Open Challenge
-
సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్
-
గ్లాస్ గుర్తు నాది.. జనసేనతో బహిరంగ చర్చకు సిద్ధం
-
YSRCP పోరుబాట.. బాబుకు దేవినేని ఓపెన్ ఛాలెంజ్..
-
నిరూపిస్తే స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేస్తా
-
లడ్డూ చూట్టూ రాజకీయం.. నా సవాల్ కు సిద్ధమా
-
ఏ విచారణకైనా మేం సిద్ధం.. బాబూ ఇదే నా ఛాలెంజ్
-
బస్తీమే సవాల్
-
నేనొక్కొన్నే వస్తా.. మార్గాని భరత్ ఓపెన్ ఛాలెంజ్
-
నీకు నిజంగా దమ్ముంటే.. సోమిరెడ్డికి కాకాని సవాల్
-
టీడీపీ నేతలకు సీదిరి అప్పలరాజు ఓపెన్ ఛాలెంజ్
-
బస్తీ మే సవాల్.. శశి థరూర్ వర్సెస్ కేంద్ర మంత్రి
తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న వేళ కేరళలోని తిరువనంతపురం పార్లమెంట్ స్థానంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికల ముందు డిబేట్ విషయంలో అక్కడ పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు బహిరంగ సవాల్‌ను విసురుకున్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ తనతో చర్చకు రావాలని కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ శశి థరూర్‌కు ఛాలెంజ్ చేశారు. దీంతో ఆయన సవాల్‌ను స్వీకరించారు శశి థరూర్. ‘తిరువనంతపురం అభివృద్ధి, పలు ఆలోచనల గురించి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌తో చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. ఆయనకు ఈ నియోజకవర్గంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇదే విషయాన్ని నేను మొదటి నుంచి చెబుతున్నా. రాజకీయాలపై చర్చిద్దాం’అని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందిస్తూ.. ‘ రాజీవ్ చంద్రశేఖర్ డిబేట్ సవాల్‌ను నేను స్వాగతిస్తున్నా. అయితే ఇప్పటివరకు చర్చకు రాకుండా ఎవరు తప్పించుకు తిరుగుతున్నారో తిరువనంతపురం సెగ్మెంట్ ప్రజలకు తెలుసు. తిరువనంతపురం రాజకీయాలు, అభివృద్ధిపై చర్చిద్దాం’అని తెలిపారు. ‘ధరల పెరుగుదల, నిరుద్యోగం, అవినీతి, మతతత్వం,పదేళ్ల బీజేపీ పాలనలో రాజకీయాల్లో పెంచిన ద్వేషం. అదే విధంగా గత 15 ఏళ్లుగా కళ్లముందు కనిపిస్తున్న తిరువనంతపురం అభివృద్ధిపై చర్చిద్దాం’ అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. కేరళలో కీలకస్థానమైన తిరువనంతపురంలో యూడీఎఫ్ కూటమి అభ్యర్థిగా శశి థరూర్ పోటీ చేస్తున్నవిషయం తెలిసిందే. అయితే ఆయన ఓటర్లుకు డబ్బులు పంచుతున్నారని బీజేపీ ఆరోపణలు చేసింది. వాటిని శశి థరూర్ టీం తీవ్రంగా ఖండించింది. ఆయన అటువంటి పనులు ఎప్పుడు చేయలేదని స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి అయిన రాజీవ్ చంద్రశేఖర్‌పై యూడీఎఫ్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆయన తన నామినేషన్ పత్రాల్లో నకిలీ అఫిడవిడ్ దాఖల చేశారని ఆరోపణులు చేశారు. ఇక్కడ వీరితో పాటు సీపీఐ పార్టీ తరఫున దిగ్గజ నేత పన్నియం రవీంద్రన్ పోటీ చేస్తున్నారు. కేరళలో మొత్తం 20 స్థానాల్లో ఒకే దశలో ఏప్రిల్ 26 పోలింగ్ జరగ్గా.. జూన్ 4 ఫలితాలు విడుదల కానున్నాయి. -
పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు గ్రంధి శ్రీనివాస్ ఓపెన్ ఛాలెంజ్
-
చంద్రబాబుకు ఇదే నా ఓపెన్ ఛాలెంజ్
సాక్షి, ఏలూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ సీఎం చేయని రీతిలో దళారి వ్యవస్థ లేకుండా ప్రజలకు సంక్షేమాన్ని చేరువ చేశారని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. వాలంటరీ సచివాలయ వ్యవస్థ ద్వారా వారింటికి సంక్షేమం చేరటంతో ప్రజలు సంతోషిస్తున్నారని తెలిపారు. ద్వారకాతిరుమల మండలంలో కార్యకర్తలు, నాయకుల ఆత్మీయ సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడారు. జగనన్నకు ఓటు వేసేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. ఎంతమందితో కలిసి వచ్చినా భయపడేది లేదని అన్నారు. ప్రజలు జగనన్నను ముఖ్యమంత్రిగా చేసేందుకు డిసైడ్ అయిపోయారని పేర్కొన్నారు. ‘చంద్రబాబుది విజన్ అయితే.. 2019లో ఎందుకు అది పాయిజన్ అయిందో చెప్పాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదు. అమ్మ ఒడి పథకాన్ని గతంలో ఎందుకు పెట్టలేదు. రెండువేల పైచిలుకు వ్యాధులకు ఆరోగ్య శ్రీలో చికిత్స ఎందుకు ఇవ్వలేదు. చంద్రబాబు విజన్ అంటే దోచుకోవడం దాచుకోవడమేనా?. నేను చంద్రబాబుకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా.. కొవ్వూరు నియోజకవర్గంలో ఏ ఇసుక ర్యాంపు నుంచైనా నాకు నెలకు, సంవత్సరానికి గాని ఎవరైనా ఒక్క రూపాయి అయినా నాకు ఇచ్చారనీ నిరూపిస్తే రాజకీయాల నుంచి నేను వైదొలుగుతా’ అని తానేటి వనిత తెలిపారు. అలాగే.. గోపాలపురం నియోజవర్గం అనేది తన స్వస్థలమని తెలిపారు. తన తండ్రి బాబాజీ రావు ఇక్కడ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు. ప్రజలకు తాను సుపరిచితురాలనేనని.. తనకు పుట్టింటికి వచ్చినట్లుందని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. -
తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: పోసాని
-
చంద్రబాబుకు కేతిరెడ్డి ఓపెన్ ఛాలెంజ్
-
లైవ్ లో కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ ఛాలెంజ్
-
చంద్రబాబు సిగ్గులేకుండా దోపిడీకి పాల్పడ్డారు
-
టీడీపీకి సవాల్ విసిరినా ఎమ్మెల్యే బాలినేని
-
టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి ఉషశ్రీ బహిరంగ సవాల్
-
పవన్ కళ్యాణ్ పై భీమిలి రైతుల ఫైర్
-
మార్గదర్శి అక్రమాలపై మే 10 తర్వాత చర్చకువస్తా: ఉండవల్లి
-
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత
-
తొడ కొట్టి చెప్తున్నా..నీకు దమ్ముంటే రద్దు చేయి...
