లక్షలు) సిద్ధార్థ్ (రూ. 75 లక్షలు) యువరాజ్ (రూ. 30 లక్షలు) ప్రిన్స్ యాదవ (రూ. 30 లక్షలు) ఆకాశ్ సింగ్ (రూ. 30 లక్షలు) దిగ్వేశ్ సింగ్ (రూ. 30 లక్షలు) హిమ్మత్ సింగ్ (రూ.30 లక్షలు) ఆర్యన్ జుయల్ (రూ.30 లక్షలు) అర్శిన్ కులకర్ణి (రూ. 30 లక్షలు) హంగార్గేకర్ (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ.51 కోట్లు; వేలానికి రూ. 68.90 కోట్లు; మిగిలింది: రూ. 10 లక్షలు కోల్‌కతా నైట్ రైడర్స్రింకూ సింగ్ (రూ. 13 కోట్లు) నరైన్ (రూ. 12 కోట్లు) రసెల్ (రూ. 12 కోట్లు) వరుణ్ చక్రవర్తి (రూ. 12 కోట్లు) హర్షిత్ రాణా (రూ. 4 కోట్లు) రమణ్‌దీప్ (రూ.4 కోట్లు) వెంకటేశ్ అయ్యర్ (రూ.23.75 కోట్లు) ఆన్రిచ్ నోర్జే (రూ.6.50 కోట్లు) డికాక్ (రూ.3.60 కోట్లు) అంగ్కృష్ (రూ.3 కోట్లు) జాన్సన్ (రూ. 2.80 కోట్లు) గుర్బాజ్ (రూ.2 కోట్లు) మొయిన్ అలీ (రూ. 2 కోట్లు) వైభవ్ అరోరా (రూ.1.80 కోట్లు) రోవ్‌మన్ పావెల్ (రూ.1.50 కోట్లు) రహానే (రూ. 1.50 కోట్లు) మనీశ్ పాండే (రూ. 75 లక్షలు) ఉమ్రన్ మలిక్ (రూ. 75 లక్షలు) అనుకూల్ రాయ్ (రూ. 40 లక్షలు) మయాంక్ మర్కండే (రూ. 30 లక్షలు) లవ్నిత్ సిసోడియా (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ.69 కోట్లు; వేలానికి రూ. 50.95 కోట్లు; మిగిలింది: రూ.5 లక్షలు. -
13 ఏళ్ల కుర్రాడికి జాక్ పాట్.. ఏకంగా రూ.1.10 కోట్లు! ఎవరీ సూర్యవంశీ?
ఐపీఎల్-2025 మెగా వేలంలో బిహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి జాక్‌పాట్ తగిలింది. ఈ 13 ఏళ్ల యువ క్రికెటర్‌ను రూ.1.10 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ కైవసం చేసుకుంది. తద్వారా ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. అతడి ప్రస్తుత వయస్సు 13 ఏళ్ల 243 రోజులు మాత్రమే. రూ.30లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన సూర్య వంశీ కోసం తొలుత రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడ్డాయి. ఆఖరికి ఢిల్లీ క్యాపిటల్స్ రేసు నుంచి వైదొలగడంతో ఈ యువ క్రికెటర్‌ను రాజస్తాన్ తమ సొంతం చేసుకుంది.ఎవరీ వైభవ్ సూర్యవంశీ?13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 2011లో బిహార్‌లోని తాజ్పుర్ గ్రామంలో జన్మించాడు. అతడికి చిన్నతనం నుంచే క్రికెట్ అంటే మక్కువ ఎక్కువ. ఆ దిశగానే వైభవ్ అడుగులు వేశాడు. అతడు అద్బుతమైన క్రికెటర్‌గా ఎదగడంలో అతడి తండ్రి సంజీవ్ సూర్యవంశీది కీలక పాత్ర. 8 ఏళ్లకే వైభవ్‌ను క్రికెట్ అకాడమీలో చేర్పించి రెండేళ్లపాటు శిక్షణ సంజీవ్ ఇప్పించాడు. ఈ క్రమంలోనే కేవలం 12 సంవత్సరాల 284 రోజుల వయస్సులో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టి వైభవ్ చరిత్ర సృష్టించాడు.2023-24 రంజీ ట్రోఫీ సీజన్లో బిహార్ తరపున ఫస్ట్‌క్లాస్ డెబ్యూ చేశాడు. తద్వారా రంజీ టోర్నమెంట్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు రంజీ మ్యాచ్‌లు ఆడిన సూర్యవంశీ..87 పరుగులు చేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో చెన్నైలో ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన యూత్ టెస్ట్ సిరీస్‌లో వైభవ్ కేవలం 58 బంతుల్లో సెంచరీ చేసి సత్తాచాటాడు. ఈ క్రమంలోనే అతడిని రాజస్తాన్ రాయల్స్ పోటీపడి మరి సొంతం చేసుకుంది. -
IPL 2025: వేలంలో చహల్‌కు కళ్లు చెదిరే ధర.. జాక్‌పాట్ కొట్టేశాడు
టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఐపీఎల్ మెగా వేలం-2025లో జాక్‌పాట్ కొట్టాడు. ఏకంగా రూ. 18 కోట్లు కొల్లగొట్టాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చహల్ కొనసాగుతున్నాడు.ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించిన చహల్.. ఏకంగా 205 వికెట్లు కూల్చాడు. తద్వారా ఇప్పటికీ లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు.ఇక ఐపీఎల్-2024లో రాజస్తాన్‌కు ఆడిన చహల్ 18 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, వేలానికి ముందు రాజస్తాన్ అతడిని వదిలేయగా.. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు.ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఆదివారం జరిగిన మొదటి సెట్వేలంలో చహల్ కోసం.. గుజరాత్ తొలుత బిడ్ వేసింది. ఈ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పోటీలో దిగింది. అయితే, ధర రూ. 15 కోట్లు దాటిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీలోకి వచ్చింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రంగంలోకి దిగింది. ఆ తర్వాత ఊహించినవిధంగా.. పంజాబ్ కింగ్స్ రేసులోకి వచ్చి ధరను రూ. 18 కోట్లకు పెంచింది. దీంతో సన్ రైజర్స్తప్పుకోగా.. పంజాబ్ చహల్‌ను దక్కించుకుంది.చదవండి: Rishabh Pant: అయ్యర్ రికార్డు బ్రేక్.. కోట్లు కొల్లగొట్టిన పంత్! లక్నో సొంతం -
రాజస్తాన్ రాయల్స్ కీలక నిర్ణయం.. బ్యాటింగ్ కోచ్‌గా భారత మాజీ ఓపెనర్
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా భారత మాజీ ఓపెనర్ విక్రమ్ రాథోర్‌ను రాయల్స్ యాజమాన్యం నియమించింది. వచ్చే ఏడాది సీజన్లో రాహుల్ ద్రవిడ్‌తో కలిసి విక్రమ్ పనిచేయనున్నాడు. ఇటీవలే రాజస్తాన్ తమ హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాథోర్‌ను కూడా తమ ఫ్రాంచైజీలో భాగం చేసింది. కాగా ద్రవిడ్-రాథోర్‌కు మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ టీ20 వరల్డ్‌కప్-2024 గెలిచిన భారత జట్టు కోచింగ్ స్టాప్‌లో భాగంగా ఉన్నారు. టీమిండియా హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ సేవలు అందించగా.. అతడి ఆధ్వర్యంలో బ్యాటింగ్ కోచ్‌గా రాథోర్ పనిచేశాడు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ ఐపీఎల్లో అదే కాంబినేషన్‌ను రిపీట్ చేయనున్నారు. రాయల్స్ స్పోర్ట్స్ గ్రూప్ యాజమాన్యంకు చెందిన రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ భారత మాజీ ఓపెనర్ విక్రమ్ రాథోర్‌ను జట్టు బ్యాటింగ్ కోచ్‌గా నియమించిందని రాజస్థాన్ రాయల్స్ ఓ ప్రకటలో పేర్కొంది.ద్రవిడ్ కూడా రాథోర్ నియామకాన్ని స్వాగతించాడు. విక్రమ్‌కు అద్బుతమైన బ్యాటింగ్ టెక్నిక్ స్కిల్స్ ఉన్నాయని, అతడి అనుభవం రాయల్స్‌ను విజయం పథంలో నడిపించగలడు అని ద్రవిడ్ పేర్కొన్నాడు.చదవండి: మహిళా క్రికెటర్‌తో ‘బంధం’.. శ్రీలంక మాజీ ప్లేయర్‌కు భారీ షాక్! -
ద్రవిడ్ రీ ఎంట్రీ.. ప్రకటించిన ఐపీఎల్ ఫ్రాంఛైజీ
టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పునరాగమనం చేయనున్నాడు. వచ్చే సీజన్లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించనునున్నాడు. రాయల్స్ యాజమాన్యం ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ‘‘టీమిండియా లెజండరీ, ప్రపంచకప్ గెలిపించిన కోచ్ రాజస్తాన్ రాయల్స్‌లోకి సంచలన రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు’’ అంటూ రాయల్స్ సీఈవో జేక్ లష్ మెక్రమ్‌తో ద్రవిడ్ దిగిన ఫొటోను షేర్ చేసింది.సరికొత్త సవాళ్లకు సిద్ధంఈ సందర్భంగా ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్ టోర్నీ ముగిసిన తర్వాత.. సరికొత్త సవాళ్లకు సిద్ధం కావాలని భావించాను. అందుకు రాయల్స్‌తో జతకట్టడం కంటే ఉత్తమమైన మార్గం మరొకటి లేదు’’ అని పేర్కొన్నాడు. కాగా.. ‘‘ద్రవిడ్‌తో సంప్రదింపులు ఫలప్రదంగా ముగిశాయి. త్వరలోనే అతను కోచ్ బాధ్యతలు చేపట్టడం ఖాయం’’ అని ఇటీవల రాయల్స్ ఫ్రాంఛైజీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇప్పుడు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ద్రవిడ్‌తో పాటు టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ విక్రం రాథోడ్‌ను కూడా కోచింగ్ సిబ్బందిలోకి తీసుకోవాలని రాయల్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.గతంలో సారథిగాకాగా ద్రవిడ్ ఐపీఎల్లో రాజస్తాన్‌కు సేవలందించడం ఇదే తొలిసారి కాదు. 2012, 2013 ఎడిషన్లలో రాయల్స్ కెప్టెన్‌గా వ్యహరించిన ద్రవిడ్ రిటైర్మెంట్ అనంతరం.. ఆ జట్టు మెంటార్‌గా రెండేళ్లు పని చేశాడు. అనంతరం 2016లో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టాడు.ఆ తర్వాత.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ‘హెడ్’గా నియమితుడైన ద్రవిడ్.. ఐపీఎల్‌కు దూరమయ్యాడు. అనంతరం టీమిండియా ప్రధాన కోచ్‌గా ఎంపికైన ఈ కర్ణాటక ప్లేయర్ రెండున్నరేళ్లపాటు ఆ విధులు నిర్వర్తించాడు. అతడి హయాంలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2022 సెమీస్, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-2023 ఫైనల్, వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్ చేరింది.వరల్డ్ కప్ విన్నర్అయితే, టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న అతడి కల నెరవేరింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ ద్రవిడ్‌ల కాంబినేషన్లో టీమిండియా కరీబియన్ గడ్డపై ఈ ఏడాది పొట్టి ఫార్మాట్ కప్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత ద్రవిడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగాడు. నిజానికి ద్రవిడ్ పదవీ కాలం కూడా గత ఏడాది వన్డే ప్రపంచకప్‌తోనే ముగిసింది. అయినా.. ఈ మెగా టోర్నీ ముగిసే వరకు కోచ్‌గా సేవలు అందించి.. ఐసీసీ టైటిల్‌తో తన ప్రయాణం ముగించాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ఇప్పటి వరకు రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ డైరెక్టర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. రాజస్తాన్‌కు సంబంధించిన బార్బడోస్ రాయల్స్... కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో, పార్ల్ రాయల్స్... సౌతాఫ్రికా20 టోర్నీల్లో పాల్గొంటున్నాయి. ఆయా లీగ్‌లలో విజయాలే లక్ష్యంగా సహాయ సిబ్బందిలో దిగ్గజాలను నియమించుకుంటోంది రాయల్స్.చదవండి: బ్యాట్ ఝులిపించిన శ్రేయస్ అయ్యర్.. ఎట్టకేలకు.. -
రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్..?
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ నూతన హెడ్ కోచ్‌ను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ శనివారం ఆర్ఆర్ మేనేజ్మెంట్ తమ నూతన హెడ్ కోచ్‌గా టీమిండియా తాజా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. రాయల్స్ 2024 ఎడిషన్‌లో డెడికేటెడ్ హెడ్ కోచ్ లేకుండానే బరిలో నిలిచింది. కుమార సంగక్కర డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా.. ట్రెవర్ పెన్నీ, షేన్ బాండ్లు అసిస్టెంట్ కోచ్‌లుగా వ్యవహరించారు. రాయల్స్ గత సీజన్ ప్లే ఆఫ్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతుల్లో ఓడింది.కాగా, ద్రవిడ్ 2011-2013 మధ్యలో రాయల్స్ హెడ్ కోచ్‌గా పని చేశాడు. 2014 ఎడిషన్‌లో మెంటార్‌గా వ్యవహరించాడు. అనంతరం అతను భారత అండర్-19, ఇండియా-ఏ, ఎన్సీఏలో హెడ్ ఆఫ్ క్రికెట్, టీమిండియా హెడ్ కోచ్ వంటి హోదాల్లో పని చేశాడు. ద్రవిడ్ ఆథ్వర్యంలోనే టీమిండియా ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌ను చేజిక్కించుకుంది. అలాగే ద్రవిడ్ హయాంలో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు.. వన్డే వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు కూడా చేరింది. తాజా సమాచారం మేరకు ద్రవిడ్ రాయల్స్ హెడ్ కోచ్‌గా నియమితుడైతే అసిస్టెంట్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్ ఎంపికవుతాడని తెలుస్తుంది. కుమార సంగక్కర డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా కొనసాగే అవకాశం ఉంది. -
రాజస్థాన్ రాయల్స్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్.. ఇంగ్లండ్‌కు సంగక్కర..?
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. రాయల్స్ యాజమాన్యం ద్రవిడ్‌తో బేరసారాలన్ని పూర్తి చేసినట్లు సమాచారం. ప్రస్తుత హెడ్ కోచ్ కుమార సంగక్కర ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు హెడ్ కోచ్‌గా వెళ్లనున్న నేపథ్యంలో ద్రవిడ్ ఎంపికకు వేగంగా పావులు కదులుతున్నట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల హెడ్ కోచ్ మాట్ పాట్స్ గత నెలలో తన పదవికి రాజీనామా చేయగా.. ఆ స్థానాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంగక్కరతో భర్తీ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ఈసీబీ నుంచి కానీ సంగక్కర నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ తెర వెనుక పావులు వేగంగా కదులుతున్నట్లు సమాచారం. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ కీ సంగక్కరతో సంప్రదింపులు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ పరిమిత ఓవర్ల జట్లకు తాత్కాలిక హెడ్ కోచ్‌గా మార్కస్ ట్రెస్కోధిక్ను నియమించింది. సెప్టెంబర్ 11 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు ట్రెస్కోథిక్ ఇంగ్లండ్ జట్టు కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ మూడు టీ20లు, ఐదు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్‌లు ముగిసిన అనంతరం పర్మెనెంట్ కోచ్‌గా సంగక్కర నియమితుడయ్యే అవకాశం ఉంది. ఈసీబీతో లైన్ క్లియెర్ కాగానే సంగక్కర రాయల్స్‌తో తెగదెంపులు చేసుకోవచ్చు. సంగక్కర రాయల్స్‌తో నాలుగేళ్ల పాటు కొనసాగాడు. మరోవైపు ద్రవిడ్‌కు సైతం రాయల్స్ పాత బంధం ఉంది. ఐపీఎల్ ఆరంభ సీజన్లలో అతను రాయల్స్ కెప్టెన్‌గా, కోచ్‌గా వ్యవహరించాడు. ఈ అనుబంధం కారణంగా రాయల్స్ యాజమాన్యం ద్రవిడ్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. -
రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్..!?
భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. హెడ్‌కోచ్‌గా భారత్‌కు టీ20 వరల్డ్‌కప్ అందించిన రాహుల్ ద్రవిడ్‌పై రాజస్తాన్ రాయల్స్ కన్నేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు అతడిని తమ జట్టు హెడ్‌కోచ్‌గా నియమించాలని రాయల్స్ ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే రాజస్తాన్ యాజమాన్యం ద్రవిడ్‌తో చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ద్రవిడ్ కూడా రాజస్తాన్ ఆఫర్‌పై సముఖంగా ఉన్నట్లు వినికిడి. కాగా ఈ మిస్టర్ డిఫెండ్బుల్కు రాజస్తాన్‌తో మంచి అనుబంధం ఉంది. గతంలో రాజస్తాన్‌కు కెప్టెన్‌గా, మెంటార్‌గా ద్రవిడ్ పనిచేశాడు. 2012, 2013 సీజన్లలో రాజస్తాన్ సారథిగా ద్రవిడ్ వ్యవహరించాడు.అనంతరం 2014. 2015 సీజన్లలో రాజస్తాన్ మెంటార్‌గా తన సేవలు అందించాడు. ఇప్పుడు మరోసారి మరోసారి రాయల్స్‌తో జత కట్టేందుకు మిస్టర్ వాల్ సిద్దమైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. .కాగా ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్‌కు కుమార సంగక్కర డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌తో పాటు కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. సంగ్కర నుంచి కోచింగ్ బాధ్యతలు ద్రవిడ్ తీసుకునే అవకాశముంది. కాగా కోచ్‌గా కూడా ద్రవిడ్‌కు అపారమైన అనుభవం ఉంది. 2016, 2017 సీజన్లలో ఢిల్లీ డేర్‌డెవిల్స్( ఢిల్లీ క్యాపిటల్స్)కు హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ పనిచేశాడు. ఆ తర్వాత 2019 వరకు భారత అండర్-19 జట్టు హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ కొనసాగాడు. ఆ తర్వాత 2021-2024 వరకు టీమిండియా హెడ్ కోచ్‌గా ద్రవిడ్ బాధ్యతలు నిర్వర్తించాడు. -
ఇలా అయితే.. టీమిండియాలో ఛాన్స్ రానేరాదు!
సూటిగా.. సుత్తి లేకుండా మాట్లాడటం తనకు అలవాటు అంటున్నాడు రాజస్తాన్ రాయల్స్ యువ క్రికెటర్ రియాన్ పరాగ్. టీ20 ప్రపంచకప్-2024కు ఎంపిక చేసిన జట్టులో తనకు స్థానం లేదని.. కాబట్టి మ్యాచ్‌లు చూసి సమయం వృథా చేసుకోవాల్సిన అవసరం తనకు లేదంటున్నాడు.కాగా అసోం ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గత ఐదేళ్లుగా రాజస్తాన్ ఫ్రాంఛైజీ తరఫున ఆడుతున్నాడు. క్యాష్‌రిచ్ లీగ్ కెరీర్ ఆరంభంలో సరిగ్గా ఆడకపోయినా మేనేజ్మెంట్ అతడికి వరుస అవకాశాలు ఇచ్చింది. అయినప్పటికీ సద్వినియోగం చేసుకోలేక విమర్శల పాలయ్యాడు.ఈ క్రమంలో ఒకానొక సమయంలో జట్టులో స్థానం కోల్పోయిన రియాన్ పరాగ్.. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి తనను తాను నిరూపించుకున్నాడు. అదే జోరును ఐపీఎల్-2024లోనూ కొనసాగించి.. విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు.తాజా ఐపీఎల్ ఎడిషన్‌లో 14 ఇన్నింగ్స్ ఆడిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. ఏకంగా 573 పరుగులతో దుమ్ములేపాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో విరాట్ కోహ్లి(741), రుతురాజ్ గైక్వాడ్(583) తర్వాతి స్థానంలో నిలిచాడు.ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 ద్వారా రియాన్ పరాగ్ టీమిండియా తరఫున అరంగేట్రం చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఈ 22 ఏళ్ల బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌ను సెలక్టర్లు పరగణనలోకి తీసుకోలేదు. అనుభవం లేని రియాన్ పరాగ్‌ను కనీసం స్టాండ్‌బై ప్లేయర్‌గా కూడా ఎంపిక చేయలేదు.ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ స్పందిస్తూ.. ఏదో ఒక రోజు సెలక్టర్లు తనను టీమిండియాకు ఎంపిక చేయక తప్పదని.. ఇది తాను అహంభావంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నానంటూ ఇటీవల వ్యాఖ్యానించాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈసారి వరల్డ్‌కప్ టోర్నీని చూడాలనే ఆసక్తి తనకు ఏమాత్రం లేదంటూ కుండబద్దలు కొట్టాడు.టీమిండియాకు మద్దతుగా నిలిచే ‘భారత్ ఆర్మీ’తో రియాన్ మాట్లాడుతున్న క్రమంలో.. ఈసారి వరల్డ్‌కప్ సెమీ ఫైనలిస్టులు ఎవరు అనుకుంటున్నారనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వడం అంటే పక్షపాత ధోరణితో మాట్లాడినట్లే అవుతుంది.నిజానికి నేను ఈసారి అసలు వరల్డ్‌కప్ మ్యాచ్ చూడాలనే అనుకోవడం లేదు. ఫైనల్లో ఎవరు గెలిచారు? ట్రోఫీ ఎవరు అందుకున్నారని మాత్రమే చూస్తాను. ఒకవేళ నేను ప్రపంచకప్ టోర్నీలో గనుక ఆడుతూ ఉన్నట్లయితే.. కచ్చితంగా ఈ టాప్-4 వగైరాల గురించి పట్టించుకునేవాడిని’’ అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘రియాన్ పరాగ్ మరో ఇషాన్ కిషన్ లేదా శ్రేయస్ అయ్యర్ అవడం ఖాయం. ఇలాంటి ఆటిట్యూడ్ ఉంటే నీకు ఛాన్సులెలా వస్తాయి? ఓవరాక్షన్ స్టార్ అనే బిరుదు సార్థకం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నావా ఏంటి?’’ అని విమర్శిస్తున్నారు.కాగా బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించారనే కారణంతో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పిస్తూ ఇటీవల బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
త్వరలోనే టీమిండియాలో నా ఎంట్రీ: ఐపీఎల్ స్టార్
తాను త్వరలోనే టీమిండియా తరఫున అరంగేట్రం చేయడం ఖాయమంటున్నాడు రియాన్ పరాగ్. సెలక్టర్లు ఏదో ఒకరోజు తనను జాతీయ జట్టుకు ఎంపిక చేయక తప్పదని.. ఈ విషయంలో పూర్తి నమ్మకంతో ఉన్నానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.అసోంకు చెందిన 22 ఏళ్ల బ్యాటింగ్ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్. కుడిచేతి వాటం కలిగిన బ్యాటర్ అయిన ఈ యంగ్‌స్టర్.. రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్ కూడా! ఐపీఎల్లో గత ఐదేళ్లుగా రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.అయితే, ఆరంభంలో నామమాత్రపు స్కోర్లకే పరిమితమై విమర్శలు ఎదుర్కొన్న రియాన్ పరాగ్ ఈ ఏడాది మాత్రం అద్భుతంగా రాణించాడు. దేశవాళీ క్రికెట్లో సూపర్ ఫామ్ అందుకున్న అతడు .. ఐపీఎల్-2024లోనూ దానిని కొనసాగించాడు.రాజస్తాన్ తరఫున 14 ఇన్నింగ్స్ ఆడి ఏకంగా 573 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో విరాట్ కోహ్లి(741), రుతురాజ్ గైక్వాడ్(583) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.సీజన్ ఆసాంతం మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుని రాజస్తాన్‌ను ప్లే ఆఫ్స్ చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు రియాన్ పరాగ్. ఇక దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లోనూ పరుగుల వరద పారిస్తున్న ఈ అసోం ఆటగాడు త్వరలోనే టీమిండియాకు ఎంపిక కానున్నాడని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో పీటీఐతో మాట్లాడిన రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఏదో ఒకరోజు వాళ్లు నన్ను సెలక్ట్ చేయక తప్పదు కదా! నేను టీమిండియాకు ఆడతాననే నమ్మకం నాకుంది.ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా నేను లెక్కచేయను.నేను పరుగులు సాధించని సమయంలోనూ ఇదే తరహా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. నాపై నాకున్న నమ్మకం అది.ఇదేమీ నేను అహంభావంతో చెబుతున్న మాట కాదు. పదేళ్ల వయసులో క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి మా నాన్న, నేను ఇదే అనుకున్నాం. ఏదేమైనా ఏదో ఒకరోజు కచ్చితంగా జాతీయ జట్టుకు ఆడటమే మా ధ్యేయం అని ఫిక్సైపోయాం’’ అని రియాన్ పరాగ్ ధీమా వ్యక్తం చేశాడు.వచ్చే ఆరునెలల కాలంలో కచ్చితంగా టీమిండియా తరఫున తాను అరంగేట్రం చేసే అవకాశం ఉందని రియాన్ నమ్మకంగా చెప్పాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ సందర్భంగా ఐపీఎల్-2024లో దుమ్ములేపిన రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా తదితరులు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. -
వర్షం వల్ల ఫైనల్ రద్దు అయితే.. ఐపీఎల్ విజేత ఎవరంటే?
ఐపీఎల్-2024 ఫైనల్ పోరుకు సర్వం సిద్దమైంది. ఆదివారం(మే 26) చెపాక్ స్టేడియం వేదికగా ఈ టైటిల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. తొలి క్వాలిఫయర్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ గెలిచిన సంగతి తెలిసిందే. అనంతరం రెండో క్వాలిఫయర్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్.. ఫైనల్‌కు పోరు అర్హత సాధించింది.ఈ క్రమంలో కేకేఆర్ మూడో టైటిల్‌పై కన్నుయేగా.. ఎస్ఆర్హెచ్ రెండో సారి టైటిల్‌ను ముద్దాడాలని భావిస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది సీజన్ లీగ్ దశలో పలు మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. ఆఖరి 8 లీగ్ మ్యాచ్‌ల్లో మూడు వర్షంతో రద్దయ్యాయి. ఆదివారం కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన చివరి మ్యాచ్ సైతం రద్దు అయింది.ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించి రద్దు అయితే పరిస్థితి ఏంటి అని అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు.ఫైనల్‌కు రిజర్వ్ డే..ఇక బీసీసీఐ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే కేటాయించింది. ఆదివారం(మే 26) నాడు వర్షం కారణంగా పూర్తిగా మ్యాచ్ మొదులు కాకపోతే రిజర్వ్ డే అయిన సోమవారం మ్యాచ్‌ను నిర్వహిస్తారు. ఒకవేళ మ్యాచ్ ప్రారంభమై ఆగిపోతే.. ఆదివారం ఎక్కడనైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచే ఆటను కొనసాగిస్తారు. ఒకవేళ సోమవారం కూడా మ్యాచ్‌ను నిర్వహించేందుకు అవకాశం లేకుంటే.. పాయింట్ల పట్టికలో టాపర్‌గా ఉన్న కేకేఆర్‌ను విజేతగా ప్రకటిస్తారు. కాగా కనీసం సూపర్ ఓవర్ నిర్వహించేందుకు భారత కాలమానం ప్రకారం రాత్రి 1:20 వరకు సమయం ఉంటుంది. కాగా గతేడాది సీజన్ ఫైనల్ మ్యాచ్ ఫలితం రిజర్వ్ డే రోజునే తేలింది. -
SRH vs RR: మా ఓటమికి కారణం అదే.. బుమ్రా తర్వాత అతడే: సంజూ
‘‘కీలకమైన మ్యాచ్. తొలి ఇన్నింగ్స్‌లో మా వాళ్లు బౌలింగ్ చేసిన విధానం పట్ల గర్వంగా ఉంది. అయితే, రెండో ఇన్నింగ్స్ మిడిల్ ఓవర్లలో వారి స్పిన్ వ్యూహాలను ఎదుర్కోవడంలో మేము తడబడ్డాం.అక్కడే మ్యాచ్ మా చేజారింది. ఈ పిచ్‌పై తేమ ఉంటుందా? లేదా అన్నది ముందే ఊహించడం కష్టం. రెండో ఇన్నింగ్స్‌కు వచ్చే సరికి వికెట్ పూర్తి భిన్నంగా మారిపోయింది.బంతి కాస్త టర్న్ కావడం మొదలైంది. ఆ అవకాశాన్ని వాళ్లు సద్వినియోగం చేసుకున్నారు. మిడిల్ ఓవర్లలో మా కుడిచేతి వాటం బ్యాటర్ల కోసం లెఫ్టార్మ్ స్పిన్నర్లను దింపి ఫలితం రాబట్టారు.అక్కడే వాళ్లు మాపై పైచేయి సాధించారు. లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్లకు ఎక్కువగా ప్రయత్నించి ఉంటే బాగుండేది. ఏదేమైనా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు’’ అని రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు.ఐపీఎల్-2024 క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని అంగీకరించాడు. అయితే, జట్టు ప్రదర్శన పట్ల మాత్రం తనతో పాటు ఫ్రాంఛైజీ కూడా సంతృప్తిగానే ఉందని సంజూ ఈ సందర్భంగా తెలిపాడు.బుమ్రా తర్వాత అతడేఈ మేరకు.. ‘‘మేము ఈ ఒక్క సీజన్లోనే కాదు.. గత మూడేళ్లుగా నిలకడగా రాణిస్తున్నాం. మా ఫ్రాంఛైజీ మా ప్రదర్శన పట్ల సంతృప్తిగానే ఉంది. ముఖ్యంగా భారత్‌లోని యంగ్ టాలెంట్‌ను మేము వెలికితీయగలుగుతున్నాం.రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ అందుకు ఉదాహరణ. వీళ్లిద్దరు కేవలం రాజస్తాన్‌కే కాదు టీమిండియా తరఫున కూడా రాణిస్తే చూడాలని కోరుకుంటున్నా.ఇక సందీప్ శర్మ.. అతడి బౌలింగ్ తీరు పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. వేలంలో తను మా జట్టులోకి రాకపోయినా వేరొకరి స్థానంలో మాతో చేరాడు. అద్భుత ఆట తీరుతో అందరినీ మెప్పించాడు.గత రెండేళ్లుగా అతడి ప్రదర్శన బాగుంది. బుమ్రా తర్వాత అతడే బెస్ట్!’’ అంటూ రాజస్తాన్ యువ ఆటగాళ్లపై సంజూ శాంసన్ ప్రశంసలు కురిపించాడు. కాగా చెన్నై వేదికగా శుక్రవారం నాటి కీలక మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 36 పరుగుల తేడాతో ఓడిపోయింది.విఫలమైన సంజూ శాంసన్ఈ క్రమంలో సన్‌రైజర్స్ ఫైనల్లో అడుగుపెట్టగా.. రాజస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్ పూర్తిగా విఫలమయ్యాడు. 11 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులే చేశాడు. యశస్వి జైస్వాల్(21 బంతుల్లో 42), ధ్రువ్ జురెల్(56 నాటౌట్) మాత్రమే రాణించారు.తిప్పేసిన స్పిన్నర్లుఅంతకు ముందు సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో రాజస్తాన్ పేసర్ సందీప్ శర్మ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 25 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. కాగా ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లెఫ్టార్మ్ స్పిన్నర్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ అద్బుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.క్వాలిఫయర్-2: సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు:👉టాస్: రాజస్తాన్.. తొలుత బౌలింగ్👉సన్‌రైజర్స్ స్కోరు: 175/9 (20)👉రాజస్తాన్ స్కోరు: 139/7 (20)👉ఫలితం: రాజస్తాన్‌పై 36 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్‌కు దూసుకెళ్లిన సన్రైజర్స్చదవండి: SRH Captain Pat Cummins: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్.. ఇంకొక్క అడుగు SRH vs RR: ఓవరాక్షన్.. మూల్యం చెల్లించకతప్పలేదు! Plenty to cheer & celebrate for the @SunRisers 🥳An impressive team performance to seal a place in the all important #Final 🧡Scorecard ▶️ https://t.co/Oulcd2FuJZ… #TATAIPL | #Qualifier2 | #SRHvRR | #TheFinalCall pic.twitter.com/nG0tuVfA22— IndianPremierLeague (@IPL) May 24, 2024 -
SRH vs RR: ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం?: టీమిండియా దిగ్గజం ఫైర్
