
సాక్షి, విజయవాడ: నారా లోకేష్‌కు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. 24 గంటల్లో తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు. అలా చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఒకవేళ ఆరోపణలు నిరూపించలేకపోతే లోకేష్ పాదయాత్ర వదిలేసి వెళ్లిపోతాడా..? అని ప్రతి సవాల్ విసిరారు.
'చంద్రబాబు, లోకేష్‌లలా నాది అక్రమ నివాసం కాదు. రైతుల వద్ద నుంచి భూమి కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నా. చంద్రబాబులా నేను ఎవర్నీ బెదిరించలేదు. నా నివాసానికి అన్ని రకాల అనుమతులు చూపిస్తా. చంద్రబాబుది అక్రమ నివాసం కాదా? చంద్రబాబు, లోకేష్‌ల నివాసం డాక్యుమెంట్లు చూపిస్తారా..? ఇసుక లారీలు బెంగళూరు వెళ్లాయని నిరూపించండి..?
లోకేష్‌కి దమ్ముంటే నా ఇంటికొస్తే.. అన్ని ఆధారాలు చూపిస్తా. చంద్రబాబు, లోకేష్‌వి ఆడవాళ్ళ ను అడ్డం పెట్టి రాజకీయాలు చేసే బతుకులు. పులకేసి లోకేష్‌కి అందర్నీ తిట్టి తిట్టించుకోవడం అలవాటైంది. మా టార్గెట్ 175ని ఖచ్చితంగా సాధిస్తాం. మా నాయకుడు తప్పు చేసిన నలుగురు ఎమ్మెల్యేలు ను సస్పెండ్ చేశారు. చంద్రబాబుకి ఆయన పార్టీ వీడిన ఎమ్మెల్యే, ఎంపీలను సస్పెండ్ చేసే దమ్ముందా? అని కేతిరెడ్డి ఫైర్ అయ్యారు.
చదవండి: ఆ రూమర్లను కొట్టిపారేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment