remand report
-
రామరాజ్యం ఆర్మీ కేసు.. వెలుగులోకి సంచలన అంశాలు
సాక్షి, వికారాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్‌పై దాడి కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. రామరాజ్యం ఆర్మీ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. రిమాండ్ రిపోర్ట్‌లో పలు అంశాలను పోలీసులు మెన్షన్ చేశారు. కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఆర్మీ ఏర్పాటైంది. రామరాజ్యం ఆర్మీ ఏర్పాటు పేరుతో మొదటి స్లాట్‌లో 5000 మందిని రిక్రూట్ చేసుకోవాలని ప్లాన్ చేశారు.రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రామరాజ్యం ఆర్మీకి 1,20,599 రూపాయల డొనేషన్లు వచ్చాయి. 20 నుంచి 50 సంవత్సరాలలోపు వారికి మాత్రమే రామరాజ్యం ఆర్మీలో సభ్యత్వం ఇస్తున్నారు. ప్రతి నెల 20 వేల రూపాయల జీతంతో పాటు వసతి సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చిన రామరాజ్యం ఆర్మీ.. గత ఏడాది సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు రిజిస్ట్రేషన్లు చేసింది. రిజిస్ట్రేషన్‌కు రూ.350 రుసుము వసూలు చేస్తున్నట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు వెల్లడించారు.ఆర్పీసీ 340ను న్యాయ వ్యవస్థలోని కొందరు నిర్లక్ష్యం చేశారని రామరాజ్యం ఆర్మీ వాదన. దీని ద్వారా ఆలయాలకు చెందిన లక్షల ఎకరాల భూములు కబ్జాకు గురవుతున్నాయని.. న్యాయవ్యవస్థ కేవలం క్రిమినల్స్‌కే తప్ప సామాన్యులకు కాదంటూ రామరాజ్యం ఆర్మీ వాదన వివినిస్తోంది. ఐదు కిలోమీటర్ల నడవగల శక్తి ఉన్నవారికి మాత్రమే ఆర్ఆర్ ఆర్మీలో చేరేందుకు అర్హతగా నిర్ణయించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు.కాగా, ఇప్పటికే ప్రధాన నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు సోమవారం మరో ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. రామరాజ్యం సైన్యం ఏర్పాటు, చేపడుతున్న కార్యాకలాపాలను పూర్తి స్థాయిలో గుర్తించారు. కేసుకు సంబంధించిన విషయాలను రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ సోమవారం మీడియాకు వివరించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పురుకు చెందిన కొవ్వురి వీర రాఘవరెడ్డి 2022లో ఫేస్బుక్ వేదికగా రామరాజ్యం సంస్థను ప్రారంభించాడు. హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి రామరాజ్యం సైన్యంలో చేరేలా ప్రజలను ప్రేరేపించాడు. రిజిస్టర్ చేసుకున్నవారికి రూ.20 వేలు వేతనం ఇస్తామని ప్రకటించాడు. ఈ ప్రకటనకు 25 మంది స్పందించి రామరాజ్యం సైన్యంలో చేరారు.ఈ నెల 7న మూడు వాహనాల్లో, 25 మంది సభ్యులతో కలిసి వీర రాఘవరెడ్డి చిలుకూరు దేవాలయం వద్దకు వచ్చాడు. అర్చకుడు రంగరాజన్ ఇంట్లోకి వెళ్లి రామరాజ్యం సైన్యానికి వ్యక్తులను పంపాలని, ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దానికి రంగరాజన్ అంగీకరించకపోవడంతో అతనిపై దాడి చేశారు. దీనిపై రంగరాజన్ ఈ నెల 8న మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతనికి కోర్డు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసులో సోమవారం ఖమ్మం జిల్లాకు చెందిన రామరాజ్యం సైన్యంలోని సభ్యులు శిరీష, రాణి, గోపాల్, శ్రీను, నిజామాబాద్ జిల్లాకు చెందిన సాయినాథ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. -
‘సైఫ్’పై దాడి చేసింది ఒక్కడు కాదా..? రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు
ముంబయి:బాలీవుడ్ నటుడు సైఫ్‌అలీఖాన్‌పై దాడి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సైఫ్‌పై దాడి కేసులో అరెస్టయిన బంగ్లాదేశ్ జాతీయుడు షరిఫుల్ ఇస్లామ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ దాడిలో ఇస్లామ్ ఒక్కడే కాకుండా మరికొందరి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇస్లామ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.ఈ కేసులో జనవరి 19న ఇస్లామ్‌ను పోలీసులు ముంబయిలోని థానెలో అరెస్టు చేశారు. ఇస్లామ్‌కు కోర్టు జనవరి 29దాకా కస్టడీ విధించింది. తమ విచారణలో ఇస్లామ్ నోరు విప్పడం లేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.దాడి జరిగిన రోజు సైఫ్ ఇంట్లో ఉన్న అందరు పనివాళ్లు వేసుకక్ను బట్టలను ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరారు. కేవలం సైఫ్ రక్తమే వాటిపై ఉందా ఇంకెవరిదైనా ఉందా అనే విషయం తెలుసుకోవడానికి పోలీసులు పనివాళ్ల దుస్తులను కోరినట్లు తెలుస్తోంది.ఇక ఇస్లామ్‌కు సిమ్‌కార్డు అందించిన జహంగీర్ షేక్ అనే వ్యక్తి కోసం ముంబయి పోలీసులు ఆదివారం(జనవరి26) కోల్‌కతా వెళ్లారు. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన తర్వాత ఇస్లామ్ కొన్ని రోజులపాటు కోల్‌కతాలో ఉన్నట్లు పోలీసులు కనిపెట్టారు.కాగా, జనవరి 16వ తేదీ రాత్రి 2 గంటలకు సైఫ్‌అలీఖాన్‌పై ముంబై బాంద్రాలోని అతడి ఇంట్లోనే దుండగుడు దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్‌కు ఆరు కత్తిపోటు గాయాలయ్యాయి. ఈ గాయాలకు చికిత్స తీసుకున్న సైఫ్ ఇప్పటికే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తనపై దాడికి ముందు పనిమనిషిపై దాడి చేసిన దుండగుడు తనను కోటి రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్లు సైఫ్ ఇప్పటికే పోలీసులకు తెలిపారు. -
తెలంగాణలో హీటెక్కిన రాజకీయాలు
-
లగచర్ల దాడి కేసు: రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్‌లోని లగచర్లలో కలెక్టర్‌పై దాడి కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ దాడి కేసులో ఏ1గా బోగమోని సురేష్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 16 మందిని అరెస్ట్ చేయగా.. మరో 30 మంది పరారీలో ఉన్నట్టు రిపోర్టులో పోలీసులు తెలిపారు.కలెక్టర్‌పై దాడి కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టు ఇలా.. ఈ దాడికి సంబంధించి బూంరాస్‌పేట్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు. 153/2024 క్రైం నెంబర్ కేసు.. సెక్షన్ 61(2), 191(4),132,109,121(1) 126(2)324 r/w190BNS Sec 30Of pdpp act, 128Of bnss కింద కేసులు నమోదయ్యాయి. అలాగే.. హత్యాయత్నం, అసాల్టింగ్, ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం వంటి నాన్ బెయిలబుల్ కూడా కేసులు నమోదు. వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ దాడి కేసులో మొత్తం 46మందిని నిందితులుగా చేర్చారు.ఇదీ చదవండి: నరేందర్ రెడ్డిని తొక్కేయాలని రేవంత్ కుట్రఎఫ్ఐఆర్లో బోగమోని సురేష్‌ను ప్రధాన నిందితుడుగా(ఏ1) పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 16మందిని అరెస్ట్ చేయగా.. మరో 30 మంది పరారీలో ఉన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే నిందితులు దాడిచేశారు. రాళ్లు, కర్రలు, కారంపొడి ముందే సిద్ధం చేసుకున్నారు. అధికారులు వచ్చిన వెంటనే దాడి చేయాలని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశాడు A1 నిందితుడు సురేష్. అరెస్ట్ అయిన నిందితులకు 14 రోజులపాటు రిమాండ్ విధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేష్ పాటు 29 మంది పరారీలో ఉన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు గాయాలయ్యాయి. ప్రభుత్వ వాహనాలు ధ్వంసం చేశారు. దాడి కేసులో నిందితుడు సురేష్ కీలకంగా మారాడు. సురేష్ ప్లాన్ ప్రకారమే కలెక్టర్‌ను లగచర్లకు తీసుకెళ్లాడు’ అని పోలీసులు పేర్కొన్నారు. ఇదీ చదవండి: లగచర్ల ఘటన: మార్నింగ్ వాక్‌లో పట్నం అరెస్ట్ -
జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
-
జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టు
-
నార్సింగి డ్రగ్స్ కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు
సాక్షి, హైదరాబాద్: నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మొత్తం 20 మంది నిందితులు కాగా, వారిలో ఏడుగురు పెడ్లర్లు, 13 మంది కన్యుమర్లు.. ఏ 10గా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్‌ను పోలీసులు చేర్చారు.నైజీరియా-ఢిల్లీ-హైదరాబాద్-ఏపీ లోని పలు ప్రాంతాలకు డ్రగ్స్‌ను చేరవేస్తున్నారు. ఎబుకా, బ్లెస్సింగ్, ఫ్రాంక్లిన్, అజీజ్, గౌతం, వరుణ్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. వరుణ్, గౌతం, షరీఫ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ దందా సాగుతోంది. పెడ్లర్లను ఆర్థికంగా ఆదుకుంటున్న నైజీరియన్లు.. వారికి కావాల్సిన డబ్బును అరేంజ్ చేసి డ్రగ్ సరఫరాకు ప్రోత్సహిస్తున్నారు. డ్రగ్స్ సరఫరాకు కింగ్‌పిన్‌గా నైజీరియాకు చెందిన ఎబుకాగా పోలీసులు పేర్కొన్నారు. ఎబుకా నుండి బ్లెస్సింగ్ అనే మరో నైజీరియన్ ద్వారా ఇండియాలోని రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు 20 సార్లు హైదరాబాద్‌లో డ్రగ్స్ సప్లై చేసినట్టు బ్లెస్సింగ్ అంగీకరించాడు. గౌతమ్ అనే డ్రగ్ పెడ్లర్ ద్వారా రాజమండ్రి, హైదరాబాద్, ప్రకాశం జిల్లాకు డ్రగ్స్ చేరుతున్నాయి.9 నెలల్లో 10 లక్షల రూపాయలను కమిషన్ రూపంలో డ్రగ్ పేడ్లర్ గౌతంకు నైజీరియన్ ముట్టచెప్పాడు. బండ్లగూడలో ఉన్న లుంబిని కమ్యూనికేషన్స్ ద్వారా డబ్బులు చెల్లించారు. వరుణ్ నుండి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, గచ్చిబౌలిలోని కస్టమర్లకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. తన స్నేహితురాలి పేరును తన పేరుగా బ్లెస్సింగ్ మార్చుకుంది. తండ్రి బస్సు డ్రైవర్ కావడంతో ఆర్థిక సమస్యలు కారణంగా ఇంటర్ వరకు చదువుకున్నాడు. 2017లో ఫేస్ బుక్‌లో బ్లెస్సింగ్ అనే మహిళతో పరిచయం అయ్యింది. బెంగుళూరు వచ్చి బ్లెస్సింగ్ అనే స్నేహితురాలి బట్టల దుకాణంలో ఒనుహా పని చేశాడు. -
బీజేపీ అగ్రనేతల ఫోన్లను ప్రణీత్ టీం ట్యాప్ చేసింది: రాధాకిషన్
-
రిమాండ్ రిపోర్ట్..బోండా ఉమా బ్యాచ్ స్కెచ్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు బయటకు..
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావు అండ్ టీమ్ అక్రమాలు బయటపడుతున్నాయి. రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు మద్దతుగా ఇతర పార్టీల నేతలకు సంబంధించిన డబ్బును పట్టుకోవడానికి ఫోన్ ట్యాపింగ్‌ను రాధాకిషన్‌రావు ఆయుధంగా ఉపయోగించుకున్నట్లు ఇప్పటికే పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. అయితే బీఆర్ఎస్కు అనుకూలంగా డబ్బు తరలించే వ్యవహారంలోనూ రాధాకిషన్‌రావు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల తాజా దర్యాప్తులో బయటపడింది.ఈ ప్రక్రియలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డికి చెందిన డబ్బును ఎక్కువగా తరలించినట్లు తేలింది. రాధాకిషన్‌రావు డబ్బు తరలించేందుకు అప్పట్లో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ టీంలో పనిచేస్తున్న ఓ ఎస్సైని ఎంచుకున్నారు. ఆయనకు ప్రత్యేకంగా ప్రభుత్వ బొలేరో వాహనాన్ని సమకూర్చి అందులోనే పెద్దఎత్తున నగదును తరలించారు. భారాస ఎమ్మెల్సీ, విశ్రాంత ఐఏఎస్ వెంకట్రామిరెడ్డ్డికి చెందిన డబ్బు తరలింపు వాహనాలకు రాధాకిషన్‌రావు ఆదేశాలతో ఎస్సై పలుమార్లు ఎస్కార్ట్‌గా వ్యవహరించారు. తెల్లాపూర్‌లోని రాజ్‌పుష్ప గ్రీన్డేల్ విల్లాస్‌లో వెంకట్రామిరెడ్డి ఇంటి సమీపంలో ఉండే శివచరణ్‌రెడ్డి అలియాస్ చరణ్‌ను కలవాలని రాధాకిషన్‌రావు ఎస్సైకి సూచించారు. అనంతరం శివచరణ్‌రెడ్డి కొత్త ఐఫోన్‌ను, సిమ్‌కార్డును తీసుకొచ్చి ఎస్సైకి అప్పగించారు రాధాకిషన్‌రావు. నగదు తరలింపు వ్యవహారాల గురించి రాధాకిషన్‌రావు ఆ ఫోన్‌కే కాల్ చేస్తూ ఎస్సైకి ఆదేశాలిచ్చేవారు. డబ్బులకు ఎస్కార్ట్ ఇచ్చి మరీ డెలివరీ చేశారు. సికింద్రాబాద్‌లో ఉండే మాజీ ఎస్పీకి సైతం డబ్బుల రవాణాలో పాత్ర ఉంది. ఆ ఎస్సై పలు సార్లు రూ. 3 కోట్ల డబ్బులు తరలించారు. డబ్బులు తరలించిన ఎస్ఐ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావు ఆదేశాలతో రాజకీయ నాయకులపై నిఘా కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. రాజకీయ నాయకులపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభాకర్‌కి రాధాకిషన్‌రావు చేరవేశారు. ప్రణీత్ రావు ఇచ్చే సమాచారంతో రాధా కిషన్ నిఘాను పెట్టారు. రాధాకిషన్ సహకరించిన ఎస్సైలు, ఇన్స్పెక్టర్లను తోపాటు మాజీ పోలీసు అధికారులను పోలీసులు విచారించనున్నారు. పలువురు రాజకీయ నేతల విచారణకు రంగం సిద్దం చేశారు. -
కవిత రిమాండ్ పొడిగింపు?
-
ముక్కలు చేసి.. మూసీలో పడేసి!
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీలోని స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) ద్వారా జరిగిన అక్రమ ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టు అయిన అదనపు ఎస్పీల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలను ఐదు రోజులపాటు పోలీసు కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఫలితంగా ట్యాపింగ్‌తో పాటు ఆధారాల ధ్వంసానికి సంబంధించిన సమాచారం సేకరించారు. ఈ వివరాలను పోలీసులు తమ రిమాండ్ రిపోర్టు ద్వారా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భుజంగరావు, తిరుపతన్నలు తమ నేరం అంగీకరించారని, ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు ఆదేశాలతోనే నేరం చేసినట్టు బయటపెట్టారని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. మంగళవారం వీరిద్దరిని గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి శనివారం వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించగా, చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రణీత్‌రావు దారికి వచ్చాడంటూ... ఈ కేసులో తొలి అరెస్టు ఎస్ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావుదే. తొలుత పోలీసు విచారణకు అతడు సహకరించలేదని, అయితే రానురాను సహకరిస్తూ కీలక వివరాలు వెల్లడించారని పోలీసులు కోర్టుకు తెలిపారు. ప్రభాకర్‌రావు రాజీనామా చేసిన రోజే (గత ఏడాది డిసెంబర్ 4న) ఆయన ఆదేశాల మేరకు ప్రణీత్‌రావు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న టీఎస్ఎస్పీ హెడ్‌కానిస్టేబుల్ కైతోజు కృష్ణతో కలిసి ఎస్ఐబీ కార్యాలయంలోకి వెళ్లారు. అక్కడ తాను ఏర్పాటు చేసుకున్న వార్ రూమ్‌తోపాటు అధికారిక ట్యాపింగ్స్ జరిగే లాగర్ రూమ్ దగ్గర సీసీ కెమెరాలు ఆఫ్ చేయించాడు. వార్‌రూమ్‌లోని 17 కంప్యూటర్లలో ఉన్న వాటితోపాటు విడిగా భద్రపరిచిన 50 హార్డ్‌డిస్క్ లను ధ్వంసం చేయడానికి ఉపక్రమించాడు. తనతో వచ్చిన ఎల్రక్టీషియన్తోపాటు నమ్మినబంటుగా ఉన్న ఓ పోలీసు సహాయంతో ఎలక్ట్రిక్ కట్టర్ వినియోగించి ఈ హార్డ్‌డిస్క్‌లు ముక్కలు చేశాడు. వీటి శకలాలను నాగోలు వద్ద మూసీనదిలో పారేశాడు. ఈ విషయాలు వెలుగులోకి రావడంతోనే అప్రమత్తమైన సిట్ అధికారులు మూసీలో సోదాలు చేశారు. వీరికి ధ్వంసమైన హార్డ్‌డిస్క్ కేసులు 5, హార్డ్‌డిస్క్ ముక్కలు తొమ్మిది లభించాయి. వీటితో పాటు తాము మూసీ నుంచే ఆరు మెటల్ హార్డ్‌డిస్క్ ముక్కల్నీ సీజ్ చేశామని కోర్టుకు తెలిపారు. ఎస్ఐబీ కార్యాలయం నుంచి ఆధారాలు ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగా సిట్ అధికారులు మూసీనది నుంచే కాకుండా గ్రీన్‌లాండ్స్‌లోని ఎస్ఐబీ కార్యాలయం, దాని ఆవరణ, పరిసరాల నుంచి కొన్ని ఆధారాలు, భౌతిక సాక్ష్యాలు సేకరించారు. అక్రమ ట్యాపింగ్‌కు వినియోగించిన 12 కంప్యూటర్లు, 7 సీపీయూలు, ల్యాప్‌టాప్, మానిటర్లు, పవర్ కేబుళ్లు స్వాదీనం చేసుకున్నారు. అక్కడ ఉన్న ఎలక్ట్రిషియన్ గదిలో క్లూస్, ఫోరెన్సిక్ అధికారులతో కలిసి సోదాలు చేసిన సిట్ హార్డ్‌డిస్క్‌లు కట్ చేస్తున్నప్పుడు కింద పడి, మూలలకు చేరిన వాటి పొడిని సీజ్ చేశారు. ఎస్ఐబీ కార్యాలయ ఆవరణలో పాక్షికంగా కాలిన డాక్యుమెంట్లు, స్పైరల్ బైండింగ్ చేసిన పత్రాలతో పాటు సీసీ కెమెరాల ఫుటేజీకి సంబంధించిన లాగ్‌బుక్ ప్రతులను పోలీసులు సేకరించారు. ఎస్ఐబీ కానిస్టేబుల్ కొత్త నరేష్ గౌడ్ నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. టి.ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ప్రతిపక్షాలపై తాము నిఘా పెట్టినట్టు అతడు బయటపెట్టాడు. ప్రధానంగా ప్రైవేట్ వ్యక్తులపై అక్రమ నిఘా ఉంచడంలో భుజంగరావు, తిరుపతన్న కీలకంగా వ్యవహరించారని, ఈ విషయాన్ని వారు అంగీకరించారని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. -
ట్యాపింగ్ ఫైల్స్..రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు
-
ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్, భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్ట్ బహిర్గతమైంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు చెబితేనే చేశామని ప్రణీత్, భుజంగరావు, తిరుపతన్న తెలిపారు. 7 రోజుల విచారణలో ప్రణీత్‌రావు కీలక విషయాలు బయటపెట్టారు. కాగా, ఈ కేసులో ప్రభాకర్‌రావును ఏ1గా పోలీసులు చేర్చారు. ఏ1 ప్రభాకర్‌రావు, ఏ2 ప్రణీత్‌రావు, ఏ3 రాధాకిషన్, ఏ4 భుజంగరావు, ఏ5 తిరుపతన్న, ఏ6 ప్రైవేట్ వ్యక్తి పేరును పోలీసులు చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావే కీలక సూత్రధారిగా తేలింది. ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు నిర్థారించారు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ డివైజ్‌లను ప్రణీత్‌రావు ధ్వంసం చేశాడు. ప్రణీత్‌రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెడిపోయిన ట్యాపింగ్ డివైజ్‌ను పోలీసులు రిట్రీవ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఏముంది? భుజంగరావు, తిరపతన్న ఇచ్చిన నెంబర్లను ప్రణీత్ ట్యాప్ చేశారు. ఎన్నికల సమయంలో వందలాది రాజకీయ నేతలు, వారి కుటుంబసభ్యుల ఫోన్లను ట్యాప్ చేశానని, రాజకీయ నేతలు కదలికలు, నిధుల సమీకరణపై దృష్టిపెట్టానని ప్రణీత్‌రావు వెల్లడించాడు. వ్యాపారవేత్తలతో పాటు సమాజంలో పేరు ఉన్న వారి ఫోన్లను కూడా టాప్ చేశాం. ట్యాపింగ్ సంబంధించిన మెయిన్ డివైజ్‌ని పూర్తిగా ధ్వంసం చేశాను. 17 కంప్యూటర్లలో ఉన్న హార్డ్ డిస్క్‌లు అన్నిటిని ధ్వంసం చేశాను. హార్డ్ డిస్కులు ప్రధాన డివైజ్‌ని కట్టర్‌తో ముక్కలు ముక్కలుగా కట్ చేశాం. ముక్కలుగా చేసిన హార్డ్ డిస్క్‌లు, డివైజ్‌లు తీసుకువెళ్లి మూసీ నదిలో పడవేశాం. రెండు లాకర్ రూములలో ఉన్న డాక్యుమెంట్లు అన్నిటిని తగలబెట్టామని ప్రణీత రావు వెల్లడించాడు. బీఆర్ఎస్ కీలక నేత ఇచ్చిన నెంబర్లను ట్యాప్‌చేశానని.. ప్రణీత్ ఇచ్చిన సమాచారాన్ని బీఆర్ఎస్ కీలక నేతకు చేరవేశామని భుజంగరావు చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు చాలా మంది రాజకీయ నేతల ఫోన్లను కుటుంబ సభ్యుల నెంబర్లను టాప్ చేశామని తెలిపారు. మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు ఇచ్చే నంబర్లను ప్రణీత్‌కి ఇచ్చానని తిరుపతన్న వెల్లడించారు. హైదరాబాద్ సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు డీసీపీ షేర్ చేశాడు. డీసీపీ చెప్పిన నంబర్లతో పాటు కొంతమంది కదలికలను ట్రాక్ చేశామని తిరుపతన్న తెలిపారు. ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్‌రావే కీలక సూత్రధారి -
సాక్షీ టీవీ చేతిలో గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్
-
సాక్షిటీవీ చేతిలో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్
-
శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు
-
చంద్రబాబు వాదన సరైంది కాదు: సీఐడీ
-
చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
-
Babu in Jail : చంద్రబాబు రిమాండ్ ఆర్డర్లో కీలకాంశాలు
స్కిల్‌స్కామ్ కేసులో విజయవాడ ACB ప్రత్యేక కోర్టు.. చంద్రబాబు రిమాండ్ ఆర్డర్ కాపీలో కీలక అంశాలను ప్రస్తావించింది. చంద్రబాబునాయుడిని కోర్టు ముందు హాజరు పరిచినప్పుడు CID అధికారులు కేసుకు సంబంధించి పూర్తి రికార్డులు, 700 పేజీలలో సమర్పించారని నివేదికలో తెలిపింది. నంద్యాలలో సెప్టెంబర్ 9, 2023, శనివారం రోజు 6గంటలకు చంద్రబాబును అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. చంద్రబాబు అవినీతికి ఆధారాలు ఇవే.. 👉: 30.1.2015న స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్‌ను ఉన్నత విద్యా మండలి ద్వారా నడిపించేందుకే సుబ్బారావును ఎక్స్ అఫిషియో సభ్యునిగా నియమించిన చంద్రబాబు అవినీతికి తెరలేపారు. 👉: ఈ కేసులో కీలక పాత్ర పోషించిన సీమెన్స్ డైరెక్టర్ జీవీఎస్ భాస్కర్ సతీమణి అపర్ణను స్కిల్ డెవలప్మెంట్ కార్పేరేషన్లో డిప్యూటి సీఈఓగా నియమించారు. ఈమెను మూడునెలల ముందే ప్రజంటేషన్లో భాగస్వామ్యం చేయడంతో పాటు ప్రాజెక్టు వివరాలన్నీ అపర్ణకు షేర్ చేశారు. 👉: రూల్సుకు విరుద్ధంగా… సీమెన్స్ నుంచి 90శాతం నిధులు రాకుండానే నేరుగా ప్రభుత్వం వాటా అయిన 10శాతం నిదులు మొత్తం 371కోట్లు రిలీజ్ చేయాల్సిందిగా కార్యదర్శి పివి రమేష్, చీఫ్ సెక్రటరీని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సాక్ష్యధారాలు మాయం చేసిన చంద్రబాబు… 👉: డిజైన్‌టెక్ వ్యవహారం బయటకు రావడంతో చంద్రబాబు అండ్ కో సాక్ష్యాధారాలను మాయం చేసింది. ఏకంగా 30.06.2016న విడుదలైన జీవో నెంబర్-4కు సంబంధించిన ఒరిజినల్ నోట్ ఫైల్‌ను సుబ్బారావు OSD NVK ప్రసాద్(ఏ-5) ద్వారా మాయం చేశారు. 👉: ఈ కేసులో నిధులు కొల్లగొట్టేందుకు… 20.10.2014న స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చార్టెడ్ అకౌంటంట్గా లక్ష్మినారాయణ(A-4) బంధువు వెంకటేశ్వర్లును జీవో నెంబర్- 48 ద్వారా నియమించారు చంద్రబాబు విచారణను అడ్డుకునే ప్రమాదం ఉంది… 👉: చంద్రబాబు తన పరపతితో విచారణను అడ్డుకునే ప్రమాదం ఉంది. సాక్షులను బెదిరించి దర్యాఫ్తును ప్రబావితం చేసే ప్రమాదం ఉంది. 👉: చంద్రబాబు రిమాండ్ తరలించి దర్యాఫ్తు సజావుగా జరిగిలే చూడాల్సిన అవసరం ఉందని సీఐడీ కోరింది. 👉: ఈ కేసులో అధికారులతో పాటు ఇతర సాక్ష్యులతో మరింత సమాచారం సేకరించాల్సి ఉంది. 👉: చంద్రబాబునాయుడు తన అధికారం అడ్డుపెట్టుకుని 279కోట్ల నిధులు మాయం చేసిన కేసులో ప్రధాన నిందితుడు. చంద్రబాబు వాదనలపై… 👉: కేవలం రాజకీయ కారణాలతోనే తనను అరెస్టు చేసినట్లు చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కక్ష్యసాధింపులో భాగంగానే అరెస్టు చేశారని వాదించారు. కాని దర్యాప్తు అధికారులు సమర్పించిన ఆధారాలనూ చూస్తే పూర్తి సాంకేతిక ఆధారాలు సెక్షన్ 167కింద రిమాండ్ చేశారని అర్ధమవుతోంది. 👉: రాజకీయ కక్ష్య కారణమన్నది పూర్తిగా అసంబద్ధం. 👉: ఇది అవినీతి నిరోదక శాఖ కాబట్టి సీఐడికి విచారణ పరిధిలేదన్న చంద్రబాబు వాదన సరైంది కాదు. గతంలో హైకోర్టు చాలా కేసుల్లో సీఐడికి అధికారాలున్నాయని డిక్లరేషన్ ఇచ్చింది. 👉: అవినీతి నిరోదక కేసులను పీసీ యాక్ట్ కింద సీఐడీ నేరుగా విచారణ చేయవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. 👉: ప్రజాప్రతినిధుల చట్టాన్ని ఉల్లంఘించి తనకు సంక్రమించిన అధికారాలను దుర్వినియోగం చేసి 279కోట్లను అక్రమంగా అవినీతి చేసి ప్రభుత్వానికి నష్టం కలిగించారు. 👉: చంద్రబాబు నిందితులు సుబ్బారావు, లక్ష్మినారాయణతో కలిసి కుట్రచేసినట్లు పూర్తి ఆధారాలున్నాయి. ఈ ఆధారాలు అవినీతి నిరోధక చట్టం పరిధిలో ఉన్నాయి. ఈ ఆధారలను బట్టి ఈ కేసులో సెక్షన్ ఐపీసీ 120బీ, 109 సెక్షన్లు పెట్టడం సబబే. కుంభకోణం బయటకు ఎలా వచ్చింది? తాము చెల్లించిన పన్నులకు సంబంధించి కొంత మొత్తం తమకు రావాలంటూ ఆదాయంపన్ను శాఖను డిజైన్ టెక్ సిస్టమ్స్ సంప్రదించింది. దీనిపై అనుమానం వచ్చిన ఐటీ అధికారులు మొత్తం కూపీ లాగారు. 2015 నుంచి 2018 మధ్య కాలంలో ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు రూ.241 కోట్లు షెల్ కంపెనీలకు రూట్ అయినట్టు గుర్తించారు. దీనిపై ఆదాయంపన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఆరా తీయడంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. 👉: చంద్రబాబు రిమాండ్ కాపీ పూర్తి డాక్యుమెంట్ కోసం క్లిక్ చెయ్యండి -
రిమాండ్ రిపోర్ట్ లో సంచలన నిజాలు..
-
Live: రిమాండ్ రిపోర్ట్ లో లోకేష్ పేరు..
-
చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని మెమో దాఖలు చేసిన సీఐడీ
-
స్కిల్ స్కామ్: సీఐడీ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ రిపోర్టును సీఐడీ.. కోర్టుకు సమర్పించింది. స్కిల్ స్కాంలో చంద్రబాబే ప్రధాన సూత్రధారుడని సీఐడీ పేర్కొంది. బాబుపై నేరపూరిత కుట్ర, ప్రజాధనం దుర్వినియోగం, మోసం అభియోగాలు ఉన్నాయి. నిన్న ఉదయం ఆరు గంటలకు చంద్రబాబును అరెస్ట్ చేశాం. స్కిల్ స్కాంలో రూ.550 కోట్ల కుంభకోణం జరిగింది. ప్రభుత్వ సొమ్మును షెల్ కంపెనీలు, ఫేక్ ఇన్వాయిస్ ద్వారా దారి మళ్లించారని సీఐడీ తెలిపింది. ‘‘స్కిల్ స్కామ్‌లో ప్రభుత్వానికి రూ.300 కోట్లు నష్టం జరిగింది. ఒప్పందం ఉల్లంఘిస్తూ రూ.371 కోట్ల అడ్వాన్సులు చెల్లింపు. ప్రభుత్వ నిధుల్లో భారీ మొత్తం షెల్ కంపెనీలకు తరలించారు. చంద్రబాబు డైరెక్షన్లోనే ప్రభుత్వం నిధులు షెల్ కంపెనీలకు మళ్లించారు. కీలక డాక్యుమెంట్ల మాయం వెనుక చంద్రబాబు హస్తం ఉంది మరింత విచారణకు చంద్రబాబును కస్టడీకి తీసుకోవాల్సి ఉంది. అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలతో చంద్రబాబే సూత్రధారి అని తేలింది.’’ అని సీఐడీ పేర్కొంది. రిమాండ్ రిపోర్టులో నారా లోకేష్ పేరును కూడా సీఐడీ ప్రస్తావించింది. కిలారి రాజేశ్ ద్వారా లోకేష్‌కు డబ్బులు అందాయని పేర్కొంది. ‘‘స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వివరాలను అచ్చెన్నాయుడికి సమర్పించారు. ప్రాజెక్ట్‌లో లోటు పాట్లు తప్పిదాలు ఉన్నప్పటికీ చంద్రబాబు, అచ్చెన్నాయుడు కలిసి ఓకే చేశారు. స్కిల్ ప్రాజెక్టులో సిమెన్స్ కంపెనీ రూ.3281 కోట్లు గ్రాంట్‌గా ఇస్తుందని బాబు, అచ్చెన్నాయుడు అబద్ధాలు చెప్పారు. చంద్రబాబుకు తన వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ముడుపులు అందాయి స్కిల్ స్కాంకు సంబంధించిన ఈడీ కూడా విచారణ జరుపుతోంది. ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది. స్కిల్ స్కాంలో ఈడీ విచారణ కీలక దశలో ఉంది. కేసులో మనోజ్ వాసుదేవ్‌కు సెప్టెంబర్ 5న నోటీసులు ఇచ్చాం. మా నోటీసులకు జవాబు ఇవ్వకుండా విదేశాలకు పారిపోయారు. వీళ్లను చంద్రబాబే కాపాడుతున్నారని మా అనుమానం’’ అని సీఐడీ రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపింది. చదవండి: ఎన్నెన్ని పాపాల్... ఎన్నెన్ని శాపాల్! -
మంజుల హత్య కేసు.. రిజ్వానా బేగం వల్లే దారుణం..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లో మహిళ దారుణ హత్య సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక, మృతురాలిని రాళ్లకు చెందిన మంజులగా పోలీసులు గుర్తించారు. ఇక, ఈ కేసుపై శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. రుజ్వానానే మంజులను తన చీరతో ఉరివేసి చంపినట్టు తెలిపారు. కాగా, కేసు వివరాలను డీసీపీ శనివారం మీడియాకు వివరించారు. ఈ సందర్బంగా డీసీపీ నారాయణ మాట్లాడుతూ.. ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి మహిళ మృతదేహాన్ని గుర్తించాం. చనిపోయిన మహిళను వడ్ల మంజులుగా గుర్తించడం జరిగింది. రెండు రోజుల కిందట మంజుల కడుపునొప్పి వస్తుందని శంషాబాద్ ఆస్పత్రికి వెళ్తున్నట్లు భర్తకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. తిరిగి రాకపోవడంతో శుక్రవారం సాయంత్రం ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త చెప్పిన పోలికలు, ఘటనా స్థలం వద్ద మృతదేహంతో సరిపోలడంతో.. హత్యకు గురైందని మంజులగా గుర్తించాము. అయితే, మంజుల హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణం. మంజుల రిజ్వానా బేగం అనే మహిళకు లక్ష రూపాయాలు అప్పుగా ఇచ్చింది. ఈ డబ్బుల వ్యవహారం వివాదంతోనే మంజులను రిజ్వానా హత్య చేసింది. ముందుగా మంజుల కళ్లలో కారంతో రిజ్వానా కారంతో దాడి చేసింది. మంజుల చీర కొంగుతో రిజ్వానా మెడ గట్టిగా పట్టకుని ఉరివేసి హత్య చేసింది. అనంతరం, పెట్రోల్‌తో మంజుల మృతదేహాన్ని రిజ్వానా కాల్చి చంపింది. 24 గంటల్లోనే కేసును చేధించాం. ఈ కేసులో రిజ్వానా బేగంను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తాము. ఒక్క రిజ్వానానే ఇదంతా చేసింది. మంజుల చనిపోయిన తర్వాత ఆమె మెడలో ఉన్న బంగారం చెవుల రింగ్స్ రిజ్వానా దొంగతనం చేసింది. అనంతరం వాటిని ముత్తూట్ ఫైనాన్స్‌లో రిజ్వానా తాకట్టు పెట్టింది. ఈ క్రమంలో భర్తతో కలిసి అజ్మీర్ వెళ్లిపోవడానికి రిజ్వానా టికెట్స్ కూడా బుక్ చేసింది అని తెలిపారు. ఇది కూడా చదవండి: జగిత్యాల గొల్లపెల్లిలో విషాదం: బాలికను బలిగొన్న పిచ్చి కుక్క -
బోనాల వేళ చికోటి ప్రవీణ్ ఓవరాక్షన్.. పోలీసుల దెబ్బకు పరారీ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన లాల్‌దర్వాజ బోనాల సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద చికోటి ప్రవీణ్ ఓవరాక్షన్ ప్రదర్శించిన విషయం తెలిసిందే. చికోటి ప్రవీణ్ లాల్ దర్వాజ ఆలయంలోకి ప్రైవేటు సెక్యూరిటితో వెళ్లారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది ప్రైవేటు సెక్యూరిటీని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, వీరి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగా, రిమాండ్ రిపోర్టు ప్రకారం.. చికోటి ప్రవీణ్ పరారీలో ఉన్నాడు. ప్రవీణ్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు. ఈ కేసులో చికోటి ప్రవీణ్‌ను పోలీసులు ఏ1గా చేర్చారు. లాల్ దర్వాజ బోనాల్లో టాస్క్‌ఫోర్స్‌కు పట్టుబడ్డ ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది వద్ద లైవ్ రౌండ్స్, మూడు తుపాకులు స్వాధీనం చేసుకున్నాం. ఈ నేపథ్యంలో చికోటి సహా మరో ముగ్గురిపై కేసులు నమోదు అయ్యింది. చీటింగ్ సహా ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. సాయుధ వ్యక్తిగత గార్డులుగా కొనసాగేందుకు అధికారం లేదు. లైసెన్స్ లేకుండా అక్రమంగా చికోటీ ప్రైవేటు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ముగ్గురు నిందితులు సిఆర్ఫీఎఫ్ నుండి రిటైర్ అయ్యి.. ఎలాంటి లైసెన్స్ లేకుండానే సెక్యూరిటీ ఉద్యోగం చేసుకుంటున్నారని తెలిపారు. తమకు వచ్చే జీతం సరిపోకపోవడంతో చికోటిని ఆశ్రయించిన ముగ్గురు ప్రైవేట్ గన్ మెన్‌గా ఉంటామని ఆయన్ని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. పర్సనల్ సెక్యూరిటీ కోసం చికోటి దగ్గరికి వెళ్లిన ఈ ముగ్గురు తాము వెపన్స్ ఉపయోగించకూడదు అని చికోటికి చెప్పినా అతను పట్టించుకోలదని చెప్పారు. అదంతా తాను చూసుకుంటానని.. ఎక్కడ లైసెన్స్ క్యారీ చేయద్దు అని చికోటి వారికి చెప్పినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిసిందని వెల్లడించారు. అయితే, ప్రవీణ్ ప్రస్తుతం గోవాలో తలదాచుకున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతి త్వరలోనే చీకోటి ప్రవీణ్‌ను ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: పొలిటికల్ అలర్ట్.. తెలంగాణలో చక్రం తిప్పిన కాంగ్రెస్! -
సాక్షి చేతిలో చికోటి రిమాండ్ రిపోర్ట్
-
స్మిత, మనోజ్ ఎపిసోడ్.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనంగా మారిన శామీర్‌పేట్ కాల్పుల ఘటనలో మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసు రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు ఉన్నాయి. మనోజ్‌కు స్మిత ఫేస్బుక్ ద్వారా పరిచయం కాగా.. స్మితతో కలిసి డిఫ్రెషన్ కౌన్సిలింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఆమెతో మనోజ్ సన్నిహితంగా మెలిగినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇక, రిమాండ్ రిపోర్టు ప్రకారం.. 2003లో స్మితతో సిద్ధార్థ్ దాస్‌కు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు(కుమారుడు-17ఏళ్లు, కుమార్తె-13ఏళ్లు) ఉన్నారు. గతంలో వీరిద్దరూ మూసాపేటలో ఉండేవారు. ఇక, 2018లో సిద్ధార్ధ్‌పై స్మిత గృహహింస కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం విడాకులకు అప్లయ్ చేసింది. అప్పటి నుండి భార్యభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. మరోవైపు.. తమను మనోజ్ హింసిస్తున్నట్లుగా స్మిత కొడుకు CWCకి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో తండ్రి సిద్ధార్థ్ దాస్ హైదరాబాద్ వచ్చారు. ఈ విషయమే అడగడానికి శనివారం ఉదయం 8.30గంటలకి సెలెబ్రిటీ విల్లా వెళ్లారు. సిద్ధార్ధ్‌ను చూడగానే మనోజ్‌ని స్మిత పిలిచారు. ఆవేశంలో ఫ్రెండ్ గిప్ట్గా ఇచ్చిన ఏయిర్ గన్‌తో సిద్ధార్థ్‌పై మనోజ్ కాల్పులు జరిపాడు. కాగా, సిద్ధార్ధ్ తప్పించుకుని పారిపోయాడు. వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, స్మితతో తన బంధానికి ఇబ్బంది కలిగిస్తున్నందుకు సిద్ధార్థ్ దాస్‌ను చంపేయాలనుకుని మనోజ్ అనుకున్నాడు. మనోజ్ పలు సినిమాలు, సీరియల్స్‌లో నటించాడు. అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: శామీర్‌పేట ఘటన: అందమైన అమ్మాయిలకు ట్రాప్, వయసులో పెద్దదైన స్మితతో మనోజ్.. -
డ్రగ్ కేసులో కదిలిన డొంక..
-
కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలు
సాక్షి, హైదరాబాద్: కబాలీ తెలుగు సినిమా నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి అలియాస్ కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. సెలబ్రిటీల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బిగ్ బాగ్ తెలుగు రియాల్టీ షో కంటెస్టెంట్ అషురెడ్డితో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు, పలువురు ప్రముఖులు, వ్యాపార సంస్థల యజమానులకు కేపీ చౌదరి డ్రగ్స్‌ను సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారం రోజుల క్రితం గోవా నుంచి హైదరాబాద్‌కు కొకైన్‌ను సరఫరా చేసి విక్రయించే క్రమంలో మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ), రాజేంద్రనగర్ పోలీసులు కిస్మత్పూర్ క్రాస్ రోడ్ వద్ద అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చౌదరి సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్న పోలీసులు వాట్సాప్ చాటింగ్స్, ఫొటోలు, బ్యాంకు లావాదేవీలను విశ్లేషించారు. ఆయా అంశాలపై స్పష్టత కోసం చౌదరిని రెండురోజులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్ట్‌లో పలు సంచలన విషయాలను పేర్కొన్నారు. 12 మందికి కొకైన్ విక్రయం పోలీసుల విచారణలో కేపీ చౌదరి.. సెలబ్రిటీలు, రాజకీయ నేతల కుమారులు, ప్రముఖులు 12 మందికి కొకైన్ విక్రయించినట్లు ఒప్పుకున్నాడు. వివిధ ప్రాంతాలకు చెందిన బెజవాడ భరత్, వందనాల అనురూప, చింతా సాయి ప్రసన్న, చింతా రాకేష్ రోషన్, నల్లా రతన్ రెడ్డి, ఠాగోర్ విజ్ అలియాస్ ఠాగోర్ ప్రసాద్ మోటూరి, తేజ్ చౌదరి అలియాస్ రఘు తేజ, వంటేరు శవన్ రెడ్డి, సనా మిశ్రా, శ్వేత, సుశాంత్, నితినేష్ వీరిలో ఉన్నారు. సెలబ్రిటీల కాంటాక్ట్‌లు, పార్టీ ఫొటోలను కేపీ చౌదరి గూగుల్ డ్రైవ్‌లో భద్రపరుచుకున్నాడు. వాటిని పోలీసులు డీకోడ్ చేశారు. వందలాది ఫోన్ కాల్స్.. ఈ ఏడాది మేలో కేపీ చౌదరి, తన స్నేహితుడు బెజవాడ భరత్‌తో కలిసి బెంగళూరుకు వెళ్లి అక్కడ డ్రగ్స్ పార్టీ నిర్వహించాడు. ఈ సమయంలో సురేష్ రాజు, రతన్ రెడ్డి, గోవాలోని మీరాజ్ క్లబ్ మేనేజింగ్ పార్ట్నర్ దీక్షయ్, సినీ ఆర్టిస్టు జ్యోతి, డాక్టర్ సుధీర్లతో కేపీ చౌదరి వందలాది ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు. పెద్దసంఖ్యలో ఫోన్‌కాల్స్ ఎందుకు చేశారని చౌదరిని ప్రశ్నించగా.. స్పష్టమైన సమాధానం చెప్పలేదని పోలీసులు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోనూ డ్రగ్స్ కస్టమర్లు.. పలు ఇతర రాష్ట్రాలలో కూడా చౌదరికి డ్రగ్స్ కస్టమర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలలో 11 అనుమానాస్పద లావాదేవీలు జరిపాడు. వీటిపైనా సరైన వివరణ ఇవ్వలేదు. అమెరికాలో ఉంటున్న దుగ్గిరాల అమర్ రూ.లక్షల్లో, గోవాలో రెస్టారెంట్ నిర్వాహకుడు మనీష్ సాహా రూ.85 వేలు, షేక్ ఖాజా అనే వ్యక్తి రూ.2 లక్షలు, బిహార్‌కు చెందిన కిన్షుక్ అగర్వాల్ రూ.16 వేలు, టి.సుజాత అనే మహిళ రూ.లక్ష నగదును కేపీ చౌదరి బ్యాంకు ఖాతాకు బదిలీ చేసినట్లు వివరించారు. -
పూర్ణానంద రిమాండ్ రిపోర్టు.. ‘అర్ధరాత్రి బాలికలను నిద్ర లేపేవాడు..’
