నేడు 12 దిశ పోలీస్‌ స్టేషన్లు ప్రారంభం | 12 Disha Police Stations To Open On 08-03-2020 | Sakshi
Sakshi News home page

నేడు 12 దిశ పోలీస్‌ స్టేషన్లు ప్రారంభం

Published Sun, Mar 8 2020 7:00 AM | Last Updated on Sun, Mar 8 2020 7:00 AM

12 Disha Police Stations To Open On 08-03-2020 - Sakshi

బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): రాష్ట్ర వ్యాప్తంగా నేడు (ఆదివారం) 12 దిశ పోలీస్‌ స్టేషన్లు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తెలిపారు. శనివారం విశాఖలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రతి జిల్లాలో మహిళా కోర్టులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలతో ఇక్కడ ప్రతి రోజూ మహిళా దినోత్సవమే అని పద్మ వ్యాఖ్యానించారు. చిత్తూరులో హర్షిత కేసు విషయంలో మహిళా కమిషన్‌ చొరవ తీసుకొని నిందితుడికి పోక్సో చట్టం కింద శిక్షపడేలా చేసిందన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement