Manjula
-
ఓకే ఫ్రేమ్‌లో ఘట్టమనేని ఫ్యామిలీ.. చాలా రోజుల తర్వాత ఇలా! (ఫోటోలు)
-
15వ వెడ్డింగ్ యానివర్సరీ.. మళ్లీ పెళ్లి చేసుకున్న నిరుపమ్- మంజుల (ఫోటోలు)
-
క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఇందులో భాగంగానే తన లుక్ అంతా మార్చే పనిలో ఉన్నాడు. అయితే షూటింగ్ కి ఇంకా టైమ్ ఉండటంతో ప్రస్తుతం ఫ్యామిలీతో సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ క్యూట్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాసరే మహేశ్ తన ఫ్యామిలీతో ఎక్కువగా సమయాన్ని గడుపుతుంటాడు. తాజాగా అలా కూతురు సితారతో కలిసి హైదరాబాద్‌లో జరిగిన ఓ పెళ్లికి వెళ్లాడు. ఈ వేడుకకు మహేశ్ అక్క మంజులు కూడా వచ్చింది. తమ్ముడితో సరదా కబుర్లు చెబుతూ పొడుగు జుత్తు గురించి అడిగింది. అలా అక్క-తమ్ముడు కలిసి చాలా సరదాగా కనిపించారు. ఇప్పుడీ వీడియోనే వైరల్ అవుతోంది.మరోవైపు ఇదే పెళ్లికి వచ్చిన ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి.. మహేశ్ బాబుని పలకరించారు. మహేశ్, అతడి కూతురు సితారతో కలిసి ఫొటో కూడా తీసుకున్నారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో అభిమానులకు తెగ నచ్చేస్తుంది.(ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న 'బిగ్ బాస్' ప్రియాంక) Cutest video on the internet today#MaheshBabu with his sister Manjula pic.twitter.com/ZkwXXp6mZL— KLAPBOARD (@klapboardpost) April 29, 2024Prabhas Raju Peddamma Taking photo with Favourite Actor @urstrulyMahesh 👌#SSMB29 #MaheshBabu pic.twitter.com/36oqc2zUvr— Nikhil_Prince🚲 (@Nikhil_Prince01) April 28, 2024 -
వివాహిత మృతి! భర్తే వేధించి, పురుగుల మందు తాగించాడని..
మహబూబ్‌నగర్: జడ్చర్ల మండలంలోని చిన్న ఆదిరాల గ్రామపంచాయతీ తుపుడగడ్డతండాకు చెందిన మంజుల (26) అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేశ్‌బాబు తెలిపారు. బాధితుల కథనం మేరకు.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం నల్లరాళ్లతండాకు చెందిన మంజుల, తుపుడగడ్డతండాకు చెందిన రమేశ్‌నాయక్ ఆరేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. భర్త, కుటుంబ సభ్యులు వరకట్నం తీసుకురావాలంటూ పలుమార్లు ఒత్తిడి చేయడంతో పాటు మానసిక, శారీరక వేధింపులకు గురి చేశారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. భర్త రమేశ్, మరిది, అత్తామామలు తీవ్రంగా కొట్టడంతోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిందని.. నోట్లో పురుగుమందు పోసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని మంజుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకొని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మాట్లాడలేక మూగ సైగలతో వివరించిందన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ బుధవారం పోలీస్‌స్టేషన్ ఎదుట మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. సీఐ రమేశ్‌బాబు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాధితుల ఫిర్యాదు మేరకు భర్త రమేశ్‌నాయక్, మరిది శ్రీకాంత్, అత్త దేవి, మామ లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇవి చదవండి: లభించని శ్రీమాన్ ఆచూకీ.. రోదిస్తున్న తల్లిదండ్రులు -
కన్నబిడ్డలనే కాల్వలోకి తోసి...
బిజినేపల్లి: కల్లు తాగొద్దని భర్త హెచ్చరించాడన్న కోపంతో ఓ తల్లి ముక్కుపచ్చలారని తన నలుగురు చిన్నారులను కాల్వలో విసిరేసింది. ఈ ఉదంతం శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని ఎర్రకుంటతండాలో చోటుచేసుకుంది. మండలంలోని లట్టుపల్లి పంచాయతీ పరిధిలోని ఎర్రకుంట తండాకు చెందిన లలిత మంగనూర్‌కు చెందిన శరబందను ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి కూతుళ్లు మహాలక్ష్మి (7), సాత్విక (5), మంజుల (3)తోపాటు 7 నెలల కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో లలిత కొన్నాళ్లుగా మందు కల్లును తాగుతుండటంతో పలుమార్లు భర్త శరబంద మందలించాడు. దీంతో భర్త తరచూ మందలిస్తున్నాడని లలిత శనివారం బిజినేపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. పోలీసులు శరబందను స్టేషన్‌కు రావాలని ఫోన్ చేసి పిలిచారు. మధ్యాహ్నం కావడంతో పిల్లలకు ఏమైనా తినిపించుకు వస్తానని చెప్పి వెళ్లిన లలిత.. పోలీస్‌స్టేషన్ సమీపంలోని కేఎల్ఐ కాల్వలోకి చిన్నారులతో కలిసి దిగింది. అటుగా వెళ్తున్న కొందరు ఆమెను గమనిస్తుండగానే నలుగురు చిన్నారులను కాల్వలోకి విసిరేసింది. వెంటనే వారు బిజినేపల్లి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించి కాల్వలోకి దిగారు. పోలీసులు సైతం కాల్వ వద్దకు వచ్చి గాలించగా.. నీటి ఉధృతికి చిన్నారులు కిలోమీటరు మేర కొట్టుకుపోయారు. చివరికి ముగ్గురు కుమార్తెల మృతదేహాలు లభించగా.. బాలుడు మార్కండేయ ఆచూకీ లభించలేదు. అప్పటికే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. చిన్నారులను కాల్వలో విసిరేసిన తల్లిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న భర్త శరబంద సైతం పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. చిన్నారుల మృతదేహాలను పోలీసులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మంజుల హత్య కేసు.. రిజ్వానా బేగం వల్లే దారుణం..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లో మహిళ దారుణ హత్య సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక, మృతురాలిని రాళ్లకు చెందిన మంజులగా పోలీసులు గుర్తించారు. ఇక, ఈ కేసుపై శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. రుజ్వానానే మంజులను తన చీరతో ఉరివేసి చంపినట్టు తెలిపారు. కాగా, కేసు వివరాలను డీసీపీ శనివారం మీడియాకు వివరించారు. ఈ సందర్బంగా డీసీపీ నారాయణ మాట్లాడుతూ.. ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి మహిళ మృతదేహాన్ని గుర్తించాం. చనిపోయిన మహిళను వడ్ల మంజులుగా గుర్తించడం జరిగింది. రెండు రోజుల కిందట మంజుల కడుపునొప్పి వస్తుందని శంషాబాద్ ఆస్పత్రికి వెళ్తున్నట్లు భర్తకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. తిరిగి రాకపోవడంతో శుక్రవారం సాయంత్రం ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త చెప్పిన పోలికలు, ఘటనా స్థలం వద్ద మృతదేహంతో సరిపోలడంతో.. హత్యకు గురైందని మంజులగా గుర్తించాము. అయితే, మంజుల హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణం. మంజుల రిజ్వానా బేగం అనే మహిళకు లక్ష రూపాయాలు అప్పుగా ఇచ్చింది. ఈ డబ్బుల వ్యవహారం వివాదంతోనే మంజులను రిజ్వానా హత్య చేసింది. ముందుగా మంజుల కళ్లలో కారంతో రిజ్వానా కారంతో దాడి చేసింది. మంజుల చీర కొంగుతో రిజ్వానా మెడ గట్టిగా పట్టకుని ఉరివేసి హత్య చేసింది. అనంతరం, పెట్రోల్‌తో మంజుల మృతదేహాన్ని రిజ్వానా కాల్చి చంపింది. 24 గంటల్లోనే కేసును చేధించాం. ఈ కేసులో రిజ్వానా బేగంను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తాము. ఒక్క రిజ్వానానే ఇదంతా చేసింది. మంజుల చనిపోయిన తర్వాత ఆమె మెడలో ఉన్న బంగారం చెవుల రింగ్స్ రిజ్వానా దొంగతనం చేసింది. అనంతరం వాటిని ముత్తూట్ ఫైనాన్స్‌లో రిజ్వానా తాకట్టు పెట్టింది. ఈ క్రమంలో భర్తతో కలిసి అజ్మీర్ వెళ్లిపోవడానికి రిజ్వానా టికెట్స్ కూడా బుక్ చేసింది అని తెలిపారు. ఇది కూడా చదవండి: జగిత్యాల గొల్లపెల్లిలో విషాదం: బాలికను బలిగొన్న పిచ్చి కుక్క -
మా నాన్న పెట్టిన రూల్స్ ని ఎదురించాం.. |
-
Actress Manjula 10th Death Anniversary: సీనియర్ నటి మంజుల పదో వర్ధంతి (ఫొటోలు)
-
డూప్లెక్స్ ఇల్లు సొంతం చేసుకున్న బుల్లితెర జంట
బుల్లితెర స్టార్ కపుల్ మంజుల-నిరుపమ్ గురించి తెలియనవారుండరు. కార్తీకదీపం సీరియల్‌తో టీఆర్పీలు కొల్లగొట్టి బుల్లితెర హీరోగా మారాడు నిరుపమ్. అటు ఆయన భార్య మంజుల కూడా పలు సీరియల్స్‌లో నటనతో అదరగొడుతోంది. వీరిద్దరూ జంటగా పలు టీవీ షోల్లోనూ పాల్గొంటూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. తాజాగా వీరిద్దరూ తమకు కొత్తిల్లు ఉన్న విషయాన్ని బయటపెట్టారు. అంతేకాదు మంజుల ఆ ఇంటిని అంతా కలియతిరిగి చూపించింది. ప్రస్తుతం ఇంటీరియర్ డిజైన్ పనులు నడుస్తుండగా అంతా పూర్తవగానే ఈ ఇంటికి షిఫ్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నిరుపమ్ మాట్లాడుతూ.. 'ఈ ఇల్లు నాన్నగారు బుక్ చేశారు. సినీకార్మికుల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన హౌసింగ్ సొసైటీ ద్వారా ఈ ఇల్లు వచ్చింది. నాన్న లేకపోవడంతో అది నాకు ట్రాన్స్ఫర్ అయింది. అది బుక్ చేసి దాదాపు 15-18 ఏళ్లు అవుతుంది. ముందు 3 BHK అనుకున్నారు, తర్వాత దాన్ని డూప్లెక్స్ ఫ్లాట్‌గా అప్డేట్ చేశారు. అలా అనేక కారణాల వల్ల పని ఆలస్యమవుతూ వచ్చింది. ఇన్నాళ్లకు ఇల్లు పూర్తవడానికి వచ్చింది' అని చెప్పాడు. కాగా నిరుపమ్, మంజుల చంద్రముఖి అనే సీరియల్లో లీడ్ రోల్స్ పోషించారు. ఈ ధారావాహిక చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోగా వీరికి ఓ బాబు జన్మించాడు. -
వంటగదిలో ఉన్న భార్య గొంతుకోసి హత్యచేసి.. మరో గదిలో..
శివమొగ్గ (బెంగళూరు): భార్యను గొంతు కోసి చంపిన భర్త తాను చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన శివమొగ్గ నగరంలోని ప్రియాంక లేఔట్లో జరిగింది. తుంగా నగర పోలీసులు తెలిపిన ప్రకారం. మంజుళ (30), దినేష్ భార్యభర్తలు. మంగళవారం రాత్రి ఇద్దరూ గొడవ పడ్డారు. బుధవారం ఉదయం వంటగదిలోనున్న భార్యను దినేష్ చాకుతో గొంతు కోసి హత్య చేసి, మరో గదిలో తాను చేయి కోసుకున్నాడు. ఇరుగుపొరుగు చూసి అతన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. చదవండి: (‘ఎందుకమ్మ ఇట్ల చేసినవ్..?.. మమ్మీ.. డాడీ గుర్తుకు రాలేదా..?') -
భార్యకు ఏడువారాల నగలు కొనిచ్చిన డాక్టర్ బాబు
షాపింగ్.. ఈ పేరు వింటే చాలు అమ్మాయిలకు ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది. ఎన్నిసార్లు షాపింగ్ చేసినా, ఎన్నిగంటలు తిరిగినా వారికి అలుపనేదే రాదు. ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు తగ్గట్టుగా డ్రెస్సింగ్, నగలు ఉండాలని తహతహలాడుతుంటారు లేడీస్. అందులోనూ సెలబ్రిటీలు ఓ మెట్టు పైనే ఉంటారు. జనాలకు బోర్ కొట్టకుండా నిత్యనూతనంగా కనిపించేందుకు తెగ ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో వారి షాపింగ్ చిట్టా పెద్దగానే ఉంటుంది. పండగలకు, ఫంక్షన్లకు, పూజలకు, పునస్కారాలకు ఇలా ప్రతిదానికి ఏదో ఒక వంక పెట్టుకుని ఛలో షాపింగ్ అంటుంటారు. తాజాగా డాక్టర్ బాబు (కార్తీకదీపం నటుడు నిరుపమ్) భార్య కూడా షాపింగ్ చేసేందుకు వెళ్లింది. సత్యనారాయణ వ్రతం ఉందంటూ ఆభరణాలు కొనుగోలు చేసింది. ఈసారి ఏకంగా ఏడువారాల నగలు తన భర్తతో కొనుగోలు చేయించింది. కాకపోతే అవి పూర్తి బంగారంతో చేసినవి కాదు. 92.5 స్వచ్ఛమైన వెండి మీద బంగారం పూతపూసి తయారు చేసినవి. అంటే బంగారం లాంటి వెండి నగలు సొంతం చేసుకుందన్నమాట. ఈ షాపింగ్ దెబ్బతో డాక్టర్ బాబు.. అమ్మాయిలకు బట్టలు, నగలు పిచ్చి అని అది ఎప్పటికీ పోదని కామెంట్ చేశాడు. చదవండి: విడాకులు తీసుకోనున్న మరో టాలీవుడ్ జంట? ఆ బాధ గురించి ఎలా చెప్పాలో మాటలు కూడా రావట్లేదు -
Manjula Pradeep: ఎవరీమె... ఏం చేస్తున్నారు.. ఎందుకీ పోరాటం?
‘ఎందుకు ఇన్ని రోజులు ఆగాల్సి వచ్చింది?’... ‘ఇంట్లో వాళ్లకు చెప్పడానికి భయమేసింది. కాస్త ఆలస్యంగా చెప్పాను. ఈ విషయం ఇంకెక్కడా చెప్పకు పరువు పోతుంది అన్నారు. కాని మీ గురించి విన్న తరువాత ధైర్యంగా ముందుకు రావాలనిపించింది. అందుకే వచ్చాను’- ఓ అత్యాచార బాధితురాలు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మృగాల మీద ఫిర్యాదు చేయడానికి ఆమెకు ధైర్యం చాలలేదు. ఆమె కుటుంబానికేమో ‘పరువు ఏమైపోతుందో’ అనేది పెద్ద సమస్య అయిపోయింది. ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ లీడర్స్’(National Council Of Women Leaders)ను ఆశ్రయించిన ఎంతో మంది బాధితుల్లో ఆమె కూడా ఒకరు. ఎవరీ ఉమెన్ లీడర్స్? ‘ఎవరో వస్తారని, ఏదో చేస్తారని చూడకుండా మనలో నుంచే లీడర్స్ రావాలి, మనకు జరిగే అన్యాయాలపై పోరాడాలి, హక్కుల చైతన్యాన్ని ఊరువాడకు తీసుకెళ్లాలి’ అనే ఆశయంతో ఏర్పాటైందే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ లీడర్స్. గుజరాత్‌కు చెందిన మంజుల ప్రదీప్(Manjula Pradeep) గత మూడు దశాబ్దాలుగా అట్టడుగు వర్గాల మహిళల హక్కుల గురించి పనిచేస్తోంది. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా బాధితులకు అండగా నిలుస్తుంది. ‘ఒక్కరు కాదు...అందరూ ఒక్కటై పోరాడాలి’ అనే నినాదం నుంచే పుట్టిన ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ లీడర్స్’ ఆర్గనైజేషన్‌కు మంజుల సహ–వ్యవస్థాపకురాలు. ‘ఈ సంస్థ ఏర్పాటుతో నా కల నెరవేరింది’ అంటోంది మంజుల ప్రదీప్. తల్లిని తండ్రి విపరీతంగా హింసించేవాడు మంజుల కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్ నుంచి గుజరాత్‌కు వలస వచ్చింది. తన తల్లిని తండ్రి విపరీతంగా హింసించేవాడు. మరోవైపు తాను స్కూల్లో కులవివక్షతను ఎదుర్కొనేది. ఎటు చూసినా బాధలు, అవమానాలు. అందుకే ఆమె ఇప్పుడు బాధితుల గొంతు అయింది. తనలాంటి గొంతులు గట్టిగా వినిపించడానికి వేదిక తయారుకావడంలో ఒకరైంది. మంజుల ప్రదీప్ జీవితంపై ‘బ్రోకెన్ కెన్ హీల్: ది లైఫ్ అండ్ వర్క్ ఆఫ్ మంజుల ప్రదీప్’ అనే పుస్తకం వచ్చింది. భావన సైతం.. ఆమె నెరవేర్చుకున్న కల ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వుమెన్ లీడర్స్’ దేశవ్యాప్తంగా ఎంతోమంది వుమెన్ లీడర్స్‌ను తయారుచేసింది, అలాంటి వారిలో ఒకరు గుజరాత్‌కు చెందిన భావన నర్కర్. 28 సంవత్సరాల భావన ఎంతోమంది బాధితులకు అండగా నిలిచి, మడమ తిప్పకుండా పోరాడటమే కాదు, తనలాగే ఎంతోమంది ఉమెన్ లీడర్స్ తయారుకావడానికి ప్రేరణ అయింది. ‘చట్టం, న్యాయం గురించిన విషయాలు తెలిస్తే ప్రశ్నించే ధైర్యం వస్తుంది, పోరాడే స్ఫూర్తి వస్తుంది. ప్రతి ఒక్కరిలో ఒక న్యాయవాది ఉండాలి...’ అంటూ దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ‘బేసిక్ లీగల్ నాలెడ్జి’ కోసం శిక్షణ ఇస్తుంది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ లీడర్స్. చదవండి: kristin Gray: అమ్మను మించిన అమ్మ -
పిడుగుపాటుకు ముగ్గురు బలి
భూపాలపల్లి రూరల్/ఏటూరునాగారం: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో సోమవారం పిడుగుపాటుకు ముగ్గురు మహిళలు మృతిచెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపా లపల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో ఇద్దరు, ము లుగు జిల్లా ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లిలో ఒక మహిళ మృతిచెందారు. ఈ రెండు ఘటనలు వరి పొలంలో కలుపుతీస్తుండగా జరిగాయి. భూపాలపల్లి జిల్లా పెద్దాపూర్ గ్రామానికి చెందిన గట్టు మల్లేశ్ భార్య గట్టు లక్ష్మి (40) తన వ్యవసాయ పొలంలో కలుపు తీసేందుకు అదే గ్రామానికి చెందిన పసరగొండ మంజుల (38)ని కూలికి తీసుకెళ్లింది. సోమవారం సాయంత్రం సమయంలో వర్షం రావడంతో ఇద్దరు కవరు కప్పుకొని పొలం గట్టుపై కూర్చు న్నారు. అదే సమయంలో ఒక్కసారిగా పిడుగు పడడంతో వారు అక్కడికక్కడే మరణించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మృతుల కుటుంబ సభ్యులను ప రామర్శించారు. మరోఘటనలో ములుగు జిల్లా ఏటూరునా గారం మండలం శంకరాజుపల్లికి చెందిన ఆతుకూరి లాలమ్మ తన కుమార్తె రమ్య (20)తో కలిసి సోమవారం పంట పొలాల్లోకి కూలి పనికి వెళ్లింది. వీరికి సమీపంలో పిడుగు పడింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా రమ్య మృతి చెందింది. లాలమ్మ కోలుకుంటుందని వైద్యులు తెలిపారు. -
