Karthika Deepam Fame Paritala Nirupam, Manjula New Home Tour Video Viral - Sakshi
Sakshi News home page

Manjula Nirupam: 18 ఏళ్ల క్రితం బుక్‌ చేసిన కొత్తిల్లు.. ఇన్నాళ్లకు రెడీ అవుతోంది!

Published Fri, Mar 10 2023 2:57 PM | Last Updated on Fri, Mar 10 2023 3:39 PM

TV Actors Nirupam, Manjula New House - Sakshi

బుల్లితెర స్టార్‌ కపుల్‌ మంజుల-నిరుపమ్‌ గురించి తెలియనవారుండరు. కార్తీకదీపం సీరియల్‌తో టీఆర్పీలు కొల్లగొట్టి బుల్లితెర హీరోగా మారాడు నిరుపమ్‌. అటు ఆయన భార్య మంజుల కూడా పలు సీరియల్స్‌లో నటనతో అదరగొడుతోంది. వీరిద్దరూ జంటగా పలు టీవీ షోల్లోనూ పాల్గొంటూ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. తాజాగా వీరిద్దరూ తమకు కొత్తిల్లు ఉ‍న్న విషయాన్ని బయటపెట్టారు. అంతేకాదు మంజుల ఆ ఇంటిని అంతా కలియతిరిగి చూపించింది. ప్రస్తుతం ఇంటీరియర్‌ డిజైన్‌ పనులు నడుస్తుండగా అంతా పూర్తవగానే ఈ ఇంటికి షిఫ్ట్‌ కానున్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా నిరుపమ్‌ మాట్లాడుతూ.. 'ఈ ఇల్లు నాన్నగారు బుక్‌ చేశారు. సినీకార్మికుల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన హౌసింగ్‌ సొసైటీ ద్వారా ఈ ఇల్లు వచ్చింది. నాన్న లేకపోవడంతో అది నాకు ట్రాన్స్‌ఫర్‌ అయింది. అది బుక్‌ చేసి దాదాపు 15-18 ఏళ్లు అవుతుంది. ముందు 3 BHK అనుకున్నారు, తర్వాత దాన్ని డూప్లెక్స్‌ ఫ్లాట్‌గా అప్‌డేట్‌ చేశారు. అలా అనేక కారణాల వల్ల పని ఆలస్యమవుతూ వచ్చింది. ఇన్నాళ్లకు ఇల్లు పూర్తవడానికి వచ్చింది' అని చెప్పాడు. కాగా నిరుపమ్‌, మంజుల చంద్రముఖి అనే సీరియల్‌లో లీడ్‌ రోల్స్‌ పోషించారు. ఈ ధారావాహిక చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోగా వీరికి ఓ బాబు జన్మించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement