సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లో మహిళ దారుణ హత్య సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక, మృతురాలిని రాళ్లకు చెందిన మంజులగా పోలీసులు గుర్తించారు. ఇక, ఈ కేసుపై శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. రుజ్వానానే మంజులను తన చీరతో ఉరివేసి చంపినట్టు తెలిపారు.
కాగా, కేసు వివరాలను డీసీపీ శనివారం మీడియాకు వివరించారు. ఈ సందర్బంగా డీసీపీ నారాయణ మాట్లాడుతూ.. ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి మహిళ మృతదేహాన్ని గుర్తించాం. చనిపోయిన మహిళను వడ్ల మంజులుగా గుర్తించడం జరిగింది. రెండు రోజుల కిందట మంజుల కడుపునొప్పి వస్తుందని శంషాబాద్ ఆస్పత్రికి వెళ్తున్నట్లు భర్తకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. తిరిగి రాకపోవడంతో శుక్రవారం సాయంత్రం ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భర్త చెప్పిన పోలికలు, ఘటనా స్థలం వద్ద మృతదేహంతో సరిపోలడంతో.. హత్యకు గురైందని మంజులగా గుర్తించాము. అయితే, మంజుల హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణం. మంజుల రిజ్వానా బేగం అనే మహిళకు లక్ష రూపాయాలు అప్పుగా ఇచ్చింది. ఈ డబ్బుల వ్యవహారం వివాదంతోనే మంజులను రిజ్వానా హత్య చేసింది. ముందుగా మంజుల కళ్లలో కారంతో రిజ్వానా కారంతో దాడి చేసింది. మంజుల చీర కొంగుతో రిజ్వానా మెడ గట్టిగా పట్టకుని ఉరివేసి హత్య చేసింది.
అనంతరం, పెట్రోల్‌తో మంజుల మృతదేహాన్ని రిజ్వానా కాల్చి చంపింది. 24 గంటల్లోనే కేసును చేధించాం. ఈ కేసులో రిజ్వానా బేగంను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తాము. ఒక్క రిజ్వానానే ఇదంతా చేసింది. మంజుల చనిపోయిన తర్వాత ఆమె మెడలో ఉన్న బంగారం చెవుల రింగ్స్ రిజ్వానా దొంగతనం చేసింది. అనంతరం వాటిని ముత్తూట్ ఫైనాన్స్‌లో రిజ్వానా తాకట్టు పెట్టింది. ఈ క్రమంలో భర్తతో కలిసి అజ్మీర్ వెళ్లిపోవడానికి రిజ్వానా టికెట్స్ కూడా బుక్ చేసింది అని తెలిపారు.
ఇది కూడా చదవండి: జగిత్యాల గొల్లపెల్లిలో విషాదం: బాలికను బలిగొన్న పిచ్చి కుక్క
Comments
Please login to add a commentAdd a comment