Ongole
-
గట్టెక్కుతామా.. నష్టపోతామా..
మరికొద్దిరోజుల్లో పొగాకు వేలం ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. రెండేళ్లుగా ధరలు ఆశాజనకంగా ఉండి రైతులకు లాభాలొచ్చాయి. ఈ ఏడాది మార్కెట్ ఎలా ఉంటుందోనని ఎదురు చూస్తున్నారు. సాగు ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో వేలంలో దక్కే ధరలపై ఆశలు పెట్టుకున్నారు. గతేడాది కంటే ధరలు పెంచితేనే లాభాలు వస్తాయని లేకుంటే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అటు బోర్డు అధికారులతోపాటు, ఇటు రైతులు అభిప్రాయపడుతున్నారు.కందుకూరు: పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్ పరిధిలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మొత్తం 11 వేలం కేంద్రాలున్నాయి. ఈనెల 10వ తేదీ నుంచి కందుకూరు – 1వ కేంద్రంతోపాటు ఒంగోలు –1, కొండపి, పొదిలి కేంద్రాల్లో వేలం ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. మిగిలిన కందుకూరు – 2, కలిగిరి, డీసీపల్లితోపాటు ఒంగోలు – 2, టంగుటూరు, వెల్లంపల్లి, కనిగిరి వేలం కేంద్రాల్లో 19వ తేదీ నుంచి మొదలవుతుంది. 2025 – 26 సీజన్‌కు సంబంధించి 11 కేంద్రాల పరిధిలో 105.27 మిలియన్ కేజీల పొగాకును అధికారికంగా అమ్ముకునేందుకు బోర్డు అనుమతి ఉంది. అయితే ప్రస్తుతం సాగు విస్తీర్ణం, వస్తున్న ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని 162 మిలియన్ కేజీల వరకు ఈ సీజన్లో అమ్మకాలు ఉండొచ్చని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. ధరలు పెంచాలంటూ..రెండు సంవత్సరాలుగా పొగాకు మార్కెట్ రైతులకు లాభాల పంట పండించింది. దీంతో ఈ ఏడాది అనేకమంది సాగుపై అధికంగా మొగ్గు చూపారు. బోర్డు పరిమితికి మించి భారీగా పంట వేశారు. రైతులు సాగులో పోటీ పడటంతో పొలాలు, బ్యారెన్ల కౌలు ధరలు అమాంతం పెరిగిపోయాయి. గతేడాది రూ.లక్ష ఉన్న బ్యారెన్ కౌలు ఈసారి రూ.2.50 లక్షల వరకు పెరిగింది. పొలం కౌలు, కూలీల రేట్లన్నీ రెట్టింపయ్యాయి. ఈ పరిస్థితుల్లో గతేడాది కంటే బ్యారెన్‌కు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అదనంగా ఖర్చయ్యిందని స్వయంగా బోర్డు అధికారులే లెక్కలు వేస్తున్నారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వేలంలో ధరలు కూడా పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేజీ పొగాకుకు సరాసరి ధరను రూ.300కు తగ్గకుండా ఇవ్వాలని కోరుతున్నారు. అయితే గతేడాది వేలం ముగిసే సమయానికి కేజీ సరాసరి ధర రూ.254 మాత్రమే ఉంది. కానీ రైతులు ఆశించిన స్థాయిలో ఈ సంవత్సరం మార్కెట్ ఉంటుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.కర్ణాటక మార్కెట్లో ఇలా..ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న పొగాకు వేలం అక్కడి రైతులకు కొంత ఆశాజనకంగానే ఉందని అధికారులు చెబుతున్నారు. బ్రైట్ గ్రేడ్ కేజీ పొగాకు ధర రూ.337 వరకు పలుకుతోంది. మొత్తంగా కేజీ సరాసరి ధర చూస్తే రూ.268.25 వరకు ఉంది. అయితే ఆంధ్రాలో పెరిగిన సాగు ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ధరలు పెంచాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు. 50 శాతం పైనే.. ఈ ఏడాది పొగాకు నాణ్యత ఆశాజనకంగా ఉండటం రైతులకు ఊరటనిచ్చే అంశంగా మారింది. మొత్తం ఉత్పత్తుల్లో 50 శాతానికి పైగా మొదటి రకం అంటే బ్రైట్ గ్రేడ్ వచ్చాయని బోర్డు అధికారులు చెబుతున్నారు. మిగిలిన గ్రేడ్లు కూడా ఆశించిన స్థాయిలో నాణ్యతగా ఉన్నాయంటన్నారు. ఇది వేలంలో రైతులకు సానుకూలాంశంగా మారనుంది. అయితే గ్రేడింగ్ విధానంలో వారు సరైన జాగ్రత్తలు పాటించి బేళ్లు కట్టాలని అధికారులు సూచిస్తున్నారు.ఉత్పత్తి బాగా పెరిగిందిఈనెల 10వ తేదీ నుంచి ఈ సీజన్‌కు సంబంధించి అధికారికంగా పొగాకు వేలం ప్రక్రియను ప్రారంభించనున్నాం. మొదటి దశలో నాలుగుచోట్ల, 19వ తేదీన మిగిలిన కేంద్రాల్లో మొదలుపెడతాం. ఈ ఏడాది ఉత్పత్తి బాగా పెరిగింది. రైతులు ఖర్చులకు అనుగుణంగా ధరలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వేలం ప్రారంభమైన తర్వాత ధరలపై ఒక అంచనాకు రాగలం. – లక్ష్మణరావు, ఆర్ఎం -
ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు రామ్ గోపాల్ వర్మ
-
ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు రాంగోపాల్ వర్మ
-
ముగిసిన రాంగోపాల్ వర్మ విచారణ
సాక్షి, ప్రకాశం జిల్లా: ఒంగోలు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు రాంగోపాల్ వర్మ వచ్చారు. ఒంగోలు రూరల్ సర్కిల్ పరిధిలోని మద్దిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో విచారణకు ఆయన హాజరయ్యారు. గతంలో చంద్రబాబు, పవన్‌పై పోస్టులు పెట్టారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఆర్జీవీపై టీడీపీ కార్యకర్త రామలింగం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫిబ్రవరి 4న విచారణకు హాజరుకావాలని ఇటీవల మూడోసారి వర్మకు నోటీసులు జారీ చేశారు. 7న విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని కోరిన వర్మ.. ఇవాళ విచారణకు హాజరయ్యారు.ముగుసిన అర్జీవి విచారణమధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు రాం గోపాల్ వర్మ ను విచారించారు ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ బాబు.మద్దిపాడు పీఎస్ 0 గంటల పాటు అర్జీవి విచారించారు. విచారణ ముగిసిన అనంతరం రాం గోపాల్ వర్మ హైదరాబాద్‌కు బయల్దేరారు. -
నేడు ఒంగోలు రూరల్ పీఎస్ కు రాంగోపాల్ వర్మ
-
టీడీపీ నేతల దందా.. ఐదు కోట్ల స్థలం హాంఫట్!
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంలో కూటమి ప్రభుత్వానికి చెందిన టీడీపీ నాయకుల తీరు అడ్డగోలుగా ఉంది. చోటామోటా నాయకుని మొదలు పెద్ద స్థాయి నాయకుని వరకు తమకు ఎదురులేదన్నట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం అవినీతి అక్రమాలకు పాల్పడే పనిలోనే ఉంటున్నారు. తాజాగా కలెక్టర్ బంగ్లాకు కిలోమీటరు దూరంలోనే కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టారు. టీడీపీ నాయకులే కొలతలు వేసుకుని ప్లాట్లుగా విభజించుకొని కర్రలు పాతారు. ఆ తర్వాత శాశ్వతంగా ఉండే విధంగా సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేశారు.ప్రస్తుతం ఏకంగా బేరం పెట్టి విక్రయించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పనులన్నీ చకచకా చేసుకుంటూ పోతున్నారు. ఇంత జరుగుతున్నా ఒంగోలు రెవెన్యూ అధికారులు మాత్రం ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అంటే.. టీడీపీ నాయకులకు భయపడి పట్టించుకోవడం లేదా.? లేకుంటే ఇప్పటికే జేబులు నింపుకుని నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మార్కెట్ విలువ 10 కోట్ల పైనే..ఒంగోలు నగరంలో అగ్రహారం రైల్వే గేటు దాటగానే బాలాజీనగర్, ఆ తర్వాత దత్తాత్రేయకాలనీ వస్తుంది. దత్తాత్రేయకాలనీ ఎదురుగా సర్వే నంబర్–81లో ప్రభుత్వానికి చెందిన 1.36 ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది. ఈ భూమి విలువ ప్రైవేటుకు చెందిన రిజిస్ట్రేషన్ స్థలమైతే మార్కెట్లో దాదాపు రూ.10 కోట్లకుపైనే ఉంది. ప్రభుత్వానికి చెందిన అసైన్మెంట్ స్థలం కావడంతో ప్రస్తుత మార్కెట్లో ఒక్కో గది రూ.55 వేల నుంచి రూ.70 వేల వరకు ఉంది. దాదాపు 816 గదుల స్థలం కావడంతో సరాసరిన ఒక్కో గదికి రూ.60 వేలు వేసుకున్నా.. సుమారు రూ.5 కోట్లు ఉంటుంది. ఇంత ఖరీదైన ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా టీడీపీ నేతలు కబ్జా చేసి మూడునాలుగు రోజులుగా ప్లాట్లు వేసుకుని ఏకంగా పిల్లర్లు వేసి నిర్మాణాలు చేపడుతున్నారంటే.. తెరవెనుక పెద్ద తతంగమే నడిచి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.స్థానిక ఎమ్మెల్యే దామచర్ల హస్తం?కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని టీడీపీ నాయకులు కబ్జా చేయడం వెనుక ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనే ప్లాట్లు వేసుకోమన్నాడంటూ ఒంగోలు నగర పాలక సంస్థలోని 16వ డివిజన్‌కు చెందిన టీడీపీ నాయకుడు, స్థానిక కార్పొరేటర్ శ్రీరామ్ నాగభూషణం అండతో తెలుగు తమ్ముళ్లు ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసి నేరుగా ప్లాట్లు వేసుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే ప్రమేయం ఉండటంతోనే రెవెన్యూ అధికారులుగానీ, మండల సర్వేయర్గానీ, ఒంగోలు నగర పాలక సంస్థ సర్వేయర్గానీ కనీసం ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదని తెలుస్తోంది. స్థానికంగా ఉన్న టీడీపీ డివిజన్ అధ్యక్షుడు ఉంగరాల రమణయ్య, ఆ పార్టీ నాయకులు పాదర్తి శింగయ్య, మాదాసు చంద్ర, కర్రి వాసు, సీహెచ్ సురేష్‌తో పాటు మరికొంతమంది కలిసి ప్లాట్లు వేసుకుని అమ్ముకుంటున్నట్లు సమాచారం. మామిడిపాలేనికి చెందిన ఒక పాస్టర్కు 50 గదులను ఒక్కో గదిని రూ.60 వేల చొప్పున విక్రయించినట్లు కూడా తెలిసింది. స్థలం కొనుగోలు చేసిన పాస్టర్ ఆగమేఘాలపై పిల్లర్లు వేసేందుకు అవసరమైన బాక్సులు తెప్పించి ఏకంగా స్థలం చుట్టూ ప్రహరీ గోడకు పిల్లర్లు కూడా పూర్తి చేసుకున్నాడు. ఆ పిల్లర్ల మధ్యలో పునాధులు తీసి ప్రహరీ నిర్మించడమే తరువాయి.టీడీపీ వస్తే ఇలానే.. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా సర్వే నంబర్–81లో స్థలాన్ని కబ్జా చేసి గుడిసెలు కూడా వేశారు. అప్పట్లో ఒంగోలు తహసీల్దార్ చిరంజీవి రంగంలోకి దిగి అక్రమంగా వేసిన గుడిసెలను పూర్తిగా తొలగించారు. ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు కూడా పెట్టారు. ఆ తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎవరూ ఆ స్థలం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం రాగానే ఆ పార్టీ నాయకుల కళ్లు ఖరీదైన ప్రభుత్వ స్థలంపై పడ్డాయి. ఇంకేముంది.. అనుకున్నదే తడవుగా పాగా వేసేశారు. జేబుల్లో కోట్ల రూపాయలు నింపుకుంటున్నారు. విచారించి చర్యలు తీసుకుంటాం.. నున్నా సురేష్, వీఆర్ఓ, బాలాజీ నగర్ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని సమాచారం అందడంతో కట్టడాలు చేస్తున్న వారిని ప్రశ్నించాను. ప్రభుత్వం నలుగురికి పట్టాలు మంజూరు చేసిందని, ఆ నాలుగు పట్టాలకు సంబంధించిన స్థలంలో చర్చి నిర్మిస్తున్నామని తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారించి ఉన్నతాధికారులకు తెలియజేస్తా. -
ఒంగోలు కూరగాయల మార్కెట్లో బీభత్సం
ఒంగోలు సబర్బన్: ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని దామోదరం సంజీవయ్య ప్రధాన కూరగాయల మార్కెట్లో మంగళవారం పోలీసులు, నగర పాలక సంస్థ అధికారులు బీభత్సం సృష్టించారు. 2019 కరోనా సమయంలో ఉన్న బకాయిలు, వాటిపై వడ్డీ చెల్లించలేదంటూ దుకాణదారులపై విరుచుకుపడ్డారు. తెల్లవారు జామున నాలుగు గంటలకు దుకాణాలు తెరిచి కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకుందామని అన్నీ సిద్ధం చేసుకునే సరికి ఒక్కసారిగా అధికారులు, పోలీసులు మార్కెట్‌ను చుట్టుముట్టారు. తాత్కాలికంగా వేసుకున్న షెడ్డులను కూలదోసేందుకు ముప్పేట దాడి మొదలెట్టారు. ఇదేం దౌర్జన్యం అని అడిగేలోగానే దుకాణాలు నేలమట్టమయ్యాయి. ముందస్తు సమాచారంగానీ, నోటీసులు గానీ ఇవ్వకుండానే దాదాపు 200 మందికి పైగా మార్కెట్‌ను చుట్టుముట్టి భయానక వాతావరణాన్ని సృష్టించారు. కూరగాయలను బురదపాల్జేశారు. మార్కెట్లో దాదాపు 200కు పైగా హోల్‌సేల్, రిటైల్ దుకాణాలున్నాయి. ఇవి కాక మరో వంద వరకు చిరు వ్యాపారులు నేలపై పట్టలు పరుచుకుని కూరగాయలు అమ్ముకుంటుంటారు. ప్రతి దుకాణంలో రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు కూరగాయలను నష్ట పోయామంటూ బాధితులు లబోదిబోమంటున్నారు. దుకాణాలను ధ్వంసం చేసిన అధికారులు.. టీడీపీ సానుభూతిపరుల షాపుల జోలికి వెళ్లకపోవడంతో ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బాధితుల నిరసన కూరగాయల మార్కెట్లోని దుకాణాలపై ఉన్న పట్టలు, తడికలకు మంట పెట్టి అందులో కూరగాయలను దహనం చేసి బాధిత వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. అధికారుల చర్యలకు నిరసనగా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ప్రధాన గేటు ముందు కూర్చొని అధికారుల చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరోనా సమయంలో చెల్లించాల్సిన అద్దెబకాయిలకు రెండింతలు వడ్డీ వేసి మరీ కట్టాలని వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. -
అమెరికా వెళ్లాక గర్ల్‌ఫ్రెండ్ హ్యాండిచ్చిందని..
ప్రేమ పేరుతో వంచించి తన ఆర్థిక అవసరాలన్నీ తీర్చుకున్న ఓ యువతి తిరస్కరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం ప్రకాశం జిల్లాలో (Prakasam District) బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన కందుల ప్రవీణ్ (27) ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసి తండ్రికి వ్యాపారంలో తోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఒంగోలుకు (Ongole) చెందిన వాకా హరిణి లక్ష్మి అనే యువతి ప్రవీణ్‌కు ఐదేళ్ల కిందట పరిచయం కావడంతో పరిచయం కాస్తా ప్రేమగా మారి ఇద్దరూ కలిసి హైదరాబాదులో (Hyderabad) కొద్దికాలం పాటు ప్రైవేటు ఉద్యోగం చేశారు.ఈ క్రమంలో యువతి ఈ చిన్న ఉద్యోగాలు తాను చేయలేనని, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లడానికి సహకరించాలని కోరడంతో ప్రవీణ్ తనకున్న పరిచయాలతో అందినకాడికి డబ్బులు తెచ్చి హరిణి లక్ష్మిని ఏడాదిన్నర క్రితం అమెరికా పంపించాడు. ఆమె అమెరికా వెళ్లిన తరువాత అక్కడ ఆమె మరో స్నేహితురాలు యామిని చౌదరితో కలిసి ప్రవీణ్‌కు ఫోన్ చేసి ‘నీవంటే నాకిష్టం లేదని.. తనను మరచిపో’ అంటూ చెప్పింది. ఈ క్రమంలో తమ కుమార్తెను ప్రవీణ్ వేధిస్తున్నాడంటూ యువతి తల్లిదండ్రులు రెండు నెలల కిందట ఒంగోలు ఒన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రవీణ్‌తో పాటు అతని తండ్రి కందుల డానియేలును పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.అనంతరం ఎవరి తీరున వారు ఉన్న క్రమంలో ఇటీవల నుంచి మళ్లీ హరిణి లక్ష్మి, ఆమె స్నేహితురాలు యామిని చౌదరి తిరిగి ప్రవీణ్‌కు ఫోన్ చేసి డబ్బులు పంపించాలని లేకపోతే వేధింపులు ఆపడం లేదని మళ్లీ ఫిర్యాదు చేస్తామని బెదిరింపులకు దిగడంతో ప్రవీణ్ తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యాడు. ఆ విషయాన్ని యువతి హరిణిలక్ష్మికి చెప్పి మరీ బుధవారం సాయంత్రం ఉప్పుగుండూరు గ్రామంలోని తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గురువారం మధ్యాహ్నం మృతుడి బంధువులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేశారు. కాగా, మృతుడి తండ్రి కందుల డానియేలు ఫిర్యాదు మేరకు యువతి వాకా హరిణి లక్ష్మి, ఆమె తండ్రి తిరుమలరావు, స్నేహితురాలు యామిని చౌదరిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ అజయ్‌బాబు తెలిపారు.భార్య తనతో డాన్స్ చేయడానికి రాలేదని.. ఉలవపాడు: సంక్రాంతి సంబరాల్లో భార్య తనతో డాన్స్ చేయడానికి రాలేదని మనస్తాపంతో భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు జిల్లాలో (Nellore District) బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఉలవపాడు (Ulavapadu) మండల పరిధిలోని కరేడు పంచాయతీలోని ఇందిరా నగర్ గిరిజన కాలనీలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. అందరూ డాన్స్‌లు వేస్తున్న సమయంలో ఇండ్లా బాలసుబ్రహ్మణ్యం (25) తన భార్యను కూడా తనతో డాన్స్ చేయడానికి రమ్మన్నాడు. పిల్లలను పట్టుకుని ఉన్నాను.. తరువాత వచ్చి వేస్తానులే అని చెప్పింది. చదవండి: సంక్రాంతి అల్లుడు మిస్సింగ్దీంతో అతను మనస్తాపానికి గురై ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికే కదా వెళ్లింది అని కార్యక్రమం అయిన తరువాత వెళ్లి చూస్తే ఇంటిలోని వంట గదిలో ఫ్యాన్‌కు వేసిన కొక్కేనికి చీరతో ఉరేసుకుని కనిపించాడు. వెంటనే స్థానికులు అతడిని ఉలవపాడు వైద్యశాలకు తరలించగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 👉ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్‌వర్మ మరో పిటిషన్
కేసుల నేపథ్యంలో ఏపీ హైకోర్టులో డైరెక్టర్ రామ్ గోపాల్‌వర్మ మరో పిటిషన్ దాఖలు చేశారు. తాను పెట్టిన ఒక పోస్ట్‌పై ఆంధ్రప్రదేశ్‌లో అనేక కేసులు నమోదు చేస్తున్నారని పిటిషనల్లో వర్మ పేర్కొన్నారు. ఒకే విషయంపై ఇన్ని కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు చేయడం చట్ట విరుద్ధమని ఆయన తెలిపారు. ఇకపై ఇదే పోస్ట్ విషయంలో కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని కోర్టును ఆర్జీవీ కోరారు. ఆపై ఇప్పటి వరకు తన మీద నమోదైన కేసులను కొట్టివేయాలని పిటిషనల్లో పేర్కొన్నారు. వర్మ దాఖలు చేసిన ఈ క్వాష్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు విచారించనుంది.ఆంధ్రప్రదేశ్‌లో తనపై నమోదైన కేసులకు సంబంధించి తాను భయపడటం లేదని రాంగోపాల్‌వర్మ ఇప్పటికే స్పష్టం చేశారు. తన కోసం పోలీసులు గాలిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏడాది క్రితం తాను చేసిన ట్వీట్లకు ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయని ఆయన ప్రశ్నించారు. ఆ ట్వీట్లతో సంబంధం లేని వారి మనోభావాలు ఎలా దెబ్బతింటాయని ఆయన అన్నారు. సంబంధంలేని వ్యక్తులు ఫిర్యాదు చేస్తే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ఆయన వీడియోలో పేర్కొన్నారు. -
రామ్ గోపాల్ వర్మ ఇంటికి ఏపీ పోలీసులు
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నివాసానికి ప్రకాశం జిల్లా పోలీసులు చేరుకున్నారు. విచారణకు రావాలని హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి పోలీసులు వచ్చారు. ఒంగోలు పోలీసు స్టేషన్‌కు విచారణ నిమిత్తం సోమవారం ఉదయం 11 గంటలకు ఆయన హాజరుకావాల్సి ఉంది. అయితే, వర్మ ఒంగోలుకు రావడం లేదని తెలియడంతో పోలీసులే ఆయన ఇంటికి చేరుకున్నారు. పోలీసుల విచారణకు సహకరించకుంటే వర్మను అరెస్ట్ చేసి ఒంగోలు తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కేసు నమోదైన విషయం తెలిసిందే. 'వ్యూహం' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో నవంబర్ 19న పోలీసుల విచారణలో వర్మ పాల్గొనాల్సి ఉండగా.. ఆ సమయంలో తనకు సినిమా షూటింగ్స్ ఉండటం వల్ల హాజరు కాలేదు. ఈ క్రమంలో పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.ఈ క్రమంలో పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. వాటికి కూడా వర్మ సమాధానం ఇచ్చారు. డిజిటల్ విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇదే విషయాన్ని వాట్సాప్ ద్వారా డీఎస్పీకి సమాచారం అందించామని ఆయన పేర్కొన్నారు. అయినా సరే పోలీసులు వర్మ ఇంటికి రావడంలో కుట్ర కోణం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వర్మ ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.విచారణ పేరుతో తనను అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. ఈమేరకు తనకు ముందస్తు బెయిల్ కావాలని పిటిషన్ వేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపైన కేసు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. తాను ఎవరి పరువుకు నష్టం కలిగించేలా ఎలాంటి పోస్టులు పెట్టలేదని.. అలాగే వర్గాల మధ్య శతృత్వం సృష్టించేలా పోస్టులు చేయలేదని పిటిషన్లో ప్రస్తావించారు. -
ఒంగోలు పోలీసులకు రాంగోపాల్ వర్మ సమాచారం
-
వైఎస్సార్సీపీలో పలు నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా చుండూరు రవిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ (శ్రీకాకుళం జిల్లా), బొడ్డేడ ప్రసాద్, (అనకాపల్లి జిల్లా) నియమితులయ్యారు.కాగా, ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా చింతాడ రవికుమార్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ను నియమించిన సంగతి తెలిసిందే.మరో వైపు, సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిల్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అక్రమ నిర్బంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు మరింత అండగా ఉండేందుకు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ తరపున ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు, వారికి భరోసా ఇవ్వడం, వారిని పరామర్శిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం ఈ బృందాలు పనిచేస్తాయి. ఆయా జిల్లాల్లో పార్టీ నేతలు, సంబంధిత నాయకులు, లీగల్‌సెల్ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ఈ బృందాలు పనిచేస్తాయి.ఇదీ చదవండి: జిల్లాలవారీగా ‘వైఎస్సార్సీపీ’ ప్రత్యేక బృందాల వివరాలు.. -
ఒంగోలులో సందడి చేసిన సినీనటి కీర్తి సురేష్ (ఫొటోలు)
-
హాస్టల్ కష్టాలు.. @ఒంగోలు
-
ఆగిపోయిన ఈవీఎంల లెక్కింపు బయటకు వచ్చిన బాలినేని
-
నిలిచిపోయిన ఈవీఎం వెరిఫికేషన్
-
నేడు ఒంగోలులో EVM చెకింగ్ అండ్ రీ వెరిఫికేషన్ ప్రక్రియ
-
ప్రియుడి మోజులో.. భర్తనే కడతేర్చింది..
ఒంగోలు టౌన్: ప్రియుడి మోజులో పడి ఆమె ఏకంగా భర్తనే హతమార్చింది. తన వ్యవహారం బయట పడేసరికి భర్త మందలించడం.. భర్త బతికుంటే తమ ‘బంధం’ కష్ట మని భావించిన ఆ మహిళ.. కిరాయి ముఠా, ప్రియుడి సాయంతో కట్టుకున్న భర్తనే దారుణంగా కడతేర్చింది.. ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన పీఎఫ్ ఇన్స్పెక్టర్ చల్లా వెంకటనరేంద్రబాబు హత్య కేసులో మృతుడి భార్యతో సహా మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో కేసు వివరాలను ఎస్పీ ఏఆర్ దామోదర్ శనివారం మీడియాకు వెల్లడించారు. ఆ యువకుడికి అలా దగ్గరైంది.. ఒంగోలులోని పీఎఫ్ ఆఫీసులో ఇన్స్పెక్టర్గా పనిచేసే చల్లా వెంకటనరేంద్రబాబు పొదిలిలోని పీఎన్ఆర్ కాలనీ మూడో లైనులో నివాసముంటున్నాడు. ఆయనకు భార్య లక్ష్మీప్రియ, ఇద్దరు పిల్లలు. వారి ఇంటి ఎదురుగా అద్దె ఇంట్లో ఉంటున్న కొండ శశికుమార్ అనే యువకుడికి లక్ష్మీప్రియ దగ్గరైంది. వారి వ్యవహారం తెలిసిన నరేంద్ర.. ఇద్దరినీ తీవ్రంగా మందలిస్తూ వస్తున్నాడు. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు శశితో కలిసి పథకం రచించింది. ఆమె ఇంట్లో ఉన్న బంగారు నగలను తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో నెల్లూరుకు చెందిన కిరాయి హంతకులతో రూ.2 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున నరేంద్ర గాఢ నిద్రలో ఉన్న సమయంలో శశితో పాటు.. నెల్లూరు కిరాయి ముఠాకు చెందిన నలుగురు యువకులు కలిసి నరేంద్ర గొంతుకు తాడు బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. మృతదేహాన్ని వంటగదిలోకి తీసుకెళ్లి తాడుతో వేలాడ దీశారు. భార్యభర్తల గొడవలతో విసిగివేసారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించేందుకు యత్నించారు. ఇదిలా ఉండగా, కిరాయి ముఠా తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా తొలుత రూ.50 వేలు మాత్రమే అడ్వాన్స్‌గా చెల్లించారు. మిగిలిన డబ్బు కోసం వారు ఫోన్లు చేస్తుండటంతో భయపడిపోయిన శశిపోలీసులకు లొంగిపోయాడు. అప్రమత్తమైన పోలీసులు నిందితులు.. లక్ష్మీప్రియతో పాటుగా ఆమె ప్రియుడు కొండ శశికుమార్, నెల్లూరు కిరాయి ముఠాకు చెందిన షేక్ నహీద్, షేక్ ఫజ్లూ, సయ్యద్ సిద్దిక్, షేక్ ముబారక్‌లను అరెస్టు చేసినట్టు ఎస్పీ దామోదర్ వివరించారు. -
నంబర్ తొలగిస్తే పంబ రేగిద్ది!
ఒంగోలు టౌన్: ఒంగోలు నగరంలో మోటారు సైకిళ్లు, ఆటోలు, కార్ల యజమానులు ఆర్టీఓ కేటాయించిన నంబర్ ప్లేట్లు దుర్వినియోగం చేయడంపై ‘ఇవి ఏ ఠాణా తాలుకానో’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం వచ్చిన కథనంపై జిల్లా పోలీసు యంత్రాంగం స్పందించింది. జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాల్లో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు నంబర్ ప్లేట్లపై ఉన్న బొమ్మలు, కామెంట్లను అక్కడికక్కడే తొలగింపజేశారు. ఒరిజినల్ నంబర్ ప్లేట్లు లేని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఒంగోలు వన్‌టౌన్ టౌన్ సీఐ షేక్ అలీ సాహెబ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ నంబర్ కనిపించకుండా ఎలాంటి గుర్తులు కానీ, చిహ్నాలు కానీ, ఫలానావారి తాలుకా అని రాయకూడదని సష్టం చేశారు. అలాగే మోటారు సైకిళ్ల మీద ఇద్దరికి మించి ప్రయాణం చేయరాదని, మద్యం సేవించి వాహనాలు నడిపి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని హితవు పలికారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాలు నిలపాలని, వ్యాపారులు తమ షాపుల ముందు రోడ్ల మీద వాహనాలు నిలపకుండా తగిన జాగ్రతలు తీసుకోవాలన్నారు. -
ఒంగోలులో ప్రజాస్వామ్యం ఉందా? : బాలినేని
సాక్షి,ప్రకాశంజిల్లా: ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజల్లో మంచి పెరు తెచ్చుకోవాలని, కొవ్వెక్కి మాట్లాడొద్దని హితవు పలికారు.‘ఎమ్మెల్యే ఉసిగొల్పితే..గుప్తా అనే వ్యక్తి చొక్కా విప్పి కొట్లాటకి దూకుతున్నాడు. ఎమ్మెల్యే నా కొవ్వు దించుతా అని మాట్లాడుతున్నాడు. ఆయన తన నోరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. నాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు.చేతనైతే నిరూపించు. నేను తెగించి ఉన్నా.. దేనికైనా సిద్ధమే. ఒంగోలులో అసలు ప్రజాస్వామ్యం ఉందా. కొంతమంది చొక్కాలు విప్పి విర్రవీగుతున్నారు. నన్ను కావాలని ఇరిటేట్ చేస్తున్నారు. విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. ఎమ్మెల్యే అవాకులు చెవాకులు పేలుతున్నాడు. నాకు 1973లోనే కారు ఉంది. ఎమ్మెల్యే జనార్దన్ అధికార మదంతో ఉన్నాడు’అని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ముందుబాబులతో చిందులేసిన ఏఎస్ఐపై చర్యలు
ఒంగోలు: విధి నిర్వహణలో ఉన్న ఓ ఏఎస్సై ఓ గ్రామంలో మందుబాబులతో కలిసి సందడి చేశారు. ఈ దృశ్యాలను కొందరు చిత్రీకరించి.. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లారు. దీంతో ఏఎస్సైను వేకెన్సీ రిజర్వ్(వీఆర్)కు పంపుతూ జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి చర్యల కోసం ఐజీ కార్యాలయానికి నివేదిక సైతం పంపినట్లు తెలుస్తోంది.ఒకవైపు కారులో హోరెత్తుతున్న మూజ్యిక్.. మరోవైపు నిషా నెత్తికెక్కి మత్తులో హుషారుగా చిందులేస్తున్న మందుబాబు. అయితే వారితో జతకట్టాడు ఓ ఏఎస్సై. తనలోని కళా పోషకుడిని తట్టి నిద్ర లేపాడు. మందుబాబు చిందులకు చేతిలో గ్లాసుతోనే ఈలలేసి గోల చేస్తూ మరింత ఉత్సాహపరిచాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాలు.. ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది. ఓ పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ పరిస్థితులతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.దీంతో పోలీసులు అక్కడ పికెట్ ఏర్పాటు చేశారు. అక్కడ విధులకు ఏఎస్సై వెంకటేశ్వర్లును అధికారులు కేటాయించారు. దీంతో ఆయన విధి నిర్వహణను విస్మరించి.. గ్రామ శివారులోకి వెళ్లి మందుబాబులతో కలిసి సందడి చేశారు.కేసు పక్కన పెట్టి మందు బాబులతో కలిసి చిందులేసిన ఒంగోలు ఎస్ఐ ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది. ఓ పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది.… pic.twitter.com/PkTVwJAH6n— Telugu Scribe (@TeluguScribe) July 2, 2024 -
దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా? టీడీపీ అధినేత నారా చంద్రబాబు యుక్తాయుక్త విచక్షణ మరిచి ‘రాళ్లతో కొట్టండి.. కర్రలతో బాదండి..’ అని సెలవిస్తే పచ్చదండు ఊరుకుంటుందా? ‘నిన్ను చంపితే ఏం చేస్తావ్..’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. టీడీపీ నేతల గత వైఖరిని మరోసారి గుర్తు చేస్తున్నాయి. ‘ఓటు వేయకుంటే పోటు.. అడ్డు తగిలితే వేటు’.. స్థూలంగా చెప్పాలంటే టీడీపీ సిద్ధాంతం ఇదే. ప్రజల ఆశీస్సులతో గద్దెనెక్కాలనే ఆలోచనకే తావు లేకుండా తమకు తెలిసిన ‘దండన’ విద్యనే పచ్చ నేతలు నమ్ముకున్నారు. నిత్యం తగువులే తలంపుగా వ్యవహరిస్తూ ప్రత్యర్థి పారీ్టల నాయకులు, కార్యకర్తలతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో టీడీపీ నేతల వికృత క్రీడకు బలైన రాజకీయ నాయకులు జిల్లాలో పదుల సంఖ్యలో ఉన్నారు. అంతకు పది రెట్ల మంది అక్రమ కేసులు ఎదుర్కొన్నారు. పచ్చటి పల్లెల్లో చిచ్చుపెట్టడమే కాకుండా తమ అహానికి, అవినీతికి అడ్డు వస్తున్నారనే కారణంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు మళ్లీ బరితెగించారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అధికారాన్ని అడ్డంపెట్టుకుని పచ్చమూకలు రెచ్చిపోయాయి. పల్లెల్లో దాడులకు తెగబడ్డాయి. తమకు అడ్డువస్తే అంతమొందించడమే లక్ష్యంగా రెచ్చిపోయాయి. నేడు అధికార పక్షంపై వికృత రాతలతో శునకానందాన్ని పొందుతున్న పచ్చమీడియా నాడు కళ్లుండి చూడలేదని కబోదుల్లా చోధ్యం చూశాయి. 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం పార్టీ అరాచకాల్లో కొన్ని ప్రధాన ఘటనలు ఎంపీటీసీ భర్తను చంపారు 2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో మర్రిపూడి మండలం కెల్లంపల్లి సెగ్మెంట్ నుంచి వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యురాలిగా తేలుకుట్ల గురవమ్మ పోటీ చేశారు. ఏప్రిల్ 11న గోసుకొండ అగ్రహారంలో పోలింగ్ బూత్ వద్ద టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడటంతో గురవమ్మ భర్త వెంకయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ఒంగోలులో చికిత్స ΄పొందుతూ మృతి చెందారు. ఏడాది వ్యవధికే దిగులుతో గురవమ్మ కూడా కన్నుమూసింది.దాడులకు అంతే లేదు..పీసీపల్లిలో 2017 జూలైలో వైఎస్సార్ సీపీ ఎంపీపీ బత్తుల అంజయ్యపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు దాడి చేసి గాయపరిచారు. 2015 ఫిబ్రవరిలో శివరాత్రి సందర్భంగా నారాయణ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను తొలగించారు. దీనిపై ప్రశ్నించిన అప్పటి వైఎస్సార్ సీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్‌తోపాటు మరో ఏడుగురిపై అక్రమంగా కేసులు బనాయించారు. కొండపి నియోజకవర్గంలో అయ్యప్పరాజుపాలెంలో ఎంపీటీసీ ఎన్నికల రోజున ఐదుగురిపై దాడి చేసి గాయపరిచారు. జరుగుమల్లి మండలానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పి.జయబాబుపై టీడీపీ నేతలు దుర్మార్గంగా రేప్ కేసు పెట్టించారు. టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో సాధారణ ఎన్నికల సమయంలో వెంకట్రావు అనే వ్యక్తి ఏజెంట్‌గా కూర్చున్నాడని అతనికి చెందిన రూ.5 లక్షల విలువ చేసే పొగాకును టీడీపీ నాయకులు తగలబెట్టారు. 2014లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక సమయంలో టీడీపీ బరితెగించింది. మార్కాపురం జెడ్పీటీసీ రంగారెడ్డి ఓటింగ్‌లో పాల్గొనకుండా చేసేందుకు ఎస్సీ, ఎస్టీ కేసు పేరుతో అరెస్టు చేయించారు. గాజులపల్లెలో దాష్టీకం2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందని పుల్లలచెరువు మండలం మర్రివేముల నుంచి ఆ పార్టీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరారు. మార్గమధ్యంలో గాజులపల్లెలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులను రెచ్చగొట్టడమే కాకుండా మర్రివేముల నుంచి 100 మంది టీడీపీ కార్యకర్తలను తీసుకెళ్లి దమనకాండ సృష్టించారు. ఇళ్లలోకి చొరబడి ఆడామగా తేడా లేకుండా బయటకు లాక్కుని వచ్చి విచక్షణా రహితంగా దాడి చేశారు. బీరువాలు పగలగొట్టి రూ.2 లక్షల సొమ్ము లూటీ చేశారు. మమ్ము రమణ అనే నిండు గర్భిణిని కాలితో తన్నడంతో ఆమెకు అబార్షన్ చేయాల్సి వచ్చింది. మమ్ము చిన్న అంజయ్య అనే వ్యక్తిపై దాడి చేయడంతో ఎముకలన్నీ విరిగి ఊపిరితిత్తులకు గాయాలయ్యాయి. సుమారు పది వాహనాలను కూడా ధ్వంసం చేశారు. పురుగుమందు డబ్బాలు తెచ్చి కొందరిపై పోసి రాక్షసానందం పొందారు. రాళ్లదాడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త బలి పొన్నలూరు మండలంలోని లింగంగుంట గ్రామంలో 2018 సెపె్టంబర్లో వినాయక నిమజ్జనం సందర్భంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు రంగునీళ్లు చల్లి రెచ్చగొట్టారు. మరుసటి రోజు ఉదయం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు కొందరు బహిర్భుమికి వెళ్లి వస్తున్న సమయంలో మాటువేసిన టీడీపీ నాయకులు కొందరు ఇంటిపైకి ఎక్కి ఒక్కసారిగా ఇటుక రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఎనిమిరెడ్డి పెదబ్రహ్మయ్య చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.రెచ్చగొట్టి.. అక్రమ కేసులు పెట్టి.. ఒంగోలు నగరంలోని కమ్మపాలెంలో ఆలూరి శ్రీహరి ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వెళ్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డిని 2019లో టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డుగా ట్రాక్టర్ పెట్టడమే కాకుండా, బూతులు తిడుతూ.. తొడలు చరుస్తూ టీడీపీ కార్యకర్తలు రాళ్ల వర్షం కురిపించారు. దాడికి దిగడమే కాకుండా పోలీసులపై ఒత్తిడి తెచ్చి బాలినేనితోపాటు ఆయన కుమారుడు ప్రణీత్‌రెడ్డి, మరికొందరిపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టించారు. కమ్మపాలెంలో దళితులు నివసించే ప్రాంతాల్లో డ్రెయినేజీ, రోడ్లు, పబ్లిక్ టాయ్‌లెట్‌కు ఏర్పాటుకు నిధులు మంజూరు చేసినా టీడీపీ నేతలు అడ్డుపుల్ల వేశారు. కమ్మపాలెంలో 119 మంది దళితులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన స్థలాల్లోకి వారిని వెళ్లనివ్వకుండా దామచర్ల అడ్డుకున్నారు. దళితులు మొత్తుకుంటున్నా వినకుండా ఆ స్థలంలో గుండా డ్రెయినేజీ నిర్మించి జులుం ప్రదర్శించారు. ఒంగోలు సమతా నగర్లో బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ప్రచారానికి ఉద్దేశపూర్వకంగా అడ్డుతగిలిన పచ్చ మందలో మేడికొండ మోహన్‌రావు, ఏఆర్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ చౌదరి, ఆయన భార్య కీలకంగా ఉన్నారు. సాటి మహిళ అని కూడా చూడకుండా ఏఆర్ కానిస్టేబుల్ భార్య మాట్లాడిన బూతులు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టయిన రోజున బండ్లమిట్టలోని దుకాణాలపై టీడీపీ నేతలు తెగబడ్డారు. ఓ ముస్లిం యువకుడిపై మూకుమ్మడిగా దాడి చేయడమే కాకుండా, దుకాణం షట్టర్ మూతవేసి హల్చల్ చేశారు. గాయపడిన ముస్లిం యువకుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దాడిలో కీలక సూత్రధారి, సమతానగర్‌లో రచ్చకు కారణమైన మేడికొండ మోహన్రావే. నగరంలో రాజకీయ ఘర్షణలు ఎక్కడ జరిగినా మోహన్‌రావు పేరే ప్రధానంగా వినిపిస్తోంది. మోటా నవీన్ అనే ఎస్టీ యువకుడిని చితకబాది ముఖంపై మూత్రం పోసిన కేసులో నిందితుడు రామాంజనేయ చౌదరికి ఆశ్రయం కలి్పంచి పోలీసులకు చిక్కకుండా కొద్ది రోజులపాటు అడ్డుపడింది మోహన్రావే అన్న ఆరోపణలున్నాయి. దాడి కేసులో జైలుకు వళ్లి వచ్చిన మోహన్‌రావును ముందు పెట్టి దామచర్ల జనార్దన్ ఆడిస్తున్న డ్రామాలను ఎల్లో పత్రిక ప్రముఖంగా ప్రచురించడం నగరంలో తీవ్ర చర్చనీయాంశమైంది. -
మీ అమూల్యమైన ఓటుతో ఆయన్ను గెలిపించండి: దిల్ రాజు
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ ప్రక్రియతో పాటుగా ఎన్నికల ప్రచారం కూడా పీక్స్‌కు చేరుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే సినిమా నటులు విశాల్, భాను చందర్, కేజీఎఫ్ ఫేమ్ రామచంద్రరాజు వంటి స్టార్స్ అందరూ వైసీపీ ప్రభుత్వానికి మద్ధతు తెలుపుతూ మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కొనసాగుతారని చెప్పారు. ఏపీలో సీఎం జగన్ చేసిన మంచి పనులను గుర్తు చేస్తూ వారందరు కూడా పలు వ్యాఖ్యలు చేశారు.టాలీవుడ్ దిగ్గజ నిర్మాతగా కొనసాగుతున్న 'దిల్ రాజు' తాజాగా ఏపీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలు వైసీపీ అభ్యర్థిగా ఎన్నికలో బరిలో ఉన్న తన మిత్రుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డిని గెలిపించాలని కోరుతూ దిల్ రాజు ఇలా చెప్పుకొచ్చారు. 'బాలినేని శ్రీనివాసుల రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఎన్నో మంచి పనులు ఒంగోలు కోసం చేశారు. ఆ తర్వాత సీఎం జగన్ గారి కేబినెట్లో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. ఈ క్రమంలో సీఎం జగన్ నేతృత్వంలో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తూ ఇప్పటి వరకు ఐదుసార్లు ఒంగోలు నుంచి బాలినేని గెలిచారు. అనేక అభివృద్ధి పనులతో ఒంగోలు పట్టణాన్ని ముందంజలో ఉంచారు.ఇప్పుడు ఆరోసారి ఒంగోలు నుంచి ఎన్నికల బరిలో బాలినేని ఉన్నారు. ఆయన్ను తప్పకుండా అక్కడి ప్రజలు గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. కొద్దిరోజుల క్రితం బాలినేని శ్రీనివాసుల రెడ్డి గారి మీద ఒక డాక్యుమెంటరీని తీశాను. అందులో ఆయన రాజకీయ ప్రస్థానంతో పాటు ఒంగోలు కోసం ఆయన ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి అందరూ తెలుసుకోవచ్చు. ఆ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ నందు అందుబాటులో ఉంది. మీ అమూల్యమైన ఓటు బాలినేని శ్రీనివాసులుకు వేస్తారని ప్రార్థిస్తున్నాను. అని ఆయన కోరారు. దిల్ రాజు మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతుంది. Ace Producer #DilRaju Supports YCP ongole Mla Candidate #BalineniSrinivasReddy pic.twitter.com/d6mtAKZxHH— cinee worldd (@Cinee_Worldd) April 24, 2024 -
తప్పుడు కేసులు పెడితే ఊరుకోను మాజీ మంత్రి బాలినేని ఫైర్
-
పోలీసులు ఓవర్ యాక్షన్ బాలినేని ఆగ్రహం
-
టీడీపీ నేత జనార్దన్ తీరుపై బాలినేని ఆగ్రహం
-
లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న ఫ్యామిలీకి ఎంపీ సీటు..
-
అంతరాలు అంతం
పేదలకూ పెద్దల తరహాలోనే ఇళ్ల పట్టాల విషయంలో ఆ రోజు నేను అధికారులందరినీ ఒకటే అడిగా. మీకు, ఎమ్మెల్యేలకు, ఇతర ప్రముఖులకు ప్రభుత్వం ఎలా ఇస్తోందని అడిగితే దానికి వేరే పద్ధతి ఉందన్నారు. ప్రముఖులకు ఇచ్చే విధానంలో, పూర్తి హక్కులతో రాష్ట్రంలో ప్రతి నిరుపేదకూ ఇంటి పట్టాలివ్వాలని ఆదేశాలివ్వడమే కాకుండా చట్టంలో మార్పులు చేశాం. ఈరోజు అవే పూర్తి హక్కులతో పట్టాలన్నీ రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ నా అక్కచెల్లెమ్మల చేతుల్లో పెడుతున్నాం. - ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పేదలకో న్యాయం.. పెద్దవారికి మరో న్యాయం అనే విధానాన్ని సమూలంగా మారుస్తూ 58 నెలలుగా మనందరి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పేదలకు ఉచితంగా అందించిన ఇళ్ల పట్టాల నుంచి విద్య, వైద్యం, సామాజిక రంగాలలో ఇదే ఒరవడిని అనుసరిస్తూ ధనిక – పేద అంతరాలను తొలగిపోయేలా విప్లవాత్మక చర్యలు చేపట్టినట్లు గుర్తు చేశారు. నాడు – నేడుతో తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ చదువులను పేదింటి పిల్లలకు చేరువ చేయడంతోపాటు ఖరీదైన, నాణ్యమైన వైద్యాన్ని సర్కారీ ఆస్పత్రుల్లో పేదలకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చామన్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కింద లబ్దిదారులకు సర్వ హక్కులతో రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా పది రోజుల పాటు పండుగలా కొనసాగనున్నాయి. రెండు రకాల రూల్సా..? దేశ చరిత్రలో తొలిసారిగా 31 లక్షల మందికి ఇచ్చిన డీ పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి అక్కచెల్లెమ్మల చేతుల్లో పెడుతున్న కార్యక్రమం ఈరోజు ఒంగోలు నుంచి జరుగుతోంది. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 20,840 రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ పంపిణీ చేస్తున్నాం. పేదలందరికీ ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణం, మంచి చేయడంలో గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో అంతా గమనించాలి. పేదల బతుకులు మారి వారి బిడ్డలు గొప్పగా ఎదిగేలా 58 నెలలుగా మన ప్రతి అడుగూ పడింది. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం ఉండటానికి వీల్లేదనే సంకల్పంతో ముందుకు వెళుతున్నాం. ఐఏఎస్‌లు, ఎమ్మెల్యేలు, ఇతర పెద్దలకు ఇచ్చే ప్లాట్లకు విధించే నిబంధనలే పేదలకూ వర్తింపచేయాలనే ఉద్దేశంతో కన్వేయన్స్ డీడ్లతో రిజిస్ట్రేషన్ చేసి అందిస్తున్నాం. రాష్ట్రంలో రెండు రకాల నిబంధనలు ఉన్నట్లు తెలుసుకున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. పేదలకు ఒక రకంగా, పెద్దలకు మరో రకంగా నిబంధనలు ఉండటం సరికాదు. అలాంటి విధానాలపై తిరుగుబాటు చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాం. 58 నెలల ప్రయాణంలో ప్రతి అడుగూ అలాగే వేస్తున్నాం. చదువుల్లో అంతరాన్ని తొలగిస్తూ.. పేదలకో న్యాయం, పెద్దవారికి మరో న్యాయం అనే విధానాన్ని మార్చేయాలనే తపనతో మన అడుగులు పడ్డాయి. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు పేద పిల్లలు గవర్నమెంట్ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదువుతుంటే డబ్బున్న వారి పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా మన గవర్నమెంట్ స్కూళ్లలో నాడు–నేడుతో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంగ్లిష్ మీడియంతో పాటు బైలింగ్యువల్ బుక్స్, బైజూస్ కంటెంట్, 8వ తరగతి నుంచి ట్యాబ్‌లు అందిస్తున్నాం. 6వ తరగతి నుంచి ప్రతి క్లాసు రూములో డిజిటల్ బోధన. ఐఎఫ్‌పీ ప్యానళ్లు అందుబాటులోకి తెచ్చాం. పేద పిల్లలు కాన్వెంట్ డ్రస్, షూస్ వేసుకుని చిరునవ్వుతో ప్రభుత్వ స్కూళ్లకు వెళుతున్నారు. సీబీఎస్ఈ నుంచి ఐబీ విద్యా విధానం స్థాయికి గవర్నమెంట్ బడులను తీసుకెళుతున్నాం. పెద్ద చదువులు చదివే పిల్లలకు వంద శాతం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ విద్యాదీవెన, వసతి దీవెనతో పాటు కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, ఎంఐటీ, హార్వర్డ్ లాంటి ప్రఖ్యాత వర్సిటీల నుంచి ఉచితంగా ఆన్లైన్లో కోర్సులు చదివేలా మనందరి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డబ్బులేని వారి పిల్లలకు, డబ్బున్న వారి పిల్లలకు మధ్య చదువుల పరంగా అంతరాన్ని చెరిపేయడం అంటే ఇదీ అని చెప్పడానికి గర్వపడుతున్నా. పేదలకు, పెద్దలకు ఒకే రకమైన వైద్యం ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే కార్పొరేట్ వైద్యం ఇవాళ పేదలకు ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,000కి మాత్రమే పరిమితం చేసిన పరిస్థితి నుంచి ఇప్పుడు 3,300 ప్రొసీజర్లకు తీసుకెళ్లింది మన ప్రభుత్వమే. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షల వరకు ఉచితంగా విస్తరించింది కూడా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. అంతేకాకుండా శస్త్ర చికిత్సల తరువాత రోగి విశ్రాంతి తీసుకునే సమయంలో నెలకు రూ.5 వేలు చేతిలో పెడుతూ ఆరోగ్య ఆసరా తెచ్చింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష ద్వారా ఉచితంగా వైద్యంతోపాటు మందులు కూడా అందుతోంది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. నేను చెప్పే ప్రతి మాటా కూడా ఆలోచన చేయమని అడుగుతున్నా. గతానికి, ఇప్పటికి మధ్య తేడాను గమనించండి. పేదలకు, పెద్దలకు ఒకే రకమైన వైద్యం అందించడం అంటే ఇదీ. బడుగు, బలహీన వర్గాలకు పదవులు గతంలో పెత్తందార్ల మనుషులు మాత్రమే అనుభవించిన నామినేటెడ్ పదవులను చట్టం చేసి ఏకంగా 50 శాతం బడుగు, బలహీన వర్గాల చేతుల్లో పెట్టింది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. సామాజిక అంతరాలను చెరిపేయడం అంటే ఇదీ. సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత అంటే ఇదీ. పేదల ఆంధ్రప్రదేశ్ వేరు... డబ్బున్న వారి ఆంధ్రప్రదేశ్ వేరు అనే భావాలను పూర్తిగా తుడిచి వేస్తూ, పేదలకో న్యాయం – డబ్బున్న వారికో న్యాయం అనే విధానాలను రద్దు చేస్తూ మన అడుగులు పడ్డాయి. సచివాలయాల్లో సర్టిఫైడ్ కాపీలు.. రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ వల్ల ఆస్తిపై అక్కచెల్లెమ్మల హక్కులు భద్రంగా ఉంటాయి. దొంగ సర్టిఫికెట్లు సృష్టించేందుకు వీలుండదు. ఎప్పుడు పడితే అప్పుడు రద్దు చేయలేరు. సచివాలయాల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆస్తికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీలు ఎన్నిసార్లైనా పొందవచ్చు. అందులో హక్కుదారు మీరే అన్న విషయం సచివాలయాల్లో శాశ్వతంగా, భద్రంగా ఉంటుంది. సరిహద్దు రాళ్లతో స్థలం వద్ద అక్కచెల్లెమ్మల ఫొటో తీసి జియోట్యాగింగ్ చేసి ఇస్తున్నాం కాబట్టి ఎవరూ కబ్జా చేయలేరు. పదేళ్లు కాగానే ఆ పట్టాలను అమ్ముకునేందుకు, వారసత్వంగా ఇచ్చేందుకు, గిఫ్ట్‌గా ఇచ్చేందుకు పట్టా భూములున్న వారితో సమానంగా ఆటోమేటిక్‌గా హక్కులు సంక్రమిస్తాయి. ఆ తేదీ వివరాలతో సహా స్పష్టంగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో పొందుపరిచాం. ఎన్ఓసీ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. బ్యాంకు రుణాలు కావాలంటే సులభంగా తక్కువ వడ్డీకే అక్కచెల్లెమ్మలకు అందుతాయి. నా అక్కచెల్లెమ్మలు, పేదలకు ఇచ్చే స్థలాలు, హక్కులు, ఆత్మగౌరవం గురించి ఇంతగా ఆలోచన చేస్తున్న ప్రభుత్వాన్ని ఎప్పుడైనా చూశారా? అక్కచెల్లెమ్మలకు మంచి అన్నగా, మంచి తమ్ముడిగా ముఖ్యమంత్రి స్థానంలో వారి బిడ్డ ఉన్నాడు కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతున్నాం. ఇంతకన్నా దారుణం ఉంటుందా? ఇవన్నీ చూస్తుంటే వంద మంది సినిమా విలన్ల కంటే, పురాణాల్లో రాక్షసులందరి కంటే ఒక్క చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ అనిపిస్తుంది. చివరికి అమరావతిలో మనం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందంటూ ఆ పెద్దమనిషి నిస్సిగ్గుగా కోర్టుల్లో కేసులు వేసి తన లాయర్లతో వాదించాడు. ఇంత అమానుషంగా ప్రవర్తించిన వ్యక్తి జంకు లేకుండా ప్రజల్లో తిరుగుతున్నాడంటే ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం వద్దని వాదిస్తే తల్లిదండ్రులంతా గట్టి గుణపాఠం చెబుతారనే భయం లేకుండా చంద్రబాబు పాపిష్టి రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా? ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని దారుణమైన వ్యాఖ్యలు చేసి కూడా బరితెగించి తిరుగుతున్నారంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా? బీసీల తోకలు కత్తిరిస్తా.. ఖబడ్దార్! అని వ్యాఖ్యానిస్తే బీసీలంతా బుద్ధి చెబుతారన్న భయం కూడా లేకుండా ఉండగలుగుతున్నాడంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా? రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను మోసగించిన ఈ మాయలోడు ఏ జంకూ గొంకూ లేకుండా ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాడంటే ఇంతకన్నా దారుణం ఉందా? 650 వాగ్దానాలిచ్చి కనీసం 10 శాతం కూడా అమలు చేయకుండా ఎన్నికలొచ్చేసరికి నిస్సిగ్గుగా మళ్లీ కొత్త మేనిఫెస్టోతో సిద్ధమయ్యాడంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా? మన ఖర్మ ఏమిటంటే ఇలాంటి వ్యక్తులతో ఈరోజు మనం రాజకీయాలు చేస్తున్నాం. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, మంత్రులు ఆదిమూలపు సురే‹Ù, ధర్మాన ప్రసాదరావు, మేరుగు నాగార్జున, ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర రెడ్డి, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్, ఐజీ రామకృష్ణ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, సీనియర్ ఐఏఎస్ ముత్యాలరాజు, కలెక్టర్ ఏఎస్.దినేష్‌కుమార్, ఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెంటు కూడా ఇవ్వకపోగా బాబు కుట్రలు.. 2020 ఉగాది నాటికే ఈ ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి అక్కచెల్లెమ్మలకు ఇవ్వాలనుకున్నా కొందరు రాక్షసుల మాదిరిగా అవరోధాలు సృష్టించారు. అధికారంలో ఉండగా పేదవాడికి ఒక్క సెంటు స్థలం ఇచ్చిన పాపానపోని చంద్రబాబు ఇవాళ మనం ఇస్తుంటే అడ్డుపడి ఆయన మనుషుల ద్వారా ఏకంగా 1,191 కేసులు దాఖలు చేశారు. వీటిని అధిగమించి ఇవాళ ఒక్క ఒంగోలులోనే 21 వేల మంది పేదలకు సర్వ హక్కులతో ఇళ్ల పట్టాలిస్తున్నాం. ఒంగోలు అర్బన్‌లో నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం యర్రజర్ల హిల్స్‌లో 866 ఎకరాలను 2020లోనే గుర్తించి 24 వేల ప్లాట్లతో లే అవుట్లు సిద్ధం చేశాం. ఈ గొప్ప కార్యక్రమానికి అడ్డుపడి చంద్రబాబు, ఆయన మనుషులు కోర్టులో కేసు వేశారు. ఒక్క ఒంగోలే కాకుండా ఏ జిల్లాలో చూసినా చంద్రబాబు పేదలకు ఇళ్ల స్థలాలివ్వలేదు. మనం ఇస్తుంటే ఆయన అసూయ దాగటం లేదు. ఇవన్నీ దాటుకుంటూ మీ బిడ్డ అడుగులు వేశాడు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మల్లేశ్వరపురం, ఎన్.అగ్రహారం, వెంగముక్కపాలెం, యర్రజెర్ల గ్రామాలకు చెందిన 342 మంది రైతన్నల దగ్గర నుంచి 536 ఎకరాల భూమిని సేకరించేందుకు రూ.210 కోట్లు ఖర్చు చేసి ఇళ్ల పట్టాలిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మరో రూ.21.33 కోట్లు లే అవుట్ అభివృద్ధి కోసం వ్యయం చేస్తున్నాం. ఇదే ఎన్.అగ్రహారం, మల్లేశ్వరపురంలో 31 బ్లాక్స్‌లో, వెంగముక్కపాలెం, యర్రజెర్లలో మరో 32 బ్లాక్స్‌తో జగనన్న మోడల్ టౌన్ షిప్స్‌ను పూర్తి మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తున్నాం. ఎస్టీపీ ప్లాంట్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, వాటర్ సప్లయ్ కోసం రూ.247 కోట్లు ఖర్చు చేసేలా ఆదేశాలు ఇచ్చాం. ఒంగోలుకు మంచి చేస్తూ పట్టణంలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు మరో రూ.339 కోట్లతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్‌కు కూడా ఈరోజే శంకుస్థాపన చేస్తున్నాం. బైబై బాబు అంటున్న బాబు సతీమణి చంద్రబాబును నేను ఇవన్నీ ప్రశి్నస్తే నన్ను సవాల్ చేస్తున్నావా? అంటాడే కానీ ఇంటింటికీ ఫలానా మంచి చేశాను అని మాత్రం చెప్పడు. గ్రామ గ్రామానికీ ఇదిగో ఈ ఈ మంచి చేశానని చెప్పలేడు. జగన్ మాదిరిగా బటన్ నొక్కి రూ.2.55 లక్షల కోట్లు పేదల ఖాతాల్లోకి జమ చేశాననే మాటలు ఈ పెద్దమనిషి నోట్లో నుంచి రావు. ఆయన చేయలేదు కాబట్టే చెప్పలేడు. ఒకవైపు ఎన్నికలకు మనమంతా సిద్ధం అంటుంటే.. మరోవైపు చంద్రబాబు భార్య మా అయన సిద్ధంగా లేరని అంటున్నారు. ఏకంగా కుప్పంలోనే బైబై బాబు.. అంటూ ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తున్నాయి. ఇలాంటి చంద్రబాబును రాష్ట్రంలో ప్రజలెవరూ సమర్థించడం లేదు. కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించడంలేదు. ఏపీకి రానివారు, సొంత ఊరు ఏదంటే తెలియని వారు, రాష్ట్రంలో ఓటే లేని వారు, ఇక్కడ దోచుకున్నది పంచుకోవడానికి అలవాటైన నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మాత్రమే చంద్రబాబును సమర్థిస్తారు. నాకు ఆయన మాదిరిగా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడి మద్దతు లేవు. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడాలని కోరుతున్నా. నేను పైన దేవుడిని, కింద మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నా. మధ్యలో దళారులను, బ్రోకర్లను నమ్ముకోలేదు. అడ్డంకులను అధిగమించి.. అధికారంలోకి రాగానే అందరికీ స్థలాలు ఇవ్వడానికి 71,811 ఎకరాలను సేకరించి పంపిణీ చేశాం. 17,005 లే అవుట్లలో అంతర్గత రోడ్లు, డ్రెయినేజీలు, కరెంటు, మంచినీరు, పార్కులు, కామన్ ఏరియాలు, ఇతర సదుపాయాల కోసం రూ.32 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. 22 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించగా 8.90 లక్షల ఇళ్లను ఇప్పటికే పూర్తి చేశాం. మిగతావి వివిధ దశల్లో వేగంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఆ ఇంటి స్థలాల విలువ ప్రాంతాన్ని బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఉంది. ఒంగోలులో అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి స్థలం విలువ గజం రూ.10 వేల పైచిలుకే ఉన్నట్లు ఇంతకు ముందే అధికారులు చెప్పారు. ఇక్కడ రెండు లే అవుట్లలో పేదలకు ఇచ్చిన ఒక్కో స్థలం విలువే రూ.6 లక్షలు కాగా రూ.2.70 లక్షలు ఖర్చు చేసి ఇళ్లు కట్టించి ఇస్తున్నాం. రోడ్లు, డ్రెయినేజీ, కరెంటు సదుపాయాల కోసం మరో రూ.లక్ష దాకా వెచ్చిస్తున్నాం. ఇలా ఇల్లు పూర్తయ్యే సరికే ఒక్కో ఇంటి విలువ రూ.10 లక్షలు పైమాటే ఉంటుందని చెప్పడానికి సంతోషపడుతున్నా. అక్కచెల్లెమ్మలను మిలియనీర్లుగా చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో రూ.7 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా విలువైన స్థిరాస్తిని పెడుతున్నాం. తద్వారా ఏకంగా రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు కేవలం ఈ ఒక్క పథకం ద్వారా నా అక్కచెల్లెమ్మల కోసం ఖర్చు చేశామని చెప్పేందుకు గర్వపడుతున్నా. మహిళలకు ఆర్థిక సాధికారత, భద్రత పేదింటి అక్కచెల్లెమ్మల సాధికారత కోసం వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, అమ్మ ఒడి, ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాలతోపాటు దిశ యాప్, సచివాలయంలో మహిళా పోలీసుల ద్వారా అండగా నిలబడ్డాం. నా అక్కచెల్లెమ్మలకు ఆర్థిక సాధికారత, భద్రత రెండూ అందుతున్నాయి. ఇవన్నీ గతంలో లేవు. మన పథకాల ఫలితంగా మహిళా ఆర్థిక సాధికారత పెరిగింది. అంతరాలు తగ్గుతున్నాయని నేను చెప్పడం కాదు.. నిన్ననే విడుదలైన జాతీయ గణాంకాలే చెబుతున్నాయి. ఆర్థిక అంతరాలను చెరిపేయడం అంటే ఇదీ. గత 58 నెలల్లో డీబీటీతో ఏకంగా రూ.2.55 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేయగా ఇందులో 75 శాతం పైచిలుకు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అందించగలిగాం. -
పేదల కోసం పెత్తందారులపై పోరాటాలెన్నో చేశాం: సీఎం జగన్
ప్రకాశం, సాక్షి: చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నామని.. తద్వారా ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలు ఎన్.అగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందు ఒంగోలు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారాయన. .. ‘‘మరో మంచి పనికి ఒంగోలు నుంచి శ్రీకారం చుడుతున్నాం. ప్రతీ అడుగు పేదల సంక్షేమం కోసం వేశాం. ఈ 58 నెలల కాలంలో పేదల బతుకులు మారాలని అడుగులు వేశాం. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నాం. ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నాం. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని అన్నారాయన. .. పేదల కోసం పెత్తందారులపై అనేక పోరాటాలు చేశామని సీఎం జగన్ ఒంగోలు సభలో గుర్తు చేశారు. అలాగే ఇంటింటికీ తలుపు తట్టి సేవలు అందిస్తున్నామని.. 58 నెలల పాలనలో మొత్తంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారాయన. వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం ఆరోగ్యశ్రీ రిధిని రూ.25 లక్షలకు పెంచాం ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లను 3,300కు పెంచాం ఆస్పత్రిలో బిల్లు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు రోగులు కోలుకునే వరకు ఆసరాగా ఉంటున్నాం గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించండి -
కుప్పం నుంచే చంద్రబాబు బైబై అంటున్నాడు: సీఎం జగన్
సాక్షి, ఒంగోలు: రాష్ట్రంలో ఒక్క పేదవాడికీ చంద్రబాబు సెంటు స్థలం ఇవ్వలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కానీ, మనం మంచి చేస్తుంటే కోర్టులకు వెళ్లి రాక్షసుల్లా అడ్డుకున్నారు. పేదలకు మంచి జరగకుండా కోర్టులో 1191 కేసులు వేశారు. చంద్రబాబు కుట్రలను అధిగమించి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. ఇప్పటికీ కూడా ఇళ్ల స్థలాలను అడ్డుకునేందుకు చంద్రబాబు కేసులు వేశారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ నేడు ఒంగోలులో 21వేల మంది అక్కాచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అలాగే, ఒంగోలులో మంచి నీటి పథకం కూడా ప్రారంభించారు. రూ.231 కోట్ల విలువ చేసే భూమిని అక్కచెల్లెమ్మలకు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘మన పేదలకు మంచి మనం మంచి చేస్తుంటే చంద్రబాబులో అసూయ పుట్టుకొస్తోంది. వంద మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందటాడు. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అని చంద్రబాబు అవమానించాడు. ఇన్ని కుట్రలు చేసి కూడా చంద్రబాబు ఇంకా బరితెగించి రాజకీయాల్లో ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. రుణమాఫీ పేరుతో పొదుపు సంఘాల మహిళలను చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు 650 హామీలిచ్చి 10 శాతం కూడా అమలు చేయలేదు. చంద్రబాబు నిసిగ్గుగా కొత్త మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వస్తున్నారు. చంద్రబాబు దారుణాలు ఎల్లో మీడియాకు కనిపించవు. మన ప్రభుత్వంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి అబద్దాలు రాస్తున్నారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా ఉందా?. చంద్రబాబులాంటి వారితో రాజకీయాలు భ్రష్టు పట్టాయి. ఏం మంచి చేశాడో చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఏమీ లేవు. మనం సిద్ధం అంటుంటే చంద్రబాబు సతీమణి సిద్ధంగా లేమంటున్నారు. కుప్పం నుంచే బైబై బాబు అంటున్నారు. చంద్రబాబును సమర్థించే వాళ్లు ఏపీలో లేని వాళ్లు మాత్రమే. చంద్రబాబు మాదిరి నాకు నాన్‌రెసిడెంట్స్ ఆంధ్రాస్ మద్దతు లేదు. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా ఉండండి. దళారులు, బ్రోకర్లను నేను నమ్ముకోలేదు. దేవుడి ఆశీస్సులు, ప్రజలే నా నమ్మకం. ఇదే సమయంలో.. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 58 నెలల కాలంలో పేదల బతుకులు మారాలని అడుగులు వేశాం. ప్రతీ అడుగు పేదల సంక్షేమం కోసం వేశామన్నారు. చరిత్రలోనే తొలిసారిగా పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ జరిగాయి. ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకు సర్వహక్కులు కల్పిస్తున్నాం. పేదల కోసం పెత్తందారులపై అనేక పోరాటాలు చేశామన్నారు. విద్యావ్యవస్థలో మార్పులు.. మన ప్రభుత్వ పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. మన ప్రభుత్వంలో పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు. విద్యార్థుల కోసం బైలింగ్వల్ పుస్తకాలు అందుబాటులోకి తెచ్చాం. నాడు-నేడుతో ప్రభుత్వ స్కూల్స్ రూపురేఖలు మార్చాం. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ ఇచ్చాం. ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ విద్యాబోదన. ప్రభుత్వ స్కూల్స్‌లో ఐబీ విధానం తెచ్చాం. విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు తెచ్చాం. మన విద్యార్థులు అంతర్జాతీయ యూనివర్సిటీల్లో చదివేలా అడుగులు వేశాం. పేదలకు కార్పొరేట్ వైద్యం.. పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25లకు పెంచాం. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ 3300లకు పెంచాం. వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. ఆసుపత్రిలో బిల్లు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు. రోగులు కోలుకునేవరకు ఆరోగ్య ఆసరా కింద సాయం. పేదల ఇంటి వద్దకే ఫ్యామిలీ డాక్టర్ విధానం తెచ్చాం. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి మధ్య తేడాను గమనించండి. రాష్ట్రంలో అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు తెచ్చాం. మన ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది. ఆర్థిక అంతరాలను తొలగించాం. పేదలకు డీబీటీ ద్వారా రూ.2లక్షల 55వేల కోట్లు అందించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 75 శాతం లబ్ధి చేకూర్చాం. మన ప్రభుత్వంలో బలహీనవర్గాలకు నామినేటెడ్ పదవులు ఇచ్చాం. గతంలో పెత్తందారులకు మాత్రమే నామినేటెడ్ పదవులు ఇచ్చేవారు. పేదలకు పట్టాలు.. రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వడం వల్ల అక్కచెల్లెమ్మలకు ఆస్తి మీద పూర్తి హక్కు ఉంటుంది. భవిష్యత్‌లో రిజిస్ట్రేషన్లను క్యాన్సిల్ చేసే అవకాశం ఎవరికీ ఉండదు. రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వడం వల్ల కబ్జా చేసేందుకు కూడా వీలుపడదు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండటం వల్ల సులభంగా బ్యాంక్ రుణాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పేదల ఆత్మగౌరవం గురించి గత ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా 17,005 జగనన్న కాలనీ లే అవుట్లు. 60వేల కోట్లతో 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు. రాష్ట్రవ్యాప్తంగా 71,811 ఎకరాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతోంది. మౌలిక సదుపాయాల కోసం ప్రతీ ఇంటికి లక్ష ఖర్చు చేశాం. అక్కచెల్లెమ్మలను లక్షాధికారులు కాదు.. మిలియనీర్లను చేస్తున్నాం. ప్రాంతాన్ని బట్టి ఇంటి స్థలం విలువ 2.5లక్షల నుంచి 15లక్షల వరకు ఉంటుంది. ఒంగోలులో పేదల ఇళ్ల కోసం 210 కోట్లతో భూమి కొనుగోలు చేశాం. మరో 21 కోట్లతో లేఅవుట్ల అభివృద్ధి చేశాం. ఒంగోలులో తాగునీటి కోసం రూ.334 కోట్లతో పనులకు శంకుస్థాపన చేశాం. జగనన్న టౌన్షిప్లో మౌలిక వసతుల కోసం రూ.247 కోట్లు ఖర్చు చేశాం’ అని తెలిపారు. -
31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం: సీఎం జగన్
CM Jagan Public Meeting At Ongole Updates ప్రకాశం జిల్లా ఒంగోలులో ముగిసిన పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఒంగోలు చరిత్రలో సువర్ణాధ్యాయం 21 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలతో భూ బదిలీ పత్రం అందజేసిన సీఎం జగన్ నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పంపిణీలో భాగంగా ఈ కార్యక్రమం ఇది దేశంలోనే ఒక చరిత్ర: సీఎం జగన్ పేదరికం నుంచి పేదలు బయటపడాలి: సీఎం జగన్ ఇళ్ల పట్టాలతో పాటు రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నాం: సీఎం జగన్ ఈ స్థలాలపై బ్యాంకు రుణాలు కూడా తీసుకోవచ్చు గ్రామ, వార్డు సచివాలయాల్లోనే సర్టిఫైడ్ కాపీలు తీసుకోవచ్చు రాష్ట్రవ్యాప్తంగా 17,005 జగనన్న లేఅవుట్లు ఆస్తి మీద అక్కచెల్లెమ్మలకు హక్కు కల్పిస్తున్నాం అక్కచెల్లెమ్మలను లక్షాధికారుల్ని కాదు.. మిలియనీర్లను చేస్తున్నాం వాళ్లు సిద్ధంగా లేరంట!: సీఎం జగన్ చురకలు చంద్రబాబు లాంటి వారితో రాజకీయాలు భ్రష్టు పట్టాయి మనం సిద్ధం అంటుంటే.. చంద్రబాబు సతీమణి సిద్ధంగా లేం అంటున్నారు కుప్పం నుంచే బైబై బాబు అంటున్నారు చంద్రబాబును కుప్పం ప్రజలు కూడా నమ్మట్లేదు చంద్రబాబు మాదిరి నాన్ రెసిడన్స్ ఆంధ్రాస్ మద్దతు నాకు లేదు బాబులా దళారులను, బ్రోకర్లను నేను నమ్ముకోలేదు నేను నమ్ముకుంది దేవుడు.. ప్రజల్ని మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలబడండి చంద్రబాబు దుర్మార్గం ఏపాటిదంటే.. చంద్రబాబు రాజకీయ రాక్షసుడు వంద సినిమాల విలన్ల దుర్మార్గం కంటే.. చంద్రబాబు దుర్మార్గం ఎక్కువ ఇళ్ల స్థలాల పంపిణీ జరగకుండా 1191 కేసులు వేయించాడు తన హయాంలో సెంటు భూమి కూడా ఇవ్వలేదు ఆ కుట్రలు అధిగమించి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తే.. కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందట! ఎస్సీలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా? అని బాబు అన్నాడు చంద్రబాబు 650 హామీలిచ్చి.. 10 కూడా నెరవేర్చలేదు నిస్సిగ్గుగా ఇప్పుడు కొత్త మేనిఫెస్టోతో వస్తున్నాడు ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం గతంలో పెత్తందారులకు మాత్రమే నామినేటెడ్ పదవులు మన ప్రభుత్వంలో బలహీన వర్గాలకు పదవులు గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించండి పేదల ఆత్మగౌరవం గురించి గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు తెచ్చాం మన ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది పేద మహిళల సాధికారత కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాం ఆర్థిక అంతరాలు తొలగించాం రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వడం వల్ల అక్కచెల్లెమ్మలకు ఆస్తి మీద పూర్తి హక్కు భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేసే అవకాశం ఎవరికీ ఉండదు రిజిస్ట్రేషన్ పట్టాలు ఉండడం వల్ల కబ్జాలు కుదరదు గ్రామ సచివాలయాల నుంచి సర్టిఫైడ్ కాపీలు ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం గతంలో పెత్తందారులకు మాత్రమే నామినేటెడ్ పదవులు మన ప్రభుత్వంలో బలహీన వర్గాలకు పదవులు గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించండి పేదల ఆత్మగౌరవం గురించి గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు తెచ్చాం మన ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది పేద మహిళల సాధికారత కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాం ఆర్థిక అంతరాలు తొలగించాం రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వడం వల్ల అక్కచెల్లెమ్మలకు ఆస్తి మీద పూర్తి హక్కు భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేసే అవకాశం ఎవరికీ ఉండదు రిజిస్ట్రేషన్ పట్టాలు ఉండడం వల్ల కబ్జాలు కుదరదు గ్రామ సచివాలయాల నుంచి సర్టిఫైడ్ కాపీలు ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం చికిత్స కోసం వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షలకు పెంచాం ప్రొసీజర్స్‌ను 3,300కు పెంచాం పేదల ఇంటి వద్దకే ఫ్యామిలీ డాక్టర్ రోగులు కోలుకునేంత వరకు ప్రభుత్వమే ఆసరా పేదల సంక్షేమం కోసం ప్రతీ అడుగు వేశాం పోటీ ప్రపంచంలో నాణ్యమైన విద్య పేదలకు నాణ్యమైన విద్య అందించాలనే ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాం ఇంగ్లీష్, తెలుగు మీడియాల్లో పుస్తకాలు అందిస్తున్నాం ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాం కార్పొరేట్ స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ బడుల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌లు ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం ఒంగోలు నుంచి మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం పేదల కోసం పెత్తందారులతో ఎన్నో పోరాటాలు చేశాం 58 నెలల కాలంలో ప్రతీ అడుగు పేదల మంచి కోసమే వేశాం పాలనతో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం ఇంటింటికే ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకు హక్కులు కల్పిస్తున్నాం పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు ఒక న్యాయం ఉండకూడదనే ఈ నిర్ణయం దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నాం. ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నాం. మాజీ మంత్రి బాలినేని ప్రసంగం పేదలకు ఇళ్ల పట్టాలు రాకుండా కోర్టుకు వెళ్లారు? పేదవాడికి మంచి జరగడం టీడీపీకి ఇష్టం లేదు టీడీపీ హయాంలో ఒక్క పేదవాడికైనా ఇల్లు ఇచ్చారా? ఒంగోలులో సీఎం జగన్.. ఎన్.అగ్రహారంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించిన సీఎం జగన్ సీఎం జగన్ వెంట స్థానిక ప్రజాప్రతినిధులు ఒంగోలు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన ఒంగోలులో సీఎం జగన్‌కు ఘన స్వాగతం జగనన్న పాలనలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కాసేపట్లో ఎన్.అగ్రహారంలో పేదలకు ఇళ్ల పట్టాల అందజేత కార్యక్రమం బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేత సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ సాక్షితో.. మాజీ మంత్రి బాలినేని ►ఒంగోలు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ కాసేపట్లో పేదలకు ఇళ్ల పట్టా పంపిణీ 21 వేలమంది అక్కాచెల్లెమ్మలకు పంపిణీ చేయనున్న సీఎం జగన్ ఒంగోలులో మంచి నీటి పథకం కూడా ప్రారంభం ► కాసేపట్లో ఒంగోలుకు చేరుకోనున్న సీఎం జగన్ సీఎం జగన్ ఒంగోలు పర్యటన ప్రకాశం జిల్లా ఒంగోలు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో ఎన్.అగ్రహారం చేరుకోనున్న సీఎం జగన్ 21వేల మంది అక్కచెళ్లెమ్మలకు ఇళ్లపట్టాలు పంపిణీ సీఎం జగన్ చేతుల మీదుగా ఒంగోలు మంచినీటి పథకం పనులు ప్రారంభం ఇళ్ల పట్టాల్లో చారిత్రక ఘట్టం పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ 31.19 లక్షల ఇళ్ల పట్టాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మరో చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుడుతోంది. దేశంలోనే తొలిసారిగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తోంది. ఇందుకోసం ఆ పట్టాలను వారి పేరు మీద ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు కన్వేయన్స్ డీడ్స్ (సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం) అందించనుంది. 20,840 మంది అక్కచెల్లెమ్మలకు సీఎం జగన్ చేతుల మీదుగా.. ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 20,840 మంది అక్కచెల్లెమ్మలకు సర్వ హక్కులతో రిజిస్టర్ చేసిన కన్వేయన్స్ డీడ్లు, ఇళ్లు మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. మల్లేశ్వరపురం, అగ్రహారం, యరజర్ల, వెంగముక్కల పాలెం గ్రామాల్లో 536.11 ఎకరాల భూసేకరణ ద్వారా రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్ డీడ్లను లబ్దిదారులకు అందించనున్నారు. సచివాలయాల్లో సర్టిఫైడ్ కాపీ ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధారణమే అయినా ఒకేసారి 30 లక్షల మందికి అందించడం, వాటిని సర్వ హక్కులతో రిజిస్ట్రేషన్ చేస్తుండడం దేశంలోనే ప్రథమం. గతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినా వాటిపై పేదలకు హక్కులు ఉండేవి కాదు. “డి’ పట్టాలు కావడంతో అనుభవించడం మినహా హక్కులు లేనందున అవసరానికి వినియోగించుకునే అవకాశం ఉండేది కాదు. ఈ సమస్యను పరిష్కరిస్తూ ఇళ్ల పట్టాలు పొందిన పదేళ్ల తర్వాత వాటిపై లబ్ధిదారులు సర్వ హక్కులు పొందేలా ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. ఇప్పుడు దాని ప్రకారమే ఇళ్ల స్థలాలకు సంబంధించిన యజమానులకు కన్వేయన్స్ డీడ్లు అందిస్తోంది. వారి పేరు మీద ఆ పట్టాలను రిజిస్ట్రేషన్ చేస్తోంది. ఈ డీడ్లు పదేళ్ల గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్‌గా సేల్ డీడ్లుగా మారతాయి. అప్పుడు ప్రభుత్వం జోక్యం లేకుండానే నేరుగా ఆ స్థలాలను అమ్ముకోవడానికి, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. విలువైన స్థిరాస్తి.. ఇంటి స్థలాన్ని ఉచితంగా ఇవ్వడమే కాకుండా గృహ నిర్మాణానికి రూ.1.80 లక్షల చొప్పున ప్రభుత్వం ఇస్తోంది. మరోవైపు పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం ఇప్పిస్తోంది. ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీల్, మెటల్ ఫ్రేమ్స్, ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందించడంతో ఇంకో రూ. 40 వేల మేర లబ్ది చేకూరుస్తోంది. మొత్తంగా ఒక్కో లబ్దిదారుడికి రూ. 2.70 లక్షల మేర ప్రయోజనం దక్కుతోంది. మౌలిక వసతుల కల్పనతో ప్రతి ఇంటికి సగటున మరో రూ.లక్ష వరకు ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోంది. తద్వారా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు ప్రాంతాన్ని బట్టి ఇంటి విలువ రూపేణా కనీసం రూ. 6 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విలువ చేసే విలువైన స్థిరాస్తిని సమకూర్చుతోంది. 17,005 లేఅవుట్లు.. 71,811 ఎకరాలు ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కోసం దేశంలో ఏ రాష్ట్రం ఖర్చు చేయని రీతిలో సీఎం జగన్ ప్రభుత్వం నిధులు వెచ్చించింది. 71,811 ఎకరాలను సేకరించి 31.19 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇందుకోసం 17,005 లేఅవుట్లు నిర్మించింది. 71,811 ఎకరాల్లో ప్రైవేట్‌గా 25,374 ఎకరాలు సేకరించారు. ఇందుకు భూసేకరణకు రూ.11,343 కోట్లు ఖర్చు చేసింది. పేదలకిచ్చిన ఇళ్ల స్థలాల కోసం ఇంత భారీగా భూసేకరణ చేసిన ప్రభుత్వం మరొకటి లేదు. -
ఒంగోలు: సీఎం జగన్ సభకు భారీ ఏర్పాట్లు
-
23న ఒంగోలుకు సీఎం జగన్
ఒంగోలు అర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 23వ తేదీన ఒంగోలు రానున్నారు. నగరంలోని 22వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా నగర శివారు అగ్రహారం వద్ద నిర్వహించనున్న సభ ఏర్పాట్లను సోమవారం మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, కలెక్టర్ దినేష్‌కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం ద్వారా అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి తీరుతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. మల్లేశ్వరపురం, అగ్రహారం, వెంగముక్కలపాలెం గ్రామాల్లోని జగనన్న టౌన్‌షిప్‌లలో అర్హులైన 22వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని వివరించారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోందని చెప్పారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని ఆలోచనల మేరకు నగర పరిధిలో అర్హులైన 22 వేల మంది పేదలకు సీఎం చేతుల మీదుగా చేపడుతున్న పట్టాల పంపిణీ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో జగనన్న టౌన్‌షిప్‌లను అర్బన్ డెవలప్మెంట్ టౌన్‌గా ఏర్పాటు చేయడంతోపాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పింస్తామన్నారు. కలెక్టర్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మల్లేశ్వరపురం, అగ్రహారం, వెంగముక్కలపాలెం గ్రామాల్లో 536 ఎకరాలు భూసేకరణ చేశామన్నారు. పట్టాల పంపిణీ పూర్తి పారదర్శకంగా చేపట్టడంతోపాటు నగరంలోని 70 సచివాలయాల పరిధిలో కన్వేయడ్ డీడ్ ప్రక్రియ జరుగుతున్నట్లు తెలిపారు. ఆర్డీవో విశ్వేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఒంగోలులో సీఎం జగన్ పర్యటన..ఏర్పాట్లను పరిశీలించిన బాలినేని
-
టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా పట్టాలిచ్చి తీరతాం: బాలినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: ఈ నెల 20న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంగోలు పర్యటించనున్నట్లు మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అదే రోజున నగరంలో 25 వేల మంది పేదల కోసం సిద్ధం చేసిన ఇంటి స్థలాలను సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు అందిస్తామని బాలినేని తెలిపారు. అర్బన్ లేఔట్‌ను బాలినేని శుక్రవారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతల తీరుపై మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పట్టాలు అడ్డుకునేందుకు కోర్టులో పిల్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో పేదలకు పట్టాలు ఇవ్వకుండా టీడీపీ నేతలు పదే పదే కోర్టుకు వెళ్తున్నారని.. వారికి ఇష్టం లేకపోతే పోటీ నుంచి తప్పుకుంటానే తప్ప ఇంటి పట్టాలు ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని బాలినేని స్పష్టం చేశారు. ఇప్పటికే ఒకచోట కోర్టుకెళ్లి ఇంటి స్థలాలను అడ్డుకున్న టీడీపీ.. మరోసారి కోర్టులో పిల్ వేయడంపై బాలినేని అసహన వ్యక్తం చేశారు. ఇంత నీచ రాజకీయం నా జీవితంలో చూడలేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: చిల్లర పాలిటిక్స్ చేస్తున్న వ్యక్తి వంశీ: ఎంపీ ఎంవీవీ ఫైర్ -
చెక్ బౌన్స్ కేసులో గణేశ్‌కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష
-
బండ్లగణేశ్‌కు బిగ్ షాక్.. ఆ కేసులో జైలు శిక్ష!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతకు బండ్లగణేశ్‌కు జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పు వెలువరించింది. అంతే కాకుండా శిక్షతో పాటు బండ్లగణేశ్‌కు రూ.95 లక్షల జరిమానా విధించింది. జరిమానాతో పాటు కోర్టు ఖర్చులు కూడా బండ్ల గణేష్ చెల్లించాలంటూ తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం ఈ టాపిక్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. 2019లో మద్దిరాలపాడుకు చెందిన జానకిరామయ్య అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేశ్ రూ. 95 లక్షల అప్పు తీసుకున్నారు. అయితే జానకి రామయ్య మరణాంతరం ఆయన తండ్రికి బండ్ల గణేశ్ రూ.95 లక్షల చెక్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో జానకి రామయ్య తండ్రి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. గతంలో ఆరునెలల జైలు శిక్ష గతంలో 2017లో సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల 550 రూపాయల జరిమానా కూడా విధించింది. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు కోర్ట్ ఈ శిక్ష విధించింది. కానీ వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. కాగా.. ఎన్టీఆర్, కాజల్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమాను బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు. చిన్న చిన్న పాత్రలతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్, రవితేజ హీరోగా తెరకెక్కిన ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారాడు. తరువాత వరుసగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించారు. -
ఎంపీ సీటుపై వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్
-
ప్రకాశించిన సాధికారత
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు నగరంలో సామాజిక సాధికారత ప్రకాశించింది. సామాజిక చైతన్యం ఉవ్వెత్తున ఎగిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు రోడ్లపైకి చేరి పండుగ చేసుకున్నారు. సీఎం వైఎస్ జగన్ అందించిన చేయూతతో తాము సాధించిన సాధికారతను ప్రతిబింబిస్తూ నగరంలోని బడుగు, బలహీనవర్గాలు బుధవారం పెద్ద ఎత్తున సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించాయి. ఒకప్పుడు అవమానాలకు గురైన తాము సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ భరోసాతో తలెత్తుకు తిరుగుతున్నామంటూ నినదించారు. జోరు వానలోనూ బస్సు యాత్రకు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. నగర వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. భారీ గజమాలలు, సంప్రదాయ నృత్యాలు, డప్పుల మోతలు, బాణాసంచాతో జై జగన్ నినాదాలతో ఒంగోలు నగరం మార్మోగింది. కర్నూలు బైపాస్ రోడ్డు నుంచి అద్దంకి బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వరకు ర్యాలీ సాగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కుల వృత్తులు ప్రతిబింబించేలా శకటాలను యాత్రలో ప్రదర్శించారు. అనంతరం ఒంగోలు బాపూజీ కాంప్లెక్స్ సెంటర్లో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. సభలో మాట్లాడుతున్న మంత్రి మేరుగు నాగార్జున ఇదో సామాజిక విప్లవం: మంత్రి విడదల రజిని సభలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ తెచ్చిన సామాజిక సాధికారతకు ఈ వేదికపై ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మంత్రులు, మేయరు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర నేతలే నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. మంత్రివర్గం నుంచి అన్ని పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే సీఎం జగన్ పెద్దపీట వేశారని తెలిపారు. పేదవానికి కార్పొరేట్ వైద్యం, విద్య అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. ఇదో సామాజిక విప్లవమని అన్నారు. బలహీనవర్గాల విద్యార్థులకు ఉన్నత చదువులు: ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆంధ్రాలో అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు ఉన్నత స్థాయి చదువులు చదివి అమెరికా, ఆ్రస్టేలియా, కెనడా వంటి దేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. సీఎం జగన్ సుపరిపాలన చూశాక ఒడిశా, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలను కూడా ఆంధ్రాలో కలపాలంటూ డిమాండ్లు వస్తున్నాయన్నారు. జగనన్న ఆలోచనలకు మేం నిదర్శనం: మంత్రి ఆదిమూలపు సురేశ్ సీఎం జగనన్న ఆలోచనా విధానానికి నిలువెత్తు నిదర్శనం ఈ సభావేదికపై ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజాప్రతినిధులమని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను సీఎం జగన్ ఉన్నతంగా తీర్చిదిద్ది, ఇంగ్లిష్ మీడియం చదువులు అందించడాన్ని మిగతా రాష్ట్రాలూ అందిపుచ్చుకుంటున్నాయని తెలిపారు. ఇంగ్లిష్ మీడియం, సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ, అధునాతన ప్రభుత్వ ఆస్పత్రులతో సీఎం జగన్ రోల్ మోడల్‌గా నిలిచారన్నారు. సీఎం జగన్ పేదల పక్షపాతి: మంత్రి మేరుగు పేదల పక్షపాతిగా సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. వైఎస్ జగన్ 75 శాతం మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చారని, ఇంతకంటే సామాజిక సాధికారత చేసే నాయకులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ఒంగోలులో ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే పోటీ కూడా చేయను : బాలినేని ఒంగోలు నగర ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు 25 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడితే టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లి అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వచ్చే నెలలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా 25 వేల మందికి ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమం జరుగుతోందన్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఒంగోలులో పోటీ కూడా చేయనన్నారు. వైఎస్సార్ హయాంలో ఒంగోలులో వైద్య కళాశాల, ప్రభుత్వ ఆస్పత్రి నిర్మించామని తెలిపారు. ఇప్పుడు ఒంగోలు నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు రూ.350 కోట్లతో మంచినీటి పథకానికి, మరో రూ.350 కోట్లతో కొత్తపట్నం మండలంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, నందిగం సురేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఒంగోలులో సామాజిక సాధికార యాత్రకు భారీ ఏర్పాట్లు
-
ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో యాత్ర
-
విశాఖపట్నం సౌత్, ఒంగోలు, బనగానపల్లెలో బస్సు యాత్ర
-
సామాజిక సాధికార యాత్ర ఈరోజు షెడ్యూల్
-
నేడు విశాఖ సౌత్, బనగానపల్లి, ఒంగోలులో సామాజిక సాధికార యాత్ర
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగిన మేలును, సామాజికన్యాయం, రాజ్యాధికారం పొందిన వైనాన్ని ప్రజలకు వివరించేందుకు వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర బుధవారం విశాఖపట్నం జిల్లా విశాఖ సౌత్, నంద్యాల జిల్లా బనగానపల్లి, ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. నాలుగున్నర సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన పలు కార్యక్రమాలను పేదలకు వివరిస్తారు. విశాఖపట్నం: విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరగనుంది. ఉదయం 11:30 గంటలకు ఫార్చున్ ఇన్ హోటల్లో వైఎస్సార్సీపీ నాయకుల మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు డైమండ్ పార్క్ నుంచి రైల్వే న్యూ కాలనీ, మనోహర థియేటర్, దుర్గాలమ్మ గుడి, జగదాంబ జంక్షన్ మీదుగా టౌన్ కొత్త రోడ్డు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. 2:30 గంటలకు టౌన్ కొత్త రోడ్డులో జరగనున్న బహిరంగ సభలో రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, తదితరులు హాజరుకానున్నారు. ఒంగోలు: ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరగనుంది. మధ్యాహ్నం 1 గంటకు ఒంగోలు నోవాసిస్ హోటల్లో వైఎస్సార్సీపీ నేతల విలేకర్ల సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు కర్నూల్ రోడ్డు బైపాస్ నుండి బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వరకు ర్యాలీ సాగనుంది. 4 గంటలకు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద నిర్వహించనున్న బహిరంగ సభలో రీజనల్ ఇంఛార్జ్ విజయసాయిరెడ్డి, ఎంపీ ఆర్.కృష్ణయ్య, మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, విడదల రజని, తదితరులు హాజరుకానున్నారు. నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర సాగనుంది. బనగానపల్లె ధనలక్ష్మి ఫంక్షన్ హాలులో ముస్లిం మైనారిటీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఒంటిగంటకు వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం కూరగాయల మార్కెట్ మీదుగా పెట్రోల్ బంకు సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే బహిరంగ సభలో ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ, మంత్రులు నారాయణ స్వామి, అంజాద్ భాషా, మాజీ మంత్రి పార్థసారథి హాజరుకానున్నారు. -
ఒంగోలులో సామజిక సాధికార యాత్రకు భారీ ఏర్పాట్లు
-
ప్రమాణం చేద్దామా?.. దామచర్లకు బాలినేని సవాల్
సాక్షి, ప్రకాశం జిల్లా: జిల్లాలో జరిగే అన్ని మీటింగ్‌లకు నన్ను పిలిచారని, మీడియా వాళ్లు అనవసరంగా ప్రతీది రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌కి అబద్ధాలు మాట్లాడటం అలవాటు. కాంట్రాక్టర్ల దగ్గర ఎవరు డబ్బులు తీసున్నారో ప్రమాణం చేద్దామా?. చీము, నెత్తురు, సిగ్గు ఉంటే నా ఛాలెంజ్‌కు స్పందించు’’ అంటూ సవాల్ విసిరారు. కొత్తపట్నం బ్రిడ్జి మెటీరియల్ కొనుగోలుకు నేను రూ.40 లక్షలు ఇచ్చా. నోటికి వచ్చినట్లు మాట్లాడితే పద్దతిగా ఉండదు’’ అని బాలినేని హెచ్చరించారు. చదవండి: తుస్సుమనిపించిన పవన్.. ఎందుకంత వణుకు? -
ఒంగోలులో భూకబ్జాలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది
-
ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త బాధ, విస్మయం కల్గించింది: బాలినేని
-
15 గంటలుగా మండుతూనే...