-
నారా లోకేష్‌కు కేతిరెడ్డి ఓపెన్ ఛాలెంజ్..
సాక్షి, విజయవాడ: నారా లోకేష్‌కు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. 24 గంటల్లో తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు. అలా చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఒకవేళ ఆరోపణలు నిరూపించలేకపోతే లోకేష్ పాదయాత్ర వదిలేసి వెళ్లిపోతాడా..? అని ప్రతి సవాల్ విసిరారు. 'చంద్రబాబు, లోకేష్లలా నాది అక్రమ నివాసం కాదు. రైతుల వద్ద నుంచి భూమి కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నా. చంద్రబాబులా నేను ఎవర్నీ బెదిరించలేదు. నా నివాసానికి అన్ని రకాల అనుమతులు చూపిస్తా. చంద్రబాబుది అక్రమ నివాసం కాదా? చంద్రబాబు, లోకేష్‌ల నివాసం డాక్యుమెంట్లు చూపిస్తారా..? ఇసుక లారీలు బెంగళూరు వెళ్లాయని నిరూపించండి..? లోకేష్‌కి దమ్ముంటే నా ఇంటికొస్తే.. అన్ని ఆధారాలు చూపిస్తా. చంద్రబాబు, లోకేష్‌వి ఆడవాళ్ళ ను అడ్డం పెట్టి రాజకీయాలు చేసే బతుకులు. పులకేసి లోకేష్‌కి అందర్నీ తిట్టి తిట్టించుకోవడం అలవాటైంది. మా టార్గెట్ 175ని ఖచ్చితంగా సాధిస్తాం. మా నాయకుడు తప్పు చేసిన నలుగురు ఎమ్మెల్యేలు ను సస్పెండ్ చేశారు. చంద్రబాబుకి ఆయన పార్టీ వీడిన ఎమ్మెల్యే, ఎంపీలను సస్పెండ్ చేసే దమ్ముందా? అని కేతిరెడ్డి ఫైర్ అయ్యారు. చదవండి: ఆ రూమర్లను కొట్టిపారేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ -
ఒరేయ్ దద్దమ్మ...నీకు దమ్ముంటే రా...నువ్వో నేనో తేల్చుకుందాం
-
ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిపై టీడీపీ నేతల దౌర్జన్యం
సాక్షి, శ్రీ సత్యసాయి: టీడీపీ నేతల దౌర్జన్యంతో పుట్టపర్తి నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న ఆరోపణలకు బహిరంగ చర్చకు సిద్ధం అయ్యారు స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. ఈ క్రమంలో సత్యమ్మ ఆలయం వద్దకు శ్రీధర్ రెడ్డి చేరుకోగా.. టీడీపీ నేతలు రాళ్లు రువ్వారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిపై టీడీపీ నేతలు రాళ్లు రువ్వారు. అలాగే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఏకంగా శ్రీధర్ రెడ్డి పైకి దూసుకొచ్చారు. అక్కడితో ఆగకుండా కారుపైకి ఎక్కి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు పల్లె. ఈ క్రమంలో అక్కడ ఉన్న టీడీపీ నేతలు.. వైఎస్సార్సీపీ నేతల వాహనాలను ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పేలా కనిపించడంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఆరోపణలపై బహిరంగ చర్చకు లోకేష్, పల్లె సిద్ధమా? ఆరోపణలపై బహిరంగ చర్చకు లోకేష్, పల్లె రఘనాథ్‌రెడ్డిలు సిద్ధమా అని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి సవాల్ విసిరారు. ఐదేళ్లు అధికారంలో ఉండి పుటపర్తికి పల్లె రఘునాథ్ ఏం చేశారో చెప్పాలని శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. పల్లె రఘునాథ్‌రెడ్డి కనుమరుగైన రాజకీయ నేత అని, సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక పుటపర్తి జిల్లా ఏర్పాటు చేసుకున్నామని, పుటపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ప్రతిసవాల్‌ను స్వీకరించని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి -
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి సవాల్ విసిరిన వినయ్ రెడ్డి
-
నారా లోకేష్ కు మంత్రి రోజా బహిరంగ సవాల్
-
ఆరోపణలపై చర్చకు సిద్ధం: మంత్రి ఉషాశ్రీ చరణ్
సాక్షి, అనంతపురం: టీడీపీ నేతలకు ఏపీ మంత్రి ఉషాశ్రీచరణ్ బహిరంగ సవాల్ విసిరారు. తనపై చేస్తున్న ఆరోపణలకు చర్చకు సిద్ధమంటూ శుక్రవారం ఆమె మీడియా సమక్షంలో పేర్కొన్నారు. నాపై చేస్తున్న ఆరోపణలకు బహిరంగ చర్చకు సిద్ధం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరిలపై పరువు నష్టం కేసు వేస్తామని ప్రకటించారామె. ప్రైవేటు భూములను కొనుగోలు చేస్తే తప్పేంటని ప్రశ్నించిన ఆమె.. టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. -
‘రామోజీరావు.. దమ్ముంటే నిరూపించు, లేదంటే పేపర్ మూసేసి ఇంట్లో కూర్చో’
సాక్షి, తాడేపల్లి: ఈనాడు రామోజీరావుకు ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఓపెన్ సవాల్ విసిరారు. ఇళ్ల నిర్మాణాలపై ఈనాడులో తప్పుడు వార్తలు రాశారని జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామోజీరావుకి దమ్ముంటే ఆ వార్త నిజమని నిరూపించాలని డిమాండ్ చేశారు. ఈనాడులో తప్పుడు వార్తలపై మంత్రి జోగి రమేష్ ట్విట్ట్ వేదికగా మండిపడ్డారు. ఈ సందర్భంగా రామోజీరావుకు సవాల్ విసిరారు. రామోజీ.. నేను రూపాయి అవినీతి చేశానని నిరూపించు. లేదంటే ఈనాడు పేపర్ మూసేసి ఇంట్లో కూర్చో. మహిళల మాన ప్రాణాలకు చెలగాటమాడే వారికి అండగా ఉంటారా?. పేపర్ ఉంది కదా అని తప్పుడు వార్తలు రాస్తే ఎలా?. నేను అవినీతికి పాల్పడ్డానని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. లేదంటే ఈనాడు ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తావా? అని సవాల్ విసిరారు. ఈనాడు రామోజీరావు నీకు ఓపెన్ ఛాలెంజ్... రూపాయి అవినీతి చేసాను అని నిరూపించు లేదంటే ఆ ఈనాడు పేపర్ మూసేసి ఇంట్లో కూర్చో pic.twitter.com/fyquSiI912 — Jogi Ramesh (@JogiRameshYSRCP) October 3, 2022 -
చర్చకు రమ్మంటే ముఖం చాటేస్తున్న ఈటల: ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి
హుజూరాబాద్: ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలకు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని కోరితే సమాధానం చెప్ప కుండా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖం చాటేస్తున్నా రని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. బుధవారం హుజూరాబాద్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హుజూరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలని సవాల్ విసిరినా ఈటల స్పందించకపోవడం తన తప్పును అంగీకరించినట్లేనని స్పష్టం చేశారు. 5న హుజూ రాబాద్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద నియోజకవర్గ ప్రజల మధ్యే అభివృద్ధిపై చర్చ పెట్టుకుందామన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక పాల్గొన్నారు. -
దమ్ముంటే డేట్ ఫిక్స్ చేయండి.. విపక్షాలకు సీఎం కేసీఆర్ సవాల్
-
చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ ఓపెన్ ఛాలెంజ్
సాక్షి, కృష్ణా జిల్లా: ‘నీకు దమ్ముంటే గుడివాడ మహానాడుకు నన్ను ఆహ్వానించు.. అదే వేదికపై సామాజిక న్యాయంపై నేను చర్చకు సిద్ధం’ అంటూ చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ ఓపెన్ సవాల్ విసిరారు. చదవండి: ఆ రెండు వేల కోసం విమర్శిస్తున్నారు: సీఎం జగన్ జిల్లాల పర్యటనల్లో సీఎం జగన్‌ను చంద్రబాబు వ్యక్తిగతంగా తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. చంద్రబాబు ఒక జోకర్లా, అయ్యన్న పాత్రుడు అండ్ కో బ్రోకర్లలా తయారయ్యారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ప్రజలకు గుర్తుండి పోయే పథకం పెట్టారా. సామాజిక న్యాయం చేశానని చంద్రబాబు చెప్పగలిగారా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నుంచి 18 మందికి మంత్రి పదవులు ఇస్తానని చెప్పే ధైర్యం చంద్రబాబుకి ఉందా’’ అంటూ మంత్రి ప్రశ్నించారు. ‘‘ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, పార్టీ లాక్కుని చంపేశావ్. ఏ మొహం పెట్టుకుని నిమ్మకూరు వస్తావ్. ఎన్టీఆర్ కొడుకులకైనా సిగ్గులేదా. చంద్రబాబు నిమ్మకూరులో అడుగు పెడితే పైనున్న ఎన్టీఆర్ ఆత్మ క్షోభ పెడుతుందని’’ మంత్రి జోగి రమేష్ అన్నారు. -
దమ్ముంటే రండి.. ప్రతిపక్ష నేతలకు ఎమ్మెల్యే సవాల్
-
బండి సంజయ్.. నీకు దమ్ముంటే ఆయనపై గెలువు చూద్దాం..!!
-
ఏ బీజేపీ నాయకుడు సమాధానం చెపుతాడో చూడం
-
ఎలన్ మస్క్ సవాల్: అలా చేస్తే రూ.45 వేల కోట్లు ఇస్తాను
వాషింగ్టన్: ప్రపంచ కుబేరులు వారి సంపదలో చాలా తక్కువ మొత్తాన్ని దానం చేస్తే భూమ్మీద ఆకలి సమస్య ఉండదన్న యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం(యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ) వ్యాఖ్యలపై స్పేస్ ఎక్స్ ఫౌండర్, బిలియనీర్ ఎలన్ మస్క్ స్పందించారు. ఈ క్రమంలో యూఎన్డబ్ల్యూఎఫ్పీకి ఓ సవాలు విసిరారు ఎలన్ మస్క్. ఆకలి సమస్యను పరిష్కరించడానికి యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ మంచి ప్రణాళికతో వస్తే తాను 6 బిలియన్ డాలర్లు(4,49,13,30,00,000 రూపాయలు) ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఎలన్ మస్క్ ఆదివారం ట్వీట్ చేశారు. కొన్ని రోజుల క్రితం యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ సంస్థ డైరెక్టర్ సీఎన్ఎన్తో మాట్లాడుతూ.. ‘‘మస్క్ లేదా ఇతర ప్రపంచ కుబేరుల సంపదలో కేవలం 2 శాతం దానం చేస్తే ప్రపంచంలో ఉన్న ఆకలి సమస్యను తీర్చవచ్చు’’ అన్నారు. సీఎన్ఎన్లో వచ్చిన ఈ వార్త కథనం క్లిప్పింగ్‌ని ఎలన్ మస్క్ సంస్థ సహా వ్యవస్థాపకుడు డాక్టర్ ఎలి డేవిడ్ ట్వీట్ చేశారు. (చదవండి: ఎంత పనిచేశావు ఎలన్‌మస్క్..! నీ రాక..వారికి శాపమే..!) ఎలి డేవిడ్ ట్వీట్‌పై మస్క్ స్పందిస్తూ.. ‘‘6 బిలియన్ల సంపదతో ప్రపంచ ఆకలిని ఎలా తీర్చగలదో యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ ఇక్కడ ట్విటర్ థ్రెడ్‌లో నాకు తెలిపితే.. నేను ఇప్పుడే టెస్లా స్టాక్‌ను అమ్మి.. ఆ మొత్తాన్ని దానం చేస్తాను’’ అన్నారు. అంతేకాక ఈ డబ్బును ఎలా వినియోగిస్తున్నారనే దాని గురించి ప్రజలకు బహిరంగ పర్చాలని.. ఒపెన్‌గా ఉండాలని సూచించారు మస్క్. యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ.. గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 155 మిలియన్ల మంది సరైన ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. ఈ అంశంపై యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డేవిడ్ బీస్లీ.. ‘‘మస్క్ తన సందలో కేవలం 2 శాతం దానం చేస్తే.. 42 మిలియన్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడవచ్చు. వీరంతా ఆకలితో అలమటిస్తున్నారు. మనం వారిని ఆదుకోకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది’’ అని తెలిపారు. (చదవండి: ఎలన్ నువ్వు అసాధ్యుడివయ్యా..! అనుకుంటే ఏదైనా చేస్తావ్..!) తన వ్యాఖ్యలపై బిస్లీ మరింత వివరణ ఇస్తూ.. ‘‘ఈ బిలియనీర్ల సంపద ప్రపంచ ఆకలిని తీర్చుతుందని మేం చెప్పడం లేదు. ఒక్కసారి ఇచ్చే ఈ మొత్తం.. ప్రస్తుతం ఆకలి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతన్న 42 మిలియన్ల మందిని కాపాడగలదు. 155 మిలియన్ల మంది ఆకలి తీర్చాలంటే 8.4 బిలియన్ల సంపద కావాలి’’ అన్నారు. చదవండి: ఎలన్‌మస్క్ నంబర్ 1 ధనవంతుడయ్యాడంటే కారణమిదే - ఆనంద్ మహీంద్రా -
‘మునుగోడుకు రూ.2వేల కోట్లిస్తే రాజకీయ సన్యాసం చేస్తా’
చౌటుప్పల్: మునుగోడు నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ రూ.2 వేల కోట్లు ఇస్తే వెంటనే తన పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సవాల్ విసిరారు. తన నియోజకవర్గంలో ఉన్న 20 వేల దళిత కుటుంబాలున్నాయన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ రాజకీయలబ్ధి కోసం హుజూరాబాద్‌లో అమలు చేస్తోన్న దళితబంధును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. -
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌పై ఈటల సంచలన వ్యాఖ్యలు
హుజూరాబాద్: ‘హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతా. నేను గెలిస్తే కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలి’ అని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ సంచలన సవాల్ విసిరారు. గురువారం హుజూరాబాద్ పట్టణ శివారులోని సిర్సపల్లి రోడ్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు వివేక్‌తో కలిసి పరిశీలించారు. హుజూరాబాద్ శివారులోని సిర్సపల్లి రోడ్లో డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలిస్తున్న ఈటల ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ తీరు మోచేతికి బెల్లంపట్టి అరచేతిని నాకించే విధంగా ఉందని, ఎన్నికల సమయంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల గురించి చాలా గొప్పగా అనేక ముచ్చట్లు చెప్పాడన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎలా కట్టించాలనే విషయంలో ఉపసంఘం వేసినా, నివేదిక ఇవ్వకముందే కాలనీల రూపంలో కట్టాలని జీవో ఇచ్చాడని తెలిపారు. గ్రామాల్లో స్థలాలు దొరకవని, కాలనీల రూపంలో డబుల్ బెడ్ రూం కట్టడం సాధ్యం కాకపోవచ్చని చెప్పామని, వినకుండా ఊరికి 400 ఇండ్లు కట్టాలని చెప్పారని తెలిపారు. ఇవి ఎవరికీ సరిపోవని చెప్పడంతో మరో వెయ్యి ఇళ్లు ఇచ్చారన్నారు. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటలో వేలాది ఇళ్లు మంజూరు చేస్తే, తాను కూడా హుజూరాబాద్‌కు మరిన్ని ఇళ్లు కావాలని అడిగానని.. దీంతో 3,900 ఇళ్లు ఇచ్చారని చెప్పారు. కేసీఆర్ మాటాలు కోటలు దాటుతాయి తప్ప, కాళ్లు మాత్రం గడప దాటవని ఎద్దేవా చేశారు. ‘హరీశ్ రావు నా దగ్గరకి వచ్చి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టలేదని చిల్లర ఆరోపణలు చేస్తున్నాడు. నీవు ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు నమ్మరు. ఎంత పిచ్చి ప్రేలాపనలు పేలినా కర్రు కాల్చి వాతపెడతారని’ హెచ్చరించారు. టీఆర్ఎస్కు దుబ్బాకలో మించిన పరాభవం ఇక్కడ తప్పదని జోస్యం చెప్పారు. -
Shoaib Akhtar: నీ చాలెంజ్ ఒప్పుకుంటున్నా.. బైక్ కొనడానికి రెడీగా ఉండు
రావల్పిండి: పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఆటకు దూరమైనా.. ఎంటర్టైన్మెంట్కు దూరం కాలేదు. ఆటలో ఎన్ని వివాదాలు వచ్చినా తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చలకీగా ఉంటాడు. క్రికెట్ చరిత్రలో గంటకు వంద మీటర్ల వేగంతో బంతులు విసరడం అరుదుగా చూస్తుంటాం. అలాంటి వారిలో అక్తర్ కూడా ఒకడు. అతను వేసే వేగానికి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా షోయబ్ 100 మీటర్ల వేగంతో విసిరే బంతులపై పాక్ ఫేమస్ యాక్టర్ ఫహద్ ముస్తఫా కొన్ని రోజుల క్రితం ట్విటర్లో ఫన్నీగా స్పందించాడు. ''అక్తర్ నీ వేగాన్ని తట్టుకోలేం.. దానికంటే ఇంట్లో ముసుగుతన్ని పడుకోవడం బెటర్'' అంటూ కామెంట్ చేశాడు. దీనికి అక్తర్ తనదైన శైలిలో ఫన్నీ కౌంటర్ ఇచ్చాడు. ''ఫహన్ నేను వేసిన ఆరు బంతులు ఆడు చాలు.. నీకు మోటార్ సైకిల్ కొనిస్తా'' అంటూ చాలెంజ్ చేశాడు. అయితే అక్తర్ ట్వీట్‌పై ఫహద్ ఏం స్పందించలేదు. తాజాగా అక్తర్ ఫహద్‌కు ఇచ్చిన చాలెంజ్‌ను తాను ఒప్పుకుంటున్నానంటూ పాకిస్తాన్ మానవవనరుల అభివృద్ధి మాజీ అధికారి సయ్యద్ జుల్ఫికర్ బుకారీ తెలిపాడు. దీనికి సంబంధించి అక్తర్, బుకారీల మధ్య ట్విటర్లో ఆసక్తికర చర్చ నడిచింది. బుకారీ స్పందనపై అక్తర్ ఒక నిమిషం ఆలోచించి రీట్వీట్ చేశాడు. ''బుకారీ మీరు బాగానే ఉన్నారా.. నేను ఇచ్చిన చాలెంజ్ మీకు అర్థమైందా'' అంటూ అడిగాడు. దానికి బుకారీ.. ''అక్తర్ నువ్వు ఇచ్చిన చాలెంజ్‌పై నేను కాన్ఫిడెంట్‌గా ఉన్నా.. ఒకవేళ నేను ఒక్క బాల్ మిస్ అయినా.. ప్రతీ బంతి చొప్పున బైక్ ఇవ్వడానికి సిద్ధం'' అని చెప్పాడు. దానికి అక్తర్ బదులిచ్చాడు. '' బుకారీ నేను వేసే ఒక్కో బంతి మీ బ్యాట్‌ను తాకిన ప్రతీసారి బైక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా.. మీరు సిద్ధమా'' అంటూ ట్వీట్ చేశాడు. అయితే అక్తర్ ట్వీట్‌పై బుకారీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అయితే వీరిద్దరి మధ్య జరిగిన చాట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: WTC Final: ఐసీసీ ఈవెంట్లు ఇద్దరికి కలిసి రాలేదు 6 ball khel li toh aik motorcycle teri @fahadmustafa26 😂 https://t.co/cKSYaACmXU — Shoaib Akhtar (@shoaib100mph) May 24, 2021 I’ll accept your challenge🏏 https://t.co/F8kYTLIj6q — Sayed Z Bukhari (@sayedzbukhari) June 1, 2021 Here we go, aik aur challenger aaye hain. Kheriyat hai @sayedzbukhari ?? https://t.co/nmJDmH4Cxs — Shoaib Akhtar (@shoaib100mph) June 1, 2021 Yes buddy all good 🙂 I am serious, every ball I miss, I will donate a bike. https://t.co/DGcnJJH1CX — Sayed Z Bukhari (@sayedzbukhari) June 1, 2021 -
వల్లభనేని సవాల్.. దేవినేని ఉమ హైడ్రామా
సాక్షి, విజయవాడ: గొల్లపూడిలో టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా ‘నిరసన దీక్ష’ పేరుతో డ్రామా రక్తి కట్టించారు. గొల్లపూడిలో సోమవారం 3648 ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా.. దేవినేని ఉమకు వైఎస్సార్ సీపీ నాయకులు కొడాలి నాని, వల్లభనేని వంశీ బహిరంగ చర్చకు రావాల్సిందిగా సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఇక మంగళవారం గొల్లపూడి సెంటర్లో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉండగా.. దేవినేని మాత్రం ‘నిరసన దీక్ష’ పేరుతో డ్రామా ప్రారంభించారు. (చదవండి : నాడు ఎన్టీఆర్ ఉసురుతీసి ఇప్పుడు దండలేస్తావా!) అంతేకాక బహిరంగ చర్చకు హాజరు కాకుండా ఉండేందుకు తన దీక్ష గురించి ముందే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో అనుమతి లేకుండా దీక్ష చేస్తున్నారనే కారణంతో పోలీసులు దేవినేనిని అరెస్ట్ చేశారు. చర్చకు హాజరుకాకుండా ఉండేందుకు పక్కా ప్లాన్‌తోనే దేవినేని నిరసన దీక్ష ప్రారంభించి.. అరెస్ట్ అయ్యేలా వ్యూహం పన్నారు. చర్చ జరగకుండా తప్పించుకున్నారు. -
