![Disha Police Made Key Comments In Poornananda Remand Report - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/23/Poornanda.jpg.webp?itok=awA6Es87)
సాక్షి, విశాఖపట్నం: భక్తిపేరిట కళ్లబొల్లి కబుర్లు చెప్పిన పూర్ణానంద స్వామి, ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాగా, బాలికను రెండేళ్ల పాటు నిర్బంధించి లైంగికంగా వేధించిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ముందు హాజరుపరిచారు. వచ్చే నెల 5వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో పూర్ణానందను సెంట్రల్ జైలుకు తరలించారు.
ఇక, తాజాగా పూర్ణానంద రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిమాండ్ రిపోర్టులో దిశ పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. పోలీసులు రిపోర్ట్ ప్రకారం.. పూర్ణానంద అర్ధరాత్రి బాలికలను నిద్ర లేపేవాడు. బాలికలను తన గదికి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. ఏడాదిగా అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చింది.
పూర్ణానంద ఇద్దరు బాలికలను అత్యాచారం చేసినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయి. బాలికలు గర్భం దాల్చకుండా పూర్ణానంద వారికి ట్యాబ్లెట్స్ ఇచ్చేవాడు. ఆశ్రమంలో మొత్తం ముగ్గురు బాలికలు, 9 మంది బాలురు ఉన్నారు. బాలికలపై అత్యాచారం జరిగినట్టు ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలో వెల్లడైనట్టు తెలిపారు. మైనర్ బాలిక గర్భం దాల్చడంతో వారి బంధువులు ఆ బాలికను ఆశ్రమం నుంచి తీసుకొని వెళ్లారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. బీటెక్ విద్యార్థి మృతి
Comments
Please login to add a commentAdd a comment