ఒంగోలు సబర్బన్: ప్రకాశం జిల్లా ఒంగోలులోని గాంధీ రోడ్డు సమీపంలోని పప్పు బజార్లో ఉన్న కాయర్ రోప్ మర్చంట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున సునీల్ కాయర్ రోప్ మర్చంట్స్ గోడౌన్లో మంటలు వ్యాపించాయి. ఒంగోలు ఫైర్ ఇంజన్లతో పాటు టంగుటూరు, కొండపి, బాపట్ల జిల్లా అద్దంకి నుంచి 8 ఫైర్ ఇంజన్లు తీసుకువచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. 15 గంటలకు పైగా మంటలు దట్టంగా వ్యాపిస్తూనే ఉన్నాయి. భారీగా స్టాక్ ఉండటంతో మంటలు అదుపులోకి రావడం లేదు. ఈ ప్రమాదంలో రూ.2 కోట్లకు పైగా నష్టం వాటిలినట్లు సమాచారం. -
రాజకీయంగా వాడుకోవాలని చూస్తే సహించం
ఒంగోలు సబర్బన్ : ప్రకాశం జిల్లా ఒంగోలులో సంచలనం సృష్టించిన నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపుల కుంభకోణం కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ మలికాగర్గ్ చెప్పారు. ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆమె మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపుల కుంభకోణం కేసును ఎవరైనా రాజకీయంగా వాడుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కేసులో ఏ పార్టీ వాళ్లు ఉన్నా వదిలిపెట్టేది లేదన్నారు. 20 రోజుల క్రితం వేరే కేసులో ఒంగోలు తాలూకా పోలీసులు తనిఖీ చేస్తుంటే అక్కడ నకిలీ స్టాంపులు, డాక్యుమెంట్లు బయటపడ్డాయని, అప్పటి నుంచి వేగంగా కేసు దర్యాప్తు జరుగుతోందన్నారు. ఈ కేసు దర్యాప్తును వేగంగా చేపట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా తనతో చెప్పారని తెలిపారు. తనతో పాటు కలెక్టర్ ఏఎస్ దినే‹Ùకుమార్‌తో కూడా ఈ కేసు విషయంపై బాలినేని స్పష్టంగా మాట్లాడినట్టు చెప్పారు. ఈ కేసులో ఏ పార్టీ వారున్నా, చివరకు తన అనుచరులున్నా సరే ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు తలొగ్గవద్దని కూడా బాలినేని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కొన్ని పార్టీలు రాజకీయ ప్రాబల్యం కోసం అనవసర ఆరోపణలు చేస్తున్నాయని, వెంటనే మానుకోవాలని సూచించారు. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలున్నా పోలీస్ అధికారులకు తెచ్చివ్వాలని సూచించారు. అంతే కానీ రాజకీయ స్వార్థం కోసం పోలీస్ దర్యాప్తును పక్కదారి పట్టిస్తే మాత్రం సహించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. ‘కేసులో వేలకొలది డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నాం. వాటిలో 130 డాక్యుమెంట్లను నిశితంగా పరిశీలిస్తున్నాం. వాటిలో నకిలీవి ఎన్ని, అసలు డాక్యుమెంట్లు ఎన్ని ఉన్నాయో అటు రెవెన్యూ, ఇటు రిజి్రస్టేషన్ల శాఖల సమన్వయంతో దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్ట్ చేశాం, మరో 12 మందిని అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇంకా ఎవరెవరి పాత్ర ఇందులో ఉందో కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నాం’ అని అన్నారు. తొలుత దర్శి డీఎస్పీతో సిట్ ఏర్పాటు చేశామని, కేసు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఒంగోలు ఏఎస్పీ కే.నాగేశ్వరరావుకు కేసును అప్పగిస్తూ అప్‌గ్రేడ్ చేసినట్టు తెలిపారు. -
సబ్ రిజిస్ట్రార్ ప్రాణాలు కాపాడిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’
సింగరాయకొండ/ఆత్మకూరు రూరల్(నంద్యాల) : జగనన్న సురక్ష క్యాంపులు ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాయి. ఇటీవల ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ ప్రాణాలు కాపాడగా, తాజాగా ఓ మహిళ గుండె జబ్బుతో బాధపడుతున్నట్టు గుర్తించి ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఒంగోలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ వైకే నందకిషోర్ రోజూ నెల్లూరు నుంచి ఒంగోలుకు ఉద్యోగం నిమిత్తం వస్తుంటారు. ఈ నెల 5న రైల్లో వస్తుండగా కావలి దాటగానే స్వల్పంగా గుండెనొప్పి వచ్చింది. మొదట గ్యాస్ సమస్య అని మందులు వేసుకున్నా.. నొప్పి తగ్గకపోవడంతో వెంటనే తనకు రైల్లో పరిచయం ఉన్న సింగరాయకొండ ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ఉజ్వలకు ఫోన్ చేసి పరిస్థితి వివరించారు. ఆ సమయంలో ప్రభుత్వ ఆస్పత్రిలో విధుల్లో ఉన్న ఉజ్వల.. సింగరాయకొండ గ్రామ సచివాలయం–2 పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష పథకం మెడికల్ క్యాంపు జరుగుతోందని, కార్డియాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకటేశ్వరరావు క్యాంపులో ఉన్నారని.. సింగరాయకొండలో దిగాలంటూ స్టేషన్‌కు 108ను పంపించి సురక్ష క్యాంపునకు తీసుకొచ్చారు. అనంతరం డాక్టర్ ఉజ్వల, డాక్టర్ వంశీధర్‌లు ఆయనకు ఈసీజీ పరీక్షలు నిర్వహించి.. రిపోర్టును పరిశీలించిన డాక్టర్ వెంకటేశ్వరరావు.. రిజిస్ట్రార్ కు గుండె నొప్పి వచ్చిందని నిర్ధారించి వెంటనే ప్రథమ చికిత్స చేయించి తర్వాత ఒంగోలు కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కిమ్స్‌లోని డాక్టర్లు రిజిస్ట్రార్ నందకిషోర్‌కు యాంజియోగ్రామ్ పరీక్ష చేసి రెండు వాల్వస్ దెబ్బతిన్నాయని గుర్తించి.. వెంటనే స్టంట్ వేసి చికిత్స చేశారు. సకాలంలో అక్కడకు రావడంతో ఆయన ప్రాణాలు దక్కాయని కిమ్స్ డాక్టర్లు కుటుంబ సభ్యులకు చెప్పారు. సరైన సమయంలో చికిత్స అందించి తన భర్త ప్రాణాలు కాపాడారని అతని భార్య విజయలక్ష్మి.. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులో ఉన్న వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ వంశీధర్ మాట్లాడుతూ సోమవారం పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన జగనన్న సురక్ష కా>్యంపులో 35 మందికి ఈసీజీ పరీక్షలు చేయగా వారిలో ముగ్గురికి గుండె సమస్యలున్నట్టు తేలిందని చెప్పారు. ఓ మహిళను కాపాడిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ఇదిలా ఉండగా, నంద్యాల జిల్లా ఆత్మకూరు శ్రీపతిరావుపేటలో సోమవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఓ మహిళను కాపాడింది. జయలక్ష్మీదేవి కొద్దిగా ఆయాసం ఉందంటూ గ్రామంలో ఏర్పాటు చేసిన శిబిరానికి వచ్చింది. వైద్యులు ఆమెకు గుండె పరీక్షలు చేసి గుండె సమస్యతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. అప్పటికప్పుడు ప్రాథమిక వైద్యం చేసి హుటాహుటిన అక్కడే ఉన్న అంబులెన్స్‌లో కర్నూలు జిల్లా ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. -
బంద్ పేరుతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు
-
బంద్ పేరుతో రెచ్చిపోయిన టీడీపి కార్యకర్తలు
-
ఒంగోలు బ్యూటీపార్లర్ కేసు: మార్గదర్శి మేనేజర్ భార్య అరెస్ట్
ఒంగోలు టౌన్: ఒంగోలులోని శ్రీకృష్ణనగర్‌లో బ్యూటీషియన్‌పై దాడి చేసి చోరీకి పాల్పడిన కేసులో ఒంగోలు మార్గదర్శి బ్రాంచి మేనేజర్ కరణం నాగేశ్వరరావు భార్య కరణం మోహన దీప్తి ఉరఫ్ దీప్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మలికా గర్గ్ కేసు వివరాలను వెల్లడించారు. ఒంగోలుకి చెందిన షేక్ రజియా శ్రీకృష్ణ నగర్‌లోని తన ఇంటిలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నారు. ఆమె భర్త షేక్ మీరా ఉద్యోగ నిమిత్తం ఉదయం వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వస్తారు. కూతురు కాలేజికి వెళ్లి సాయంత్రం వస్తుంది. దీంతో రజియా ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. రజియాకు షేక్ సాహెర భాను అనే స్నేహితురాలు ఉంది. ఆమెకు రజియా వద్ద రూ.10 లక్షలకు పైగా విలువైన బంగారు నగలు ఉన్నాయని తెలుసుకుని ఆ విషయాన్ని తనకు పరిచయమున్న కరణం దీప్తి, ముండ్రు లక్ష్మి నవత ఉరఫ్ నవ్య, అలహరి అపర్ణలకు చెప్పింది. దీంతో అప్పటికే అనేక చోరీలు చేసి ఉన్న ఈ కిలాడీ ముఠా బ్యూటీ పార్లర్ మీద కన్నేశారు. వీరు మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో బ్యూటీపార్లర్‌కు వచ్చారు. మేకప్ చేయించుకునేందుకు వచ్చినట్లు నమ్మించారు. మొదట ఇద్దరు ఐ బ్రోస్ చేయించుకున్నారు. మరొకరికి పెడిక్యూర్ చేస్తుండగా అదను చూసి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం రజియా మీద ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న మత్తు కలిగించే ద్రావణాన్ని స్ప్రే చేశారు. తేలికపాటి యాసిడ్ లాంటి ద్రావణాన్ని ఆమె మీద చల్లారు. క్లోరోఫాం ప్రయోగించడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయారు. ఆ తరువాత వాళ్లు చేతికి అందిన కాడికి దోచుకొని పోయారు. రజియా మెడలోని బంగారు నగలు, ఇంట్లో కప్‌బోర్డులో దాచిన నగలు, రూ.40 వేల నగదు దోచుకొని వెళ్లారు. ఈ కేసు వివరాలను తెలుసుకున్న ఎస్పీ మలికా గర్గ్ వెంటనే పోలీసులను రంగంలోకి దించారు. సీఐ భక్తవత్సలరెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. చదవండి: అవమానించడంతోనే పెట్రోల్ పోసుకున్నా సీసీ కెమెరాల్లో ముగ్గురు నిందితులను గుర్తించిన పోలీసులు హైడ్రామా మధ్య వారిని అదుపులోకి తీసుకున్నారు. కరణం మోహన దీప్తితో పాటుగా బజాజ్ ఫైనాన్స్‌లో ఉద్యోగం చేసే ముండ్ర వెంకటరావు భార్య లక్ష్మి నవత, శ్రీనివాసరావు భార్య అలహరి అపర్ణ, దాసరి భాను ఉరఫ్ షేక్ సాహెరా భానులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో ఒంగోలు తాలూకా పరిధిలో పెళ్లూరు, పొదిలి, దొనకొండలలో కూడా చోరీలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. 24 గంటల్లోపే కేసును ఛేదించడమే కాకుండా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు. ఒంగోలు డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి, సీఐ భక్తవత్సలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాలినేని సవాల్.. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..
సాక్షి, ప్రకాశం జిల్లా: జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ఇళ్ల పట్టాలలో స్కాం చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. ‘‘నిస్వార్దంగా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నాం. బురద చల్లడానికి ప్రయత్నం చేస్తే పేదలు క్షమించరు. స్కామ్‌లు నిరూపించలేకపోతే మీరు రాజకీయ సన్యాసం చేస్తారా?. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి తీరతా’’ అని బాలినేని స్పష్టం చేశారు. చదవండి: దళిత గళం గొంతు నొక్కి! -
యువగళంలో నారా లోకేష్‌కు షాక్ ఇచ్చిన తమ్ముళ్లు
-
యువగళంలో నారా లోకేష్ బిత్తరపోయేలా..
సాక్షి, ప్రకాశం: యువగళం పేరుతో జనాదరణకు దూరంగా.. సెల్ఫీ(ల్ఫ్) పాదయాత్ర చేసుకుంటూ పోతున్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌కు బిత్తరపోయే దృశ్యం కనిపించింది. ఒంగోలులో లోకేష్‌కు ఝలక్ ఇచ్చేలా కొందరు తెలుగు తమ్ముళ్లే ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌ను హైలెట్ చేస్తూ పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన టీడీపీ కార్యకర్తలు.. ‘‘అసలోడు వచ్చేవరకూ కొసరోడికి పండగే’’ అంటూ ప్రధాన కూడలలో వాటిని ఏర్పాటు చేశారు. ఒకవేళ.. భవిష్యత్తులో ఎప్పుడైనా టీడీపీ అధికారంలోకి వస్తే ఎన్టీఆరే సీఎం అవుతాడంటూ అందులో రాసి ఉంచారు. దీంతో ఫ్లెక్సీని చూసి ఉలిక్కిపడ్డ లోకేష్ అనుచరగణం దానిని తొలగించే యత్నం చేసింది. బహుశా ఇది జూనియర్ ఫ్యాన్స్ పని అయ్యి ఉండొచ్చనే చర్చ నడుస్తోంది. ఇదే ఫ్లెక్సీ లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్(స్వర్గీయ) ఫొటోతో పాటు .. లోకేష్ తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు బొమ్మ కూడా ఉండడం గమనార్హం. ఇక లోకేష్‌ను ఎన్టీఆర్ రాజకీయ వారసుడిగా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని.. సిసలైన వారసులకే పార్టీ పగ్గాలు అప్పజెప్పాంటూ ఓ వర్గం మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. -
జగన్ పాలనపై ఒంగోలు కుర్రాడి లెక్కలు చూశారా?
సాక్షి, ఒంగోలు: ఏపీ ప్రజల్లారా.. గత ప్రభుత్వానికి, ప్రస్తుత పాలనకు తేడాలు గమనిస్తున్నారా?. చంద్రబాబు హయంలో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోపోగా.. అదనంగా దొంగలముఠా అవినీతితో అడ్డగోలుగా దోపిడీకి గురైంది. ఆ గాయాలకు మందు రాస్తూనే.. సంక్షేమం ప్రజలకు చేరవేసే ఉద్దేశంతో ఎంతటి భారానైన్నా భరిస్తూ ముందుకు సాగుతోంది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం . ఈ క్రమంలో ఒంగోలుకు చెందిన 17 ఏళ్ల కుర్రాడొకడు సీఎం జగన్‌పాలనపై అద్భుతమైన ప్రజంటేషన్ ఇచ్చాడు. అభివృద్ధి.. సంక్షేమం విషయంలో గత ప్రభుత్వానికి.. ఇప్పటి ప్రభుత్వానికి ఎలాంటి తేడాలు ఉన్నాయనేది లెక్కలతో సహా తేల్చి చూపించాడు ఒంగోలుకు చెందిన త్రిపర్ణో. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది.. ఏపీని అన్నింటా ఎలా వెనక్కి తీసుకెళ్లింది.. ఈ నాలుగేళ్ల ఇప్పుడున్న ప్రభుత్వం ఏమేం చేసింది.. ఇంతకు ముందున్న ప్రభుత్వం-ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎలాంటి తేడాలు ఉన్నాయనేది కళ్లకు కట్టినట్లు చూపించాడు. అభివృద్ధి అంటే కేవలం ధనికులు ఎదగడం మాత్రమే కాదని.. సగటు మనిషిని అభివృద్ధిలోకి తేవడమనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్న సీఎం జగన్ తనకు ఆదర్శనీయమంటున్నాడు త్రిపర్ణో. అందుకే క్షేత్ర స్థాయిలో బాగా రీసెర్చి చేసి.. వాస్తవాలను కళ్లకు కట్టేలా ఈ ప్రజంటేషన్ను రూపొందించాడట. -
ఒంగోలు: బ్యాంకులో కాల్పుల కలకలం.. సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య
సాక్షి ప్రకాశం: ఒంగోలులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కోర్టు సెంటర్లోని యూనియన్ బ్యాంక్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్ ఎం. వెంకటేశ్వర్లు(35) తుపాకీతో తనను తానే కాల్చుకుని మృతిచెందాడు. దీంతో, ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. యూనియన్ బ్యాంక్‌లో వెంకటేశ్వర్లు సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. అయితే, సోమవారం విధుల్లో ఉండగా.. బ్యాంక్‌లోని రూమ్‌లోకి వెళ్లి గన్‌తో తనను తానే కాల్చుకున్నాడు. ఈ క్రమంలో పెద్ద శబ్ధం రావడంతో బ్యాంకు సిబ్బంది వెంటనే వెళ్లి చూడగా వెంకటేశ్వర్లు రక్తపు మడుగులో పడిఉన్నాడు. దీంతో, బ్యాంకు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఇక, చీమకుర్తికి చెందిన వెంకటేశ్వర్లు కొంతకాలంగా యూనియన్ బ్యాంకులో సెక్యూరిటీగా గార్డుగా పనిచేస్తున్నాడు. వెంకటేశ్వర్లు కుటుంబం ఒంగోలు రామ్‌నగర్‌లోని 8వ లైన్లో నివాసం ఉంటోంది. ఏడేళ్ల క్రితం ఉమామహేశ్వరితో వెంకటేశ్వర్లకు వివాహం జరిగింది. వీరికి సంతానం లేనట్టు తెలుస్తోంది. కాగా, వెంకటేశ్వర్ల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: విషాదం: ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు చిన్నారులు మృతి.. కారణం ఇదే.. -
AP: అక్షజ్ ఘనత.. ఆరేళ్లకే ఎవరెస్ట్ అధిరోహణ
ఒంగోలు టౌన్: ఒంగోలుకు చెందిన ఓ చిన్నారి ఎవరెస్ట్ ఎక్కాడు. ఆ చిన్నోడి ధైర్య సాహసాలు మెచ్చుకున్న నేపాల్ రాయబారి ఎవరెస్ట్ డే రోజున అవార్డుతో సత్కరించారు. ఒంగోలులోని సంతపేటకు చెందిన వెలగపూడి వెంకటరమణ ఏపీ ట్రాన్స్‌కో లో ఎస్ఈ గా చేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన అల్లుడు అమిత్, కూతురు అనురాధ ఇంజినీర్లుగా మస్కట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి అక్షజ్ ఉడియావాల(6) అనే కుమారుడున్నాడు. అక్షజ్ గతేడాది ఎవరెస్ట్ శిఖరంలోని బేస్ క్యాంపు వరకు అంటే 5,364 మీటర్ల ఎత్తు వరకు ఎక్కి అక్కడ భారత జాతీయ జెండాను ఎగరేశాడు. ప్రతి ఏడాది మే 29న ఎవరెస్ట్ డే సందర్భంగా మస్కట్‌లోని నేపాల్ రాయబార కార్యాలయంలో జరిగిన ఎవరెస్ట్ డే కార్యక్రమానికి అక్షజ్ తో పాటు అతడి తల్లిదండ్రులకు ఆహ్వానం అందింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అక్షజ్ తన అనుభవాలను అక్కడ వివరించాడు. అక్షజ్కు నేపాల్ రాయబారి దోర్నాథ్ ఆర్యల్ సర్టిఫికెట్ ఆఫ్ అప్రిసియేట్ అవార్డును ప్రదానం చేశారు. అక్షజ్ తల్లిదండ్రులు అమిత్, అనురాధలను సత్కరించారు. ఇది కూడా చదవండి: హజ్ యాత్రకు జూన్ 7న తొలి విమానం -
జిల్లాలో ఆదిమానవులు నివాసమున్నారా?
జిల్లాలో ఆదిమానవులు నివాసమున్నారా? అడవుల్లో లక్షల ఏళ్ల నాడు ఆవులు, గుర్రాలు, జింకలు తిరుగాడాయా? అంటే అవుననే అంటున్నారు వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు. దాదాపు ఏడు దశాబ్దాలుగా ఇక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి. గుండ్లకమ్మ, పాలేరు, మన్నేరు, నాస వాగు పరిసరాల్లో విస్తృత స్థాయిలో పరిశోధనలు చేశారు. తాజాగా పామూరు మండలంలో గుజరాత్ రాష్ట్రం బరోడాలోని ఆర్కియాలజీ మహారాజా సాయాజీరావు యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు చేస్తున్న పరిశోధనల్లో దాదాపు 2.5 లక్షల ఏళ్లనాటి అవశేషాలను గుర్తించారు. హోమో ఎరక్టాస్ అనే తెగకు చెందిన ఆదిమానవులు ఆ అవశేషాలను వినియోగించినట్లు భావిస్తున్నారు. పరిశోధకులతో ముచ్చటించగా ఎన్నో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. వాటి గురించి తెలుసుకుందామా.. ఒంగోలు, సాక్షిప్రతినిధి: నదీ పరీవాహక ప్రాంతాల్లోనే నాగరికత అభివృద్ధి చెందింది అనేది అందరికీ తెలిసిందే. ఆదిమానవులు నదుల పక్కనే ఉన్న కొండ దిగువ ప్రాంతాల్లో నివాసముంటూ జీవనం సాగించారన్నది చరిత్రకారులు చెబుతూ వస్తున్నారు. అందుకే పరిశోధకులు ఎక్కువగా నదీ పరీవాహక ప్రాంతాలనే ఎంచుకుంటుంటారు. ఈ క్రమంలో జిల్లాలో గుండ్లకమ్మ, పాలేరు, మాకేరు, మన్నేరు వాగులను ఆర్కియాలజీ విభాగానికి చెందిన విద్యార్థులు ఎంచుకున్నారు. దాదాపు ఏడు దశాబ్దాలుగా దేశంలో వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఆర్కియాలజీ అధికారుల సాయంతో పరిశోధనలు చేస్తున్నారు. మాకేరు, మన్నేరు, పాలేరు..వాటికి అనుబంధ వాగులు కనిగిరి ప్రాంతంలోనే ఎక్కువగా ప్రవహిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉన్నప్పటి నుంచి పరిశోధనలు చేశారు. ఆదిమానవుని ఆనవాళ్లతో పాటు ఆవులు, గుర్రాలు, ఉడుములు, జింకల అవశేషాలు, రాతి పనిముట్లు గుర్తించారు. – 1950లో ఎన్ ఐజాక్ అనే శాస్త్రవేత్త గుండ్లకమ్మ, పాలేరు నది పరివాహక ప్రాంతాల్లో పరిశోధన చేశారు. అప్పట్లో కర్నూలు జిల్లాలో అంతర్భాగంగా కనిగిరి, కంభం తదితర గ్రామాలు ఉండేవి. ఆయా గ్రామాల్లోని నదీ పరివాహక ప్రాంతాల్లో ఆయన పరిశోధన చేశారు. ఆయన సమరి్పంచిన పీహెచ్డీ రికార్డులో ఈ ప్రాంతంలో ఆదిమానవులు నివశించారని ప్రస్తావించారు. అలాగే 1975లో వి.మధుసూదన్ రావు అనే శాస్త్రవేత్త ఆంధ్ర యూనివర్శిటీలో పీహెచ్డీ చేశారు. ఈయన పెదఅలవలపాడు, వెలిగండ్ల మండలాల్లోని పాలేరు, మన్నేరు పరివాహక ప్రాంతాల్లో పర్యటించి పరిశోధన పత్రాలను సమరి్పంచారు. అంతేకాకుండా 2004–05 సంవత్సరాల్లో హైదరాబాద్‌కు చెందిన జియాలజిస్ట్‌లు గుండ్లకమ్మ, మన్నేరు ప్రాంతాల్లో పర్యటించారు. ఇండోనేషియాలో బద్దలైన అగ్ని పర్వతాల ఆనవాళ్లకు సంబంధించి, వాటి నుంచి వచ్చే బూడిదను ఈ ప్రాంతాల్లో ఆయన కనిపెట్టారు. ఇది గాలి ద్వారా వచ్చింది. దీని వల్ల జంతు జాతులు అంతరించడం, మానవుల సంఖ్య తగ్గినట్లు నివేదికలున్నాయి. దానికి సంబంధించిన ఆనవాళ్లు (రాతియుగం నాటి పనిముట్లు, జంతు జాలాలు, అవశేషాలు కని్పంచాయి) కూడా ఇక్కడే ఉన్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని కందుకూరు సమీపం మాచవరం గ్రామానికి చెందిన దేవర అనిల్ కుమార్ గుజరాత్‌లోని ఆర్కియాలజీ మహారాజా సాయాజీరావు యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన తన సీనియర్ సమరి్పంచిన పరిశోధనలకు సంబంధించిన రికార్డులు అధ్యయనం చేశారు. అలాగే జిల్లాకు చెందిన ప్రొఫెసర్ కొండా శ్రీనివాసులు ఇచ్చిన సమాచారం మేరకు ఆయన సలహాలు, సూచనలతో పలుమార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) హైదరాబాద్ వారి ద్వారా జీపీఆర్ సర్వే నిర్వహింపజేసి వారు సూచించిన ప్రాంతంలో మధ్య ప్రాచీన యుగం నాటి, రాతి యుగం నాటి ఆదిమానవుని, జంతు జలాలపై లోతైన పరిశోధన ప్రారంభించిన అనీల్ కుమార్ పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు. 2017–18 సంవత్సరాల నుంచి గుండ్లకమ్మ, పాలేరు, మన్నేరు పరివాహక ప్రాంతాలైన సీఎస్‌పురం, డీజీపేట, పెద అలవలపాడు, హనుమంతునిపాడు, సింగరాయకొండ, నెల్లూరు జిల్లాలోని జడదేపి తదితర ప్రాంతాల్లో పరిశోధన చేశారు. కనిగిరిలోని మన్నేరు వాగులో ఎక్కువ శాతం మధ్యప్రాచీన రాతియుగం (70 వేల ఏళ్లు) కాలం నాటి అవశేషాలు, సర్ఫేస్ సర్వేలో (బయటకు కనిపించేవి) నాలుగు కిలోమీటర్ల మేర ఉన్నాయి. నీటి కోత ఎక్కువ జరగడం వల్లే అధిక సంఖ్యలో అవశేషాలు ఉన్నందున మన్నేరు వాగును ఎంచుకున్నట్లు ఆయన చెబుతున్నారు. హనుమంతునిపాడు వద్ద పాలేరులో 2.50 లక్షల ఏళ్ల నాటి రాతి పనిముట్లు లభించాయి. 2019 మన్నేరు వాగులో పరిశోధన చేసి కొన్ని అవశేషాలను గుర్తించారు. 2020లో ఒకటిన్నర నెల తవ్వకాలు జరపగా అక్కడ చాలా ప్రాచీన కాలం నాటి, ఆసక్తికర అవశేషాలు దొరకడంతో పూర్తి స్థాయిలో సైంటిఫిక్‌గా లోతుగా పరిశోధన చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పామూరు మండలం మోట్రాలపాడు మన్నేరు వాగులో హైదరాబాద్‌లోని ఎన్జీఆర్ఐ (నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు) చెందిన వారితో జీపీఆర్ (జియోగ్రౌండ్ ఫెనిటిరేటింగ్ రాడార్) కింద రాళ్లు, గుంతలు ఉన్నాయా అనేది తెలుసుకునేందుకు సర్వే చేశారు. డాక్టర్ సక్రమ్, డాక్టర్ ఆనంద్ పాండేల ఆధ్వర్యంలో 12 మంది ఎంఏ విద్యార్థులు ఈ నెల 13, 14, 15 తేదీల్లో సర్వే చేశారు. ఎక్కడెక్కడ అవశేషాలు ఉన్నాయనే దానిపై క్షుణ్ణంగా సర్వే చేసేందుకు వాళ్లు సూచనలు ఇచ్చారు. వాళ్లు చూపించిన ప్రదేశాల్లో తవ్వకాల్లో జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జీవితాంతం పరిశోధనలు చేస్తా.. జిల్లాలో చారిత్రక విశేషాలను తెలుసుకునేందుకు నిరంతరం సర్వే చేస్తా. ఎన్జీవోలు ఫండింగ్ ఇచ్చి తాను చేస్తున్న పరిశోధనలను ప్రోత్సహిస్తునాŠిన్య. ఆధునిక మానవుల పరిణామ క్రమానికి సంబంధించి మరిన్ని పరిశోధనలు జరిగేందుకు, కొత్త విషయాలు వెలుగులోకి వచ్చేందుకు ఈ పరిశోధన ఫలితాలు దోహద పడతాయి. అమెరికాకు చెందిన నేషనల్ జోబ్రోసిక్ సొసైటీ, వెన్నర్ గ్రండ్ ఫౌండేషన్, లీకే ఫౌండేషన్ తదితర సంస్థల ద్వారా ఫండ్ సమకూరింది. లీకే ఫౌండేషన్ వారు ప్రపంచం మొత్తంలో 25 మందికి ఇస్తే ఇండియాలో నాకు మాత్రమే వచ్చింది. తాము చేస్తున్న పరిశోధనకు మోటరాలపాడు సర్పంచ్ మెడబలివి గురవయ్య పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నారు. – దేవర అనీల్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, కందుకూరు వెలుగు చూసిన ఆనవాళ్లివీ.. మోట్రాలపాడు మన్నేరు వాగులో మధ్య ప్రాచీన రాతి యుగం నాటి రాతి పనిముట్లు (ఫ్లెయిట్స్, పాయింట్స్, స్కేపర్స్, బ్యోరింగ్స్, బోరఫ్, లిబల్బా టెక్నాలజీకి చెందిన పనిముట్లు) ఓఎస్ఎల్, యురీనియం సీరిస్ ద్వారా 70 వేల ఏళ్ల నాటివిగా గుర్తించారు. అలాగే 40, 50 వేల ఏళ్ల నాటి వైల్డ్, మచ్చిక జాతికి చెందిన ఆవులు, జింకలు, గుర్రాలు, ఉడుముల (వైల్డ్ జాతికిచెందిన) దంతాలు, ఎముకలు, ఇతర అవశేషాలను కనుగొన్నారు. ఈ అవశేషాలు ఒకే ప్రాంతంలో (మన్నేరు వాగు ప్రాంతం) సర్ఫేస్‌గా (పైన కనిపించేవి) సుమారు నాలుగు కిలో మీటర్ల దూరంలో ఎక్కువ శాతం ఉన్నాయి. అంతేగాక ఇక్కడ వాగు కోతలు జరిగాయి. దీంతో పూర్తి స్థాయిలో ఇక్కడే పరిశోధన చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లోని అత్యున్నత ల్యాబ్‌లో.. కేవలం సర్వేతో కాకుండా .. తవ్వకాల్లో దొరికిన సాంపిల్స్, ఆనవాళ్లను ప్రపంచంలోని అత్యున్నత ల్యాబ్‌లకు పంపించి వాటి వివరాలను తెలుసుకుంటున్నారు. అవి ఎంత పురాతనమైనవి, ఏ కాలం నాటివి, ఎన్నేళ్ల కిందటివి అన్న వివరాలను సేకరిస్తున్నారు. గుజరాత్‌లోని ఇస్రో ల్యాబ్, ఆ్రస్టేలియా, పోర్చుగల్, హార్వర్డ్ యూనివర్శిటీ, యూఎస్ఏ (అర్బనా)లోని ల్యాబ్‌లకు పంపి అవి ఏకాలం నాటివి అని సాంకేతికంగా నిర్ధారణ చేస్తున్నారు. -
రెచ్చిపోయిన జనసేన కార్పొరేటర్.. ఫ్లెక్సీలను చించివేస్తూ..
సాక్షి,ఒంగోలు టౌన్: ఒంగోలు నగరంలో జనసేనకు చెందిన కార్పొరేటర్, ఇతర నాయకులు సోమవారం తీవ్రంగా రెచ్చిపోయారు. నగరంలో వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను చించివేస్తూ గందరగోళం సృష్టించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతూ ఫ్లైఓవర్ బ్రిడ్జి, చర్చి సెంటర్, ఇతర ప్రధాన కూడళ్లలో వైఎస్సార్సీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని చూసి రెచ్చిపోయిన జనసేన నాయకులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడమే కాకుండా పలుచోట్ల వివాదానికి దిగారు. వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను తొలగించాలంటూ పోలీసులతో అడ్డగోలుగా వాదించారు. చర్చి సెంటరుకు చేరుకున్న జనసేన కార్యకర్తలు గొడవలు సృష్టించేందుకు ప్రయత్నించారు. జనసేనకు చెందిన 38వ డివిజన్ కార్పొరేటర్ మునగాల రమేష్ కర్నూలు రోడ్డులోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేశారు. అక్కడ ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న పోలీసులు వారిస్తున్నా వినలేదు. దాంతో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు. రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని, ఆ తర్వాత వదిలేశారు. వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను చించివేసిన రమేష్ పై వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. చదవండి: కీలక పరిణామం.. భారీగా ‘మార్గదర్శి’ చరాస్తుల జప్తు! -
కేతు విశ్వనాథరెడ్డి కన్నుమూత.. సీఎం జగన్ సంతాపం
సాక్షి, వైఎస్సార్/ ప్రకాశం: తెలుగు సాహిత్యంలో కురువృద్దులు.. రాయలసీమ కథకు చిరునామా కేతు విశ్వనాథరెడ్డి(84) గారు ఇకలేరు. సోమవారం వేకువ ఝామున గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. ఒంగోలులోని ఓ ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్ మీద చికిత్స అందించే యత్నం చేసినా ఫలితం దక్కలేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కేతు విశ్వనాధ రెడ్డి మృతికి పలువురు వక్తలు, రచయితలు సంతాపం చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కేతు విశ్వనాథరెడ్డి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆధునిక తెలుగు సాహితీ రంగానికి విశ్వనాథరెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు. సామాజిక సంస్కరణలను అవశ్యకతను చెబుతూ విశ్వనాథరెడ్డి రాసిన కథలు పలువురికి స్ఫూర్తిగా నిలిచాయని కొనియాడారు. ఆయన సేవలను గుర్తించి 2021లో వైయస్సార్ లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డుతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని సత్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం జగన్ గుర్తుచేశారు. విశ్వనాథ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కేతు విశ్వనాథరెడ్డి (84).. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం రంగశాయిపురం స్వస్థలం. సాహితీ, విద్యావేత్తగా కేతు విశ్వనాథరెడ్డి పేరొందారు. రాయలసీమ మాండలికానికి సాహితీ గౌరవం తీసుకొచ్చిన ఘనత దక్కించుకున్నారు. కేతు విశ్వనాథరెడ్డి కథలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కడప జిల్లా గ్రామనామాలపై పరిశోధనకు ఆయన డాక్టరేట్ పొందారు. జర్నలిస్టుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. కడప, తిరుపతి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో అధ్యాపకుడిగా విశిష్ట సేవలందించారు. ఒకప్పుడు కడప కేంద్రంగా సుప్రసిద్ధ సాహిత్య విమర్శకుడు రాచమల్లు రామచంద్రారెడ్డి (రారా) ప్రియ శిష్యునిగా సాహిత్యంలో మెలకువలు నేర్చుకున్నారు. పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఎస్సీఈఆర్టీ సంపాదకుడిగా, పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయస్థాయి పలు పాఠ్యపుస్తకాలకు సంపాదకత్వం వహించారు. పాఠ్యప్రణాళికలను రూపొందించాడు. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించారు. అరసం (అభ్యుదయ రచయితల సంఘం) అధ్యక్షుడిగా కొంత కాలం ఉన్నారు. జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003) కథా సంపుటాలు, వేర్లు, బోధి అనే నవలలు వెలువరించారు. రాయలసీమ మాండలికంలో సాగిన ఈయన రచనలు మట్టి పరిమళాన్ని వెదజల్లాయి. ఈయన రాసిన అనేక కథలు హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఆంగ్లం, రష్యన్ భాషల్లోకి అనువాదం అయ్యాయి. ఉద్యోగ విరమణ అనంతరం పుట్టిన గడ్డపై మమకారంతో కడపకు చేరుకున్నారు. కడప నగరంలో భార్యతో కలిసి సింగపూర్ టౌన్షిప్లో ఉంటున్న ఆయన.. రెండు రోజుల క్రితం ఒంగోలులో ఉంటున్న కుమార్తె వద్దకు వెళ్లారు. ఈ ఉదయం గుండెపోటురాగా.. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. -
AP: కవాసకీ వ్యాధి బాధితుడికి రూ.లక్ష ఆర్థిక సాయం
ఒంగోలు అర్బన్: అరుదైన మల్టీసిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్(కవాసకీ వ్యాధి)తో బాధపడుతున్న బాలుడి తల్లిదండ్రులకు సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్ గురువారం రూ.లక్ష చెక్కు అందజేశారు. ఐదో విడత వైఎస్సార్ మత్స్యకార భరోసా నగదు జమ కార్యక్రమానికి సీఎం జగన్ ఈనెల 16న బాపట్ల జిల్లా నిజాంపట్నానికి వచ్చారు. ఆ సమయంలో ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన హృదయరంజన్, ఉషారాణి దంపతులు సీఎంను కలిసి తమ కుమారుడి అనారోగ్య పరిస్థితిని వివరించారు. సీఎం జగన్ స్పందిస్తూ.. ప్రభుత్వం తరఫున తగిన వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. తక్షణ ఆర్థిక సాయంగా రూ.లక్ష అందించాలని అధికారులను ఆదేశించారు. చదవండి: ప్రతిభ చూపిన విద్యార్థులు.. ‘జగనన్న ఆణిముత్యాలు’ -
కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
సాక్షి, ప్రకాశం జిల్లా: తనపై కొద్ది రోజులుగా పనిగట్టుకుని ఆరోపణ చేస్తున్నారని, రాజకీయంగా తనను హింసించడమే ధ్యేయంగా కొన్ని శక్తులు పని చేస్తున్నాయని ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్ మరణం తర్వాత పార్టీని అంటిపెట్టుకొని ఉన్నానని అయినా తనపైన నిత్యం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని బాలినేని వాపోయారు. హవాలా కుంభకోణం నుంచి భూ కుంభకోణం దాకా అన్నీ నా మీద రుద్ది ఒక పద్ధతి ప్రకారం అభాసుపాలు చేస్తున్నారని బాలినేని మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. తనను తన కుమారుడిని రాజకీయంగా వేధించడమే పనిగా పెట్టుకున్నారని ఎవరు ఏం చేసినా తాను వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమేనని బాలినేని స్పష్టం చేశారు. పార్టీలో బాధ్యత గల వ్యక్తిగా తను ఒకరి గురించి మాట్లాడనని బాలినేని అన్నారు. చదవండి: అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ -
చంద్రబాబు లెగ్గు మహిమ.. సైకిల్ ముక్కలు
ఎవరికివారే యమునా తీరే అన్న చందంగా తయారైంది జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఎనిమిది నియోజకవర్గాల్లో సైకిల్ ముక్కలు..ముక్కలుగా విడిపోయింది. జిల్లా కేంద్రం ఒంగోలు మొదలు పశ్చిమాన ఉన్న యర్రగొండపాలెం నియోజకవర్గం వరకూ అన్ని ప్రాంతాల్లో గ్రూపు తగాదాలతో సతమతమవుతోంది. పైకి అందరూ కలసినట్టుగా బిల్డప్ ఇస్తున్నా అంతర్గతంగా ఒకరంటే ఒకరికి పడక రగిలిపోతున్నారు. ఆ పార్టీ అధినేత వచ్చి వెళ్లినా పరిస్థితిలో ఎలాంటి మార్పు కానరాలేదు. సాక్షిప్రతినిధి, ఒంగోలు: జిల్లాలోని తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. నూతనంగా ఏర్పాటైన జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి టీడీపీ పార్టీ ముక్కలు... ముక్కలుగా విడిపోయింది. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల తీరు ఎవరి దారి వారిదే అన్నట్లు తయారైంది. కొన్ని నియోజవర్గాల్లో పార్టీని ముందుకు నడిపే నాయకుడే కరువయ్యాడంటే జిల్లాలో టీడీపీ పరిస్థితి ఎంతదయనీయంగా ఉందో అవగతమవుతుంది. టీడీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో మూడు రోజుల పాటు పర్యటించినా జిల్లా పార్టీలోని నాయకుల మధ్య ఉన్న విభేదాలను సరిదిద్దలేకపోయారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తీవ్రస్థాయిలో ఉన్నా వాటిని చంద్రబాబు సరిదిద్దకపోవడం విచారకరమని సొంత పార్టీ కేడరే నిరుత్సాహం వ్యక్తం చేయడం గమనార్హం. పార్టీలోని నేతలు విడిపోయినా, పార్టీ పరువు గంగలో కలిసిపోతున్నా, చంద్రబాబు పార్టీలో అంతా బాగుంది అన్నట్లు బిల్డప్ ఇస్తూ జిల్లాలో మూడు రోజులు గడిపారు. జిల్లా పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే కొందరు పెత్తందార్లు మిగతా వర్గాల నేతలను విస్మరించటం వల్ల ప్రతి నియోజకవర్గంలో వర్గాల వారీగా పార్టీ చీలిపోయింది. జిల్లా పర్యటన సందర్భంగా చంద్రబాబు తొలుత గిద్దలూరు నియోజకవర్గంలో అడుగుపెట్టారు. ఆదిలోనే హంసపాదు అన్న చందంగా నేతల మధ్య విభేదాల ఫలితంగా తొలిరోజు సభ అట్టర్ ప్లాప్ అయింది. మూడు ముక్కలుగా విడిపోయి ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకున్నారు. వైఎస్సార్సీపీ జెండాపై ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు డబ్బు మూటలకు ఆశపడి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పచ్చ కండువా కప్పుకున్న ముత్తుముల అశోక్ రెడ్డిది ఒక గ్రూపు. రెండో గ్రూపు మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకురాలు పిడతల సాయి కల్పనా రెడ్డి. ఇక ముచ్చటగా మూడో గ్రాపు పెట్టెల నారాయణ యాదవ్‌ది. చంద్రబాబు వచ్చినప్పుడు పిడతల సాయి కల్పనా రెడ్డి అసలు ఆయనను కలవనే లేదు. అధినేత వస్తుంటే కనీసం సమాచారం ఇవ్వకుండా అవమానించారంటూ పార్టీ నేతలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దామచర్ల జనార్దన్ ఆమెను కలిసేందుకు ప్రయత్నించినా నిరాకరించినట్టు తెలిసింది. యర్రగొండపాలెంలో అయితే సైకిల్ పార్టీ నాలుగు ముక్కలైంది. సీనియర్ నాయకుడు డాక్టర్ మన్నే రవీంద్ర వర్గం ప్రధానంగా ఉండగా ఎరిక్షన్ బాబు, పాలపర్తి డేవిడ్ రాజు, గత ఎన్నికల్లో ఓటమి పాలైన బూదాల అజితరావుది మరో గ్రూపుగా ఎవరిదారి వారిదన్నట్లు వ్యవహరిస్తూ పోతున్నారు. పక్క నియోజకవర్గంలో పార్టీ అధినేత స్వయంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటుంటే ఇక్కడ ఎవరికి వారు విడివిడిగా కార్యక్రమాలు చేపట్టడం గమనార్హం. పార్టీలో కుమ్ములాటలు పక్కనపెట్టిన చంద్రబాబు యర్రగొండపాలెంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న దళితులపై వాళ్ల పార్టీ నాయకులు, కార్యకర్తల చేత రాళ్ల దాడి చేయించే పనికి పూనుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. ఇక దర్శి నియోజకవర్గంలో అయితే పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. పార్టీ కేడర్‌కు మార్గం చూపే నాయకుడే కరువయ్యాడు. దర్శి పార్టీ ఇన్చార్జ్గా ఉన్న పమిడి రమేష్ ఆ బాధ్యతలకు కొంతకాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు. చివరకు ఇన్చార్జ్ పదవికి, పార్టీ సభ్యత్వానికి సైతం సోమవారం రాజీనామా చేయటంతో ఆ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. గతంలో ఆ పార్టీలో ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా చేసిన శిద్దా రాఘవరావు వైఎస్సార్సీపీలో చేరారు. ఆ తరువాత దర్శి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన కదిరి బాబూరావు సైతం పచ్చ జెండాను కిందపడేసి వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో దర్శిలో టీడీపీని ముందుకు నడిపే నాయకుడే కరువయ్యాడు. దీంతో ఇక్కడి పరిస్థితి మరీ దారుణంగా మారింది. సంతనూతలపాడు నియోజకవర్గంలో కూడా నాయకత్వ లోపం స్పష్టంగా కనపడుతోంది. మాజీ ఎమ్మెల్యే విజయకుమార్‌ను ఆ నియోజకవర్గంలో నాయకుడిగా పార్టీ కేడర్ గుర్తించటం లేదు. ఇక్కడ విజయకుమార్ సరిపోడు అని పార్టీ కేడర్ ఒక నిర్ణయానికి వచ్చారు. అందుబాటులో లేకుండా బయటే ఉంటుండడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండపి నియోజకవర్గంలో ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి తీరు పట్ల పార్టీలో కేడర్ కొంత గుర్రుగా ఉంది. కొంతమందిని దగ్గరకు తీసి మరికొంతమందిని పూర్తిగా విస్మరిస్తున్నాడన్న నైరాశ్యం కార్యకర్తల్లో నెలకొని ఉంది. కనిగిరి నియోజకవర్గంలో ఉగ్రనరసింహారెడ్డి వన్ మ్యాన్ షో నిర్వహిస్తూ సెకండ్ కేడర్‌ను పట్టించుకోవడంలేదని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాలినేని దెబ్బకు దామచర్ల విలవిల... జిల్లా కేంద్రం ఒంగోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి దెబ్బకు టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విలవిల్లాడుతున్నాడు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బాలినేని ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నారు. కరోనా సమయంలో తన సొంత డబ్బులు ఖర్చు చేసిమరీ ప్రజలకు, బాధితులకు సేవలందించారు. అదే సమయంలో దామచర్ల ఒంగోలు ముఖం కూడా చూడకుండా బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో తలదాచుకున్నారు. వరదల సమయంలో కూడా ప్రజల సమస్యలు పట్టించుకున్న పరిస్థితి లేదు. వీటికి తోడు దామచర్ల సోదరుడు సత్యతో విభేదాలు భగ్గుమంటున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో దామచర్ల జనార్దన్‌కు టీడీపీ టిక్కెట్టు కూడా దక్కే పరిస్థితి లేదని ఆ పార్టీలోని నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు. బాలినేనిని ఎదుర్కోవాలంటే కొత్త అభ్యర్థి అయితే తప్ప టీడీపీకి వేరే గత్యంతరం లేదన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన నూకసాని బాలాజీని దామచర్ల పూర్తిగా విస్మరించారన్న ఆరోపణలు ఉన్నాయి. దామచర్ల నిర్వహించే సమావేశాలకు కనీసం నూకసానిని పిలవటం కూడా లేదు. దీంతో నూకసాని పాత గుంటూరు రోడ్డులో నుంచి పార్టీ కార్యాలయాన్ని భాగ్యనగర్ మూడో లైన్‌కు మార్చుకున్నారు. టీడీపీ నాయకులను దామచర్ల భాగ్యనగర్‌లోని జిల్లా పార్టీ కార్యాలయానికి కూడా ఎవరూ వెళ్లొవద్దని ఆంక్షలు విధించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో నూకసాని బాలాజీ కార్యాలయం వెలవెలబోతోంది. -
సీఎం జగన్ చొరవతో కిడ్నీ వ్యాధి బాధితునికి భరోసా
ఒంగోలు అర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో కిడ్నీ వ్యాధి బాధితునికి భరోసా లభించింది. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న యువకుడి కుటుంబ సభ్యులకు కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఒంగోలులోని ప్రకాశం భవనంలో ప్రభుత్వం తరఫున గురువారం రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరో రూ.5 లక్షలు వచ్చేలా చర్యలు చేపట్టడంతోపాటు వివిధ రూపాల్లో ఆదుకుంటామన్నారు. ఈబీసీ నేస్తం రెండో విడత ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం మార్కాపురం వచ్చిన సందర్భంగా బాధితుడి తల్లి మారమ్మ ఆయనను కలిసి తన కుమారుడు శ్రీనివాసులు పరిస్థితిని వివరించింది. బీఎస్సీ నర్సింగ్ చదివి ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడని, తనొక్కడే కుటుంబానికి ఆధారమని తెలిపింది. కిడ్నీ చెడిపోయి ఆస్పత్రిలో ఉన్నాడని, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని వైద్యులు తెలిపారని సీఎంకు వివరించింది. చదవండి: టిడ్కో ఇళ్లపై విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి: సీఎం జగన్ స్పందించిన ముఖ్యమంత్రి జగన్ బాధిత కుటుంబానికి సహాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో బాధితుడి తల్లి మారమ్మను గురువారం కలెక్టరేట్‌కు పిలిపించి తక్షణ ఆరి్థక సహాయంగా రూ.లక్ష చెక్కు అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరో రూ.5 లక్షల సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. బాధితుడి అర్హతను బట్టి ఉద్యోగం కూడా ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇడుపూరు లే–అవుట్లో ఇంటిస్థలం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని ఆమెకు ధైర్యం చెప్పారు. -
అక్కచెల్లెమ్మలకు సెల్యూట్
మీ బిడ్డ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం గత 46 నెలల కాలంలో అక్క చెల్లెమ్మలకు సాధికారత కల్పించే దిశగా వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. తల్లి గర్భంలో ఉన్న శిశువు మొదలు 60–100 ఏళ్ల వయస్సులో ఉన్న అవ్వల వరకు అందరికీ మంచి చేస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్య పోషణతో మొదలు పెడితే వృద్ధాప్య పెన్షన్ వరకు అన్ని విధాలా మంచి చేయాలనే తపన, తాపత్రయంతో ముందుకెళ్తున్నాం. రాజకీయంగా నా అక్కచెల్లెమ్మలు పైకి రావాలని, సామాజికంగా, విద్యాపరంగా కూడా సాధికారతను సాధించాలని అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘సన్మానాలు అందుకునే వాళ్లు మాత్రమే గొప్ప వాళ్లు కాదు. నిత్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ.. వారి జీవితాలను మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్న వారందరి బాగు కోసం నిత్యం చిరునవ్వుతో, గొప్ప బాధ్యతతో శ్రమించే ప్రతి అక్క, చెల్లెమ్మ కూడా గొప్ప వాళ్లే. అందుకే వారందరికీ సెల్యూట్ చేస్తున్నా’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇంటింటి దీపాలైన అక్క చెల్లెమ్మలు బాగుంటేనే ఆయా కుటుంబాలు బాగుంటాయని చెప్పారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో బుధవారం ఆయన వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం కింద రెండో విడత నగదు పంపిణీని కంప్యూటర్లో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. 4,39,068 మంది అక్క చెల్లెమ్మలకు రూ.658.60 కోట్లు లబ్ధి చేకూర్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అత్యంత బరువు బాధ్యతలు భుజాన వేసుకున్న 45–60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అక్క చెల్లెమ్మల చేతిలో డబ్బులు పెడితే ప్రతి రూపాయి తమ కుటుంబం బాగోగుల కోసమే ఖర్చు పెడతారని దృఢంగా నమ్ముతున్నామన్నారు. అందుకే వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా అన్ని విధాలా తోడుగా నిలిచామని తెలిపారు. ‘ఇప్పటికే వైఎస్సార్ చేయూత పథకం ద్వారా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తున్నాం. అంతటితో ఆగిపోకుండా కాపు అక్కచెల్లెమ్మల కోసం వైఎస్సార్ కాపు నేస్తం పథకం ప్రారంభించాం. వీరందరితో పాటు ఓసీ వర్గాల్లోని పేద అక్కచెల్లెమ్మలకు మంచి చేయడం కోసం ఈబీసీ నేస్తం పథకానికీ శ్రీకారం చుట్టాం’ అని చెప్పారు. ఈ రెండేళ్లలోనే వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా పేద అక్క చెల్లెమ్మలకు రూ.1,258 కోట్లు వాళ్ల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశామన్నారు. రెడ్లు, కమ్మ, ఆర్య వైశ్యులు, క్షత్రియులు, వెలమలు, బ్రాహ్మణులు తదితర ఓసీ కులాల్లో ఉన్నపేద అక్కచెల్లెమ్మలకూ ఇలా మేలు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టక పోయినా ఈబీసీ నేస్తం, కాపు నేస్తం పథకాలు తీసుకొచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఏం చెప్పారంటే.. అన్ని విధాలా అండగా నిలిచాం ► ఈ 46 నెలల మీ బిడ్డ ప్రభుత్వంలో అమ్మ ఒడి మొదలు వైఎస్సార్ ఆసరా.. వైఎస్సార్ సున్నావడ్డీ, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం.. వైఎస్సార్ ఈబీసీ నేస్తం, విద్యా దీవెన, వసతి దీవెన, షాదీతోఫా, కళ్యాణమస్తు.. విదేశీ విద్యా దీవెన వంటి అనేక పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచాం. ► అక్కచెల్లెమ్మలకు ఇప్పటి వరకు రూ.2 లక్షల 7 వేల కోట్ల లబ్ధి చేకూర్చాం. ఇందులో రూ.లక్షా 42 వేల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా లంచాలు, వివక్షకు తావు లేకుండా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వెళ్లాయని చెప్పడానికి గర్వపడుతున్నాను. ► వైఎస్సార్ చేయూత ద్వారా 26,39,703 మందికి రూ.14,129 కోట్లు, వైఎస్సార్ కాపు నేస్తం కింద 3.56 లక్షల మందికి రూ.1,518 కోట్లు, వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 41.77 లక్షల మందికి రూ.40,094 కోట్లు, అమ్మ ఒడి కింద 44 లక్షల 48 వేల మందికి రూ.19,674 కోట్లు జమ చేశాం. ఒక్క వైఎస్సార్ ఆసరా ద్వారా మాత్రమే 78 లక్షల 75 వేల మందికి ఇప్పటికే రూ.19,178 కోట్లు వాళ్ల ఖాతాల్లో వేశాం. ► ఏకంగా 30 లక్షల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాం. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ ఇళ్లు పూర్తయితే ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఉంటుంది. మొత్తంగా 30 లక్షల మందికి మంచి చేస్తూ రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల ఆస్తి నా అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టినట్లవుతుంది. పొదుపు సంఘాల్లో ఉన్న 1.02 కోట్ల మంది అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద రూ.3,615 కోట్లు ఇచ్చాం. మార్కాపురానికి వరాల జల్లు మీ బిడ్డ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ ఇప్పటికే పూర్తయింది. రెండో టన్నెల్ ఈ సెప్టెంబర్, అక్టోబర్‌లో పూర్తి కాగానే మళ్లీ వచ్చి ప్రారంభిస్తాను. గతంలో నాన్న గారు 36 కిలోమీటర్ల ఈ సొరంగాలను 20 కిలో మీటర్లు పూర్తి చేస్తే, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు ఐదు కిలోమీటర్లు కూడా చేయలేదు. మీ బిడ్డ అధికారంలోకొచ్చాక యుద్ధప్రాతిపదికన ఆ మిగిలిపోయిన 11 కిలోమీటర్లు పూర్తి చేసి, ప్రాజెక్టును అక్టోబర్‌లో ప్రారంభించనున్నం. మార్కాపురం నియోజకవర్గానికి సంబందించి నా సోదరుడు ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి నా దృష్టికి తెచ్చిన వాటికి ఇప్పుడే ఇక్కడే శంకుస్థాపన చేశాం. ఎన్ఎస్పీ కెనాల్ నుంచి పొదిలి దాకా అంటే 17 కి.మీ. పైపులైను ద్వారా పొదిలికి తాగునీరు అందించే కార్యక్రమానికి రూ.50 కోట్లతో పునాది వేశాం. మార్కాపురం మున్సిపాలిటీలో నీటి పనులకు రూ.5.20 కోట్లతో శ్రీకారం చుట్టాం. మెడికల్ కాలేజీ కోసం భూములిచ్చిన రైతులకు ప్రత్యామ్నాయంగా ఇచ్చిన 13 ఎకరాల అభివృద్ధికి సంబంధించి ఎకరాకు మరో రూ.3 లక్షలు ఇచ్చేందుకు అంగీకరిస్తున్నాం. పొదిలి మెయిన్‌రోడ్డు, పొదిలిలో డ్రెయిన్‌కు రూ.13 కోట్లు మంజూరు చేస్తాం. రూ.2 కోట్లతో షాదీఖానా, అంబేడ్కర్ భవనం, బీసీ భవనం మంజూరు చేస్తున్నాం. మన ఇంటి నుంచే ఆధునిక భారతీయ మహిళ ► విద్యా దీవెన, వసతి దీవెన కింద పిల్లల చదువుల కోసం రూ.13,351 కోట్లు ఖర్చు చేయగలిగాం. సంపూర్ణ పోషణ ద్వారా 35 లక్షల మంది బాలింతలు, గర్భిణులకు.. 6 నుంచి 72 నెలల చిన్నారులకు మంచి చేస్తూ రూ.6,131 కోట్లు ఖర్చు చేశాం. ► అక్కచెల్లెమ్మలకు భద్రత పరంగా ‘దిశ’ ద్వారా అండగా నిలిచాం. కోటి 17 లక్షల మంది దిశ యాప్ వారి ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నారు. నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ ద్వారా ఇచ్చే పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏకంగా చట్టం చేశాం. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఇంటి నుంచి రావాలని తపన పడుతూ పాలన సాగిస్తున్నాం. ► ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మేరుగు నాగార్జున, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. -
ప్రియుడు కోసం ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు వస్తే.
