కుమార్తెకు ఇష్టం లేని వ్యక్తితో వివాహ ప్రయత్నం | attempt to daughter Marriage with a man who does not like | Sakshi
Sakshi News home page

కుమార్తెకు ఇష్టం లేని వ్యక్తితో వివాహ ప్రయత్నం

Published Mon, May 30 2016 2:43 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

attempt to daughter Marriage  with a man who does not like

తనయురాలితో కలిసి   భార్యను హత్య చేసిన భర్త

 

బెంగళూరు(బనశంకరి) : కుమార్తెకు ఇష్టం లేని వ్యక్తితో వివాహం చేసేందుకు యత్నించిన భార్యను తనయురాలితో కలిసి భర్త హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇంటి వెనుక పూడ్చి పెట్టారు. ఈ ఉదంతం ఆదివారం నగరంలో వెలుగు చూసింది. హెబ్బడగెరెలో తిమ్మయ్య, మంజుల(55) నివాసం ఉంటున్నారు. వీరికి పవిత్ర, రాణి అనే కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె పవిత్ర భర్త ఓ నేరం కేసులో జైలు పాలు కాగా పవిత్ర తల్లివద్దనే ఉంటోంది. రెండో కుమార్తె రాణి ఓ యువకుడిని ప్రేమించింది. అతనితో వివాహం చేయాలని కోరగా తల్లి అంగీకరించలేదు.


మరో వ్యక్తితో వివాహం చేయాలని నిర్ణయించింది. ఇది భర్తకు  కూడా ఇష్టం లేదు. దీంతో తిమ్మయ్య తన భార్యను అంతమొందించేందుకు పథకం రూపొందించాడు. ఈమేరకు రాణితో కలిసి మంజులను హత్య చేసి ఇంటి వెనుక పూడ్చి పెట్టారు. తన తల్లి కనిపించడం లేదని పెద్ద కుమార్తె ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి రాణి, తిమ్మయ్యను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. తామే మంజులను హత్య చేసినట్లు నిర్ధారించడంతో ఆదివారం ఘటనా స్థలానికి చేరుకొని మంజుల మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం  కోసం ఆస్పత్రికి తరలించి నిందితులను అరెస్ట్ చేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement