
సాక్షి,సత్యసాయిజిల్లా: చంద్రబాబు చేతిలో పవన్ కళ్యాణ్ కీలుబొమ్మగా మారారని, ఆయనకు పవన్ కళ్యాణ్‌కు సొంత సిద్ధాంతం, సొంత భావజాలం లేదని వైఎస్సార్సీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. శనివారం(ఫిబ్రవరి1) కేతిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘వైఎస్ జగన్‌తో ఉన్నంతవరకే విజయసాయిరెడ్డికి విలువ.నాకు వైఎస్ జగన్ సిద్ధాంతాలు నచ్చే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. వైఎస్సార్,వైఎస్ జగన్ విప్లవాత్మక పరిపాలన అందించారు. ఆరోగ్యశ్రీ,ఫీజు రీయింబర్స్‌మెంట్, సచివాలయాలు ఇందుకు ఉదాహరణలు.
చంద్రబాబు,పవన్ కల్యాణ్‌లకు విజన్ ఎక్కడుంది? చరిత్రలో నిలిచిపోయేలా చంద్రబాబు ఒక్క పథకమైనా ప్రవేశపెట్టారా? బాలకృష్ణ గుడివాడ నుంచి పోటీ చేస్తే వరుసగా గెలవగలరా?
రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగవ్వాలి.పదోతరగతి దాకా ప్రైవేటు స్కూళ్లు ఉండొద్దు.అప్పుడే అందరు ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే చదువుతారు. అమరావతిని మాత్రమే అభివృద్ధి చేయాలనుకోవడం దుర్మార్గం’అని కేతిరెడ్డి మండిపడ్డారు.