సాక్షి, విశాఖపట్నం: భక్తిపేరిట కళ్లబొల్లి కబుర్లు చెప్పిన పూర్ణానంద స్వామి, ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాగా, బాలికను రెండేళ్ల పాటు నిర్బంధించి లైంగికంగా వేధించిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ముందు హాజరుపరిచారు. వచ్చే నెల 5వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో పూర్ణానందను సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక, తాజాగా పూర్ణానంద రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిమాండ్ రిపోర్టులో దిశ పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. పోలీసులు రిపోర్ట్ ప్రకారం.. పూర్ణానంద అర్ధరాత్రి బాలికలను నిద్ర లేపేవాడు. బాలికలను తన గదికి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. ఏడాదిగా అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చింది. పూర్ణానంద ఇద్దరు బాలికలను అత్యాచారం చేసినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయి. బాలికలు గర్భం దాల్చకుండా పూర్ణానంద వారికి ట్యాబ్లెట్స్ ఇచ్చేవాడు. ఆశ్రమంలో మొత్తం ముగ్గురు బాలికలు, 9 మంది బాలురు ఉన్నారు. బాలికలపై అత్యాచారం జరిగినట్టు ఎఫ్ఎస్ఎల్ నివేదికలో వెల్లడైనట్టు తెలిపారు. మైనర్ బాలిక గర్భం దాల్చడంతో వారి బంధువులు ఆ బాలికను ఆశ్రమం నుంచి తీసుకొని వెళ్లారని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. బీటెక్ విద్యార్థి మృతి -
సాక్షి టీవీ చేతిలో పూర్ణానంద రిమాండ్ రిపోర్ట్
-
నోటీసులివ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు?: వెంకట్రామి రెడ్డి
సాక్షి, హైదరాబాద్: డెక్కన్ క్రానికల్ మాజీ చైర్మన్ వెంకట్రామిరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, అరెస్ట్‌పై ఈడీ కీలక వ్యాఖ్యలు చేసింది. డీసీ వెంకట్రామిరెడ్డి రూ.9వేల కోట్ల రుణాలు తీసుకున్నారు. మిగిలిన ఇద్దరు నిందితులతో కలిసి వెంకట్రామిరెడ్డి కుట్ర చేశారు. ఆయన విచారణకు సహకరించకపోవడంతోనే అరెస్ట్ చేశాం. బ్యాంక్ ఫ్రాడ్ కేసులో మనీలాండరింగ్ జరిగింది అని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈడీ రిమాండ్ రిపోర్టుపై వెంకట్రామిరెడ్డి స్పందించారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. చాలాసార్టు విచారణకు హాజరయ్యాను.. సహకరించాను అని తెలిపారు. కాగా, వెంకట్రామిరెడ్డి అరెస్ట్‌పై నాంపల్లి కోర్టు కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది. ఇదిలా ఉండగా.. కెనరా బ్యాంక్, ఐడీబీఏ బ్యాంక్‌లను మోసం చేసిన కేసులో వెంకట్రామి రెడ్డిని ఈడీ అదుపులోకి తీసుకుంది. వెంకట్రామి రెడ్డితో సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. కాగా రూ. 8 వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో వెంకట్రామ్‌రెడ్డిపై ఈడీ అభియోగాలు మోపింది. రుణాలు ఎగవేసిన ఆరోపణలపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. తీసుకున్న రుణాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని ఆరోపించింది. సీబీఐ కేసు ఆధారంగా వెంకట్రామ్‌రెడ్డిపై ఈడీ కేసు ఫైల్ చేసి దర్యాప్తు జరుపుతోంది. గతంలో వెంకట్రామిరెడ్డికి చెందిన రూ,3,300 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆయన పలు బ్యాంకుల్లో 8,800 కోట్ల రుణాలు తీసుకోగా.. వాటిని తిరిగి కట్టకుండా ఎగవేయడంతో ఈడీ దాడులు చేసింది. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు.. భారీ నగదు, డాక్యుమెంట్స్ సీజ్! -
అప్సర హత్యకు ముందు.. గూగుల్‌లో సాయికృష్ణ
సాక్షి, హైదరాబాద్: అప్సర హత్య కేసులో రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగు చూశాయి. వాళ్లిద్దరి పరిచయం దగ్గరి నుంచి సాయికృష్ణ అరెస్ట్ దాకా పరిణామాలు పోలీసులు అందులో పేర్కొన్నారు. ఏడాది కాలంలో వాళ్ల మధ్య బంధం ఎలా బలపడింది?.. చివరకు తాను ఆమెను హత్య ఎలా చేసింది సాయికృష్ణ చెప్పిన విషయాల ఆధారంగా నివేదిక రూపొందించారు. గత ఏడాది ఏప్రిల్ నుండి సాయి కృష్ణ అప్సర మధ్య పరిచయం ఏర్పడింది. సాయికృష్ణ పెద్ద పూజారిగా పని చేసిన సరూర్ నగర్ బంగారు మైసమ్మ గుడి కేంద్రంగానే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తరచూ అప్సరకు వాట్సాప్ ద్వారా సాయి కృష్ణ మెసేజ్‌లు పంపేవాడు. ఈ క్రమంలో కిందటి ఏడాది నవంబర్‌లో గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం, ద్వారక గుడిని ఇద్దరూ కలిసి సందర్శించారు. అదే టైంలో.. ఇద్దరి మధ్య బంధం మరింత బలపడి.. ఆమె వాట్సాప్ ద్వారా సాయికృష్ణకు లవ్ ప్రపోజ్ చేసింది. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయయడం ప్రారంభించింది అప్సర. లేకుంటే రోడ్డుకు ఈడుస్తానని బ్లాక్ మెయిలింగ్‌కు దిగింది. దీంతో ఆమె అడ్డు తొలగించుకునేందుకు హత్య చేసినట్లు సాయికృష్ణ అంగీకరించాడు. గూగుల్‌లో సెర్చింగ్.. హత్యకు వారం రోజుల ముందు ఇంటర్నెట్లో సాయి కృష్ణ నేరాలు ఎలా చేయాలనే వివరాలను సెర్చ్ చేశాడు. "How to Kil human being" అని గూగుల్‌లో వెతికి చూసినట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో తనను కోయంబత్తూర్ కు తీసుకెళ్లాలని అప్సర పలుమార్లు సాయి కృష్ణను కోరింది. ఇదే అదనుగా భావించి ఆమె అడ్డు తొలగించుకోవాలని సాయికృష్ణ డిసైడ్ అయ్యాడు. టికెట్ కొనలేదని చెప్పి మరీ.. జూన్ 3 వ తేదీ రాత్రి 9 గంటలకు కోయంబత్తూర్ కు టికెట్ బుక్ చేశానని అప్సరను నమ్మించాడు సాయి కృష్ణ. సరూర్ నగర్ నుండి కారులో అప్సరను తీసుకుని.. 8:15గంటల సమయంలో బయల్దేరాడు. 9 గంటలకు శంషాబాద్ అంబేద్కర్ సర్కిల్ దగ్గరకు చేరుకున్నాక.. టికెట్ బుక్ చేయలేదని చెప్పాడు. ఆపై గోశాలకు వెళ్దామని చెప్పి.. రాళ్లగూడ వైపు తీసుకెళ్లాడు. డిన్నర్ కోసం ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆపాడు. అప్పటికే ఆరోగ్యం బాగోలేక అప్సర ఒకసారి వాంతి చేసుకుంది. సాయికృష్ణ ఒక్కడే భోజనం చేసి.. 12 గంటల ప్రాంతంలో సుల్తాన్ పల్లి గోశాల వద్దకు చేరుకున్నారు. అక్కడ బెల్లం దంచే రాయిని అప్సరకు తెలియకుండా కారులో దాచేశాడు. అటుపై అర్ధరాత్రి 3:50 కు వెంచర్ సైడ్ వెళ్లారు. కారు ఫ్రంట్ సీట్లో నిద్రలో ఉన్న సమయంలోనే అప్సరను హత్య చేశాడు సాయి కృష్ణ. ఇదీ చదవండి: నా భర్త అమాయకుడు.. తప్పు అప్సరదే! -
బండి సంజయ్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
సాక్షి, వరంగల్: టెన్త్ పేపర్ లీక్ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలను పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఏ1గా బండి సంజయ్ పేరును చేర్చారు. ఏ2 ప్రశాంత్, ఏ3 మహేష్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా శివగణేష్, ఏ6గా పోగు సుభాష్, ఏ7గా పొగు శశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ శార్మిక్, ఏ10గా పోతబోయిన వసంత్‌ను పోలీసులు పేర్కొన్నారు 120(బి) సెక్షన్ కింద సంజయ్‌పై కేసు నమోదు చేశారు. రిమాండ్ రిపోర్ట్‌లో మొత్తం 10 మంది నిందితుల పేర్లు చేర్చారు. బండి సంజయ్ సహా ప్రశాంత్, మహేష్, శివగణేష్లను అరెస్ట్ చేయగా, మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. టెన్త్ విద్యార్థికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరికొంతమంది కీలక సాక్షులను విచారించాల్సి ఉందని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ‘‘ఏ2 ప్రశాంత్ ఎమ్మెల్యే ఈటలకు 10:41కి పేపర్‌ను పంపించారు. బండి సంజయ్‌కు 11:24కి ప్రశ్నపత్రం చేరింది. 9:30కే ప్రశ్నాపత్రం లీకైందంటూ ప్రశాంత్ తప్పుడు వార్తలు ప్రచారం చేశాడు. ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాం. ఏ4గా మైనర్ ఉండటంతో వివరాలు వెల్లడించడం లేదు. టెన్త్ హిందీ పేపర్‌ను ప్రశాంత్ వైరల్ చేశాడు. ఈటల సహా చాలా మంది నేతలకు టెన్త్ పేపర్ వెళ్లింది. పరీక్షకు ముందు రోజు ప్రశాంత్, బండి సంజయ్ చాటింగ్ జరిగింది’’ అని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. ‘‘ప్రశాంత్, సంజయ్ మధ్య తరుచూ ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయి. బండి సంజయ్ ఫోన్ ఇచ్చేందుకు నిరాకరించారు. మెసేజ్ షేర్ చేసినందుకు ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదు. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని కుట్రపన్నారు. చాటింగ్ ఆధారంగానే బండి సంజయ్‌ను ఏ1గా చేర్చాం. టెన్త్ పేపర్ లీక్ వెనుక పెద్ద కుట్ర ఉంది. పేపర్ లీక్‌పై మీడియాకు ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇస్తున్నారు. బండి సంజయ్ ఫోన్ లభ్యమైతే మరింత సమాచారం తెలుస్తుంది’’ అని సీపీ పేర్కొన్నారు. చదవండి: సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తలపించేలా.. కోర్టు ముందుకు బండి సంజయ్.. ‘‘వాట్సాప్ మెసేజ్‌లను రిట్రీవ్ చేస్తున్నాం. పేపర్ లీక్ అంతా గేమ్ ప్లాన్‌లా చేస్తున్నారు. నమో టీమ్‌లో ఏ2 ప్రశాంత్ పని చేస్తున్నారు. బండి సంజయ్ అరెస్ట్‌ను లోక్‌సభ స్పీకర్‌కు తెలియజేశాం. మేం పక్కాగా లీగల్ ప్రొసీజర్‌నే ఫాలో అయ్యాం. బండి సంజయ్ డైరెక్షన్లోనే పేపర్ లీకేజీ వ్యవహారం జరిగింది. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర జరిగింది’’ అని సీపీ వెల్లడించారు. -
పదో తరగతి పేపర్ లీక్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు..
సాక్షి, హైదరాబాద్: టెన్త్ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి నిందితుల రిమాండ్ రిపోర్టులు కీలక విషయాలు వెల్లడయ్యాయి. తెలిసిన విద్యార్థుల కోసమే బందెప్ప, సందెప్ప పేపర్ లీక్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. స్లిప్‌ల రూపంలో సమాధానాలు పంపేందుకే ఇలా చేసినట్లు తెలిపారు. క్వచ్చన్ పేపర్ ఫొటో పెట్టాలని బందెప్పను సమ్మప్ప కోరగా.. పరీక్షకు రాని ఓ విద్యార్థి ప్రశ్నాపత్రాన్ని అతను పంపినట్లు రిమాండ్ రిపోర్టులో వివరించారు. పొరపాటున మరో వాట్సాప్ గ్రూప్‌లో కూడా ప్రశ్నాత్రాన్ని బందెప్ప పోస్ట్ చేశాడని, అప్రమత్తమై డిలీచ్ చేసే లోపే పలువురు స్క్రీన్ షాట్ తీసుకున్నట్లు చెప్పారు. బందెప్ప నుంచే పేపర్ బయటకు వచ్చినట్లు గుర్తించారు. ఆన్సర్ పేపర్ మిస్సింగ్.. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు.. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో సోమవారం పదో తరగతి ఆన్సర్షీట్ల కట్ట మిస్ అయ్యింది. తపాలా కార్యాలయం నుంచి ఉట్నూర్ బస్టాండ్‌కు తీసుకు వస్తున్న క్రమంలో ఇవి ఆటో నుంచి మాయమయ్యాయి. విషయం బయటకు రావడంతో అధికారులు బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆన్సర్ పేపర్ మిస్సింగ్‌కు కారణమైన ఇద్దరు తపాలా ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. పోస్ట్ ఆఫీస్‌లో పనిచేస్తున్న వీ రజిత(ఎంటీఎస్), నాగరాజు(ఔట్ సోర్సింగ్)లను విధుల నుంచి తాత్కాలికంగా తొలగించారు. చదవండి: పేపర్ లీక్ కాదు.. పరీక్ష మధ్యలో బయటకు వచ్చిందంతే!: వరంగల్ సీపీ -
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్.. నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు నిందితుల రిమాండ్ రిపోర్టు సాక్షి టీవీ చేతికి అందింది. ఈ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు 12 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. తొమ్మిది మంది నిందితులతోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. రిమాండ్ రిపోర్టు ప్రకారం.. అరెస్టయిన వారిలో నలుగురు టీఎస్పీఎస్సీ ఉద్యోగులు.. A1 ప్రవీణ్ TSPSC సెక్రెటరీ పీఏ, A2 నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్, A10 ASO షమీమ్, A12 డాటా ఎంట్రీ ఆపరేటర్ రాజశేఖర్ ఉన్నారు. నిందితుల్లో మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. 19 మంది సాక్షులను విచారించాం. టీఎస్పీఎస్సీ ఉద్యోగి శంకరలక్ష్మి ప్రధాన సాక్షి. ఫిర్యాదుదారుడు అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ, టీఎస్పీఎస్సీ, తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీస్ ఉద్యోగులు, కర్మన్ ఘాట్‌లోని ఒక హోటల్లోని యాజమని, ఉద్యోగిని సాక్షి. ఈ నెల 4వ తేదీన ఆర్ స్క్వేర్ హోటల్లో నీలేష్, గోపాల్‌తో పాటు డాక్యా బస చేశారు. హోటల్లో రెండు గదులు (107,108) అద్దెకు తీసుకుని.. అక్కడే ప్రశ్నాపత్రం చూసి ప్రిపేర్ అయ్యారు. తర్వాత నీలేష్, గోపాల్ నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లారు. హోటల్లోని సీసీటీవి ఫుటేజీలో పేపర్ ఎక్స్చేంజ్ వ్యవహారం నిక్షిప్తమైంది. ప్రవీణ్, రాజశేఖర్ ఇచ్చిన సమాచారం మేరకు షమీమ్, రమేష్, సురేష్లను అరెస్ట్ చేశాం. ముగ్గురు నిందితుల నుంచి ఒక ల్యాప్‌టాప్, మూడు మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను కస్టడి కోరిన సిట్ మరోవైపు పేపర్‌లీక్ కేసులో ఇటీవల అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను సిట్ ఏడు రోజులపాటు కస్టడీకి కోరింది. షమీం, రమేష్, సురేష్లను సిట్ గురువారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
సిసోడియా ఈడీ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి మనీష్ సిసోడియా ఈడీ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఈ రిపోర్టులో మరోసారి కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించారు. హైదరాబాద్‌లో ఐటీసీ కోహినూర్ వేదికగా కీలక చర్చలు జరిగినట్లు ఈడీ అధికారులు రిపోర్టులో పేర్కొన్నారు. కవిత, సిసోడియా మధ్య రాజకీయ అవగాహన ఉందని బుచ్చిబాబు స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలిపారు. డిల్లీ లిక్కర్ స్కాం హైదరాబాద్‌లోనే జరిగిందని చెప్పారు. 'హవాలా ద్వారా రూ.100 కోట్ల ముడుపులు పంపామని బుచ్చిబాబు ఒప్పుకున్నారు. కేజ్రీవాల్‌తో సిసోడియా, విజయ్ నాయర్ సంప్రదింపులు జరిపారు. డిల్లీ లిక్కర్ పాలసీలో కవితకు అనుకూలంగా వ్యవహరిస్తే ఆప్‌కు ముడుపులు ఇవ్వాలని సమావేశంలో చర్చలు జరిపారు. కవిత తరఫున అరుణ్‌చంద్ర పిళ్లై, సిసోడియా తరఫున విజయ్ నాయర్ పనిచేశారు. ఈ స్కాంలో సౌత్ గ్రూప్‌కు అనుకూలంగా వ్యవహరించినందుకు మద్యం కంపెనీలో కవితకు వాటాలు ఇచ్చారు.' అని రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. చదవండి: మనీష్ సిసోడియా తరఫున విజయ్ నాయర్ కవితను కలిశారు.. కోర్టులో ఈడీ -
ఢిల్లీ లిక్కర్ స్కాం.. అరుణ్ రామచంద్ర పిళ్లై ఈడీ రిపోర్టులో కవిత పేరు
న్యూఢిల్లీ: డిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్ రామచంద్ర పిళ్లై ఈడీ రిమాండ్ రిపోర్టులో మరోసారి ఎమెల్సీ కవిత పేరు వచ్చింది. ఆయన కవిత బినామీ అని, ఆమె ప్రతినిధినని ఎన్నోసార్లు స్టేట్మెంట్లు ఇచ్చినట్లు రిమాండ్ రిపోర్టు పేర్కొంది. కవిత ఆదేశాల మేరకే ఆయన పనిచేసినట్లు చెప్పింది. ఇండో స్పిరిట్ స్థాపనలో రామచంద్ర పిళ్లైదే కీలక పాత్ర అని తెలిపింది. కాగితాలపై రూ.3.5 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు పిళ్లై చూపారని రిమాండ్ రిపోర్టులో ఉంది. అందుకు ప్రతిఫలంగా కవిత ఆదేశాల మేరకు అరుణ్ పిళ్లైకు కోటి రూపాయలు ఇచ్చినట్లు తెలిపింది. నేరపూరిత నగదు ప్రవాహం గురించి తెలుసుకునేందుకు ఆయనను ఇంటరాగేషన్ చేయాలని ఈడీ రిమాండ్ రిపోర్టు పేర్కొంది. సౌత్ గ్రూప్ నుంచి రూ.వందల కోట్లు ఆప్ లీడర్లకు చెల్లించినట్లు పిళ్లై చెప్పారని తెలిపింది. కాగా.. అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఇటీవలే ఆయనను రెండు రోజులపాటు ప్రశ్నించిన అధికారులు ఈక్రమంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఈయన అరెస్టుతో ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన వాళ్ల సంఖ్య 11కి చేరింది. ఈడీ కస్టడీలో ఉన్న రామచంద్రపిళ్లై స్టేట్మెంట్ను వీడియో రికార్డు చేయాలని కోర్టు ఆదేశించింది. -
సాత్విక్‌ను బూతులు తిట్టి, చితకబాదారు: పోలీసులు రిపోర్ట్
సాక్షి, హైదరాబాద్: నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థి సాత్విక్ క్లాస్‌రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సాత్విక్ మృతిపై ఇంటర్ బోర్డ్ కమిటీ వేసి విచారణ చేపట్టింది. ప్రాథమిక నివేదికను కూడా వెల్లడించింది. ఇక, సాత్విక్ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రిపోర్టు ప్రకారం.. కాలేజీ వేధింపుల వల్లే సాత్విక్ మృతిచెందాడు. సాత్విక్‌ను బూతులు తిట్టడం వల్లే మనస్తాపం చెందాడు. విద్యార్థుల ముందు కొట్టడం వల్ల హర్ట్ అయ్యాడు. ఆచార్యతో పాటు ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి తరచూ తిట్టడంతో మనస్తాపనికి గురయ్యాడు. చనిపోయిన రోజు స్టడీ అవర్‌లో ఆచార్య, కృష్ణారెడ్డి.. సాత్విక్‌కు చితకబాదారు. హాస్టల్లో సాత్విక్‌ను వార్డెన్ వేధించాడు అని స్పష్టం చేశారు. అంతకుముందు.. ఇంటర్ బోర్డు అధికారులు సాత్విక్ ఆత్మహ్యతపై ప్రభుత్వానికి నివేదికను అందించారు. నివేదికలో భాగంగా కాలేజీలో సాత్విక్ అడ్మిషన్ లేదని కమిటీ తెలిపింది. ఒక కాలేజీలో అడ్మిషన్.. మరో కాలేజీలో క్లాసులు అని రిపోర్టులో స్పష్టం చేసింది. కాలేజీలో వేధింపులు నిజమేనని తెలిపింది. ర్యాగింగ్ లాంటి వాటిపైన ఇంకా విచారణ చేయాల్సి ఉందని కమిటీ పేర్కొంది. -
ఆ 15 నిమిషాల్లో ఏం జరిగింది?
సాక్షి, వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్య ఘటనపై ఇంకా అనుమానాలు తొలగిపోలేదు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి 7.15 గంటల మధ్య అంటే కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఏం జరిగిందనే మిస్టరీని ఛేదించాల్సి ఉంది. ఆ సమయంలోనే ప్రీతి కుప్పకూలి ఉందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అప్పుడు అక్కడ ఎవరెవరున్నారనేది పోలీసుల విచారణలో తేలినా సాంకేతిక దర్యాప్తులోనూ అనుమానమున్న వ్యక్తులు అక్కడేమైనా ఉన్నారా అన్నదానిపైనా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెల 24న నిందితుడైన సెకండియర్ విద్యార్థి సైఫ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన సమయంలో సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఉన్న వివరాలు ఎన్నో అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. రిమాండ్ రిపోర్టులో ఏముందంటే... ♦ గత డిసెంబర్లో ఓ ప్రమాద కేసులో రోగి గైడ్ వైర్ విషయంలో సైఫ్ ప్రీతిని వేధించాడు. ఫిబ్రవరిలో హనుమకొండలోని మెటర్నిటీ ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్నప్పుడూ ప్రిలిమినరీ అనస్తీషియా రిపోర్ట్స్ (పీఏసీ) రాయమన్నాడు. దాన్ని ప్రీతి రాశాక, వాట్సాప్ గ్రూప్‌లో ఆ నివేదికను పోస్టు చేసి ఇది ఎవరు రాశారంటూ హేళన చేస్తూ వ్యాఖ్యలు చేశాడు. దీనికి ప్రీతి స్పందిస్తూ ‘నాతో ఏమైనా సమస్య ఉంటే హెచ్ఓడీ లేదంటే జీఎంహెచ్ ఇన్చార్జికి ఫిర్యాదు చేయ్’ అని సైఫ్‌కు పర్సనల్ వాట్సాప్ మెసేజ్ పెట్టింది. లేదంటే ఇదే విషయాన్ని హెచ్ఓడీకి చెబుతాననడంతో కోపోద్రిక్తుడైన సైఫ్ ఆమెను మరింత వేధించాలనుకున్నాడు. ♦ హెచ్ఓడీకి సైఫ్‌పై ఫిర్యాదు చేసేందుకు మద్దతివ్వాలని స్నేహితులు, సహచరులను ప్రీతి కోరింది. తన ప్రవర్తన మారకపోతే అందరినీ వేధిస్తాడని చెప్పింది. ♦ ఈ నెల 21న అనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ నాగార్జునకు వేధింపులపై వచ్చిన సమాచారంతో అదేరోజు 11 గంటలకు సైఫ్‌ను పిలిపించి మాట్లాడారు. ప్రీతిని ఎందుకు వేధిస్తున్నావు, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఆ తర్వాత ప్రీతిని పిలిచి ఇద్దరూ ఒకేచోట డ్యూటీ చేయొద్దన్నారు. ఎంజీఎం కాకుండా అంతకుముందు డ్యూటీ వేసిన ఆస్పత్రిలోనూ చేసుకోవచ్చన్నారు. ♦ ప్రీతి అదేరోజూ మధ్యాహ్నం 3 గంటలకు ఎంజీఎంలో వి ధులకు హాజరైంది. స్టాఫ్ నర్సు మండె విజయలక్ష్మి, సె కండియర్ స్టూడెంట్ డాక్టర్ భీమని మనీశ్, థర్డ్ ఇయర్ హౌస్ సర్జన్ డాక్టర్ రూహితో కలిసి విధులు నిర్వర్తించింది. 22న ఉదయం 5 నుంచి 7 గంటల వరకు జరిగిన అపరేషన్‌లో పాల్గొంది. ఆ తర్వాత అనస్తీషి యా పీజీ రూమ్ లోకి వెళ్లింది. 7.15 నిమిషాలకు స్టాఫ్ నర్సు విజయలక్ష్మి అక్కడికెళ్లగా కిందపడి ఉన్న ప్రీతిని చూసింది. ప్రీతికి డాక్టర్ రూహి, డాక్టర్ భీమని మనీశ్ చికిత్స అందించారు. తేలాల్సినవెన్నో... ♦ సైఫ్ వేధింపుల గురించి ప్రీతి క్లాస్‌మెట్స్, సీనియర్ విద్యార్థులకు తెలిసినా ఆమె సహాయం కోరినప్పుడు వారు ఎందుకు మద్దతివ్వలేదు. ప్రీతి క్లాస్మేట్ అనూషకు వాట్సాప్ ద్వారా ప్రీతికి సపోర్ట్ చేయొద్దంటూ సైఫ్ వ్యక్తిగతంగా పెట్టిన మెసేజ్ పోలీసులకు లభ్యమైంది. ప్రీతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సందర్భంలోనూ ఈ వైద్య విద్యారి్థనులంతా సైఫ్‌కు అనుకూలంగా ఆందోళన చేయడం వివాదాస్పదమైంది. విద్యార్థులు సీనియర్లతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని, తమ కెరీర్‌కు ఇబ్బంది అవుతుందని వెనకడుగు వేశారా అన్నది తేలాలి. ♦ ప్రీతి కార్డియాక్ అరెస్ట్ వల్ల కుప్పకూలిందని, పీఏసీ రిపోర్టు విషయంలోనే సైఫ్ గట్టిగా మాట్లాడాడని, వేధింపులు, ర్యాగింగ్ లేవని బుధవారం నాడే ఎంజీఎం, కేఎంసీ ఉన్నతాధికారులు ఎందుకు ప్రకటించారు? సైఫ్ ర్యాగింగ్, వేధింపులు చేశాడని కౌన్సెలింగ్‌లో ఒప్పుకున్నా ఈ మాటల్ని వీరెందుకు చెప్పలేదు? ♦ ట్యాక్సికాలాజి రిపోర్టు వెల్లడించినా ఆమె ఇంజక్షన్ తీసుకుందా అన్నది పోలీసులు తేల్చాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
సైఫ్ రిమాండ్ రిపోర్ట్ లో పలు కీలక అంశాలు
-
లొంగిపోయే ముందే శరీర భాగాలు కాల్చేసి..
అబ్దుల్లాపూర్‌మెట్: తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని ప్రాణ స్నేహితుడైన నవీన్‌ను దారుణంగా హత్య చేసిన హరిహరకృష్ణ రిమాండ్ రిపోర్ట్‌లో విస్తుపోయే అంశాలు వెల్లడయ్యాయి. హరిహరకృష్ణ లొంగిపోయిన తర్వాత వెల్లడించిన వివరాలు, తమ దర్యాప్తులో తేలిన అంశాలను పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆ రిపోర్టుప్రకారం.. ప్రియురాలికి, తనకు అడ్డుగా ఉన్నాడన్న ఉద్దేశంతో నవీన్‌ను అంతం చేసేందుకు హరిహరకృష్ణ 3 నెలల ముందే ప్రణాళిక రచించాడు. అందులో భాగంగానే మలక్‌పేటలోని ఓ దుకాణంలో కత్తిని కొనుగోలు చేశాడు. అదును కోసం ఎదురుచూస్తూ ఈ నెల 17న ప్లాన్ అమలుకు సిద్ధమయ్యాడు. ఇంటర్ మిత్రుల గెట్ టు గెదర్ ఉందని నవీన్‌ను పిలిచాడు. మధ్యాహ్నం దాకా ఇద్దరూ కలిసి తిరిగారు. సాయంత్రం పెద్దఅంబర్ పేటలోని వైన్స్ వద్ద మద్యం కొనుగోలు చేసి తాగారు. గొంతు నులిమి చంపి.. ఇద్దరూ మద్యం తాగాక హరిహరకృష్ణ ప్లాన్ ప్రకారం నవీన్‌ను ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలోకి తీసుకువచ్చాడు. ఈ క్రమంలోనే ప్రేమించిన యువతి విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న హరిహరకృష్ణ.. నవీన్‌ను గొంతు నులిమి హత్య చేశాడు. వెంట తెచ్చుకున్న కత్తితో నవీన్ మృతదేహంపై విచక్షణారహితంగా పొడిచాడు. తల, కాళ్లు, చేతులు, గుండె, పెదాలను కోసేశాడు. ఆ భాగాలను ఓ సంచీలో వేసుకుని అర్ధరాత్రి వరకూ అక్కడే ఉన్నాడు. 18న తెల్లవారుజామున నవీన్ శరీర భాగాలున్న సంచీని తీసుకుని ఘటనా స్థలానికి దగ్గరలో ఉన్న తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి వద్ద చెట్ల పొదల్లో విసిరేశాడు. తర్వాత అదే గ్రామంలో ఉన్న స్నేహితుడు హాసన్ ఇంటికి వెళ్లాడు. స్నానం చేశాక నవీన్‌ను హత్య చేసిన విషయం అతడికి చెప్పాడు. దీనితో భయపడిన హాసన్ అక్కడి నుంచి వెళ్లిపోవాలనడంతో.. హరిహరకృష్ణ తన ప్రియురాలికి ఫోన్ చేసి, నవీన్‌ను హత్య చేసిన విషయాన్ని చెప్పాడు. ఆమె నమ్మకపోవడంతో నవీన్ శరీర భాగాల ఫొటోలను ఆమెకు వాట్సాప్‌లో పంపించాడు. దీనిపై ఆందోళన చెందిన ప్రియురాలు.. పోలీసులకు లొంగిపోవాలని సూచించింది. పారిపోయి.. తిరిగొచ్చి కాల్చేసి.. నవీన్ ఆచూకీ కోసం అతడి కుటుంబ సభ్యు ల నుంచి ఒత్తిడి పెరగడంతో.. హరిహరకృష్ణ ఫోన్ స్విచాఫ్ చేసి హైదరాబాద్ నుంచి వెళ్లిపోయాడు. వరంగల్, కోదాడ, ఖమ్మం, విశాఖపట్నం ప్రాంతాలకు వెళ్లి వారం తర్వాత తిరిగి వచ్చాడు. నేరుగా బ్రాహ్మణపల్లికి వెళ్లాడు. చెట్ల పొదల్లో విసిరేసిన నవీన్ శరీర భాగాలతోకూడిన బ్యాగును బయటికి తీసి, దహనం చేశాడు. అనంతరం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు హరిహరకృష్ణను తీసుకెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. 25న హయత్‌నగర్ మేజిస్ట్రేట్ ముందు నిందితుడిని హాజరుపర్చి.. రిమాండ్ కోసం చర్లపల్లి జైలుకు తరలించారు. హరిహరకృష్ణ కస్టడీ కోసం పోలీసుల పిటిషన్ నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణను విచారించేందుకు 8 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు మొదట హయత్‌నగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి హత్యకేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదవడంతో.. పోలీసుల పిటిషన్‌ను రంగారెడ్డి జిల్లా సెషన్స్ కోర్టుకు బదిలీ చేశారు. దీనిపై కోర్టు మంగళవారం నిర్ణయం తీసుకోనుంది. -
3 నెలల క్రితమే నవీన్ హత్యకు హరిహరకృష్ణ ప్లాన్
-
సాక్షి చేతికి బైరి నరేష్ రిమాండ్ రిపోర్ట్
-
కావాలనే అలా మాట్లాడా.. భైరి నరేష్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు!
సాక్షి, హైదరాబాద్: అయ్యప్ప స్వామి పుట్టుకను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్.. ఉద్దేశ్యపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు చేసినట్లు అంగీకరించాడు. ఈ మేరకు పోలీసుల విచారణలో నేరం అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్ ద్వారా తేలింది. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలతో హిందూ సంఘాలు, అయ్యప్ప మాలధారుల ఆగ్రహానికి గురయ్యాడు ఓయూ స్టూడెంట్ భైరి నరేష్. అయితే కేసులు నమోదు కావడంతో అతన్ని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఇక రిమాండ్‌లో ఉన్న భైరి నరేష్ పోలీసుల ఎదుట నేరం ఒప్పుకున్నాడు. కావాలనే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు అంగీకరించాడతను. అలాగే.. నరేష్‌ను తాను ఉద్దేశ్యపూర్వకంగానే ఆ కార్యక్రమానికి పిలిచినట్లు మరో నిందితుడు, సభను నిర్వహించిన హనుమంతు పోలీసుల ఎదుట స్టేట్మెంట్ ఇచ్చాడు. మరోవైపు భైరి నరేష్‌పై గతంలోనూ పలు కేసులు నమోదు అయ్యాయని కొడంగల్ పోలీసులు కోర్టుకు వెల్లడించినట్లు రిమాండ్ కాపీలో ఉంది. మత విద్వేషాలకు పాల్పడే ఉద్దేశంతోనే అలాంటి వ్యాఖ్యలు చేశాడని పోలీసులు కొడంగల్ స్థానిక కోర్టుకు తెలిపారు. హనుమకొండలో రెండు, నవాబ్‌పేట పోలీస్ స్టేషన్లోనూ భైరి నరేష్‌పై కేసులు ఉన్నట్లు న్యాయస్థానానికి తెలిపారు. ప్రస్తుత కేసుపై అన్నీ కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. డిసెంబర్19వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. కొడంగల్‌లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంలో ప్రసంగించిన భైరి నరేష్ ఈ క్రమంలోనే హిందూ దేవుళ్లు, అయ్యప్ప స్వామిపై వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఉమాపతి గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకుని ప్రత్యక్ష సాక్ష్యుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు పోలీసులు. సాక్షి చేతిలో బైరి నరేష్ రిమాండ్ రిపోర్ట్ -
యువతి కిడ్నాప్ కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడ యువతి వైశాలి కిడ్నాప్ కేసులో పోలీసులు తాజాగా రిమాండ్ రిపోర్టును విడుదల చేశారు. ఈ రిపోర్టులో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. సాక్షి చేతికి అందిన వైశాలి కేసు రిమాండ్ రిపోర్టులో.. ‘గతేడాది బొంగులూరులోని ఆర్డీ స్పోర్ట్స్ అకాడమీలో ఇద్దరి మధ్య పరిచయం. వైశాలి మొబైల్ నెంబర్ తీసుకున్న నవీన్ రెడ్డి తరుచూ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చేశాడు. పరిచయాన్ని అడ్డుగా పెట్టుకొని వైశాలితో కలిసి ఫోటోలు తీసుకున్నాడు. మధ్యలో పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. దీంతో వైశాలి తల్లిదండ్రులు ఒప్పుకుంటే వివాహం చేసుకుంటానని చెప్పింది. వైశాలి తల్లిదండ్రులను ఒప్పించేందుకు ప్రయత్నించాడు. వారు పెళ్లికి అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. వైశాలి ఇంటి వద్ద దాడికి పాల్పడుతున్న నవీన్ గ్యాంగ్ వైశాలి పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిచి ఇద్దరు దిగిన ఫోటోలను వైరల్ చేశాడు. అయిదు నెలల కిత్రం వైశాలి ఇంటి ముందు స్థలం లీజుకు తీసుకుని షెడ్డు వేశాడు. ఆగస్టు 31న గణేష్ నిమజ్జనం సందర్భంగా న్యూసెన్స్ చేశాడు. వైశాలి ఫిర్యాదుతో నవీన్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈనెల 9న వైశాలికి నిశ్చితార్థం జరుగుతున్నట్లు తెలుసుకున్నాడు. యువతిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దాడిలో ధ్వంసమైన ఇంట్లోని సామాగ్రి వారం ముందు నుంచే వైశాలి కిడ్నాప్‌కు ప్లాన్ చేశాడు. దీనికోసం తన అనుచరులతో పాటు మిస్టర్ టీ స్టాళ్లలో పనిచేసే సిబ్బందిని ఉపయోగించుకున్నాడు. కిడ్నాప్‌లో ఆరుగురు కీలకంగా వ్యవహరించారు. నవీన్‌రెడ్డి, రుమాన్, చందూ, సిద్ధూ, సాయినాథ్, భాను ప్రకాష్‌తో కలిసి వైశాలి కిడ్నాప్‌కు ప్లాన్ వేశారు. వైశాలితోపాటు చుట్టుపక్కల వారిని భయభ్రాంతులకు గురిచేసేలా పథకం రచించారు. చదవండి: ముగిసిన మైత్రీ మూవీ మేకర్స్ ఐటీ రైడ్స్, కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం డిసెంబర్ 9వ మధ్యాహ్నం 12 గంటల సమయంలో 40 మందితో కలిసి వైశాలిని కిడ్నాప్ చేశాడు. ఇంటి వద్ద పార్క్ చేసిన అయిదు కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. యువతి ఇంటిపై దాడి చేసి వస్తువులను సీసీటీవీ కెమెరాలను నాశనం చేశారు. డీవీఆర్లు ఎత్తుకెళ్లారు. వైశాలిని కిడ్నాప్ చేసి కారులో నల్గొండ వైపు తీసుకెళ్లారు.తమ కోసం పోలీసులు వెతుకుతున్నారనే విషయాన్ని నవీన్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని ఫోన్లు స్విచ్ఛాఫ్ పెట్టుకున్నారు. అనంతరం నల్గొండ వద్ద అతని స్నేహితులు కారు నుంచి దిగి పారిపోయారు. నవీన్ మరో స్నేహితుడు రుమాన్ వోల్పో కారులో వైశాలిని హైదరాబాద్ తీసుకొచ్చారు. కిడ్నాప్ జరిగిన సాయంత్రానికి తాను క్షేమంగా ఉన్నట్లు వైశాలి.. తండ్రికి కాల్ చేసి చెప్పింది. రాత్రి 8.37 నిమిషాలకు మన్నెగూడలో ఉన్నట్లు చెప్పడంతో అక్కడికి వెళ్లి వైశాలిని ఇంటికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసున నమోదు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో 32 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు వైశాలి కిడ్నాప్ కేసులో నిందితులను కస్టడీ కోరుతూ ఇబ్రహీంపట్నం కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. నిందితులను 5 రోజుల కస్టడీ కోరుతూ ఆదిభట్ల పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఏ3 భాను ప్రకాశ్, ఏ4 సాయినాథ్, ఏ8 ప్రసాద్, ఏ9 హరి, ఏ30 విశ్వేశ్వర్‌ను కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలైంది. -
రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో.. ఏ1గా మధుసూదన్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన విధ్వంసం కేసులో 45 మందిని అరెస్టు చేసిన పోలీసులు యల్లారెడ్డికి చెందిన స్పోర్ట్స్ పర్సన్ మలవెల్లి మధుసూదన్‌ను ఏ1 గా చూపించారు. ప్రస్తుతానికి ఇతడే ప్రధాన నిందితుడు అయినప్పటికీ.. దర్యాప్తులో వేరే వ్యక్తుల పాత్ర తేలే అవకాశం ఉందని చెపున్నారు. మధుసూదన్‌తో సహా అరెస్ట్‌చేసిన నిందితులను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి.. రిమాండ్ రిపోర్టును దాఖ లు చేశారు. ఇందులో మొత్తం 56 మందిని ఇప్పటివరకు నిందితులుగా గుర్తించినట్లు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు పేర్కొన్నారు. 13 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం నమోదుచేసిన ఎఫ్ఐఆర్లో ఐపీసీ, రైల్వే, ప్రజా ఆస్తుల విధ్వంసక నిరోధక చట్టాల్లోని 15 సెక్షన్ల కింద నిందితులపై ఆరో పణలున మోదుచేశారు. ప్రాథమిక దర్యాప్తులో కుట్రకోణం వెలుగులోకి రావడంతో ఆదివారం నాటి నిందితుల రిమాండ్ రిపోర్ట్‌లో ఆమేరకు ఐపీసీలోని 120బీ సెక్షన్‌ను జోడించారు. కాగా, మధుసూదన్ జాతీయ కబడ్డీ ఆటగాడు. 18 మంది ప్రత్యక్ష సాక్షులు ఈ కేసులో క్షతగాత్రులు సహా 18 మందిని ప్రత్యక్ష సాక్షులుగా చేర్చారు. నిందితులుగా ఉన్న 56 మందీ ఫిజికల్, మెడికల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సా«ధించి ఆర్మీ ఉద్యోగం కోసం ఎదు రుచూస్తున్న వారేనని పోలీసులు పేర్కొన్నా రు. కేంద్రం కొత్తగా తెచ్చిన అగ్నిపథ్ నియా మక పథకానికి వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూపు లు ఏర్పాటు చేశారని, ఇప్పటివరకు 8 గ్రూపులను గుర్తించామని, బిహార్‌లో జరిగిన అలర్ల వీడియోలను వీటిలో పోస్టు చేశారని రిపోర్టులో పేర్కొన్నారు. ఏడు వాట్సాప్ గ్రూపుల అడ్మిన్లు పరారీలో ఉండగా.. ‘రైల్వేస్టేషన్ బ్లాక్’అడ్మిన్ రమేశ్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ గ్రూప్ ద్వారా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధ్వంసానికి ప్లాన్ చేశారని, పలు ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలకు చెందిన నిర్వాహకులు, యజమానులు, డైరెక్టర్లు సహకరించారని పొందుపరిచారు. ఆస్తి, ఆత్మ రక్షణ కోసం పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరిపారని బుల్లెట్ తగిలి రాకేష్ మరణించగా... మరో 12 మందికి గాయాలయ్యాయని రాశారు. ఈ రిపోర్ట్‌లో ఎక్కడా ఏపీలోని నరసరావుపేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీ యజమాని ఆవుల సుబ్బారావు పేరు కనిపించ లేదు. సికింద్రాబాద్ స్టేషన్ మేనేజర్ రాజ నర్సు ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ వెల్లడించింది. విధ్వంసంలోని ప్రతి ఘట్టమూ సెల్ఫోన్లలో రికార్డింగ్ సికింద్రాబాద్ స్టేషన్లో స్వయంగా విధ్వంసం సృష్టించిన వారే సాక్ష్యాధారాలను పరోక్షంగా ఇచ్చారని అధికారులు చెప్తున్నారు. ఈ విధ్వంసంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తాము చేసే చర్యలను తమ ఫోన్లలో ఇతరుల ద్వారా రికార్డు చేయించారు. రైలు ఇంజిన్ పగలకొట్టడం దగ్గర నుంచి బోగీలు కాల్చడం వరకు ప్రతి ఘట్టాన్నీ ఇలా చిత్రీకరించారు. ఓ ఆందోళనకారుడు ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీలోకి ఎక్కి, అక్కడ దొరికిన కాగితాలను సీటులో వేసి, మంట అంటిస్తున్నదీ తన సెల్ఫోన్లో రికార్డు చేయించాడు. ఇలాంటి ఫొటోలు, వీడియోలను కొన్నింటిని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయగా మరికొన్ని గ్యాలరీల్లో సేవ్ అయి ఉన్నాయి. 45 మంది నిందితులను అరెస్టు చేసిన జీఆర్పీ పోలీసులు వారి నుంచి 44 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషించి ఈ విధ్వంసానికి పథక రచన చేసిన వారి వివరాలను వాట్సాప్ గ్రూపుల ద్వారా తెలుసుకున్నారు. ఫోన్లలో ఉన్న వీడియో, ఫొటో సాక్ష్యాలను సేకరిం చారు. న్యాయస్థానం అనుమతితో ఈ ఫోన్ల ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపి వీటిని పక్కా ఆధారాలుగా తయారు చేయాలని నిర్ణయిం చారు. మరోపక్క విధ్వంసం కేసును హైదరాబాద్ పోలీసులకు బదిలీ చేశామని రైల్వే ఎస్పీ ఆదివారం రాత్రి ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు ఇవ్వాలని, సోమవారం వరకు అలాంటివి అందలేదని నగర పోలీసులు చెప్తున్నారు. సుబ్బారావుని తెస్తారా? లేదా? ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటకు చెందిన సా యి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావును ఈ కేసులో అరెస్టు చేయడంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. విధ్వంసానికి పాల్పడిన నిందితుల్లో 272 మంది నగరంలోని ఇతడి బ్రాంచ్ అభ్యర్థులని పోలీసులు గుర్తించారు. అభ్యర్థులను రెచ్చగొట్టడంతోపాటు ఉదంతం జరగడానికి ముందు రోజు రాత్రి సికింద్రాబాద్ వచ్చాడని, ఘటన జరిగిన రోజు కొన్ని గంటలు ఉన్నాడని తేల్చారు. అయితే నరసరావుపేట పోలీసుల అదుపులో ఉన్న ఇతడిని తమకు అప్పగించాలంటూ రైల్వే పోలీసులు కోరలేదు. సుబ్బారావును నిందితుడిగా చేర్చడానికి మరికొన్ని ఆధారాలు అవసరమని ఓ అధికారి పేర్కొన్నారు. కీలక నిందితులది కామారెడ్డి జిల్లా సాక్షి, కామారెడ్డి: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కేసులో కీలక నిందితులు కామారెడ్డి జిల్లాకు చెందిన వారే ఉన్నారు. కేసులో ఏ1గా ఉన్న మలపెల్లి మధుసూదన్ (20)ది ఎల్లారెడ్డి కాగా.. ఏ5 సంతోష్ (22) గాంధారి మండలం మాతుసంగెంకు చెందిన వాడు, ఏ13 బూక్య పెంట్య (19) మాచారెడ్డి మండలం ఎల్లంపేటకు చెందిన వ్యక్తిగా తేల్చారు. వీరితోపాటు విధ్వంసంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ సబ్ డివిజన్లకు చెందిన మరో 12 మంది ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం పోలీసులు జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. -
సికింద్రాబాద్ అల్లర్లు: ‘సాక్షి’ చేతిలో రిమాండ్ రిపోర్ట్.. కీలక అంశాలు వెలుగులోకి..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో రైల్వే పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో రూ.20 కోట్ల నష్టం వాటిల్లినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఏ2 నుంచి ఏ12 వరకు నిందితులు తప్పించుకుని తిరుగుతున్నట్లు రిమాండ్ రిపోర్ట్‌లో రైల్వే పోలీసులు పేర్కొన్నారు. ‘రైల్వే స్టేషన్ బ్లాక్’ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ రమేష్‌గా గుర్తించారు. రమేష్‌ను ఏ3గా రిమాండ్ రిపోర్ట్‌లో చేర్చారు. చదవండి: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన: మా పిల్లలకు ఏ పాపం తెలియదు..! డిఫెన్స్ కోచింగ్సెంటర్లే అభ్యర్థులను రెచ్చగొట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. రిమాండ్ రిపోర్ట్‌లో సాయి అకాడమీ సుబ్బారావు పేరు కనిపించలేదు. ఈ నెల 17న మధ్యాహ్నం 12:10కి స్టేషన్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ బ్లాక్ వాట్సాప్ గ్రూప్‌లో 500 మంది సభ్యులున్నట్లు గుర్తించారు. రిమాండ్ రిపోర్ట్‌లో మొత్తం 56 మందిని రైల్వే పోలీసులు చేర్చారు. వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టి విధ్వంసానికి కుట్ర పన్నినట్లు పోలీసులు తేల్చారు. -
జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు
-
ఆమ్నీషియా పబ్ కేసు.. మరో మైనర్తోనూ అసభ్యంగా..!
సాక్షి, హైదరాబాద్/ బంజారాహిల్స్: రొమేనియా బాలికపై జరిగిన ఘాతుకం కేసుకు సంబంధించి మరో కోణంలోనూ పోలీసుల నిర్లక్ష్యం బయటపడింది. ఈ నేరానికి పాల్పడిన నిందితులు ఆమ్నేషియా పబ్‌లో మరో బాలికతోనూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ అంశం రొమేనియా బాలిక వాంగ్మూలంతో వెలుగులోకి వచి్చనా ఇప్పటివరకు తదుపరి చర్యలు తీసుకోలేదు. అలా చేస్తే నిందితులపై మరో కేసు నమోదవుతుందనే ఒత్తిళ్ల నేపథ్యంలోనే పోలీసులు మిన్నకుండిపోయారని తెలుస్తోంది. మరోపక్క ‘కారులో బాలిక’ వీడియోలను వైరల్ చేసిన మూడు యూట్యూబ్ చానళ్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీటిని మీడియాకు విడుదల చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై చర్యలు తీసుకునే అంశంలోనూ పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు సమాచారం. అది కాలేజీ పార్టీ కాదు ... ఆమ్నేíÙయా పబ్‌లో గత నెల 28న జరిగింది ఓ కార్పొరేట్ స్కూల్‌కు సంబంధించిన ఫేర్వెల్ పార్టీ అని ఇప్పటివరకు భావించారు. పబ్ సిబ్బందిని క్షుణ్ణంగా విచారించిన పోలీసులు అది ఓ ప్రైవేట్ పార్టీగా తేల్చారు. నగరానికి చెందిన హాదీ, సుల్తాన్ తదితరులు వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో పార్టీ ఏర్పాటుకు నిర్ణయించారు. హాదీ రొమేనియా బాలికను పార్టీకి హాదీ తీసుకువెళ్లాడు. మధ్యాహ్నం 1.30 గంటలకు వీళ్లు వెళ్లగా... 3.15 గంటలకు నిందితులు వచ్చారు. పబ్‌లోనే ఈమెకు మరో బాలికతో పరిచయమైంది. వీరిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో సమీపించిన సాదుద్దీన్, ఉమేర్లతో పాటు మిగిలిన నిందితులు అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో విసుగు చెందిన బాలికలు ఇద్దరూ పార్టీ ముగియడానికి ముందే పబ్ నుంచి బయటకు వచ్చేశారు. మరో బాలిక క్యాబ్‌లో వెళ్లిపోగా.. హాదీ కోసం ఎదురుచూస్తూ రొమేనియా బాలిక బయటే ఆగింది. ఈ సమయంలో బయటకు వచి్చన ఎమ్మెల్యే కుమారుడు, నిందితులు ఆకర్షణీయమైన మాటలు చెప్పి ఆమెను లోబరుచుకున్నారు. ఈ వ్యవహారంలో సదరు కార్పొరేటర్ కుమారుడు కీలకంగా వ్యవహరించాడు. కాగా కారులోనూ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ కాన్సూ బేకరీ వద్దకు తీసుకువచ్చారు. అక్కడ నుంచి వెళ్లిపోవడానికి బాలిక సిద్ధమవగా.. ఇంటి వద్ద దింపుతామన్న నిందితులు, బెంజ్ కారులో పెట్రోల్ అయిపోయిందని చెప్పి ఇన్నోవాలో ఎక్కించుకుని అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే ఎమ్మెల్యే కుమారుడు బేకరీ వద్ద నుంచే వెళ్లిపోయాడు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత నిందితులు బేకరీకి వచ్చారు. తాము ఎంజాయ్ చేశామని గ్రూప్ ఫోటో దిగి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు చేశారు. అక్కడ నుంచి ఎవరి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ వివరాలు రొమేనియా బాలిక, నిందితుల వాంగ్మూలాల్లో బయటకు వచ్చాయి. పోక్సో చట్టం కింద కేసు నమోదుకు అవకాశం చిన్నారులపై జరిగే లైంగిక దాడులు నిరోధించడానికి ఉద్దేశించిన పోక్సో చట్ట ప్రకారం ఏదైనా నేరం జరిగిందని తెలిసీ ఫిర్యాదు చేయకపోవడం, తదుపరి చర్యలు తీసుకోకపోవడం సైతం నేరమే. అలాగే పబ్‌లో మరో బాలిక పట్ల సాదుద్దీన్, ఉమేర్ తదితరులు అసభ్యంగా ప్రవర్తించడమూ నేరమే అవుతుంది. దీనికి సంబంధించి ఆ బాలిక లేదా ఆమె సంబం«దీకుల నుంచి వాంగ్మూలం నమోదు చేసి పోక్సో చట్టం కింద మరో కేసు రిజిస్టర్ చేయడానికి ఆస్కారం ఉంది. కానీ నగర పోలీసులు మరో బాలికను గుర్తించి, వాంగ్మూలం నమోదు చేయడం దిశగా చర్యలు తీసుకోలేదు. ఆమెపై జరిగిన అసభ్య ప్రవర్తన విషయం తెలిసినప్పటికీ మిన్నకుండిపోయారు. సోమవారం పోలీసులు పబ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించినప్పుడూ ఈ దృశ్యం వారికి స్పష్టంగా కనిపించింది. నిందితుల రిమాండ్ రిపోర్టులోనూ ఈ అంశాలను పోలీసులు చేర్చారు. ఎమ్మెల్యే కుమారుడికి చెక్ పెట్టేందుకే వీడియో? ఈ ఉదంతానికి సంబంధించి బయటకువచి్చన వీడియోల చిత్రీకరణ వెనుక మరో కోణం ఉన్నట్లు నిందితుల విచారణ సందర్భంగా పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్యే కుమారుడు, ఈ కేసులో నిందితులు స్నేహితులే అయినప్పటికీ వారి మధ్య కొన్ని స్పర్ధలు ఉన్నాయి. ఎమ్మెల్యే కుమారుడు వీరిపై ఆధిపత్యం చెలాయిస్తుండేవాడని సమాచారం. దీంతో అతడికి చెక్ పెట్టడానికి అవకాశం కోసం మిగిలిన వాళ్లు ఎదురు చూశారు. బెంజ్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో వెనుక సీట్లో కూర్చున్న ఎమ్మెల్యే కుమారుడు బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది చూసిన ఉమేర్ తన ఫోన్‌ను ముందు సీట్లో కూర్చున్న వ్యక్తికి ఇచ్చి రికార్డు చేయించాడు. దీని ఆధారంగా ఎమ్మెల్యే కుమారుడిని బెదిరించాలని వాళ్లు భావించారు. అయితే దారుణం బయటకు వచ్చి కేసు నమోదు కావడం, పోలీసుల గాలింపు నేపథ్యంలో వీడియోలను మరో రకంగా వాడుకున్నారు. ఆ ఉదంతంలో తమ తప్పు లేదని, బాలిక సమ్మతితోనే అంతా జరిగిందని చెప్పడానికి ఎంపిక చేసుకున్న వారికి ఓ నిందితుడి తండ్రి లీక్ చేశాడు. ఇలా చేసిన వ్యక్తితో పాటు నిందితులకు ఫామ్‌హౌస్‌లో ఆశ్రయం ఇచి్చన వారికీ నోటీసులు జారీ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఎమ్మెల్యేపై కేసు వద్దంటూ ఒత్తిళ్లు... సంబంధించిన కారులోని వీడియోలు వైరల్ చేస్తున్న యూట్యూబ్ చానళ్లు, సోషల్ మీడియాపై చర్యలకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. ఇప్పటికే యూట్యూబ్‌ను పరిశీలించిన అధికారులు ఈ వీడియోలు పోస్టు చేసిన మూడు యూట్యూబ్ చానళ్లను గుర్తించారు. ఆదివారం వాటిపై సుమోటో కేసులు నమోదు చేసిన అధికారులు ఓ చానల్ రిపోర్టర్‌కు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. అయితే బెంజ్ కారులో బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కుమారుడిపైనా, ‘కారులో బాలిక’వీడియోలను మీడియాకు విడుదల చేసిన ఎమ్మెల్యే రఘునందన్‌రావుపైనా కేసు నమోదు చేసే విషయంలో పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి. చట్ట ప్రకారం ఈయనపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు స్పష్టం చేస్తున్నాయి. అయితే అలా చేస్తే అది రాజకీయ ఇబ్బందులకు కారణమవుతుందంటూ పోలీసులపై ఒత్తిడి వస్తున్నట్లు తెలిసింది. న్యాయస్థానంలో బాలిక వాంగ్మూలం జూబ్లీహిల్స్ పోలీసులు రొమేనియా బాలికను సోమవారం న్యాయస్థానానికి తీసుకువెళ్లి మేజి్రస్టేట్ ఎదుట హాజరుపరిచారు. ఆయన సమక్షంలో బాధితురాలి నుంచి మరోసారి వాంగ్మూలం సేకరించారు. దీని ఆధారంగా ఎమ్మెల్యే కుమారుడిని ఆరో నిందితుడిగా చేర్చాలని ఎట్టకేలకు పోలీసులు నిర్ణయించారు. మరోపక్క ఫోరెన్సిక్ నిపుణులు సోమవారం మరోసారి బెంజ్, ఇన్నోవా కార్లను తనిఖీ చేసి పలు నమూనాలు సేకరించారు. -
బేగంబజార్ పరువు హత్య: సంజన తల్లి ముందుగానే హెచ్చరించినా..
హైదరాబాద్: నగరంలోని బేగం బజార్లో.. పరువు హత్యకు గురైన నీరజ్ పర్వాన్ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు అంశాలు వెలుగు చూశాయి. సంజన తల్లి నీరజ్-సంజనలను ముందుగానే హెచ్చరించినా.. వాళ్లు వినకపోవడం, తదనంతర పరిణామాలు సంజన బంధువుల్లో నీరజ్ పట్ల మరింత విద్వేషాన్ని రగిల్చిందని తెలుస్తోంది. కులాంతర వివాహం కావడంతో పరువు పోయి ఆ అవమానభారంతోనే నీరజ్‌ను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిందితులు ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. పెళ్లి, ఆ తర్వాత బాబు పుట్టినతర్వాత యాదవ అహీర్ సమాజ్‌కు చెందిన వ్యక్తులతో నీరజ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు నిందితులు తెలిపారు. ఈ ఘటన తర్వాత యాదవ్ సమాజ్‌లోని కార్యక్రమాలకు సైతం సంజన కుటుంబీకులను పిలవకపోవడంతో ఆ కుటుంబం రగిలిపోయిందట. పైగా తమ కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో.. ఎక్కడికి వెళ్లినా అవమానపడ్డ సంజన కుటుంబ సభ్యులు. వాస్తవానికి గతేడాది ఏప్రిల్‌లో సంజనకు, మరో అబ్బాయితో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు ఆమె కుటుంబ సభ్యులు. అయితే అంతుకు ముందే ఇంట్లోంచి వెళ్లిపోయిన సంజన, నీరజ్‌ను షంషీర్‌గంజ్‌లోని సాయిబాబా ఆలయంలో ప్రేమపెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో.. బాబు పుట్టాక తన తల్లితో సంజన మాట్లాడింది. ఆ సమయంలో.. ఎట్టిపరిస్థితుల్లో బేగం బజార్‌కు రావొద్దని సంజన తల్లి ఆ జంటను హెచ్చరించినట్లు రిపోర్ట్‌లో ఉంది. అయితే ఆమె హెచ్చరికలను లెక్క చేయని ఆ జంట.. బేగం బజార్లోనే ఉంది. దీంతో ఎలాగైనా నీరజ్‌ను హత్య చేయాలని ప్లాన్ చేసుకున్నారు నిందితులు. గురువారం జుమేరాత్ బజార్లో కత్తులు, రాడ్లు కొన్నారు. ఘటనకు ముందు పీకలదాకా మద్యం సేవించారు. శుక్రవారం రాత్రి నీరజ్ కోసం ఓ బాలుడితో రెక్కీ చేశారు. ఆ సమయంలో తాతతో కలిసి బైక్‌పై వెళ్తున్న నీరజ్ కంట్లో కారం చల్లి.. కత్తులతో దాడి చేసి హతమార్చారు. చదవండి: నా అత్తమామలకు కూడా ప్రాణహాని ఉంది-నీరజ్ భార్య -
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర రిమాండ్ రిపోర్ట్
-
3 నిమిషాల ముందు వెళ్లి.. 5 నిమిషాల్లో హత్య చేసి..
సాక్షి, కరీంనగర్: న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి హత్యలకు నిందితులు రెండు గంటల్లోనే ప్లాన్ చేసి అమలు చేసినట్లు పోలీసులు తేల్చారు. హత్యకు ముందు, తర్వాత జరిగిన పరిణామాలను నిందితుల ‘రిమాండ్ కేస్ డైరీ’లో వివరించారు. వామన్‌రావు దంపతుల కన్నా 3 నిమిషాల ముందు మాత్రమే నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి నల్ల బ్రీజా కారులో వెళ్లి కల్వచర్ల వద్ద మాటు వేసినట్లు వీడియో ఫుటేజీల్లో రికార్డు అయిన సమయాన్ని విశ్లేషిస్తే తెలుస్తోంది. హత్యాకాండను ఐదారు నిమిషాల్లోనే పూర్తిచేసి తిరిగి మంథని వైపు వెళ్లినట్టు తేలింది. 2.26 గంటల నుంచి... హత్య జరిగిన 17వ తేదీ మధ్యాహ్నం 2:26.38 గంటలకు నిందితులు ఉపయో గించిన నంబర్ లేని బ్రీజా కారు పొన్నూరు క్రాస్‌రోడ్స్‌లో కనిపించింది. 2:27 గంటలకు సెంటినరీ కాలనీలోని తెలంగాణ చౌరస్తా వద్దకు వచ్చింది. వీరి వెనుకే గట్టు వామన్‌రావు దంపతులు ప్రయాణిస్తున్న క్రెటా కారు 2:29 గంటలకు పొన్నూరు క్రాస్‌రోడ్స్ వద్ద పెద్దపల్లి వైపు వెళ్లగా 2:30.09 గంటలకు తెలంగాణ చౌరస్తా వద్ద క్రాస్ అయింది. అంటే, నిందితుల కారుకు, న్యాయవాద దంపతుల కారుకు మధ్య నున్న సమయ వ్యత్యాసం 3 నిమిషాలే. తెలంగాణ చౌరస్తా నుంచి హత్య జరిగిన ప్రాంతానికి రెండున్నర కి.మీ. దూరం ఉండగా కారులో 2 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉంది. దీనిని బట్టి హత్య 2:32 గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. ఐదారు నిమిషాల్లోనే హత్యలు చేసి నిందితులు తిరుగు ప్రయాణమై సీసీటీవీ ఫుటేజీల్లో చిక్కారు. 2:41 గంటలకు హత్యకు వాడిన బ్రీజా కారు తెలంగాణ చౌరస్తాలోకి చేరుకోగా, వీరిని వెంబడించిన కుంట శ్రీనివాస్‌కు చెందిన వైట్ క్రెటా కారు కూడా 2:42 గంటలకే తెలంగాణ చౌరస్తాలో కనిపించింది. బిట్టు శ్రీనుకు కుంట శ్రీను కాల్.. వామన్‌రావు దంపతులు మంథని కోర్టుకు రావడాన్ని కుంట శ్రీనివాస్ 17న మధ్యాహ్నం 12:45 గంటలకు బిట్టు శ్రీనుకు చెప్పినట్టు ఫోన్కాల్డేటాను బట్టి తెలుస్తోంది. దీన్ని నిర్ధారించుకోమని బిట్టు శ్రీను అనడంతో కుంట శ్రీనివాస్.. పూదరి లచ్చయ్యకి కాల్ చేసి వామన్‌రావు వచ్చాడో లేదో చెప్పాలన్నాడు. దీంతో 12:47 గంటలకు లచ్చయ్య కాల్ చేసి వామన్‌రావు రాకను నిర్ధారించాడు. అప్పుడు కుంట శ్రీనివాస్ మంథని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం లొకేషన్ నుంచి మాట్లాడినట్టు కాల్‌డేటా ఆధారంగా గుర్తించారు. అప్పటి నుంచి ఫోన్ కాల్స్ ద్వారానే కుంట శ్రీనివాస్(ఏ1), బిట్టు శ్రీను(ఏ4), పూదరి లచ్చయ్య(ఏ5), చిరంజీవి (ఏ2), కుమార్ (ఏ3)లు మాట్లాడుకుంటూ ఉన్నారు. హత్యకు ముందు 2:15 గంటలకు చిరంజీవికి చివరి ఫోన్‌కాల్ చేసిన కుంట శ్రీనివాస్.. అతడిని తీసుకుని కారులో 17 నిమిషాల్లోనే స్పాట్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. గుంజపడుగులో పోలీసుల విచారణ.. హత్యకు గ్రామంలోని కక్షలే కారణమని నిందితులు పేర్కొనడంతో మంథని మం డలం గుంజపడుగులో పోలీసులు విచారణ చేపట్టారు. హత్యకు ఉపయోగించిన కత్తులు తయారు చేసిన బాబు, రఘు, శ్రీనులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కరీంనగర్ జైలులో ఉన్న నిందితులు కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్‌లను భద్రతా పరమైన కారణాల నేపథ్యంలో వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. -
న్యాయవాదుల హత్య: వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, కరీంగనర్/పెద్దపల్లి: హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. కుంట శీను, చిరంజీవి ఇద్దరూ పథకం ప్రకారమే న్యాయవాద దంపతులను హతమార్చినట్టు తెలుస్తోంది. హత్య చేసిన తర్వాత నిందితులు రామగిరి నుంచి మహరాష్ట్రకు పరారయినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత సుందిళ్ల బ్యారేజ్‌లో కత్తులు, బట్టలు పడేసినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అనంతరం సుందిళ్ల బ్యారేజ్ దగ్గరే వేరే బట్టలు మార్చుకుని పరారయ్యారని పోలీసులు తెలిపారు. న్యాయవాది వామన్‌రావుకు సంబంధించిన సమాచారాన్ని లచ్చయ్య ఎప్పటికప్పుడు కుంట శీనుకు అందించేవాడని తెలిసింది. హత్యకు వినియోగించిన కత్తులు, వాహనం బిట్టు శీను సమకూర్చాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు పేర్కొన్న పోలీసులు.. మరో ఇద్దరు నిందితులు కుంట శ్రీను, లచ్చయ్య పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. చదవండి: 'నా భర్తను వామన్‌రావు హత్య చేశాడు’ న్యాయవాద దంపతుల హత్య: బిట్టు శ్రీను ఏం చెప్పాడు? -
దీక్షిత్ టీషర్ట్‌ను మెడకు చుట్టి హత్య
సాక్షి, మహబూబాబాద్ : నగరానికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్, హత్య కేసు నిందితుడు మంద సాగర్‌ను పోలీసులు శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దీక్షిత్‌ను కిడ్నాప్ చేసిన 2 గంటల వ్యవధిలోనే కిడ్నాపర్ సాగర్ హత్య చేశాడు. బాలుడికి ముందుగా నిద్రమాత్రలు ఇచ్చి, కర్చీఫ్‌తో చేతులు కట్టి.. చిన్నారి టీషర్ట్‌తోనే మెడకు ఉరి బిగించి చంపాడు. ఆ హత్య తర్వాతే బాలుడి తల్లిదండ్రులనుంచి 45 లక్షలు డిమాండ్ చేశాడు. నిందితుడు సాగర్ బాలుడిని హత్య చేసిన చోట నుంచే డబ్బుల కోసం దీక్షిత్ తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. 45 లక్షల రూపాయలు ఇవ్వకపోతే దీక్షిత్‌ను చంపేస్తానని బెదిరించాడు. ఇంటర్నెట్ కాల్స్ అవ్వటం వల్ల వెంటనే ఫోన్ కాల్ ట్రేస్ చేయలేకపోయాం. హైదరాబాద్, వరంగల్ సైబర్ క్రైమ్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేసిన.. ఎక్స్పర్ట్ ద్వారా సాగర్ ఫోన్ కాల్స్‌ను ట్రేస్ చేశాం. బాలుడిని హత్య చేసిన తర్వాత పెట్రోల్ పోసి తగులబెట్టాడు. మంద సాగర్ ఒక్కడు మాత్రమే ఈ హత్యలో పాల్గొన్నాడు. మిగితా వారికి ఎలాంటి సంబంధం లేద’’ని తెలిపారు. ( కంగనాపై మరో కేసు నమోదు..) రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ అండ్ మర్డర్ కేసు రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. నిందితుడు సాగర్ సంవత్సరం నుండి డింగ్ టాక్ వాయిస్ ఓవర్ ఇంటర్ నెట్ ప్రోటోకాల్ యాప్‌ను వాడుతున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్‌కు ఫోన్ చేసేందుకు ఈ యాప్‌ను సంవత్సరం నుండి ఉపయోగిస్తున్నాడు. ఈ యాప్ ద్వారా బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. మొబైల్ నెంబర్ ద్వారా కాకుండా యాప్ ద్వారా కాల్స్ చేయటంతో బాలుడి ఆచూకీ కనుక్కోవటం పోలీసులకు 3 రోజులు పాటు సవాలుగా మారింది. పెట్రోల్ బంక్ వద్దకు వెళదామని చెప్పి బాలుడిని తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నాడు సాగర్. తెలిసిన వ్యక్తి కావడంతో పిలవగానే దీక్షిత్ అతడి బైక్ ఎక్కాడు. అప్పటికే స్థానిక మెడికల్ స్టోర్ నుండి సాగర్ రెండు నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. మార్గం మధ్యలో ఒక చోట మంచినీళ్లు తాగెందుకు ఆపాడు. ఆ మంచి నీళ్లలోనే నిద్రమాత్రలు వేశాడు. బాబు మత్తులోకి జారుకుని, స్పృహలోకి వచ్చేలోపే బాలుడిని హత్య చేశాడు. అనంతరం వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఒక చౌరస్తా దగ్గరికి బాలుడి తండ్రిని రమ్మని చెప్పి షాపులో నుండి రంజిత్ రెడ్డి కదలికలను గమనించాడు. మఫ్టీలో పోలీసులు ఫాలో అవుతున్నారన్న అనుమానంతో మళ్లీ యాప్ నుండి రంజిత్ రెడ్డికి ఫోన్ చేశాడు. హత్య చేసిన వెంటనే మనోజ్ రెడ్డి ఇంటికి బాలుడి తలిదండ్రుల రియాక్షన్ చూసేందుకు వెళ్లాడు. -
ముందే దొరికినా వదిలేశారు!