జగన్ సీఎం కాకుంటే రాజకీయ సన్యాసం
సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఈ నెల 23వ తేదీన రానున్న ఫలితాల్లో వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా 120కి పైగా సీట్లు గెలుచుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అవ్వడం ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి అన్నారు. అలా జరగకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, ఈ సవాలుకు టీడీపీ నాయకులు సిద్ధమా అని శ్రీకాకుళం నగరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆమె చాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఈవీఎంల పనితీరు అమోఘమని, ఇంతకు మంచిన టెక్నాలజీ ఎక్కడా లేదని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. 2019 ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలుసుకుని ఏమి చేయాలో తెలియక ఓటింగ్ యంత్రాలను తప్పుబడుతున్నారని మండిపడ్డారు. ఎలాగూ ఓడిపోతామని.. ఉన్నంతకాలమైనా పాలించేద్దామని ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి, ఎన్నికల అధికారులపై, సీఎస్‌పై ఇష్టం వచ్చినట్లు పిచ్చికూతలు కూస్తున్నారన్నారు. దీన్నిబట్టి చూస్తే బాబుకి మతి భ్రమించిందని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. చంద్రబాబుకు చరమగీతం జిల్లాలో 10 ఎమ్మెల్యే స్ధానాలతోపాటు జిల్లా పరిధిలో ఉన్న 3 ఎంపీ స్థానాలు వైఎస్సార్సీపీవేనని కృపారాణి చెప్పారు. టీడీపీ అరాచక పాలనతో విసుగు చెందిన ప్రజలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున మార్పు కావాలని కోరుకుంటున్నారన్నారు. టీడీపీకి, చంద్రబాబుకి రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడేందుకు మరో నాలుగు రోజులే మిగిలున్నాయన్నారు. గడిచిన ఐదేళ్లలో ప్రజా సమస్యలను పక్కనబెట్టి టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జన్మభూమి కమిటీలతో రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ, పార్లమెంట్లలో ప్రజా సమస్యలపై నిలదీస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారన్నారు. చంద్రబాబు బోగస్ సర్వేలతో ప్రజలకు మభ్యపెడుతున్న తీరు హాస్యాస్పదమన్నారు. కౌంటింగ్ సమయంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, అల్లర్లు సృష్టించడంలో నేరుగా చంద్రబాబే టీడీపీ నేతలకు శిక్షణ ఇచ్చిఉన్నారన్నారు. పోలింగ్ జరిగిన నాడే అనేక ప్రాంతాల్లో గొడవలు సృష్టించారని, ఈసీ ముందుజాగ్రత్త చర్య వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. మరో నాలుగు రోజుల్లో టీడీపీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంధవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజ యరావు, శిమ్మ రాజశేఖర్, కె.ఎల్.ప్రసాద్, కోరాడ రమేష్, టి.కామేశ్వరి, పి.సుగుణారెడ్డి, గుంట జ్యోతి, పి.రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
లోకేష్‌తో ఆ పని చేయించగలరా
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పథకాలు ప్రచార ఆర్భాటాలకు తప్ప, ప్రజలకు ఉపయోగం లేనివని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 'రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1500 రోజులయ్యింది, కానీ ఇప్పటి వరకూ ప్రజలకు చేసింది ఏమీ లేదు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరితే ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన కార్యక్రమాలను ప్రజలే ప్రచారం చేసి మళ్లీ అధికారం ఇచ్చారు. బాబు తాను ప్రవేశ పెట్టిన పథకాలు 110 చెప్పమనండి చూద్దాం, లోకేష్‌తో అయినా చెప్పించండి. బీజేపీకి ఓటేస్తే వైఎస్సార్సీపీకి వేసినట్లు అని టీడీపీ నాయకులు అభూత కల్పన సృష్టిస్తున్నా'రంటూ మండిపడ్డారు. కేసులు పెడతారనే భయం : 'బాబు చేతికి టీడీపీ వచ్చాక 2009 మినహా ప్రతీ సారి బీజేపీ పొత్తుతోనే ఎన్నికలకు వెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తుతో వెళ్లను అని చెప్పిన ప్రతీ సారి మళ్లీ పొత్తు పెట్టుకున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీలు అవిశ్వాసం పెట్టి, రాజీనామాలు చేసిన తర్వాతనే, బాబు ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారు. ధర్మ పోరాటం అని ప్రగల్భాలు పలికారు. బీజేపీ తనపై కేసులు పెడుతుందని, వలయంగా ఉండండి సీఎం అని ప్రజలను కోరారు. రహస్యంగానే బీజేపీ మిత్రులతో కలిసి వలయం ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ మంత్రి భార్య స్వప్న మునుగంటివార్‌కు టీటీడీ సభ్యురాలిగా పదవి ఇచ్చారు. అదే విధంగా పరకాల ప్రభాకర్‌కు కూడా పదవి ఇచ్చారు' అని అన్నారు. పొత్తు కోసం తహతహ : 'బీజేతో పొత్తు కోసం ఒక పత్రిక అధిపతి అమిత్‌షాతో గంట సేపు ముచ్చటించారు. హామీలన్నీ అమలు చేస్తే ఇబ్బంది లేదని గడ్కరీ పర్యటనలో బాబు సంకేతం ఇచ్చారు. పోలవరంలో అవినీతి ఉందని గడ్కరీ అన్నారు. అప్పుడేమో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అన్నారు. ఇప్పుడేమో బీజేపీతో మాకు అంటగడుతున్నారు. కానీ బాబు మాత్రం అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌తో అడ్జస్ట్ అవుతున్నారు. కుటుంబరావు మోడీ అవినీతిని నెలలోపు బయట పెడుతామన్నారు, జీవీఎల్ నర్సింహారావు కూడా టీడీపీ అవినీతి బయట పెడుతామన్నారు. కానీ ఇప్పుడు ఎందుకు బయట పెట్టడం లేదు. ఏ క్షణంలోనైనా బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి చంద్రబాబు. బాబువి రాజకీయ కుయుక్తులు. నీతి ఆయోగ్‌లో మోడీ ఎడమ చేయి తాకితే అదే మహద్భాగ్యమన్నట్లు మురిసారు' అంటూ దుయ్యబట్టారు. టీడీపీ ఎంపీలు విచిత్ర వేషాలు : '29 సార్లు ఢిల్లీ వెళ్లిన బాబు. మీటింగ్ తర్వాత మీడియాతో ఎందుకు మాట్లాడటం లేదు. మళ్లీ ఎందుకు కేంద్రంతో సంబంధాల కోసం తహతహలాడుతున్నారు. ప్రభుత్వ ధనంతో ధర్మ పోరాట దీక్షలు తప్ప, పోరాటం లేదు. బాబు పోరాటం చేసి వ్యక్తి కాదు. ఆయనకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య. ఈ పార్లమెంటు సమావేశంలో కూడా టీడీపీ ఎంపీలు విచిత్ర వేషాలు వేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. మా పార్టీ హోదా కోసం రాజీనామా చేసింది. కానీ టీడీపీ మాత్రం వేషాలు వేస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి మీద ఆయన మంత్రి వర్గంలో ఉన్న వ్యక్తి ఆరోపణలు చేశారు. దాని మీద విచారణ చేయాలి. కాంగ్రెస్, టీడీపీని కలిసి చూడమనండి. వైరుధ్య పార్టీలు కాంగ్రెస్, టీడీపీ కలవడం అంటేనే వైఎస్సార్సీపీ బలంగా ఉందని అర్థం. ప్రజలే అన్ని కలయికల మీద తీర్పునిస్తారు' అని అంబటి రాంబాబు అన్నారు. -
