Family photo
-
ఓకే ఫ్రేమ్‌లో ఘట్టమనేని ఫ్యామిలీ.. చాలా రోజుల తర్వాత ఇలా! (ఫోటోలు)
-
నువ్వు నేను హీరోయిన్ అనిత ఫ్యామిలీ (ఫొటోలు)
-
Singer Dhanunjay Unseen Photos: సింగర్ ధనుంజయ్ క్యూట్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
Naga Shaurya Family Photos: హీరో నాగ శౌర్య ఫ్యామిలీ అరుదైన ఫోటోలు
-
సత్య దేవ్ భార్య, కొడుకును చూశారా? ఫ్యామిలీ ఫొటో షేర్ చేసిన హీరో
టాలీవుడ్లో వర్సలైట్ యాక్టింగ్‌తో అతి తక్కువ సమయంలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటీవలె మెగాస్టార్ చిరంజీవి 'గాడ్‌ఫాదర్' చిత్రంలో కీలక పాత్రలో నటించి మెప్పించిన సత్యదేవ్ తాజాగా 'గుర్తుందాదా శీతాకాలం' సినిమాలో హీరోగా అలరించాడు. అయితే సినిమాల్లో రాకముందే సత్యదేవ్‌కు పెళ్లయిన సంగతి తెలిసిందే. చదవండి: ఫేం కోసం తప్పుడు ప్రచారం.. ‘సింగింగ్ ఐకాన్’ యశస్వి మోసం బట్టబయలు! అయితే ఎప్పుడు తన కుటుంబాన్ని మీడియాకు పరిచయం చేయలేదు. దీంతో సత్యదేవ్‌కు పెళ్లయిందనే విషయం చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో రీసెంట్గా గుర్తుందా శీతాకాలం మూవీ ప్రమోషన్ ఈవెంట్లో తన భార్యను పరిచయం చేసిన సత్యదేవ్ తాజాగా తన కొడుకును కూడా పరిచయం చేశాడు. ఈ రోజు తన కొడుకు బర్త్‌డే సందర్భంగా ఫ్యామిలీ ఫొటో షేర్ చేశాడు. సత్య దేవ్ భార్య పేరు దీపికా, కొడుకు పేరు సవర్ణిక్. చదవండి: షణ్ముఖ్‌తో హగ్‌లు, ముద్దులు.. స్టేజ్‌పై శ్రీహాన్ ముందే సిరి కన్నీళ్లు! బుధవారం(ఫిబ్రవరి 8) తనయుడి బర్త్‌డే సందర్భంగా భార్య, కొడుకుతో ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ‘సవర్ణిక్ మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్నాడు. నా ప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ కొడుకు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపాడు. దీంతో సత్య దేవ్ ఫ్యామిలీ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకాలం మీడియాకు దూరంగా ఉంచిన సత్య దేవ్ కొడుకు చాలా క్యూట్‌గా ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు అందమైన ఫ్యామిలీ, చూడముచ్చటైన జంట అంటూ సత్యదేవ్ దంపతులపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Satyadev (@actorsatyadev) -
పసిప్రాయంలో కిడ్నాప్.. 51 ఏళ్ల తర్వాత..
వాషింగ్టన్: ఊహ కూడా తెలియని పసిప్రాయంలోనే ఆ బాలిక కిడ్నాపైంది. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకుకుండా పరాయి ఇంట్లోనే పెరిగింది. అయితే విధి ఆమెను మళ్లీ కుటుంబంతో కలిసేలా చేసింది. 51 ఏళ్ల తర్వాత ఆ మహిళ తన ఇంటికి చేరుకుంది. అమెరికా టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్‌లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అల్టా అపంటెంకో అనే మహిళకు ఓ పాప ఉండేది. ఉద్యోగం వల్ల తీరక లేకపోవడంతో చిన్నారి ఆలనా పాలనా చూసుకునేందుకు ఓ ఆయాను నియమించాలనుకుంది. ఆమె రూమ్ మేట్ ఓ మహిళ ఉందని చెప్పడంతో వివరాలేవి తెలుసుకోకుండానే పనిలో పెట్టుకుంది. అయితే వచ్చిన ఆయా ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పాపను కిడ్నాప్ చేసింది. 1971 ఆగస్టు 23న ఈ ఘటన జరిగింది. చిన్నారి కన్పించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ వారు ఎంత వెతికినా పాప ఆచూకీ లభించలేదు. తల్లిమాత్రం తన బిడ్డ కోసం అప్పటినుంచి వెతుకుతూనే ఉంది. చివరకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో తమ బిడ్డ ఫోర్ట్ వర్త్‌కు 1100 మైళ్ల దూరంలో ఉందనే విషయం బంధువుల ద్వారా అల్టాకు తెలిసింది. వెంటనే వాళ్లు అధికారులను సంప్రదించి డీఎన్ఏ టెస్టు నిర్వహించాలని చెప్పారు. పాప పుట్టిన తేదీ, పుట్టుమచ్చలు, డీఎన్ఏ ఫలితాల ఆధారంగా 51 ఏళ్ల క్రితం కిడ్నాపైంది ఈమే అని అధికారులు నిర్ధరించారు. దీంతో బాల్యంలో తప్పిపోయిన మెలిస్సా హై స్మిత్ ఐదు దశాబ్దాల తర్వాత కుటుంబం చెంతకు చేరింది. తన వాళ్లతో కలిసి చర్చిలో నిర్వహించిన వేడుకలో పాల్గొంది. ఇన్నేళ్ల తర్వాత తమబిడ్డను చూసి తల్లిదండ్రులు, తోబుట్టువులు ఆనంద పరవశంలో మునిగిపోయారు. బిడ్డను చంపిందనే అపవాదు.. అయితే దర్యాప్తు అధికారులు ఈ కేసును చాలా సార్ల తప్పుదోవ పట్టించారని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. గైనకాలజిస్ట్ సాయంతోనే తమబిడ్డ దక్కినట్లు పేర్కొంది. పాప కిడ్నాపై చాలా సంవత్సరాలు కన్పించకపోవడంతో తల్లే ఆమెను హత్య చేసి ఉంటుందనే ప్రచారం కూడా జరిగింది. ఎట్టకేలకు ఆ దుష్ప్రచారానికి తెరపడింది. చదవండి: మంకీపాక్స్ పేరు మార్చిన డబ్ల్యూహెచ్ఓ.. ఇకపై ఇలానే పిలవాలి..! -
'కాంతార' హీరో రిషబ్ శెట్టి ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
కన్నడ హీరో రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కాంతార సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన ఒక్క సినిమాతో స్టార్ హీరో క్రేజ్‌ను దక్కించుకున్నారు. కన్నడలో కాకుండా టాలీవుడ్, బాలీవుడ్‌లోనూ రిషబ్ శెట్టి నటనకు ఫిదా కాని ప్రేక్షకుడు ఉండటంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. దర్శకత్వంతో పాటు స్వయంగా నటించి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన రిషబ్ శెట్టి గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. తాజాగా తన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలను స్వయంగా రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో కాసేపట్లోనే అవి నెట్టింట వైరల్‌గా మారాయి. రిషబ్ శెట్టి-ప్రగతిలది ప్రేమ వివాహం. కామన్ ఫ్రెండ్ ద్వారా ఫేస్‌బుక్‌తో మొదలైన సాన్నిహిత్యం పెళ్లి వరకు వెళ్లింది. వీరికి కొడుకు రన్విత్, కూతురు రాధ్య ఉన్నారు. తాజాగా ట్రెడిషనల్ దుస్తుల్లో రిషబ్ శెట్టి ఫ్యామిలీ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
Viral Photo: దారుణం.. చావు ఇంట్లో నవ్వులు.. ఫ్యామిలీ ఫోటోపై ట్రోలింగ్..
తిరువనంతపురం: ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో ఏడుపులు వినిపిస్తాయి. కుటుంబసభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోతారు. బంధువులు, చుట్టుపక్కల వారు వారిని ఓదారుస్తుంటారు. కానీ కేరళ పథానంతిట్ట జిల్లా మలపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో కుటుంబసభ్యులు ఇందుకు భిన్నంగా ప్రవర్తించారు. 95 ఏళ్ల బామ్మ చనిపోతే.. ఆమె శవపేటిక చుట్టూ చేరి నవ్వుతూ ఫోటో దిగారు. ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇంట్లో ఒకరు చనిపోతే మీరంతా ఎలా నవ్వుతున్నారని కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. మరికొందరు మాత్రం ఆ ఫోటోలో ఏం తప్పులేదని కుటంబసభ్యులను వెనకేసుకొచ్చారు. దీనిపై పెద్ద చర్చే పెట్టారు. కేరళ విద్యాశాఖ మంత్రి వీ శివన్కుట్టి కూడా ఈ చర్చలో భాగమయ్యారు. 95ఏళ్ల మరియమ్మ ఆగస్టు 17న మరణించారు. ఆమెకు 9 మంది సంతానం. వాళ్లకు 19 మంది పిల్లలున్నారు. కుటుంబసభ్యులంతా దేశవిదేశాల్లో స్థిరపడ్డారు. వృద్ధాప్యం, అనారోగ్యంతో కొద్ది వారాల పాటు మంచానికే పరిమితమై మరియమ్మ కన్నుమూశారు. విషయం తెలిసి దాదాపు కుటంబసభ్యులు అందరూ స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలోనే ఆమె జ్ఞాపకార్థం ఓ ఫోటో దిగాలని కెమెరా ముందు నవ్వుతూ కన్పించారు. మరియమ్మ బతికినంతకాలం ఎంతో సంతోషంగా జీవించారని, అందరినీ ప్రేమగా చూసుకున్నారని ఓ కుటుంబసభ్యుడు తెలిపారు. అందుకే ఆమెకు కుటుంబసభ్యులంతా ఆనందంతో వీడ్కోలు ఇవ్వాలనుకున్నట్లు పేర్కొన్నారు. నవ్వుతూ ఫోటో దిగడంలో తప్పేమీ లేదన్నారు. కేరళ మంత్రి శివన్కుట్టి కూడా కుటుంబసభ్యులకు అండగా నిలిచారు. చావు చాలా బాధాకరం అని పేర్కొన్నారు. జీవితాంతం ఆనందంగా బతికిన వారిని అంతిమ వీడ్కోలులో నవ్వుతూ సాగనంపడంలో తప్పేం లేదన్నారు. ఈ ఫోటోపై నెగెటివ్‌గా స్పందించాల్సిన అవసరం లేదన్నారు. చదవండి: కాంగ్రెస్‌కు యువనేత గుడ్‌బై.. గాంధీలపై విమర్శలు -
కలెక్టర్ హత్య కేసులో జీవిత ఖైదీ.. జైలు కాదు ఇంట్లో!!
పాట్నా: కలెక్టర్ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆర్జేడీ(మాజీ) నేత.. జైలుకు బదులుగా ఇంటికి చేరడం, కుటుంబం.. అనుచరులతో సరదాగా గడపడం పెనుదుమారం రేపుతోంది. ఫొటోకాస్త వైరల్ కావడంతో ఈ ఘటనకు సంబంధించి బాధ్యులైన ఆరుగురు పోలీస్ సిబ్బందిపై వేటు వేసిన బీహార్ పోలీస్ శాఖ.. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఆర్జేడీ నేత బాహుబలి ఆనంద్ మోహన్.. తుపాకులు, కత్తులతో స్వేచ్ఛగా విహరించడంతో పాటు ఫొటోలకు ఫోజులు ఇచ్చే నేతగా పేరుండేది. అయితే 1994లో ముజాఫర్పూర్ శివారులో గోపాల్‌గంజ్ కలెక్టర్ కృష్ణయ్యను దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో ట్రయల్ కోర్టు ఆనంద్‌కు మరణ శిక్ష విధించింది. అయితే.. పాట్నా హైకోర్టు దానిని జీవిత ఖైదుగా మార్చింది. సుప్రీంకోర్టులోనూ ఆనంద్‌కు ఊరటే లభించింది కూడా. మోహన్, ఆయన భార్య గతంలో అసెంబ్లీ, పార్లమెంట్ సభ్యులుగా వ్యవహరించారు. మోహన్ తనయుడు చేతన్ ఆనంద్ కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ తరుణంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న బాహుబలి ఆనంద్ మోహన్‌ను పాట్నా కోర్టులో ప్రవేశపెట్టిన సిబ్బంది.. జైలుకు కాకుండా నేరుగా ఆయన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ భార్య లవ్లీ ఆనంద్, కొడుకు చేతన్ ఆనంద్, పార్టీ కార్యకర్తలతో గ్రూప్ ఫొటోలు దిగాడు మోహన్. సరదాగా పార్టీల్లో కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలు రెండు రోజుల తర్వాత వైరల్ కావడంతో రాజకీయ దుమారం మొదలైంది. రిటర్న్ ఆఫ్ జంగిల్‌రాజ్ బీజేపీ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. రిటర్న్ ఆఫ్ జంగిల్ రాజ్ అంటూ మోహన్ కుటుంబ ఫొటోను వైరల్ చేస్తోంది. లాలూ-రబ్రీ కాలం మళ్లీ వచ్చేసిందంటూ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్ విమర్శలు గుప్పిస్తున్నారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ఒక జీవిత ఖైదును ఇంటికి అనుమతించినందుకు ఆరుగురు సిబ్బందిపై వేటు వేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోపై దర్యాప్తునకు ఆదేశించినట్లు సహస్రా ఎస్పీ లిపీ సింగ్ వెల్లడించారు. डीएम मर्डर केस में उम्रकैद की सजा काट रहे RJD नेता आनंद मोहन जेल की जगह अपने घर पहुंचे गए। ये है राजद जदयू के जंगल राज की ताकत। pic.twitter.com/1wdkxDd5Hp — Shandilya Giriraj Singh (@girirajsinghbjp) August 15, 2022 