డ్రైవింగ్ లైసెన్స్ లేదు.. పైగా ఓవర్ లోడ్.. అలాంటి లారీ కనిపిస్తే ఆర్టీఓ ఏం చేయాలి? స్వాధీనం చేసుకోవాలి. కానీ మహబూబ్‌నగర్ ఆర్టీఓ ఆ పని చేయలేదు. ముందు హైవేపై అక్రమ పార్కింగ్.. తర్వాత సర్వీస్ రోడ్డులో గంటల తరబడి లారీ... అప్పుడు పెట్రోలింగ్ పోలీసులు ఏం చేయాలి? లారీని తీసేలా చర్యలు తీసుకోవాలి. కానీ వారు ఆ పని చేయలేదు. ఈ రెండు ఘటనల్లో ఎవరి పని వారు సక్రమంగా నిర్వర్తించి ఉంటే.. ప్రియాంక ప్రాణాలతోనే ఉండేది. అక్కడ ఆర్టీఓ, ఇక్కడ పోలీసులు తమ విధులు కచ్చితంగా పాటించి ఉంటే ఓ అమాయక అతివ..ఉన్మాదుల పశువాంఛకు బలయ్యేది కాదు. సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డిజిల్లా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యాచారం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వేర్వేరు అంశాల్లో నిబంధనలు ఉల్లంఘించిన నిందితులను రెండుసార్లు వదిలేయడమే ప్రియాంక పాలిట శాపమైంది. ఆమెపై హత్యాచారం జరగడానికి ఒకరోజు ముందు నిందితులు వస్తున్న లారీని మహబూబ్‌నగర్ ఆర్టీఓ పట్టుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడం, పైగా ఓవర్ లోడ్ ఉండటంతో నిబంధనల ప్రకారం దానిని సీజ్ చేయాల్సి ఉండగా.. ఆర్టీఓ ఆ పని చేయకుండా వదిలేసి వెళ్లిపోయారు. అనంతరం తొండుపల్లి చేరుకున్న నిందితులు లారీని హైవేపై అక్రమంగా పార్క్ చేశారు. ఘటన జరగడానికి 12 గంటల ముందు అటుగా వచ్చిన హైవే పెట్రోలింగ్ పోలీసులు.. లారీని అక్కడి నుంచి తీసేయాలని హెచ్చరించి వెళ్లిపోయారు. దీంతో నిందితులు తొండుపల్లి టోల్‌ప్లాజా గేట్ దగ్గరున్న సర్వీస్ రోడ్డులో లారీని నిలిపి అలాగే ఉంచారు. అక్కడే చాలాసేపు లారీ ఉండటం.. ఆపై అక్కడకు వచ్చిన ప్రియాంకను నిందితులు చూడటంతో వారి మదిలో దుర్బుద్ధి పుట్టి పథకం ప్రకారం ఘాతుకానికి తెగబడ్డారు. ఒకవేళ ఆర్టీఓ ఆ లారీని సీజ్ చేసినా.. సర్వీస్ రోడ్డులో కూడా అంతసేపు లారీని నిలపకుండా పోలీసులు చర్యలు తీసుకున్నా.. ఈ దురాగతం జరిగి ఉండేది కాదని రిమాండ్ రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది. ప్రియాంకారెడ్డి హత్యాచారం కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్‌ను పోలీసులు శనివారం షాద్‌నగర్ మొదటి శ్రేణి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించారు. అందులోని ముఖ్యాంశాలివీ.. ఆర్టీఓకి చిక్కి ... నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ నవంబర్ 21న బూర్గుల గ్రామం నుంచి ఇనుప కడ్డీలు తీసుకుని వెళ్లి కర్ణాటకలోని రాయచూర్‌లో ఆన్లోడ్ చేశారు. అనంతరం లారీ యజమాని సూచనలతో నవంబర్ 24న గంగావతికి వెళ్లి ఇటుకలు లోడ్ చేసుకొని హైదరాబాద్ బయలుదేరారు. వచ్చేదారిలో నవీన్, చెన్నకేశవులు గుడిగండ్ల గ్రామంలో కలిశారు. అదే గ్రామంలో పొదల్లో ఉన్న ఐరన్ చానల్స్‌ను లోడ్ చేసుకుని తీసుకొస్తుండగా 26న మహబూబ్‌నగర్ ఆర్టీఓ లారీని ఆపి తనిఖీలు చేశారు. ఆరిఫ్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని, పైగా లారీ ఓవర్ లోడ్‌తో ఉందని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆర్టీఓకు లారీ అప్పగించి రావొద్దంటూ యజమాని స్పష్టంచేయడంతో ఆరిఫ్.. లారీ స్టార్ట్ కాకుండా చూసేందుకు సెల్ఫ్ స్టార్ట్ వైర్ పీకేశాడు. దీంతో ఆర్టీఓ లారీని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. అక్కడి నుంచి బయలుదేరి మార్గమధ్యంలో రాయ్కల్ టోల్ ప్లాజా వద్ద ఇనుప కడ్డీలను విక్రయించిన నిందితులు రూ.4 వేలు సంపాదించారు. అనంతరం తొండుపల్లి వచ్చి అక్కడే లారీ కేబిన్‌లో నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు పోలీసు పెట్రోలింగ్ వాహనం వచ్చి అక్కడి నుంచి లారీని తీసేయాలని హెచ్చరించడంతో.. సమీప దూరంలోని ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డులోకి లారీని తీసుకెళ్లి అక్కడ నిలిపి ఉంచారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో మద్యం కొనుగోలు చేసి, కేబిన్‌లోనే తాగుతూ కూర్చున్నారు. ఆ సమయంలో లారీ పక్కనే స్కూటీ పార్క్ చేస్తున్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ప్రియాంకారెడ్డిని చూశారు. ఆమె అందంగా ఉందని, స్కూటీ కోసం తిరిగి వచ్చినప్పుడు ఆమెపై అత్యాచారం చేయాలని నిందితులు కుట్ర పన్నారు. పథకం ప్రకారం స్కూటీ వెనుక టైర్‌ను నవీన్ పంక్చర్ చేశాడు. అప్పటికే ఫుల్ బాటిల్ మద్యం తాగిన నిందితులు మరో హాఫ్ బాటిల్ తెచ్చుకుని తాగుతూ కూర్చున్నారు. రాత్రి 9.30 గంటల సమయంలో ప్రియాంక రావడాన్ని గమనించారు. ఆరిఫ్, చెన్నకేశవులు ఆమె వద్దకు వెళ్లి.. మేడమ్, మీ స్కూటీ టైర్ పంక్చర్ అయిందని చెప్పి మాట కలిపారు. వారి వాలకం చూసిన ప్రియాంక స్పందించలేదు. కానీ నిందితులు ఆమెకు సహాయం చేస్తున్నట్టు నటించారు. స్కూటీ టైర్లో గాలి నింపుకొని తీసుకురావాలని ఆరిఫ్.. శివను పంపించాడు. ఆరిఫ్ మాట్లాడుతుండగానే ప్రియాంక తన చెల్లెలికి ఫోన్ చేసి లారీ డ్రైవర్లును చూస్తుంటే భయమేస్తోందని చెప్పింది. కొద్దిసేపటికి షాప్ మూసి ఉందంటూ శివ తిరిగి వచ్చాడు. హెల్ప్.. హెల్ప్ అన్నా వదిలిపెట్టలేదు మరో షాప్‌లో గాలి నింపుకొని వస్తానంటూ శివ మళ్లీ బండి తీసుకుని వెళ్లాడు. అతడు గాలి నింపుకొని తిరిగి వచ్చిన వెంటనే నిందితులు తమ పథకాన్ని అమలు చేశారు. ఆరిఫ్ ప్రియాంక చేతులు పట్టుకోగా.. చెన్నకేశవులు ఆమె కాళ్లు, నవీన్ నడుము వద్ద పట్టుకుని ప్రహరీ గోడ లోపలున్న చెట్ల పొదల్లోకి బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో ఆమె హెల్ప్.. హెల్ప్ అంటూ ఆర్తనాదాలు చేసినా నిందితులు కనికరించలేదు. అరుపులు బయటకు వినిపించకుండా ఆరిఫ్ ఆమె నోటిని తన చేతితో మూసివేశాడు. వెంటనే నవీన్ ఆమె సెల్‌ఫోన్‌ను స్విచ్చాఫ్ చేశాడు. శివ ఆమె దుస్తులను లాగేశాడు. దీంతో మళ్లీ హెల్ప్.. హెల్ప్ అని అరవడంతో నవీన్, చెన్నకేశవులు ప్రియాంక నోట్లో మద్యం పోశారు. అనంతరం ఒకరి తర్వాత ఒకరు పాశవికంగా అత్యాచారం చేశారు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి ప్రియాంక స్పృహ కోల్పోయింది. కొంతసేపటికి స్పృహ రావడంతో నిందితులు ఆమెను చంపాలని నిర్ణయించుకున్నారు. ఆరిఫ్ ఆమె నోరు, ముక్కును చేతులతో గట్టిగా అదిమి పట్టడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. నవీన్ కుమార్ ఆమె సెల్‌ఫోన్, పవర్ బ్యాంక్, వాచీలను కవర్లో పెట్టి లారీలో ఉంచాడు. అనంతరం ఓ బెడ్‌షీట్‌లో మృతదేహాన్ని చుట్టి లారీలో పడేశారు. అక్కడి నుంచి నవీన్, శివ స్కూటీపై, మహమ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు లారీలో షాద్‌నగర్ వైపు రాత్రి 11 గంటలకు బయలుదేరారు. నవీన్, శివ బాటిల్ తీసుకుని పెట్రోల్ కోసం కొత్తూరు శివారులోని బంకుకు వెళ్లారు. అయితే, వారిపై అనుమానం వచ్చిన బంక్ ఉద్యోగి లింగరామ్ గౌడ్ బాటిల్లో పెట్రోల్ పోయడానికి నిరాకరించాడు. దీంతో దగ్గర్లో ఉన్న ఐవోసీ పెట్రోల్ బంక్‌లో నిందితులిద్దరూ పెట్రోల్ కొనుగోలు చేశారు. షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి అండర్‌పాస్ వద్దకు అందరూ చేరుకున్నారు. మృతదేహాన్ని లారీ నుంచి దింపి అండర్‌పాస్ కిందికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ తర్వాత ప్రియాంక సిమ్‌కార్డులు, బ్యాగ్‌ను అదే మంటల్లో వేసి కాల్చేశారు. అనంతరం అక్కడి నుంచి ఆరాంఘర్ వైపు వెళ్లిపోయారు. సంబంధిత వార్తలు 28 నిమిషాల్లోనే చంపేశారు! పోలీసుల నిర్లక్ష్యమే కొంపముంచిందా? పశువులు తిరుగుతున్నాయి జాగ్రత్త ప్రియాంక కేసులో ఇదే కీలకం ‘నా కొడుకుకు ఉరిశిక్ష వేసినా ఫర్వాలేదు’ -
ప్రియాంక ఫోన్ నుంచి ఆరిఫ్‌కు కాల్
సాక్షి, షాద్‌నగర్: ప్రియాంకారెడ్డి హత్య కేసు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోని వచ్చాయి. బైక్ టైర్ పంక్చర్ చేపిస్తామని స్కూటీని తీసుకెళ్లిన ఆరిఫ్ ఎంతకీ రాకపోవడంతో ప్రియాంక తన మొబైల్ నుంచి ఫోన్ కాల్ చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. ప్రియాంక రెడ్డి ఫోన్ ఆధారంగా మహమ్మద్ ఆరిఫ్ ఆచూకీని పోలీసులు కనుకున్నారు. దీంతో కేసు విచారణలో ప్రియాంక ఫోన్ కీలక ఆధారంగా మారింది. రిమాండ్ రిపోర్టులో పలు సంచలన విషయాలు బయటకొచ్చాయి. నిందితులు ప్రియాంకను బలవంతంగా తీసుకెళ్లే సమయంలో.. హెల్ప్ హెల్ప్ అని వేడుకున్నా నిందితులు కనికరించలేదు. బలవంతంగా ఆమె నోట్లో మద్యం పోసి అత్యాచారం జరిపి.. రాక్షసానందం పొందారు. ఒకరి తరువాత ఒకరు బాధితురాలిపై అత్యాచారం జరిపినట్లు రిపోర్టులో తేలింది. బుధవారం రాత్రి 9.30 నుండి 10.20 వరకు కీచకులు ఈ దారుణకాండ కొనసాగించారు. ఆ సమయంలో ప్రియాంక తీవ్రంగా ప్రతిఘటించడంతో నిందితులు ముక్కు, నోరు గట్టిగా నొక్కి పట్టారు. దీంతో ఊరిపి ఆడక బాధితురాలు మృతి చెందింది. అనంతరం బాధితురాలిని ప్యాంట్ లేకుండానే లారీ క్యాబిన్ లోకి ఎక్కించారు. లారీలోకి ఎక్కించి తరువాత కూడా మృతదేహంపై కూడా పలుమార్లు అత్యాచారం చేసినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడయింది. లారీ క్యాబీన్‌ను పరిశీలించిన పోలీసులు రక్తపు మరకలు, వెంట్రుకలను సేకరించారు. అయితే షాద్‌నగర్ బ్రిడ్జ్ వద్ద ప్రియాంకను కిందకు దింపాలని వారు నిర్ణయించారు. ప్రియాంక బతికే ఉంటుందన్న అనుమానం రావడంతో పెట్రోల్ పోసి కాల్చి చంపారు. కాగా ప్రియాంకను అత్యంత దారుణంగా హత్య చేసిన నలుగురు నిందితులను ఇప్పటికే 14 రోజుల రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలంగా మారిన ఈ ఘటనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని, వెంటనే ఉరివేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
కుట్రదారులెవరు.. సూత్రధారులెక్కడ?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/హైదరాబాద్: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని హత్య చేయాలనే పన్నాగంతోనే దుండగుడు శ్రీనివాసరావు కత్తితో దాడికి తెగబడ్డాడని కోర్టుకిచ్చిన రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న పోలీసులు ఆ హత్యా పథకం వెనుక కుట్రదారులెవరు, అసలు సూత్రధారులెవరు అనే కీలక విషయాలను కనీసంగా కూడా ప్రస్తావించ లేదు. పదోతరగతి వరకు మాత్రమే చదువుకున్న యువకుడు పక్కా వ్యూహం ప్రకారం రాష్ట్ర శాంతి భద్రతల పరిధిలోకి వచ్చే ప్రాంతంలో కాకుండా కేంద్రబలగాల పరిధిలోని ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాన ప్రతిపక్ష నేతపై దాడికి తెగబడటం మామూలు విషయం కాదు. ఒక్క వేటుతో గొంతులోకి కత్తి దించి ప్రాణాలు హరించడమే లక్ష్యంగా ఘాతుకానిఎకి తెగించిన శ్రీనివాసరావుకు ఇదంతా చేయమని నూరిపోసిందెవరు..? అతనికి ఆ విధంగా ప్రేరేపించి ఏం జరిగినా మేం చూసుకుంటాం... అని అండగా నిలిచిందెవరు.. పక్కా పథకం ప్రకారం పదినెలలుగా విశాఖ ఎయిర్‌పోర్టులోనే మకాం వేయించి అండగా నిలిచింది ఎవరు అనే కీలక విషయాలు సూత్రప్రాయంగా కూడా ఆ రిమాండ్ రిపోర్ట్‌లో లేవు. శ్రీనివాసరావు ఏడాదికాలంలోపే తొమ్మిది ఫోన్లు మార్చాడని, తొమ్మిది సిమ్‌కార్డులతో పదివేలకు పైగా ఫోన్‌కాల్స్ మాట్లాడాడని, మూడు జాతీయ బ్యాంకుల్లో అతనికి అకౌంట్లు ఉన్నాయని స్వయంగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్హా నిర్ధారిస్తున్నారు. ఇటీవలికాలంలో ఆస్తులు కూడబెట్టుకునే పనితో పాటు విచ్చలవిడిగా జల్సాలు చేస్తున్నాడని అతని సొంతూరు గ్రామస్తులతో పాటు విశాఖలో పనిచేసే రెస్టారెంట్ సిబ్బంది చెబుతున్నారు. ఇన్ని నిధులు ఎక్కడనుంచి వచ్చాయనే కోణంలోనూ దర్యాప్తు చేయలేదు. ఇక నిందితుడు విచారణకు సహకరించడం లేదని పోలీసు ఉన్నతాధికారులే బాహాటంగా అంగీకరిస్తున్నారు. ఇదంతా చూస్తుంటేనే శ్రీనివాసరావు వెనుక బడాబాబుల పాత్ర ఉందనేది ఎవరికైనా అర్ధమవుతుంది. 120బి సెక్షన్ ఎందుకు నమోదు చేయలేదో? దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేంద్రబలగాలు పహారా కాసే ఎయిర్‌పోర్ట్‌లో హత్యాయత్నం జరిగితే ఒక్క హత్యాయత్నం (ఐపీసీ 307) కేసు మాత్రమే నమోదు చేశారు. కుట్రదారులు, అసలు సూత్రధారులను బట్టబయలు చేసేందుకు ఐపీసీ 120 బి సెక్షన్ కింది కేసు నమోదు చేసి విచారించాల్సిన పోలీసులు దాని జోలికి పోలేదు. బడాబాబులు దాగున్న కుట్ర కేసును కేవలం డబ్బు కోసం పాత్రధారి అయిన శ్రీనివాసరావుతోనే కేసు ముగించే పనిలో పోలీసు ఉన్నట్లు తెలుస్తోందని, రిమాండ్ రిపోర్ట్‌లో కుట్రకోణాన్ని ప్రస్తావించక పోవడం దాన్నే సూచిస్తోందని సీనియర్ న్యాయవాదులు వ్యాఖ్యానిస్తున్నారు. నేరపూరిత కుట్ర రుజువైతే మరణ శిక్షే... శ్రీనివాసరావు విమానాశ్రయంలోకి కత్తిని శ్రీనివాసరావు ఎలా తేగలిగారు.. ఇందుకు ఎవరు సహకరించారు.. కత్తిని ఎవరు సమకూర్చారు.. తదితర అంశాలన్నీ కూడా కుట్ర కోణంలో దర్యాప్తు సాగినప్పుడే బహిర్గతం అవుతాయి. ‘నేరపూరిత కుట్ర రుజువైతే మరణశిక్ష, యావజ్జీవ కారాగారశిక్ష విధింవచ్చు. ఇంతటి తీవ్రమైన నేరం విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ బాసులు చెప్పిన కోణంలో దర్యాప్తును ముగించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని స్పష్టంగా తెలుస్తోందని న్యాయనిపుణులు వాఖ్యానిస్తున్నారు. మహేష్ చంద్ర లడ్హా నిర్ధారిస్తున్నారు. ఇటీవలికాలంలో ఆస్తులు కూడబెట్టుకునే పనితో పాటు విచ్చలవిడిగా జల్సాలు చేస్తున్నాడని అతని సొంతూరు గ్రామస్తులతో పాటు విశాఖలో పనిచేసే రెస్టారెంట్ సిబ్బంది చెబుతున్నారు. ఇన్ని నిధులు ఎక్కడనుంచి వచ్చాయనే కోణంలోనూ దర్యాప్తు చేయలేదు. ఇక నిందితుడు విచారణకు సహకరించడం లేదని పోలీసు ఉన్నతాధికారులే బాహాటంగా అంగీకరిస్తున్నారు. ఇదంతా చూస్తుంటేనే శ్రీనివాసరావు వెనుక బడాబాబుల పాత్ర ఉందనేది ఎవరికైనా అర్ధమవుతుంది. -
అది హత్యాయత్నమే
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై గురువారం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన కత్తి దాడి ముమ్మాటికీ హత్యాయత్నమేనని పోలీసులు స్పష్టం చేశారు. జగన్ అదృష్టవశాత్తూ యాదృచ్ఛికంగా పక్కకు తిరగడంతో ముప్పు తప్పిందని, ఆ కత్తిపోటు గొంతులో దిగి ఉంటే ప్రాణాలు దక్కేవి కావని తేల్చిచెప్పారు. జగన్‌ను అంతం చేయాలనే ఉద్దేశంతోనే దుండగుడు శ్రీనివాసరావు కత్తితో దాడి చేశాడని వెల్లడించారు. ఎడమ చేతి భుజంపై కత్తి దింపి, వెనక్కి తీసి మరోసారి పొడిచేందుకు యత్నించగా.. పక్కనే ఉన్న వైఎస్సార్సీపీ నేతలు అతడి నుంచి బలవంతంగా కత్తిని స్వాధీనం చేసుకున్నారని వివరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై విశాఖ ఎయిర్‌పోర్టు పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఈ విషయాలను స్పష్టంగా పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఏముందంటే.. అక్టోబర్ 25, మధ్యాహ్నం 12.20 గంటలు: వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయనగరం జిల్లా పార్వతీపురం సమీపంలో ప్రజా సంకల్ప యాత్ర ముగించుకుని, హైదరాబాద్ వెళ్లడానికి విశాఖ పట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఒంటి గంట సమయంలో ఆయన విమానంలో బయల్దేరాల్సి ఉంది. మధ్యాహ్నం 12.22 గంటలకు: ఎయిర్‌పోర్టులోని వీవీఐపీ లాంజ్‌కు జగన్ చేరుకున్నారు. ఆయన వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అధికారులు ఉన్నారు. కొద్దిసేపు అక్కడ కూర్చున్న తర్వాత వీవీఐపీ లాంజ్‌లో తూర్పు వైపునగల టాయిలెట్‌కు జగన్ వెళ్లారు. రెండు నిమిషాల తరువాత టాయిలెట్ నుండి బయటకు వచ్చి సోఫాలో కూర్చున్నారు. 12.30 గంటలకు: జగన్మోహన్రెడ్డి కోసం పార్టీ నేతలు ఎయిర్పోర్ట్ లాబీలో ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో టీ ఆర్డర్ చేశారు. రెస్టారెంట్‌కు చెందిన సర్వీస్ అసిస్టెంట్ రమాదేవి టీ కప్పులతో వస్తుండగా, తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం థానేలంక నివాసి, ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో సర్వీస్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న జనుపల్లి శ్రీనివాసరావు మంచినీటి సీసాను అందించే నెపంతో ఆమెను అనుసరించాడు. పార్టీ నేతలు ‘జగన్ సార్ టీ తాగరు. కాఫీ తీసుకుంటారు’ అని చెప్పడంతో కాఫీæ తెచ్చేందుకు రమాదేవి రెస్టారెంట్‌కు తిరిగి వెళ్లారు. శ్రీనివాసరావు మాత్రం అక్కడే ఉండిపోయాడు. 12.38 గంటలు: రమాదేవి కాఫీ తీసుకుని వీవీఐపీ లాంజ్‌కు తిరిగి వచ్చారు. అదే సమయంలో రెవెన్యూ అధికారులు వైఎస్ జగన్‌తో..‘ఫ్లైట్‌కు టైమైంది సార్.. బోర్డింగ్, చెకప్‌కు వెళ్లాలి’ అని అధికారులు సూచించారు. 12.39 గంటలకు: జగన్ కాఫీ సేవించడం ముగించుకుని సెక్యూరిటీ చెకింగ్‌కు బయల్దేరారు. సరిగ్గా అదే సమయంలో శ్రీనివాసరావు సార్‌తో సెల్ఫీ తీసుకుంటానని మాట కలిపి జగన్ ఎడమ చేతి పక్కనే నిలుచున్నాడు. ఇంతలో జగన్‌తో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సెల్ఫీ తీసుకుంటుండగా శ్రీనివాసరావు ఒక్క ఉదుటున కత్తితో జగన్‌పై దాడి చేశాడు. నిందితుడికి కుడిపక్కకు జగన్ తిరగడంతో ఎడమపక్క భుజంపై రక్తం కారే బలమైన గాయం తగిలింది. దీంతో జగన్ చిన్నగా అరిచారు. దుండగుడు మళ్లీ పొడిచేందుకు యత్నించడంతో పార్టీ నేతలు బలంవంతంగా అతడి నుంచి కత్తిని లాక్కున్నారు. అతడిని కొట్టవద్దని పార్టీ నేతలను జగన్ వారించారు. అనంతరం ప్రథమ చికిత్స చేయించుకుని షెడ్యూల్ ప్రకారం ఇండిగో విమానంలో హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. ఆ కత్తి గొంతులో దిగి ఉంటే.. ‘‘కత్తితో దాడి చేయడం వల్ల జగన్‌కు తీవ్రంగా రక్తం కారే గాయమైంది. నిందితుడు హత్యకు ప్రయత్నించినా జగన్మోహన్రెడ్డి అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆ కత్తి గొంతుకు తగిలి ఉంటే జగన్ చనిపోయి ఉండేవారు. కాబట్టి నిందితుడు ప్రతిపక్ష నేతను హత్య చేసేందుకు ప్రయత్నించినందున ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశాం. 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నందున బెయిల్ మంజూరు కాకుండా కోర్టుకు పంపించాం. నిందితుడి వద్ద నుంచి 2.5 అంగుళాల కత్తి, గులాబీ రంగు కలిగిన మరో బ్లేడు, లేఖ స్వా«ధీనం చేసుకున్నాం’’ అని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. నిందితుడు నేరం అంగీకరించాడు ‘‘విచారణలో నిందితుడు నేరం అంగీకరించాడు. మధ్యవర్తుల సమక్షంలో నిందితుడి వాంగ్మూలాన్ని 25వ తేదీ రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య రికార్డు చేశాం. శ్రీనివాసరావుపై తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో క్రైం నంబరు 48/2017, సెక్షన్ 323, 506 కింద కేసులు నమోదై ఉన్నట్టు తేలింది. అరెస్టు సమయంలో సర్వోన్నత న్యాయస్థానం సూచనలను పాటించాం. కేసు రాజకీయంగా సున్నితమైంది కావడం వల్ల మధురవాడ ఏసీపీ బీవీఎస్ నాగేశ్వరరావు నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశాం’’ అని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో ఎయిర్పోర్ట్ పోలీస్‌స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మళ్ల శేషు తెలియజేశారు. లేఖ పేజీలపై అస్పష్టత మొదటి నుంచీ అనుమానిస్తున్న విధంగానే దుండగుడు శ్రీనివాసరావు నుంచి స్వాధీనం చేసుకున్న లేఖపై రిమాండ్ రిపోర్ట్‌లో అస్పష్టత నెలకొంది. 10 పేజీల లేఖ అని ఓసారి, 11 పేజీల లేఖ అని మరోసారి రిపోర్టులో పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డిని హత్య చేయడానికే శ్రీనివాసరావు కత్తి దూశాడని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసిన పోలీసులు అతడు జగన్ అభిమాని అని, వైఎస్సార్సీపీకి గట్టి మద్దతుదారు అని పేర్కొనడం గమనార్హం. -