ప్రభుత్వానివన్నీ ప్రచార ఆర్భటాలే
-
టీడీపీకి బుగ్గన బహిరంగ సవాల్
-
మార్చి 7న మీటింగ్ మీరు రెడీనా? : వర్మ ఛాలెంజ్
సాక్షి, హైదరాబాద్ : కొద్ది రోజులుగా తనపై వస్తున్న విమర్శలు వివాదాలపై రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ) వెబ్ సిరీస్ విడుదల సందర్భంగా ఓ చర్చా వేదికలో సామాజిక కార్యకర్త, మహిళ సంఘం నాయకురాలు దేవి పై అనుచితంగా వ్యాఖ్యలు చేసిన విషయంలో ఆయనపై పోలీస్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ కోసం సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. అంతేకాకుండా ఈవివాదంపై మహిళా సంఘాలు వర్మను అరెస్టు చేయాలంటూ నిరసనలకు దిగాయి. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ తన ఫేస్బుక్లో స్పందించారు. స్త్రీ స్వేచ్చ గురించి, భావజాల స్వేచ్చ గురించి విశాఖపట్నంలో బహిరంగ సమావేశానికి పిలుపు నిచ్చారు. ఓ మీడియా సంస్థలో తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి సమాధానం చెబుతానన్నారు. తాను కేవలం భారత చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవిస్తానని తెలిపారు. తాను ఎక్కడ ఉన్నా తన ఆలోచనలే లోకంగా బ్రతుకుతానని అన్నారు. తాను వచ్చేనెల 7న విశాఖపట్నంలో మీటింగ్ పెట్టుకుంటానని, అదేరోజు తనపై దుష్ప్రచారాలు చేసేవారు, విమర్శించేవారు కూడా వ్యతిరేకంగా మీటింగ్ పెట్టుకోవాలంటూ సవాల్ విసిరారు. ఎవరి మీటింగ్‌కు ఎక్కవమంది వస్తారో పూర్తి నిజం ఒక్క దెబ్బకు తెలిసిపోతుందని అన్నారు. తన సమావేశానికి యువత, కాలేజీ విద్యార్థులు, గృహుణులు, తన ఆలోచనలతో ఏకీభవించేవారు పెద్దఎత్తున రావాలని పిలుపునిచ్చారు. -
టీఆర్ఎస్ సవాల్‌కు సై: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ విద్యుత్ దుర్మార్గాలపై బహిరంగ చర్చకు తాము సిద్ధమేనని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపారు. ఎంపీ బాల్క సుమన్ కోరిన విధంగా బహిరంగ చర్చకు తాను, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ 12వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు వస్తామని, చర్చా వేదిక సీఎం అధికార నివాసం ప్రగతి భవన్ అయినా లేదా మరెక్కడికైనా వస్తామని తెలిపారు. ఈ మేరకు రేవంత్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడినా విద్యుత్ కొరత ఏర్పడకుండా కాంగ్రెస్ హయాంలో చేపట్టిన కొత్త విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాలు, ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్లు, కొత్త ప్లాంట్ల నిర్మాణాల పేరుతో జరుగుతున్న అక్రమాలు.. అన్నీ బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. విద్యుత్ వెలుగుల వెనక చీకటి కోణం ‘రోజంతా విద్యుత్’వెలుగుల వెనక చీకటి కోణం దాగి ఉందని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి మీద రాతలు రాయడంలో దిట్ట అని, తన ఆర్థిక అవసరాలకు అనుగుణంగా పనిచేయడంలో కేసీఆర్‌ది అందెవేసిన చెయ్యి అని ఆయన విమర్శించారు. బుధవారం గాంధీ భవన్లో రేవంత్ విలేకరులతో మాట్లాడుతూ, విద్యుదుత్పత్తి కేంద్రాల్లో సబ్ క్రిటికల్ టెక్నాలజీని మార్చమని కేంద్రం ఆదేశించినా ఇక్కడ దానిని పాటించడంలేదని అన్నారు. ఈ టెక్నాలజీని అందించే ఇండియా బుల్స్ సంస్థ కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకుందని, అందుకే కేంద్ర ప్రభుత్వం తిరస్కరించినా.. కాలం చెల్లిన టెక్నాలజీని వాడుతున్నారని పేర్కొన్నారు. బీహెచ్ఈఎల్ ద్వారా ప్రభుత్వం ఇండియా బుల్స్‌కి రూ.2 వేల కోట్లు చెల్లించిందని ఆరోపించారు. ఈ చెల్లింపులోనే కేసీఆర్ చీకటి ఒప్పందం దాగి ఉందని అన్నారు. 24 గంటల విద్యుత్ కాంగ్రెస్‌కు ఇష్టం లేదు రేవంత్‌వన్నీ తప్పుడు లెక్కలు: ఎంపీ బాల్క సుమన్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌తో కలసి ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ..కరెంటు కష్టాల నుంచే తెలంగాణ ఉద్యమం పుట్టిందన్నారు. కరెంటుపై రేవంత్‌రెడ్డి చెప్పేవన్నీ తప్పుడు లెక్కలని నిరూపిస్తామని చెప్పారు. తాము చెప్పే లెక్కలు అబద్ధమైతే ప్రజలు వేసే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. సవాల్‌కు సిద్ధమేనా? ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న విద్యుత్ సంస్థ కాంగ్రెస్ నేత సుబ్బరామిరెడ్డికి చెందినదని, ఒప్పందంలో అవకతవకలు జరిగినట్లు ఆయనతో రేవంత్ చెప్పించగలరా అని బాల్క సుమన్ సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ కృషితోనే భూపాలపల్లిలో విద్యుత్ ఉత్పాదన ప్రారంభమైందన్నారు. రేవంత్ చెబుతున్న గుజరాత్ కంపెనీ ఎక్కడుందో ఆయనకే తెలియాలన్నారు. విద్యుత్‌పై బహిరంగ చర్చకు కాంగ్రెస్ నేతలు సిద్ధమేనా అని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డితో కలసి వచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. రేవంత్ చెప్పేది అబద్ధమైతే అబిడ్స్ చౌరాస్తాలో ముక్కు నేలకు రాస్తారా అని సవాలు చేశారు. -
మా మిషన్లు ఇస్తాం.. దమ్ముంటే హ్యాక్ చేయండి!
