విజయవాడ, సాక్షి: వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వ్యవస్థలన్నింటిని ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేసుకుంటూ పోతోంది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికే కొన్నింటిని రద్దు చేసింది. మరికొన్నింటికి పేర్లు మార్చేసింది. ఇంకొంటిలో.. అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిపైనా వేధింపులకు పాల్పడుతోంది. తాజాగా..
దిశ పోలీస్ స్టేషన్ ల పేరు మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక జీవోను విడుదల చేసింది. తెలంగాణలో జరిగిన దిశ ఘటన.. యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటన తర్వాత.. మహిళల రక్షణ దిశగా అప్పటి సీఎం వైఎస్ జగన్ అడుగులేశారు. మహిళలపై నేరాల త్వరితగత విచారణ కోసం దిశ చట్టంతో పాటు ప్రత్యేక పోలీస్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
2020 ఫిబ్రవరి 8వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఇవాళ తొలి దిశ పోలీస్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. దిశ చట్టం-పీఎస్‌తో పాటు పత్కర పరిస్థితుల్లో మహిళలకు తక్షణ రక్షణ కోసం దిశ యాప్‌ను సైతం తీసుకొచ్చారు. జగన్ సర్కార్ తీసుకున్న ఈ చర్యలపై నాడు దేశవ్యాప్తంగా చర్చ సైతం నడిచింది.
జగన్ పాలన కొనసాగినంత కాలం ‘దిశ’ వ్యవస్థ సమర్థవంతంగా పని చేసింది. అయితే ఆ క్రెడిట్‌ను కనుమరుగు చేయాలనే ప్రయత్నాల్లో.. ఇప్పుడు దిశ పీఎస్‌ల పేర్లు ఉద్దేశపూర్వకంగానే మార్చేస్తోంది చంద్రబాబు సర్కార్. ఇప్పటికే దిశ యాప్ పనితీరును కూటమి సర్కార్ నిర్వీర్యం చేసినట్లు తెలుస్తోంది.
దిశా పోలీస్ స్టేషన్లన పేరు మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వంకు పేర్లు మార్చడం పై ఉన్న శ్రద్ధ మహిళల రక్షణపై లేదు. మహిళలకు భద్రత కల్పించాలనే దిశా చట్టం, యాప్, పోలీస్ స్టేషన్లను వైయస్ జగన్ తీసుకొచ్చారు. పక్క రాష్ట్రంలో ఆడపిల్లకు అన్యాయం జరిగితే దిశా చట్టాన్ని వైయస్ జగన్ తీసుకువచ్చారు. దిశా యాప్ తో వేలాది మంది అమ్మాయిలు రక్షణ పొందారు.
:::వరుదు కళ్యాణి, YSRCP మహిళా విభాగం అధ్యక్షురాలు
Comments
Please login to add a commentAdd a comment