కమర్షియల్ విప్లవనాదం.. మనుషులంతా ఒక్కటే
‘ఎవడిదిరా ఈ భూమి? ఎవ్వడురా భూస్వామి?దున్నేవాడిదె భూమి... పండించేవాడే ఆసామి’. తీవ్రమైన ఆ ప్రశ్నలు... తెగువతో కవి కలం ఇచ్చిన ఆ బలమైన ఆ సమాధానాలు వింటే – ఇప్పుడంటే మాదాల రంగారావు, ఆర్. నారాయణమూర్తి తరహా ఎర్ర సినిమాలు గుర్తొస్తాయి. కానీ, వాటికన్నా ముందే ఓ స్టార్ సినిమా... వెండితెరపై విప్లవం పండించిందని తెలుసా? ఎన్టీ రామారావు లాంటి స్టార్ హీరో, వరుస విజయాల మీదున్న దాసరి నారాయణరావు లాంటి దర్శకుడు కలసి నాలుగున్నర దశాబ్దాల క్రితమే చేసిన సమసమాజ నినాదం ‘మనుషులంతా ఒక్కటే’ (1976 ఏప్రిల్ 7). ఆ సినిమాకు 45 వసంతాలు. ఆనాటి పరిస్థితులే... అలా తెరపై... వ్యవసాయ ఆధారితమైన మన దేశంలో స్వాతంత్య్రం వచ్చిన వెంటనే భూ సంస్కరణలు మొదలయ్యాయి. 1950లోనే జమీందారీ వ్యవస్థ రద్దు బిల్లు వచ్చింది. 1956లో అనేక ప్రాంతాలు ఆ బిల్లును చట్టం చేశాయి. ఆర్థిక అసమానతలెన్నో ఉన్న మన దేశానికి కమ్యూనిజమ్, సోషలిజమ్ తారక మంత్రాలయ్యాయి. నెహ్రూ, శాస్త్రి తర్వాత ప్రధాని అయిన ఇందిరా గాంధీ 1970లో రాజభరణాలను రద్దు చేశారు. 1971 ఎన్నికల్లో ‘గరీబీ హఠావో’ నినాదం మారుమోగించారు. ఆ సామాజిక పరిస్థితుల్లో, జనంలో బలపడుతున్న భావాలతో తెరకెక్కిన కథ – ‘మనుషులంతా ఒక్కటే’. బ్రిటీషు కాలం నాటి పెత్తందారీ జమీందారీ వ్యవస్థనూ, సమకాలీన సామ్య వాద భావనలనూ అనుసంధానిస్తూ తీసిన చిత్రం ఇది. తాతను మార్చే మనుమడి కథ కథ చెప్పాలంటే... జమీందారు సర్వారాయుడు (కైకాల సత్యనారాయణ), ఆయన కొడుకు రాజేంద్రబాబు (ఎన్టీఆర్) పేదలను ఈసడించే పెత్తందార్లు. కానీ, పేదింటి రైతు పిల్ల రాధ (జమున) వల్ల పెద్ద ఎన్టీఆర్ మారతాడు. ఆమెను పెళ్ళాడతాడు. పేదల పక్షాన నిలిచి, న్యాయం కోసం పోరా డతాడు. ప్రాణాలు కూడా కోల్పోతాడు. కానీ, ఆ పేదింటి అమ్మాయికీ, అతనికీ పుట్టిన రాము (రెండో ఎన్టీఆర్) పెరిగి పెద్దవాడై, జమీందారు తాతకు బుద్ధి చెబుతాడు. వర్గ భేదాలు, వర్ణ భేదాలు లేకుండా మనుషులంతా ఒక్కటే అని వాణిజ్యపంథాలో చెప్పడంలో సూపర్ హిట్టయిందీ చిత్రం. విప్లవ కథాచిత్రాలకు కమర్షియల్ మూలం కళాదర్శకుడు– పబ్లిసిటీ డిజైనింగ్ ‘స్టూడియో రూప్ కళా’ ఓనరైన వి.వి. రాజేంద్ర కుమార్ కు సినిమా చేస్తానంటూ అప్పటికి చాలా కాలం ముందే ఎన్టీఆర్ మాటిచ్చారు. మాటకు కట్టుబడి, డేట్లిచ్చారు. పౌరాణికం తీయాలని రాజేంద్ర కుమార్ మొదట అనుకున్నారు. చివరకు ఎన్టీఆర్ – దాసరి కాంబినేషన్‌కు శ్రీకారం చుడుతూ, సాంఘికం ‘మనుషులంతా ఒక్కటే’ తీశారు. రాజేంద్ర కుమార్ సమర్పణలో, ఆయన సోదరుడు – కథా, నవలా రచయిత వి. మహేశ్, గుంటూరుకు చెందిన దుడ్డు వెంకటేశ్వరరావు నిర్మాతలుగా ఈ సినిమా నిర్మాణమైంది. ‘మనుషులంతా ఒక్కటే’ అనే పేరు, ‘దున్నేవాడిదే భూమి’ లాంటి అంశాలు అచ్చంగా వామపక్ష భావజాలంతో కూడిన సినిమాల్లో కనిపిస్తాయి. కానీ ప్రజాపోరాటంతో పాటు, పెద్ద కుటుంబానికి చెందిన హీరో తక్కువ కులపు పేదింటి అమ్మాయిని పెళ్ళాడడం లాంటివన్నీ ఈ కమర్షియల్ చిత్రంలో ఉన్నాయి. అలా చూస్తే ‘భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం’ అనే విప్లవ భావాలతో వచ్చిన తర్వాతి సినిమాలకు ఒక రకంగా ‘మనుషులంతా ఒక్కటే’ మూలమనేవారు దాసరి. అంతకు మునుపు కూడా పెత్తందార్లపై, రైతు సమస్యలపై సినిమాలు వచ్చినా, అవన్నీ పూర్తిగా గ్రామీణ నేపథ్యంలోవే! బ్లాక్ అండ్ వైటే!! ఇలా కమర్షియల్, కలర్ చిత్రాలు కావనేది గమనార్హం. కథ వెనుక కథేమిటంటే... దాసరి రచయితగా, దర్శకత్వ శాఖలో సహాయకుడిగా ఉన్నప్పటి నుంచి ఎన్టీఆర్‌కు తెలుసు. ‘ఒకే కుటుంబం’ (1970 డిసెంబర్ 25)తో సెట్స్‌పై దాసరి దర్శకత్వ ప్రతిభ కూడా ఎన్టీఆర్‌కు తెలిసింది. మరో హిందీ షూటింగుతో క్లాష్ వచ్చి, దర్శకుడు ఎ. భీమ్‌సింగ్ అందుబాటులో లేనప్పుడు కొద్దిరోజులు ‘ఒకే కుటుంబం’ షూటింగ్ చేసింది ఆ చిత్రానికి సహ రచయిత, అసోసియేట్ డైరెక్టరైన దాసరే! అంతకు ముందు రచయితగానూ దాసరి ఒకటి రెండు కథలతో ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళినా, రకరకాల కారణాలతో అవేవీ సెట్స్ పైకి రాలేదు. ఈ ‘మనుషులంతా ఒక్కటే’కు దాసరి ముందు అనుకున్న మూలకథ కూడా వేరే ఎన్టీఆర్ నిర్మాతల దగ్గరకు వెళ్ళిందట! ఎన్టీఆర్, జమునలతో తీయాలనేది ప్లాన్. కానీ, అప్పటికే వచ్చిన ‘మంగమ్మశపథం’(1965)తో పోలికలున్నాయంటూ, ఆ నిర్మాత వెనక్కి తగ్గారట! ఆ తరువాత చాలాకాలానికి దాసరి దర్శకుడయ్యాక ఆ మూల కథే మళ్ళీ ఎన్టీఆర్, జమునలతోనే తెరకెక్కడం విచిత్రం. ‘మనుషులంతా ఒక్కటే’ నిర్మాతల్లో ఒకరైన నవలా రచయిత వి. మహేశ్ గతంలో దాసరి దగ్గర పలు చిత్రాలకు అసిస్టెంట్ స్టోరీ రైటర్. చాలాకాలం క్రితం తాను అనుకున్న కథలో మహేశ్, ఆర్కే ధర్మరాజు సహకారంతో మార్పులు, చేర్పులు చేశారు దాసరి. దాంతో, ఈ కథ నేపథ్యమే మారింది. దున్నేవాడిదే భూమి, జమీందారీ వ్యవస్థ, తాతకు మనుమడు బుద్ధి చెప్పడం లాంటి అంశాలతో కథ కొత్త హంగులు దిద్దుకుంది. నిర్మాత మహేశ్, ఆర్కే ధర్మరాజులకే కథారచన క్రెడిట్ ఇచ్చి, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వ బాధ్యతల క్రెడిట్ తీసుకున్నారు దాసరి. ఈ సినిమాలో తెరపై రెండో ఎన్టీఆర్‌ను హోటల్ రిసెప్షన్ దగ్గర పలకరించే చిరువేషంలోనూ మెరిశారు మహేశ్. సమాజానికి మంచి చెప్పే ఈ కథతో ఆ ఏటి ద్వితీయ ఉత్తమ కథారచయితగా మహేశ్ రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకున్నారు. క్రేజీ కాంబినేషన్! దాసరి కొడుకుకు ఎన్టీఆర్ పేరు!! దర్శకుడిగా దాసరికి ఇది 12వ సినిమా. అంతకు ముందు 11 సినిమాల్లో ‘సంసారం – సాగరం’, ‘రాధమ్మ పెళ్ళి’, ‘తిరపతి’, యావరేజ్ ‘యవ్వనం కాటేసింది’ పోగా మిగతా 7 సక్సెస్. ఆ మాటకొస్తే ‘మనుషులంతా ఒక్కటే’ రిలీజైన 1976కు ముందు సంవత్సరం 1975లో రిలీజైన దాసరి చిత్రాలు నాలుగూ శతదినోత్సవ చిత్రాలే. దాసరి మంచి క్రేజు మీదున్నారు. అయితే, శోభన్‌బాబు ‘బలిపీఠం’ మినహా అప్పటి దాకా ఆయన తీసిన సినిమాలన్నీ బ్లాక్ అండ్ వైటే! స్టార్ల కన్నా కథకే ప్రాధాన్యమున్న లోబడ్జెట్ చిత్రాలే! ఆ టైములో ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్‌తో, కలర్లో, ఔట్‌డోర్‌లో, భారీ బడ్జెట్‌తో తొలిసారిగా దర్శకత్వం వహించే ఛాన్స్ రాగానే దాసరి రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. 1975 నాటికి శోభన్‌బాబు జోరు మీదున్నారు. టాప్ స్టార్‌గా ఎన్టీఆర్ కెరీర్ కొనసాగుతోంది. అప్పట్లో ఎన్టీఆర్ సెంటిమెంటల్ క్రైమ్ కథ ‘అన్నదమ్ముల అనుబంధం’ (1975 జూలై 4), ప్రయోగాత్మక ‘తీర్పు’(1975 అక్టోబర్ 1), మాస్‌ఫార్ములా ‘ఎదురులేని మనిషి’ (1975 డిసెంబర్ 12), విభిన్నమైన క్లాస్ ప్రేమకథ ‘ఆరాధన’ (1976 మార్చి 12) చిత్రాలతో 9 నెలల కాలంలో 4 హిట్లు, చారిత్రక కథా చిత్రం ‘వేములవాడ భీమకవి’ (1976 జనవరి 8) తర్వాత ‘మనుషులంతా ఒక్కటే’తో జనం ముందుకొ చ్చారు. జమీందారీ కథకు తగ్గట్టు రాతి కట్టడంతో కోటలా కనిపించే బెంగళూరులోని మైసూర్ మహారాజా ప్యాలెస్‌లో షూటింగ్ చేసిన తొలి తెలుగు చిత్రమూ ఇదే. అంతకు ముందొచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు’ (1973) లాంటివన్నీ తెల్లగా, పాలరాతితో చేసినట్టు తోచే మైసూరులోని లలితమహల్ ప్యాలెస్‌లో తీసినవి. చిత్రమేమిటంటే, ఏ.వి.ఎం స్టూడియోలో ‘మనుషులంతా ఒక్కటే’ షూటింగ్ ప్రారంభమైనరోజునే దాసరికి అబ్బాయి పుట్టాడు. ఆ సంతోష వార్త తెలియగానే ఎన్టీఆర్‌తో పంచుకున్న దాసరి, ‘తారక రామారావు అనే మీ పేరు కలిసొచ్చేలా మా తొలి సంతానానికి నామకరణం చేస్తున్నాం’ అని చెప్పారు. కొడుకుకి‘తారక హరిహర ప్రభు’ అని పేరు పెట్టారు. ఎస్పీబీ గాత్రానికి ఓ కొత్త ఊపు ఇద్దరు ఎన్టీఆర్‌లు, ఇద్దరు హీరోయిన్లున్నా – ‘మనుషులంతా...’లో ఎన్టీఆర్‌కు ఒక్క డ్యుయెటైనా ఉండదు. బాపు సూపర్ హిట్ ‘ముత్యాల ముగ్గు’ సహా అక్కినేని ‘సెక్రటరీ’, కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప’ తదితర చిత్రాల ఆడియోలతో గాయకుడు రామకృష్ణ హవా నడుస్తున్న రోజులవి. ఆ పరిస్థితుల్లో అప్పటికి ఇంకా వర్ధమాన గాయకుడైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ‘మనుషులంతా ఒక్కటే’లోని సోలో పాటలన్నీ ఎస్. రాజేశ్వరరావు స్వరసారథ్యంలో పాడి, ఆకట్టుకున్నారు. ‘అను భవించు రాజా..’, ‘తాతా బాగున్నావా..’, ‘ఎవడిదిరా ఈ భూమి..’ (రచన సినారె), ‘కాలం కాదు కర్మా కాదు..’ (ఆత్రేయ) – ఇలా ఆ సోలో సాంగ్స్ అన్నీ పాపులరే. ఇక, ‘ముత్యాలు వస్తావా...’ డ్యూయట్లో అచ్చంగా అల్లు రామలింగయ్యే పాడారేమో అనేట్టుగా ఎస్పీబీ తన గళంతో మాయాజాలం చేయడం మరో విశేషం. అలా ఆయన కెరీర్‌కు ఈ చిత్రం ఓ కొత్త ఊపు. హాస్యనటి రమాప్రభ ఈ సినిమాలో అల్లు రామలింగయ్య, నాగేశ్‌ల సరసన ద్విపాత్రాభినయం చేయడం ఓ గమ్మత్తు! అల్లుతో రమాప్రభకు ‘ముత్యాలు వస్తావా... అడిగింది ఇస్తావా...’ అంటూ డ్యూయెట్ పెట్టడం మరో గమ్మత్తు!! రాజేశ్ ఖన్నా, షర్మిలా టాగోర్ నటించిన హిందీ సినిమా ‘ఆరాధన’ (1969 సెప్టెంబర్ 27)లో ఎస్.డి. బర్మన్ బాణీకి ఆయన కుమారుడు ఆర్.డి. బర్మన్ హంగులు చేర్చగా, దేశమంతటినీ ఊపేసిన పాపులర్ శృంగారగీతం ‘రూప్ తేరా మస్తానా.’ సరిగ్గా ఆ బాణీనే అనుసరిస్తూ, కొసరాజు రాసిన ‘ముత్యాలు వస్తావా..’ అప్పట్లో రేడియోలో మారుమోగింది. ఇప్పటికీ ఎమోషనల్‌గా... ఆ బుర్రకథలు ఇదే సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు పెద్ద ఎన్టీఆర్ పాత్ర ఒంటరిగా దుండగుల చేతిలో చనిపోయే ఉద్విగ్నభరిత ఘట్టం ఉంటుంది. ఆ సందర్భానికి తగ్గట్టు మహాభారతంలోని అభిమన్యుడి బుర్రకథను సినారె ప్రత్యేకంగా రాశారు. ప్రసిద్ధ బుర్రకథకుడు నాజర్ బృందంతో ఈ బుర్రకథ తీయాలనుకున్నారు. అయితే, ఆయన వయోభారం అడ్డమైంది. దాంతో, సినారె సూచనతో హైదరాబాద్‌కు చెందిన మరో ప్రముఖ బుర్రకథకుడు పి. బెనర్జీ బృందంతో ఆ బుర్రకథ తీశారు. ఆ బుర్రకథ, తెరపై దాని చిత్రీకరణ ఓ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. నాలుగున్నరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ –దాసరి కాంబినేషన్లోనే వచ్చిన ‘సర్దార్ పాపారాయుడు’ లోనూ ఇంటర్వెల్ ముందు ఇదే బెనర్జీ బృందంతో శ్రీశ్రీ రాసిన అల్లూరి సీతారామరాజు బుర్రకథ పెట్టడం విశేషం. యాభైకే... 100 రోజుల వసూళ్ళు తరువాతి కాలంలో దర్శకులైన కె. దుర్గానాగేశ్వరరావు ‘మనుషులంతా ఒక్కటే’కు కో–డైరెక్టరైతే, శతచిత్ర దర్శకుడైన కోడి రామకృష్ణ అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్. దాసరి శిష్యుడు – ఇప్పటి విప్లవ చిత్రాలకు చిరునామాగా మారిన ఆర్. నారాయణమూర్తి కూడా ఈ విప్లవాత్మక కథాచిత్రంలో క్లైమాక్స్‌లో ఒక చిన్న డైలాగు వేషంలో కనిపిస్తారు. తమిళనాడులోని మద్రాసు, కర్ణాటకలోని బెంగళూరు, నందీహిల్స్, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు పరిసరాల్లో – ఇలా 3 రాష్ట్రాల్లో భారీ వ్యయంతో ఈ సినిమా చిత్రీకరణ సాగింది. 33 ప్రింట్లతో 50 థియేటర్లలో రిలీజైన ఈ కలర్ చిత్రం అప్పట్లో దాదాపు అన్ని కేంద్రాలలో 50 రోజులు ఆడింది. నాలుగు కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. విజయవాడ లక్ష్మీ టాకీస్‌లో అత్యధికంగా 128 రోజులు ప్రదర్శితమైంది. ఇక, హైదరాబాద్ కేంద్రంలో షిఫ్టింగులతో, సంయుక్త రజతోత్సవం మాత్రం జరుపుకొంది. క్లైమాక్స్ చిత్రీకరణ సాగిన నెల్లూరులో విపరీతంగా ఆదరణ లభించింది. అలా నెల్లూరు, గుంటూరు లాంటి కొన్ని కేంద్రాలలో సర్వసాధారణంగా ఒక సినిమాకు వందరోజులకు వచ్చే వసూళ్ళను ‘మనుషులంతా ఒక్కటే’ కేవలం యాభై రోజులకే సాధించడం అప్పట్లో చర్చ రేపింది. ఆ ఏడాది జూలై 26న మద్రాస్ తాజ్ కోరమాండల్ హోటల్లో దర్శకుడు పి. పుల్లయ్య, నిర్మాత డి.వి.ఎస్ రాజు ముఖ్య అతిథులుగా సినిమా వంద రోజుల వేడుక ఘనంగా చేశారు. అప్పట్లో ఎమ్జీఆర్తో తమిళంలో ఈ సినిమాను రీమేక్ తీయాలనుకున్నారు. కానీ, ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి కావడంతో అది కుదరలేదు. ఏది ఎలా ఉన్నా, మనుషులంతా ఒక్కటే అనే సార్వకాలిక సత్యాన్ని జనరంజకంగా చెప్పిన చిత్రంగా ‘మనుషులంతా ఒక్కటే’ ఎప్పటికీ గుర్తుంటుంది. ఎన్టీఆర్ సహకారంతో... ‘మనుషులంతా...’ తరువాత రాజేంద్ర కుమార్‌కు ఎన్టీఆర్ ఇంకో సినిమా చేశారు. ‘రక్తసంబంధం’ ఫక్కీలోని ఆ అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ చిత్రం – ‘మహాపురుషుడు’. ‘ఆబాలగోపాలుడు’ టైటిల్ మధ్యలో అనుకొని, చివరకు ‘మహాపురుషుడు’ (1981 నవంబర్ 21)గానే రిలీజైందా సినిమా. నిర్మాణం సగంలో ఉండగానే రాజేంద్ర కుమార్ హఠాత్తుగా కన్నుమూశారు.చిత్ర నిర్మాణం సందిగ్ధంలో పడి, ఆలస్యమైంది. ఎన్టీఆర్ సహకరించి, సినిమా పూర్తి చేయించి, రిలీజ్ చేయించడం విశేషం. పబ్లిసిటీలో... పేరు వివాదం! ‘మనుషులంతా ఒక్కటే’తో మొదలైన ఎన్టీఆర్ – దాసరి కాంబినేషన్లో ఆ తరువాత మరో 4 సినిమాలు వచ్చాయి. ఈ సినిమా తీసేనాటికే ప్రింట్, పోస్టర్ పబ్లిసిటీలో దర్శకుడిగా దాసరి పేరు సినిమా టైటిల్ కన్నా పైన మేఘాలకు ఎక్కింది. కానీ, ఎన్టీఆర్‌తో తొలిసారి తీస్తున్న ‘మనుషులంతా ఒక్కటే’ ప్రిరిలీజ్ పబ్లిసిటీకి దాసరి తన పేరును సినిమా టైటిల్ కన్నా కిందే వేసుకున్నారు. ఆ పైన తమ కాంబినేషన్లో రెండో సినిమా ‘సర్కస్ రాముడు’ (1980 మార్చి 1)కు మాత్రం ఎందుకనో టైటిల్ పైన తన పేరు వేసుకున్నారు దాసరి. అది చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ దాసరి దగ్గర పంచాయతీ పెట్టారు. దాంతో, ఇకపై ప్రధాన పబ్లిసిటీలో ముందుగా పైన ఎన్టీఆర్ నటించిన అని పేరు వేసి, ఆ తరువాతే మరోవైపు తన పేరు మేఘాలలో వేయడానికి దాసరి రాజీ కొచ్చారు. ఒప్పుకున్నట్టే, ఆ తరువాత తీసిన ‘సర్దార్ పాపారాయుడు’ (1980 అక్టోబర్ 30), ‘విశ్వరూపం’ (1981 జూలై 25) ప్రధాన పబ్లిసిటీకి ఆ పద్ధతే అనుసరించారు. ఆఖరుగా వచ్చిన ‘బొబ్బిలిపులి’ (1982 జూలై 9)కి సైతం ‘‘నవరస నాయకుడు నటరత్న యన్.టి.ఆర్. నటనా వైభవం’’ అని ముందు వేసి, ఆ తరువాతే మేఘాలలో తన పేరు పబ్లిసిటీలో కనిపించేలా చూశారు. పబ్లిసిటీలో పేరెక్కడ ఉండాలనే ఈ వివాదం సినీప్రియుల్లో అప్పట్లో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. నాగభూషణం లాస్... సత్యనారాయణకు గెయిన్! ఈ సినిమాలో కీలకమైనది – మనుమడైన రెండో ఎన్టీఆర్ ఢీ కొట్టే తాత పాత్ర. అహంకారం నిండిన జమీందారుగా ఆ విలనీ తాత పాత్ర, ఆ గెటప్ అప్పట్లో నటుడు నాగభూషణం ట్రేడ్ మార్క్. నిజానికి, ఎన్టీఆర్ కూడా ఆయన పేరే సూచించారట. కానీ, నాగభూషణం సమర్పించిన ‘ఒకే కుటుంబం’కి పనిచేసిన దాసరి ఆ మాట వినలేదు. ‘తాత – మనవడు’లో నాగభూషణం బదులు గుమ్మడితో వేషం వేయించిన దాసరి ఈసారీ వ్యక్తిగత కారణాల రీత్యా నాగభూషణాన్ని వద్దనే అనుకొన్నారు. సత్యనారాయణ పేరు పైకి తెచ్చారు. అదేమంటే, ‘నన్ను నమ్మండి. ఆయన అద్భుతంగా చేస్తారని నిరూపిస్తా’ అని వాదించి మరీ ఒప్పించారు. నిరూపించారు. ‘ఎన్టీఆర్‌కు తాతగా మహామహులు చేయాల్సింది నేను చేయడమేమిట’ని సత్యనారాయణ సైతం భయపడ్డారు. కానీ, తాత పాత్రకు ప్రాణం పోశారు. ఆయన అభినయం, ‘తాతా బాగున్నావా’ లాంటి పాటలతో నేటికీ ఆ పాత్ర చిరస్మరణీయమైంది. ‘కర్ణ’ ఛాన్స్ ఇచ్చిన... జమున కెమేరా అందం పెద్ద ఎన్టీఆర్‌కు భార్యగా, చిన్న ఎన్టీఆర్‌కు తల్లిగా, ఆత్మాభిమానం ఉన్న పేదింటి రైతుబిడ్డగా జమునది క్లిష్టమైన పాత్ర. ఆ పాత్రను ఆమె అభినయంతో మెప్పించారు. నలభై ఏళ్ళ వయసులోనూ జమున లంగా, ఓణీలతో సినిమా ఫస్టాఫ్‌లో ఆకర్షణీయంగా, చలాకీగా కనిపిస్తారు. ఆ వయసులోనూ, ఆ కాస్ట్యూమ్స్‌తో ఆమెను అందంగా, హుందాగా చూపడంలో కెమేరామ్యాన్ కన్నప్ప ప్రతిభ కూడా ఉంది. ఆ పనితనం ఎన్టీఆర్‌కు బాగా నచ్చింది. ఆ వెంటనే ఎన్టీఆర్ తన 54వ ఏట స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ, త్రిపాత్రాభినయం చేస్తున్న పౌరాణిక చిత్రం ‘దాన వీర శూర కర్ణ’ (1977 జనవరి 14)కు కన్నప్పనే కెమేరామ్యాన్‌గా తీసుకున్నారు. కర్ణుడు, సుయోధనుడు, శ్రీకృష్ణుడు – ఈ మూడు పాత్రల్లోనూ తెరపై అందంగా కనువిందు చేశారు. ఆ పాట... అలా స్పెషల్! ఇదే సినిమాలో దాసరి చేసిన మరో మ్యాజిక్ – సినిమాల టైటిల్స్‌తోనే ఏకంగా ఓ పాటంతా రాసి, మెప్పించడం! ‘నిన్నే పెళ్ళాడుతా... రాముడూ భీముడూ...’ అంటూ ఆ పాట అంతా ఎన్టీఆర్ నటించిన సినిమాల టైటిల్స్‌తోనే సాగుతుంది. పి. సుశీల గానంలో హీరోయిన్ మంజుల స్టేజీపై నర్తిస్తుండగా, ఎన్టీఆర్ మీదే దాన్ని చిత్రీకరించడం విశేషం. అంతకు ముందు ‘ఒకే కుటుంబం’ లాంటి సినిమాల్లో గీతరచన చేసినా, దర్శకుడయ్యాక దాసరికి ఇదే ఫస్ట్ సాంగ్. ఈ సినిమాలో ఈ సందర్భం కోసం మొదట వేరే పాట అనుకున్నారు. ఎన్టీఆర్ పౌరాణిక గెటప్పుల్లో కనిపించేలా సినారె రాశారు. అయితే, ఆఖరి నిమిషంలో ఆ గెటప్పుల ప్రతిపాదన విరమించుకొని, ఆపద్ధర్మంగా దాసరి ఈ సినిమా టైటిల్స్పాట రాశారు. సినీటైటిల్స్తోనే ఓ పాట రావడం తెలుగులో అదే తొలిసారి. అప్పటికే ఎన్టీఆర్ దాదాపు 250 సినిమాల్లో నటించారు. అందులోని 34 టైటిల్స్ ఈ పాటలో ఉన్నాయి. అలా ఒక హీరోపై ఆయన సినీటైటిల్స్తోనే ఓ పాట రాసి, ఆయనపైనే చిత్రీకరించడం తెలుగులో ఇదొక్కసారే జరిగింది. తర్వాత ‘మరోచరిత్ర’ లాంటి సినిమాల్లో వేర్వేరు సినిమాల టైటిల్స్ తోనే పాటంతా రాయడమనే ధోరణి కొనసాగింది. - రెంటాల జయదేవ -
షూటింగ్లో అలా చూస్తే ఫీలవుతాను
‘చంద్రముఖి’గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ ఆడపడుచు మంజుల తెలుగింటి కోడలు అయింది. మా ఇంటి ‘కృష్ణవేణి’ అంటూ తన నటనతో అందరిచేత మెప్పు పొందుతోంది. తన సహనటుడు నిరుపమ్ పరిటాలను పెళ్లి చేసుకున్న మంజుల చెబుతున్న ముచ్చట్లివి. ♦ చిన్నవయసులోనే తల్లిగా నటిస్తున్నారు.. నేను ఇప్పుడు నటిస్తున్న ‘కృష్ణవేణి’ సీరియల్ ‘స్టార్ మా’ టీవీలో వస్తోంది. ఇందులో స్టోరీ దాదాపుగా నాతోనే ముడి పడి ఉంటుంది. తల్లి క్యారెక్టర్ అయినా స్వతంత్రభావాలు గల పాత్ర. అందుకే ఒప్పుకున్నాను. ♦ ఈ ఫీల్డ్కి ఎలా వచ్చారు? మాది బెంగుళూరు. మా నాన్నగారు పోలీసాఫీసర్. తను యాక్టర్ కూడా. నటన అంటే ఆయనకు పిచ్చి. మా నాన్నగారి ఫ్రెండ్ సలహాతో చిన్నప్పటి నుంచే అలా నేనూ యాక్టింగ్‌లోకి వచ్చాను. కన్నడలో పదికి పైగా సీరియల్స్‌లో నటించాను. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ్లో కూడా ఓ సీరియల్ చేస్తున్నాను. ‘చంద్రముఖి’ సీరియల్ చేస్తున్నప్పుడు ఇక్కడి భాష రాదు. తర్వాత మెల్లగా నేర్చుకున్నాను. తెలుగులోనూ పదికి పైగా సీరియల్స్ చేశాను. ♦ నలుగురు అక్కచెల్లెళ్లు అన్నారు.. అవును, అక్క స్కూల్ టీచర్. నేను రెండవ అమ్మాయిని. మూడవ అమ్మాయి హౌజ్‌వైఫ్. చిన్నది కీర్తి. తనూ సీరియల్స్‌లో నటిస్తోంది. అమ్మ హౌజ్‌వైఫ్. మేమందరం కలిస్తే సందడే సందడి. ♦ నిరుపమ్‌తో మీ పరిచయం, ప్రేమ.. ‘చంద్రముఖి’ మా ఇద్దరికి మొదటి సీరియల్. మా ఇద్దరి లక్షణాలు ఒకేలా ఉంటాయి. నేను సైలెంట్‌గా నా పనేదో నేను అన్నట్టు ఉంటాను. నిరుపమ్ కూడా అలాగే సైలెంట్‌గా ఉంటారు. ఏడాది వరకు అలాగే ఉన్నాం. అనుకోకుండా మా మధ్య ఒక మేసేజ్ షేర్ అయ్యింది. అక్కణ్ణుంచి మెసేజ్‌లు, మాటలు పెరిగాయి. చంద్రముఖి సీరియల్ ఆరున్నరేళ్ల పాటు నడిచింది. ఆ టైమ్‌లోనే మా ప్రేమ, పెళ్లి, బాబు పుట్టడం అన్నీ జరిగాయి (నవ్వుతూ). మా ఇద్దరి కుటుంబాల వాళ్లు యాక్టింగ్ ఫీల్డ్‌లో ఉన్నవారే. మా మామగారు ఓమ్కార్ పరిటాల నటుడు, రచయితగా పేరున్నవారు. ♦ పుట్టినిల్లు – మెట్టినిల్లు అన్ని పండగలు, పద్ధతులు ఒకేలా ఉన్నాయి. పెద్దగా తేడా లేదు. కొన్ని మాత్రమే వేరు. పిల్లలకు అన్నప్రాసన చేయడం మా పుట్టింటివాళ్ల వైపు లేదు. ఇక్కడ మా బాబుకు ఆ వేడుక చేశాం. అలాగే అబ్బాయిలకు పంచెల ఫంక్షన్ అని లేదు. ఇక్కడ ఆ వేడుక చేయాల్సి ఉంది. అమ్మవాళ్ల వైపు ఉగాదికి వేపాకు–బెల్లం కలిపి తింటారు. ఇక్కడ షడ్రుచులతో పచ్చడి చేసుకుంటారు. అమ్మవాళ్లు శ్రావణమాసంలో ఇక్కడలా వ్రతం చేయరు. పూజలు చేస్తారు. ♦ వర్క్– ఫ్యామిలీ బ్యాలెన్స్ నెలలో 15 రోజులు వర్క్. మిగతా 15 రోజులు ఫ్యామిలీతో కలిసేలా ప్లాన్ చేసుకుంటాను. మా బాబు అక్షజ్ ఓమ్కార్కి ఎనిమిదేళ్లు. మా కంపౌండ్‌లో మిగతా పిల్లల తల్లులను చూసి ‘అమ్మా, నువ్వు కూడా టీచర్, డాక్టరయితే ఈవెనింగ్ నాతో ఉండేదానివి కదా! అంటుంటాడు. అందుకే మిగతా రోజులన్నీ వాడితోనే స్పెండ్ చేసేలా జాగ్రత్త తీసుకుంటాను. ప్రతి వేసవిలోనూ, నవరాత్రి సెలవుల్లో అందరం అమ్మవాళ్లింట్లో కలుస్తాం. ♦ స్వీట్ మెమరీస్! నా జీవితంలో రెండు విషయాలు ఎప్పటికీ మరిచిపోలేను. మా పెళ్లికి పేరెంట్స్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్ రాలేదు. కానీ, తుపాన్ రూపంలో పెద్ద సమస్య వచ్చింది. మా పెళ్లి విజయవాడలో, రిసెప్షన్ బెంగుళూరులో అని డిసైడ్ అయ్యాం. అప్పుడు పెద్ద తుపాన్. నా పెళ్లికి నేను వెళ్లడానికి చాలా కష్టమైంది. నేను పెళ్లి మంఠపం చేరుకునేంతవరకు అందరూ టెన్షన్ పడ్డారు. మొత్తానికి ఎలాగోలా చేరుకున్నాను. మా సిస్టర్స్ నా పెళ్లయ్యాక చేరుకున్నారు. ఇది ఎప్పటికీ మర్చిపోలేను. ఇక రెండవది ‘చంద్రముఖి’ సీరియల్ టైమ్‌లోనే నేను, మా ఆయన దుబాయ్‌కి వెళ్లాం. మా ఇద్దరికీ అక్కడి లేక్ బోట్లో సాంగ్ షూటింగ్. బోట్ చివరలో ఇద్దరం టైటానిక్ పోజ్‌లో నిల్చున్నాం. మా చుట్టూ పడవల్లో కెమరాలతో షూట్ చేస్తున్నారు. మేమున్న బోట్ కదులడంతో నీళ్లలో పడిపోయా. ఆ టైమ్‌లో నిరుపమ్ గట్టిగా పట్టుకున్నారు. అప్పుడే చచ్చిపోతాను అనుకున్నా. ♦ ఇద్దరిదీ ఒకే ఫీల్డ్ సమస్యలు వస్తే! చాలా త్వరగానే పరిష్కరించుకుంటాం. నాకు కొంచెం పొసిసెవ్ ఎక్కువ. ఆయనతో కంపేర్ చేస్తే నాకే కోపం ఎక్కువ. ఆయనే కూల్ చేస్తుంటారు. షూటింగ్లో ఆయన వేరే నటితో కలిసి యాక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో చూసినప్పుడు మాత్రం ఫీలవుతాను. కొద్దిసేపట్లోనే ‘ఇదే మా జీవితం కదా!’ అని నాకు నేను సర్దిచెప్పుకుంటాను. ♦ డ్రీమ్స్.. బీకామ్ చేశాను కాబట్టి అకౌంటెంట్ అవాలనుకున్నా. యాక్టింగ్ ఫీల్డ్ నా కల కూడా కాదు. అనుకోకుండా వచ్చాను. ఇద్దరం వర్క్‌లో బిజీ. ఇద్దరం కలిసి ఉండేది తక్కువ సమయం. తనతో బయటకెళ్లాలి అని, నేనూ, బాబు, తనూ కలిసి ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటాను.– నిర్మలారెడ్డి -
ఆమె ఇంటర్ ఫెయిల్.. ఐటీ కంపెనీ ఎండీనా
మాది జమ్మికుంట మండలం చల్లూరు. అమ్మనాన్న సరోజన–బక్కారెడ్డి. నేను ఇంట్లో మూడో కూతుర్ని. అమ్మ నాన్న వ్యవసాయం చేసేవారు. అందరిలాగానే నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా. 1993–94లో పదో తరగతిలో సాధారణ మార్కులతోనే పాస్ అయ్యాను. 1994–96 జమ్మికుంటలోని ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ హెచ్ఈసీ చదివాను. చదువుపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఇంటర్ ఫెయిల్ అయ్యాను. అయినా బాధపడలేదు. కానీ అమ్మనాన్న నాకు పెళ్లి చేయాలని నిశ్చయించారు. వారి మాట కూడా కాదనలేదు. గోదావరిఖనికి చెందిన సింగరేణి కార్మికుడు శంకర్‌రెడ్డి కుమారుడు సంపత్‌రెడ్డికి ఇచ్చి 1997లో పెళ్లి చేశారు. సాక్షి,పెద్దపల్లి: కాలక్షేపం కోసం టైలరింగ్.. పెళ్లి అయినా నా ఆలోచన ఎప్పుడూ ఏదైనా సాధించాలని ఉండేది. గృహిణిగా ఇంట్లో కాలక్షేపం కాకపోవడంతో స్నేహితురాళ్లతో కలిసి కుట్టు పని నేర్చుకున్నా. ఇంట్లోనే లేడీస్ టైలర్ నడిపించాను. మధ్యలో ఆగిన చదువు గురించి బెంగ పెట్టుకోకుండా తిరిగి ప్రారంభించాలనుకున్నా. 2003లో కాకతీయ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీలో చేరా. మూడేళ్లలో 2006లో అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాను. కంప్యూటర్ టీచర్‌గా... 2006లో భర్త, పిల్లలం కరీంనగర్‌కు షిఫ్ట్ అయ్యాం. అక్కడే ఓ ప్రైవేటు స్కూల్లో కంప్యూటర్ టీచర్‌గా రూ.1500 జీతానికి పనిచేశాను. టీచర్‌గా పని చేస్తూనే ఎస్ఆర్ఎం పీజీ కాలేజీలో ఎంబీఏ పూర్తి చేశాను. కాకతీయ ఓపెన్ యూనివర్సిటీలో టాపర్‌గా నిలిచాను. జమ్మికుంటకు చెందిన డిగ్రీ లెక్చరర్ మల్లికార్జున్‌రావు, ఎంబీఏ ప్రొఫెసర్ శ్రీధర్ నాలోని ప్రతిబను గుర్తించి ప్రోత్సహించారు. వారిని ఎప్పటికీ మర్చిపోను. 2008లో కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్లాం. ఓ ఐటీ కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లాను. హెచ్ఆర్గా ఎంపికయ్యాను. 2010లో మలేషియా, సింగపూర్‌లో జరిగిన ఐటీ కంపెనీల సెమినార్లో పాల్గొన్నాను. అక్కడికి వచ్చిన ప్రతినిధులను చూసి నాకూ ఓ కంపెనీ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. డెర్రాన్ ఐటీ సొల్యూషన్స్.. సింగపూర్ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చిన తర్వాత 2011లో డెర్రాన్ ఐటీ సొల్యూషన్స్ పేరుతో కంపెనీ ప్రారంభించాను. ఉద్యోగం చేసి సంపాదించిన మొత్తంతోపాటు భర్త ఆర్థిక సహకారం.. అత్తింటివారి ప్రోత్సాహం నాకు కలిసి వచ్చాయి. సింగపూర్‌లో ఏర్పడిన వివిధ కంపెనీల ప్రతినిధుల పరిచయాలతో ఓ మల్టీనేషనల్ కంపెనీలతో అనుబంధం ఏర్పాటు చేసుకున్నాం. అయినా ప్రాజక్టు పనుల కోసం రెండు మూడేళ్లు ఇబ్బంది పడ్డాం. పెళ్లి సమయంలో అమ్మానాన్న పెట్టిన నగలు కూడా బ్యాంకులో కుదువ పెట్టాను. కరెంటు బిల్లు కట్టేందుకు డబ్బులు లేకపోతే మా అక్కలు ఇద్దరు సహాయం చేశారు. రాత్రి రెండు గంటల వరకు కూడా ఆఫీసులో పనిచేసిన సందర్భాలు అనేకం.. ఓసారి ముంబయి కంపెనీకి చెందిన వారు బిజినెస్ గురించి మాట్లాడుతూ కనీసం కారు లేదు.. బిల్లులు ఎలా పేమెంట్ చేస్తారంటూ ఎగతాళి చేశారు. ఇలాంటి సంఘటనలు నాలో పట్టుదలను మరింత పెంచాయి. ప్రాజెక్టులు రాక ప్రారంభమైన తర్వాత.. ఉద్యోగుల సహకారంతో ఎలాంటి ఎర్రర్స్ లేకుండా తయారు చేసి ఇచ్చాం. దీంతో కంపెనీలకు నమ్మకం పెరిగింది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అప్లికేషన్ డెవలప్మెంట్, ఈ పబ్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్, మార్కెటింగ్ ప్రాజెక్టు తయారు చేసి అందిస్తున్నాం. తొమ్మిదేళ్లుగా విజయవంతంగా ప్రాజెక్టులు తయారు చేస్తున్నాం. 20 మందితో కంపెనీ ప్రారంభం.. ఓ ఐటీ కంపెనీలో పనిచేసిన అనుభవం సొంతగా ఐటీ కంపెనీ ఏర్పాటుకు ప్రోత్సహించింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో 20 మందితో ఐటీ కంపెనీ స్థాపించాను. ప్రాజెక్టులు పెరిగే క్రమంలో వందలాది మందికి ఉద్యోగాలు కల్పించాం. హైటెక్‌సిటీ, సైబర్టవర్స్లో కంపెనీ నడిపించిన సమయంలో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. ప్రాజెక్టులు రాకపోయినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సి వచ్చేది. మా సంస్థలో పనిచేసి అవకాశాలు పొందిన సుమారు రెండు వేల మందికి ప్రముఖ కంపెనీల్లో అవకాశం రావడంతో విదేశాల్లో స్థిరపడ్డారు. ఏడాది క్రితం వైజాగ్‌లో మార్కెటింగ్ బ్రాంచ్ ప్రారంభించాం. ప్రస్తుతం రెండు బ్రాంచిల్లో కలిపి 200 మంది పనిచేస్తున్నారు. తొమ్మిది సంవత్సరాలుగా సోషల్‌వర్కర్‌గా పనిచేస్తున్నా. నాకు ఉమెన్ ప్రొటెక్షన్ కౌన్సిల్లో షీటీంలో సలహాదారుగా అవకాశం కల్పించారు. యాంటీ కరప్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఏసీసీఐ) తెలంగాణ రాష్ట్ర చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నా. కుటుంబం.. మంజుల భర్త సంపత్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఓ మీడియా సంస్థలో పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు దీప్తి ప్రస్తుతం ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతోంది. కుమారుడు నిఖిల్‌రెడ్డి ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు. లక్ష్యం ఉంటే ఏదైనా సాధ్యమే.. టెన్త్, ఇంటర్లలో తప్పినంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. ఏడాది, రెండేళ్లు గ్యాప్ తీసుకుని తిరిగి చదువుకుంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. గ్యాప్ తీసుకోవడం ద్వారా దీక్ష పెరుగుతుంది. సులభంగా పై చదువులకు వెళ్లగలుగుతాం. నాతోపాటు చాలామంది ఇదే విధంగా పైకి వచ్చిన వారు ఉన్నారు. ఒక గృహిణిగా ఉంటూ చదువుల తల్లి ప్రసన్నం పొందాను. ఐటీ కంపెనీ స్థాపించి 200 మందికి ఉద్యోగాలు కల్పించాను. మా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు రెండు పీజీలు చేసిన వారు సైతం ఉన్నారు. అందులో పరీక్షలు తప్పి తిరిగి పాసై ఆపైన జీవితంలో సక్సెస్ అయిన వారు చాలామంది ఉన్నారు. – మంజుల, ఐటీ కంపెనీ ఎండీ -
సూపర్ స్టార్ సోదరి కొత్త ఇన్నింగ్స్
ఘట్టమనేని వారసురాలిగా వెండితెర మీద సత్తా చాటుతున్న నటి, నిర్మాత, దర్శకురాలు మంజుల. అభిమానుల ఆంక్షల మధ్య వెండితెరకు పరిచయం అయిన మంజుల తొలి సినిమా షోతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తరువాత అడపాదడపా నటిగా కొనసాగుతూనే నిర్మాతగానూ ఇందిరా ప్రొడక్షన్ బ్యానర్‌పై పలు చిత్రాలను ప్రొడ్యూస్ చేశారు. ఇటీవల సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన మనసుకు నచ్చింది సినిమాతో దర్శకురాలిగా మారిన మంజుల త్వరలో మరో రంగంలోకి అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న డిజిటల్ ట్రెండ్‌కు అనుగుణంగా ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించనున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు అ! ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో అధికారక ప్రకటన వెలుడవనుంది. -
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే!
...చాలే ఇది చాలే అంటూ ఫుల్‌గా ఆనందపడిపోతున్నారు హీరోయిన్ రాయ్‌లక్ష్మి. ఈ సాంగ్ ‘గీతగోవిందం’ లోనిదే కావచ్చు. కానీ ఆ మూమెంట్‌ను ఇప్పుడు రాయ్‌లక్ష్మి కూడా ఫీల్ అవుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. దాదాపు ఆరేళ్ల తర్వాత కన్నడలో ‘ఝాన్సీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు రాయ్‌లక్ష్మీ. పీవీఎస్ గురుప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్గా మొదలైంది. ఇందులో ఐపీఎస్ ఆఫీసర్ ఝాన్సీ పాత్రలో నటిస్తున్నారు రాయ్‌లక్ష్మి. ఈ సినిమా సెట్స్‌కు రాయ్‌లక్ష్మి తల్లి వెళ్లారు. అందులో విశేషం ఏముందీ అనుకుంటున్నారా? విషయం ఉంది. ‘‘నా సినీ కెరీర్ (దాదాపు పదకొండేళ్ల కెరీర్) లో ఫస్ట్ టైమ్ మా అమ్మగారు సెట్స్‌కు వచ్చారు. ఇంతకన్నా నాకు ఇంకేం స్పెషల్ ఉంటుంది. ఇది నా లైఫ్‌లో వన్నాఫ్ ది బెస్ట్ మూమెంట్స్’’ అని పేర్కొన్నారు రాయ్‌లక్ష్మి. ఇంతకు ముందు 2012లో వచ్చిన ‘కల్పన’ చిత్రంతో శాండిల్‌వుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు రాయ్‌లక్ష్మి. తమిళంలో వచ్చిన ‘కాంచన’ చిత్రానికి ఇది రీమేక్. అలాగే ప్రస్తుతం సౌత్‌లో బిజీగా ఉన్న ఈ అమ్మడు తెలుగులో ‘వేర్ ఈజ్ వెంకట్‌లక్ష్మి’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆమె టీచర్ పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాకు కిశోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. -
అక్కతో సినిమా కూడా చేస్తానేమో?
