సాక్షి, ఒంగోలు: ఏపీ ప్రజల్లారా.. గత ప్రభుత్వానికి, ప్రస్తుత పాలనకు తేడాలు గమనిస్తున్నారా?. చంద్రబాబు హయంలో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోపోగా.. అదనంగా దొంగలముఠా అవినీతితో అడ్డగోలుగా దోపిడీకి గురైంది. ఆ గాయాలకు మందు రాస్తూనే.. సంక్షేమం ప్రజలకు చేరవేసే ఉద్దేశంతో ఎంతటి భారానైన్నా భరిస్తూ ముందుకు సాగుతోంది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం . ఈ క్రమంలో ఒంగోలుకు చెందిన 17 ఏళ్ల కుర్రాడొకడు సీఎం జగన్‌పాలనపై అద్భుతమైన ప్రజంటేషన్ ఇచ్చాడు.
అభివృద్ధి.. సంక్షేమం విషయంలో గత ప్రభుత్వానికి.. ఇప్పటి ప్రభుత్వానికి ఎలాంటి తేడాలు ఉన్నాయనేది లెక్కలతో సహా తేల్చి చూపించాడు ఒంగోలుకు చెందిన త్రిపర్ణో. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది.. ఏపీని అన్నింటా ఎలా వెనక్కి తీసుకెళ్లింది.. ఈ నాలుగేళ్ల ఇప్పుడున్న ప్రభుత్వం ఏమేం చేసింది.. ఇంతకు ముందున్న ప్రభుత్వం-ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎలాంటి తేడాలు ఉన్నాయనేది కళ్లకు కట్టినట్లు చూపించాడు.
అభివృద్ధి అంటే కేవలం ధనికులు ఎదగడం మాత్రమే కాదని.. సగటు మనిషిని అభివృద్ధిలోకి తేవడమనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్న సీఎం జగన్ తనకు ఆదర్శనీయమంటున్నాడు త్రిపర్ణో. అందుకే క్షేత్ర స్థాయిలో బాగా రీసెర్చి చేసి.. వాస్తవాలను కళ్లకు కట్టేలా ఈ ప్రజంటేషన్‌ను రూపొందించాడట.
Comments
Please login to add a commentAdd a comment