అయితే బీజేపీ విమర్శలపై యువ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్ తీవ్రంగా స్పందించాడు. కోర్టు బయట అనారోగ్యానికి గురైన తన తండ్రిని ఇంటికి తెస్తే తప్పేంటని అంటున్నాడు. అనుచరులతో తన తండ్రి సమావేశం అయిన ఫొటోను సైతం బీజేపీ వక్రీకరిస్తోందని, వాస్తవాలను వివరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. వాజ్‌పేయి హయాంలో విశ్వాస తీర్మానం సందర్భంగా.. తన తండ్రి, మరో పది మంది ఎంపీలను ఒప్పించి అనుకూలంగా ఓటు వేయించడని, అప్పుడు లేని ఇబ్బంది బీజేపీకి ఇప్పుడు కలుగుతుందో అర్థం కావడం లేదని కౌంటర్ ఇచ్చాడు ఎమ్మెల్యే చేతన్ ఆనంద్. ఇదీ చదవండి: పింక్ వర్సెస్ ఆరెంజ్.. ఎగిరిన రాళ్లు, విరిగిన కర్రలు -
రష్మిక మందన్నా పేరెంట్స్‌ని ఎప్పుడైనా చూశారా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న రష్మిక తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే రష్మిక సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలనూ షేర్ చేస్తుంటుంది.తాజాగా రష్మక తన ఫ్యామిలీ ఫోటోను అభిమానులతో పంచుకుంది. 'ఇది మందన్నా ఫ్యామిలీ అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మీరు మా ముఖాలపై ఎప్పుడూ చిరునవ్వును తీసుకొస్తారు. ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తుంటాం' అంటూ తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ రష్మిక పోస్ట్ షేర్ చేసింది. ఈ ఫోటోలో రష్మిక పేరెంట్స్‌తో పాటు ఆమె చెల్లి కూడా ఉంది. అయితే ఈ ఫోటోను చూసిన నెటిజన్లు రష్మికకు ఇంత చిన్ని చెల్లెలు ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
వైరల్ అవుతున్న అజిత్ ఫ్యామిలీ ఫొటోలు, స్టైలిష్ లుక్‌తో షాకిచ్చిన ‘తల’
Ajith Family Pics Goes Viral: తమిళ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం వలిమై మూవీ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా బోని కపూర్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదలైన వలిమై తమిళనాట రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది. విడుదలైన 3 రోజుల్లోనే ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. దీంతో ఇప్పటి వరకు వలిమై దాదాపు రూ. 130 కోట్ల నుంచి రూ. 140 కోట్ల వరకు వసూళ్లు చేసి ఉంటుందని సినీ విశ్లేషకులు అంచన వేస్తున్నారు. వలిమై బ్లాక్‌బస్టర్ హిట్‌తో అజిత్ ఫుల్ ఖుషిలో ఉన్నాడు. అదే జోష్‌లో కుమరుడు అద్విక్ బర్త్‌డేను కుటుంబంతో కలిసి గ్రాండ్తో సెలబ్రెట్ చేసుకున్నాడు అజిత్. చదవండి: ఆమెతో నా భర్త వివాహేతర సంబంధం, విడాకులు: నటి భావోద్వేగం ఇందుకోసం భార్య పిల్లలతో రెస్టారెంట్‌కు వెళ్లిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. అయితే హీరోగా అజిత్ ఎంత బిజీగా ఉన్న ఖాళీ సమయాన్ని ఎక్కువగా కుటుంబానికి వెచ్చిస్తాడు. అయితే ఆయన చాలా నిరాడంబరంగా ఉంటారు. వ్యక్తిగత విషయాలు, ఫ్యామిలీ ముచ్చట్లను ఎక్కువగా ప్రస్తావించడు. ఈ నేపథ్యంలో తన కూతురు, కొడుకు ఫొటోలు కానీ, ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు బయటకు రావడం చాలా అరుదు. ఈ క్రమంలో కొడుకు బర్త్‌డే సెలబ్రెషన్లో భాగంగా భార్య శాలిని, కూతురు అనౌష్క, కుమారుడు అద్విత్తో కలిసి దిగిన ఫొటో ఫ్యాన్స్ తెగ ఆకట్టుకుంటుంది. చదవండి: ఆ హీరో నన్ను ఏకాంతంగా కలవాలి అన్నాడు: ‘చంద్రలేఖ’ హీరోయిన్ ఇందులో ‘తల’ కుమారుడిని చూసి కుట్టి తల(జునియల్ తల) అంటూ ముద్దుగా పిలుచుకుంటున్న అజిత్ ఫ్యాన్స్. ఇదిలా ఈ ఫొటోలో ఫ్యాన్స్ సర్ప్రైజ్ చేసే మరో సంఘటన చోటు చేసుకుంది. ఎప్పుడు పంచ కట్టు, తెల్ల జుట్టుతో ఉండే అజిత్ ఈ ఫొటోల ఫుల్ స్టైలిష్‌గా కనిపించాడు. పెద్ద గడ్డం, వైట్ హెయిర్ సూట్‌తో పాటు చెవి రింగ్ ధరించి తల గ్యాంగ్‌లీడర్‌లా కనిపించాడు. అజిత్ కొత్త లుక్‌ను చూసి అభిమానులంతా షాక్ అవుతున్నారు. అంతేకాదు లేట్ చేయకుండ తల కొత్త సినిమా స్టార్ చేశాడని, ఇది ఆయన న్యూ ప్రాజెక్ట్‌లోని లుక్ అయ్యింటుందని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
కుటుంబమే బలం... చెరగని రాజన్న స్మృతులు
-
నెట్టింట వైరలవుతున్న సుధీర్‌బాబు ఫ్యామిలీ ఫోటోలు
గతేడాది 'వి' చిత్రంతో అలరించిన యంగ్ హీరో సుధీర్‌బాబు ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. సినిమా షూటింగులతో బిజీగా ఉండే సుధీర్‌బాబు ఏ మాత్రం సమయం దొరికినా కుటుంబంతో గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తాజాగా తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. అందరూ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌లో కనిపించారు. సుధీర్‌బాబు భార్య పద్మిణి ప్రియదర్శిని సూపర్‌స్టార్ కృష్ణ కూతురన్న సంగతి చాలా మందికి తెలియదు. 2006లో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరికి చరిత్ మానస్ – దర్శన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చరిత్ మానస్ ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెర ఆరంగేట్రం చేశారు. ప్రస్తుతం సుధీర్‌బాబు చేతిలో రెండు సినిమాలున్నాయి. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ‘సమ్మోహనం, ‘వి’ చిత్రాల తర్వాత హీరో సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందతున్న మూడో చిత్రమిది. ఈ మూవీలో ఉప్పెనలో బేబమ్మగా అలరించిన కృతిశెట్టి సుధీర్‌బాబుకు జంటగా నటించనుంది. ఈ మూవీతో పాటు 'పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్‌బాబు నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ ఇటీవలె రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో సుధీర్‌బాబు సూరిబాబుగా నటిస్తున్నారు. ఫస్ట్ గ్లింప్స్‌లో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి మరోసారి ఫిట్‌నెస్‌పై తనకున్న డెడికకేషన్ను నిరూపించుకున్నారు. ఇక గతంలోనూ సుధీర్‌బాబు బావ, సూపర్ స్టార్ మహేష్‌బాబు కూడా సుధీర్‌బాబు ఫిట్‌నెస్‌పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. చదవండి : 'సిక్స్ ప్యాక్ బాడీ సీక్రెట్స్ చెప్పమని ఆ హీరోలు అడుగుతారు' ఐదెకరాల పొలంతో పాటు ఓ స్కూటర్ ఉంది..నన్ను పెళ్లిచేసుకుంటావా? -
ఫ్యామిలీతో వైఎస్ రాజశేఖరరెడ్డి అపూర్వ చిత్రాలు
-
మీ నవ్వే మాకు ఆనందం
సినిమా రిలీజ్ ఉన్నప్పుడు, ఏదైనా ముఖ్యమైన ఫంక్షన్స్‌లో తప్ప ఎక్కువగా కనిపించరు అనుష్క. చాలా శాతం లో ప్రొఫైల్‌లో ఉంటారామె. తన ఫ్యామిలీ విశేషాలను, ఫొటోలను కూడా ఎక్కువగా పంచుకోరు. తాజాగా తన ఫ్యామిలీ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. సోమవారం అనుష్క తండ్రి పుట్టినరోజు. ఈ సందర్భంగా పక్కన ఉన్న ఫొటోను షేర్ చేసి ‘‘పిల్లలను మీ అంత జాగ్రత్తగా పెంచుతూ, ప్రేమను పంచుతూ, ధైర్యం నింపుతూ, ప్రోత్సహించే నాన్నను నేనెక్కడా చూడలేదు. మా కోసం ఎంతో కష్టపడ్డారు. ఇవాళ మీ పుట్టినరోజు. మీ నవ్వే మా అందరి ఆనందం’’ అని పేర్కొన్నారు అనుష్క. -
సెంటిమెంట్ టచ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో వేల మంది ప్రాణాలు కోల్పోతుండగా లక్షల మంది క్షతగాత్రులుగా మారుతున్నారు. ఈ యాక్సిడెంట్స్‌లో ప్రధానంగా జాతీయ రహదారులపై, కమర్షియల్ వాహనాల కారణంగా జరుగుతున్నవీ పెద్ద సంఖ్యలోనే ఉంటున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కుతున్న కమర్షియల్ వాహనాల డ్రైవర్ల వైఖరి ప్రమాదహేతువుగా మారుతోంది. పరిమితికి మించి ప్రయాణికుల్ని ఎక్కించుకోవడం, సరుకు రవాణా వాహనంలో ప్రయాణికుల్ని తీసుకువెళ్ళడం, మద్యం మత్తులో, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో ఆయా వాహనాలకు చెందిన డ్రైవర్ తదితరులే కాకుండా ఏ పాపం ఎరుగని ఎదుటి వాహనాల వారు, పాదచారులు బాధితులుగా మారుతున్నారు. ఈ తరహా ప్రమాదాలు నిరోధించడానికి వాటి డ్రైవర్లపై సెంటిమెంట్ ప్రయోగించాలని కేంద్రం ఆధీనంలోని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ (ఎంఓఆర్టీహెచ్) యోచిస్తోంది. గత ఏడాది దేశ వ్యాప్తంగా జరిగిన మొత్తం ప్రమదాలతో పోలిస్తే లారీలు వంటి కమర్షియల్ వాహనాల వల్ల జరిగిన ప్రమాదాల్లోనే 20.1 శాతం మంది మరణించారు. ఈ నేపథ్యంలోనే నిబంధనల్ని బేఖాతరు చేయడం, దూకుడుగా వ్యవహరించడం చేస్తున్న కమర్షియల్ వాహనాల డ్రైవర్లకు ఓపక్క అవగాహన కల్పించడంతో పాటు మరోపక్క వారిపై సెంటిమెంట్‌ను ప్రయోగించనున్నారు. ఆయా వాహనాల్లో డ్యాష్‌బోర్డులపై డ్రైవర్లకు ఎదురుగా వారి కుటుంబీకుల ఫోటోలు ఉంచడం తప్పనిసరి చేయాలని ఎంఓఆర్‌టీఎహెచ్ యోచిస్తోంది. తద్వారా తన కోసం ఇంట్లో ఎదురు చూస్తున్న కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకునే డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు పడుపుతారని ఆ విభాగం భావిస్తోంది. ఈ విధానాన్ని ఆయా రాష్ట్రాలకు చెందిన ఆర్టీఏతో కలిసి చేపట్టాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ప్రాథమికంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అభిప్రాయాన్ని తీసుకోవాలని భావిస్తోంది. ఇందులో వచ్చిన మెజార్టీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోనుంది. ఆపై అవసరమైతే మోటారు వాహన చట్టంలో సవరణలు ప్రతిపాదించాలని ఎంఓఆర్‌టీఎహెచ్ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. కమర్షియల్ వాటితో పాటు ఇతర వాహనాల వల్ల జరుగతున్న ప్రమాదాలను నిరోధించడానికీ పటిష్ట కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడానికి ఎంఓఆర్‌టీఎహెచ్ సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఈ విధానాలు అమలులోకి తీసుకురావడానికి వీలుగా అవసరమైతే రాష్ట్రాలకు ప్రత్యేకంగా నిధులు సైతం కేటాయించాలని యోచిస్తోంది. వీటితో ఆయా రాష్ట్ర పోలీసు, ఆర్టీఏ విభాగాలు తమకు అవసరమైన పరికరాలు, ఉపకరణాలను సమీకరించుకుని రంగంలోకి దిగేలా ఆదేశాలు జారీ చేయనుంది. ఇవి ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలులో ఉన్నప్పటికీ దేశ వ్యాప్తంగా యూనిఫామిటీలో అమలయ్యేలా చూడాలని భావిస్తోంది. కీలక సవరణలతో కూడిన మోటారు వాహనాల చట్టం సవరణ బిల్లు అమలులో రావడంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలోనే ఎంఓఆర్టీహెచ్ ఈ ఆలోచన చేసి ఉండచ్చని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఎంఓఆర్‌టీఎహెచ్ యోచిస్తున్న ముఖ్య చర్యలివీ... ♦ పరిమితికి మించిన లోడుతో ప్రయాణిస్తున్న వాహనాలను గుర్తించడానికి చెక్‌పోస్టుల సమీపంలోని వేయింగ్ మిషన్ల వద్ద ప్రత్యేక తనిఖీలు ఏర్పాటు చేయాలి. అన్ని వాహనాల పైనా ఒకే రకమైన చర్యలు తీసుకోవడం