‘‘మంజుల డైరెక్షన్ చేస్తుందని ఊహించలేదు. హాలిడేస్ టైమ్‌లో తను ఏదో రాసుకుంటుంటే కవిత రాసుకుంటుందేమో అనుకున్నా. కానీ సినిమా కథ రాసుకుంటుందని అనుకోలేదు’’ అని హీరో మహేశ్‌బాబు అన్నారు. సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరో హీరోయిన్లుగా మంజుల దర్శకత్వంలో సంజయ్ స్వరూప్, పి.కిరణ్ నిర్మించిన ‘మనసుకు నచ్చింది’ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ–రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘మంజుల కథ ప్రిపేర్ చేసుకొని, సినిమా చేయబోతున్నానని చెప్పినప్పుడు నేను షాక్ అయ్యా. ఒకరకంగా గర్వంగా ఫీలయ్యాను. విజువల్స్ బాగా నచ్చాయి. మా కిరణ్‌గారి సపోర్ట్, గైడెన్స్ సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ఆశిస్తున్నా. భవిష్యత్‌లో మా అక్కతో (మంజుల) సినిమా కూడా చేస్తానేమో?’’ అన్నారు. ‘‘మనసుకు నచ్చింది’ కథ రాయడం మొదలుకొని, సినిమా పూర్తి చేయడం వరకూ ఒక నేచురల్ ప్రాసెస్‌లా జరిగింది. మా నాన్నగారు (కృష్ణ), తమ్ముడు మహేశ్ గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది. ఒకానొక సందర్భంలో మహేశ్ కొడుకు గౌతమ్ వెళ్లి ‘నాన్నా.. మంజుల ఆంటీ సినిమాలో ఎప్పుడు యాక్ట్ చేస్తావ్?’ అని అడిగితే చాలా సింపుల్‌గా ‘అదే నా ఆఖరి సినిమా అవుతుంది’ అన్నాడట (నవ్వుతూ). కిరణ్‌గారి సహకారానికి రుణపడి ఉంటా’’ అన్నారు మంజుల. ‘‘మంజులగారి దర్శకత్వంలో హీరోగా చేయడం.. అది ఆమె ఫస్ట్ మూవీ కావడం నా లక్’’ అన్నారు సందీప్ కిషన్. -
మహేశ్ ఇంప్రెస్ అయ్యాడు – మంజుల
‘‘నేను డైరెక్షన్ చేస్తున్నానంటే మహేశ్ నమ్మలేదు. టీజర్స్, సాంగ్స్ చూసి షాక్ అయ్యాడు. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఈ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యాడు’’ అన్నారు మంజుల. సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరో హీరోయిన్లుగా మంజుల ఘట్టమనేని దర్శకత్వం వహించిన సినిమా ‘మనసుకు నచ్చింది’. పి.కిరణ్, సంజయ్ స్వరూప్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ–‘‘ఏదో ఓ సినిమా డైరెక్ట్ చేయాలని ఈ సినిమా డైరెక్ట్ చేయలేదు. మంచి విషయం ఉండబట్టే చేశాను. బేసిక్‌గా నేను రొమాంటిక్ పర్సన్‌ను. అందుకే ఓ స్వీట్ లవ్‌స్టోరీ రాసుకున్నాను. ఈ సినిమా చూసి కెమెరామేన్ ఛోటాగారు బెస్ట్ లవ్ స్టోరీ అన్నారు. కథను ముందు కిరణ్‌గారికి చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. ఆ సాయంత్రమే సాయిమాధవ్ బుర్రాకి చెప్పాను. ఆయనకూ బాగా నచ్చింది. ఈ సినిమాలో మా ఆయన (సంజయ్) స్పెషల్ రోల్ చేశారు. ఆయన లక్కీ యాక్టర్. ఆయన చేసిన సినిమాలన్నీ హిట్టయ్యాయి. మా అమ్మాయి కూడా మంచి రోల్ ప్లే చేసింది. సందీప్, అమైరా బాగా చేశారు. నా దగ్గర పవన్ కల్యాణ్ కోసం మంచి కథ ఉంది. ఆయనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఆ ఒక్క సినిమా చేసి రాజకీయాల్లోకి వెళ్లొచ్చు’’ అన్నారు.‘‘ప్రతి ఒక్కరి లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసే అందమైన చిత్రం. ఇందులో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని ఒక ఇంట్రస్టింగ్ మెసేజ్ ఉంటుంది. ఇది ఏ జానర్ సినిమా అని ఒక ఫ్రెండ్ అడిగాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ ఒక మంచి కాఫీలాంటి సినిమా అవుతుంది అనిపించింది. నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం అవుతుంది’’ అన్నారు సందీప్ కిషన్. ‘‘మంజుల కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. బేసిక్‌గా నాకు లవ్‌స్టోరీస్ అంటే చాలా ఇష్టం. అందరికీ నచ్చుతుందని ఈ సినిమా తీశాం. ఫిబ్రవరి 16న విడుదల చేస్తున్నాం’’ అన్నారు పి.కిరణ్. ‘‘ప్రేక్షకులందరికీ నచ్చే కథ. అందరికీ నచ్చే డైలాగ్స్ రాశాను. మంజులగారు క్లారిటీతో, మనసుకు హత్తుకునేలా రాయించుకున్నారు’’ అన్నారు బుర్రా సాయిమాధవ్. ‘‘సినిమా చూశాం. చాలా హ్యాపీగా ఉన్నాం. అందరికీ నచ్చేలా ఓ మంచి సినిమా తీసిన మంజులకు నా కంగ్రాట్స్. కిరణ్‌గారు లేకపోతే ఈ సినిమా లేదు’’ అన్నారు సంజయ్ స్వరూ‹ప్. ఈ సినిమాకు సంగీతం: రధన్, కెమెరా: రవి యాదవ్, మాటలు: సాయి మాధవ్ బుర్రా. -
మంచి ఫీల్
సూపర్‌స్టార్ కృష్ణ తనయ మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా పరిచయమవుతోన్న చిత్రం ‘మనసుకు నచ్చింది’. సందీప్ కిషన్ హీరోగా, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరోయిన్లుగా మంజుల దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్–ఇందిరా ప్రొడక్షన్స్ పతాకాలపై సంజయ్ స్వరూప్–పి.కిరణ్ నిర్మించారు. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఫిబ్రవరి 16న విడుదల చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ –‘‘ఫ్రెష్, రొమాంటిక్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. డైరెక్టర్‌గా మంజులకు తొలి చిత్రమైనా అనుభవం ఉన్నవారిలా చక్కగా తెరకెక్కించారు. ఒక మంచి సినిమా చూశామనే భావన ప్రేక్షకులకు కలిగించేలా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రధన్ మ్యూజిక్ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ప్రియదర్శి, పునర్నవి భూపాలం, నాజర్, అరుణ్ ఆదిత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రవి యాదవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా. -
మహేశ్ మాంజా తయారు చేసేవాడు – మంజుల
సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘మనసుకు నచ్చింది’ త్వరలో విడుదల కానుంది. సందీప్ కిషన్, అమైరా దస్తూర్ జంటగా పి. కిరణ్, సంజయ్ స్వరూప్ నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా మంజుల, సందీప్ పంచుకున్న విశేషాలు. మీ చిన్నప్పటి సంక్రాంతిని గుర్తు చేసుకుంటారా? మంజుల: మా అమ్మమ్మ భోగి రోజు పిల్లలందరికీ నూనె రాసి, స్నానం చేయించేది. పిండి వంటలు బాగా వండేవాళ్లు. ముఖ్యంగా గారెలు, పాయసం అయితే తెగ లాగించేవాళ్లం. తెల్లవారు జాము భోగి మంటలు వేసేవాళ్లం. సంక్రాంతి పండగ విశేషం గురించి అప్పట్లో ఏమీ తెలియకపోయినా ఆ సెలబ్రేషన్ చాలా బాగా అనిపించేది. మీ నాన్న సొంతూరు బుర్రిపాలెంలో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్న సందర్భాలేమైనా? మా చిన్నప్పుడు కంటిన్యూస్‌గా మూడు సంవత్సరాలు సంక్రాంతి పండగకి బుర్రిపాలెం వెళ్లాం. అక్కడ మా నాన్నమ్మ బాగా సెలబ్రేట్ చేసేది. విలేజ్‌లో పండగలంటే ఓ సెపరేట్ కళ ఉంటుంది. పెద్ద పెద్ద ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు... చాలా సందడిగా ఉంటుంది. ఇప్పుడు లేదని కాదు.. ఇప్పుడూ మా ఇంట్లో ఫెస్టివల్స్ బాగానే జరుపుకుంటాం. ఈ టైమ్‌లో పెద్ద పెద్ద ముగ్గులు వేయిస్తాను. నేను డైలీ పూజ చేస్తాను. పండగ రోజు ఇంకొంచెం ఎక్కువసేపు చేస్తుంటాను. సంక్రాంతి రోజు ముఖ్యంగా వినాయకుడు, శివుడికి పూజ చేస్తాను. చిన్నప్పుడు మీ బ్రదర్స్ (అన్నయ్య రమేశ్‌బాబు, తమ్ముడు మహేశ్‌బాబు)తో కలసి గాలిపటాలు ఎగరేసేవారా? మేం ముగ్గురు సిస్టర్స్ చూడటంవరకే. రమేశ్ అన్నయ్య, మహేశ్‌కి గాలిపటాలంటే పిచ్చి. సంక్రాంతి టైమ్ అంటే చాలు.. రోజూ గాలిపటాలు ఎగరేయాల్సిందే. ఇద్దరూ ఇంట్లోనే ‘మాంజా’ తయారు చేసేవాళ్లు. పోటీలు పడి ఎగరేసేవాళ్లు. నాన్న చూస్తూ కూర్చునేవారు. ఇప్పుడు మీ భర్త, పాప (సంజయ్, జాన్వీ) కైట్స్ ఎగరేస్తారా? లాస్ట్ ఇయర్ ట్రై చేశారు. ఇద్దరికీ కుదరలేదు (నవ్వుతూ). బేసిక్‌గా సంజయ్‌కి గాలిపటాలు ఎగరేయడం తెలీదు. ఈసారి అయినా కుదురుతుందో లేదో చూడాలి. సంక్రాంతి షాపింగ్ కంప్లీట్ అయిందా? ‘మనసుకు నచ్చింది’ సినిమా డైరెక్షన్ చేస్తున్న విషయం మీకు తెలుసు. షూటింగ్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో ఫుల్ బిజీ. అయినా పండగ రోజు కొత్త బట్టలు వేసుకుంటేనే బాగుంటుంది. మా అమ్మాయి వెస్ట్రన్ డ్రెస్సులకు అలవాటుపడింది. పండగల సమయంలో అయినా ట్రెడిషనల్ వేర్ అయితే బాగుంటుంది కదా. అందుకే తనకు అలాంటి డ్రెస్ తీసుకున్నా. మామూలుగా పండగలకి మీ బ్రదర్స్, సిస్టర్స్ కలుస్తుంటారా? ప్లాన్ చేసుకుని కలిసింది లేదు. అయితే ఇకనుంచి ప్లాన్ చేయాలని ఉంది. మిగతా రోజుల్లో ఎవరి పనులతో వాళ్లం బిజీగా ఉన్నా పండగలకి మాత్రం అందరం ఒకచోట కలిస్తే బాగుంటుందని ఈ ఏడాదే అనిపించింది. అమ్మానాన్న, బ్రదర్స్, సిస్టర్స్ ఫ్యామిలీస్‌ని కలిసేలా నేనే ఇకనుంచి ప్లాన్ చేయాలనుకుంటున్నా. ఈ ఇయర్ డైరెక్టర్‌గా మీ పేరుని స్క్రీన్ మీద చూడబోతున్నారు. ఎలా ఉంది? డైరెక్షన్ అనేది పెద్ద బాధ్యత. బాగానే చేశాననే నమ్మకం ఉంది. దర్శకురాలిగా నాకు మొదటి సినిమా, నటిగా మా అమ్మాయికి ఇది మొదటి సినిమా. మంచి క్యారెక్టర్ చేసింది. నాకు నచ్చిన కథతో, నాకు నచ్చినట్లుగా పూర్తి సంతృప్తితో చేసిన సినిమా ఇది. డైరెక్షన్ చేస్తానన్నప్పుడు నాన్నగారు చాలా ఎంకరేజ్ చేశారు. త్వరలో రిలీజ్ అనుకుంటున్నాం. పండగ రోజు కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేద్దామనుకున్నా కానీ, అందరూ సెలవు తీసుకుంటామన్నారు. అందుకని నేనూ రిలాక్స్ అవుతున్నా (నవ్వుతూ). ఫైనల్లీ సంక్రాంతి స్పెషల్ ఏంటి? పర్సనల్‌గా ఫుల్ సెలబ్రేషన్. ప్రొఫెషనల్‌గా డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ కాబోతున్నాను. దేవుడు ఇచ్చిన మంచి గిఫ్ట్‌లా భావిస్తున్నాను. మంచి లవ్‌స్టోరీతో ‘మనసుకు నచ్చింది’ తీశాను. సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. అమ్మమ్మతో కలసి గాలిపటాలు ఎగరేసేవాణ్ణి – సందీప్ కిషన్ చిన్నప్పుడు సంక్రాంతి పండగ అంటే సినిమాలు చూస్తూ గడిపేసేవాణ్ణి. పండగకి రిలీజయ్యే సినిమాలన్నీ చూడాల్సిందే. అవి పూర్తయ్యాక టీవీల్లో వచ్చే స్పెషల్ షోస్, సినిమాలు చూస్తూ కూర్చునేవాణ్ణి. ఏదైనా సినిమా చుట్టూనే. గాలిపటాలూ ఎగరేసేవాణ్ణి. అది కూడా మా అమ్మమ్మతో. మేడ మీదకు నాతో పాటు వచ్చి తను కూడా సరదాగా ఎగరేసేది. పెద్దయ్యాక ఫ్రెండ్స్ పెరిగాక వాళ్లతో కైట్స్ ఎగరేయడం అలవాటైంది. సంక్రాంతి అంటే నాకు సికింద్రాబాద్ గుర్తొస్తుంది. నా ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు. ఎక్కువమంది మార్వాడీ స్నేహితులే. మనలానే వాళ్లు కూడా సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేస్తారు. ఫెస్టివల్ టైమ్‌లో మేమంతా కలుస్తాం’’ అంటున్న సందీప్‌తో ‘‘కోడి పందాలు ఎప్పుడైనా చూశారా?’’ అనడిగితే – ‘‘లేదు. కానీ, ‘గుండెల్లో గోదారి’ సినిమా కోసం చూశాను. ఆ సినిమా షూటింగ్ రాజమండ్రిలో చేశాం. కోడి పందాల సీన్ ఉంది. అంతకుముందు ఎప్పుడూ చూడలేదు కాబట్టి, డైరెక్ట్‌గా కోడి పందాలు చూశాను’’ అన్నారు. ‘‘ఈ సంవత్సరం ఎక్కువ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. అలాగే, మంజులగారి డైరెక్షన్లో చేసిన ‘మనసుకు నచ్చింది’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. నేను చేసిన ఫస్ట్ ప్యూర్ లవ్‌స్టోరీ ఇది. ఇంకా ఈ సంవత్సరం మంచి మంచి పాత్రలు చేస్తున్నాను’’ అని సందీప్ కిషన్ అన్నారు. -
మంజుల ‘మనసుకు నచ్చింది’ ట్రైలర్ అదిరింది!
-
పెండ్లీకూతురే.. లేపుకెళ్లడం ఫస్ట్‌టైమ్ చూస్తున్నా!
సాక్షి, హైదరాబాద్: మహేశ్‌బాబు సోదరి ఘట్టమనేని మంజుల దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా ‘మనసుకు నచ్చింది’ . సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిధా, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ను మహేశ్‌బాబు చేతుల మీదుగా మంగళవారం ఆవిష్కరించారు. ఒక అందమైన ప్రేమకథ నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కింది. ‘ పెండ్లీకూతురే.. పెండ్లికొడుకును లేపుకెళ్లడం ఫస్ట్‌టైమ్ చూస్తున్న నేను’ అన్న ప్రియదర్శి డైలాగ్‌తో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. మనసుకు నచ్చింది చేసేందుకు ఎంతదూరమైన వెళ్లే ఒక జంట ప్రేమకథ ఎలా మొదలైంది.. అన్న ఆసక్తికరమైన అంశంతో మోడ్రన్ యూత్ జీవనశైలికి దగ్గరగా ఈ సినిమా తెరకెక్కినట్టు కనిపిస్తోంది. ఈ సినిమా ట్రైలర్లో త్రిధా బికినీలో కనిపించడం గమనార్హం. స్నేహం, ప్రేమ అందులోని ఎమోషన్స్‌తో ఈ సినిమా ‘మనసుకు నచ్చేలా’ తెరకెక్కినట్టు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. -
సూపర్ స్టార్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్
జాతీయ అవార్డు సాధించిన షో సినిమాతో నటిగా పరిచయం అయిన సూపర్ స్టార్ కృష్ణ వారసురాలు మంజుల తరువాత నిర్మాతగా కూడా తన మార్క్ చూపించారు. త్వరలో దర్శకురాలిగా ప్రేక్షకులను ముందుకు వచ్చేందకు రెడీ అవుతున్నారు. సందీప్ కిషన్, అమైరా దస్తర్ హీరో హీరోయిన్లుగా స్వీయ నిర్మాణంలో మనసుకు నచ్చింది సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ ను మంగళవారం సాయంత్ర సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే టీజర్, ప్రోమో సాంగ్స్ తో ఆకట్టుకున్న మనసుకునచ్చింది టీం, ఈ రోజు సాయంత్రం థియెట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయనుంది. రధన్ సంగీతం అందించిన ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ అవుతోంది. -
నిజంగానే ‘మనసుకు నచ్చింది’
సినీ రంగంలో సాంకేతికనిపుణులుగా మహిళలు అరుదుగా కనిపిస్తుంటారు. ముఖ్యంగా దర్శకత్వ శాఖలో గుర్తింపు తెచ్చుకున్న మహిళలను వేళ్లమీద లెక్కపెట్టోచ్చు. తాజాగా ఈ జాబితాలో ఓ స్టార్ వారసురాలు చేరిపోయారు. నటిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సూపర్ స్టార్ కూతురు మంజుల మనసుకు నచ్చింది సినిమాతో దర్శకురాలిగా మారారు. ఫస్ట్ లుక్, టీజర్లతో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. సందీప్ కిషన్, అమైరా దస్తర్ లు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో మంజుల కూతురు జాన్వీ వెండితెరకు పరిచయం అవుతోంది. రథన్ స్వరపరచిన ఈ సినిమా పాటలను ఒక్కొక్కటిగా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మూడో సాంగ్ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘రేయ్ ఇదే ని జాగా’ అంటూ సాగే ఈ పాట యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. -
మంజుల నిర్మాతగా నాని సినిమా
సూపర్ స్టార్ కృష్ణ వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన మంజుల.. నటిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా దర్శకురాలిగా మారి సందీప్ కిషన్ హీరోగా మనసుకు నచ్చింది పేరుతో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను కూడా స్టార్ చేసే ఆలోచనలో ఉంది మంజుల. అయితే ఆ సినిమాకు మంజుల కేవలం నిర్మాతగానే వ్యవహరించనుందట. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మంజుల ఓ సినిమాను నిర్మించనుంది. ప్రస్తుతం అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న హలో సినిమా పనుల్లో బిజీగా ఉన్న విక్రమ్, ఆ సినిమా పూర్తయిన వెంటనే తదుపరి చిత్రం పనులు మొదలుపెట్టనున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
టీజర్ చూశా.. చాలా బాగుంది – కృష్ణ
‘‘కిరణ్‌గారు మంచి మంచి సినిమాలు చేశారు. ఆ బ్యానర్‌తో కలిసి ఇందిర ప్రొడక్షన్ సినిమా నిర్మించడం ఆనందంగా ఉంది. మంజుల కథ, డైలాగ్స్ కూడా రాసుకుని డైరెక్షన్ చేస్తుందని నాకు తెలియదు. ఈ సినిమా కథ నాకు తెలియదు. అయితే, ఫస్ట్ లుక్ టీజర్ చాలా బాగుంది. కచ్చితంగా సినిమా సూపర్‌హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు. సందీప్ కిషన్, అమైరా దస్తుర్, త్రిదా చౌదరి హీరో హీరోయిన్లుగా ఘట్టమనేని మంజుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మనసుకు నచ్చింది’. ఆనంది ఇందిరా ప్రొడక్షన్ ఎల్.ఎల్.పి బ్యానర్‌పై సంజయ్ స్వరూప్, పి.కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌ని కృష్ణ, ఫస్ట్‌లుక్ పోస్టర్ని దర్శకుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు. కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘మంజుల నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి, ఆ తర్వాత డైరెక్షన్ చేస్తానని చెప్పింది. ఓరోజు సడన్‌గా వచ్చి డైరెక్షన్ చేస్తున్నాను అంది. అదేంటి? నా అసిస్టెంట్‌గా చేస్తానన్నావు కదా? అని అడిగితే.. ‘నేను మీ ఏకలవ్య శిష్యురాల్ని.. మీ సినిమాలు చూసి తెలుసుకున్నాను’ అంది. నాకు గురుదక్షిణగా రెండు పాటలు చూపించింది. చాలా బాగున్నాయి’’ అన్నారు. ‘‘నాన్నలా పేరు రావాలంటే సినిమాలే మార్గమని ఈ రంగంలోకి అడుగుపెట్టా. సినిమాల్లో నటించడంతో పాటు నిర్మించాను. ఇంకా ఏదో చేయాలనిపించి దర్శకత్వం చేశా’’ అన్నారు మంజుల. ‘‘స్వీట్ అండ్ సింపుల్ హార్ట్ టచింగ్ లవ్‌స్టోరీ ఇది. ఎప్పటి నుంచో ఇలాంటి లవ్‌స్టోరీ చేయాలనుకున్నా. ఇప్పటికి కుదిరింది. నాకు అక్కయ్య లేని లోటును మంజులగారు తీర్చారు’’ అన్నారు సందీప్‌కిషన్. ‘‘ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. సినిమా బాగా వచ్చింది. జనవరి 26న విడుదల చేస్తున్నాం’’ అన్నారు సంజయ్ స్వరూప్, పి.కిరణ్. మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా, నటులు ప్రియదర్శి, పునర్నవి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రధన్, కెమెరా: రవియాదవ్. -
‘మనసుకు నచ్చింది’ ఫస్ట్ లుక్
-
సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో స్టార్
తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో అపూర్వ విజయాలను, సరికొత్త సాంకేతికతలను అందించిన సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో తార తెరకు పరిచయం అవుతోంది. గతంలో కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా పలు చిత్రాల్లో నటించగా.. ప్రస్తుతం మహేష్ బాబు సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. కృష్ణ కూతురు మంజుల కూడా వెండితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకొని.. ప్రస్తుతం దర్శకురాలిగా ఓ సినిమాను రూపొందిస్తున్నారు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన వన్ నేనొక్కడినే సినిమాతో మూడోతరం నుంచి మహేష్ తనయుడు గౌతమ్ కూడా వెండితెరకు పరిచయం అయ్యాడు. తాజాగా మంజుల కూతురు కూడా వెండితెర మీద సందడి చేయనుంది. తన స్వీయ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తన కూతురు జాన్వీ కీలక పాత్రలో నటింస్తున్నట్టుగా ప్రకటించింది మంజుల. లోకేషన్ లో జాన్వీ సందీప్ తో షూటింగ్ లో ఉండగా తీసిన ఫొటోను కూడా ట్వీట్ చేసింది. మంజుల నటిగా పరిచయం అయిన సమయంలో సూపర్ స్టార్ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరి మంజుల కూతుర్ని ఘట్టమనేని అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. My daughter Jaanvi - I have never exposed her to shoots, She is hardly been on sets. So I was quite nervous on her first day of the shoot, But you should have seen her, She just breezed in,gave her shot with great confidence. A complete natural and ofcourse a diva(high maintenance). She reminds me of Mahesh when he was a child star. A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni) on Nov 24, 2017 at 3:13am PST -
మంజుల మాట విని షూటింగ్ క్యాన్సిల్
సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల, ఇటీవల తన పుట్టిన రోజు సందర్బంగా ‘మనసు చెప్పింది’ పేరుతో ఓ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వీడియోకు సినీపప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వెళ్లువెత్తాయి. తాజాగా యంగ్ హీరో విజయ్ ఆమె ఆలోచనలను ఆచరణలో పెట్టి చూపించాడు. తన మనసు నిద్రపొమ్మని చెప్పిందని, అందుకే షూటింగ్ క్యాన్సిల్ అంటూ తన సోషల్ మీడియా పేజ్‌లో కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌తో పాటు ఓ ఫొటోనూ కూడా షేర్ చేశాడు విజయ్. ఈ పోస్ట్‌ను మంచులకు ట్యాగ్ చేసి తను తన హార్ట్ ను ఫాలో అవుతున్నట్టుగా తెలిపాడు. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్‌గా మారిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో యమా బిజీగా ఉన్నాడు. కథ ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న విజయ్, ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నిర్మిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మహానటి సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటిస్తున్నాడు. Shoot cancelled, Heart said go back to sleep 😊#FollowYourHeart @ManjulaOfficial pic.twitter.com/28uVzD6YTy — Vijay Deverakonda (@TheDeverakonda) 9 November 2017 -
మంజుల ఫెయిల్యూర్ స్టోరీ.. మహేష్ కూల్ రియాక్షన్
-
మంజుల ఫెయిల్యూర్ స్టోరీ.. మహేష్ కూల్ రియాక్షన్
సాక్షి, సినిమా : సినిమాల్లోకి స్టార్ల వారసులు వరదల్లా వెల్లువెత్తుతున్న వేళ సూపర్ స్టార్ కృష్ణ తనయ మంజుల మాత్రం ఎందుకనో కెరీర్లో రాణించలేకపోయింది. నీలకంఠ షో ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఆమె తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో మెరిశారే తప్ప పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అయితే తాను ఎందుకు ఫెయిల్ కావాల్సి వచ్చిందో చెబుతూ తన పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫేస్బుక్ లో ఓ వీడియోను పోస్ట్ షేర్ చేశారు. ఫాలో యువర్ హార్ట్ అంటే మనస్సుకు నచ్చిందే చేయండి అంటూ మంజుల వీడియో ద్వారా తన భావాలను పంచుకున్నారు. ''మొదటినుండీ నటించాలనే అనుకున్నాను. కాని కుదర్లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫెయిల్ అయ్యాను. నేను నటించి ఫెయిల్ అవ్వడం వేరు. కాని అసలు నాకు అవకాశమే రాలేదు. దీనంతటికి కారణం మా ఫ్యామిలీ.. ఫ్యాన్స్ అనిపించింది.(అప్పట్లో కృష్ణ అభిమానులే ఆమెను హీరోయిన్ కాకుండా అడ్డుకున్నారనే టాక్ వినిపించింది). కానీ ఆలోచిస్తే దీనంతటికీ బాధ్యురాలిని నేనేనని ఇప్పుడు అర్థమౌతోంది. సమాజం కోసం కాదు నా కోసం నేను ఆలోచించటం మొదలుపెట్టా'' అంటూ మంజుల వివరించారు. ''ఆ తరువాత నాకు నచ్చింది నేను చేయడం మొదలెట్టాను. ఇప్పుడు నా హృదయాన్ని ఫాలో అవుతున్నాను. హ్యాపీగా ఉన్నాను. గమ్యం ముఖ్యంకాదు.. ప్రయాణమే ముఖ్యం. మనసుకు నచ్చింది చేస్తే ఏదైనా సాధించొచ్చు'' అంటూ ముగించింది. ఇక సోదరికి విషెస్ చెబుతూ ఆ వీడియోను సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. ఆలోచన అద్భుతంగా ఉందంటూ సందేశం ఉంచాడు. నటి రకుల్ ప్రీత్ కూడా ఈ వీడియోను షేర్ చేయటం విశేషం. -
పట్టించిన ప్రకటన..
