
సాక్షి, విజయవాడ: గొల్లపూడిలో టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా ‘నిరసన దీక్ష’ పేరుతో డ్రామా రక్తి కట్టించారు. గొల్లపూడిలో సోమవారం 3648 ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా.. దేవినేని ఉమకు వైఎస్సార్ సీపీ నాయకులు కొడాలి నాని, వల్లభనేని వంశీ బహిరంగ చర్చకు రావాల్సిందిగా సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఇక మంగళవారం గొల్లపూడి సెంటర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉండగా.. దేవినేని మాత్రం ‘నిరసన దీక్ష’ పేరుతో డ్రామా ప్రారంభించారు. (చదవండి : నాడు ఎన్టీఆర్ ఉసురుతీసి ఇప్పుడు దండలేస్తావా!)
అంతేకాక బహిరంగ చర్చకు హాజరు కాకుండా ఉండేందుకు తన దీక్ష గురించి ముందే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో అనుమతి లేకుండా దీక్ష చేస్తున్నారనే కారణంతో పోలీసులు దేవినేనిని అరెస్ట్ చేశారు. చర్చకు హాజరుకాకుండా ఉండేందుకు పక్కా ప్లాన్‌తోనే దేవినేని నిరసన దీక్ష ప్రారంభించి.. అరెస్ట్ అయ్యేలా వ్యూహం పన్నారు. చర్చ జరగకుండా తప్పించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment