సాక్షి,ప్రకాశంజిల్లా: ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజల్లో మంచి పెరు తెచ్చుకోవాలని, కొవ్వెక్కి మాట్లాడొద్దని హితవు పలికారు.
‘ఎమ్మెల్యే ఉసిగొల్పితే..గుప్తా అనే వ్యక్తి చొక్కా విప్పి కొట్లాటకి దూకుతున్నాడు. ఎమ్మెల్యే నా కొవ్వు దించుతా అని మాట్లాడుతున్నాడు. ఆయన తన నోరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. నాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు.
చేతనైతే నిరూపించు. నేను తెగించి ఉన్నా.. దేనికైనా సిద్ధమే. ఒంగోలులో అసలు ప్రజాస్వామ్యం ఉందా. కొంతమంది చొక్కాలు విప్పి విర్రవీగుతున్నారు. నన్ను కావాలని ఇరిటేట్ చేస్తున్నారు.
విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. ఎమ్మెల్యే అవాకులు చెవాకులు పేలుతున్నాడు. నాకు 1973లోనే కారు ఉంది. ఎమ్మెల్యే జనార్దన్ అధికార మదంతో ఉన్నాడు’అని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment