kodali nani
-
దేవుడి దయతో గొప్ప విజయాన్ని చవిచూశాం: YS Jagan
-
కొడాలి నానిపై కేసు... అంబటి రాంబాబు రియాక్షన్
-
KSR Live Show: బాబుకు ఇంటూరి రవికిరణ్ అంటే ఎందుకంత భయం..
-
కొడాలి నానిపై కేసు
-
కూటమి సర్కార్ కక్ష సాధింపు.. కొడాలి నానిపై కేసు
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి నేతల ఆగడాలు రోజురోజుకు శృతి మించుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్‌గా కూటమి నేతలు, పోలీసులు ముందుకు సాగుతున్నారు. నిన్నటి వరకు సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు కొనసాగగా.. ఇప్పుడు రాజకీయ నాయకులపై వేధింపులు మొదలయ్యాయి.మాజీ మంత్రి కొడాలి నానిపై లా విద్యార్థినితో కూటమి నేతలు ఫిర్యాదు చేయించారు. కూటమి నేతలు మాత్రమే కాకుండా విద్యార్థులను కూడా రాజకీయ కక్షలకు పావులుగా వాడుకుంటున్నారు. లా విద్యార్థిని ప్రియతో కూటమి నేతలు.. కొడాలి నానిపై త్రీటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేయించారు. చంద్రబాబుపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీంతో, పోలీసులు నానిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
కొడాలి నాని పుట్టిన రోజు.. ఫ్లెక్సీలను అడ్డుకున్న పోలీసులు
-
చంద్రబాబుకు వైఎస్ఆర్ సీపీ నేతల హెచ్చరిక..
-
చంద్రబాబు పాపాలు కడిగేందుకే పూజలు: పేర్నినాని
సాక్షి,తాడేపల్లి:రాజకీయాల కోసం చంద్రబాబు దైవాన్ని కూడా వదల్లేదని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. పార్టీ నేతలు కొడాలినాని, వల్లభనేనివంశీతో కలిసి తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం(సెప్టెంబర్25) పేర్నినాని మీడియాతో మాట్లాడారు.‘తిరుమలలో నెయ్యిని వెనక్కి పంపామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ మాత్రం అబద్ధాలు చెబుతున్నారు.లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. తన కుట్ర రాజకీయాల కోసం కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు.లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు మాట్లాడారు.అలాంటిదేమీ లేదని ఈవో శ్యామలరావు చెప్తుంటే చంద్రబాబు అడ్డమైన ఆరోపణలు చేశారు.లోకేష్ అయితే ఏకంగా పందికొవ్వు కలిసిందన్నారు.పవన్ కళ్యాణ్ కూడా అదే దారిలో ఆరోపణలు చేశారు.ఈ కూటమి పాపాన్ని ప్రక్షాళన చేయాలని వైఎస్ఆర్సీపీ భావించింది. వారి పాపాలను క్షమించి వదిలేయమని శనివారం(సెప్టెంబర్28) రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు చేయాలని పిలుపునిస్తున్నాం.శరీరం, ఆత్మ వేరైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకటే.అందుకే చంద్రబాబు మాట్లాడిన మలినపు మాటలకు పవన్ కూడా వత్తాసు పలికారు.ఎన్నికలకు ముందు చంద్రబాబు అనేక హామీలు ఇస్తే వాటికి పవన్ కూడా హామీ ఇచ్చారు.బస్సులో ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అమ్మకు రూ.18 వేలు.. ఇలా అనేక హామీలు ఇచ్చారుఅవేమీ అమలు చేయలేదు కాబట్టి వారంతా లోలోపల మదనపడుతున్నారు.అందుకే పాపపరిహార్ధం ప్రాయశ్చిత్త శిక్ష వేసుకున్నారు.తాను బాప్టిజం తీసుకున్నట్టు పవన్ చెప్పారు.జనం ఏదీ మర్చిపోరు.నెయ్యి వెయ్యి రూపాయలు ఉందని చంద్రబాబు అంటున్నారు.మరి ఆయన హయాంలో ఏనాడైనా వెయ్యి రూపాయలకు కొన్నారా?జగన్ ప్రభుత్వం కంటే తక్కువ ధరకే చంద్రబాబు హయాంలో కొనుగోలు చేశారు.హెరిటేజ్ లో ఆవునెయ్యి నాలుగు వందలకు ఎలా ఇస్తున్నారు’అని పేర్ని నాని ప్రశ్నించారు.చంద్రబాబు నిజంగా శ్రీవారి భక్తుడేనా: కొడాలి నానిస్వామివారి ప్రతిష్టను మంటకలిపేలా చంద్రబాబు ఆరోపణలు చేశారువైఎస్సార్సీపీ హయాంలో 18 సార్లు కల్తీ ట్యాంకర్లను వెనక్కు పంపాంప్రతి ట్యాంకర్‌ను నిబంధనలకు అనుగుణంగా టెస్టులు చేశాంవందల ఏళ్లుగా ఇలాంటి ఆనవాయితీ కొనసాగుతోందిజులై 17 న ఒక ట్యాంకర్లో నెయ్యి సరిగా లేదని వెనక్కి పంపారుఆ నెయ్యిని లడ్డూలో వాడలేదుకానీ చంద్రబాబు మాత్రం అడ్డమైన ఆరోపణలు చేశారుఅపవిత్రమైన లడ్డూలను భక్తులు తిన్నారని చంద్రబాబు అన్నారుజగన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ఇలాంటి దుర్మార్గపు ఆరోపణలు చేశారుచంద్రబాబుకు బుద్ది రావాలని వెంకటేశ్వర స్వామి ని కోరుకుంటున్నాంవెంకటేశ్వరస్వామిని కూడా రాజకీయాలకు వాడుకున్న దుర్మార్గుడు చంద్రబాబుఏ ల్యాబ్ కూడా కల్తీలు జరిగినట్టు రిపోర్టు ఇవ్వలేదుకల్తీ జరిగే అవకాశం ఉందని మాత్రమే చెప్పాయిదాన్ని పట్టుకుని చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశారుచంద్రబాబు అసలు వెంకటేశ్వర స్వామి భక్తుడేనా?