సాక్షి, హైదరాబాద్: ఏపీలోని ఒంగోలు చెందిన ఓ బాలిక తను ప్రేమించిన వ్యక్తి కోసం హైదరాబాద్‌కు వచ్చింది. కాగా ప్రేమించిన ఆ యువకుడు ఆమెను సోమవారం రామచంద్రాపురం పట్టణంలోని లింగంపల్లిలో వదిలేసి వెళ్లాడు. దీంతో ఆ బాలిక రోడ్డుపై రోదిస్తూ ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెకు ధైర్యం చెప్పారు. నిజామాబాద్ ప్రాంతానికి చెందిన యువకుడు ప్రస్తుతం పటాన్చెరులో సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడని అతని కోసం ఇక్కడికి వచ్చానని వివరించింది. అతడి ఫోన్ నంబరు కూడా తన వద్ద లేదని సీఐ సంజయ్‌కు చెప్పగా, స్టేట్ హోంకు తరలించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం పోయిందని.. పటాన్చెరు టౌన్: ఉద్యోగం పోయిందని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ పోలీసుల కథనం ప్రకారం..సాయి విల్లాస్‌లో నివాసం ఉండే హరీశ్(30) ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. అయితే ఇటీవలే హరీశ్ ఉద్యోగం పోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందాడు. ఆదివారం భార్య నందిని బయటకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న హరీశ్ చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఇంటికి రాగా ఉరివేసుకొన్న భర్త కనిపించాడు. స్థానికుల సాయంతో భర్తను మదీనగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడు హరీశ్ సోదరుడు రమేశ్ ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
టీడీపీ నేత దామచర్ల జనార్ధన్ దౌర్జన్యం.. సీఐకి బెదిరింపులు
సాక్షి, ఒంగోలు: ఒంగోలు టూటౌన్ పోలీస్ స్టేషన్లో టీడీపీ నేత దామచర్ల జనార్ధనరావు దౌర్జన్యానికి పాల్పడ్డారు. తన అనుచరులతో వెళ్లి పీఎస్‌లో పోలీసులను బెదిరింపులకు గురిచేశారు. పోలింగ్ బూత్‌లో గొడవకు కారణమైన టీడీపీ కార్యకర్తను.. దామచర్ల జనార్ధన్ పీఎస్ నుంచి తీసుకెళ్లారు. నిందితుడిని తీసుకెళ్లొదన్న సీఐపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఎస్పీతో చంద్రబాబు మాట్లాడాతరంటూ నిందితుడిని తీసుకెళ్లారు. అయితే స్టేషన్ హౌజ్ ఆఫీసర్ అనుమతి లేకుండా నిందితుడిని దామచర్ల తీసుకెళ్లడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బరితెగించిన టీడీపీ నేతలు
-
అభివృద్ధి పథంలో ఒంగోలు
-
Ongole: ఇది ఖైదీల బంక్..! రోజుకు రూ.5 లక్షల అమ్మకాలు..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు సంతపేటలోని జిల్లా జైలు వద్ద ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌ను ఖైదీలే నిర్వహిస్తున్నారు. వాహనాల్లో పెట్రోల్, డీజిల్ నింపేవారు.. వాహనాలకు గాలి పట్టే వారితోపాటు క్యాష్ కౌంటర్లో ఉండే వ్యక్తి వరకు అందరూ జీవిత ఖైదు అనుభవిస్తున్న వారే కావడం విశేషం. 2018లో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ బంక్ ఏర్పాటు చేయగా.. ఈ బంక్‌లో స్రత్పవర్తనతో పని చేయడం ద్వారా ఏడుగురు ఖైదీలు శిక్ష తగ్గి ఇళ్లకు వెళ్లిపోయారు. మరో నలుగురికి సైతం శిక్షలు తగ్గి ఇళ్లకు వెళ్లేందుకు అర్హత సాధించారు. ప్రస్తుతం ఇందులో 10 మంది పని చేస్తున్నారు. నిత్యం రూ.5 లక్షల విలువైన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక్కడ పని చేసినందుకు గాను ప్రతి ఖైదీ రోజుకు రూ.200 ఆదాయాన్ని కూడా సమకూర్చుకుంటున్నారు. ఈ బంక్ ద్వారా జైళ్ల శాఖకు నెలకు సుమారు రూ.2.50 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. ఇక్కడ పనిచేస్తే మంచి మార్కులు జీవిత ఖైదీలుగా శిక్ష అనుభవిస్తూ మంచి ప్రవర్తనతో మెలుగుతున్న వారిని మాత్రమే ఆరు బయట ఖైదీలుగా ఎంపిక చేసి పెట్రోల్ బంక్‌లో పనిచేసే అవకాశం కల్పిస్తోంది జైళ్ల శాఖ. బంక్‌లో నెల రోజులపాటు ఖైదీలు పనిచేస్తే 8 రోజుల చొప్పున శిక్ష తగ్గుతుంది. ఎన్ని నెలలు పనిచేస్తే అన్ని నెలలపాటు 8 రోజుల చొప్పున తగ్గించుకుంటూ వెళతారు. దీంతోపాటు ప్రత్యేకంగా సంవత్సరంలో మరో 30 రోజుల శిక్ష తగ్గించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. రాష్ట్ర ఉన్నతాధికారులు సైతం ప్రత్యేకంగా మరో 60 రోజులపాటు శిక్షను తగ్గించే వెసులుబాటు ఉంది. పెరోల్‌పై 14 రోజుల పాటు ఖైదీలు తమ ఇళ్లకు వెళ్లి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. ఆ కాలాన్ని కూడా శిక్షలో తగ్గించేలా వెసులుబాటు కలి్పస్తారు. మొత్తం మీద శిక్షపడిన మూడేళ్ల నుంచి ఈ తగ్గింపు శిక్ష కార్యక్రమాన్ని అమల్లోకి తెస్తారు. మొత్తం మీద శిక్షను తగ్గించే వెసులుబాటు విధించిన శిక్ష కంటే మూడో వంతుకు తక్కువగా ఉంటుంది. ద్విచక్ర వాహనాలకు గాలి పడుతున్న ఖైదీ సుబ్బయ్య స్రత్పవర్తనతో మెలుగుతున్నా హత్య కేసులో నాకు శిక్ష పడింది. ఇప్పటికే పదేళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాను. మంచి ప్రవర్తనతో మెలుగుతుండటంతో ఇక్కడి అధికారులు పెట్రోల్ బంక్‌లో పనిచేసే అవకాశం కల్పించారు. – డి.సుధాకర్, చీరాల, జీవిత ఖైదీ పశ్చాత్తాప పడుతున్నా క్షణికావేశంలో తప్పు చేశా. కుటుంబాలకు దూరమై బాధ పడుతున్నాం. జీవితంలో ఎలాంటి తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నా. ఖైదీలతోపాటు వారి కుటుంబాలు కూడా ఇళ్ల వద్ద ఉండి శిక్ష అనుభవిస్తున్నాయి. శిక్ష పడి ఏడేళ్లు పూర్తయింది. మంచి ప్రవర్తనతో మెలగడంతో పెట్రోల్ బంక్‌లో పనిచేసే అవకాశం కలిగింది. – జి.సుబ్బయ్య, అర్ధవీడు, జీవిత ఖైదీ పరివర్తన తీసుకొచ్చే దిశగా.. ఈ బంక్‌లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మూడు షిఫ్టుల్లో ఖైదీలు పని చేస్తారు. శిక్ష అనుభవిస్తున్న వారిలో పరివర్తన తీసుకొచ్చేలా తీర్చిదిద్దుతున్నాం. వారి ప్రవర్తనను బట్టి ఆరుబయట ఖైదీలుగా మెలిగే వెసులుబాటు కల్పిస్తున్నాం. జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిని మంచి ప్రవర్తనను బట్టి మార్కులు వేస్తాం. తదనుగుణంగా వారి శిక్షాకాలం తగ్గుతుంది. – పి.వరుణారెడ్డి, జైలు సూపరింటెండెంట్ చదవండి: ఓర్చుకోలేక.. ‘ఈనాడు’ విషపు రాతలు.. సీమను సుభిక్షం చేస్తున్నదెవ్వరు? -
పుంజు భళా.. మటన్ కీమా, గుడ్డు, బాదం, ఆయుర్వేద స్నానం.. కనులారా చూడాల్సిందే..
అదో మామిడి తోట..అక్కడ ఎన్నో వింతలు..విశేషాలు.. అక్కడికి వెళితే తిరిగి వెనక్కి రావాలనిపించదు. లోపలకు అడుగు పెట్టగానే రంగు రంగుల, రకరకాల కోళ్లు దర్శనమిస్తాయి. ఇక లోపలకు వెళితే కొక్కొరోకో కూతలు...ఒకటా, రెండా వందల సంఖ్యలో కోడి పుంజులు, పెట్టలతో ఆహ్లాదకరమైన వాతావరణంలోకి అడుగుపెట్టినట్టు అనుభూతి కలుగుతుంది. అది చెబితే తనివి తీరదు. ఆ ఆనందాన్ని కనులారా చూడాల్సిందే.. అక్కడి ప్రత్యేకతలు చెవులారా వినాల్సిందే. ఒంగోలు నగరానికి కూత వేటు దూరంలో యరజర్ల గ్రామం. 4 ఎకరాల్లో కోళ్ల ఫాం ఉంది. ఇక్కడ కోళ్ల పెంపకంలో ప్రత్యేకత ఉంది. మామిడి తోటలో ఉన్న ఈ వాతావరణాన్ని చూసి ఆశ్చర్యపోవాల్సిందే. విభిన్న జాతి రకాల కోళ్లు, కోడి పుంజులను చిన్న పిల్లల్లా వీటిని కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతున్నారు. వీటికి ప్రత్యేక గదులు. దుప్పట్లు.. దోమ తెరలు ఏర్పాటు చేశారు. వీటికి ఆయుర్వేద వనమూలికతో ప్రత్యేక స్నానం. మటన్ కీమా, బాదం, పిస్తా, తేనె, అంజూర్.. ఇలా బలవర్ధకమైన ఆహారం. అనారోగ్యం పాలవకుండా మందులు.. ఇంకా ఎన్నో.. వీటిని సంరక్షించేందుకు నిత్యం పది మంది పనివారు. ఇక్కడ విదేశాల నుంచి తీసుకువచ్చిన కోళ్లు కూడా సందడి చేస్తాయి. ఎన్నో ఆసక్తి కలిగించే విషయాలు, విశేషాలు తెలుసుకుందామా మరి.. యరజర్లకు చెందిన టి.శ్రీనివాసరావు కోడి పుంజుల ఫాంను ఏర్పాటు చేశారు. ఇక్కడ పుంజులకు, బ్రీడర్లకు ప్రత్యేకంగా ఫాంలను ఏర్పాటు చేసి మరీ నిర్వహిస్తున్నారు. 20 ఏళ్ల నుంచి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, కృష్ణా జిల్లా నున్నలోనూ పెంపకం కేంద్రాలు ఏర్పాటు చేశారు. అనంతరం రెండేళ్లుగా స్వగ్రామం యరజర్లలోని తన మామిడి తోటను కోడి పుంజుల ఉత్పత్తి కేంద్రంగా మార్చేశారు. కుక్కుట శాస్త్రంలోనూ లేని విధంగా.. ఎన్నో మెళకువలు గుడ్డు పెట్టించటం మొదలుకొని పొదిగి పిల్ల తయారు, వాటి పెంపకం ...అన్ని దశల్లోనూ ఎన్నో మెళకువలు. వాటికి బలవర్ధకమైన ఆహారం ఇవ్వటం దగ్గర నుంచి ఆరోగ్య పరిరక్షణ వరకూ ఎన్నో జాగ్రత్తలు అన్నీ...ఇన్నీ కావు స్పెషల్ మెనూ... ఇక్కడ కోడి పుంజులకూ బలవర్ధకమైన మెనూ ఉందండీ. బాదం, ఖర్జూరం, అంజూర్, యాలుకలు, రసగుల్లాలు, రంగు రంగుల ద్రాక్షలు, కిస్ మిస్, నాటుకోడి గుడ్డు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంత ఉంది.. వాటికి పరగడపున మొదలుకొని సాయంత్రం వరకు మెనూ సమయాన్ని పాటిస్తారు. ప్రతి రోజూ 30 గ్రాముల లడ్డూ... ప్రతి రోజూ ఒక్కో పుంజుకు ఉదయం 30 గ్రాముల లడ్డూ పెడతారు. బాదం, పిస్తా, అంజూర్, ఖర్జూరం, రెండు మూడు రకాల ఎండు ద్రాక్ష, సొంటి, సోంపు, గసగసాలు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, యాలుక్కాయలు, రసగుల్లలు, పిట్ట దంట్లు వీటన్నింటినీ కలిపి పచ్చడి బండపై రుబ్బు రోలుతో కచ్చపచ్చాగా నూరి సమపాళ్లలో తేనె వేసి లడ్డూలుగా తయారు చేస్తారు. ప్రతి రోజు ఉదయాన్నే 30 గ్రాముల చొప్పున ఒక్కో పుంజుకు తినిపిస్తారు. ఆ తరువాత ఉదయం 10 గంటల లోపు ఉడకబెట్టిన నాటుకోడి గుడ్డు ఇస్తారు. తర్వాత 30 గ్రాముల మటన్ కీమా.. ► మధ్యాహ్నం ఒక్కో పుంజుకు నానబెట్టిన 8 బాదం పప్పు. వాటితో పాటు ఎండు ద్రాక్షలు, కిస్మిస్ ఒక్కోదానికి 10, ఆవుపాలలో నాన బెట్టిన అంజూర్ను తినిపిస్తారు. ఇంకా రకరకాల డ్రై ఫ్రూట్స్‌ను కూడా.. ► సాయంత్రం ధాన్యం, రాగులు, సజ్జలు, చిలకడ గుండ్లు, పిట్టగుండ్లు లాంటి వాటిని సరిపడా ఇస్తారు. కొత్త జాతులు... ఇతర దేశాల జాతులతో సంపర్కం ఇక్కడ రకరకాల కొత్త కోడి పుంజు జాతులను రూపొందిస్తున్నారు. భీమవరం కోడి పెట్ట జాతితో అరేబియా జాతి, ఆఫ్రికా జాతి, ఈము జాతి కోళ్లను సంపర్కం చేయించి మరీ కొత్త రకం జాతులను ఉత్పత్తి చేస్తున్నారు. ► అరేబియా జాతికి చెందిన పెట్టను రూ.70 వేలు వెచ్చించి మరీ ఇక్కడకు తెప్పించారు. ► రూ.3 లక్షల విలువచేసే భీమవరం జాతికి చెందిన సీతువా బ్రీడర్తో కూడా పిల్లల ఉత్పత్తి. ► ఈము పక్షితో భీమవరం జాతి బ్రీడర్‌ను సంక్రమింపజేసి కొత్త రకం జాతి ఉత్పత్తి చేశారు. ► ఆఫ్రికా రకం కోడి కాకి జాతి బ్రీడర్ పుంజుతో మరో రకం ఉత్పత్తి. ► అరేబియా జాతి మైల రకం కోడి ఉంది. ► తెల్ల కొక్కెర పెట్టతో ఇతర జాతుల ఉత్పత్తి ► ఇతర దేశాల జాతి పెట్టలతో దేశీరకం జాతులతో సంపర్కం చేయించి మరీ చురుకైన జాతులను ఉత్పత్తి చేస్తున్నారు. ఆయుర్వేద మూలికలతో చేసిన నీళ్లు మూడు నెలలకొకసారి ఆయుర్వేద స్నానం కోడి పుంజుగా మూడు నెలల వయస్సు వచ్చే సరికి మొదటి ఆయుర్వేద స్నానం ప్రారంభిస్తారు. సాధారణంగా కోళ్లను నీటిలో వదలటం, ఈత కొట్టించటం సర్వసాధారణం. వాటితో పాటు శరీరం గట్టి పడటానికి, శరీరంలోని వృథా నీరు బయటకు పోవటానికి, ఉన్న కొవ్వు కరిగిపోవటానికి, శరీరం ‘‘వజ్రకాయం’’ కావటానికి దోహదపడేలా వాటిని తీర్చిదిద్దుతారు. అందుకే ఆయుర్వేద స్నానంతో పాటు స్టీమ్ బాత్ చేయిస్తారు. తొలుత 50 లీటర్ల నీటిని తీసుకోవాలి. ఆ నీటిలో వెదురు ఆకు, వాయల ఆకు, నల్లతుమ్మ చెక్క, విప్ప పువ్వు, మోదుగు పువ్వు, పచ్చి పసుపు కొమ్ములు, మిరియాలు, స్ఫటిక, వాము, జాజికాయ, జాపత్రి, పచ్చ కర్పూరం కలిపి నీటిలో ఉడకబెట్టాలి. ఆ నీటిని 25 లీటర్ల వరకు వచ్చేలా మరిగించాలి. ఆ తరువాత కొంచెం చల్లనీళ్లలో కలిపి నులివెచ్చగా నీటిని తయారు చేసి ఆ నీటిలో పుంజును మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉంచాలి. ఆ నీటిలో ముంచిన గోనె సంచులను పిండి.. కింద ఒకటి, పైన ఒకటి గోనె సంచులు ఉంచి స్ట్రీమ్ బాత్లాగా వాటిని అందులో ఉంచాలి. ఆ పొగల్లో నుంచి పుంజు శరీరంలోని వృథా నీరు కాస్తా బయటకు వెళ్లిపోతాయి. అరగంట సేపు ఆదమరిచి ఆ పుంజులు సొమ్మసిల్లుతాయి. అరగంట తరువాత ఆ గోనె సంచుల నుంచి వాటిని విడదీసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరల్లో ఉంచాలి. ఈ విధంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆయుర్వేద స్నానం చేయిస్తారు. ఆ తరువాత మూడో రోజు షాంపూలతో స్నానం చేయించటం ఇలా ఎన్నో జాగ్రత్తలు. దీనిద్వారా శరీరంలో ఉన్న రుగ్మతలు కూడా దరిచేరవు. ఆరు నెలలపాటు ప్రత్యేక ర్యాక్‌లలో పెంచుతారు. వీటి కోసం ప్రత్యేక బెడ్లు, దోమ తెరలు ఉంటాయి. ప్రత్యేకంగా తీసుకొచ్చిన గంపలో వీటిని ఉంచి కంటికి రెప్పలాగా కాపాడుతారు. అనారోగ్యం పాలవకుండా మందులు ఇస్తారు. ప్రత్యేక టానిక్‌లు కూడా వేస్తుంటారు. అంతేకాదండోయ్ ప్రతి చెట్టుకూ సీసీ కెమెరాలు కూడా అమర్చారు. ఆసక్తితోనే పెంపకం.. కోళ్లపై చిన్ననాటి నుంచి ఉన్న ఆసక్తితోనే వీటిని పెంచుతున్నాను. వీటికి ఖరీదైన పౌష్టికాహారాన్ని అందించడమే కాకుండా ఆరోగ్యంగా ఉండేలా నిత్యం జాగ్రత్తలు తీసుకుంటాం. పుంజులు, పెట్టలను విడివిడిగా ప్రత్యేక గదుల్లో ఉంచుతాం. విదేశాల నుంచి అరుదైన జాతులను తీసుకువచ్చి క్రాస్ బీడింగ్ చేస్తున్నాం. పాముల నుంచి రక్షించేందుకు ప్రత్యేకంగా వలలను కూడా ఏర్పాటు చేశాం. – టీ శ్రీనివాసరావు, యర్లజర్ల - పట్నాల రవిచంద్ర, ఒంగోలు డెస్క్ ఫోటోలు: ఎం ప్రసాద్ -
ఒంగోలు సిటీ.. ఇదిగో అభివృద్ధి
అభివృద్ధి.. సంక్షేమం రెండు కళ్లుగా సాగుతున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఒంగోలు నగరం రూపురేఖలు మారుతున్నాయి. నగర పాలక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు వెచ్చించి మౌలిక వసతులు కల్పిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూడున్నరేళ్లలో రూ.137.79 కోట్లు వెచ్చించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నగరంలోని ప్రతి ఇంటింటికీ తిరుగుతూ డివిజన్లలోని సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నారు. నూతన నగర పాలకమండలి ఏర్పడిన తరువాత రెండో బడ్జెట్ నేడు ప్రవేశపెట్టనున్నారు. ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరం సమగ్ర అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోంది. ఏడాదికి ఏడాదికి పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని విస్తరిస్తున్న నగరాన్ని పరిగణలోకి తీసుకొని ప్రజల అవసరాలు తీర్చేందుకు కసరత్తు చేస్తున్నారు. భవిష్యత్తు తరాలకు కూడా మౌలిక వసతుల కల్పనలో ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. నగర ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకొని ముందుకు సాగుతున్నారు. ఒంగోలు నగరంలో బాలినేని మార్క్ అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు చేయటమే లక్ష్యంగా యంత్రాంగాన్ని ఉరుకులు.. పరుగులు పెట్టిస్తున్నారు. ప్రస్తుతం ఒంగోలు నగర జనాభా 3,01,572 మందికి చేరింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు బాలినేని ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో వేలాది మంది అర్హులైన పేదలు, మధ్య తరగతి వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించేందుకు ఇంటింటికీ వెళుతున్న బాలినేనికి స్వయంగా లబ్ధిదారులు ‘ఇది మీరు ఇచ్చిన ఇల్లే వాసన్నా’ అంటూ కృతజ్ఞతలు చెబుతున్నారు. 11వ డివిజన్లో సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్లకు శంకుస్థాపన చేస్తున్న ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని, పక్కన మేయర్ గంగాడ (ఫైల్) కోట్ల రూపాయలతో మౌలిక వసతుల కల్పన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఒంగోలు నగరంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్ల నిర్మాణాలు చేపడుతున్నారు. నగరంలో మొత్తం 50 డివిజన్లలో సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్ల నిర్మాణాలు చేపట్టేందుకు 1013 పనులు మంజూరు చేశారు. అందుకుగాను రూ.101.67 కోట్ల సాధారణ నిధుల నుంచి ఖర్చు చేయటానికి పూనుకున్నారు. వాటిలో ఇప్పటికే 641 పనులు పూర్తయ్యాయి. మరో 71 పనులు కొనసాగుతున్నాయి. 301 పనులు ప్రారంభించాల్సి ఉంది. 2019 నుంచి 2022 వరకు షెడ్యూల్డ్ క్యాస్ట్ సబ్ ప్లాన్ కింద మొత్తం రూ.కోటి వెచ్చించి 12 పనులు చేపట్టి పూర్తి చేశారు. ఎంపీ లాడ్స్ కింద రూ.20 లక్షలు వెచ్చించి నాలుగు పనులు పూర్తి చేశారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి 14వ ఫైనాన్స్ కింద మంచినీటి సరఫరా పనులతో పాటు మొత్తం 3 పనులకు రూ.6.84 కోట్లు వెచ్చించారు. 2020–21 ఆర్థిక సంవత్సరానికిగాను 15వ ఆర్థిక సంఘంలో భాగంగా మొత్తం 29 పనులు చేపట్టారు. అందుకుగాను రూ.16.87 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో 6 పనులు పూర్తి కాగా మరో 14 పనులు ప్రారంభించాల్సి ఉంది. ఒంగోలు నగరంలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించి నూతనంగా ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లు మంజూరయ్యాయి. ఒక్కో అర్బన్ హెల్త్ సెంటర్‌కు ప్రభుత్వం రూ.80 లక్షల చొప్పున మంజూరు చేసింది. వాటిలో కొన్ని పూర్తికాగా కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. మరో నాలుగు పాత అర్బన్ హెల్త్ సెంటర్లను ఒక్కో దానిని రూ.10 లక్షలు వెచ్చించి ఆధునికీకరించారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద ఆరు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.1.58 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆ పనులు జరుగుతున్నాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తయిన డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం 20 పనులు మంజూరు చేసింది. అందుకోసం ఒక్కో డివిజన్‌కు రూ.20 లక్షల చొప్పున మంజూరు చేసింది. ఇప్పటికే 11 పనులు ప్రారంభించి జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి అభివృద్ధి నిధుల్లో భాగంగా మూడు పనులకు గాను రూ.22.95 లక్షలు మంజూరు చేశారు. వాటిలో రెండు పనులు జరుగుతున్నాయి. మరొక పనిని ప్రారంభించాల్సి ఉంది. జగనన్న హరిత నగరాల్లో భాగంగా ఒంగోలు నగరంలో మొక్కలు నాటడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించేందుకు రూ.2.62 కోట్లు కేటాయించారు. పచ్చదనాన్ని పెంపొందించే ప్రణాళికలు ప్రారంభించారు. గుండ్లకమ్మ నుంచి ఏర్పాటు చేసిన మంచినీటి పథకం అమృత్ మొదటి విడత పనులు రూ.75 కోట్లతో కొనసాగుతున్నాయి. రూ.209 కోట్లతో అంచనా బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వైనం 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను సోమవారం జరగనున్న ఒంగోలు నగర పాలక సంస్థ పాలక మండలి రూ.209 కోట్లతో అంచనా బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన కౌన్సిల్ సమావేశ మందిరంలో బడ్జెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పాలక మండలి ఏర్పాటైన తరువాత ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్ ఇది. ఆదాయం, రాబడులు, జీతాలు, ఒంగోలు నగర పాలక సంస్థ నిర్వహ ణ, అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు అన్నీ కలుపుకొని రూ.196 కోట్ల ఖర్చు లు పోను రూ.13 కోట్ల మిగులుతో కౌన్సిల్ ఆమోదించనుంది. మౌలిక వసతుల కల్పన దిశగా అడుగులు ఒంగోలు నగరంలో మౌలిక వసతుల కల్పన దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాను. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరంలో అభివృద్ధి పనులు వేగవంతంగా చేపడుతున్నాం. నగర శివారు ప్రాంతాల్లోనూ ప్రజల అవసరాలు తీర్చేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించాం. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా నగరాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంచనా బడ్జెట్‌ను రూపొందించాం. కౌన్సిల్ సమావేశంలో చర్చ అనంతరం ఆమోదింపజేసుకొని ముందుకు సాగుతాం. – ఎం.వెంకటేశ్వరరావు, కమిషనర్, ఒంగోలు నగర పాలక సంస్థ -
వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ హైలైట్స్
-
వీరసింహరెడ్డి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతి నిరాకరణ వార్తల్లో నిజం లేదు
-
వీరసింహరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్పుపై స్పందించిన అడిషనల్ ఎస్పీ
సాక్షి, ఒంగోలు (ప్రకాశం జిల్లా): బాలకృష్ణ చిత్రం వీరసింహరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్పుపై వస్తున్న వార్తలపై అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు వివరణ ఇచ్చారు. ఈవెంట్‌కి పోలీసులు మొదట అనుమతి ఇచ్చి తర్వాత అనుమతి నిరాకరించారంటూ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. మొదట ఏబీమ్ స్కూల్ ఆవరణలో వీరసింహరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నిర్వహకులు సన్నాహాలు చేసుకున్నారని.. ఆ విషయం మేం తెలుసుకొని నిర్వాహకులతో మాట్లాడి.. అక్కడ ఈవెంట్ చేస్తే పార్కింగ్‌కి, ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతుందని నచ్చ చెప్పామన్నారు. పక్కనే రైల్వే స్టేషన్, ఆసుపత్రులు ఉనందున్న ప్రజల రాకపోకలకు ఇబ్బందవుతుందని సూచించామని అడిషనల్ ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది లేని ప్రదేశంలో ఈవెంట్ జరుపుకోమని సూచించామని, దానికి నిర్వాహకులు కూడా సమ్మతించి.. ఈవెంట్ ప్లేస్ మార్చుకున్నారన్నారు. మొదట మేము అనుమతి ఇచ్చి ఆ తర్వాత వెనక్కి తీసుకున్నామన్న వార్తలలో వాస్తవం లేదని ఆయన తెలిపారు. రేపు ఒంగోలు-గుంటూరు రోడ్డు అర్జున్ ఇన్ఫ్రాలో జరిగే వీరసింహరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వారు అడిగిన దాని కన్నా ఎక్కువే భద్రత ఇస్తున్నామని అడిషనల్ ఎస్పీ చెప్పారు. ట్రాఫిక్‌ను కూడా డైవర్ట్ చేస్తున్నామని, ఇటువంటి ఇబ్బంది లేకుండా హీరో బాలకృష్ణ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌కి సహకరిస్తున్నామని అడిషనల్ ఎస్పీ తెలిపారు. చదవండి: సూసైడ్ చేసుకునేవాడినంటూ బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్.. ఆయన లేకపోతే.. -
సన్నాయి ఊదలేం.. బసవన్నను ఆడించలేం
సన్నాయి, మేళతాళాలతో ఓ రాముడూ అమ్మగారికి నమస్కరించు.. అయ్యగారికి దండం పెట్టూ.. సీతమ్మా వచ్చి రాముడు పక్కన నిలబడు... లక్ష్మణా రాముడు పక్కన నిలబడు... హనుమంతూ పల్టీలు కొట్టు ఇలా ఇంటి ముంగిట వాకిట ముగ్గులలో గొబ్బెమ్మల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ బసవన్నలను ఆడిస్తూ అందరినీ ఆహ్లాదపరుస్తారు గంగిరెద్దుల వాళ్లు. సంక్రాంతి వచ్చిందంటే వీరికి మూడు నెలలు పండగే. గజ్జెలు కట్టి.. రంగురంగుల వస్త్రాలతో బసవన్నలను అలంకరించి ఊరూరా తిరుగుతూ సందడి చేస్తారు. వీరి జీవనాన్ని ఒక్కసారి పరికిస్తే మనసును బాధించే ఎన్నో కష్టాలు మన ముందు ఉంచుతారు. వారి మదిని ఒక్కసారి తడితే వారి భవిష్యత్ అందర్నీ కలచివేయక మానదు. సంప్రదాయ బద్ధంగా వస్తున్న కళను వదులుకోలేక.. భారమైనా జీవితాన్ని ఈడ్చుకుంటూ వస్తున్నారు. ఉన్న ఊరు వదిలి వందల కిలోమీటర్లు వచ్చి ఊరికి దూరంగా ఉన్న ఖాళీ స్థలాల్లో గుడారాలు వేసుకుని బతుకు బండి లాగుతున్న వీరిని చూస్తే గుండె బరువెక్కక మానదు. ప్రస్తుతం సంక్రాంతి పండుగ సందర్భంగా వారి జీవన విధానాన్ని తెలుసుకుందామని నగరంలోని ముంగమూరుడొంక వెళ్లాం. అక్కడ ఉన్న ఖాళీ స్థలాల్లో చిన్న చిన్న గుడారాలు వేసుకుని పిల్లాజెల్లాతో నివాసం ఉంటున్నారు. సుమారు 60 నుంచి 80 గుడారాలు కనిపించాయి. అక్కడున్న వారిలో పెద్దాయన బత్తుల సబ్బయ్యను కలిశాం. ‘సంప్రదాయంగా వస్తున్న ఈ కళకు ఆదరణ తగ్గిపోయింది. ఇన్నాళ్లు బసవన్నలను పట్టుకుని అందంగా సింగారించి ఇంటింటికీ వెళ్లి భిక్షాటన చేసే వాళ్లం. అలసిపోయాం. మాతో పాటు గంగిరెద్దులు కూడా అడుగులు వేయలేని పరిస్థితి. ఇక అందరం ప్రత్యామ్నాయ వృత్తులకు పోయి కడుపు నింపుకుంటున్నాం. సంకురాత్రి వచ్చిందంటే నాలుగు డబ్బులు కనిపిస్తాయి. అవి కూడా బసవన్నల పోషణకు సరిపోతాయి. మా పిల్లలు వేరే పనులకు వెళ్లి తెచ్చిన డబ్బుతో మా కడుపులు నిండుతాయి..’ అంటూ చెమర్చిన కళ్లతో చెప్పుకొచ్చాడు సుబ్బయ్య. ‘ఏడాదిలో రెండుమూడు నెలలు మాత్రమే ఉపాధి ఉండటంతో మిగతా ఏడాది అంతా గంగిరెద్దుల పోషణ గగనమవుతోంది. రానురాను సంప్రదాయ కళకు ప్రోత్సాహం కూడా సన్నగిల్లుతోంది. ఆచారాన్ని పోగొట్టలేక భారమైనా ఈడ్చుకొస్తున్నాం’ అని అంటున్నారాయన. సుమారు రూ.10 వేలు ఖర్చు చేసి గంగిరెద్దులను సింగారిస్తాం. రెండు నెలల పాటు ఊరూరా తిరిగితే దయగల మహానుభావులు చేసే దానధర్మాలతో వచ్చిన డబ్బుతో కాలం వెళ్లిపోతుంది. కొంత మంది దానం చేసిన దుస్తులను సైతం బసవన్నల అలంకరణకే వాడుకుంటాం. దాదాపు 40 ఏళ్ల పాటు గంగిరెద్దులతో తిరిగా. ఇప్పుడు ఆరోగ్యం సహకరించడంలేదు. వైద్యానికి ఆర్థికంగా ఇబ్బంది ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నా. మాయావిడ తెల్లవారుజామునే బజారుకెళ్లి పండ్లు తీసుకొస్తది. వాటిని సైకిల్ రిక్షాపై వేసుకుని ఒంగోలు నగర వీధుల్లో తిరుగుతూ విక్రయిస్తున్నా. మా పిల్లలు కూడా 8వ తరగతి వరకూ చదువుకుని వేరే పనులకు వెళ్తున్నారు. మాకు సొంత గూడు అంటూ ఏమీ లేదు. ఖాళీ స్థలాల్లో గుడారాలు వేసుకున్నాం. ఈ స్థలం మాది.. ఖాళీ చేయండి అంటే వేరే ప్రాంతానికి పోతాం అంటున్నాడు సుబ్బయ్య. గంగిరెద్దుల తరం వారికి ప్రకాశం జిల్లా పెట్టింది పేరు. జిల్లాలోని తర్లుపాడు మండలం నాగళ్లముడుపు గ్రామంలో ప్రధాన ఆచారంగా దాదాపు 500 కుటుంబాలు జీవనాన్ని సాగిస్తున్నాయి. అదేవిధంగా వెలిగండ్ల మండలం గణేశునిపల్లె గ్రామంలోనూ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. వీరిని ఆధారం చేసుకుని గుంటూరు జిల్లా వినుకొండ దగ్గర ఉప్పరపాలెం, నెల్లూరు జిల్లా కొల్లపూడి, కంటేపల్లి, మనుబోలు గ్రామాల్లో ఆచారాన్ని కొనసాగిస్తున్న వారూ ఉన్నారు. పోషణ గగనం కావడంతో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు వెతుక్కుంటున్నారు. రకరకాల వ్యాపకాలతో జీవనోపాధి పొందుతున్నారు. నాలుగు నెలలు శిక్షణ... వీరి ఆచారం ప్రకారం రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సీత అని పేర్లు పెట్టుకుంటారు. కొత్తగా తీసుకొచ్చిన గిత్తలకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇస్తారు. వాటికి ఆట, పాట నేర్పిస్తారు. కాళ్లు ఆడించడం.. చేతులు తొక్కడం.. నమస్కారాలు చేయడం వంటి అంశాల్లో నాలుగు నెలల పాటు తర్ఫీదు ఇస్తారు. రాముడూ ఇలా వచ్చి బాబుగారికి సలాం చేయి అంటే బసవన్నలు చేయాల్సిందే. కొత్తగా వచ్చిన గిత్తలు బెదరకుండా చూసుకుంటూనే రంగంలోకి దింపుతారు. పలిగాపులో (నోట్లో తలపెట్టడం) కూడా శిక్షణ ఇస్తారు. ఒంటి నిండా రంగురంగుల దుస్తులతో వీటిని అలంకరించడంతో మండుటెండల్లో ఇవి ఇబ్బంది పడతాయి. కొన్ని పొగరు గిత్తలైతే శివాలు ఎత్తుతాయి. కులపెద్దలదే తీర్పు... ఎవరైనా తప్పు చేస్తే ముందుగా వీరి కులంలోని పెద్దలు పంచాయితీ చేస్తారు. తప్పు చేశారని రుజువైతే వారే శిక్షవేస్తారు. వారి తీర్పు శిరోధార్యం. అక్కడ కూడా న్యాయం జరగకపోతే పోలీస్స్టేషన్లకు వెళ్తారు. డిగ్రీ, ఇంజినీరింగ్ చదువులు... గంగిరెద్దుల వంశానికి చెందిన కొందరు వాటికి ఆటపాటలు నేర్పి సంక్రాంతి పండుగ నెలల్లో ప్రతి ఇంటి ముందు ప్రత్యేక అలంకరణలతో డూ..డూ బసవన్నలు చేసే విన్యాసాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. మరికొందరు ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఉన్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు రాక దుకాణాల్లో, ఫ్యాక్టరీల్లో చిన్న, చిన్న పనులు చేసుకుని పొట్టపోసుకుంటున్నారు. చాలా మంది ఐదారు తరగతుల వరకూ చదువుకుని ఆర్థిక ఇబ్బందులతో ముందుకు వెళ్లలేక కూలి పనులకు వెళ్తున్నారు. మా కష్టాలు గుర్తించండి... సంకురేత్రి నెల మొదలు శివరాత్రి వరకూ గంగిరెద్దులతో ఇంటింటా తిరుగుతూ బసవన్నలతో సందడి చేస్తాం. మా ఆచారం ప్రకారం అందరం ఆరు నెలలు పట్నంలో ఉంటాం. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల్లో పెళ్లిలకు మేళాలు వాయిస్తాం. ఇతర పనులకు వెళ్తాం. నాలుగు డబ్బులు సంపాదించుకుని తిరిగి వినాయక చవితికిగానీ, దసరాకుగానీ సొంతూళ్లకు వెళ్లిపోతాం. అక్కడ పొలం పనులు చేసుకుంటాం. గంగిరెద్దులకు పొలంలో వచ్చిన జొన్న, వరిగడ్డి ఆహారంగా పెడతాం. డిసెంబర్ మొదటి వారంలో పట్టణాలకు చేరుకుని సంకురేత్రికి ఎద్దులను ఆడించుకుంటూ జీవనం సాగిస్తాం. కొంత మంది కూలి పనులకెళ్తారు. నేనూ, నా కుటుంబ సభ్యులు (నలుగురు) రెండు బృందాలుగా విడిపోయి రోజంతా తిరిగితే రూ.1,000 నుంచి రూ.1,500 వస్తాయి. అందులో గంగిరెద్దులకు ఆహారం పోతే మాకు అంతంత మాత్రమే మిగులుతుంది. ఆవు కంటతడి పెడితే ఇంటికి మంచిది కాదు. వాటిని కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటాం. గంగిరెద్దులను ఏదైనా ఉత్సవాలకు తీసుకెళ్తే అక్కడ కచ్చితంగా సీతారాముల కల్యాణం ఉండి తీరాల్సిందే. అన్ని జాతుల వారికి కాలనీలు ఉన్నాయి. మాకు మాత్రం ఎక్కడా లేవు. పేర్నమిట్ట దగ్గర స్థలాలు ఇస్తే బాగుంటుంది. పాలకులు మా కష్టాలను గుర్తించండి. – బి.వీరయ్య, ఒంగోలు -
‘నేను మోనార్క్‌ని నన్నెవరూ మోసం చేయలేరు..’
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘‘నేను మోనార్క్‌ని నన్నెవరూ మోసం చేయలేరు...’’ ఓ సినిమాలో డైలాగు. అదే మాదిరిగా ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ) ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ సుధాకర్ పనితనం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన వ్యవహార శైలిపై ఇటు విద్యార్థులు.. అటు ఉద్యోగులూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు పలు ఫిర్యాదులు సైతం వెళ్లాయి. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా బాధ్యతలు స్వీకరించిన సమయంలోనే వైద్య విద్యార్థుల స్నాతకోత్సవం జరిగింది. ఆ కార్యక్రమానికి అప్పట్లో స్థానిక మంత్రిని గాని, కలెక్టర్‌ను గాని, ఎంపీని కానీ ఆహా్వనించలేదు. ఇదేంటని వైద్య విద్యార్థులు ప్రశ్నిస్తే ‘‘మీకు సర్టిఫికెట్లు కావాలా... అతిథులు కావాలా’’ అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల మెడికల్ కాలేజీకి సంబంధించిన మెస్ విషయంలోనూ ఈయన వ్యవహరించిన తీరుపై పెద్ద వివాదం జరిగింది. చివరకు కలెక్టర్ జోక్యంతో సద్దుమణిగింది. వీడియో కాన్ఫరెన్స్‌లకు గైర్హాజరు రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ నుంచి జిల్లా స్థాయిలో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లకు ప్రిన్సిపల్ తరచూ గైర్హాజరు అవుతుంటారు. కలెక్టర్, రాష్ట్ర స్థాయి అధికారుల వీడియో సమావేశాలైనా...వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి జరిగితే ప్రిన్సిపల్ హాజరైన దాఖలాలు లేవు. ఇదిలా ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియను చేపడితే దానిలో సైతం అటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కానీ, ఇటు జీజీహెచ్ అధికారులకు కానీ సహకరించకుండా జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఎనీమియా వ్యాధికి సంబంధించి సర్వే చేయాల్సి ఉండగా దానిపై ప్రొఫార్మా తయారు చేసే విషయంలోను ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిసింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులే తయారు చేసి కలెక్టర్‌కు సమర్పించారు. మహిళా ఉద్యోగి రాజీనామా... ప్రిన్సిపల్‌తో పాటు ఈయన అనుచరుల వేధింపుల దెబ్బకు ఒక మహిళా ఉద్యోగి తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేశారు. ప్రిన్సిపల్‌కు ప్రధాన అనుచరుడుగా ఉన్న మెడికల్ కాలేజీలో ఎల్రక్టీషియన్ కూడారి ఆంజనేయులు మహిళా ఉద్యోగిపై లైంగికంగా వేధింపులకు గురిచేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఆమె 2022 అక్టోబర్ 20న రిమ్స్ అవుట్ పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆంజనేయులుపై ఒంగోలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ విషయమై ప్రిన్సిపల్‌కు కూడా ఫిర్యాదు చేసింది. అయినా అతని అనుచరుడు కావటంతో చర్యలు తీసుకోలేదు. దీనిపై మనస్థాపం చెందిన మహిళా ఉద్యోగి రాజీనామా చేసింది. దళిత సామాజిక వర్గానికి చెందిన అటెండర్లు ఆయనకు కనీసం ఆహారం కూడా అందించకూడదనే మౌఖిక ఆదేశాలు జారీ చేశాడంటే ఆ సామాజిక వర్గాల ఉద్యోగులంటే ఎంత చిన్న చూపో ఉందో అర్థమవుతోంది. చదవండి: ఆఫీస్‌కు వచ్చి పని చేయాల్సిందే.. చివరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ షాకింగ్ నిర్ణయం బయోమెట్రిక్ నుంచి మినహాయింపు రూల్ ఈజ్ రూల్...రూల్ ఫర్ ఆల్...కానీ ఈ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్‌కు మాత్రం కొన్ని మినహాయింపులు. విధి నిర్వహణకు వచ్చిన సమయంలో ఉద్యోగులందరూ బయో మెట్రిక్ ద్వారా హాజరు వేయాలి. కానీ ఈయనకు బయో మెట్రిక్ విధానం మినహాయింపు. ఆయన ఎప్పుడైనా రావచ్చు...వెళ్లిపోవచ్చు...అసలు రాకుండా కూడా ఉండవచ్చు. ఇదీ ఆయన తీరు. ఆరోపణలన్నీ అవాస్తవమే.. నాపై వచ్చినవన్నీ నిరాధారమైన ఆరోపణలే. మహిళా ఉద్యోగి విషయంలో లేనిపోని రాజకీయాలు చేస్తున్నారు. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాత్రమే నేను పని చేస్తున్నాను. సెలవులు ఎవరైనా పెట్టుకోవచ్చు. గైర్హాజరైతేనే ఒప్పుకోను. – డాక్టర్ పీవీ సుధాకర్, జీఎంసీ ప్రిన్సిపాల్ -
'ఆ కుటుంబం వద్ద రూ.5కోట్లు తీసుకున్న ఘనుడు దామచర్ల జనార్ధన్'
సాక్షి, ప్రకాశం: భూ ఆక్రమణలపై టీడీపీ నేత దామచర్ల జనార్ధన్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. రెండు కుటుంబాల మధ్య భూవివాదంలో ఓ కుటుంబం వద్ద రూ.5కోట్లు తీసుకున్న ఘనుడు దామచర్ల జనార్ధన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంలో రూ.5కోట్లు తీసుకోలేదని దామచర్ల ప్రమాణం చేయగలారా? అంటూ ప్రశ్నించారు. బ్యాంకులను మోసం చేసి రూ.100కోట్లు కొట్టేసిన చరిత్ర ఆయనది అంటూ ఫైర్ అయ్యారు. రానున్న రోజుల్లో దామచర్ల జనార్ధన్ అవినీతి బాగోతాలపై ఈడీకి ఫిర్యాదు చేస్తామని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. చదవండి: (కట్టుకథలు..విషపురాతలు.. ఎమ్మెల్యే కేతిరెడ్డిని టార్గెట్ చేస్తూ కథనాలు) -
‘రాముడూ.. మేమెలా బతకాలిరా...’