రాజస్తాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ ఆట తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ మండిపడ్డాడు. ప్రతిభ ఉంటే సరిపోదని.. దానిని ఎలా వినియోగించుకోవాలో కూడా తెలిసి ఉండాలంటూ చురకలు అంటించాడు.ఐపీఎల్-2024లో ఆది నుంచి వరుస విజయాలు సాధించిన రాజస్తాన్ రాయల్స్.. ఆ తర్వాత వరుస ఓటములతో విమర్శలు మూటగట్టుకుంది. ప్లే ఆఫ్స్ చేరినప్పటికీ సంజూ శాంసన్ సేన స్థాయికి తగ్గట్లు రాణించడం లేదని విశ్లేషకులు పెదవి విరిచారు.ఎలిమినేటర్ మ్యాచ్‌లో విశ్వరూపంఅలాంటి సమయంలో కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో అద్భుత ఆట తీరుతో రాజస్తాన్ తిరిగి సత్తా చాటింది. అహ్మదాబాద్‌లో బుధవారం నాటి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.విలువైన ఇన్నింగ్స్ ఆడిన రియాన్ఈ విజయంలో రియాన్ పరాగ్ కీలక పాత్ర పోషించాడు. 26 బంతుల్లో 36 విలువైన పరుగులు జోడించి జట్టును గెలుపు తీరాలకు చేర్చడంలో సహకారం అందించాడు. అయితే, మరో కీలకమైన మ్యాచ్‌లో మాత్రం ఒత్తిడిలో అతడు చిత్తయ్యాడు.మరో కీలక మ్యాచ్‌లో మాత్రం విఫలంసన్రైజర్స్ హైదరాబాద్‌లో శుక్రవారం నాటి క్వాలిఫయర్-2లో రియాన్ పరాగ్ పూర్తిగా విఫలమయ్యాడు. లక్ష్య ఛేదనలో రాజస్తాన్ తడబడుతున్న వేళ నాలుగో నంబర్లో బ్యాటింగ్‌కు వచ్చిన 22 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. 10 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులే చేశాడు.రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్ వేసిన రైజర్స్ లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో మొదటి బంతిని ఎదుర్కొనే క్రమంలో.. నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. అనవసరపు షాట్‌కు యత్నించి బంతిని గాల్లోకి లేపగా.. అభిషేక్ శర్మ క్యాచ్ పట్టాడు.Shahbaz Ahmed has put Sunrisers Hyderabad on 🔝🧡#RR in deep trouble and in search of something special in Chennai! Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #SRHvRR | #Qualifier2 | #TheFinalCall pic.twitter.com/8sGV8fzxcZ— IndianPremierLeague (@IPL) May 24, 2024 దీంతో రియాన్ పరాగ్ తడ‘బ్యాటు’ అంతటితో ముగిసిపోయింది. అతడు అవుటైన తీరుకు రాజస్తాన్ కోచ్ సంగక్కర షాక్‌లో ఉండిపోగా.. కామెంటేటర్ సునిల్ గావస్కర్ తీవ్ర స్థాయిలో విమర్శించాడు.ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం?‘‘ఎలా ఉపయోగించుకోవాలో తెలియనపుడు నీకు ఎంత ప్రతిభ ఉంటే ఏం లాభం? అసలు ఇలాంటి షాట్ ఎలా ఆడతావు? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. అపారమైన ప్రతిభ.. కానీ దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియదు. ఇంకొన్ని బంతుల వరకు పరుగులు రానంత మాత్రాన ఏం మునిగిపోతుంది? ఆ తర్వాత మళ్లీ పుంజుకోవచ్చు కదా!’’ అంటూ గావస్కర్ లైవ్ కామెంట్రీలోనే రియాన్ పరాగ్‌పై ఫైర్ అయ్యాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్లో రియాన్ పరాగ్ 16 మ్యాచ్‌లలో కలిపి 573 పరుగులు సాధించాడు.చదవండి: Kavya Maran Viral Reaction Video: దటీజ్ కావ్య.. సరైన నిర్ణయాలు!.. తండ్రిని హత్తుకుని చిన్నపిల్లలా! -
SRH vs RR: ఓవరాక్షన్.. మూల్యం చెల్లించకతప్పలేదు!
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ ప్రయాణం ముగిసిపోయింది. క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి పాలైన సంజూ శాంసన్ సేన టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫలితంగా ఈసారి టైటిల్ పోరుకు అర్హత సాధించాలన్న కల కలగానే మిగిలిపోయింది.ఇదిలా ఉంటే.. ఓటమి బాధలో ఉన్న రాజస్తాన్ ఆటగాడు షిమ్రన్ హెట్మెయిర్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ నిర్వాహకులు అతడికి జరిమానా విధించారు. ఇంతకీ ఏం జరిగిందంటే?!..వాళ్లిద్దరు మినహా అంతా విఫలంచెన్నైలోని చెపాక్ వేదికగా సన్‌రైజర్స్‌తో తలపడ్డ రాజస్తాన్ 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఎస్ఆర్హెచ్ విధించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(42), ఐదో నంబర్ బ్యాటర్(56- నాటౌట్) మినహా మిగతా బ్యాటర్లంతా పూర్తిగా విఫలమయ్యారు.Plenty to cheer & celebrate for the @SunRisers 🥳An impressive team performance to seal a place in the all important #Final 🧡Scorecard ▶️ https://t.co/Oulcd2FuJZ… #TATAIPL | #Qualifier2 | #SRHvRR | #TheFinalCall pic.twitter.com/nG0tuVfA22— IndianPremierLeague (@IPL) May 24, 2024 ఆశలన్నీ వమ్ముచేసి.. వికెట్ పారేసుకునిసన్రైజర్స్ బౌలర్ల ట్రాప్‌లో చిక్కుకుని పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇక పవర్ఫుల్ హిట్టర్‌గా పేరొందిన షిమ్రన్ హెట్మెయిర్ 10 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులే చేసి ఘోరంగా విఫలమయ్యాడు.పద్నాలుగవ ఓవర్లో రైజర్స్ లెఫ్టార్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మ బౌలింగ్‌లో ఊహించని రీతిలో బౌల్డ్ అయి వికెట్ పారేసుకున్నాడు. జట్టు తనపై పెట్టుకున్న ఆశలు వమ్ము చేశాడు. ఈ క్రమంలో.. అప్పటికే పరాజయం దిశగా జట్టు పయనించడం.. పార్ట్‌టైమ్ బౌలర్ చేతిలో తనకు భంగపాటు ఎదురుకావడంతో హెట్మెయిర్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు.పనిష్మెంట్ ఇచ్చిన బీసీసీఐక్రీజును వీడే సమయంలో బ్యాట్‌తో వికెట్లను కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అతడికి జరిమానా విధించడం గమనార్హం. ‘‘షిమ్రన్ హెట్మెయిర్.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడని మ్యాచ్ రిఫరీ తేల్చారు. అతడు కూడా తన తప్పును అంగీకరించాడు’’ అని ప్రకటన విడుదల చేసింది. హెట్మెయిర్ మ్యాచ్ ఫీజులో 10 శాతం మేర కోత విధిస్తున్నట్లు తెలిపింది.చదవండి: SRH: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్.. ఇంకొక్క అడుగు: కమిన్స్Kavya Maran: దటీజ్ కావ్య.. సరైన నిర్ణయాలు!.. తండ్రిని హత్తుకుని చిన్నపిల్లలా! -
SRH: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్: కమిన్స్
ఎనిమిది.. ఎనిమిది.. పది.. గత మూడేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్థానాలు. చెత్త ప్రదర్శనతో గతేడాది అట్టడుగున నిలిచిన ఆరెంజ్ ఆర్మీ ఈసారి అద్భుత ఆట తీరుతో సంచలనాలు సృష్టించింది.విశ్లేషకుల అంచనాలు తలకిందులు చేస్తూ ఏకంగా ఫైనల్లో అడుగుపెట్టింది. క్వాలిఫయర్-2లో రాజస్తాన్ రాయల్స్‌ను చిత్తు చేసి.. ఆరేళ్ల తర్వాత తుదిపోరుకు అర్హత సాధించింది.కొత్త కోచ్ డానియల్ వెటోరి మార్గదర్శనంలో.. నూతన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ఊహించని ఫలితాలు సాధిస్తూ టైటిల్ వేటలో నిలిచింది. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌పై విజయానంతరం ఎస్ఆర్హెచ్ సారథి కమిన్స్ మాట్లాడుతూ తన మనసులోని భావాలు పంచుకున్నాడు.మా బలం అదే‘‘ఈ సీజన్ ఆసాంతం మా వాళ్లు అదరగొట్టారు. ఆరంభం నుంచే ఫైనల్ లక్ష్యంగా ముందుకు సాగాము. ఇప్పుడు ఆ కలను నెరవేర్చుకున్నాము. మా బలం బ్యాటింగ్ అన్న సంగతి మాకు తెలుసు. అయినప్పటికీ మా బౌలర్లను తక్కువ అంచనా వేయడానికి లేదు. అనుభవజ్ఞులైన బౌలర్లు మా జట్టులో ఉన్నారు. భువీ, నట్టు, ఉనాద్కట్ నా పని మరింత సులువు చేశారు.ఆ నిర్ణయం నాది కాదుఇక ఈ రోజు షాబాజ్ అహ్మద్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకురావాలన్న నిర్ణయం డాన్ వెటోరీదే. ఈ లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ జట్టులో ఎంత మంది వీలైతే అంత మంది లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్లను ఈరోజు ఆడించాలని అనుకున్నాడు.అతడొక సర్ప్రైజ్ఇక అభిషేక్ శర్మ ఈరోజు ఇలా బౌలింగ్(2/24) చేయడం నిజంగా ఓ సర్ప్రైజ్ లాంటిదే. మిడిల్ ఓవర్లలో అతడు ప్రభావం చూపాడు. వాస్తవానికి ఈ పిచ్ మీద 170 పరుగుల టార్గెట్‌ను ఛేదించడం అంత సులువేమీ కాదని తెలుసు.కాస్త మెరుగ్గా ఆడితే గెలిచే అవకాశం ఉంటుందని తెలుసు. అయితే, వికెట్‌ను బట్టి పరిస్థితులను అంచనా వేయడంలో నేనేమీ దిట్ట కాదు. ఎందుకంటే వారం వారం ఇదంతా మారిపోతూ ఉంటుంది.ఇంకొక్కటి మిగిలి ఉందిమేము ఇక్కడిదాకా చేరడం వెనుక ఫ్రాంఛైజీకి చెందిన ప్రతి ఒక్కరి సహకారం ఉంది. దాదాపుగా 60- 70 మంది మనస్ఫూర్తిగా కఠిన శ్రమకోర్చి మమ్మల్ని ఈస్థాయిలో నిలిపారు.ఇంకొక్క అడుగు.. అందులోనూ సఫలమైతే ఇంకా బాగుంటుంది’’ అని కమిన్స్ హర్షం వ్యక్తం చేశాడు. సమిష్టిగా రాణించినందు వల్లే తాము ఫైనల్ చేరుకోగలిగామని జట్టులోని ప్రతి ఒక్కరికి క్రెడిట్ ఇచ్చాడు.ఇంపాక్ట్ చూపిన షాబాజ్కాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ స్థానంలో ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్.. యశస్వి జైస్వాల్(42), రియాన్ పరాగ్(6), రవిచంద్రన్ అశ్విన్(0) వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కీలక సమయంలో రాణించి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ అభిషేక్ శర్మ కెప్టెన్ సంజూ శాంసన్(10), షిమ్రన్ హెట్మెయిర్(4) రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు.క్వాలిఫయర్-2: సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు:👉వేదిక: ఎంఏ చిదంబరం స్టేడియం(చెపాక్), చెన్నై👉టాస్: రాజస్తాన్.. తొలుత బౌలింగ్👉సన్‌రైజర్స్ స్కోరు: 175/9 (20)👉రాజస్తాన్ స్కోరు: 139/7 (20)👉ఫలితం: రాజస్తాన్‌పై 36 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ విజయం.. ఫైనల్‌కు అర్హత👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షాబాజ్ అహ్మద్(18 పరుగులు, 3/23).చదవండి: T20 WC: టీ20 వరల్డ్‌కప్-2024కు పాకిస్తాన్ జట్టు ప్రకటన.. Plenty to cheer & celebrate for the @SunRisers 🥳An impressive team performance to seal a place in the all important #Final 🧡Scorecard ▶️ https://t.co/Oulcd2FuJZ… #TATAIPL | #Qualifier2 | #SRHvRR | #TheFinalCall pic.twitter.com/nG0tuVfA22— IndianPremierLeague (@IPL) May 24, 2024 -
RR Vs SRH Pics: ఆర్ఆర్ను చిత్తు చేసి.. ఫైనల్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఫొటోలు)
-
RR Vs SRH: రాజస్తాన్ చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన సన్‌రైజర్స్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లో అడుగు పెట్టింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో 36 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. దీంతో సన్‌రైజర్స్ ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఈ క్వాలిఫయర్-2లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రాహుల్ త్రిపాఠి(37), హెడ్(34) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ రెండు వికెట్లు సాధించాడు. తిప్పేసిన షాబాజ్..అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగల్గింది. రాజస్తాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్(56) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా..యశస్వీ జైశ్వాల్(42) పరుగులతో పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అయితే లక్ష్య చేధనలో రాజస్తాన్‌ను ఎస్ఆర్హెచ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ దెబ్బతీశాడు. 3 వికెట్లు పడగొట్టి రాయల్స్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు అభిషేక్ రెండు.. నటరాజన్, కమ్మిన్స్ తలా వికెట్ సాధించారు. ఇక మే 26న చెపాక్ వేదికగా ఫైనల్ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. -
RR Vs SRH: చాహల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డును చాహల్ నెలకొల్పాడు. ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో క్వాలిఫయర్-2లో రెండు సిక్స్‌లు ఇచ్చిన చాహల్.. ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో చాహల్ ఇప్పటివరకు 224 సిక్స్‌లు ఇచ్చాడు. ఇంతుకుముందు ఈ రికార్డు భారత మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా(222) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో చావ్లాను చాహల్ అధిగమించాడు. ఇక కీలక మ్యాచ్‌లో చాహల్ నిరాశపరిచాడు. తన నాలుగు ఓవర్లలో కోటాలో వికెట్లు ఏమీ తీయకుండా 34 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రాహుల్ త్రిపాఠి(37), హెడ్(34) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ రెండు వికెట్లు సాధించాడు. -
రాజస్తాన్‌పై ఘన విజయం.. ఫైనల్‌కు చేరిన ఎస్ఆర్హెచ్
Rajasthan Royals and Sunrisers Hyderabad Qualifier 2 Live Updatesరాజస్తాన్‌పై ఘన విజయం.. ఫైనల్‌కు చేరిన ఎస్ఆర్హెచ్ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లో అడుగు పెట్టింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో 36 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. దీంతో సన్‌రైజర్స్ ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఈ క్వాలిఫయర్-2లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రాహుల్ త్రిపాఠి(37), హెడ్(34) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగల్గింది. రాజస్తాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్(56) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా..యశస్వీ జైశ్వాల్(42) పరుగులతో పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అయితే లక్ష్య చేధనలో రాజస్తాన్‌ను ఎస్ఆర్హెచ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ దెబ్బతీశాడు. 3 వికెట్లు పడగొట్టి రాయల్స్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు అభిషేక్ రెండు.. నటరాజన్, కమ్మిన్స్ తలా వికెట్ సాధించారు. ఇక మే 26న చెపాక్ వేదికగా ఫైనల్ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది.కష్టాల్లో రాజస్తాన్.. విజయం దిశగా ఎస్ఆర్హెచ్రాజస్తాన్ ఆరో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన హెట్‌మైర్.. అభిషేక్ శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 13 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 102/6. క్రీజులో జురెల్(24), పావెల్(2) పరుగులతో ఉన్నారు. రాజస్తాన్ విజయానికి 30 బంతుల్లో 74 పరుగులు కావాలి.శెభాష్ షాబాజ్.. రాజస్తాన్ విలవిల రాజస్తాన్ రాయల్స్‌ను షాబాజ్ అహ్మద్ దెబ్బ తీశాడు. అతడి స్పిన్ దాటికి రాజస్తాన్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. 12వ ఓవర్ వేసిన షాబాజ్ బౌలింగ్‌లో తొలి బంతికి పరాగ్ ఔట్ కాగా.. ఐదో బంతికి అశ్విన్ పెవిలియన్‌కు చేరాడు. 13 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 90/5మూడో వికెట్ డౌన్..సంజూ శాంసన్ రూపంలో రాజస్తాన్ రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన శాంసన్.. అభిషేక్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన రాజస్తాన్..65 పరుగుల వద్ద రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 42 పరుగులు చేసిన యశస్వీ జైశ్వాల్.. షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 66/2రాజస్తాన్ తొలి వికెట్ డౌన్..176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 24 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన కాడ్మోర్.. కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.దూకుడుగా ఆడుతున్న రాజస్తాన్..176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. క్రీజులో కాడ్మోర్(6), యశస్వీ జైశ్వాల్(13) పరుగులతో ఉన్నారు.రాజస్తాన్ టార్గెట్ ఎంతంటే?చెపాక్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-2లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు రాణించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రాహుల్ త్రిపాఠి(37), హెడ్(34) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ రెండు వికెట్లు సాధించాడు.19 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 169/7హెన్రిచ్ క్లాసెన్ రూపంలో ఎస్ఆర్హెచ్ ఏడో వికెట్ కోల్పోయింది. 50 పరుగులు చేసిన క్లాసెన్ సందీప్ శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 19 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 169/716 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 136/616 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 6 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెన్(37), షాబాజ్ అహ్మద్(5) పరుగులతో ఉన్నారు.ఆరో వికెట్ డౌన్..ఎస్ఆర్హెచ్ మరోసారి వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. 14 ఓవర్ వేసిన అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఐదో బంతికి నితీష్ రెడ్డి(5) ఔట్ కాగా.. ఆరో బంతికి అబ్దుల్ సమద్ క్లీన్ బౌల్డయ్యాడు.నాలుగో వికెట్ డౌన్.. హెడ్ ఔట్99 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్.. సందీప్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు. 11 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. 9 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్ ఎంతంటే?9 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 3 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో హెన్రిచ్ క్లాసెన్(12), ట్రావిస్ హెడ్(33) పరుగులతో ఉన్నారు.వారెవ్వా బౌల్ట్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లుసన్రైజర్స్ హైదరాబాద్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. 5వ ఓవర్ వేసిన బౌల్ట్ బౌలింగ్‌లో తొలుత రాహుల్ త్రిపాఠి(37), అనంతరం మార్క్రమ్(1) పెవిలియన్‌కు చేరాడు. 6 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ 3 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది.తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. 12 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో రాహుల్ త్రిపాఠి(7), ట్రావిస్ హెడ్(3) పరుగులతో ఉన్నారు. 3 ఓవర్లకు ముగిసే సరికి వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది.ఐపీఎల్-2024లో క్వాలిఫయర్-2కు రంగం సిద్దమైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా క్వాలిఫయర్-2లో రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ రెండు మార్పులతో బరిలోకి దిగగా.. రాజస్తాన్ ఎటువంటి మార్పులు చేయలేదు. ఎస్ఆర్హెచ్ జట్టులోకి మార్క్రమ్, జయదేవ్ ఉనద్కత్ వచ్చారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తోంది.తుది జట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్రాజస్తాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్/ కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ -
SRH vs RR: అతడి మీదే భారం.. సన్‌రైజర్స్ గెలవాలంటే..
ఐపీఎల్-2024 ఫైనల్ రేసులో మరో పోరుకు రంగం సిద్ధమైంది. క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటికే తుదిపోరుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం దక్కించుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ శుక్రవారం రాజస్తాన్ రాయల్స్‌తో తాడోపేడో తేల్చుకోనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ కీలక మ్యాచ్ జరుగనుంది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ రాణిస్తే తప్ప ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ముందంజ వేయలేదని అభిప్రాయపడ్డాడు.సన్‌రైజర్స్ బలం వాళ్ల ఓపెనర్లేఈ మేరకు.. ‘‘సన్‌రైజర్స్ బలం వాళ్ల ఓపెనర్లే. వీరిద్దరూ గనుక బ్యాట్ ఝులిపిస్తే ఆపటం ఎవరితరం కాదు. క్రీజులో ఒక్కసారి పాతుకుపోతే తొలి 8- 10 ఓవర్లలోపే మ్యాచ్ ఫలితాన్ని తమకు అనుకూలంగా మార్చేస్తారు.ముఖ్యంగా ట్రావిస్ హెడ్ దంచికొడితే తిరుగే ఉండదు. అయితే, గత రెండు మ్యాచ్‌లలో వరుసగా అతడు డకౌట్ అయ్యాడు. అయినప్పటికీ తిరిగి పుంజుకోగలడనే ఆశిద్దాం.ఈసారి వాళ్లు అతడి ఆటకు చెక్ పెట్టేందుకుఈ సీజన్లో ట్రావిస్ హెడ్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. గత మ్యాచ్‌లో అవుట్ చేసినప్పటికీ ట్రెంట్ బౌల్ట్ అతడిని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. రియాన్ పరాగ్ క్యాచ్ వదిలేయడంతో లైఫ్ పొందిన హెడ్ బాగా ఆడాడు.అర్ధ శతకం కూడా సాధించాడు. అయితే, ఈసారి వాళ్లు అతడి ఆటకు చెక్ పెట్టేందుకు మరింత గట్టిగానే ప్రయత్నం చేయడం ఖాయం. ట్రావిస్ హెడ్ గనుక ఈసారి పరుగులు రాబట్టకపోతే సన్‌రైజర్స్ ముందుకు సాగలేదు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.ట్రావిస్ హెడ్‌తో పాటు అభిషేక్ శర్మ కూడా రాణిస్తే మాత్రం రాజస్తాన్ బౌలర్లు వాళ్లను ఆపలేరని పేర్కొన్నాడు. ఇక ఈ సీజన్లో దుమ్ములేపుతున్న అభిషేక్ శర్మ త్వరలోనే టీమిండియాకు ఆడటం ఖాయమని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా జోస్యం చెప్పాడు.వరుసగా రెండుసార్లు డకౌట్‌కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ ప్రధాన బలం అన్న విషయం తెలిసిందే. అయితే, గత రెండు మ్యాచ్‌లలో హెడ్ లెఫ్టార్మ్ సీమర్ల చేతికి చిక్కి పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఈ క్రమంలో క్వాలిఫయర్-2లో రాజస్తాన్ సీమర్ ట్రెంట్ బౌల్ట్ నుంచి అతడికి గండం పొంచి ఉంది. కాగా ఈ సీజన్లో హెడ్ ఇప్పటి వరకు 13 ఇన్నింగ్స్ ఆడి 199.62 స్ట్రైక్‌రేటుతో 533 పరుగులు సాధించాడు.చదవండి: T20: బంగ్లాదేశ్‌కు ఊహించని షాకిచ్చిన పసికూన.. సిరీస్ సొంతం -
IPL 2024: ‘ఫైనల్’ వేటలో...