నిజమైన భక్తుడే ఐతే ఎన్నిసార్లు తలీలాలు అర్పించారో చెప్పాలిసుప్రీంకోర్టు న్యాయమూర్తికి కూడా జగన్ లేఖ రాశారువిచారణ జరపాలని కోరాంసిట్ అంటే కూర్చునే, స్టాండ్ అంటే నిలపడే అధికారులతో సిట్ వేస్తే ఏం లాభం?టీడీపీ ఆఫీసులో లోకేష్ చెప్పినట్టు రిపోర్ట్ రాసే వారు ఇంకేం విచారణ చేస్తారు?చంద్రబాబు చేసిన పాపానికి ఆయనకే శిక్ష వేయాలిరాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని కోరుతూ శనివారం ప్రత్యేక పూజల కార్యక్రమానికి పిలుపునిస్తున్నాఇదీ చదవండి: తాము తీసుకున్న గోతిలోనే బాబు అండ్ కో -
ఏపీ హైకోర్టులో కొడాలి నానికి ఊరట
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్రంలో వలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నమోదు చేసిన కేసుపై 41ఏ ప్రోసీజర్ పాటించాలని కోర్డు ఆదేశించింది. అనంతరం, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.కాగా, మాజీ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట లభించింది. వలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదుపై నమోదు చేసిన కేసులో కొడాలి నాని ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈనేపథ్యంలో విచారణలో భాగంగా 41ఏ ప్రొసీజర్‌ను పోలీసులు పాటించాలని కోర్టు ఆదేశించింది. అలాగే, విచారణలో సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ పాటించాలని హైకోర్టు పోలీసులను ఆదేశాలు జారీ చేసింది. అనంతరం, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.ఇదిలా ఉండగా.. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతల ప్రోత్బలంతో కొందరు వలంటీర్లు వైఎస్సార్సీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. దీంతో, వారికి వత్తాసు పలుకుతూ పోలీసులు కూడా అక్రమంగా కేసులు నమోదు చేశారు. -
దాడులు కాదు.. సూపర్ 6 అమలు ఎప్పుడు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విధ్వంసాలు, అరాచకాలు ఆపి.. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని మాజీ మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో దొంగ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. విశాఖలోని రుషికొండపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నిరుద్యోగులకు నెలకు ఇస్తామన్న రూ.3 వేలు వెంటనే ఇవ్వాలన్నారు.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో విజిటర్స్ కోసం ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌పై కూడా అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఫర్నిచర్ విలువ చెబితే చెల్లిస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోగా, దుష్ప్రచారం చేస్తుండటం దారుణం అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం వద్ద గురువారం మాజీ మంత్రులు కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, మాజీ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే సుధా మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.కార్యకర్తలకు అండగా ఉంటాం టీడీపీ దాడులకు భయపడేది లేదు. ఎవరిని చంపుతారో చంపుకోమనండి. టీడీపీ దాడుల్లో గాయపడిన ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త కుటుంబం వద్దకు తాను వెళ్తానని, వాళ్లకు అండగా ఉంటానని వైఎస్ జగన్ చెప్పారు. ఎటువంటి రివ్యూ చేయకుండా వైఎస్ జగన్‌కు సెక్యూరిటీ తీసేయడం దారుణం. మమ్మల్ని ఎవరు టార్గెట్ చేసినా భయపడేది లేదు. మేం ప్రజల మధ్య ఉంటాం. వారి సమస్యల కోసం పోరాటం చేస్తాం.