సాక్షి, సిటీబ్యూరో: నీలోఫర్ ఆస్పత్రి నుంచి శిశువును కిడ్నాప్ చేసి, ఆ శిశువు మరణానికి కారణమైన కేసులో నిందితురాలు సత్తూరి మంజుల పోలీసుల చిక్కడానికి ఓ ఆటో వెనుక ఉన్న ప్రకటన కీలకంగా మారింది. దీని ఆధారంగా సదరు ఆటోడ్రైవర్‌ను గుర్తించిన అధికారులు అతడు చెప్పిన వివరాలతో బండరోనిపల్లిలో గాలించారు. అక్కడ దొరికిన వివరాలతో రాజేంద్రనగర్‌లోని కాటేదాన్‌లో నిందితురాలిని పట్టుకోగలిగారు. ఈ కేసు దర్యాప్తుపై సాగిందిలా.... గర్భస్రావం విషయం దాచి... మహబూబాబాద్ జిల్లా కె.సముద్రానికి చెందిన మంజుల, బండరోనిపల్లికి చెందిన కుమార్ గౌడ్ హైదరాబాద్ కాటేదాన్‌లోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో పని చేస్తున్నారు. కుమార్ మూడేళ్ల క్రితం మంజులను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటిసారి గర్భందాల్చిన మంజులకు మూడో నెలలోనే గర్భస్రావమైంది. ఈ ఏడాది రెండోసారి గర్భందాల్చగా... ఐదున్నర నెలలకు అబార్షన్ అయ్యింది. ఈ విషయాన్ని భర్త, కుటుంబీకులకు చెప్పకుండా దాచిన మంజుల తనకు తొమ్మిదో నెల వచ్చే వరకు మేనేజ్ చేసింది. ఆపై శనివారం ప్రసవం కోసం వెళ్తున్నానంటూ భర్తకు చెప్పి అతడిని ఆదివారం రమ్మంటూ పేట్లబురుజు ఆస్పత్రికి వచ్చింది. మూడో నెలలో గర్భవతి కార్డు కోసం, ఆపై మరోసారి వైద్య పరీక్షలకు ఆస్పత్రికి వచ్చిన మంజులకు దీనిపై అవగాహన ఉంది. శనివారం ఆస్పత్రి వరకు చేరుకున్న మంజుల తొలుత ఎవరైనా శిశువులను ఇస్తారేమోనని ప్రయత్నించి విఫలమైంది. ఆ రోజు అన్ని వార్డుల్లో కలియదిరిగినా ఫలితం లేకపోవడంతో రాత్రికి అక్కడే నిద్రించింది. ఆటో... బస్సు... బైక్‌పై ప్రయాణం... నగరంలోని ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన పాండు భార్య నిర్మల శుక్రవారం పేట్లబురుజు ఆస్పత్రిలో మగశిశువుకు జన్మనిచ్చింది. పొత్తికడుపు సంబంధిత సమస్యతో బా«ధపడుతున్న శిశువును ఆదివారం నీలోఫర్ ఆస్పత్రికి పంపాలని పేట్లబురుజు ఆస్పత్రి వర్గాలు నిర్ణయించాయి. అయితే శిశువు వెంట నిర్మలను తీసుకువెళ్ళడం సాధ్యం కాకపోవడంతో ఆమె తల్లి కల్పన ఆయా కోసం ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే ఆయాగా వారికి పరిచయమైన మంజుల సహాయం చేస్తున్నట్లు నటిస్తూ నీలోఫర్ వరకు వెళ్ళింది. ఆపై అదును చూసుకుని శిశువును తీసుకుని ఆటోలో ఉడాయించింది. ఆటోలో లక్డీకాపూల్‌లోని సంధ్య హోటల్ వరకు వెళ్లిన మంజుల అక్కడి నుంచి బస్సులో అఫ్జల్‌గంజ్, అటునుంచి పేట్లబురుజు ఆస్పత్రికి చేరుకుంది. అప్పటికే ఆమె భర్త కుమార్‌గౌడ్ అక్కడకు రావడంతో అతడితో కలిసి బైక్‌పై బండరోనిపల్లికి బయలుదేరింది. ఆమన్‌గల్ సమీపంలో బైక్ పంక్చర్ కావడంతో కుమార్ తన భార్య, శిశువును బస్సులో పంపించాడు. ఆటోడ్రైవర్ కీలక సమాచారం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నీలోఫర్ ఆస్పత్రి వద్ద ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. మంజుల శిశువుతో సహా ఓ ఆటో ఎక్కినట్లు కనిపించడంతో దాని నెంబర్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అయితే ఆ ఆటో వెనుక వైపు ఓ వ్యాపార ప్రకటన ఉండటంతో దానిపై ఉన్న కాంటాక్ట్ నెంబర్ ఆధారంగా పోలీసులు వారిని సంప్రదించారు. ముందే ఉన్న ఓ ప్రకటనపై మీ ప్రకటన అతికించినట్లు పోలీసులు చెప్పడంతో తాము కేవలం రెండు ఆటోలకే అతికించామంటూ వారు వివరాలు చెప్పారు. ఆ ఇద్దరు ఆటోడ్రైవర్లను గుర్తించి ప్రశ్నించగా.. ఓ వ్యక్తి సదరు మహిళను లక్డీకాపూల్‌లోని సంధ్య హోటల్ వరకు తీసుకువెళ్ళానని, ఆమెది కల్వకుర్తి ప్రాంతంగా చెప్పినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు కల్వకుర్తి, ఆమన్‌గల్, వెల్దండ తదితర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. అనుమానితురాలి ఫొటోతో స్థానికులను ఆరా తీశారు, మంగళవారం సాయంత్రం బండరోనిపల్లికి వెళ్లి ఆరా తీయగా గ్రామానికి చెందిన వృద్ధుడు ఆమెను కుమార్ భార్య మంజులగా గుర్తించాడు. కాటేదాన్‌లో చిక్కిన కిడ్నాపర్ మంజుల.. రెండు రోజుల క్రితమే మంజుల ప్రసవించిందని, సోమవారం తెల్లవారుజామున శిశువు మరణించడంతో ఖననం చేసి హైదరాబాద్‌కు వెళ్లిపోయినట్లు చెప్పాడు. దీంతో కుమార్ కోసం ఆరా తీయగా.. ఎవరూ స్పష్టమైన చిరునామా చెప్పలేకపోయారు. నేరచరితుడైన అతడికి ఊరంతా దూరంగా ఉంటుందని తేలింది. చివరకు అతడి సోదరుడి వివరాలు తెలియడంతో నగరంలో పట్టుకున్న పోలీసులు కుమార్ మొదటి భార్య చిరునామా సేకరించారు. ఆమె ద్వారా కుమార్, మంజుల ఇంటిని గుర్తించి మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. కుటుంబీకులను ఏమార్చడానికి తానే శిశువును కిడ్నాప్ చేశానని, సోమవారం తెల్లవారుజామున మరణించడంతో ఖననం చేసినట్లు అంగీకరించడంతో కేసు కొలిక్కి వచ్చింది. నిందితురాలి రిమాండ్ నాంపల్లి: నీలోఫర్ ఆసుపత్రిలో మగ శిశువును కిడ్నాప్ చేసిన మహిళ మంజులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఖనంనం చేసి శిశువు మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు మండల మెజిస్ట్రేట్ సమక్షంలో పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టు మార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. నిందితురాలిపై ఐపీసీ 363, 304, 201, 75, 84 జెజె, 3(2),(5),(5ఎ),లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ ఆర్.సంజయ్ కుమార్ తెలిపారు. -
మహేష్ సినిమాతో మంజుల మూవీ ట్రైలర్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం స్పెడర్. తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మరో ఓ చిన్న సినిమా టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు సోదరి, నటి అయిన మంజులు తొలిసారిగా దర్శకత్వ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ లో జెమినీ కిరణ్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న సినిమాతో మంజుల దర్శకురాలిగా పరిచయం అవుతోంది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమైనా దస్తర్, త్రిధా చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాకు రథన్ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ స్పైడర్ సినిమా బ్రేక్ లో ప్రదర్శించనున్నారు. -
కెప్టెన్ ఆన్ డ్యూటీ
మంజుల ప్రేక్షకులకు ఎలా తెలుసు? సూపర్‌స్టార్ కృష్ణ కూతురిగా తెలుసు... మహేశ్‌బాబు సిస్టర్‌గా తెలుసు... నటిగా, నిర్మాతగా తెలుసు! కానీ, ఆమెలో ఓ దర్శకురాలు ఉన్నారు. ఆవిణ్ణి త్వరలో మనకు పరిచయం చేయనున్నారు మంజుల. సందీప్ కిషన్ హీరోగా పి. కిరణ్, సంజయ్ స్వరూప్ నిర్మిస్తున్న సినిమాతో మంజుల దర్శకురాలిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. బుధవారం గోవాలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఫస్ట్‌డే కెప్టెన్ సీటులో కూర్చున్న మంజుల కెమెరాలో ఫ్రేమ్ చెక్ చేసుకుంటున్న స్టిల్‌నే మీరు చూస్తున్నారు. నెల రోజుల పాటు గోవాలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ జరుగుతుందట. నెక్స్›్ట లొకేషన్ హైదరాబాదే. ‘అందాల రాక్షసి’ ఫేమ్ రధన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో అమైరా దస్తూర్, త్రిధా చౌదరి హీరోయిన్లు. -
15 ఏళ్ల తరువాత 'సెకండ్ షో'
2002లో కేవలం రెండే పాత్రలతో తెరకెక్కి ఘనవిజయం సాధించిన సినిమా షో. సూపర్ స్టార్ వారసురాలు మంజుల, విలక్షణ నటుడు సూర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన షో విశ్లేషకుల ప్రశంసలతో పాటు జాతీయ అవార్డును సైతం గెలుచుకుంది. ఈ సినిమా దర్శకుడు నీలకంఠ ఒక్కసారి సినీవర్గాల దృష్టిని ఆకర్షించాడు. ఆ తరువాత నీలకంఠ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్సమ్మ మంచి విజయం సాధించినా.. ఆ ఫాం కంటిన్యూ చేయలేకపోయాడు. చమ్మక్ చల్లో, మాయ లాంటి సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో కొంత గ్యాప్ తీసుకున్న నీలకంఠ, మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. తనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన షో సినిమాకు సీక్వల్ రూపొందించే పనిలో ఉన్నాడు. దాదాపు 15 ఏళ్ల తరువాత సెకండ్ షో పేరుతో షో సినిమాకు సీక్వల్‌ను రెడీ చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
హిందూపురంలో దోపిడీ
- కొరియర్ బాయ్‌నంటూ వచ్చి ఇంట్లోకి జొరబడి.. - పట్టపగలే రూ.4 లక్షల బంగారు నగలు, రూ.లక్ష నగదుతో పరారీ హిందూపురం అర్బన్ : హిందూపురంలో నిత్యం రద్దీగా ఉండే ఎంఎఫ్ రోడ్డులోని ఓ ఇంటిలోకి దొంగలు పథకం ప్రకారం చొరబడ్డారు. ఇంట్లోని వృద్ధురాలిని మరణాయుధాలతో బెదిరించారు. ఆనక బంగారు నగలు, నగదుతో ఉడాయించారు. గురువారం పట్టపగలు జరిగిన ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. స్థానిక ఎంఎఫ్ రోడ్డులోని మండి మార్చెంట్ కృష్ణమూర్తి, అతని కుమారులందరూ సొంత పనుల కోసం బయటకు వెళ్లారు. దొంగలు అదే ఇంటిని టార్గెట్ చేశారు. ఇంట్లో వృద్ధురాలు మంజుల మాత్రమే ఉందని పసిగట్టి, దోపిడీకి పథకం పన్నారు. గడియ పెట్టిన తలుపు వద్దకు ఇద్దరు వచ్చి ‘మీకు అర్జెంట్ కొరియర్’ వచ్చిందని తెలిపారు. వృద్ధురాలు తలుపుతీసే లోపే వారే గడియాను తీసి లోనికి చొరబడ్డారు. ఆ వెంటనే వృద్ధురాలి మెడపై కత్తి పెట్టి అరిస్తే చంపేస్తామని బెదిరించారు. డబ్బు ఎక్కడ దాచోరో చెప్పాలని గద్దించారు. ఆమెను వెంటబెట్టుకుని ఇల్లంతా కలియతిప్పారు. డబ్బు లేదని, దేవుడి గదిలో వెండి పూజ సామగ్రి ఉందని ఆమె చెప్పగా.. ఒంటిపైనున్న నగలు తీసుకొని, తనను వదిలేయాలని ఆమె ప్రాధేయపడింది. దీంతో దొంగలు ఆమె నోటికి ప్లాస్టర్ వేసి.. చేతులు కట్టేసి వంటింట్లో బంధించారు. తర్వాత రూ.4 లక్షలు విలువ చేసే బంగారు మంగళ్యం చైను, రెండు గాజులు, చెవి కమ్మలు, రూ.లక్ష నగదు ఎత్తుకుపోయారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్ సీఐ ఈదుర్‌బాషా తమ సిబ్బందితో కలసి ఆ ఇంటిని పరిశీలించారు. ఆధారాల కోసం క్లూస్ టీంను రప్పించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రేపటికి ముందడుగు
మహిళను గౌరవించడానికి ఒక ‘డే’నా! ఒక జన్మ కూడా సరిపోదు. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ ఒక్క రోజు నాలుగు చప్పట్లు కొట్టి రేపటి నుంచి ఇష్టానుసారంగా ఉండటం... ఇవాళ్టి అబద్ధాన్ని ఒక జన్మంతా సాగదీయడమే. అసలు మహిళలకి మగాడు మర్యాద ఇవ్వడమేంటి? అతడికి జన్మను ఇచ్చిందే ఒక మహిళ. మహిళ ఆత్మ గౌరవాన్ని తగ్గించకుండా ఉంటే చాలు. మహిళ విజయాలకు వంకలు పెట్టకుండా ఉంటే చాలు. సామర్థ్యాలను సమాధి చేయకుండా ఉంటే చాలు. మగాడి జీవితానికి బొడ్డుతాడు అయిన ఈ మహోన్నత శక్తిని నులిమేయకుండా ఉంటే చాలు. తన మనుగడను తను తెంచుకోకుండా ఉంటే చాలు! నటి... సూపర్‌స్టార్ కృష్ణ కుమార్తె... మంజులతో ఇంటర్వ్యూ అసలు ఎక్కడా కనిపించడం లేదు.. ఏం చేస్తున్నారు? మాతృత్వం గొప్ప వరం. అందుకే కూతురు పుట్టాక బ్రేక్ తీసుకున్నా. ఇన్నేళ్లూ మదర్‌హుడ్‌ని ఆస్వాదించాను. ఎదిగే పిల్లలకు తల్లిదండ్రుల అవసరం ఉంటుంది. అప్పుడు పిల్లలపై మన ప్రేమ తప్పక చూపించాలి. నేనదే చేశా. ఇప్పుడు నా కూతురి వయసు పదేళ్లు. ‘అమ్మా... నాతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయకు. వర్క్ చూసుకో’ అని తనే అంటోంది. సో, ప్రొఫెషనల్ లైఫ్ స్టార్ట్ చేసే టైమ్ వచ్చింది. ఓ మూవీ డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నా. ఇవాళ ‘ఉమెన్స్ డే’ కాబట్టి, దాని గురించి మాట్లాడుకుందాం. మహిళగా పుట్టినందుకు మీరెలా ఫీలవుతున్నారు? లక్లా భావిస్తున్నా. మగవాళ్ల కంటే మహిళలే ఎక్కువ అనే అంశం జోలికి వెళ్లదలచుకోలేదు. అలాంటి వాదన నాకిష్టం ఉండదు. ‘ఎంతో పుణ్యం చేస్తే మహిళగా పుడతారు’ అని దలైలామా, ఓషో వంటి ఆధ్యాత్మిక గురువులు అన్నారు. ఉద్వేగం, సున్నితత్వం, ఆవేశం, జాగ్రత్త.. వంటివన్నీ మహిళలకు ఎక్కువ. మగవాళ్లు కూడా మహిళల నుంచే పుడతారు. అది సహజమైన ప్రక్రియ. మహిళగా పుట్టినందుకు ఒక్క క్షణం కూడా పశ్చాత్తాపపడింది లేదు. స్త్రీ ‘తక్కువ’... పురుషుడు ‘ఎక్కువ’ అనే సమాజం ఇది. ఈ పరిస్థితిలో ఓ స్త్రీ ఆత్మవిశ్వాసంగా బతకాలంటే ఏం చేయాలి? నేను ఫీలయ్యేది ఏంటంటే... మనకి మనమే (మహిళలు) ఎక్కడో చిన్న భయాలు, ఓ రకమైన ఆలోచనలతో ఒకదానికి కట్టుబడిపోతున్నాం. కొందరు మహిళలు వాళ్లను వాళ్లే తక్కువ చేసుకుంటారు. ‘మనం ఎక్కువ’ అనే ఫీలింగ్ ఇన్సెక్యూర్టీని పోగొట్టి, ఆత్మవిశ్వాసం పెంచుతుంది. మహిళలకు అడ్డంకులు ఉన్నాయి. కాదనడం లేదు. ఏది ఏమైనా అమ్మగా, వర్కింగ్ విమెన్‌గా... రెంటినీ బ్యాలెన్స్ చేసుకోగల సామర్థ్యం మహిళలకే ఉంది. మనకు ‘సూపర్ పవర్స్’ ఉన్నాయి. ఇంటినీ, జాబ్‌నీ బ్యాలెన్స్ చేసుకోవడం మగవాళ్ల వల్ల కాదు. మనల్ని మనం తక్కువగా ఊహించుకోకుండా ఉంటే ‘మగవాళ్లు ఎక్కువ’ అనే ధోరణిలో మార్పు తీసుకురాగలుగుతామని నా నమ్మకం. మగవాడు ఇంటి పనులు చేయకూడదని కొందరి మగవాళ్లల్లో ఉంటుంది.. కొందరు ఆడవాళ్ల ఫీలింగ్ కూడా అదే... కరెక్ట్‌గా అన్నారు. ట్రెండ్ మారింది. ఇప్పుడు మగవాళ్లు కూడా ఇంటి పనుల్లో హెల్ప్ చేయడానికి ముందుకొస్తున్నారు. మహిళలుగా వాళ్లకు ఆ ఛాన్స్ మనమే ఇవ్వాలి. కొందరు... ‘వద్దండీ. మీకెందుకు శ్రమ’ అంటారు. మగాళ్ల కంటే మనమే ఎక్కువ ఇదైపోతుంటాం. మనకూ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండాలని మనం ఫీలవ్వాలి. అది లేనిదే ఏం చేయలేం. ఇప్పుడు మగవాళ్లు మారుతున్నారు. మా ఆయన మా అమ్మాయి డైపర్స్ ఛేంజ్ చేసేవారు. స్టడీస్ దగ్గర్నుంచి అమ్మాయి విషయంలో ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటారు. పిల్లల బాగోగులు చూసుకోవడం తండ్రులకు లభించే గొప్ప గిఫ్ట్. ఐయామ్ నాట్ గుడ్ ఎట్ సీయింగ్ అకడమిక్స్. ఆయనే చూసుకుంటారు. కృష్ణగారి కూతురు కావడంతో ఫ్యాన్స్ మిమ్మల్ని హీరోయి న్ని కానివ్వలేదు. అమ్మాయిని కాబట్టి ప్రొఫెషన్ని ఎంచుకునే ఫ్రీడమ్ లేకుండాపోయిందని బాధగా అనిపించిందా? అప్పుడు అనిపించింది. ఫ్రీడమ్ లేదా? అనుకున్నా. నేను అనుకుని ఉంటే అభిమానులను ఎదిరించి సినిమాలు చేసుండొచ్చు. కానీ, ఆలోచించా. ఓ మహిళగా కుటుంబ గౌరవం, పేరు మన చేతుల్లో ఉంటాయి. మన కల్చర్ చాలా డిఫరెంట్. ఫ్యాన్స్ నాన్నగారిని చాలా ప్రేమిస్తారు. ‘హీ ఈజ్ ద కింగ్. ఇది ఆయన కింగ్డమ్’. నేను దాన్ని పూర్తిగా గౌరవిస్తా. అందుకే నేను కూడా ఫ్యాన్సే రైట్ అనుకున్నా. ఎందుకంటే... దర్శకులు వచ్చి కథలు చెప్పినప్పుడు... ‘నేను ఇది చేయను, అది చేయను’ అని చెప్పేదాన్ని. కొన్ని పాత్రలకే పరిమితం కావాలనుకున్నప్పుడు చేయకపోవడమే బెటర్. యాక్చువల్లీ నేను యాక్ట్ చేస్తానన్నప్పుడు నాన్నగారు హండ్రెట్ పర్సెంట్ హ్యాపీగా లేరు. నా ఇష్టాన్ని కాదనలేక ‘యస్’ చెప్పారు. ఫ్యాన్స్ ఆక్షేపించినప్పుడు ఓ పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నప్పుడు కొన్ని పాటించాలని, ఫ్యామిలీ గౌరవ మర్యాదలను స్పాయిల్ చేయకూడదని అర్థమైంది. అందుకే నా అంతట నేను మానుకున్నా. అయినా అప్పుడు చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్ కూడా లేవు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఆ టైమ్‌లో ఎప్పుడైనా నేను అబ్బాయిగా పుట్టి ఉంటే నచ్చిన ప్రొఫెషన్లో సెటిలై ఉండేదాన్నని అనిపించిందా? అస్సలు లేదండి. మా అమ్మ, అమ్మమ్మ ‘నువ్ మగాడిగా పుట్టుంటే ఈపాటికి ఇండస్ట్రీ అంతా ఏలేసేదానివి’ అనేవారు. నేను నవ్వేదాన్ని. అప్పుడు కూడా నాకు అబ్బాయిగా పుడితే బాగుండేదని అనిపించలేదు. ‘నిర్భయ’ వంటి ఘటనలు విన్నప్పుడు మీకెలా అనిపిస్తుంది? చాలా డిస్ట్రబ్ చేస్తాయి. మహిళగానే కాదు... మానవత్వపు దృష్టితో చూసినా చాలా విచారకరమైన ఘటన. ఓ మనిషి అంత క్రూరంగా ఎలా చేస్తాడు? ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుంది? ఆ ప్రాణం ఎంత విలవిలలాడి ఉంటుంది? రక్త–మాంసాలతో పుట్టిన సాటి మనిషిగా ఆ బాధను గ్రహించలేరా? ఒకప్పుడు మంచి మనుషులు ఉండేవారు. రాముడు తదితరుల గురించి చెబుతారు కదా! మళ్లీ ఆ రోజులు రావాలి. కఠినమైన శిక్షలు వేయాలి లాంటివి చెప్పను. శిక్షలు కూడా మార్చలేవు. ‘మంచితనం’ పెంచుకోవాలి. అందుకే, ‘మూర్ఖత్వపు మనుషులు మాకు వద్దు. వాళ్ల నుంచి మమ్మల్ని బయటకు తీసుకురా. మనుషుల్లో మంచిని మాత్రమే ఉంచు. నీచపు స్థితికి దిగజారనివ్వకుండా ఉన్నత స్థితికి తీసుకువెళ్లు’ అని మనందరం దేవుణ్ణి ప్రార్థించాలి. మనందరం మంచోళ్లం అయిపోవాలి. అదొక్కటే మార్గం. మనం మారి, ప్రేమతో సమాజంలో మార్పు తీసుకురావాలి. ప్రేమను పంచాలి. ఇటీవల తమిళ హీరో శరత్‌కుమార్ కూతురు వరలక్ష్మి దగ్గర ఓ వ్యక్తి అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. బ్యాగ్రౌండ్ ఉన్న సెలబ్రిటీలకూ వేధింపులు తప్పవా? సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎవరికైనా అలాంటి ఘటనలు ఎదురవుతాయి. చెడు ఆలోచనలున్న వెధవ ఎవరైనా తగిలాడనుకోండి... వాట్ టు డూ! ఎలా హ్యాండిల్ చేయాలి? ఎలా బయటపడాలి? అనేది మన చేతుల్లో ఉంటుంది. అలాంటోళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో తెలియాలి. అడ్వాంటేజ్ తీసుకోవాలనే వెధవలు ఇంచు మించు ప్రతి రంగంలోనూ ఉన్నారు. అందరిలోనూ మార్పు రావాలి. మంచిని పంచాలి. మంచి మనుషులుగా మారుతుంటే.. మనల్ని చూసి ఇంకొకరు. అలా మల్టిప్లై అయ్యి లోకమంతా మారుతుందని ఆశిద్దాం. మీ రోల్ మోడల్ ఎవరు? మా అమ్మమ్మ. ఆ ప్రేమ వేరు. (నవ్వుతూ..) నాయనమ్మకు లేదని అనడం లేదు. మా అమ్మమ్మకు అమ్మ ఏకైక సంతానం. అందుకని అమ్మమ్మ మాతోనే ఉండేవారు. నాన్నగారికి మా అమ్మమ్మ అంటే గౌరవం. అమ్మకన్నా అమ్మమ్మ స్ట్రాంగ్. మమ్మల్ని బాగా పెంచింది. స్కూల్‌కి వెళతాం, పాఠాలు చదువుతాం, మిగతావన్నీ నేర్చుకుంటాం. కానీ, ముందు మన బేస్ స్ట్రాంగ్‌గా ఉండాలి. అప్పుడు ఏదైనా చేయగలం అనిపిస్తుంది. నాకు ఆ బేస్ అమ్మ, అమ్మమ్మ దగ్గర లభించింది. ఏం నేర్చుకున్నా.. నేర్చుకోకపోయినా... ఎమోషన్, లవ్ అనేవి స్ట్రాంగ్‌గా ఉండాలి. ఆ ఇద్దరి దగ్గరనుంచి అవి నేర్చుకున్నాను. మా ఐదుగురు బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌ను అమ్మమ్మ ఎంతో కేరింగ్‌గా చూసుకుంది. అమ్మమ్మ ఈజ్ వెరీ స్ట్రాంగ్ విమెన్. డైరెక్షన్ చేయబోతున్నారని తెలిసి, కృష్ణగారు ఏమన్నారు? హి వాజ్ సో హ్యాపీ. ముఖ్యంగా నా కథను నమ్మి, మరొకరు సినిమాను నిర్మిస్తున్నందుకు ఆనందపడ్డారు. కేవలం దర్శకత్వం మాత్రమే చేస్తున్నానని తెలిసిన తర్వాత నాన్నగారు ఇంకా గర్వంగా ఫీలయ్యారు. మహేశ్‌బాబుకు చెప్పగానే... ‘డైరెక్షన్ చేస్తున్నావా? వెరీ డిఫికల్ట్. అంత ఈజీ కాదు’ అన్నాడు. ‘అవును! నాకు ఆ సంగతి తెలుసు. బట్, నేను చేయగలనని నాకు తెలుసు’ అని చెప్పా. అప్పుడు ‘గుడ్... గుడ్. బాగా చెయ్’ అన్నాడు. మహేశ్‌కి భయం ఎక్కువ. తన చుట్టూ ఉన్నవాళ్లు సక్సెస్ కావాలని కోరుకుంటాడు. ఒకవేళ సరైన రిజల్ట్ రాకపోతే... ఎక్కడ డిజప్పాయింట్ అవుతామేమోనని ‘బీ కేర్‌ఫుల్’ అంటుంటాడు. ప్రతి పని పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాడు. ప్రాక్టికల్‌గా ఉంటాడు. నాన్నగారికి మహేశ్‌కి ఫుల్ డిఫరెంట్. నాలో ఇద్దరి లక్షణాలున్నాయి. అన్నయ్య రమేశ్, మా ఆయన అందరూ... సపోర్ట్ చేస్తారు. మీ చుట్టూ ఉన్న మీ నాన్నగారు, బ్రదర్స్, హజ్బెండ్, బ్రదర్ ఇన్లాస్... అందరూ మంచోళ్లే అనుకుంటా! అవునండీ. మా ఆయన (సంజయ్) చాలా మంచి వ్యక్తి. ఫ్యామిలీని చూసుకోవడంలో గానీ, ఇల్లు, పిల్లలు, ఫ్రీడమ్ విషయంలోగానీ... హి ఈజ్ అమేజింగ్. నాన్నగారు మహిళలను గౌరవించే విధానం, ఫ్రీడమ్ ఇచ్చే విధానం సూపర్. ఆయనెంత గొప్ప మనిషి అండి. మనీ, ఫేమ్, సక్సెస్ రావడం ఈజీ. కానీ, మంచి పేరు రావడం చాలా కష్టం. తెలుగువాళ్లు మొత్తం ‘కృష్ణగారు గొప్ప వ్యక్తి’ అని చెబుతారు. మహిళలు, మగవారు సమానమని నాన్న చెబుతారు. మహేశ్ కూడా అంతే. ఒక్క క్షణం కూడా ‘ఐయామ్ ద బాస్’ అనే తరహాలో ప్రవర్తించడు. ఫాదర్, బ్రదర్స్, హజ్బెండ్... ప్రతి ఒక్కరూ అంత మంచోళ్లు అవడం నా అదృష్టం. చుట్టూ మంచి వాతావరణం ఉంటే లైఫ్‌లో అద్భుతాలు సృష్టించవచ్చు. మీరు డైరెక్షన్ చేయబోయే సినిమా ఎలా ఉంటుంది? క్యూట్ లవ్ స్టోరీ. ‘ఫస్ట్ మూవీ ఎప్పుడూ ఎందుకు లవ్ స్టోరీలు తీస్తారు?’ అని చాలామంది అడిగారు. ప్రేమ అనేది యూనివర్సల్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. ఇదే నా మొదటి సినిమా. మంచి సినిమా చేయాలని మొదలుపెడుతున్నాను. నా ఫస్ట్ లవ్ డైరెక్షనే. యాక్టింగ్‌లోకి ఎందుకొచ్చానంటే... నాన్నగారిని చూసి యాక్టింగ్ ఈజీ అనుకున్నాను. నాకూ ఈజీగా ఛాన్సులొచ్చాయి. కానీ, దర్శకత్వం అనేది జీవితాన్ని ఓ కోణంలో దగ్గరగా చూసిన తర్వాత అనుభవంతో చేయాలి. ఓ 20 ఏళ్ల అమ్మాయికి, ఆ టైమ్‌లో కష్టం అనిపించింది. ఇప్పుడు హ్యాపీగా సినిమా తీయడానికి రెడీ అయ్యాను. మనుషులు ఎలా ఉండాలనుకుంటానో... అలాంటి పాత్రలు సృష్టించే ఛాన్స్ వచ్చింది. 20 ఏళ్ల క్రితం నేను వేరు, ఇప్పుడు వేరు. నాలో వచ్చిన పరిణతి సినిమాలో కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్... ఫన్, కమర్షియల్ వేలో తీయబోతున్నా. కానీ, మంచి సెన్సిబిలిటీస్ ఉంటాయి. మీ అమ్మాయి జాన్వీని కూడా నటింపజేస్తున్నారట? అవునండీ. కథని మలుపు తిప్పే క్యారెక్టర్ తనది. పక్కనే అల్లరి చేస్తున్న కూతురితో.. జానూ... కుదురుగా కూర్చో... వన్ లాక్ రెమ్యునరేషన్ ఇస్తానన్నాగా... నో మమ్మీ... ఫైవ్ లాక్స్.. అంటూ అల్లరిగా చూసింది. తల్లీకూతుళ్లిద్దరూ కూల్‌గా నవ్వేశారు. ► ఈ ‘ఉమెన్స్ డే సందర్భంగా’ నేను కోరుకునేదొక్కటే.. నాలానే మిగతా అందరి మహిళల జీవితాల్లోనూ మంచి మగవాళ్లు ఉండాలి. ఇప్పటికే మంచివాళ్లు ఉన్నారు. నెగటివ్ ఎనర్జీ ఉన్న ఆ మిగతావాళ్లల్లోనూ మంచి మార్పు రావాలి. ► మహాత్మా గాంధీగారు నాకు ఆదర్శం. అహింసను నమ్ముతా. ఆయన మహిళల గురించి చాలా గొప్పగా చెప్పారు. ‘మహిళలకు పవర్ ఇచ్చినట్లయితే.. ప్రపంచం ఇంకా మంచిగా మారుతుంది’ అని ఆయనోసారి చెప్పారు. – డి.జి. భవాని -
రాయలచెరువులో గర్భిణి మృతి
యాడికి (తాడిపత్రి) : యాడికి మండలం రాయలచెరువులో మంజుల (60) అనే తొమ్మిది నెలల గర్భిణికి మంగళవారం రాత్రి మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. మంజులకు వెక్కిళ్లు ఎక్కువగా రావడంతో శ్వాస తీసువడానికి ఇబ్బంది పడింది. కుటుంబ సభ్యులు తాడిపత్రి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. -
డాక్టర్ల నిర్లక్ష్యంపై కన్నెర్ర
= చికిత్స పొందుతూ బాలింత మృతి = ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోâýæన, ఉద్రిక్తత = చూసేందుకు వస్తూ రోడ్డు ప్రమాదంలో బంధువు మృతి = తల్లిదండ్రులకు గాయాలు = రంగంలోకి దిగిన పోలీసులు హిందూపురం అర్బన్: హిందూపురంలోని తేజ నర్సింగ్ హోం ఎదుట లేపాక్షి మండలం ఉప్పరపల్లి వాసులు శనివారం ఆందోâýæనకు దిగారు. అక్కడి వైద్యుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ధర్నా చేశారు.దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అసలేం జరిగిందంటే... ఉçప్పరపల్లికి చెందిన మంజుల(19)ను ప్రసవం కోసం నవంబరు 19న హిందూపురంలోని తేజ నర్సింగ్ హోంకు తీసుకువచ్చారు. అదే రోజు రాత్రి ఆమెకు సిజేరియ¯ŒS ఆపరేష¯ŒS చేయగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. నాలుగు రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జి చేశారు. అదే రాత్రి ఇంటికెళ్లిన కాసేపటికే ఒళ్లంతా నొప్పులు, కడుపు ఉబ్బరమంటూ తిరిగి ఆమెను ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స మొదలుపెట్టిన వైద్యులు 28 రోజులుగా చికిత్స అందిస్తూ వచ్చారు. శనివారం సాయంత్రం ఆమె మృతి చెందింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలపకుండా ఆస్పత్రికిసం బంధించిన అంబులెన్సును రప్పించి మృతదేహాన్ని అందులో ఉంచారు. ఇంతలో భర్త, బంధువులు వచ్చి ‘మాకేం చెప్పకుండా ఎందుకు పంపించేస్తున్నారంటూ’ ప్రశ్నించారు. అసలు విషయం చెప్పడంతో బాధితులు ఆగ్రహంతో ఊగిపోయారు. వైద్యుల తీరును తప్పుబట్టారు. వాస్తవాలు చెప్పకుండా ఇప్పుడు మృతదేహాన్ని అప్పగిస్తారా అంటూ నిలదీశారు. న్యాయం చేసేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆస్పత్రి ఎదుటే బైఠాయించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు విషయం తెలుసుకున్న వ¯ŒSటౌ¯ŒS సీఐ ఈదురుబాషా, ఎస్ఐ వెంకటేశ్ తమ సిబ్బందితో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆందోâýæనకారులతో చర్చించారు. చివరకు నష్ట పరిహారం ఇచ్చేందుకు ఆస్పత్రి యాజమాన్యం అంగీకరించడంతో వారు ఆందోâýæన విరమించారు. చూసేందుకు వస్తూ.. రోడ్డు ప్రమాదానికి గురై... ఆస్పత్రిలో తమ బిడ్డ మంజుల మృతి చెందినట్లు తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు అక్కమ్మ, చిన్ననరసప్ప సహా సమీప బంధువులు కర్ణాటకలోని శిడ్లఘట్ట సమీపంలో గల గొరిమినుపల్లినుంచి హుటాహుటిన కారులో హిందూపురం బయలుదేరారు. మార్గమధ్యంలోని ఆంధ్ర సరిహద్దులోని గడిదం గ్రామం వద్దకు రాగానే కారు అదుపు తప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న(మంజులకు వరుసకు అత్తయ్యే) బంధువు మృతి చెందారు. ఆమె తల్లిదండ్రులకూ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగ్రాతులను కర్ణాటకలోని గౌరిబిదనూరు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరుకు తరలించినట్లు బంధువులు తెలిపారు. -
తల్లిదండ్రులు మందలించారని..
జీలుగుమిల్లి: పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం గంగన్నగూడెంలో విషాదం చోటు చేసుకుంది. ఓ విషయంలో తల్లిదండ్రులు మందలించారని మనస్తాపంతో మంజుల(16) అనే యువతి పురుగుల మందు తాగింది. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్న జంగారెడ్డి గూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కాసేపటికే మృతిచెందింది. స్థానికంగా ఉన్న త్రివేణి కళాశాలలో మంజుల ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మెగాఫోన్ పట్టనున్న సూపర్ స్టార్ సిస్టర్
సౌత్ సినీ రంగంలో ఇప్పుడిప్పుడే వారసురాళ్లు కూడా కనిపిస్తోంది. మంచు లక్ష్మీ లాంటి వారు తమ మార్క్ చూపించగా మరింత మంది సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. అయితే చాలా క్రితమే నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది ఘట్టమనేని వారసురాలు మంజులు. కృష్ణ కూతురిగా సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంజుల నటిగాను గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నించింది. షో లాంటి సినిమాతో జాతీయ స్థాయిలో ఆకట్టుకుంది. అయితే నిర్మాతగా వరుస ఫెయిల్యూర్స్ రావటంతో కొంత కాలంగా వెండితెరకు దూరంగా ఉంటోంది. తాజాగా మరోసారి సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్లాన్ చేస్తోంది మంజుల. అయితే ఈ సారి నటిగానో, నిర్మాతగానో కాకుండా దర్శకురాలిగా సత్తాచాటేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఓ కథ రెడీ చేసిన మంజుల సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడనుందన్న టాక్ వినిపిస్తోంది. -
గుట్టుగా రెండో వివాహం
చితకబాదిన మొదటి భార్య, బంధువులు దొడ్డబళ్లాపురం: గుట్టుచప్పుడు కాకుండా రెండో వివాహం చేసుకుని కాపురం చేస్తున్న వ్యక్తిని, అతడి రెండో భార్యను మొదటి భార్య, బంధువులు కలిసి చెప్పులు, చీపుర్లతో చితకబాదారు. ఈ సంఘటన దేవనహళ్లి తాలూకా చీమాచనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. చీమాచనహళ్లికి చెందిన నవీన్‌కు, ఇదే తాలూకా పెద్దనహళ్లికి చెందిన మంజులతో రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది. భార్య పురుడుకు పుట్టింటికి వెళ్లగా నవీన్ పెద్దనహళ్లికి చెందిన మరో యువతి ప్రియాంకను గుట్టుచప్పుడు కాకుండా వివాహం చేసుకొని చీమాచనహళ్లిలో కాపురం పెట్టాడు. విషయం కాస్త మొదటి భార్య మంజుల, కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. శుక్రవారం రోజు నవీన్,ప్రియాంక ఇద్దరూ ఇంట్లో ఉన్న సమయంలో వెళ్లి చెప్పులతో, చీపుర్లతో చితకబాదారు. మొదటి వివాహానికి ముందు నుంచే తామిద్దరం పరస్పరం ప్రేమించుకుంటున్నామని, అందుకే వివాహం చేసుకున్నానని ప్రియాంక తేల్చి చెప్పింది. చెన్నరాయపట్టణ పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి ఘటనపై ఆరా తీశారు. ఇరు వైపులనుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు. -
శిథిల భవనం కూలి ఇద్దరికి గాయాలు
రంగారెడ్డి జిల్లా మేడ్చల్ పట్టణంలో వర్షాల ధాటికి ఒక భవనం కూలిన ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. స్థానిక ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో ఓ పాత భవనం వర్షాలకు నాని మంగళవారం మధ్యాహ్నం కూలింది. ఆ భవనంలో ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పినట్లయింది.అయితే, అదే సమయంలో అటుగా వెళ్తున్న రాకేష్, మంజుల దంపతులు స్వల్పంగా గాయపడ్డారు. -
ఊయలే ఉరితాడైంది..
ఎంపీపీ అధ్యక్షురాలి తనయుడి మృతి దండేపల్లి : ఊయల తాడు ఉరి తాడుగా మారి పదేళ్ల బాలుడిని బలితీసుకుంది. ఊయలూగుతుండగా ప్రమాదవశాత్తు తాడు మెడకు బిగుసుకుని దండేపల్లి ఎంపీపీ అధ్యక్షురాలు గోళ్ల మంజుల, రాజమల్లుల కుమారుడు రిషీత్(10) మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. ఎంపీపీ అధ్యక్షురాలు గోళ్ల మంజుల గ్రామసభలో పాల్గొనడానికి వెళ్లారు. ఆమె భర్త రాజమల్లు ఓ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లాడు. వారి కుమారుడు రిషీత్ మేదరిపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. ఆందోళన నేపథ్యంలో సోమవారం పాఠశాలకు బంద్ కావడంతో ఇంటి వద్ద ఒంటరిగా ఉన్నాడు. ఇంటి ఆవరణలోని ఊయలలో నిలబడి ఊగుతూ ప్రమాదవశాత్తు కిందికి జారాడు. దీంతో ఊయల తాడు మెడకు చుట్టుకుని బిగుసుకు పోరుుంది. దీంతో ఊపిరాడక రిషీత్ చనిపోయూడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలుడు ప్రాణాలు కోల్పోయూడు. పక్కింటి వాళ్లు వచ్చి చూడగా రిషీత్ ఊయల తాడుకు చనిపోయి కనిపించాడు. ఈ విషయం రాజమల్లుకు తెలియజేయడంతో వెంటనే ఆయన వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే చనిపోరుునట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యూరు. రిషీత్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు వచ్చి కంటతడిపెట్టారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, దండేపల్లిని మంచిర్యాల జిల్లాలోనే ఉంచాలని చేపడుతున్న ఆందోళనలో భాగంగా సోమవారం మండలంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. బడి లేకపోవడంతో రిషీత్ ఇంటివద్దే ఉండిపోయాడు. తండ్రి ఇదే ఆందోళనలో పాల్గొనడానికి వెళ్లగా.. తల్లి గ్రామసభకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగింది. -
మెగాఫోన్ పట్టనున్న సూపర్ స్టార్ కూతురు
ఇప్పటికే నటిగా, నిర్మాతగా ప్రూవ్ చేసుకున్న స్టార్ వారసురాలు మంజుల. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వెండితెరకు పరిచయం అయిన మంజుల 'షో' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. తరువాత మహేష్ హీరోగా తెరకెక్కిన పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి మంచి విజయాలు సాధించింది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఆరెంజ్ సినిమాలో చివరి సారిగా కనిపించిన మంజుల తరువాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తోంది. మంగళవారం సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి అభిమానులకు మరో తీపి కబురు అందింది. ఇప్పటికే నటిగా, నిర్మాతగా మంచి విజయాలు సాధించిన మంజుల, త్వరలో దర్శకురాలిగా మారనుంది. యంగ్ హీరో నాని కథానాయకుడిగా ఓ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతోంది మంజుల. ఇప్పటికే కథ విన్న నాని వెంటనే సినిమాను పట్టాలెక్కించడానికి అంగీకరించాడట. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జెంటిల్‌మేన్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న నాని, ఆ సినిమా తరువాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమాను అంగీకరించాడు. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి మరీ.., మంజుల సినిమాను సెట్స్ మీదకు తీసుకురావాలని భావిస్తున్నాడట. నటిగా, నిర్మాతగా సక్సెస్ అయిన మంజుల దర్శకురాలిగా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి..? -
కుమార్తెకు ఇష్టం లేని వ్యక్తితో వివాహ ప్రయత్నం
తనయురాలితో కలిసి భార్యను హత్య చేసిన భర్త బెంగళూరు(బనశంకరి) : కుమార్తెకు ఇష్టం లేని వ్యక్తితో వివాహం చేసేందుకు యత్నించిన భార్యను తనయురాలితో కలిసి భర్త హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇంటి వెనుక పూడ్చి పెట్టారు. ఈ ఉదంతం ఆదివారం నగరంలో వెలుగు చూసింది. హెబ్బడగెరెలో తిమ్మయ్య, మంజుల(55) నివాసం ఉంటున్నారు. వీరికి పవిత్ర, రాణి అనే కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె పవిత్ర భర్త ఓ నేరం కేసులో జైలు పాలు కాగా పవిత్ర తల్లివద్దనే ఉంటోంది. రెండో కుమార్తె రాణి ఓ యువకుడిని ప్రేమించింది. అతనితో వివాహం చేయాలని కోరగా తల్లి అంగీకరించలేదు. మరో వ్యక్తితో వివాహం చేయాలని నిర్ణయించింది. ఇది భర్తకు కూడా ఇష్టం లేదు. దీంతో తిమ్మయ్య తన భార్యను అంతమొందించేందుకు పథకం రూపొందించాడు. ఈమేరకు రాణితో కలిసి మంజులను హత్య చేసి ఇంటి వెనుక పూడ్చి పెట్టారు. తన తల్లి కనిపించడం లేదని పెద్ద కుమార్తె ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి రాణి, తిమ్మయ్యను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. తామే మంజులను హత్య చేసినట్లు నిర్ధారించడంతో ఆదివారం ఘటనా స్థలానికి చేరుకొని మంజుల మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి నిందితులను అరెస్ట్ చేశారు. -
మిస్టరీగా మారిన మెడికో ఆత్మహత్య
-
మిస్టరీగా మారిన మెడికో ఆత్మహత్య