జగన్‌పై హత్యాయత్నం: దారితప్పిన దర్యాప్తు
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని హత్య చేయడానికి జరిగిన ప్రయత్నానికి సంబంధించి సాగుతున్న దర్యాప్తు తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. జరిగిన సంఘటన, దాని పూర్వాపరాలు, పరిణామ క్రమాన్ని లోతుగా విశ్లేషిస్తే తెరవెనుక పెద్ద కుట్రే జరిగిందనడానికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. సంఘటనపై ముఖ్యమంత్రి, మంత్రులు, డీజీపీ స్పందించిన తీరు అనుమానాలు రేకెత్తించగా, గత రెండురోజులుగా జరుగుతున్న పరిణామాలు వారి మాటల ప్రభావం దర్యాప్తుపై పడినట్టు స్పష్టమవుతోంది. ఏదైనా చిన్న సంఘటన (నేరం) జరిగినప్పుడు దానిపై పోలీసులు దర్యాప్తు చేయడానికి అనేక అంశాలను నిశితంగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ధారణకు రావడం సహజం. అలా నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఆ ఘటనకు సంబంధించిన పూర్వాపరాలను వెల్లడిస్తారు. కీలకమైన లేదా సున్నితమైన కేసుల్లో ఒక్కోసారి ఆధారాలు తారుమారవుతాయని లేదా దర్యాప్తు ప్రభావితమవుతుందన్న కారణంగా చార్జీషీట్ దాఖలు చేసేంతవరకు వివరాలు వెల్లడించరు. కానీ జగన్‌పై హత్యాయత్నం జరిగిన గంట నుంచే పరిణామాలు శరవేగంగా మారాయి. అత్యంత కీలకమైన ఈ కేసులో దర్యాప్తు జరపాల్సిన అనేక కోణాలను అధికారులు విస్మరించడం గమనార్హం. దర్యాప్తు కోణాలను వదిలిపెట్టడమే కాకుండా కీలకమైన ఆధారాలు సేకరించే విషయంలో జరుగుతున్న జాప్యం కూడా కావాలనే చేస్తున్నట్టు కనబడుతోంది. ఈ కేసులో కిందిస్థాయిలో దర్యాప్తును తీవ్ర ప్రభావం చేసే రీతిలో ముఖ్యమంత్రి, మంత్రులు, రాష్ట్ర డీజీపీ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో న్యాయం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టును ఆశ్రయించిన తర్వాత పోలీసులు కొంత హడావిడి చేయడం ప్రారంభించినట్టు కూడా కనబడుతోంది. ఎయిర్‌పోర్ట్‌లోని వీఐపీ లాంజ్ సమీపంలోని ఫ్యూజన్ ఫుడ్స్ హోటల్లో ఎందుకు తనిఖీ చేయలేదు? హైదరాబాద్‌లో శుక్రవారం కోర్టుకు హాజరుకావడానికి జగన్ మోహన్ రెడ్డి బయలుదేరినప్పుడు విశాఖ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. దాడి చేసిన వ్యక్తి ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్ హోటల్లో పనిచేస్తాడని తెలుసు. అలాంటప్పుడు దాడి జరిగిన వెంటనే అధికారులు సదరు హోటల్లో అనువణువూ శోధించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే.. నిందితుడు ఇంకా ఏమైనా ఆయుధాలు సేకరించాడా? తన పథకాన్ని అమలు చేయడానికి హోటల్‌ను ఏ విధంగా వాడుకున్నాడు? లేదా హోటల్లో మిగతా వారెవరైనా దీనికి సహకరించారా? సేకరించిన ఆయుధాలను హోటల్లో ఎక్కడ భద్రపరిచాడు? అసలు మొత్తంగా ఎన్ని ఆయుధాలు సమకూర్చుకున్నాడు? హోటల్లో రోజూవారి చర్యలేంటి? ఇతర పనివాళ్లతో ఎలా ఉంటాడు? తరుచూ హోటల్‌కు ఎవరెవరు వచ్చేవాళ్లు? ఎవరెవరితో సన్నిహితంగా మెదిలేవాడు? జగన్ ఎయిర్‌పోర్టులో ప్రవేశించడానికి ముందు దాడి చేసిన వ్యక్తి ఎక్కడున్నాడు? ఇలాంటి ఎన్నో అంశాలను దర్యాప్తు అధికారులు పరిగణలోకి తీసుకోవాలి. కీలకమైన కేసుల్లో ఇలాంటి కోణంలో దర్యాప్తు మరింత లోతుగా సాగితే తప్ప నిజాలు బయటకు రావు. అలా జరగాలంటే అవసరమైతే కొంతకాలం వరకు హోటల్‌ను సీజ్ చేయాలి. లేదా ఇతరులెవరూ ప్రవేశించకుండా తమ ఆధీనంలోకి తీసుకుని ముమ్మర తనిఖీలు నిర్వహించాలి? కానీ రిమాండ్ రిపోర్టు పరిశీలిస్తే దర్యాప్తు అధికారులు వీటన్నింటినీ పట్టించుకోలేదని స్పష్టమవుతుంది. కీలకమైన ఇలాంటి అంశాలను ఎవరి కోసం, ఎందుకోసం వదిలిపెట్టినట్టు? రెస్టారెంట్ యజమానిని ఎందుకు వదిలేశారు? కీలకమైన కేసుల్లో నిజాలు కక్కించడానికి పోలీసులు ఎన్నెన్ని మార్గాలు అనుసరిస్తారో అందరికీ తెలిసిందే. ఈ కేసులో కూడా అత్యంత కీలకం రెస్టారెంట్ యజమాని. ఎందుకంటే, విమానాశ్రయమంటే దేశ భద్రతకు సంబంధించిన అంశాలు అనేకం ముడిపడి ఉండటమే కాకుండా వీవీఐపీలు పర్యటించే అత్యంత కీలకమైన ప్రాంతం. అలాంటి చోట వ్యాపారం కొనసాగిస్తున్నందున ఆ వ్యక్తిని తక్షణం విచారించాల్సిన అవసరం ఉంటుంది. దేశ ప్రధానమంత్రి, రక్షణమంత్రి మరెవరైనా విశాఖ రావాలన్నా అదే విమానాశ్రయంలో దిగాల్సిందే. అలాంటి కీలకమైన ప్రాంతంలో నడుస్తున్న హోటల్లో పనిచేస్తున్న వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడినప్పుడు పోలీసులు యజమానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించకుండా ఎందుకు వదిలిపెట్టినట్టు? వైఎస్సార్ కాంగ్రెస్ నేతలతో పాటు ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెళ్లువెత్తిన తర్వాత యజమానిని అది కూడా రెండ్రోజుల తర్వాత చుట్టపుచూపుగా పోలీస్ స్టేషన్‌కు ఆహ్వానించి తూతూ మంత్రంగా స్టేట్మెంట్ రికార్టు చేస్తారా? అది కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత మాత్రమే పిలవడంలోని మతలబేంటి? హోటల్‌ను తనిఖీ చేయకపోగా, యజమానిని కూడా అంత సులభంగా ఎందుకు వదిలిపెట్టినట్టు? ఆరోజు ఎక్కడున్నారు? విమానాశ్రయంలోని ఫ్యూజన్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ టీడీపీకి చెందిన వ్యక్తి అని తెలిసిందే. అయితే ఇంతటి తీవ్రమైన ఘటన జరిగినప్పుడు దర్యాప్తులో భాగంగా హోటల్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు యజమానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తారు. ఆ పని ఎందుకు చేయలేదు? దాడికి పాల్పడిన వ్యక్తికి సంబంధించి అనేక విషయాలు యజమానికే ఎక్కువగా తెలుస్తాయి. ఎందుకంటే ఆ వ్యక్తిని పనిలో పెట్టుకున్నది ఆ యజమానే కాబట్టి. అయితే, ఆ వ్యక్తి ముఖ్యమంత్రికి సన్నిహితుడు కావడం, విమానాశ్రయంకు వచ్చే టీడీపీ ప్రముఖులకు చాలా మందికి అక్కడ సపర్యలు జరుగుతుండటంతో పాటు ఘటన అనంతరం ముఖ్యమంత్రి, డీజీపీ చేసిన వ్యాఖ్యలే యజమానిని అదుపులోకి తీసుకోకపోవడానికి కారణంగా భావించాల్సి వస్తోంది. హోటల్ యజమాని ఆరోజు ఎక్కడున్నారు? ఎప్పుడెప్పుడు వస్తుంటారు? వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు? దాడికి పాల్పడిన వ్యక్తిని ఎక్కడ పరిచయం? ఎలా పరిచయం? ఈ రకంగా ఎన్నో శోధిస్తే తప్ప కొన్ని నిజాలు బయటకు రావు. కానీ ఆ కోణంలో దర్యాప్తు సాగలేదన్నది రిమాండ్ రిపోర్టును బట్టి తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు ఎంట్రీ వద్ద ఏం నమోదైంది? విమానాశ్రయం అంతటా సీసీ కెమెరాలున్నాయి. ఎయిర్‌పోర్టులో ప్రవేశించే ప్రధాన ద్వారం నుంచి సెక్యూరిటీ చెక్ ప్రాంతంతో పాటు అంతటా సీసీ కెమెరాలు ఉన్నప్పుడు గడిచిన కొద్ది రోజులుగా నిందితుడి కదలికలకు సంబంధించి సీసీ ఫుటేజీని ఎందుకు పరిశీలించలేదు? సీసీ ఫుటేజీ ఉన్నట్టుగా ఎందుకు ప్రకటించడం లేదు? కేసుకు సంబంధించి ఎన్ని కోణాల్లో వీలైతే అన్ని కోణాల్లో శోధించి నిజాలు వెలికి తీయడానికి అత్యంత కీలకంగా సీసీ ఫుటేజీ ఉపయోగపడుతుంది. సీసీ ఫుటేజీ విషయంలో ఎందుకు దోబూచులాట. ఇంత జాప్యం చేసిన తర్వాత సీసీ ఫుటేజీ ఉంటుందన్న గ్యారెంటీ ఏంటి? జాప్యం చేసినందువల్ల పుటేజీ ఆధారాలు తారుమారు కావన్న గ్యారంటీ ఏంటి? సంఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవనీ, దాడికి పాల్పడిన వ్యక్తి సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి కంట బడకుండా విమానాశ్రయంలో తిరుగుతున్నాడని కూడా పోలీసులు చెబుతున్నారంటే... ఇంతకన్నా ఘోరమేమైనా ఉంటుందా? దీన్ని బట్టి విమానాశ్రయం అనువణువూ ఆ వ్యక్తికి తెలిసినట్టే భావించాలి. లేదంటే ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతుందా? నిజానికి విమానాశ్రయంలోని ఎస్టాబ్లిష్మెంట్స్లో పనిచేసే సిబ్బంది ప్రతి ఒక్కరినీ తనిఖీ చేయకుండా లోనికి వదలరన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది ఈ నిందితుడిని ఎందుకు తనిఖీ చేయలేదు? చేసి ఉంటే కత్తులు లోనికి ఎలా వెళ్తాయి? నిజానికి ఆ కత్తులను నిందితుడే లోనికి తీసుకెళ్లాడా? లేక వేరెవరైనా సమకూర్చారా? లోనికి చేరవేయడానికి మరెవరైనా సహకరించారా? అన్న అనుమానంపై పోలీసులు దర్యాప్తు చేయకపోవడానికి కారణాలేంటి? పోలీసులు చెబుతున్న దాన్ని బట్టి దాడికి పాల్పడిన వ్యక్తి ఒక రోజు ముందు మాత్రమే ఆ ఆయుధాలను తెచ్చాడని చెబుతున్నారు. అలా అని ఏ రకంగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు? ఆ వ్యక్తి చెప్పిందే వేదంగా భావించడంలోని ఆంతర్యమేంటి? ఇతర మార్గాలతో నిర్ధారణకు రావలసిన అవసరం లేదా? లేఖల లోతుల్లోకి ఎందుకు వెళ్లడం లేదు? హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత పరస్పర విరుద్ధమైన ప్రకటనలు ఎందుకు వెలువడ్డాయి. మొదట పందెం కోళ్లకు వాడే కత్తిని స్వాధీనం చేసుకుని సిబ్బంది లేఖ విషయాన్ని గానీ రెండో ఆయుధం కత్తి ఉన్నట్టు గానీ తొలుత చెప్పలేదు. డీజీపీ స్పందించిన అనంతరం ఒక్కసారిగా లేఖ అంశం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వ్యక్తి వద్ద స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్న లేఖలో ఉన్న చేతిరాత ఒకతీరుగా లేదని మీడియా బయటపెట్టిన తర్వాత... నిజమే చేతిరాత వేర్వేరుగా ఉందని మరుసటి రోజు నిర్ధారించడంలోని ఆంతర్యమేంటి? చేతిరాత వేర్వేరుగా ఉన్నప్పుడు పేపర్ (కాగితం) వేర్వేరుగా ఉందా? వేర్వేరు పెన్నులు (సిరా) వాడినట్టు తేలిందా? లేఖలో పేర్కొన్న అంశాలు ఆ వ్యక్తి స్వయంగా డిక్టేట్ చేశాడా? డబ్బులు లేక ఇంటర్మీడియట్ తొలి సంవత్సరంలోనే విద్యను ఆపేసిన వ్యక్తి లేఖలు రాయలేక వేరే వాళ్లతో రాయించాడా? ఆ వ్యక్తి డిక్టేట్ చేస్తుంటే రాశారా? అందులో పేర్కొన్న అంశాలను తిరిగి చెప్పగలడా? ఒక కీలకమైన కేసులో నిజానిజాలు వెల్లడి కావాలంటే ఇలాంటి అంశాలు ఎంతో కీలకంగా మారుతాయి. కానీ దర్యాప్తు అధికారులు ఎందుకో వాటిని పట్టించుకోలేదు. సమాధానాలు దొరకని రిమాండ్ రిపోర్ట్ ఇలాంటి సున్నితమైన కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఆయుధాల వివరాలను రాసేప్పుడు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తలు పాటించాలి. ఈ రిమాండ్ రిపోర్టులో మాత్రం పోలీసులు ఎందుకనో... హత్యాయత్నానికి వాడిన ఆయుధం చాలా చిన్నదని చెప్పడానికి అనేకసార్లు ప్రయత్నం చేశారు. రిమాండ్ రిపోర్ట్‌లో దాడి చేసిన వ్యక్తి వాడిన ఆయుధం – వెరీ స్మాల్ నైఫ్ (సాధారణంగా ఒక నైఫ్ అని రాసి దాని సైజ్ రాస్తారు) కానీ ఇక్కడ పోలీసులు ఒకటికి రెండుసార్లు వెరీ స్మాల్ నైఫ్ అని రాయడం గమనిస్తే ముఖ్యమంత్రి, డీజీపీ నోట్లోనుంచి వచ్చిన మాటలకు అనుగుణంగానే స్క్రిప్ట్ ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఇకపోతే, రెండో ఆయుధం... వెరీ బ్లేడ్ టైప్ ఇన్స్ట్రుమెంట్ అని రాశారు. హత్యాయత్నం కేసుల్లో సాధారణ బ్లేడ్ సైతం ఆయధమే అవుతుంది తప్ప అదో ఇన్స్ట్రుమెంట్ అని రాయడం మరీ విడ్డూరం. ఎవరైనా బ్లేడ్‌తో దాడి చేశారనుకుంటే... బ్లేడ్‌తో దాడి చేశారనే రాస్తారు తప్ప బ్లేడ్ వంటి ఒక వస్తువును ఉపయోగించారని రాయరు. ఆ రాసిన తీరు కూడా ఎలా ఉందంటే... ఆ వ్యక్తి హోటల్లో పనిచేస్తున్నందున ఆ ఆయుధాన్ని చంపడానికి కాకుండా హోటల్లో పనిచేస్తున్నాడు కాబట్టి రేపటి రోజున కూరగాయలు తరగడానికి పెట్టుకున్నాడన్నా ఆశ్చర్యపోనక్కరలేదు. అందుకు ఆస్కారం కలిగించే రీతిలో పదప్రయోగం ఉండటం విడ్డూరం. ఇంతకు లేఖ ఎన్ని పేజీలు హత్యాయత్నం చేసిన వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్న లేఖ అంశం మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. 9 పేజీలు, 10, 11, 12 పేజీలు ఇలా రోజుకో రకంగా వార్తలొచ్చాయి. దీనిపై రిమాండ్ రిపోర్ట్ ఏం రాశారంటే... హత్యాయత్నం చేసిన వ్యక్తిని ఆసాంతం తనిఖీ చేశామని, అతడి వద్ద 11 పేజీల లేఖ ఒకటి స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత క్రమంలో (సరిగ్గా చెప్పాలంటే మరో అయిదు లైన్ల తర్వాత) సదరు వ్యక్తి నుంచి ఏమేమి స్వాధీనం చేసుకున్నామో తెలిపే జాబితా ఒకటి ఇచ్చారు. అందులో 10 పేజీల లేఖ అని పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్‌లోని అయిదు లైన్లలోనే ఈ రకమైన వ్యత్యాసం ఉండటం దర్యాప్తు ఎంత తేలికభావంతో కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. నెల రోజుల ఐడీ కార్డు హత్యాయత్నం చేసిన వ్యక్తి అసలు ఎంతకాలం నుంచి విమానాశ్రయంకు వస్తున్నారు. ఎందుకంటే పోలీసులు పేర్కొన్న రిమాండ్ రిపోర్ట్‌లో అతడి (శ్రీనివాస్) ఐడీ నంబర్ కేవలం నెల రోజులకు మాత్రమే అనుమతి ఉంది. అతని ఐడీ కార్డు ప్రకారం గత సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 29 తో ముగుస్తుంది. (VEP No.VTZ-27645 Valid from 30-9-2018 to 29-10-2018) కార్డు వాలిడిటీ అమలులోకి వచ్చిన రోజు ఆదివారం (సెప్టెంబర్ 30) కావడం గమనార్హం. మరో నాలుగు రోజుల్లో కాలపరిమితి (29 వ తేదీ సోమవారంతో) ముగుస్తుండగా, 25 వ తేదీ హత్యాయత్నం జరిగింది. విమానాశ్రయాల్లో పని చేసే సిబ్బంది వేర్వేరు పేర్లతో ఎయిర్పోర్ట్ ఎంట్రీ పాస్ (ఏఈపీ) లు తయారు చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) 2016 లో కొన్ని మార్గదర్శకాలను రూపొందించి, వాటిని అమలు చేయాలని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ను నిర్ధేశించింది. విమానాశ్రయాల్లో పనిచేసే ఎలాంటి సిబ్బంది అయినా ఆధార్‌తో లింక్ అయి ఉన్న ఎయిర్పోర్ట్ ఎంట్రీ పాస్ (ఏఈపీ) ఐడీ కార్డు (బయోమెట్రిక్స్ పవర్డ్ ఆధార్ నంబర్) ను మాత్రమే జారీ చేయాలి. 2017 జనవరి 1 వ తేదీ నుంచి దీన్ని కచ్చితంగా అమలు చేయాలి. కానీ ఇక్కడ జగన్‌పై హత్యయత్నానికి పాల్పడిన వ్యక్తి ఐడీ కార్డు కేవలం నెల రోజులకు మాత్రమే జారీ చేసినట్టు రిమాండ్ రిపోర్టులో ఉండటం గమనార్హం. ఇకపోతే, ఎయిర్‌పోర్టు లోని వీఐపీ లాంజ్‌లోకి ఫ్యూజన్ ఫుడ్స్ నుంచి ఇద్దరు వ్యక్తులు జగన్ దగ్గరకు వచ్చారని అందులో ఒకరు రమాదేవి కాగా మరొకరు హత్యాయత్నం చేసిన శ్రీనివాస్‌గా పేర్కొన్నారు. రమాదేవి ఐడీ నంబర్ (ఏఈ నం. వీటీజెడ్–276577 ) గా ఆరు అంకెలతో కూడి ఉండగా, జగన్‌పై హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావు ఐడీ నంబర్ అయిదు డిజిట్లతో ఉంది. నిబంధనల ప్రకారం శ్రీనివాస్ అనే వ్యక్తిది ఆధార్ లింక్ చేసిన ఐడీ అయినట్టయితే ఆధార్ వివరాలు ఏవి? ఎందుకు వెల్లడించలేదు? అసలు ఇలాంటి గుర్తింపు కార్డు ఎంతకాలం కిందట జారీ అయింది. ఈ కోణంలో వివరాలను ఎందుకు సేకరించలేదు? విచారణలో వీటినెందుకు విస్మరించారు? ఈ వ్యక్తి ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో వంటవాడిగా – సర్వీస్ అసిస్టెంట్‌గా ఏడాది కిందటే చేరినట్టు రిమాండ్ రిపోర్టులో చెప్పారు. ఏడాది కింద చేరిన వాడికి నెల రోజులు మాత్రమే అనుమతించే ఐడీ కార్డు ఎందుకు జారీ చేశారు? ప్రతి నెల వేర్వేరు కార్డులు జారీ చేస్తున్నారా? అలా చేయడం ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందా? విచిత్రమేమంటే... హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి జగన్ మోహన్‌రెడ్డికి ఒక వినతి పత్రం ఇవ్వాలని అనుకున్నారని, అందుకోసం చిన్న కత్తులు సమకూర్చుకున్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. జగన్‌కు వినతిపత్రం ఇవ్వాలంటే కత్తులు సమకూర్చుకోవాలా? ఏమిటీ విడ్డూరం. దుబాయ్‌లో ఎంతకాలం? దాడికి పాల్పడిన వ్యక్తి ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా ఇంటర్ మొదటి సంవత్సరంలోనే ఆపేసినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అలాగే కొంతకాలం దుబాయ్ వెళ్లి అక్కడ వెల్డర్ అసిస్టెంట్‌గా పనిచేసినట్టు పేర్కొన్నారు. కొంతకాలం అన్నారే తప్ప ఎంతకాలం? ఎప్పటి నుంచి ఎప్పటివరకు పనిచేశాడు? ఎప్పుడు తిరిగొచ్చాడు? తిరిగొచ్చాక ఏం చేశాడు? అతడి పాస్‌పోర్ట్ ఎక్కడుంది? అందులో వివరాలేంటి? ఎక్కడి నుంచి పాస్‌పోర్టు పొందాడు? వంటి వివరాలేవీ అందులో లేవు. నిష్పాక్షిక విచారణ ఒక్కటే మార్గం విశాఖ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనను లోతుగా విశ్లేషించినప్పుడు అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. మంత్రులు, డీజీపీ, ముఖ్యమంత్రి లాంటి వాళ్లు ఈ ఘటనకు సంబంధించి చాలా తేలికగా మాట్లాడిన మాటల ప్రభావం దర్యాప్తుపై తీవ్రంగా ఉన్నట్టు అది సాగుతున్న దిశను బట్టి విధితమవుతోంది. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు రెండో వారంలో విశాఖ జిల్లాలో ప్రవేశించడానికి ముందునుంచి కూడా అనేకసార్లు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఎప్పుడెప్పుడు విమానాశ్రయం వస్తారన్న సమాచారం అందరికి తెలిసిందే. గడిచిన మూడు నెలల్లో జగన్ అనేకసార్లు విశాఖ విమానాశ్రయం వచ్చారు. దాన్ని బట్టి హత్యకు చాలా పకడ్బందీ కుట్ర జరిగిందనే ప్రస్తుత పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. జగన్‌ను హతమార్చడానికి రెక్కీ కూడా జరిగి ఉంటుందన్న అనుమానాలు పార్టీ నేతల్లో ఉంది. దర్యాప్తు సాగుతున్న తీరు ఈ అనుమానాలను నివృతి చేయలేవని కూడా అంటున్నారు. ఈ మొత్తం ఘటన వెనుక దాగివున్న కుట్ర బయటపడాలంటే సమగ్ర నిష్పాక్షిక విచారణ ఒక్కటే మార్గం. కుట్రదారులెవరు.. సూత్రధారులెక్కడ? అది హత్యాయత్నమే: రిమాండ్ రిపోర్టు దుండగుని తీగలాగితే... ‘దేశం’ డొంక కదులుతోంది శ్రీనివాస్ ఫ్లాట్‌లోని వేరే గదిలో ఇద్దరమ్మాయిలు! -
రిమాండ్ రిపోర్ట్‌పై సీఎం సమీక్ష!
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన దాడి ముమ్మాటికీ హత్యాయత్నమేనని రిమాండ్ రిపోర్ట్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని తేలాయి. వైఎస్ జగన్ అప్రమత్తంగా లేకుంటే కత్తి గొంతులో దిగేదని రిమాండ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆదివారం ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరావుతో అత్యవసరంగా భేటి అయ్యారు. ఈ రిపోర్ట్‌పై సమీక్ష జరుపుతున్నారు. మరోవైపు కాకినాడలో సీబీఐని కుదిపేసిన సానా సతీష్‌పై సోదాలు నిర్వహించడం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఏపీ పోలీసులు తెలంగాణలో డబ్బులతో పట్టుబడటంపై కూడా చర్చించినట్లు సమాచారం. చదవండి: వైఎస్ జగన్‌పై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమే! -
వైఎస్ జగన్‌పై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమే!
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమేనని స్పష్టమైంది. ఈ మేరకు రిమాండ్ రిపోర్టులో సంచలన వాస్తవాలు వెలుగుచూశాయి. ఈ దాడిలో వైఎస్ జగన్ మెడభాగంలో కత్తి తగిలి ఉంటే.. ఆయన అక్కడే చనిపోయి ఉండేవారని, నిందితుడు శ్రీనివాసరావు జగన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించాడని రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు. దాడి సమయంలో అదృష్టవశాత్తు వైఎస్ జగన్ కుడివైపునకు తిరగడంతో హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్నారని వెల్లడించారు. గత గురువారం విశాఖపట్నం విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ వచ్చేందుకు పార్టీ నేతలతో కలిసి ఆయన వీఐపీ లాంజ్‌లో ఎదురుచూస్తున్న సమయంలో సెల్ఫీ నెపంతో వైఎస్ జగన్ వద్దకు వచ్చిన జనిపల్లి శ్రీనివాసరావు కోళ్ల పందాలకు ఉపయోగించే పదునైన కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనపై ఏపీ పోలీసు దర్యాప్తు అధికారులు స్థానిక కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టును ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. వైఎస్ జగన్‌పై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమేనని రిమాండ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. కత్తి గనుక మెడ భాగంలో తగిలి వుంటే ఆయన చనిపోయివుండేవారనే, నిందితుడు శ్రీనివాస్.. వైఎస్ జగన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించాడని తెలిపింది. వైఎస్సార్సీపీ నేత కరణం ధర్మశ్రీ సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో నిందితుడు హత్యాయత్నం చేశాడని, అదృష్టవశాత్తు ఆ సమయంలో వైఎస్ జగన్ కుడివైపునకు తప్పుకోవడంతో ఆయనకు ప్రాణాపాయం తప్పిందని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఏపీ ప్రోటోకాల్ ఇన్స్పెక్టర్ వాసుదేవ్ అక్కడే వున్నారని కూడా రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపారు. అంతేకాదు నిందితుడి జేబులో మరో పదునైన కత్తి ఉందని, జగన్ హత్యకు నిందితుడు పథకం ప్రకారమే ప్లాన్ చేశాడని విచారణలో వెల్లడైంది. 25వ తేదీన వైఎస్ జగన్ ఎయిర్‌పోర్టుకు వస్తారన్న సమాచారం తెలుసుకున్న శ్రీనివాస్.. ఒక రోజు ముందుగానే కత్తులను ఎయిర్‌పోర్ట్‌లోకి తెచ్చుకున్నాడని, సీసీ కెమెరాలు కవర్ చేయని ప్రాంతంలో ఆ కత్తులను దాచాడని రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. సాక్షి టీవీ లైవ్ కవరేజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
జగ్గారెడ్డి రిమాండ్ రిపోర్ట్
సాక్షి, హైదరాబాద్ : నకిలీ పాస్‌పోర్ట్‌లతో అక్రమ రవాణా చేసిన కేసులో జగ్గారెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. న్యాయస్థానం జగ్గారెడ్డిని పద్నాలుగు రోజులపాటు రిమాండ్‌కు తరలించింది. రిమాండ్ రిపోర్ట్‌లోని వివరాలు.. 2004లో నిర్మల, విజయ లక్ష్మి, భరత్‌ల పేర్లతో పాస్‌పోర్ట్‌లు పొందారు. ఏజెంట్ మధు ద్వారా ముగ్గురిని తన భార్యా పిల్లల పేర్లతో అమెరికాకు పంపేందుకు 15 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కూతురు విజయ లక్ష్మి పేరుతో శ్రీ తేజ జూనియర్ కాలేజీ నుంచి బోనఫైడ్ సంపాదించారు. ఆమె పుట్టిన రోజును 1987 సెప్టెంబర్ 3గా పేర్కొన్నారు. కొడుకు భరత్ సాయి రెడ్డి పేరు కోసం సంగారెడ్డిలోని కరుణ స్కూల్ నుంచి బోనోఫైడ్, క్యారెక్టర్ సర్టిఫికెట్స్ పొందారు. అతని పుట్టిన రోజును 1989 మార్చి 5గా పేర్కొన్నారు. ఈ వివరాలు జగ్గారెడ్డి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డుల్లో తేడాలున్నాయి. పాస్‌పోర్ట్ కార్యాలయం సీనియర్ సూపరింటెండెంట్, గతంలో జగ్గారెడ్డి దగ్గర పీఏగా పనిచేసిన రాజేందర్ తో పాటు మరో ఇద్దరిని సాక్ష్యులుగా చేర్చారు. భార్య పిల్లలుగా పాస్పార్ట్ల్లో ఉన్న ఫొటోలు జగ్గారెడ్డి ఫ్యామిలివీ కాదని రాజేందర్ తెలిపారు. వీసా పొందిన తరువాత తన స్నేహితుడు కుసుమ కుమార్ తో కలిసి ఆ ముగ్గుర్ని జగ్గారెడ్డి న్యూ యార్క్ తీసుకెళ్ళారు. ఇలా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పాస్ పోర్ట్ వీసాలు పొంది దేశ భద్రతకు ముప్పు తెచ్చారు. 2016లో తన పాస్ పోర్ట్ పోయిందని కొత్త పాస్ పోర్ట్ కోసం జగ్గారెడ్డి దరఖాస్తు చేసుకున్నాడు. -
‘గజల్’ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్ : లైంగికి వేధింపులకు పాల్పడ్డి జైలు పాలైన గజల్ శ్రీనివాస్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసుకు సంబంధించి నిందితులుగా గజల్ శ్రీనివాస్‌ను ఏ1గా, పనిమనిషి పార్వతిని ఏ2గా చేర్చారు. మహిళల పట్ల గజల్ శ్రీనివాస్ అసభ్యంగా ప్రవర్తించేవాడని, అభ్యంతరకరమైన ప్రాంతాల్లో మసాజ్ చేయాలని బెదరించేవాడని వేధింపులు ఎదుర్కొన్న యువతి పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి స్టింగ్ ఆపరేషన్ వీడియోలను బాధితురాలు పోలీసులకు అందచేసింది. గజల్ శ్రీనివాస్ తండ్రిలాంటివారు.. రేడియో జాకీని లైంగికంగా వేధించిన కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న పార్వతి మాట్లాడుతూ.. గజల్ శ్రీనివాస్ తనకు తండ్రి లాంటి వాడని తెలిపింది. ఆయన దగ్గర తాను చాలాకాలంగా పని చేస్తున్నానని, మహిళలను వేధించే వ్యక్తి కాదని చెప్పింది. ఆరోపణలు చేసిన ఆమె... తనకు తానుగా మసాజ్ చేస్తానని ముందుకొచ్చిందని పార్వతి ఆరోపిస్తోంది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఇంత స్థాయికి ఎదిగిన వ్యక్తి...ఓ అమ్మాయిని ఇబ్బంది పెట్టాడంటే నమ్మేలా లేదని శ్రీనివాస్ ఫ్యామిలి ఫ్రెండ్ జ్యోతిర్మయి అన్నారు. ఖైదీ నెంబర్ 1327 లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన గజల్ శ్రీనివాస్‌ను పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన మేజిస్ట్రేట్ గజల్ శ్రీనివాస్ కు ఈ నెల 12 వరకు రిమాండ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. జైలు అధికారులు... గజల్ శ్రీనివాస్‌కు 1327 నెంబర్ ను కేటాయించారు. మరోవైపు న్యాయమూర్తి రిమాండ్ ప్రకటించిన వెంటనే గజల్ శ్రీనివాస్ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేశారు. దీనిపై కోర్టులో వాదోపవాదనలు జరిగిన అనంతరం బెయిల్ పిటిషన్ ను న్యాయమూర్తి రద్దు చేశారు. అలాగే గజల్ శ్రీనివాస్ ను రెండు వారాల కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటీషన పై విచారణ రేపటికి వాయిదా పడింది. -
గజల్ శ్రీనివాస్ తండ్రిలాంటివారు..
-
‘నా కుమారుడు డ్రగ్స్ తీసుకుంటాడు’
హైదరాబాద్: తన కుమారుడు విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతాడన్నది అవాస్తవమని మాదక ద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ మెస్సానస్ తండ్రి బెర్నార్డ్ తెలిపారు. తన కొడుకు డ్రగ్స్ తీసుకుంటాడు గానీ విక్రయించడని చెప్పారు. పోలీసులు తమ ఇంట్లో సోదాలు జరిపి కొంత డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. కెల్విన్ కొరియర్ ద్వారా డ్రగ్స్ పంపిస్తే విద్యార్థులకు విక్రయించామని మరో ఇద్దరు నిందితులు అబ్దుల్ వహీబ్, అబ్దుల్ ఖుదూస్ వెల్లడించినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కెల్విన్‌తో రెండేళ్లుగా పరిచయం ఉందని, ఆరు నెలలుగా డ్రగ్స్ విక్రయిస్తున్నామని మీరు వెల్లడించారు. ముగ్గురు నిందితులపై బాలనగర్, చార్మినార్ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. కెల్విన్‌పై బాలనగర్లో.. వహీబ్, అబ్దుల్ ఖుదూస్‌లపై చార్మినార్ పీఎస్‌లో కేసులు పెట్టారు. కాగా, వీఐపీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు కెల్విన్ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. మెసేజ్ పంపిన అరగంటలో మత్తు పదార్థాలు సరఫరా చేశానని అతడు చెప్పినట్టు సమాచారం. సినీ పరిశ్రమ, పాఠశాల, కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ విక్రయించినట్టు సమాచారం. ముగ్గురు నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వీరికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. రెండు రోజుల్లో నిందితులను తమ కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా 25 మంది వీఐపీలను పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. -
ఆత్మహత్య చేసుకోవాలని సారికను ఒత్తిడి చేశారు!
-
ఆత్మహత్య చేసుకోవాలని సారికను ఒత్తిడి చేశారు!
మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లలది ఆత్మహత్యేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో సారిక, ఆమె పిల్లలు ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. దీనిపై ముమ్మరంగా దర్యాప్తు చేసిన వరంగల్ పోలీసులు.. రిమాండు రిపోర్టును సిద్ధం చేశారు. ఇందుకోసం మొత్తం 24 మందిని ప్రశ్నించారు. రాజయ్య కుమారుడు అనిల్, కోడలు సారికల వైవాహిక జీవితం గురించి కూడా రిమాండు రిపోర్టులో పేర్కొన్నారు. అనిల్ రెండో భార్య సన మాత్రం తప్పించుకుని తిరుగుతోందని తెలిపారు. కాగా, ఈ కేసులో ఎ1 అనిల్, ఎ2 సిరిసిల్ల రాజయ్య, ఎ3 మాధవీలత, ఎ4 సన అని పేర్కొన్నారు. రిమాండు రిపోర్టులో మరిన్ని విభ్రాంతికర వాస్తవాలను పోలీసులు బయటపెట్టారు. అవి ఇలా ఉన్నాయి... అనిల్ రెండో వివాహంతోనే సారికపై వేధింపులు మొదలయ్యాయి అనిల్‌కు తల్లిదండ్రుల మద్దతు ఉంది సారికను మామ రాజయ్య, అత్త మాధవీలత వేధించారు ఆమె పలుమార్లు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది కేసుల కారణంగా సారికపై వేధింపులు మరింతగా పెరిగాయి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని నిరంతరం వేధించారు ఆత్మహత్య చేసుకోవాలంటూ ఒత్తిడి చేశారు ఇంట్లో పనివాళ్లు, డ్రైవర్లు ఈ వేధింపులకు సాక్షులు సారిక, పిల్లలను అత్తింటివారు ఒంటరి చేశారు ఉప ఎన్నికల్లో రాజయ్య గెలిస్తే వేధింపులు పెరుగుతాయని సారిక భయపడింది పలుకుబడి ఉపయోగించి వేధిస్తారని ఆందోళన చెందింది విసిగిపోయి పిల్లలతో ఆత్మహత్యకు ఒడిగట్టింది తెల్లవారుజామున 4-4.30 మధ్య ఆత్మహత్యకు పాల్పడింది పొగలు రావడంతో చుట్టుపక్కల వాళ్లు గుర్తించి 100, 108లకు సమాచారం ఇచ్చారు. ఆ ఇంటి బెడ్రూంలో రెండు గ్యాస్ సిలిండర్లున్నాయి ఒకటి ఖాళీ, మరోటి నిండుది. మంటలు, పొగ కారణగానే సారిక, పిల్లలు మరణించారు బెయిల్ దరఖాస్తు కాగా, శనివారం వరంగల్ కోర్టులో రాజయ్య, ఆయన భార్య మాధవి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సంఘటన జరిగిన ఇంట్లో తాము ఉండటం లేదని, ఎన్నికల నేపథ్యంలోనే తాము ఒక రోజు ముందుగా అక్కడికి వచ్చామని అందులో పేర్కొన్నారు. అందువల్లే ఈ ఘటనతో తమకు ఎటువంటి సంబంధం లేదని, తమకు బెయిల్ ఇవ్వాలని అందులో కోరారు. వారి పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం దానిపై విచారణను ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది. -
రిషితేశ్వరి కేసు రిమాండ్ రిపోర్టు ఇదే!
-
రిషితేశ్వరి కేసు రిమాండ్ రిపోర్టు ఇదే!
గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితుల రిమాండ్ రిపోర్ట్ 'సాక్షి టీవీ' సంపాదించింది. ఈ కేసులో A1గా సీనియర్ విద్యార్థిని హనీషా, A2గా జయచరణ్, A3గా శ్రీనివాస్ పేర్లను పోలీసులు నమోదు చేశారు. ప్రేమించాలంటూ రిషితేవ్వరిపై సీనియర్ విద్యార్థులు ఒత్తిడి చేశారని, నిరాకరించడంతో శ్రీనివాస్, జయచరణ్‌లు కలిసి రిషితేశ్వరిపై వదంతులు ప్రారంభించారని, ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఆమె తీవ్ర మనోవేదనకు గురైనట్లు రిమాండ్ రిపోర్టులో ఉంది. ర్యాగింగ్‌లో భాగంగా హాస్టల్ నుంచి రిషితేశ్వరిని రూమ్మెట్స్ బయటకు నెట్టారని, వార్డెన్ స్వరూపరాణి, ఆఫీస్ అసిస్టెంట్ రాజ్‌కుమార్‌కు ఫిర్యాదు చేసిందని, ఏప్రిల్ 18న కాలేజీలో ఫ్రెషర్స్ డే పార్టీ సందర్భంగా రిషితేశ్వరికి మిస్ పర్ఫెక్ట్ అవార్డు వచ్చిందని, అదేరోజు రిషితేశ్వరి పట్ల శ్రీనివాస్, జయచరణ్ అసభ్యంగా ప్రవర్తించారని, ర్యాగింగ్ శృతి మించడంతో జులై 14న హాస్టల్లో చున్నీతో రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుందని రిమాండ్ రిపోర్టులో ఉంది. చున్నీకి వేలాడుతున్న రిషితేశ్వరిని మొదటగా విద్యార్థినులు... సుజాత, కుసుమలత, గౌరిలు చూశారని, మధ్యాహ్నం 2.30గంటలకు యూనివర్సిటీ అంబులెన్స్‌లో ఆమెను గుంటూరుకు తరలించారని,ఆత్మహత్య చేసుకున్న రూమ్‌లో 2 నైలాన్ తాడులు గుర్తించామని, నిందితులపై ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం అదుపులోకి తీసుకున్నామని, ఈ నెల 16న యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని, రిషితేశ్వరి కేసును మరింత లోతుగా విచారించాల్సి ఉందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. -
ఎవరీ జనార్దన్?
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో మరో పేరు తెరపైకి వచ్చింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు మే 27 నుంచి 31 మధ్య 32 సార్లు ఫోన్ సంభాషణలు సాగాయి. వీరి సంభాషణల్లో చాలా సార్లు జనార్దన్ పేరు వినిపించింది. ప్రతి విషయాన్ని సండ్ర జనార్దన్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కొన్ని కీలక భేటీలు జరిగాయి. అయితే జనార్దన్ ఎవరు అన్న విషయం తెలాల్సివుంది. ఓటుకు కోట్లు కేసులో సండ్ర మొత్తం వ్యవహారాన్ని నడిపించి మే 30 నాటి ఆపరేషన్‌లో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని రంగంలోకి దింపారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపులు ఇస్తూ రేవంత్ ఏసీబీ అధికారులకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. -
సాక్షి చేతికి ఎమ్మెల్యే సండ్ర రిమాండ్ రిపోర్టు
-
'తెరవెనుక ఉండి మొత్తం వ్యవహారం నడిపించారు'
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కీలక పాత్ర వహించారని ఏసీబీ వర్గాలు భావిస్తున్నాయి. సండ్ర తెర వెనుక ఉండి ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారాన్ని మొత్తం నడిపించినట్లు తెలుస్తోంది. ఇందుకు సండ్ర పక్కా వ్యూహ రచన చేసినట్లు సమాచారం. ఓటుకు కోట్లు కేసులో సండ్ర మొత్తం వ్యవహారాన్ని నడిపించి మే 30 నాటి ఆపరేషన్‌లో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపులు ఇస్తూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే. మే 30న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి, ఇదే కేసులో A-4 నిందితుడైన మత్తయ్యకు సండ్ర వీరయ్య.. 8 కాల్స్ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. సండ్రను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్టును సాక్షి సేకరించింది. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న సెబాస్టియన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యల మధ్య మే 27 నుంచి 31 మధ్య 32 సార్లు ఫోన్ సంభాషణలు సాగాయి. సండ్ర మాట్లాడిన సంభాషణలు.. ఎమ్మెల్యేలు ఎవరెవరు డబ్బులకు లొంగుతారో సండ్ర ఆరా ఎంత డబ్బు పెడితే ఏ ఎమ్మెల్యే వస్తారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేల గైర్హాజరు, మరికొందరు టీడీపీకి ఓటు వేసేలా వ్యూహం మైనార్టీ ఎమ్మెల్యేల లక్ష్యంగా బేరసారాలకు వ్యూహం మహానాడు సభా వేదికల్లోనూ కుట్ర సంభాషణలు బాస్ తరపున వ్యవహారం నడిపించాలంటూ సెబాస్టియన్ కు సండ్ర సూచన ఎమ్మెల్యేల కొనుగోలుకు బాస్‌తో మాట్లాడి డబ్బులు అరెంజ్ చేస్తా డబ్బులకు లొంగకుంటే అధికారం ఆశ చూపాలి ఏపీలో చంద్రబాబు సర్కార్ ఉంది ఏపీలో ఆంగ్లో ఇండియన్ పోస్టులు ఖాళీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే నీ పేరు చంద్రబాబుకు చెబుతా ఏపీలో ఏ పని కావాలన్నా బాబుతో చెప్పి చేయిస్తా ఎవరైనా చుట్టాలుంటే చెప్పు.. బాబుకు చెప్పి పని చేయిస్తా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు మాదే అధికారం -
'సాక్షి' చేతికి ఎమ్మెల్యే సండ్ర రిమాండ్ రిపోర్టు
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ఐదో నిందితుడిగా ఉన్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు సంబంధించి కీలక రిమాండ్ రిపోర్ట్ 'సాక్షి' సేకరించింది. అందులో ఏసీబీ వెల్లడించిన వివరాలు మొత్తం రాజకీయ వ్యవస్థ విస్తుబోయేలా ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏ ఏ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్నదానిపై సండ్ర సవివరంగా మాట్లాడారు. ప్రధానంగా సెబాస్టియన్ - సండ్ర వెంకట వీరయ్యల మధ్య సంభాషణలను ఏసీబీ అధికారులు సవివరంగా సేకరించి మరీ కోర్టుకు సమర్పించారు. మే 27 నుంచి మే 31 మధ్య అయిదు రోజుల గడువులో ఏకంగా 32 సార్లు సెబాస్టియన్, సండ్ర మధ్య సంభాషణలు జరిగాయి. సండ్ర 23 సార్లు కాల్ చేస్తే.. సెబాస్టియన్ 8 సార్లు కాల్ చేశారు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణల రికార్డులను పరిశీలిస్తే.. మొత్తం వ్యవస్థ ఏ స్థాయిలో అవినీతి ప్రవాహిస్తుందో అర్థమవుతుంది. మరోవైపు సండ్రను నిన్న అరెస్ట్ చేసిన అధికారులు ఇవాళ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. అయిదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
'రిమాండ్ రిపోర్ట్ అందిన తర్వాతే ఏదైనా చెప్పగలం'
-
'రిమాండ్ రిపోర్ట్ అందిన తర్వాతే ఏదైనా చెప్పగలం'
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారంలో రిమాండ్ రిపోర్ట్ చదివిన తర్వాతగానీ ఏమీ మాట్లాడలేమని, అది తమకు ఇంకా అందలేదని రేవంత్ తరఫు న్యాయవాదులు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు వేయాలని నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీవెన్ సన్ కు రూ.50 లక్షలు ఇస్తూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డ రేవంత్ రెడ్డిని కలుసుకునేందుకు న్యాయవాదులు సోమవారం తెల్లవారుజామునే బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నప్పటికీ అధికారులు వారిని లోపలికి అనుమతించలేదు. రేవంత్ డబ్బు కట్టలతో పడ్డుబడ్డ వీడియోలపై స్పందిస్తూ 'అధికారికంగా ఎలాంటి సీడీలు విడుదల చేయలేదని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. రిమాండ్ రిపోర్టు వచ్చిన తర్వాతగానీ ఏ ఆధారలతో మా క్లైంటును అరెస్టుచేశారో తెలుస్తుంది. ఆ తర్వాతగానీ ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై మాకొక స్పష్టత వస్తుంది' అని రేవంత్ తరఫు న్యాయవాదులు సమాధానమిచ్చారు. -
జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే..
-
జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే.. ఇలా చేశా: ఓబులేసు
ఓబులేసు రిమాండ్ రిపోర్టు 'సాక్షి' చేతికి చిక్కింది. తనకు ప్రాణాంతక వ్యాధి సోకిందని, చివరిక్షణాల్లో జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకున్నానని.. అందుకే డబ్బు సంపాదించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నానని ఓబులేసు అంగీకరించాడు. 12 ఏళ్ల పాటు గ్రేహౌండ్స్‌లో విధులు నిర్వర్తించానని చెప్పాడు. ప్రముఖులను కిడ్నాప్ చేసి పెద్దమొత్తంలో డబ్బు డిమాండ్ చేయాలనుకున్నానని, అందుకోసమే ఏకే 47ను చోరీ చేశానని ఓబులేసు పోలీసు విచారణలో అంగీకరించాడు. కేబీఆర్ పార్కుకు వాకింగ్ కోసం వచ్చే డబ్బున్నవాళ్లు, పెద్దపెద్ద కార్లలో వచ్చేవాళ్లను గమనించేవాడినన్నాడు. డ్రైవర్ లేని కార్లలో ఓనర్లు ఎక్కిన తర్వాత తాను వెంటనే దూరాలని పథకం వేశానన్నాడు. నిత్యానందరెడ్డి సీటుబెల్టు పెట్టుకుంటున్న సమయంలో తాను సీట్లోకి వెళ్లానని, ఏకే 47తో బెదిరించానని విచారణలో అంగీకరించాడు. అంతకుముందు 2014 ఫిబ్రవరి 19న ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడిని అపహరించానని, యువకుడి తల్లిదండ్రుల నుంచి 10 లక్షలు తీసుకున్నానని, తర్వాత అతడిని వదిలేసి నార్సింగిలోని తన ఇంటికి వచ్చానని చెప్పాడు.