
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ఫ్యామిలీ ఇటీవల పార్టీలో సందడి చేశారు.

ఘట్టమనేని కుటుంబ సభ్యులంతా కలిసి బర్త్ డే వేడుకలో పాల్గొన్నారు.

మహేశ్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని పుట్టిన రోజు సందర్భంగా అంతా కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు.

ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను మంజుల తన ఇన్‌స్టాలో షేర్ చేశారు.

నా లైఫ్‌లో ఈ రోజు చాలా ప్రత్యేకమని మంజుల రాసుకొచ్చారు.

ఈ బర్త్ డే పార్టీలో సుధీర్ బాబు దంపతులు కూడా పాల్గొన్నారు.

చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ అంతా ఓకేచోట కలవడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ప్రస్తుతం ఈ పోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.