► సినిమా కథను తలపిస్తున్న మెడికో కేసు ► అన్నీ అంతుబట్టని రహస్యాలే అనంతపురం: అనంతపురం శ్రీనివాసనగర్‌లో జరిగిన మెడికో మీనాక్షి(అసలు పేరు మంజుల)ఆత్మహత్య కేసు మిస్టరీగా మారింది. ఈ కేసులో ఎన్నో చిక్కుముడులు.. అచ్చం సినిమా కథను పోలిన ఈ ఉదంతంలో లోతుగా పోయేకొద్దీ విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. అందరినీ ఆశ్చర్యానికి, విస్మయానికి గురి చేస్తున్నాయి. ఎవరీ మంజుల..? బెంగళూరుకు చెందిన మీనాక్షిగా భావించిన ఆమె అసలు పేరు మంజుల అని తెలిసింది. ఆమెది బెంగళూరు కాదని, పుట్టపర్తి మండలం బత్తలపల్లికి చెందిన వడ్డే రంగమ్మ, మారెన్న దంపతుల మూడో సంతానంగా వెల్లడైంది. ఐదేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన రాము చౌదరి అనే వ్యక్తి మంజులను ప్రేమించి ఇంటి నుంచి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి మూడేళ్ల వరకు మంజుల ఆచూకీ కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. ఆ తరువాత తాను బెంగళూరులో డాక్టర్ కోర్సు(మెడిసిన్) చదువుతున్నాని మంజుల తల్లిదండ్రులకు ఫోన్లో తెలిపింది. త్వరలో ఇంటికొస్తానని కూడా చెప్పినట్లు తమతో చెప్పినట్లు ఆమె తండ్రి తెలిపారు. అసలీ శ్రీనివాస్ చౌదరి ఎవరంటే? పుట్టపర్తి మండలం రాయలవారిపల్లికి చెందిన సుబ్బమ్మ, వెంకటప్ప దంపతుల కుమారుడే శ్రీనివాస్ చౌదరి. 20 ఏళ్ల కిందట అతను బతుకుదెరువు కోసం అనంతపురానికి వచ్చాడు. మొదట ఆర్టీసీ బస్టాండ్‌లో క్యాంటిన్ నిర్వహించేవాడు. తర్వాత రైల్వేస్టేషన్లో క్యాంటిన్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతను అనేక మంది మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. మంజులతో వెళ్లిపోయిన రాము, శ్రీనివాస్ చౌదరికి సమీప బంధువే. వారిద్దరితో పాటు మంజుల కలసి మూడేళ్లుగా అనంతపురంలోని శ్రీనివాస్‌నగర్‌లో కలసి ఉంటున్నారు. రెండేళ్ల కిందట శ్రీనివాస్ చౌదరికి మంజులతో వివాహమైంది. అప్పటి నుంచి మంజుల ఇంట్లో ఉండగానే రోజుకో మహిళను శ్రీనివాస్ తన ఇంటికి పిలిపించుకునేవాడని చెబుతున్నారు. ఈ విషయంగా వారిద్దరి మధ్య తరచూ ఘర్షణ కూడా జరిగేందంటున్నారు. రాము ఏమయ్యాడో..? ఆరేళ్ల కిందట మంజులను పిల్చుకెళ్లిన రాము ఇప్పుడు ఏమయ్యాడో అంతుబట్టడం లేదు. శ్రీనివాస్ చౌదరితో మంజుల వివాహం ఎలా అయిందనే విషయం పెద్ద మిస్టరీగా మారింది. శ్రీనివాస్ చౌదరికి పోలీసుల అండదండలు సోమవారం రాత్రి 10 గంటలకు మంజుల తన నాలుగు నెలల చిన్నారితో కలసి ఇంట్లో పడుకుంది. ఆ సమయంలో శ్రీనివాస్ మరో మహిళను ఇంటికి పిల్చుకువచ్చాడు. దీంతో వారిద్దరూ గొడవ పడ్డారు. ఆమె ఉరికి వేలాడింది. ఈ విషయాన్ని వెంటనే అతను మూడో పట్టణ పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. రాత్రి విధి నిర్వహణలో ఉన్న ఓ ఏఎస్ఐకి విషయం చెప్పాడు. అతను ఈ విషయాన్ని ఓ ఎస్ఐకి సమాచారాన్ని అందించడంతో ఎక్కడికైనా వెళ్లి తలదాచుకోవాలని, మిగిలిన విషయాలన్నీ తాను చూసుకుంటానని అభయమిచ్చినట్లు తెలిసింది. ఎస్ఐ డెరైక్షన్ మేరకు మంజుల (మీనాక్షి) మృతదేహాన్ని శ్రీనివాస్ మరొసటి రోజు అర్ధరాత్రి 2 గంటలకు కారులో నేరుగా సర్వజనాస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ విషయం అన్ని పత్రికల్లో రావడంతో స్పందించిన జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. దీంతో శ్రీనివాస్చౌదరిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే త్రీటౌన్ సీఐ ఆంజినేయులు, ఎస్ఐ తమీమ్ అహమ్మద్ శ్రీనివాస్‌నగర్‌లోని శ్రీనివాస్ చౌదరి ఇంట్లో సోదాలు నిర్వహించి పలు కీలక అంశాలు తెలుసుకున్నారు. శ్రీనివాస్‌చౌదరి ఇప్పటికే ముగ్గురు అమ్మాయిలను వివాహం చేసుకుని వదిలేసినట్లు తెలిసింది. కేసు తారుమారుకు యత్నం రాష్ట్రస్థాయి పోలీస్ శాఖలోని ఓ కీలక ఉన్నతాధికారికి తాను సమీప బంధువునంటూ శ్రీనివాస్ చౌదరి ప్రచారం చేసుకునేవాడు. దీంతో పోలీసులు సైతం అదే స్థాయిలో అతనికి రాచమర్యాదలు చేయడం గమనార్హం. ఇప్పటికే మంజుల మృతిని పక్కదావ పట్టించడానికి పెద్దమనుషులుగా చెలామణి అవుతున్న కొందరు దుప్పటి పంచాయితీ చేయడానికి రంగంలోకి దిగారు. నిత్య పెళ్లికొడుకుగా మారిన శ్రీనివాస్ వెనుక ఉన్న రాజకీయ నేతల అండదండలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ ఎవరో మాకు తెలియదు ' అసలు ఈ శ్రీనివాస్ చౌదరి ఎవరో..? తమ బిడ్డను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడో మాకు తెలియదు. మా కూతురు ఆరేళ్ల కిందట రాము అనే వ్యక్తితో వెళ్లిపోయింది. అతన్నే పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పింది. ఇప్పుడేమో శ్రీనివాస్ చౌదరి పెళ్లి చేసుకున్నట్లు, వారికి నాలుగు నెలల బాబు ఉన్నట్లు అంటున్నారు. ఈ విషయం ఇంతవరకు మాకు తెలియదు. అసలు రాము ఏమయ్యాడో తెలియడం లేదు. మా బిడ్డ మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయి. నిష్పక్షపాతంగా విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయి ' అని మంజుల తండ్రి వడ్డే మారన్న చెప్పుతున్నారు. -
బోయిన్‌పల్లిలో చైన్ స్నాచింగ్
రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి గుర్తు తెలియని ఇద్దరు దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా బోయిన్పల్లి మండలం తమ్మంపల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామానికి చె ందిన పులి మంజుల(32) బీడీల ఫ్యాక్టరీకి వెళ్లి వస్తున్న సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. దీంతో బాదితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
రెండో పెళ్లి తప్పింది.. తొలి పెళ్లి అయ్యింది
తాండూరు (రంగారెడ్డి): భార్య ఉండగానే ఓ ప్రబుద్ధుడు రెండో పెళ్లికి సిద్ధమవటం.. తీరా తాళి కట్టే సమయానికి మొదటి భార్య రావటం.. పెళ్లి ఆగిపోవటం.. ఏం చేయాలో తోచక వేరే వ్యక్తికి వధువునిచ్చి పెళ్లి చేయటం.. చూస్తే ఏదో సినిమా జరిగిన సన్నివేశాన్ని గుర్తు చేస్తుందిగా.. ఈ పెళ్లి. సరిగ్గా ఓ పెళ్లిలో ఇదే జరిగింది. శుక్రవారం తాండూరు పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. తాండూరు అర్బన్ సీఐ వెంకట్రామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ మండలం రాంపల్లికి చెందిన మంజులకు 1989లో వినోద్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. రెండేళ్ల తరువాత ఇద్దరూ విడిపోయారు. తరువాత 2004 సంవత్సరంలో లంగర్‌హౌస్‌కు చెందిన తన మేనమామ కొడుకు గాజర్ల కిరణ్‌వర్మను పెళ్లి చేసుకున్నారు. తరువాత సేల్స్ రి్రపజెంటేట్గా పనిచేసే కిరణ్‌వర్మ, మంజుల ఇద్దరు కొంతకాలం విశాఖపట్నంలో నివసించారు. రెండేళ్ల క్రితం ఇద్దరు హైదరాబాద్‌కు వచ్చారు. తాజాగా తాండూరు పట్టణానికి చెందిన ఓ అమ్మాయితో తెలిసిన వారి ద్వారా కిరణ్‌వర్మ పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. తనకు ఇదివరకే పెళ్లి జరిగిన విషయాన్ని దాచిపెట్టాడు. శుక్రవారం ఉదయం 11.15 గంటలకు మంచి ముహూర్తం ఉందని, అదే ముహూర్తానికి పెళ్లి చేయాలని ఒత్తిడి తెచ్చాడు. వరకట్నం కింద రూ.లక్ష నగదు, నాలుగు తులాల బంగారం ఇతర కానుకలు మాట్లాడుకున్నారు. వధువు తరఫున కుటుంబ సభ్యులు స్థానిక దేవాలయంలో ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. తన భర్త రెండో పెళ్లి చేసుకుంటున్న సమాచారం తెలుసుకున్న మంజుల గురువారం రాత్రే కీసర పోలీసుస్టేషన్‌కు వెళ్లి వివరాలు తెలిపింది. మంజుల తన తండ్రి రాజేశ్వరరావు, సోదరుడు బాల్‌రాజ్‌లతో కలిసి తాండూరుకు రాత్రి చేరుకున్నారు. శుక్రవారం ఉదయమే మంజుల పోలీసుస్టేషన్‌కు వెళ్లి తన భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నాడని, ఆధార్‌కార్డు, ఫొటోలు తదితర ఆధారాలు పోలీసులకు చూపించింది. పోలీసులు వధువు తరఫు వారికి జరిగిన విషయం తెలపడంతో మొదట షాక్ తిన్నారు. పోలీసులు రంగం ప్రవేశం చేసి, కిరణ్‌వర్మను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. వరుడి తరఫున వచ్చిన కొందరు దగ్గర బంధువులు మినహా అందరూ అక్కడి నుంచి ఫలాయనం చిత్తగించారు. ఈ మేరకు చీటింగ్ కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్టు సీఐ చెప్పారు. అనంతరం రెండో పెళ్లి తప్పిపోవడంతో వధువు కుటుంబ సభ్యులు సంతోషపడ్డారు. కూతురు పెళ్లి ఆగిపోవద్దని భావించి కొన్ని గంటల వ్యవధిలో గతంలో అనుకున్న బంధువుల అబ్బాయికిచ్చి పెళ్లి జరిపించారు. మంజులను పెళ్లి చేసుకోలేదు: కిరణ్‌వర్మ తన భార్యగా చెప్పుకుంటున్న మంజులను నేను పెళ్లి చేసుకోలేదు. ఆమెతో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నాను. సేల్స్ రిప్రజంటేటీవ్‌గా పని చేస్తూ విశాఖపట్నంలో ఇద్దరు కలిసి నివసించాం. సుమారు రెండేళ్ల క్రితమే హైదరాబాద్‌కు వచ్చాం. -
ఇష్టంలేని పెళ్లి చేశారని నవవధువు బలవన్మరణం
బోడుప్పల్: తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేశారని నవవధువు ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఈ విషాద ఘటన జరిగింది. ఎస్ఐ మగ్బూల్జాని కథనం ప్రకారం... వరంగల్ జిల్లా ఘనాపూర్ మండలం కుందూరు గ్రామానికి చెందిన మంజుల (20)కు ఘట్కేసర్ మండలం చెంగిచెర్లకు చెందిన మహేశ్‌తో గతనెల 22 న వివాహం జరిగింది. మహేశ్ ఆటో డ్రైవర్ కాగా, అత్తమామలు కూలి పనిచేస్తారు. కాగా, తల్లిదండ్రులు తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని మనోవేదనకు గురవుతున్న మంజుల బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్: తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేసినందుకు ఓ యువతి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ మగ్బూల్జాని తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా ఘనాపూర్ మండలం కుందూరు గ్రామానికి చెందిన మంజుల (20)కు ఘట్కేసర్ మండలం చెంగిచెర్లకు చెందిన మహేశ్‌తో గతనెల 22న వివాహం జరిగింది. మహేశ్ ఆటో డ్రైవర్ కాగా, అత్తమామలు కూలి పనులు పనిచేస్తారు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
జీతాలు పెంచాలని ఆశా కార్యకర్తల ధర్నా
చిక్కబళ్లాపురం: నెలసరి వేతనాలను పెంచాలం టూ ఆశా, అక్షర దాసోహ కార్యకర్తలు గురువా రం ధర్నా నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాల యం ఎదుట చేపట్టిన ఈ కార్యక్రమానికి సీఐ టీయూ నాయకత్వం వహించింది. ఈ సందర్భంగా అక్షర దాసోహ తాలూకా సంచాలకురా లు మంజుల మాట్లాడుతూ... అక్షర దాసోహ కార్యకర్తలకు నెలకు గౌరవ వేతనంగా రూ. 1800, ఆశా కార్యకర్తలకు రూ. 1700 చెల్లిస్తున్నారని తెలిపారు. ఈ వేతనంతో జీవనం గడపడం దుర్భరంగా మారిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీస వేతనంగా రూ.పది వేలను చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్‌కు వి నతిపత్రం అందజేశారు. అంతకు నగరంలో కా ర్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వెంకటలక్షుమమ్మ, నరసమ్మ, శోభా, భారతి, రాధమ్మ, సీపీఎం సంచాలకుడు ముని కృష్ణప్ప తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి సపోర్ట్
హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో సోమవారం సాయంత్రం సాక్షి సిటీ ప్లస్ అనుబంధం ఏర్పాటు చేసిన ‘సిటీ ఆఫ్ ఛారిటీ’ ఇష్టాగోష్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటి సమంత ఛారిటీ అనే పదానికి కొత్త అర్థాన్ని ఇచ్చారు. ‘‘సాయపడుతున్నవారిని ప్రోత్సహించినా, సాయం చేస్తున్నవారి చిరునామా చెప్పినా చాలు... అది కూడా పెద్ద సాయమే’’ అన్నారు. వార్తా కథనాలతో సరిపెట్టకుండా పదిమంది సేవాతత్పరులను ఒకచోట కలిపి పరస్పర సహకారానికి నాంది పలుకుతున్న సాక్షికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలు సేవా సంస్థల నిర్వాహకులు తమ మనోభావాల్ని సాక్షితో పంచుకున్నారు. సదా మీ సేవలో... ఇటీవల సాక్షి సిటీ ప్లస్‌లో ‘సిటీ ఆఫ్ ఛారిటీ’ పేరుతో పదిహేడు కథనాలు ప్రచురితమైయ్యాయి. దానికి ‘సదా మీ సేవలో’ అంటూ సమంత బాసటగా నిలిచారు. ‘ప్రత్యూష సపోర్ట్’ పేరుతో గత ఏడాదిగా పేద పిల్లలకు వైద్యం, తలసేమియా బాధితులకు రక్తదానం, అనాథ పిల్లలకు ఆర్థిక సాయం చేస్తోంది ఆ సంస్థ. ప్రముఖ నటిగా క్షణం తీరికలేని సమంత, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వెనక తగిన కారణమే ఉంది. ‘‘నేను బిలో మిడిల్‌క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని. సాయం చేసే చేతులకున్న విలువ గురించి తెలుసు. ఈ ప్రపంచంలో ఒక్కశాతం మాత్రమే ధనవంతులున్నారు. మిగతా 99 శాతం ప్రజలు పేదవారే. ఈ ఒక్కశాతం ధనికులు తలుచుకుంటే మిగతా జనాభా తలరాతలు మార్చగలరని నా నమ్మకం. నేను డబ్బు, పేరు రెండూ సంపాదించాను. మిగిలింది ఆత్మతృప్తి. దానికోసమే నా ప్రయత్నం. సిటీ ఆఫ్ ఛారిటీకి బ్రాండ్ అంబాసిడర్‌గా సాక్షి సిటీ ప్లస్ నుంచి పిలుపు రాగానే ఒక్కనిమిషం కూడా ఆలోచించకుండా ముందుకు రావడం వెనకున్న కారణం కూడా ఇదే. పైగా వందకుపైగా ఎన్జీవోల నుంచి ఎంట్రీలు వచ్చాయని తెలిసాక ఆశ్చర్యపోయాను. ఇలాంటి ఇష్టాగోష్టి మనలో మరింత సేవాభావాన్ని నింపుతుందని ఆశిస్తున్నాను’’ అని సమంత అన్నారు. యువత పాత్రే కీలకం... అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ ప్రత్యేక సేవకు నడుంబిగించిన సత్యహరిచంద్ర ఫౌండేషన్ రాజేశ్వరరావు మాట్లాడుతూ...‘‘సాక్షి సేవా ప్రచారానికి నటి సమంత బాసటగా నిలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా సంస్థలో పాల్గొంటున్న యువతకు ఆమె తప్పకుండా ఆదర్శంగా నిలుస్తారు’’ అని అన్నారు. యశోదా చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గోరుకంటి రవీందర్రావు మాట కలుపుతూ ‘‘మనకున్నదాంట్లో కొంత తోటివారికి, పేదవారికి పంచడం త్యాగంలా భావించక్కర్లేదు, బాధ్యతగా అనుకోవాలి. అనాథపిల్లలకు ఉపాధిమార్గం చూపిస్తున్న మా సంస్థ ఉద్దేశ్యం అదే’’ అని చెప్పారు. డబ్బులు కట్టినా ఆటలాడించే అవకాశం లేని స్కూళ్లలో, ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా ఆటలాడిస్తూ తన సేవను చాటుకుంటున్న ‘మ్యాజిక్ బస్’ సంస్థ సేవల గురించి వివరంగా చెప్పారు ఆ సంస్థ మేనేజర్ దీమంత్. ఈ సంస్థలో కూడా యువతపాత్రే కీలకం అన్నారు. స్పర్శ్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ ‘‘క్యాన్సర్ కాటుకి బలై, మృత్యువుతో పోరాడుతున్నవారు మా సంస్థలో సేదతీరుతున్నారు. ప్రేమను పంచే మా సంస్థ సేవల్ని మరింత విస్తరించాలనుకుంటున్నాం’’ అంటూ తమ ఆలోచనల్ని పంచుకున్నారు. ఈ సంస్థలతో పాటు కృష్ణదేవరాయ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (కెఎస్‌పి), జాయ్ ఆఫ్ రీడింగ్ గ్రూప్, మేక్ ఎ డిఫరెన్స్ (మ్యాడ్), రక్షణ వెల్ఫేర్ అసోసియేషన్, స్టూడెంట్ సోషల్ సర్వీస్ (ఎస్ఎస్ఎస్), ఫ్రెండ్స్ ఫర్ సేవ , బాలసంస్కార్, సంభవామి సంస్థ, దయ ఫౌండేషన్, స్నేహదీపం, ఎ వేక్ ఓ వరల్డ్ సంస్థల నిర్వాహకులు కూడా వారి అనుభవాల్ని పంచుకున్నారు. ‘సపోర్ట్’ ఉంటుంది ప్రత్యూష సపోర్ట్ సంస్థ కో ఫౌండర్ డాక్టర్ అనగాని మంజుల తమ సంస్థ గురించి వివరించారు. ‘‘ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థకు ప్రత్యూష సపోర్ట్ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. సమంత సేవాహృదయం నన్ను కదిలించింది. వెంటనే ఆమెతో కలిసి పనిచేయడానికి సిద్ధపడ్డాను. అవసరానికి, అవకాశానికి మధ్య వారధిగా నిలవడం కూడా ఉన్నతమైన సేవే. ఆ పనికి పూనుకున్న సాక్షికి మరొకసారి మా సంస్థ తరఫున ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను’’ అన్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘డాక్టర్ మంజులగారికి పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన సందర్భంగా సాక్షి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రత్యూష సపోర్ట్ సేవలతో పాటు వైద్యవృత్తిలో కూడా వారి ఆశయాలు నెరవాలని కోరుకుంటున్నాం’’ అని చెప్పారు. ఇదే తొలిసారి... ‘‘చదువుకునే విద్యార్థి నుంచి రిటైర్ అయిన వృద్ధుల వరకూ అందరూ సేవకు సిద్దపడడం సంతోషంగా ఉంది. మీ అందరికీ సాక్షి అన్నిరకాలుగా అండగా నిలబడుతుంది. మరిన్ని సేవా సంస్థల్ని మీతో భాగస్వాముల్ని చేయడానికి మావంతు ప్రయత్నం చేస్తాం. అలాగే నటి సమంతను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. సేవకు సమయం లేదనేవారికి ఆమె ఆదర్శంగా నిలుస్తారు. అంత చిన్నవయసులో తోటివారి శ్రేయస్సుకోసం ఆమె పడుతున్న తపన నేటి యువతలో సేవాభావాన్ని నింపుతుందని ఆశిస్తున్నాను’’ అని సాక్షి ఛైర్పర్సన్ వైఎస్ భారతి అన్నారు. సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ...‘‘మీలోని సేవాగుణం మరింతమందికి ఆదర్శం కావాలి. మనచుట్టూ ఉన్న స్వచ్ఛంద సంస్థలన్నింటినీ ఒక్కవేదికపైకి తేవడానికి ఇది సాక్షి వేసిన తొలి అడుగు. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది’’ అని చెప్పారు. కార్యక్రమం చివర్లో సమంత మాట్లాడుతూ...‘‘ మీ సంస్థల సేవాకార్యక్రమాల గురించి విన్నాక నాకేమనిపిస్తుందంటే.. నేను చేస్తున్న సేవా చాలా చిన్నదని. నేను ఇంకా చాలా చేయాలి. మరెంతోమందిని ఈ సేవలో భాగస్వాముల్ని చేయాలి’’ అంటూ ముగించారు. సేవలోనే సంతృప్తి! ఇప్పటివరకూ ఎన్నో కార్యక్రమాలకు హాజరయ్యాను. గొప్ప గొప్ప వ్యక్తుల్ని కలిసాను. కానీ ఇలా తోటివారి శ్రేయస్సు కోసం పాటుపడే పదిమంది మధ్య కూర్చోవడం ఇదే తొలిసారి. చాలా ఆనందంగా ఉంది. ఈ క్షణాలు నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. సాక్షి చేసిన ఈ ప్రయత్నానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా దృష్టిలో సంతోషం డబ్బులోను, పేరులోను ఉండదు. తోటివారికి ఎంతోకొంత సాయపడ్డామన్న తృప్తిలోనే ఉంటుంది. ఆ తృప్తి కోసమే ‘ప్రత్యూష సపోర్ట్’ నడుపుతున్నాను. - సమంత, సినీనటి - భువనేశ్వరి ఫొటోలు: ఎస్.ఎస్ ఠాకూర్, జి. రాజేశ్ -
సెల్ ఫోన్ చార్జింగ్ పెడుగూ మహిళ మృతి
యాచారం: సెల్‌ఫోన్‌ను చార్జింగ్ నుంచి తీస్తుండగా విద్యుద్ఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మంతన్‌గౌరెల్లిలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన కనక మంజుల(25) సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లో సెల్‌ఫోన్‌ను చార్జింగ్ నుంచి తీసేందుకు యత్నించింది. ఈ క్రమంలో ఆమె కరెంట్ షాక్‌కు గురై మృతి చెందింది. మృతురాలికి భర్త ఎల్లయ్య, కుమారుడు క్రాంతి, కూతురు ప్రవళిక ఉన్నారు. -
సదా మీ సేవలో..
‘వి మేక్ ఎ లివింగ్ బై వాట్ వి గెట్.. బట్, వి మేక్ ఎ లైఫ్ బై వాట్ వి గివ్’ ప్రత్యూష ఫౌండేషన్ బ్రోచర్‌పై ఉన్న కొటేషన్. సమంత మనసులోని మాటకు అక్షర రూపం ఇది. ‘ఉన్నదాంతో మనం బతకగలం. కానీ మనం ఇచ్చిన దాంతో ఎదుటి వారి జీవితాలను నిలబెట్టగలం’ అని సమంత చెప్పే మాటలు చేతల్లోకి మారి ఏడాది కావొస్తోంది. మహిళలకు, పిల్లలకు ఎన్నో రకాల సేవలను అందించింది ప్రత్యూష ఫౌండేషన్. గతేడాది సమంత అనారోగ్యానికి గురైన సమయంలో ఆ మనసును తొలచిన ఆలోచనలే ఆమెను సేవామార్గం వైపు అడుగులు వేయించారు. ‘అన్నీ ఉన్నా.. మనిషి ఆరోగ్యం కుదుటపడాలంటే కాస్త ప్రేమ కావాలి. కానీ పేదవారికి ప్రేమతో పాటు డబ్బు ఉండాలి.. ఆదరణ చూపాలి’.. సమంత మదిలో మెదిలిన ఈ ఆలోచనలే ‘ప్రత్యూష ఫౌండేషన్’ టాగ్లైన్... సపోర్ట్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. సమంత.. సింగిల్ కాల్షీట్ కూడా ఖాళీ లేని బిజీ హీరోయిన్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అనుకుంటారంతా. సమంత మాత్రం తన ఇంటినే కాదు.. ఎందరి జీవితాలనో చక్కబెట్టాలని సంకల్పించింది. అందుకే రిటైర్ అయ్యాక మదిని తొలిచే సామాజిక సేవ.. సమంత మదిలో ఇప్పుడే మెదిలింది. ‘సంపాదన ఎంత ముఖ్యమో.. సేవ కూడా అంతే ముఖ్యమని’ కదిలింది. తన ఆలోచనకు ‘ప్రత్యూష ఫౌండేషన్’ అని నామకరణం చేసి రంగంలోకి దూకింది. అంతే వేగంగా ‘ఆక్షన్’ పేరుతో మిగతా సెలిబ్రిటీలనూ అందులో భాగస్వాముల్ని చేసింది. ‘నేను ఎప్పటికీ హీరోయిన్గా ఉండలేను..! కానీ సమాజం దృష్టిలో మాత్రం సేవకురాలిగా ఎప్పటికీ నిలిచిపోవాలన్నది నా కోరిక’ అని చెప్పే ఈ కథానాయిక తీరిక కుదిరితే చాలు.. ప్రత్యూష ఫౌండేషన్ పనుల్లో బిజీ అవుతోంది. రియల్ టార్గెట్.. చదువు.. ఆపై ఉద్యోగం.. లైఫ్ సెటిల్మెంట్.. ఈ టార్గెట్‌పై దృష్టి పెట్టిన యూత్ లైఫ్ బిజీ అయిపోయిందని ఫిక్సయిపోయింది. అలాంటి వారికి తీరిక కుదరని షెడ్యూల్లో ఓపిక కూడదీసుకుని సమంత చేస్తున్న సేవా కార్యక్రమాలను ఇప్పటి యూత్ ఆదర్శంగా తీసుకోవాలని చెబుతున్నారు ప్రత్యూష ఫౌండేషన్ కో-ఫౌండర్ డాక్టర్ మంజుల. ‘హీరోయిన్గా సమంత అందరికీ తెలుసు. కానీ ఏడాదిగా ఆమె చేస్తున్న సేవను అభినందిస్తున్నాను. సమంతతో కలసి పని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. విమెన్ హెల్త్‌పై అవగాహన తరగతుల ఏర్పాటు, అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారుల వివరాలు సేకరించి వారికి వైద్యం చేయించడం, వీటితో పాటు మహిళా సాధికారికత కోసం కార్యక్రమాలెన్నో ఈ సంస్థ ద్వారా చేయుగలిగాం. మధ్యలో సమంతకు వచ్చిన ‘మేక్ ఎ విష్’ ఆలోచనను ఆచరణలో పెట్టడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి ఉంది’ అని వివరించారు డాక్టర్ మంజలా అనగాని. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్.. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా తలసేమియా బాధితులకు రక్తం అందించే కార్యక్రమాలను కూడా నిర్వహించారు. సమంత ఫ్యాన్స్ స్వచ్ఛందంగా పాల్గొని ఈ రక్తదాన శిబిరాలను గ్రాండ్ సక్సెస్ చేస్తున్నారు. అలాగే రెయిన్ బో, లివ్లైఫ్ ఆస్పత్రుల సాయంతో చేసే హెల్త్ క్యాంపెయిన్లకు కూడా పెద్ద ఎత్తున బాధితులు తరలి వస్తున్నారు. ఇక్కడ పది మందికీ చేయూతనిస్తున్న ప్రత్యూష ఫౌండేషన్ సేవలను చెన్నైకి కూడా విస్తరింపజేయాలని సమంత కోరుకుంటున్నారు. ఆమె ఆశయం నెరవేరాలని మనమూ కోరుకుందాం. చేతులు కలిపి.. చేతలు తెలపండి.. చీకటి వెలుగుల జీవితంలో అందరూ కోరుకునేది వెలుగే. ఆ జిలుగు నీడలో పది మందినీ ఆహ్వానించే వారు కొందరే ఉంటారు. అలాంటి వారి గురించి పదిమందికీ తెలిస్తే.. మరెందరి హృదయాల్లోనో సేవాభావం వెలుగు చూస్తుంది. మరెందరినో సేవామార్గంలో నడిపిస్తుంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా మీకున్న పరిధిలో సమాజం కోసం మీరు చేతులు కలిపి.. చేసిన చేతల వివరాలు మాకు తెలియజేయండి. మీకు స్ఫూర్తిగా స్టార్‌డమ్‌కి సేవను జోడించి తనదైన శైలిలో స్పందిస్తున్న సినీ నటి సమంత ‘సిటీప్లస్’లో వెలుగుచూసే కథనాలకు బాసటగా నిలుస్తానంటోంది. మీరు చేయాల్సిందల్లా.. ఓ సంస్థ ద్వారా, వ్యక్తిగతంగా మీరు చేస్తున్న సేవల వివరాలను మాకు మెయిల్ చేయండి. వాటిని ‘సిటీప్లస్’లో ప్రచురిస్తాం. వీటిలో ఉన్నతమైన వాటిని ఎంపిక చేసి.. సదరు సేవా సంస్థలు, వ్యక్తులను సమంత పలకరిస్తారు. ఒక్క సమంత మాత్రమే కాదు.. సేవ చేసే హృదయాలను అభినందించడానికి మరెందరో సెలిబ్రిటీలు ముందుకు రానున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు చేస్తున్న చారిటీ -భువనేశ్వరి వివరాలు మెయిల్ టు sakshicityplus@gmail.com -
నిర్మాతగా మారిన వనిత
ప్రఖ్యాత నటులు ఎంజిఆర్, శివాజి, రజని, కమల్ల పేర్లు జపిస్తున్నారు నటి వనిత. నట దంపతులు విజయకుమార్, మంజుల వారసురాలైన ఈమె గురించి తెలియనివారుండరు. ఎందుకంటే ఆ మధ్య ఈమె పేరు వార్తల్లో బాగా నానింది. హీరోయిన్గా కొన్ని చిత్రాలు చేసిన వనిత, ఆకాష్ అనే వ్యక్తిని వివాహమాడి కొంతకాలం తరువాత అతని నుంచి విడాకులు పొం దారు. ఆ తరువాత రాజన్ ఆనంద్‌ను పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం సంసార జీవితం తరువా త విడిపోయారు. ఈమెకు విజయ్ శ్రీహరి, జెని త అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ పెళ్లి, విడాకుల వ్యవహారాల్లో పోలీసుస్టేషన్లు, కోర్టులు అంటూ వార్తల్లో కెక్కిన నటి వనిత తాజాగా నిర్మాతగా అవతారమెత్తారు. ఈమె నిర్మిస్తున్న చిత్రానికి ఎంజీఆర్, శివాజి, రజని, కమల్ అనే పేరును నిర్ణయించారు. నృత్య దర్శకుడు రాబర్ట్ ను హీరోగా నటిస్తూ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన ఈ చిత్రానికి శ్రీకాంత్‌దేవా సంగీతబాణీలందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం స్థానిక వడపళనిలోని ఆర్ కేవీ స్టూడియోలో జరిగింది. చిత్ర ఆడియోను సీని యర్ సంగీత దర్శకుడు శ్రీకాంత్ దేవా తండ్రి అయిన దేవా ఆవిష్కరించారు. వనిత మాట్లాడు తూ వారాంతరాల్లో స్నేహితులందరూ కలుసుకు ని సరదాగా గడుపుతామన్నారు. అలా ఒకరోజు రాబర్ట్ తన వద్ద మంచి కథ ఉంది సినిమా చేద్దాం అని చెప్పారన్నారు. ఆ కథ తనకు అంతగా నచ్చకపోవడంతో ఆయన్ని నిరుత్సాహపరచడం ఇష్టం లేక మంచి నిర్మాత కోసం ప్రయత్నిద్దాం అని చెప్పానన్నారు. విషయం అర్థం చేసుకున్న రాబర్ట్ మరో కథను తయారు చే సినట్లు వివరించారు. పూర్తి వినోదభరిత అంశాలతో కూడిన ఆ కథ నచ్చడంతో చిత్ర నిర్మాణానికి సిద్ధం అయ్యానన్నారు. ఆ కథతో తెరకెక్కిస్తున్న చిత్రమే ఎంజీఆర్, శివాజి, రజని, కమల్ అని తెలిపారు. కథకు నప్పడంతోనే ఈ చిత్రానికి ఆ పేరును నిర్ణయించినట్లు వివరించారు. ఈ ఆడియోను శ్రీ స్టూడియో సంస్థ ద్వారా సంగీత దర్శకుడు శ్రీకాంత్‌దేవా మార్కెట్లోకి విడుదల చేయటం విశేషం. -
పోలీస్‌స్టేషన్ ఎదుట టీడీపీ నేతల ధర్నా
ఎమ్మెల్యే జేసీపై కేసు ఎత్తేయాలని డిమాండ్ తాడిపత్రి : తాడిపత్రిలోని ఏటీఎం సెంటర్ల వద్ద పరిశుభ్రత విషయంలో తనను బెదిరించారన్న చీఫ్ మేనేజర్ మంజుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ టీడీపీ నేతలు మంగళవారం ఎస్బీఐ మెయిన్ బ్రాంచి ముట్టడికి ప్రయత్నించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఎస్బీఐ రెండు బ్రాంచీలతోపాటు పట్టణమంతా పోలీసులు భారీగా మోహరించి ఉండటంతో ముట్టడియత్నం విరమించుకుని టీడీపీ నేతలు పట్టణ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. అంతకు మునుపు పచ్చదనం- పరిశుభ్రత కోసం రాజీలేకుండా కృషి చేస్తున్న ఎమ్మెల్యేపై కేసు ఎలా నమోదు చేస్తారు... చెత్తను తొలగించమని చెప్పడమూ తప్పేనా.. శుచీశుభ్రత సామాన్యులకేనా.. అధికారులకు వర్తించదా.. అంటూ మున్సిపల్ చైర్పర్సన్ వెంకటలక్ష్మి, వైస్ చైర్మన్ జిలాన్‌బాషా, టీడీపీ నాయకులు సూర్యముని, జగదీశ్వరరెడ్డి, ఎస్.వి.రవీంద్రారెడ్డి, అయాబ్బాషా, ఫయాజ్ బాష, మున్సిపల్ మాజీ చైర్మన్ ఇ.సి.వెంకటరమణ, కౌన్సిలర్లు, కార్యకర్తలతోపాటు ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు ప్లకార్డులు చేతపట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేపై కేసును ఎత్తివేయాలని పలువురు నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విచారణ చేపట్టి న్యాయం చేస్తామని అడిషనల్ ఏఎస్పీలు మాల్యాద్రి, అభిషేక్ మహంతి, డీఎస్పీ నాగరాజు హామీ ఇవ్వడంతో నాయకులు శాంతించి ఆందోళన విరమించారు. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం ఎస్బీఐ మెయిన్ బ్రాంచి చీఫ్ మేనేజర్ మంజుల పట్టణ ఎస్ఐని కలిసి తాను బ్యాంకుకు భద్రత కల్పించాలని మాత్రమే కోరానని, ఎమ్మెల్యేపై ఫిర్యాదును వెనక్కు తీసుకుంటున్నాని వనతి పత్రం సమర్పించారు. పోలీసుల వైఖరితోనే వివాదం ఎస్బీఐ వివాదానికి మూలకారణం పోలీసుల వైఖరేనని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. తనపై ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా ఉన్నతాధికారుల ఆదేశాలంటూ స్థానిక పోలీసులు కేసు నమోదు చేయడం వారి అత్యుత్సాహానికి నిదర్శనమన్నారు. తాడిపత్రి మున్సిపాల్టీ అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. పోలీసుల తీరుపై ఎస్పీని కలుస్తానన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు
(తాడిపత్రి నుంచి శివారెడ్డి, సాక్షిటీవీ) అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రిలో మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్బీఐ మేనేజర్ మంజులను దూషించిన సంఘటనపై టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో ఎస్బీఐ బ్యాంకుల ముట్టడికి జేసీ అనుచరులు యత్నించటంతో పోలీసులు భారీగా బలగాలను రప్పించారు. ఈ సందర్భంగా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళితే... నాలుగు రోజుల క్రితం తాడిపత్రిలో ఎస్బీఐ ఏటీఎం వైపుగా వెళుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి...ఏటీఎం గదిలో నగదు డ్రా చేసుకున్న సందర్భంగా వచ్చిన రసీదులు, కాగితాలను గమనించారు. దాంతో ఏటీఎం సెంటర్ పరిశ్రుభంగా లేదంటూ ఎస్బీఐ మేనేజర్‌కు ఫోన్ చేశారు. అయితే ఆమె ఆ సమయంలో ఫోన్ లిప్ట్ చేయలేదు. మరోసారి కాల్ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి.... మేనేజర్ పట్ల దురుసుగా మాట్లాడినట్లు సమాచారం. దీనిపై జేసీ, మేనేజర్ మంజల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దాంతో ఆమె.... జేసీ ప్రభాకర్ రెడ్డి తనపట్ల దుసురుగా మాట్లాడటమే కాకుండా, దుర్భాషలాడరంటూ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ...ఇరువురు మధ్య రాజీ కుదర్చేందుకు ప్రయత్నించారు. అయితే అందుకు ఎస్బీఐ మేనేజర్ అంగీకరించకపోవటంతో మూడు రోజులుగా తాత్సారం చేసిన పోలీసులు ఎట్టకేలకు సోమవారం రాత్రి జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ చర్యను నిరసిస్తూ జేసీ అనుచరులు తాడిపత్రిలోని రెండు ఎస్బీఐ బ్రాంచ్‌లను ముట్టడికి యత్నించారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ ముట్టడించి జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, జేసీ అనుచరుల మధ్య వాగ్వివాదం జరిగింది. -
టచ్ స్క్రీన్ సెల్ కోసం ఉసురు తీశాడు !
కోలారు : బంగారుపేట పట్టణంలో ఈనెల 11న సంచలనం సృష్టించిన మంజుల అనే వివాహిత హత్యోదంతాన్ని పోలీసులు ఛేదించారు. కేవలం టచ్ స్క్రీన్ సెల్‌ఫోన్ కొనుగోలు చేసేందుకు అవసరమైన డబ్బు కోసం ఓ బాలుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని నిర్ధారించిన పోలీసులు ఈమేరకు బాలుడిని అరెస్ట్ చేశారు. కేజీఎఫ్ ఎస్పీ భగవాన్‌దాస్ మంగళవారం వివరాలు వెల్లడించారు. బంగారుపేట పట్టణంలోని విజయనగర కాలనీలో నివాసం ఉంటున్న బాలుడు అదే ప్రాంతంలోని ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. హతురాలు మంజుల ఇంటి ఎదుట గతంలో బాలుడి కుటుంబం నివాసం ఉండేది. పూర్వ పరిచయంతో బాలుడు ఈనెల 11న మంజుల ఇంటికి వెళ్లాడు. మంచినీరు ఇవ్వాలని కోరడంతో ఆమె లోపలకు వెళ్లింది. అదే సమయంలో లోపలకు చొరబడిన బాలుడు ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న కర్ర తీసుకొని మంజుల ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకపోయింది. బాలుడు ఆమె నోటిని అదిమిపెట్టి బ్లేడ్‌తో గొంతుకోసి హతమార్చాడు. అనంతరం బీరువాలో ఉన్న నగదు, బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. రక్తంతో తడిసిన చేతులతో వెళ్తున్న బాలుడిని చూసిన స్థానికులు ఏమైందని ప్రశ్నించగా బైక్నుంచి పడ్డానని అబద్దం చెప్పాడు. అనంతరం బాలుడు హొసకోటకు వెళ్లిపోయాడు. ఐదు రోజుల తర్వాత సేలంకు చేరుకుని మిత్రుల వద్ద ఉన్నాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలుడి కోసం గాలించి పక్కా సమాచారంతో సేలంకు వెళ్లి మంగళవారం అరెస్ట్ చేశారు. టచ్‌స్క్రీన్ సెల్‌ఫోన్ కోసం అవసరమైన డబ్బు కోసం హత్యోదంతానికి పాల్పడినట్లు బాలుడు విచారణలో అంగీకరించాడని ఎస్పీ తెలిపారు. -
పట్టపగలు మహిళ దారుణ హత్య
మృతురాలు రైల్వే కానిస్టేబుల్ భార్య బంగారు నగలతో ఉడాయింపు కోలారు : ఇంటిలో ఒంటరిగా ఉన్న వివాహితను దుండగుడు పట్టపగలు దారుణంగా హత్యచేసిన సంఘటన బంగారుపేట పట్టణంలోని అమరావతి కాలనీలో సోమవారం సంచల నం సృష్టించింది. హత్యకు గురైన యువతి రైల్వే కానిస్టేబుల్ భార్య మంజుల (23) కావడం గమనార్హం. వివరాలు... ఉదయం తన ఇద్దరు పిల్లలు పాఠశాలకు, భర్త అశోక్ విధులకు వెళ్లిపోగా మంజుల ఒంటరిగా ఉంది. మధ్యాహ్నం 12 ప్రాంతంలో ఇంటిలోకి ప్రవేశించిన దుండగుడు మంజులపై దాడికి దిగి బ్లేడుతో గొంతు కోసి హతమార్చాడు. సంఘటన స్థలంలో సుత్తి కూడా పడి ఉండటంతో అతి దారుణంగా సుత్తితో మోదిన ఆనవాళ్లు కనిపించాయి. అనంతరం బీరువాలో ఉన్న నగదుతో ఉడాయించాడు. ఇదే సమయంలో నిందితుడు ఎటువంటి భయం కనిపించకుండా సంఘటన అనంతరం కొద్ది దూరం నడుచుకుంటూ వచ్చాడు. అతడి చేతికి రక్తం అంటి ఉండటంతో ఓ వ్యక్తి ప్రశ్నించడంతో వాహనంపై నుంచి కిందపడ్డానని చెప్పి తప్పించుకున్నాడు. కొద్దిసేపు అనంతరం భర్త అశోక్ ఇంటికి వచ్చి చూడగా భార్య రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేజీఎఫ్ ఎస్పీ భగవాన్‌దాస్, డీఎస్పీ వివేకానంద, సీఐ వెంకటాచలపతి, ఎస్ఐ రవికుమార్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసు జాగిలాలతో ఆధారాలు సేకరించారు. వేలిముద్రల నిపుణులు కూడా రంగంలోకి దిగారు. అశోక్ ఫిర్యాదు మేరకు బంగారుపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందం ఏర్పాటు హంతుకుడి ఆచూకీ కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ భగవాన్ దాస్ తెలిపారు. హంతుకుడి చేతికి కూడా గాయం అయిందని, హత్య చేసిన అనంతరం నిందితుడు కిలోమీటరు పైగా నడుచుకునే వెళ్లాడని పోలీసులు ఆధారాలు సేకరించారని, త్వరలో పట్టుకుంటామని ఎస్పీ చెప్పారు. -
జిల్లా ఆస్పత్రిలో వైద్యుల మధ్య విభేదాలు
నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : అసలే వైద్యుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న జిల్లా ఆస్పత్రిలో... ఉన్న వైద్యులు వారం రోజులుగా ఒకరికొకరు వాగ్వాద పడుతున్నా రు. దీంతో రోగులకు సరైన వైద్యసేవలు అందడం లేదు. విధుల్లో కావాలనే వేధిస్తున్నారని గైనిక్ వైద్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా గత బుధవారం జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నను కలిసి లిఖిత పూర్వకంగా వారు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి వైద్యాధికారులు తమకు ఎక్కువగా బాధ్యతలు అప్పగిస్తూ కావాలని వేధిస్తున్నారని, కళాశాల ప్రొఫెసర్లుగా ఉన్న తమకు వైద్యసేవలు అందించడానికి వీలులేదని కోరుతూ లేఖలో ఆస్పత్రిలోని స్త్రీ వైద్యనిపుణులు రాజేశ్వరి, మంజుల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రికి రోగుల తాకిడి ఎక్కువగా ఉందని, ముఖ్యంగా ప్రతిరోజు 40 ప్రసవాలు చేయాల్సి వస్తుందని, ఉన్న ముగ్గురు వైద్యులు సక్రమంగా విధులకు రాకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆస్పత్రి అధికారులు పేర్కొంటున్నారు. ఇరువురి మధ్య డ్యూటీల కేటాయింపులో తరుచుగా వాగ్వాదం చోటుచేసుకుంటున్నాయి. తమకు డ్యూటీలు వేయవద్దని వైద్యురాళ్లు, డ్యూటీలు చేయాల్సిందేనని వైద్యాధికారులు పట్టుబడుతుండడంతో వీరిమధ్య వారం రోజులుగా వాగ్వాదాలు జరుగుతున్నాయి. అయితే ఫిర్యాదు అందగానే కలెక్టర్ శుక్రవారం మెడికల్ కళాశాల అధికారులను , వైద్యులను తను చాంబర్‌కు పిలిపించుకొని సమావేశం నిర్వహించారు. వైద్యులు విభేదాలు మాని రోగులకు సేవలు అందించాలని, ఒకరికొకరు ఫిర్యాదు చేసుకోవడం తగదని హెచ్చరించినట్లు తెలిసింది. ఆస్పత్రిలో గైనిక్ సేవలు అందించడానికి వైద్యురాళ్లు పనిభారం అనుకోకుండా, వీలైనంత ఎక్కువగా సేవలు అందించాలని సూచించారు. వైద్యుల కొరత తీవ్రంగా ఉన్నప్పుడు అదనం గా సేవలు అందించాలని కోరినట్లు తెలి సింది. లేకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించి నట్లు సమాచారం. కళాశాల ప్రిన్సిపాల్, ఆస్పత్రి సూపరింటెండెంట్ వైద్యుల పనితీరు నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. ఇందులో 40 మంది ప్రొఫెసర్లు హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారని తెలపడంతో కలెక్టర్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. తక్షణమే వారిని రప్పించి వైద్యసేవలు అందిచాలని ఆదేశించారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ జిజియాబాయి, ఆసుపత్రి సూపరింటెండెంట్ భీంసింగ్, పరిపాలన అధికారి నరేందర్, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. -
ఘనంగా డూండ్ వేడుకలు
కారేపల్లి, న్యూస్‌లైన్ : గిరిజన సంప్రదాయంలో వినూత్నమైన వేడుక డూండ్. భార్యలు భర్తలను కర్రలతో కొట్టడమే దీని ప్రత్యేకత. కారేపల్లి మండలం సామ్యాతండాలో సోమవారం సాయంత్రం ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆద్యంతం ఆసక్తికరంగా జరిగిన ఈ వేడుక తండాల్లో ఆనందోత్సాహాలను నింపింది. ఈ ఏడాది ఎవరింట్లో జరిగిందంటే..? ఈ యేడాది సామ్యతండాలో భూక్య శ్రీను, మంజుల దంపతుల ఇల్లు ఈ వేడుకలకు వేదికైంది. గత హోలీ తర్వాత వారికి కుమారుడు జన్మించడంతో పండుగ వారింట్లో నిర్వహించారు. ఈ వేడుక తండావాసుల్లో ఆనందోత్సాహాలను నింపడమే కాకుండా తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిందని ఆ తండా గేర్యా వాంకుడోతు తులిస్యా, భూక్య కోట్యా, గేరీనీలు వాంకుడోతు వీరమ్మ, భూక్య పరోస వివరించారు. ఈ కార్యక్రమాన్ని కులపెద్దలు వాంకుడోతు సామ్య, భూక్య సక్రియ, ఈర్యానాయక్ పర్యవేక్షించారు. డూండ్ అంటే... డూండ్ అంటే వెతకడం అని అర్థం. గత హోలీ నుంచి, ఈ ఏడాది హోలీ మధ్యకాలంలో తండాలో ఎవరి కుటుంబంలో మగపిల్లాడు జన్మిస్తాడో.. అతనిని సంప్రదాయబద్ధంగా హోలీ రోజు తెల్లవారు జామున 4 గంటలకు గేరినిలు తండాలో ఒక చోట దాచి పెడ్తారు(ఇక్కడ పురుషులను గేర్యాలు అని, స్త్రీలను గేరినిలని అంటారు.). గేర్యాలు కర్రలు చేబూని ఎక్కడ దాచారో డూన్డ్ (వెతకడం) చేస్తారు. పిల్లవాడు దొరికాకా గేర్యా, గేరినిలు కామదహనం చేసి రంగులు పులుముకుంటారు. అనంతరం సాయంత్రం మగపిల్లాడి ఇంటి వద్ద ఒక స్తూపం (గుంజ) చుట్టూ గంగాళాల్లో తినుబండరాలు ఉంచుతారు. వాటిని తాళ్లతో ఒకదానికొకటి బిగించి గేరినిలు (భార్యలు) కర్రలతో కాపలా కాస్తారు. ఇక గేర్యాలు వాటిని తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తారు. తినుబండరాల కోసం వచ్చిన గేర్యాలను కర్రలతో కొడుతూ పాటలు పాడుతూ గేరినిలు స్తూపం చుట్టూ తిరుగుతారు. ఈ క్రమంలో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపిస్తుంది. ఎవరైతే గేరినిలను చేధించుకుని ఆ గంగాళాలను ఎత్తుకొస్తారో వారిని తండాలో ధీరుడిగా గుర్తిస్తారు. అనంతరం ఆ తినుబండరాలను గేర్యా, గేరినిలు రెండు వాటాలుగా వేసుకుని కామదహనం చేసిన చోటికి వెళ్లి, దాన్ని చల్లార్చతారు. అనంతరం ఆ పక్కనే ఉన్న బీడుల్లో తినుబండరాలు ఆరగిస్తారు. దీంతో డూండ్ వేడుక ముగుస్తుంది. -
బస్సు ఢీకొని నలుగురు దుర్మరణం
చిత్రదుర్గం, న్యూస్‌లైన్ : నగర శివారులోని సీబార వద్ద గురువారం ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బైక్‌ను ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఉదయం 10 గంటల సమయంలో చిత్రదుర్గం నుంచి బైకుపై నలుగురు బెడివళ్లి గ్రామానికి వెళుతుండగా వెనుక నుంచి వస్తున్న ఓ ప్రైవేట్ (రిపబ్లిక్) బస్సు ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే నలుగురూ మృతి చెందారు. బెడివళ్లి గ్రామానికి చెందిన హనుమంతప్ప (40), అతడి భార్య మంజుళ (30), ఇద్దరు కుమార్తెలు సహన (4), పూర్ణిమ (3) చిత్రదుర్గంకు పనిమీద వచ్చి తిరిగి బైక్‌పై వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. దీంతో సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై చిత్రదుర్గం రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
గ్లామర్ క్వీన్
-
రాలిన తార
-
ప్రముఖ నటి మంజుల కన్నుమూత