
సాక్షి, ప్రకాశం: చంద్రబాబు జీవితమంతా కుట్రల మయమని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పట్టాభి బూతులు మాట్లాడారని అన్నారు. చంద్రబాబు దీక్ష అంటేనే ఒక దొంగ దీక్ష... అని మంత్రి బాలినేని విమర్శించారు.
ఏపీలో కుట్రలో కుతంత్రాలు చేస్తామంటే ఊరుకోబోమని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పట్టాభి అసభ్య పదజాలాన్ని చంద్రబాబు వెనకేసుకోస్తారా? అని ప్రశ్నించారు. గతంలో.. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి టీడీపీ నేతలు రథాలు తగలబెట్టించారని బాలినేని ఎద్దేవా చేశారు.
చదవండి: TDP Leader Pattabhi Arrested: టీడీపీ నేత పట్టాభి అరెస్ట్