
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి నేతల ఆగడాలు రోజురోజుకు శృతి మించుతున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలే టార్గెట్‌గా కూటమి నేతలు, పోలీసులు ముందుకు సాగుతున్నారు. నిన్నటి వరకు సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు కొనసాగగా.. ఇప్పుడు రాజకీయ నాయకులపై వేధింపులు మొదలయ్యాయి.
మాజీ మంత్రి కొడాలి నానిపై లా విద్యార్థినితో కూటమి నేతలు ఫిర్యాదు చేయించారు. కూటమి నేతలు మాత్రమే కాకుండా విద్యార్థులను కూడా రాజకీయ కక్షలకు పావులుగా వాడుకుంటున్నారు. లా విద్యార్థిని ప్రియతో కూటమి నేతలు.. కొడాలి నానిపై త్రీటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేయించారు. చంద్రబాబుపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీంతో, పోలీసులు నానిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Comments
Please login to add a commentAdd a comment