
హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిని బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. యాంజియో నిర్వహించిన వైద్యులు ఆయన గుండెలో మూడు బ్లాక్‌లు ఉన్నట్లు తేల్చారు.
దీంతో కొడాలి నానిని బైపాస్ సర్జరీ నిమిత్తం కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం 11 గంటల సమయంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో (ఎయిర్ అంబులెన్స్) వైద్యుల పర్యవేక్షణలో ముంబైకి తరలించారు. అక్కడ ఆయనకు బైపాస్ సర్జరీ చేయనున్నట్లు తెలిసింది.