సాక్షి, ఒంగోలు: మూడు కుటుంబాలకు జీవనాధారం ఆ గంగిరెద్దు. కుటుంబంలో ఒకరిగా ఉండే ఆ ఎద్దుకు ముద్దుగా వారు పెట్టుకున్న పేరు రాముడు. కాస్త గడ్డి వేస్తే తన కడుపు నింపుకొంటూ.. ఏడేళ్లుగా మూడు లంబాడీ కుటుంబాల ఆకలి తీరుస్తోంది. ఎవరు చెయ్యెత్తినా ఆగి విశ్వాసాన్ని ప్రదర్శించేది. అయితే ఏమైందోగానీ సోమవారం రాత్రి 11 గంటల సమయంలో హఠాత్తుగా ‘రాముడు’ మరణించాడు. దీంతో యజమాని వీరయ్యతో పాటు మూడు కుటుంబాలు కన్నీరు మున్నీరయ్యారు. 33వ డివిజన్ కార్పొరేటర్ నియంతారెడ్డి, పెద్దిరెడ్డి భాస్కరరెడ్డి ద్వారా సమాచారం అందుకున్న పశు సంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ బేబీరాణి, ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జేడీ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాలిచ్చే జంతువులు చనిపోయినపుడు మాత్రమే పరిహారం అందుతుందన్నారు. అయితే ఎద్దు మరణంతో మూడు కుటుంబాలకు జీవనాధారం పోయిన నేపథ్యంలో పరిహారం వచ్చేందుకు కృషి చేస్తానని హాబీ ఇచ్చారు. గుండెపోటు వల్లే ఎద్దు మరణించిందని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు. గంగిరెద్దు అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని నగరపాలక సంస్థ సిబ్బందికి కమిషనర్ వెంకటేశ్వరరావు సూచించారు. చదవండి: (Egg Prices: కొండెక్కిన కోడిగుడ్డు.. సామాన్యుల బెంబేలు) -
Prakasam District: వికేంద్రీకరణకు మద్దతుగా మానవహారం
సాక్షి, ప్రకాశం జిల్లా: రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ సభ జరిగింది. అనంతరం వందలాది మంది కార్యకర్తలతో మానవహారం నిర్వహించి మూడు రాజధానులకు మద్దతు ప్రకటించారు. చంద్రబాబు తీరుపై ఇంచార్జ్ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు రాజధానిని గ్రాఫిక్స్‌తో మురిపించి రాష్ట్ర ప్రజలను మోసం చేసారని బాలినేని ధ్వజమెత్తారు. రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ తప్ప వెలగబెట్టింది ఏమి లేదని బాలినేని మండిపడ్డారు. విశాఖపట్నం లాంటి పెద్ద నగరంలో శాసన రాజధాని ఉంటే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ముళ్ళకంపళ్లలో రాజధాని పెట్టి ఒక వర్గాన్ని అభివృద్ధి చేద్దామని చంద్రబాబు కలలు కన్నారని మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు. ఇప్పటికే చంద్రబాబు రాష్ట్రాన్నీ కొల్లగొట్టేశాడని మంత్రి మండిపడ్డారు. చదవండి: మూడు రాజధానులకు మద్దతుగా సత్యాగ్రహ దీక్ష -
వైఎస్సార్సీపీ సీనియర్ నేత సింగరాజు వెంకట్రావు కన్నుమూత
ఒంగోలు: వైఎస్సార్సీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు (55) అనారోగ్యంతో మంగళవారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన కొన్ని నెలలుగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. కోలుకుంటున్నారని అందరూ భావిస్తున్న సమయంలో ఆయన మరణవార్త తెలియడంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. హైదరాబాద్ నుంచి మంగళవారం మధ్యాహ్నం భౌతికకాయాన్ని ఒంగోలు బండ్లమిట్టలోని ఆయన నివాస గృహానికి తీసుకొచ్చారు. కన్నీటి పర్యంతమైన బాలినేని దంపతులు.. వెంకట్రావు భౌతికకాయం ఒంగోలుకు రాగానే వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన సతీమణి శచీదేవి, కుమారుడు బాలినేని ప్రణీత్‌రెడ్డి అక్కడకు చేరుకున్నారు. వెంకట్రావు భౌతికకాయాన్ని పట్టుకుని బాలినేని కన్నీటి పర్యంతమయ్యారు. నగరంలో మంచి అభిమానాన్ని సంపాదించుకున్న సింగరాజు వెంకట్రావు భౌతికకాయాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఫోన్లో పరామర్శించిన మంత్రి సురేష్.. సింగరాజు వెంకట్రావు మృతికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకట్రావు కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. వెంకట్రావు పారీ్టకి అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నామన్నారు. ఇదీ వెంకట్రావు ప్రస్థానం.. సింగరాజు వెంకట్రావు నగరంలో వైఎస్సార్ సీపీకి ఎంతో కీలకమైన నేత. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి అత్యంత నమ్మకస్తుడు. వైఎస్సార్ సీపీ ప్రతిపక్షంలో ఉన్నా...అధికారంలో ఉన్నా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో, టీడీపీ ప్రభుత్వంలో అద్దంకి బస్టాండ్‌లో దుకాణాలను కూల్చివేసిన సమయంలో అండగా నిలబడి కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపారు. కమ్మపాలెంలో వైఎస్సార్ సీపీ కార్యాలయం ప్రారంభాన్ని టీడీపీ నేతలు అడ్డుకున్న సమయంలోనూ ఆయన వారిని ఎదిరించి నిలిచారు. ఈ క్రమంలో జైలుకు సైతం వెళ్లారు. పారీ్టలో ఆయన సేవలకు గుర్తింపుగా సింగరాజు వెంకట్రావు సతీమణి మీనాకుమారికి ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తొలి చైర్‌పర్సన్‌గా నామినేటెడ్ పోస్టు కేటాయించారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యానికి గురై కన్నుమూయడం అందరినీ కలిచివేసింది. వెంకట్రావుకు భార్య మీనాకుమారితో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకట్రావు భౌతికకాయానికి నగర మేయర్ గంగాడ సుజాత, బైరెడ్డి అరుణ, కుప్పం ప్రసాద్, వేమూరి సూర్యనారాయణ, వెలనాటి మాధవరావు, కటారి శంకర్, గంటా రామానాయుడు, సింగరాజు రాంబాబు, తోటపల్లి సోమశేఖర్, దామరాజు క్రాంతికుమార్, పంది రత్నరాజు, కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, హరిబాబు, పటాపంజుల శ్రీనివాసులు, బొట్ల సుబ్బారావు, పెద్దిరెడ్డి భాస్కరరెడ్డి, షేక్ మీరావలి ఇతర నేతలు నివాళులర్పించారు. నేడు అంత్యక్రియలు... బుధవారం స్థానిక బండ్లమిట్టలోని వెంకట్రావు నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
మూడు రాజధానుల కోసం గళమెత్తిన విద్యార్థి లోకం
ఒంగోలు సబర్బన్: మూడు రాజధానుల కోసం విద్యార్థి లోకం గళమెత్తింది. ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అంటూ ఒంగోలు నగరం మార్మోగింది. శనివారం వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ముంగమూరు రోడ్డు జంక్షన్ నుంచి లాయర్ పేట షిర్డీ సాయిబాబా గుడి వరకు సాగింది. విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ.. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు పరిపాలనా వికేంద్రీకరణ జరిగిన నాడే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి పథంలో నడుస్తాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని చూస్తుంటే.. ప్రతిపక్ష టీడీపీతో పాటు దాని తోక పార్టీలు అమరావతే రాజధాని కావాలని పట్టుబట్టడం వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారాలే కారణమని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ యువనేత బాలినేని ప్రణీత్‌రెడ్డి మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు అవశ్యమని పేర్కొన్నారు. తెలంగాణ విషయంలో మోసపోయింది చాలదన్నట్లు అమరావతి ఒక్కదానినే రాజధానిని చేయాలని టీడీపీ పట్టుబట్టడం వెనుక ఆంతర్యం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనని అన్నారు. అమరావతిలో రాష్ట్ర సచివాలయం నిర్మిస్తే వర్షం వస్తే వర్షపు నీరు కారి బకెట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చిన ఘనత టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుదేనని విమర్శించారు. రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని కోరుకోవాల్సింది పోయి ఏ ప్రాంతం ఏమైపోతే మాకేమి.. అమరావతి ఒక్కటే బాగుపడితే చాలు అన్న చందంగా చంద్రబాబు ఉండటాన్ని మిగతా ప్రాంతాల ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రేల్లా అమర్నాథరెడ్డి, రాష్ట్ర ఆర్యవైశ్య ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాదు, విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు దాట్ల యశ్వంత్, విద్యార్థి విభాగం నాయకులు కొండూరు నవీన్, కృష్ణారెడ్డి, పురిణి శ్రీనివాసులురెడ్డి, నరశింహ, శ్రీకాంత్‌రెడ్డి, చంద్ర, హరీష్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. -
రెచ్చిపోయిన మృగాలు.. స్కూటీపై వెళ్తున్న మహిళను అడ్డుకుని పొల్లాల్లోకి లాక్కెళ్లి..
ఒంగోలు సబర్బన్: రాత్రివేళ స్కూటీపై ఇంటికి వెళ్తున్న ఓ మహిళను ఇద్దరు యువకులు అడ్డుకుని అఘాయిత్యానికి పాల్పడ్డారు. చిమ్మచీకట్లో పొలాల్లోకి లాక్కెళ్లి లైంగికదాడి చేశారు. ఒంగోలులోని కొప్పోలు–ఆలూరు రోడ్డులో బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. కొత్తపట్నం మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన వివాహిత(30) ఒంగోలు నగరంలో కూరగాయల వ్యాపారం చేస్తుంటుంది. బుధవారం రాత్రి వ్యాపారం ముగించుకుని 10.30 గంటల సమయంలో స్కూటీపై ఇంటికి వెళ్తోంది. ఆ సమయంలో ఇద్దరు యువకులు అడ్డుకుని అఘాయిత్యానికి పాల్పడ్డారు. తొలుత ద్విచక్ర వాహనంపై ఆమెను వెంబడించారు. కొప్పోలు–గుత్తికొండవారిపాలెం రోడ్డులో గుత్తికొండవారిపాలెం దాటిన తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో అడ్డుకున్నారు. చీకట్లో పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారు. అనంతరం ఇంటికి వెళ్లిన ఆమె.. ఆ విషయాన్ని తన తల్లికి చెప్పుకుంది. గురువారం ఒంగోలు వచ్చి ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీస్ అధికారులను వేడుకుంది. ఎస్పీ మలికాగర్గ్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని అఘాయిత్యానికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులు ఆలూరు రోడ్డులోని రొయ్యల చెరువుల వద్ద పనిచేసే వారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును ఒంగోలు తాలూకా పోలీస్‌స్టేషన్ నుంచి ఒంగోలు దిశ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. దర్యాప్తును ముమ్మరం చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. -
ఒంగోలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇంటికి కూతవేటు దూరంలోనే..
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హైస్పీడ్‌లో ఉన్న కారు.. లారీని వెనుకవైపు నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఇక, మృతులను ఒంగోలుకు చెందిన పవన్ కుమార్, శ్రీను, పరమేష్‌గా పోలీసులు గుర్తించారు. అయితే, వీరంతా తమిళనాడులోని చెన్నైకి వెళ్లి తిరిగి వస్తుండగా ఒంగోలు సమీపంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మరో ఐదు నిమిషాల్లో వారు ఇంటికి చేరుకుంటారు అన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇంటికి కూతవేటు దూరంగా ప్రమాదం జరగడంతో మృతుల కుటుంబాల సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు.. తెల్లవారుజాము కావడం, డ్రైవర్ కునుకుపాటు కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కాగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. -
ప్రకాశం జిల్లా ఒంగోలు లో రోడ్డు ప్రమాదం
-
ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు : ఎమ్మెల్యే సుధాకర్ బాబు
-
ఎడ్ల బండి నడిపిన మంత్రి రోజా
-
తుపాకీ పట్టిన చేతులతో మేడి పట్టిన మాజీ సైనికులు
తుపాకీ చేతపట్టి సరిహద్దు రేఖపై పహారా కాసిన వారే.. నాగలి చేతబూని పంటచేలో సేద్యం చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి దేశం కోసం పరితపించిన వారే నిరంతర శ్రామికులై శ్వేదం చిందిస్తూ అన్నదాతలుగా మారారు. వేలాది మంది సైనికులు, మాజీ సైనికులకు నిలయమైన జిల్లాలో ఏళ్ల తరబడి దేశసేవలో తరించిన మాజీ సైనికులు వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణిస్తున్నారు. కష్టం మాకు లెక్కేం కాదంటూ అవిశ్రాంతంగా మండుటెండల్లో.. పంట చేలల్లో కాయకష్టం చేస్తూ గర్వంగా మీసం మెలేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జై జవాన్.. జై కిసాన్.. అన్న నినాదాన్ని సార్థకం చేస్తున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ సైనికులు. జిల్లాలో దేశానికి సేవ చేసిన.. చేస్తున్న జవాన్లు వేల సంఖ్యలో ఉన్నారు. సైనికులకు పశ్చిమ ప్రకాశం పెట్టింది పేరు. ప్రధానంగా గిద్దలూరు నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న సైనికులు, మాజీ సైనికులతో పోల్చుకుంటే అత్యధిక శాతం ఉన్నారు. నియోజకవర్గంలోని అర్థవీడు మండలం జిల్లాలోనే అత్యధికంగా సైనికులు, మాజీ సైనికులున్న మండలంగా గుర్తింపు పొందింది. ఆ తరువాత స్థానాల్లో కూడా గిద్దలూరు నియోజకవర్గంలోని కొమరోలు, బేస్తవారిపేట, రాచర్ల, కంభం మండలాలున్నాయి. ఆ తరువాత స్థానాల్లో కనిగిరి నియోజకవర్గం, మార్కాపురం నియోజకవర్గాలు ఉన్నాయి. దేశానికి సేవలందించటంలో జిల్లాకు గుర్తింపు దేశ సేవలో వేలాది మంది జిల్లావాసులు పునీతులయ్యారు. జిల్లా వ్యాప్తంగా మాజీ సైనికులు 28 వేల మంది ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం దాదాపు 15 వేల మందికి పైగా త్రివిధ దళాల్లో పనిచేస్తున్నారు. గ్రామాలకు గ్రామాలే సైన్యంలో పనిచేస్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, పాకిస్థాన్, చైనాతో జరిగిన యుద్ధాల్లోనూ జిల్లా సైనికులు అత్యంత సాహసాన్ని కనబరిచారు. కార్గిల్‌లాంటి యుద్ధాల్లో ప్రాణాలు ఫణంగా పెట్టారు. త్రివిధ దళాల్లో 15 నుంచి 30 సంవత్సరాల వరకు సేలందించి పదవీ విరమణ చేసిన వారు వేల సంఖ్యలో ఉన్నారు. సైనికులుగా పనిచేసిన తరువాత వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు కూడా పొందే అవకాశం మాజీ సైనికులకు ఉంటుంది. అలా వెళ్లిన వారు కొంతమంది మాత్రమే ఉంటారు. మరికొంతమంది వివిధ రంగాల్లో అంటే వ్యాపారాలు, పరిశ్రమలు, ఇతర రంగాల్లో స్థిరపడ్డారు. ఎక్కువ మంది వ్యవసాయం మీద మక్కువతో కష్టమైనా ఇష్టంగా పనిచేస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లోనే అత్యధికంగా.. సైనికుడంటే ఒక క్రమశిక్షణతో కూడిన జీవనం. ఆ క్రమశిక్షణ సోమరితనాన్ని పారదోలుతుంది. జవానుగా పదవీ విరమణ చేసిన వేలాది మంది మాజీ సైనికులు విశ్రాంత జీవితాన్ని ఖాళీగా గడపకుండా.. వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణిస్తున్నారు. మాజీ సైనికులు ఇతర రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయ అనుబంధ రంగాల్లో స్థిరపడినవారి సంఖ్య అధికంగా ఉంది. ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో వీరి సంఖ్య దాదాపు 10 వేల మంది వరకు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వ్యవసాయ, ఉద్యాన పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. మరికొందరు పశువుల పెంపకం ప్రధాన వృత్తిగా చేసుకున్నారు. కొందరు వ్యవసాయంతోపాటు చేపల చెరువులు వేస్తూ అందులో మంచి ఫలితాలు సాధిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయం, చేపల పెంపకంతో.. ఇతని పేరు దూదేకుల మౌలాలి. రాచర్ల మండలంలోని గుడిమెట్ట కొత్తపల్లె గ్రామానికి చెందిన ఈయన 26 ఏళ్లపాటు ఆర్మీ జవానుగా పని చేసి 2018లో పదవీ విరమణ చేశారు. అనంతరం స్వగ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి వారికున్న 6.50 ఎకరాల వ్యవసాయ భూమిని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. టమోటా, మిరప, బత్తాయి, పత్తి పంటలతో పాటు చేపల పెంపకం చేపడుతున్నారు. తక్కువ ఆదాయం వస్తున్నా వ్యవసాయంపై మక్కువతో పంటలు సాగుచేస్తున్నట్లు మౌలాలి చెబుతున్నారు. జత ఎడ్లతో పాటు, నాలుగు పాడి గేదెలను పెంచుకుంటున్నారు. కుటుంబంలోని అందరూ వ్యవసాయ పనులు చేసుకుంటూ మరికొంత మందికి తన వ్యవసాయం, చేపల పెంపకం ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. పొలం కౌలుకు తీసుకొని.. రాచర్ల మండలం అంకిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన కఠారు పూర్ణ రంగయ్య 22 ఏళ్ల పాటు మిలిటరీలో పనిచేశారు. తనకు పెన్షన్ వస్తున్నా, మిలిటరీ క్యాంటీన్లో కావాల్సిన వస్తువులు నాణ్యమైనవి, తక్కువ ధరకు వస్తున్నా సరిపెట్టుకోలేదు. శరీరంలో శక్తి ఉన్నంత వరకు ఖాళీగా ఉండకూడదని నిర్ణయించుకున్నారు. తనకు పొలం లేకపోయినా 4 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. ఆ పొలంలో ఒక ఎకరంలో వరి సాగుచేస్తుండగా మిగతా మూడెకరాల్లో మిర్చితో పాటు కూరగాయల సాగు చేపడుతూ శ్రమను నమ్ముకున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడుతూ కౌలుకు తీసుకున్న పొలం అయినా ఇష్టంగా పంటలు పండిస్తున్నారు. పెట్టుబడి, కౌలు ఖర్చులు, కూలీ ఖర్చులు పోనూ ప్రతి సంవత్సరం ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. (క్లిక్ చేయండి: వెలుగులు విరజిమ్మనున్న చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్) -
ఒంగోలు: వైవీ సుబ్బారెడ్డి ఇంటికి వైఎస్ విజయమ్మ
సాక్షి, ఒంగోలు: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తల్లిని వైఎస్ విజయమ్మ పరామర్శించారు. ఒంగోలులో వైవీ సుబ్బారెడ్డి ఇంటికి చేరకున్న విజయమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పిచ్చమ్మ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విజయమ్మతో పాటు వైవీ సుబ్బారెడ్డి సోదరుడు వైవీ భద్రారెడ్డి, వైవీ చెల్లెలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సతీమణి సత్యదేవి కూడా ఉన్నారు. చదవండి: (ప్రభుత్వానికి 26 జిల్లాలు సమానమే: మంత్రి బొత్స) -
కరువు నేలలో జలధారలు
నీటి జాడలు లేక భూములు బీడు బారాయి. గుక్కెడు నీరు దొరక్క గ్రామాలకు గ్రామాలే వలసపోయాయి. దశాబ్దాలుగా కరువు కోరల్లో విలవిల్లాడిన నేలపై కృష్ణమ్మ పరుగులు పెట్టనుంది. నెర్రెలు బారిన భూములు సస్యశ్యామలం కానున్నాయి. జిల్లాలోని ప్రాజెక్టుల్లో జలసిరులు నిల్వ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన ప్రయత్నాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెలిగొండ ప్రాజెక్ట్ టెయిల్ఎండ్ భూములుగా ఉన్న తీగలేరు కాలువ పనులను ఆయకట్టు పరిధిలోకి తీసుకొచ్చారు. ఇందు కోసం రూ.84.25 కోట్ల నిధులు కేటాయిస్తూ ప్రత్యేక జీఓ విడుదల జేశారు. ముఖ్యమంత్రి నిర్ణయంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కరువు నేలపై జల పరవళ్లు చూడాలని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంతో శ్రీకారం చుట్టిన ప్రాజెక్ట్‌లు సాకారం దిశగా అడుగులు పడుతున్నాయి. జిల్లాకు ప్రధాన జలవనరుగా మారనున్న వెలిగొండ ప్రాజెక్ట్‌కు నిధుల వరద పారించారు. వెలిగొండతో పాటు రామతీర్థం, గుండ్లకమ్మ, కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం.. ఇలా కరువు సీమలో కృష్ణమ్మను పరుగులు తీయించారు. ఇప్పడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెలిగొండ ప్రాజెక్టు చివరి భూములుగా ఉన్న తీగలేరు కాలువ టీ–5 పరిధిని పెంచి పుల్లలచెరువు మండలాన్ని సస్యశ్యామలం చేసేందుకు నడుంబిగించారు. పుల్లలచెరువు మండలంలోని 9 గ్రామాలను ఆయకట్టు పరిధిలోకి తీసుకొచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా జీఓ నంబర్ 1824ను 2022 ఆగస్టు 17న విడుదల చేసింది. జలవనరుల శాఖ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం రూ. 84.25 కోట్లు మంజూరు చేసింది. తీగలేరు కాలువ అభివృద్ధి కోసం టెండర్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. తీగలేరును అభివృద్ధి చేయడం ద్వారా పుల్లలచెరువు మండలంలో తాగు, సాగు నీరు అవసరాలు పూర్తిగా తీరనున్నాయి. చిన కండలేరు ప్రాజెక్టుకు అనుసంధానం: తీగలేరు బ్రాంచ్ కాలువను అభివృద్ధి చేయటం ద్వారా ఆ కాలువ ద్వారా ప్రవహింపజేసే నీటితో పుల్లలచెరువు మండలంలోని చినకండలేరు జలాశయాన్ని అనుసంధానం చేయనున్నారు. దశాబ్దాల తరబడి తాగు, సాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్న పుల్లలచెరువు మండల ప్రజల కష్టాలను యర్రగొండపాలెం ఎమ్మెల్యే, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గుక్కెడు నీటి కోసం వలసలు వెళ్లే గ్రామాల ప్రజలకు శాశ్వత తాగునీటి పరిష్కారం చూపించాలని సీఎంను కోరారు. దశాబ్దాలుగా కరువుతో బీడు భూములుగా మారుతున్న గ్రామాల రైతుల కష్టాలు తీర్చాలని కోరారు. ఆయా గ్రామాల ప్రజల తాగునీటి, సాగు నీటి అవసరాలు తీరాలంటే ఒక్క వెలిగొండ ప్రాజెక్టు పనుల పరిధిని పెంచితేనే సాధ్యమని సీఎంకు వివరించారు. దీంతో ప్రత్యేక జీఓ ద్వారా నిధులు విడుదల చేశారు. 11,500 ఎకరాలు సస్యశ్యామలం: పుల్లలచెరువు మండలానికి కృష్ణా జలాలను తీసుకురావడంతో 9 గ్రామాల్లోని దాదాపు 11,500 ఎకరాలకు పైగా బీడువారిన భూములు వివిధ రకాల పంటలతో కళకళలాడనున్నాయి. ఇప్పటి వరకు వెలిగొండ ప్రాజెక్టు టెయిల్ఎండ్ భూములుగా ఉన్న తీగలేరు కాలువ పనులను ఆయకట్టు పరిధిలోకి తీసుకురావడంతో మండల ప్రజల ఆశలు చిగురించాయి. కరువు నేలలో బీడు భూములను పంట పొలాలుగా మార్చటంతో పాటు తాగునీటి సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుల జీవితాల్లో వెలుగులు మా ప్రాంతంలో తాగు, సాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. టి–5 కాలువ పనులు పూర్తిచేసి చిన్నకండలేరు ప్రాజెక్టుకు నీరు వస్తే మా ప్రాంతాల్లోని రైతుల జీవితాల్లో వెలుగులు నింపినవారవుతారు. ఏళ్ల తరబడి నీరులేక ఇబ్బందులు పడుతున్నాం. సాగునీరు లేక, పంటలు పండక కరువుతో అల్లాడుతున్నాం. ప్రభుత్వం తీగలేరు కాలువ పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయటంతో ఇక్కడి ప్రజలకు ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మా ప్రాంతం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. – శివారెడ్డి, రైతు, మల్లాపాలెం కోనసీమను తలపిస్తాయి.. తీగలేరు కాలువ పనులకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మండల ప్రజలకు ఎంతో సంతోషంగా ఉంది. స్థానిక ప్రజల కష్టాలను గుర్తించి సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించిన రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురే‹Ùకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. టి–5 కాలువ ద్వారా చిన్నకండలేరు ప్రాజెక్టుకు నీరు వస్తే ఈ ప్రాంత పొలాలు కోనసీమను తలపిస్తాయి. నీరు వృథా కాకుండా పంటలను సాగు చేసుకుంటాం. – నాసరయ్య, రైతు, పుల్లలచెరువు -
కన్సల్టెన్సీ.. కంత్రీ.. జాబులు పేరుతో ‘టీడీపీ’ నేత దగా
సాక్షి ప్రతినిధి, ఒంగోలు(ప్రకాశం జిల్లా): జిల్లాలో టీడీపీ కంత్రీగాళ్లు చెలరేగిపోతున్నారు. పార్టీ నేతల ముసుగులో చీకటి వ్యాపారాలు, మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిషేధిత గుట్కాలు.. గంజాయి విక్రయిస్తూ ఓ టీడీపీ నేత కుమారుడు పోలీసులకు చిక్కగా, ఓ మహిళా నేత భర్త ఎస్సీ కార్పొరేషన్లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తూ లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన సొమ్మును స్వాహా చేసి జైలు పాలయ్యాడు. తాజాగా ఆ పార్టీ జిల్లా కార్యాలయ కార్యదర్శి దాసరి వెంకటేశ్వర్లు నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తానంటూ కన్సల్టెన్సీ పేరుతో రూ.కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. ఇతని బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. చదవండి: ఆ టీడీపీ నేత సిగ్గు లేకుండా రూ.20 కోట్లు అడిగాడు: ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు విశాఖలో నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తామంటూ రూ.కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ‘స్మార్ట్ సిటీ జాబ్ కన్సల్టెన్సీ’ తరహాలోనే ఒంగోలులో శ్రీనాథ్ జాబ్ కన్సల్టెన్సీ అండ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టింది. సాక్షాత్తూ టీడీపీ నాయకుడు ఈ సంస్థను ఏర్పాటు చేసి నిరుద్యోగులను నిలువునా మోసం చేసి దోచుకున్నాడు. ఉద్యోగాల కోసం కాళ్లరిగేలా తిరిగిన నిరుద్యోగులు చివరకు ఉద్యోగాలు రావని నిర్ధారించుకొని డబ్బులైనా తిరిగి ఇవ్వాలని ప్రాధేయపడినా ప్రయోజనం లేదు. డబ్బులు ఇచ్చేది లేదు మీకు దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరింపులకు దిగటంతో బాధితులు న్యాయం చేయాలని జిల్లా పోలీస్ అధికారులను వేడుకుంటున్నారు. మోసం ఇలా.. స్థానిక పాత గుంటూరు రోడ్డులోని టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శిగా పనిచేస్తున్న దాసరి వెంకటేశ్వర్లు ఎదురుగా ఉన్న సూర్య కాంప్లెక్స్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లోని 110 రూమ్‌ని అద్దెకు తీసుకొని శ్రీనాథ్ జాబ్ కన్సల్టెన్సీ అండ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ పేరిట రిజిస్టర్ నంబర్ 52/2020తో కార్యాలయాన్ని ప్రారంభించాడు. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేశాడు. ఒక్కో ఉద్యోగానికి రూ.3 లక్షల చొప్పున ఖర్చవుతుందని నమ్మబలికాడు. దీంతో దాదాపు 15 నుంచి 20 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో డబ్బులు చెల్లించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జ నార్దన్తో దాసరి వెంకటేశ్వర్లు (ఫైల్) మద్దిపాడు గ్రామానికి చెందిన చల్లపల్లి సుధాకర్‌బాబు జూన్ 2020లో ఉద్యోగం కోసం శ్రీనాథ్ కన్సల్టెన్సీ కార్యాలయానికి వెళ్లాడు. ఒక్కో ఉద్యోగానికి రూ.5 లక్షలు అవుతుందని వెంకటేశ్వర్లు చెప్పాడు. సుధాకరబాబు అంత ఇచ్చుకోలేనని మద్దిపాడులో కంప్యూటర్ సెంటర్‌ను నిర్వహిస్తూ తను, తన భార్య జీవనం సాగిస్తున్నామని చెప్పాడు. దీంతో ఇద్దరికీ కలిపి రెండు ఉద్యోగాలకు రూ.3 లక్షల చొప్పున మొత్తం రూ.6 లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. 2020 జూన్‌లో రెండు సార్లు రూ.2 లక్షల చొప్పున రూ.4 లక్షలు, 2021లో మరో రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.6 లక్షలు వెంకటేశ్వర్లుకి చెల్లించారు. ఆ తరువాత ఎన్ని రోజులు తిరుగుతున్నా ఉద్యోగాలు ఇవ్వలేదు. చివరకు ఇచ్చిన డబ్బులైనా ఇవ్వాలని ప్రాధేయపడినా లాభం లేదు. ఆ తర్వాత కార్యాలయాన్ని మూసేశారు. ఈ విధంగా ఎంతో మంది బాధితులు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక లబోదిబోమంటూ గుండెలు బాదుకొని ఒక్కొక్కరిగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శిగా దాసరి: దాసరి వెంకటేశ్వర్లు టీడీపీ సీనియర్ నాయకుడు. మర్రిపూడి మండలం అయ్యపురాజుపాలేనికి చెందిన వెంకటేశ్వర్లు టీడీపీ తరఫున మర్రిపూడి ఎంపీపీగా కూడా గెలిచాడు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌కు అత్యంత సన్నిహితుడు కూడా. ఆ తరువాత దాసరి వెంకటేశ్వర్లును ఒంగోలులోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహిస్తున్న ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయ ఇన్చార్జ్ బాధ్యతలు కూడా ఆయన నిర్వహించేవాడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఖాదీబోర్డు మెంబరుగా కూడా పనిచేశాడు. టీడీపీ నేతల చీకటి భాగోతాలు.. టీడీపీ నాయకులు నిత్యం ఎదుటి వారి తప్పులను వల్లెవేస్తుంటారు. కానీ పార్టీలో కొంతమంది చేసే నీతిమాలిన.. రోత మాలిన పనులను మాత్రం తమకేమీ తెలియదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఒంగోలు నగరానికి చెందిన 33వ డివిజన్ టీడీపీ నేత జగన్నాథం శారద భర్త మురళీమోహన్ ఎస్సీ కార్పొరేషన్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేషన్లో చక్రం తిప్పాడు. లబ్ధిదారుల నుంచి రికవరీ చేసిన సొమ్మును కార్పొరేషన్‌కు చెల్లించకుండా స్వాహా చేశాడు. బాధితులు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అతని భాగోతం వెలుగు చూసింది. విచారణలో అక్రమాలు రుజువు కావడంతో మురళీ మోహన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 46వ డివిజన్‌కు చెందిన టీడీపీ నేత మస్తానమ్మ కుమారుడు నిషేధిత గుట్కాలు, గంజాయి విక్రయిస్తూ పోలీసులకు చిక్కాడు. తాజాగా పార్టీ సీనియర్ నాయకుడు దాసరి వెంకటేశ్వర్లు నిరుద్యోగుల నుంచి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసి నిలువునా ముంచేశాడు. చంపుతానని బెదిరించాడు ప్రభుత్వ విభాగాల్లో ఔట్‌సోర్సింగ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి జిల్లా టీడీపీ కార్యాలయంలో మేనేజర్‌గా పనిచేస్తున్న దాసరి వెంకటేశ్వర్లు మోసం చేశాడు. మూడు విడతలుగా నాకు, నా భార్యకు ఉద్యోగాలు కావాలని రూ.6 లక్షలు చెల్లించాను. మద్దిపాడు కంప్యూటర్ సెంటర్ నడుపుకుంటూ పైసా...పైసా కూడబెట్టుకొని ఉన్నది మొత్తం అతనికి ధారపోశాను. ఉద్యోగం ఇవ్వకపోగా చివరకు డబ్బులు అడిగినా ఇవ్వలేదు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరిస్తున్నాడు. ఇక చేసేది లేక ప్రాణ భయంతో జిల్లా ఎస్పీ మలికా గర్గ్‌కు ఫిర్యాదు చేశాను. నాకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నాను. – చల్లపల్లి సుధాకర బాబు, మద్దిపాడు, బాధితుడు -
వైఎస్సార్ సీపీలోకి పలువురు టీడీపీ నాయకులు
ఒంగోలు సబర్బన్/ఒంగోలు: టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఒంగోలు నగరంలోని మూడో డివిజన్ నుంచి టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో శనివారం వైఎస్సార్ సీపీలో చేరారు. నగరంలోని 49వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ నాయకులకు వైఎస్సార్ సీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చదవండి: ఇది టీడీపీ, జనసేనకు జీర్ణించుకోలేని అంశమే టీడీపీ బూత్ కమిటీ కన్వీనర్, ఒంగోలు నగర కార్యనిర్వాహక కార్యదర్శి రేల రాజేంద్ర, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ ఆధ్వర్యంలో మరికొంతమంది వైఎస్సార్ సీపీలో చేరారు. వీరితో పాటు 3వ డివిజన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి కాకర్లమూడి ఎలియాజర్, ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ కూడా బాలినేని సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా రేవల రాజేంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంక్షేమంపై చూపుతున్న శ్రద్ధ ప్రతి ఒక్కరినీ వైఎస్సార్ సీపీవైపు ఆకర్షితులను చేస్తోందని తెలిపారు. ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డిపై అభిమానంతో ఆయనతో కలిసి పయనిద్దామనే ఆలోచనతో పార్టీలో చేరామన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ యువ నాయకుడు బాలినేని ప్రణీత్‌రెడ్డిని బాలినేని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో గుండు మధు, పార్టీ నాయకులు ఎందేటి రంగారావు, మహబూబ్‌బాషా, షేక్ హబీబ్, మురళి, తదితరులు పాల్గొన్నారు. -
ఒంగోలు జీజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు
ఒంగోలు అర్బన్: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో మెరుగైన వైద్య సేవలందిస్తామని, అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ప్రభుత్వ వైద్య కళాశాలలో కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధ్యక్షతన ఆస్పత్రి అభివృద్ధిసొసైటీ (హెచ్‌డీసీ) సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న బాలినేని మాట్లాడుతూ జీజీహెచ్‌లో కోవిడ్ అనంతరం ఓపీలు క్రమంగా పెరుగుతున్నాయన్నారు. రోగులకు అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉన్నాయని, ఎటువంటి మందుల కొరత లేదని తెలిపారు. అయితే కొన్ని పత్రికలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, ఇది సరికాదని హితవు పలికారు. జీజీహెచ్‌లో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందిస్తామన్నారు. పేదలకు వైద్యం అందించే జీజీహెచ్‌పై అసత్య ప్రచారాలు చేయడం దురదృష్టకరమన్నారు. ప్రజలకు ఆసుపత్రిపై నమ్మకం కలిగేలా ఉన్నవి ఉన్నట్లు తెలియపచాలన్నారు. కోవిడ్ సమయంలో జీజీహెచ్ అందించిన వైద్య సేవలు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిందన్నారు. కోవిడ్ సేవలు అభినందనీయమన్నారు. ఈ నెల 30వ తేదీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీతో ఒంగోలులో ప్రత్యేకంగా వైద్య శాఖపై సమీక్ష నిర్వహించి సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. డిమాండ్ తగినట్లుగా వైద్య సేవలు: కలెక్టర్ జీజీహెచ్‌లో డిమాండ్‌కు తగినట్లుగా మెరుగైన వైద్య సేవలందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. ఎమ్మెల్యే బాలినేనితో కలిసి హెచ్‌డీఎస్ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. రోగుల నమోదు నుంచి మందుల లభ్యత, రక్త నిల్వలు, వైద్య సిబ్బంది ఇతర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ ఉధృతి తగ్గినందున ఓపీలు క్రమంగా పెరుగుతున్నాయన్నారు. నెలకు రూ.12వేల నుంచి రూ.20వేల వరకు పెరిగాయన్నారు. నెలలో సుమారు 2 వేల మైనర్ ఆపరేషన్లు, 350 వరకు మేజర్ ఆపరేషన్లు జరగుతున్నాయన్నారు. హైరిస్క్ కేసులు మాత్రమే గుంటూరు జీజీహెచ్‌కు రిఫర్ చేస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో మందుల కొరత లేదని, అవసరమైన మందులు 48 గంటల్లో సెంట్రల్ డ్రగ్‌స్టోర్ నుండి జీజీహెచ్‌కు అందుతున్నాయన్నారు. ఏవైనా కొన్ని మందులు అందుబాటులో లేకుంటే వాటిని హెచ్‌డీఎస్ నిధులతో ప్రైవేట్ కొనుగోలు చేసి రోగులకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. మందులు కాని రక్తం కాని రోగులకు భారం కాకుండా ఎటువంటి ఆర్థిక భారం లేకుండా పూర్తి స్థాయిలో వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వైద్యులను అనుమతి లేకుండా గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఎం రాఘవేంద్రరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ భగవాన్ నాయక్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సుధాకర్, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ రవి, ఓఎంసీ కమిషనర్ వెంకటేశ్వరరావు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
Ongole: ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లకు ఫుల్ డిమాండ్!
సాక్షి, ఒంగోలు: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మార్చివేసిన నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అమాంతం పెరిగింది. నాడు–నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్ స్కూళ్లకు మించి సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు జగనన్న విద్యా కానుక కిట్లు, మధ్యాహ్న భోజనం, తదితర కార్యక్రమాల అమలుతో ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లకు డిమాండ్ ఏర్పడింది. గతంలో ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసినా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేవారు కాదు. ప్రస్తుతం అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులే ప్రభుత్వ పాఠశాలల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నెల మొదటి వారంలో పాఠశాలలు తెరవగా, రెండు వారాలు గడవకముందే ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ప్రస్తుతం పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాలలకు వెళ్లి అడ్మిషన్లు క్లోజవడంతో వెనుదిరుగుతున్నారు. క్లిక్: మారనున్న కనిగిరి పట్టణ రూపు రేఖలు -
Ongole: నా వెనకుంది దామచర్ల.. నన్నేమీ చేయలేరు..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నేతలు, సానుభూతిపరులు సాగించిన భూదందా నేటికీ కొనసాగుతోంది. అమాయక పేద ప్రజలకు స్థలాల ఆశ చూపి గతంలో డబ్బు గుంజిన టీడీపీ నాయకులు నేడు అదే పంథాను అనుసరిస్తున్నారు. ఒంగోలు నగరంలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై కోర్టులో కేసులు వేసి రాక్షసానందం పొందుతున్న టీడీపీ నేతలు.. అదే ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో భూదందా సాగిస్తుండటం సంచలనంగా మారింది. చదవండి: విభేదాలతో సై’కిల్’.. టీడీపీలో కుంపట్ల కుమ్ములాట పెళ్లూరు. చెరువుకొమ్ముపాలెం మధ్య ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా ఆక్రమించి బిట్లు బిట్లుగా విక్రయించిన మహిళా నాయకురాలు.. తాజాగా మరికొంత ప్రభుత్వ భూమిని ఆక్రమించి అమ్మేసే యత్నం చేస్తోంది. దీనిపై అభ్యంతరం తెలిపిన స్థానికులను చంపేస్తామంటూ రౌడీలతో బెదిరిస్తుండటంతో వారు ప్రాణ భయంతో బుధవారం ఎస్పీ మలికాగర్గ్ వద్దకు వెళ్లి రక్షణ కల్పించాలని మొరపెట్టుకున్నారు. ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని చెరువుకొమ్ముపాలెం–పెళ్లూరు పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూమి గత టీడీపీ ప్రభుత్వంలో ఆక్రమణకు గురైంది. ఈ అక్రమాల దందాకు ప్రధాన సూత్రధారురాలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అనుచర వర్గానికి చెందిన పాలేటి అమృత. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఆమె.. దానికి ఏకంగా అమృత నగర్‌గా పేరుపెట్టింది. అందులో గుడిసెలు వేసి పట్టాలిప్పిస్తానని చెప్పడంతో సుమారు 55 మంది వరకు ఆశపడ్డారు. ఒక్కొక్కరికి 10 గదుల చొప్పున స్థలం కేటాయించిన అమృత రూ.లక్ష చొప్పున అప్పనంగా దండుకుంది. రౌడీ మూకలతో బెదిరింపులు.. చెరువుకొమ్ముపాలెం ఎస్సీ కాలనీలో 55 మంది గుడిసెలు వేసుకోగా ప్రస్తుతం అక్కడ 30 కుటుంబాలే కాపురముంటున్నాయి. సుమారు 25 మంది అమృత బెదిరింపులకు భయపడి గుడిసెలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. మామిడిపాలేనికి చెందిన కొందరు రౌడీïÙటర్లను పంపి తరచూ బెదిరిస్తుండటంతో చేసేదేమీ లేక వారంతా ఖాళీ చేసి వెళ్లిపోయారు. అలా ఖాళీ చేసి వెళ్లిన వారి గుడిసెలను కూడా అమృత రూ.లక్ష చొప్పున మళ్లీ బేరానికి పెట్టి అమ్మేసింది. అమృత నగర్ వెనుక ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఇటీవల కాలంలో ప్రభుదాస్ అనే వ్యక్తితో కలిసి ప్లాట్లు వేసి 15 మందికి విక్రయించడంతో స్థానికులు తమకు ఇబ్బందులొస్తాయని ఎదురుచెప్పడం అమృతకు కంటగింపుగా మారింది. బుధవారం రాత్రి పది గంటల సమయంలో అమృతతోపాటు 10 మంది వ్యక్తులు గుడిసెల వద్దకు వచ్చి బెదిరించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అమ్మో ఆ వేధింపులు తాళలేం... సుబానీ బ్యాచ్, ప్రభుదాస్ బ్యాచ్ పేరుతో కొందరు రౌడీలు అర్ధరాత్రి పూట వచ్చి ఇళ్ల వద్ద నానాయాగీ చేస్తున్నారని కాలనీ వాసులు వాపోయారు. ఇళ్ల మధ్యలో మద్యం తాగి సీసాలు పగలగొట్టడంతో పాటు రాళ్లు వేస్తున్నారని, తలుపులు కొట్టి బెదిరిస్తుండటంతో నిత్యం నరకం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రభుత్వ భూమిని చదును చేస్తుండగా అడ్డుకోవడానికి వచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతోపాటు సచివాలయ సిబ్బందిని కూడా అమృత బెదిరించిందని స్థానికులు ఆరోపించారు. ‘‘మీరు ఎక్కడికెళ్లినా నాకేమీ కాదు. నాకు దామచర్ల జనార్దన్ సపోర్ట్ ఉంది’’ అంటూ పాలేటి అమృత బహిరంగంగా బెదిరిస్తోందని చెప్పారు. ‘కుక్క జోలికెళ్లి చక్కదనం పోగొట్టుకోవడం ఎందుకని వదిలేశాం’ అంటూ గుడిసెలు ఖాళీ చేసి వెళ్లిన బాధితులు అమృత వ్యవహార శైలిని ఉద్దేశించి వ్యాఖ్యానించడం గమనార్హం. ఎస్పీగారూ మీరే కాపాడాలి.. చెరువుకొమ్ముపాలెం కాలనీ వాసుల మొర ‘ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానంటూ అమృత అనే మహిళ తమ వద్ద నుంచి లక్ష రూపాయల చొప్పున తీసుకుని ప్రభుత్వ స్థలాన్ని చూపింది. గతంలో ఆమె మీద కేసు కూడా నమోదైంది. మళ్లీ రూ.50 వేలు డబ్బు ఇవ్వాలంటూ రౌడీలను పంపించి బెదిరిస్తోంది. రెండు రోజుల నుంచి రాత్రిపూట ఇళ్ల వద్దకు రౌడీలు వచ్చి రచ్చరచ్చ చేస్తున్నారు. ప్రశి్నస్తే దాడి చేస్తున్నారు. మంగళవారం తాలూకా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. అమృత బారి నుంచి మాకు రక్షణ కలి్పంచండి’ అని కాలనీ వాసులు బుధవారం ఎస్పీని వేడుకున్నారు. -
విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ జగన్
ఒంగోలు: ‘విశ్వసనీయతకు మారుపేరు సీఎం జగన్మోహన్రెడ్డి అయితే వెన్నుపోట్లకు పెట్టింది పేరు చంద్రబాబు’ అని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అక్కా చెల్లెమ్మ అంటూ జగన్మోహన్రెడ్డి పిలిచే పిలుపులోనే ఆప్యాయత, అనురాగాలు ఉట్టిపడతాయన్నారు. కానీ చంద్రబాబుకు మహిళల పట్ల గౌరవంగా ఉండాలన్న కనీస జ్ఞానం కూడా లేని వ్యక్తని ధ్వజమెత్తారు. 2014లో డ్వాక్రా సంఘాల అప్పులు మొత్తం తీరుస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... గద్దెనెక్కాక రూ.14 వేల కోట్ల అప్పును తీర్చకుండా సంఘాలను రుణాల రొంపిలోకి నెట్టి డిఫాల్ట్ అయ్యేలా చేశాడని మండిపడ్డారు. కానీ సీఎం జగన్మోహన్రెడ్డి హామీ మేరకు రెండు విడతలుగా డ్వాక్రా సంఘాల రుణాలను తిరిగి వారికి చెల్లించడంతో పాటు ఏటా సున్నా వడ్డీ కూడా అందిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు కట్టిస్తూ వారందరినీ లక్షాధికారులను చేసిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మాజ్యోతిరావు ఫూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం దక్కేలా చేసేందుకు ఆయన చేస్తున్న సేవలు అనిర్వచనీయమన్నారు. ఈ ఆశయాలే 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి 175కు 175 స్థానాలు కట్టబెడతాయన్నారు. రెండేళ్లు కరోనా వెంటాడినా రూ.లక్షల కోట్ల రూపాయలను ప్రజల ఖాతాల్లో వేసి సీఎం జగన్మోహన్రెడ్డి అండగా ఉన్నారన్నారు. అందుకే జగన్‌ను చూస్తే నమ్మకం, చంద్రబాబును చూస్తే వెన్నుపోట్లు గుర్తుకు వస్తాయన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్రస్థాయి ప్లీనరీకి ప్రజలు విచ్చేసి జగన్మహన్రెడ్డి పట్ల కనబరిచిన విశ్వాసం దేశచరిత్రలోనే ప్రత్యేక రికార్డు అన్నారు. వైఎస్సార్సీపీ నాయకుడు పోతుల సురేష్ మాట్లాడుతూ చంద్రబాబు మాట్లాడితే సామాజిక న్యాయానికి పేటెంట్ అని చెప్పుకుంటారని, కానీ ఆయన భావజాలమే ప్రజా వ్యతిరేకమన్నారు. రాష్ట్ర విభజన సమయంలో సైతం రెండుకళ్ల సిద్ధాంతాన్ని పాటించారన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తామంటూ హెచ్చరించిన ఘటనలు, దళితులపై చేసిన వ్యాఖ్యలు, చివరకు అమరావతిలో 55వేల మంది అణగారిన వర్గాలకు ఇళ్ల స్థలాలు దక్కకుండా చేసేందుకు కోర్టుల కేసులు వేయించిన చంద్రబాబుకు సామాజిక న్యాయంపై మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. వెన్నుపోటు రాజకీయాలు, అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అయితే, ప్రజల విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అనంతరం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పోతుల సునీతకు వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి చింతగుంట్ల సువర్ణ, పోతంశెట్టి వెంకటరత్నం తదితరులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. (క్లిక్: బాబుకు మైండే కాదు.. చెవులూ పోయాయి) -
గుట్కా దందా.. తమ్ముళ్ల పంథా
సాక్షి, ఒంగోలు: చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి చాటుమాటు పనులు అన్న చందంగా ఉంది తెలుగు తమ్ముళ్ల తీరు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమాలకు తెగబడిన టీడీపీ నాయకులు.. అధికారంలో లేనప్పుడు గుట్టుచప్పుడు కాకుండా గంజాయి, గుట్కా దందాకు తెరలేపారు. ఒంగోలు నగరానికి చెందిన టీడీపీ నాయకుడు గుట్లాపల్లి శ్రీమన్నారాయణ గంజాయి, గుట్కా వ్యాపారం చేస్తూ మాఫియాగా మారాడు. చంద్రబాబు సామాజిక వర్గానికే చెందిన శ్రీమన్నారాయణ తల్లి మస్తానమ్మ ప్రస్తుతం ఒంగోలు 46వ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్నారు. ఆయన సోదరుడు కూడా టీడీపీలో క్రియాశీలకమైన పదవిలో ఉన్నాడు. టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఏళ్ల తరబడి గంజాయి, గుట్కాల వ్యాపారం చేస్తూ జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కూడా గంజాయి, గుట్కా ప్యాకెట్లను తరలిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నాడు. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు శ్రీమన్నారాయణ అత్యంత సన్నిహితుడు. దామచర్ల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా గంజాయి, గుట్కా వ్యాపారం జోరుగా సాగించాడు. మాజీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌కు కూడా అత్యంత సన్నిహితుడుగా మెలుగుతూ వచ్చాడు. యువతకు ఉపాధి కోసం టీడీపీ ధర్నాలో ప్లకార్డు పట్టుకొని నిరసన తెలుపుతున్న శ్రీమన్నారాయణ (ఫైల్) గుడ్లూరు పోలీసులకు గంజాయితో పట్టుబడి గుడ్లూరు పోలీసులకు గుట్లాపల్లి శ్రీమన్నారాయణ గత ఏడాది గంజాయితో పట్టుబడ్డాడు. 2021 ఏప్రిల్ 25వ తేదీన గుడ్లూరు పోలీసులు జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తుండగా బెంగళూరు నుంచి కారులో గంజాయితో వస్తూ దీనిని గమనించిన గుట్లాపల్లి శ్రీమన్నాయణ బృందం కారును తిరిగి కావలి వైపునకు తిప్పడంతో పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. అప్పట్లో వారి వద్ద కారులో 10 కేజీల గంజాయి దొరికింది. గుడ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీమన్నారాయణతో పాటు తెట్టుకు చెందిన తిరుమలరాజు వెంకటేశ్వరరాజు, ఏకొల్లు కృష్ణార్జున రావు, బెంగళూరుకు చెందిన శంకర్ మోహన్, ప్రధాన నిందితుడు శ్రీమన్నారాయణ కారు డ్రైవర్ రమేష్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: (ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు) ) గుట్కా ప్యాకెట్లతో నిందితులు శ్రీమన్నారాయణ, కారు డ్రైవర్ ఒంగోలులో గుట్కాల నిల్వలతో... ఒంగోలు నగరంలో కారులో గుట్కాలు తరలిస్తున్నట్లు ఎస్పీ మలికాగర్గ్‌కు సమాచారం వచ్చింది. దీంతో ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ ఎన్.సూర్యచంద్రారావు తన సిబ్బందితో దాడి చేసి కారును పట్టుకున్నారు. కారును స్వాధీనం చేసుకొని కారు నడుపుతున్న ముల్లూరి వెంకట నాగ శివ చరణ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న 27,375 గుట్కాప్యాకెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు గుట్లాపల్లి శ్రీమన్నారాయణ అక్రమ వ్యాపారం బయటపడింది. ఒంగోలు నగరంలోని బృందావన్ నగర్ 11 వ లైన్‌లోని ఒక పాడుబడిన ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్ల గుట్టు రట్టయింది. ఆ ఇంట్లో 2,39,556 గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ఆ ఇల్లు 46వ డివిజన్ టీడీపీకి చెందిన కార్పొరేటర్ గుట్లాపల్లి మస్తానమ్మ, కుమారుడు గుట్లాపల్లి శ్రీమన్నారాయణది అని తేలింది. మొత్తం గుట్కా ప్యాకెట్ల విలువ రూ.3,43,224 గా ఎస్ఈబీ పోలీసులు తేల్చారు. ఇలా గంజాయి, గుట్కా అక్రమ వ్యాపారంలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. -
టీడీపీ నాయకుడే గుట్కా కింగ్!
ఒంగోలు: గుట్టు చప్పుడు కాకుండా గుట్కా విక్రయాలు సాగిస్తున్న టీడీపీ నాయకుడి ఉదంతాన్ని ఎస్ఈబీ అధికారులు రట్టు చేశారు. ఒంగోలు అన్నవరప్పాడు సెబ్ కార్యాలయంలో బుధవారం ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ ఎన్.సూర్యచంద్రరావు వివరాలు చెప్పారు. స్థానిక కమ్మపాలెం వాసి ముల్లూరి వెంకట నాగశివ చరణ్ కారులో గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నట్లు సెబ్ అధికారులకు సమాచారం అందింది. స్థానిక ఎస్ఈబీ అధికారులు కూరగాయల మార్కెట్ సెంటర్ వద్ద కారును ఆపి తనిఖీ చేయగా అందులో 27,375 గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీంతో అతన్ని అదుపులోనికి తీసుకుని విచారించగా స్థానిక బృందావన్ నగర్‌లోని ఒక పాడుబడిన ఇంట్లో ఉంచిన గుట్కా నిల్వల సమాచారాన్ని ఇచ్చాడు. అతని సహాయంతో సంబంధిత ప్రాంతాన్ని గుర్తించి ఇంట్లో తనిఖీ చేయగా 2,39,556 గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీంతో గుట్లపల్లి శ్రీమన్నారాయణ అలియాస్ చిన్నా నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. శ్రీమన్నారాయణ స్థానిక 46వ డివిజన్ కార్పొరేటర్ కుమారుడు. ఇతను మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు అనుచరుడిగా పేరుంది. దాడిలో 2,66,931 గుట్కా ప్యాకెట్లను సీజ్‌చేశారు. వాటి విలువ రూ.3,43,224గా ఉంటుందని అంచనా. -
పోక్సో కేసులో దోషికి యావజ్జీవ ఖైదు, జరిమానా
ఒంగోలు: ప్రకాశం జిల్లా మార్కాపురంలో 2018లో బాలిక (13)పై లైంగికదాడి చేసిన నేరానికి ఆరెం చెన్నయ్య (40)కు యావజ్జీవ ఖైదు విధిస్తూ ఒంగోలులోని పోక్సోకోర్టు ప్రత్యేక జడ్జి సోమశేఖర్ మంగళవారం తీర్పు చెప్పారు. తల్లిదండ్రులు కూలిపనులకు వెళ్లిన సమయంలో ఇంటివద్దనున్న ఆ బాలికను చెన్నయ్య బలవంతంగా సమీపంలోని ఒక ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. ఇంటి యజమాని రావడం, బాలిక కేకలు వేయడంతో పరారయ్యాడు. బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నయ్యపై పోక్సో చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో చెన్నయ్యకు జీవితకాలం జైలుశిక్ష, రూ.4 వేలు జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. బాధితురాలు మైనర్ కావడంతో ఆమెకు వైద్యఖర్చులు, పునరావాసం కోసం రూ.5 లక్షలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా న్యాయసేవాధికార సంస్థకు సూచించారు. ప్రాసిక్యూషన్ తరఫున పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.వి.రామేశ్వరరెడ్డి వాదించారు. -
కెనడాలో కారు ఢీకొని ఒంగోలు వాసి దుర్మరణం
సాక్షి,అమరావతి: కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ప్రవాసాంధ్రుడు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఈ నెల 16 తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఏపీ ఎన్ఆర్టీఎస్ రీజినల్ కోఆర్డినేటర్ పిరకల రామకృష్ణ, ప్రొ రీజినల్ కోఆర్డినేటర్ కాయం పురుషోత్తంరెడ్డిలు కెనడాలో చాలా కాలంగా నివాసముంటున్నారు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రవాసాంధ్రులకు అండగా ఉండేవారు. ఈ నెల 16 తెల్లవారు జామున మిత్రుడిని కలిసేందుకు వీరు కారులో బయలుదేరారు. కెనడాలోని అంటారియో స్టేట్ మిసెస్ ఆగా గ్రామం హైవేపై వెనుక నుంచి వచ్చిన మరో కారు వీరి కారును ఢీకొట్టింది. దీంతో వీరి కారు స్వల్పంగా దెబ్బతింది. కారును రోడ్డు పక్కన నిలిపి ప్రమాదానికి కారకులైన వారితో మాట్లాడుతుండగా.. మరోకారు వేగంగా వచ్చి వెనుక వైపు నుంచి వీరిద్దరినీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒంగోలుకు చెందిన రామకృష్ణ(42) అక్కడికక్కడే మృతి చెందగా, చిత్తూరు జిల్లా భాకరాపేటకు చెందిన పురుషోత్తంరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. పురుషోత్తమరెడ్డి మృత్యువుతో పోరాడుతున్నారు. విషయం తెలిసిన వెంటనే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కెనడాలోని బాధితుల కుటుంబసభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించారు. రామకృష్ణ మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు ఏపీ ఎన్ఆర్టీఎస్ అక్కడి కోఆర్డినేటర్ చుక్కలూరి వేణుగోపాల్‌రెడ్డి కెనడా ఎంబసీతోనూ, ఏపీ ఎన్ఆర్టీఎస్ చైర్మన్ వెంకట్ మేడపాటి ఇండియన్ ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నారు. -
రూ.2.14 కోట్ల విలువైన మద్యం బాటిళ్ల ధ్వంసం
ఒంగోలు సబర్బన్: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పట్టుబడిన అక్రమ మద్యం బాటిళ్లను బుధవారం ఎస్పీ మలికాగర్గ్ సమక్షంలో ధ్వంసం చేశారు. ఒంగోలు నగరం దక్షిణ బైపాస్‌లోని జాతీయ రహదారి ఫ్లైఓవర్ వంతెన కింద అక్రమ మద్యం బాటిళ్ల ధ్వంసం కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీ మొత్తంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లు, ఎస్ఈబీ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. మొత్తం రూ.2.14 కోట్ల విలువైన 42,810 బాటిళ్లను ధ్వంసం చేశారు. (క్లిక్: 88 వేల మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి..) -
అయ్యో జనార్దనా: ముందు చూస్తే నుయ్యి.. వెనుక చూస్తే గొయ్యి
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు సొంత పార్టీలోనే అసమ్మతి సెగ తగులుతోంది. మహానాడు వేదికగా అన్నదమ్ముల మధ్య ఫ్లెక్సీల వివాదం జనార్దన్‌ను అప్రతిష్టపాలు చేయగా.. తాజాగా కొత్తపట్నం మండలంలోని మత్స్యకార నేతలు ఆయన తీరుపై భగ్గుమంటున్నారు. అటు ప్రజలు, ఇటు పార్టీ నాయకులు వ్యతిరేకంగా మారిపోవడంతో పాటు సొంతింటిలోనే అసమ్మతి కుంపటితో దామచర్ల తలపట్టుకుంటున్నారు. కేడర్ చేజారిపోకుండా నానా తంటాలు పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: మాజీ ఎమ్మెల్యే జనార్దన్ పరిస్థితి ముందు చూస్తే నుయ్యి.. వెనుక చూస్తే గొయ్యి అన్న చందంగా మారింది. మహానాడు వేదికగా సోదరుడితో గొడవలు బహిర్గతమై అందరిలో నవ్వుల పాలైన మాజీ ఎమ్మెల్యే దామచర్ల ఇప్పుడు చివరకు ద్వితీయ శ్రేణి నాయకుల ఛీత్కారాలకు గురవుతున్నారు. అసలే అంతంత మాత్రంగా పార్టీ పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఒక వైపు సొంతింటి సెగ, మరో వైపు పార్టీలో అసమ్మతిరాగం దామచర్ల రాజకీయ భవిష్యత్తును అగమ్య గోచరంగా మార్చింది. మహానాడు ఫ్లెక్సీల ఏర్పాటులో అన్నదమ్ముల మధ్య ఏర్పడిన వివాదాలు పార్టీ పరువు తీశాయంటూ ఓవైపు టీడీపీ అధిష్టానం దామచర్లపై గుర్రుగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈసారి టికెట్టు తనకే కావాలంటూ సోదరుడు సత్య కేడర్‌ను తనవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ కేడర్ జారిపోకుండా నానా తంటాలు పడుతున్న మాజీ ఎమ్మెల్యే దామచర్లకు పార్టీ నేతల్లో పెళ్లుబుకుతున్న అసమ్మతి రాగం కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. మహానాడుతో వాపును చూసి బలుపు అనుకుంటున్న దామచర్ల సొంత పార్టీ నేతల్లో నమ్మకాన్ని కోల్పోతున్న పరిస్థితిపై ఆ పార్టీలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు దామచర్ల కుట్ర రాజకీయాలకు తెరతీస్తున్నారు. అవి కూడా బెడిసి కొడుతుండటంతో భంగపాటుకు గురవుతున్నారు. కులాల మధ్య వైషమ్యాలు సృష్టించి తద్వారా లబ్ధిపొందాలని చేస్తున్న ప్రయత్నాలు అతనికి తీవ్ర తలనొప్పి తెచ్చి పెడుతుండటంతో పార్టీ అధిష్టానం వద్ద పట్టుకోల్పోతున్నారనే చర్చ సాగుతోంది. మహానాడు సందర్భంగా ఫ్లెక్సీలు పీకేస్తున్నారంటూ లేని పోని ఆరోపణలు చేసి భంగపడిన దామచర్ల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి భారీ స్థాయిలో ప్రజల నుంచి స్పందన వస్తుండటంతో ఇక తన పనైపోయిందని గ్రహించి కుట్ర రాజకీయాలకు తెగబడ్డారు. అల్లూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గొడవలు సృష్టించి ప్రజల నుంచి వైఎస్సార్ సీపీకి, బాలినేనికి వ్యతిరేకత వస్తుందని చూపించే కుట్రకు తెర తీశారు. టీడీపీకి చెందిన నాయకులను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వద్దకు పంపి ఓ మహిళను అడ్డుపెట్టుకుని దిగజారుడు రాజకీయాలకు దిగారు. దీన్ని బాలినేని దీటుగా తిప్పికొట్టడంతో టీడీపీ నేతలు తోకముడిచారు. ఏదో ఒక విధంగా కుయుక్తులు పన్ని ప్రజల్లో తన పట్ల నమ్మకాన్ని పెంచుకోవాలని చేస్తున్న ప్రయత్నాలన్నీ వరుసగా బెడిసికొడుతుండటంతో ఏం చేయాలో పాలుపోక తలపట్టుకున్నాడు. తాజాగా కొత్తపట్నం మండలం మడనూరులో మత్స్యకారుల వర్గానికి చెందిన ఓ సీనియర్ టీడీపీ నేతకు తెలియకుండా ఓ శుభకార్యానికి హాజరవడంతో ఆ పార్టీలో అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంది. తమకు తెలియకుండా గ్రామంలోకి ఎలా వస్తారంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు దామచర్ల వద్దకు వెళ్లకుండా ఆగిపోయారు. ఈ వ్యవహారం బెడిసి కొట్టిందని గ్రహించిన దామచర్ల సదరు నాయకుని ఇంటికి వెళ్లేందుకు యత్నించగా కనీసం ఇంట్లోకి కూడా రాకుండా అడ్డుకుని తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగడంతో చేసేది లేక అక్కడి నుంచి జారుకున్నారు. దామచర్ల నిర్వాకంపై సదరు నేత మత్స్యకార వర్గానికి చెందిన వారితో అసమ్మతి కుంపటి రాజేస్తుండటంతో ఈ విషయం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ద్వితీయ శ్రేణి నాయకులు అనేక మంది ఏకమై దామచర్లపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసే వరకు పరిస్థితి వెళుతుందనే ప్రచారం సాగుతోంది. ఒకవైపు ఒంగోలు నగర శివారులోని యరజర్ల వద్ద రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిరుపేదలకు 25 వేల ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు మాజీ మంత్రి బాలినేని ప్రభుత్వ భూమిని సిద్ధం చేయగా, కోర్టు ద్వారా దాన్ని దామచర్ల ఆపించారని తెలుసుకున్న నిరుపేదలు అతనిని తీవ్రస్థాయిలో ఛీత్కరించుకున్నారు. అటు ప్రజలు, ఇటు పార్టీ నాయకులు వ్యతిరేకంగా మారిపోవడంతో పాటు సొంతిటిలోనే అసమ్మతి కుంపటి రాజుకుంది. అయ్యే జనార్దనా... ఏమిటి నీ పరిస్థితి అంటూ.. సొంత పార్టీ నాయకులే నవ్వుకుంటున్న విచిత్ర పరిస్థితి నెలకొంది. -
మంత్రి జోగి రమేష్ కారుకు తప్పిన ప్రమాదం
ఒంగోలు(ప్రకాశం జిల్లా): మంత్రి జోగి రమేష్ ప్రయాణిస్తున్న కారుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన సోమవారం ఉదయం చిలకలూరిపేట నుంచి నెల్లూరుకు కారులో వెళ్తుండగా ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని పెళ్లూరు వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై పనుల నిమిత్తం ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా దారి మళ్లింపు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. చదవండి: చినరాజప్ప ప్రధాన అనుచరుడు పల్లంరాజు అరెస్టు డివైడర్‌పై ఏర్పాటు చేసిన కోన్లు హోరు గాలికి ఎగిరి రోడ్డుకు అడ్డంగా పడటంతో మంత్రి కాన్వాయ్‌లోని ఓ కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో కాన్వాయ్‌లోని కార్లు ఒకదానిని మరొకటి ఢీకొనడంతో పాటు పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొన్నాయి. మంత్రి జోగి రమేష్ ప్రయాణిస్తున్న కారు కూడా అదుపు తప్పినప్పటికీ.. ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంటనే మరో కారులో ఎక్కి ఆయన వెళ్లిపోయారు. హైవే మొబైల్ సిబ్బంది, తాలూకా సీఐ శ్రీనివాసరెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన కారును పక్కకు తొలగించారు. -
ఒంగోలు జేఎంబీ చర్చిలో గొడవలు బాధాకరం: బాలినేని
-
ఒంగోలులో వెలవెల బోయిన తెలుగుదేశం మహానాడు
-
ఎస్సై నిర్వాకం: ప్రేమించి, పెళ్లి చేసుకుని.. నా జీవితాన్ని నాశనం చేశాడు
సాక్షి, గుంటూరు: ఒంగోలు పీటీసీలో ఎస్సైగా పనిచేస్తున్న వినోద్ కుమార్ అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని అతని భార్య మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రేమించి, పెళ్లి చేసుకుని రెండేళ్ల తర్వాత నడిరోడ్డుపై వదిలేశాడంటూ రోజారాణి ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సై వినోద్‌కుమార్‌పై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. వినోద్ కుమార్‌కు వేరే మహిళతో సంబంధం ఉన్న విషయం తెలుసుకుని ప్రశ్నించినందుకే తనను వదిలేశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలీసులు కౌన్సిలింగ్‌కు పిలిచినా రాకుండా, తన జీవితాన్ని నాశనం చేశాడంటూ బాధితురాలు కన్నీటి పర్యంతమవుతోంది. చదవండి: (విధి వైపరీత్యం అంటే ఇదేనేమో.. కళ్ల ముందే నలుగురు కొడుకులు) -
నల్లమల అటవీ ప్రాంతం.. కార్చిచ్చుకు కళ్లెం
నల్లమల అటవీ ప్రాంతం.. నాలుగు జిల్లాల పరిధిలో పది లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ సువిశాల అరణ్యంలో ఒక్క చోట అగ్గిరాజుకుంటే చాలు వందల ఎకరాల్లో బుగ్గి మిగులుతుంది. మండు వేసవిలో ఈ అగ్నిప్రమాదాల బెడద ఇంకా ఎక్కువ. మానవ తప్పిదాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. పచ్చని అడవుల్లో కార్చిచ్చుకు కళ్లెం వేసేలా అటవీ శాఖ ఫైర్‌వాచర్స్‌ను నియమించి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి అగ్నినిరోధక పరికరాలను అందజేసింది. అటవీ ప్రాంతంలో నీటి కుంటలు ఏర్పాటు చేసి అప్పటికప్పుడు నీటిని తీసుకెళ్లేందుకు వాహనాలు సమకూర్చింది. మార్కాపురం: వేసవి వచ్చిందంటే అగ్ని ప్రమాదాల భయం వెంటాడుతోంది. తెలిసో తెలియకో చేస్తున్న మానవ తప్పిదాలు అడవులను కాల్చివేస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అడవుల్లో ప్రమాదాలు జరిగి ఆందోళన కలిగిస్తున్నాయి. దీని వలన పర్యావరణం దెబ్బతింటోంది. నల్లమల అటవీ ప్రాంతం ప్రకాశం, గుంటూరు, కర్నూలు, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉంది. మార్కాపురం డీఎఫ్‌వో పరిధిలో 900 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. మార్కాపురం డీఎఫ్ఓ పరిధిలో మార్కాపురం, యర్రగొండపాలెం, గంజివారిపల్లె, గుంటూరు జిల్లాలోని విజయపురిసౌత్ రేంజ్‌లు ఉండగా, గిద్దలూరు పరిధిలో గిద్దలూరు, గుండ్లకమ్మ, తురిమెళ్ల, కనిగిరి, ఒంగోలు ఉన్నాయి. దోర్నాల నుంచి శ్రీశైలం, దోర్నాల–ఆత్మకూరు, గిద్దలూరు– నంద్యాల మధ్య ఘాట్ రోడ్డులో ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రయాణికులు వాహనాల ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. కొంత మంది బీడీ, సిగరెట్ తాగి ఆర్పకుండా రోడ్డుపై వేస్తున్నారు. వేసవి తీవ్రత వలన అలా కిందపడిన నిప్పు గడ్డికి అంటుకుని వేగంగా వ్యాపించి అడవులను దహిస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తోంది. అటవీశాఖ అధికారులు ప్రయాణికులకు, ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నా కొంత మందిలో చైతన్యం లేకపోవటం, మరికొందరు ఏమరుపాటుగా సిగరెట్ తాగి రోడ్డు పక్కన వేయటం వలన తరచుగా అడవిలో మంటలు రేగుతున్నాయి. వీటిని చల్లార్చేందుకు అటవీశాఖ సిబ్బంది తీవ్రంగా కష్టపడుతుంటారు. 110 మంది వాచర్ల నియామకం: ఈ నేపథ్యంలో ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం, అటవీశాఖ ముందుగానే మేల్కొని అగ్నిప్రమాదాల నివారణకు శిక్షణ ఇచ్చిన ప్రత్యేక సిబ్బందిని నియమించాయి. మార్కాపురం డీఎఫ్ఓ పరిధిలో ఉన్న మార్కాపురం, గంజివారిపల్లె, యర్రగొండపాలెం, పెద్దదోర్నాల, గుంటూరు విజయపురిసౌత్ వరకు విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదాలు జరిగితే తక్షణం అక్కడికి వెళ్లి మంటలను ఆర్పేందుకు 110 మంది ఫైర్‌వాచర్స్‌ను ప్రభుత్వం నియమించింది. వీరికి ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్లను అందజేశారు. దీనితో పాటు అటవీ ప్రాంతంలో నీటి కుంటలు ఏర్పాటు చేసి అప్పటికప్పుడు నీటిని తీసుకెళ్లేందుకు వాహనాలు సమకూర్చారు. ఈ సిబ్బంది దోర్నాల నుంచి శ్రీశైలం వరకు, యర్రగొండపాలెం నుంచి మాచర్ల వరకు, దోర్నాల నుంచి ఆత్మకూరు వరకు తమకు కేటాయించిన ప్రాంతాల్లో నిరంతరం తిరుగుతూ ప్రయాణికులను అప్రమత్తం చేస్తూ అగ్నిప్రమాదాలు జరగకుండా చూస్తున్నారు. దీంతో పాటు శ్రీశైలం వెళ్లే ప్రయాణికుల వాహనాలను గణపతి చెక్‌పోస్టు వద్ద ఆపి బీడీ, సిగరెట్లు తీసివేస్తూ, అగ్నిని మండించే పదార్థాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. 2020 ఏప్రిల్‌లో అర్ధవీడు మండలం బొమ్మిలింగం అటవీ ప్రాంతంలో భారీ స్థాయిలో అగ్నిప్రమాదం జరిగి చాలా వరకు అటవీ ప్రాంతం కాలిపోయింది. ప్రత్యేక శిక్షణ ఇచ్చాం: ఈ ఏడాది అటవీ ప్రాంతంలో 950 అగ్ని ప్రమాద సంఘటనలు జరిగాయి. మా సిబ్బంది వెంటనే స్పందించి మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అనేక చర్యలు తీసుకున్నాం. నల్లమల అటవీ ప్రాంతంలో ఉండే చెంచులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. ప్రమాదం జరిగిన వెంటనే మాకు సమాచారం అందిస్తారు. దీని ద్వారా మేము సిబ్బందిని అప్రమత్తం చేసి సంఘటన స్థలానికి పంపి మంటలను ఆర్పివేస్తాం. ప్రయాణికులు కూడా అటవీ ప్రాంతంలో ప్రయాణించేటప్పుడు బీడీలు, సిగరెట్లు తాగవద్దని మా విజ్ఞప్తి. చిన్న ప్రమాదం జరిగినా ఆ నష్టాన్ని పూడ్చటం సాధ్యం కాదు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. – అప్పావు విఘ్నేష్, డీఎఫ్ఓ, మార్కాపురం వందల సంఖ్యలో ప్రమాదాలు నల్లమల అటవీ ప్రాంతంలో ప్రతి ఏడాది వేసవిలో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. గడిచిన 3 నెలల్లో నల్లమలలో 950 అగ్ని ప్రమాదాలు జరగగా సిబ్బంది సకాలంలో స్పందించి ఆర్పివేశారు. గత ఏడాది ఏప్రిల్ నాటికి 1500 అగ్ని ప్రమాదాలు జరిగినట్లు అటవీశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చిన్న చెట్టుకు నిప్పు అంటుకున్నా అటవీ అధికారులు ప్రమాదాన్ని గుర్తించి కౌంట్ చేస్తారు. అగ్ని ప్రమాదాల వలన పర్యావరణ కాలుష్యంతో పాటు విలువైన వృక్షసంపద, రకరకాల పక్షులు, జంతువులు మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి అడవిలో కార్చిచ్చు వ్యాపించిందంటే ఆర్పి వేయటం అటవీ, అగ్నిమాపక సిబ్బందికి తలకు మించిన భారమవుతోంది. -
నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్
ఒంగోలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఒంగోలు పర్యటనలో భాగంగా నూతన దంపతులను ఆశీర్వదించారు. మధ్యాహ్నం 1.20 గంటలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం సభ ముగిసిన అనంతరం సీఎం నేరుగా స్థానిక బందరు రోడ్డులోని రవిశంకర్ గ్రూప్స్ చైర్మన్ కంది రవిశంకర్ నివాసానికి చేరుకున్నారు. రవిశంకర్, ప్రియదర్శిని, వారి కుమారుడు సాయినాథ్‌లు సీఎంకు ఘనంగా స్వాగతం పలికారు. నూతన దంపతులు కంది విష్ణుమోహన్, స్నేహలను సీఎం ఆశీర్వదించారు. రవిశంకర్ కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్నారు. స్నేహ తల్లిదండ్రులైన బొత్స లక్ష్మణ్‌రావు, కన్నమ్మదేవిలను, మంత్రి బొత్స సత్యన్నారాయణను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, మున్సిపల్ శాఖామంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, పోతుల సునీత, శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, మద్దిశెట్టి వేణుగోపాల్, అన్నా వెంకట రాంబాబు, బుర్రా మధుసూదన్ యాదవ్, కె.నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కదిరి బాబూరావు, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, బాచిన చెంచుగరటయ్య, శాప్‌నెట్ చైర్మన్ బాచిన కృష్ణచైతన్య, బాలినేని ప్రణీత్‌రెడ్డి, నగర మేయర్ గంగాడ సుజాత, ప్రముఖ వ్యాపార వేత్త శిద్దా హనుమంతరావు తదితరులు పాల్గొని నూతన దంపతులకు ఆశీస్సులు అందించారు. అక్కడ నుంచి బయల్దేరి 1.53 గంటలకు హెలిపాడ్‌కు చేరుకున్నారు. 1.59 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంగోలు నుంచి తాడేపల్లికి హెలికాప్టర్లో బయల్దేరి వెళ్లారు. చదవండి: (Jeevitha Rajasekhar: సినీ నటి జీవితకు అరెస్ట్ వారెంట్) -
పథకాలు ఆపేయాలట!
గత 35 నెలల్లో రూ.1,36,694 కోట్లను నేరుగా ప్రజలకు అందించాం. ఇందులో రూ.94,318 కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల చేతుల్లోకి వెళ్లింది. కరోనా వచ్చినా, ఆర్థిక పరిస్థితులు ఎదురు తిరిగినా, చెక్కుచెదరని సంకల్పం చూపించాం. నా ఇబ్బందులు నాకు ఉన్నా, వాటి ముందు మీ ఇబ్బందులే ఇంకా ఎక్కువ అని భావించి మీ సోదరుడిగా మీకు తోడుగా నిలిచాను. ఇంతలా మనసున్న పాలనను గతంలో మీరు ఎప్పుడైనా చూశారా? ఇంతటి సంక్షేమాభివృద్ధికి కారణమైన పథకాలను వాళ్లు ఆపేయాలంటున్నారు.. ఆపేయాలా? మీరే చెప్పండి. – సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలో సంక్షేమాభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుండటం చూసి దుష్ట చతుష్టయం.. చంద్రబాబు, రామోజీ, ఏబీఎన్, టీవీ5.. వారి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేకపోతున్నారని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మహిళా పక్షపాత ప్రభుత్వంగా ముద్ర పడటంతో వారికి కడుపు మంట పెరిగిపోయిందని చెప్పారు. అక్కచెల్లెమ్మలందరూ సొంత కాళ్లపై నిలబడేలా పలు పథకాలు, కార్యక్రమాలు అమలవుతుండటం తట్టుకోలేక విష ప్రచారానికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకాలన్నీ ఆపేయాలని, లేదంటే రాష్ట్రం మరో శ్రీలంకలా మారుతుందని తప్పుడు రాతలు, తప్పుడు ప్రచారానికి దిగారని మండిపడ్డారు. ‘మీరే చెప్పండి.. ఈ పథకాలన్నీ ఆపేయాలా?’ అని అక్కచెల్లెమ్మలను ప్రశ్నించారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద మూడో విడత నగదు జమ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఆయన ఒంగోలులో ప్రారంభించారు. కంప్యూటర్లో బటన్ నొక్కి కోటి 2 లక్షల 16 వేల 410 మంది మహిళల ఖాతాల్లో రూ.1,261 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా స్థానిక పీవీఆర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ పథకం కింద ఈ మూడు సంవత్సరాల్లో రూ.3,615 కోట్లు అందజేశామని చెప్పారు. జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ జగనన్న కాలనీలు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ సంపూర్ణ పోషణ.. తదితర పథకాల ద్వారా రాష్ట్రంలో అనేక సామాజిక వర్గాల చరిత్రను మార్చేస్తున్నామని తెలిపారు. కేవలం ఈ 35 నెలల కాలంలో రూ.1,36,694 కోట్లు నేరుగా ప్రజల చేతుల్లో పెట్టామని సగర్వంగా చెబుతున్నానన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. పేదల కడుపు నింపడం తమాషాలా? – ఏ పథకంలోనూ ఎక్కడా లంచాల్లేవు. వివక్ష లేదు. బటన్ నొక్కగానే నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ అవుతోంది. 1వ తేదీన పొద్దున్నే తలుపు తట్టి పింఛన్ అందిస్తున్నాం. ఏ పథకంలో అయినా ఎవరైనా మిస్ అయి ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకుంటే జూన్‌లో, డిసెంబర్లో అందిస్తున్నాం. – అయితే ఇలాంటి పాలన వద్దని, మా బాబు పాలనే కావాలని దుష్ట చతుష్టయం, వారి దత్తపుత్రుడు అంటున్నారు. ఈనాడులో వాళ్లు రాస్తున్న రాతలు ఏంటో తెలుసా? ప్రభుత్వం డబ్బులు పంచే తమాషాలు ఇక ఆపాలట.. జగన్ ప్రభుత్వం నిర్వాకంతో మరో శ్రీలంకగా రాష్ట్రం.. ఉచితంతో ఆర్థిక విధ్వంసం.. ఇవి రోజూ మన చంద్రబాబు, రామోజీరావు, ఏబీఎన్, టీవీ5లు మాట్లాడుతూ కలిసి రాస్తున్నారు. – ఇబ్బందులు పడుతున్న నా అక్కచెల్లెమ్మలు, రైతులు, చదువుకుంటున్న పిల్లలు, అవ్వ, తాతలు, పేదరికంతో అలమటిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని నా వాళ్లందరికీ పథకాలు అమలు చేయడానికి వీలు లేదనేది ఎల్లో పార్టీ, ఎల్లో మీడియా, ఎల్లో దత్తపుత్రుడి ఉద్దేశం. – తెలుగుదేశం పార్టీ ఏం చెప్పదల్చుకుందో అది వారి అధికార గెజిట్ పేపర్లో చెబుతుంటారు. దాదాపు రోజూ ఇటువంటి మాటలే. ఇటువంటి రాతలే. ఈ పథకాలన్నింటినీ అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గోబెల్స్ ప్రచారం మొదలు పెట్టారు. చంద్రబాబులా.. ఎన్నికల తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తే, ప్రజలకు వెళ్లాల్సిన సొమ్మంతా పాలకుల జేబుల్లోకి వెళితే రాష్ట్రం అమెరికా అవుతుందట. ఇది ఈనాడు నిర్వచనం. ఇలాంటి రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం. మీరు ఒప్పుకుంటారా? – లంచాలకు తావులేకుండా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందా? ఈ పథకాలన్నింటినీ ఆపేయాలని, చంద్రబాబుకు ఓటు వేస్తే వీటన్నింటినీ ఆపేస్తారని చెప్పకనే చెబుతున్నారు ఈ ఎల్లో మీడియా ప్రబుద్ధులు. దీనికి మీరు ఒప్పుకుంటారా? (ఒప్పుకోమంటూ అందరూ చేతులు పైకెత్తి ఊపారు) మీరు ఇలా గట్టిగా చెప్పడం వల్ల ఇప్పటికైనా ఆ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లకు బుద్ధి వస్తుందని ఆశిద్దాం. – మనందరి ప్రభుత్వంలో 44.50 లక్షల మంది తల్లులకు మంచి చేస్తూ 84 లక్షల మంది పిల్లలను బడిబాట పట్టిస్తూ రూ.13,022 కోట్లు జగనన్న అమ్మ ఒడి ద్వారా లబ్ధి కలిగించాం. ఈ పథకాన్ని ఆపేయాలా? – 52.40 లక్షల మంది రైతులు, కౌలు రైతు కుటుంబాలకు నేరుగా బటన్ నొక్కగానే వారి అకౌంట్లోకి డబ్బు వెళ్లిపోతోంది. వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రైతులకు, కౌలు రైతులకు, అసైన్డ్ రైతులకు, ఆర్వోఎఫ్ఆర్ రైతన్నల కుటుంబాలు.. 52.40 లక్షల మందికి ఏకంగా రూ.20,162 కోట్లు నేరుగా ఇచ్చి మేలు చేశాం. ఈ పథకాన్నీ నిలిపివేయాలా? – ఏకంగా 25 లక్షల మంది 45 నుంచి 65 సంవత్సరాల వయస్సులోని అక్కచెల్లెమ్మలందరికీ మంచి చేస్తూ వైఎస్సార్ చేయూత పథకం తీసుకొచ్చాం. ఏటా వారికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఇస్తూ.. రిలయన్స్, అమూల్, ఐటీసీ వంటి పెద్ద పెద్ద సంస్థతో ఒప్పందాలు చేసి, బ్యాంకులతో అనుసంధానం చేసి జీవనోపాధి చూపించాం. రూ.9,180 కోట్లతో అమలు చేస్తున్న ఈ పథకాన్నీ ఆపేయాలా? – గతంలో చంద్రబాబు మోసం వల్ల డ్వాక్రా అక్కచెల్లెమ్మలు రూ.25,517 కోట్ల మేర అప్పులపాలయ్యారు. సున్నా వడ్డీ పథకాన్నీ రద్దు చేశారు. అప్పులు తడిసి మోపెడై 18.36 శాతం సంఘాలు ఎన్పీఏలుగా మారి ఎదురీదారు. మనందరి ప్రభుత్వంలో 78.75 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు, వారి కుటుంబాలకు మంచి చేస్తూ వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.12,758 కోట్లు ఇస్తే..ఆ పథకాన్ని ఆపేయాలన్నది వీరి ఉద్దేశం. ఇందుకు మీరు ఒప్పుకుంటారా? – ఈ రోజు 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వారి పేరుతోనే ఇంటి స్థలాలు ఇచ్చాం. ఆ స్థలాల్లో ఇల్లు కట్టించే ఒక్క గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. ఇది పూర్తయితే అక్కచెల్లెమ్మల చేతిలో ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, రూ.10 లక్షల ఆస్తి ఇచ్చినట్లు అవుతుంది. మొత్తంగా రెండు నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలు వారి చేతుల్లో పెట్టినట్లు అవుతుంది. ఇటువంటి గొప్ప పథకాన్నీ ఆపేయాలా? (ఈ ప్రశ్నలన్నింటికీ ఒద్దు.. ఒద్దు.. అని ప్రజలు సమాధానమిచ్చారు) ఇలా ఎన్నో పథకాల ద్వారా మీకు తోడుగా నిలుస్తున్నాం. ఇప్పటికైనా వారిలో మార్పు వస్తే కొద్దో గొప్పో మంచి జర్నలిజం అనేది కనిపిస్తుంది. మీరు కూడా ప్రశ్నించండి – 18.50 లక్షల పంపు సెట్లకు ఏటా రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తూ ఉచితంగా కరెంటు ఇస్తున్నాం. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న గోరు ముద్ద ద్వారా జరుగుతున్న మంచి ఏమిటో మీ అందరికీ తెలుసు. నాడు–నేడు ద్వారా రాష్ట్రంలో ఉన్న స్కూళ్లు, ఆస్పత్రుల రూపు రేఖలు మారుతున్నాయి. – వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా 62 లక్షల మంది జీవితాల్లో వెలుగులు కనిపిస్తున్నాయి. వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా దాదాపు లక్ష మంది చేనేత కుటుంబాలకు మంచి జరుగుతోంది. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 3.3 లక్షల మంది కాపు అక్కచెల్లెమ్మలకు మంచి జరుగుతోంది. వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 4 లక్షల మంది అగ్రవర్ణాల్లోని పేద అక్కచెల్లెమ్మలకు కూడా మంచి జరుగుతోంది. – జగనన్న చేదోడు ద్వారా మన రజకులు, నాయీబ్రాహ్మణులు, టైలర్లు.. మొత్తం 3 లక్షల మంది కుటుంబాలకు మంచి జరుగుతోంది. జగనన్న తోడు పథకం ద్వారా చిరు వ్యాపారం చేస్తున్న 14.16 లక్షల మందికి మేలు కలిగింది. వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా 2.75 లక్షల మంది సొంత ఆటోలు, సొంత క్యాబ్‌లు ఉన్న డ్రైవర్ల కుటుంబాలకు మంచి జరుగుతోంది. – వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా 95 శాతం ప్రజలకు గొప్ప మేలు జరుగుతోంది. ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించుకుని, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నెలకు రూ.5 వేలు చొప్పున వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా సాయం అందిస్తున్నాం. ఇంకా గోరుముద్దు, సంపూర్ణ పోషణ.. ఇలాంటి పథకాలు కార్యక్రమాలన్నీ తీసి వేయాలన్నదే వాళ్ల ఉద్దేశం. – ఈ రోజు జగన్ చేస్తున్నది మంచా.. చెడా అన్నది మీరంతా ఒక్కసారి ఆలోచించండి. ఈ పథకాలన్నింటినీ నిలిపేయాలంటున్న ఎల్లో పార్టీలు, ఎల్లో మీడియా, వారి దత్తపుత్రుడిని నేను మీ తరఫున ప్రశ్నిస్తున్నాను. మీరు కూడా ప్రశ్నించండి. నిజంగా మీరు మనుషులేనా? అని అడగండి. ఇంత మంచి ఎలా చేయగలుగుతున్నానో ఆలోచించండి – జగన్ బటన్ నొక్కితే నగదు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళుతోంది. చంద్రబాబు బటన్ నొక్కలేదు. ప్రభుత్వ సొమ్మును ఆయన కోసం, ఆయన చుట్టూ ఉన్న రామోజీరావు, ఏబీఎన్, టీవీ5, జన్మభూమి కమిటీ సభ్యులు, ఇతర నేతల కోసం ఖర్చు చేస్తూ ఆయన పాలన సాగింది. అందుకే అదే బడ్జెట్, అదే రాష్ట్ర వనరులు, అవే అప్పులు అయినప్పటికీ జగన్ పాలన చంద్రబాబు పాలన కంటే చాలా చాలా గొప్పగా సాగుతోంది. – రాష్ట్రంలో కనీవినీ ఎరుగని విధంగా విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ రోజు 70 శాతం మంత్రి పదవులు వచ్చాయి. సామాజిక న్యాయం అన్నది మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నాం. ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఈ వర్గాల వారికి ఇవ్వడం మహా సామాజిక విప్లవం. మంత్రివర్గంలో 11 మంది మంత్రులు ఈ వర్గాల వారే ఉన్నారు. – ఎక్కడో ఎందుకు.. ఈ ఎల్లో సభ్యులు నివాసం ఉంటున్న విజయవాడను ఒక్కసారి ఉదాహరణగా తీసుకుందాం. విజయవాడ మేయర్ జనరల్ స్థానంలో ఒక బీసీ మహిళ, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్‌గా జనరల్ స్థానంలో బీసీ మహిళ కనిపిస్తోంది. కనకదుర్గమ్మ తల్లి ఆలయ చైర్మన్‌గా బీసీ వ్యక్తికే అవకాశం కల్పించాం. 13 జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్లలో తొమ్మిది మంది ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు అవకాశం ఇచ్చాం. మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా.. ఈ రోజు మీ అందరితో ఇన్ని విషయాలు పంచుకున్నాను. మీకు ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నా. చంద్రబాబు హయాంలో అయినా, మన హయాంలో అయినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, అప్పులు దాదాపు ఒకటే. ఇంకా చెప్పాలంటే కాస్తో కూస్తో ఆయన కంటే మనమే తక్కువ అప్పులు చేస్తున్నాం. మరి అలాంటప్పుడు జగన్ ఎలా ఇంత మంచి చేస్తున్నాడు? ఆ పెద్ద మనిషి ఎందుకు చేయలేకపోయాడు? అని అందరూ ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించండి. జగన్ బటన్ నొక్కితే నగదు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళుతోంది. చంద్రబాబు బటన్ నొక్కలేదు. ప్రభుత్వ సొమ్మును ఆయన కోసం, ఆయన చుట్టూ ఉన్న రామోజీరావు, ఏబీఎన్, టీవీ5, జన్మభూమి కమిటీ సభ్యులు, ఇతర నేతల కోసం ఖర్చు చేస్తూ ఆయన పాలన సాగింది. అందుకే అదే బడ్జెట్, అదే రాష్ట్ర వనరులు, అవే అప్పులు అయినప్పటికీ జగన్ పాలన చంద్రబాబు పాలన కంటే చాలా చాలా గొప్పగా సాగుతోందని సగర్వంగా తెలియజేస్తున్నా. -
గత ప్రభుత్వానికి ఆ ఆలోచనే లేదు: సీఎం జగన్
సాక్షి, ఒంగోలు: గడిచిన మూడేళ్లలో మొత్తం రూ.3,165 కోట్లు అక్కాచెల్లెమ్మలకు అందజేశామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఒంగోలు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ముందుగా సాధికారత సారధులకు అభినందనలు తెలియజేశారు. తొలి ఏడాది సున్నా వడ్డీ కింద ప్రభుత్వం రూ.1,258 కోట్లు చెల్లించిందని, రెండో ఏడాది రూ.1,096 కోట్లు, వరుసగా ఇప్పుడు మూడో ఏడాది రూ. 1,261 కోట్లు చెల్లిస్తున్నట్లు సీఎం జగన్ తెలియజేశారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా దాదాపు కోటి 2లక్షల 16 వేలమందికి పైగా అక్క చెల్లెమ్మలకు మేలు కలిగిందని తెలియజేశారాయాన. ‘‘గతంలో 12శాతం దాకా వడ్డీలు కట్టాల్సి వచ్చేది. అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలన్న ఆలోచనే గత ప్రభుత్వం చేయలేదు. పైగా సున్నా వడ్డీ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసిన పరిస్థితులున్నాయి. కానీ మన ప్రభుత్వంలో ప్రతి ఏడాది మహిళలకు భరోసా ఇస్తున్నాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా 35 నెలల కాలంలో 1,36,694 కోట్లు లబ్ధిదారులకు అందించామని ఆయన పేర్కొన్నారు. ఎక్కడా లంచాలకు తావులేకుండా లబ్ధిదారులకు మేలు జరిగిందని ప్రస్తావించారు. అంతేకాదు.. సామాజిక న్యాయం అన్నది మాటల్లో కాదు.. చేతల్లో చూపించిన ప్రభుత్వం తమదని, మంత్రి పదవులు 70 శాతం దాకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చామని సీఎం వైఎస్ జగన్ గుర్తు చేశారు. ప్రసంగం అనంతరం.. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి జమచేశారు. చదవండి👉🏼: దుష్టచతుష్టయం అంటే ఎవరంటే..: సీఎం జగన్ -
బాలినేని కుమారుడి గిఫ్ట్‌కు సీఎం జగన్ ఫిదా
సాక్షి, ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంగోలులో మూడో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ నిధులను విడుదల చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కొడుకు ప్రణీత్ రెడ్డి సీఎం జగన్‌కు దూసుకెళ్తున్న బుల్(ప్రభుత్వం అభివృద్దిలో దూసుకుపోతోంది అన్నట్టుగా)ను బహుమతిగా అందజేశారు. ఈ బహుమతికి సీఎం జగన్ ఫిదా అయ్యారు. కాగా, అంతకుముందు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ మహిళల పక్షపాతి.. అన్నింటా మహిళలే ప్రధానం అని భావిస్తారు. మేనిఫెస్ట్‌లో ఇచ్చిన వాగ్ధానాలను 90 శాతం వరకు సీఎం జగన్ నెరవేర్చారు. సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారని అన్నారు. ఇది చదవండి: దుష్టచతుష్టయం కడుపు మంటతో ఉంది: సీఎం జగన్ -
ఒంగోలులో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
Ongole: ఆర్టీఏ అధికారుల తీరుపై సీఎం జగన్ సీరియస్
సాక్షి, ప్రకాశం జిల్లా: ఒంగోలులో ఆర్టీఏ అధికారుల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఏ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం కాన్వాయ్ కోసం వాహనాలు సమకూర్చాలని సిబ్బంది ఒత్తిళ్లు తెస్తున్నారంటూ సీఎం వైఎస్ జగన్ దృష్టికి వార్తా కథనాలు వచ్చాయి. వాటిపై స్పందించిన సీఎం ప్రజలను ఇబ్బందులు పెడితే సహించబోమంటూ గట్టి సంకేతాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇద్దరు సస్పెన్షన్ ఈ ఘటనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు.. బాధ్యులపై చర్యలు చేపట్టారు. ఈమేరకు ఒంగోలు ఏఎంవీఐ సంధ్య, హోంగార్డ్ తిరుపాల్‌రెడ్డిలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. చదవండి: మన పంతం 'అవినీతి అంతం' -
CM Jagan Ongole Tour: ఒంగోలు పర్యటనకు సీఎం జగన్
సాక్షి, ఒంగోలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 22వ తేదీ శుక్రవారం ఒంగోలు రానున్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ మూడో విడత ప్రారంభ కార్యక్రమాన్ని ఒంగోలు నుంచి చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన వివరాలను తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాలయం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి అదనపు పీఎస్ కే.నాగేశ్వరరెడ్డి విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ నెల 22వ తేదీ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలో ముఖ్యమంత్రి నివాసం నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని హెలిప్యాడ్ వద్దకు వెళతారు. హెలిప్యాడ్ నుంచి 9.40 గంటలకు హెలిక్యాప్టర్‌లో ఒంగోలుకు బయలుదేరుతారు. ఉదయం 10.10 గంటలకు ఒంగోలు నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఏబీఎం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు హెలిక్యాప్టర్ చేరుకుంటుంది. 10.25 గంటల వరకు ఏబీఎం గ్రౌండ్‌లోనే స్థానిక నాయకులతో, అధికారులతో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. 10.40కి ఏబీఎం నుంచి రోడ్డు మార్గం ద్వారా రంగారాయుడు చెరువు వద్ద ఉన్న పీవీఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటారు. చదవండి: (YSRCP: 2024 ఎన్నికలే లక్ష్యంగా కొత్త టీమ్ రెడీ) పది నిమిషాల పాటు ప్రాంగణంలోని డ్వాక్రా గ్రూపు సభ్యులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. 10.55 గంటలకు పీవీఆర్ ప్రాంగణంలోని వేదిక మీదకు చేరుకుంటారు. సీఎం వైఎస్ జగన్ జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. 11.05 నుంచి 11.10 గంటల మధ్య కలెక్టర్ ఏఎస్.దినేష్ కుమార్, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు సున్నా వడ్డీ కార్యక్రమం, జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తారు. అనంతరం డ్వాక్రా గ్రూపులకు చెందిన సున్నా వడ్డీ లబ్ధిదారుల పరిచయ కార్యక్రమం, వాళ్ల అనుభవాలు వివరిస్తారు. తరువాత 11.45 నుంచి 12.15 గంటల వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటల తరువాత వైఎస్సార్ సున్నావడ్డీ మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 2021–22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ ల్యాప్‌టాప్‌లో బటన్ నొక్కటం ద్వారా నేరుగా డ్వాక్రా గ్రూపుల బ్యాంకు అకౌంట్లకు జమ చేయనున్నారు. 12.25 నుంచి 12.30 లోపు సెర్ప్ సీఈఓ ఇంతియాజ్ ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి మొదలుకొని అధికారులకు, డ్వాక్రా గ్రూపు సభ్యులకు, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతారు. సభా స్థలి నుంచి కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లోని బందర్ రోడ్డులో ఉన్న రవిప్రియ మాల్ అధినేత కంది రవి శంకర్ నివాసానికి మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకుంటారు. అక్కడ రవి శంకర్ కుటుంబంలో ఇటీవల వివాహం అయిన నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. రవి శంకర్ నివాసం నుంచి 12.55కు ఏబీఎం గ్రౌండ్‌లోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి 1.05 కు హెలిక్యాప్టర్‌లో బయలుదేరి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళతారు. -
లేడీ సింగం: అవినీతి పోలీస్ అధికారుల వెన్నులో వణుకు
ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తా.. మహిళా రక్షణకు ప్రాధాన్యతనిస్తా.. కేసులు సత్వరం పరిష్కారం అయ్యేలా చూస్తా.. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతా.. ఇల్లీగల్ లిక్కర్..గుట్కా..గాంబ్లింగ్ తదితరాలపై ప్రత్యేక దృష్టిసారిస్తా.. ఇక డిపార్ట్మెంట్లో అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదంటూ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నాడే తన బాటను స్పష్టం చేశారు మలికా గర్గ్. తొమ్మిది నెలల కిందట బాధ్యతలు స్వీకరించిన ఆమె ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రక్షాళన ప్రారంభించారు. నిర్లక్ష్యం, అక్రమార్కులపై వేటు వేశారు. డీఎస్పీ, సీఐ, నలుగురు ఎస్ఐలు, పలువురు కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుని దూకుడు పెంచారు. తమ మార్క్ పాలనతో ముందుకు సాగుతున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో అవినీతి పోలీస్ అధికారుల వెన్నులో వణుకు మొదలైంది. కింది స్థాయి సిబ్బంది మొదలు డీఎస్పీ స్థాయి అధికారి వరకు ఎస్పీ దెబ్బకు అలర్ట్ అయ్యారు. ఇప్పటి వరకు చేసిన అవినీతి కార్యకలాపాలను నిలిపివేయాల్సిన అనివార్య పరిస్థితులు పోలీస్ సిబ్బందికి, అధికారులకు ఏర్పడ్డాయి. జిల్లా సరిహద్దుల్లోనూ అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలకు కొంతమేర తెరపడింది. కేసుల దర్యాప్తులో సైతం వేగం పెరిగింది. తప్పు చేస్తే వేటు తప్పదనే సంకేతాలు ఇస్తూనే సమర్ధవంతంగా పనిచేసే వారిని ప్రోత్సహిస్తూ వస్తున్నారు ఎస్పీ మలికా గర్గ్. 2021 జూలై 15న ప్రకాశం జిల్లా ఎస్పీగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. రెండు, మూడు నెలల పాటు జిల్లాపై అవగాహన పెంచుకున్నారు. హోంగార్డు మొదలుకొని డీఎస్పీ, ఏఎస్పీ స్థాయి అధికారి వరకు విధుల్లో వారి పనితీరును పరిశీలించారు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టే వరకు జిల్లాలో పరిస్థితులు వేరేగా ఉండేవి. సలాములతో కాలం గడుపుతూ ఇష్టారీతిన విధులు నిర్వహిస్తూ వచ్చిన పోలీసు సిబ్బందికి, అధికారులకు తనదైన శైలిలో కౌన్సెలింగ్ ఇస్తూ వచ్చారు. దీంతో చాలా వరకు వారి పంథాను మార్చుకున్నారు. తమ వైఖరిలో మార్పురాని వారిపై ఆమె చర్యలకు ఉపక్రమించారు. పనిచేసే వారిని ప్రోత్సహిస్తూనే, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ తనదైన మార్క్ చూపిస్తున్నారు. తప్పుచేస్తే అంతే.. విధుల్లో తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని ఎస్పీ మలిక గర్గ్ కొన్ని సంఘటనల్లో నిరూపించారు. జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన కొన్ని సంఘటనల్లో కఠినమైన చర్యలు చేపట్టారు. ఇటీవల యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం రేపిన రియల్టర్ హత్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సైని సస్పెండ్ చేశారు. అదేవిధంగా యర్రగొండపాలెం సీఐని వీఆర్‌కు పిలిపించారు. మార్కాపురం డీఎస్పీకి చార్జ్ మెమో జారీ చేశారు. లింగసముద్రం ఎస్సై ఇసుక రవాణా విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో అతనిని సస్పెండ్ చేశారు. కొత్తపట్నం ఎస్సై విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సస్పెండ్ చేశారు. గ్రానైట్ విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని బల్లికురవ ఏఎస్సైతో పాటు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసి హోంగార్డును విధుల నుంచి తప్పించారు. బేస్తవారిపేటలో ఏఎస్సై, హెడ్ కానిస్టేబుళ్లు మద్యం తాగి న్యూసెన్స్ సృష్టించడంతో వారిరువురినీ సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంపై వేటు విధుల్లో ఉంటూ ప్రజల పట్ల, ఫిర్యాదుల పట్ల, ఫిర్యాదుదారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను సహించేది లేదంటూ కొందరిపై చర్యలు చేపట్టారు. జరుగుమల్లి ఎస్సై ఇసుక అక్రమార్కుల విషయలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఫిర్యాదులు రావటంతో ఆమెను వీఆర్‌కు పిలిపించారు. అదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మరికొందరు పోలీస్ సిబ్బంది, అధికారులను కూడా దాదాపు 10 మందికి పైగా వీఆర్‌కు పిలిపించారు. జిల్లాలోని మారుమూల పోలీస్ స్టేషన్‌ను సైతం తనిఖీ చేసిన ఎస్పీ మలిక గర్గ్ కేసుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది, పోలీస్ అధికారులకు మెమోలు, చార్జ్ మెమోలు జారీ చేశారు. రికార్డులు సక్రమంగా నిర్వహించకపోయినా అలాంటి వారిపై చర్యలు తీసుకున్నారు. -
ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లి..
ఒంగోలు: ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన యువకుడు ఫిట్స్‌తో అక్కడ అకస్మాత్తుగా మృతిచెందాడు. కొడుకులిద్దరు, భర్తను ఒకరి తర్వాత ఒకర్ని కోల్పోయిన ఆ ఇల్లాలి వేదన చూపరులను కంట తడిపెట్టిస్తోంది. వివరాలివీ.. నగరంలోని కొప్పోలుకు చెందిన దొండపాటి కార్తీక్ (26) బీటెక్ వరకు ఒంగోలులోనే చదివాడు. రెండు నెలల క్రితం ఎంఎస్ డేటాసైన్స్ చదువు కోసం అమెరికాలోని చికాగో స్టేట్ లెవిస్ యూనివర్శిటీకి వెళ్లాడు. ఇప్పటికే చిన్న కుమారుడు, భర్త మృతిచెందడంతో ఉన్న ఒక్కగానొక్క కొడుకు కార్తీక్ మీదే ఆశలు పెట్టుకున్న తల్లి శోభారాణి అంతదూరం వద్దంటున్నా కార్తీక్ వినిపించుకోలేదు. చదువు పూర్తికాగానే రెండేళ్లలో వచ్చేస్తానంటూ వెళ్లాడు. కానీ, భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉ.7 గంటల సమయంలో కార్తీక్ మూర్ఛవ్యాధి (ఫిట్స్)కి బలయ్యాడు. వెళ్లిన రెండు నెలల్లోనే కొడుకు కన్నుమూయడంతో ఆ తల్లి ఆవేదన వర్ణణాతీతంగా మారింది. 15ఏళ్ల క్రితం ఇదే రోజు చిన్నకొడుకు మృతి 15 సంవత్సరాల క్రితం చిన్న కుమారుడు శ్రీరామనవమి పండుగ రోజే రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు వదిలాడు. దీంతో ఆ దంపతులు తమ ఆశలన్నీ కార్తీక్‌పైనే పెట్టుకున్నారు. ఏడేళ్ల క్రితం శోభారాణి భర్త రత్తయ్య కూడా కన్నుమూశారు. ఈ నేపథ్యంలో.. మిగిలిన ఒక్క కొడుకూఅమెరికా వెళ్లి మృతిచెందడంతో ఆ తల్లి హృదయం విలవిల్లాడుతోంది. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కావడంలేదు. మరోవైపు.. కార్తీక్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ప్రతినిధులు ముందుకొచ్చారు. చికాగో అధికారులతో వారు చర్చిస్తున్నారు. మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడానికి నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది. -
టీ అమ్మిన చేతులతో నాడిపట్టేలా..
సాక్షి, ఒంగోలు: రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం..కన్నబిడ్డలను కష్టపడి చదివించుకుంటూ జీవనం సాగిస్తోంది. బిడ్డలకు కూడా కష్టం అంటే ఏమిటో తెలియజేస్తోంది. ఆ బిడ్డలు తల్లిదండ్రుల కష్టాన్ని చూసి చదువులో రాణించటం మొదలు పెట్టారు. ఆ కష్టం కాస్తా ఫలించింది. కుమారుడు మెడిసిన్‌కు సంబంధించి నీట్ ఎంట్రన్స్ పరీక్షలో ఉచితంగా ఎంబీబీఎస్ సీటు సాధించి ఆ తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందాన్ని నింపాడు. దీంతో ఆ కుటుంబం సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. స్థానిక ధారావారితోటలో నివాసం ఉంటూ..ప్రకాశం భవన్ ముందు టీకొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న దాసరి పిచ్చయ్య, మాధవిల కుమారుడు దాసరి వంశీకృష్ణ ఈ అరుదైన ఘనత సాధించాడు. తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసిన వంశీకృష్ణ చదువుకుంటూనే టీ కొట్టులో కూడా పనిచేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. చివరకు మొన్నటి మెడిసిన్ నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించాడు. కౌన్సిలింగ్లో విశాఖపట్నంలోని గాయత్రీ విద్యాపీఠం మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటు వచ్చింది. పిచ్చయ్య ఎస్సీ కార్పొరేషన్లో రూ.లక్ష రుణం తీసుకొని జీవనం సాగిస్తూ తన కుమారుడు, కుమార్తెలను ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. కుమార్తె వైష్ణవి కూడా బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. వైష్ణవి చదువుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా దీవెన ద్వారా ఆర్థిక సహకారం అందుతోంది. ప్రత్యేకంగా అభినందించిన మంత్రి బాలినేని ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన దాసరి వంశీకృష్ణను రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలు చంద్రయ్య నగర్లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం సాయంత్రం వచ్చిన మంత్రి బాలినేని ఎంబీబీఎస్ సీటు సాధించిన వంశీకృష్ణను వెన్ను తట్టి ప్రోత్సహించారు. సాధారణ టీకొట్టు నడుపుకుంటున్న వ్యక్తి కుమారుడు ఎంబీబీఎస్ సీటు సాధించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడని అభినందించారు. యువత కష్టపడి చదువుకోవాలని బాలినేని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దాసరి వంశీకృష్ణ పడిన కష్టం గురించి మంత్రికి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తూతిక విశ్వనాథ్ శ్రీనివాస్ వివరించారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద టీ అమ్ముకుంటూ కష్టపడి చదువుకొని ఎంబీబీఎస్ సీటు సాధించాడని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తున్న అమ్మ ఒడి పథకం ద్వారా వంశీకృష్ణ చెల్లెలు వైష్ణవి చదువుకుందని, అదేవిధంగా బీటెక్‌లో చేరాక జగనన్న విద్యా దీవెన పథకం కూడా వచ్చిందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. విశాఖపట్నంలో ఎంబీబీఎస్ సీటు వచ్చిన ఆర్డర్‌ను మంత్రి బాలినేని చేతుల మీదుగా వంశీకృష్ణకు అందజేశారు. -
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ప్రకాశం జిల్లా శనగలు
జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన శనగ రైతులకు ఒక అద్భుత అవకాశం తలుపు తట్టింది. సాక్షాత్తూ కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూ తయారీ కోసం జిల్లాలో పండించిన జేజీ–11 రకం శనగలు కొనుగోలు చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకొచ్చింది. అలాగే సేద్యానికి అవసరమైన సాయాన్ని కూడా టీటీడీ అందించనుంది. శ్రీవారి సేవ చేసేందుకు అవకాశం కలగడం మహద్భాగ్యంగా రైతులు భావిస్తున్నారు. సాక్షి, ఒంగోలు: ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు మంచి అవకాశాలు వస్తున్నాయి. రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా ఇంటిల్లిపాది కష్టపడి పంటలను పండించి అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన పంటలు పండిస్తున్నారు. ఈ విధానంలో సాగుచేసిన శనగలు గొనుగోలు చేసేందుకు తిరుమల, తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముందుకొచ్చింది. జిల్లాలో దాదాపు 1026 టన్నుల జేజీ–11 శనగలు కొనేందుకు అంగీకరించింది. దీంతో జిల్లాలో పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం(జెడ్బీఎన్ఎఫ్)కు చెందిన అధికారులతో టీటీడీ అధికారులు సమావేశమయ్యారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. జిల్లాలో మొత్తం ఏడు వేల మంది ప్రకృతి వ్యవసాయం చేసే రైతులున్నారు. అందులో టీటీడీ నిబంధనల మేరకు సాగు చేసిన శనగ రైతులను ఎంపిక చేసుకున్నారు. బోడవాడలో శనగల నాణ్యతను పరిశీలిస్తున్న జెడ్బీఎన్ఎఫ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వి.సుభాషిణి చదవండి: (టీడీపీతో బీజేపీ పొత్తుపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు) ఇది మొదటి సంవత్సరం కావడంతో దీనిపై రైతులకు పెద్దగా అవగాహన లేదు. మొదటి విడతగా జిల్లాలోని 377 మంది రైతులు టీటీడీకి శనగలు (ఎర్ర శనగలు) ఇచ్చేందుకు అంగీకరించారు. వీరి దగ్గర నుంచి 1026 టన్నుల శనగలు కొనేందుకు మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపారు. శనగ పంట సాగు చేయటానికి రైతులు అవలంబించిన పద్ధతులు, పక్క పొలాల్లో పిచికారీ చేసే రసాయన ఎరువులు, పురుగు మందులు ప్రకృతి వ్యవసాయం చేసే పొలంలోకి రాకుండా తీసుకున్న జాగ్రత్తలు వీటన్నింటినీ పరిశీలించిన తరువాతనే కొనుగోలుకు ముందుకొచ్చారు. అందుకుగాను సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్(సీఎస్ఏ), ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థలను టీటీడీ రంగంలోకి దించింది. శాస్త్రీయంగా పరీక్షలు నిర్వహించిన తరువాతనే కొనుగోలు చేయటానికి నిర్ణయం తీసుకున్నారు. చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో రైతులకు ఇచ్చిన ఆవులు, ఎద్దులు మద్దతు ధరకంటే పది శాతం అదనపు ధర.. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన శనగలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకంటే పది శాతం అధికంగా ఇచ్చి కొనుగోలు చేయటానికి టీటీడీ అంగీకరించింది. ప్రస్తుతం ఎంఎస్పీ ప్రకారం క్వింటా శనగలు రూ.5,230 మద్దతు ధర ఉంది. దీనికి పది శాతం అదనంగా ఇచ్చి కొనుగోలు చేయటానికి నిర్ణయించింది. అంటే క్వింటా శనగలు రూ.5,753 రైతుకు దక్కనుంది. జిల్లాలో మొత్తం 49 ఆర్బీకేల పరిధిలో 19 మండలాల్లో పండించిన శనగలు కొనుగోలు చేయటానికి సిద్ధం చేశారు. జిల్లాలోని యర్రగొండపాలెం, మార్టూరు, పర్చూరు, ఇంకొల్లు, కారంచేడు, చినగంజాం, జే.పంగులూరు, కొరిశపాడు, అద్దంకి, నాగులుప్పలపాడు, మద్దిపాడు, ఒంగోలు, వలేటివారిపాలెం, చీమకుర్తి, ఎస్‌ఎన్‌పాడు, కనిగిరి, తర్లుపాడు, కొత్తపట్నం, ముండ్లమూరు మండలాల్లోని గ్రామాల్లో పండిన శనగలు కొనుగోలు చేయనున్నారు. ఉచితంగా ఆవులు, ఎడ్లు.. ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు సాగు చేస్తున్న రైతులకు టీటీడీ ఉచితంగా ఆవులు, సేద్యానికి జత ఎద్దులు అందిస్తోంది. ప్రకృతి వ్యవసాయానికి ఆవులు, ఎద్దుల మూత్రం, పేడ ఎంతో అవసరం. ఘన జీవామృతం, ద్రవ జీవామృతంతో పాటు పలురకాల కషాయాల ద్వారా పంటల్లో చీడ పీడలు, వ్యాధులను నివారించవచ్చు. అందుకోసం టీటీడీ జిల్లాలోని రైతులకు ఉచితంగా రవాణా ఖర్చులు భరించి మరీ రైతులకు అందజేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 247 ఆవులు కావాలని రైతులు కోరారు. అయితే ఇప్పటి వరకు 124 ఆవులను ఇచ్చారు. 26 జతలు ఎడ్లు కూడా ఇచ్చారు. ఒక్కో రైతుకు ఒక ఆవు కానీ లేదా, జత ఎడ్లుకానీ ఉచితంగా అందిస్తున్నారు. శనగ రైతులకు మంచి అవకాశం టీటీడీ ముందుకొచ్చి ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన జేజీ–11 రకం శనగలు కొనుగోలు చేయటం రైతులకు మంచి అవకాశం. జిల్లాలో ప్రతి సంవత్సరం ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు ఆసక్తిని పెంచుకుంటున్నారు. దీంతో టీటీడీ లాంటి ప్రముఖ అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన దేవస్థానం లడ్డూ తయారీకి కొనుగోలు చేయటం రైతులు ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు. మొదటి సంవత్సరం కాబట్టి కొంతమంది మాత్రమే ముందుకు వచ్చారు. వచ్చే ఏడాది నుంచి ఇంకా ఎక్కువ మంది రైతులు ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ధర కూడా పది శాతం అదనంగా ఇస్తున్నారు. గోవులు, ఎడ్లు ఉచితంగా ఇవ్వటంతో రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. - వి.సుభాషిణి, జిల్లా ప్రాజెక్టు మేనేజర్, జెడ్బీఎన్ఎఫ్ -
ఒంగోలులో భారీ అగ్నిప్రమాదం
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు నగర శివారులో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన 7 బస్సులు పూర్తిగా దగ్ధమవ్వగా.. ఒక బస్సు పాక్షికంగా దెబ్బతింది. వివరాలు.. ఒంగోలుకు చెందిన వేమూరి సుబ్బారావు అనే వ్యక్తి వేమూరి ట్రావెల్స్, వేమూరి కావేరి ట్రావెల్స్, కావేరి కామాక్షి ట్రావెల్స్, వినోద్ ట్రావెల్స్ అనే పేర్లతో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖ, గోవా, షిర్డీలకు బస్సులు నడుపుతుంటారు. కరోనా వల్ల బస్సులు నడపడం కష్టంగా మారిందని.. ఏడాదిన్నర కాలంగా 20 బస్సులను స్థానిక ఉడ్ కాంప్లెక్స్‌లోని తనకున్న 60 సెంట్ల ఖాళీ స్థలంలో పార్కింగ్ చేశాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో బస్సులు నిలిపి ఉన్నచోట ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఒంగోలులోని మూడు ఫైర్ ఇంజన్లు, టంగుటూరు, అద్దంకి నుంచి మరో రెండు ఫైర్ ఇంజన్లు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేశాయి. కానీ అప్పటికే 7 బస్సులు పూర్తిగా దగ్ధమవ్వగా.. ఒక బస్సు మాత్రం పాక్షికంగా దెబ్బతింది. అగ్నిమాపక అధికారులు శ్రీనివాసరావు, వీరభద్రరావు, కేవీకే ప్రసాద్, ఒంగోలు డీఎస్పీ నాగరాజు, తాలూకా సీఐ శ్రీనివాసరెడ్డి తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై ట్రావెల్స్ మేనేజర్ వేమూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కరోనా వల్ల 2020వ సంవత్సరం నుంచి బస్సులను ఉడ్ కాంప్లెక్స్‌లోని తన స్థలంలోనే పార్కింగ్ చేసి ఉంచానని చెప్పారు. అగ్నిమాపక శాఖ అధికారులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. కాగా, బస్సులు పూర్తిగా కాలిపోవడం వల్ల రూ.3.25 కోట్ల నష్టం వాటిల్లినట్లు పోలీసులకు వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశాడు. మంటలు ఎలా చెలరేగాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని.. ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. -
ప్రకాశం జిల్లా ఒంగోలు ఉడ్ కాంప్లెక్స్ సమీపంలో అగ్ని ప్రమాదం
-
ఒంగోలులో యువతుల సహజీవనం.. ఆ వీడియోలు చూసి..
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇద్దరు యువతుల సహజీవనం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఓ యువతి తల్లి స్పందిస్తూ ఇద్దరు అమ్మాయిలు(సుమలత, రమ్య) వివాహం చేసుకున్నారంటూ ఒంగోలు వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు ఈ ఘటనపై యువతులను వివరణ కోరగా.. తమ మధ్య అలాంటి సంబంధం ఏదీ లేదంటున్నారు. మేము ఇద్దరం అక్కా చెల్లెల్లా కలిసి మెలసి జీవిస్తున్నామన్నారు. రమ్యకు మేనమామతో ఆమె తల్లి నాగమణి వివాహం చేసేందుకు సిద్దమవ్వడంతో ఆ పెళ్లి ఇష్టం లేక రమ్య తన వద్ద ఉంటోందని సుమలత పేర్కొంది. కేవలం టిక్ టాక్‌లో రమ్య తాను కలిసి వివాహం చేసుకుంటున్నట్లు నటించిన వీడియోలు చూసి అదే నిజమైన పెళ్లిగా భావిస్తూ తమ మధ్య ఏదో సంబంధం ఉన్నట్లు అపోహపడుతోందని తెలిపింది. ఇదిలా ఉండగా సుమలత నివాసంలో పనిచేసే ఆయా మాత్రం వీరిద్దరు పెళ్లి చేసుకున్న విషయం వాస్తవమేనని చెబుతోంది. ఇద్దరు మహిళల వివాహంపై తాను మందలించడంతో తనను ఇంటి పనుల్లో నుంచి తొలగిస్తామని చెప్పారని తెలిపింది. దీంతో అసలు నిజం ఏంటనే విషయంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. చదవండి: (ప్రేమ వివాహం: ఐదు నెలల తర్వాత గ్రామానికి వచ్చి.. ఊరు శివార్లలో..) -
డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్
ఒంగోలు: రెండు లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ తరలిస్తున్న కేసులో కీలక నిందితుడు మలిపెద్ది సాయిరాఘవ అలియాస్ సోనును అరెస్టు చేసినట్టు ఎస్ఈబీ సూపరింటెండెంట్ అవులయ్య తెలిపారు. ఒంగోలు ఎస్ఈబీ కార్యాలయంలో ఆదివారం నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ గరికపాటి బిందుమాధవ్ నుంచి వచ్చిన సమాచారం మేరకు తమ సిబ్బంది ఈ నెల 18న స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గుజ్జు విజయశివభార్గవరెడ్డిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.2 లక్షల విలువైన నిషేధిత డ్రగ్స్‌ను సీజ్ చేసినట్టు తెలిపారు. అతనిని విచారించగా ఈ కేసులో బెంగళూరుకు చెందిన ఆంటోనీ, వైజాగ్‌కు చెందిన సోనులు కీలక పాత్రధారులుగా గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో తమ సిబ్బంది వైజాగ్ వెళ్లి మలిపెద్ది సాయిరాఘవ అలియాస్ సోనును అరెస్టు చేసి విచారించగా.. 2019లో వైజాగ్‌లో సంచలనం సృష్టించిన రేవ్ పార్టీ గంజాయి కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడుగా తేలిందన్నారు. సోనును రిమాండ్‌కు తరలించినట్టు అవులయ్య వివరించారు. కార్యక్రమంలో ఎస్ఈబీ అసిస్టెంట్ ఎన్ఫోర్సుమెంట్ సూపరింటెండెంట్ శ్రీధర్‌బాబు, ఒంగోలు ఎస్ఈబీ ఇన్స్పెక్టర్ లత తదితరులున్నారు. -
ప్రేమికుడి కోసం యువతి హల్చల్.. చావైనా, బతుకైనా ప్రేమించినోడితోనే
అనంతపురం సిటీ: తాను ప్రేమించిన ఒంగోలు యువకుడితో పెళ్లి చేయాలంటూ అనంతపురంలో ఓ యువతి ‘సఖి’ సెంటర్లో హల్చల్ చేసింది. తల్లిదండ్రులను చూడగానే రగిలిపోవడమే కాకుండా కౌన్సెలింగ్ నిర్వాహకులకు సహకరించకుండా దాడికి యత్నించడం, తాను చెప్పిందే రాసుకోవాలంటూ మీడియా ప్రతినిధులపై హుకుం చేస్తూ వీరంగం సృష్టించింది. గుంతకల్లు ప్రాంతంలో బ్యూటీషియన్ కోర్సు చేసిన యువతి విజయనగరంలో డిగ్రీ చదువుతున్న ఒంగోలు యువకుడితో ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకుంది. అది కాస్తా ప్రేమగా మారింది. అలా ఏడాదిగా వారిద్దరి మధ్య చాటింగ్‌లు కొనసాగాయి. ఇంతలోనే విషయం ఇంట్లో తెలిసి యువతిని పెద్దలు మందలించారు. చావైనా, బతుకైనా ప్రేమించినోడితోనేనని తెగేసి చెప్పి ఒంగోలు వెళ్లింది. అక్కడ ప్రతిఘటన ఎదురవడంతో వెనక్కు తిరిగొచ్చింది. చదవండి: ‘హాయ్..! మరదలా..’ అంటూ నగ్న చిత్రాలు, బూతు బావ భరతం పట్టిన మరదలు న్యాయం కోసం ‘సఖి’ని ఆశ్రయించి.. ప్రేమించిన యువకుడితో పెళ్లి చేయాలంటూ యువతి అనంతపురంలోని సఖి సెంటర్ నిర్వాహకులను గురువారం ఆశ్రయించింది. వారు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు యత్నించారు. అయితే అందుకు సహకరించలేదు. ప్రేమించినోడితేనే పెళ్లి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరిస్తూ ఆస్పత్రిపై నుంచి దూకేస్తానంటూ పారిపోయేందుకు యత్నించింది. అడ్డుకోబోయిన ఏఎస్ఐ గోవిందమ్మ, సఖి సెంటర్ మేనేజర్ శాంతామణి, సిబ్బందిపై ఎదురు దాడికి దిగింది. రాత్రంతా ఆమెను కాపలా కాయడం వారికి కష్టతరమైంది. చేసేది లేక ఆ అమ్మాయిని ఓ గదిలో పెట్టి గడియ బిగించారు. అంతే ఉగ్రరూపం దాల్చింది. ఒక్కసారిగా తలుపులను గట్టిగా తన్నడంతో గడియతో సహా ఊడొచ్చాయి. ఊహించని ఈ హఠాత్పరిణామంతో భయభ్రాంతులకు గురైన అధికారులు ‘దిశ’ పోలీసులకు సమాచారం అందించారు. రాత్రంతా కాపలా కాశారు.\ మీడియా ప్రతినిధులతోనూ వాగ్వాదం.. ప్రేమించినోడితో పెళ్లి చేయకపోతే ఇక్కడే చస్తానని బెదిరిస్తూ గురువారమంతా నీళ్లు, ఆహారం ఏమీ తీసుకోకుండా నిరసన ప్రకటించింది. శుక్రవారం కూడా ఆహారం తీసుకోలేదు. తనకు సఖి సెంటర్ నిర్వాహకులు న్యాయం చేయడం లేదంటూ మీడియాకు సమాచారం అందించింది. విలేకరులు వచ్చాక రెండు మూడు గంటల తర్వాత నోరు విప్పింది. తనను ఎదురు ప్రశ్నించకూడదని, తను చెప్పింది మాత్రమే రాసుకోవాలని, రికార్డు చేసుకోవాలని విలేకర్లతోనూ వాగ్వాదం చేసింది. తల్లిదండ్రులు కనిపిస్తే కస్సుమంటోంది... తన ప్రేమ భగ్నం కావడానికి తల్లిదండ్రులు, అక్క,బావలే కారణమనే ఆగ్రహంతో ఊగిపోతున్న యువతి.. సఖి సెంటర్ నిర్వాహకుల కోరిక మేరకు ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు తమ బిడ్డకు ఎంతగా నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారిని చూడగానే రగిలిపోయింది. తన జీవితాన్ని నాశనం చేసింది చాలు. మీరెళ్లండి. నేను మాత్రం మీ వెంట ఇంటికి రానంటూ చీదరించుకుంది. చేతుల నిండా బ్లేడ్ గాయాలే.. ప్రేమించినోడి కోసం ఆ యువతి రెండు చేతులపై కోసుకున్న గాయాలే కనిపిస్తున్నాయి. వాడి కోసం అవసరమైతే చచ్చిపోవడానికైనా సిద్ధమేనంటూ, తన మనస్సు మార్చేందుకు ఎవరూ ప్రయత్నించొద్దంటూ ‘దిశ’ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సీఐ ధరణి కిశోర్ సహా మహిళా పోలీసులు, విలేకర్లతో యువతి వాదించింది. దీంతో గుంతకల్లు డీఎస్పీ నరసింగప్పకు సమాచారం అందించారు. అక్కడి నుంచి పోలీస్ బృందం కూడా బయలుదేరి వచ్చింది. కౌన్సెలింగ్‌కు సహకరించడం లేదు యువతి మంకుపట్టు పడుతోంది. కౌన్సెలింగ్‌కు సహకరించడం లేదు. అబ్బాయితో మాట్లాడి, పిలిపిస్తామని చెప్పినా వినడం లేదు. ఎదురు దాడికి దిగుతోంది. నోటికొచ్చినట్లు తిడుతోంది. నేను, ఏఎస్ఐ, మా సిబ్బంది రెండ్రోజులుగా నిద్రాహారాలు మాని ఆ అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుతున్నాం. – శాంతామణి, సఖి సెంటర్ నిర్వాహకురాలు చట్టప్రకారమే ముందుకెళ్తాం యువతి మానసిక పరిస్థితి బాగోలేదు. ప్రభుత్వాస్పత్రి మానసిక వైద్య నిపుణుడి వద్దకు పిల్చుకెళ్తాం. వైద్యుడి సర్టిఫికెట్ రాగానే జడ్జి ఎదుట యువతిని హాజరుపరుస్తాం. ఆ తరువాత జడ్జి ఆదేశిస్తే విశాఖలోని మానసిక రోగుల ఆస్పత్రికి తరలిస్తాం. ఏదైనా చట్టం ప్రకారమే ముందుకెళ్తాం. – ఆర్ల శ్రీనివాసులు, దిశ డీఎస్పీ, అనంతపురం -
వాట్సప్ చివరి స్టేటస్.. ఊరి నుంచి తెచ్చుకున్న అమ్మ చీరతోనే ఉరేసుకుని..
సాక్షి, ఒంగోలు/విశాఖపట్నం: ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి తన అమ్మ చీరతోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులోని దామచర్ల ఆంజనేయులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం పాత ఆదినారాయణ సంత సమీపంలోని గుల్లేపల్లి గ్రామానికి చెందిన వెసలపు పాతబాబు, నారాయణమ్మ దంపతుల కుమారుడు వి.వరుణ్ సాయి (17) ఒంగోలులోని దామచర్ల ఆంజనేయులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో హాస్టల్ నెల రోజుల క్రితమే తెరుచుకుంది. హాస్టల్ వార్డెన్ కరోనా రావడంతో సెలవులో ఉన్నాడు. హాస్టల్లో ఉంటున్న వరుణ్‌వాసు పండుగ సెలవులకు ఇంటికి వెళ్లి గత ఆదివారం హాస్టల్‌కు తిరిగి వచ్చాడు. తరగతులకు వెళ్లకుండా.. ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి హాస్టల్ వదిలి క్లాసులకు వెళ్లడం లేదు. ఏమిటి అంటే ఆరోగ్యం బాగోలేదని చెబుతుండడంతో సహచర విద్యార్థులు పట్టించుకోలేదు. వచ్చేటప్పుడు చీరె తీసుకొని వచ్చాడు. చీరె ఎందుకు తెచ్చావు అంటే మా అమ్మది.. కప్పుకోవడానికి ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. గురువారం నుంచి వీరికి మిడ్ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలకు వరుణ్‌వాసు హాజరుకాకపోవతుండటంతో తోటి విద్యార్థులు అడిగితే ప్రస్తుతం ప్రిపేర్ కాలేదని, చివరి పరీక్షల్లో బాగా మార్కులు తెచ్చుకుంటానని చెప్పాడు. శుక్రవారం మధ్యాహ్నం హాస్టల్ విద్యార్థులతో కలిసి భోజనం చేసి తన గదికి వెళ్లాడు. కొద్ది సేపటికి.. కొద్దిసేపటి తరువాత తోటి విద్యార్థులు వెళ్లి చూడగా వరుణ్‌వాసు తన తల్లి చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. దీంతో వాళ్లు హాస్టల్ గది తలుపుని బలవంతంగా తెరిచి ఫ్యాన్‌కు వేలాడుతున్న అతనిని చీరె నుంచి తప్పించి హాస్టల్ వాచ్‌మన్‌కు ఫోన్ చేశారు. వాచ్‌మన్ వచ్చి అప్పటికే స్పృహ లేకుండా ఉన్న వరుణ్‌ను రిమ్స్‌కు తీసుకెళ్లగా వైద్యులు పరిశీలించి మృతిచెందినట్లు నిర్థారించారు. చదవండి: డ్రగ్స్ కేసు: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు ప్రధాన నిందితుడు టోనీ చివరి వాట్సప్ స్టేటస్ వాట్సప్ స్టేటస్‌లో.. కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు ఇచ్చిన సమాచారంతో తాలూకా సీఐ శ్రీనివాసరెడ్డి రిమ్స్‌కు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించడంతో పాటు హాస్టల్లో విద్యార్థులను విచారించారు. వరుణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే దానిపై అతని వాట్సప్‌ను పరిశీలించగా అందులో స్టేటస్ ‘డెత్...దిడే పీపుల్ విల్ టాక్ గుడ్ ఎబౌట్ యు...గుడ్‌బై ’ అని పోస్టు చేసి ఉంది. దీంతో అతను ఈ పోస్టును ఎవరిని ఉద్దేశించి చేశాడనేది తెలియలేదు. చదవండి: సీఎం దృష్టికి వెళ్లకుండా చూస్తాం.. రూ.25లక్షలు ఇవ్వు.. డీఎంకే ఎమ్మెల్యేలకు బెదిరింపులు తల్లిదండ్రులకు సమాచారం.. వరుణ్ కాలేజీలో విద్యార్థులందరితో కలివిడిగా ఉంటాడని, మంచివాడు అంటూ చెబుతున్నారు. పోలీసులు విషయాన్ని వైజాగ్‌లోని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీనిపై తాలూకా సీఐ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రాథమికంగా తమ విచారణలో కాలేజీకి సంబంధించి బాలునికి ఎటువంటి సమస్యలు లేవని తేలిందని, అంతే కాకుండా సెలవుల నుంచి కాలేజీకి వచ్చినప్పటి నుంచి తరగతులకు కూడా హాజరుకాలేదని తెలుస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఏం జరిగిందనే దానిపై బాలుని తల్లిదండ్రులు వచ్చిన తరువాత వారు చెప్పే సమాధానం, బాలుని వాట్సప్ సందేశాలను పరిశీలించిన తరువాత పూర్తి విషయాలు వెల్లడిస్తామన్నారు. -
బండ్ల గణేష్‌కు అరెస్ట్ వారెంట్ జారీ.. కోర్టుకు హాజరు ?
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మరోసారి వివాదాల్లో చిక్కుక్నునారు. ఈ సారి ఆయన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నారు. బండ్ల గణేష్‌పై ఏపీ ప్రకాశం జిల్లా ఒంగోలు రెండో మెజిస్ట్రేట్ కోర్టు సోమవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జిల్లాలోని ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి గణేష్ రూ.1.25 కోట్ల చెక్కును అందించినట్లు సమాచారం. అయితే ఆ చెక్కు బౌన్స్ కావడంతో చెక్ బౌన్స్ కేసు నమోదు చేశాడు వెంకటేశ్వర్లు. విచారణకు హాజరు కావాలని కోర్టు పలుమార్లు ఆదేశించినా బండ్ల గణేష్ స్పందించలేదు. దీంతో అతన్ని అరెస్ట్ చేయాల్సిందిగా న్యాయమూర్తి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. బండ్ల గణేష్ సోమవారం కోర్టుకు హాజరైనట్లు తెలుస్తోంది. గతంలో బండ్ల గణేష్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కేసు నమోదైంది. కడపకు చెందిన మహేష్ అనే వ్యక్తి తనకు రూ.13 కోట్లు ఇచ్చాడని, దానిని నటుడు తిరిగి ఇవ్వలేదని తెలుస్తోంది. చివరికి కడపలో డబ్బులు చెల్లించకపోవడంతో బండ్ల గణేష్‌పై మహేష్ ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అదే తరహాలో బండ్ల గణేష్ విచారణకు కోర్టుకు హాజరుకాకపోవడంతో కడప మెజిస్ట్రేట్ ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో పోలీసులు బండ్ల గణేష్‌ను అరెస్టు చేసి కడప జిల్లా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. -
ఒంగోలు జాతి కోడె దూడ ధర రూ.2 లక్షలు
నాదెండ్ల (చిలకలూరిపేట): 20 నెలల వయసున్న ఒంగోలు జాతి కోడె దూడ రూ.2 లక్షల ధర పలికింది. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన రైతు, చిలకలూరిపేట మునిసిపల్ వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వరరావు దీనిని పెంచుతున్నారు. తిరుపతికి చెందిన ఓ ప్రైవేటు బ్రీడింగ్ కేంద్రం వారు బ్రీడింగ్ నిమిత్తం ఈ ఒంగోలు వృషభ రాజాన్ని రూ.2 లక్షలకు కొనుగోలు చేశారు. -
నువ్వురాకపోతే చచ్చిపోతా.. నువ్వు అవి మానేస్తానంటేనే వస్తా..
సాక్షి, ఒంగోలు: స్థానిక నేతాజీ కాలనీలో నక్కా మణికంఠ(30) ఇంటి సీలింగ్‌కు ఉన్న కొక్కేనికి తాడుసాయంతో ఉరేసుకుని ఆత్మహత్యచేసుకున్నాడు. తాను నివాసం ఉండే ఇంట్లోనే ఈ ఘటన సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం మణికంఠ స్వగ్రామం టంగుటూరు మండలం మర్లపాడు. రెండు సంవత్సరాలుగా తుపాకుల విజయ్‌కుమార్ అలియాస్ లవ్లీ అనే ట్రాన్స్‌జెండర్‌తో కలిసి ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం ఇద్దరు వివాహం కూడా చేసుకున్నారు. గత నెల 19న మణికంఠకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆస్పత్రిలో చూపించగా వైద్యులు మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలని సూచించారు. చదవండి: (దారుణ హత్య: తల, మొండెం వేరుచేసి తలతో పారిపోయి..) అయితే వత్తిరీత్యా డ్రైవర్ అయిన మణికంఠ మద్యం, సిగిరెట్లు మానకపోవడంతో సోమవారం మణికంఠ , లవ్లీ మధ్య వివాదం జరిగింది. దీంతో లవ్లీ చిలకలూరిపేట వెళ్ళింది. దీంతో నువ్వురాకపోతే చచ్చిపోతానని ఫోన్లో హెచ్చరించాడు. మానేస్తానంటేనే వస్తానంటూ అటునుంచి సమాధానం వచ్చింది. ఆ తరువాత కొద్దిసేపటికి ఫోన్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోతుండడంతో లవ్లీ సమీపంలోని వారికి ఫోన్‌చేసింది. వారు వెళ్లి చూడగా ఇంటిపైన ఉన్న కొక్కేనికి వేలాడుతూ కనిపించాడు. దీంతో ఉరేసుకున్నట్లు గుర్తించి వారు లవ్లీకి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తాలూకా ఎస్సై దేవకుమార్ ఘటనాస్థలానికి చేరుకుని మతదేహాన్ని కిందకు దించి చుట్టుపక్కల వారిని విచారించారు. లవ్లీ కూడా ఒంగోలుకు చేరుకోవడంతో ఆమెను విచారించారు. గతంలోను ఇదే విధంగా.. మణికంఠ తరచూ ఆత్మహత్యచేసుకుంటానని బెదిరించేవాడని, అదే విధంగా బెదిరిస్తున్నాడని అనుకున్నానని లవ్లీ చెబుతోంది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Chanda Nagar: యువతి ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..
సాక్షి, చందానగర్: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 25వ తేదీన యువతి ఆత్మహత్య కేసులో అనేక విషయాలు బయటపడుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కరవిడికి చెందిన నాగచైతన్య(24) ఆదివారం హత్యకు గురైన విషయం తెలిసిందే. ప్రియుడు గుంటూరు జిల్లా రెంటచింతలకు చెందిన కోటిరెడ్డి(29) ప్రియురాలిని హత్య చేసి సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారు. చదవండి: ఒంగోలు ఆస్పత్రిలో ప్రేమ..హైదరాబాద్‌కి వచ్చి కత్తితో పొడుచుకుని.. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులకు అనేక విషయాలు తెలిశాయి. ఒంగోలులోని జిన్స్ హాస్పిటల్లో నాగచైతన్య నర్సు. అక్కడే కోటిరెడ్డి మేనేజర్‌గా పనిచేసేవాడు. వీరిద్దరి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. నాగచైతన్య తనను వివాహం చేసుకోవాల్సిందిగా కోటిరెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చింది. ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని కోటిరెడ్డి ప్లాన్ వేశాడు. 23వ తేదీ ఉదయం సిటిజన్ ఆస్పత్రి వరకు వచ్చిన అతను సాయంత్రం వరకు అక్కడే ఉండి నాగచైతన్యను ఎస్వీఆర్ గ్రాండ్ హోటల్లోని ఓయో రూమ్‌కు తీసుకెళ్లాడు. చదవండి: ‘సంబంధం’ పెట్టుకుని.. సస్పెండయ్యారు! ఓడ్కా తాగి రాత్రి అక్కడే బస చేసిన అతను స్విగ్గీలో ఇద్దరికీ భోజనం ఆర్డర్ చేశాడు. 24 తేదీ ఉదయం 11 గంటలకు హోటల్ గదికి తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి 10.30 గంటల సమయంలో ఒంగోలులోని ఓ ఆస్పత్రిలో చేరాడు. అతను నాగచైతన్యను హత్య చేసి ట్రైన్లో ఒంగోలుకు చేరుకున్నట్లు తెలిసింది. అనంతరం రాత్రి 11 గంటల సమయంలో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చి తలుపులు తెరిచి చూడగా నాగచైతన్య రక్తపు మడుగులో మృతి చెందింది. కత్తి, తాడు కొనుగోలు.. 23న నగరానికి వచ్చిన కోటిరెడ్డి ఓ సూపర్ మార్కెట్లో కత్తి, తాడు కొనుగోలు చేశాడు. ఓయో రూమ్‌కు తీసుకెళ్లిన కోటిరెడ్డి ముందుగానే ఓడ్కా బాటిల్, కత్తి, తాడు తన బ్యాగ్‌లో తీసుకెళ్లాడు. రూమ్‌కు వెళ్లిన కొద్ది సేపటికే బయటకు వెళ్లి కూల్‌డ్రింక్స్ తీసుకొచ్చాడు. స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. స్విగ్గీ బాయ్ నుంచి ఫుడ్ డెలివరీ తీసుకున్న అతను రూమ్‌లోకి వెళ్లి మరుసటి రోజు ఉదయం వరకు బయటకు రాలేదు. దీంతో పోలీసులు బలమైన ఆధారాలు సేకరించారు. రాత్రి ఇరువురు ఓడ్కా సేవించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది. అనంతరం వివాహం విషయంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకొని ఉంటుందని ఆ క్రమంలోనే ప్రియురాలిని కత్తితో గొంతుకోసి హత్య చేసి ఉంటాడని ప్రాథమిక సాక్ష్యాధారాలను బట్టి తెలుస్తోంది. అనంతరం ఫ్యాన్‌కు ఉరి వేసేందుకు చున్నీ ప్రయత్నించి ఉంటాడని పోలీసులు వెల్లడించారు. కులాంతరమే హత్యకు కారణమా? కోటిరెడ్డి రెడ్డి సామాజిక వర్గం కావడంతోనే నాగచైతన్యను వివాహం చేసుకునేందుకు అతడి కుటుంబ సభ్యులు నిరాకరించి ఉంటారని తెలుస్తోంది. దళిత కులానికి చెందిన యువతి కావడంతో కోటిరెడ్డి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపడుతున్నారు. కాగా ఒంగోలుకు వెళ్లిన సిటీ పోలీసులు అతడిని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. -
ఒంగోలు ఆస్పత్రిలో ప్రేమ..హైదరాబాద్‌కి వచ్చి కత్తితో పొడుచుకుని..
-
ఒంగోలు ఆస్పత్రిలో ప్రేమ..హైదరాబాద్‌కి వచ్చి కత్తితో పొడుచుకుని..
సాక్షి, ఒంగోలు/చందానగర్: కులాంతర వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించరని మనస్తాపం చెందిన ప్రేమజంట హైదరాబాద్‌లోని ఓ హోటల్ గదిలో కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. యువతి మృతిచెందగా, గాయాలైన యువకుడు భయపడి ఒంగోలు జీజీహెచ్‌లో చేరి చికిత్స పొందుతున్నాడు. యువకుడు, పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా రెంటచింతల మండలం రెంట్యాలకు చెందిన గాదె కోటిరెడ్డి ఒంగోలులోని జిమ్స్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఒంగోలు మండలం కరవది ప్రాంతానికి చెందిన జి.నాగచైతన్యతో (జిమ్స్‌లోనే నర్సు) పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు. కులాంతర వివాహం కావడంతో కోటిరెడ్డి తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య హైదరాబాద్ చేరుకుని అక్కడ సిటిజన్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఈ నెల 22న కోటిరెడ్డి హైదరాబాద్ చేరుకున్నాడు. బాచుపల్లిలో తన సోదరి ఇంట్లో ఉండి 23వ తేదీ నాగచైతన్యను కలిశాడు. డ్యూటీ అనంతరం ఆమెతో కలిసి షాపింగ్‌కు వెళ్లి కత్తిని కొనుగోలు చేశాడు. అక్కడ నుంచి నల్లగండ్లలోని ఎస్వీఆర్ గ్రాండ్ హోటల్లో రూమ్ తీసుకున్నారు. వివాహానికి పెద్దలు అంగీకరించరని స్పష్టతకు వచ్చి 24వ తేదీ తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇద్దరూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ముందుగా నాగచైతన్య కత్తితో గొంతుపై, కడుపులో పొడుచుకుని పడిపోయింది. దీంతో కోటిరెడ్డి కూడా కత్తితో గొంతుమీద పొట్టలో పొడుచుకుని పడిపోయాడు. చదవండి: (టీలో నిద్రమాత్ర వేసి.. మత్తులోకి వెళ్లగానే అత్యాచారం) ఉదయం 10.30 గంటల సమయంలో కోటిరెడ్డికి మెలకువ వచ్చి చూడగా నాగచైతన్య స్పృహలో లేదు. ఫ్యానుకు ఉరేసుకునేందుకు విఫలయత్నం చేశాడు. భయంతో రెంట్యాలలోని ఇంటికి చేరుకుని బంధువులకు విషయం చెప్పాడు. అంతా కలిసి రెంట్యాల పోలీసుల వద్దకు వెళ్లగా వారు చందానగర్ ఎస్సైతో మాట్లాడారు. మరోవైపు సాయంత్రం వరకు హోటల్ గది నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో నిర్వాహకులు గది తెరచి చూడగా అందులో నాగచైతన్య రక్తపు మడుగలో చనిపోయి ఉంది. దీంతో వారు చందానగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. నాగచైతన్య చనిపోయిందని స్పష్టం కావడం, కోటిరెడ్డి గాయాలతో ఉండటంతో తొలుత చికిత్స చేయించాలని చందానగర్ఎస్సై సూచించారు. దీంతో బంధువులు అతనిని సోమవారం ఒంగోలు జీజీహెచ్‌లో చేర్చారు. అయితే 24వ తేదీ ఉదయం 4 గంటల సమయంలో కత్తితో శరీరంపై రెండు చోట్ల గాయాలు చేసుకున్న వ్యక్తి 25వ తేదీ ఉదయం 4గంటలకు జీజీహెచ్‌లో చేరేంత వరకు ఏంజరిగిందనేది పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రస్తుతం కోటిరెడ్డి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. చదవండి: (అనుమానం.. చిత్రహింసలు.. నదిలో దూకి తల్లీ, బిడ్డ ఆత్మహత్య) -
దర్శి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు, దర్శి మాజీ శాసనసభ్యులు సానికొమ్ము పిచ్చిరెడ్డి కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో ఒంగోలులో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు పర్యాయాలు 1989, 1999లలో దర్శి నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. పిచ్చిరెడ్డి మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. శుక్రవారం సాయంత్రం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. చదవండి: (ఎప్పటికప్పుడు జనన, మరణాల ధ్రువీకరణ) -
అద్దెకున్న మహిళే హంతకురాలు
సాక్షి, ఒంగోలు: చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలేనికి చెందిన మేదరమెట్ల సీతారావమ్మ దారుణ హత్య కేసులో నిందితులను 48 గంటల్లోనే అరెస్టు చేసినట్లు ఎస్పీ మలికా గర్గ్ వెల్లడించారు. మృతురాలి దుకాణం అద్దెకు తీసుకున్న మహిళే ప్రధాన నిందితురాలని తెలిపారు. ఘటనా స్థలంలో ఎటువంటి క్లూలు లేకపోయినా అధికారులు, సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి నిందితులను గుర్తించారని పేర్కొంటూ నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మహిళ హత్య కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు. దర్శి మండలం రామచంద్రాపురానికి చెందిన రేగటి రమాదేవి ఐదు నెలల క్రితం మర్రిచెట్లపాలేనికి వచ్చి సీతారావమ్మ బడ్డీకొట్టును నెలకు రూ.6 వేలకు అద్దెకు తీసుకుని హోటల్ ప్రారంభించింది. రమాదేవి కుమారుడు పవన్ నూడుల్స్ బండి పెట్టుకుని రోజుకు రూ.100 అద్దె చెల్లిస్తానని చెప్పాడు. 4 నెలలకు పైగా కాలానికిగాను రూ.38 వేలు సీతారావమ్మకు చెల్లించాల్సి ఉండగా రూ.13 వేలు మాత్రమే చెల్లించారు. ఈ క్రమంలో బసిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వద్ద రూ.60 వేలు, స్థానికంగా పూలకొట్టు నిర్వహించే మహిళ వద్ద రూ.5 వేలు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వలేకపోపోయారు. నెల క్రితం సీతారావమ్మకు చెప్పకుండా దుకాణం ఖాళీ చేశారు. 15 రోజుల తర్వాత అద్దెకు ఉంటున్న తూబట్ల అంజిరెడ్డి ఇంటికి వచ్చి సామాన్లు తీసుకెళ్లేందుకు యత్నించగా బాకీ చెల్లించాలని అప్పులవాళ్లు తేల్చిచెప్పారు. చదవండి: (నిరుద్యోగులను ముంచేసిన మహిళా హోంగార్డు) ఆర్థిక బాధల నుంచి బయటపడేందుకు సీతారావమ్మను హతమార్చి సొమ్ము కాజేయాలని నిర్ణయించుకున్న రమాదేవి.. దర్శికి చెందిన స్నేహితురాలు ధర్మవరపు కుమారితో కలిసి పథకం రచించింది. ఈ క్రమంలో సిలిండర్లు తీసుకువెళ్లే నెపంతో రెండుసార్లు అర్ధరాత్రి వేళ సీతారావమ్మ ఇంటికి వెళ్లి తలుపులు తెరవాలని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో ముండ్లమూరు మండలం లక్ష్మీపురానికి చెందిన సుధాకరరెడ్డి కారును బాడుగకు తీసుకుని ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం సీతారావమ్మ ఇంటికి వెళ్లారు. కండువా, స్కార్ఫ్‌ను సీతారావమ్మ మెడకు బిగించి, కాళ్లూచేతులను చీరెతో కట్టేసి చంపారు. ఆమె శరీరంపై ఉన్న 31.82 గ్రాముల బంగారు గాజులు రెండు, 2.29 గ్రాముల చెవి కమ్మలు, 3.68 గ్రాముల చెవి మాటీలు, 14 గ్రాముల కాశీనాయన పూసల దండతోపాటు పోకో సీ3 మొబైల్, రూ.3 వేల నగదు తీసుకుని మృతురాలి ఇంటికి తాళం వేసి పరారయ్యారు. రెండు రోజుల తర్వాత వెలుగులోకి.. సీతారావమ్మ ఇంటికి తాళం వేసి ఉండడం, ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు తలుపులు పగలగొట్టి చూడగా ఆమె శవమై పడి ఉంది. సీతారావమ్మ కుమార్తె అనూరాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఎటువంటి క్లూలు లభించలేదు. అయితే తన ఇంటికి రెండుసార్లు అర్ధరాత్రి పూట రమాదేవి వచ్చివెళ్లిన విషయాన్ని చుట్టుపక్కల వారితో సీతారావమ్మ చెప్పిన మాటలు నిందితుల గుర్తింపులో కీలకంగా మారాయి. రమాదేవిపై నిఘా ఉంచిన పోలీసులు 7వ తేదీన సీతారావమ్మ ఇంటికి వచ్చినట్లు గుర్తించారు. దర్శి బస్టాండు వద్ద రమాదేవిని, మరో నిందితురాలు కుమారిని ఆమె ఇంటి వద్ద అరెస్టు చేశారు. చదవండి: (ఇల్లరికం అల్లుడు.. అత్తారింట్లో ఏం చేశాడంటే..!) చోరీ సొత్తు మార్చి బ్యాంకులో తాకట్టు సీతారావమ్మ ఇంట్లో దోచుకున్న సొత్తును దర్శిలోని సాయిబాబా జ్యూవెలరీస్‌లో ఇచ్చి కొత్త నగలు తీసుకున్నారు. ఆ నగలను రమాదేవి తన తండ్రితో బ్యాంకులో తాకట్టుపెట్టించి బాకీ తీర్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో షాపు యజమాని నుంచి సీతారావమ్మకు చెందిన నగలను స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన సొత్తు విలువ రూ.2.23 లక్షలుగా అంచనా వేశారు. -
నిరుద్యోగులను ముంచేసిన మహిళా హోంగార్డు
సాక్షి, ఒంగోలు: ప్రజలకు రక్షణగా నిలిచి అన్యాయాలను అడ్డుకోవాల్సిన ఓ మహిళా హోంగార్డు.. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసింది. డీజీపీ పేరుతో స్టాంపులు తయారుచేసి ఒకే కుటుంబంలో ముగ్గురికి నకిలీ నియామకపత్రాలిచ్చింది. లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ నిరుద్యోగులను ముంచేసింది. ఓ నిరుద్యోగి చేసిన ఫిర్యాదుతో ఈ మోసం బయటపడింది. ఈ వివరాలను జిల్లా ఎస్పీ మలికాగర్గ్ సోమవారం మీడియాకు వెల్లడించారు. ఒంగోలుకు చెందిన చెట్ల వాణి తండ్రి పోలీస్ శాఖలో పనిచేసేవారు. పెళ్లయిన తర్వాత ఆమె భర్త నిరాదరణకు గురయ్యింది. తల్లిదండ్రులు కూడా చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న అప్పటి డీజీపీ ఈమెను హోంగార్డుగా నియమించారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె అడ్డదారులు తొక్కింది. సింగరాయకొండకు చెందిన షేక్ ఖాజాహుస్సేన్, కృష్ణలతో చేతులు కలిపింది. వీరు ముగ్గురూ కలిసి హోంగార్డు పోస్టులు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు ఎరవేసి మోసం చేయడం మొదలుపెట్టారు. ఈక్రమంలో వాణికి ఒంగోలు బలరాం కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు పరిచయమయ్యాడు. హోంగార్డు పోస్టులు ఇప్పిస్తున్నానని చెప్పడంతో నమ్మిన వెంకటేశ్వర్లు.. డిగ్రీ చదువుతున్న తన అల్లుడు శివకుమార్‌రెడ్డికి ఉద్యోగం ఇప్పించాలని కోరాడు. ఇందుకోసం ఆమె అడిగిన రూ.60 వేలను రెండు దఫాల్లో చెల్లించారు. అయితే ఆమె ఇచ్చిన నియామకపత్రం నకిలీదని తెలియడంతో బాధితుడు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. చెట్ల వాణి, హుస్సేన్, కృష్ణ చేసిన మరికొన్ని మోసాలు కూడా బయటపడ్డాయి. ఒక కేసులో తండ్రి, కుమారుడు, కుమార్తెకు నకిలీ నియామక పత్రాలిచ్చినట్లు వెల్లడైంది. ఇప్పటి వరకు ఐదుగురి వద్ద నుంచి రూ.5 లక్షలకు పైగా వసూలు చేశారని ఎస్పీ తెలిపారు. నిందితులకు ఇందిరమ్మ కాలనీకి చెందిన జిరాక్స్ షాపు నిర్వహించే అరుణ, కొల్లు జయలక్ష్మి సహకరించారని వెల్లడించారు. ఐదుగురిని అరెస్టు చేసి డీజీపీ పేరుతో తయారు చేసిన స్టాంపులు, నకిలీ నియామకపత్రాలను సీజ్ చేశామన్నారు. కేసును వేగంగా దర్యాప్తు చేసిన డీఎస్పీ నాగరాజు, సీఐ సుభాషిణి, ఎస్సై ముక్కంటి, ఏఎస్సై గుర్రం ప్రసాద్ తదితరులను ఎస్పీ అభినందించారు. -
మంత్రి బాలినేని చొరవ.. రోజూ నీళ్లొచ్చేలా మెగా ప్లాన్
గుక్కెడు నీటి కోసం ఒంగోలు నగర ప్రజలు నానా తంటాలు పడాల్సిందే. నాలుగు రోజులకు ఒకసారి ఇచ్చే మంచినీటి కోసం ఎదురుచూపులే. శివారు కాలనీల్లో మంచినీటి ట్యాంకర్లు వస్తే తప్ప నీరందని దుస్థితి. పట్టణం ఆవిర్భావం నుంచి ఉన్న ఈ సమస్యకు చెక్ పెట్టేలా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో మెగా తాగునీటి ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. రూ.409 కోట్లు ఖర్చయ్యే ఈ పథకాన్ని సీఎం జగన్ మంజూరు చేయడంతో నగరవాసుల క‘న్నీటి’ కష్టాలకు తెరపడనుంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు నగరంలో మంచినీటి సమస్యకు ఒక పరిష్కారం దొరికింది. జిల్లా కేంద్రం నలుదిశలా విస్తరిస్తోంది. అందుకు తగ్గట్టుగా నీటి అవసరాలూ పెరుగుతున్నాయి. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నగరంలోని తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంపై దృష్టి సారించారు. ముందుచూపుతో భారీ రక్షిత మంచినీటి పథకం ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. మెగా మంచినీటి ప్రాజెక్టుకు రంగం సిద్ధం చేశారు. నగర పాలక సంస్థ అధికారులతో మొత్తం రూ.409 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేయించారు. రెండు రోజుల క్రితం ఒంగోలుకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. వెంటనే స్పందించిన సీఎం పథకం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో నగర ప్రజల దశాబ్దాల సమస్య తీరనుంది. ఇదీ ప్రణాళిక... ఈ పథకం పూర్తయితే నాలుగైదు రోజులకు వచ్చే మంచినీటికి æఇక చెక్ పడ్డట్టే. ప్రతి మనిషికి 135 లీటర్ల చొప్పున నగర ప్రజలందరికీ ప్రతిరోజూ రక్షిత మంచినీటిని అందించవచ్చు. ప్రస్తుతం నగరంలో దాదాపు 3 లక్షలకు పైగా జనాభా నివశిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఒంగోలు నగరంలో 2,65,746 మంది ఉన్నారు. నగరంలో విలీనమైన గ్రామాలకు సైతం ఈ ప్రాజెక్టు ద్వారా సంవృద్ధిగా నీటిని సరఫరా చేసేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం నగరానికి రామతీర్థం నుంచే సాగర్ నీళ్లు వస్తున్నాయి. నగరంలోని రెండు సమ్మర్ స్టోరేజీ ట్యాంకులతో పాటు రంగారాయుడు చెరువు నుంచి ప్రస్తుతం తాగునీరు సరఫరా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న సరఫరా వ్యవస్థకు భిన్నంగా నగరానికి రామతీర్థం నుంచే నీటిని సరఫరా చేయటానికి మాస్టర్ ప్లాన్ వేశారు. అందులో భాగంగా నగరం వరకు నీటిని సరఫరా చేయటానికి మొత్తం రూ.107 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందుకు పైప్‌లైన్ వ్యవస్థను రూపొందించనున్నారు. రామతీర్థం రిజర్వాయర్‌లో 18 మీటర్ల వ్యాసార్థంతో ఇన్‌టేక్ వెల్‌తో పాటు పంపు హౌస్‌ను నిర్మించనున్నారు. రిజర్వాయర్‌లోనే ఇన్‌టేక్ వెల్ కోసం కాపర్ డ్యాంను నిర్మిస్తారు. అక్కడే సర్వీసు బ్రిడ్జితో పాటు, 150 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ఆరు పంప్ సెట్లతో పాటు నీటిని పంపింగ్ చేయటానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయనున్నారు. అక్కడి వరకు దాదాపు రూ.5.50 కోట్ల వరకు వెచ్చించనున్నారు. చీమకుర్తి విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి ఇన్‌టేక్ వెల్ వరకు దాదాపు 16 కిలో మీటర్ల మేర విద్యుత్ లైన్‌ను ప్రత్యేకంగా వేయనున్నారు. డ్యాం వద్ద నుంచి ఇన్‌టేక్ వెల్ వరకు అప్రోచ్ రోడ్డు, 900 కిలో లీటర్ల సామర్థ్యం ఉన్న ఒక ట్యాంకును కూడా ఏర్పాటు చేయటానికి ప్రతిపాదనల్లో పొందుపరిచారు. అక్కడ నుంచి ఒంగోలు వరకు నీటిని సరఫరా చేయటానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లకు సంబంధించి మొత్తం రూ.107 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. రీ మోడల్‌కు రూ.302 కోట్లు నగరంలోని మంచినీటి వ్యవస్థను మొత్తాన్ని రీ మోడల్ చేయటానికి దాదాపు రూ.302 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇంటింటికీ మంచినీరు సరఫరా చేసేందుకు మొత్తం 28 జోన్లుగా విభజించారు. కొత్తగా నగరంలో కలిసిన నగర శివారు గ్రామాలు, విలీన గ్రామాలన్నింటినీ కలుపుకొని ఈ నూతన విధానానికి రూపకల్పన చేశారు. ఈ మెగా మంచినీటి ప్రాజెక్టు కోసం 28 జోన్లలో కొత్తగా 12 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించ తలపెట్టారు. ఒంగోలు నగరం నలుదిశలా వీటిని ఏర్పాటు చేయాలి. ఒక్కో ట్యాంకు 500 కిలో లీటర్ల సామర్ధ్యం నుంచి 700 కిలో లీటర్ల సామర్ధ్యం వరకు ఉంటాయి. ఇప్పటి వరకు ఉన్న పాత ట్యాంకుల నాణ్యతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని వాటిని వాడాలా, వద్దా అన్న దానిపై కూడా లోతుగా అధ్యయనం చేశారు. భవిష్యత్తులో నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేయాల్సి వచ్చినా మంచినీటి పైప్‌లైన్ వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోనున్నారు. ప్రస్తుతం ఉన్న మంచినీటి పైప్‌లైన్ వ్యవస్థ మొత్తం రీ మోడల్ దిశగా ప్రణాళికలు రూపొందించారు. అమృత్ పథకానికి రూ.70 కోట్లు గ్రాంట్‌గా తెప్పించిన మంత్రి బాలినేని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ‘‘అమృత్’’ పథకాన్ని టీడీపీ పాలకులు మధ్యలోనే వదిలేశారు. నిధులు లేవని గుండ్లకమ్మ నుంచి ఏర్పాటు చేసిన పథకం పనులు నిలిచిపోయాయి. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ కమీషన్ల కక్కుర్తితో ఈ పథకం మధ్యలోనే నిలిచిపోయింది. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన బాలినేని అమృత్ పథకం పూర్తి చేయటానికి ప్రభుత్వం నుంచి రూ.70 కోట్లు గ్రాంట్‌గా తెప్పించారు. దీంతో ఆగిపోయిన పథకం పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ పథకంలో నాలుగు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించనున్నారు. సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు అడిగిన వెంటనే ఒంగోలు నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు సిద్ధం చేసిన మెగా మంచినీటి పథకాన్ని స్వయంగా సీఎం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించటం ఎంతో సంతోషంగా ఉంది. ఒంగోలు నగర ప్రజలు ఎంతో అదృష్టవంతులు. ఈ పథకంతో నగర రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయి. ఇప్పటి వరకు ప్రజలు మంచినీటి కోసం పడుతున్న కష్టాలు తీరనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు జీవితాంతం ఒంగోలు నగర ప్రజలతో పాటు రుణపడి ఉంటా. – బాలినేని శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర మంత్రి -
Ongole: సీఎం వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
సాక్షి, ప్రకాశం జిల్లా: తాడేపల్లి నుంచి ఒంగోలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద సీఎంకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. పోలీస్ ట్రైనింగ్ కాలేజీ (పీటీసీ)లో హెలికాప్టర్ దిగిన దగ్గర నుంచి పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వరకు దారి పొడవునా మహిళలు, పార్టీ శ్రేణులు సీఎం వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. సీఎం వచ్చే దారితోపాటు, ఒంగోలు నగరం మొత్తం భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఆసరా సభా వేదిక వద్దకు చేరుకున్న సీఎం.. అక్కడ పొదుపు మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. అనంతరం వేదిక వద్ద లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత తన ప్రసంగం అనంతరం వైఎస్సార్ ఆసరా రెండో విడత కింద లబ్ధిదారులకు డబ్బులు జమ చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ‘వైఎస్సార్ ఆసరా’ పథకం రెండవ విడత మొత్తాన్ని ప్రభుత్వం నేడు డ్వాక్రా గ్రూపు సభ్యులైన మహిళల ఖాతాల్లో నేరుగా జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట ఉన్న అప్పును నాలుగు విడతల్లో మహిళలకు అందజేసే ఈ పథకానికి సీఎం వైఎస్ జగన్ గత ఏడాది శ్రీకారం చుట్టి.. తొలి విడత సొమ్ము జమ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం నుంచి రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 7.97 లక్షల స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 78.76 లక్షల మంది మహిళలకు రూ.6,439.52 కోట్లు పంపిణీ ప్రారంభం కానుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక నుంచి దాదాపు 20 వేల మంది లబ్ధిదారుల సమక్షంలో సీఎం జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. గత ఏడాది తొలి విడతగా చెల్లించిన రూ.6,318.76 కోట్లు కూడా కలిపితే పొదుపు సంఘాల అప్పునకు సంబంధించి రూ.12,758.28 కోట్లు మహిళలకు అందజేసినట్టవుతుంది. చదవండి: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేయండి -
AP: ట్రిపుల్ ఐటీ ఫలితాలు విడుదల
సాక్షి, ఒంగోలు: రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష-2021 ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం ఫలితాలను విడుదల చేశారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో మంత్రి సురేష్ ఫలితాలను విడుదల చేశారు. సెప్టెంబర్ 26న పరీక్ష నిర్వహించగా.. రికార్డు సమయంలో 10 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో తొలి ఐదుస్థానాల్లో నిలిచినవారు.. 1. ఎం. గుణశేఖర్ (ధర్మవరం, అనంతపురం) 2. శ్రీచక్రధరణి (మైదుకూరు, వైఎస్సార్ జిల్లా) 3. ఎం. చంద్రిక (విజయనగరం జిల్లా) 4. వెంకటసాయి సుభాష్ (జమ్మలమడుగు, వైఎస్సార్ జిల్లా) 5. జి. మనోజ్ఞ (మండపేట, తూ.గో జిల్లా) (ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అక్టోబర్ 7న ఒంగోలుకు సీఎం జగన్
సాక్షి, ఒంగోలు: వైఎస్సార్ ఆసరా రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఈనెల 7వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంగోలు రానున్నారని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎం కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో ముందుగా పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలోని క్రీడా మైదానాన్ని మంత్రి బాలినేని, తలశిల రఘురాం, సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ వకుల్ జిందాల్, కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ మలికాగర్గ్ సోమవారం పరిశీలించారు. అనంతరం క్రీడా మైదానంలో సీఎం కార్యక్రమ ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో వారు చర్చించారు. క్రీడా మైదానంలో దక్షిణ భాగంలో ముఖ్యమంత్రి సభావేదిక ఉండాలన్నారు. 23 నెలల తరువాత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు వస్తుండడంతో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావించాలన్నారు. పీవీఆర్ గ్రౌండ్‌ను పరిశీలిస్తున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పక్కన సీఎం కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం, సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ వకుల్ జిందాల్, కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ మలికాగర్గ్ మహిళల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్, ఎస్పీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని విజయవంతం చేయాలన్నారు. ఉదయం 9 గంటలకు మహిళలు పీవీఆర్ ఉన్నత పాఠశాలలో ఉండేలా చూడాలన్నారు. కోవిడ్ నిబంధనలు అనుసరించి 20 వేల మంది కార్యక్రమానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో హెలిపాడ్ ఏర్పాట్లు, వేదిక వద్దకు సీఎం వచ్చే రూటుకు ఆర్అండ్బీ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలు మార్గానికి అడ్డు రాకుండా సీఎంకు అభివాదం చేసేందుకు వీలుగా బ్యారికేడ్ల ఏర్పాటుకు సంబంధించి పలు సూచనలు చేశారు. హెలిపాడ్ నుంచి సభా ప్రాంగణానికి వచ్చే ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం మాట్లాడుతూ వైఎస్సార్ ఆసరా రెండో విడతలో మహిళలకు నగదు పంపిణీ కార్యక్రమం ఒంగోలులో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సీఎం జిల్లాకు వచ్చి దాదాపు రెండేళ్లవుతున్నందున విజయవంతం చేసే బాధ్యత మహిళలపై ఉందన్నారు. కేవలం రెండు రోజుల సమయంలో సభా ఏర్పాట్ల విషయంపై కొందరు అనుమానం వ్యక్తం చేయగా ‘ఒంగోలులో వాసన్న ఉన్నాడు కదా చూసుకుంటాడు’ అని సీఎం జగన్మోహన్రెడ్డి అన్నట్లు తలశిల తెలిపారు. కోవిడ్ రెండు టీకాలు వేయించుకుంటేనే అనుమతి: కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ రెండు టీకాలు వేయించుకున్న వారినే కార్యక్రమానికి అనుమతిస్తామన్నారు. ప్రాంగణంలో స్టాల్స్ ఏర్పాటు చేయాలని, నగరంలో విద్యుత్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీలు నియమించాలని, కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రికి వివరించారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాలతోపాటు రైతు భరోసా కేంద్రాల్లోను సీఎం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సీఈవో ఎండీ ఇంతియాజ్, ఎస్పీ మలికాగర్గ్, జేసీలు జేవీ మురళి, కె.కృష్ణవేణి, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, డీఆర్వో ఎస్.సరళావందనం, లిడ్ క్యాప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, డీఆర్డీఏ పీడీ బాబూరావు, మెప్మా పీడీ టి.రవికుమార్, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. సీఎం పర్యటన ఇలా సీఎం పర్యటన షెడ్యూల్‌ను కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మీడియాకు విడుదల చేశారు. ఉదయం 9.55 గంటలకు తాడేపల్లిలోని ఆయన నివాసం వద్ద నుంచి హెలికాప్టర్లో బయల్దేరతారు. 10.35 గంటలకు ఒంగోలు పోలీసు ట్రైనింగ్ కాలేజీలో హెలికాప్టర్ దిగుతారు. 10.45 గంటలకు హెలిపాడ్ నుంచి బయల్దేరి 11 గంటలకు సభాస్థలి అయిన ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. పది నిముషాలపాటు స్టాల్స్‌ను పరిశీలిస్తారు. 11.15 గంటలకు జ్యోతి ప్రజ్వలన, డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. 11.25 గంటలకు మంత్రుల ప్రసంగాలు, 11.40 నుంచి 12 గంటల వరకు లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి కార్యక్రమం, అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగం ఉంటుంది. 12.30 గంటలకు వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభిస్తారు. 12.40 గంటలకు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్‌తో కార్యక్రమం ముగుస్తుంది. 12.45 గంటలకు సభాస్థలి వద్ద నుంచి కారులో హెలిపాడ్‌కు మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకుంటారు. 1.05 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి 1.50 గంటకు తాడేపల్లిలోని నివాసానికి సీఎం చేరుకుంటారు. -
ప్రకాశం జిల్లాలో కౌంటింగ్ కేంద్రాలవద్ద పటిష్ట భద్రత
-
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఒంగోలు లో గొడవ
-
ఒంగోలులో స్ట్రీట్ ఫైట్.. వీడియో వైరల్
సాక్షి, ప్రకాశం: ఒంగోలు శివారు మంగమూరు రోడ్డులో జరిగిన ఓ స్ట్రీట్ ఫైట్ వీడియో వైరల్‌గా మారింది. కారు కొనుగోలు విషయంలో కబాడీపాలెంకు చెందిన ఇరువర్గాల మధ్య వివాదం ఘర్షణకు దారితీసింది. ఓ యువకుడిని మరో వర్గానికి చెందిన యువకులు విచక్షణారహితంగా కొట్టారు. రాడ్లు, కర్రలతో కొట్టడంతో ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఘర్షణ సమయంలో అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్.. వద్దని వారిస్తున్నా ఆ యువకులు లెక్క చేయలేదు. సోషల్ మీడియాలో ఈ కొట్లాట దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇవీ చదవండి: గణేష్ ఉత్సవాల్లో విషాదం: చూస్తుండగానే యువకుడు మృతి కుసంస్కారం: టీడీపీ పిచ్చి పరాకాష్టకు.. -
చలానా మాఫియా..
జిల్లా రిజిస్ట్రేషన్ శాఖను నకిలీ చలానాల కుంభకోణం కుదిపేస్తోంది. ఈ నెల 3వ తేదీ ఒంగోలు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వెలుగుచూసిన నకిలీ చలానాల బాగోతాన్ని మరవకముందే కందుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మరో మోసం బయటపడింది. జిల్లావ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లతో పాటు అధికారులు, సిబ్బంది తీరుపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న నకిలీ చలానాల స్కాంతో మరిన్ని అవకతవకలు చోటుచేసుకుని ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒంగోలు సబర్బన్: స్టాంప్ డ్యూటీ కింద ప్రభుత్వానికి చెల్లించాల్సిన కేవలం 550 రూపాయలకు నకిలీ చలానా సృష్టించిన విషయం కందుకూరు సబ్ రిజి్రస్టార్ కార్యాలయంలో గురువారం వెలుగుచూసింది. అయితే, కందుకూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో చేయించాల్సిన రిజిస్ట్రేషన్‌కు ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ పేరిట సింగరాయకొండ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో డాక్యుమెంటేషన్ చేయించారు. గుడ్లూరు మండలం మొగళ్లూరుకు చెందిన సీహెచ్ హజరత్ తన స్థిరాస్తి రిజి్రస్టేషన్‌కు స్టాంప్ డ్యూటీ చెల్లించగా, అది నకిలీ చలానాగా తేలింది. సింగరాయకొండ సబ్ రిజి్రస్టార్ కార్యాలయంలో దాఖలు చేసి కందుకూరులో రిజిస్టర్ అయిన ఈ డాక్యుమెంట్ నంబర్ 2800/2021. మొక్కుబడిగా పరిశీలన... రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వెలుగు చూసిన నకిలీ ఈ–చలానాల వ్యవహారంపై జిల్లాలో పరిశీలన మొక్కుబడిగా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కందుకూరులో బయటపడిన సరికొత్త నకిలీ చలానా వ్యవహారమే అందుకు నిదర్శనంగా ఉంది. జిల్లావ్యాప్తంగా జరిగిన మోసాలు బయటపడకుండా ఉండేందుకు మొక్కుబడిగా తనిఖీలు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒంగోలు రిజి్రస్టార్ కార్యాలయంలో వెలుగు చూసిన నకిలీ చలానాల వ్యవహారం కూడా అందుకు ఉదాహరణగా నిలుస్తోంది. వాస్తవానికి గత నెలలోనే ఈ కుంభకోణాన్ని అధికారులు గుర్తించినప్పటికీ బయటకు పొక్కకుండా తొక్కిపెట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటపెట్టి తాము డబ్బు తిరిగి కట్టించామంటూ కవర్ చేశారు. ఈ విషయంలో రిజి్రస్టేషన్ శాఖ అధికారుల తీరు చూస్తే దొంగే.. దొంగ అని అరిచినట్టు తెలుస్తోంది. ఒంగోలు సబ్ రిజిస్ట్రార్లు అయిన జాయింట్–1, జాయింట్–2 పరిధిలో నకిలీ చలానాల ద్వారా స్థిరాస్తి రిజి్రస్టేషన్లు జరిగినట్లు తేలింది. మొత్తం 71 స్థిరాస్తి రిజిస్ట్రేషన్లకు సంబంధించిన 77 ఈ–చలానాలు సృష్టించారు. వాటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీగా కట్టాల్సిన రూ.26,74,850 మొత్తాన్ని చెల్లించకుండానే నకిలీ చలానాల ద్వారా మోసం చేశారు. సెంట్రలైజ్డ్ ఫండ్స్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎఫ్ఎంఎస్) ద్వారా ఆన్లైన్ చెల్లింపుల్లో మోసానికి పాల్పడ్డారు. ఒంగోలులో హైడ్రామా... ఒంగోలు కేంద్రంగా రిజిస్ట్రేషన్ శాఖలో నకిలీ చలానాల ద్వారా మోసానికి పాల్పడిన వ్యవహారంలో హైడ్రామా నెలకొంది. నకిలీ ఈ–చలానాలు ముందుగా ఒంగోలులో బయటపడినా రిజి్రస్టేషన్ శాఖ అధికారులు కప్పిపెట్టే ప్రయత్నం చేశారు. అది చివరకు రాష్ట్ర ఉన్నతాధికారులకు తెలియడంతో హైడ్రామాకు తెరతీశారు. వాస్తవానికి నకిలీ చలానాలు ఆగస్టు 16వ తేదీనే బయటపడ్డాయి. కానీ, అధికారులు ఆ విషయం బయటకు రాకుండా ప్రయత్నించి ప్రభుత్వాన్ని మోసం చేశారు. సూత్రధారి అయిన ఒంగోలుకు చెందిన డాక్యుమెంట్ రైటర్ కాజా పవన్‌కుమార్, రిజి్రస్టేషన్ అధికారులు కలిసి ప్రభుత్వ ఖజానాకు ఆ మొత్తాన్ని జమ చేయాలని చూశారు. ఆగస్టు 24వ తేదీ వరకు సమాలోచనలు, చర్చోపచర్చలు చేసుకున్నారు. చివరకు ఆగస్టు 24వ తేదీ డాక్యుమెంట్ రైటర్ కాజా పవన్‌కుమార్‌తో మొత్తం రూ.26,74,850 బ్యాంకు చలానా కట్టించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంలోనూ జాప్యం... ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన మోసాన్ని వెంటనే బయటపెట్టకపోవడంతో పాటు పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయలేదు. విషయం బయటకు పొక్కి పత్రికల్లో వార్తా కథనాలు వచ్చిన తర్వాత సెప్టెంబర్ 2న అర్ధరాత్రి ఒంగోలు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సెప్టెంబర్ 5వ తేదీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంలో కూడా ఎక్కడా దొరక్కుండా చూడాలన్నదే వారి ఉద్దేశంగా తెలుస్తోంది. నకిలీ చలానాలకు పాల్పడిన డాక్యుమెంట్ రైటర్ పవన్‌తో పాటు ఒంగోలు రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేస్తున్న పెద్ద తలల పాత్రపై కూడా ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కందుకూరు సంఘటనతో జిల్లావ్యాప్తంగా అప్రమత్తమయ్యారు. -
ఎవరికీ భారం కాకూడదని.. వృద్ధ దంపతుల ఆత్మహత్య
సాక్షి,ప్రకాశం: ఒక వైపు తీర్చలేని అప్పులు, మరో వైపు అనారోగ్యంతోపాటు, మలి వయసులో తాము ఎవరికీ భారం కాకూడని భావించిన ఓ వృద్ధ జంట తనువు చాలించాలని నిర్ణయించుకుంది. తాము బతికుండటం భారమని తలచి పురుగు మందు తాగి బలన్మరణం చెందారు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి బల్లికురవ మండలంలోని చిన్న అంబడిపూడి గ్రామంలో జరగ్గా, మంగళవారం వెలుగు చూసింది. బంధువులు పోలీసులు స్థానికులు అందించిన వివరాలు మేరకు.. చిన్న అంబడిపూడి గ్రామానికి చెందిన గంగవరపు శేషయ్య (65), నాగేశ్వరమ్మ (61) దంపతులు. వీరికి కుమారుడు ఆనందరావు, కుమార్తె సుజాత ఉన్నారు. ఇద్దరికీ వివాహాలయ్యాయి. వీరికి 12 ఎకరాల సాగు భూమి ఉంది. అందులో రెండెకరాల భూమిని కుమార్తెకు ఇచ్చారు. ఒకే ఇంట్లో ముందు వైపు కుమారుడు, వెనుక వైపు వృద్ధ దంపతులు నివాసముంటున్నారు. ఎవరికి వారే తమ భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. శేషయ్య సొంతంగా తన భూమిని సాగు చేస్తూ మెట్ట పంటలైన కంది, పత్తి, కూరగాయలు, వరి పండించుకుంటున్నాడు. ఈ క్రమంలో శేషయ్యకు నాలుగేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది, భార్య ఇటీవల కిడ్నీ వ్యాధి బారిన పడింది. సాగు కోసం తెచ్చిన అప్పులు వడ్డీలతో కలిపి రూ.15 లక్షలయ్యాయి. తాను పక్షవాతంతో పొలం పనులు చేయించలేక, మరో వైపు భార్య కిడ్నీ వ్యాధితో బాధపడుతుండటం భరించలేక శేషయ్య, భార్యా తాను భర్తకు భారంగా మారానని భావించి..ఇక ఇద్దరం బతికుండి చేసేదేముందనే భావనకు వచ్చారు. అప్పుడప్పుడూ ఈ మాటలను ఇరుగు పొరుగువారితో అంటుండేవారని తెలిసింది. ఎప్పటిలాగే సోమవారం భోజనం చేసి పడుకున్నారు. అందరూ నిద్రించారని నిర్థారించుకున్న తరువాత ఇంట్లో ఉన్న పురుగు మందును తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. చీకటితో నిద్ర లేచే తమ తల్లిదండ్రులు ఎంత పొద్దెక్కినా లేవకపోవటంతో కుమారుడు వచ్చి చూశాడు. ఇద్దరూ మంచంపై విగతజీవులై పడి ఉండటాన్ని గమనించి భోరున విలపించాడు. ఈ ఘటనలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలాన్ని సీఐ ఎం.రాజేశ్, ఎస్‌హెచ్‌వో సైదయ్య పరిశీలించారు. శేషయ్య కుమారుడు ఆనందరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదుతో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
బైకుల దొంగ.. 18 మోటార్ సైకిళ్లు స్వాధీనం
ముండ్లమూరు: వివిధ ప్రాంతాల్లో మోటారు సైకిళ్లను అపహరించుకెళ్తున్న నర్రా సుబ్బారెడ్డిని అరెస్టు చేసినట్లు దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్లో శనివారం నిందితుడి వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. ద్విచక్ర వాహనాల దొంగతనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉల్లగల్లు ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద ఈ నెల 16వ తేదీ రాత్రి బైకు అపహరణకు గురికాగా అదే గ్రామానికి చెందిన బొట్ల నాగేశ్వరరావు స్థానిక పోలీసుస్టేషన్లో 17వ తేదీన ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దర్శి సీఐ భీమానాయక్, ముండ్లమూరు ఎస్ఐ గంగుల వెంకటసైదులు నేతృత్వంలో కానిస్టేబుళ్లు విజయ్‌కుమార్, బి.ప్రేమానిధి, డి.అశోక్‌కుమార్, ఎస్కే ఖాశిం, కావిరాజు, టి. శ్రీనులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పెట్రోల్ బంక్ వద్ద సేకరించిన ఆధారాల మేరకు మోటార్ సైకిళ్ల దొంగ కోసం వేట ప్రారంభించారు. చదవండి: ఉద్యోగాల పేరిట టోకరా.. రూ.10 కోట్ల వసూలు! శనివారం దర్శి నుంచి అద్దంకి వెళ్తున్న దర్శి మండలం పాపిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన వర్రా సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారు. అతడి నుంచి 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.7.20 లక్షలు. నిందితుడు జిల్లాలోని చీరాల, చినగంజాం, అద్దంకి, చీమకుర్తి, దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు మండలాలతో పాటు గుంటూరు జిల్లా వినుకొండ, నూజెండ్ల మండలాల పరిధిలో పలు మోటార్ సైకిళ్లను అపహరించాడు. స్వాధీనం చేసుకున్న 18 ద్విచక్ర వాహనాల్లో 11 వాహనాలకు సంబంధించి వివిధ పోలీసుస్టేషన్‌ల్లో కేసులు నమోదై ఉన్నాయి. ఏడు బైకులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎంవీఐకి సమాచారం అందించారు. నిందితుడిని అరెస్టు చేసిన ప్రత్యేక టీమ్‌ను డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి అభినందించారు. వారికి రివార్డు కోసం ఉన్నతాధికారులకు సిఫారసు చేయనున్నట్లు తెలిపారు. డీఎస్పీతో పాటు దర్శి సీఐ భీమానాయక్, ఎస్ఐ గంగుల వెంకటసైదులు, హెడ్‌కానిస్టేబుల్ సూర్యనారాయణ, సిబ్బంది అంజిబాబు, విజయ్‌కుమార్ ఉన్నారు. చదవండి: రాహుల్ హత్య కేసులో కీలక పరిణామం, A1 లొంగుబాటు -
భూమి ఆన్‌లైన్‌కి లంచం అడుగుతున్నారు
ఒంగోలు: ‘నాకు 70 సెంట్ల భూమి ఉంది. దానిని ఆన్లైన్ చేయమని అధికారులను కోరితే తిప్పుకుంటూ ఉన్నారు. చివరకు రూ.10 వేలు లంచం ఇస్తేనే చేస్తామని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది అంటున్నారని’ ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి అనే రైతు నేరుగా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశాడు. స్పందించిన కలెక్టర్ ఈ విషయమై విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సోమవారం ఉదయం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని ఒంగోలులోని స్పందన సమావేశపు హాలు నుంచి ప్రవీణ్‌కుమార్ నిర్వహించారు. పొదిలికి చెందిన బీ శ్రీదేవి మాట్లాడుతూ సర్వే నం 1052లో తన భూమిని ఆన్లైన్ చేసినా పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. మూడు సార్లు తహసీల్దార్‌ను కలిసి విన్నవించుకున్నా పట్టించుకోలేదని తెలిపింది. స్పందించిన కలెక్టర్ ఈ విషయమై విచారించి వెంటనే పాస్ పుస్తకం వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. టంగుటూరుకు చెందిన పాదర్తి సుబ్బరాయుడు అనే రైతు తన భూమి ఆక్రమణకు గురైందని, సర్వే చేయించి హద్దులు వేయమని తహసీల్దార్, సర్వేయర్‌ను అడిగితే కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే సర్వేయర్‌ను పంపించి సర్వే చేయిస్తానని హామీ ఇచ్చారు. కనిగిరి మండలం మాచవరానికి చెందిన కే ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ గ్రామ కంఠంలో వార్డు సచివాలయానికి మూడు సెంట్ల భూమి కేటాయిస్తే, చంద్రహాస్ అనే వ్యక్తి అందులోకి రానీయకుండా అడ్డుకుంటున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై మునిసిపల్ కమిషనర్, తహసీల్దార్, వీఆర్ఓకు అర్జీ ఇచ్చామన్నారు. స్పందించిన కలెక్టర్ వెంటనే ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. డయల్ యువర్లో వచ్చిన వాటిని వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ డయల్ యువర్ కార్యక్రమం ముగిసిన అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సమావేశం నిర్వహించారు. డయల్ యువర్ కలెక్టర్ ద్వారా నేరుగా తనకు ఫోన్లు చేసిన ప్రజలు చెప్పిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. జవాబుదారితనంతో సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు జే వెంకటమురళి, టీఎస్ చేతన్, కేఎస్ విశ్వనాథన్, కే కృష్ణవేణి, ఇన్చార్జి డీఆర్ఓ సరళా వందనం పాల్గొన్నారు. -
అతడి కోసం హిజ్రాగా మారిన యువకుడు!
సాక్షి, గిద్దలూరు(ఒంగోలు): ఆర్మీ జవాన్ వివాహాన్ని హిజ్రాలు అడ్డుకున్న సంఘటన గిద్దలూరు పట్టణంలో చోటుచేసుకుంది. శుక్రవారం జరిగిన ఈ సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాచర్ల మండలం పాలకవీడు గ్రామానికి చెందిన మగ్బూల్, అర్థవీడు మండలంలోని పాపినేనిపల్లెకు చెందిన వినీత్ క్లాస్మేట్స్ కాకుండా మంచి స్నేహితులు కూడా. అలా వీరిద్దరూ కలిసి ఆర్మీ సెలక్షన్స్‌కు వెళ్లేవారు. ఇద్దరూ నిత్యం మాట్లాడుకువారు. వారిలో మగ్బూల్ ఆర్మీకి ఎంపికవగా, వినీత్ ఎంపిక కాలేదు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం వినీత్ హిజ్రాగా మారి వినీతగా పేరు మార్చుకున్నాడు. అయినప్పటికీ మగ్బూల్‌తో స్నేహం కొనసాగిస్తూ వచ్చాడు. వారిద్దరి స్నేహాన్ని సహజీవనంగా కూడా మార్చుకున్నారు. మగ్బూల్ ఆర్మీలో ఉన్నప్పటికీ వినీతతో తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు. సెలవుపై వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి సరదాగా తిరిగేవారు. ఇటీవల సెలవుపై వచ్చిన మగ్బూల్.. గిద్దలూరు పట్టణానికి చెందిన మహిళను వివాహం చేసుకునేందుకు నిశ్చయించుకున్నాడు. శుక్రవారం ఓ కల్యాణ మండపంలో వివాహం చేసుకుంటుండగా, సమాచారం తెలుసుకున్న హిజ్రా వినీత.. పలువురు హిజ్రాలతో కలిసి అక్కడకు చేరుకుని మగ్బూల్ వివాహాన్ని అడ్డుకుంది. తననే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. మగ్బూల్ నిరాకరించడంతో ఆత్మహత్యకు పాల్పడగా, కర్నూలు జిల్లాలోని నంద్యాల వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నట్లు సమాచారం. మగ్బూల్ కోసమే వినీత్ హిజ్రాగా మారినట్లు తెలుస్తోంది. -
సైకిల్‌కు రూ.300: పరువు పోగొట్టుకున్న టీడీపీ నేతలు..
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ టీడీపీ చేపట్టిన సైకిల్ ర్యాలీకి ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు ఝులక్ ఇచ్చారు. ఒంగోలు నగరంలోని టీడీపీ కార్యాలయానికి సోమవారం ఉదయం ప్రధాన నాయకులు వచ్చారు. ఎంత సేపటికీ మిగతా నేతలు, కార్యకర్తలు రాకపోయేసరికి కంగుతిన్నారు. ఎక్కడ పరువు పోతుందోనని డబ్బులిచ్చి చిన్నపిల్లలను ర్యాలీకి తీసుకొచ్చి అభాసుపాలయ్యారు. ర్యాలీలో చిన్నపిల్లలు పాల్గొనకుండా పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నేతలు కనీసం ఉనికి సైతం చాటుకోలేక పరువుపోగొట్టుకుని బిక్కమొహాలతో వెనుదిరిగారు. జిల్లాలో టీడీపీ నిరసన ర్యాలీ ‘నీరసంగా’ సాగింది. ఆ పార్టీ దయనీయ పరిస్థితికి ఈ ఘటన అద్దం పడుతోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: డీజిల్, పెట్రోలు ధరల పెంపునకు నిరసనగా సైకిల్ ర్యాలీ నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలిచ్చారు. దీంతో ఆ పార్టీ జిల్లా నాయకులు సోమవారం జరిగే సైకిల్ ర్యాలీలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తీరా సోమవారం నిర్వహించాల్సిన సైకిల్ ర్యాలీకి నాయకులు, కార్యకర్తలు కరువయ్యారు. పాల్గొనేందుకు ప్రజలు కూడా విముఖత చూపారు. అసలు సైకిల్ ర్యాలీకి సైకిళ్లే కరువయ్యాయి. ఈ కార్యక్రమానికి వచ్చిన పది నుంచి పదిహేను మంది కూడా కార్లు, బైకుల్లో అక్కడకు చేరుకున్నారు. మరి సైకిళ్లు ఎవరు తేవాలి..? చదువుకునే పిల్లల్ని వాళ్లకున్న సైకిళ్లతో సహా టీడీపీ జిల్లా కార్యాలయానికి రప్పించారు. సైకిళ్లకు పార్టీ జెండాలు కట్టారు. పిల్లల మెడలో వేసుకోవడానికి కూడా పార్టీ జెండాలు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రాగానే పాత గుంటూరు రోడ్డులోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి కొద్ది మంది నాయకులు, చిన్నారులతో ర్యాలీగా బయలుదేరారు. అంతే, ఒంగోలు డీఎస్పీ ప్రసాదు తన సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదు, దానికితోడు చదువుకునే పిల్లలతో సైకిల్ ర్యాలీ ఏమిటని టీడీపీ నేతలను నిలదీశారు. అనంతరం పిల్లలందరినీ అక్కడి నుంచి పంపించి వేశారు. పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరిన ర్యాలీలో జనార్దన్‌కు మాత్రమే ఒక్క సైకిల్ మిగిలింది. అక్కడ నుంచి ర్యాలీగా నడుచుకుంటూ బయలుదేరేందుకు టీడీపీ నాయకులు పూనుకున్నారు. కానీ, పోలీసులు అడ్డుకుని తిరిగి పార్టీ కార్యాలయంలోకే పంపించి వేశారు. ఆ సమయంలో పోలీసులకు, పార్టీ నాయకులకు మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. అసలు విషయం ఏమిటంటే ర్యాలీకి వచ్చిన పిల్లాడితో పాటు సైకిల్‌కు రూ.300 ఇస్తామని చెప్పిమరీ తీసుకొచ్చినట్లు గుసగుసలు వినిపించాయి. నేతలకు, కేడర్‌కు మధ్య అగాధం... జిల్లాలో తెలుగుదేశం పార్టీ రానురానూ ఉనికి కోల్పోతోంది. నాయకులే కాదు కార్యకర్తలు సైతం పార్టీకి దూరమవుతూ వస్తున్నారు. నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అధినేత చంద్రబాబు చెప్పడం.. ఆ కార్యక్రమాలకు పార్టీ జిల్లా నాయకులు కేడర్‌కు పిలుపునివ్వడం సర్వసాధారణమైంది. అయితే, ఇక్కడే పార్టీ పెద్దలకు, కేడర్‌కు మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది. ఏ నిరసన కార్యక్రమానికి పిలుపినిచ్చినా ఆ పది, పదిహేను మంది మాత్రమే హాజరవుతున్నారే తప్ప పార్టీ కేడర్‌లో కదలిక లేకుండా పోయింది. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం పదవులు అనుభవించిన నాయకులంతా కరోనా కష్టకాలంలో సైతం కనిపించకుండాపోయి ఇప్పుడు నిరసన కార్యక్రమాలంటూ రావడాన్ని పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజల మాట అటుంచితే కరోనా సమయంలో పార్టీ కార్యకర్తల బాగోగులు సైతం పట్టించుకోకుండా తప్పించుకు తిరిగారంటూ ఆ పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు పిలిచినప్పుడు వారి సంగతి తేలుద్దామని వేచిచూస్తున్న టీడీపీ కార్యకర్తలకు ఆ సమయం రానే వచ్చింది. నిరసన కార్యక్రమానికి తరలిరావాలంటూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ పిలుపునిచ్చినా కనీస స్పందన కూడా లేని దుస్థితి నెలకొంది. కార్యకర్తలు ఝలక్ ఇచ్చారని తెలుసుకున్న టీడీపీ నేతలు కంగుతిని పరువు నిలుపుకునేందుకు స్కూలు పిల్లలను పిలిపించుకుని ఛీ అనిపించుకున్నారు. ఈ ఘటనతో జిల్లాలో ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిన విషయం స్పష్టమవుతోంది. -
రైతులుకు సోలార్ పవర్..
సాక్షి,ఒంగోలు అర్బన్: వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి రైతుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారు. ఇప్పటికే రైతు భరోసా, రైతు భరోసా కేంద్రాలు, ల్యాబ్‌లు, పాడి రైతుల అభివృద్ధి కోసం అమూల్ సంస్థతో కలిసి పనిచేయడంతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి రైతుల వ్యవసాయానికి అవసరమైన నాణ్యమైన విద్యుత్‌ను 9 గంటల పాటు నిరంతరాయంగా అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తొలుత 10 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించినా కొన్ని సాంకేతిక కారణాలతో తొలి విడతలో 6400 మెగావాట్ల ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా జిల్లాకు 1200 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని కేటాయించారు. దొనకొండ మండలం రుద్ర సముద్రం ఆల్ట్రా మెగా సోలార్ పార్కు నుంచి 600 మెగావాట్లు, సీఎస్‌పురం సోలార్ పార్కు నుంచి మరో 600 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. ఆ మేరకు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ జేవీ మురళి భూ సేకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిరంతరం సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పనులు వేగవంతం చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ జీఈసీఎల్) ద్వారా సోలార్ పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ జీఈసీఎల్ ద్వారా డీఈని నియమించారు. మొదటి దశకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ అడిగిన మొత్తం 5930.88 ఎకరాల్లో ప్రభుత్వ భూమి 1558.67 ఎకరాలు, అసైన్డ్ భూమి 2137 ఎకరాలు, పట్టా భూమి సుమారు 300 ఎకరాలను జిల్లా యంత్రాంగం గుర్తించింది. అందులో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, పట్టా భూములు కలిపి మొత్తం సుమారు 4 వేల ఎకరాలు గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్‌కు కేటాయించారు. ఎక్కడెక్కడ..ఎంతెంత భూమి.. సీఎస్‌పురం ఆల్ట్రా మెగా సోలార్ పార్కు కోసం 3,363 ఎకరాలు అవసరం కాగా 289 ఎకరాల ప్రభుత్వ భూమి, 1366 ఎకరాల అసైన్డ్ భూమి, 194 ఎకరాల పట్టా భూములను సమకూర్చారు. సీఎస్‌పురం మండలంలోని పెదగోగులపల్లి, దొనకొండ మండలంలోని రుద్రసముద్రం, మంగినపూడి, భూమనపల్లి గ్రామాల్లో భూములు కేటాయించేలా అధికారులు చర్యలు చేపట్టారు. దొనకొండ మండలంలో ఏర్పాటు చేయనున్న ఆల్ట్రా మెగా సోలార్ పార్కుకు సంబంధించి అవసరమైన మొత్తం 2567.88 ఎకరాల్లో ఇప్పటికే 1269.67 ఎకరాల ప్రభుత్వ భూమి, 547 ఎకరాల అసైన్డ్ భూములు అందజేశారు. సోలార్ పార్కు కోసం పట్టా భూములు ఇచ్చిన రైతులకు ఏడాదికి రూ.25 వేల చొప్పున లీజు కూడా చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. లీజుకు చెల్లించే మొత్తానికి రెండేళ్లకు ఒకసారి 5 శాతం చొప్పున పెంచుతూ లీజు చెల్లిస్తారు.