Two Mens Physically Harassed Married Woman At Ongole, Details Inside - Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన మృగాలు.. స్కూటీపై వెళ్తున్న మహిళను అడ్డుకుని పొల్లాల్లోకి లాక్కెళ్లి..

Oct 14 2022 1:31 PM | Updated on Oct 14 2022 4:10 PM

Physical Harassment On Married Woman At Ongole - Sakshi

రాత్రివేళ స్కూటీపై ఇంటికి వెళ్తున్న ఓ మహిళను ఇద్దరు యువకులు అడ్డుకుని అఘాయిత్యానికి పాల్పడ్డారు.

ఒంగోలు సబర్బన్‌: రాత్రివేళ స్కూటీపై ఇంటికి వెళ్తున్న ఓ మహిళను ఇద్దరు యువకులు అడ్డుకుని అఘాయిత్యానికి పాల్పడ్డారు. చిమ్మచీకట్లో పొలాల్లోకి లాక్కెళ్లి లైంగికదాడి చేశారు. ఒంగోలులోని కొప్పోలు–ఆలూరు రోడ్డులో బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. 

వివరాల ప్రకారం.. కొత్తపట్నం మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన వివాహిత(30) ఒంగోలు నగరంలో కూరగాయల వ్యాపారం చేస్తుంటుంది. బుధవారం రాత్రి వ్యాపారం ముగించుకుని 10.30 గంటల సమయంలో స్కూటీపై ఇంటికి వెళ్తోంది. ఆ సమయంలో ఇద్దరు యువకులు అడ్డుకుని అఘాయిత్యానికి పాల్పడ్డారు. తొలుత ద్విచక్ర వాహనంపై ఆమెను వెంబడించారు. కొప్పోలు–గుత్తికొండవారిపాలెం రోడ్డులో గుత్తికొండవారిపాలెం దాటిన తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో అడ్డుకున్నారు. చీకట్లో పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారు. 

అనంతరం ఇంటికి వెళ్లిన ఆమె.. ఆ విషయాన్ని తన తల్లికి చెప్పుకుంది. గురువారం ఒంగోలు వచ్చి ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీస్‌ అధికారులను వేడుకుంది. ఎస్పీ మలికాగర్గ్‌ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని అఘాయిత్యానికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులు ఆలూరు రోడ్డులోని రొయ్యల చెరువుల వద్ద పనిచేసే వారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును ఒంగోలు తాలూకా పోలీస్‌స్టేషన్‌ నుంచి ఒంగోలు దిశ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. దర్యాప్తును ముమ్మరం చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement