ఈ చిత్రం చూశారా.. వైభవ్‌ ఫ్యామిలీ మొత్తం ఒకేలా! | Look At-Vaibhav Sooryavanshi Carbon-Copy Cute Family Video Viral | Sakshi
Sakshi News home page

ఈ చిత్రం చూశారా.. వైభవ్‌ ఫ్యామిలీ మొత్తం ఒకేలా!

May 25 2026 6:38 PM | Updated on May 25 2026 8:05 PM

Look At-Vaibhav Sooryavanshi Carbon-Copy Cute Family Video Viral

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సీజ‌న్‌లో 14 మ్యాచ్‌లాడిన వైభ‌వ్ 583 ప‌రుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచ‌రీ, మూడు అర్థ‌సెంచ‌రీలున్నాయి. ఆదివారం ముంబై ఇండియ‌న్స్‌పై గెలిచిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ నాలుగో జ‌ట్టుగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది.

మే 27న (బుధ‌వారం) ఎస్ఆర్‌హెచ్‌తో ఎలిమినేట‌ర్ మ్యాచ్ ఆడ‌నుంది. ఈ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే సోష‌ల్ మీడియాలో వైభ‌వ్ సూర్య‌వంశీకి సంబంధించిన ఫ్యామిలీ వీడియో వైర‌ల్‌గా మారింది. ఆదివారం ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన‌ మ్యాచ్‌ను వీక్షించ‌డానికి వైభ‌వ్ కుటుంబం మొత్తం త‌ర‌లివ‌చ్చింది.

మ్యాచ్‌లో వైభ‌వ్ తుస్సుమ‌న్న‌ప్ప‌టికీ రాజ‌స్తాన్ గెల‌వ‌డం, ప్లేఆఫ్ చేర‌డంతో అత‌డి కుటుంబం సంతోషంతో ఇంటిబాట ప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో స్టేడియం నుంచి బ‌య‌టికి వ‌స్తున్న వైభ‌వ్ సూర్య‌వంశీ కుటుంబం స‌హా అత‌డి సోద‌రులు కెమెరా కంటికి చిక్కారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. 'ఫ్యామిలీ అంతా ఒకేలా ఉంది' అంటూ కామెంట్స్ చేయ‌డం ఆస‌క్తి క‌లిగించింది.

కాగా, వైభవ్‌కు ముగ్గురు సోదరులు ఉన్నారు. ఉజ్వల్, విశాల్ అతడి కంటే పెద్దవాళ్లు కాగా, ఆశీర్వాద్ అందరికంటే చిన్నవాడు. ఈ న‌లుగురు అన్న‌దమ్ములు కూడా హైట్‌లో తేడా ఉన్న‌ప్ప‌టికీ ముఖ క‌వ‌లిక‌ల్లో మాత్రం అచ్చు గుద్దిన‌ట్లు ఒకేలా ఉండ‌డం విశేషం. ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ 30 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్తాన్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగులు చేసింది. జురెల్ (38), జోఫ్రా ఆర్చ‌ర్ (32) స‌హా మిగ‌తా బ్యాట‌ర్లు త‌లా కొన్ని ప‌రుగులు చేయ‌డంతో రాజ‌స్తాన్ 200 ప‌రుగుల మార్క్‌ను దాటింది. అనంత‌రం లక్ష్య‌ ఛేద‌న‌లో ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగుల‌కే ప‌రిమితమైంది.

చదవండి: మెగాటోర్నీకి ముందు ఆసీస్ స్టార్ షాకింగ్‌ నిర్ణయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement