Disha Police Station
-
దిశ పోలీస్ స్టేషన్ల పేర్లు మార్పుపై వరుదు కళ్యాణి కౌంటర్
-
మారని బాబు సర్కారు తీరు!
విజయవాడ, సాక్షి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వ్యవస్థలన్నింటిని ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేసుకుంటూ పోతోంది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికే కొన్నింటిని రద్దు చేసింది. మరికొన్నింటికి పేర్లు మార్చేసింది. ఇంకొంటిలో.. అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిపైనా వేధింపులకు పాల్పడుతోంది. తాజాగా..దిశ పోలీస్ స్టేషన్ ల పేరు మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక జీవోను విడుదల చేసింది. తెలంగాణలో జరిగిన దిశ ఘటన.. యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటన తర్వాత.. మహిళల రక్షణ దిశగా అప్పటి సీఎం వైఎస్ జగన్ అడుగులేశారు. మహిళలపై నేరాల త్వరితగత విచారణ కోసం దిశ చట్టంతో పాటు ప్రత్యేక పోలీస్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అటు కోట్ల మూటలు.. ఇటు నీతి మాటలు 2020 ఫిబ్రవరి 8వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఇవాళ తొలి దిశ పోలీస్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. దిశ చట్టం-పీఎస్‌తో పాటు పత్కర పరిస్థితుల్లో మహిళలకు తక్షణ రక్షణ కోసం దిశ యాప్‌ను సైతం తీసుకొచ్చారు. జగన్ సర్కార్ తీసుకున్న ఈ చర్యలపై నాడు దేశవ్యాప్తంగా చర్చ సైతం నడిచింది. జగన్ పాలన కొనసాగినంత కాలం ‘దిశ’ వ్యవస్థ సమర్థవంతంగా పని చేసింది. అయితే ఆ క్రెడిట్‌ను కనుమరుగు చేయాలనే ప్రయత్నాల్లో.. ఇప్పుడు దిశ పీఎస్‌ల పేర్లు ఉద్దేశపూర్వకంగానే మార్చేస్తోంది చంద్రబాబు సర్కార్. ఇప్పటికే దిశ యాప్ పనితీరును కూటమి సర్కార్ నిర్వీర్యం చేసినట్లు తెలుస్తోంది.దిశా పోలీస్ స్టేషన్లన పేరు మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వంకు పేర్లు మార్చడం పై ఉన్న శ్రద్ధ మహిళల రక్షణపై లేదు. మహిళలకు భద్రత కల్పించాలనే దిశా చట్టం, యాప్, పోలీస్ స్టేషన్లను వైయస్ జగన్ తీసుకొచ్చారు. పక్క రాష్ట్రంలో ఆడపిల్లకు అన్యాయం జరిగితే దిశా చట్టాన్ని వైయస్ జగన్ తీసుకువచ్చారు. దిశా యాప్ తో వేలాది మంది అమ్మాయిలు రక్షణ పొందారు.:::వరుదు కళ్యాణి, YSRCP మహిళా విభాగం అధ్యక్షురాలు -
నర్సింగ్ విద్యార్థినిలకు వేధింపులు.. దిశ పోలీసుల ఎంట్రీతో..
సాక్షి, అన్నమయ్య: నర్సింగ్ చదువుతున్న అమ్మాయిల వెంటపడుతూ వారిని వేధిస్తున్న పోకిరీలకు దిశ పోలీసులు తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో, పోకిరీలు.. దిశ పోలీసులకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. మరొకసారి అమ్మాయిల వెంటపడి, వేధింపులకు గురిచేయమని ఇద్దరు యువకులు పోలీసులకు లేఖ రాసి ఇచ్చారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందలూరులో నర్సింగ్ చదువుతున్న ముగ్గురు అమ్మాయిలు శనివారం కాలేజ్‌కు వెళ్తున్నారు. ఇద్దరు యువకులు అమ్మాయిలను అనుసరించి వేధింపులకు గురిచేశారు. దీంతో, బాధిత యువతులు దిశ ఎస్‌వోఎస్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. కేవలం ఆరు నిముషాల వ్యవధిలో దిశ టీమ్ విద్యార్థినుల ఉన్న లొకేషన్‌కు చేరుకున్నారు. అనంతరం, నర్సింగ్ కాలేజ్ అమ్మాయిల వెంటపడి వేధిస్తున్న సురేష్, చంద్ర శేఖర్ అనే యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు యువకుల తల్లిదండ్రులను కూడా స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరొక్కమారు అమ్మాయిల వెంటపడి వేధింపులకు గురిచేయమని యువకులు లిఖితపూర్వకంగా రాసి పోలీసులకు ఇచ్చారు. ఇక, దిశ యాప్‌ను కొన్ని రోజుల కిందటే డౌన్లోడ్ చేసుకున్నట్లు బాధిత యువతి స్పష్టం చేసింది. దిశ SOSకు కాల్ చేసిన వెంటనే పోలీసులు స్పందించిన తీరు చాలా బాగుందని విద్యార్థినిలు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: వాళ్ళది వివాహేతర సంబంధం కాదు: మనోజ్ తండ్రి -
అత్యాచారం కేసు: పూర్ణానంద రిమాండ్ పొడిగింపు
సాక్షి, విశాఖ: పూర్ణానంద అత్యాచారం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా పూర్ణానంద రిమాండ్‌ను కోర్టు మరోసారి పొడిగించింది. ఇక, మైనర్లపై అత్యాచారానికి పాల్పడినట్టు ఫిర్యాదు రావడంతో దిశ పోలీసులు పూర్ణానందను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక, ఈనెల 17వ తేదీన దిశ పోలీసులు.. ఐడెంటిఫికేషన్ టెస్టు పెరేడ్‌ను నిర్వహించనున్నారు. కాగా, ఇద్దరు మైనర్లపై అత్యాచారం జరిగినట్టు ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. మరోవైపు.. ఈ కేసులో దిశ పోలీసులు.. అన్ని సైంటిఫిక్ ఆధారాలను సేకరిస్తున్నారు. ఇది కూడా చదవండి: పూర్ణానంద రిమాండ్ రిపోర్టు.. ‘అర్ధరాత్రి బాలికలను నిద్ర లేపేవాడు..’ -
పూర్ణానంద రిమాండ్ రిపోర్టు.. ‘అర్ధరాత్రి బాలికలను నిద్ర లేపేవాడు..’
సాక్షి, విశాఖపట్నం: భక్తిపేరిట కళ్లబొల్లి కబుర్లు చెప్పిన పూర్ణానంద స్వామి, ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాగా, బాలికను రెండేళ్ల పాటు నిర్బంధించి లైంగికంగా వేధించిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ముందు హాజరుపరిచారు. వచ్చే నెల 5వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో పూర్ణానందను సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక, తాజాగా పూర్ణానంద రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిమాండ్ రిపోర్టులో దిశ పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. పోలీసులు రిపోర్ట్ ప్రకారం.. పూర్ణానంద అర్ధరాత్రి బాలికలను నిద్ర లేపేవాడు. బాలికలను తన గదికి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. ఏడాదిగా అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చింది. పూర్ణానంద ఇద్దరు బాలికలను అత్యాచారం చేసినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయి. బాలికలు గర్భం దాల్చకుండా పూర్ణానంద వారికి ట్యాబ్లెట్స్ ఇచ్చేవాడు. ఆశ్రమంలో మొత్తం ముగ్గురు బాలికలు, 9 మంది బాలురు ఉన్నారు. బాలికలపై అత్యాచారం జరిగినట్టు ఎఫ్ఎస్ఎల్ నివేదికలో వెల్లడైనట్టు తెలిపారు. మైనర్ బాలిక గర్భం దాల్చడంతో వారి బంధువులు ఆ బాలికను ఆశ్రమం నుంచి తీసుకొని వెళ్లారని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. బీటెక్ విద్యార్థి మృతి -
బ్లాక్ మెయిలింగ్: భర్త సంసారానికి పనికిరాడని తెలిసినా కూడా!
దిశ పోలీస్స్టేషన్లతో కొత్త దశ మొదలైంది. చిన్నారులు, మహిళల సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది. ఇవి ఎన్నో సమస్యలు పరిష్కరిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లల కాపురాలను చక్కదిద్దుతున్నాయి. కడప అర్బన్ : సమాజంలో భార్యాభర్తల అన్యోన్యతతో కుటుంబ అభివృద్ధి, తద్వారా పిల్లల శ్రేయస్సు, వారి ద్వారా సమాజాభివృద్ధి సుసాధ్యమవుతుంది. వారి మధ్య కలతలు కాపురంలో చిచ్చు రేపుతున్నాయి. గ్రామీణ స్థాయి నుంచి పట్టణ, నగర స్థాయికి వచ్చిన వారు తాము చేస్తున్న వ్యాపారాలు, ఉద్యోగాల ‘బిజీ లైఫ్’తో తమ పిల్లల బాగోగులను పట్టించుకునే స్థితిలో వుండరు. దీంతో పిల్లలు శారీరక పెరుగుదల, ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు సాధిస్తున్నారు. కానీ తమ దైనందిన జీవితంలో తల్లిదండ్రులు, పెద్దలు, గురువులను ఎలా గౌరవించాలి. తాను జీవితాంతం తోడు నీడగా వుండాల్సిన భార్య, భర్త స్థానాలు ఎలా వుండాలి? అనే విధానాలపై ‘మానసిక పరిపక్వత’ చెందక అవగాహన రాహిత్యంతో ‘సంసార జీవితాల’ను దూరం చేసుకుంటున్నారు. పూర్వకాలంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు వుండేవి. అవ్వా,తాతలు తమ పిల్లలకు, మనువలు, మనువరాళ్లకు మంచి, చెడ్డా, కుటుంబ జీవన విధానం, సమాజంలో మెలిగే పద్ధతులను నేర్పించేవారు. రానురాను ఆ విధానంలో వచ్చిన మార్పులతో చిన్నచిన్న కుటుంబాలుగా విడిపోయి, జీవన విధానాలను నగరజీవితాలుగా మార్చుకుని భర్త,భార్య, పిల్లలుగా మారిపోయి ఆర్థికంగా మెరుగు పడాలనే తాపత్రయంలో పడిపోయారు. కాలక్రమేణ వారి పిల్లల కార్పొరేట్ చదువులపై వున్న శ్రద్ధ, వారి క్రమశిక్షణతో జీవితాన్ని సాగించేలా చూడాలనే విధానం సన్నగిల్లిపోయింది. అంతేగాక ఆడ,మగ పిల్లలను చిన్నతనం నుంచే వారికి ఇచ్చే స్వేచ్ఛా, స్వాతంత్య్రాలతో పెరిగి పెద్దవాళ్లయిన తరువాత కూడా అదే విధానం అవలంబించడం వల్ల జీవితగమనంలో విభేదాలు తలెత్తుతున్నాయి. సమస్యల చుట్టూ పరిభ్రమిస్తున్న జీవితాలు ► ఆధునిక సాంకేతికతతో ‘సెల్‌ఫోన్’ లేకుండా చిన్న పిల్లాడి నుంచి పెద్దల వరకు వుండలేకపోతున్నారు. ‘సెల్‌ఫోన్’ దైనందిన జీవితంలో భాగమవడంతోపాటు, వ్యసనంగా మారింది. ‘దిశ’ మహిళా అప్‌గ్రేడ్ పోలీస్‌స్టేషన్ వారు భార్యాభర్తల మధ్య ఏర్పడుతున్న కలతలకు కారణాలను తెలుసుకుని ‘కౌన్సెలింగ్’ అనే బ్రహ్మాస్త్రంతో తొలగించేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నారు. ఈ విధానం ద్వారా చాలా కేసుల్లో విజయవంతంగా ముందుకు వెళుతున్నారు. ► 18 ఏళ్ల వయసు రాగానే, పూర్తవకముందే కొందరు ఆడపిల్లలు తల్లిదండ్రులను సైతం లెక్కచేయకుండా తాను ప్రేమించిన యువకుడే సర్వస్వం అంటూ ముందుకు వచ్చి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఎంత త్వరగా జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నారో, వీరిలో కొందరు అంతే త్వరగా విడిపోవడానికి సిద్ధపడుతున్నారు. ► కొందరు తమ సెల్ఫోన్ల ద్వారా ఇంటిలో పడకగది నుంచి స్నానాల గదుల వరకు ఒకరిపై మరొకరు నమ్మకం లేక వీడియోలను తీసుకుంటూ వారి సంసారాన్ని వారే నాశనం చేసుకుంటున్నారు. ► విద్యావంతులైన వారే కొందరు ఆడపిల్లలు తమ వైవాహిక జీవితాన్ని ఆరు నెలలకు గానీ, ఏడాది పూర్తవక ముందే భర్త సంసారానికి పనికిరాడని నిర్ణయించుకుంటున్నారు. ‘కౌన్సెలింగ్ పీరియడ్’ రెండు నెలల కాలం పూర్తవక ముందే ‘కక్షసాధింపు’ ధోరణిలో ప్రవర్తిస్తూ విడిపోతున్నారు. కడప ‘దిశ’ పోలీస్ స్టేషన్ ద్వారా అందిస్తున్న సేవలు ► కడప దిశ పోలీస్‌స్టేషన్‌కు నేరుగాగానీ, జిల్లా ఎస్పీ నిర్వహించే ‘స్పందన’ ద్వారా వచ్చే భార్యాభర్తల, మహిళల, చిన్నపిల్లల సమస్యలు, నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను డీఎస్పీ స్థాయి అధికారి దృష్టికి వస్తాయి. ఆయన ఆదేశాల మేరకు మొదట బాధితుల సమస్యలను తెలుసుకుంటారు. భార్యాభర్తల మధ్య ప్రాథమికంగా మనస్పర్థలను తొలగించేందుకు ఇక్కడి సిబ్బంది ప్రయత్నిస్తారు. లేదంటే మొదటి రెండు నెలలు ‘కూలింగ్ పీరియడ్’లో మూడు లేదా ఐదు కౌన్సెలింగ్‌లను నిర్వహించి వారి మధ్య విభేదాలను తొలగించి సజావుగా కాపురం చేసుకునేలా ప్రయత్నిస్తారు. కలువలేని పరిస్థితుల్లో వారి ఇష్ట ప్రకారం ఎఫ్.ఐ.ఆర్‌లను తమ పరిధిలో గానీ, ఆయా పోలీస్స్టేషన్ల ద్వారా నమోదు చేయిస్తారు. తరువాత న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఈ కౌన్సెలింగ్‌లను ప్రతి మంగళవారం, శనివారం నిర్వహిస్తారు. ఈ కౌన్సెలింగ్‌కు భార్యాభర్తలను విడివిడిగా పోలీసు అధికారి, మనస్తత్వశాస్త్ర నిపుణులు, న్యాయవాదులు, ఎన్జీఓ సంఘానికి చెందిన సభ్యుల సమక్షంలో విచారణ చేస్తారు. తరువాత ఇద్దరిని కలిపి విచారణ చేసి విడిపోతే కష్ట,నష్టాలు, కలిసుంటే జీవితాంతం సంసారం సాఫీగా సాగుతుందని ‘పోస్ట్ మేరిటల్ కౌన్సెలింగ్’ విధానం ద్వారా వివరిస్తారు. గతంలో ప్రతి మంగళవారం, శనివారం కౌన్సెలింగ్‌ను ఐదు జంటలలోపు నిర్వహించేవారు. ప్రస్తుతం 10 నుంచి 15 జంటలకు నిర్వహించాల్సి వస్తోంది. ► కొందరు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు తమ ఆడపిల్లలకు తక్కువ వయసులోనే వివాహం చేస్తుంటారు. వారికి వైవాహిక జీవితంపై అవగాహన వుండదు. అలాంటి జంటలకు కౌన్సెలింగ్ ద్వారా వారి మధ్య మనస్పర్థలు తొలగించి, వారిని ఒక్కటిగా చేసి పంపిస్తున్నారు. ► ఉద్యోగం వుంటే ఆర్థిక స్వేచ్ఛ కలిగి వుంటుందని కొందరు మహిళలు గానీ, పురుషులుగానీ వివాహేతర సంబంధాలు, రెండో వివాహంపై మొగ్గు చూపుతూ సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో కొందరిని కౌన్సెలింగ్ నిర్వహించడం ద్వారా కలుపుతున్నారు. కొందరు ఎన్ని కౌన్సెలింగ్‌లు నిర్వహించినా అవగాహన రాహిత్యంతో దూరంగానే వుంటున్నారు. మచ్చుకుకొన్ని.. ► పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాక తన భర్త సంసారానికి పనికిరాడని తెలుసుకుని తల్లిదండ్రులకు చెప్పలేక తనలోనే కుమిలిపోయి నరకం అనుభవించింది. డబ్బుల కోసం తన భర్త మరో వివాహానికి సిద్ధపడితే పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు వాస్తవాలను విచారణ చేసి వారు విడిపోతేనే మంచిదని భావించారు. ► తనను ప్రేమించిన సమయంలో ఫొటోలు తీసుకున్న యువతిని, వేరే వివాహం చేసుకున్న తరువాత ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫొటోలుగా మార్చి ‘బ్లాక్ మెయిలింగ్’కు పాల్పడిన ఓ యువకుడిని పిలిపించి, సదరు న్యూడ్ ఫొటోలను తొలగించి, చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం జరిగేలా కృషి చేశారు. ► ఓ తొమ్మిదినెలల పసిబాబును, భార్యను మనస్పర్థలతో దూరం చేసుకున్న భర్తను ఒకేఒక్క కౌన్సెలింగ్ ద్వారా వారిని కలిపి పంపించారు. ► కొందరు భర్తలు మద్యం, ఇతర చెడు వ్యసనాలకు బానిసలుగా మారి వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించడం, అవసరమైతే ‘డీ ఆడిక్షన్’ సెంటర్లకు పంపించి వారిని కలిపేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నారు. కౌన్సెలింగ్ ద్వారానే మనస్పర్థలకు చెక్ భార్యాభర్తల మధ్య ఏర్పడిన విభేదాలను తొలగించేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది సహకారంతో కృషి చేస్తున్నాం. ప్రతి మంగళ, శనివారాలలో ‘కౌన్సెలింగ్’ను నిర్వహించి వారి మధ్య అభిప్రాయ భేదాలను తొలగించి న్యాయం జరిగేలా చూస్తున్నాం. మహిళలు, చిన్నారుల పట్ల జరిగే నేరాల నియంత్రణకు అహర్నిశలు పనిచేస్తున్నాం. ‘దిశ’ యాప్‌ను జిల్లా వ్యాప్తంగా మహిళల చేత డౌన్లోడ్ చేయించాం. ఆపద సమయాలలో ఆదుకుంటున్నాం. – ఎస్.రమాకాంత్, కడప ‘దిశ’ డీఎస్పీ -
ఉద్యోగినిపై వేధింపులు.. దిశ పోలీసులకు కాల్.. ఆరు నిమిషాల్లోనే
శ్రీకాకుళం: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన దిశ చట్టం, ఎస్ఓఎస్ యాప్ సత్ఫలితాలనిస్తున్నాయి. తాజాగా పొందూరు మండలంలో బుధవారం జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. పొందూరు మండలంలో పనిచేస్తున్న ఉద్యోగినిని రణస్థలం మండలం కోటపాలెం సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఎ.ధర్మారావు వేధింపులకు గురిచేశాడు. బైక్‌పై ఉద్యోగానికి వెళ్తున్న యువతిని రాపాక జంక్షన్ వద్ద అడ్డగించి బెదిరించాడు. వెంటనే అమ్మాయి ప్రాణభయంతో దిశ ఎస్‌వోఎస్‌కు కాల్ చేసి సహాయం కోరింది. దీంతో ఆరు నిమిషాల్లో సంఘటనా స్థలానికి దిశ పోలీసులు చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని బాధితురాలికి భరోసా కల్పించారు. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. -
డిగ్రీ విద్యార్థిని అనూష హత్య కేసు.. ప్రేమోన్మాదికి జీవితఖైదు
నరసరావుపేట టౌన్: తన ప్రేమను నిరాకరించిందని యువతిని దారుణంగా హత్య చేసిన ప్రేమోన్మాదికి జీవితఖైదు, రూ.2,500 జరిమానా విధిస్తూ పల్నాడు జిల్లా నరసరావుపేట 13వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఒంగోలు వెంకటనాగేశ్వరరావు గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన కోటా అనూష నరసరావుపేట రామిరెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదివేది. అదే కళాశాలలో చదువుతున్న బొల్లాపల్లి మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన మేడం విష్ణువర్ధన్‌రెడ్డి తనను ప్రేమించాలని అనూషను వేధింపులకు గురిచేశాడు. ఆమె నిరాకరించడంతో 2021, ఫిబ్రవరి 24న కళాశాలకు వెళుతున్న అనూషను మాట్లాడాలని విష్ణువర్ధన్‌రెడ్డి బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని పట్టణ శివారులోని పాలపాడు రోడ్డు గోవిందపురం మైనర్ కాలువ వద్దకు తీసుకువెళ్లి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేసి పరారయ్యాడు. మృతురాలి తల్లి వనజాక్షి ఫిర్యాదు మేరకు నరసరావుపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవడంతోపాటు రూ.10 లక్షల పరిహారం అందించింది. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసును పల్నాడు జిల్లా దిశ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రత్యేక విచారణ అధికారిగా డీఎస్పీ రవిచంద్రను నియమించారు. హత్యపై సమగ్ర వివరాలు సేకరించి చార్జిషీట్ దాఖలు చేసి సకాలంలో సాక్షులను కోర్టులో హాజరుపరిచారు. దీంతో విచారణ చేసిన న్యాయమూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుడికి జీవతఖైదు, రూ.2,500 జరిమానా విధించారు. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా కృషి చేసిన పోలీసులను ఎస్పీ రవిశంకర్‌రెడ్డి అ«భినందించారు. దిశ డీఎస్పీ రవిచంద్రను అనూష తల్లిదండ్రులు సన్మానించారు. పోలీసుల సహకారంతోనే త్వరగా శిక్ష ప్రేమించలేదన్న అక్కసుతో మా అమ్మాయిని దుండగుడు విష్ణువర్ధన్‌రెడ్డి కిరాతకంగా గొంతునులిమి హత్య చేశాడు. పోలీసుల సహకారంతో త్వరితగతిన నిందితుడికి శిక్ష పడింది. ప్రభుత్వం, పోలీసులు మా కేసు పట్ల చూపించిన శ్రద్ధ మరువలేం. నిందితుడికి యావజ్జీవ శిక్ష పడినప్పటికీ... ఉరిశిక్ష వేసి ఉంటే బాగుండేది. – కోటా వనజాక్షి, అనూష తల్లి ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టాం. నిందితుడ్ని 24 గంటల్లో అరెస్ట్ చేసి 48 గంటల వ్యవధిలో ప్రాథమిక చార్జిషీట్, వారం రోజుల్లో సమగ్ర విచారణ జరిపి తుది చార్జిషీట్‌ను దాఖలు చేశాం. దిశ ద్వారా సత్వర న్యాయం అందుతుందన్న భావన ఈ కేసుతో రుజువైంది. – రవిచంద్ర, దిశ డీఎస్పీ, నరసరావుపేట -
పోలీస్ విధులకు ఆటంకం కలిగించారు
సాక్షి,భీమవరం/రాజమహేంద్రవరం రూరల్/బిక్కవోలు: విశాలమైన ప్రదేశంలో సభ నిర్వహించుకునేందుకు అనుమతిచ్చినా పట్టించుకోకుండా.. రోడ్డుపై సభ పెట్టడమే కాకుండా.. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకే టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రులు జవహర్, నిమ్మకాయల చినరాజప్ప తదితరులపై కేసు నమోదు చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ సీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శనివారం రాజమహేంద్రవరంలోని దిశ పోలీస్‌స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘శుక్రవారం అనపర్తి నియోజకవర్గంలో ‘రాష్ట్రానికి ఇదేం ఖర్మ’ కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతి కోరుతూ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దరఖాస్తు చేశారు. రోడ్డుపై సభ నిర్వహించకూడదన్న షరతులతో వారికి అనుమతులిచ్చాం. విశాలమైన ప్రదేశంలో, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సభ నిర్వహించుకోవాలని సూచించాం. కానీ పోలీసుల మాటలు పట్టించుకోకుండా.. బిక్కవోలు నుంచి అనపర్తికి చంద్రబాబు, టీడీపీ నేతలు ర్యాలీగా వస్తుండటంతో ఆర్ఎస్ పేట ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద డీఎస్పీ భక్తవత్సలనాయుడు వారితో షరతుల ఉల్లంఘనపై చర్చించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మాజీ మంత్రులు జవహర్, నిమ్మకాయల చినరాజప్పతో పాటు వెయ్యి మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు ప్రోద్బలంతో పోలీసులను నెట్టుకుంటూ ముందుకు దూసుకొచ్చారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. ఈ ఘటనపై డీఎస్పీ శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలు వెయ్యి మందిపై బిక్కవోలు ఎస్సై బుజ్జిబాబు కేసు నమోదు చేశారు’ అని ఇన్చార్జ్ ఎస్పీ సుధీర్‌కుమార్ వివరించారు. ఇరుకైన ప్రదేశం కావడంతో అనపర్తిలో రోడ్‌షోకు మాత్రమే అనుమతిచ్చామని.. సభకు అనుమతివ్వలేదని స్పష్టం చేశారు. గోకవరంలో చంద్రబాబు సభను అడ్డుకోలేదని తెలిపారు. కేసు విచారణ చేపట్టి సంబంధిత నేతలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సభ నిర్వాహకులపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవు.. అనుమతులు లేని ప్రాంతాల్లో సభలు నిర్వహించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టబద్ధమైన చర్యలు తప్పవని ఐజీ జి.పాలరాజు చెప్పారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో సభ నిర్వహణకు కళాక్షేత్రంతోపాటు బలభద్రపురం వద్ద పెద్ద లేఅవుట్‌ను సూచించి అక్కడ పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని చెప్పినా వినకుండా.. చంద్రబాబు, టీడీపీ నేతలు పోలీసులను నెట్టేసి.. రోడ్డు పైనే సభ పెట్టారని పాలరాజు తెలిపారు. ఇదే సమయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు కొందరు బస్సు అద్దాలు పగలగొట్టడంతో పాటు పోలీసులపై రాళ్లు రువ్వారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో మాజీ సీఎం చంద్రబాబుకు రక్షణ కల్పించేందుకే పోలీసులు కొద్దిపాటి లాఠీచార్జి చేయాల్సి వచ్చిందన్నారు. రాళ్లు రువ్వినవారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ రవిప్రకాష్, డీఎస్పీ బి.శ్రీనాథ్ పాల్గొన్నారు. -
బాలికపై లైంగిక దాడి కేసులో వృద్ధుడికి 20 ఏళ్ల జైలు
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఓ బాలికపై లైంగిక దాడి కేసులో 73 ఏళ్ల వృద్ధుడికి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ విశాఖ పోక్సో కోర్టు సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. విశాఖలోని ఆరిలోవ ప్రాంతంలో మూడో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక తల్లితో కలిసి నివాసముంటోంది. ఒక రోజు పాఠశాల నుంచి వచ్చి ఇంటి బయట స్నేహితులతో ఆడుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన కోలాటి బాలయోగి (73) బాలికకు మాయమాటలు చెప్పి అతడి ఇంటికి తీసుకువెళ్లి.. లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇలా సుమారు ఐదు నెలల పాటు బాలికను హింసించాడు. బాలికకు తరచూ కడుపునొప్పి వస్తుండడంతో తల్లి ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. వైద్య పరీక్షలో అసలు విషయం తేలింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దిశా పోలీస్‌స్టేషన్ ఏసీపీ డాక్టర్ జి.ప్రేమ్‌కాజల్ దర్యాప్తు చేసి నిందితుడు బాలయోగిని అరెస్టు చేసి పూర్తి ఆధారాలతో పోక్సో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఆధారాలను పరిశీలించిన పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.రామశ్రీనివాస్ ముద్దాయి బాలయోగికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించారు. అలాగే బాధిత బాలికకు నష్టపరిహారంగా రూ.4 లక్షలు ఇవ్వాలని తీర్పు వెలువరించారు. -
రెచ్చిపోయిన మృగాలు.. స్కూటీపై వెళ్తున్న మహిళను అడ్డుకుని పొల్లాల్లోకి లాక్కెళ్లి..
ఒంగోలు సబర్బన్: రాత్రివేళ స్కూటీపై ఇంటికి వెళ్తున్న ఓ మహిళను ఇద్దరు యువకులు అడ్డుకుని అఘాయిత్యానికి పాల్పడ్డారు. చిమ్మచీకట్లో పొలాల్లోకి లాక్కెళ్లి లైంగికదాడి చేశారు. ఒంగోలులోని కొప్పోలు–ఆలూరు రోడ్డులో బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. కొత్తపట్నం మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన వివాహిత(30) ఒంగోలు నగరంలో కూరగాయల వ్యాపారం చేస్తుంటుంది. బుధవారం రాత్రి వ్యాపారం ముగించుకుని 10.30 గంటల సమయంలో స్కూటీపై ఇంటికి వెళ్తోంది. ఆ సమయంలో ఇద్దరు యువకులు అడ్డుకుని అఘాయిత్యానికి పాల్పడ్డారు. తొలుత ద్విచక్ర వాహనంపై ఆమెను వెంబడించారు. కొప్పోలు–గుత్తికొండవారిపాలెం రోడ్డులో గుత్తికొండవారిపాలెం దాటిన తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో అడ్డుకున్నారు. చీకట్లో పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారు. అనంతరం ఇంటికి వెళ్లిన ఆమె.. ఆ విషయాన్ని తన తల్లికి చెప్పుకుంది. గురువారం ఒంగోలు వచ్చి ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీస్ అధికారులను వేడుకుంది. ఎస్పీ మలికాగర్గ్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని అఘాయిత్యానికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులు ఆలూరు రోడ్డులోని రొయ్యల చెరువుల వద్ద పనిచేసే వారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును ఒంగోలు తాలూకా పోలీస్‌స్టేషన్ నుంచి ఒంగోలు దిశ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. దర్యాప్తును ముమ్మరం చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. -
ఆ కేసు విచారణకు స్వీకరిస్తేనే ఎన్ఓసీ అవసరం
సాక్షి, అమరావతి: ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి, అతని పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నప్పుడు, ఆ క్రిమినల్ కేసును సంబంధిత కోర్టు విచారణకు(కాగ్నిజెన్స్) స్వీకరించినప్పుడు మాత్రమే.. నిందితుడు విదేశాలకు వెళ్లాలంటే సంబంధిత కోర్టు నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. కేసు సంబంధిత కోర్టులో పెండింగ్‌లో ఉన్నంత మాత్రాన, ఆ కేసును పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుగా భావించడానికి వీల్లేదంది. సంబంధిత కోర్టు ఆ కేసును విచారణకు తీసుకోనంత వరకు విదేశీయానం విషయంలో ఆ కోర్టు నుంచి ఎన్ఓసీ అవసరం లేదంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ఇటీవల తీర్పునిచ్చారు. పిటిషనర్ నుంచి స్వాధీనం చేసుకున్న పాస్‌పోర్ట్‌ను తిరిగి అతనికి ఇచ్చేయాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. కేసు విచారణకు హాజరయ్యే హామీతో రూ.2 లక్షలను విజయవాడ రెండో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో డిపాజిట్ చేయాలని పిటిషనర్‌ను ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా, ఆలమూరు మండలానికి చెందిన డీవీ సూర్యనారాయణమూర్తిపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఖతార్‌లో ఉద్యోగం చేస్తున్న సూర్యనారాయణమూర్తి మన దేశానికి రాగానే విజయవాడ దిశా పోలీసులు అతని పాస్‌పోర్టును సీజ్ చేశారు. అంతేకాక అతని పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకోవాలంటూ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధి కారికి లేఖ రాశారు. దీనిపై సూర్యనారాయణమూర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
Extramarital Affair: భర్తకు వివాహేతర సంబంధం ఉందంటూ..
విజయనగరం క్రైమ్: భర్తకు వివాహేతర సంబంధం ఉందంటూ సీసీఎస్‌లో పనిచేస్తున్న షేక్ ఇల్తామష్ భార్య దిశ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేసింది. వివరాలి ఉన్నాయి. స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పైన ఉన్న సీసీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ షేక్ ఇల్తా మష్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన అతని భార్య నసీమా ఆదివారం ఫిర్యాదు చేసిందని విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని దిశ డీఎస్పీ త్రినాథ్ వెల్లడించారు. చదవండి: ఇలా చేశావేంటి అలెగ్జాండర్.. యువతిని నమ్మించి.. మోసగించి.. మరో మహిళతో.. -
రోజుల్లోనే దర్యాప్తు.. నెలల్లోనే శిక్షలు
సాక్షి, అమరావతి: మహిళలపై నేరాల కేసుల్లో పోలీసుశాఖ దూకుడు నేరస్తులను బెంబేలెత్తిస్తోంది. నేరం చేసినా ఏం ఫర్వాలేదు.. విచారణ ఏళ్లపాటు సాగుతుందిలే అనే నేరస్తుల ధీమాకు కాలం చెల్లింది. రోజుల్లోనే దర్యాప్తు పూర్తిచేసి నెలల్లోనే విచారణ ప్రక్రియ ముగించి కోర్టుల ద్వారా శిక్షలు ఖరారు చేస్తుండటం నేరస్తులను హడలెత్తిస్తోంది. ఇటీవల గుంటూరు జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య హత్యకేసులో దోషికి 257 రోజుల్లోనే ఉరిశిక్ష పడగా.. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విదేశీ మహిళపై అత్యాచారయత్నం కేసులో 13 రోజుల్లోనే దర్యాప్తు పూర్తిచేసి 57 రోజుల్లోనే శిక్ష విధించారు. మహిళలపై నేరాల కేసులను ఏమాత్రం ఉపేక్షించవద్దని, దోషులకు సత్వరం శిక్షలు పడేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ పోలీసు శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో దోషులకు శిక్షలుపడేలా పోలీసు శాఖ జిల్లాల వారీగా కార్యాచరణను అమలు చేస్తోంది. దేశంలోనే రికార్డు వేగంతో శిక్ష ఖరారు నెల్లూరు జిల్లాలో లిథువేనియాకు చెందిన మహిళపై అత్యాచారయత్నం కేసులో దోషులకు దేశంలోనే రికార్డు వేగంతో శిక్షలు విధించారు. బాధితురాలు విదేశీ మహిళ కావడంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆమె తమ దేశానికి వెళ్లాల్సి ఉంది. ఆమె స్వదేశానికి వెళ్లిపోతే ఇక్కడ దర్యాప్తు పూర్తిస్థాయిలో నిర్వహించలేమని, విచారణ ప్రక్రియ దీర్ఘకాలం కొనసాగితే నిందితులకు అనుకూలంగా మారవచ్చని పోలీసులు గుర్తించారు. దీంతో అత్యంత వేగంగా దర్యాప్తు కొనసాగించారు. ► తనపై జరిగిన అత్యాచారయత్నంపై మార్చి 8న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. 8 గంటల్లోనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసును దిశ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ► ఏడురోజుల్లోనే అంటే మార్చి 16న కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ► అనంతరం ఆరు రోజుల్లోనే విచారణ ప్రక్రియ పూర్తిచేశారు. 21 మంది సాక్షులను మార్చి 29 నుంచి ఏప్రిల్ 1లోగా రోజుకు ఏడుగురు చొప్పున విచారించారు. ఏప్రిల్ 4న సాక్ష్యాల పరిశీలన పూర్తి చేశారు. ► తరువాత రెండురోజుల్లోనే అంటే ఏప్రిల్ 6, 7 తేదీల్లో ఇరువైపుల వాదనలు పూర్తయ్యాయి. ► తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం మే 5న తీర్పు వెలువరించింది. మొత్తంమీద ఘటన జరిగిన 57 రోజుల్లోనే దోషులకు శిక్షలు విధించడం ద్వారా దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచింది. జిల్లాల వారీగా కార్యాచరణ మహిళలపై దాడులకు పాల్పడే కేసుల్లో దోషులకు సత్వరం శిక్షలు విధించేలా చేయడం కోసం పోలీసు శాఖ జిల్లాల వారీగా కార్యాచరణ చేపట్టింది. జిల్లాలో సున్నితమైన 25 కేసులను ఎంపికచేసి వాటి దర్యాప్తు, విచారణపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. సమగ్ర ఆధారాల సేకరణ, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా సాక్షుల విచారణ, సమగ్రంగా వాదనలు వినిపించి నేరనిరూపణ జరిగేలా చొరవ చూపుతున్నారు. నేర నిరూపణకు అవసరమైన మౌలిక వసతులను ప్రభుత్వం ఇప్పటికే పటిష్టపరచడంతో దర్యాప్తు ప్రక్రియ వేగవంతం చేసేందుకు ఉపకరిస్తోంది. దిశ పోలీసు స్టేషన్లు, ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఏర్పాటు, దిశ కేసుల దర్యాప్తునకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం, మహిళలపై దాడుల కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు తదితర చర్యలతో దర్యాప్తు, న్యాయవిచారణ వ్యవస్థ బలోపేతమయ్యాయి. పోలీసు, న్యాయశాఖల సమన్వయంతో దోషులను గుర్తించి సత్వరం శిక్షలు విధించడం సాధ్యపడుతోంది. అందుకు తాజా ఉదాహరణలు.. ► హిందూపురంలో ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో 34 రోజుల్లోనే దర్యాప్తు, న్యాయవిచారణను పూర్తిచేశారు. దోషికి న్యాయస్థానం పదేళ్ల జైలుశిక్ష విధించింది. ► రాజమహేంద్రవరంలో ఒక అత్యాచారం కేసులో కూడా అత్యంత వేగంగా దర్యాప్తు చేసి న్యాయవిచారణ ప్రక్రియ ముగించడంతో దోషికి న్యాయస్థానం జీవితఖైదు విధించింది. ► గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థిని రమ్య హత్యకేసును కూడా అత్యంత వేగంతో దర్యాప్తు చేసి దోషి శశికృష్ణకు 257 రోజుల్లోనే న్యాయస్థానం ద్వారా ఉరిశిక్ష విధించేలా చేశారు. 2021 ఆగస్టు 15న రమ్య హత్యకు గురికాగా.. కేవలం 10 గంటల్లోనే నిందితుడు శశికృష్ణను అరెస్టు చేశారు. ఫోరెన్సిక్, డీఎన్ఏ పరీక్షలను 48 గంటల్లోనే పూర్తిచేసి నివేదికలు తెప్పించారు. వారం రోజుల్లోనే చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్రమం తప్పకుండా విచారణకు హాజరై వాదనలు వినిపించడంతో ఘటన జరిగిన 257 రోజుల్లోనే న్యాయస్థానం హంతకుడికి ఉరిశిక్ష విధించింది. నేరస్తులకు ఇదే హెచ్చరిక మహిళలపై నేరాల కేసుల దర్యాప్తు, విచారణను రికార్డు వేగంతో పూర్తిచేస్తున్నాం. శాస్త్రీయ ఆధారాలతో నేరాన్ని నిరూపించి సత్వర శిక్షలు విధిస్తుండటం నేరస్తులకు హెచ్చరిక వంటిది. నేరాలకు పాల్పడితే తప్పించుకోవచ్చనో, విచారణ పేరిట కాలయాపన చేయవచ్చనుకునే పరిస్థితులు లేవు. మహిళలపై నేరాలకు పాల్పడితే కచ్చితంగా శిక్ష పడుతుందని నిరూపిస్తున్నాం. – కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ ఏపీ పోలీసులకు కృతజ్ఞతలు తనపై అత్యాచారయత్నం కేసును సత్వరం విచారించి దోషులకు శిక్షలు పడేలా చేసిన రాష్ట్ర పోలీసులకు లిథువేనియా మహిళ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసులో పోలీసుల స్పందనను ప్రశంసిస్తూ ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. – లిథువేనియా మహిళ -
మహిళలకు అండగా ‘దిశ’ స్టేషన్లు
పీఎం పాలెం (భీమిలి): దిశ పోలీస్స్టేషన్లు మహిళల రక్షణకు నిరంతరం అండగా ఉంటాయని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత చెప్పారు . శనివారం విశాఖలోని ఎండాడ దిశ పోలీస్‌స్టేషన్‌ను ఆమె సందర్శించారు. మహిళలు, బాలికలపై జరుగుతోన్న అమానుష ఉదంతాలు తనని తీవ్రంగా కలిచి వేస్తున్నాయన్నారు. దిశ పోలీస్స్టేషన్లు రాష్ట్రవ్యాప్తంగా ఆపదలో ఉన్న 900 మంది మహిళలకు రక్షణ కల్పించాయని వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1.24 కోట్ల మంది ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నట్లు చెప్పారు. విశాఖ దిశ పోలీస్ స్టేషన్ పరిధిలో 7.31 లక్షల మంది ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిపారు. దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న తరవాత విధిగా దిశ పోలీస్ స్టేషన్లో రిజిస్ట్రేషన్ (ఎస్‌వోఎస్) చేయించుకోవాలని సూచించారు. ఎస్‌వోఎస్ సమయంలో కొంత సమాచారం ఇవ్వవలసి ఉంటుందని అంతమాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మహిళలకు అవగాహన కల్పించడానికి స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆమె తిలకించారు. -
Disha Bill: సత్వర పరిష్కార దిశ
ఆడపిల్ల పుడితే... అదృష్టం పుట్టిందని సంబరపడాలి. ఆడపిల్ల పెరుగుతుంటే... ఆ ఇంట్లో ఆనందం వెల్లి విరియాలి. ఆడపిల్ల ఆ ఇంటికి సంతోషం... ఆ ఇంటి వేడుకల కల్పవల్లి. ఆ సంతోషం... ఆనందం... అదృశ్యమై ఆందోళన రాజ్యమేలుతుందా? ఆడపిల్ల అమ్మానాన్నల గుండె ఆందోళనతో కొట్టుకుంటే ఆ తప్పెవరిది? మొదట సమాజానిది... ఆ తర్వాత చట్టానిది... ప్రభుత్వానిది. ప్రభుత్వం ఆ ‘దిశ’ గా అప్రమత్తమైంది... నేరగాళ్ల మీద కొరడా ఝళిపిస్తోంది. అతడు 85 ఏళ్ల వృద్ధుడు, కోర్టు బోను ఎక్కడానికి కూడా దేహం సహకరించనట్లు ఆయాసపడుతున్నాడు. ఎట్టకేలకు అతడిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అతడి మీద నమోదైన కేసు గురించి తెలిసి పోలీసుల మీద న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తమ దగ్గరున్న ఆధారాలు సమర్పించారు. ఆ ఆధారాలను చూసిన న్యాయమూర్తి ఆగ్రహాన్ని అణచుకుంటూ తీర్పు రాశారు. ఆ తీర్పు పాఠం కోసం కోర్టు హాలు నిశ్శబ్దంగా చెవులు రిక్కించింది. అతడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు న్యాయమూర్తి. సరైన తీర్పే వచ్చిందని ఊపిరి పీల్చుకున్నారంతా. అపరాధి మాత్రం ‘మన న్యాయవ్యవస్థ ఇంత త్వరగా తీర్పులు చెప్పేస్తోందా, మన పోలీసులు ఇంత త్వరగా కేసులు దర్యాప్తు చేసేసి బలమైన ఆధారాలు సేకరించి శిక్ష పడేవరకు విశ్రమించడం లేదా! కేసు కోర్టుకు రావడానికి ఏ పుష్కరకాలమో పడుతుందనుకుంటే... వీళ్లకిదేం పోయేకాలం...’ అన్నట్లు అసహనంగా చూశాడు. బాధితురాలు మూడేళ్ల పాపాయి. తనకేం జరిగిందో తనకు తెలియదు. రోజూ తాను ఆడుకునే పక్కింటి తాతయ్య తన మీద ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడో కూడా తెలియని పసితనం ఆ పాపాయిది. ఈ జ్ఞాపకాలేవీ తన బిడ్డకు గుర్తుండకూడదని కూతుర్ని తన వైపు తిప్పి గట్టిగా హత్తుకుంది. కోర్టు దృశ్యం పాపాయి మెదడులో నిక్షిప్తం కాకూడదని దేవుణ్ని ప్రార్థిస్తోంది పాపాయి తల్లి. సంఘటన జరిగిన ఆరు రోజుల్లో కేసు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు వేశారు ‘దిశ’ పోలీసులు. తొమ్మిది నెలల్లో నిందితుడికి శిక్ష పడింది. ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలను నివారించేందుకు దిశ పోలీసులు చేస్తున్న యజ్ఞమిది. ∙∙∙ అది నేపాల్ నుంచి వచ్చి మన దగ్గర స్వెట్టర్లు అమ్ముకుంటున్న కుటుంబం. వాళ్లకు నాలుగున్నరేళ్ల పాపాయి. ఆటపాటల్లో మునిగిపోయి ఆకలైనప్పుడు అమ్మ కోసం వెతుక్కునే వయసది. ఆ పరిసరాల్లో నివసించే ఓ వ్యక్తి కళ్లు ఆ పాపాయి మీద పడ్డాయి. ‘నీకు టీవీ చూపిస్తాను’ అని లోపలికి తీసుకువెళ్లాడు. కేసు వెలుగులోకి వచ్చింది. టీవీ చూపిస్తూ, చాక్లెట్లు ఇచ్చి ఎలా మాయచేశాడో చెప్పడానికి పాపాయి ప్రయత్నిస్తోంది. కానీ పాపాయికి, వాళ్ల తల్లిదండ్రులకు తెలుగు రాదు, ఇంగ్లిష్ రాదు. ఏం జరిగిందనేది పోలీసులకు అర్థమవుతోంది. కానీ పాపాయి చేత చెప్పించి కేసు రికార్డు చేయించక తప్పదు. నేపాలీ ట్యూటర్ని పిలిపించి కేసు రికార్డు చేశారు. ఎనిమిది రోజుల్లో చార్జిషీట్ వేయగలిగారు. మెడికల్ సర్టిఫికేట్లు కోర్టుకు సమర్పించడం వంటి ప్రక్రియ మొత్తం వేగంగా జరిగి పోయింది. ఏడు నెలల్లో నిందితుడికి జీవితఖైదు పడింది. అలాగే మరో పన్నెండేళ్ల అమ్మాయిని వ్యూహాత్మకంగా పడుపు వృత్తిలోకి దించిన ఉదంతంలో ఏకంగా 74 మందిని అరెస్టు చేశారు. వారిలో యూఎస్‌కి వెళ్లబోతున్న టీసీఎస్ ఉద్యోగి కూడా ఉన్నాడు. యూకేలో ఉన్న ఒక నిందితుడు, ఇండియాలోనే ఉన్న మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు దిశ పోలీసులు. ∙∙∙ ఆ బిల్లు దిశగా దర్యాప్తు గుంటూరు, దిశ పోలీస్ స్టేషన్ ఏఎస్పీ సుప్రజ పై కేసుల దర్యాప్తును వివరిస్తూ... ‘‘మేము దిశ బిల్లు స్ఫూర్తితో కేసులను సత్వరం పరిష్కరిస్తున్నాం. పై కేసుల్లో కూడా నేరగాళ్లకు శిక్ష పడితీరాలన్నంత ఆవేశంతో పని చేశాం. పసిబిడ్డల పట్ల ఆ దుర్మార్గులు వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్సాకరం. మరొకరు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడకూడదన్నంత సీరియెస్‌గా పని చేస్తున్నాం. నేరం జరిగిన విషయం నిజమే అయినప్పటికీ న్యాయపోరాటంలో కొన్నిసార్లు మేము దఖలు పరిచిన ఆధారాలు వీగిపోతుంటాయి. అందుకే కొన్ని ఆధారాలను అత్యంత గోప్యంగా ఉంచి నేరుగా కోర్టులో బయటపెట్టాను. ఎనభై ఐదేళ్ల వృద్ధుడు లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కోర్టులో అతడి నటన కూడా ఆస్కార్‌కు దీటుగా ఉండింది. దాంతో జడ్జిగారు మమ్మల్నే సందేహించారు కూడా. అప్పుడు నేను వీడియో బయటపెట్టడంతో కేసు నిలిచింది’’ అన్నారు సుప్రజ. దిశ బస్సులు పోలీస్ ఉద్యోగం చేస్తున్న మహిళలకు వృత్తిపరమైన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. బందోబస్తు డ్యూటీకి వెళ్లినప్పుడు విఐపీ రావడానికి నాలుగు గంటల ముందే ఆ ప్రదేశంలో ఉండాలి. ప్రోగ్రామ్ పూర్తయి, అందరూ వెళ్లిపోయే వరకు డ్యూటీ ఉంటుంది. కనీసం ఏడెనిమిది గంటలు పడుతుంది. ఏ ఒకటి – రెండు చోట్లనో తప్ప బాత్రూమ్ వంటి సౌకర్యాలు ఉండవు. మహిళలకు అన్ని రోజులూ ఒకటిగా ఉండవు. కష్టాలు వర్ణనాతీతంగా ఉంటాయి. వారి కష్టాలను అర్థం చేసుకుని సీయెం వారికి ‘దిశ బస్సు’ల రూపంలో మొబైల్ టాయిలెట్ల సౌకర్యం కల్పించి మహిళాపోలీసుల కష్టాలను దూరం చేశారు. ‘ఈ మేలును మేము ఎప్పటికీ మర్చిపోలేమ’ని అంటున్నారు మహిళాపోలీసులు. దిశ కేసుల విషయంలో కూడా ఇనుమడించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. బిల్లు ఇంకా చట్టం రూపం సంతరించుకోలేదు. దిశ పోలీస్స్టేషన్లు, దిశ పోలీసులు మాత్రం ఆ బిల్లును స్ఫూర్తిగా తీసుకుని పని చేస్తున్నారు. న్యాయపోరాటంలో బాధితుల పక్షాన నిలుస్తున్నారు. కొన్నింటికి ఆధారాలుండవు! చిన్నపిల్లలు, పెద్దవాళ్లు అనే కాదు... మొత్తంగా ఆడవాళ్ల మీద జరిగిన నేరాన్ని రుజువు చేయడం చాలా కష్టం. ముందు సమాజమే అంగీకరించడానికి సిద్ధంగా ఉండదు. పైన వృద్ధుడి విషయంలోలాగానే సమాజం పోలీసులనే సందేహిస్తుంది. మహిళల విషయంలో కూడా మొదట బాధితురాలినే తప్పు పడుతుంది. ఈ నెగిటివ్ ఆటిట్యూడ్ తొలగిపోవాలి. ప్రతి కేసుకీ వీడియోలు ఉండవు. కానీ నేరం జరిగి ఉంటుంది. మహిళను తేలికగా మాట్లాడే ముందు జరిగిన అన్యాయాన్ని కనీసంగా అర్థం చేసుకోవడానికి అయినా ప్రయత్నించాలి. – సుప్రజ, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఇన్చార్జ్, వెస్ట్ సబ్ డివిజన్, దిశ పోలీస్ స్టేషన్,గుంటూరు – వాకా మంజులారెడ్డి -
సోషల్ మీడియా పరిచయం, పెళ్లి.. ఆ తర్వాతే అసలు కథ..
సాక్షి, రాయచోటిటౌన్: ప్రేమించి పెళ్లి చేసుకుని వేధిస్తున్నాడనే ఫిర్యాదు మేరకు ఫైజాన్ అనే యువకుడిపై కేసు నమోదు చేసినట్లు రాయచోటి డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. నిందితుడిపై గత సంవత్సరం సెప్టెంబర్ 28న ఐపీసీ 498ఏ, డిసెంబర్ 15న వారి కుటుంబ సభ్యులపై 498ఏ, 506 వరకట్న కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు చెప్పారు. గురువారం డీఎస్పీ శ్రీధర్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన యువతి ప్రైవేట్ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తుండగా రాయచోటికి చెందిన ఫైజాన్ సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నాంటూ దగ్గరయ్యాడు. తరువాత ఆమెతో కలసి ఉన్న ఫొటోలను చూపించి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. బాధితురాలు కడప దిశా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో యువకుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. చదవండి: (కారం చల్లి, గొడ్డలితో సాఫ్ట్వేర్ ఉద్యోగిపై దాడి.. ఆయుధాన్ని..) పెళ్లయిన కొన్ని రోజుల తరువాత హింసిస్తున్నాడంటూ ఆమె మరోసారి రాయచోటి దిశా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో యువకుడితో పాటు అతని కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసినట్లు రాయచోటి డీఎస్పీ తెలిపారు. దీనిపై చార్జీషీట్ కూడా దాఖలు చేశామన్నారు. ఈ కేసులో మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనతో ఉన్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం అనే నేరంపై ఐపీసీ 307, 506, 66ఈ, 66 ఐటీ యాక్టు కింద కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఆయన చెప్పారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లైంగిక వేధింపులు
సాక్షి, ఏలూరు: ఏలూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. స్థానిక సబ్‌రిజిస్ట్రార్ జయరాజ్ కొంత కాలంగా తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తోటి మహిళా ఉద్యోగిణి దిశా పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది. జయరాజ్ ను.. ఎన్నిసార్లు మందలించిన వినడంలేదని, వేధింపులు భరించలేకపోయాయని పోలీసుల ఎదుట వాపోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రేమికుల మృతి -
‘దిశ వన్ స్టాప్’.. మహిళలపై వేధింపులకు ఫుల్స్టాప్
సాక్షి, అమరావతి: దిశ వన్‌స్టాప్ సెంటర్లు మహిళల భద్రతకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు వెనకంజ వేసే బాధిత మహిళలకు అండగా నిలుస్తూ భరోసా కల్పిస్తున్నాయి. కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వడం నుంచి అవసరమైన కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు వరకు పూర్తి బాధ్యత వహిస్తున్నాయి. దాంతో గతానికి భిన్నంగా బాధిత మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి వన్‌స్టాప్ సెంటర్ల ద్వారా సత్వర న్యాయాన్ని పొందుతున్నారు. ఐదు రకాలుగా భరోసా బాధిత మహిళలకు సత్వర న్యాయం చేసే దిశగా రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లో వన్‌స్టాప్ సెంటర్లను తీర్చిదిద్దడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక కార్యాచరణ నిర్దేశించారు. దిశ వ్యవస్థ పరిధిలోకి వీటిని తీసుకువచ్చి ‘దిశ వన్‌స్టాప్ సెంటర్లు’గా తీర్చిదిద్దారు. దాంతో దిశ వన్‌స్టాప్ సెంటర్లు మహిళల సమస్యల పరిష్కారంలో సమర్థవంతమైన పాత్ర పోషిస్తున్నాయి. జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లకు ప్రభుత్వం ప్రత్యేకంగా సబ్ ఇన్స్పెక్టర్ సహా 18 మంది సిబ్బందిని నియమించింది. వీరిలో వీలైనంత వరకు మహిళలనే నియమించారు. ఈ సెంటర్లు 24 గంటలూ అందుబాటులో ఉంటూ బాధిత మహిళలకు ఐదు రకాల సేవలు అందిస్తున్నాయి. గృహ హింస, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, బాధిత మహిళలకు ఆశ్రయం కల్పించడంలో కీలక భూమిక పోషిస్తున్నాయి. బాధిత మహిళలకు ఐదు రోజుల వరకు ఆశ్రయం కల్పించేందుకు వసతి ఏర్పాట్లు చేశారు. సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు భయపడే మహిళల పరిస్థితిని గుర్తించి వారికి తగిన సహాయం చేసి సమస్య పరిష్కారానికి వన్‌స్టాప్ సెంటర్లు చొరవ చూపిస్తున్నాయి. అందుకోసం మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. దిశ యాప్, 108 కమాండ్ కంట్రోల్, పోలీస్ స్టేషన్ల నుంచి వన్‌స్టాప్ సెంటర్లకు సమాచారం వస్తుంది. ఆ వెంటనే ఇక్కడి సిబ్బంది బాధిత మహిళలతో మాట్లాడి వారి సమస్య గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. వారి సమస్య పూర్తి పరిష్కారమయ్యే వరకు వారికి అండగా ఉంటున్నారు. గృహ హింస, బాల్య వివాహాల కేసుల్లో కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అత్యాచారం, లైంగిక దాడుల కేసుల్లో బాధితులకు అవసరమైన వైద్య పరీక్షల నిర్వహణ, అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు వరకు వన్‌స్టాప్ సెంటర్ల సిబ్బంది బాధ్యత వహిస్తున్నారు. ఉచితంగా న్యాయ సహాయాన్ని అందిస్తున్నారు. బాధిత మహిళలకు పూర్తి భరోసా కలిగేంత వరకు వన్‌స్టాప్ సెంటర్లే బాధ్యత తీసుకుంటుండటం విశేషం. 35 శాతం పెరిగిన కేసుల పరిష్కారం వన్‌స్టాప్ సెంటర్‌ను ఆశ్రయిస్తే చాలు తమకు న్యాయం జరుగుతుందన్న భరోసా కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతమైంది. మహిళలపై వేధింపులను ప్రభుత్వం తీవ్రమైన అంశంగా పరిగణిస్తూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించడమే దీనికి కారణం. దాంతో గతంలో కంటే బాధిత మహిళలు ధైర్యంగా వన్‌స్టాప్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. 2018 నాటితో పోలిస్తే వన్‌స్టాప్ సెంటర్ల ద్వారా మహిళలపై వేధింపుల కేసుల పరిష్కారం 35 శాతం పెరగడం విశేషం. కొత్తగా 5 వన్‌స్టాప్ కేంద్రాల నిర్మాణం రాష్ట్రంలో ప్రస్తుతం 8 జిల్లా కేంద్రాల్లో వన్‌స్టాప్ సెంటర్లకు శాశ్వత భావనాలు ఉన్నాయి. మిగిలిన ఐదు జిల్లాల్లో కూడా వన్‌స్టాప్ సెంటర్లకు శాశ్వత భవనాలను నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. కర్నూలు, తూర్పు గోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో శాశ్వత భవనాలు 2022 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. బాధిత మహిళలకు పూర్తి భరోసా బాధిత మహిళల సమస్యల పరిష్కారం కోసం వన్‌స్టాప్ సెంటర్లు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నాయి. అవసరమైతే బాధిత మహిళల ఇంటికే సిబ్బంది వెళ్లి మరీ సమస్య పరిష్కారానికి చొరవ చూపిస్తున్నారు. కౌన్సెలింగ్ నిర్వహించడంతోపాటు అవసరమైన మహిళలకు ఆశ్రయం కల్పిస్తున్నాం. తీవ్రమైన కేసుల్లో మహిళలకు వైద్య పరీక్షల నిర్వహణ, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వరకూ అన్నీ వన్‌స్టాప్ సెంటర్ల సిబ్బందే పర్యవేక్షిస్తున్నారు. – కృతికా శుక్లా, కమిషనర్, మహిళా–శిశు సంక్షేమ శాఖ -
దిశ బిల్లు ఆమోదం కోసం.. కేంద్రాన్ని కోరతాం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ బిల్లు మహిళా భద్రత దిశగా అతిపెద్ద ముందడుగని ‘మహిళా సాధికారికతపై పార్లమెంటరీ కమిటీ’ ప్రశంసించిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. దిశ బిల్లును ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని కూడా కమిటీ తెలిపిందన్నారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డాక్టర్ హీనా విజయ్‌కుమార్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ శనివారం విశాఖపట్నంలో పర్యటించి పోలీసు శాఖలో మహిళా అధికారులు, ఉద్యోగులతో సమావేశమవడంతోపాటు దిశ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిందని తెలిపారు. మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ వ్యవస్థను తీసుకురావడం విప్లవాత్మక సంస్కరణగా పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడిందని చెప్పారు. దిశ పోలీస్ స్టేషన్‌కు అనుసంధానంగా క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ వాహనం ఏర్పాటు చేయడం ఎంతో ఉపయుక్తమైన అంశమని వైద్యురాలితోపాటు న్యాయవాది కూడా అయిన ఆమె ప్రశంసించారని తెలిపారు. దోషులను గుర్తించి 21 రోజుల్లో శిక్ష విధించాలనే నిబంధనలను దిశ బిల్లులో పొందుపరచడంతోపాటు అందుకు అవసరమైన దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ ల్యాబొరేటరీల ఏర్పాటు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం, ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు ప్రతిపాదించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శమని చెప్పారని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో దిశ వ్యవస్థను తన స్వరాష్ట్రమైన మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, పోలీసు అధికారులు పరిశీలించి వెళ్లారని తెలుసుకుని ఆమె సంతోషం వ్యక్తం చేశారన్నారు. ఏపీ ప్రభుత్వం ఆమోదించిన దిశ బిల్లు వెంటనే చట్టంగా మారేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని, అందుకోసం కేంద్ర హోం, న్యాయ, మహిళా–శిశు సంక్షేమ మంత్రిత్వశాఖలతో చర్చిస్తామని చెప్పారని తెలిపారు. దిశ బిల్లు, అందులో నిబంధనలు, అంద్జుకు ఏర్పాటు చేసిన మౌలిక వసతుల వ్యవస్థపై పార్లమెంటరీ కమిటీ ప్రశంసలు కురిపించడం మహిళా భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని డీజీపీ పేర్కొన్నారు. -
ఏపీకి పార్లమెంట్ కమిటీ ప్రశంసలు
సాక్షి, విశాఖపట్నం: ఏపీపై పార్లమెంట్ మహిళా భద్రత, సాధికారిత కమిటీ ప్రశంసలు కురిపించింది. విశాఖలోని ‘దిశ’ పోలీస్‌స్టేషన్‌ను పార్లమెంట్ కమిటీ శనివారం సందర్శించింది. కమిటీకి దిశ పీఎస్ పనితీరును దిశ స్పెషల్ అధికారి డీఐజీ రాజకుమారి, సీపీ మనీష్‌కుమార్ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో దిశ పోలీస్‌స్టేషన్ పనితీరు అద్భుతమని పార్లమెంట్ కమిటీ ప్రశంసించింది. చదవండి: Disha App: ‘దిశ’ యాప్ కేరాఫ్ మన అన్న.. భద్రతకు ‘దిశ’ నిర్దేశం -
Disha App: ప్రాణాలు కాపాడిన ‘దిశ’
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): దిశ యాప్ ఒక మహిళ ప్రాణాలు కాపాడింది. మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ చివరిక్షణంలో దిశకు సమాచారం అందించటంతో పోలీసులు నిమిషాల వ్యవధిలోనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఏడాది వయసున్న ఆమె కుమార్తెను సంరక్షించారు. ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. సేకరించిన, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన జ్ఞానప్రసన్న (31) కృష్ణలంకలోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. కొన్నేళ్ల కిందట భర్తతో విభేదాలు రావడంతో ఒంటరిగా జీవిస్తోంది. చదవండి: కృష్ణా జలాల వివాదం తెలుగు రాష్ట్రాలకే పరిమితం ఈ నేపథ్యంలో ప్రైవేటు బ్యాంకుల్లో రికవరీ ఏజెంట్‌గా పనిచేసే సింగ్‌నగర్ లూనా సెంటర్‌కు చెందిన షేక్ అఖిల్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ సహజీవనం సాగిస్తున్నారు. అఖిల్‌కు అతడి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు తెలిసిన ప్రసన్న లూనాసెంటర్‌లోని అతడి ఇంటికి వెళ్లి ప్రశ్నించింది. అఖిల్, అతడి కుటుంబసభ్యులు ఆమెను తిట్టి, కొట్టి అక్కడి నుంచి పంపేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె బుధవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో ఉన్న శానిటైజర్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తాను మోసపోయానని, ఆత్మహత్య చేసుకుంటున్నానని చివరి క్షణంలో దిశ యాప్‌కు సందేశం పంపింది. చికిత్స పొందుతున్న జ్ఞాన ప్రసన్న క్షణాల్లో స్పందించిన పోలీసులు ప్రసన్న ఫోన్ నుంచి వచ్చిన సందేశంతో డీజీపీ కార్యాలయంలో దిశ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆమె ఫోన్ సిగ్నల్ ద్వారా న్యూరాజరాజేశ్వరీపేటలో ఉన్నట్లు గుర్తించి సమీపంలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడే విధుల్లో ఉన్న ఏఎస్ఐ హేమచంద్, కానిస్టేబుల్ ప్రకాష్, హోంగార్డ్ చంద్రశేఖర్ 10 నిమిషాల్లోనే ప్రసన్న ఇంటికి చేరుకున్నారు. చదవండి: రూ.789 కోట్లతో 48 లక్షలమంది పిల్లలకు ‘కానుక’ అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఏడాది వయసున్న ఆమె కుమార్తెను కూడా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రసన్న ప్రాణాపాయస్థితి నుంచి బయటపడింది. ఆమె కుమార్తెను వైద్యసిబ్బంది సంరక్షిస్తున్నారు. ప్రసన్న ఇంకా మాట్లాడే స్థితికి రాకపోవడంతో పోలీసులకు పూర్తి వివరాలు తెలియలేదు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఉన్న ప్రసన్న తల్లిదండ్రులకు, బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. దిశ అధికారులు, పోలీసులకు ప్రశంసలు కేవలం ఓ సందేశం ద్వారా నిమిషాల వ్యవధిలో మహిళ ఇంటికి చేరుకుని మృత్యువాత పడకుండా ఆమెను కాపాడిన దిశ కార్యాలయం అధికారులు, అజిత్‌సింగ్‌నగర్ పోలీసులను పోలీసు ఉన్నతాధికారులు, ప్రజలు ప్రశంసిస్తున్నారు. -
ఏపీలో సత్ఫలితాలను ఇస్తున్న దిశా మహిళ పోలీస్ స్టేషన్లు
-
ముస్లిం యువతి కేసు.. ‘దిశ’ డీఎస్పీ దర్యాప్తు
సాక్షి, అమరావతి/గోనెగండ్ల: కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో గతేడాది ఆగస్టు 17న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ముస్లిం యువతి కేసును ‘దిశ’ డీఎస్పీ స్థాయి అధికారితో దర్యాప్తు చేయిస్తామని దిశ ప్రత్యేక అధికారి, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు కృతిక శుక్లా చెప్పారు. పొలానికి వెళ్తుండగా ఆమెను కొందరు అత్యాచారం చేసి హత్య చేశారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారుల బృందం శనివారం ఆ గ్రామానికి వెళ్లింది. ఇందుకు సంబంధించిన వివరాలను కృతిక శుక్లా మీడియాకు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఎర్రబాడు గ్రామంలో బాధిత ముస్లిం కుటుంబాన్ని కలిసి మాట్లాడారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయిస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. బాధిత కుటుంబం పూరిగుడిసెలో నివసిస్తున్నందున వెంటనే ఇల్లు మంజూరు చేసి.. నిర్మించి ఇవ్వాలని ఆర్డీవో అధికారులకు కృతికా శుక్లా ఆదేశాలిచ్చారు. కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ íసీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) మనజీర్ జిలానీసామూన్, జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) శ్రీనివాసులు తదితరులున్నారు. -
దశ'దిశ'లా పటిష్టం
సాక్షి, అమరావతి: మహిళా భద్రత కోసం నెలకొల్పిన ‘దిశ’ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం మరింతగా బలోపేతం చేస్తోంది. ప్రధానంగా గస్తీ (పెట్రోలింగ్)ను పటిష్టం చేయడం ద్వారా విజబుల్ పోలీసింగ్‌ను వ్యవస్థాగతంగా బలోపేతం చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అందుకోసం ప్రత్యేకంగా దిశ పోలీస్ వ్యవస్థ కోసం 145 స్కార్పియో వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే మహిళా భద్రత కోసం రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఒకటి చొప్పున 900 స్కూటర్లను ప్రభుత్వం సమకూర్చిన సంగతి తెలిసిందే. తాజాగా స్కార్పియో వాహనాలు కొనుగోలు చేయాలన్న నిర్ణయంతో దిశ గస్తీ మరింత పటిష్టం కానుంది. దిశ గస్తీ పటిష్టం ఇలా... ► 145 స్కార్పియో వాహనాల కోసం రూ.16.60 కోట్లను పోలీసు శాఖ వెచ్చించనుంది. ► ఒక్కోటి దాదాపు రూ.11 లక్షల చొప్పున మొత్తం రూ.15.95 కోట్లతో 145 స్కార్పియో వాహనాలను కొనుగోలు చేస్తారు. ► వీటికి ఎల్ఈడీ లైట్లు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం, జీపీఎస్ పరికరాలు, బాడీ డెకాల్, ఇతర గస్తీ పరికరాలను రూ.65 లక్షలతో ఏర్పాటు చేస్తారు. ► రాష్ట్రంలో 5 పోలీస్ కమిషనరేట్లకు 10 వాహనాల చొప్పున మొత్తం 50 వాహనాలను అందిస్తారు. 13 పోలీసు జిల్లాలకు 5 వాహనాల చొప్పున మొత్తం 65 వాహనాలను సమకూరుస్తారు. ► ఈ వాహనాలతో విజుబుల్ పోలీసింగ్‌ను బలోపేతం చేస్తారు. ప్రధానంగా విద్యా సంస్థలు, మార్కెట్ ప్రదేశాలు, ఇతర జనసమ్మర్థమైన సున్నిత ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేస్తారు. దిశ పోలీస్ స్టేషన్లకు సొంత భవనాలు మహిళా భద్రత కోసం ప్రభుత్వం రాష్ట్రంలోని జిల్లా ప్రధాన కేంద్రాల్లో ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఇక కొత్తగా 6 దిశ పోలీస్స్టేషన్లు నిర్మించాలని నిర్ణయించింది. అందుకోసం ఒక్కో పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి రూ.2.73 కోట్ల చొప్పున మొత్తం రూ.16.40 కోట్లను కేటాయించింది. కౌన్సెలింగ్ రూమ్, వెయిటింగ్ హాల్, క్రచ్–ఫీడింగ్ రూమ్, టాయిలెట్లు, ఇతర వసతులతో ఈ దిశ పోలీస్ స్టేషన్లు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది. -
ప్రతి జిల్లాలో ‘దిశ’ ప్రత్యేక కోర్టులు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో దిశ ప్రత్యేక కోర్డులను ప్రభుత్వం ఏర్పాటుచేయనుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్లో విశాఖ రేంజ్ పరిధిలోని మూడు జిల్లాలకు సంబంధించిన సచివాలయ మహిళా పోలీసులు, మహిళా మిత్రలకు దిశ యాప్‌పై శనివారం అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దిశ యాప్, సైబర్‌మిత్ర వాట్సప్, ఏపీ పోలీస్ సేవా యాప్ అందించే సేవలను నగర పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా, టెక్నికల్ డీఐజీ పాలరాజు, దిశ డీఐజీ రాజకుమారిలు వివరించారు. అనంతరం డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీసులకు అదనపు బలంగా 15వేల మంది సచివాలయ మహిళా పోలీసులు మహిళల భద్రతకు సేవలందిస్తున్నారన్నారు. పోలీస్స్టేషన్ల్లో ఉండే మహిళా పోలీసులకు ఏవైతే అధికారాలు ఉంటాయో అవన్నీ సచివాలయ మహిళా పోలీసులకు ఉంటాయన్నారు. అవగాహన కార్యక్రమాలు ప్రతి డివిజన్, మండల, గ్రామాల స్థాయిలో దీనిని నిర్వహిస్తామన్నారు. ‘స్పందన’తో సామాన్య ప్రజలకు న్యాయం గతంలో పోలీస్స్టేషన్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంవల్ల అక్కడకు వెళ్లేందుకు ప్రజలు వెనుకడుగు వేసేవారని డీజీపీ అన్నారు. కానీ, వీటన్నింటికీ చెక్ చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘స్పందన’తో సామాన్య ప్రజలు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని వివరించారు. ప్రస్తుతం ఎఫ్ఐఆర్ నమోదైన 59 రోజుల్లో ఆ కేసు చార్జిషీట్ ఫైల్ చేయకపోతే.. తక్షణమే ఎస్పీకి మెసేజ్ వెళ్తుందన్నారు. కాగా, స్పందన కార్యక్రమం తీసుకొచ్చిన 20 నెలల కాలంలో 31,100 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు గౌతమ్ సవాంగ్ చెప్పారు. మరోవైపు.. ఏఓబీలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని డీజీపీ తెలిపారు. ఏజెన్సీలో గంజాయి సాగుకు మావోయిస్టులు సహకరిస్తున్నారని.. అలాగే, లేటరైట్ సమస్య ఇప్పటిది కాదని, దీనిని కావాలని కొందరు రాజకీయం చేస్తున్నారని డీజీపీ చెప్పారు. -
మన మహిళలు దేశానికే ఆదర్శం
అక్క చెల్లెమ్మల భద్రత కోసమే దిశ యాప్‌ను రూపొందించాం. ప్రతి అక్కా, ప్రతి చెల్లెమ్మ మొబైల్ ఫోన్లో దిశ యాప్ ఉండాలి. కనీసం కోటి మందికిపైగా సెల్ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేయించాలి. ఈ యాప్ ఉంటే అన్నయ్య తోడున్నట్టే. ఆపదలో చిక్కుకుంటే ఈ యాప్‌లోని ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు. అందుకు అవకాశం లేకుంటే సెల్ ఫోన్‌ను అటూ ఇటూ గట్టిగా ఊపితే చాలు. నిమిషాల్లో పోలీసులు మీరున్న ప్రదేశానికి వచ్చి మీకు రక్షణ కల్పిస్తారు. అందుకోసం ఎన్నో ఫీచర్లు ఈ యాప్‌లో అందుబాటులోకి తెచ్చాం. – సీఎం వైఎస్ జగన్ ప్రతి ఇంటికీ వెళ్లి యాప్ డౌన్లోడ్ చేయిస్తున్నాం మా సచివాలయంలో 32 మంది వలంటీర్లకు గాను 26 మంది మహిళా వలంటీర్లు ఉన్నారు. వాళ్లందరికీ దిశ యాప్ గురించి వివరించి డౌన్లోడ్ చేయించాను. వీరందరూ ఇంటింటికీ వెళ్లి యాప్ ఉపయోగం గురించి వివరిస్తూ డౌన్లోడ్ చేయిస్తున్నారు. రెండు రోజుల్లో 1,515 మంది సెల్ ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేయించారు. – కనకదుర్గ, మహిళా పోలీస్, గొల్లపూడి సచివాలయం సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మహిళ దేశానికే ఆదర్శం కావాలన్నదే తమ లక్ష్యం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఆ దిశగా ఎన్నో విప్లవాత్మక చర్యలు తీసుకున్నామని, ప్రతి అడుగు కూడా అక్కచెల్లెమ్మలకు మేలు చేసేదిగానే ఉంటుందన్నారు. మహిళల భద్రత కోసం స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కనీసం ఒక్కో జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున.. మొత్తంగా 18 దిశ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. 900 మొబైల్ పెట్రోలింగ్ ద్విచక్ర వాహనాలను ప్రారంభించామని, ఒక వారంలో మరిన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. దిశ కేసులకు సంబంధించి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించామని, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. దిశా చట్టాన్ని మెరుగు పరుస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని చెప్పారు. వీటన్నింటికీ తోడు ఆపద వేళల్లో అక్కచెల్లెమ్మలకు ఓ అన్నయ్యగా అండగా నిలిచేలా ‘దిశ’ యాప్‌ను రూపొందించామని, ఈ యాప్‌ను అందరూ డౌన్లోడ్ చేసుకునేలా చూడాలన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని గ్రామ సచివాలయంలో మంగళవారం నిర్వహించిన ‘దిశ యాప్ అవగాహన సదస్సు’లో ఆయన పాల్గొన్నారు. దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం, ఆపద ఎదురైతే ఆ యాప్‌ను ఉపయోంచి తక్షణం పోలీసు రక్షణ పొందే విధానాన్ని ఆయన స్వయంగా మహిళలకు వివరించారు. మహిళలు, యువతులతో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్‌లో దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేయించారు. యాప్ పనితీరులో భాగంగా దిశ పోలీసులు నిర్వహించిన డెమోనూ మహిళలకు చూపించి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి పైగా పోలీస్ స్టేషన్లలో అధికారులు, ఇతర సిబ్బంది వర్చువల్‌గా వీక్షించిన ఈ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సదస్సులో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు వనిత, సుచరిత, పుష్పశ్రీవాణి, సదస్సులో యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని..మొబైల్‌ను చూపుతున్న మహిళలు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలి – అక్కచెల్లెమ్మల సెల్ఫోన్లో ఈ దిశ యాప్ ఉండాలి. అందుకోసం మహిళా పోలీసులు, వలంటీర్లు తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించాలి. ఈ యాప్ ఉంటే జరిగే మంచి గురించి తెలపాలి. దిశ యాప్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో స్వయంగా వివరించాలి. ఈ ప్రచారాన్ని ఒక ప్రత్యేక డ్రైవ్‌లా చేపట్టాలి. – దిశ యాప్‌కు ఎంతటి ప్రాముఖ్యత ఉందన్నది మహిళా పోలీసులు, వలంటీర్లకు బాగా తెలుసు. మొన్న ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగిన సంఘటన నా మనసును చాలా కలచివేసింది. ఓ అమ్మాయి ఏ సమయంలోనైనా బయటకు వెళ్లినప్పుడు, జన సందోహం లేనప్పుడు అనుకోకుండా ఏమైనా జరిగితే వాళ్ల పరిస్థితి ఏమిటన్నదానికి ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగిన సంఘటనే నిదర్శనం. – ఏడాది క్రితం తెలంగాణలో దిశ అనే అమ్మాయిపై జరిగిన అఘాయిత్యం తెలిసిందే. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనం దాన్ని ఎలా ఆపగలం అనే ఆలోచన నుంచే ఈ దిశ యాప్‌ను అభివృద్ధి చేశాం. ఈ యాప్‌ను ఎంత ఎక్కువ మంది అక్కచెల్లెమ్మలతో డౌన్లోడ్ చేయించగలిగితే అంత ఎక్కువగా వారికి సహాయం చేయగలుగుతాం. – ఆపదలో వారికి తోడుగా నిలబడే పరిస్థితి వస్తుంది. అందుకే మహిళా పోలీసులు, వలంటీర్లు, ఇతర సచివాలయ సిబ్బంది దిశ యాప్ రాయబారులుగా వ్యవహరించాలి. ప్రతి ఇంటికి వెళ్లి ఈ యాప్ ఆవశ్యకతను వివరించి డౌన్లోడ్ చేయించాలి. బటన్ నొక్కితే చాలు వెంటనే పోలీసు రక్షణ – ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే ఓ అన్నయ్య మీకు తోడున్నట్టుగా భావించవచ్చు. అనుకోని విధంగా ఏదైనా ఆపద కలిగినప్పుడు ఈ యాప్‌లోని ఎస్ఓఎస్ బటన్ నొక్కిన వెంటనే పోలీసులు నిమిషాల్లో మీ దగ్గరకు వస్తారు. – ముందు మీకు ఫోన్ చేస్తారు. మీరు ఫోన్ ఎత్తి పొరపాటున బటన్ నొక్కుకుపోయింది అని అంటే సరే అని రారు. ఇబ్బందుల్లో ఉన్నాము అని మీరు చెబితే నిమిషాల్లోనే మీరున్న ప్రదేశానికి వచ్చి మీకు రక్షణ కల్పిస్తారు. – ఒకే వేళ మీరు ఫోన్ ఎత్తకపోయినా సరే.. మీరు ఆపదలో ఉన్నారని అర్థం చేసుకుని వెంటనే వచ్చి మీకు రక్షణగా నిలుస్తారు. ఈ యాప్ ద్వారా మీ లొకేషన్ అంటే మీరున్న ప్రదేశం ఎక్కడ ఉందన్న సమాచారం నేరుగా కంట్రోల్ రూమ్‌కు తెలుస్తుంది. తద్వారా పోలీసులు నేరుగా మీరున్న ప్రదేశానికి వచ్చి రక్షణ కల్పించేలా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఆపదలో ఫోన్ ఊపితే చాలు.. – అక్కచెల్లెమ్మలకు ఆపద కలిగినప్పుడు ఫోన్లో ఉన్న బటన్ నొక్కేంత సమయం లేనప్పుడు.. ఆ ఫోన్‌ను అటూ ఇటూ గట్టిగా ఊపితే చాలు మీరు ఆపదలో ఉన్నారని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం వెళ్తుంది. అక్కడ నుంచి మీకు ఫోన్ చేస్తారు. మీరు ఫోన్‌కు స్పందించలేదంటే మీరు ఆపదలో ఉన్నారని గుర్తించి వెంటనే మీ వద్దకు చేరుకుని రక్షణ కల్పిస్తారు. – ఈ విధంగా మనం ఎక్కడికి పోయినా, ఏ పరిస్ధితుల్లో ఉన్నా ఫోన్ మన దగ్గర ఉంటే చాలు మనకు ఎలాంటి ముప్పు కలగకుండా ఓ అన్నయ్యలా ఈ యాప్ అండగా నిలుస్తుంది. ఈ యాప్‌ను ఎంత ఎక్కువగా డౌన్ లోడ్ చేయిస్తే అంత మంచి జరుగుతుంది. – అది ఎలా వాడాలి, దాని వల్ల ఉపయోగాలు ఏంటి అనేది నేర్పించాలి. ఇదొక పెద్ద కార్యక్రమం. దీన్ని వలంటీర్లు, మహిళా పోలీసులు, మహిళా మిత్రలు అందరూ బాధ్యతగా తీసుకుని ప్రతి ఇంటికి వెళ్లి డౌన్ లోడ్ చేయించాలి. – గొల్లపూడి గ్రామంలో దాదాపు 2,800 ఇళ్లకు గాను ఇప్పటికే 15 వందల ఇళ్లలో డౌన్ లోడ్ చేశారు. మిగిలిన 1,300 ఇళ్లలో త్వరలోనే డౌన్లోడ్ చేయిస్తారనే నమ్మకం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో అందరి ఇళ్లకు వెళ్లి దిశ యాప్‌ను డౌన్లోడ్ చేయించాలి. ట్రాక్ మై ట్రావెల్ ఫీచర్ – ఈ యాప్‌లో ఉన్న మరో ముఖ్య అంశం కూడా ఉంది. మనం ఎక్కడకైనా ఆటోలోనో, ట్యాక్సీలోనో తెలియని వాళ్ల వాహనంలో ప్రయాణం చేయాల్సి రావచ్చు. అప్పుడు వాళ్ల మీద మనకు ఏమైనా కొద్దిగా అనుమానం వచ్చినా ఈ యాప్ మనకు రక్షణగా నిలుస్తుంది. – ఈ యాప్‌లో మనం వెళ్లాల్సిన లొకేషన్‌ను ఈ యాప్‌లో టైప్ చేసి ట్రాక్ మై ట్రావెల్ అనే బటన్ నొక్కితే చాలు. మీరు వెళ్లాల్సిన రూట్‌ను చూపిస్తుంది. మీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీస్ కంట్రోల్ రూం ట్రాకింగ్‌లో పెడుతుంది. ఆ వాహనం సరైన మార్గంలో వెళ్లకపోతే పోలీసులు వెంటనే వస్తారు. మీకు రక్షణ కల్పిస్తారు. – మహిళలకు పోలీసులు ఏదైనా సందేశం ఇవ్వడానికి ‘పుష్’ బటన్ ఆప్షన్ ఈ యాప్‌లో ఉంది. త్వరలోనే మరిన్ని ఆప్షన్లను కూడా పొందుపరచనున్నాం. సున్నితమైన, ప్రమాదకర ప్రదేశాలు, చైన్ స్నాచింగ్ వంటి వాటికి ఆస్కారం ఉన్న ప్రాంతాల గురించి మహిళలను అప్రమత్తం చేసేలా అదనపు ఫీచర్లు ఏర్పాటు చేయబోతున్నాం. కోటి మందికిపైగా డౌన్లోడ్ చేసుకునేలా చేయాలి – రాష్ట్రంలో స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి అక్క, చెల్లెమ్మ ఫోన్లో ఈ యాప్ డౌన్లోడ్ కావాలి. ఇప్పటికే 17 లక్షల మందికిపైగా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. – కనీసం కోటి మందికిపైగా డౌన్లోడ్ చేసుకునేలా చేయాలి. మన ప్రభుత్వం రూపొందించిన దిశ యాప్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇప్పటికే నాలుగు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. దిశ పోలీస్ స్టేషన్లు – మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాకు కనీసం ఒక పోలీస్ స్టేషన్ ఉండేలా చేయడంతో పాటు వాటిలో పూర్తిగా మహిళా అధికారులు, సిబ్బందినే నియమించాం. – మహిళలకు సైబర్ క్రైం, ఇతరత్రా సమస్యలు ఎదురైతే ఆ పోలీస్ స్టేషన్‌కు వెళితే చాలు. అక్కడ అంతా మహిళలే ఉంటారు కాబట్టి మనస్ఫూర్తిగా వారితో మాట్లాడొచ్చు. వారు మీ సమస్యలు పూర్తిగా వింటారు. ఫిర్యాదు తీసుకుంటారు. మీ సమస్యను సత్వరం పరిష్కరిస్తారు. – దాదాపు 900 మొబైల్ పెట్రోలింగ్ ద్విచక్ర వాహనాలను కూడా ఈ మధ్యే ప్రారంభించాం. పెట్రోలింగ్‌ను ఇంకా పెంచేందుకు ఈ వారంలోనే మరిన్ని వాహనాలు వాహనాలను తీసుకురానున్నాం. ప్రత్యేక కోర్టులు – దిశా చట్టాన్ని కూడా మెరుగ్గా చేసేందుకు, మరింత ఉపయోగకరంగా ఉండేటట్టు చేసి బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. అనుమతులు మంజూరు కేంద్రం చేతిలో ఉంది కాబట్టి ఇంకా పూర్తి చట్టం తీసుకురాలేకపోయాం. ఈలోగా మనం చేయాల్సిన వాటికి సంబంధించి ప్రతి అడుగు ముందుకు వేస్తున్నాం. – దిశ కోసం ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడుతున్నాం. ప్రత్యేకంగా దిశ కేసులనే చూడటానికి ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాం. అట్టడుగు వర్గాల్లో విశ్వాసం – ఈ రాష్ట్ర హోం మంత్రి ఓ మహిళ. నా చెల్లి, దళితురాలు. అట్టడుగు వర్గాల్లో విశ్వాసం నింపేందుకు ఈ విషయం చెబుతున్నాం. అట్టడుగు వర్గాలకు కూడా పూర్తి న్యాయం జరుగుతుంది. పోలీసుల దగ్గరికి వెళ్లడానికి భయపడాల్సిన పని లేదు. పోలీసులు మనకు మంచి చేసే ఆప్తులు అనే మెసేజ్ పోవడానికి ఉపయోగపడుతుంది. – ఈ యాప్ అభివృద్ధి చేసే విషయంలో సుచరితమ్మ కూడా కీలక పాత్ర పోషించారు. ‘దిశ’కు సంబందించిన ఇద్దరు మహిళా అధికారులను నియమించాం. ఐపీఎస్ అధికారి దీపికా పాటిల్, ఐఏఎస్ అధికారి కృతికా శుక్లా ప్రత్యేకంగా దిశ కార్యక్రమాల మీదే పని చేస్తున్నారు. – ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు తానేటి వనిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), పేర్ని వెంకట్రామయ్య(నాని), ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, డీజీపీ గౌతం సవాంగ్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు. మూడు నిమిషాల్లోనే పోలీసు రక్షణ సదస్సుకు హాజరైన ఓ వలంటీర్ తన సెల్‌ఫోన్ నుంచి దిశ యాప్‌లోని ఎస్ఓస్ బటన్‌ను నొక్కింది. వెంటనే పోలీస్ కంట్రోల్ రూం నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. మీ రక్షణకు వస్తున్నాం.. ఏమీ కంగారు పడొద్దు.. అని వారు ధైర్యం చెప్పారు. అనంతరం కంట్రోల్ రూం సిబ్బంది ఆమె ఉన్న ప్రదేశానికి సమీపంలోని భవానీపురం పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే ఆ యువతి రక్షణకు వెళ్లాలని చెప్పారు. ఆ వెంటనే భవానీపురం పోలీసులు ఆ వలంటీర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. కాసేపటికే తమ వాహనంలో ఆమె వద్దకు వచ్చారు. వలంటీర్ దిశ యాప్‌ను ఉపయోగించినప్పటి నుంచి కేవలం మూడు నిముషాల్లోనే ఆమె వద్దకు పోలీసులు రావడం విశేషం. ఆమె ఉన్న ప్రదేశం గురించి నావిగేషన్ ద్వారా తెలుసుకోవడం, తక్షణ ఆధారాల సేకరణ కోసం పోలీసుల యూనిఫాంకు కెమెరాలు అమర్చిన విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందరికీ వివరించారు. ఈ మొత్తం డెమోను డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరిస్తూ స్రీన్లపై చూపించడంతో యాప్ ఎంత సమర్థంగా పని చేస్తుందన్నది అందరికీ స్పష్టంగా తెలిసింది. -
దిశ యాప్‌ను మహిళలంతా డౌన్లోడ్ చేసుకోవాలి: మేకతోటి సుచరిత
-
మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు దిశ యాప్‌పై పూర్తి అవగాహన, చైతన్యం కలిగించాలని సూచించారు. దిశ యాప్‌ను ఎలా వాడాలన్న దానిపై అవగాహన కలిగించాలని అధికారులకు స్పష్టం చేశారు. మహిళా భద్రత, దిశ యాప్ వినియోగంపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, ఇంటెలిజెన్స్ చీఫ్ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎంవో అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంటింటికీ వెళ్లి అక్క చెల్లెమ్మల ఫోన్లలో యాప్‌ను డౌన్లోడ్ చేసి అవగాహన కల్పించాలని చెప్పారు. గ్రామ సచివాలయాల్లోని మహిళా పోలీసులు, వలంటీర్లకు తొలుత శిక్షణ ఇచ్చి, తర్వాత వారి ద్వారా అక్క చెల్లెమ్మలకు దిశ యాప్‌పై అవగాహన కలిగించాలని సూచించారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలనే విషయంపై అక్క చెల్లెమ్మలకు విడమరచి చెప్పాలన్నారు. దీన్ని ఒక డ్రైవ్‌గా తీసుకుని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. కాలేజీలు, విద్యా సంస్థల్లోనూ విద్యార్థినులకు యాప్ వినియోగంపై అవగాహన కలిగించాలని, ఈ చర్యతో దిశ యాప్ వినియోగం పెరుగుతుందని పేర్కొన్నారు. అక్క చెల్లెమ్మలకు మరింత భద్రత కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకునేలా యంత్రాంగం సిద్ధం కావాలన్నారు. దిశ, స్థానిక పోలీస్స్టేషన్లు సత్వరమే స్పందించేలా వారిని సన్నద్ధం చేయాలని, పోలీస్ స్టేషన్లలో అవసరమైనన్ని పెట్రోలింగ్‌వాహనాలను సమకూర్చాలని ఆదేశించారు. -
ఆ ఫోటోలతో బ్లాక్ మెయిల్.. భార్గవ్ నిజస్వరూపం బట్టబయలు
మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన ఫన్ బకెట్ ఫేం భార్గవ్ ను అరెస్ట్ చేసినట్టు విశాఖ సిటీ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ తెలిపారు. చెల్లి అంటూ దగ్గరై టీవీ చానల్స్ లో అవకాశం ఇస్తానంటూ మైనర్‌తో అశ్లీల చిత్రాలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన ట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితు నిపై అత్యాచారం తోపాటు ఫోక్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు వివరించారు. టిక్ టాక్ ద్వారా బాలికను పరిచయం చేసుకున్న భార్గవ్.. టిక్ టాక్ లో స్టార్ చేస్తానని, ఇతర మీడియా చానెల్స్ లో చాన్సులు ఇప్పిస్తానని బాలికకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేశాడు. అయితే ఆ బాలిక నో చెప్పింది. అయినా భార్గవ్ బాలికను వదల్లేదు. వీడియోల పేరుతో దగ్గరయ్యాడు. ఈ క్రమంలో డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని బాలికను బ్లాక్ మెయిల్ చేసిన భార్గవ్, శారీరకంగా అనుభవించాడని పోలీసులు తెలిపారు. టిక్ టాక్ భార్గవ్ ను హైదరాబాదులో అరెస్ట్ చేసి విశాఖపట్నం తీసుకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ నిందితుడిపై ఇతర ఫిర్యాదులు ఉంటే బాధితులు పోలీసులను ఆశ్రయించారని ఏసీపీ కాజల్ సూచించారు. చదవండి: చెల్లీ అని పిలుస్తూనే.. మైనర్ బాలికపై అత్యాచారం -
రెండు సెకన్లలోనే పోలీసులు స్పందించారు
బొమ్మలసత్రం (నంద్యాల): ‘ఆత్మస్థైర్యం కోల్పోయి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. కానీ చివరి క్షణంలో పిల్లలను బతికించుకోవాలన్న ఆశ కలిగింది. దీంతో దిశ యాప్ ద్వారా పోలీసులకు కాల్ చేశా. కేవలం రెండు సెకన్లలోనే వారు స్పందించారు. మా సమస్య విన్న కొద్దిసేపటికే ఘటన స్థలానికి చేరుకుని నాతోపాటు నా పిల్లలను రక్షించారు’ అని ఆదిలక్ష్మి అనే బాధితురాలు తెలిపింది. వివరాల్లోకెళ్తే.. కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాపిరేవులకు చెందిన ఎ.ఆదిలక్ష్మి, తన కుమార్తెలు సుప్రియ (7), చరిత (5)తో కలిసి శుక్రవారం నంద్యాల–గిద్దలూరు ఘాట్ రోడ్డులో సర్వనరసింహస్వామి ఆలయం వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. దిశ యాప్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే స్పందించి వారిని కాపాడారు. శనివారం నంద్యాల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలితోపాటు ఆమె పిల్లలను జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప పరామర్శించారు. డీఎస్పీ చిదానందరెడ్డి ఆధ్వర్యంలో బాధితురాలికి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫక్కీరప్ప మీడియాతో మాట్లాడుతూ.. ఆదిలక్ష్మి భర్త ప్రసాద్ గతేడాది ప్రమాదవశాత్తూ కుందూ నదిలో పడి మృతి చెందాడన్నారు. ఆమె తన ముగ్గురు కుమార్తెలు సుప్రియ, చరిత, యామినిలతో కలిసి గ్రామంలోనే నివసిస్తోందని, భర్త లేకపోవడంతో కుటుంబాన్ని పోషించడం భారంగా మారిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే సూపర్ వాస్మోల్ ద్రావణాన్ని తాను సేవించి.. పెద్ద కుమార్తె సుప్రియ, రెండో కుమార్తె చరితకు కూడా తాగించిందన్నారు. కొంత సమయం తర్వాత కుమార్తెలను ఎలాగైనా బతికించుకోవాలన్న తపనతో తన సెల్‌ఫోన్‌లోని దిశ యాప్ ద్వారా తమకు కాల్ చేసిందన్నారు. దిశ యాప్ వల్లే బాధితురాలిని, ఆమె కుమార్తెలను రక్షించగలిగామని చెప్పారు. మహిళలకు ఏ సమస్య వచ్చినా యాప్ ద్వారా పోలీసులను సంప్రదించాలన్నారు. బాధితురాలిని కాపాడటంలో చొరవ చూపిన మహానంది ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సిబ్బందిని ఆయన అభినందించారు. -
ఏపీలో దిశతో మారుతున్న మహిళల దశ
-
అల్లుడి కోపం తగ్గింది.. సంసారం నిలబడింది
జీవితాంతం తోడు నీడగా ఉంటామని నవ దంపతులు చేసుకున్న పెళ్లినాటి ‘నాతిచరామి’ ప్రమాణాలను పక్కనపెట్టి చిన్నచిన్న మనస్పర్థలతో సంసారాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. అనుమానాలు, అపార్థాలు, అసూయా ద్వేషాలు ఇందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఇంకొందరి విషయాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చురేపుతున్నాయి. ఫలితంగా విడాకుల వరకు వెళ్లి కాపురాలు కుప్ప కూలిపోతున్నాయి. కలహాల కాపురాలను ‘కౌన్సెలింగ్’మంత్రంతో నిలబెడుతూ దంపతులకు ‘దిశా’ నిర్దేశం చేస్తున్నారు కడప మహిళా స్టేషన్ పోలీసులు. –కడప అర్బన్ ఇలా సరిచేశారు.. కడపకు చెందిన ఓ మహిళను ముంబైకి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. ఇటీవల ఆ మహిళ తనను ఓ గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నారని తల్లికి సమాచారం ఇచ్చింది. స్థానికుల సలహా మేరకు బాధితురాలి తల్లి కడపలోని దిశ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి డీఎస్పీ షౌకత్ ఆలీకి ఫిర్యాదు చేసింది. ఆయన తమ సిబ్బందితో కలిసి బాధితురాలు చేసిన ఫోన్ నంబర్ ఆధారంగా ముంబైలోని ఆ ప్రాంతం పరిధిలోని పోలీస్‌స్టేషన్ అడ్రస్‌ను సేకరించారు. పోలీస్‌స్టేషన్‌కు ఇక్కడి నుంచి ఫిర్యాదు చేస్తే వారు ఏసీపీని సంప్రదించాలని సూచించారు. ఆ అధికారి ఫోన్లో స్పందించకపోవడంతో ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇచ్చారు. వెంటనే బాధిత మహిళకు విముక్తి కల్పించారు. కడప దిశ పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వచ్చి భర్తకు, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో వారి సంసారం చక్కబడింది. అనంతరం బాధితురాలి తల్లి బంధువులతో ముంబైకి వెళ్లి, తన కుమార్తెను, అల్లుడిని చూసుకుని వచ్చారు. ‘‘బాధితురాలి తల్లి కష్టాన్ని తమదిగా భావించి సమస్యను పరిష్కరించామని’’డీఎస్పీ తెలియజేశారు. ఇద్దరినీ కలిపారు రాజంపేట పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఓ మండలానికి చెందిన యువతీ, యువకుడు పరస్పరం ప్రేమించుకున్నారు. యువకుడు తాను గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నాని ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుందామని చెప్పాడు. ఆమె ససేమిరా ఒప్పుకోకపోగా, తనను వెంటనే వివాహం చేసుకోవాలని కోరింది. మరోవైపు తనను ప్రేమించిన యువకుడు బంధువులకు చెందిన వేరే అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుండటంతో ఆమె పోలీసులను సంప్రదించింది. ఈ విషయంపై ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు లోతుగా విచారించారు. వీరి మధ్య మనస్పర్థలను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో వారి మధ్య సయోధ్య కుదిరింది. లేదంటే ఇద్దరు ప్రేమికులతో పాటు, మరో యువతి పేరును అనవసరంగా ప్రచారంలోకి తీసుకుని వస్తే.. ఆమె ఆవేదనకు గురైతే? ఆత్మహత్యలు లాంటి అనర్థాలకు దారితీసే అవకాశాలు కూడా లేకపోలేదు. అల్లుడి కోపం తగ్గింది.. సంసారం నిలబడింది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఓ అధ్యాపకుడికి, కడపకు చెందిన ఓ యువతికి నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఏడాదిన్నర బాబు ఉన్నాడు. భర్తతో గొడవపడి, బాబును తండ్రి దగ్గరే వదిలేసి కడపకు వచ్చేసింది భార్య. భార్యకోసం భర్త కడపకు వస్తే తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గొడవపడి బయటకు నెట్టేశారు. దీంతో వీరిమధ్య మనస్పర్థలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. కొన్నిరోజులకు భార్య, తనకు కుమారుడు కావాలని, కనీసం వీడియోకాల్లోనైనా మాట్లాడించాలని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో చెప్పింది. వారు అల్లుడిమీద కోపంతో తమ కుమార్తె మాటలను ఖాతరు చేయలేదు. దీంతో ఆమె దిశ మహిళా పోలీస్ స్టేషన్‌ను సంప్రదించారు. బోరున విలపిస్తూ తన కుమారుడిని, భర్తను కలపాలని ప్రాధేయపడ్డారు. స్పందించిన డీఎస్పీ ఆమె భర్తను, కుమారుడిని, బంధువులను పిలిపించారు. కౌన్సెలింగ్ నిర్వహించి వారి మధ్య మనస్పర్థలను తొలగించారు. దీంతో భర్త తన కుమారుడితో పాటు అత్తారింటికి వెళ్లాడు. మరుసటిరోజున భార్యాభర్తలు స్టేషన్‌కు వచ్చి ‘‘తమ సంసారాన్ని నిలబెట్టారని.. లేకుంటే జీవితాంతం విడిపోయేవారమని, సంతోషం వ్యక్తం చేస్తూ, కృతజ్ఞతలు’’తెలియజేశారు. ఒన్‌స్టాప్ (దిశ)సెంటర్ పాత్ర కీలకం జిల్లా స్త్రీ,శిశు సమగ్రాభివృద్ధి (ఐసీడీఎస్) పరిధిలో రిమ్స్ ఆవరణంలో నిర్మించిన ఒన్‌స్టాప్ సెంటర్(దిశ సెంటర్)లో ప్రాజెక్టు డైరెక్టర్ పద్మజ ఆదేశాల మేరకు అడ్మినిస్ట్రేటర్ ఎన్. అశ్విని, సైకాలజిస్ట్‌గా సునీత, న్యాయసలహాదారుగా ఉమాదేవి, ఇతర సిబ్బంది విధులను నిర్వహిస్తున్నారు. వీరు తమ పరిధిలో భార్యాభర్తల కౌన్సెలింగ్‌ను విడతలవారీగా నిర్వహించి వారి మధ్య తలెత్తే విభేదాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. -
రైతన్నకు రక్షణగా 'పోలీస్' వ్యవస్థ
తమ వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి చాలా మంది రైతులు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్తారు. అక్కడ వారికి ఏవైనా ఇబ్బందులు వస్తే, మోసానికి గురైతే.. చట్టపరంగా, ఇతరత్రా రక్షణగా ఈ కొత్త వ్యవస్థ వారికి అండగా నిలవాలి. ఎంత త్వరగా స్పందించి, వారికి అండగా నిలబడుతున్నామన్నదే ప్రధాన లక్ష్యం. ఇందుకు రైతు భరోసా కేంద్రాలు, పోలీసులు పరస్పర అవగాహన, అనుసంధానంతో పని చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి రోజూ 2 గంటల పాటు కచ్చితంగా స్పందన కార్యక్రమం నిర్వహించాలి. ఇక్కడ పని చేస్తున్న సిబ్బందికి ప్రత్యేకంగా యూనిఫామ్స్ నిర్దేశించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఇబ్బందులు, మోసాలకు గురికాకుండా రక్షణగా పోలీసు వ్యవస్థ ఉండాలని, ఇందు కోసం జిల్లాకు ఒక రైతు భరోసా పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై ఆలోచన చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం తదితర వ్యవహారాల్లో మోసాలు జరిగితే వారికి అండగా నిలిచి, వారికి న్యాయం చేసేలా ఈ వ్యవస్థ ఏర్పాటు గురించి ఆలోచిస్తున్నామని తెలిపారు. బయటి ప్రాంతాల్లో వ్యాపారుల నుంచి మోసాలకు గురి కాకుండా వారికి భద్రత కల్పించడమే దీని ఉద్దేశమని స్పష్టం చేశారు. దిశ చట్టం అమలు, సైబర్ కియోస్క్ లు, జిల్లాకొక రైతు భరోసా పోలీస్ స్టేషన్ ఏర్పాటు, సచివాలయ సిబ్బందికి యూనిఫాం, స్పందన నిర్వహణ అంశాలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి పోలీస్ స్టేషన్లో దిశ హెల్ప్ డెస్క్ మాదిరిగా రైతుల కోసం ఒక డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ డెస్‌్కలు అన్నీ జిల్లా స్థాయి పోలీస్ స్టేషన్ కింద ఉండాలన్నది ప్రాథమిక ఆలోచనని తెలిపారు. ఈ నూతన వ్యవస్థ ఎలా ఉండాలనే దానిపై మేధోమథనం చేసి, పూర్తి స్థాయిలో ఆలోచించి.. కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో హోంమంత్రి సుచరిత తదితరులు మహిళలు, బాలలపై నేరాల్లో 7 రోజుల్లో చార్జిషీటు మహిళలు, బాలలపై నేరాలకు సంబంధించి 7 రోజుల్లోగా చార్జిషీటు దాఖలు చేసే దిశగా అడుగులు ముందుకు వేయాలి. దర్యాప్తునకు అనుసరించే ప్రక్రియలో మౌలిక సదుపాయాల పరంగా సమస్యలు ఏమైనా ఉంటే దానిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. దిశ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపైనా దృష్టి పెట్టడంతో పాటు అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్‌్కలు ఏర్పాటు చేయాలి. – మొబైల్ ఫోన్ల సెక్యూరిటీ కోసం ప్రారంభించిన సైబర్ కియోస్క్ మంచి ఫలితాలను ఇస్తున్నందున, దాన్ని ఎలా వినియోగించుకోవాలన్న దానిపై పలు సూచనలు కియోస్క్ వద్ద పెట్టాలి. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల వద్దే కాకుండా విద్యా సంస్థల వద్ద కూడా సైబర్ కియోస్క్‌లు ఏర్పాటు చేయాలి. వీటికి ‘దిశ కియోస్క్’ అని పేరు పెట్టాలి. తిరుపతి, విశాఖపట్నంలో ఫోరెన్సిక్ ల్యాబ్‌ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. దిశ యాప్‌పై విస్తృత ప్రచారం – దిశ పోలీస్ స్టేషన్ల వద్ద, కాలేజీల వద్ద దిశ కార్యక్రమం కింద అందే సేవలు, రక్షణ, భద్రత అంశాలను పొందుపరుస్తూ హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులతో అనుసంధానం కావాలి. – గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులకు దిశ కార్యక్రమం పట్ల అవగాహన కల్పించాలి. గ్రామాల్లో ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, ఏఎన్ఎంలకు కూడా దిశ యాప్‌పై అవగాహన కల్పించాలి. గ్రామ సచివాలయాల్లో దిశ యాప్ సహా.. దాని కింద చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించి పోస్టర్లు, హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలి. – దిశ ఎస్ఓఎస్ నుంచి కాల్ వచ్చిన వెంటనే నిర్దేశిత సమయంలోగా పోలీసులు అక్కడ ఉంటున్నారా? లేదా? (సగటున 6 నిమిషాల్లోగా చేరుకుంటున్నామని, కొన్ని ఘటనల విషయంలో కౌన్సిలింగ్ చేస్తున్నామని అధికారులు తెలిపారు) ఇలాంటి ఘటనల్లో ఫిర్యాదులు చేసిన మహిళలకు క్రమం తప్పకుండా కాల్స్ వెళ్లాలి. వారి సమస్య తీరిందా? లేదా? అన్న దానిపై వారి నుంచి తప్పనిసరిగా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. ఈ ఫాలో అప్ క్రమం తప్పకుండా చేయాలి. మహిళలపై 7.5 శాతం తగ్గిన నేరాలు – ‘దిశ’ అమలు, మహిళల భద్రత, రక్షణపై ప్రత్యేక దృష్టి కారణంగా 2019తో పోలిస్తే 2020లో మహిళలపై 7.5 శాతం నేరాలు తగ్గాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 471 కేసులకు సంబంధించి 7 రోజుల్లో, 1,080 కేసుల్లో 15 రోజుల్లో చార్జిషీటు దాఖలు చేశామని, 103 కేసుల్లో శిక్షలు ఖరారు అయ్యాయని చెప్పారు. – సైబర్ బుల్లీయింగ్‌పై 1,531 కేసులు, లైంగిక వేధింపులకు సంబంధించి 823 కేసులు పెట్టామన్నారు. గతంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డ 1,40,415 మంది డేటాను క్రోడీకరించామని, సైబర్ మిత్ర ద్వారా 2,750 పిటిషన్లు స్వీకరించామని, 374 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశామని తెలిపారు. – ఇప్పటి వరకు 12 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారని, యాప్‌ను ఉపయోగించి రిపోర్టు చేసిన 799 ఘటనల్లో చర్యలు తీసుకున్నామని, ఇందుకు సంబంధించి 154 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశామని అధికారులు వెల్లడించారు. – మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు దిశ తరహా కార్యక్రమాలను చేపట్టాయని, దిశ దర్యాప్తు (పెట్రోలింగ్) వాహనంపై ప్రధాని నుంచి ప్రశంసలు లభించాయని తెలిపారు. – ఈ సమీక్షలో హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, దిశ స్పెషల్ ఆఫీసర్లు కృతికా శుక్లా, దీపికా పాటిల్, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
భర్త బాధితులకు ‘దిశ’ భరోసా
పోలీసుల స్పందనతో నిలిచిన ప్రాణం.. తూర్పుగోదావరి జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వివాహిత అర్ధరాత్రి 1:59 గంటలకు దిశ యాప్ ద్వారా పోలీసు సాయం కోరింది. తన భర్త వేధింపుల కారణంగా తాను నిద్రమాత్రలు మింగినట్టు తెలిపింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఐదు నిమిషాల్లోనే ఆమె వద్దకు చేరుకున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సకాలంలో చికిత్స అందడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. అనంతరం ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను, ఆమె భర్తను పిలిచి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇటువంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకుంటానని భర్త చెప్పడంతో వారి కాపురాన్ని పోలీసులు నిలబెట్టినట్లయింది. బెదిరించిన యువకుడి అరెస్ట్.. కర్నూలు జిల్లాలోని ఆస్పరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడు తనతో వివాహేతర సంబంధం పెట్టుకోమని ఒక యువతిని వేధించాడు. అందుకు అంగీకరించని ఆమె పెళ్లి చెడగొట్టేందుకు లెటర్ రాస్తానని బెదిరించాడు. దీనిపై బాధితురాలు దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. బాలికను వేధించినందుకు కేసు.. గుంటూరు జిల్లా వట్టిచెరుకురు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాలిక (12)ను ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో పొరుగింటి యువకుడు చొరబడి వేధించాడు. ఇది గమనించిన స్థానికులు దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు వచ్చి బాలికను కాపాడటంతోపాటు ఆమెను లైంగికంగా వేధించిన యువకుడిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు... ఇలా భర్త చేతిలో దెబ్బలు తిని కాపాడమని కోరిన గృహిణులతోపాటు ఆకతాయిల వేధింపులకు గురైన విద్యార్థినులు, బస్టాండ్, రైల్వేస్టేషన్, ప్రధాన కూడళ్లలో అపరిచితుల అసభ్య ప్రవర్తనతో విసిగిపోయిన యువతులకు దిశ యాప్ వరంలా మారింది. సాక్షి, అమరావతి: భర్త బాధితులైన పలువురు గృహిణులు దిశ యాప్‌ను ఆశ్రయిస్తున్నారు. దిశ కాల్ సెంటర్‌కు ఫిర్యాదు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే పోలీసులు స్పందిస్తున్నారు. సమీపంలోని పోలీస్ స్టేషన్ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో కౌన్సెలింగ్ ద్వారా కాపురాలు చక్కదిద్దుతున్నారు. దిశ కాల్ సెంటర్‌కు వచ్చిన కాల్స్‌ను పోలీసులు విశ్లేషించగా.. భర్త బాధితులకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దిశ బిల్లు తెచ్చిన సంగతి తెల్సిందే. దిశ బిల్లులో భాగంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకునేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 8న దిశ మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్‌ను దాదాపు 12 లక్షలమంది డౌన్లోడ్ చేసుకోగా, ఆపదలో ఉన్న మహిళలు, బాలికలు నేరుగా ఫిర్యాదు చేస్తున్నారు. దిశ యాప్‌లో వస్తున్న ఫిర్యాదుల్లో భర్త బాధితలు సైతం ఉండటం గమనార్హం. అనేకమంది గృహిణులు ‘భర్త పెట్టే బాధలు భరించలేకపోతున్నాం కాపాడండి’ అంటూ వేడుకుంటున్నారు. గడిచిన పదినెలల కాలంలో 675 మంది మహిళలు, బాలికలు దిశ కాల్ సెంటర్‌కు ఫోన్ చేశారు. వీరిలో భర్త వేధింపులు తాళలేకపోతున్నామంటూ 267 మంది కాల్ చేశారు. ఈ ఘటనల్లో మద్యం తాగి వచ్చి భార్యను కొట్టిన ప్రబుద్ధులే ఎక్కువగా ఉన్నారు. దీనికితోడు అధిక కట్నం కోసం వేధిస్తున్న వారున్నారు. రాత్రివేళ 10.30 గంటల నుంచి తెల్లవారుజాము 3.30 గంటల మధ్య ఈ తరహా వేధింపులు జరిగినట్టు దిశ కాల్స్‌లో రికార్డయ్యాయి. భర్త కొడుతున్న సమయంలో తమ మొబైల్స్‌లోని దిశ యాప్‌ను ఓపెన్ చేసి ఎస్‌వోఎస్ బటన్ ప్రెస్ చేసే అవకాశం లేకపోవడంతో తమ చేతిలోని సెల్ ఫోన్‌ను అటు ఇటు ఊపి (షెక్ చేయడం) ఆపదలో ఉన్నాం ఆదుకోండి.. అని సమాచారం అందించడం విశేషం. దిశ కాల్ సెంటర్‌కు సమాచారం వచ్చిన వెంటనే సమీపంలోని పోలీసులను అప్రమత్తం చేయడంతో భర్త బాధితులను కాపాడుతున్నారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి కాపురాలు చక్కదిద్దుతున్నారు. పదినెలల్లో దిశ యాప్‌కు వచ్చిన ఫిర్యాదులు భర్త వేధింపులు: 267 బయటివారి వేధింపులు: 115 గుర్తుతెలియనివారి వేధింపులు: 69 పనిచోసేచోట వేధింపులు: 67 బంధువుల వేధింపులు: 68 తప్పుడు ఫిర్యాదులు: 22 అసభ్య ప్రవర్తన: 19 మహిళ అదృశ్యం: 13 బాలికలపై అకృత్యాలు: 9 సివిల్ వివాదాలు: 8 బాలికల అదృశ్యం: 8 ప్రమాదాలు: 6 పురుషుల అదృశ్యం: 3 వెంటపడి వేధింపులు: 1 మొత్తం: 675 తక్షణం స్పందిస్తున్నాం దిశ యాప్ ద్వారా కాల్ సెంటర్‌కు వస్తున్న సమాచారంపై తక్షణం స్పందించి సమీపంలోని పోలీసులను అప్రమత్తం చేస్తున్నాం. ఆపదలో ఉన్న మహిళలు, బాలికలు, యువతులకు తక్షణ సహాయం అందించేందుకు పోలీసులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందిస్తున్న పోలీసులు 5 నుంచి 12 నిమిషాల్లోనే ఘటన ప్రాంతానికి చేరుకుని సహాయం అందిస్తున్నారు. చాలావరకు తక్షణ సహాయం, కౌన్సెలింగ్‌లతో సరిపెడుతున్నాం. తీవ్రత ఉన్న వాటిపై గృహహింస, పోక్సో, నిర్భయ కేసులు నమోదు చేస్తున్నాం. భర్తల వేధింపులపై 267 మంది ఫిర్యాదు చేయగా కౌన్సెలింగ్ అనంతరం అనేక కాపురాలు చక్కబడ్డాయి. అప్పటికీ మాటవినని 20 మంది పురుషులపై కేసులు నమోదు చేశాం. - దీపికా పాటిల్, దిశ ప్రత్యేక అధికారి -
దివ్య హత్య కేసు: దిశా పోలీస్ స్టేషన్‌కు నాగేంద్ర
సాక్షి, విజయవాడ: దివ్య హత్య కేసులో నిందితుడిగా ఉన్న నాగేంద్రను జీజీహెచ్ నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరు పరచడానికి 24 గంటల సమయం ఉండటంతో పోలీసులు నిందితుడిని దిశ పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చారు. దీంతో దిశా టీమ్ నాగేంద్ర నుంచి వాస్తవాలు రాబట్టే పనిలో పడ్డారు. గత రెండు గంటల నుంచి హత్యకు గల కారణాలపై పోలీసులు నాగేంద్ర నుంచి కీలక విషయాలు రాబడుతున్నారు. కోర్టు సమయం ముగియటంతో న్యాయమూర్తి ఇంటివద్దే నాగేంద్రను హాజరు పరిచే అవకాశం ఉంది. అనంతరం చార్జ్‌షీట్ దాఖలు చేసి నాగేంద్రను పోలీసులు కస్టడీకి కోరనున్నారు. (దివ్యది హత్యే.. తేల్చిన పోలీసులు) -
ఏపీలో బాగా తగ్గిన క్రైమ్ రేటు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నేరాలు తగ్గుతున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల అదుపునకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గత ఏడాదితో పోలి్చతే ఈ ఏడాది రాష్ట్రంలో నేరాలు ఏకంగా 18 శాతం తగ్గడం గమనార్హం. తీవ్రమైన నేరాలతో పాటు మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు కూడా తగ్గుముఖం పట్టాయి. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ), ఏపీ పోలీస్ రికార్డుల్లో గణాంకాలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఎన్సీఆర్బీ 2019 లెక్కల ప్రకారం ప్రతి లక్ష మంది జనాభాకు జాతీయ స్థాయి క్రైమ్ రేటు 241.9 ఉంటే ఏపీలో అది 227.9 మాత్రమే ఉండటం గమనార్హం. అంటే జాతీయ స్థాయి కంటే ఏపీలో క్రైమ్ రేటు 14 తక్కువగా నమోదైందన్న మాట. అలాగే గతేడాదితో పోల్చితే ఈ ఏడాది రాష్ట్రంలో నేరాల సంఖ్య 18 శాతం తగ్గడం విశేషం. దేశానికే ఆదర్శంగా దిశ బిల్లు ► పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో దిశ ఘటన నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకంటే ఎంతో ముందుగా స్పందించిన ఏపీ ప్రభుత్వం దిశ చట్టం తెచ్చేలా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. దిశ బిల్లు తేవడంతోపాటు దిశ మొబైల్ అప్లికేషన్, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ ఫోరెన్సిక్ ల్యాబ్‌లు, ప్రత్యేక పోలీస్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి మహిళలు, బాలికలపై నేరాలకు చెక్ పెట్టేందుకు, నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు గట్టి చర్యలు చేపట్టింది. జీరో ఎఫ్ఐఆర్తో బాధితులకు తక్షణం పోలీస్ సాయం అందేలా చేస్తున్నారు. మహిళలు, బాలికలపై చిన్న ఘటన జరిగినా యుద్ధప్రాతిపదికన స్పందించి తక్షణ చర్యలు చేపడుతున్నారు. ► స్పందన, మహిళా మిత్ర, సైబర్ మిత్ర, మహిళా పోలీస్ వంటి కార్యక్రమాలతో తక్షణం స్పందిస్తున్న తీరు శాంతిభద్రతల రక్షణకు, నేరాల అదుపునకు దోహదం చేస్తోంది. ► ప్రజలకు 87 పోలీసు సేవలు మరింత అందుబాటులోకి తెస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించిన పోలీస్ సేవా యాప్ విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. బాధితులే కాకుండా సాధారణ పౌరులు సైతం పోలీస్‌స్టేషన్ గడప తొక్కనవసరం లేకుండానే మొబైల్ యాప్ ద్వారా పోలీస్ సేవలు పొందుతున్నారు. ► ఇసుక, మద్యం అక్రమాలు, సంబంధిత నేరాలకు చెక్ పెట్టేలా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ఏర్పాటు చేశారు. ► పరివర్తన, నవోదయం వంటి కార్యక్రమాలతో నాటుసారా తయారీదార్లలో మార్పు కోసం పోలీసు యంత్రాంగం ప్రత్యేక కార్యచరణ చేపట్టింది. నేరాలు మరింత తగ్గించేందుకు కృషి.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల అదుపునకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. సీఎం దిశా నిర్దేశంలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఉత్సాహంగా పనిచేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రజా సహకారాన్ని అందిపుచ్చుకుని చేపడుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇవ్వడంతో క్రైమ్ రేటు తగ్గింది. ఏపీ పోలీస్ శాఖకు ఈ ఏడాది ఏకంగా 103 జాతీయ అవార్డులు రావడం మా పనితీరును స్పష్టం చేస్తోంది. భవిష్యత్తులో మరింత ఉత్సాహం, జవాబుదారీతనంతో నేరాలు తగ్గించేందుకు కృషి చేస్తాం. – డీజీపీ గౌతమ్ సవాంగ్ -
మహిళలకు రక్షణ కల్పిస్తాం
గుణదల(విజయవాడ తూర్పు): మహిళలకు రక్షణ కల్పించే దిశగా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని హోం శాఖా మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. విజయవాడ నగరంలోని క్రీస్తురాజపురంలో ప్రేమోన్మాది చేతిలో దారుణహత్యకు గురయిన దివ్య తేజస్విని కుటుంబసభ్యులను శనివారం పరామర్శించారు. అనంతరం మంత్రి సుచరిత మాట్లాడుతూ.. దివ్య కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం దిశ పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేసిందని చెప్పారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ, 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో వేధింపులు, హత్యలు గణనీయంగా తగ్గాయన్నారు. టీడీపీ హయాంలో మహిళలపై అత్యాచారాలు అధికంగా ఉండేవని సుచరిత తెలిపారు. దివ్య తల్లిదండ్రుల లేఖ ఆడపిల్లలకు జరుగుతున్న అఘాయిత్యాలను ప్రస్తావిస్తూ మంత్రి సుచరితకు దివ్య తల్లిదండ్రులు లేఖ అందజేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొంతమంది యువకులు మాదకద్రవ్యాలకు బానిసలై ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
దివ్య తేజశ్విని కేసు దర్యాప్తు ‘దిశ’ పోలీసులకు
సాక్షి, అమరావతి: విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకానికి బలైపోయిన దివ్య తేజశ్విని కేసును దిశ పోలీసులు దర్యాప్తు చేస్తారని దిశ ప్రత్యేక అధికారులు కృతిక శుక్లా, దీపికా పాటిల్ ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వారు విజయవాడలోని దివ్య తేజశ్విని కుటుంబసభ్యులను శుక్రవారం పరామర్శించి ఓదార్చారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తికి కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ► సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చాం. ► మహిళలపై ఉన్మాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం. ► ఈ కేసులో నిందితుడిపైన దిశ స్ఫూర్తిగా ఏడు రోజుల్లో చార్జ్ షీట్ దాఖలు చేస్తాం. ► ఆపదలో ఉన్న మహిళలు డయల్ 100, డయల్ 112, డయల్ 181 ద్వారా పోలీసుల సహాయం కోరాలి. దిశ యాప్, పోలీస్ సేవ యాప్ అందుబాటులో ఉన్నాయి. -
అత్యాచార కేసుల్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు
సాక్షి, అమరావతి: మహిళలు, ఆడపిల్లలపై రోజురోజుకీ పెరిగిపోతున్న దారుణాలపై కేంద్ర హోం శాఖ స్పందించింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన హాథ్రస్ హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చట్టాలను అనుసరించి కేంద్ర హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.. ► మహిళలపై నేరాలు.. ప్రధానంగా అత్యాచారం వంటి కేసుల్లో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. లైంగిక దాడి వంటి ఘటనల్లో తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఒకవేళ నేరం బాధితురాలుండే పోలీస్‌స్టేషన్ పరిధి వెలుపల జరిగితే.. ఎక్కడైనా సరే ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేయాల్సిందే. లేకపోతే సదరు పోలీస్ అధికారి శిక్షార్హుడు. ► లైంగిక దాడి గురించి సమాచారం అందిన 24 గంటల్లోగా బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించాలి. న్యాయాధికారి ముందు రికార్డు చేయనప్పటికీ.. బాధితురాలి మరణ వాంగ్మూలం పరిగణనలోకి తీసుకోవాలి. ► లైంగిక దాడుల కేసుల్లో సాక్ష్యాలను సేకరించేందుకు సెక్సువల్ అసెల్ట్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్లను ఉపయోగించాలి. అత్యాచార కేసుల్లో పోలీసుల దర్యాప్తు 60 రోజుల్లో పూర్తి చేయాలి. ► దర్యాప్తులో రాష్ట్ర పోలీసులకు సహకారం అందించేందుకు ‘ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఫర్ సెక్సువల్ అఫెన్సెస్’ ఆన్లైన్ పోర్టల్‌ను కేంద్ర హోం శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఈ మార్గదర్శకాలు పాటించని పోలీసులపైనా కఠిన చర్యలు ఉంటాయి. ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ మహిళలు, ఆడపిల్లల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచింది. తెలంగాణలో జరిగిన ‘దిశ’ ఘటన నేపథ్యంలో.. ఏపీలోని ఆడబిడ్డలెవరికీ అలాంటి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో వైఎస్ జగన్ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. మహిళలు, బాలికల రక్షణకు ప్రత్యేకంగా ‘దిశ’ యాక్ట్ తెచ్చింది. దిశ పోలీస్ స్టేషన్లు, సైంటిఫిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసింది. ఫలితంగా మహిళలు, చిన్నారులపై అత్యాచారానికి, లైంగిక వేధింపులకు పాల్పడిన దుర్మార్గులకు 21 రోజుల్లోనే శిక్షలు పడేలా కృషి చేస్తోంది. ఏపీలోని దిశ యాక్ట్ తరహాలోనే ప్రత్యేక చట్టం తెచ్చేందుకు మహారాష్ట్ర, తదితర రాష్ట్రాలు ఏపీలో అధ్యయనం కూడా చేశాయి. అన్యాయానికి గురైన మహిళలు ఎక్కడైనా ఫిర్యాదు చేసేలా 2019 డిసెంబర్ 5 నుంచే రాష్ట్రంలో జీరో ఎఫ్ఐఆర్ను అమలులోకి తెచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 341 జీరో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో తీసుకొచ్చిన దిశ యాక్ట్, జీరో ఎఫ్ఐఆర్ తదితరాలు మహిళలు, చిన్నారుల రక్షణలో సత్ఫలితాలను ఇస్తున్నాయని ఏపీ పోలీస్ శాఖ టెక్నికల్ చీఫ్ పాల్‌రాజ్ ‘సాక్షి’కి తెలిపారు. -
‘దిశ’ స్ఫూర్తితో 74 కేసుల్లో శిక్షలు
సాక్షి, అమరావతి: మహిళలపై నేరాలకు, అకృత్యాలకు ఒడిగట్టే వారికి కఠిన శిక్షలు వేయడమే కాకుండా.. వేగంగా శిక్షలు పడేలా రాష్ట్ర ప్రభుత్వం ‘దిశ’ చట్టాన్ని రూపొందించి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించింది. దీనికి కేంద్రం నుంచి ఆమోదం రావాల్సి ఉన్నప్పటికీ.. నేరాలకు పాల్పడిన వారిపై దిశ చట్టం స్ఫూర్తితో న్యాయస్థానాల్లో వేగంగా శిక్షలు ఖరారయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే దిశ చట్టం చేసిన తరువాత ఆగస్టు నెల వరకు మహిళలపై నేరాలకు పాల్పడిన 74 కేసుల్లో శిక్షలు ఖరారయ్యాయి. జాప్యాన్ని నివారించి.. ► సాధారణంగా న్యాయస్థానాల్లో సంవత్సరాల తరబడి వాదనలు నడుస్తాయి. దీనివల్ల కేసులు వాయిదాలు పడుతూ వస్తాయి. ► అయితే, దిశ చట్టం కింద నేరం జరిగిన ఏడు రోజుల్లో పోలీసులు చార్జిషీటు దాఖలు చేయాలి. 21 రోజుల్లోనే నిందితులకు శిక్షలు ఖరారు కావాలి. ► ఇందుకోసం కేసుల విచారణకు మహిళా ప్రత్యేక కోర్టుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దిశ చట్టం రూపుదిద్దుకున్నాక మహిళలపై నేరాలకు సంబంధించి ఇప్పటివరకు 74 కేసుల్లో శిక్షలు ఖరారయ్యాయి. ► వాటిలో మూడు కేసుల్లో నిందితులకు మరణ శిక్షలు పడ్డాయి. ► మరో ఐదు కేసుల్లో జీవిత ఖైదు, రెండు కేసుల్లో 20 ఏళ్ల పాటు జైలు శిక్షలు ఖరారయ్యాయి. మహిళలకు రక్షణ కవచం ‘దిశ’ – దీపికా పాటిల్, ‘దిశ’ ప్రత్యేక అధికారి మహిళల రక్షణ కవచంలా ఉండేలా సీఎం వైఎస్ జగన్ ‘దిశ’ బిల్లు తెచ్చారు. ఎక్కడైనా నేరం జరిగితే కేసు నమోదు, పోలీస్ దర్యాప్తు, న్యాయ విచారణ వేగంగా పూర్తి చేసేలా దృష్టి సారించాం. ప్రతి దిశ పోలీస్ స్టేషన్లో ప్రభుత్వం ఐదుగురు ఎస్సైలను నియమించింది. అందుకే కేసుల్లో వేగంగా తీర్పులు వచ్చి దోషులకు శిక్షలు పడుతున్నాయి. దిశ బిల్లు రాక ముందు ఉన్న కేసులను కూడా దీని పరిధిలోకి తెచ్చి వేగంగా విచారణ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. -
ఫోన్ వస్తే చాలు పోలీసులు ఎత్తుకుపోతారు
సాక్షి, అమరావతి : మీరు ఒక మహిళ కావచ్చు మిమ్మల్ని తెలిసిన వ్యక్తి తెలియని వ్యక్తి వేధించే ప్రయత్నం కూడా జరగొచ్చు. ఎవరికైనా చెబితే పరువు పోతుందని భయం కూడా ఉండొచ్చు. అలాంటి అనుమానాలు అవసరం లేదు చిన్న ఫోన్ కాల్ చేస్తే చాలు మీ పేరు రహస్యంగా ఉంచి వేధించే వ్యక్తి భరతం పట్టే పరిస్థితి ఇప్పుడు విశాఖ లో ఏర్పడింది. ఈ మధ్యకాలంలో విశాఖలో ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ఆఫీస్‌కి హడావిడిగా వెళ్లే మహిళలను బైక్ పై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించి కొంత దూరం వెళ్లి ఆమె ముఖాన్ని తిరిగి చూసే ఘటనలు పెరిగాయి. ఇంటి నుంచి ఆఫీస్ కి ఎలా చేరాలి అన్న ఆలోచనతో వడివడిగా వెళ్తున్న దశలో ఊహించని ఈ పరిణామాలతో చాలా మంది మహిళలు షాక్‌కు గురయ్యారు. కొందరు ఇంట్లో వాళ్లకు చెప్పుకున్నారు మరికొందరు చెప్పుకోలేక కుమిలిపోయారు. కానీ బీచ్ లో ఇద్దరు మహిళలు మాత్రం జరిగిన ఘటనతో కోపంతో రగిలిపోయారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరు మహిళలు సహకారంతో పోలీసులు ఆ అపరిచిత వ్యక్తిని అరెస్టు చేశారు. విశాఖలోని అఫీషియల్ కాలనీకి చెందిన రాంబాబు అనే ఈ వివాహితుడు గత కొన్నేళ్లుగా ఇలా ఒంటరి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్న ట్టు పోలీసులు గుర్తించారు. దిశ చట్టం పై అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అయితే ఇక్కడ చెప్పుకునే విషయం ఏమంటే జరిగిన అన్యాయంపై ధైర్యంగా ముందుకు రావడమే కాకుండా నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులకు సహకరించిన మహిళల గురించి..ఇలా ముందుకు వచ్చిన ఆ మహిళలను విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా అభినందించారు. Brave women అని కొనియాడారు. ఇలా మహిళలు ముందుకు రావడం మంచి పరిణామమని మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఉషశ్రీ పేర్కొన్నారు -
ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం
సాక్షి, అమరావతి: తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని.. రాష్ట్ర చరిత్రలో మహిళలకు ఇంత ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వంలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మహిళలపై సైబర్ నేరాల నిరోధానికి చర్యలు తీసుకోవడంతో పాటు వేధింపులను ఎలా ఎదుర్కోవాలనే దానిపై అవగాహన కల్పిచేందుకు రాఖీ పండుగను పురస్కరించుకుని సోమవారం తన క్యాంపు కార్యాలయంలో మహిళల రక్షణ కోసం ఈ–రక్షాబంధన్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఎమన్నారంటే.. ► రాఖీ పండుగ సందర్భంగా రెండు కార్యక్రమాలు మొదలుపెట్టాం. ► ఉదయం వైఎస్సార్ చేయూత, ఆసరా కార్యక్రమాలకు సంబంధించి హిందుస్థాన్ యునిలీవర్, ప్రోక్టర్ అండ్ గాంబిల్, ఐటీసీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. ► ఇంతకుముందు అమూల్‌తో ఒప్పందం చేసుకున్నాం. ► అర్హత పొందిన మహిళలకు నాలుగేళ్లపాటు తోడ్పాటు అందుతుంది. ► ఈ పెద్ద పెద్ద కంపెనీల భాగస్వామ్యంతో వారికి స్థిరమైన ఆదాయం లభించేలా కార్యక్రమాలు చేపడుతున్నాం. ► ఇందుకు ఏడాదికి దాదాపు రూ.11వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. రాఖీ పండుగ రోజున మరో కార్యక్రమం చేపడుతున్నాం.. ► 4s4u.ap.police.gov.in అనే పోర్టల్‌ను ప్రారంభిస్తున్నాం. ► రాబోయే నెలరోజులపాటు ఈ వెబ్ చానల్లో వివిధ నిపుణులతో మహిళలకు అవగాహన కల్పిస్తారు. ► ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్ ఉంది కాబట్టి దానివల్ల మంచి ఏంటి? చెడు ఏంటి? నష్టాలేంటి? వేధింపులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై అవగాహన కలిగిస్తారు. ► సైబర్, వైట్‌కాలర్ నేరాలు.. తదితర అంశాలనూ వివరిస్తారు. ► ఏయే యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏ యాప్‌లవల్ల ఇబ్బందులు వస్తాయన్న వాటి గురించి కూడా చెబుతారు. ► నేరం జరిగినప్పుడు ఎక్కడ? ఎలా? ఫిర్యాదు చేయాలో తెలియజేస్తారు. దిశ యాప్, పోలీస్స్టేషన్లు.. ► దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం, దిశ కాల్ సెంటర్‌కు ఫోన్ చేయడం, సైబర్‌మిత్ర వాట్సాప్ నంబర్ల ద్వారా సహాయం పొందవచ్చు. ► ఇవికాక దిశ పోలీస్స్టేషన్లు కూడా ఉన్నాయి. వీటిలో ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చు. వెంటనే చర్య తీసుకుంటారు. ► 18 దిశ పోలీస్స్టేషన్లు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా పెట్టాం. ► దిశ చట్టం కోసం రాష్ట్ర ప్రభుత్వపరంగా చేయాల్సినవి చేశాం. రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాం. ► రాష్ట్ర చరిత్రలో మహిళలకు ఇంత ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వంలేదు. ► ఇప్పటికే వారికి 50శాతం రిజర్వేషన్లు.. అమ్మ ఒడి, వసతి దీవెన ఇస్తున్నాం. ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున వారి పేరు మీద ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. ► హోంమంత్రి పదవి కూడా మహిళకు ఇచ్చాం. ప్రతి గ్రామంలో మహిళా పోలీసులను పెట్టాం. ► మద్యాన్ని కూడా నియంత్రించాం. ► 4ఎస్4యూ పోర్టల్ ద్వారా కూడా వారికి మంచి జరుగుతుంది. ఇది మరో చరిత్రాత్మక ఘట్టం. హోంమంత్రి సుచరిత, డీజీపీ సవాంగ్, సీఐడీ అడిషనల్ డీజీ సునీల్‌కుమార్, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే రజని, మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ పాల్గొన్నారు. -
నిత్య పెళ్లి కొడుకు: స్పందించిన మొదటి భార్య
సాక్షి, విజయవాడ : విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకున్నాడు. కట్నం కోసం ఆడవాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతూ క్రమశిక్షణ తప్పాడు. ఆగ్నిసాక్షిగా కట్టిన తాళిని ఎగతాళి చేస్తూ ముగ్గురు మెడలో మూడుముళ్లు వేశాడు. రెండో భార్య దిశ పోలీసులను ఆశ్రయించడంతో బడిపంతులు బాగోతం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అవనిగడ్డకు చెందిన శీలం సురేష్ చాట్రాయి మండలంలోని మర్రిబంధం ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. 2011 లో శాంతిప్రియ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అదనపు కట్నం తేలేదని ఆమెను వదిలేసి, మొదటి పెళ్లి గురించి చెప్పకుండా 2015 లో శైలజ అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. కట్నం కింద నాలుగులక్షల రూపాయలు, పది సవర్ల బంగారం తీసుకొన్నాడు. ఆడపిల్లకు జన్మనిచ్చిందని శైలజతో తెగతెంపులు చేసుకొని 2019 లో అనూష అనే ఉపాధ్యాయిని రహస్యంగా మూడో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి నిలదీసిన భార్య శైలజ ,అత్తలపై దాడి చేశాడు. సురేష్ నయవంచనపై జిల్లా విధ్యాశాఖాధికారితో పాటు దిశ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. సురేష్‌పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూడు పెళ్లిళ్లకు సహకరించిన సురేష్ తల్లిదండ్రులు, అన్నయ్యపై చర్యలు తీసుకోవాలని విజయవాడ దిశ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో మహిళ మోసపోకముందే సురేష్‌ను అరెస్ట్ చేయాలని రెండో భార్య శైలజ విజ్ఞప్తి చేశారు. న్యాయం జరిగేవరకు పోరాటం కొనసాగిస్తానని తేల్చి చెప్పారు. బాధిత భార్యలకు మహిళ సంఘాలు అండగా నిలిచాయి. సురేష్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. అదనపు కట్నం కోసం వేధించాడు : సురేష్ మొదటి భార్య నిత్య పెళ్లికొడుకు సురేష్ బాగోతంపై ఆయన మొదటి భార్య శాంతి ప్రియ స్పందించారు. తనలాగే మరో ఇద్దరిని కూడా మోసం చేశాడని తెలిసి బాధపడ్డానని తెలిపారు. సురేష్ పై చర్యలు తీసుకోకుంటే మరింతమందిని మోసం చేస్తారని పేర్కొన్నారు. తాను కేసు పెట్టినప్పుడే చర్యలు తీసుకుంటే మరో ఇద్దరు మహిళలకు అన్యాయం జరిగేది కాదని వాపోయారు. రూ.10లక్షలు కట్నంగా తీసుకొని ఇంకా కావాలని తనను వేధించారని ఆరోపించారు. పుట్టింట్లో ఘనంగా పుట్టిన రోజు జరుపుతానని చెప్పి వదిలేసి కనిపించకుండా వెళ్లాడని చెప్పారు. సురేష్‌కు పలుకుబడి ఉండటం వల్ల ఏ కేసులోనూ చిక్కకుండా తిరుగుతున్నాడని ఆరోపించారు. తమకు న్యాయం చేయమని త్వరలోనే మహిళా కమిషన్‌ను కూడా కలుస్తానని శాంతిప్రియ పేర్కొన్నారు. -
నిత్య పెళ్లికొడుకుగా మారిన ఓ ప్రధానోపాధ్యాయుడు
-
వేధింపులు పోలీసుల దృష్టికి తేవాలి
సాక్షి, గుంటూరు/పట్నంబజారు(గుంటూరు): మహిళలు, యువతులకు సంబంధించి ఎటువంటి ఘటన జరిగినా త్వరితగతిన చర్యలు చేపట్టడంతో పాటు శిక్షలు తప్పవని, బాధితులు నిర్భయంగా వేధింపుల ఘటనలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ దృఢ లక్ష్యంతో దిశ పోలీసు స్టేషన్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారని, వాటి ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. గుంటూరులో బీటెక్ విద్యార్థిని నగ్న వీడియోలను పోర్న్ వెబ్‌సైట్స్, ఇన్‌స్ట్రాగామ్‌లలో పెట్టి వేధింపులకు గురిచేయడం ఎంతో బాధాకరమన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి సోమవారం వచ్చిన ఆమె అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డితో సమావేశమయ్యారు. ఈ కేసు పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఘటనపై ఈనెల 20న ఫిర్యాదు అందిన నేపథ్యంలో సాంకేతికపరంగా దర్యాప్తు, నిందితులను విచారణ చేసి వరుణ్, కౌశిక్‌ను 27న అరెస్ట్ చేశారన్నారు. ఇన్‌స్ట్రాగామ్‌లో అప్లోడ్ చేసిన మరో వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. -
అమ్మాయిలు మరింత జాగ్రత్తగా ఉండాలి
-
‘దిశ పీఎస్‌లో ఎలాంటి ఒత్తిళ్లు లేవు’
సాక్షి, గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకు వచ్చిన దిశ పోలీస్ స్టేషన్ల వల్ల మెరుగైన ఫలితాలు కన్పిస్తున్నాయని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. దిశ పీఎస్‌లో ఎలాంటి ఒత్తిళ్లు లేదని పేర్కొన్నారు. బాధితురాలికి న్యాయం చేయడం, దోషులకు శిక్ష వేయించటమే పని అని తెలిపారు. గుంటూరు ఇంజనీరింగ్ విద్యార్థి కేసులో పోలీసులు వెనువెంటనే స్పందిచారని ఆమె తెలిపారు. కానీ స్టూడెంట్స్ స్థాయిలో ఇలా జరగటం దారుణమన్నారు. కాగా ఇంజనీరింగ్ విద్యార్థుల కీచక పర్వం గుంటూరు పట్టణంలో శనివారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. తోటి విద్యార్థినితో సన్నిహితంగా ఉంటూ వీడియోలు చిత్రీకరించిన ఇద్దరు యువకులు.. వాటిని అడ్డుపెట్టుకుని కోరిక తీర్చాలని వేధింపులకు గురి చేశారు. తాము చెప్పినట్టు వినకుంటే ఆ వీడియోలను వెబ్సైట్లో పెడతామంటూ బెదిరింపులకు దిగారు. ఈక్రమంలో బాధితురాలు దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. (మరో ఇద్దరు యువతుల ప్రమేయం!) ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. ఈ ఘటనపై పోక్సో చట్టంతో పాటుగా ఇతర కేసులు కూడా పెట్టినట్లు వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో కఠిన శిక్షలు ఉంటాయన్నారు ఏఐపీ అడ్రస్ ద్వారా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో అప్లోడ్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ఏ1 నిందితుని తల్లిదండ్రులు పోలీసుశాఖకు చెందిన వారే అయినప్పటికీ నిందితుడిని అరెస్టు చేశామని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. ఎవరి ఒత్తిళ్లు తమపై లేవని స్పష్టం చేశారు, త్వరలో మరికొందరిని అరెస్టు చేస్తామని వెల్లడించారు. -
‘దిశ’పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: ‘దిశ’ అమలు కోసం ప్రత్యేక వాహనాలు వెంటనే ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అదే విధంగా వీలైనంత త్వరగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని.. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం కూడా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ‘దిశ’పై సీఎం జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, దిశ అధికారులు కృతికా శుక్లా, దీపికా పాటిల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దిశ యాప్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్న అంశంపై ప్రజలకు ఎస్ఎంఎస్ సహా వివిధ మార్గాల్లో సమాచారం పంపాలని సూచించారు. అలాగే స్మార్ట్ ఫోన్లలో మాత్రమే కాకుండా మిగతా ఫోన్లలో కూడా ‘దిశ’ యాప్ సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. ఇందుకోసం సంబంధిత కంపెనీలతో మాట్లాడాలని ఆదేశించారు. (వలస కూలీలపై సీఎం జగన్ ఆవేదన) ప్రతీ పార్లమెంటు నియోజకవర్గానికి డీ- అడిక్షన్ సెంటర్ ‘‘దిశ చట్టం రాష్ట్రప్రతి ఆమోదం పొందేలా చూడాలి. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం వీలైనంత త్వరగా చేపట్టాలి. కేసుల విచారణ వేగంగా జరిగేలా చూడాలి. ఫోరెన్సిక్ ల్యాబ్‌ల నిర్మాణం, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తేవాలి. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గానికీ ఒక డీ-అడిక్షన్ సెంటర్ ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఉన్న 11 , కొత్తగా ఏర్పాటు చేసే 16 టీచింగ్ ఆస్పత్రుల్లో డీ- అడిక్షన్ సెంటర్ కూడా ఒక విభాగంగా కలుపుకుని నిర్మాణాలు చేపట్టాలి. తద్వారా శాశ్వత ప్రాతిపదికన డీ- అడిక్షన్ సెంటర్ ఏర్పాటు అవుతుంది. వన్ స్టాప్ సెంటర్లకు సంబంధించి మౌలిక సదుపాయాలను కూడా ఇందులో భాగం చేయాలి. వన్ స్టాప్ సెంటర్లను కూడా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికీ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే దిశ పోలీస్స్టేషన్లు కూడా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి ఉండేలా చూడాలి. ‘దిశ’పై ప్రతి నెలా ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలి’’ అని సీఎం జగన్ ఆదేశించారు. దిశ పోలీస్స్టేషన్లకు ఐఎస్ఓ సర్టిఫికెట్లు అత్యుత్తమ నాణ్యత, ప్రమాణాలతో కూడిన సేవలకు గాను 6 దిశ పోలీస్స్టేషన్లకు జీటౌ 9001:2015 సర్టిఫికెట్లు లభించాయి. వీటిని సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ క్రమంలో సర్టిఫికెట్ల జారీని సౌత్ ఇండియా ఐఎస్ఓ జనరల్ మేనేజర్ డాక్టర్ ఎలియాజర్ వివరించారు. కాగా విజయనగరం, రాజమండ్రి అర్బన్, విశాఖపట్నం సిటీ, నెల్లూరు, కర్నూలు, అనంతపూర్ పోలీస్స్టేషన్లకు జీటౌ 9001:2015 సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. త్వరలో విజయవాడ సిటీ దిశ పోలీస్‌స్టేషన్‌కు కూడా ఈ సర్టిఫికెట్ లభించనుంది. సర్టిఫికెట్ల ఆవిష్కరణ అనంతరం 18 దిశ పోలీస్టేషన్ల సిబ్బందితో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా ఎస్పీలు, ఇతర అధికారులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ‘‘167 కేసులు వారం రోజుల్లో డిస్పోజ్ చేశామని అధికారులు చెప్తున్నారు. చాలా సంతృప్తికరంగా ఉంది. మీరు చాలా ఎఫెర్ట్ పెట్టారు. దీని వల్ల ఎలాంటి మార్పులు వస్తున్నాయో చూపిస్తున్నారు. దిశ పోలీస్ స్టేషన్‌కు నేతృత్వం వహిస్తున్న డీఎస్పీ, మరియు ఎస్సైలు, కానిస్టేబుళ్లు.. చాలా బాగా పనిచేస్తున్నారు. అయితే మనం వేయాల్సిన అడుగులు చాలా ఉన్నాయి. దిశ యాక్ట్, స్పెషల్ కోర్టుల కోసం మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను రేపటి లోగా నియమించమని చెప్పాం. అలాగే ఫోరెన్సిక్ సిబ్బంది నియామకం, ల్యాబ్ నిర్మాణం కోసం నిధులు కూడా విడుదల చేశాం. ప్రతి దిశ పోలీస్స్టేషన్లలో కనీసం 50 శాతం మహిళలు ఉండేలా చూస్తాం.(కువైట్ నుంచి వలస కార్మికులను రప్పించండి) నెలకోసారి ‘దిశ’పై సమీక్ష చేయాలని నిర్ణయించుకున్నాం. మన పోలీసులను గర్వంగా నిలబెట్టేది.. దిశ రూపంలో మనం చేస్తున్న ప్రయత్నాలే. మహిళలకు భద్రత కల్పించడానికి దిశ ద్వారా మనం ముందడుగు వేశాం. మనకు హోం మంత్రిగా మహిళ ఉన్నారు. సీఎస్ నీలం సాహ్ని కూడా మహిళే. అలాగే దిశ విభాగానికి ఉన్న ఇద్దరు అధికారులు కూడా మహిళలే. ‘దిశ’ ప్రవేశపెట్టిన జనవరి నుంచి చురుగ్గా కార్యకలాపాలు. 7 రోజుల్లోగా ఛార్జిషీటు నమోదు. త్వరితంగా శిక్షల ఖరారులో ముందడుగు. మహిళలపై నేరాలు 134, చిన్నారులపై నేరాలు 33. 167 కేసుల్లో 7 రోజుల్లోగా ఛార్జిషీటు దాఖలు. 3 నెలల వ్యవధిలో 20 కేసుల్లో శిక్షలు. ఇందులో 2 మరణశిక్షలు. 5 జీవిత ఖైదులు. 20 ఏళ్ల శిక్ష 1, ఏడేళ్ల శిక్ష 5,3 ఏళ్ల శిక్ష పడ్డ కేసులు 3. మూడునెలల శిక్ష 3. జువనైల్‌హోంకు ఒకరిని పంపారు’’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో.. ప్రత్యేక కోర్టులు లేకున్నా.. సరైన ఆధారాల సేకరణ, వేగవంతమైన విచారణల కారణంగా ఈ శిక్షలు పడేలా చేయగలిగామని అధికారులు తెలిపారు. ‘‘దిశ యాప్‌ను 2.8 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. 19,918 ఎస్ఓఎస్ రిక్వెస్ట్‌లు రిసీవ్ చేసుకున్నాం. ఫిబ్రవరి 9 నుంచి 292 ఘటనల్లో చర్యలు. 68 ఎఫ్ఐఆర్లు నమోదు. భర్త ద్వారా వేధింపులు 93. మహిళలపై వేధింపులు 42. గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా వేధింపులు. 42 బంధువుల ద్వారా వేధింపులు. 29. ఇతరుల ద్వారా వేధింపులు. 21. పబ్లిక్ న్యూసెన్స్ . 17 ఫేక్ కాల్స్. 15 చిన్నారులపై వేధింపులు. 8 మహిళల అదృశ్యం. 7 సివిల్ వివాదాలు. 7 బాలికల అదృశ్యం. 5 మిగిలినవి ఇతర కేసులు. 100,112,191 దిశ ఎస్ఓఎస్ కాల్స్ ద్వారా సహాయం కోసం ఏ మహిళ చేసినా వెంటనే చర్యలు తీసుకుంటున్నాం’ అని ముఖ్యమంత్రికి తెలిపారు. ‘‘మహిళలు, చిన్నారుల పట్ల స్నేహ పూర్వక వాతావరణం. ప్రత్యేక పీపీపీలతో సమన్వయం చేసుకుని నిర్ణీత సమయంలోగా శిక్షలు వేయించేలా చర్యలు. గృహ హింస, మద్యపానం వల్ల చోటుచేసుకున్న హింసలపై ప్రత్యేక దృష్టి. విస్తృతంగా కౌన్సెలింగ్’’ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో మహిళా సంరక్షణ పోలీసులు, వాలంటీర్ల భాగస్వామ్యం కానున్నారు. మహిళలపై నేరాలు తగ్గాయి: సుచరిత ‘‘దిశ చట్టం ఆమోదం. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో దిశ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. తొలిసారిగా 6 దిశ పోలీస్స్టేషన్లకు ఐఎస్ఓ సర్టిఫికెట్లు వచ్చాయి. చట్టం అమలు తీరుపై దిశ పోలీస్స్టేషన్ల సిబ్బందితో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దిశ అమలు కోసం ప్రత్యేక వాహనాలు, సిబ్బందిని నియమించుకోవాలని సీఎం ఆదేశించారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌ల నిర్మాణం, మౌలిక సదుపాయాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దిశ చట్టం ఏర్పాటు చేశాక మహిళలపై నేరాలు తగ్గాయి’’ అని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. -
నలు‘దిశ’లా రక్షణ!
సాక్షి, గుంటూరు: “దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు ఓ చరిత్ర.. మహిళల భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆరు పోలీస్ స్టేషన్లను ఇప్పటికే ప్రారంభించాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మిగిలిన 12 స్టేషన్లను ప్రారంభించాం’ అని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. గుంటూరు నగరంలో ఏర్పాటు చేసిన అర్బన్ దిశ పోలీస్ స్టేషన్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మహిళల భద్రత కోసం దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడం పోలీస్ శాఖ చరిత్రలో ఓ మైలురాయిగా అభివర్ణించారు. మహిళల భద్రత కోసం దిశ ఎస్ఓఎస్ యాప్, దిశ పోలీస్ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చిన 2020 సంవత్సరం “ఉమెన్ సేఫ్టీ’ సంవత్సరంగా నిలుస్తుందన్నారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని చెప్పారు. దిశ చట్టం అమలులోకి వస్తే దిశ పోలీస్ స్టేషన్లు మరింత బలోపేతం అవుతాయన్నారు. దిశ పోలీస్ స్టేషన్లలో మహిళా డీఎస్పీలను నియమించాలనుకున్నామని, అయితే సరిపడా మహిళా అధికారులు అందుబాటులో లేరన్నారు. రాబోయే రోజుల్లో సమస్యను అధిగమించి మహిళా అధికారులను ఏర్పాటు చేస్తామన్నారు. కార్పొరేట్ కార్యాలయాన్ని తలపించేలా దిశ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. ప్రతి ఒక్కరూ ఈ–దిశ ఎస్ఓఎస్ యాప్ గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలీసు గౌరవ వందనం స్వీకరణ దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన డీజీపీ ముందుగా పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. గార్డ్ ఆఫ్ హానర్ ఇన్చార్జిగా వ్యవహరించిన ఆర్ఎస్ఐ బాషాను అభినందించారు. అనంతరం మహిళా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ శిలా ఫలకాన్ని ఆవిష్కరించి, పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. దిశ పోలీస్ స్టేషన్లో పోలీసు ఉన్నతాధికారుల విజిటర్స్ బుక్‌లో డీజీపీ తొలి సంతకం చేశారు. అనంతరం మహిళా పోలీసులతో, మహిళా మిత్ర వలంటీర్లతో మాట్లాడారు. కౌన్సిలింగ్ హాల్లో మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది, కుటుంబాలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో గుంటూరు రేంజ్ ఐజీ జె. ప్రభాకర్‌రావు, డీఐజీ అర్బన్ ఇన్చార్జి ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ, రూరల్ జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు, విజిలెన్స్ ఎస్పీ జాషువా, ఏఎస్పీలు గంగాధరం, ఈశ్వరరావు, మనోహర్‌లు, డీఎస్పీలు బి.సీతారామయ్య, బీవీ రామారావు, సుప్రజ, సౌజన్య, బాలసుంధర్‌రావు, రమణకుమార్, ప్రకాశ్‌బాబు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. దిశ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఆర్థిక సాయం చేసిన ఐటీసీ సీఈవో సంజయ్ రంగరస్, డైరెక్టర్ వీరస్వామిను డీజీపీ ప్రత్యేకంగా అభినందిచి, కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు అర్బన్ కమిషనరేట్ ప్రతిపాదన పెండింగ్‌లో ఉందన్నారు. దీనిపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, హోం మంత్రి సుచరితతో చర్చించామన్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ సన్నద్ధమై ఉందని డీజీపీ తెలిపారు. ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించామన్నారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత పోలింగ్ నిర్వహించడంపై దృష్టి కేంద్రీకరించామని, ప్రతిరోజూ ఎన్నికల నిర్వహణ, బందోబస్తు తదితర అంశాలపై అన్ని జిల్లాల ఎస్పీలు, ఇతర అధికారులతో సమీక్ష చేపడుతున్నట్టు పేర్కొన్నారు. -
దిశ చట్టం దేశానికే ఆదర్శం
అనంతపురం క్రైం: నగరంలోని మూడవ పట్టణ పోలీసుస్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన దిశ పోలీసుస్టేషన్‌ను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, డీఐజీ కాంతిరాణా టాటా ఆదివారం ప్రారంభించారు. అనంతరం దిశ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్, కంప్యూటర్ గదులు, పోలీసు స్టేషన్ ఆవరణంలోని ఆట స్థలం తదితర వాటిని వారు ప్రారంభించారు. కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ చట్టం దేశానికే ఆదర్శమన్నారు. కేసు నమోదైన మూడు వారాల్లోనే నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చట్టాన్ని రూపొందించారన్నారు. అత్యాచారాలు, అఘాయిత్యాలు జరగకుండా మహిళల భద్రతే బాధ్యతగా ప్రభుత్వం దిశ పోలీసుస్టేషన్లను ఏర్పాటు చేసిందన్నారు. మహిళలు, అమ్మాయిలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేసేందుకు పోలీసుస్టేషన్లో అన్ని సదుపాయాలు కల్పించారన్నారు. మహిళల పని వేళల్లో మార్పు మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని మహిళా ఉద్యోగుల పనివేళల్లో మార్పులు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వివిధ శాఖల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మహిళా ఉద్యోగుల విధులుంటాయన్నారు. ఆ తర్వాత సమయాల్లో విధులకు హాజరుకావాల్సిన అవసరం ఉండదన్నారు. మేమున్నాం మహిళలు, అమ్మాయిల భద్రత, రక్షణకు మేమున్నాం. ప్రభుత్వం మహిళల భత్రలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా దిశ చట్టాన్ని రూపొందించింది. కేసు రిజిస్టర్ చేసిన 21 రోజుల్లో స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు శిక్షణ పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇటీవల చిత్తూరులో 90 రోజుల్లో ఓ వ్యక్తికి ఉరిశిక్షణ పడిన విషయం అందరికీ తెలిసిందే. మహిళలు, అమ్మాయిలు దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. దిశ పోలీసుస్టేషన్, వన్‌స్టాప్ సెంటర్‌ను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. –కాంతిరాణా టాటా, డీఐజీ ఏడు రోజుల్లో చార్జ్‌షీట్ దిశ పోలీసుస్టేషన్, యాప్‌లో ఫిర్యాదు చేసిన ఏడు రోజుల్లో నిందితులపై చార్జ్‌షీట్ దాఖలు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. ఆర్ఎఫ్ఎస్ఎల్, మెడికల్ సర్టిఫికెట్లు నిర్దేశిత సమయంలో సేకరించేలా ఆయా విభాగాలను సంసిద్ధం చేసుకున్నాం. ఇప్పటికే జిల్లాలో వివిధ ఘటనల్లో నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపాము. దిశ పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి అదనంగా 30 శాతం అలవెన్సులు, తదితర సౌకర్యాలు ప్రభుత్వం కల్పించింది. – బీ.సత్యయేసుబాబు, ఎస్పీ డీఎస్పీకిసన్మానం దిశ పోలీసుస్టేషన్ ఏర్పాటుకు విశేష కృషి చేసిన డీఎస్పీ వీరరాఘవరెడ్డిని కలెక్టర్, డీఐజీ, ఎస్పీ సన్మానించారు. ఆయనతో పాటు దిశ పోలీసుస్టేషన్ ఏర్పాటుకు తమ వంతు సహకరించిన కియా, అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రతినిధులను సన్మానించారు. కార్యక్రమంలో ఐఏఎన్ అధికారి సుబ్రమణ్యం, జేసీ డిల్లీరావు, డీఎస్పీలు ఏ శ్రీనివాసులు, ఈ శ్రీనివాసులు, రమాకాంత్, సీఐలు ప్రతాప్‌రెడ్డి, రెడ్డప్ప, జాకీర్ హుస్సేన్ ఖాన్, కే శ్రీనివాసులు, మురళీధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మహిళల భద్రత మన బాధ్యత
సాక్షి, అమరావతి: ‘మహిళల భద్రత మన బాధ్యత’ అనే నినాదంతో 2020ని మహిళా భద్రత సంవత్సరంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారని, ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలోని పోలీసులంతా పని చేయాలని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరులో దిశ పోలీస్ స్టేషన్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఇప్పటికే ప్రారంభించిన 6 పోలీస్ స్టేషన్లతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 18 దిశ స్టేషన్లు ఏర్పాటయ్యాయని చెప్పారు. శాంతి భద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్తో కలిసి రాష్ట్రంలోని 967 పోలీస్ స్టేషన్ల సిబ్బందితో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పోలీస్ కుటుంబ సభ్యులు, గ్రామ మహిళా సంరక్షణ అధికారులు, మహిళా మిత్రలు, విద్యార్థులతోనూ ముచ్చటించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఏమన్నారంటే.. - మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించడంలో మనమంతా కీలక పాత్ర పోషించాలి. - పోలీస్ స్టేషన్లకు మహిళలు నిర్భయంగా వచ్చి బాధలు చెప్పుకునే పరిస్థితి కల్పించాలి. - దిశ యాప్‌ను ప్రతి మహిళా డౌన్లోడ్ చేసుకునేలా చైతన్యం తీసుకురావాలి. - మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ బిల్లు నవ శకానికి నాంది. - మనమంతా సమన్వయంతో కొత్త స్ఫూర్తిని నింపుతూ ముందుకు సాగితేనే దిశ చట్టానికి సార్ధకత చేకూరుతుంది. మీడియాతో మాట్లాడుతూ.. - స్థానిక ఎన్నికల్లో శాంతి భద్రతల పరిరక్షణకు సర్వసన్నద్ధంగా ఉన్నాం. - ఇప్పటికే ఎస్పీలతో రెండు పర్యాయాలు సమావేశం నిర్వహించి అవసరమైన ఆదేశాలు ఇచ్చాం. - దిశ బిల్లులో భాగంగా ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. - ల్యాబ్‌లలో సాంకేతిక పరిజ్ఞానం, డీఎన్ఏ పరీక్షలకు అవసరమైన ఆధునిక పరికరాలు సమకూర్చుకోవాల్సి ఉంది. ఇందుకు ఏపీ పోలీస్ బృందం ఇప్పటికే గుజరాత్లో పర్యటించి అధ్యయనం చేసింది. పోలీసులు ‘మహిళా ఫ్రెండ్లీ’ మహిళా దినోత్సవం రోజు నుంచే రాష్ట్రంలో ‘మహిళా ఫ్రెండ్లీ పోలీస్’ విధానం అమల్లోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు డీజీపీ కార్యాలయం నుంచి అన్ని పోలీస్ స్టేషన్లకు వెళ్లాయి. ఈ మార్గదర్శకాల ప్రకారం.. - ప్రతి పోలీస్ స్టేషన్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు, మహిళా మిత్ర, ఉమెన్ హెల్ప్‌లైన్ సెంటర్, వన్ స్టాప్ సెంటర్‌తోపాటు ముఖ్యమైన ఫోన్ నంబర్లు బోర్డులో ప్రదర్శించాలి. - పోలీస్ స్టేషన్లో మంచినీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలి. - పోలీస్ స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచాలి. - ప్రతి మహిళను ‘అమ్మా.. తల్లీ, చెల్లీ.. రండి.. కూర్చోండి’ అని గౌరవభావంతో మాట్లాడాలి. - పోలీస్ స్టేషన్‌కు వచ్చే మహిళలను కూర్చోబెట్టి వారి సమస్య తెలుసుకుని ధైర్యం కల్పించేలా వ్యవహరించాలి. - మహిళల రక్షణను దృష్టిలో ఉంచుకుని వీలైనంత ఎక్కువ మంది మహిళా పోలీసులను వినియోగించాలి. - తరచూ ఓపెన్ హౌస్ నిర్వహించి మహిళలను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి పోలీసులు ‘మహిళా ఫ్రెండ్లీ’గా వ్యవహరిస్తారనే ధైర్యం ఇవ్వాలి. - మహిళల సమస్యల పరిష్కారంలో అత్యధికంగా మహిళా మిత్రలను, గ్రామ మహిళా సంరక్షణ పోలీసులను భాగస్వాముల్ని చేయాలి. - అక్రమ మద్యం తయారీని అరికట్టడం, మద్యం బెల్ట్ షాపులను లేకుండా చేయడంలో భాగంగా మహిళల్లో చైతన్యం తేవాలి. - పాఠశాలలు, కాలేజీలు, ప్రధాన కూడలి ప్రాంతాల్లో మహిళా కానిస్టేబుళ్లు, మహిళా మిత్రలు, మహిళ సంరక్షణ పోలీసులతో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేయాలి. - ఆ ప్రాంతాల్లో తరచూ మహిళలకు చైతన్య, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. -
మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి
సాక్షి, అమరావతి: 2020ని 'ఉమెన్ సేఫ్టీ ఇయర్’గా మార్చాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. రాష్ట్రంలో మహిళా దినోత్సవం సందర్భంగా నేటి నుంచి మరో 12 దిశ పోలీస్స్టేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన కార్యాలయం నుంచి దిశ పోలీస్స్టేషన్ల సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. సీఎం లక్ష్యానికి అనుగుణంగా పనిచేసేందుకే ‘దిశ’ ఉమెన్ ఫ్రెండ్లీ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించడంలో మహిళా మిత్రలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పోలీస్స్టేషన్లకు మహిళలు నిర్భయంగా వచ్చి బాధలు చెప్పుకునే పరిస్థితి కల్పించాలన్నారు. పోలీస్ స్టేషన్లకు రావాలంటే మహిళలు భయపడే రోజులు పోవాలన్నారు. మహిళల రక్షణ కోసం ముఖ్యమంత్రి చేపట్టిన ‘దిశ’లో భాగస్వాములు కావటం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతున్నామని.. పూర్తిస్థాయి భద్రతతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు చేపడతామని డీజీపీ తెలిపారు. రాష్ట్రంలో గతం కంటే ఇప్పుడు ప్రశాంత పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని తెలిపారు. నేటి నుంచి అందుబాటులో 18 దిశ పోలీస్ స్టేషన్లు రాష్ట్రంలో నేటి నుంచి 18 దిశ పోలీస్స్టేషన్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయని ‘దిశ చట్టం’ ప్రత్యేక అధికారి దీపిక పాటిల్ అన్నారు. ‘దిశ ఎస్ ఓ ఎస్ యాప్’కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే 122 కాల్స్ వచ్చాయని 37 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయని తెలిపారు. తమ పొరుగు మహిళలు ఆపదలో ఉన్నారని పురుషుల నుంచి సైతం కాల్స్ వస్తున్నాయని వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘ఈచ్ ఫర్ ఈక్వల్’ అనే నినాదం ఇస్తున్నామని చెప్పారు. పొరుగు మహిళల కష్టాలు చూసి తోటి మహిళలు సైతం ఫిర్యాదులు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈవ్టీజర్ల బెడద తప్పింది.. వీక్లీ ఆఫ్‌తో వారంలో ఒక రోజు కుటుంబం అంతా కలిసే అవకాశం కలుగుతుందని ‘దిశ’ సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. దిశ యాప్‌తో ఈవ్టీజర్ల బెడద చాలా వరకు తప్పిందని డీజీపీకి మహిళా మిత్రలు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో మహిళలు నిర్భయంగా ఉన్నారన్నారు. అఘాయిత్యాలు, వేధింపులకు చెక్ పెట్టడంతో మహిళల్లో భరోసా కనిపిస్తోందని తెలిపారు. ‘దిశ యాప్’పై విస్తృత ప్రచారం కల్పించి.. అధిక మంది డౌన్లోడ్ చేసుకునేవిధంగా కృషి చేయాలని డీజీపీని మహిళా మిత్రలు కోరారు. ఏలూరు: మహిళా భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ‘దిశ’ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కోటదిబ్బలో దిశ మహిళా పోలీస్టేషన్‌ను కలెక్టర్ ముత్యాలరాజు, డీఐజీ కేవీ మోహన్‌రావు, ఎస్పీ నవదీప్ సింగ్గ్రేవాల్ ప్రారంభించారు. మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వారు తెలిపారు. -
నేడు 12 దిశ పోలీస్ స్టేషన్లు ప్రారంభం
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): రాష్ట్ర వ్యాప్తంగా నేడు (ఆదివారం) 12 దిశ పోలీస్ స్టేషన్లు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. శనివారం విశాఖలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రతి జిల్లాలో మహిళా కోర్టులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలతో ఇక్కడ ప్రతి రోజూ మహిళా దినోత్సవమే అని పద్మ వ్యాఖ్యానించారు. చిత్తూరులో హర్షిత కేసు విషయంలో మహిళా కమిషన్ చొరవ తీసుకొని నిందితుడికి పోక్సో చట్టం కింద శిక్షపడేలా చేసిందన్నారు. -
ఏపీలో మరో 12 ‘దిశ’ పోలీస్స్టేషన్లు
సాక్షి, విజయవాడ: మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరు జిల్లాల్లో ‘దిశ’ పోలీస్ స్టేషన్లు ప్రారంభించామని.. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మరో 12 దిశ పోలీస్స్టేషన్లను ప్రారంభిస్తున్నామని ఆయన వెల్లడించారు. దిశ-2019 చారిత్రాత్మక బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించిందని.. రాష్ట్రపతి ఆమోదం రావాల్సి ఉందన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ఏపీ పోలీసులు ముందంజలో ఉన్నారన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. దిశా చట్టానికి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. (అందుకే దిశ చట్టం తీసుకువచ్చాం: సీఎం జగన్) మహిళా పీఎస్‌లు అప్‌గ్రేడ్.. ‘దిశ’ చట్టం అమలులో భాగంగా 13 జిల్లాల్లో ప్రత్యేక కోర్టులతో పాటు విశాఖ, తిరుపతిలో ‘దిశ’ ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ వెల్లడించారు. మహిళా పీఎస్‌లను ‘దిశ’ ఉమెన్ పోలీస్స్టేషన్లుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ‘దిశ ఎస్ఓఎస్ యాప్’ కు ఇరవై ఐదురోజుల్లో 86 క్రియాశీలక కాల్స్ వచ్చాయన్నారు. ఇరవై ఆరు కేసుల్లో ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. భర్త వేధింపులు,ఈవ్ టీజింగ్ మెసేజ్ లపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ‘దిశ యాప్’ను రెండు లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు. 14 వేల కాల్స్ వచ్చాయన్నారు. స్పందనలో 52 శాతం మహిళలు ఫిర్యాదు ఇవ్వడం మార్పుకు నిదర్శనమన్నారు. నేరాలను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు సైబర్ మిత్రా ఏర్పాటు చేసామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 206 జీరో ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయన్నారు. సైబర్ మిత్రకు ‘9121211100’ వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని డీజీపీ పేర్కొన్నారు. (దశ 'దిశ'లా స్పందన) -
‘మన ముఖ్యమంత్రి మహిళా పక్షపాతి’
సాక్షి, కోనేరుసెంటర్(మచిలీపట్నం): మహిళలపై దాడులకు తెగబడే మృగాళ్ల గుండెల్లో వణుకుపుట్టించే చట్టమే దిశ చట్టం అని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. జిల్లాకేంద్రమైన మచిలీపట్నంలో నూతనంగా ఏర్పాటుచేసిన దిశ పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం హోంమంత్రి సుచరిత ప్రారభించారు. అనంతరం జిల్లా పోలీస్‌పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళల పక్షపాతి అని అన్నారు. ఒక మహిళను రాష్ట్ర హోంమంత్రిని చేయటమే అందుకు నిదర్శనమన్నారు. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళల భద్రతకు ప్రత్యేక చట్టం తెచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. దిశ చట్టంపై మహిళలంతా పూర్తి అవగాహన కలిగివుండాలన్నారు. పొరుగు రాష్ట్రంలో జరిగిన దిశ ఘటన మరెక్కడ జరగకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఆలోచన చేసి, అలాంటి నేరాలకు పాల్పడే మానవ మృగాలకు 21 రోజుల్లో శిక్ష పడేలా దిశ చట్టాన్ని అమలు తీసుకువచ్చారన్నారు. మహిళలపై దాడులకు పాల్పడి అమాయక ఆడపిల్లలను హత్యలు చేసే మానవ మృగాలకు కఠినమైన శిక్ష పడేలా ఈ చట్టాన్ని అమలులోకి తీసుకురావటం జరిగిందన్నారు. ఈ చట్టం ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు. ఏడు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి, 14 పని దినాల్లో విచారణ ముగించి, 21 రోజుల్లో నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి దిశ స్టేషన్లు ఏర్పాటుచేయటం జరుగుతుందన్నారు. ప్రత్యేక వసతులతో ఈ స్టేషన్లు ఉంటాయన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లు, ప్రత్యేక న్యాయస్థానాలు ఈ చట్టం అమలు కోసం ఏర్పాటుచేయటం జరుగుతుందన్నారు. దిశ చట్టాన్ని రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేసేందుకు ఇద్దరు ప్రత్యేక అధికారులను సైతం ప్రభుత్వం నియమించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 18 దిశ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేయటం జరుగుతుందని, మహిళలంతా ఈ చట్టంపై పూర్తి అవగాహన కలిగివుండటంతో పాటు దిశ యాప్‌ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని ఆమె సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ యేడాదిని మహిళ భద్రత సంవత్సరంగా ప్రకటించటం జరిగిందన్నారు. దిశ చట్టం అమలుపై పక్క రాష్ట్రాలు సైతం ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రతి యేటా మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై దాదాపు 13,000లకుపైగా కేసులు నమోదు అవుతున్నాయన్నారు. దీని బట్టి చూస్తే మహిళల పట్ల మగాళ్ళకు ఉన్న విలువ ఏంటో అర్ధం అవుతుందన్నారు. అలాంటి పరిస్థితులకు స్వస్తి చెప్పేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కఠినమైన చట్టాలను అమలులోకి తీసుకువస్తున్నారన్నారు. గత ప్రభు త్వం మద్యాన్ని ఆదాయ వనరుగా పరిగణనిస్తే ప్రస్తుత ప్రభుత్వం మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించాలనే సంకల్పంతో సంపూర్ణ మద్యనిషేధం వైపు అడుగులు వేస్తుందని అన్నారు. మహిళలకు రక్షణ కవచం : మంత్రి పేర్ని నాని రాష్ట్ర రవాణా, సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) మాట్లాడుతూ మహిళలకు దిశ చట్టం రక్షణకవచంలా నిలుస్తుందన్నారు. మనిషి అనారోగ్యానికి గురైతే ఆ రోగాన్ని కనిపెట్టే యంత్రాలు వాడుకలోకి వచ్చాయిగానీ మనిషి ఎప్పుడు ఎలా మారతాడో కనిపెట్టే యంత్రం మాత్రం ప్రపంచవ్యాప్తంగా కనిపెట్టలేకపోయారన్నారు. మహిళల పట్ల తప్పు చేసే మానవ మృగాల్లో దిశ చట్టం భయం పుట్టిస్తుందన్నారు. అలాగే అన్యాయానికి గురైన బాధితులకు 21 రోజుల్లో న్యాయం జరుగుతుందన్నారు. చట్టం అమలుకు పటిష్ట చర్యలు: ఏలూరు రేంజ్ డీఐజీ ఖాన్ ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ మాట్లాడుతూ మహిళల రక్షణకు, దిశ చట్టం అమలుకు పోలీసుశాఖ పటిçష్ట చర్యలు చేపడుతుందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో వేలాది మంది మహిళలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంరక్షణ కార్యదర్శులుగా నియమించటం గొప్ప విషయమన్నారు. వీరితో పాటు బాలమిత్ర, సైబర్‌మిత్ర టీంలను కూడా మహిళల రక్షణ కోసం ఏర్పాటుచేయటం జరిగిందన్నారు. శక్తివంతమైనది దిశ చట్టం: వాసిరెడ్డి పద్మ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ దిశ చట్టం ద్వారా నేరాల సంఖ్య దాదాపు తగ్గిపోవటం ఖాయమన్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లలకు చెప్పే జాగ్రత్తలు ఈ చట్టం అమలుతో మగపిల్లలకు చెప్పే రోజులు వస్తాయన్నారు. అంతటి శక్తివంతమైన చట్టంగా దిశ అమలు అవుతుందన్నారు. ఈ చట్టం అమలుతో నేరస్తుల్లో ఖచ్ఛితమైన మార్పు రావాలన్నారు. దిశ చట్టం అమలుపై ప్రతిపక్షం ఎన్ని ఆరోపణలు చేసినా మగాళ్ల మైండ్‌సెట్ మారే వరకు చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. మహిళలకు మరింత భద్రత : ఎస్పీ రవీంద్రనాథ్ బాబు జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు మాట్లాడుతూ దిశ చట్టం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. దిశ పోలీస్‌స్టేషన్ ప్రారంభంతో జిల్లాలోని మహిళలకు మరింత భద్రత కల్పించటం జరుగుతుందన్నారు. దిశ స్టేషన్‌కు అవసరమైన సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఏఎస్పీ మోకా సత్తిబాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని), శాసనసభ్యులు సింహాద్రి రమేష్, కైలే అనిల్‌కుమార్, దూలం నాగేశ్వరరావు, వల్లభనేని వంశీ, రక్షణనిధి, డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, దిశ చట్టం ప్రత్యేక అధికారిణి దీపికా పటేల్, జిల్లా విద్యాశాఖా«ధికారిణి రాజ్యలక్ష్మి, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. -
‘దిశ చట్టం గురించి ప్రతి ఒక్కరికి వివరించాలి’
సాక్షి, కృష్ణా : మహిళల భద్రతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మచిలీపట్నంలో దిశ పోలీస్ స్టేషన్‌ను మంగళవారం మంత్రి సుచరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో విధుల్లో ఉన్న మహిళా పోలీసులు దిశ చట్టం గురించి, మహిళల రక్షణ గురించి ప్రతి ఒక్కరికి వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్నాని, కొడాలి నాని, మహిళా చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు, రక్షణనిధి, వల్లభనేని వంశీ, కైలే అనిల్‌కుమార్, నాగేశ్వరరావు, సింహాద్రి రమేష్ పాల్గొన్నారు. (‘దిశ యాప్’తో మహిళలకు రక్షణ: సుచరిత) చదవండి: కడప జైలులో దేశంలోనే తొలిసారిగా.. -
‘రాజకీయ లబ్ధి కోసమే ఆ ఆరోపణలు’
సాక్షి, గుంటూరు: తల్లి గర్భంలో ఎంత రక్షణ ఉంటుందో.. అలాంటి రక్షణ ఏపీలో ఉందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆదివారం ఆమె నరసరావుపేటలో ‘దిశ’ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్యామూల్ ఆనంద్, రేంజి ఐజీ వినీత్ బ్రిజిలాల్, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, విడదల రజని, బొల్లా బ్రహ్మనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన దిశ ఘటన దేశంలో సంచలనం కలిగించిందని.. ఇలాంటి సంఘటనలు ఏపీలో జరగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశ చట్టాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. (చంద్రబాబు తీరుపై పోలీసుల సంఘం ఆగ్రహం) రాష్ట్ర్రంలో మొత్తం 18 ‘దిశ’ పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా ‘దిశ’ ఎస్ ఓ ఎస్ యాప్ ను కూడా రూపొందించామని చెప్పారు. ప్రతి మహిళ దిశ యాప్‌ను ఉపయోగించుకోవాలని కోరారు. గత ప్రభుత్వంలో పనిచేసిన పోలీసులే ఇప్పుడు కూడా కొనసాగుతున్నారని.. కానీ రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు పోలీస్ శాఖపై నిందలు వేస్తున్నారని హోంమంత్రి సుచరిత విమర్శించారు. -
మహిళల భద్రతే సీఎం జగన్ మోదటి ప్రాధాన్యత
-
ఇదీ.. నా కల
ఒక గ్రామం నుంచి మనిషి బయటకు పోవాల్సిన పనిలేకుండా అన్నీ అందుబాటులో ఉండేలా అడుగులు వేస్తున్నాం.. అలాగే అక్రమాలపై మహిళా సంరక్షణ పోలీస్ రిపోర్ట్ ఇచ్చాక దానిపై యాక్షన్ తీసుకోవడం ముఖ్యం. అప్పుడే ఊళ్లో మార్పు కనిపిస్తుంది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘గ్రామం బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఒక గ్రామం ఎలా ఉంటే బావుంటుందో ఒక్కసారి ఊహిస్తే.. అది మన కళ్లముందు కనిపిస్తుంది. 72 గంటల్లో సేవలందించేలా గ్రామ సచివాలయం, స్కూలు, ఆసుపత్రి, రైతు భరోసా కేంద్రం, అంగన్వాడీ కేంద్రం, ఓ మహిళా సంరక్షణ పోలీసు.. ఇలా అన్నీ వరుసగా కనిపిస్తాయి. ఇది కేవలం ఊహగానే మిగిలి పోకుండా మన కళ్లెదుట సాక్షాత్కరింప చేయడానికి మన ప్రభుత్వం నడుం బిగించింది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. విజయనగరంలోని పోలీస్ బ్యారెక్స్‌లో సోమవారం ఆయన దిశ మహిళా పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన తన కలల గ్రామాన్ని నిజం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఒక గ్రామం నుంచి మనిషి బయటకు పోవాల్సిన పని లేకుండా అన్నీ అందుబాటులో ఉండేలా అడుగులు వేస్తున్నామన్నారు. సీఎం వైఎస్ జగన్ ఏం చెప్పారంటే.. ఎనిమిది నెలలుగా విప్లవాత్మక కార్యక్రమాలు ‘పోలీస్ అంటే ఊర్లో కొద్దో గొప్పో భయం ఉంటుంది. అందుకే గ్రామ మహిళ సంరక్షణ కార్యదర్శి పేరును ‘మహిళ సంరక్షణ పోలీస్’గా మారుద్దామని డీజీపీకి చెప్పాను. ఈ పేరు అయితే బావుంటుంది. గ్రామ, వార్డు పరిధిలో మహిళ సంరక్షణ పోలీస్‌లు, మహిళా పోలీస్ మిత్రలు, పోలీస్ చెల్లెమ్మల భుజస్కందాలపై ఉన్న బాధ్యతను గుర్తు చేయాల్సిన పరిస్థితి. ఒక గ్రామం ఎలా ఉంటే బావుంటుందో.. అలా మార్చేందుకు మన ప్రభుత్వం గత 8 నెలల కాలంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. రాబోయే రోజుల్లో గ్రామం అన్నది ఏలా ఉంటుందంటే.. ప్రతి 2 వేల జనాభాకు కావాల్సిన ప్రతి సేవ అందుబాటులో ఉండేట్టు గ్రామ సచివాలయం ఉంటుంది. అన్ని సేవలూ అక్కడే లభించేలా చర్యలు తీసుకుంటున్నాం. లంచాలు, వివక్షకు తావులేకుండా ప్రతీ సేవ నిర్ణీత గడువులోగా అందేలా చూస్తున్నాం. దిశ పోలీస్ స్టేషన్ బయట మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సీఎం వైఎస్ జగన్ గ్రూప్ ఫొటో గ్రామ సచివాలయం పక్కనే మెరుగైన వసతులతో ఒక ఇంగ్లిష్ మీడియం స్కూలు కనిపిస్తుంది. అదే గ్రామంలో ఒక అడుగు ముందుకు వేస్తే వైఎస్సార్ విలేజ్ క్లినిక్ అనే ఒక ఆసుపత్రి కనిపిస్తుంది. రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడు 2,400 సబ్ సెంటర్స్ కూడా లేవు. రానున్న రోజుల్లో మొత్తం 11,158 గ్రామ సచివాలయాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్ తీసుకొస్తాం. అక్కడ డీఎస్సీ చదివిన నర్సు, ఒక ఏఎన్ఎం ఉంటారు. వారు అదే ఊళ్లో ఉంటూ 24 గంటలు వైద్య సేవలు అందిస్తారు. గ్రామ సచివాలయం నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతు భరోసా కేంద్రం ఉంటుంది. అన్ని విషయాల్లో రైతులకు తోడుగా ఉంటుంది. ఈ క్రాప్ బుకింగ్, పంటలు, వాతావరణం, గిట్టుబాటు ధర, మార్కెట్‌కు సంబంధించిన సూచనలు ఇస్తారు. శిక్షణ కూడా ఉంటుంది. నాణ్యతతో కూడిన పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్,విత్తనాలు అందుబాటులో ఉంటాయి. మహిళా సంరక్షణ పోలీస్‌ది కీలక పాత్ర మహిళా సంరక్షణ పోలీస్‌లు, మహిళా పోలీస్ మిత్రాలు చురుగ్గా ఉండాలి. మీ గ్రామంలో ఎవరైనా, ఎక్కడైనా ఇల్లీగల్ లిక్కర్ అమ్ముతున్నారంటే వాళ్లకు సింహస్వప్నం కావాలి. మీరు ఒక్క మెసేజ్ కొడితే ఎస్పీ అలర్ట్ అవుతారు. పోలీసులను పంపించి క్లీన్ చేసేస్తారు. గ్రామంలో ఎలాంటి తప్పులు జరుగుతున్నా వెంటనే మీరు అలర్ట్ అయ్యి రిపోర్టు చేయాలి. మీరు చేసిన రిపోర్టు మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో పరిశీలించి రోబోయే రోజుల్లో డైరెక్ట్‌గా డీజీపీ, హోంమినిస్టర్, నేను కూడ ఇన్వాల్వ్ అవుతాం. ఎందుకంటే మీరు రిపోర్ట్ ఇచ్చాక దానిపై యాక్షన్ తీసుకోవడం అన్నది వెరీ ఇంపార్టెంట్. అప్పుడే ఊర్లో మార్పు కనిపిస్తుంది. అంగన్వాడీ సెంటర్లు మీ అధీనంలో ఉంటాయి. గ్రామంలో ఉన్న స్కూళ్లు, ఆ స్కూళ్ల వ్యవహారాలు, ఆస్కూల్లో బూత్‌రూంలు, మధ్యాహ్న భోజన పథకం నాణ్యత.. ఇలా అన్నీ కూడా గ్రామ సెక్రటేరియట్ పరిధిలోకి తీసుకొస్తున్నాం. వీటి పర్యవేక్షణలో మీరు భాగస్వాములవుతున్నారు. మీ అందరికీ ఒక అన్నలా బెస్ట్ విషెస్ చెబుతున్నా. మీ వల్ల గ్రామానికి మంచి జరగాలని, ప్రభుత్వానికి మంచి పేరు రావాలని ఆశిస్తున్నా’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. -
దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సీఎం
-
మీ ఫోన్లో దిశ యాప్ ఉందా?
-
గుడ్డిగా నమ్మితే చిక్కుల్లో పడతారు జాగ్రత్త!
మంగళగిరికి చెందిన ఓ మహిళ విజయవాడలో కన్సల్టెన్సీలో పనిచేస్తోంది. కన్సల్టెన్సీకి కోర్సుల వివరాలు తెలుసుకోడానికి వెళ్లిన చినకాకానికి చెందిన యువకుడు ఆమెతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. సర్టిఫికెట్ల గురించి మాట్లాడాలని ఈ నెల 15న ఆ యువకుడు సదరు మహిళను విజయవాడలో కలిశాడు. అనంతరం మంగళగిరికి వెళ్తే అక్కడ ఫ్రీగా మాట్లాడుకోవచ్చని నమ్మబలికాడు. హాయ్‌ల్యాండ్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలోకి మహిళను తీసుకెళ్లాడు. అక్కడికి యువకుని స్నేహితులు ఇద్దరు చేరుకున్నారు. ముగ్గురూ కలిసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. సాక్షి, గుంటూరు: అఘాయిత్యాలకు పాల్పడేందుకు నిందితులు వల విసురుతున్న విషయాన్ని మహిళలు, గుర్తించకపోవడం వల్లే తరచుగా అనర్థాలు సంభవిస్తున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాబోవు ప్రమాదాన్ని పసిగట్టి వేగంగా తప్పించుకోడానికి ప్రయత్నించినా, లేక చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు సమాచారం ఇచ్చినా అనర్థాలు సంభవించడానికి అవకాశం ఉండదని చెబుతున్నారు. ఆపదలో ఉన్న సమయంలో మహిళలు, యువతులు బేలగా మారితే నిందితులు మరింత బలవంతులుగా మారుతారని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. దిశ ఎస్‌ఓఎస్‌తో రక్ష ♦ ఆపదలో ఉన్న ఆడపడుచులకు తక్షణ సహాయం అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం దిశ ఎస్ఓఎస్ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ పనితీరు ఇలా... ♦ ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ ఫోన్లో ప్లేస్టోర్‌లోకి వెళ్లి దిశ ఎస్ఓఎస్ యాప్ డౌన్లోడు చేసుకోవాలి. ♦ దిశ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవడానికి మాత్రమే నెట్ అవసరం. తరువాత నెట్ లేకపోయినప్పటికీ యాప్ పనిచేస్తుంది. ♦ ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఈ యాప్‌ను ఓపెన్ చేసి అత్యవసర సహాయం (ఎస్ఓఎస్) బటన్ నొక్కితే చాలు. మీ ఫోన్ నంబరు, మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో, మీ చిరునామా, దిశ కంట్రోల్ రూముకు చేరుతుంది ♦ ఆపదలో ఉన్న మహిళ, యువతి ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేసే పరిస్థితిలో లేకపోతే ఆమె ఫోన్ గట్టిగా అటూ, ఇటూ ఊపితే చాలు. మీరు ఆపదలో ఉన్నారనే విషయం దిశ కంట్రోల్ రూమ్‌కు తెలిసిపోతుంది. ♦ ఒక వేళ బాధిత మహిళ ఎస్ఓఎస్ బటన్ నొక్కితే ఆమె వాయిస్‌తో పాటు అక్కడ జరిగే దృశ్యానికి సంబంధించి పది సెకన్ల వీడియో రికార్డు అవడానికి వీలుంటుంది. ♦ ఎస్ఓఎస్ బటన్ నొక్కగానే దిశ కంట్రోల్ రూమ్‌కు సమాచారం వెళ్లి అక్కడి నుంచి సమీపంలోని పోలీసు స్టేషన్‌కు, పోలీసు రక్షక్ వాహనాలకు ఆటోమ్యాటిక్‌గా సమాచారం చేరిపోతుంది. ♦ ప్రమాదంలో ఉన్నవారి చెంతకు వెంటనే చేరుకోవడానికి జీపీఎస్ ఉన్న పోలీసు రక్షక్ వాహనంలోని మొబైల్ డేటా టెర్మినల్ సహాయపడుతుంది. ♦ ఆపదలో ఉన్నామనే విషయం దిశ కంట్రోల్ రూముతో పాటు మీ కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులకు ఇలా మొత్తం ఐదు నంబర్లకు దిశ యాప్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ♦ దిశ యాప్‌లోని ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్ వినియోగిస్తే మీరు ప్రయాణిస్తున్న వాహనం మీ గమ్యస్థానానికి కాకుండా ఇంకెక్కడికైనా వెళుతుంటే కూడా సమాచారం దిశ కంట్రోల్ రూముతోపాటు మీరు నమోదు చేసుకున్న ఐదు నంబర్లకు పంపి అప్రమత్తం చేయవచ్చు. ♦ ఈ యాప్‌లోనే డయల్ 100, 112, సహా ఇతర ఎమర్జెన్సీ నంబర్లు ఉంటాయి. వీటి ద్వారా ఆపద సమయంలో సహాయం అర్థించవచ్చు. ♦ దిశ యాప్‌లో పోలీసు అధికారుల ఫోన్ నంబర్లు, సమీపంలోని పోలీసు స్టేషన్లు, ఆసుపత్రుల వివరాలు ఉంటాయి. మహిళలు, యువతులు జాగ్రత్త వహించాలి ♦ గుర్తు తెలియని వ్యక్తులు మాటా మాటా కలిపి సాన్నిహిత్యం పెంచుకుంటుంటే తొలుత అనుమానించాలి. ♦ వ్యక్తిగత వివరాలను వారికి చెప్పకుండా జాగ్రత్త వహించాలి. ♦ ఎవరూ లేని ప్రాంతంలో ముక్కూ మొహం తెలియని వారు సాయం చేస్తామని ముందుకు వస్తే నిరాకరించాలి. ♦ నిర్మానుష్య ప్రాంతాల్లో స్కూటీ, కారు ఇతర వాహనాలు ఆగిపోతే ఒంటరిగా ఉన్నప్పుడు వెంటనే కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ♦ ఎప్పుడూ బ్యాగ్‌లో పెప్పర్ స్ప్రే, చాకు, కారం వంటివి అందుబాటులో ఉంచుకోవాలి. ఆపద వచ్చినప్పుడు దాడికి ఉపయోగించుకోవాలి. ప్రాణాల మీదకు వచ్చినప్పుడు నిందితుడిపై దాడి చేయడం ఆత్మరక్షణ కిందకే వస్తుంది. -
దిశ యాప్‌ను ఎలా ఉపయోగించాలంటే..
సాక్షి, అమరావతి : మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోచ్చిన దిశ యాప్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే పోలీసులు స్పందిస్తున్న తీరుపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపదలో ఉన్న మహిళల కోసం రూపొందించిన ఈ యాప్‌ను కేవలం నాలుగు రోజుల్లోనే 50 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అలాగే ఓ అన్నగా తమ భద్రత కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇటీవల ఓ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ దిశ యాప్ ద్వారా సాయం కోరగా.. కేవలం ఆరు నిమిషాల్లోనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆమెను వేధిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఇంటర్నెట్ సాయంతో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, ఇన్స్టాల్ చేసుకుంటే చాలు.. ఆ తర్వాత ఇంటర్నెట్ ఉన్నా లేకున్నా ఫోన్ ద్వారా ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చు. ఎస్‌వోఎస్ బటన్ నొక్కడం ద్వారా గానీ, ఫోన్‌ను గట్టిగా అటూఇటూ ఉపడం ద్వారా గానీ ఆపదలో ఉన్న మహిళలు దిశ కాల్ సెంటర్‌కు సమాచారం ఇవ్వవచ్చు. ఆ తర్వాత ప్రమాదంలో ఉన్న మహిళలను కాపాడేందుకు దిశ కంట్రోల్ రూమ్ నుంచి పోలీసులకు ఆటోమేటిక్‌గా సమాచారం అందుతుంది. దిశ యాప్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, కంట్రోల్ రూమ్‌కు ఎలా ఫిర్యాదు చేయాలో పూర్తి వివరాలు ఓసారి చుద్దాం.. ► ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ ఫోనుల్లో ప్లేస్టోర్‌లోకి వెళ్లి దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ► ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇంటర్నెట్ అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్నెట్ ఉన్నా, లేకున్నా మొబైల్ ద్వారా ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ► ఆపదలో ఉన్నవారు ఈ యాప్‌ను ఓపెన్ చేసి అత్యవసర సహాయం(ఎస్‌వోఎస్) బటన్ నొక్కితే చాలు.. వారి ఫోన్ నంబర్, చిరునామా, వారున్న ప్రదేశం వివరాలు దిశ కంట్రోల్ రూమ్‌కు చేరతాయి. ► ఎస్‌వోఎస్ బటన్ ప్రెస్ చేసే సమయం లేనప్పుడు చేతిలోని ఫోన్‌ను గట్టిగా అటూఇటూ ఊపితే చాలు.. దిశ కమాండ్ రూమ్‌కు సమాచారం చేరుతుంది. ► ఎస్‌వోఎస్ బటన్‌ను నొక్కితే వాయిస్‌తోపాటు పది సెకన్ల వీడియోను కూడా రికార్డు చేసి కమాండ్ రూమ్‌కు పంపించే వీలు ఉంది. ► ఎస్‌వోఎస్ బటన్ నొక్కగానే కంట్రోల్ రూమ్‌కు సమాచారం వెళ్లి.. అక్కడి నుంచి వెంటనే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు, పోలీస్ రక్షక్ వాహనాలకు ఆటోమేటిక్‌గా కాల్ వెళ్తుంది. ► ప్రమాదంలో ఉన్నవారిని చేరుకోవడానికి జీపీఎస్ అమర్చిన పోలీస్ రక్షక్ వాహనాల్లోని ‘మొబైల్ డేటా టెర్మినల్’ సహాయపడుతుంది. ► అలాగే ఆపదలో ఉన్నప్పుడు సమాచారాన్ని పోలీసులతోపాటు తక్షణం కుటుంబ సభ్యులు/మిత్రులకు పంపేలా ఐదు ఫోన్ నంబర్ల (ఎమర్జెన్సీ కాల్స్)ను దిశ యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. ► దిశ యాప్‌లోని ‘ట్రాక్ మై ట్రావెల్’ ఆప్షన్ వినియోగిస్తే వారు వెళ్లాల్సిన ప్రాంతాన్ని కూడా నమోదు చేయొచ్చు. ఇలా చేయడం ద్వారా వారు ప్రయాణిస్తున్న వాహనం వెళ్లాల్సిన ప్రాంతానికి కాకుండా దారి మళ్లితే ఆ సమాచారాన్ని కంట్రోల్ రూమ్, బంధుమిత్రులకు పంపి అప్రమత్తం చేయొచ్చు. ► ఈ యాప్‌లోనే డయల్ 100, డయల్ 112 నంబర్లను కూడా పొందుపర్చారు. డయల్ 100 అయితే నేరుగా కాల్ చేసి విషయం చెప్పాలి. డయల్ 112 అయితే మిస్డ్ కాల్ ఇచ్చినా సరిపోతుంది. ► దిశ యాప్‌లో పోలీసు అధికారుల ఫోన్ నంబర్లు, సమీపంలోని పోలీస్‌స్టేషన్ వివరాలు తెలుసుకునేందుకు ఆప్షన్లు ఉంటాయి. వైద్య సేవలు అవసరమైనప్పుడు యాప్ ద్వారా దగ్గర్లోని ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకులు, ఫార్మసీల వివరాలను కూడా తెలుసుకోవచ్చు. -
4 రోజుల్లోనే 50 వేల మంది డౌన్లోడ్
సాక్షి, అమరావతి: ఆపదలో ఉన్న మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ ఎస్‌వోఎస్ యాప్ వినియోగదారుల ప్రశంసలు పొందుతోంది. నాలుగు రోజుల్లోనే దిశ యాప్‌ను ఏకంగా 50 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారని దిశ స్పెషల్ ఆఫీసర్ దీపిక పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసులు స్పందిస్తున్న తీరుకు మెచ్చి గూగుల్ ప్లేస్టోర్‌లో 5కి ఏకంగా 4.9 స్టార్ రేటింగ్ ఇచ్చారన్నారు. 9వ తేదీ నుంచి సగటున రోజుకు రెండు వేల మందికిపైగా దిశ యాప్ ద్వారా పోలీస్ కమాండ్ రూమ్‌కు టెస్ట్ కాల్స్ చేస్తున్నారని వివరించారు. దిశ చట్టాన్ని తెచ్చిన 24 గంటల్లోనే మొదటి కేసులో పోలీసులు వాయు వేగంతో స్పందించిన విధానం, బాధితురాలికి పూర్తి స్థాయిలో భరోసా కల్పించిన తీరుతో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తున్నాయని పేర్కొన్నారు. కుటుంబ సమస్యల కారణంతో ఎక్కువ మంది దిశను ఆశ్రయిస్తున్నారని, అలాంటి వారికి నిపుణులైన, అనుభవము ఉన్నవారి చేత కౌన్సెలింగ్ నిర్వహించి వారు కలసి మెలసి ఉండేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. బుధవారం వచ్చిన ఫిర్యాదుల్లో ముఖ్యమైనవి.. ► భార్య, భర్తల మధ్య నెలకొన్న వివాదంలో భర్త విచక్షణ కోల్పోయి కొడుతుండడంతో బాధిత మహిళ తన చేతిలోని మొబైల్ ఫోన్‌ను షేక్ చేయడం ద్వారా దిశ కంట్రోల్ సెంటర్‌కు ఫిర్యాదు అందించింది. పోలీసులు నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకొని భర్త వేధింపుల నుంచి బాధితురాలిని రక్షించారు. ► పశ్చిమగోదావరి జిల్లాలో వరుసకు సోదరుడైన వ్యక్తి తనను వేధిస్తున్నాడంటూ ఒక మహిళ ఎస్‌వోఎస్ ద్వారా ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ► తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తి తరచుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ ఓ బాలిక దిశ ఎస్‌వోఎస్ ద్వారా ఫిర్యాదు చేసింది. తక్షణమే స్పందించిన పోలీసులు బాలిక వద్దకు చేరుకొని ధైర్యం చెప్పారు. వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. (చదవండి: ఇంటర్నెట్ అవసరం లేకుండానే..) -
ఏపీలో దిశ యాప్‌కి అనూహ్య స్పందన
-
దశ 'దిశ'లా స్పందన
సాక్షి, అమరావతి: ఆపదలో ఉన్న మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ వినియోగదారుల ప్రశంసలు పొందుతోంది. ఈ నెల 9న ప్లేస్టోర్‌లో ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లలో అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ను 12 ఉదయం వరకు అంటే.. మూడు రోజుల్లోనే 35 వేల మంది డౌన్లోడ్ చేసుకోవడం విశేషం. అదేవిధంగా యాప్ సేవలను మెచ్చి గూగుల్ ప్లేస్టోర్‌లో 5కి ఏకంగా 4.8 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఈ యాప్ పనిచేస్తుందో.. లేదో తెలుసుకునేందుకు కూడా పెద్ద ఎత్తున కాల్స్ వస్తుండటం మరో విశేషం. 9వ తేదీ నుంచి రోజూ రెండు వేల మందికిపైగా దిశ యాప్ ద్వారా పోలీస్ కమాండ్ రూమ్‌కు టెస్ట్ కాల్స్ చేశారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ నెల 8న రాజమహేంద్రవరంలో దిశ పోలీస్‌స్టేషన్‌తోపాటు దిశ మొబైల్ అప్లికేషన్ (యాప్)ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. దిశ.. పనితీరు ఇలా.. - ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ ఫోనుల్లో ప్లేస్టోర్‌లోకి వెళ్లి దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. - ఇన్స్టాల్ చేసుకోవడానికే ఇంటర్నెట్ అవసరం. తర్వాత ఇంటర్నెట్ ఉన్నా, లేకున్నా మొబైల్ ద్వారా యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. - ఆపదలో ఉన్నవారు ఈ యాప్‌ను ఓపెన్ చేసి అత్యవసర సహాయం (ఎస్‌వోఎస్) బటన్ నొక్కితే చాలు.. వారి ఫోన్ నంబర్, చిరునామా, వారున్న ప్రదేశం వివరాలు దిశ కంట్రోల్ రూమ్‌కు చేరతాయి. - ఎస్‌వోఎస్ బటన్ ప్రెస్ చేసే సమయం లేనప్పుడు చేతిలోనిఫోన్ను గట్టిగా అటూఇటూ ఊపితే చాలు.. దిశ కమాండ్ రూమ్‌కు సమాచారం చేరుతుంది. - ఎస్‌వోఎస్ బటన్‌ను నొక్కితే వాయిస్‌తోపాటు పది సెకన్ల వీడియోను కూడా రికార్డు చేసి కమాండ్ రూమ్‌కు పంపించే వీలు ఉంది. - ఎస్‌వోఎస్ బటన్ నొక్కగానే కంట్రోల్ రూమ్‌కు సమాచారం వెళ్లి.. అక్కడి నుంచి వెంటనే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు, పోలీస్ రక్షక్ వాహనాలకు ఆటోమేటిక్‌గా కాల్ వెళ్తుంది. - ప్రమాదంలో ఉన్నవారిని చేరుకోవడానికి జీపీఎస్ అమర్చిన పోలీస్ రక్షక్ వాహనాల్లోని ‘మొబైల్ డేటా టెర్మినల్’ సహాయపడుతుంది. - ఆపదలో ఉన్నప్పుడు సమాచారాన్ని పోలీసులతోపాటు తక్షణం కుటుంబ సభ్యులు/మిత్రులకు పంపేలా ఐదు ఫోన్ నంబర్ల (ఎమర్జెన్సీ కాల్స్)ను దిశ యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. - దిశ యాప్‌లోని ‘ట్రాక్ మై ట్రావెల్’ ఆప్షన్ వినియోగిస్తే వారు వెళ్లాల్సిన ప్రాంతాన్ని కూడా నమోదు చేయొచ్చు. ఇలా చేయడం ద్వారా వారు ప్రయాణిస్తున్న వాహనం వెళ్లాల్సిన ప్రాంతానికి కాకుండా దారి మళ్లితే ఆ సమాచారాన్ని కంట్రోల్ రూమ్, బంధుమిత్రులకు పంపి అప్రమత్తం చేయొచ్చు. - ఈ యాప్‌లోనే డయల్ 100, డయల్ 112 నంబర్లను కూడా పొందుపర్చారు. డయల్ 100 అయితే నేరుగా కాల్ చేసి విషయం చెప్పాలి. డయల్ 112 అయితే మిస్డ్ కాల్ ఇచ్చినా సరిపోతుంది. - దిశ యాప్‌లో పోలీసు అధికారుల ఫోన్ నంబర్లు, సమీపంలోని పోలీస్‌స్టేషన్ వివరాలు తెలుసుకునేందుకు ఆప్షన్లు ఉంటాయి. వైద్య సేవలు అవసరమైనప్పుడు యాప్ ద్వారా దగ్గర్లోని ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకులు, ఫార్మసీల వివరాలను కూడా తెలుసుకోవచ్చు. అవగాహన కల్పిస్తున్నాం మహిళల రక్షణ కోసం చేపట్టిన దిశ కార్యక్రమంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నాం. తద్వారా ఎక్కువ మంది దీన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాం. దిశ యాప్‌నకు తక్కువ సమయంలోనే విశేష స్పందన లభిస్తోంది. యాప్ ద్వారా ఫిర్యాదు చేసిన మహిళలకు ఆరు నుంచి పది నిమిషాల్లోనే తక్షణ సాయం అందిస్తున్నాం. – డీజీపీ గౌతమ్ సవాంగ్ -
24 గంటల్లోనే చార్జిషీట్ దాఖలు
ఏలూరు టౌన్/సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్కాచెల్లెమ్మల భద్రతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగా ‘దిశ’ చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు శాసనసభలో తీర్మానం చేశారు. దిశ పోలీసు స్టేషన్లు, దిశ ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ ఎస్ఓఎస్ యాప్ మహిళలకు రక్షణగా నిలుస్తోంది. ఈ యాప్ ద్వారా రక్షణ కోరిన ప్రభుత్వ మహిళా అధికారికి పోలీసులు అండగా నిలిచారు. ఆమెను వేధింపులకు గురిచేసిన ప్రొఫెసర్ బసవయ్య కేసులో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ సర్కిల్ పోలీసులు చార్జిషీట్‌ను(అభియోగ పత్రం) కేవలం 24 గంటల్లోనే బుధవారం ఎక్సైజ్ కోర్టులో దాఖలు చేయడం గమనార్హం. అసలేం జరిగింది.. విశాఖపట్నం నుంచి విజయవాడకు బస్సులో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళా అధికారిని ఆంధ్రా యూనివర్సిటీలో ఇనార్గానిక్, అనలిటికల్ విభాగాధిపతిగా పనిచేస్తున్న ప్రొఫెసర్ కాలోతు బసవయ్య మంగళవారం తెల్లవారుజామున పోకిరీ చేష్టలతో వేధింపులకు గురిచేశాడు. వెంటనే ఆమె దిశ ఎస్ఓఎస్ యాప్ ద్వారా రక్షణ కోరగానే, బస్సు ఏలూరు జాతీయ రహదారిలో పెదపాడు మండలం పరిధిలోని కలపర్రు టోల్గేట్ వద్దకు చేరుకునేలోపు ఏలూరు త్రీటౌన్ పోలీసులు స్పందించి, కేవలం 6 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలికి రక్షణగా నిలిచారు. నిందితుడిని అరెస్టు చేసి ఏలూరు త్రీటౌన్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ ఆదేశాలతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఈ కేసును పెదపాడు పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. పెదపాడు ఎస్సై జ్యోతిబసు కేసు నమోదు చేశారు. దర్యాప్తును ముమ్మరం చేశారు. కేవలం 24 గంటల్లోనే ఈ కేసులో చార్జిషీటును ఏలూరు ఎక్సైజ్ కోర్టులో దాఖలు చేశారు. దేహశుద్ధి జరిగినా బుద్ధి మార్చుకోని బసవయ్య దిశ యాప్ ద్వారా నమోదైన తొలి కేసులోని నిందితుడు కాలోతు బసవయ్య నాయక్ నేపథ్యం ఆరా తీస్తే అతడు గతంలోనూ మహిళలను వేధించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన బసవయ్య ఎమ్మెస్సీ చదివి, విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో కెమిస్ట్రీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధుల్లో చేరాడు. ఇటీవలే ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందాడు. మహిళలను వేధింపులకు గురిచేయడం బసవయ్యకు అలవాటేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. భీమవరంలోని ఓ కాలేజీలో గతేడాది జరిగిన పరీక్షలకు బసవయ్య ఎగ్జామినర్‌గా వచ్చాడు. అప్పుడు అక్కడి విద్యార్థినులు, మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ కాలేజీ సిబ్బంది అతడిని నిర్బంధించి, దేహశుద్ధి చేశారు. అçప్పటి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌కు సమాచారం అందించారు. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని యూనివర్సిటీ ప్రతినిధులు భీమవరంలోని ప్రైవేట్ కాలేజీ సిబ్బందికి నచ్చజెప్పడంతో అతడిని విడిచిపెట్టారు. అయినప్పటికీ బుద్ధి మార్చుకోని బసవయ్య బస్సులో ప్రభుత్వ ఉద్యోగిని వేధిçస్తూ పోలీసులకు చిక్కాడు. పెదపాడు పోలీసులు అతడిపై క్రైమ్ నెంబర్ 52/2020 ఐపీసీ సెక్షన్ 354, 354(ఎ) కింద కేసు నమోదు చేశారు. బుధవారం ఏలూరు ఎక్సైజ్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు నిందితుడు బసవయ్యకు స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. -
6 నిమిషాల్లోనే అరెస్టు చేశాం: దీపికా పాటిల్
సాక్షి, విజయవాడ: మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన దిశ యాప్‌నకు అనూహ్య స్పందన లభిస్తోందని దిశ చట్టం పర్యవేక్షణ ప్రత్యేక ఐపీఎస్ అధికారి దీపికా పాటిల్ అన్నారు. యాప్ ప్రారంభించిన నాలుగు రోజుల్లో 4, 105 మెసేజ్‌లు వచ్చాయని.. అందులో చాలా వరకు యాప్‌ను పరీక్షించేందుకు చేసినవే ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికి రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని.. 38 ఫిర్యాదులపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. బుధవారం దీపికా పాటిల్ మాట్లాడుతూ.. బస్సులో మహిళను వేధించిన కేసులో ఆరు నిమిషాల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఈ నెలాఖరుకల్లా రాష్ట్రంలోని 18 దిశా పోలీస్ స్టేషన్లను సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు. (6 నిమిషాల్లో..ఆకతాయి ప్రొఫెసర్ ఆటకట్టు) ‘‘దిశా చట్టానికి రాజముద్ర పడే లోపు మహిళా రక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. దిశా యాప్‌పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి మహిళలల్లో చైతన్యం తీసుకువస్తాం. మహిళల పట్ల చిన్న తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకొంటాం. సోషల్ మీడియా వేధింపులపైనా ప్రత్యేక నిఘా పెట్టాం. మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పాన్ని నెరవేర్చే దిశగా దిశా బృందం ముందుకు సాగుతుంది’’ అని దీపికా పాటిల్ పేర్కొన్నారు. -
భరోసా కల్పించిన దిశ యాప్..
-
6 నిమిషాల్లో..ఆకతాయి ప్రొఫెసర్ ఆటకట్టు
తెల్లవారుజాము 4.21 గంటల సమయం.. విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ బస్సు..ఏలూరు సమీపంలోని కలపర్రు టోల్‌ప్లాజా..ప్రయాణికులంతా నిద్రమత్తులో ఉన్నారు... ఓ పోకిరిలో మాత్రం కామ పిశాచి నిద్ర లేచింది..!ఉన్నతమైన అధ్యాపక వృత్తిలో ఉన్నా వివేకం నశించడంతో అసభ్య చేష్టలకు దిగాడు..ధైర్యాన్ని కూడదీసుకున్న బాధిత మహిళ ‘దిశ యాప్’ ద్వారా సమాచారం ఇచ్చారు...ఫిర్యాదు అందిన 6 నిమిషాల్లోనే అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళను క్షేమంగా గమ్య స్థానానికి పంపించారు. సాక్షి, అమరావతి, విశాఖపట్నం/ ఏలూరు టౌన్ : ఆపదలో ఉన్న మహిళలు, చిన్నారుల రక్షణ కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన ‘దిశ’ యాప్ సత్ఫలితాన్నిచ్చింది.. వేళకాని వేళ మహిళపై వేధింపులకు దిగిన ఓ పోకిరీ భరతం పట్టింది.. తక్షణ రక్షణ తథ్యం.. అని నిరూపించింది.. కేవలం ఆరు నిమిషాల్లో పోలీసులను బాధితురాలి వద్దకు చేర్చి అభయమిచ్చింది.. తద్వారా అక్కచెల్లెమ్మల జోలికొస్తే ఖబడ్దార్.. అని హెచ్చరించింది.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 8న దిశ యాప్ ప్రారంభమైన నేపథ్యంలో తొలిసారి ఓ మహిళకు అండగా నిలిచింది. భరోసా కల్పించిన దిశ యాప్.. ప్రభుత్వ మహిళా ఉద్యోగి ఒకరు సోమవారం రాత్రి విశాఖ నుంచి విజయవాడకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బయలుదేరారు. ఇదే బస్సులో ప్రయాణిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన కాలోతు బసవయ్య నాయక్ విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీలో కెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. బస్సులో సీట్లు ఖాళీగా ఉండడంతో తెల్లవారుజామున మహిళా అధికారి సీటు వద్దకు చేరుకుని పోకిరీ చేష్టలతో వేధింపులకు గురిచేశాడు. ముఖ్యమంత్రి జగన్ తాజాగా ప్రారంభించిన దిశ యాప్ గుర్తుకురావటంతో బాధితురాలు 4.21 గంటల సమయంలో తన మొబైల్ ఫోన్‌ను ఐదు పర్యాయాలు అటుఇటు కదిలించారు. యాప్‌లోని ఎస్ఓఎస్ బటన్‌ను నొక్కటంతో ఆపదలో ఉన్నట్లు సమాచారం అందుకున్న దిశ కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. బాధిత మహిళ ఏలూరు సమీపంలో ఉన్నట్లు గుర్తించి పశ్చిమ గోదావరి ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్‌కు సమాచారం అందించారు. ఎస్పీ ఆదేశాలతో ఏలూరు త్రీ టౌన్ పోలీసులు వెంటనే బయలుదేరి తెల్లవారుజామున 4.27 గంటలకు(కాల్ వచ్చిన 6 నిమిషాల్లో) బస్సు వద్దకు చేరుకున్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళకు ధైర్యం చెప్పి ఆకతాయిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి రిమాండ్ విధించిన కోర్టు బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఏయూ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ కె.బసవయ్య నాయక్‌పై ఏలూరు త్రీటౌన్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదైనట్లు సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్ తెలిపారు. అనంతరం పెదపాడు పోలీస్ స్టేషన్‌కు రిఫర్ చేయడంతో క్రైమ్ నెంబర్ 52/2020 సెక్షన్ 354, 354(ఏ) కింద కేసు నమోదు చేశారు. బసవయ్య నాయక్‌ను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్టు పోలీసులు తెలిపారు. ఏలూరు రూరల్ సీఐ శ్రీనివాసరావు కేసును దర్యాప్తు చేస్తున్నారు. వర్సిటీలో ఇనార్గానిక్, అనలిటికల్ విభాగాధిపతిగా విధులు నిర్వహిస్తున్న బసవయ్యపై చర్యలు తీసుకుంటామని ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి తెలిపారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు వచ్చినప్పటి నుంచి ఆకతాయి ప్రొఫెసర్ అరెస్టు వరకు దిశ ప్రత్యేకాధికారి దీపిక పాటిల్ పర్యవేక్షించారు. పోలీసులకు సీఎం జగన్ అభినందనలు దిశ యాప్ ద్వారా అందిన తొలి ఫిర్యాదుపై పోలీసులు స్పందించిన తీరు పట్ల ముఖ్యమంత్రి జగన్ అభినందనలు తెలిపారు. పోలీసులు అతి తక్కువ సమయంలో స్పందించి ఆపదలో ఉన్న మహిళకు అండగా నిలిచారని ప్రశంసించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పోలీసులను కోరారు. ఘటన వివరాలను డీజీపీ గౌతమ్ సవాంగ్ సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. ఆరు నిమిషాల్లో ఆరు కి.మీ – బాధితురాలు ఆపదలో ఉన్నట్లు దిశ కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందుకున్న ఏలూరు త్రీటౌన్ కానిస్టేబుల్ నాగదాసి రవి ఆరు కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఆరు నిమిషాల్లో చేరుకున్నాడు. – త్రీటౌన్ ఎస్ఐ బీఎస్‌డీఆర్ ప్రసాద్, మరో కానిస్టేబుల్ టి.సతీష్ కూడా స్వల్ప వ్యవధిలోనే అక్కడకు చేరుకుని నిందితుడిని బస్సులో నుంచి అదుపులోకి తీసుకున్నారు. – బాధిత అధికారి 4.10 గంటల సమయంలో తొలుత విశాఖ మహిళా పోలీస్‌స్టేషన్ ఏసీపీ ప్రేమ్కాజల్కి ఫోన్ చేయగా డయల్–100కి కాల్ చేయాలని సూచించారు. ఆ వెంటనే బాధితురాలు దిశ యాప్‌ను వినియోగించడంతో అతి వేగంగా సాయం అందింది. -
పోలీసులకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి : దిశ యాప్ ద్వారా ఓ మహిళకు సాయం అందించిన పోలీసులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మహిళల భద్రత, దిశ పథకం, దిశ యాప్ అమలు తీరుపై మంగళవారం సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిశ యాప్ సాధించిన విజయాన్ని గౌతం సవాంగ్ సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. ‘విశాఖపట్నం నుంచి విజయవాడ బస్సులో వస్తున్న మహిళను తోటి ప్రయాణికుడు వేధించడంతో బాధితురాలు దిశయాప్ ద్వారా పోలీసులను ఆశ్రయించారు. తెల్లవారుజామున 4.21 గంటలకు బాధితురాలి నుంచి ఎస్‌వోఎస్ కాల్ ద్వారా మంగళగిరి దిశ కాల్ సెంటర్‌కు ఫిర్యాదు అందింది. దీంతో కాల్ సెంటర్ సిబ్బంది వెనువెంటనే సమీపంలోని ఎమర్జెన్సీ టీమ్‌కు సమాచారం అందించారు. కేవలం 5 నిమిషాల్లోనే ఏలూరు సమీపంలో బస్సువద్దకు దిశ టీమ్ చేరుకొని వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు 3వ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేశారు’ అని సవాంగ్ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఈ ఘటనపై సీఎం జగన్ పోలీసులకు అభినందనలు తెలిపారు. చదవండి : మహిళకు సాయపడ్డ ‘దిశ’ యాప్ -
పోలీసులకు సీఎం జగన్ అభినందనలు
-
మహిళకు సాయపడ్డ ‘దిశ’ యాప్
సాక్షి, విజయవాడ: ‘దిశ’ యాప్ సాయంతో మహిళను వేధిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన మంగళవారం విజయవాడలో జరిగింది. బస్సులో వైజాగ్ నుంచి విజయవాడ వెళ్తున్న మహిళ పట్ల తోటి ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె తెల్లవారుజామున 4.21 గంటలకు దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు నిమిషాల వ్యవధిలో బాధితురాలి వద్దకు చేరుకున్నారు. అనంతరం వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిని ప్రొఫెసర్‌గా గుర్తించారు. మహిళా ప్రయాణికురాలి ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీ టౌన్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని దిశ ప్రత్యేకాధికారి దీపిక పాటిల్ పేర్కొన్నారు. (‘దిశ’ పోలీసు స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం జగన్) -
‘దిశ’ తప్పిన ‘పచ్చ’ రాజకీయం
సాక్షి, మహేంద్రవరం : ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అనే సామెతను తు.చ. తప్పకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు పై నుంచి కింది స్థాయి వరకూ పాటిస్తున్నట్టుంది. మహిళలకు భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 18 దిశ పోలీసు స్టేషన్లను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సమాయత్తమైంది. ఇందులో భాగంగా ‘దిశ’ తొలి పోలీసు స్టేషన్‌ను రాజమహేంద్రవరం కేంద్రంగా శనివారం సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రయత్నాన్ని పార్టీలకతీతంగా అన్ని వర్గాలూ స్వాగతించాయి. కానీ ప్రచారం కోసం టీడీపీ రాజకీయ రంగు పులమడాన్ని ఆ పార్టీ శ్రేణులే ఛీ కొడుతున్నాయి. ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గ’న్నట్టుగా రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని సోమవారం ఫిర్యాదు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే భవాని ఫిర్యాదు ఇలా... గత డిసెంబరు 16న అసెంబ్లీలో మద్యం పాలసీపై జరిగిన చర్చలో మద్యం బ్రాండ్ల గురించి ఆమె ప్రస్తావించారు. దీనిపై హేళన చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అదే నెల 17న స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, తనకు న్యాయం చేసి ‘దిశ’ చట్టంపై ప్రజలకు నమ్మకం కల్పించాలని రాజమహేంద్రవరంలోని ‘దిశ’ పోలీసు స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని సోమవారం ఫిర్యాదు చేశారు. ఇన్నాళ్లూ ఎందుకు మౌనం...? గత ఏడాది డిసెంబరు 17న అసెంబ్లీ స్పీకర్‌కు ఎమ్మెల్యే భవాని ఫిర్యాదు చేశారు. ఇన్నాళ్లూ సైబర్ పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయకుండా మౌనం వహించి ఇప్పుడు ‘దిశ’ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంలో ఔచిత్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. శనివారం దిశ పోలీసు స్టేషన్ ప్రారంభమైతే 48 గంటలు కూడా తిరగకుండానే ఇంత హఠాత్తుగా ఫిర్యాదు చేయడంలో ఆంతర్యమేమిటంటున్నారు. అసెంబ్లీలో ఈ అంశంపై ఎమ్మెల్యే ఫిర్యాదు చేసి 53 రోజులవుతోంది. ఆ చర్యలు ఏ దశలో ఉన్నాయో తెలుసుకోకుండా పార్టీ కార్యకర్తలతో దిశ పోలీసు స్టేషన్‌కు రావడమేమిటని అక్కడున్నవారే విసవిసలాడారు. మహిళా ఎమ్మెల్యేగా గైర్హాజరవుతూ... మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దిశ పోలీసు స్టేషన్‌ను తన నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నప్పుడు నియోజకవర్గ ప్రజాప్రతినిధిగానే కాకుండా ఒక మహిళా ప్రతినిధి అయి ఉండి గైర్హాజరవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోనీ ఎమ్మెల్యేను ఆహ్వానించకుండా ప్రభుత్వం ఏమైనా పార్టీ కోణంలో చూసిందా అంటే అదీ లేదు. పోలీసు శాఖ నుంచి మిగిలిన ప్రజాప్రతినిధులకు పంపించినట్టుగానే ఈ ఎమ్మెల్యేకు కూడా ఆహ్వానం పంపించినా డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదు చేస్తూ...న్యాయం జరిగేలా చూసి... దిశ చట్టంపై మహిళల్లో నమ్మకం కలిగించాలని ఎలా కోరతారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వెనుకబడ్డ రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకూ రాష్ట్ర నలుమూలల నుంచి మహిళా ప్రజాప్రతినిధులు ఈ ప్రతిష్టాత్మక సభకు హాజరయ్యారు. సమావేశానికి హాజరై చట్టంపై తన అభిప్రాయాన్ని తెలియజేసి ఉంటే మరింత హుందాగా ఉండేదంటున్నారు. రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ నాయకులు దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారు. 53 రోజుల కిందట జరిగిన సంఘటనపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఫిర్యాదు చేశారు. ఇది అసెంబ్లీ సెక్రటేరియట్ పరిధిలో ఉంది. దీనిపై ఎలా చర్యలు తీసుకోవాలో న్యాయ సలహా తీసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఉండవల్లి అనూష ఆరు నెలలుగా ఫేస్ బుక్‌లో అసభ్యంగా పోస్టులు పెట్టారని ఫిర్యాదు వచ్చింది. పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన మద్దుల రాజేశ్వరి 2018 డిసెంబర్ నుంచి 2019 డిసెంబర్ వరకూ పోస్టింగ్‌లు ఉన్నాయంటున్నారు. ఫేస్ బుక్‌లలో 18 అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెట్టినట్లు ఫిర్యాదు చేశారు. ఏడాది కిందట జరిగిన సంఘటనపై ఒకటి, నెల కిందట జరిగిన సంఘటనపై మరొకటి ఫిర్యాదు చేశారు. ఈ మూడు ఫిర్యాదులు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలోనివి కావు. అయినా న్యాయ సలహా తీసుకొని చర్యలు తీసుకుంటాం. జీరో ఎఫ్ఐఆర్ అనేది అత్యవసర సంఘటనలో మహిళల రక్షణ కోసం తీసుకుంటాం. మూడు సంఘటనలు ఇప్పటికిప్పుడు జరిగినవి కావు. భారత దేశం మొత్తం దిశ చట్టం కోసం అభినందిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఇలా చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు, ప్రజలు, చట్టం అమలు చేసేందుకు పోలీసులకు సహకరించాలి. – లతామాధురి, అదనపు ఎస్పీ, రాజమహేంద్రవరం. -
‘దిశ’ పోలీస్ స్టేషన్లో తొలిగా 2 కేసులు
రాజమహేంద్రవరం క్రైం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం రాజమహేంద్రవరంలో ప్రారంభించిన దిశ మహిళా పోలీస్ స్టేషన్లో తొలిసారిగా ఆదివారం రెండు కేసులు నమోదయ్యాయి. భర్తల వేధింపులకు గురవుతున్న ఇద్దరు మహిళలు ఈ మేరకు ఫిర్యాదులు చేశారు. వారికి వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి మేడపాటి షర్మిలారెడ్డి తోడ్పాటు అందించారు. భర్త, అత్తమామలు వరకట్నం తీసుకురావాలంటూ తనను వేధిస్తున్నారంటూ నగరంలోని ఇన్నీసుపేటకు చెందిన కొండపల్లి మౌనికాదేవి ఫిర్యాదు చేశారు. దీనిపై ఇరువర్గాలకూ రెండుసార్లు కౌన్సెలింగ్ చేసినప్పటికి వారిలో మార్పు రాకపోవడంతో దిశ మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆదివారం మొట్టమొదటి కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా మహిళా ఎస్సై రేవతిని నియమించారు. విచారణ త్వరితగతిన పూర్తి చేసి, కోర్టులో చార్జిషీటు దాఖలు చేస్తారని తెలిపారు. అలాగే తన భర్త శ్రీరామ్ రవితేజను అత్తమామలు మూడు నెలలుగా దాచేసి, కాపురానికి రాకుండా వేధింపులకు గురి చేస్తున్నారని స్థానిక నెహ్రూనగర్ సుబ్బారావుపేటకు చెందిన వివాహిత జ్యోతిర్మయి ఫిర్యాదు చేసింది. తమకు దివ్యాంగురాలైన బిడ్డ పుట్టిందని, ఆ కుమార్తె తనవల్లనే మృతి చెందినట్లు వేధిస్తున్నారని ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దిశ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేసి బాధిత మహిళలకు న్యాయం చేస్తామని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా షర్మిలారెడ్డి మాట్లాడుతూ దగా పడిన మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొండంత అండగా దిశ మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారని అన్నారు. -
వైఎస్ఆర్ జిల్లలో దిశ స్టేషన్ ప్రారంభం
-
దిశ చట్టం దేశానికే రోల్ మోడల్
-
దిశ.. కొత్త దశ
-
దిశతో భరోసా