ఓవరాల్‌గా ఆరుసార్లు 200కుపైగా స్కోర్లు... వీటిలో గత ఏడాది వరకు ఉన్న అత్యుత్తమ స్కోరును అధిగమిస్తూ మూడుసార్లు 250కు పైగా పరుగులు... పవర్‌ప్లేలో ఏ జట్టుకూ సాధ్యం కాని విధంగా రెండుసార్లు 100కు పైగా స్కోర్లు... ముగ్గురు ప్రధాన బ్యాటర్లు కలిపి ఏకంగా 106 సిక్సర్లు... ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన ఇది. ఈ జోరులో ప్లే ఆఫ్స్‌కు దూసుకొచి్చన జట్టు తొలి క్వాలిఫయర్‌లో కాస్త తడబడింది. అయితే ఆరేళ్ల తర్వాత మళ్లీ ఫైనల్ చేరేందుకు ఆ జట్టుకు మరో అవకాశం లభించగా, రాజస్తాన్ రాయల్స్ రూపంలో ఎదురుగా ప్రత్యర్థి ఉంది. నాణ్యమైన బౌలింగ్‌తో రాజస్తాన్ ఎలాంటి ప్రత్యర్థినైనా నిలువరించగలుగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆసక్తి రేపుతోంది.చెన్నై: ఐపీఎల్–17 సీజన్ తుది పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రత్యరి్థని నిర్ణయించే క్వాలిఫయర్–2 సమరానికి రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన హైదరాబాద్, రాజస్తాన్ జట్ల మధ్య చెపాక్ మైదానంలో ఈ పోరు జరగనుంది. ఈ సీజన్లో ఇరు జట్ల తలపడిన ఏకైక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఒక పరుగు తేడాతో నెగ్గింది. టోర్నీలో దూకుడైన బ్యాటింగ్‌తో హైదరాబాద్ శాసించగా... రాజస్తాన్ విజయాల్లో బౌలింగ్ కీలకంగా నిలిచింది. ఇరు జట్లు తాజా సీజన్లో చెన్నై వేదికగా ఒక్కో మ్యాచ్ ఆడాయి. హైదరాబాద్ 134, రాజస్తాన్ 141 పరుగులు మాత్రమే చేసి చెన్నై చేతిలో ఓటమి పాలవడం విశేషం. మార్క్రమ్ను ఆడిస్తారా! కోల్‌కతాతో తొలి క్వాలిఫయర్‌లో హైదరాబాద్ బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. హెడ్ వరుసగా రెండోసారి డకౌట్ కాగా, అభిõÙక్ శర్మ కూడా విఫలం కావడం జట్టుపై ప్రభావం చూపింది. క్లాసెన్ మాత్రం తన ఫామ్ కొనసాగించాడు. ఓపెనర్లు లీగ్ మ్యాచ్ తరహాలో తమ జోరును అందిపుచ్చుకుంటే జట్టు మరోసారి భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. ఇతర బ్యాటర్లు రాహుల్ త్రిపాఠి, నితీశ్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్ కూడా సహకరించాల్సి ఉంది. అయితే బ్యాటింగ్‌ను పటిష్టం చేసేందుకు నాలుగో విదేశీ ఆటగాడిగా మార్క్రమ్ లేదా గ్లెన్ ఫిలిప్స్‌లలో ఒకరిని రైజర్స్ ఆడించవచ్చు. పెద్దగా ప్రభావం చూపలేని విజయకాంత్ స్థానంలో లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేను తీసుకొని ‘ఇంపాక్ట్’ ద్వారా మరో బ్యాటర్‌ను ఆడించే అవకాశం ఉంది. చెపాక్ పిచ్‌పై షహబాజ్‌తో పాటు మరో స్పిన్నర్ జట్టుకు అవసరం. పేస్ బౌలింగ్‌లో భువనేశ్వర్, కమిన్స్‌లతో పాటు సొంత మైదానంలో ఆడుతున్న నటరాజన్ కీలకం అవుతారు. మార్పుల్లేకుండా... రాజస్తాన్ మాత్రం బుధవారం ఆర్సీబీని ఓడించిన టీమ్‌లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. స్పిన్‌కు అనుకూలిస్తే ఒక పేసర్‌ను తప్పించి కేశవ్‌ను ఆడించాలని భావించినా... జట్టు విదేశీ కూర్పుపై ప్రభావం పడవచ్చు. బౌల్ట్ కీలక బౌలర్ కాగా ఓపెనర్‌గా టామ్ కోలర్ ఖాయం. లోయర్ మిడిలార్డర్లో హెట్‌మైర్, పావెల్ల మెరుపు బ్యాటింగ్‌ను కోల్పోయి పరిస్థితి రాజస్తాన్ తెచ్చుకోదు. కాబట్టి ఇద్దరు అగ్రశ్రేణి స్పిన్నర్లు అశి్వన్, చహల్ జట్టు భారం మోస్తారు. ముఖ్యంగా ఓనమాలు నేర్చుకున్న మైదానంలో అశి్వన్ చెలరేగితే హైదరాబాద్‌కు కష్టాలు తప్పవు. రాయల్స్ బ్యాటింగ్‌లో కాస్త దూకుడు లోపించింది. ఎలిమినేటర్‌లో కూడా అది కనిపించింది కానీ లక్ష్యం చిన్నది కావడంతో దాని ప్రభావం కనపడలేదు. ముఖ్యంగా సామ్సన్ వరుసగా మూడు మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. రియాన్ పరాగ్ మాత్రమే నిలకడగా ఆడుతుండగా, జురేల్ కూడా రాణించడం లేదు. తుది జట్ల వివరాలు (అంచనా) హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), హెడ్, అభిషేక్, త్రిపాఠి, నితీశ్ రెడ్డి, క్లాసెన్, సమద్, షహబాజ్, భువనేశ్వర్, నటరాజన్, మార్కండే, మార్క్రమ్. రాజస్తాన్: సామ్సన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, టామ్ కోలర్, పరాగ్, జురేల్, హెట్‌మైర్, పావెల్, అశ్విన్, బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ, చహల్.పిచ్, వాతావరణం చెన్నైలో వేడి చాలా ఎక్కువగా ఉంది. అయితే సాయంత్రం మంచు ప్రభావం కూడా ఉండటంతో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. ఈ సీజన్లో జరిగిన 7 మ్యాచ్‌లలో 5 సార్లు తర్వాత బ్యాటింగ్ చేసిన జట్టే నెగ్గింది. 19: ఐపీఎల్లో ఇప్పటి వరకు సన్‌రైజర్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు ముఖాముఖిగా 19 సార్లు తలపడ్డాయి. 10 మ్యాచ్‌ల్లో హైదరాబాద్... 9 మ్యాచ్‌ల్లో రాజస్తాన్ గెలుపొందాయి. ఈ సీజన్లో ఈ రెండు జట్లు ఒకసారి పోటీపడగా సన్‌రైజర్స్ ఒక పరుగు తేడాతో నెగ్గింది. రాజస్తాన్‌పై సన్‌రైజర్స్ అత్యధిక స్కోరు 217, అత్యల్ప స్కోరు 127 కాగా... సన్‌రైజర్స్‌పై రాజస్తాన్ అత్యధిక స్కోరు 220, అత్యల్ప స్కోరు 102.