కాకుండా... అందులో ఉన్న లోడును బట్టి జరిమానా విధించడమో, వాహనాన్ని జప్తు చేయడమో చేసేలా విధానం రూపొందించనుంది. ♦ మైనర్లు వాహనాలు నడపటానికి అర్హులు కాదు. ఈ నేపథ్యంలోనే స్కూళ్ళు, జూనియర్ కాలేజీల యాజమాన్యాలతో కలిసి స్పెషల్ డ్రైవ్స్ చేపట్టేలా ఆర్టీఏ, పోలీసు విభాగాలకు సిఫార్సు చేయనుంది. వీటికి వాహనాలను డ్రైవ్ చేసుకుంటూ వచ్చే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులనూ పిలిపించి కౌన్సిలింగ్ చేయడం, కేసులు నమోదు తప్పనిసరి చేసేలా ఆదేశించనుంది. ♦ జాతీయ రహదారులను ప్రతి 40 కిమీకి ఒక సెక్టార్‌గా ఏర్పాటు చేయించి... హైవే పెట్రోలింగ్ వాహనాలతో నిరంతరం గస్తీ ఉండాలంటూ రాష్ట్రాలకూ సూచించనుంది. ఈ వాహనాలు అక్కడ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించి, ప్రమాదకారకాలను గుర్తించడంతో పాటు నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యల్నీ సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ♦ వరుసగా మూడేళ్ళ గణాంకాలను పరిగణలోకి తీసుకుని పోలీసుస్టేషన్ల వారీగా ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను గుర్తించడం, వాటిలో లోపాలను సరిచేయడానికి నివేదికలు రూపొందించాల్సిన బాధ్యతా స్థానిక పోలీసు, ఆర్టీఏ అధికారులకు అప్పగించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ♦ మద్యం తాగి వాహనాలు నడిపే డ్రైవర్లకు చెక్ చెప్పడానికి జాతీయ రహదారుల్లోనూ తనిఖీలు తప్పనిసరి చేయించనుంది. దీనికోసం టోల్‌ప్లాజాలు, చెక్‌పోస్టుల్లో ప్రత్యేకంగా పోలీసులు సిబ్బందిని నియమించేలా, వారికి బ్రీత్ అనలైజర్లుతో పాటు ఇతర పరికరాలు ఇచ్చేలా చర్యలకు యోచిస్తోంది. -
అల్లు అర్జున్ ఫ్యామిలీ అరుదైన ఫొటో
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహా రెడ్డి, వారి ముద్దుల కొడుకు ఉన్నారు. అల్లు అర్జున్ తన కొడుకును ఎత్తుకుని ఉండగా, ఆ చిన్నారి తన తల్లి స్నేహా రెడ్డి గర్భంలో ఉన్న సోదరుడు/సోదరిని ముద్దాడుతున్నాడు. త్వరలో తమ ఇంట్లోకి మరో బేబి వస్తోందని, ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉందని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్ స్నేహా రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు తొలిసంతానం మగబిడ్డ జన్మించాడు. -
చంద్రుడిపై ఫ్యామిలీ ఫొటో
లండన్: మీరు పక్కన చూస్తున్న చిత్రంలో ఏం కనిపిస్తుందో గమనించారా.. అందులో ఏముందిలే.. బూడిద, ఒక ఫొటో, పాదముద్రలు, పక్కనే ఏదో వాహనం పోయినట్లు అని అనుకుంటున్నారా.. అయితే మీరు భ్రమపడినట్లే. ఎందుకంటే ఇది మాములు చిత్రం కాదు. చంద్రుడి ఉపరితలంపై ఉన్న నిజ చిత్రం. బూడిద మాదిరిగా కనిపిస్తున్న ఆ మట్టి చంద్రుడి మీదదే. 1972లో అపోలో 16 ద్వారా చంద్రుడిపై కాలుపెట్టిన చార్లెస్ డ్యూక్ తనకు గుర్తుగా రెండు మూడు అడుగులు వేయడమే కాకుండా ఎప్పటికీ ఒక మధుర జ్ఞాపకంగా ఉండిపోయేలా తన కుటుంబంతో కలిసి దిగిన ఒక ఫొటోని కూడా వదిలేసి వచ్చారు. అంతేకాకుండా అది ఎప్పటికీ చెరిగిపోకుండా దానికి ప్రత్యేక పాలిథిన్ కవర్లో అమర్చారు. అలా ఎంతమంది జ్ఞాపకాలు పదిలంగా అందనంత దూరంలో ఉంటాయో మీరే ఊహించుకోండి. నిజంగా వ్యోమగామి చార్లెస్ డ్యూక్ వచ్చిన ఆలోచన అద్భుతం కదా..! వీలయితే, మీరు ప్రయత్నించండి చూద్దాం. -
మళ్లీ ‘ఆధార్’ రగడ
ఒంగోలు టూటౌన్ : ఆధార్‌కార్డు రగడ మరోసారి తెరపైకొచ్చింది. ఎన్నికల ముందు వరకూ సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఆధార్ కార్డు తప్పనిసరని నిబంధనలు విధించడంతో ఆధార్ కార్డులు లేని వారంతా అధిక ధరలు వెచ్చించి సిలిండర్లు కొనుగోలు చేసి అవస్థపడ్డారు. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా అందరికీ సాధారణ ధరలకే సిలిండర్లు సరఫరా చేయాలని ఆదేశించడంతో ఆ వివాదం సద్దుమణిగింది. అయితే, ఈసారి రేషన్‌కార్డుకు ఆధార్ కార్డును లింకుపెట్టి చౌకధరల దుకాణాల ద్వారా సరుకులు పొందే లబ్ధిదారుల ప్రయోజనాలకు గండికొట్టేవిధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రేషన్‌కార్డుకు ఆధార్‌కార్డు, ఫ్యామిలీ ఫొటో అనుసంధానం చేయాలని, లేకుంటే ఆ కార్డు చెల్లదని పౌరసరఫరాల శాఖాధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇంకా ఆధార్‌కార్డు పొందలేకపోయిన తెలుపు రంగు రేషన్‌కార్డుదారులు తమకు సరుకులు అందవేమోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 33.97 లక్షల మంది జనాభా ఉన్నారు. 2,202 చౌకధరల దుకాణాలున్నాయి. మొత్తం 8,90,507 రేషన్ కార్డులు మంజూరు చేయగా, వాటిలో 6,73,999 తెలుపురంగు రేషన్ కార్డులు, 52,140 అంత్యోదయ కార్డులు, వెయ్యి అన్నపూర్ణకార్డులు ఉన్నాయి. తాత్కాలిక కూపన్లతో మరో 55,085 మంది చౌకధరల దుకాణాల నుంచి సరుకులు పొందుతున్నారు. ఈ కూపన్లకు గత నెలతో గడువు ముగియడంతో కొత్తగా ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వం మళ్లీ కూపన్లు మంజూరు చేసింది. ప్రజాపంపిణీ వ్యవస్థకు ఎన్టీఆర్ ప్రజాపంపిణీ పథకంగా పేరు మార్చి కూపన్లు మంజూరు చేసింది. వాటి ద్వారా దారిద్య్రరేఖకు దిగువనున్న పేదలకు రాయితీపై ప్రతినెలా నిత్యవసర సరుకులు సరఫరా చేస్తోంది. అయితే, ప్రస్తుతం రేషన్ కార్డులకు ఆధార్ కార్డు, ఫ్యామిలీ ఫొటోలను అనుసంధానం చేయాలని, లేకుంటే ఆ కార్డు చెల్లదని, సరుకులు కూడా అందవని ప్రభుత్వం మెలిక పెట్టడంతో లబ్ధిదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంకా అందని ఆధార్ కార్డులు... ఆధార్ కార్డుతో పాటు ఫ్యామిలీ ఫొటోను ఆన్లైన్లో రేషన్‌కార్డుకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియను తహసీల్దార్ కార్యాలయాల్లో నిర్వహించాలని సూచించింది. ఆధార్ కార్డు, ఫ్యామిలీ ఫొటో అనుసంధానం చేయని రేషన్‌కార్డులను బ్లాక్ లిస్టులోపెట్టి చౌకధరల దుకాణాల ద్వారా నిత్యవసర సరుకుల పంపిణీ నిలిపివేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో ఆధార్ కార్డుల కోసం వివరాలు నమోదు చేసుకుని ఇంకా కార్డులు అందని వారు, నేటికీ వివరాలు కూడా నమోదు చేసుకోని వారు ఆందోళన కు గురవుతున్నారు. జిల్లాకు చెందిన అనేకమంది ఆధార్ కార్డు కోసం ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకున్నప్పటికీ నేటికీ కార్డులు అందలేదు. కొంతమంది రెండోసారి కూడా వివరాలు నమోదు చేసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేదలను కలవరానికి గురిచేస్తోంది. ఆధార్ కార్డు, ఫ్యామిలీ ఫొటో అనుసంధానంపై ఆగస్టు నుంచే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనున్నట్లు అధికారులు చెబుతుండటంతో చౌకధరల దుకాణాలపై ఆధారపడి జీవిస్తున్న రేషన్ కార్డుదారులు ఇప్పటి నుంచే కంగారుపడుతున్నారు. అనుసంధానం తప్పనిసరి : రంగాకుమారి, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారిణి ఆధార్ కార్డుతో పాటు ఫ్యామిలీ ఫొటోను రేషన్‌కార్డుకు ఆన్లైన్లో అనుసంధానం చేయాల్సి ఉంది. ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లేకుంటే రేషన్‌కార్డును బ్లాక్‌లిస్టులో పెట్టే అవకాశం ఉంది.