ఇన్నాళ్లుగా తాము ఎన్నికల్లో ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను (ఈవీఎం) ఈ నెలాఖరులో ఇస్తామని, దమ్ముంటే ఎవరైనా సరే వాటిని హ్యాక్ చేయడం లేదా ట్యాంపరింగ్ చేసి చూపించాలని ఎన్నికల కమిషన్ సవాలు చేసింది. మొత్తం 55 రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈసీ ఒక సమావేశం నిర్వహించింది. వాటిలో 16 పార్టీలు మళ్లీ బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశాయి. దాంతో ఈసీ అధికారులు స్పందించి, తాము ఈ నెలాఖరులో ఓపెన్ చాలెంజ్ నిర్వహిస్తామని, అందులో ఎవరైనా సరే తమ ఈవీఎంలను ట్యాంపర్ చేసి చూపించాలని సవాలు చేశారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వివిధ కోర్టులలో ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి 37 కేసులు నమోదయ్యాయని, వాటిలో ఇప్పటికే 30 కేసుల్లో తీర్పులు రాగా, వాటన్నింటిలో కూడా ఈవీఎంలను ట్యాంపర్ చేయడం కుదరదనే చెప్పారని ఢిల్లీ రాజౌరి గార్డెన్ ఎమ్మెల్యే మన్జీందర్ సింగ్ సిర్సా తెలిపారు. ప్రభుత్వం తలపెట్టిన వీవీపాట్ నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్ స్వాగతించింది. ఇప్పటికే తమకు ఈ మిషన్ల కొనుగోలుకు సంబంధించి నిధులు కూడా అందాయని, 2019 నాటికి వీటిని ఉపయోగంలోకి తెస్తామని ఈసీ వర్గాలు తెలిపాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అసెంబ్లీలో హ్యాక్ చేసి చూపించింది తమ ఈవీఎంలా కనిపించేదే తప్ప అసలుది కాదని స్పష్టం చేశాయి. ఈవీఎంలు నూటికి నూరుశాతం కచ్చితమైనవనే విషయాన్ని ప్రతి భారతీయుడికి ఎన్నికల కమిషన్ చెప్పగలగాలని, అది వాళ్ల బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు. -
‘ఓపెన్ చాలెంజ్’ తేలకుండా శిక్షణా?
సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలపై అనుమానాలు వ్యక్తంచేస్తున్న పలువురు అభ్యర్థులు గురువారం డీజీపీ కార్యాలయ ముట్టడికి యత్నించారు. హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండటంతో పాటు ఓపెన్ చాలెంజ్ కింద 153 మంది అభ్యర్థులు సందేహాలు వ్యక్తం చేయగా, ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదన్నారు. మార్చి 15నే క్లారిటీ ఇస్తామని ప్రకటించిన బోర్డు అధికారులు ఇప్పటికీ స్పందించడం లేదని, ఈ రెండు అంశాల్లో క్లారిటీ రాకముందే ఈ నెల 10 నుంచి కానిస్టేబుల్ శిక్షణ కార్యక్రమాలు ఎలా మొదలుపెడతారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. 40మంది అభ్యర్థులు డీజీపీ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం జరిగేవరకు ఎట్టి పరిస్థితుల్లో శిక్షణ కార్యక్రమాలు మొదలుపెట్టడానికి వీలులేదని, ఫలితాల్లో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అభ్యర్థులు ఎత్తిచూపుతున్న అంశాలు.. కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం రాకపోవడం. రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన మెరిట్ లిస్ట్‌లో ర్యాంకుల కేటాయింపులో తప్పిదాలు. అసలు అభ్యర్థుల పేర్లు లేకుండా ప్రకటించడం. ఫిజికల్ టెస్టుల్లో కొన్ని ప్రాంతాల్లో నిర్వహణ లోపం వల్ల అభ్యర్థులు నష్టపోయారని ఆరోపణ. ఎన్సీసీ కోటాలో కటాఫ్ జనరల్ వారి కటాఫ్ కంటే ఎక్కువగా ఉండటం. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్‌కే మొదటి ప్రాధాన్యత ఇవ్వటం. నాన్‌లోకల్ అభ్యర్థులకు కూడా రిజర్వేషన్ వర్తింపజేయడం. డ్రైవింగ్ టెస్ట్ పెట్టకుండా లైసెన్స్ ఉన్న వారికి 3 నుంచి 6 మార్కులు కలపడం. ద్విచక్రవాహన లైసెన్స్ ఉన్నవారికి కూడా మార్కులు కలపడం. సైబరాబాద్, రంగారెడ్డిలోని పోస్టులను నోటిఫికేషన్లో వేర్వేరుగా చూపించి, కటాఫ్ మాత్రం కలిపి ఇవ్వడం. కనీస అర్హత మార్కులు రాని హోంగార్డులను ఎంపిక చేయటంపై ఆశావహ అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 15 రోజుల్లో క్లారిటీ: ఐజీ నియామక ఫలితాలపై ఓపెన్ చాలెంజ్ ద్వారా సందేహం వ్యక్తం చేసిన 153 మంది అభ్యర్థులకు పదిహేను రోజుల్లో బోర్డు అధికారులు క్లారిటీ ఇస్తామని చెప్పినట్టు ఐజీ కల్పనా నాయక్ అభ్యర్థులకు సూచించారు. పదిహేను రోజుల్లో క్లారిటీ ఇచ్చిన అనంతరం ఎంత మంది సెలక్ట్ అయినా వారిని తదుపరి బ్యాచ్‌లో శిక్షణకు పంపిస్తామని ఐజీ చెప్పినట్టు అభ్యర్థులు మీడియాకు తెలిపారు. అప్పటివరకు తాము పోరాటం ఆపమని హెచ్చరించారు. -
ఎన్నికల సంఘం ఓపెన్ చాలెంజ్!
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం) ట్యాంపరింగ్ ఆరోపణల నేపథ్యంలో జాతీయ ఎన్నికల సంఘం బహిరంగ సవాల్ కు సిద్ధమవుతోంది. ట్యాంపరింగ్ ఆరోపణలు నిరూపించాలని రాజకీయ పార్టీలు, టెక్నోక్రాట్స్, సంఘాలను ఆహ్వానించాలని ఈసీ నిర్ణయించింది. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు ఉన్నవారెవరైనా తమ సవాల్ ను స్వీకరించొచ్చని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. ‘ఓపెన్ చాలెంజ్ కు త్వరలోనే తేదీ ప్రకటిస్తాం. 2009లోనూ ఇదేవిధంగా బహిరంగ సవాల్ విసిరాం. ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలను ఎవరూ నిరూపించలేకపోయారు. ఈవీఎంల పనితీరుపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఓపెన్ చాలెంజ్ కు సిద్ధమవుతున్నామ’ని ఈసీ వర్గాలు వెల్లడించాయి. 72 గంటల సమయమిస్తే ఈవీఎంల సాఫ్ట్వేర్ ఏమిట,? దానిని ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో వెల్లడిస్తానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించిన సంగతి తెలిసిందే. -
‘పోలీస్’ ఫలితాలపై 150 మంది చాలెంజ్!
సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలపై అనుమానాలున్న 150 మందికి పైగా అభ్యర్థులు ఓపెన్ చాలెంజ్ ద్వారా అభ్యర్థించినట్లు రిక్రూట్మెంట్ బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి. కటాఫ్ మార్కులు, రిజర్వేషన్లు సహా అభ్యర్థుల ప్రతి సందేహాన్నీ నివృత్తి చేసేందుకు దేశ చరిత్రలో తొలిసారిగా పోలీస్ శాఖ ఓపెన్ చాలెంజ్‌కు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. సందేహాలపై 10 నుంచి 15 రోజుల్లో వివరణ ఇస్తామని, ఏ అభ్యర్థికైనా అన్యాయం జరిగిందని నిరూపితమైతే అతనికి అపాయింట్మెంట్ ఆదేశాలిస్తామని స్పష్టం చేశారు. -
'నరసరావుపేట సభను చూసి వణికిపోతున్నారు'
-
'నరసరావుపేట సభను చూసి వణికిపోతున్నారు'
విజయవాడ: నరసరావుపేటలో వైఎస్ జగన్ బహిరంగ సభను చూసి టీడీపీ నేతలు వణికిపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేక పిచ్చి ప్రేలాపణలు పేలుతున్నారన్నారు. మంత్రి దేవినేని ఉమ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని.. ప్లేస్, టైమ్ దేవినేని ఉమానే డిసైడ్ చేసుకోవాలని పార్థసారధి సవాల్ విసిరారు. ప్రజలకు చేసిన మోసాలపైనా, అవినీతిపైనా వైఎస్సార్సీపీ చర్చకు సిద్ధమన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అభ్యర్థులుండరని మాట్లాడుతున్న మంత్రి ఉమ దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధపడాలని ఆయన బహిరంగ సవాల్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు కాసు మహేష్ రెడ్డి శుక్రవారం నరసరావుపేటలో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. -
నూజివీడులో టెన్షన్..టెన్షన్
కృష్ణాజిల్లా : నూజివీడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుపై ముద్దరబోయిన అవినీతి ఆరోపణలు చేశారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని ఎమ్మెల్యే మేకా ప్రతాప్, ముద్దరబోయినకు బహిరంగ సవాల్ విసిరారు. స్థానిక పెద్దగాంధీ సెంటర్లో సోమవారం ఎమ్మెల్యే మేకా ప్రతాప్, పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి చర్చకు సిద్ధమయ్యారు. దీంతో టీడీపీ కార్యాలయంతో పాటు ఎమ్మెల్యే నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. పోలీసులు ముందస్తుగా ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. ఎమ్మెల్యే తన అనుచరులతో బహిరంగ చర్చకు వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఎమ్మెల్యే అనుచరులు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే మేకా ప్రతాప్ చర్చకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. -
నూజివీడులో టెన్షన్..టెన్షన్
-
చంద్రబాబుకు చాలెంజ్
స్టీఫెన్సన్ ఎవరో.. ఆ హోటల్ ఎక్కడుందో నాకు తెలీదు కేసీఆర్‌కు నేను లేఖ ఇచ్చానని రుజువుచేస్తే రాజీనామా చేస్తా లేదంటే చంద్రబాబు రాజీనామా చేస్తారా? అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన జగన్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్టీఫెన్సన్కు నామినేటెడ్ ఎమ్మెల్యే పదవి ఇవ్వాలని తాను టీఆర్ఎస్కు లేఖ ఇచ్చినట్లు రుజువు చేస్తే తక్షణమే రాజీనామా చేస్తానని, లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేస్తారా? అని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార పక్షానికి సవాల్ విసిరారు. మంగళవారం శాసనసభలో ప్రత్యేక హోదాపై చర్చ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని జగన్మోహన్రెడ్డి లేఖ ఇవ్వడంవల్లే స్టీఫెన్సన్కు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే పదవి ఇచ్చారని ఆరోపించారు. దాని పై జగన్ ప్రతిస్పందిస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ''అచ్చెన్నాయుడుగారూ... టీఆర్ఎస్కు నేను లేఖ ఇచ్చానా? నేను కేసీఆర్‌కు ఆ లెటరు ఇస్తే... ఆ లెటరు నీకెట్లావచ్చింద య్యా? కేసీఆర్ ఇచ్చారా? ఎవరా స్టీఫెన్సన్? ఆ స్టీఫెన్సన్ ఎవరో నాకు తెలియదు. ఆ హోటల్ ఎక్కడుందో నాకు తెలీదు. నేను లేఖ ఇచ్చినట్లు రుజువు చెయ్.. రాజీనామా చేస్తా. లేదంటే చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తారా? నేను గట్టిగా సవాల్ విసురుతున్నా. చాలెంజ్... చాలెంజ్.. చాలెంజ్... చంద్రబాబు నాయుడికి, నాకు చాలెంజ్...''అని జగన్ సవాలు విసిరారు. తాను కోరుకున్నవారిని ఎమ్మెల్సీగా గానీ, రాజ్యసభ సభ్యునిగా గానీ పంపించగలుగుతానని, ఎవరి వద్దకో వెళ్లాల్సిన, ఎవరినో బ్రతిమిలాడాల్సిన అవసరం తనకు లేదని జగన్ స్పష్టం చేశారు. ఇంకా నయం... రేవంత్‌రెడ్డికి డబ్బు ఇచ్చి లంచమిచ్చేందుకు పంపించిందీ, ఆడియో వీడియో టేపుల్లో మాట్లాడిందీ జగనేనని చెప్పలా.. అని ఎద్దేవా చేశారు. ''చంద్రబాబు తెలంగాణలో ఎనిమిదిమంది ఎమ్మెల్యేలను కొనేందుకు రూ.150 కోట్లు లంచమిచ్చేందుకు బ్లాక్‌మనీ సిద్ధం చేశారు. అందుకే ఓటుకు కోట్లు కేసు చార్జిషీటులో చంద్రబాబు పేరు 22 సార్లు పెట్టారు. కాబట్టే ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు ఈరోజు ప్రత్యేక హోదాను పణంగా పెట్టి మోదీగారి ముందు చంద్రబాబు నాయుడు సాష్టాంగపడ్డారు'' అని జగన్ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్లో లాలూచీకి ఆధారాలున్నాయి అంతకుముందు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని, జగన్మోహన్రెడ్డి లేఖ రాయడంవల్లే స్టీఫెన్సన్కు కేసీఆర్ ఎమ్మెల్యే పదవి ఇచ్చారని ఆరోపించారు. 21న గ్రాండ్ హోటల్లో స్టీఫెన్సన్, టీఆర్ఎస్ నాయకుడు హరీష్‌రావుతో జగన్ సమావేశమయ్యారని చెప్పారు. ఈ లాలూచీకి సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు.