kethireddy venkat ramireddy
-
నారా లోకేష్‌కు కేతిరెడ్డి ఓపెన్ ఛాలెంజ్..
సాక్షి, విజయవాడ: నారా లోకేష్‌కు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. 24 గంటల్లో తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు. అలా చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఒకవేళ ఆరోపణలు నిరూపించలేకపోతే లోకేష్ పాదయాత్ర వదిలేసి వెళ్లిపోతాడా..? అని ప్రతి సవాల్ విసిరారు. 'చంద్రబాబు, లోకేష్లలా నాది అక్రమ నివాసం కాదు. రైతుల వద్ద నుంచి భూమి కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నా. చంద్రబాబులా నేను ఎవర్నీ బెదిరించలేదు. నా నివాసానికి అన్ని రకాల అనుమతులు చూపిస్తా. చంద్రబాబుది అక్రమ నివాసం కాదా? చంద్రబాబు, లోకేష్‌ల నివాసం డాక్యుమెంట్లు చూపిస్తారా..? ఇసుక లారీలు బెంగళూరు వెళ్లాయని నిరూపించండి..? లోకేష్‌కి దమ్ముంటే నా ఇంటికొస్తే.. అన్ని ఆధారాలు చూపిస్తా. చంద్రబాబు, లోకేష్‌వి ఆడవాళ్ళ ను అడ్డం పెట్టి రాజకీయాలు చేసే బతుకులు. పులకేసి లోకేష్‌కి అందర్నీ తిట్టి తిట్టించుకోవడం అలవాటైంది. మా టార్గెట్ 175ని ఖచ్చితంగా సాధిస్తాం. మా నాయకుడు తప్పు చేసిన నలుగురు ఎమ్మెల్యేలు ను సస్పెండ్ చేశారు. చంద్రబాబుకి ఆయన పార్టీ వీడిన ఎమ్మెల్యే, ఎంపీలను సస్పెండ్ చేసే దమ్ముందా? అని కేతిరెడ్డి ఫైర్ అయ్యారు. చదవండి: ఆ రూమర్లను కొట్టిపారేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ -
రైతులను విస్మరించిన ముఖ్యమంత్రి
– వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి బత్తలపల్లి : వర్షాభావంతో తీవ్రంగా నష్టపోయిన వేరుశనగ రైతులను ముఖ్యమంత్రి విస్మరించారని వైఎస్సార్సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శించారు. వారికి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని గంటాపురంలో ఎండిపోయి, దిగుబడిలేని వేరుశనగ పంటలను ఆయన పరిశీలించారు. బాధిత రైతు నారాయణస్వామితో మాట్లాడారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబునాయుడు జిల్లాలో పర్యటించినప్పుడు వేరుశనగ పంటలు ఎండకుండా రెయిన్ గన్లు తానే కనిపెట్టినట్లు షో చేశారని,రెయిన్ గన్లు అన్నీ ఫెయిల్ అయ్యాయని, ఆయన ఏమీ కనిపెట్టలేదని, కరువును మాత్రం కనిపెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతి ఎకరాకు రూ.20 వేలు ఇన్పుట్ సబ్సిడీ, బీమా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రూ.170 కోట్లు ఖర్చు పెట్టి రైయిన్‌గన్‌లను తీసుకువచ్చి టీడీపీ కార్యకర్తలు, నాయకుల ఇంటిలో భద్రపరుచుకున్నారన్నారు. వేరుశనగకు ఫసల్ బీమా వర్తింపజేయకుంటే రైతుల పక్షాన వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, అప్రాచ్చెరువు ఈశ్వర్‌రెడ్డి, బత్తలపల్లి, ధర్మవరం మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.