రుషికొండపై భవనాలు ప్రభుత్వ ఆస్తి. అవి వైఎస్ జగన్‌వి కావు. వీఐపీల కోసం భవనాలు కడితే దానినీ రాద్ధాంతం చేస్తున్నారు. ఎల్లో బ్యాచ్ చెప్పేవన్నీ అబద్దాలే. రుషికొండలో కట్టిన ప్రభుత్వ భవనాలి్న.. జగన్ నివాసంగా ఎల్లో మీడియా, టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వం కట్టించిన గెస్ట్ హౌస్‌లో ఉండాల్సిన అవసరం వైఎస్ జగన్‌కు లేదు. ఎక్కడైనా ఆయన సొంత ఇంటిలోనే ఉంటారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను పక్కదారి పట్టించడానికి టీడీపీ నేతలు రోజుకో డ్రామా ఆడుతున్నారు. – కొడాలి నాని, మాజీ మంత్రి టీడీపీ చేసిన మంచి ఒక్కటీ లేదు రుషికొండపై నిరి్మంచిన ప్రభుత్వ భవనాలు విశాఖకే తలమానికంగా ఉంటాయి. దీనిపై ఎల్లో మీడియా, కూటమి పార్టీలు వికృత రాజకీయం చేస్తున్నాయి. రూ.700 కోట్లతో నాసిరకంగా తాత్కాలిక సచివాలయం నిరి్మంచింది టీడీపీ ప్రభుత్వం. రుషికొండలో రూ.400 కోట్లతోనే ఐకానిక్ భవనాలు నిర్మించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. ప్రభుత్వ స్థలంలో నిరి్మంచిన ప్రభుత్వ భవనాలివి. శిథిలమైన హరిత రిసార్ట్స్ స్థానంలో నూతన భవనాల నిర్మాణం.విశాఖ నుంచి పరిపాలనకు ఈ భవనాలు అనువైనవని అధికారుల కమిటీ తేలి్చంది. దీంతో సీఎం నివాసం, కార్యాలయానికి అనుకూలంగా కొన్ని మార్పులు చేస్తే అవి సొంత భవనాలంటూ టీడీపీ గగ్గోలు పెడుతోంది. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ ప్రభుత్వానికి చేతకాదు. 2014 – 2019 మధ్య రాష్ట్రానికి చేసిన మంచి ఒక్కటి లేదు. అన్నీ రాష్ట్రానికి తలవంపులు తెచ్చే పనులే. ఇప్పుడూ అదే చేస్తోంది. – గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రివైఎస్ జగన్ ఊరూరా తిరగమన్నారు వైఎస్ జగన్ మమ్మల్ని ఊరూరా తిరగమన్నారు. కూటమి పార్టీల దాడులు, ఆస్తుల విధ్వంసం సమయంలో ప్రతి కార్యకర్తకు అండగా ఉండాలని సూచించారు. 40 శాతం ఓటు బ్యాంకు కలిగిన మనం భయపడకూడదంటూ మనో ధైర్యం నింపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన మంచి ప్రజలెవరూ మరచిపోలేదు. ప్రతి ఇంట్లో జగన్ చేసిన మంచి కనిపిస్తోంది.ప్రతి ఇంటికీ మేం తలెత్తుకుని పోగలం. చెప్పిన పని చేశాం కాబట్టి.. ప్రజల మధ్యకు గౌరవంగా వెళ్లగలుగుతాం. చంద్రబాబు ప్రలోభాలకు మోసపోయిన పరిస్థితుల మధ్య అపజయం సంభవించింది. బాబు మోసాలు ఎప్పుడైతే తేటతెల్లం అవుతాయో.. కాలం గడుస్తున్న కొద్దీ చంద్రబాబుపై కోపం వస్తుంది. అప్పుడు వైఎస్సార్సీపీ పట్ల అభిమానమూ మళ్లీ రెట్టింపు అవుతుంది. మళ్లీ వైఎస్సార్సీపీ రికార్డు మెజార్టీతో గెలుస్తుంది. చంద్రబాబు చేతిలో ప్రతి రోజు మోసపోతున్న ప్రజలకు అండగా ఉంటాం. – వంగా గీత, మాజీ ఎంపీ అంతర్జాతీయ స్థాయిలో కట్టడాలు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై టీడీపీ నేతలు దృష్టి సారించాలి. రిషికొండలో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా పర్యాటక శాఖ కట్టిన భవనాలు అవి. మేమేమీ వర్షానికి కారిపోయే అసెంబ్లీ, సచివాలయం కట్టలేదు. సెవెన్ స్టార్ రేంజ్లో పర్యాటక శాఖ భవనాలు నిరి్మంచాం. మేము కట్టిన మెడికల్ కాలేజీలు, నాడు – నేడు స్కూల్స్, ఆసుపత్రులు, సచివాలయాలు, పోర్టులను కూడా టీడీపీ నేతలు ఇలానే ప్రజలకు చూపించాలి. రిషికొండలో నాణ్యమైన, అంతర్జాతీయ స్థాయిలో కట్టడాలు నిరి్మంచాం.గతంలో చంద్రబాబు ఎక్కడైనా ఇంత నాణ్యమైన భవనాలు కట్టారా? కేంద్రం అనుమతి, హైకోర్టు పర్యవేక్షణలోనే నిర్మాణాలు చేపట్టాం. ఆడుదాం ఆంధ్రా ఖర్చు రూ.100 కోట్లు అయితే స్కామ్ జరిగింది రూ.100 కోట్లు అని టీడీపీ నేతలు చెబుతున్నారు. స్కామ్ ఇలా కూడా ఉంటుందా? క్రీడాకారులకు ఇచ్చిన నగదు బహుమతులు గుర్తు లేవా? అసలు ఆడుదాం ఆంధ్రా టెండర్లు మా క్రీడా శాఖ ద్వారా నిర్వహించలేదు. అలాంటిది నేను, సిద్దార్థ్ రెడ్డి అవినీతి చేశాం అనడం హాస్యాస్పదం. 2029లో మళ్లీ జగనన్నను సీఎం చేసుకోవడానికి తగ్గట్టుగా ఐదేళ్లు పనిచేస్తాం. – ఆర్కే రోజా, మాజీ మంత్రి మా ఓట్లు ఏమయ్యాయి.. అంటున్నారుబద్వేలు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రతి గ్రామంలో అపూర్వ స్వాగతం లభించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ 99 శాతం పైగా హామీలను అమలు చేయటంతో సగర్వంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగాం. మా ఓటు మీకే నమ్మా? మీ ఫ్యాన్ గుర్తుకే వేసి తీరుతాం అని ఓటర్లు భరోసా ఇచ్చారు. కానీ ఫలితాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఈవీఎంలపై జగనన్న ట్వీట్ చేస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? చంద్రబాబు గతంలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చనలేదా? ఎన్నికల ఫలితాలు చూసి ఓటర్లే ఆశ్చర్యపోతున్నారు.మేం జగన్‌కు వేసిన ఓట్లు ఏమయ్యాయి అని ప్రశి్నస్తున్నారు. అదే మన ప్రభుత్వం ఉండి ఉంటే ఈపాటికే విద్యా దీవెన ఇచ్చేవాళ్లం. రైతు భరోసా, అమ్మ ఒడి, మత్స్యకార భరోసా అన్నీ సమయానికి అందేవి. ఏకంగా రూ.2.7 లక్షల కోట్లు ప్రజలకు డీబీటీ ద్వారా ఇచ్చాం. ఏ పథకం ఏ నెలలో అమలవుతుందో క్యాలెండర్ ఇచ్చి.. తేదీల వారీగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో వైఎస్ జగన్ నగదు జమ చేసేవారు. ఇప్పుడు కూడా నిత్యం ప్రజల్లో ఉంటాం. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. – దాసరి సుధా, బద్వేలు ఎమ్మెల్యే టీడీపీ కపట నాటకాన్ని ప్రజలు గమనించాలి ఎన్నికల ఫలితాలు ఎందుకు ఇలా వచ్చాయన్నది ఇవ్వాళ్టికీ మాకు ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా వైఎస్ జగన్ మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశారు. ఇంత చేసినా ఎక్కడ మోసం జరిగింది అనేదే ప్రశ్న. ఇప్పుడు రుషికొండపై చంద్రబాబు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నారు. రుషికొండ మొత్తం 61 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 9.88 ఎకరాల విస్తీర్ణంలోనే ఈ భవనాలు నిరి్మంచారు.గతంలో హరిత రిసార్టు 48 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేది. ప్రస్తుత భవనాలు 19,968 చ.మీ విస్తీర్ణంలో ఉన్నాయి.వీటన్నింటినీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు వీలుగా నిరి్మంచారు. ప్రెసిడెన్షియల్ సూట్, సూట్ రూమ్, బాంక్వెట్ హాల్‌తో విజయనగర బ్లాకు, ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్స్, సూట్ రూమ్స్, డీలక్స్ గదులు, బాంక్వెట్ హాల్‌తో కళింగ బ్లాక్ నిరి్మంచారు. సూట్ రూమ్‌లు, కాన్ఫరెన్స్ హాల్‌తో పల్లవ బ్లాక్, సమావేశ మందిరాలతో చోళ బ్లాక్, రిక్రియేషన్ లాంజ్, బిజినెస్ సెంటర్‌తో గజపతి బ్లాక్, ప్రైవేట్ సూట్ రూమ్‌లతో వేంగిబ్లాక్, రెస్టారెంట్స్, లాంజ్, కిచెన్, పార్కింగ్ సౌకర్యాలతో ఈస్ట్రన్ గంగా బ్లాక్‌లని నిరి్మంచారు. ఈ ఏడు బ్లాక్‌లు ప్రభుత్వానివే. అయినప్పటికీ ఈ విష ప్రచారం టీడీపీ సంస్కృతికి నిదర్శనం. దాడులు, ఆస్తుల విధ్వంసం ఆపి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలి. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి -
ఇక తగ్గేదేలేదు.. కొడాలి నాని ఈజ్ బ్యాక్
-
ఎవడికి భయపడే ప్రసక్తే లేదు
-
టీడీపీ దాడులకు భయపడేది లేదు: కొడాలి నాని
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల్లో దొంగ వాగ్దానాలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు మాజీ మంత్రి కొడాలి నాని. అలాగే, విశాఖలోని రుషికొండపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.కాగా, కొడాలి నాని గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్-6 ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి. నిరుద్యోగులకు ఇస్తామన్న మూడు వేలు ఇవ్వాలి. సీఎం క్యాంపు కార్యాలయంలో విజిటర్స్ కోసం ఏర్పాటు చేసిన ఫర్నీచర్‌పై కూడా అసత్యపు ప్రచారం చేస్తున్నారు. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మకండి.చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను పక్కదారి పట్టించడానికి టీడీపీ నేతలు రోజుకో డ్రామా ఆడుతున్నారు. రుషికొండలో భవనాలు ప్రభుత్వ ఆస్తి.. వైఎస్ జగన్‌వి కావు. వీఐపీల కోసం భవనాలు కడితే రాద్దాంతం చేస్తున్నారు. ఎల్లో బ్యాచ్ చెప్పేవన్నీ అబద్దాలే. టీడీపీ దాడులకు భయపడేది లేదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
సూపర్ 6.. చంద్రబాబుకు కొడాలి నాని డిమాండ్
-
టీడీపీపై కొడాలి నాని ఫైర్
-
ఇంత దారుణమా..
-
దాడులపై పోలీసులు ప్రేక్షక పాత్ర
మచిలీపట్నం టౌన్: కృష్ణా జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ, జనసేన కార్యకర్తలు చేస్తున్న దాడులను నియంత్రించకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పోలీసులపై హైకోర్టులో ప్రైవేటు కేసులు వేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని) వెల్లడించారు. శనివారం వారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పేర్ని నాని మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ, జనసేన రౌడీ మూకలు ఉద్దేశ పూర్వకంగా, అధికార మదంతో మారణహోమం సాగిస్తున్నా, విధ్వంసం సృష్టిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారన్నారు. చంద్రబాబునాయుడు, జిల్లాలో గెలుపొందిన ఎమ్మెల్యేలు.. వారి కార్యకర్తలు చేస్తున్న దాడులపై ప్రేక్షకపాత్ర వహించేలా పోలీసులకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ఆ ఆదేశాలను పోలీసులు తూచా తప్పకుండా పాటిస్తుండటం విచారకరం అన్నారు. గతంలో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లు ఆంధ్రప్రదేశ్‌లోనూ తీసుకొచ్చారని విమర్శించారు. రౌడీషీటర్లు స్థానికంగా ఉన్న డీఎస్పీ, సీఐ, ఎస్సైలను ఏరా.. ఉద్యోగం చేయాలని లేదా.. నువ్వు ఇక్కడే ఉంటావా.. లేక వీఆర్‌కు వెళతావా.. అని మాట్లాడుతున్నా పోలీసులు మిన్నకుండి పోవడం విచారకరం అన్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలతో కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. కళ్లెదుటే దాడులు.. అచేతనంగా పోలీసులు‘బందరు గొడుగుపేటలోని ఎంకులు బంకులు ఎదురుగా ఉన్న సందులో ఒక యాదవ కుటుంబం ఇంట్లో సామగ్రి, టీవీని ధ్వంసం చేస్తే, కేసు పెట్టినా ఇనుగుదురుపేట పోలీసులు పట్టించుకోలేదు. బాధితులను వైఎస్సార్సీపీ నాయకులు పరామర్శించి సామగ్రి కొనుగోలుకు ఆర్థిక సాయం చేస్తే మళ్లీ సామగ్రి కొంటే ఇలాగే ధ్వంసం చేస్తామని టీడీపీ నాయకులు, కార్యకర్తలు హెచ్చరిస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణం. స్థానిక చిలకలపూడి గోడౌన్స్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ కాలనీలో కూలీ పనులు చేసుకునే భార్యాభర్తలు వైఎస్సార్సీపీకి పని చేశారనే కారణంతో వారి ఇంటిపై దాడి చేసి సామగ్రి ధ్వంసం చేశారు. అడ్డుపడిన వీరిద్దరినీ తీవ్రంగా గాయపరిచారు. ఆ దంపతులను ఆసుపత్రిలో చేర్చుకోకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఆ సమయంలో 25కు పైగా కేసులు ఉన్న రౌడీషీటర్ నవీన్.. ఆసుపత్రికి వెళ్లి నెలల పిల్లాడిని ఎత్తుకున్న ఆ మహిళను అసభ్య పదజాలంతో దూషించాడు. ఇదంతా పోలీసుల కళ్లెదుటే జరిగింది. అయినా రౌడీ షీటర్‌పై కేసు పెట్టకపోగా, బాధితులపైనే ఎదురు కేసు పెట్టారు. మర్డర్ కేసు ముద్దాయిలు, రౌడీలే డీఎస్పీలు, సీఐలుగా భావించేలా చంద్రబాబు తయారు చేశారు. మహేష్ అనే వ్యక్తి విచ్చలవిడిగా బరితెగించి కుర్చీలతో ఎస్ఐ పైనే దాడి చేశాడు. కార్లు ధ్వంసం చేశాడు. అయినా ఇంత వరకు కేసు నమోదు చేయలేదు. ఇంత జరుగుతున్నా జిల్లా ఎస్పీ స్పందించకపోవటం విచారకరం. మాజీ ఎమ్మెల్యేలు అందరం ఎస్పీని కలిసి విన్నవించాలని నిర్ణయం తీసుకున్నాం. విజయవాడ నుంచి బయలుదేరిన వల్లభనేని వంశీ, కైలే అనిల్కుమార్లను పోలీసులు రానివ్వకుండా నిర్బంధించారు. రేపో, ఎల్లుండో డీజీపీ, ఎస్పీలను కలిసి దాడుల ఘటనలపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తాం. ఈ దాడుల ఘటనలపై వీడియో ఆధారాలతో హైకోర్టులో ప్రైవేటు కేసు వేస్తున్నాం’ అని పేర్ని నాని తెలిపారు.మేం వస్తున్నాం.. ధైర్యంగా ఉండండి...మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్సార్సీపీ శ్రేణులను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భౌతిక దాడులకు దిగుతూ చేతులు, కాళ్లు విరగ్గొట్టడంతో పాటు గ్రామాల్లో ఉండొద్దని హెచ్చరిస్తున్నారన్నారు. ఈ ఘటనలకు పోలీసులే ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారని తెలిపారు. ‘దాడులు జరుగుతుంటే పోలీసులు నిలబడి చూస్తూ ఎంజాయ్ చేస్తుండటం దారుణం.స్థానికంగా దాడులు జరుగుతున్న సమయంలో ఆయా ప్రాంతాల పోలీసులకు సమాచారం అందించినా, స్పందించడం లేదు. వచ్చినా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఈ ఘటనలపై కేసులు కట్టడం లేదు. దాడులు చేస్తున్న వారే కాకుండా దాడులను చూస్తూ మిన్నకుండిపోయిన పోలీసులపై కూడా కేసులు వేస్తాం. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. రెండు రోజుల్లో జిల్లాలోని ముఖ్య నాయకులందరం ప్రతి నియోజకవర్గానికి వెళ్లి దాడులకు గురైన వారి ఇళ్లకు వెళ్లి ధైర్యం చెబుతాం. ఇకనైనా దాడులు ఆగకుంటే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డు పైకి వస్తారు. లా అండ్ ఆర్డర్ సమస్య ఎదురైతే దానికి పోలీస్ వ్యవస్థే బాధ్యత వహించాలి’ అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, మచిలీపట్నం, పెడన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), ఉప్పాల రమేష్ (రాము) పాల్గొన్నారు.పేర్ని కిట్టు, నాయకులను అడ్డుకున్న పోలీసులుటీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన బాబి దంపతులను పరామర్శించేందుకు బయలుదేరిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బందరు పట్టణంలోని చిలకలపూడి ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే బాబి దంపతులు వైఎస్సార్సీపీ పక్షాన నిలిచారనే నెపంతో కూటమి శ్రేణులు వారి నివాసంపై దాడికి పాల్పడ్డారు. సామగ్రి ధ్వంసం చేశారు.ఈ సందర్భంగా శనివారం బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) తన నివాసం నుంచి నగర మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్‌దాదా, కార్పొరేటర్లతో కలిసి బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారి పరామర్శకు వెళ్లేందుకు అనుమతి లేదని అడ్డుకున్నారు.అదనపు బలగాలను రప్పించి దారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పరామర్శకు అనుమతి ఏమిటని పేర్ని కిట్టు, తదితరులు పోలీసులను దాటుకుని వెళ్లి బాబి దంపతుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. పరామర్శించిన వారిలో కార్పొరేటర్లు మేకల సుబ్బన్న, జోగి చిరంజీవి, ఐనం తాతారావు, మాచవరపు రాంప్రసాద్, పల్లి శేఖర్, పర్ణం సతీష్, శ్రీరాం చిన్నా ఉన్నారు. -
పోలీసుల ప్రేక్షక పాత్ర కొడాలి నాని షాకింగ్ రియాక్షన్
-
కార్యకర్తల్ని కాపాడుకుంటాం: కొడాలి నాని
సాక్షి, కృష్ణా జిల్లా: ఏపీలో టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. రాష్ట్రపతి, గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. కళ్లేదుటే దాడులు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ మరో బిహార్‌గా మారుతోందంటూ ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇళ్లపైనా టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. న్యాయపరంగా కోర్టులోనే తేల్చుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు నిర్ణయించారు.టీడీపీ దాడులపై మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, ఎన్నికల తర్వాత ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేశారని మండిపడ్డారు. టీడీపీ, జనసేన పార్టీ వాళ్లు మా పై దాడులకు పాల్పడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతల, కార్యకర్తలను భయపెట్టాలనుకుంటున్నారు. దాడులు జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదు’’ అని కొడాలి నాని ధ్వజమెత్తారు.వైఎస్సార్సీపీపై జరుగుతున్న దాడుల పై హైకోర్టుకు వెళ్తాం. దాడులు చేసిన వారితో పాటు. చూస్తూ ఉన్న పోలీసులపై కేసులు వేస్తాం. రాబోయే రెండు రోజుల్లో కృష్ణాజిల్లాలో పర్యటిస్తాం. గాయపడిన కార్యకర్తలకు ధైర్యం చెబుతాం. కార్యకర్తలను కాపాడుకుంటాం. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ప్రాంతాల్లో పర్యటిస్తాం. శాంతిభద్రతల సమస్య వస్తే పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని కొడాలి నాని చెప్పారు. -
ఆగని టీడీపీ దాడులు.. వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇళ్ల వద్ద ఉద్రిక్తత
కృష్ణా, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ అరాచక కాండ కొనసాగుతోంది. శుక్రవారం కూడా వైఎస్సార్సీపీ శ్రేణుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీల ఇళ్లపై దాడులకు యత్నించింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తెలుగు యువతకు చెందిన కొందరు నాయకులు.. శుక్రవారం మధ్యాహ్నాం కొడాలి నాని ఇంటిపైకి రాళ్లు, గుడ్లు విసిరారు. ఆపై టపాసులు కాల్చి నానా హంగామా చేశారు. ఇంటిలోకి చొచ్చుకునిపోయే ప్రయత్నమూ చేశారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు.. వాళ్లను అడ్డుకుని అక్కడి నుంచి పంపించే యత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులతోనూ వాళ్లు వాగ్వాదానికి దిగారు. కృష్ణాజిల్లా గుడివాడలో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటిపై దాడి..ఇంటి లోపలకి చొరబడే ప్రయత్నం చేసిన టీడీపీ గుండాలు.#TDPGoons pic.twitter.com/yDo1iT7yql— YSR Congress Party (@YSRCParty) June 7, 2024ఇక.. విజయవాడలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపైనా దాడి జరిగింది. టీడీపీ గుండాలు వంశీ ఉండే అపార్ట్‌మెంట్‌ను నలువైపులా చుట్టుముట్టి.. వాహనాల్లో అటు ఇటు తిరుగుతూ హల్ చల్ చేశారు. వంశీ ఉంటున్న ఫ్లోర్ వైపు రాళ్లు విసిరారు. ఈ దాడిలో పార్కింగ్‌లో ఉన్న ఆయన వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆపై పోలీసులు రంగంలోకి దిగి టీడీపీ శ్రేణుల్ని చెదరగొట్టి.. చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. అయితే.. సీఆర్పీఎఫ్, పోలీస్ బలగాలు మోహరించినప్పటికీ.. టీడీపీ యువత మరోసారి వల్లభనేని వంశీ ఇంటి పైకి దూసుకొచ్చింది. ఈ క్రమంలో అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపైనా టీడీపీ గుండాలు దాడికి యత్నించారు. ఏసీపీ వాహనంతో పాటు మరో వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి టీడీపీ రౌడీలను చెదరగొట్టాయి. ఆపై వంశీ ఇంటి వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.ఇక విజయవాడలోనే గత అర్ధరాత్రి రాజీవ్ నగర్‌లోని వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి శివారెడ్డి ఇంటి పై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో ఆయన కారు అద్ధాలు ధ్వంసం అయ్యాయి. ఇంటి బయట ఫర్నీచర్‌ను పూర్తిగా నాశనం చేశారు. ఆ సమయంలో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన స్థానికులు.. భయంతో వణికిపోయారు. ఆపై శివారెడ్డిని చంపేస్తామంటూ బెదిరిస్తూ వాళ్లంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఈ ఉదయం టీడీపీ నేతల దాడిపై నున్న పోలీస్ స్టేషన్లో పెద్దిరెడ్డి శివారెడ్డి ఫిర్యాదు చేశారు.రాజమండ్రిలో టీడీపీ గూండాలు.. ఫ్లైఓవర్ శిలా ఫలకం ధ్వంసంతూర్పు గోదావరి: రాజమండ్రిలో టీడీపీ నేతలు అరాచకానికి దిగారు. మోరంపూడి ఫ్లై ఓవర్ శిలాఫలకం నాశనం చేశారు. సమాచారం అందుకున్న మాజీ ఎంపీ మార్గాని భరత్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న రాజమండ్రిలో.. ఇలాంటి ఘటనలు సరికాదని టీడీపీ శ్రేణుల్ని ఉద్దేశించి హితవు పలికారాయన. అలజడులు సృష్టించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉందని అన్నారాయన. -
గుడివాడ సీటు గెలుపుపై మేకపోతు గాంభీర్యం!
ఆ నియోజకవర్గంలో పోలింగ్ పూర్తవ్వగానే పసుపు పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. పోలింగ్ సరళి తమకే అనుకూలమని డప్పు కొట్టుకున్నారు. కట్ చేస్తే.. తాజా లెక్కలు చూశాక వారిలో ఆందోళన మొదలైందట. ఏదో అనుకుంటే మరేదో జరిగేలా ఉందనుకుని కలవరపడుతున్నారని టాక్ నడుస్తోంది. ఇంతకీ కృష్ణాజిల్లా గుడివాడలో తెలుగు తమ్ముళ్ల టెన్షన్‌కు కారణమేంటి?.. కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీ టాప్ ప్రయారిటీ లిస్ట్ లో పెట్టుకున్న నియోజకవర్గం గుడివాడ. ఇక్కడి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తిరుగులేని శక్తిగా ఉన్న కొడాలి నానిని వైఎస్ఆర్సీపీ తరపున హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవకుండా అడ్డుకోవాలనేది టీడీపీ నాయకత్వం బలమైన కోరిక. ఇందుకోసం రెండేళ్లుగా చాలా ప్రయత్నాలు చేసింది. కొడాలి నానిపై పోటీకి పనికొచ్చే నాయకులు గుడివాడలో కనిపించక, చివరికి అమెరికా నుంచి వచ్చిన ఎన్నారై వెనిగండ్ల రామును పోటీలో నిలిపింది. కొడాలి నానిని ఓడిస్తానని ధీమా వ్యక్తం చేసిన వెనిగండ్ల రాము, టీడీపీ నేతలు పోలింగ్ సరళిని చూసి ఖంగుతిన్నారట. 13వ తేదీన జరిగిన పోలింగ్ లో గుడివాడ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు. దీంతో గతం కంటే పోలింగ్ శాతం పెరిగింది. పోలింగ్ శాతం పెరగడానికి మహిళా ఓటర్లలో చైతన్యం ఎక్కువగా కనిపించడమే ప్రధాన కారణం. మొత్తంగా.. గుడివాడ నియోజకవర్గం అంతటా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. నందివాడ మండలంలో రెండు కేంద్రాలు, గుడివాడ పట్టణంలోని రెండు కేంద్రాల్లో రాత్రి 10 గంటల వరకూ పోలింగ్ జరిగింది. నియోజకవర్గంలో ఎక్కడా చిన్న అవాంఛనీయ ఘటన కూడా లేకుండా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడంతో తొలిసారి రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. ఇదిలా ఉంటే పోలింగ్ సరళి..పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల క్యూ లైన్లను చూసి బోల్డంత ఊహించుకున్న టీడీపీ నేతల ఆశలపై వారే తయారుచేసుకున్న తాజా లెక్కలు నీళ్లు చల్లాయట. రికార్డ్ స్థాయిలో జరిగిన పోలింగ్ సైకిల్ పార్టీకి అనుకూలంగా లేదని వారిలో వారే చర్చించుకుంటున్నారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఉదయం నుంచే భారీగా తరలి రావడం తమకే కలిసి వచ్చిందని టీడీపీ నేతలు సంబరపడినప్పటికీ, పోలింగ్ అనంతరం వేసుకున్న లెక్కలు వారిని కలవరపెడుతున్నాయని టాక్. భారీగా పెరిగిన పోలింగ్ శాతం.. మహిళల ఓట్లన్నీ వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా కనిపిస్తున్నాయట. గడచిన మూడు దశాబ్ధాలుగా గుడివాడ నియోజకవర్గంలో జరగని చాలా అభివృద్ధి పనులు కేవలం ఈ ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని చేసి చూపించారు. పేదల సొంతింటి కల టిడ్కో ఇళ్లు, జగనన్న కాలనీల రూపంలో ప్రజలకు అందజేశారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును వినియోగించుకున్న తరుణంలో మరోసారి గుడివాడ ఎమ్మెల్యేగా కొడాలి నాని గెలుపు ఖాయం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారట.తాజా అంచనాలు భయపెడుతున్నా చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు తమను కచ్చితంగా గట్టెక్కిస్తాయని చెప్పుకుంటున్నారట టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము. లోలోన టెన్షన్ పడుతూనే చంద్రబాబు సూపర్ సిక్స్ ను చూసే మహిళలు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. గెలుపు లాంఛనమే అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్న చర్చ ప్రస్తుతం గుడివాడలో జోరుగా సాగుతోంది.ఇదీ చదవండి: ట్రెండ్ తెలియాలంటే నిరీక్షించాల్సిందే -
గుడివాడ గెలుపుపై కొడాలి నాని రియాక్షన్
-
నాగార్జున యాదవ్ ని మంత్రిని చేసి నన్ను పక్కన పెట్టిన పర్లేదు: కొడాలి నాని
-
ఆ ముసలోడికి ఏం రోగం..కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్..
-
బీసీలను ఆదరించడంలో సీఎం జగన్ ముందుంటారు: కొడాలి నాని
సాక్షి, కృష్ణా: బీసీ వర్గాలను ఆదరించడంలో ముఖ్యమంత్రి ఎప్పుడూ ముందే ఉంటారని అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. అన్ని రంగాల్లో తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యానికి గురిచేసిన కులాల్లో యాదవ కులం ఒకటి అని నాని చెప్పుకొచ్చారు.కాగా, గుడివాడలో యాదవ సంఘీయుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కొడాలి నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. ‘కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్రంలో అనేక చోట్ల, జనరల్ స్థానాల్లో మేయర్లుగా జడ్పీ చైర్మన్లుగా సీఎం జగన్ అవకాశం ఇచ్చారు. యాదవులను గుడివాడ మున్సిపల్ చైర్మన్‌గా చేస్తాం. గుడివాడ పురపాలక సంఘం పరిధిలోని రెండు ఎకరాల స్థలాన్ని యాదవ కళ్యాణ మండపానికి కేటాయించాలని మున్సిపాలిటీలో తీర్మానం చేయించాం.గుడివాడ నియోజకవర్గంలో ఏ కులానికి లేని విధంగా యాదవులకు అద్భుతమైన కళ్యాణ మండపం నిర్మితమవడంలో నా సహాయ సహకారాలు అన్ని విధాలుగా అందిస్తాను. రాబోయే రోజుల్లో గుడివాడ నియోజకవర్గంలో యాదవులకు రాజకీయ ప్రాధాన్యం ఉంటుంది. గుడివాడలో యాదవులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పించాం.ఈనెల 13వ తేదీన జరిగే ఎన్నికల పోలింగ్ లో యాదవ సోదర సోదరీమణులందరూ మీ అమూల్యమైన ఓటుని ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని యాదవులకు సముచిత స్థానం కల్పించారు. అన్ని రంగాల్లో తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యానికి గురిచేసిన కులాల్లో యాదవ కులం కూడా ఒకటి.గుడివాడ నియోజకవర్గంలోని యాదవ సోదరులతో నాకు ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. యాదవ సోదరులు ముందుకు వస్తే రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశాలు కల్పిస్తుంది. తద్వారా సంఘం అభివృద్ధికి దోహద పడినవారు అవుతారు. అవకాశం ఉన్నచోట మీ పిల్లలను రాజకీయంగా ప్రోత్సహించండి. సీఎం జగన్ తిరిగి అధికారంలోకి వచ్చాక కేబినెట్లో నాలాంటి వారికి పెద్దగా అవకాశం ఉండదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తారు. నాకు, పేర్ని నానికు మంత్రి పదవులు ఇవ్వకపోయినా, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వకపోయినా, విశ్వాసంతో సీఎం జగన్ వెంటే ఉంటాం’ అని కామెంట్స్ చేశారు.