సాక్షి, తాడేపల్లి: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సిన అవసరం తనకేంటని ప్రశ్నించారు మాజీ మంత్రి కొడాలి నాని. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రుల అపాయింట్‌మెంట్ తనకు అవసరం లేదని తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎంగా గెలిచినప్పుడు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీటర్‌లో అభినందించాని గుర్తు చేశారు. ఫోన్ చేసి అభినందించాల్సిన పని ఏం ఉందని అన్నారు. కేసీఆర్‌కు తొంటి విరిగింది కాబట్టి సీఎం జగన్ పరామర్శించారని తెలిపారు.
పక్క రాష్ట్రంలో ఎన్నికలకు తమకు ఏం సంబంధం లేదని కొడాలి నాని తెలిపారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన షర్మిలకు మద్దతివ్వడంలో వింత ఏముందని ప్రవ్నించారు. రేవంత్ ఏపీకి వచ్చి పీసీసీ బాధ్యత తీసుకోమని చెప్పాలంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబును గెలిపించడం కోసం రేవంత్ ఏపీకి వస్తాడేమోనని అన్నారు.
చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటున్నాడని కొడాలి నాని విమర్శించారు. కష్ట కాలంలో పార్టీ కోసం పనిచేసిన కేశినేని నానిని మోసం చేసి.. రూ. 150 కోట్లకు ఎంపీ సీటు కేశినేని చిన్నికి అమ్మాడని మండిపడ్డారు. గుడివాడలో కూడా రూ. 100 కోట్లు ఇచ్చినతనికి సీటు ఇచ్చాడని ధ్వజమెత్తారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లు కూడా చంద్రబాబు అమ్ముకుంటున్నాడన్నారని విమర్శించారు.
చదవండి: ఏపీ: ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment